ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ శనివారం ఇచ్చిన బంద్ పిలుపునకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య స్పష్టం చేశారు. శుక్రవారం బంజారాహిల్స్‌లోని మాల మహానాడు రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కంటితుడుపు చర్యలో భాగంగా ప్యాకేజీ పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రజలను మంత్రులు అరుణ్‌జైట్లి, వెంకయ్యనాయుడు మోసగించారని ఆరోపించారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి ఓట్లు, సీట్లురావనే ఉద్దేశంతోనే ఈ కుట్రకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చినప్పుడే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు అభివృద్ధి చెందుతారని అన్నారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెరుకు రాంచందర్, సెక్రటరీ జనరల్ జంగా శ్రీను, గ్రేటర్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగదేశి రవికుమార్, యూత్ వింగ్ అధ్యక్షుడు సుధాకర్, తెలంగాణ అధ్యక్షుడు జి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏపీ బంద్‌కు మాలమహానాడు సంపూర్ణ మద్ధతు
Published Fri, Sep 9 2016 6:00 PM | Last Updated on Tue, Sep 4 2018 5:24 PM
Advertisement
Advertisement