Obed McCoy Overcame His Mother's Illness To Deliver Goods Against RCB - Sakshi
Sakshi News home page

IPL 2022: 'ఓవైపు తల్లికి సీరియస్‌.. అయినా మ్యాచ్‌లో అదరగొట్టాడు'

Published Sat, May 28 2022 4:10 PM | Last Updated on Sat, May 28 2022 4:53 PM

Obed McCoy Overcame His Mothers Illness To Deliver Goods Against RCB - Sakshi

PC: IPL.com

ఐపీఎల్‌-2022లో అహ్మదాబాద్‌ వేదికగా జరిగిన క్వాలిఫయర్‌-2లో ఆర్సీబీని చిత్తు చేసి రాజస్తాన్‌ రాయల్స్‌ ఫైనల్‌కు చేరింది. కాగా రాజస్తాన్‌ విజయంలో ఆ జట్టు పేసర్‌ ఒబెడ్ మెక్కాయ్ కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో జోస్‌ బట్లర్‌ అదగరగొట్టగా.. బౌలింగ్‌లో మెక్కాయ్‌, ప్రసిద్ద్‌ కృష్ణ అద్భుతంగా రాణించారు.  ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 23 పరుగులు ఇచ్చిన మెక్కాయ్‌ మూడు కీలక​ వికెట్ల పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు మెక్కాయ్‌  తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పి‍ంచారు. 

మ్యాచ్‌ ఆరంభానికి ముందు ఈ విషయం గురించి మెక్కాయ్‌కు సమాచారం అందింది. అయినప్పటికీ ఓ వైపు బాధను దిగమింగుతూ మెక్కాయ్‌ అత్యుత్తమంగా రాణించాడు. అయితే ఈ విషయాన్ని మ్యాచ్‌ అనంతరం రాజస్తాన్‌ రాయల్స్‌ హెడ్‌ కోచ్‌ కుమార్ సంగక్కర వెల్లడించాడు. కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సంగక్కర తెలిపాడు. "మెక్కాయ్‌ తల్లి క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌కు ముందు అనారోగ్యానికి గురైంది. అయినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి మెక్కాయ్‌ అద్భుతంగా రాణించాడు. కాగా ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది అని"సంగక్కర పేర్కొన్నాడు. ఇక అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్లో గుజరాత్‌ టైటాన్స్‌తో రాజస్తాన్‌ తలపడనుంది.

చదవండి: Mathew Wade: 'మా జట్టు ఫైనల్‌ చేరింది.. అయినా సరే టోర్నమెంట్‌ చికాకు కలిగిస్తుంది'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement