అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. టీ 20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న నాలుగో బౌలర్‌గా మెకాయ్ నిలిచాడు. ఫ్లోరిడా వేదికగా భారత్‌తో జరిగిన నాలుగో టీ20లో మెక్‌కాయ్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 66 పరుగులు ఇచ్చాడు. తద్వారా ఈ చెత్త రికార్డును మెక్‌కాయ్ తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతకుముందు ఈ చెత్త రికార్డు నమోదు చేసిన జాబితాలో శ్రీలంక బౌలర్ రజితా 75 పరుగులు ఇచ్చి తొలి స్థానంలో ఉండగా.. ఐర్లాండ్ బౌలర్ మెక్‌గ్రాత్( 69 పరుగులు), దక్షిణాఫ్రికా బౌలర్ కైల్ అబాట్(68) పరుగులతో రెండు, మాడు స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా భారత్‌తో జరిగిన రెండో టీ20ల్లో మెకాయ్ ఏకంగా ఆరువికెట్లు పడగొట్టి బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. అయితే ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20లో మాత్రం మెకాయ్‌ను టీమిండియా బ్యాటర్లు రఫ్పాడించారు. దీంతో తన నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ.. 66 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్‌పై 59 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో టీమిండియా సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.
టీమిండియా బ్యాటర్లలో రిషభ్ పంత్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ(33),సంజు సామ్సన్(30) పరుగులతో రాణించారు. ఇక 192 పరుగుల భారీ లక్క్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ భారత్ బౌలర్లు చెలరేగడంతో 132 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3 వికెట్లు పడగొట్టగా... అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు తీశారు.
.@surya_14kumar and @ImRo45 take @ObedCMcCoy to the cleaners. 25 OFF THE OVER! That helicopter shot from SKY though!
— FanCode (@FanCode) August 6, 2022
Watch the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/sBfdPOwRYu
Comments
Please login to add a commentAdd a comment