IPL 2022: Fans Trolls On Young Woman Who Not Get Married Until RCB Win Title, Details Inside - Sakshi
Sakshi News home page

Trolls On RCB Fan Girl: 'ఆర్‌సీబీ కప్‌ కొట్టదు.. నువ్వు పెళ్లి చేసుకోవు'

Published Sat, May 28 2022 12:00 PM | Last Updated on Sat, May 28 2022 2:59 PM

IPL 2022: Fans Troll Young Woman Who-Not Get Married Until RCB Win-Title - Sakshi

PC: IPL Twitter

క్రికెట్‌లో ఒక జట్టుకు వీరాభిమానులు ఉండడం సహజం. అయితే ఆ జట్టు ఒక మేజర్‌ కప్‌ను గెలిచేవరకు పెళ్లి చేసుకోమంటూ కొందరు భీష్మించుకు కూర్చోవడం మూర్కత్వం కిందకే వస్తుంది. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆర్‌సీబీకి వీరాభిమానిగా ఉన్న ఒక యువతి.. ఐపీఎల్‌లో ఆ జట్టు కప్‌ కొట్టేవరకు పెళ్లి చేసుకోనంటూ మైదానంలో ప్లకార్డు పట్టుకోవడం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇలాంటి అభిమానులు కూడా ఉంటారా అని చాలా మంది సందేహం వ్యక్తం చేశారు. 

అయితే ఆర్‌సీబీ ఈ సీజన్‌లో ప్లే ఆఫ్‌ చేరడం.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ను చిత్తు చేసి క్వాలిఫయర్‌-2కు అర్హత సాధించడం జరిగిపోయాయి. ఇక ఈసారి ఆర్‌సీబీ టైటిల్‌ కొట్టినట్లేనని.. ఆ యువతి పెళ్లి చేసుకోవడం ఖాయమని అంతా భావించారు. కానీ విధి మరొకటి తలిచింది. ప్లేఆఫ్‌లో ఆర్‌సీబీకి ఉన్న ఒత్తిడి మరోసారి బయటపడింది. చివరిదాకా ఊరించి కచ్చితంగా టైటిల్‌ కొడుతుంది అనుకునే దశలో ఊసురుమనిపించే ఆర్‌సీబీ మరోసారి అదే పంథాను అనుసరించింది. శుక్రవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ పరాజయం చవిచూసింది. దీంతో ఆర్‌సీబీ విజేతగా నిలవాలనే కోరిక మరోసారి తీరని కలగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో ప్లకార్డుతో హల్‌చల్‌ చేసిన యువతిని ఉద్దేశించి అభిమానులు వినూత్న రీతిలో కామెంట్స్‌ చేశారు. ''ఆర్‌సీబీ కప్‌ కొట్టదు.. నువ్వు పెళ్లి చేసుకోవు.. నిరీక్షణ ఫలించలేదు.'' అంటూ పేర్కొన్నారు.

ఇక రాజస్తాన్‌ ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌ మెరుపులతో క్వాలిఫయర్‌-2 వన్‌సైడ్‌గా మారిపోయింది. మ్యాచ్‌లో ఏ దశలోనూ ఆర్‌సీబీ పోరాటపటిమ చూపించలేకపోయింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్‌సీబీ రాజస్తాన్‌ బౌలర్ల దాటికి 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానిక 157 పరుగుల నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. రజత్‌ పాటిదార్‌ 58 పరుగులతో టాప​ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ బట్లర్‌ దూకుడుతో లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ చేధించింది. బట్లర్‌ సిక్సర్లు, ఫోర్ల వర్షానికి ఆర్‌సీబీ బౌలర్లు చూస్తూ ఉండిపోయారు. అలా వరుసగా మూడోసారి ప్లేఆఫ్‌ చేరినప్పటికి ఆర్‌సీబీ.. ఈసారి కూడా ఐపీఎల్‌ కప్‌ కొట్టకుండానే ఇంటిబాట పట్టింది. 

చదవండి: Jos Buttler: వారెవ్వా.. బట్లర్‌ విధ్వంసకర ఆట తీరు.. అరుదైన రికార్డు సొంతం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement