mala mahanadu
-
వర్గీకరణ రివ్యూ పిటిషన్‌పై నేడు నిర్ణయం
న్యూఢిల్లీ, సాక్షి: ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాల మహానాడు సవాల్ చేసింది. రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు మాలలకు వ్యతిరేకంగా ఉందని, తీర్పును రివ్యూ చేయాలంటూ మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య, మాజీ ఎంపీ హర్ష కుమార్‌లు పిటిషన్ వేశారు. అయితే ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అనే ఉత్కంఠకు కాసేపట్లో తెరపడనుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తేదీన కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈమేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కనబెడుతూ.. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది.‘‘వ్యవస్థాగతంగా ఎదుర్కొంటున్న వివక్ష కారణంగా ఎస్సీ/ఎస్టీ వర్గాల వారు పైకి రాలేకపోతున్నారు. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుంది. అందుకే 2004 నాటి ఈవీ చిన్నయ్య తీర్పును మేం వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నాం’’ అని సీజేఐ ధర్మాసనం స్పష్టంచేసింది. అణగారిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్డ్ కేటగిరీలో రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది. ధర్మాసనంలో దీనికి అనుకూలంగా ఆరుగురు న్యాయమూర్తులు తీర్పు చెప్పగా.. జస్టిస్ బేలా ఎం.త్రివేది మాత్రం ఉప వర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు.కేసు వివాదం..ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50శాతాన్ని వాల్మీకి, మజహబీ సిక్కు సామాజికవర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ 2006లో పంజాబ్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అయితే, ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ చెల్లదంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు 2010లో తీర్పు వెలువరించింది. ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాల శాసనసభలకు కాదని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు 2004లో తీర్పు చెప్పింది. దాన్నే పంజాబ్, హరియాణా తమ ఉత్తర్వులో హైకోర్టు ప్రస్తావించింది.దీంతో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఇందులో వ్యాజ్యదారుగా ఉన్నారు. ఈ పిటిషన్లను విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. 2020లో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనిపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆరంభంలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఉపవర్గీకరణ చేసుకొనేలా రాష్ట్రాలకు అనుమతినిస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది. విచారణ సమయంలో కేంద్రం కూడా ఎస్సీ/ఎస్టీలో ఉపవర్గీకరణను సమర్థించింది. -
చంద్రబాబు దొంగ హామీలు ప్రజలు నమ్మలేదు.. జగనే మళ్ళీ సీఎం..
-
చంద్రబాబు దళితులను మోసం చేశారు: మంగరాజు
-
ఈనాడు, ఆంధ్రజ్యోతికి బిగ్ షాక్
-
మూడు రాజధానులతో అన్ని ప్రాంతాల అభివృద్ధి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న మహోన్నత ఆశయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన మూడు రాజధానులకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు నత్తా యోనారాజు పునరుద్ఘాటించారు. మూడు రాజధానులకు మద్దతుగా విజయవాడలో సోమవారం మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీనగర్‌లోని ధర్నా చౌక్‌లో నిర్వహించిన ఒక రోజు దీక్ష విజయవంతంగా ముగిసింది. యోనారాజు మాట్లాడుతూ అమరావతి రాజధాని పేరుతో టీడీపీ చేస్తున్న డ్రామాలకు వ్యతిరేకంగా, మూడు రాజధానులకు మద్దతుగా మాలమహానాడు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోజు దీక్షలు తలపెట్టామని, ఏలూరు జిల్లాలో పూర్తిచేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పి.గౌతంరెడ్డి, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి దేవినేని అవినాష్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బొప్పన భవకుమార్, ఏపీ బీసీ సంఘం అధ్యక్షుడు మారేష్, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాసరావు మద్దతు తెలిపారు. -
మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన మాల మహానాడు
సాక్షి, విశాఖపట్నం: మూడు రాజధానులకు మాల మహానాడు మద్దతు ప్రకటించింది. విశాఖను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు మంగరాజు తెలిపారు. ‘‘దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబడి ఉంది. విశాఖను పరిపాలన రాజధానిగా చేస్తేనే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది. అమరావతి రైతులు ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారులు పాదయాత్ర చేస్తున్నారు. చంద్రబాబు ఒక సామాజిక వర్గం కోసమే అమరావతి రాజధాని కావాలంటున్నారు. మూడు రాజధానులను అడ్డుకుంటే రాబోయే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెబుతామని’’ మంగరాజు హెచ్చరించారు. చదవండి: AP: ఒకే అంశంపై రెండు పిటిషన్లు.. హైకోర్టు ఆగ్రహం -
మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా శ్రీనివాస్
పంజగుట్ట: రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాలలను చైతన్యపరచాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య కోరారు. బుధవారం మాల మహానాడు జాతీయ కార్యాలయంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇటీవల మాల మహానాడు రాష్ట్ర కమిటీ రద్దు చేసిన నేపథ్యంలో నూతన రాష్ట్ర అధ్యక్షునిగా జంగా శ్రీనివాస్‌ను, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మాల మహేశ్, గ్రేటర్ అధ్యక్షునిగా బైండ్ల శ్రీనివాస్‌ను నియమించి వారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చెన్నయ్య మాట్లాడుతూ.. డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, పీవీ రావు ఆశయాలకు అనుగుణంగా పనిచేయా లని, రాష్ట్రంలో మాలలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ముందుండాలని కోరారు. -
‘బినామీ గద్దలకోసం బాబు ఉద్యమం’
తాడికొండ: చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని పీవీరావు మాలమహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నత్తా యోనారాజు విమర్శించారు. అధికారం కోసం దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్న చంద్రబాబు నేడు పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తుంటే అడ్డుకునేందుకు తన బినామీలైన పెద్దగద్దల కోసం ఉద్యమం చేయడం సిగ్గుచేటన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షల్లో 33వ రోజు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజధాని పేరిట మూడు పంటలు పండే భూములను సేకరించిన చంద్రబాబు అగ్రవర్ణాలకు ఒక ప్యాకేజీ, దళితులకు మరో ప్యాకేజీ ఇచ్చి మోసం చేశారని చెప్పారు. మాదిగ ఆరి్థక చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు బేతపూడి సాంబయ్య మాట్లాడుతూ రాజధాని పూలింగ్‌కు బేతపూడిలో 60 సెంట్లు ఇచి్చన తనకు సామాన్య ప్యాకేజీ ఇచి్చన చంద్రబాబు అగ్రవర్ణాలకు అగ్ర ప్యాకేజీ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేతలు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులరి్పంచారు. -
బాబు పెట్టుబడి ఉద్యమాన్ని తిప్పికొడతాం
సాక్షి, విజయవాడ: మాజీ సీఎం చంద్రబాబు తన సామాజిక వర్గాన్ని పెంచి పోషించేందుకే అమరావతిలో రాజధాని పెట్టాలనుకొన్నారని దళిత నేతలు వ్యాఖ్యానించారు. ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం అన్ని ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకొంటున్నారని ఆరోపించారు. కుట్రలు మానకపోతే ఐక్య దళిత వేదిక ఏర్పాటు చేసి బాబుకు బుద్ధి చెపుతామన్నారు. మూడు రాజధానులు, అన్ని ప్రాంతాల అభివృద్ధికి మద్దతు తెలిపేందుకు దళిత సంఘాలు ఏకమయ్యాయి. ఈ మేరకు మాదిగ దండోరా, మాల మహానాడు నేతలు విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం సమావేశమయ్యారు. అనంతరం దళిత నేతలు మీడియాతో మాట్లాడుతూ.. అంబేద్కర్ ఆలోచనలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం ఉందని అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలన్నదే బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయమన్నారు. అది పరిపాలన వికేంద్రీకరణతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఇక టీడీపీ పాలనలో రాజధాని దళిత రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం చంద్రబాబు చేస్తున్న పెట్టుబడి ఉద్యమాన్ని తిప్పికొడతామని హెచ్చరించారు. -
ఆంధ్రప్రదేశ్‌కు మందకృష్ణ బద్ధ శత్రువు
సాక్షి, విజయవాడ: ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాజకీయం చేసి.. పడ్బం గడుపుకోవాలని మందకృష్ణ మాదిగ చూస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్‌కుమార్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు మందకృష్ణ బద్ధ శత్రువు అని ఆయన మండిపడ్డారు. అన్నదమ్ముల్లా ఉన్న మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని గుమ్మపు సూర్యప్రసాద్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి.. సీఎంస వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారని, మందకృష్ణ మాటలకు ఎవరు భయపడబోరని ఆయన పేర్కొన్నారు. మందకృష్ణది హేయమైన చర్య.. మందకృష్ణ మాదిగపై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మందకృష్ణ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంతో చర్చలు జరపకుండా 30న అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం హేయమైన చర్య అని అన్నారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది ఎస్సీ వర్గీకరణ కోసం కాదని, సీఎం వైఎస్ జగన్‌ను బ్లాక్మెయిల్ చేసేందుకేనని పేరుపోగు వెంకటేశ్వరరావు మండిపడ్డారు. -
‘సీఎం జగన్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు’
సాక్షి, అమరావతి : నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని మాల మహానాడు నాయకులు అశోక్ కుమార్, సూర్యప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు. గతంలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా భారీ సంఖ్యలో దళితులకు ఎమ్మెల్సీ, నామినేటెడ్ పదవులను కట్టబెట్టారని గుర్తుచేశారు. టీడీపీ నేత చంద్రబాబు నాయుడు మాత్రం ఎల్లప్పుడు మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. అయితే సీఎం జగన్ మాత్రం ఇరు సామాజిక వర్గాలను సమానంగా చూస్తున్నారన్నారు. అటువంటి జననేతపై మంద కృష్ణ మాదిగ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. -
ఏ పార్టీకి మద్దతిచ్చేది 4న నిర్ణయిస్తాం: చెన్నయ్య
హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతిచ్చేది నవంబర్ 4న నిర్ణయిస్తామని మాల మహా నాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తెలిపారు. మాల ల మనోభావాలకు దగ్గరగా ఉండే పార్టీకే మద్దతిస్తామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గంగారాం అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. నవంబర్ 4న మింట్ కాంపౌండ్‌లో మాల మహా నాడు కమిటీ సమావేశమై మద్దతుపై నిర్ణయం తీసుకుంటుందని చెన్నయ్య చెప్పారు. -
మాల మాదిగలకు సమానంగా టికెట్లివ్వాలి
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మాల మాదిగలకు సమానంగా టికెట్లు ఇవ్వాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య డిమాండ్ చేశారు. బుధవారం ఖైరతాబాద్‌లో ఏర్పాటు చేసిన మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చెన్నయ్య మాట్లాడుతూ..అన్ని పార్టీలు ప్రకటించబోయే మేనిఫెస్టోలో తమ డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలను బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా రూ.5 లక్షల వరకు ఇవ్వాలని, సబ్‌ప్లాన్ నిధులను సక్రమంగా వినియోగించేలా కమిటీని ఏర్పాటుచేయాలని, అర్హులైన దళితులందరికీ ఇళ్లు నిర్మించాలని, మహిళా సంఘాలకు ఇచ్చే బ్యాంకు రుణాలు రూ.20 లక్షలకు పెంచి ప్రోత్సహించాలనే డిమాండ్లను మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మాల మహానాడు మహిళా అధ్యక్షురాలు సరసాదేవి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్యామ్‌కుమార్, సాయి, దేవిక, రాజ్‌కుమార్, రాజేందర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్రవర్ణాల లబ్ధి కోసమే వర్గీకరణ డ్రామా
సాక్షి, హైదరాబాద్: అగ్రవర్ణాలు లబ్ధి పొందేందుకే ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ డ్రామా ఆడుతున్నాయని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య ఆరోపించారు. వర్గీకరణ అంశానికి కాలం చెల్లిందని, దళితులు ఈ డిమాండ్ కోరుకోవడం లేదన్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మాలమహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్సీల్లో మాల, మాదిగలు, ఎస్టీల్లో లంబాడ, ఆదివాసీల మధ్య గొడవలు సృష్టించి అగ్రవర్ణ రాజకీయ పార్టీలు లబ్ధి పొందుతున్నాయని చెన్నయ్య విమర్శించారు. ఎస్సీ వర్గీకరణకు మద్దతు పలికిన రాజకీయ పార్టీల వైఖరిని మాలమహానాడు ఖండిస్తోందన్నారు. అఖిల పక్షాన్ని డిల్లీకి తీసుకెళ్లాలన్న ఆలోచనను రాజకీయ పార్టీలు విరమించుకోవాలని, లేకుంటే అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును దళితులు వ్యతిరేకిస్తున్న అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ సమావేశంలో మాలమహానాడు ప్రతినిధులు జంగా, భగవాన్ దాస్, బి.సాయి తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నుంచి బయటకు వచ్చేయాలి
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): దళితులపై వివక్ష చూపుతున్న టీడీపీ నుంచి ఎస్సీలు బయటకు వచ్చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య పిలుపునిచ్చారు. విజయవాడలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పార్టీలో మాల, మాదిగ సామాజిక వర్గాలకు సముచిత స్థానం కల్పించడం లేదన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో దళితులకు అన్యాయం జరుగుతోందని తెలిపారు. దివంగత ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో భారీ నీటిపారుదల, రెవెన్యూ, రోడ్లు, భవనాల శాఖలు దళితులకు కేటాయించారని, చంద్రబాబు మంత్రివర్గంలో మాత్రం ఎస్సీ, ఎస్టీలకు ప్రాతినిథ్యం కొరవడిందన్నారు. కేంద్రంలో రెండు మంత్రి పదవులతో పాటు, రాజ్యసభ సీట్లను అగ్రవర్ణాలకే కేటాయించారని గుర్తు చేశారు. టీడీపీ పోలిట్‌బ్యూరో నుంచి ఎంపీ శివప్రసాద్‌ను సైతం తొలగించారన్నారు. కాపుల మెప్పు కోసం పీతల సుజాతను మంత్రివర్గం నుంచి తొలగించడం దుర్మార్గమన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా గిరిజన మండలిలో పార్టీ నాయకులను నామినేట్ చేశారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒత్తిడి తీసుకురావడం వల్లే గిరిజన సలహా మండలి నియమించారన్నారు. -
...ప్రాబ్లమ్ నహీ!
గష్మీర్ మహాజని, స్పృహా జోషి జంటగా నటించిన మరాఠీ సినిమా ‘మలా కాహీచ్ ప్రాబ్లమ్ నాహీ!’. సమీర్ విద్వాంశ్ దర్శకత్వంలో రీచా సిన్హా, రవి సింగ్ నిర్మించిన ఈ సిన్మా పాటలను మరాఠీ చలనచిత్ర ప్రముఖుల సమక్షంలో విడుదల చేశారు. ‘‘ఆల్రెడీ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ నెలకొంది. పాటలు, టీజర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. హృషికేశ్, సౌరభ్, జస్రాజ్లు సంగీతమందించిన పాటల్లో ఎమోషనల్, లవ్, రొమాంటిక్ మెలోడీస్ ఉన్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ నెల 28న ‘మలా కాహీచ్ ప్రాబ్లమ్ నాహీ!’ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
వెంకయ్యనాయుడు తీరు దారుణం
ఆచంట : ఎస్సీ వర్గీకరణ విషయంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు చొరవ చూపడం దారుణమని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ ధ్వజమెత్తారు. ఆచంట మండలంలోని దళిత ప్రజాప్రతినిధులను స్థానిక రామేశ్వరస్వామి సత్రంలో గురువారం ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాజేష్ మాట్లాడుతూ కనీసం వార్డు సభ్యునిగా కూడా గెలవలేని వెంకయ్యనాయుడుకు ఎస్సీ వర్గీకరణ అంశంపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.. పదేళ్లు ఇవ్వాలని కోరిన ఆయన ఇప్పుడు మాటమార్చి తన నైజాన్ని బయటపెట్టారన్నారు. ఇప్పటికైనా ఎస్సీ వర్గీకరణ ప్రయత్నాలను మానుకోకపోతే వెంకయ్యనాయుడుకు, తెలుగుదేశం పార్టీకి చరమగీతం పాడతామన్నారు. వర్గీకరణకు వ్యతిరేకంగా భారీ ఉద్యమాలు నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమానికి ఆచంట, పాలకొల్లు నియోజకవర్గాల నుంచి మాల మహానాడు నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో మాల మహానాడు ప్రధాన కార్యదర్శి కొల్లాపు వేణు, జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు కర్ణి జోగయ్య, కోశాధికారి ఏనుగుపల్లి చంద్రశేఖర్, ఆచంట నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిసరెళ్ల శ్రీనివాస్, పోడూరు మండల అధ్యక్షుడు నేలపాటి రాజబాబు, ఆచంట, పెనుగొండ మండలాల అధ్యక్షులు రావి నాగరాజు, బల్లాశ్రీనివాస్, పోడూరు మండల ఉపాధ్యక్షుడు నెల్లి శ్రీనివాస్, ఆచంట యువజన విభాగం అధ్యక్షుడు కట్టా శిరీష, సర్పంచ్ బీర తిరుపతమ్మ, ఎంపీటీసీ కట్టా జాన్‌మోషే, జిల్లా సమన్వయకర్త నన్నేటి పుష్పరాజ్ పాల్గొన్నారు. -
‘వెంకయ్య పంచెలు ఊడదీసి తరుముతాం’
నెల్లూరు(సెంట్రల్): ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగ, మాలల మధ్య చిచ్చుపెడుతున్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు పంచెలు ఊడదీసి తరుముతామని మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యనమల సుదర్శన్ హెచ్చరించారు. నెల్లూరులో ఆదివారం జరిగిన మాల మహానాడు కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాల, మాదిగల మధ్య కావాలనే వర్గీకరణ పేరుతో వెంకయ్య చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మాలలకు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను చంద్రబాబు పక్కదారి పట్టిస్తు న్నారని ఆరోపించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాల మొత్తాన్ని టీడీపీ నాయకులకే ఇస్తున్నారని విమర్శించారు. మాలల ఓట్లతో రాజకీయం చేస్తున్న చంద్రబాబు, వెంకయ్యలకు బుద్ధి చెబుతామన్నారు. నెల్లూరులో జూలై 25న పెద్ద ఎత్తున మాలల సభ నిర్వహిస్తామన్నారు. సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వర్ణా వెంకయ్య, నెల్లూరు జిల్లా అధ్యక్షుడు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్‌రెడ్డి ఇంటి ముట్టడి
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడిన తెలంగాణ టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇంటిని మాలమహానాడు నేతలు ముట్టడించారు. బుధవారం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడటానికి నిరసనగా.. గురువారం మాలమహానాడు కార్యకర్తలు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఇంటిని ముట్టడించడానికి యత్నించడంతో.. అప్రమత్తమైన పోలీసులు ఆందోళన కారులను అక్కడి నుంచి చెదరగొట్టారు. పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
ఎస్సీలను వర్గీకరించవద్దు
కేంద్ర మంత్రి గెహ్లాట్, ఏచూరిలకు మాల మహానాడు వినతి న్యూఢిల్లీ: ఉషా మెహ్రా కమిషన్ నివేదిక ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో మాలల కంటే మాదిగలే ఎక్కువ ప్రయోజనాలు పొందుతున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణ వద్దని కోరుతూ కేంద్ర సామాజిక, న్యాయశాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లాట్, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిలకు వినతిపత్రాలు సమర్పించారు. సుప్రీంకోర్టు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ల తీర్పులను గౌరవించి వర్గీకరణకు సహకరించవద్దని వారిని కోరారు. మనువాదులతో కుమ్మకై దళితులను చీల్చే కుట్ర: రామూర్తి ఎస్సీ వర్గీకరణ కోసం మంద కృష్ణ మాదిగ మనువాదులతో కుమ్మకై దళితులను చీల్చే కుట్ర పన్నుతున్నారని తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు పసుల రామూర్తి విమర్శించారు. వర్గీకరణకు వ్యతిరేకంగా సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మం తర్ వద్ద గురువారం ధర్నా చేపట్టారు. అగ్రవర్ణ నాయకులకు దళితులపై చిత్తశుద్ధి ఉంటే రాజ్యాంగం ద్వారా వచ్చే ఫలాలను వారికి అందేలా చూడాలని కోరారు. -
‘బీజేపీ నిర్ణయం వెనక్కి తీసుకోవాలి’
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చిన బీజేపీ వెంటనే తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని మాల మహానాడు డిమాండ్ చేసింది. బీజేపీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించింది. బీజేపీ తీరుకు నిరసనగా శనివారం నాంపల్లిలోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయన్ని ముట్టడించేందుకు యత్నించిన మాలమహానాడు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
కేంద్రమంత్రి వెంకయ్య దిష్టిబొమ్మ దహనం
వర్గీకరణ ప్రకటనపై మాలల ఆందోళన ఉప్పలగుప్తం : ఎస్సీ వర్గీకరణ చేస్తామని చేసిన ప్రకటనతో కేంద్రమంత్రులు ఎం.వెంకన్నాయుడు, బండారు దత్తాత్రేయ మాలలను మోసం చేశారని, తమపై చౌకబారు వ్యాఖ్యలు చేసి అవమానపరిచారని ఆరోపిస్తూ మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు ఆందోళన దిగారు. వెంకయ్య దిష్టిబొమ్మను వారు దహనం చేశారు. గొల్లవిల్లి సెంటరులో మంగళవారం నియోజకవర్గ నలుమూలల నుంచి వందలాది మంది మాలలు సుమారు గంట సేపు రాస్తారోకో చేశారు. సుప్రీంకోర్టు కొట్టివేసినా ఎస్సీ వర్గీకరణ చేస్తామంటూ కేంద్రమంత్రులు మాదిగలను రెచ్చగొడుతున్నారని నాయకులు ఇసుకపట్ల రఘుబాబు, పెయ్యల శ్రీనివాసరావు, గెడ్డం సురేష్‌బాబు, జంగా బాబూరావు, నందిక శ్రీనివాసరావు ఆరోపించారు. మాదిగలకు అండగా ఉంటామని చెప్పిన వీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారని, వీరిని మంత్రివర్గం నుంచి బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ పేరుతో మాల, మాదిగలను విడదీసి ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడితే మాలల నుంచి తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించారు. మాలమహానాడు మండల అధ్యక్షుడు కొంకి వెంకట బాబ్జీ, పెయ్యల విష్ణుమూర్తి, పరశురాముడు, అయితాబత్తుల ఉమామహేశ్వరరావు, పినిపే జయరాజ్, పరమట సత్యనారాయణ, బడుగు అబ్బులు, యాళ్ళ లక్ష్మినారాయణ, గుత్తాల బోసు, ఉండ్రు బాబ్జీ, మెండు రమేష్ తదితరులు ఈమేరకు తహసీల్దార్ ఎస్.సుబ్బారావు, ఎంపీడీఓ వి.శ్రీనివాస్‌లకు వినతిపత్రాలు అందజేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా.. కాకినాడ సిటీ : ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు దండోరా సభలో ప్రకటించడాన్ని నిరసిస్తూ మాలమహానాడు నాయకులు, కార్యకర్తలు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు దిష్టిబొమ్మను దహనం చేసే ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఇందుకు మాలలు నిరసించారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు ధనరాశి శ్యామ్‌సుందర్ మాట్లాడుతూ దళితుల మధ్య చిచ్చురేపి విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఏబీసీడీ వర్గీకరణను అడ్డుకుని తీరుతామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ విరమించుకోకపోతే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. బి.అచ్చారావు, పెయ్యల అరుణ్‌కుమార్, గంటా వీరబాబు, ఎ¯ŒS.వీరబాబు, బూషణం, అమర్నాధ్, నాని, కిషోర్ తదితరలు పాల్గొన్నారు. -
మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గం ఏర్పాటు
హైదరాబాద్ : తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర కమిటీ కార్యవర్గాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు అద్దంకి దయాకర్ ప్రకటించారు. సోమవారం హైదరాబాద్ నాంపల్లిలో జరిగిన సంఘం పదో వార్షికోత్సవ సందర్భంగా పూర్తి స్థాయి కమిటీని నియమించారు. రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులుగా ఏశమళ్ళ సృజన్ కుమార్, నల్లవెల్లి సంజీవ , పిల్లి సుధాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా భైరి రమేశ్, ధార సత్యం, అధికార ప్రతినిధిగా సైదులు, రాష్ట్ర పోలిట్ బ్యూరో చైర్మన్‌గా అశోద భాస్కర్, రాష్ట్ర కో-అర్డినేటర్‌గా కె.సాయి గిరి, యువత అధ్యక్షుడుగా దర్శ సతీష్ లను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. -
'ఏపీ ప్రభుత్వానిది దగాకోరు బాట'
⇒ దళితులను మోసగిస్తున్న సీఎం చంద్రబాబు ⇒ మాలమహానాడు జాతీయ అధ్యక్షులు కల్లూరి చెంగయ్య విజయవాడ (గుణదల): ప్రభుత్వం తలపెట్టిన దళితబాట దగాకోరు బాటగా మారిందని, దళిత ప్రజలను మరోమారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వంచిస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య అన్నారు. దళిత నిరుద్యోగులను మభ్యపెట్టడానికి, చంద్రబాబు పాలనపై దళితులలో వస్తున్న అసంతృప్తిని అణచివేయటానికి పన్నిన కుట్రే చంద్రన్నబాటని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు కావస్తున్నా ఎన్నికల మేనిఫెస్టోలో దళిత వర్గాలకు ఇచ్చిన హామీలలో ఒక్కటీ నెరవేర్చలేదని గురువారం ఇక్కడ విడుదల చేసిన ఓ ప్రకటనలో చెంగయ్య ధ్వజమెత్తారు. మూడు సెంట్లు భూమి, పరిశ్రమల స్థాపన కోసం బ్యాంకు పూచీకత్తులేకుండా వడ్డీలేని రుణాలు మంజూరు, భూమి కొనుగోలు పథకం అమలు కావటం లేదని, అసైన్డ్ భూములకు శాశ్వత పట్టాలు ఇవ్వటంలోనూ ప్రభుత్వం విఫలమైందన్నారు. పరిశ్రమల పేరుతో గతంలో కాంగ్రెస్ పార్టీ దళితుల నుంచి బలవంతంగా తీసుకున్న లక్షా 20 వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను తిరిగి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయాలని, నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇంత వరకు ప్రణాళికలు కూడా రూపొందించలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్లకు చైర్మన్లను ఏర్పాటు చేయటం వంటి అంశాలపై ఎలాంటి ప్రకటన ఇవ్వకుండా కేవలం ఎస్సీ రుణాలు మంజూరు పేరుతో ప్రచారం చేసుకుని సమస్యలను పక్కదోవ పట్టిస్తున్నారని కల్లూరి చెంగయ్య ఆరోపించారు. -
మాలల అణచివేతకే జీవో నెం.25
గుంటూరు (నెహ్రూనగర్) : రాజ్యాంగ వ్యతిరేకంగా రాష్ట్రంలో అమలువుతున్న జీవో నెం 25ను వెంటనే రద్దు చేయాలని మాల మహాసభ అధ్యక్షుడు మల్లెల వెంకట్రావు డిమాండ్ చేశారు. ఎస్సీ రిజర్వేషన్‌కు వ్యతిరేకంగా శనివారం మహిమ గార్డెన్స్‌లో ప్రత్యేక సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ పాల్గొన్నారు. మల్లెల వెంకట్రావు మాట్లాడుతు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని 2004 సంవత్సరంలో సుప్రీం కోర్టు కొట్టివేసినా కోర్టు తీర్పును ధిక్కరించి మాలల అణిచివేత చేసే దిశగా మంత్రి రావెల కిషోర్‌బాబు జీవో నెం 25ని తీసుకువచ్చి అమలు చేయటాన్ని ఖండిస్తున్నామని తెలిపారు. ఈ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తు నవంబర్ 21వ తేదీన రాష్ట్రంలోని అన్ని మండల కార్యాలయల వద్ద ధర్నాలు చేయాలని తీర్మానించామని పేర్కొన్నారు.