ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేస్తున్న యువకుడిపై కేసు నమోదైంది. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికంగా ఓ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలికను రమేశ్(25) అనే యువకుడు ప్రేమపేరుతో కొంతకాలంగా వేధిస్తున్నాడు. ఎంతచెప్పినా వినకుండా తనవెంట పడి మానసికక్షోభకు గురిచేస్తుండటంతో బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు స్థానిక పోలీస్‌స్టేషన్ ఈ విషయమై ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమపేరుతో వేధింపులు..కేసు నమోదు
Published Mon, Oct 17 2016 7:18 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement