Obed McCoy
-
టీ20 వరల్డ్‌కప్ 2024కు ముందు వెస్టిండీస్‌కు భారీ షాక్
స్వదేశంలో జరిగే టీ20 వరల్డ్‌కప్ 2024కు ముందు ఆతిథ్య వెస్టిండీస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్ గాయం కారణంగా మెగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్షిప్ సందర్భంగా హోల్డర్ గాయపడినట్లు తెలుస్తుంది. హోల్డర్ స్థానాన్ని రిజర్వ్ ఆటగాడు ఓబెద్ మెక్‌కాయ్‌తో భర్తీ చేయనున్నట్లు విండీస్ చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ తెలిపాడు. ప్రపంచకప్ లాంటి మెగా ఈవెంట్లో హోల్డర్ లాంటి అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ లేకపోవడం తమ జట్టుకు పెద్ద లోటే అవుతుందని హేన్స్ అభిప్రాయపడ్డాడు. మెక్కాయ్ హోల్డర్ స్థానానికి న్యాయం చేస్తాడని హేన్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు.ఇదిలా ఉంటే, టీ20 వరల్డ్‌కప్ 2024లో రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్లైన వెస్టిండీస్ ప్రస్తానం జూన్ 2న మొదలవుతుంది. విండీస్ తమ తొలి మ్యాచ్‌లో పపువా న్యూ గినియాతో తలపడుతుంది. విండీస్ గ్రూప్-సిలో పపువా న్యూ గినియా, న్యూజిలాండ్, ఉగాండ, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో తలపడుతుంది.టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం విండీస్ జట్టు: రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), అల్జరీ జోసెఫ్ (వైస్ కెప్టెన్), జాన్సన్ చార్లెస్, రోస్టన్ చేజ్, షిమ్రాన్ హెట్మెయర్, షమర్ జోసెఫ్, బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, షాయ్ హోప్, ఆండ్రీ రస్సెల్, రొమారియో షెపర్డ్, ఒబెడ్ మెక్కాయ్, అకీల్ హోసేన్, గుడకేష్ మోటీ, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్రిజర్వ్ ప్లేయర్లు: కైల్ మేయర్స్, మాథ్యూ ఫోర్డ్, ఫాబియన్ అలెన్, హేడెన్ వాల్ష్, ఆండ్రీ ఫ్లెచర్ -
నేపాల్ క్రికెట్ బోర్డు పేదరికం.. విండీస్ క్రికెటర్లకు ఊహించని కష్టాలు
ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం వెస్టిండీస్-ఏ క్రికెట్ జట్టు నేపాల్‌లో పర్యటిస్తుంది. ఈ నెల (ఏప్రిల్) 27 నుంచి వచ్చే నెల (మే) 4వ తేదీ వరకు జరిగే ఈ పర్యటనలో విండీస్-నేపాల్ జట్లు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనున్నాయి. కిరీటీపూర్ వేదికగా జరిగే ఈ సిరీస్ ఏప్రిల్ 27, 28, మే 1, 2, 4 తేదీల్లో జరుగనుంది. విండీస్ క్రికెట్ బోర్డు నేపాల్ సిరీస్‌ను వరల్డ్‌కప్ సన్నాహకంగా భావించి పూర్తి స్థాయి జట్టును అక్కడికి పంపింది.ఐపీఎల్‌తో బిజీగా ఉన్న క్రికెటర్లు మినహా మిగతా జట్టంతా నేపాల్ పర్యటనకు వచ్చింది. విండీస్ క్రికెటర్లు నిన్ననే నేపాల్ రాజధాని ఖాట్మండులో ల్యాండ్ అయ్యారు. అయితే ఖాట్మండు విమానాశ్రయంలో విండీస్ క్రికెటర్లకు ఊహించని కష్టాలు ఎదురయ్యాయి. నేపాల్ క్రికెట్ బోర్డు విండీస్ క్రికెటర్లకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్లుకు స్వాగతం పలికే నాథుడు కూడా లేకుండా పోయాడు.నిధులలేమితో కొట్టిమిట్టాడుతున్న నేపాల్ క్రికెట్ బోర్డు విండీస్ క్రికెటర్లకు కనీస రవాణా సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. క్రికెటర్లు సాధారణ బస్సులో బస చేసే ప్రదేశానికి బయల్దేరారు. నేపాల్ క్రికెట్ బోర్డు దీనస్థితి ఎంతలా ఉందంటే.. విండీస్ క్రికెటర్ల లగేజీని మోసుకెళ్లేందుకు ట్రాలీ ఆటో లాంటి ఆతి సాధారణ రవాణా సదుపాయాన్ని ఏర్పాటు చేసింది. విండీస్ ఆటగాళ్లు ఎవరి లగేజీని వాళ్లే మోసుకెళ్లి ట్రాలీలో పెట్టుకున్నారు.ఈ మొత్తం తంతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతుంది. కొందరు నేపాల్ క్రికెట్ బోర్డు పరిస్థితిని చూసి జాలి పడుతుంటే.. మరికొందరు మీమ్స్‌కు వాడుకుంటున్నారు.కాగా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పరిస్థితి కూడా గతంలో నేపాల్ క్రికెట్ బోర్డు పరిస్థితి మాదిరే ఉండేది. ఆ జట్టు క్రికెట్ బోర్డు కూడా పేదరికంతొ కొట్టిమిట్టాడింది. ప్రస్తుతం పరిస్థితుల్లో కొద్దిగా మార్పు వచ్చింది. విండీస్ క్రికెట్ బోర్డుకు ఎలాగోలా నిధులు సమకూరుతున్నాయి. అందుకే ఆ జట్టు యూఎస్ఏతో కలిసి ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌కు ఆతిథ్యమివ్వగలుగుతుంది. నేపాల్ క్రికెట్ బోర్డు విషయానికొస్తే.. ఆ దేశ క్రికెట్ బోర్డు ఆటగాళ్లకు జీతాలు ఇవ్వలేకపోతుంది. కనీసం కిట్లు కూడా సమకూర్చలేకపోతుంది. దీనస్థితిలో ఉన్న నేపాల్ క్రికెట్‌ను బీసీసీఐ లాంటి సంపన్న బోర్డులు ఆదుకోవాలి. నేపాల్‌లో పర్యటిస్తున్న వెస్టిండీస్-ఏ క్రికెట్ జట్టు: రోస్టన్ ఛేజ్ (కెప్టెన్), అలిక్ అథనాజ్ (వైస్ కెప్టెన్), ఫాబియన్ అలెన్, కడీమ్ అలీన్, జాషువా బిషప్, కీసీ కార్టీ, జాన్సన్ చార్లెస్, మార్క్ దేయల్, ఆండ్రీ ఫ్లెచర్, మాథ్యూ ఫోర్డ్, ఒబెడ్ మెకాయ్ , గుడకేష్ మోటీ, కీమో పాల్, ఒషానే థామస్, హేడెన్ వాల్ష్West Indies team have arrived in Nepal. pic.twitter.com/EIrBPPr5ui— Mufaddal Vohra (@mufaddal_vohra) April 25, 2024 -
నొప్పితో బాధపడుతుంటే చప్పట్లు కొట్టడం ఏంటి?
టి20 ప్రపంచకప్‌లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. టి20ల్లో రెండుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన విండీస్ ఇలా అవమానకర రీతిలో వెనుదిరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అరె రెండుసార్లు చాంపియన్ అయిన విండీస్ ఇలా నాకౌట్ కావడం ఏంటని సగటు అభిమాని బాధపడుతున్న వేళ ఆ జట్టు బౌలర్ చేసిన కవ్వింపు చర్య ఆగ్రహం తెప్పించింది. విషయంలోకి వెళితే.. ఐర్లాండ్ ఇన్నింగ్స్ సమయంలో ఇన్నింగ్స్ 4వ ఓవర్లో అల్జారీ జోసెఫ్ ఒక బంతిని స్ట్రెయిట్ డెలివరీగా వేశాడు. అయితే పాల్ స్టిర్లింగ్ మిస్ చేయడంతో బంతి అతని గజ్జల్లో బలంగా తాకింది. దీంతో స్టిర్లింగ్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఆ తర్వాత బాధను ఓర్చుకుంటూనే తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు. ఒక బ్యాటర్‌కు తగలరాని చోట తగిలి నొప్పితో బాధపడుతుంటే బౌండరీ లైన్ వద్ద ఉన్న విండీస్ ఆటగాడు ఒబెద్ మెకాయ్ మాత్రం చప్పట్లు కొడుతూ ''వెల్డన్ జోసెఫ్ గుడ్ బౌలింగ్'' అంటూ అభినందించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒక వ్యక్తి తన ట్విటర్లో షేర్ చేయడంతో అందరు మెకాయ్ చర్యను తప్పుబట్టారు. ''ఒక బ్యాటర్ గాయపడి నొప్పితో బాధపడుతుంటే ఇలా చప్పట్లు కొట్టడం ఏంటని''.. '' ఓడిపోతున్నామని ముందే తెలిసిందా.. అందుకే ఇలా చేశాడా''..'' ఓడిపోయారని సానుభూతి చూపించాలనుకుంటే మెకాయ్ చర్యతో అది రివర్స్ అయింది.. పాల్ స్టిర్లింగ్‌కు ఏం కాకూడదని కోరుకుంటున్నా అంటూ కామెంట్స్ చేశారు. ఇక ఈ టి20 ప్రపంచకప్‌లో వాస్తవానికి విండీస్‌పై పెద్దగా ఎవరికి అంచనాలు లేవు.. అయినప్పటికి రెండుసార్లు చాంపియన్ కావడంతో కాస్త ఆశలు ఉన్నాయి. కానీ ఐర్లాండ్‌తో మ్యాచ్ అనంతరం వెస్టిండీస్‌కు అంత సీన్ లేదన్న విషయం అర్థమయింది. 147 పరుగుల టార్గెట్‌ను కాపాడుకోవడంలో చేతులెత్తేసిన వెస్టిండీస్ ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. అటు ఐర్లాండ్ మాత్రం 147 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగి ఆద్యంతం ఆకట్టుకుంది. ముఖ్యంగా జట్టు ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ ఈ ప్రపంచకప్‌లో తొలిసారి తన బ్యాట్‌కు పదును చెప్పాడు. 48 బంతుల్లో 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతనితో పాటు కెప్టెన్ ఆండ్రూ బాల్బర్నీ 37 పరుగులు, లోర్కాన్ టక్కర్ 45 నాటౌట్ రాణించారు. #T20WorldCup #IREvsWI #WIvsIRE #T20worldcup22 pic.twitter.com/H129vR6UC1 — The sports 360 (@Thesports3601) October 21, 2022 చదవండి: WI Vs IRE: పేరుకే రెండుసార్లు చాంపియన్.. మరీ ఇంత దారుణంగా.. -
టీ20ల్లో మెకాయ్ చెత్త రికార్డు.. నాలుగో బౌలర్‌గా!
అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. టీ 20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న నాలుగో బౌలర్‌గా మెకాయ్ నిలిచాడు. ఫ్లోరిడా వేదికగా భారత్‌తో జరిగిన నాలుగో టీ20లో మెక్కాయ్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 66 పరుగులు ఇచ్చాడు. తద్వారా ఈ చెత్త రికార్డును మెక్కాయ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఈ చెత్త రికార్డు నమోదు చేసిన జాబితాలో శ్రీలంక బౌలర్ రజితా 75 పరుగులు ఇచ్చి తొలి స్థానంలో ఉండగా.. ఐర్లాండ్ బౌలర్ మెక్‌గ్రాత్( 69 పరుగులు), దక్షిణాఫ్రికా బౌలర్ కైల్ అబాట్(68) పరుగులతో రెండు, మాడు స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా భారత్‌తో జరిగిన రెండో టీ20ల్లో మెకాయ్ ఏకంగా ఆరువికెట్లు పడగొట్టి బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. అయితే ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20లో మాత్రం మెకాయ్ను టీమిండియా బ్యాటర్లు రఫ్పాడించారు. దీంతో తన నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ.. 66 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్‌పై 59 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో టీమిండియా సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రిషభ్ పంత్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ(33),సంజు సామ్సన్(30) పరుగులతో రాణించారు. ఇక 192 పరుగుల భారీ లక్క్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ భారత్ బౌలర్లు చెలరేగడంతో 132 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3 వికెట్లు పడగొట్టగా... అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు తీశారు. .@surya_14kumar and @ImRo45 take @ObedCMcCoy to the cleaners. 25 OFF THE OVER! That helicopter shot from SKY though! Watch the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/sBfdPOwRYu — FanCode (@FanCode) August 6, 2022 చదవండి: Obed Mccoy: మొన్న 'భయపెట్టాడు'.. ఇవాళ 'భయపడ్డాడు' -
మొన్న 'భయపెట్టాడు'.. ఇవాళ 'భయపడ్డాడు'
టీమిండియాతో జరుగుతున్న టి20 సిరీస్‌లో వెస్టిండీస్ ఒక మ్యాచ్ గెలిచిందంటే అదంతా ఒబెద్ మెకాయ్ పుణ్యమే. రెండో టి20లో విండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో మెకాయ్ ఆరు వికెట్లతో చెలరేగి టీమిండియా పతనాన్ని శాసించాడు. రోహిత్ శర్మను గోల్డెన్ డక్ చేయడం సహా మరో ఐదు కీలక వికెట్లు తీశాడు. అంతలా భయపెట్టిన ఈ వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ తాజాగా మాత్రం టీమిండియా బ్యాటర్స్‌కు భయపడ్డాడు. ముఖ్యంగా భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌లు మెకాయ్ వేసిన ఒక ఓవర్లో ఏకంగా 25 పరుగులు పిండుకున్నారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో మెకాయ్ వేసిన తొలి బంతినే రోహిత్ శర్మ సిక్సర్ బాదగా.. ఆ తర్వాత ఓవర్ చివరి బంతిని సూర్యకుమార్ సిక్సర్‌తో ముగించాడు. మధ్యలో మరొక సిక్సర్, ఫోర్ సహా మొత్తం 25 పరుగులు వచ్చాయి. సూర్య కొట్టిన రెండు సిక్సర్లలో ఒకటి హెలికాప్టర్ సిక్స్ ఉండడం విశేషం. ఈ దెబ్బతో మెకాయ్ మొహం ఒక్కసారిగా మాడిపోయింది. అంతేకాదు 4 ఓవర్లలో రెండు వికెట్లు తీసినప్పటికి.. 66 పరుగులు సమర్పించుకోవడం విశేషం. ''మొన్న భయపెట్టిన బౌలర్.. ఇవాళ భయపడ్డాడు'' అంటూ క్రికెట్ అభిమానులు కామెంట్స్ చేశారు. కాగా మెకాయ్ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఓవర్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వెస్టిండీస్‌ను వన్డే సిరీస్‌లో చిత్తు చేసిన భారత్ టి20 సిరీస్‌ను కూడా 3–1తో సొంతం చేసుకుంది. శనివారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో భారత్ 59 పరుగులతో విండీస్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (31 బంతుల్లో 44; 6 ఫోర్లు), రోహిత్ శర్మ (16 బంతుల్లో 33; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సంజు సామ్సన్ (23 బంతుల్లో 30 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్ యాదవ్ (14 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు. విండీస్ బౌలర్ మెకాయ్ 4 ఓవర్లలో 66 పరుగులిచ్చాడు. అనంతరం విండీస్ 19.1 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌటైంది. పూరన్ (24), రావ్మన్ పావెల్ (24) మాత్రమే కొద్దిగా పోరాడగలిగారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3 వికెట్లు పడగొట్టగా... అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు తీశారు. చివరిదైన ఐదో టి20 నేడు ఇదే మైదానంలో జరుగుతుంది. .@surya_14kumar and @ImRo45 take @ObedCMcCoy to the cleaners. 25 OFF THE OVER! That helicopter shot from SKY though! Watch the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/sBfdPOwRYu — FanCode (@FanCode) August 6, 2022 చదవండి: IND vs WI: టి20 క్రికెట్లో రోహిత్ సేన కొత్త చరిత్ర.. IND VS WI 4th T20: అఫ్రిదిని అధిగమించి, క్రిస్ గేల్‌కు చేరువైన హిట్‌మ్యాన్ -
ఒబెడ్ మెకాయ్ ఇరగదీశాడు.. కానీ ఆ రికార్డు ఇప్పటికీ దీపక్ చహర్‌దే!
సెయింట్స్ కిట్స్ వేదికగా సోమవారం భారత్‌తో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ పేసర్ ఒబెడ్ మెకాయ్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. మెకాయ్ తన టీ20 కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 17 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అతడి బౌలింగ్ కోటాలో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉండడం గమనార్హం. ఈ క్రమంలో మెకాయ్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 6 వికెట్లు పడగొట్టిన ఐదో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ ఘనతను నాలుగురు బౌలర్లు అందుకున్నారు. అజంతా మెండిస్ రెండు సార్లు ఆరు వికెట్ల ఫీట్‌ను నమోదు చేశాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో దీపక్ చహర్(6/7, బంగ్లాదేశ్‌పై), అజంతా మెండిస్(6/8, జింబాబ్వేపై), అజంతా మెండిస్ (6/16, ఆస్ట్రేలియాపై), యజ్వేంద్ర చహల్(6/25, ఇంగ్లండ్‌పై ), ఆస్టన్ ఆగర్(6/30, న్యూజిలాండ్‌పై) ఉన్నారు. అయితే అత్యంత తక్కువ పరుగులు ఇచ్చి ఆరు వికెట్లను పడగొట్టిన రికార్డు మాత్రం భారత పేసర్ దీపక్ చహర్ పేరిట ఉంది. చహర్ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేదు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో చాహర్ కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక జింబాబ్వేపై 8 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టిన శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ రెండో స్థానంలో ఉన్నాడు. చదవండి: Asia Cup 2022 Schedule: భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే..? -
ఆ అవార్డును మా అమ్మకు అంకితమిస్తున్నా: మెకాయ్
సెయింట్స్ కిట్స్ వేదికగా టీమిండియాతో జరిగిన రెండో టీ20లో వెస్టిండీస్ విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. విండీస్ విజయంలో ఆ జట్టు పేసర్ ఒబెద్ మెకాయ్ కీలక పాత్ర పోషించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను మెకాయ్ ముప్పు తిప్పలు పెట్టాడు. తొలి బంతికే కెప్టెన్ రోహిత్ శర్మను పెవిలియన్‌కు పంపి ఆదిలోనే భారత్‌ను మెకాయ్ దెబ్బ కొట్టాడు. ఈ క్రమంలో తన కెరీర్లో అత్యత్తుమ బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో మెకాయ్ 17 పరుగులు ఇచ్చి ఏకంగా ఆరు వికెట్లు పడగొట్టాడు. ఇక అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన మెకాయ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడిన మెకాయ్.. తనకు దక్కిన ఈ అవార్డును అనారోగ్యంతో ఉన్న తన తల్లికి అంకితమిస్తున్నట్లు తెలిపాడు. తను ఒక ఉత్తమ ఆటగాడిగా ఎదగడంలో తన తల్లి కీలక పాత్ర పోషించదని మెకాయ్ అన్నాడు. "దేవుడికి కృతజ్ణతలు చెప్పాలి అనుకుంటున్నాను. దేవుడు దయ వల్ల ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించగలిగాను. నాకు దక్కిన ప్లేయర్ ఆప్‌ది మ్యచ్‌ను మా అమ్మకు అంకిమిస్తున్నా. ఆమె ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతోంది. అయినప్పటికీ నన్ను ఆమె ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. అందుకే ఈ అవార్డును తనకి అంకితమివ్వాలి అనుకుంటున్నాను. ఇక తొలి బంతికే వికెట్ సాధించి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి తెచ్చింది. పవర్‌ప్లేలో ఎప్పుడూ నేను వికెట్లు పడగొట్టడానికి ప్రయత్నిస్తాను. తొలి టీ20లో నేను అంతగా రాణించలేకపోయాను. అయితే అప్పుడు చేసిన తప్పులను ఈ మ్యాచ్‌లో సరిదిద్దు కోవడం సంతోషంగా ఉంది" అని మెకాయ్ పేర్కొన్నాడు. ఇక ఇరు జట్ల మధ్య మూడో టీ20 మంగళవారం(ఆగస్టు2)న జరగనుంది. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా రెండో టీ20: లగేజీ సమయానికి రాని కారణంగా మ్యాచ్ ఆలస్యం ►వేదిక: వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్, వెస్టిండీస్ ►టాస్: వెస్టిండీస్- బౌలింగ్ ►ఇండియా స్కోరు: 138 (19.4) ►వెస్టిండీస్ స్కోరు: 141/5 (19.2) ►విజేత: 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపు ►5 మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఒబెడ్ మెకాయ్(4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు) చదవండి: Rohit Sharma: అందుకే ఆవేశ్ చేతికి బంతి! ఇదొక గుణపాఠం... మా ఓటమికి ప్రధాన కారణం అదే! -
Ind Vs WI: అందుకే ఆఖరి ఓవర్లో ఆవేశ్ చేతికి బంతి! ఇదో గుణపాఠం... అయినా: రోహిత్
India Vs West Indies 2nd T20- Rohit Sharma Comments On Loss: కరీబియన్ గడ్డపై వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా జోరుకు ఆతిథ్య వెస్టిండీస్ జట్టు బ్రేకులు వేసింది. రెండో టీ20లో విజయం సాధించి ఎట్టకేలకు గెలుపు రుచి చూసింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పైచేయి సాధించి 5 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రస్తుతం 1-1తో సమమైంది. టాస్ గెలిచి... సెయింట్ కిట్స్‌లోని వార్నర్ పార్క్ వేదికగా సోమవారం విండీస్- టీమిండియా మధ్య రెండో టీ20 జరిగింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను.. విండీస్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ దెబ్బకొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మను డకౌట్ చేయడం సహా.. మరో ఓపెనర్ సూర్యకుమార్ యాదవ్‌ను 11 పరుగులకే పెవిలియన్‌కు పంపాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ 10 పరుగులకే పరిమితం కాగా.. రిషభ్ పంత్ 24 పరుగులు చేశాడు. ఆల్‌రౌండర్లు హార్దిక్ పాండ్యా 31, రవీంద్ర జడేజా 27 పరుగులతో రాణించారు. బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు పొందిన దినేశ్ కార్తిక్(7 పరుగులు) వికెట్ తీసి మరోసారి మెకాయ్.. దెబ్బతీశాడు. అశ్విన్ 10, భువనేశ్వర్ 1, ఆవేశ్ ఖాన్ 8, అర్ష్‌దీప్ 1(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో 19.4 ఓవర్లలో రోహిత్ సేన 138 పరుగులు సాధించింది. అదరగొట్టిన బ్రాండన్! ఇక లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్‌కు ఓపెనర్ బ్రాండన్ కింగ్(68 పరుగులు) అద్భుత ఆరంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్ కైలీ మేయర్స్ మాత్రం 8 పరుగులకే పరిమితమయ్యాడు. కెప్టెన్ నికోలస్ పూరన్(14 పరుగులు) మరోసారి నిరాశపరిచాడు. షిమ్రన్ హెట్మెయిర్ 6 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ బ్యాటర్ డెవాన్ థామస్ 31 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. బౌండరీ బాది విండీస్ విజయం ఖరారు చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో డెత్ ఓవర్ల స్పెషలిస్టు భువనేశ్వర్ కుమార్‌ను కాదని.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ యువ బౌలర్లు అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్‌కు బంతిని ఇవ్వడం గమనార్హం. ఇక 19వ ఓవర్లో అర్ష్‌దీప్ కాస్త పొదుపుగానే బౌలింగ్ చేయగా(6 పరుగులు ఇచ్చాడు)... ఆఖరి ఓవర్లో ఆవేశ్ ఖాన్ తేలిపోయాడు. మొదటి బంతి నోబాల్ కాగా.. థామస్ వరుసగా సిక్స్, ఫోర్ బాదడంతో భారత్ భారీ మూల్యం చెల్లించకతప్పలేదు. మా బ్యాటింగ్ బాగాలేదు! ఈ నేపథ్యంలో పరాజయంపై స్పందించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓటమికి గల కారణాలు విశ్లేషించాడు. అదే విధంగా డెత్ ఓవర్లలో యువ ఆటగాళ్లను బరిలోకి దింపడంపై వివరణ ఇచ్చాడు. ఈ మేరకు.. ‘‘మా బ్యాటింగ్ అస్సలు బాగాలేదు. పిచ్ చాలా బాగుంది. కానీ మేము దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాము. మెరుగైన స్కోరు నమోదు చేయలేకపోయాము. అందుకే వాళ్లకు అవకాశం! అప్పుడప్పుడూ ఇలా జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు ప్రతిసారి అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. మాకు ఇదొక గుణపాఠం. తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. ఇక ఆఖరి ఓవర్ విషయానికొస్తే.. యువకులకు తప్పక అవకాశాలు ఇవ్వాలి. నిజానికి భువి మాకోసం ఏం చేయగలడో.. ఏమేం చేశాడో ఇప్పటికే అనేక సందర్భాల్లో నిరూపితమైంది. గత కొన్నేళ్లుగా అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే, ఆవేశ్, అర్ష్‌దీప్ లాంటి వాళ్లకు అవకాశాలు ఇస్తేనే కదా! వాళ్లలోని నైపుణ్యాలు, ప్రతిభకు పదును పెట్టగలరు. అయినా కేవలం ఈ ఒక్క గేమ్‌తో ఒక అంచనాకు రాలేము. నా జట్టు పట్ల నేను గర్వపడుతున్నా. నిజానికి 13-14 ఓవర్లోనే ముగుస్తుందనుకున్న మ్యాచ్‌ను మా వాళ్లు చివరి ఓవర్ వరకు లాక్కొచ్చారు. మార్చే ప్రసక్తే లేదు! మా బౌలర్లు అనుకున్న ప్రణాళికలను పక్కాగా అమలు చేశారు. అయితే, బ్యాటింగ్ పరంగా మేము మెరుగుపడాల్సి ఉంది. కానీ, ప్రయోగాలకు మాత్రం వెనుకాడబోము. ఒక్క ఓటమి కారణంగా మేము బెంబేలెత్తిపోము. ఎలాంటి మార్పులకు ఆస్కారం ఇవ్వము’’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. కాగా టీమిండియా ఇటీవల తరచుగా ఓపెనింగ్ జోడీని మారుస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. వెస్టిండీస్- టీమిండియా మధ్య మంగళవారం(ఆగష్టు 2) మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. వెస్టిండీస్ వర్సెస్ ఇండియా రెండో టీ20: లగేజీ సమయానికి రాని కారణంగా మ్యాచ్ ఆలస్యం ►వేదిక: వార్నర్ పార్క్, సెయింట్ కిట్స్, వెస్టిండీస్ ►టాస్: వెస్టిండీస్- బౌలింగ్ ►ఇండియా స్కోరు: 138 (19.4) ►వెస్టిండీస్ స్కోరు: 141/5 (19.2) ►విజేత: 5 వికెట్ల తేడాతో వెస్టిండీస్ గెలుపు ►5 మ్యాచ్‌ల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఒబెడ్ మెకాయ్(4 ఓవర్లలో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు) చదవండి: Obed Mccoy: విండీస్ బౌలర్ సంచలనం.. టి20 క్రికెట్లో ఐదో బౌలర్‌గా Watch as the #MenInMaroon celebrate clinching victory in the second match of the @goldmedalindia T20 Cup, presented by Kent Water Purifiers #WIvIND 🏏🌴 pic.twitter.com/UV5Sl2zfAc — Windies Cricket (@windiescricket) August 1, 2022 -
విండీస్ బౌలర్ సంచలనం.. టి20 క్రికెట్లో ఐదో బౌలర్‌గా
వెస్టిండీస్ బౌలర్ ఒబెద్ మెకాయ్ టీమిండియాతో జరిగిన రెండో టి20లో సంచలన బౌలింగ్‌తో మెరిశాడు. లగేజీ కారణంగా మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభం కాగా.. టీమిండియా బ్యాటర్లను విండీస్ బౌలర్ మెకాయ్ ముప్పతిప్పలు పెట్టాడు. తన టి20 కెరీర్లోనే బెస్ట్ బౌలింగ్ నమోదు చేసిన మెకాయ్ నాలుగు ఓవర్లలో 17 పరుగులిచ్చి ఒక మెయిడెన్ సహా ఆరు వికెట్లు తీశాడు. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన ఒబెద్ మెకాయ్ పలు రికార్డులు అందుకున్నాడు. ►టి20 క్రికెట్లో ఆరు వికెట్లు తీసిన ఐదో బౌలర్‌గా ఒబెద్ మెకాయ్(6/17) నిలిచాడు. ఇంతకముందు ఈ ఘనత నలుగురు బౌలర్లు అందుకోగా.. అజంతా మెండిస్ రెండుసార్లు ఆరు వికెట్ల ఫీట్‌ను నమోదు చేశాడు. దీపక్ చహర్(6/7, బంగ్లాదేశ్‌పై), అజంతా మెండిస్(6/8, జింబాబ్వేపై), అజంతా మెండిస్ (6/16, ఆస్ట్రేలియాపై), యజ్వేంద్ర చహల్(6/25, ఇంగ్లండ్‌పై ), ఆస్టన్ ఆగర్(6/30, న్యూజిలాండ్‌పై) ఈ ఫీట్‌ను అందుకున్నారు. ►ఇక టీమిండియాపై టి20ల్లో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన నమోదు చేసిన బౌలర్లోలో ఒబెద్ మెకాయ్ తొలి స్థానంలో నిలిచాడు. మెకాయ్ తర్వాత వనిందు హసరంగా(4/9), మిచెల్ సాంట్నర్(4/11), డారెన్ సామీ(4/16) ఉన్నారు. ►ఇక వెస్టిండీస్ తరపున టి20ల్లో బెస్ట్ బౌలింగ్ ప్రదర్శన కనబరిచిన బౌలర్ల జాబితాలోనూ మెకాయ్ అగ్రస్థానంలో నిలిచాడు. మెకాయ్ తర్వాత కీమో పాల్(5/15), డారెన్ సామి(5/26), జాసన్ హోల్డర్ (5/27), ఒషేన్ థామస్(5/28) ఉన్నారు. చదవండి: IND vs WI 2nd T20: బెంబేలెత్తించిన విండీస్ బౌలర్.. టీమిండియా ఓటమి -
బెంబేలెత్తించిన విండీస్ బౌలర్.. టీమిండియా ఓటమి
వరుసగా నాలుగు పరాజయాల తర్వాత వెస్టిండీస్ ఎట్టకేలకు బోణీ కొట్టగలిగింది. టీమిండియాతో సోమవారం ఆలస్యంగా జరిగిన రెండో టి20 వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 19.2 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. బ్రాండన్ కింగ్ అర్థసెంచరీతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక చేదనలో వెస్టిండీస్‌కి శుభారంభం దక్కింది. తొలి వికెట్‌కి 46 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన కేల్ మేయర్స్ 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసి హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. నికోలస్ పూరన్ 11 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. హెట్‌మైర్ 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔట్ కాగా ఓపెనర్ బ్రెండన్ కింగ్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. 52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసిన బ్రెండన్ కింగ్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే 19వ ఓవర్లో 6 పరుగులే ఇచ్చి విండీస్ బ్యాటర్లను అర్షదీప్ కట్టడి చేశాడు. దీంతో వెస్టిండీస్ విజయానికి ఆఖరి ఓవర్లో 10 పరుగులు కావాల్సి వచ్చాయి. ఓడియన్ స్మిత్ ఫ్రీహిట్‌ను సద్వినియోగం చేసుకొని సిక్సర్‌తో విరుచుకుపడ్డాడు. ఆ తర్వాత బంతికి ఫోర్ బాది విండీస్‌కు విజయాన్ని అందించాడు. అంతకముందు భారత్ 19.4 ఓవర్లలో 138 పరుగులకే ఆలౌటైంది. టాపార్డర్ బ్యాటర్లు రోహిత్ శర్మ (0), సూర్యకుమార్ (11), అయ్యర్ (10) వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పంత్ (12 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (31 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కాసేపు ఆదుకున్నారు. జడేజా (30 బంతుల్లో 27; 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. అయితే మెకాయ్ (4–1–17–6) బెంబేలెత్తించాడు. అతను 19వ ఓవర్లో దినేశ్ కార్తీక్ (7), అశ్విన్ (10), భువనేశ్వర్ (1) వికెట్లను పడగొట్టడంతో ఆఖర్లో ఆశించినన్ని పరుగులు రాలేదు. హోల్డర్‌కు 2 వికెట్లు దక్కాయి. ఇరుజట్ల మధ్య మూడో టి20 మంగళవారం(ఆగస్టు 2న) జరగనుంది. చదవండి: Obed Mccoy: ఒబెద్ మెకాయ్ సంచలనం.. టి20 క్రికెట్లో ఐదో బౌలర్‌గా -
Ind Vs WI: వాళ్ల వల్లే ఇదంతా! మరీ చెత్తగా! ఇకపై: విండీస్ కెప్టెన్
West Indies vs India, 2nd T20I: వన్డే సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా చేతిలో క్లీన్‌స్వీప్ అయిన వెస్టిండీస్.. మొదటి టీ20 మ్యాచ్‌లో పరాజయంతో మరింత కుంగిపోయింది. వన్డే మ్యాచ్‌లలో గట్టి పోటీనిచ్చినా తమకు కలిసి వచ్చిన టీ20 ఫార్మాట్లో మాత్రం తేలిపోయింది. ముఖ్యంగా డెత్ ఓవర్లలో విండీస్ బౌలర్లు తేలిపోయారు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ట్రినిడాడ్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆఖరి నాలుగు ఓవర్లలో ఏకంగా 52 పరుగులు సమర్పించుకున్నారు. జేసన్ హోల్డర్ పందొమ్మిదో ఓవర్లో 21 పరుగులు ఇస్తే.. ఆఖరి ఓవర్లో ఒబెడ్ మెకాయ్ 15 పరుగులు ఇచ్చాడు. అతడి బౌలింగ్‌లో టీమిండియా వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్ వరుసగా 1,0,6,4,0,4 బాదాడు. ఈ నేపథ్యంలో రోహిత్ సేన 190 పరుగుల భారీ స్కోరు చేయగలిగింది. ఇక భారత బౌలర్ల ధాటికి విండీస్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టడంతో 122 పరుగులకే ఆతిథ్య జట్టు కథ ముగిసింది. ఫలితంగా 68 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. వాళ్లు పూర్తిగా నిరాశపరుస్తున్నారు! ఈ నేపథ్యంలో సోమవారం నాటి(ఆగష్టు 1) రెండో టీ20 ఆరంభానికి ముందు వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘గత కొంతకాలంగా మా తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఎప్పటికప్పుడు మళ్లీ పాత కథే పునరావృతమవుతోంది. ఆటగాళ్లు పూర్తిగా నిరాశపరుస్తున్నారు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో మా ప్రదర్శన బాగుండటం లేదు. ఆ సమస్యను అధిగమించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చాడు. లోపాలు సరిచేసుకుని ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. కాగా ఈ ఏడాది మేలో నికోలస్ పూరన్.. కీరన్ పొలార్డ్ నుంచి వెస్టిండీస్ పరిమితో ఓవర్ల జట్టు పగ్గాలు అందుకున్నాడు. నెదర్లాండ్స్ పర్యటనలో 3-0తో వన్డే సిరీస్ గెలిచాడు. అయితే, పాకిస్తాన్ టూర్లో ఘోర పరాభవం ఎదురైంది. వన్డే సిరీస్‌లో పాక్ చేతిలో పూరన్ బృందం 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. ఇక స్వదేశంలో బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ గెలిచినా.. వన్డే సిరీస్‌లో బంగ్లా చేతిలో.. ఆ తర్వాత టీమిండియా చేతిలో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైంది. మొదటి రెండు వన్డేల్లో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. 3 పరుగులు, 2 వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. చదవండి: IND VS WI: రెండో టీ20కి ముందు రోహిత్‌ను ఊరిస్తున్న ప్రపంచ రికార్డు -
'ఓవైపు తల్లికి సీరియస్.. అయినా మ్యాచ్‌లో అదరగొట్టాడు'
ఐపీఎల్-2022లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-2లో ఆర్సీబీని చిత్తు చేసి రాజస్తాన్ రాయల్స్ ఫైనల్‌కు చేరింది. కాగా రాజస్తాన్ విజయంలో ఆ జట్టు పేసర్ ఒబెడ్ మెక్కాయ్ కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో జోస్ బట్లర్ అదగరగొట్టగా.. బౌలింగ్‌లో మెక్కాయ్, ప్రసిద్ద్ కృష్ణ అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్‌లో తన నాలుగు ఓవర్ల కోటాలో 23 పరుగులు ఇచ్చిన మెక్కాయ్ మూడు కీలక వికెట్ల పడగొట్టాడు. కాగా ఈ మ్యాచ్‌కు ముందు మెక్కాయ్ తల్లి తీవ్ర అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. మ్యాచ్ ఆరంభానికి ముందు ఈ విషయం గురించి మెక్కాయ్కు సమాచారం అందింది. అయినప్పటికీ ఓ వైపు బాధను దిగమింగుతూ మెక్కాయ్ అత్యుత్తమంగా రాణించాడు. అయితే ఈ విషయాన్ని మ్యాచ్ అనంతరం రాజస్తాన్ రాయల్స్ హెడ్ కోచ్ కుమార్ సంగక్కర వెల్లడించాడు. కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సంగక్కర తెలిపాడు. "మెక్కాయ్ తల్లి క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు ముందు అనారోగ్యానికి గురైంది. అయినప్పటికీ ఆ విషయాన్ని పక్కన పెట్టి మెక్కాయ్ అద్భుతంగా రాణించాడు. కాగా ఆమె ఆరోగ్యం ప్రస్తుతం బాగానే ఉంది అని"సంగక్కర పేర్కొన్నాడు. ఇక అహ్మదాబాద్ వేదికగా ఆదివారం జరగనున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌తో రాజస్తాన్ తలపడనుంది. చదవండి: Mathew Wade: 'మా జట్టు ఫైనల్ చేరింది.. అయినా సరే టోర్నమెంట్ చికాకు కలిగిస్తుంది' -
IPL 2022 RR Vs RCB: వాళ్లిద్దరు అద్భుతం చేశారు: సచిన్ ప్రశంసల జల్లు
IPL 2022 Qualifier 2 RR Vs RCB: రాజస్తాన్ రాయల్స్ బౌలర్లు ప్రసిద్ కృష్ణ, ఒబెడ్ మెకాయ్లను టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ప్రశంసించాడు. తమ అద్భుత బౌలింగ్ నైపుణ్యాలతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) ఆటగాళ్లను ఒత్తిడికి గురిచేసి వారిని తక్కువ స్కోరుకే పరిమితం చేశారని పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2022 క్వాలిఫైయర్-2లో రాజస్తాన్ ఆర్సీబీని ఓడించిన సంగతి తెలిసిందే. బౌలర్ల కృషికి తోడు జోస్ బట్లర్ వీరోచిత ఇన్నింగ్స్‌తో ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది ఫైనల్లో ప్రవేశించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ ఆర్సీబీని తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ క్రమంలో రాజస్తాన్ బౌలర్లు ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా ప్రసిద్ కృష్ణ కీలక వికెట్లు పడగొట్టాడు. ఆర్సీబీ ఓపెనర్ విరాట్ కోహ్లి, ఫినిషర్ దినేశ్ కార్తిక్, ఆల్‌రౌండర్ వనిందు హసరంగ వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా 4 ఓవర్ల బౌలింగ్‌లో కేవలం 22 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఇక ఒబెడ్ మెకాయ్ సైతం అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 4 ఓవర్లలో 23 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. డుప్లెసిస్, మాక్స్వెల్ వంటి డేంజరస్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపాడు. ఇలా వీరిద్దరు ఆర్సీబీని 157 పరుగులకు కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలో సచిన్ టెండుల్కర్ యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ...‘‘ప్రసిద్ కృష్ణతో పాటు మెకాయ్ రాజస్తాన్‌కు కీలకంగా మారాడు. వీరిద్దరూ కలిసి బెంగళూరు బ్యాటర్లను ఒత్తిడిలోకి నెట్టారు. లోయర్ ఆర్డర్లో అద్భుత స్ట్రైక్‌రేటుతో దూసుకుపోతున్న దినేశ్ కార్తిక్‌ను ప్రసిత్ అవుట్ చేశాడు. హసరంగను బోల్తా కొట్టించాడు. నిజానికి ఇలాంటి పిచ్‌పై 157 స్కోరు ఏమాత్రం చెప్పుకోదగింది కాదు’’ అని పేర్కొన్నాడు. ఆర్సీబీని ఇలా కట్టడి చేసిన ఘనత ప్రసిద్, మెకాయ్‌కే చెందుతున్నాడు. ఇదిలా మిగతా రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ ఒకటి, అశ్విన్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. చదవండి 👇 Jos Buttler: అంచనాలు లేకుండా బరిలోకి.. వార్న్ గర్వపడుతూ ఉంటాడు: బట్లర్ భావోద్వేగం Mathew Wade: 'మా జట్టు ఫైనల్ చేరింది.. అయినా సరే టోర్నమెంట్ చికాకు కలిగిస్తుంది' Moments we'll never forget. 😍 #RRvRCB pic.twitter.com/yhVLY254vq — Rajasthan Royals (@rajasthanroyals) May 28, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Chaar chaand lag gaye. 💗🧿 pic.twitter.com/9lEy7B2RMW — Rajasthan Royals (@rajasthanroyals) May 27, 2022