రామ లక్షణుల్లా కలిసి మెలిసి ఉండే పఠాన్ సోదరులు వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ సందర్భంగా మాటా మాటా అనుకున్నారు. రనౌట్ విషయంలో ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే కొద్ది సేపటికే అది సమసిపోయింది. అన్మదమ్ములిద్దరు మ్యాచ్ అనంతరం మైదానంలో కలియతిరిగారు.
వివరాల్లోకి వెళితే.. దక్షిణాఫ్రికా ఛాంపియన్స్‌తో నిన్న (జులై 10) జరిగిన మ్యాచ్‌లో భారత ఛాంపియన్స్ గెలిచే స్థితిలో ఉండింది. భారత్ గెలుపుకు చివరి రెండు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సి ఉండింది. క్రీజ్‌లో ఇర్ఫాన్ పఠాన్ (34), యూసఫ్ పఠాన్ (36) ఉన్నారు. వీరిద్దరు క్రీజ్‌లో ఉండగా.. భారత్ గెలుపు ఖాయమని అంతా అనుకున్నారు.
A heated moment between Pathan brothers at WCL.
India Champions needed 21 runs in the last 12 balls to qualify for Semi Finals. pic.twitter.com/hgIbhCtGFq— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024
అయితే 18వ ఓవర్ చివరి బంతికి ఇర్ఫాన్ భారీ షాట్‌కు ప్రయత్నించి, అది విఫలం కావడంతో రెండు పరుగులు తీయాలని ప్రయత్నించాడు. రెండో పరుగుకు ప్రయత్నించే క్రమంలో పఠాన్ సోదరుల మధ్య సమన్వయం లోపించడంతో ఇర్ఫాన్ రనౌటయ్యాడు. ఇందుకు కోపోద్రిక్తుడైన ఇర్ఫాన్.. అన్న యూసఫ్ పఠాన్‌పై అసహనం వ్యక్తం చేసి గట్టిగా అరిచాడు. ఇందుకు యూసఫ్‌కు కూడా ప్రతిగా స్పందించాడు.
అన్నదమ్ముల మధ్య హీటెడ్ ఆర్గుమెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ఛాంపియన్స్.. సౌతాఫ్రికా ఛాంప్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓడినా సెమీస్‌కు చేరుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. స్నైమ్యాన్ (73), రిచర్డ్ లెవి (60) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. హర్బజన్ సింగ్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. సౌతాఫ్రికా బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయడంతో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యే సరికి 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది.
యూసఫ్ పఠాన్ (54 నాటౌట్), ఇర్ఫాన్ పఠాన్ (35) భారత్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. కాగా, ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచినా సెమీస్‌కు క్వాలిఫై కాలేకపోయింది. మెరుగైన రన్‌రేట్ కారణంగా భారత్ సెమీస్‌కు చేరింది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, వెస్టిండీస్, భారత్ సెమీస్‌కు చేరగా.. సౌతాఫ్రికా, ఇంగ్లండ్ ఇంటిబాట పట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment