a.subbareddy
-
ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మృతి.. ‘భారత్ సిరప్‌లే కారణం’
ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మృతి చెందారు. పిల్లల మరణానికి భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ కారణమని ఉజ్బెకిస్తాన్ ఆరోపించింది. శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న 21 మంది పిల్లలలో 18 మంది నోయిడాకు చెందిన మారియన్ బయోటెక్ తయారు చేసిన డాక్-1 మాక్స్ దగ్గు మందు తాగి పిల్లలు మృతిచెందారంటూ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సిరప్‌లపై నిర్వహించిన ల్యాబరేటరీ పరీక్షల్లో విషపూరితమైన ఇథిలీన్ గ్లైకాల్ కనుగొన్నట్లు తెలిపింది. సిరప్‌లపై నిషేధం ‘పిల్లలు ఆసుపత్రిలో చేరక ముందు వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా, తల్లిదండ్రులు లేదా ఫార్మసిస్ట్‌ల సలహా మేరకు అధిక మోతాదులో జలుబును తగ్గించేందుకు పిల్లలకు అందించారు. 2.5- 5 ఎంఎల్ మోతాదుతో రోజుకు మూడు నుంచి నాలుగు సార్లు 2-7 రోజుల పాటు ఈ సిరప్‌ను తీసుకున్నట్లు తేలింది. ఇది ప్రామాణిక మోతాదు కంటే ఎక్కువ’ అని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇక 18 మంది పిల్లలు మరణించడంతో దేశంలోని అన్ని ఫార్మసీల నుంచి డాక్ -1 మాక్స్ టాబ్లెట్లు, సిరప్‌లపై నిషేధం విధించారు. కాగా 2012లో మారియన్ బయోటెక్ ఉజ్బెకిస్తాన్‌లో రిజిస్టర్ చేసుకుంది. స్పందించిన భారత్ భారత్‌కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు మందు తాగి ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది చిన్నారులు మృతి చెందిన ఘటనపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఉజ్బెకిస్తాన్ ఆరోపణలపై విచారణ చేపట్టేందుకు భారత్ సిద్ధమైంది. ఉజ్బెకిస్తాన్ ప్రకటన తమ దృష్టికి వచ్చిందని.. దీనికి సంబంధించిన వివరాలను తమకు అందించాలని అక్కడి ఆరోగ్య మంత్రిత్వ శాఖను కోరినట్లు తెలిపింది. అయితే ఈ సిరప్‌ను ప్రస్తుతం భారత మార్కెట్లో విక్రయించడం లేదని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) వర్గాలు వెల్లడించాయి. అదే విధంగా ఈ ఘటనపై సీడీఎస్ఓ-నార్త్ జోన్, ఉత్తరప్రదేశ్ డ్రగ్స్ కంట్రోలింగ్ అండ్ లైసెన్సింగ్ అథారిటీ బృందాలు సంయుక్తంగా విచారణ జరుపుతున్నాయని తెలిసింది. మారియన్ బయోటెక్ కంపెనీ ఏమన్నదంటే ఉజ్బెకిస్తాన్‌లో పిల్లల మరణాల పట్ల చింతిస్తున్నామని మారియన్ బయోటెక్ ఫార్మా కంపెనీ పేర్కొంది. తయారీ యూనిట్ నుంచి దగ్గు మందు నమూనాలను సేకరించి పరీక్షలకు పంపామని, నివేదికల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. ప్రభుత్వం విచారణ జరుపుతోందని, పూర్తి నివేదిక తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని కంపెనీ లీగల్ హెడ్ హసన్ రజా అన్నారు. రెండోసారి భారత్‌లో తయారు చేసిన దగ్గు సిరప్‌లపై ఆరోపణలు రావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. ఇంతకుముందు ఆఫ్రికన్ దేశమైన గాంబియాలో 70 మందికిపైగా పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. హర్యానాకు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్‌లో తయారైన దగ్గు మందు సిరప్ కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. పిల్లల మృతిపై కంపెనీ సిరప్‌లకు సంబంధం ఉందని, వీటిని వాడవద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఉబ్జెకిస్తాన్, గాంబియాలోనూ చిన్నారుల మరణాలకు సిరప్‌లో ప్రాణాంతక రసాయనం ఇథిలీన్ గ్లైకాల్ ఉండటమే కారణమని తేలింది. -
పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని..అవమానంతో యువకుడు మృతి
ఒక వ్యక్తి పెళ్లి క్యాన్సిల్ అయ్యిందని అవమానంతో ఆత్యహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఈ మేరకు బాధితుడు తండ్రి పోలీసులు ఫిర్యాదు చేయడంతో.. సదరు మహిళ కుటుంబసభ్యలు కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. వివరాల్లోకెళ్తే...పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...మృతుడుని 29 ఏళ్ల మోహన్ కుమార్‌గా గుర్తించారు పోలీసులు. అతనికి కావ్య శ్రీ అనే అమ్మాయితో వివాహం నిశ్చయమైంది. పెళ్లి తర్వాత కూడా చదువకోవచ్చని ఆమెకు అబ్బాయి కుటుంబ సభ్యులు చెప్పారు. అలాగే బాధితుడు మోహన్ వివాహ ఏర్పాట్ల కోసం సుమారు రూ. 10 లక్షలు కాబోయే భార్య కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. ఐతే మోహన్ గురించి అమ్మాయి కుటుంబ సభ్యులు కొన్ని రూమర్లు విని పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం మోహన్, అతడి కుటుంసభ్యులను అమ్మాయి తల్లిదండ్రులు పిలిపించి....వివాహం రద్దు చేసుకోవాలని సూచించారు. అలాగే డబ్బులు వెనుకకు ఇచ్చేందుకు నిరాకరించడమే గాక పెళ్లిని రద్దు చేసుకోమని ఒత్తిడి చేశారు. అలాగే అమ్మాయిని ఇక ఇబ్బంది పెట్టకూడదని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఈ విషయమై ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తిందని, అలాగే తమను బయటకు గెట్టివేసి అవమానించినట్లు మోహన్ తండ్రి రంగస్వామి ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ అవమానం తోపాటు పెళ్లి కూడా రద్దు కావడంతో తన కొడుకు మోహన్ కలత చెంది ఉరి వేసుకుని చనిపోయినట్లు తెలిపాడు. మోహన్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రోజులానే ఆరోజు కూడా డ్యూటికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి తన కాబోయే భార్య ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. ఈ ఘటనతో నిందితులు పరారీలో ఉన్నారు. ఈమేరకు పోలీసులు అమ్మాయి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: రెండు కార్లు ఢీ...మృత్యువులోనూ వీడని బంధం) -
భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఆస్తులు.. ఎంతంటే?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్తులు గతంతో పోలిస్తే భారీగానే పెరిగాయి. ప్రస్తుతం ఆయన వద్ద రూ.2.23 కోట్ల ఆస్తులు ఉన్నాయి. అందులో ఎక్కవ భాగం బ్యాంకు డిపాజిట్ల రూపంలోనే ఉన్నాయి. అయితే, ఎలాంటి స్థిరాస్తులు లేవు. గాంధీనగర్‌లో గతంలో కొనుగోలు చేసిన భూమిని విరాళంగా ఇచ్చేశారు మోదీ. ఈ మేరకు తాజాగా వెల్లడించిన ఆస్తుల వివరాల్లో పేర్కొన్నారు మోదీ. మరోవైపు.. బాండ్స్, షేర్లు, మ్యూచ్యువల్ ఫండ్స్‌లోనూ పెట్టుబడి పెట్టలేదు. సొంతంగా కారు కూడా లేదు. అయితే, సుమారు రూ.1.73 లక్షల విలువైన మూడు బంగారు ఉంగరాలు ఉన్నాయి. ఏడాదిలో రూ.26 లక్షల నుంచి రూ.2 కోట్లకు.. ప్రధాని మోదీకి చెందిన చరాస్తులు ఏడాది క్రితం 2021, మార్చి 31 నాటికి రూ.26.13 లక్షలుగా ఉండేవి. రూ.1.1 కోట్లు విలువైన స్థిరాస్తి ఉంటే దానిని విరాళంగా ఇచ్చారు. 2022, మార్చి 31 నాటి డిక్లరేషన్ ప్రకారం ప్రస్తుతం మోదీ వద్ద ఆస్తులు రూ.2,23,82,504 ఉన్నాయి. ఈ మేరకు వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. 2022, మార్చి 31 నాటికి మోదీ చేతిలో రూ.35,350 నగదు ఉంది. అలాగే పోస్ట్‌ఆఫీస్‌లోని నేషనల్ సేవింగ్స్ సర్టిఫెక్ట్ విలువ రూ.9,05,105, జీవిత బీమా పాలసీల విలువ రూ.1,89,305గా ఉన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేబినెట్ మంత్రులు తమ ఆస్తుల వివరాలను ప్రకటించారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వద్ద చరాస్తులు రూ.2.54 కోట్లు, స్థిరాస్తులు రూ.2.97 కోట్లు ఉన్నాయి. 29 కేంద్ర మంత్రుల్లో గత ఆర్థిక సంవత్సరంలోని తమ, తమపై ఆధారపడిన వారి ఆస్తుల వివరాలను వెల్లడించిన వారిలో ధర్మేంద్ర ప్రదాన్, జోతిరాదిత్య సింధియా, ఆర్కే సింగ్, హర్దీప్ సింగ్ పూరీ, పర్శోత్తమ్ రూపాలా, జీ కిషన్ రెడ్డి, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీలు ఉన్నారు. ఇదీ చదవండి: Akhilesh Yadav: నితీష్ రాజీనామా.. ‘బీజేపీ భగావ్’ అంటూ అఖిలేష్ షాకింగ్ కామెంట్స్ -
టీ20ల్లో మెకాయ్ చెత్త రికార్డు.. నాలుగో బౌలర్‌గా!
అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ ఒబెడ్ మెకాయ్ ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. టీ 20ల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న నాలుగో బౌలర్‌గా మెకాయ్ నిలిచాడు. ఫ్లోరిడా వేదికగా భారత్‌తో జరిగిన నాలుగో టీ20లో మెక్కాయ్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 66 పరుగులు ఇచ్చాడు. తద్వారా ఈ చెత్త రికార్డును మెక్కాయ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఈ చెత్త రికార్డు నమోదు చేసిన జాబితాలో శ్రీలంక బౌలర్ రజితా 75 పరుగులు ఇచ్చి తొలి స్థానంలో ఉండగా.. ఐర్లాండ్ బౌలర్ మెక్‌గ్రాత్( 69 పరుగులు), దక్షిణాఫ్రికా బౌలర్ కైల్ అబాట్(68) పరుగులతో రెండు, మాడు స్థానాల్లో కొనసాగుతున్నారు. కాగా భారత్‌తో జరిగిన రెండో టీ20ల్లో మెకాయ్ ఏకంగా ఆరువికెట్లు పడగొట్టి బెంబేలెత్తించిన సంగతి తెలిసిందే. అయితే ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ20లో మాత్రం మెకాయ్ను టీమిండియా బ్యాటర్లు రఫ్పాడించారు. దీంతో తన నాలుగు ఓవర్లలో రెండు వికెట్లు పడగొట్టినప్పటికీ.. 66 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. విండీస్‌పై 59 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో టీమిండియా సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రిషభ్ పంత్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రోహిత్ శర్మ(33),సంజు సామ్సన్(30) పరుగులతో రాణించారు. ఇక 192 పరుగుల భారీ లక్క్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ భారత్ బౌలర్లు చెలరేగడంతో 132 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ 3 వికెట్లు పడగొట్టగా... అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు తీశారు. .@surya_14kumar and @ImRo45 take @ObedCMcCoy to the cleaners. 25 OFF THE OVER! That helicopter shot from SKY though! Watch the India tour of West Indies LIVE, only on #FanCode 👉 https://t.co/RCdQk12YsM@BCCI @windiescricket #WIvIND #INDvsWIonFanCode #INDvsWI pic.twitter.com/sBfdPOwRYu — FanCode (@FanCode) August 6, 2022 చదవండి: Obed Mccoy: మొన్న 'భయపెట్టాడు'.. ఇవాళ 'భయపడ్డాడు' -
సీఎం కేసీఆర్‌పై సీబీఐకి ఫిర్యాదు చేసిన కేఏ పాల్
-
పాత ఫొటోలతో విష ప్రచారం
మహారాణిపేట (విశాఖ దక్షిణ): గత తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల జీవీఎంసీ పరిధిలో ఉన్న రహదారులన్నీ దెబ్బతిన్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,పంచాయతీరాజ్ శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత రహదారులన్నీ యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు పూర్తి చేస్తోందని, నిధులు కూడా కేటాయించామని ఆయన తెలిపారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మంత్రి బూడి ముత్యాలనాయుడు మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈనాడు పత్రిక పాత ఫొటోలు వేసి తప్పుగా ప్రచారం చేసిందని, ద్వారకానగర్‌లో జూన్ 6వ తేదీలోపు రహదారులు వేసినట్టు స్పష్టం చేశారు. ఇక్కడే మరమ్మతులు కూడా చేపట్టామని ఉప ముఖ్యమంత్రి అన్నారు. మరమ్మతులు జరిగిన రహదారుల్లో పాత ఫొటోలతో పత్రికలో వేసి వార్తలు రాయడం దారుణమన్నారు. అల్లా ఉద్దీన్ అద్భుత దీపం మాదిరిగా రాత్రికి రాత్రి రోడ్లు వేయడం జరగదు కదా అన్నారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ రహదారులన్నీ ఛిద్రంగా మారాయని, దాని వల్లే ఇప్పుడు అధ్వానంగా తయారయ్యాయన్నారు. పాత ఫొటోలు వేసి పచ్చ పత్రిక ప్రభుత్వంపై బురద జల్లేందుకు కంకణం కట్టుకుందన్నారు. జీవీంఎసీ పరిధిలోని అన్ని వార్డుల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం కార్పొరేటర్లు సూచనలు, సలహాలు మేరకు పనులు చేపడుతున్నట్టు చెప్పారు. జీవీఎంసీ పరిధిలో అన్ని వార్డుల్లో మొత్తం 6,900 గుంతలను, రహదారులను గుర్తించడం జరిగిందని, ఇందులో సుమారు 3,200 గుంతలను 9 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేసినట్టు చెప్పారు. మిగిలిన 3,700 గుంతలు జూలై 15 నాటికి పూర్తి చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశాలు జారీ చేశామన్నారు. అలాగే వార్డుల్లో పనుల కోసం ఒక్కొ కార్పొరేటర్‌కు రూ.కోటి 50 లక్షల కేటాయించామన్నారు. ఈ పనులు కూడా టెండర్లు పిలిచి త్వరగా చేపట్టాలని, వచ్చే సెప్టెంబర్ నాటికి పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. గ్రామీణా ప్రాంతాల్లో కూడా రహదారుల నిర్మాణం చేపట్టామన్నారు. నాడు–నేడు పథకం నిధులు కేటాయింపు ప్రక్రియ ప్రణాళిక బద్ధంగా జరుగుతోందన్నారు. రాష్ట్రంలో రహదారుల కోసం రూ.1,073 కోట్లు కేటాయించామన్నారు. అలాగే మన్యం ప్రాంతాల్లో కూడ పీఆర్, ఆర్అండ్బీ రహదారులు వేయాలని వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ శ, ఆర్డీవో డి.హుస్సేన్ సాహెబ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. (చదవండి: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో మెరిసిన మన్యం బిడ్డ) -
తుమ్మపూడిలో ఉద్రిక్తత.. లోకేష్ రాకతో రెచ్చిపోయిన టీడీపీ కార్యకర్తలు
సాక్షి, గుంటూరు: దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హత్య కేసులోని మృతురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు నారా లోకేష్ రావడంతో టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. దీంతో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. ఈ దాడిలో పోలీసులకు గాయాలు అయ్యాయి. అంతకుముందు తెనాలి ఆసుపత్రి దగ్గర కూడా టీడీపీ నాయకులు వీరంగం సృష్టించారు. తిరుపతమ్మ కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్తుంటే అంబులెన్ను అడ్డుకున్నారు. లోకేష్ వచ్చేవరకు మృతదేహాన్ని ఆపాలంటూ హంగామా చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు టీడీపీ నాయకులను చెదరగొట్టారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. అయితే తుమ్మపూడిలో లోకేష్ రాగానే మరోసారి రెచ్చిపోయారు టీడీపీ నాయకులు. చదవండి👉 తుమ్మపూడి మహిళ హత్య కేసులో సంచలన విషయాలు. -
అమ్మా.. నీవు లేని లోకంలో నేనుండలేను..
సాక్షి,కర్నూలు: ‘అమ్మా.. నాకు ఊహ తెలియని వయసులో నాన్న చనిపోయాడు. అయినా కష్టం విలువ తెలియకుండా పెంచి పెద్ద చేశావు. ఇప్పుడు నువ్వూ వదిలిపోతే నేనెలా బతికేది. నువ్వు లేని ఈ లోకంలో నేనుండలేను’ అంటూ ఓ యువకుడు బలవన్మరణం చెందాడు. ఈ ఘటన అవుకు మండల పరిధిలోని నిచ్చెన మెట్ల గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన బండి వెంకటరాముడు (31) ఆరేళ్ల వయస్సులో ఉండగా తండ్రి అనారోగ్యంతో మృతిచెందాడు. తల్లి లక్ష్మీదేవి అన్నీ తానై రెక్కల కష్టంతో కుమారుడిని పెంచి పెద్ద చేసింది. ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసింది. వెంకటరాముడికి కూతుళ్లు ఆరేళ్ల సిరివెన్నెల, నాలుగేళ్ల శ్రీజ, రెండేళ్ల వర్షిత ఉన్నారు. ప్రస్తుతం భార్య జ్యోతి గర్భిణి. ఈక్రమంలో రెండు నెలల క్రితం లక్ష్మీదేవి అనారోగ్యంతో మృతిచెందింది. చిన్నప్పుడే తండ్రి మృచెందినా ఏ లోటూ రానివ్వకుండా చూసుకున్న తల్లి దూరం కావడంతో దిగులు చెందేవాడు. ఈక్రమంలో ఈ నెల 23న రాత్రి కలుపు మొక్కల నివారణ మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు కర్నూలు ఆస్పత్రికి తరలించగా అక్కడ కోలుకోలేక 24న మృతిచెందాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ జగదీశ్వరరెడ్డి బుధవారం తెలిపారు. మృతుని కూతుళ్లు, భార్య రోదించిన తీరును చూసి గ్రామస్తులు కంట తడి పెట్టుకున్నారు. చదవండి: ఉసురు తీసిన మద్యం మత్తు -
నాగబాబు బర్త్‌డే : చిరంజీవి భావోద్వేగ ట్వీట్
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, నటుడు, నిర్మాత నాగబాబు పుట్టిన రోజు నేడు(అక్టోబర్ 29). ఈ సందర్భంగా పలువురు సీనీ ప్రముఖులు నాగబాబుకు బర్త్‌డే విషెష్ తెలియజేస్తున్నారు. ఇక తన తమ్ముడికి సోషల్ మీడియా వెదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు మెగాస్టార్ చిరంజీవి. ‘విధేయుడు, భావోధ్వేగం కలిగిన వాడు, దయా హృదయుడు, సరదా వ్యక్తి నా సోదరుడు నాగబాబుకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను అంటూ చిరంజీవి తన ట్వీటర్ ద్వారా బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇద్దరు తమ్ముళ్లు పవన్, నాగబాబులతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశాడు. ఇక అన్నయ్య బర్త్‌డే ట్వీట్‌కు స్పందించిన నాగబాబు..‘థ్యాంక్స్ అన్నయ్య.. నేనేప్పుడు నీతోడుగానే ఉంటా’ అంటూ రిప్లై ఇచ్చాడు. (చదవండి : పారితోషికం తీసుకోవడంలేదు) అలాగే మెగా అల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ కూడా మామయ్య నాగబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. క్రీడలు, కళలలోకి రావడంలో నన్నుప్రోత్సహించిన వారిలో నాగబాబు ఒకరు. ఆయనకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని ట్వీట్ చేస్తూ నాగబాబుతో కలిసి దిగిన తన చిన్నప్పటి ఫోటోని షేర్ చేశాడు. అలాగే నాగబాబు కుమారుడు, హీరో వరుణ్ తేజ్, సినీ నిర్మాత బండ్ల గణేష్ తదితరులు సోషల్ మీడియా వేదికగా నాగబాబుకి బర్త్‌డే విషెష్ తెలియజేశారు. Happy Birthday to my passionately loyal, emotional, kind hearted and fun loving brother @NagaBabuOffl Have a great year ahead! మన బంధం, అనుబంధం ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని , నీ ప్రతి పుట్టినరోజుకి అది మరింత బలపడాలని ఆశిస్తున్నాను! pic.twitter.com/qswBwxgVfe — Chiranjeevi Konidela (@KChiruTweets) October 29, 2020 The man behind me getting into sports and arts...Wishing one of my pillars of support and strength @NagaBabuOffl mama, a very Happy Birthday. pic.twitter.com/dp9lxONvQb — Sai Dharam Tej (@IamSaiDharamTej) October 29, 2020 Happy birthday Nana! Thanks for this beautiful life you’ve given me.. And for always being my best friend!! Love you!❤️❤️❤️@NagaBabuOffl pic.twitter.com/cZvJ2CqYVG — Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) October 29, 2020 బోలా నాగేంద్రుడి కి జన్మదిన శుభాకాంక్షలు @NagaBabuOffl 💐 pic.twitter.com/i4fGF7hZFi — BANDLA GANESH. (@ganeshbandla) October 29, 2020 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1461324347.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1461324347.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1461324347.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); Happy birthday Nanna! Here’s wishing that you’ll become funnier, more handsome and much more younger with each birthday! Love you to bits! ❤️ @NagaBabuOffl pic.twitter.com/dN0rO4BnK9 — Niharika Konidela (@IamNiharikaK) October 29, 2020 -
నేను రన్స్ ఇవ్వడం కాదు.. వారు కొడుతున్నారు!
దుబాయ్: ఈ ఐపీఎల్ సీజన్లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా, ఢిల్లీ క్యాపిటల్స్ రెండో స్థానంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ మూడో స్థానంలో ఉన్నాయి. ఇక కేకేఆర్ నాల్గో స్థానంలో ఉండగా, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐదో స్థానంలో ఉంది. ఆపై సీఎస్కే, రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్ వరుస స్థానాల్లో ఉన్నాయి. కాగా, శ్రీలంక పేసర్ ఇసురు ఉదాన ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఈ సీజన్లో ఇసురు ఉదాన ఆడిన ప్రతీ మ్యాచ్‌లోనూ 40 పరుగులు తగ్గకుండా ఇచ్చాడు. ఇది ఆర్సీబీ పరాజయాల్లో ప్రభావం చూపిందనేది ఆ ఫ్రాంచైజీ అభిమానుల అభిప్రాయం. (ధోని ఒక్కడ్నే బాధ్యుడ్ని చేస్తారా?) ఒక అభిమాని అయితే ఈ విషయాన్ని ఇసురా ఉదానను అడిగేశాడు. ‘ మీరెందుకు ప్రతీ మ్యాచ్‌లోనూ పరుగులు ఇస్తున్నారు. పవర్ ప్లేలో భారీ పరుగులు సమర్పించుకుంటున్నారు ఎందుకు?’ అని ప్రశ్నించాడు. మరి దీనికి ఏమి సమాధానం మాత్రం ఉదానా తెలివిగా ఇచ్చాడు. ‘ నేను ఎక్కడ ఇస్తున్నాను. బ్యాట్స్‌మన్ బ్యాట్‌తో కొడుతున్నాడు’ అంటూ కొంటెగా సమాధానమిచ్చాడు. ఆర్సీబీ ఆడిన గత మ్యాచ్‌లో ఘోర పరాజయం చవిచూసింది. ఢిల్లీతో జరిగిన ఆ మ్యాచ్‌లో 59 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో ఉదానా వికెట్ తీసినా నాలుగు ఓవర్లలో 40 పరుగులిచ్చాడు. ఇక సైనీ అయితే మూడు ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించుకున్నాడు. ఢిల్లీ 196 పరుగులు చేయగా, ఆర్సీబీ 137 పరుగులే చేసి ఓటమి పాలైంది. -
‘సాక్షి’ ఫొటో జర్నలిస్టుపై దాడి
సాక్షి, చార్మినార్ (హైదరాబాద్): సాక్షి దినపత్రిక ఫొటో జర్నలిస్టు గాలి అమర్‌పై బుధవారం సిటీ కాలేజీ చౌరస్తా వద్ద ఐదుగురు దుండగులు దాడి చేసి గాయపరిచారు. విధి నిర్వహణలో ఉన్న అమర్‌పై స్థానికులు అకారణంగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. పేట్లబురుజు సిటీ కాలేజీ చౌరస్తా వద్ద సిగ్నల్స్ పనితీరు, వాహనాల రాకపోకలపై ఫొటోలు చిత్రీకరిస్తుండగా స్థానికంగా నివాసముంటున్న కొందరు అమర్‌ను అడ్డుకుని చితకబాదారు. కెమెరాతో పాటు సెల్‌ఫోన్ లాక్కున్నారు. అక్కడి వాహనదారులు సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ వారు ఆగలేదు. చదవండి: మాజీ ఎమ్మెల్యే ‘వరద’ కుమారుడు, అల్లుడిపై కేసు చార్మినార్ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ట్రాఫిక్ పోలీసు కానిస్టేబుల్ సంఘటనా స్థలానికి చేరుకుని దుండగుల దాడి నుంచి ఫొటో జర్నలిస్టును కాపాడాడు. లాక్కున్న కెమెరాతో పాటు సెల్‌ఫోన్‌ను దుండగుల నుంచి తిరిగి ఇప్పించాడు. బాధితుడిని వైద్య పరీక్షల నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చార్మినార్ ఇన్స్పెక్టర్ నరేశ్‌కుమార్ తెలిపారు. సంఘటనా స్థలంలోని సీసీ కెమెరా ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. చదవండి: ‘సాక్షి’ బాల ఎడిటర్లు 301 మంది నిందితులపై చర్యలు తీసుకోవాలి.. ‘సాక్షి’ఫోటో జర్నలిస్టు గాలి అమర్‌పై అకారణంగా దాడికి పాల్పడిన దుండగులపై కేసులు నమోదు చేసి చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సిరిగిరి విజయ్‌కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఫొటో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు అనుమళ్ల గంగాధర్, జనరల్ సెక్రటరీ కేఎన్ హరి, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంగు వెంకటేశ్ గౌడ్, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్ దాడిని ఖండించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కాజల్ అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చింది
చెన్నై: కాజల్‌అగర్వాల్‌ను తాజాగా కర్ణాటక ఆహ్వనించింది. కళాకారులకు భాషా బేధం ఉండదన్నది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈ సౌలభ్యం ఎక్కువన్నది విధితమే. ఒక భాషలో నటించిన చిత్రం విజయం సాధిస్తే వెంటనే ఇతర భాషా దర్శకులు ఆ చిత్రాలపై, అందులో నటించిన హీరోయిన్లపైనా దృష్టిసారిస్తారు. అలా ప్రస్తుతం హీరోయిన్లుగా నటిస్తున్న వారందరూ బహుభాషా నటీమణులగా పేరు తెచ్చుకుంటున్నారని చెప్పవచ్చు. నటి కాజల్‌అగర్వాల్ కూడా బహుభాషా నటినే. బాలీవుడ్లో రంగప్రవేశం చేసి ఆ తరువాత టాలీవుడ్, కోలీవుడ్‌లలో ప్రవేశించి టాప్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది. అయితే దక్షిణాది భాషల్లో ఒకటైన కన్నడంలో ఈ బ్యూటీ ఇప్పటి వరకూ నటించలేదు. అలాంటిది తాజాగా అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చేసింది. కన్నడంతో సంచలన నటుడిగా ముద్రవేసుకున్న ఉపేంద్రతో జతకడుతోంది. కబ్జా అనే చిత్రంలో ఈ జంట నటిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్లో అవకాశాలు తగ్గాయి. తమిళంలో కమలహాసన్‌కు జంటగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్–2 చిత్రంలో నటిస్తోంది. ఈ రెండు భాషల్లోనూ మరో అవకాశం లేకపోవడంతో కన్నడ పరిశ్రమపై దృష్టి సారించింది. అయితే అక్కడ త్రిష, నయనతార వంటి వారు నటించినా పేద్దగా పేరుతెచ్చుకోలేకపోయారు. మరి కాజల్‌అగర్వాల్‌కు శాండిల్‌వుడ్‌లో భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలి. అక్కడ ఒక రౌండ్ కొడుతుందా లేక ఒకటి రెండు చిత్రాలతోనే సరిపెట్టుకుంటుందా అన్న ఆసక్తి మాత్రం సినీ వర్గాల్లో నెలకొంది. కాగా శాండిల్‌వుడ్ ఎంట్రీ గురించి కాజల్ మాట్లాడుతూ తాను నటించే ప్రతి చిత్రాన్ని తొలి చిత్రంగానే భావిస్తానని చెప్పింది. ఇప్పుడు కన్నడంలో మొదటి సారి నటిస్తున్నాను. ఈ అనుభవం కొత్తగా ఉంది అని పేర్కొంది. ఈ చిత్రాన్ని ఏడు భాషల్లో విడుదల చేయనున్నారని తెలిపింది. ఇప్పటికి 50 చిత్రాలను పూర్తి చేశానని, వంద చిత్రాలను పూర్తి చేయడమే తన లక్ష్యమని కాజల్‌అగర్వాల్ పేర్కొంది. అయితే లక్ష్యంపెద్దదిగానే ఉంది. అందుకు మరో 10, 15 ఏళ్లు పడుతుందే. అప్పటికి వయసు ప్రభావం చూపదా? అయినా నూరు చిత్రాల్లో నటించడమే తన లక్ష్యం అంటోంది గానీ, హీరోయిన్‌గానే అని అనలేదు కాబట్టి అక్కగా, వదినగా అయినా తన టార్గెట్‌ను పూర్తి చేసుకుంటుందేమో. అన్నట్టు ఈ జాణ నటించిన ఏకైక హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం ప్యారిస్ ప్యారిస్ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నా, విడుదలకు మోక్షం కలగలేదు. -
తోడేళ్లుగా మారిన వారి ముఖాలు
న్యూఢిల్లీ : స్పెయిన్‌లో ‘అలోపేసియా (జుట్టు సహా శరీరంపై ఎక్కడ వెంట్రుకలున్నా రాలిపోవడం)’ వ్యాధితో బాధ పడుతున్న కొంత మంది యువకులు అందుకు విరుగుడు మందులు వాడడంతో అనూహ్యంగా వారి ముఖాలే మారిపోయాయి. ఒక జుట్టుపైనే కాకుండా ముఖం నిండా వెంట్రుకలు పుట్టుకొచ్చాయి. ఇప్పుడు వారి ముఖాలు తోడేలు ముఖాల్లా తయారయ్యాయి. అందుకే దీన్ని ‘వర్‌ఫూల్ఫ్ సిండ్రోమ్’ అని పిలుస్తారని, వైద్య పరిభాషలో ‘హైపర్ట్రికోసిస్’గా వ్యవహరిస్తారని స్పెయిన్ వైద్యాధికారులు తెలిపారు. మందు కల్తీ అవడం వల్ల ఇలా జరిగిందని, ఈ మందును తయారు చేసిన ‘ఫార్మా క్విమికా’ లైసెన్స్‌ను రద్దు చేశామని, ఆ బ్యాచ్ సరకును మొత్తం మార్కెట్ నుంచి స్వాధీనం చేసుకున్నామని వైద్యాధికారులు చెప్పారు. 16 మంది యువకులు ఈ వ్యాధి బారిన పడినట్లు తమ దృష్టికి వచ్చిందని, ముఖాన భారీగా వెంట్రుకలు వస్తుండడంతో వారు మందులు మానేశారని, అప్పటి నుంచి వెంట్రుకలు అవాంఛిత చోట రావడం ఆగిపోయిందని వైద్యాధికారులు వివరించారు. ఫార్మా క్విమికా కంపెనీ భారత్‌కు కూడా ఔషధాలను విక్రయిస్తుందని అక్కడి మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ విషయం భారతీయ వైద్యాధికారుల దృష్టికి వచ్చిందా లేదా? అన్నది స్పష్టం కావడం లేదని అక్కడి మీడియా వార్తలు తెలియజేస్తున్నాయి. అలోపేసియా అంటే శరీరంలో ఎక్కడ పడితే అక్కడ అవసరమైన దానికంటే ఎక్కువగా వెంట్రుకలు పెరగడం. దీనికి ఒక మందు అంటూ లేదు. వెంట్రుకలు ఏ ప్రాంతంలో పెరుగుతున్నాయి? అవి ఏ స్థాయిలో పెరుగుతున్నాయి? అన్న అంశంపై ఆధారపడి ఉంటుందట. ఇది ఎక్కువ మందికి పుట్టుకతో రాగా, కొందరిలో యుక్త వయస్సులో వస్తుందట. పురుషుల్లో మేల్ హార్మోన్సు అధికంగా ఉండడం వల్ల ఇలా అవాంఛిత వెంట్రుకలు వస్తాయట. -
సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
సాక్షి, రాయ్‌గఢ్ : హౌరా-జగదల్పూర్ సామలేశ్వరి ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వస్తున్న టవర్‌కార్( ప్రత్యేక రైలు)ను ఢీకొట్టడంతో వెనుక నున్న మూడు బోగీలకు మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. ఒడిశాలోని హావ్‌డా నుంచి జగదల్పూర్ వైపు వెళ్తుండగా కెవుటాగూడ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే లైనులో రైలు, టవర్‌కార్ ఎదురెదురుగా వచ్చి ఢికొనడం వల్ల రెండు జనరల్ బోగీలు, లగేజీ బోగీలో మంటలు చెలరేగాయి. రైల్వే సిబ్బంది వెంటనే స్పందించడంతో ఇద్దరు మినహా ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. -
పిట్స్బర్గ్ వర్సిటీతో ఎంవోయూ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని వర్సిటీలకు అకడమిక్ సహకారం అందించే అంశంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు అమెరికాలోని పిట్స్బర్గ్ వర్సిటీతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి గురువారం అవగాహనా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి, పిట్స్బర్గ్ వర్సిటీ గ్లోబల్ అఫైర్స్ వైస్ ప్రోవోస్ట్ డాక్టర్ ఏరియల్ ఆర్మోనీ పరస్పరం ఎంవోయూలను మార్చుకున్నారు. ఏరియల్ ఆర్మోని మాట్లాడుతూ, 1787లో ఏర్పాటైన తమ వర్సిటీ వైద్యం, విద్య, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ రంగాల్లో బోధన, పరిశోధనలు చేస్తోందన్నారు. ప్రస్తుతం వర్సిటీ అమెరికాలో 5 క్యాంపస్‌లు, 28 వేల మంది విద్యార్థులను కలిగి ఉందన్నారు. ఈ ఎంవోయూ ద్వారా రాష్ట్రం లోని వర్సిటీలు, పిట్స్బర్గ్ వర్సిటీల మధ్య పరస్ప రం విద్యార్థులు, అధ్యాపకుల మార్పిడి, పరిశోధనల్లో సహాయసహకారం లభించనుందని పాపిరెడ్డి పేర్కొన్నారు. పిట్స్బర్గ్ వర్సిటీ అందిస్తున్న ఉత్తమ కోర్సులు, సబ్జెక్టులను రాష్ట్రంలోని వర్సిటీల్లో ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తామన్నారు. రాష్ట్రంలోని వర్సిటీలు, పరిశోధన కేంద్రాలతో పిట్స్బర్గ్ వర్సిటీ అనుసంధానమై విద్యాపరిశోధనలు, విద్యాబోధన అంశాల అభివృద్ధికి సహకారం అందించనుందన్నారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫె సర్ లింబాద్రి, వెంకటరమణ పాల్గొన్నారు. ఎంవోయూ అనంత రం పిట్స్బర్గ్ ప్రతినిధి బృందం సచివాలయంలో సీఎస్ ఎస్.కె.జోషి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మను మర్యాదపూర్వకంగా కలిసింది. -
ఆన్య ఖురానాకు స్వర్ణం
సాక్షి, హైదరాబాద్: లెజెండ్ హంట్ రోలర్ స్కేటింగ్ చాంపియన్ షిప్లో ఆన్య ఖురానా విజేతగా నిలిచింది. ఇందిరా పార్క్‌లోని స్కేటింగ్ రింక్ వేదికగా ఆదివారం జరిగిన 9–11 బాలికల ఫైనల్లో ఆన్య అగ్రస్థానాన్ని దక్కించుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. రోలర్ హాక్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ టోర్నీలో రిధి పటేల్ రజతాన్ని సొంతం చేసుకోగా... నమితా నిరెల్ ఆడమ్స్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది. బహుమతి ప్రదాన కార్యక్రమంలో భారత రోలర్ స్కేటింగ్ సమాఖ్య ప్రతినిధి అమిత్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు పతకాలను అందజేశారు. -
డేటా చోరీ స్కాం, విస్తుగొలిపే వాస్తవాలు
-
డేటా చోరీ స్కాం, విస్తుగొలిపే వాస్తవాలు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రజల డేటా చోరీ కేసులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల దర్యాప్తులో తీగ లాగుతుంటే డొంక కదులుతోంది. ప్రజల డేటా చోరీకి పాల్పడిన ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీల ప్రతినిధులతో కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక ఈ రెండు సంస్థలు కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీలకు ఎలాంటి అనుభవం లేకపోయినా... ముఖ్యమంత్రితో పాటు ఆయన తనయుడు తమ శాఖల నుంచి పెద్ద ఎత్తున కాంట్రాక్టులు కట్టబెట్టారు. కుటుంబ వికారం, సమాజ వికాసం ప్రాజెక్ట్‌ను ఏపీ సర్కార్...బ్లూ ఫ్రాగ్ సంస్థకు అప్పగించింది. ఈ మేరకు మంత్రి లోకేష్ చేతిలోని పంచాయతీ రాజ్ శాఖ ఓ జీవోను జారీ చేసింది. ఇందుకోసం ఈ ఏడాది జనవరి 29న హై లెవల్ ఎంపిక కమిటీని నియమించి, అన్ని శాఖల సమాచారం అందించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఇక 2017లో పంటల సలహా కాంట్రాక్ట్‌ను రూ.30 కోట్లకు బ్లూ ఫ్రాగ్‌కు అప్పగించింది. అయితే ఇచ్చిన పని సకాలంలో పూర్తి చేయలేకపోవడంతో 2018లో ఆ సంస్థను అధికారులు తప్పించారు. మరోవైపు కరెంట్ స్తంభాల జియో ట్యాగింగ్ కాంట్రాక్ట్‌ను కూడా ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీలకు ఏపీ ప్రభుత్వం అప్పచెప్పింది. కాగా ఈ రెండు సంస్థలు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సేవలు అందించాయి. -
326వ రోజు పాదయాత్ర డైరీ
సామాన్యులు స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా హరించాలనుకోవడం ఎంత ఆటవికం? ఈరోజు కోటబొమ్మాళి, సంతబొమ్మాళి మండలాల్లో పాదయాత్ర సాగింది. మంత్రి గారు, ఆయన అనుచరుల అరాచకాల మీద రోజంతా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. నిన్న రాత్రి బస చేసిన రైస్‌మిల్ యజమాని, ఆయన కుటుంబీకులు వచ్చి కలిశారు. బసకు చోటిచ్చినందుకు వారింటికి వెళ్లి మరీ బెదిరించారట. మిల్లును, వ్యాపారాన్ని దెబ్బ కొడతామని హుంకరించారట. అయినా అభిమానం ముందు ఆ బెదిరింపులేవీ పనిచేయలేదు. మంత్రి గారి స్వగ్రామం నిమ్మాడ గ్రామస్తులు కలిశారు. నిరుపేద ఎరకయ్యకు ఉన్న ఒకే ఒక ఎకరా భూమికి దారి లేకుండా చేసి సెల్‌ఫోన్ టవర్ పెట్టి సొమ్ము చేసుకుంటున్నారట. మంత్రి గారి అడుగులకు మడుగులొత్తలేదని అదే గ్రామంలో 20 కుటుంబాలను సాంఘిక బహిష్కరణ చేశారట. వారితో ఎవరూ మాట్లాడకూడదు.. వారి భూములెవ్వరూ సాగు చేయకూడదు. అమ్మరాదు.. కొనరాదు. ఎటువంటి వ్యాపారాలూ చేయరాదు. ఆఖరికి చాకలి, మంగలి కూడా వెళ్లకుండా ఆంక్షలు విధించారట. ఏ పథకాలు అందకుండా చేయడం, బతుకుదెరువే లేకుండా చేయాలనుకోవడం విస్మయం కలిగించింది. సామాన్యులకు స్వేచ్ఛగా జీవించే హక్కు కూడా హరించాలనుకోవడం ఎంత ఆటవికం? పాదయాత్రకు వెళితే పింఛన్లు ఆపేస్తామంటూ ప్రజల్ని బెదిరిస్తున్నారని ముద్దపు కవిత అనే సోదరి వాపోయింది. టీడీపీ దుర్మార్గ పాలన నుంచి విముక్తి కోరుకుంటున్న ప్రజల ఆకాంక్షకు చిహ్నంగా లక్ష్మి అనే సోదరి పావురాలను ఎగురవేయించింది. మరోవైపు మంత్రి గారి సొంత మండలంలోనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగునీటికి సైతం అల్లాడిపోతున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ఊసే లేదట. రోడ్లు, మౌలికవసతులే లేవని పల్లెపల్లెనా ప్రజలు మొర పెట్టుకున్నారు. నాన్నగారిచ్చిన కొండపేట, పొడుగుపాడు, కొత్తపేట తదితర చిన్నచిన్న ఎత్తిపోతల పథకాలను సైతం పూర్తి చేయకపోవడంతో తమ పొలాలకు సాగునీరందడం లేదన్నది రైతన్నల వ్యథ. వారి కష్టాలు తీర్చి మంచి చేసి మనసులు గెలవాల్సింది పోయి.. బెదిరింపులు, దౌర్జన్యాలు, మోసాలతో లొంగదీసుకోవాలనుకోవడం మూర్ఖత్వం కాక మరేమిటి? నేను ఈరోజు నడిచిన దారిలోనే నాన్నగారి పాదయాత్ర కూడా సాగింది. నాడు పాదయాత్రలో ఈ ప్రాంత ఉప్పు రైతుల కష్టాలు చూశారాయన. అధికారంలోకి రాగానే ‘నాలా’పన్ను తీసేసి ఆదుకున్నారని నాన్న గారిని గుర్తు చేసుకున్నారు నౌపడ గ్రామస్తులు. ఉప్పు రైతులకు తుపాను పరిహారమిచ్చిన గొప్ప మనç సు ఆయనదన్నారు. నాన్నగారి పాదయాత్రప్పుడు ప్రజా వ్యతిరేక పాలనతో ప్రజలు విసుగెత్తిపోతే.. నేడు ప్రజా వ్యతిరేక పాలన, పాలకులే ప్రజాకంటకులై ప్రజలను కాల్చుకుతింటున్న అరాచకం నెలకొంది. సాయంత్రం వడ్డితాండ్ర వద్ద కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా 3,051 రోజులుగా దీక్షలు చేస్తున్న మత్స్యకారుల శిబిరానికి వెళ్లాను. తరతరాలుగా వారు ఆధారపడి జీవిస్తున్న తంపర భూములను థర్మల్ పవర్ ప్లాంట్‌కు కట్టబెట్టే జీవో నంబర్ 1108 రద్దు కోసం పోరాడుతున్నారు. ఆ జీవోను రద్దు చేస్తామని గత ఎన్నికలప్పుడు హామీ ఇచ్చిన బాబు మోసం చేశారని మండిపడ్డారు. ఓవైపు మేము తంపర భూములపై హక్కులు కోల్పోయి పోరాడుతుంటే.. మరోవైపు మంత్రి గారి బినామీలు అవే భూముల్లో అక్రమ రొయ్యల చెరువులు ఏర్పాటు చేసుకొని దోచుకుంటున్నారని వాపోయారు.ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. తాగడానికి మంచి నీరు లేక, నీటిని కొనలేక కిడ్నీ వ్యాధులు తదితర రోగాల బారినపడతామని తెలిసి కూడా విధి లేని పరిస్థితిలో అక్కడున్న నీటినే తాగుతున్నామని ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. ఏమైంది మీ ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం? ఆ పథకం కింద ప్రతి గ్రామానికి రక్షిత నీటి సరఫరా, ప్రతి వీధికి ఉచిత కుళాయి, రూ2.కే 20 లీటర్ల మినరల్ వాటర్ అంటూ మీ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాల్లో పేర్కొన్నారు. అదైనా గుర్తుందా? ఆఖరికి మీ మేనిఫెస్టో కూడా ప్రజల్ని మోసగించడానికేనా? -
‘అక్కడ దాడులు చేస్తే వందల కోట్లు దొరుకుతాయి’
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్నాయకులు తప్పుబట్టారు. జూబ్లీహిల్స్‌లోని రేవంత్ నివాసానికి చేరుకున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డిలు ఈ దాడులను ఖండించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ.. గత నాలుగేళ్లుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అణచివేత దోరణి అవలంభిస్తున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు గళమెత్తినా వారిని టార్గెట్ చేస్తూ కేసులతో వేధిస్తున్నారని విమర్శించారు. కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు డీకే శివకుమార్‌పై ఐటీ దాడులను యావత్ దేశం చూసిందన్నారు. ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డిని కేంద్ర సంస్థల సహాకారంతో కేసీఆర్ ఎలా ఇబ్బందులు పెట్టి, భయభ్రాంతులకు గురిచేస్తున్నారో ప్రజలందరు గమనించాలని కోరారు. ఎన్నికల వేళ అకారణంగా ఇంట్లో ఎవరు లేనప్పుడు సోదాలు నిర్వహించటాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. నిజంగా ఐటీ శాఖకు డబ్బులు కావాలంటే టీఆర్ఎస్ కార్యలయం, కేసీఆర్ నివాసంపై రైడ్ చేయాలని.. అక్కడ అడ్డగోలుగా దోచుకున్న వందల కోట్లు దొరుకుతాయని ఆరోపించారు. అక్రమ కేసులతో కాంగ్రెస్ శ్రేణులను భయపెడతామంటే.. భయపడేది లేదని.. రెట్టించిన ధైర్యంతో కొట్లాడతామని తెలిపారు. ప్రతిపక్షాల గొంతు నొక్కి, అణచివేసేందుకు జరిగే దాడులను తిప్పి కొడతామని పేర్కొన్నారు. రేవంత్ ఇంటిపై జరుగుతున్న దాడులను.. తెలంగాణ సమాజంపై, తెలంగాణ ప్రజల మీద జరుగుతున్నవిగా ఆయన పేర్కొన్నారు. మోదీతో కుదుర్చుకున్న అంతర్గత ఒప్పందంతోనే దాడులు.. జానారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఉన్నవారిని అణచివేసే విధానాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి ఏర్పరుచుకున్న అంతర్గత ఒప్పందంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. చట్టబద్ధ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ, ఇక్కడ కేసీఆర్ ఒకేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యవాదుల మనుగడ కొనసాగాలంటే ఈ ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి రాకుండా చేయాలని ప్రజలను కోరారు. ఇలాంటి దాడులకు కాంగ్రెస్ భయపడదని స్పష్టం చేశారు. మాల్దీవుల్లో ప్రతిపక్షాలను అణగదొక్కిన అక్కడి అధ్యక్షుడు ఓటమిపాలయ్యారని.. తెలంగాణలో కూడా అదే పునరావృతం అవుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ నాయకులపై కక్ష సాధింపు మరోవైపు కాంగ్రెస్ శ్రేణులపై జరుగుతున్న దాడులపై ఆ పార్టీ సీనియర్ నాయకులు వి హనుమంతరావు మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులపై కక్ష సాధింపులకు దిగుతోందని విమర్శించారు. ఇటీవల జగ్గారెడ్డిపైన పాత కేసులు తిరగదోడి, నేడు రేవంత్‌రెడ్డిపైన ఐటీ దాడులు జరిపి ఇబ్బందులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో కేసీఆర్ ఢిల్లీలో 40 నిమిషాలు ప్రత్యేంగా భేటీ అయ్యారని.. అప్పుడే ఈ దాడులకు ప్రణాళిక సిద్ధం అయిందని ఆరోపించారు. ప్రజల్లో టీఆర్ఎస్పైన తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇదీ పునరావృతం అవుతుందని హెచ్చరించారు. తాము కూడా టీఆర్ఎస్ బొక్కలు తవ్వడం స్టార్ట్ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా మెట్రో రైల్ ఓపెనింగ్ సమయంలో గవర్నర్ నరసింహాన్‌తో కలిసి అపద్ధర్మ మంత్రి కేటీఆర్ తొక్కడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ దగ్గరకు వస్తుంటే టీఆర్ఎస్ పేరుపైన ప్రకటనలు ఇవ్వడం ఎంటని ప్రశ్నించారు. -
కోట రహస్యం..వీడని చిక్కుముడి
పర్లాకిమిడి : గజపతి సంస్థానం మహారాజా గోపీనాథ గజపతి అస్వస్థత కారణంగా ఆత్మహత్య చేసుకున్న ఆయన వ్యక్తిగత సిబ్బంది కేసుకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పుడు ఇవి జిల్లా వ్యాప్తంగా బిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. రాజావారి ఆరోగ్యం పట్ల ఆయన వ్యక్తిగత సిబ్బంది వహించిన నిర్లక్ష్యం కారణంగానే రాజావారు నిశ్చలస్థితిలో ఉండిపోయారని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా సిబ్బందిపై ప్రజలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశారు. ఈ అవమానం భరించలేక రెండేళ్ల క్రితం రాజావారి వ్యక్తిగత సిబ్బందిగా పనిచేసిన గజపతి సంస్థానం మేనేజర్ అనంగమంజరీ దేవి, ఆమె సోదరి విజయలక్ష్మి పాత్రో, తమ్ముళ్ళు సంజయ్‌కుమార్ పాత్రో, సంతోష్‌కుమార్ పాత్రోలు వారి స్వగృహంలోనే ఆత్మహత్య చేసుకున్నారు. 2016లో మహారాజా గోపీనాథ గజపతి అస్వస్థకు గురై ప్రస్తుతం రాష్ట్ర రాజధానిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ప్రభుత్వ ఆధీనంలో దీర్ఘకాలిక వైద్య సేవలు పొందుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు గజపతి ప్యాలెస్ వ్యవహారాలు మహారాజా గోపినాథ గజపతి నారాయణ దేవ్ కుమార్తె కల్యాణీ దేవి చూసుకుంటున్నారు. ఆత్మహత్యల నేపథ్యంలో అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేపట్టారు. సిట్‌కు కేసు అప్పగింత కానీ కారణాలు ఎంతమాత్రం తెలియరాకపోవడంతో సిట్ బృందానికి కేసును అప్పగించారు. ఈ బలవన్మరణాల పట్లబలమైన వ్యక్తుల పాత్రే ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై పలు మీడియాల్లో పెద్ద ఎత్తున కథనాలు కూడా అప్పట్లో వెలువడ్డాయి. అనంతరం దర్యాప్తు చేపట్టిన సిట్ బృందం దర్యాప్తు చేపట్టి రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యల రహస్యాన్ని పసిగట్టేందుకు అప్పట్లో సిట్ బృందం రెండు నెలల కాలం పాటు పర్లాకిమిడిలో ఉండి దర్యాప్తు చేపట్టింది. ఇదే సమయంలో సంస్థానం మేనేజర్ అనంగమంజరీ దేవి మరణ వాంగ్మూలంలో పేర్కొన్న వ్యక్తులను కూడా ప్రశ్నించింది. కేసుకు సంబంధించి స్థానిక ఎమ్మెల్యేతో పాటు మరో 11 మందిని సిట్ బృందం ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మేనేజర్ మరణ వాంగ్మూలంలో ఏముందోనన్న విషయం ఇప్పటికీ సిట్ దర్యాప్తు బృందం వెల్లడించకపోవడంపై కూడా స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. నివేదిక సంగతేంటి..? దర్యాప్తు పూర్తయినా ఇంతవరకు నిందితుల వివరాలు కూడా వెల్లడించకపోవడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. సిట్ దర్యాప్తు బృందం అలసత్వంపై బాధిత కుటుంబ సభ్యులు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఆశ్రయించారు. అయినా వివరాలు తెలియరాక పోవడం విశేషం. అప్పట్లో ఈ ఉమ్మడి ఆత్మహత్యలు జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా కేసు విషయంలో కొందరి రాజకీయ నేతల హస్తం ఉందని తేలిన నేపథ్యంలో సిట్ దర్యాప్తు బృందం నివేదిక వెల్లడిస్తుందా? లేదా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అయితే జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు సిట్ నివేదిక వెల్లడిస్తుందని అధికారులు చెబుతున్నారు. -
ఏపీ టెట్‌లో పొరపాట్లు సరిచేసుకునే అవకాశం
సాక్షి, అమరావతి: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష-2018( టెట్) దరఖాస్తులో పొరపాట్లు చేసిన అభ్యర్థులకు సరిచేసుకునే అవకాశం కల్పిస్తున్నామని టెట్ కన్వీనర్ ఎ. సుబారెడ్డి వెల్లడించారు. రేపు అర్థరాత్రి వరకు పెపర్, సబ్జెక్ట్, మీడియం ఆప్షన్లలలొ మార్పులు చేసుకోవచ్చని తెలిపారు. టెట్ దరఖాస్తులో తమ పొరపాట్లను సరిచేయాలంటూ అభ్యర్థుల చేసిన వినతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కన్వీనర్ పేర్కొన్నారు. టెట్ వెబ్సైట్లో ఫిర్యాదుల ఆప్షన్లో పేపర్, సబ్జెక్టు, మీడియం మార్పునకు సదరు అభ్యర్థి ఫిర్యాదు చేసుకోవాలి. అనంతరం వాటిని సరిచేసి అభ్యర్థుల మొబైల్‌కు సక్షిప్త సందేశాలు చేరవేస్తారు. దీని తర్వాతే జిల్లా పరీక్షా కేంద్రాలను ఆప్షన్లుగా ఎంచుకునే అవకాశం ఉంటుందని కన్వీనర్ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
హైదరాబాద్ డీఈఓగా సోమిరెడ్డి , రంగారెడ్డికి రమేష్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విద్యాశాఖ అధికారులకు స్థాన చలనం కలిగింది. హైదరాబాద్ డీఈఓగా పనిచేస్తున్న ఎ.సుబ్బారెడ్డి బదిలీ అయ్యారు. తదుపరి పోస్టింగ్ నిమిత్తం డెరైక్టరేట్లో రిపోర్టు చేయాలని సూచించారు. కాగా రంగారెడ్డి డీఈఓగా పనిచేస్తున్న ఎం.సోమిరెడ్డిని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమించారు. మెదక్ డీఈఓగా పనిచేసి బదిలీ అయి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న జి.రమేశ్‌ను రంగారెడ్డికి బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన ముగ్గురు అధికారులు ఒకే బ్యాచ్‌కు చెందిన డిప్యూటీ ఈఓలు కావడం విశేషం. బుధవారం వీరు కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. నగరంపై తనదైన ముద్ర.. హైదరాబాద్ డీఈఓగా రెండేళ ్ల క్రితం బాధ్యతలు చేపట్టిన ఎ.సుబ్బారెడ్డి నగరంపై తనదైన ముద్ర వేశారు. ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ పెంచడంతోపాటు విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు కృషిచేశారు. టెన్త్ పరీక్షలతోపాటు టెట్, డీఎస్సీ వంటి ప్రధాన పరీక్షల నిర్వహణలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేనివిధంగా వందకు పైగా గుర్తింపు లేని పాఠశాలలను సీజ్ చేశారు. ఫీజుల ని యంత్రణ కోసం ప్రత్యేక విధానాన్ని అమలు చేసి ప్రైవేటు దోపిడీని అరికట్టేం దుకు కృషిచేశారు. ఆయా ప్రైవేటు పాఠశాలల ఫీజుల వివరాలను తల్లిదండ్రులు తెలుసుకునేలా ప్రత్యేక బుక్‌లెట్‌ను అం దుబాటులోకి తెచ్చారు. ఆర్టీఈ చట్టాన్ని అమలు చేయడంలో ఇతర జిల్లాలకు హైదరాబాద్‌ను ఆదర్శంగా నిలిపారు. ఉత్తమ ఫలితాల దిశగా.. రంగారెడ్డి డీఈఓగా రెండేళ్లకుపైగా సేవలందించిన ఎం.సోమిరెడ్డి జిల్లా విద్యాశాఖలో తొలి నుంచి సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సామర్థ్యాలు లభించేలా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధ్యాయులను భయపెట్టకుండా అనునిత్యం వారి బాధ్యతలను గుర్తు చేస్తూ.. మెరుగైన విద్యాబోధనకు కృషి చేశారు. ప్రతి విద్యార్థికి వారి వారి తరగతులకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను అందించి పరీక్షలంటే భయం పోగొట్టే ప్రయత్నం చేశారు. ఏటా టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం మెరుగయ్యేలా అవసరమైన చర్యలు తీసుకున్నారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అందించే కార్యక్రమానికి రాష్ట్రంలోనే తొలిసారిగా రంగారెడ్డి జిల్లాలో అమలుకు శ్రీకారం చుట్టారు. ముక్కుసూటి అధికారి రమేశ్.. రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమితులైన జి.రమేశ్ గతంలో మెదక్ డీఈఓగా పనిచేశారు. ఆయన పనిచేసిన రెండేళ్లలో మెదక్ జిల్లా విద్యాశాఖలో అపరిష్కృత సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. ‘డయల్ యువర్ డీఈఓ’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ప్రమాదాలకు గురైన విద్యార్థుల ను ఆదుకునేందుకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక వర్గాల నుంచి నిధులు రాబట్టారు. కలెక్టర్ సహకారంతో ఆయా నిధులను బాధితులకు అందించారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు. బడికి పోకుండా మొండికేసిన టీచర ్ల పాలిట సింహస్వప్నంగా నిలిచారు. రమేశ్‌కు స్థానిక ప్రజాప్రతినిధులకు పొసగకపోవడంతో మూ డు నెలల కిందట బదిలీ అయ్యారు. ప్రస్తుతం పోస్టింగ్ కోసం వెయిటింగ్లో ఉన్న రమేశ్‌ను ప్రభుత్వం రంగారెడ్డి డీఈఓగా నియమించింది.