మాట్లాడుతున్న యోనారాజు
తాడికొండ: చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని పీవీరావు మాలమహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నత్తా యోనారాజు విమర్శించారు. అధికారం కోసం దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్న చంద్రబాబు నేడు పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తుంటే అడ్డుకునేందుకు తన బినామీలైన పెద్దగద్దల కోసం ఉద్యమం చేయడం సిగ్గుచేటన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షల్లో 33వ రోజు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
రాజధాని పేరిట మూడు పంటలు పండే భూములను సేకరించిన చంద్రబాబు అగ్రవర్ణాలకు ఒక ప్యాకేజీ, దళితులకు మరో ప్యాకేజీ ఇచ్చి మోసం చేశారని చెప్పారు. మాదిగ ఆరి్థక చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు బేతపూడి సాంబయ్య మాట్లాడుతూ రాజధాని పూలింగ్‌కు బేతపూడిలో 60 సెంట్లు ఇచి్చన తనకు సామాన్య ప్యాకేజీ ఇచి్చన చంద్రబాబు అగ్రవర్ణాలకు అగ్ర ప్యాకేజీ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేతలు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులరి్పంచారు.
Comments
Please login to add a commentAdd a comment