హైదరాబాద్ డీఈఓగా సోమిరెడ్డి , రంగారెడ్డికి రమేష్
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విద్యాశాఖ అధికారులకు స్థాన చలనం కలిగింది. హైదరాబాద్ డీఈఓగా పనిచేస్తున్న ఎ.సుబ్బారెడ్డి బదిలీ అయ్యారు. తదుపరి పోస్టింగ్ నిమిత్తం డెరైక్టరేట్‌లో రిపోర్టు చేయాలని సూచించారు. కాగా రంగారెడ్డి డీఈఓగా పనిచేస్తున్న ఎం.సోమిరెడ్డిని హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమించారు.
మెదక్ డీఈఓగా పనిచేసి బదిలీ అయి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న జి.రమేశ్‌ను రంగారెడ్డికి బదిలీ చేస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. బదిలీ అయిన ముగ్గురు అధికారులు ఒకే బ్యాచ్‌కు చెందిన డిప్యూటీ ఈఓలు కావడం విశేషం. బుధవారం వీరు కొత్త స్థానాల్లో బాధ్యతలు చేపట్టనున్నారు.
నగరంపై తనదైన ముద్ర..
హైదరాబాద్ డీఈఓగా రెండేళ ్ల క్రితం బాధ్యతలు చేపట్టిన ఎ.సుబ్బారెడ్డి నగరంపై తనదైన ముద్ర వేశారు. ప్రభుత్వ పాఠశాలలపై పర్యవేక్షణ పెంచడంతోపాటు విద్యావ్యవస్థను గాడిన పెట్టేందుకు కృషిచేశారు. టెన్త్ పరీక్షలతోపాటు టెట్, డీఎస్సీ వంటి ప్రధాన పరీక్షల నిర్వహణలోనూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుం డా చర్యలు తీసుకున్నారు.
రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ లేనివిధంగా వందకు పైగా గుర్తింపు లేని పాఠశాలలను సీజ్ చేశారు. ఫీజుల ని యంత్రణ కోసం ప్రత్యేక విధానాన్ని అమలు చేసి ప్రైవేటు దోపిడీని అరికట్టేం దుకు కృషిచేశారు. ఆయా ప్రైవేటు పాఠశాలల ఫీజుల వివరాలను తల్లిదండ్రులు తెలుసుకునేలా ప్రత్యేక బుక్‌లెట్‌ను అం దుబాటులోకి తెచ్చారు. ఆర్టీఈ చట్టాన్ని అమలు చేయడంలో ఇతర జిల్లాలకు హైదరాబాద్‌ను ఆదర్శంగా నిలిపారు.
ఉత్తమ ఫలితాల దిశగా..
రంగారెడ్డి డీఈఓగా రెండేళ్లకుపైగా సేవలందించిన ఎం.సోమిరెడ్డి జిల్లా విద్యాశాఖలో తొలి నుంచి సంస్కరణలకు ప్రాధాన్యమిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కనీస సామర్థ్యాలు లభించేలా పలు కార్యక్రమాలు చేపట్టారు. ఉపాధ్యాయులను భయపెట్టకుండా అనునిత్యం వారి బాధ్యతలను గుర్తు చేస్తూ.. మెరుగైన విద్యాబోధనకు కృషి చేశారు.
ప్రతి విద్యార్థికి వారి వారి తరగతులకు సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను అందించి పరీక్షలంటే భయం పోగొట్టే ప్రయత్నం చేశారు. ఏటా టెన్త్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం మెరుగయ్యేలా అవసరమైన చర్యలు తీసుకున్నారు. జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యను అందించే కార్యక్రమానికి రాష్ట్రంలోనే తొలిసారిగా రంగారెడ్డి జిల్లాలో అమలుకు శ్రీకారం చుట్టారు.
ముక్కుసూటి అధికారి రమేశ్..
రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారిగా నియమితులైన జి.రమేశ్ గతంలో మెదక్ డీఈఓగా పనిచేశారు. ఆయన పనిచేసిన రెండేళ్లలో మెదక్ జిల్లా విద్యాశాఖలో అపరిష్కృత సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. ‘డయల్ యువర్ డీఈఓ’ పేరిట కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ప్రమాదాలకు గురైన విద్యార్థుల ను ఆదుకునేందుకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారు.
స్వచ్ఛంద సంస్థలు, పారిశ్రామిక వర్గాల నుంచి నిధులు రాబట్టారు. కలెక్టర్ సహకారంతో ఆయా నిధులను బాధితులకు అందించారు. టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో పారదర్శకతకు పెద్దపీట వేశారు. బడికి పోకుండా మొండికేసిన టీచర ్ల పాలిట సింహస్వప్నంగా నిలిచారు. రమేశ్‌కు స్థానిక ప్రజాప్రతినిధులకు పొసగకపోవడంతో మూ డు నెలల కిందట బదిలీ అయ్యారు. ప్రస్తుతం పోస్టింగ్ కోసం వెయిటింగ్‌లో ఉన్న రమేశ్‌ను ప్రభుత్వం రంగారెడ్డి డీఈఓగా నియమించింది.