Andhra Pradesh formation day
-
‘భావితరాలకు ఏం సమాధానం చెబుతారు?’
ఆరు కోట్ల మంది ఆంధ్రుల్ని అవమానించారు.. యావత్ ఆంధ్రప్రదేశ్‌ను అవమానించారు. భావి తరాలకు ఏం సమాధానం చెబుతారు?.తిరుపతి, సాక్షి: కూటమి ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించకపోవడంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్ ఖాతాలో ఆమె ఒక సందేశం ఉంచారు.‘‘మన చుట్టూ ఉన్న.. తెలంగాణకు అవతరణ దినం ఉంది. కర్నాటకకు అవతరణ దినం ఉంది. తమిళనాడుకు అవతరణ దినం ఉంది. ఒడిశాకు అవతరణ దినం ఉంది. కానీ, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వడం వలనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి అవతరణ దినోత్సవం అంటూ లేకుండా పోయింది.ఇదీ చదవండి: అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం: వైఎస్ జగన్‘‘మా జగనన్న ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించాం. అయితే చంద్రబాబు ప్రభుత్వం జిల్లా స్థాయిలో కూడా అవతరణ దినోత్సవరం నిర్వహణ రద్దు చేసింది. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగాన్ని అవహేళన చేసేలా ఈ నిర్ణయం ఉంది అని ఆర్కే రోజా అన్నారు.ఆరుకోట్ల ఆంధ్రులను అవమానించారు..ఆంధ్రప్రదేశ్ ను అవమానించారు..మన చుట్టూ ఉన్న...తెలంగాణకు అవతరణ దినం ఉందికర్నాటకకు అవతరణ దినం ఉందితమిళనాడుకు అవతరణ దినం ఉందిఒడిశా కు అవతరణ దినం ఉందికానీ @ncbn ముఖ్యమంత్రి అవ్వడం వలన...ఆంధ్రప్రదేశ్ కి అవతరణ దినం...లేకుండా పోయింది...…— Roja Selvamani (@RojaSelvamaniRK) November 1, 2024.. ఎంత దారుణం.. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నిర్వహించరా?. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమేనా? చంద్రబాబు, పవన్ కల్యాణ్.. వీళ్లసలు పాలకులేనా?. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు అవతరించిందని అడిగితే.. భావితరాలకు ఏం సమాధానం చెప్తారు..?. ఆరు కోట్ల మంది తెలుగు ప్రజలను అవమానించినందుకు.. అమరజీవి త్యాగాన్ని అవమానించినందుకు.. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఇక నుంచి ప్రతీ ఏటా అవతరణ దినోత్సవం తప్పక నిర్వహించాల్సిందే’’ అని ఆమె డిమాండ్ చేశారామె. -
అమరజీవి త్యాగాన్ని స్మరించుకుందాం: వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, టీజేఆర్ సుధాకర్ బాబు, వైసీపీ నేతలు పాల్గొన్నారు.తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వైఎస్సార్ నేతలు హాజరయ్యారు. ఆ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములుతో పాటు ఎందరో త్యాగాలు చేస్తే ఆంధ్రరాష్ట్రం అవతరించిందన్నారు. 2019-24 మధ్య పొట్టిశ్రీ రాములు ఆశయాలకు వైఎస్ జగన్ జీవం పోశారన్నారు. ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలను వైఎస్ జగన్ చేసి చూపించారన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్రమాలు జరగకపోవడం బాధాకరమని దేవినేని అవినాష్ అన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు— YS Jagan Mohan Reddy (@ysjagan) November 1, 2024 -
ఏపీ అవతరణ దినోత్సవ వేడుకల్లో సీఎం జగన్ (ఫొటోలు)
-
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు
-
ఏపీ ప్రజలది అసాధారణమైన ప్రతిభ: ప్రధాని మోదీ
సాక్షి, ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం ఉదయం సోషల్ మీడియాలో ట్వీట్ చేశారాయన. ఏపీ ప్రజలు చైతన్యవంతులంటూ ట్వీట్ చేశారాయన. అంతేకాదు అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం, దృఢమైన పట్టుదల ఇక్కడి ప్రజల సొంతమంటూ ప్రధాని తన సందేశంలో కొనియాడారు. ఏపీ ప్రజల శ్రేయస్సు కోసం, విజయం కోసం నిరంతరం తాను ప్రార్థిస్తానంటూ ప్రధాని మోదీ ట్వీట్లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభసందర్భంగా, ఈ చైతన్యవంతమైన రాష్ట్ర ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి అసాధారణమైన ప్రతిభ, అచంచలమైన సంకల్పం మరియు దృఢమైన పట్టుదలతో, ఆంధ్రప్రదేశ్ ప్రజలు విభిన్న రంగాలలో తమదైన ముద్ర వేశారు. వారి నిరంతర శ్రేయస్సు మరియు విజయం కోసం నేను… — Narendra Modi (@narendramodi) November 1, 2023 ఇదీ చదవండి: రాష్ట్ర అవతరణ దినోత్సవం.. వైఎస్సార్ అవార్డుల ప్రదానం నేడు -
అమరజీవి నడిచిన దారిలో...
‘నాకు శ్రీరాములు వంటి పదకొండు మంది అను చరులు ఉంటే చాలు. నేను ఒక్క సంవత్సరంలో బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేస్తాను’ అని పొట్టి శ్రీరాములు అంకిత భావం, ఉపవాస సామర్థ్యం గురించి వ్యాఖ్యానిస్తూ గాంధీజీ అన్నారు. తెలుగువారందరికీ ప్రాతఃస్మరణీ యుడైన శ్రీరాములు గొప్పదనానికి ఇంతకంటే కితాబు ఏముంటుంది? పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ‘పెద్ద మనుషుల ఒప్పందం’ ఫలితంగా తెలంగాణ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో 1956 నవంబర్ 1న ‘ఆంధ్రప్రదేశ్’ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏటా నవంబర్ ఒకటవ తేదీ నాడు జరుపుకోవడం ఆనవాయితీ అయింది. అయితే 2014లో ఏపీ తెలంగాణ నుంచి విడి పోయిన తర్వాత నాటి ఏపీ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1 నుంచి మార్చి వేశారు. ఇది అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగానికి జరిగిన మహా అపరాధంగా భావించాలి. అయితే జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ తప్పును సరిదిద్ది ఎప్పటిలాగే నవంబర్ 1 ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతూ శ్రీరాములు త్యాగానికి ఘన నివాళులర్పిస్తున్నారు. మద్రాస్ రాష్ట్రంలో కలిసి ఉన్న తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలని 56 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు చరిత్ర సృష్టించారు. పొట్టి శ్రీరాములు మరణ వార్త తెలిసి వేలాదిమంది తెలుగు ప్రజలు మద్రాస్‌లోని మౌంట్ రోడ్‌కు చేరుకోవడంతో పరిస్థితి అల్లకల్లోలంగా మారింది. ప్రజా ఆస్తుల విధ్వంసం జరిగింది. తెలుగు ప్రాంతాలైన విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, భీమవరం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ఏలూరు, గుంటూరు, తెనాలి, ఒంగోలు, కనిగిరి, నెల్లూరులతో సహా అనేక ప్రాంతాల్లో ఆందోళనలు మిన్నంటాయి. అనకాపల్లి, విజయవాడ లలో పోలీసులు ఏడుగురిని కాల్చి చంపారు. ఫలితంగా మద్రాస్, ఆంధ్రా ప్రాంతాలలో పెద్ద ఎత్తున నాలుగు రోజుల పాటు ప్రజాందోళన కొనసాగింది. దీంతో కేంద్ర సర్కారు దిగివచ్చి, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ 1952 డిసెంబరు 19న ప్రకటించారు. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా తెలుగు మాట్లాడే వారి కోసం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. ఇది దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది అయ్యింది. అనంతరం, తెలంగాణను కలుపుతూ తెలుగు మాట్లాడే జిల్లాలు అన్నీ కలిసి హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది. నెల్లూరు జిల్లాలోని పడమటపల్లిలో 1901లో శ్రీరాములు జన్మించారు. అయితే ఆ ప్రాంతంలో కరవు పరిస్థితులు నెలకొనడంతో వారి కుటుంబం మద్రాసుకు తరలి వెళ్లింది. అక్కడే పాఠశాలలో శ్రీరాములు తన విద్యాభ్యాసం పూర్తి చేశారు. తర్వాత శానిటరీ ఇంజనీరింగ్ బొంబాయిలోని విక్టోరియా జూబ్లీ టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో చేశారు. కళాశాల విద్య తర్వాత, ముంబైలోని ‘గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే’లో చేరారు. దురదృష్టవశాత్తు తన భార్యను, అప్పుడే పుట్టిన బిడ్డను కోల్పోయారు. ఆయన జీవితంలో జరిగిన అత్యంత విషాదకర సంఘటన ఇది. ఆ సంఘటనను ఆయన జీర్ణించు కోలేకపోయారు. మనోవేదనతో రెండు సంవత్సరాల తరువాత ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనేందుకు గాంధీజీ నిర్వహిస్తున్న సబర్మతి ఆశ్రమంలో చేరారు. గాంధీజీ ఆశయాలకు ప్రభావితులై దళితుల అభ్యున్నతికి విశేషమైన కృషి చేశారు. సమాజంలోని అంటరానితనాన్నీ, అసమానతలనూ నిరసించి అట్ట డుగు వర్గాల అభ్యున్నతికి కృషిచేసిన గొప్ప సంఘ సంస్కర్త. కుల, మతాలకు అతీతంగా అట్టడుగు వర్గాల ఇళ్లలో భోజనం చేసేవారు. దళితుల హక్కులకు మద్దతుగా ఉపవాసాలు చేశారు. నెల్లూరు మూలపేట వేణుగోపాల స్వామి ఆలయంలో దళితుల ప్రవేశానికి మద్దతుగా ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. వారి హక్కుల సాధనకు కాళ్లకు చెప్పులు లేకుండా ఎర్రటి ఎండలో గొడుగు లేకుండా తిరిగే వారు. సమసమాజ స్థాపన కోసం గాంధీజీ సిద్ధాంతాలను ఆచరిస్తున్న ఆయన్ని చూసి కొంతమంది స్థానికులు పిచ్చివాడిగా భావించేవారు. దళితులకు సంఘీభావం తెలిపినందుకు ఒక దశలో అగ్రకులాల వారి ఆగ్రహానికి గురయ్యారు. ప్రత్యేకించి తన వైశ్య కులం వారు ఆయన్ని కులం నుంచి బహిష్కరించినట్లుగా ప్రకటించారు. అయినా ఆయన అవేవీ పట్టించుకోకుండా తన సంకల్పం కోసం దీక్షతో ముందుకు సాగిపోయారు. తదనంతర కాలంలో కానీ ఆయన గొప్పతనం ఏమిటో వాళ్లకు అర్థం కాలేదు. దళితుల అభ్యున్నతికీ, అణగారిన వర్గాల సంక్షే మానికీ కృషి చేయడం నాయకుల బాధ్యత అని చెప్పిన పొట్టి శ్రీరాములు బాటలోనే నేటి సీఎం జగన్ మోహన్ రెడ్డి పయనించడం ముదావహం. పి. విజయబాబు వ్యాసకర్త ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షులు (నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం) -
YSR Awards 2022: మహోన్నత గౌరవం
దశాబ్దాలుగా మన సంస్కృతి, సాంప్రదాయాలకు వారధులుగా నిలుస్తున్న వారిని ఈ అవార్డులతో సత్కరిస్తున్నాం. సమాజం కోసం శ్రమించిన మానవతామూర్తులు, మహనీయులను రాష్ట్ర అత్యున్నత అవార్డులతో సత్కరించుకోవడం సంతోషంగా ఉంది. సామాన్యుల్లోని అసామాన్యులకు, మానవతామూర్తుల సేవలకు వందనంగా ‘వైఎస్సార్’ అవార్డులు నిలుస్తాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన వైఎస్సార్ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వకంగా అభినందనలు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: సమాజంలో మానవత్వపు పరిమళాలు, ఎల్లలు దాటిన కీర్తి పతాకాలు పురస్కారాల పండుగలో పులకించాయి. నిలువెత్తు వ్యక్తిత్వం, మహోన్నత కీర్తి శిఖరం ‘వైఎస్సార్’ పురస్కారాలతో సగౌరవంగా సత్కరించి ప్రభుత్వం తన వినమ్రత చాటుకుంది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన మానవతామూర్తులు, విశిష్ట వ్యక్తులను వరుసగా రెండో ఏడాది రాష్ట్ర అత్యున్నత పురస్కారం ‘‘వైఎస్సార్’’ అవార్డులతో ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. వ్యక్తులుగా, సంస్థలుగా సమాజంలో గొప్ప పనులు చేస్తున్న ప్రతి ఒక్కరినీ గౌరవించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ అవార్డులను నెలకొల్పింది. వైఎస్సార్ జీవిత సాఫల్య, వైఎస్సార్ సాఫల్య పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం విజయవాడలో నిర్వహించారు. తొలుత అమరజీవి పొట్టి శ్రీరాములు, దివంగత వైఎస్సార్ విగ్రహాలకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2022 సంవత్సరానికి గానూ వ్యవసాయం, కళలు–సంస్కృతి, సాహిత్యం, మహిళా – శిశు సాధికారత, విద్య, జర్నలిజం, వైద్యం, పరిశ్రమల రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు మొత్తం 30 అవార్డులను గవర్నర్, ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. వీటిల్లో 20 వైఎస్సార్ జీవిత సాఫల్య, 10 వైఎస్సార్ సాఫల్య పురస్కారాలున్నాయి. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా వైఎస్ విజయమ్మ హాజరయ్యారు. వైఎస్సార్ అవార్డులను నెలకొల్పడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం, అవార్డు గ్రహీతల గొప్పతనాన్ని వివరించారు. వైఎస్సార్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు అందుకున్న వారితో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సీఎం మాతృమూర్తి వైఎస్ విజయమ్మ పురస్కారం సాధించిన ‘దిశ’ వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి వైఎస్సార్ అవార్డులను ప్రదానం చేశారు. వ్యవసాయంలో 5, కళలు– సంస్కృతిలో 5, సాహిత్యంలో 3, మహిళా, శిశు సాధికారతలో 3, విద్యలో 4, జర్నలిజంలో 4, వైద్యంలో 5 అవార్డులు, పరిశ్రమల విభాగంలో ఒక అవార్డును అందజేశారు. వైఎస్సార్ జీవిత సాఫల్య అవార్డు కింద రూ.10 లక్షల నగదు, వైఎస్సార్ సాఫల్య అవార్డు కింద రూ.5 లక్షల నగదుతో పాటు వైఎస్సార్ కాంస్య విగ్రహం, జ్ఞాపిక, ప్రశంసా పత్రాలతో సత్కరించారు. కళలు, సంస్కృతి రంగంలో కళాతపస్వి కె.విశ్వనాథ్ తరఫున వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆయన తనయుడు కాశీనాథుని నాగేంద్రనాథ్ అందుకోగా వైద్య రంగంలో ప్రతాప్ సి.రెడ్డి తరఫున వైఎస్సార్ జీవిత సాఫల్య పురస్కారాన్ని ఆయన కుమార్తె సంగీతారెడ్డి స్వీకరించారు. వ్యవసాయంలో వైఎస్సార్ సాఫల్య పురస్కారాన్ని కట్టమంచి బాలకృష్ణారెడ్డి తరఫున ఆయన కుటుంబ సభ్యులు అందుకున్నారు. ముఖ్యమంత్రి మానస పుత్రిక ‘దిశ’ ద్వారా మహిళా రక్షణకు కృషి చేసిన ఐదుగురు పోలీసులకు ఉమ్మడిగా అవార్డులను బహూకరించారు. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానమ్, హోంమంత్రి తానేటి వనిత, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా, తెలుగు, సంస్కృత అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీ పార్వతి, జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, ప్రభుత్వ కార్యక్రమాల కన్వీనర్ తలశిల రఘురాం, ప్రభుత్వ సలహాదారు (కమ్యూనికేషన్స్), వైఎస్సార్ అవార్డుల కమిటీ కన్వీనర్ జీవీడీ కృష్ణ మోహన్, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, ప్రభుత్వ జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, సాధారణ పరిపాలన (రాజకీయ) కార్యదర్శి రేవు ముత్యాలరాజు, డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ విజయ్‌కుమార్‌రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మన కీర్తికి సత్కారం: సీఎం జగన్ దశాబ్దాలుగా మన సంస్కృతి, సాంప్రదాయాలకు వారధులుగా నిలుస్తున్న వారిని ఈ అవార్డులతో సత్కరిస్తున్నాం. సమాజం కోసం శ్రమించిన మానవతామూర్తులు, మహనీయులను రాష్ట్ర అత్యున్నత అవార్డులతో సత్కరించుకోవడం సంతోషంగా ఉంది. సామాన్యుల్లోని అసామాన్యులకు, మానవతామూర్తుల సేవలకు వందనంగా ‘వైఎస్సార్’ అవార్డులు నిలుస్తాయి. తమ శ్రమ, స్వేదంతో రాష్ట్ర చరిత్రను గొప్పగా లిఖిస్తున్న రైతన్నలను ఎక్కడా లేనివిధంగా ప్రతిష్టాత్మక ‘వైఎస్సార్’ అవార్డులతో ప్రభుత్వం సత్కరిస్తోంది. మహిళా రక్షణకు నిరంతరం పాటుపడే రక్షణ సారథులను, వెనుకబాటు, అణచివేత, పెత్తందారీ పోకడలపై ఎలుగెత్తిన సామాజిక ఉద్యమకారులను సవినయంగా గౌరవించుకుంటున్నాం. భిన్న కలాలు, గళాలు, పాత్రికేయులు, మన గడ్డపై పుట్టి వైద్య ఆరోగ్య రంగంలో ప్రపంచ కీర్తి గడించిన మహామహులు, అంతర్జాతీయంగా పేరొందిన మన పారిశ్రామిక దిగ్గజాలకు అవార్డులను అందజేస్తున్నాం. వైఎస్సార్ ఆచరించిన విధానాల స్ఫూర్తితో.. వ్యక్తులుగా, సంస్థలుగా సమాజంలో గొప్ప పనులు చేస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. అందుకు సంకేతంగానే ఏటా నాన్న (దివంగత వైఎస్సార్) పేరుతో ఈ అవార్డులను అందజేస్తున్నాం. ముఖ్యమంత్రిగా ఉన్న 5.3 ఏళ్ల స్వల్ప కాలంలోనే వైఎస్సార్ ఆచరించి చూపిన రైతు, మహిళా, నిరుపేద పక్షపాత విధానాలు, సామాజిక, ప్రాంతీయ న్యాయం, వైద్య రంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులు, మనదైన తెలుగుతనం, మన కళలు, సాంప్రదాయాలు, శ్రమ, పరిశ్రమకు నిదర్శనంగా ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నాం. ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకమైన వైఎస్సార్ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వకంగా అభినందనలు తెలియచేస్తున్నా. మహోన్నత వ్యక్తి వైఎస్సార్: గవర్నర్ సామాజిక సేవా స్ఫూర్తితో వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్’ అవార్డులతో సత్కరించడం సంతోషంగా ఉందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి గొప్ప ప్రజానాయకుడని కొనియాడారు. పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు, వారి సమస్యలను దగ్గరగా చూసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పలు ప్రజా సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రజల గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. అంతటి మహోన్నత వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా అవార్డులతో గౌరవించడం సముచితంగా ఉందన్నారు. రాష్ట్రం గొప్ప కళలు, సంస్కృతి, ఆధ్యాత్మికతకు నిలయంగా వెలుగొందుతోందన్నారు. ఎందరో మహనీయుల త్యాగఫలాలతో ఏర్పడిన రాష్ట్రంలో సామాజిక స్పృహతో నిరంతరం సేవలందిస్తూ మన ఖ్యాతిని చాటిన వారిని అవార్డులకు ఎంపిక చేయడం మంచి సాంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. వైఎస్సార్ బాటలోనే ఆయన తనయుడు సీఎం జగన్ రాష్ట్రాన్ని దేశంలోనే అభివృద్ధికి చిరునామాగా నిలిపేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి రంగాలవారీగా అవార్డులు ప్రదానం ఇలా.. వ్యవసాయం (అందరికీ వైఎస్సార్ అఛీవ్మెంట్ అవార్డులు 1) ఆదివాసీ క్యాష్యూనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ – సోడెం ముక్కయ్య – బుట్టాయగూడెం, ఏలూరు జిల్లా 2) కుశలవ కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ కంపెనీ – ఎ.గోపాలకృష్ణ, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా 3) అన్నమయ్య మ్యూచువల్లీ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ – జయబ్బనాయుడు, తలుపల గ్రామం, పీలేరు మండలం, అన్నమయ్య జిల్లా 4) అమృతఫల ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, –కె.ఎల్.ఎన్.మౌక్తిక, సబ్బవరం, అనకాపల్లి జిల్లా 5) కట్టమంచి బాలకృష్ణారెడ్డి, కట్టమంచి గ్రామం, చిత్తూరు జిల్లా కళలు–సంస్కృతి 1) కళాతపస్వి కె.విశ్వనాథ్, సినీ దర్శకుడు (లైఫ్ టైం) 2) ఆర్.నారాయణమూర్తి, సినీ నటుడు, దర్శకుడు (లైఫ్ టైం) 3) సుప్రసిద్ధ రంగస్థల కళాకారుడు నాయుడు గోపీ (అచీవ్మెంట్) 4) పెడన కలంకారీ నేతన్న పిచుక శ్రీనివాస్ (అచీవ్మెంట్) 5) దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన ఉదయగిరి ఉడెన్ కట్లరీ– షేక్ గౌసియా బేగం (అచీవ్మెంట్) సాహిత్య సేవ (అందరికీ లైఫ్ టైం అవార్డులు 1) విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ (మనోహర్ నాయుడు అవార్డు అందుకున్నారు) 2) ఎమెస్కో పబ్లిషింగ్ హౌస్ – సంస్థ సీఈవో విజయకుమార్ అవార్డును అందుకున్నారు 3) రాయలసీమ ప్రసిద్ధ రచయిత డాక్టర్ శాంతి నారాయణ మహిళా సాధికారత–రక్షణ 1) ప్రజ్వల ఫౌండేషన్– సునీతా కృష్ణ్ణణ్ (లైఫ్ టైం) 2) శిరీషా రిహేబిలిటేషన్ సెంటర్, ఉయ్యూరు – ఎం.సోమేశ్వరరావు అవార్డును అందుకున్నారు (లైఫ్ టైం) 3) దిశ పోలీసింగ్– రవాడ జయంతి, ఎస్వీవీ లక్ష్మీనారాయణ, రాయుడు సుబ్రహ్మణ్యం, హజరత్తయ్య, పి.శ్రీనివాసులు (ఉమ్మడిగా వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డు) విద్యా రంగం 1) మదనపల్లి – రిషీ వ్యాలీ విద్యా సంస్థ – అనంత జ్యోతి అవార్డును అందుకున్నారు (లైఫ్ టైం) 2) కావలి– జవహర్ భారతి విద్యా సంస్థ– వినయ్‌కుమార్‌రెడ్డి అవార్డును అందుకున్నారు (లైఫ్ టైం) 3) వ్యక్తిత్వ వికాస నిపుణుడు బి.వి.పట్టాభిరాం (లైఫ్ టైం) 4) బ్యాంకింగ్ రంగంలో వేలాది మందికి దారి చూపిన నంద్యాలకు చెందిన దస్తగిరిరెడ్డి (అచీవ్మెంట్) జర్నలిజం (అందరికీ లైఫ్‌టైం అచీవ్మెంట్ 1) భండారు శ్రీనివాసరావు 2) సతీష్ చందర్ 3) మంగు రాజగోపాల్ 4) ఎంఈవీ ప్రసాదరెడ్డి వైద్య రంగం (అందరికీ లైఫ్ టైం అచీవ్మెంట్ 1) డాక్టర్ బి.నాగేశ్వరరెడ్డి, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ 2) డాక్టర్ వరప్రసాదరెడ్డి, శాంతా బయోటెక్ (హెపటైటిస్–బి వ్యాక్సిన్) 3) భారత్ బయోటెక్ డాక్టర్ కృష్ణా ఎల్లా, సుచిత్ర ఎల్లా (కోవ్యాగ్జిన్) (కృష్ణా ఎల్లా అవార్డు అందుకున్నారు) 4) అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి (ఆయన తరఫున కుమార్తె సంగీతా అవార్డు అందుకున్నారు) 5) ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్– గుళ్లపల్లి నాగేశ్వరరావు పారిశ్రామిక రంగం అంతర్జాతీయ పారిశ్రామిక వేత్త గ్రంథి మల్లికార్జునరావు (లైఫ్ టైం) -
Johnson Choragudi: భావోద్వేగాల బంధం
రాష్ట్రావతరణ దినమైన నవంబర్ ఒకటి, గత చరిత్రలోకి చేజారి పోకుండా మళ్ళీ ‘స్వాధీనం’ చేసుకుని, సకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్ప పరిణతిని ప్రదర్శించింది. ఇక్కడ స్వాధీనం అంటున్నది– ‘క్లెయిమ్’ అనే ఆంగ్ల పదాన్ని దృష్టిలో ఉంచుకుని. తెలంగాణ మన నుంచి విడిపోయినప్పుడు, 1956 నుండి నైసర్గిక ఆంధ్రప్రదేశ్ చరిత్రను ‘క్లెయిమ్’ చేసుకోవలసిన – ‘పెద్దన్న’ పాత్రను గత ప్రభుత్వం తొలి ఐదేళ్లు వదులుకుంటే, చివరికి ఆ లోపాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరిచేసింది. ముఖ్యమంత్రిగా ఆయనకు తొలి అనుభవం అయినప్పటికీ, నిర్ణయానికి అవసరమైన మేధోమథనం ఎంత వేగంగా జరిగింది అంటే, 2019 జూన్‌లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం నుంచి అక్టోబర్ మూడవ వారం నాటికి – నవంబర్ 1 రాష్ట్రావతరణ దినోత్సవం అని ప్రకటన వెలువడింది. అది కూడా చీఫ్ సెక్రటరీ ఈ విషయాన్ని ప్రకటించడం ద్వారా, ఈ ప్రభుత్వం ‘బిజినెస్ లైక్’ పనిచేస్తుందనే సంకేతాలు కూడా మొదట్లోనే వెలువడ్డాయి. ఐదేళ్లు ఆలస్యం అయినప్పటికీ కడకు ప్రభుత్వం తల నెరిసినతనంతో, సమ్యక్ దృష్టి (హోలిస్టిక్ అప్రోచ్) తో వ్యవ హరించి ఒక చారిత్రిక తప్పిదాన్ని సరిచేసింది. అలా తొలి ఏడాది విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో రాష్ట్రావతరణ దినోత్సవాలు – ‘స్టేట్ ఫంక్షన్’గా జరిగాయి. ఇది జరిగాక, అదే వారంలో 2019 నవంబర్ 6న దీనిపై రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో అత్యున్నత పురస్కారంగా భావిస్తున్న భారతరత్న, పద్మ విభూషణ్ తరహాలో రాష్ట్రంలో సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ ప్రజా రంగంలో విశేష సేవలు అందించిన వారికి రాష్ట్రావతరణ దినోత్సవం నాడు పురస్కరాలతో ప్రభుత్వం సత్కరిస్తుంది అని అందులో ప్రకటించింది. అయితే, కరోనా కారణంగా 2020లో ‘మెడికల్ ఎమర్జెన్సీ’ కావడంతో అది ఆగినా, ఆ తర్వాత రెండేళ్లుగా రాష్ట్రావతరణ దినోత్సవం నాడు ప్రభుత్వం పురస్కారాలతో సత్కరించడం గొప్ప విషయం. గత ఏడాది– ‘వైఎ స్సార్ లైఫ్ టైం ఎచీవ్మెంట్ అవార్డు’ పురస్కారానికి 10 లక్షల నగదు, మెమెంటో, ప్రశంసాపత్రం, అలాగే, ‘వైఎస్సార్ ఎచీవ్మెంట్ అవార్డు’ పురస్కారానికి 5 లక్షల నగదు, మెమెంటో, ప్రశంసా పత్రం అందించారు. పురస్కార గ్రహీతల ఎంపిక కోసం ప్రభుత్వం పకడ్బంది ‘స్క్రీనింగ్’ విధానాన్ని అనుసరిస్తున్నది. 2022 పురస్కారాలకు ‘వైఎస్సార్ లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డు’కు 20 మందినీ, ‘వైఎస్సార్ ఎచీవ్ మెంట్ అవార్డు’కు 10 మందినీ ఎంపిక చేశారు. వీరిని – వ్యవసాయం, పరిశ్రమలు, వైద్య రంగం, విద్యా రంగం, కళారంగం, సాహిత్యం, మీడియా, స్త్రీ రక్షణ – సాధికారికత రంగాల నుంచి ఎంపిక చేశారు. (క్లిక్ చేయండి: తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!) అలజడి తర్వాత కుదురు కోవడం గురించి యోచించడానికి, అధినేతకు ప్రజలు – ప్రాంతము మధ్య ఉండే భావోద్వేగాల బంధం ఎటు వంటిదో తెలియాలి. లేనప్పుడు, అస్పష్టం అయోమయం మిగులుతుంది. ‘రాజ్యం’లో భాగమైన–’ఎగ్జిక్యూటివ్’ అందించే విలువైన మార్గదర్శనాలను అధినేత నిర్ణయాత్మకంగా వినియోగించుకున్నప్పుడు, ప్రజల తీర్పుతో ఎన్నికయిన ప్రభుత్వాలకు అది అదనపు విలువ అవుతుంది. ఇవన్నీ కాకుండా ప్రస్తుత సీఎంకీ ఏపీ ‘బ్యూరోక్రసీ’కీ మధ్య వయస్సులో కుదిరిన సారూప్యత వల్ల, ఇక్కడ తక్కువ కాలంలో ఎక్కువ ప్రభావవంతంగా ప్రస్తుతం ప్రభుత్వంలో పని సాగుతున్నది. - జాన్సన్ చోరగుడి అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత -
ఏపీ అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ బిశ్వభూషణ్
-
పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణాలర్పించి, అమరజీవి అయిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములు (1901 మార్చి 16 – 1952 డిసెంబరు 15). మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు. గాంధీజీకి శ్రీరాములు అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటు అతని మంకుతనం మీద కాస్త చిరాకు కూడా ఉండేదని అంటారు. శ్రీరాములు వంటి కార్యదీక్షాపరులు పదిమంది ఉంటే ఒక్క సంవత్సరంలోనే స్వతంత్రం సాధించవచ్చునని గాంధీజీ అనేవారని అంటారు. 1946 నవంబరు 25న ఈ గాంధీ శిష్యుడు మద్రాసు ప్రావిన్సులోని అన్ని దేవాలయాలలోనూ హరిజనులకు ప్రవేశం కల్పించాలని ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించాడు. కొద్ది రోజుల్లోనే స్వాతంత్య్రం రావచ్చునన్న ఆశాభావంతో కాంగ్రెసు నాయకులు, సభ్యులందరి దృష్టి ఆ స్వాతంత్య్రోద్యమంపైనే ఉంది. కనుక శ్రీరాములు దీక్షను మానుకోవాలని వారు సూచించినా ఆయన వినకపోయేసరికి ఇక వారు గాంధీని ఆశ్రయించారు. ఎలాగో గాంధీ శ్రీరాములుకు నచ్చజెప్పి దీక్ష విరమింపజేశారు. అయితే 1952లో శ్రీరాములు దీక్ష మాన్పించడానికి గాంధీజీ జీవించి లేరు. జీవితం చివరిదశలో నెల్లూరులో ఉంటూ, శ్రీరాములు హరిజనోద్ధరణకు పాటు పడ్డారు. దీని గురించిన నినాదాలను అట్టలకు రాసి, మెడకు వేలాడేసుకుని ప్రచారం చేసేవాడు. కాళ్ళకు చెప్పులు, తలకు గొడుగు లేకుండా మండుటెండల్లో తిరుగుతూ ప్రచారం చేసే ఆయన్ను చూసి పిచ్చివాడనేవారు. ఆ పిచ్చివాడే ఆంధ్రుల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించేందుకు ప్రాణ త్యాగానికి పూనుకుని, అమరజీవి అయ్యారు. -
YSR Awards: సేవలకు సత్కారం
‘సామాన్యుల్లా కనిపించే అసామాన్యుల సేవలకు వందనం.. వెలకట్టలేని మీ ప్రతిభకు సలాం చేస్తూ వైఎస్సార్ అవార్డులు ప్రకటించాం. ఎందరికో స్ఫూర్తినిస్తున్న మహోన్నత వ్యక్తులు, సంస్థలను పురస్కారాలతో సత్కరిస్తున్నాం. తెలుగువారికి, రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా నిలిచిన సంస్కృతి, కళలకు అవార్డుల్లో పెద్దపీట వేశాం..’ – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఇక నుంచి ఏటా నవంబర్ 1వ తేదీన వైఎస్సార్ అవార్డులను ప్రదానం చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని సోమవారం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు గవర్నర్ విశ్వభూషణ్ , సీఎం వైఎస్ జగన్ నివాళులు అర్పించారు. అనంతరం 2021 సంవత్సరానికిగాను 29 వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డులు, 30 వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు కలిపి మొత్తం 59 అవార్డులను గవర్నర్, ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. వైఎస్సార్ అవార్డులను నెలకొల్పడం వెనుక ఉద్దేశం, ఎంపికలో పాటించిన పారదర్శకత, అవార్డు గ్రహీతల గొప్పతనం గురించి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ వివరించారు. సీఎం జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. పద్మ అవార్డుల తరహాలో... కేంద్ర ప్రభుత్వం ఏటా వివిధ రంగాలలో సేవలందించిన గొప్పవారిని దేశంలో అత్యున్నత అవార్డులైన భారతరత్న, పద్మశ్రీ, పద్మభూషణ్ తదితర అవార్డులతో సత్కరిస్తోంది. మనందరి ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమమే చేపట్టి రాష్ట్రం తరపున అవార్డులు ఇస్తే బాగుంటుందని పలువురు సూచించిన నేపథ్యంలో వైఎస్సార్ అవార్డులను నెలకొల్పాం. మహామనిషి పేరుతో అత్యున్నత పురస్కారాలు మహానేత, నాన్న వైఎస్సార్ పేరు చెబితే అందరికీ ఎన్నో విషయాలు గుర్తుకొస్తాయి. నిండైన తెలుగుదనం తన పంచెకట్టులో కనిపిస్తుంది. తన ప్రతి అడుగులోనూ వ్యవసాయం మీద మమకారం కనిపిస్తుంది. పల్లెలు, పేదల మీద అభిమానం తనను చూడగానే గోచరిస్తాయి. ప్రతి ఒక్కరి ప్రాణాన్ని నిలబెట్టాలన్న ఆరాటం, అందరినీ పెద్ద చదువులు చదివించాలన్న తపన.. ఇవన్నీ నాన్నను చూడగానే గుర్తొచ్చే విషయాలు. ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన ఆ మహామనిషి ఈరోజు మన మధ్య లేకపోయినా.. అంత గొప్పవాడు, మహానుభావుడి పేరుమీద రాష్ట్ర స్ధాయిలో అత్యున్నత పౌర పురస్కారాలను వైఎస్సార్ లైఫ్‌టైం అచీవ్మెంట్, వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డుల పేరుతో ప్రకటించాం. లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డులు ప్రకటించిన వారికి రూ.10 లక్షలు, కాంస్య విగ్రహం, మెమెంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నాం. వైఎస్సార్ అచీవ్మెంట్ అవార్డులు పొందినవారికి రూ.5 లక్షలు, కాంస్య విగ్రహం, మెమెంటో, యోగ్యతా పత్రం ఇస్తున్నాం. పారదర్శకంగా ఎంపిక ఈ రోజు గర్వంగా ఇంకో విషయం చెబుతున్నా. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం దగ్గరనుంచి ప్రతి సంక్షేమ పథకాన్నీ పేదలకు అత్యంత పారదర్శకంగా ఇవ్వగలిగే వ్యవస్ధని తెచ్చాం. ఈ అవార్డుల ఎంపికలో కూడా కులం, మతం, ప్రాంతం చూడలేదు. పార్టీలు, రాజకీయ భావాలను కూడా చూడలేదు. మనిషిని మనిషిగానే చూశాం. విభేదించే భావాలున్నా మనుషుల్లో కూడా మహామనుషులను చూశాం. రాష్ట్ర చరిత్రలోనే అత్యంత పారదర్శకంగా అవార్డులను ఇస్తున్నాం. ఎందరో మహానుభావులు... మన తెలుగు సంస్కృతి, కళలు, మానవతామూర్తులకు ఇస్తున్న గొప్ప అవార్డులుగా వీటిని భావిస్తున్నాం. ఎందరెందరికో స్ఫూర్తినిస్తున్న మహోన్నత వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులు ఇస్తున్నాం. తెలుగువారికి, ఆంధ్రప్రదేశ్‌కి బ్రాండ్ అంబాసిడర్లైన కళలు, సంస్కృతికి ఈ అవార్డుల్లో పెద్దపీట వేశాం. ఒక డప్పు కళాకారుడికి, ఒక తోలుబొమ్మలాటకు, పొందూరు ఖాదీకి, జానపద గీతానికి, బొబ్బిలి వీణకు, రంగస్థల పద్యానికి, థింసా నృత్యానికి, సురభి నాటకానికి, సవర చిత్రకళకు, వీధి నాటకానికి, హరికథకు, బుర్రకథకు, వెంకటగిరి జాంధానీ చీరకు, మనదైన కలంకారీకి, చెక్కమీద చెక్కే శిల్పానికి, నాదస్వరానికీ, మనదైన కూచిపూడికి ఇస్తున్న అవార్డులు ఇవి. వందేళ్ల చరిత్ర ఉన్న ఎంఎస్ఎన్ ఛారిటీస్, సీపీ బ్రౌన్ లైబ్రరీ, వేటపాలెం గ్రంథాలయం, ఆర్డీటీ సంస్థ, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్.. ఇలాంటి గొప్ప సంస్థలు చేస్తున్న సేవలకు ఇస్తున్న అవార్డులు ఇవి. పండించే రైతన్నకు మనదైన వ్యవసాయానికి, ఉద్యానవన ఉద్యమానికి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో వస్తున్న విప్లవానికి ఇస్తున్న అవార్డులు ఇవి. కలం యోధులైన కవులకు, స్త్రీవాద ఉద్యమానికి, సామాజిక స్పృహను మేల్కొల్పడంలో మేరుపర్వత సమానులైన రచయితలకు, విశ్లేషక పాత్రికేయులకు ఇస్తున్న అవార్డులు ఇవి. కోవిడ్ సమయంలో అయినవారే దగ్గరకు రాని పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో అన్నీ తామై వారాలు, నెలలు పాటు కుటుంబాలకు దూరమై ప్రాణాలకు తెగించి అసామాన్యమైన సేవలందించిన మానవతామూర్తులకు ఈ అవార్డులు ఇస్తున్నాం. మీ అందరి కుటుంబ సభ్యుడిగా, మీవాడిగా తెలుగుజాతి మాణిక్యాలను, మకుటాలను, మహానుభావుల్ని ఈ రకంగా సత్కరించడాన్ని దేవుడు నాకిచ్చిన అదృష్టంగా భావిస్తున్నా. విశిష్ట సేవలు.. ప్రతిభకు గుర్తింపు – గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వ్యక్తులు, సంస్థల సేవలకు గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ అవార్డులను ప్రదానం చేయడం సంతోషదాయకమని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రైతులు, పేదల కోసం విశేషంగా కృషి చేసి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆ మహానేత మహోన్నత వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తూ ఆయన పేరిట ఏటా అవార్డులను అందించాలన్న నిర్ణయం సామాజిక, కళ, సాంస్కృతిక రంగాలకు ప్రోత్సాహానిస్తుందని చెప్పారు. సామాజిక, సేవా, సాంస్కృతిక రంగాల్లో విశేష కృషి చేస్తూ కూడా ఎలాంటి గుర్తింపునకు నోచుకోనివారిని ఎంపిక చేసి అవార్డులు ప్రదానం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఓ మంచి ఒరవడిని సృష్టించిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్దేశించిన అత్యున్నత ప్రమాణాలను పాటిస్తూ అవార్డులకు ఎంపిక చేయడం ముదావహమన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణంతో ఏర్పడ్డ రాష్ట్ర అవతవరణ దినోత్సవం రోజు ఏటా వైఎస్సార్ అవార్డులను ఇవ్వడం సముచిత నిర్ణయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తొమ్మిది సంస్థలకు పురస్కారం వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహోన్నత వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతల్లో 9 సంస్థలు ఉండగా వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన వారు 11 మంది ఉన్నారు. కళలు, సంస్కృతి రంగాల నుంచి 20 మంది, సాహిత్యరంగంలో ఏడుగురు, పాత్రికేయ రంగానికి చెందినవారు ఆరుగురు, కోవిడ్ సేవలు అందించిన ఆరుగురు ప్రభుత్వ వైద్యాధికారులు/సిబ్బంది అవార్డులకు ఎంపికయ్యారు. మరణించిన ఐదుగురు అవార్డు గ్రహీతల తరపున వారి కుటుంబ సభ్యులు అవార్డులను స్వీకరించారు. అనివార్య కారణాలతో పాత్రికేయ దిగ్గజం ఏబీకే ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో తరువాత ప్రత్యేకంగా అవార్డు అందించాలని నిర్ణయించారు. ప్రముఖ రచయిత్రి ఓల్గా తరపున ఆమె కుమార్తె అవార్డు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, నారాయణస్వామి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కన్నబాబు, ఆదిమూలపు సురేశ్, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎం.శంకర్ నారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, తానేటి వనిత, జి.జయరాం, ప్రభుత్వ కార్యక్రమాల కన్వీనర్ తలశిల రఘురాం, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ, ముఖ్యమంత్రి మీడియా సలహాదారు, వైఎస్సార్ అవార్డుల కమిటీ కన్వీనర్ జీవీడీ కృష్ణమోహన్, తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి, మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రశంసలందుకున్న సీఎం జగన్ వినమ్రత వీల్ చెయిర్లో ఉన్న కత్తి పద్మారావు నిలుచునేందుకు సహాయం చేస్తున్న సీఎం జగన్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని తరచూ చెప్పే మాటను సీఎం వైఎస్ జగన్ ఆచరణలో మరోసారి నిరూపించారు. ముఖ్యమంత్రి అనే భేషజం, హోదాను ఏమాత్రం ప్రదర్శించకుండా తన వినమ్రతను చాటుకున్నారు. సోమవారం విజయవాడలో నిర్వహించిన ‘వైఎస్సార్’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమ వేదికపై సాక్షాత్కరించిన ఆ దృశ్యం అందరి ప్రశంసలు అందుకుంది. ప్రముఖ అభ్యుదయ కవి కత్తి పద్మారావు ఇటీవల అనారోగ్యం బారినపడటంతో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి వీల్ చెయిర్లో వచ్చారు. సహాయకులు ఆయన్ను వీల్ చెయిర్లో వేదిక మీదకు తీసుకొస్తున్న దృశ్యాన్ని దూరం నుంచి చూడగానే సీఎం జగన్ లేచి ముందుకు వచ్చి సాదరంగా ఆహ్వానించారు. వీల్ చెయిర్ ఫుట్ రెస్ట్ మీద ఉన్న కత్తి పద్మారావు కాలును సీఎం జగన్ స్వయంగా పట్టుకుని ఫుట్ రెస్ట్ నుంచి పక్కకు జరిపి నేలపై ఉంచారు. ఆయన చేతులు పట్టుకుని నిల్చునేందుకు ఆసరా అందించారు. వైఎస్సార్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం చేసిన తరువాత కత్తి పద్మారావు తిరిగి వీల్ చెయిర్లో కూర్చునేందుకు సాయం చేశారు. ఆయన కాళ్లను వీల్ చెయిర్ ఫుట్ రెస్ట్ మీద ఉంచి సరి చేశారు. కత్తి పద్మారావుపట్ల గౌరవంతో, వాత్సల్యంతో ముఖ్యమంత్రి స్పందించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంది. ఆ వీడియో క్లిప్, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
ఘనంగా ఏపీ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
-
AP Formation Day: జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం జగన్
-
AP Formation Day: జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులర్పించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. (చదవండి: AP Formation Day: ఏపీ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు) ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ, డిప్యూటీ సీఎం నారాయణస్వామి, డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, ఆదిమూలపు సురేష్, శంకరనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్, తానేటి వనిత, గుమ్మనూరి జయరాం, అవంతి శ్రీనివాస్, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, తెలుగు అకాడమీ చైర్మన్ లక్ష్మీ పార్వతి, మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎంపీ నందిగం సురేష్ పాల్గొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్.. ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం కొనసాగించడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామన్నారు. -
వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున నివాళర్పించారు. (చదవండి: AP Formation Day: జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం జగన్) ఈ సందర్భంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిందన్నారు. మహనీయుడి స్పూర్తి కొనసాగాలనే సీఎం జగన్.. రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుతున్నారన్నారు. అధికారంలో ఉండగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని టీడీపీ ప్రభుత్వం జరపలేదని.. అప్పట్లో వేడుకలు జరపకుండా ఇప్పుడు అచ్చెన్నాయుడు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు. చదవండి: అప్పుడలా.. ఇప్పుడిలా.. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం -
AP Formation Day: ఏపీ ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ప్రజలు నైపుణ్యం, ధృడ సంకల్పం, పట్టుదలకు మారుపేరని కొనియాడారు. ఈ మేరకు ట్విటర్లో స్పందిస్తూ..‘ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. రాష్ట్ర ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను.’ అని ట్వీట్ చేశారు. చదవండి: రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లోని నా సోదరీమణులకు, సోదరులకు శుభాకాంక్షలు. ఏపీ ప్రజలు తమ నైపుణ్యం, దృఢ సంకల్పం, పట్టుదలకు మారు పేరు. అందువల్ల వారు అనేక రంగాల్లో రాణిస్తున్నారు. ఏపీ ప్రజలు సంతోషంగా, ఆరోగ్యంగా, విజయవంతంగా ఉండాలని కోరుకుంటున్నాను. — Narendra Modi (@narendramodi) November 1, 2021 -
రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
సాక్షి, అమరావతి: సంక్షేమ, అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ పయనిస్తోందని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. నేడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వం, సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ దేశంలోనే విశిష్ట స్థానాన్ని కలిగి ఉందన్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలన్నారు. సామాన్య ప్రజల కలలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం తాను చేస్తున్న కృషిలో విజయం సాధించాలని గవర్నర్ ఆకాంక్షించారు. ఈ మేరకు రాజ్‌భవన్ వర్గాలు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపాయి. సర్దార్ పటేల్ సేవలు స్ఫూర్తిదాయకం 556 సంస్థానాలను స్వతంత్రంగా ఉంచడం ద్వారా భారతదేశాన్ని దెబ్బ తీయాలన్న బ్రిటిష్ పాలకుల కుట్రలను తిప్పికొట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ రాచరిక రాజ్యాలను దేశంలో విలీనం చేశారని గవర్నర్ పేర్కొన్నారు. ఉక్కు మనిషి సర్దార్ పటేల్ 146వ జయంతి వేడుకలను రాజ్‌భవన్‌లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సర్దార్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దేశానికి సర్దార్ పటేల్ నిరుపమాన సేవలు అందించారని కొనియాడారు. దేశానికి పటేల్ అందించిన సేవలు సదా స్ఫూర్తిదాయకమన్నారు. -
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. పొట్టి శ్రీరాములు త్యాగఫలంతో పాటు అనేక మంది పోరాట ఫలితంతో ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. అదే అంకితభావం, చిత్తశుద్ధి, దృఢ సంకల్పం కొనసాగించడం ద్వారా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్దామన్నారు. నేడు సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఉదయం 10.15 గంటలకు రాష్ట్ర అవతరణ వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం తెలుగుతల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళి అర్పించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు. -
‘బినామీ గద్దలకోసం బాబు ఉద్యమం’
తాడికొండ: చంద్రబాబు ఏరు దాటాక తెప్ప తగలేసే రకమని పీవీరావు మాలమహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు నత్తా యోనారాజు విమర్శించారు. అధికారం కోసం దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్న చంద్రబాబు నేడు పేదలకు ఇళ్లస్థలాలు ఇస్తుంటే అడ్డుకునేందుకు తన బినామీలైన పెద్దగద్దల కోసం ఉద్యమం చేయడం సిగ్గుచేటన్నారు. గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షల్లో 33వ రోజు ఆదివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజధాని పేరిట మూడు పంటలు పండే భూములను సేకరించిన చంద్రబాబు అగ్రవర్ణాలకు ఒక ప్యాకేజీ, దళితులకు మరో ప్యాకేజీ ఇచ్చి మోసం చేశారని చెప్పారు. మాదిగ ఆరి్థక చైతన్య సమితి రాష్ట్ర అధ్యక్షుడు బేతపూడి సాంబయ్య మాట్లాడుతూ రాజధాని పూలింగ్‌కు బేతపూడిలో 60 సెంట్లు ఇచి్చన తనకు సామాన్య ప్యాకేజీ ఇచి్చన చంద్రబాబు అగ్రవర్ణాలకు అగ్ర ప్యాకేజీ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నేతలు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులరి్పంచారు. -
జగన్ సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి పరుగులు
సాక్షి, అమరావతి: రాష్ట్రాభివృద్ధి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో ఇలాగే పరుగులు తీస్తుందని, వచ్చే సాధారణ ఎన్నికల నాటికి నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి దృఢ విశ్వాసం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఘనంగా జరిగిన రాష్ట్రావతరణ దినోత్సవ వేడుకల్లో సజ్జల ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలంతా జగన్ వెనుక మడమ తిప్పని సైనికుల మాదిరిగా కలిసికట్టుగా ఉండాలని కోరారు. ప్రజలతో మమేకమై కర్తవ్యదీక్షతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పునరంకితం అవుదామన్నారు. టీడీపీ పాలనలో రాష్ట్రం అథోగతి పాలైందన్నారు. వైఎస్ జగన్ సారథ్యంలో ఏడాదిన్నరలో జరిగిన సంక్షేమ కార్యక్రమాల అమలుతో రాష్ట్రం మళ్లీ అభివృద్ధి పట్టాల మీదకు వచ్చిందని చెప్పారు. తొలుత సజ్జల జాతీయ జెండాను ఎగురవేశారు. తెలుగు తల్లి, పొట్టి శ్రీరాములు, మహాత్మాగాంధీ, దివంగత సీఎం వైఎస్సార్ చిత్రపటాలకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్యేలు.. సామినేని ఉదయభాను, వసంత కృష్ణప్రసాద్, జోగి రమేశ్, కేంద్ర కార్యాలయం ఇన్చార్జ్ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అభివృద్ధి యజ్ఞం
సాక్షి, అమరావతి: కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ, రాజకీయాలు, ఇవేవీ చూడకుండా ఎక్కడా వివక్షకు, అవినీతికి తావులేకుండా తమ 17 నెలల పాలన సాగిందని, ఇకముందు కూడా అదేవిధంగా కొనసాగుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో చదువు, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం కోసం సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని సగర్వంగా చెబుతున్నానన్నారు. తెలుగు వారందరికీ మంచి జరగాలని, గ్రామాల రూపురేఖలు మార్చాలన్న ఒక కలతో ముందుకు పరుగెత్తామని సీఎం పేర్కొన్నారు. మన తెలుగు రాష్ట్రంలో ఒక మహా యజ్ఞం జరుగుతోందని, దేవతల యజ్ఞానికే రాక్షసుల పీడ తప్పనప్పుడు, ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న మన ప్రభుత్వానికి ఆటంకాలు ఎదురుకాకుండా ఉంటాయా? అని జగన్ ప్రశ్నించారు. తెలుగు నేల మీద పుట్టిన కులాల కలుపు మొక్కలు మన పరువు ప్రతిష్టలను బజారుకీడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా తన క్యాంప్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి అనంతరం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జగన్ ఇంకా ఏమన్నారంటే.. గట్టిగా ఆలోచించాల్సిన అంశాలివి.. – నా వారు, కాని వారు అన్న ధోరణులు ఈ రోజుకీ బాహాటంగా రాజ్యాంగాన్ని, చట్టాలను అపహాస్యం చేస్తున్నాయి. ఇలాంటి ధోరణులను సమర్థించవచ్చా? – ప్రజల తీర్పును, ప్రజా ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటూ, వ్యక్తులు చేస్తున్న వ్యవస్థల మేనేజ్మెంట్ మొత్తంగా తెలుగు జాతి ప్రయోజనాలకు వేరు పురుగుగా మారింది. దీన్ని ఇలాగే కొనసాగిద్దామా? – తన వాడు గెలవలేదు, తమ వాడు పదవిలో, అధికారంలో లేడన్న కడుపు మంటతో నిత్యం అసత్యాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్న టీవీలు, పేపర్ల వ్యవహారాన్ని సమాచార స్వేచ్ఛ అందామా? వీటన్నిటిపైనా మనం గట్టిగా ఆలోచన చేయాలి. మహనీయుల త్యాగఫలం ఆంధ్రప్రదేశ్ – అమరజీవి పొట్టి శ్రీరాములు మహాత్యాగాన్ని స్మరించుకుంటూ, ఒక రాష్ట్రంగా మనల్ని మనం సమీక్షించుకుంటూ మరిన్ని అడుగులు ముందుకు వేసేందుకు ఈరోజు అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. – తెలుగువారికి రాష్ట్రం కావాలని 1952 అక్టోబర్ 19న పొట్టి శ్రీరాములు గారు నిరాహార దీక్ష ప్రారంభించడం, 58 రోజుల పాటు ఆ దీక్ష కొనసాగడం, 1952 డిసెంబర్ 15న ఆయన మన రాష్ట్రం కోసం అమరులు కావడం, 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం అవతరించడం, ఆ తర్వాత తెలుగు వారందరి ఉమ్మడి రాష్ట్రంగా 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడడం మనందరికీ తెలిసిన గొప్ప చరిత్ర. మన బంగారు భవిష్యత్తు కోసం ఎందరో త్యాగమూర్తులు చేసిన త్యాగ ఫలితం ఇది. నెరవేర్చాల్సిన పనులు కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి – 28 రాష్ట్రాల భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రం పడనంతగా, ఇన్ని త్యాగాల నడుమ కూడా ఇంతగా దగా పడిన రాష్ట్రం మనదే అని గుర్తుంచుకోవాలి. బయటివారి కత్తిపోట్లు, సొంతవారి వెన్నుపోట్లు వీటన్నింటితో తల్లడిల్లిన రాçష్ట్రం మనది. – నేటికీ రాష్ట్రంలో 33 శాతం మంది చదువు రానివారు ఉన్నారు. దాదాపుగా 85 శాతం ప్రజలు తెల్ల రేషన్‌కార్డులతో బీపీఎల్ దిగువన ఉన్నారు. – స్వయం సహాయక బృందాలలో చేరి దాదాపు 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలు నేటికీ సమరం చేస్తున్నారు. ఒక పంటకు కూడా కనీçస నీటి సదుపాయం లేని కోటి ఎకరాల భూములు ఇవాళ్టికీ మన రాష్ట్రంలో ఉన్నాయి. – ఆవాసం కోసం నేటికీ 32 లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. అలాగే పిల్లల చదువులు, కుటుంబసభ్యుల ఆరోగ్యం కోసం ఎన్నో కుటుంబాలు ఆస్తులు అమ్ముకుంటున్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి హక్కుగా దక్కాల్సిన సేవల కోసం కూడా దేబిరించాల్సిన పరిస్థితి ఉంది. – ఇలాంటి అనేక అంశాలు నెరవేర్చాల్పిన మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. కాబట్టే గ్రామ, గ్రామాన ప్రజల ఆకాంక్షలు, అవసరాలను వారిలో ఒకరిగా ఉండి, వారితో మమేకమై, వేల కిలోమీటర్లు కాలి నడకన ప్రయాణం చేసి సమస్యలు గుర్తించాం. ప్రతి అంశంపైనా దృష్టి పెట్టాం – మన గ్రామం, మన వ్యవసాయం, మన కుటుంబం, మన బడి, మన ఆస్పత్రి, మన వైద్య ఆరోగ్య రంగం, మన నీటి పారుదల రంగం వంటి ప్రతి ఒక్క అంశంపైనా.. అధికారంలోకి వచ్చిన తర్వాత దృష్టి పెట్టాల్సిన దానికన్నా మరింత వాస్తవిక ధృక్పథంతో దృష్టి పెడుతున్నాం. – గ్రామాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని సుపరిపాలన దిశగా కనీవినీ ఎరుగని విధంగా అడుగులు వేస్తున్నాం. చరిత్రలో లేని విధంగా మొత్తం వ్యవస్థలోనే మార్పులకు శ్రీకారం చుట్టాం. అందుకే ఈ ఫలితాలు – ఇప్పుడు ఒక గ్రామంలోకి ఒక వ్యక్తి అడుగుపెట్టిన వెంటనే, 2 వేల జనాభా కలిగిన ఆ గ్రామంలో గ్రామ సచివాలయం కనిపిస్తోంది. – ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ ఏర్పాటుతో ప్రతి ప్రభుత్వ సేవ ఈరోజు డోర్ డెలివరీ జరుగుతోంది. – నాలుగు అడుగులు వేస్తే అదే గ్రామంలో నాడు–నేడు కార్యక్రమంతో ఒక ఇంగ్లిష్ మీడియమ్ స్కూల్ రూపురేఖలు కనిపిస్తున్నాయి. –మరో నాలుగు అడుగులు ఇటువేస్తే.. ఏకంగా 51 రకాల మందులతో, ఏఎన్ఎం నర్సు, ఆశా వర్కర్లతో ఆరోగ్యశ్రీకి రెఫరల్‌గా వైఎస్సార్ విలేజ్ క్లినిక్ 24/7 సేవలు అందిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. –అటువైపు చూస్తే రైతు భరోసా కేంద్రాలు కనిపిస్తున్నాయి. విత్తనం నుంచి పంట అమ్ముకునే వరకు ప్రతి దశలోనూ రైతును చేయిపట్టి నడిపిస్తున్న ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. మరో నాలుగు అడుగులు వేస్తే జనతా బజార్లు కూడా కనిపించే విధంగా కార్యాచరణ జరుగుతోంది. ప్రజాబలం, దేవుడి ఆశీస్సులతో ముందుకుసాగుతాం.. – సమస్యలు ఉన్నాయి. సవాళ్లు కూడా ఉన్నాయి. అయినా మన ముందున్న కర్తవ్యం పవిత్రమైనది. లక్ష్యం ఉన్నతమైనది కాబట్టి ప్రజాబలంతో అందుకు మార్గం వేయగలమని, దేవుడి ఆశీస్సులతో అడుగులు ముందుకు వేయగలమనే నమ్మకం ఉంది. – ఇక మీదట మనందరి ప్రభుత్వం మన రాష్ట్రంలోని ప్రతి ఇంటి ఆత్మగౌరవం నిలబెట్టేలా వెరుపన్నది లేకుండా ముందుకు సాగుతుంది. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. పొట్టి శ్రీరాములు విగ్రహానికి సీఎం నివాళులు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆదివారం కోవిడ్–19 నిబంధనలను పాటిస్తూ రాష్ట్ర అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగు తల్లి, పొట్టి శ్రీరాములు చిత్రపటాలకు నమస్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ నందిగం సురేష్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహరాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు (కమ్యూనికేషన్స్) జీవీడీ కృష్ణమోహన్, సీఎం ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ తలశిల రఘురామ్, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌సవాంగ్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాల్లో పాల్గొన్న సీఎం జగన్
-
రాష్ట్ర అవతరణ ఉత్సవాలు
-
జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం ఉదయం 9.00 గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో జరిగే కార్యక్రమానికి హాజరై పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు ‘మా తెలుగు తల్లికి’ గీతాలాపన అనంతరం జాతీయ పతాకం ఎగురేశారు. అనంతరం తెలుగు తల్లికి, అమరజీవి పొట్టి శ్రీరాములుకు నివాళులు అర్పించారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక ఆయా జిల్లాల్లో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. జిల్లా మంత్రులు అందుబాటులో లేకపోతే జిల్లా ఇన్చార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో జాతీయ జెండా ఎగరేశారు. ప్రజల ఆనందకర జీవనమే ప్రభుత్వానికి విజయసూచిక -గవర్నర్ విశ్వభూషణ్ సాక్షి, అమరావతి: ప్రజల ఆనందకర జీవనమే ఏ ప్రభుత్వానికైనా విజయసూచికని.. ఆ మేరకు పాలన సాగాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. ప్రజలే ప్రాధాన్యతగా అమలు చేస్తున్న విధానాలను ప్రభుత్వం కొనసాగించాలి. సామాన్యుల కలలను సాకారం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని తన సందేశంలో గవర్నర్ పేర్కొన్నారు. (సీఎం జగన్ చరిత్రలో నిలిచిపోతారు) అంకితభావం, నిబద్ధతతో ముందుకెళదాం ప్రజలకు సీఎం జగన్ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు సాక్షి, అమరావతి: నేడు (నవంబర్ 1) రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పొట్టి శ్రీరాములుతోపాటు ఇతర స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు ఎంతగానో ప్రేరేపింపజేస్తున్నాయి. మహానుభావుల త్యాగాలను మననం చేసుకుంటూ.. వారిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం మనమంతా అంకితభావం, నిబద్ధతతో ముందుకెళదాం’ అని సీఎం పేర్కొన్నారు. తాడేపల్లి : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరిగాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. పార్టీ పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణ రెడ్డి, ప్రభుత్వ విప్ సామినేని ఉదయ భాను, ఎమ్మెల్యేలు జోగి రమేష్, వసంత కృష్ణ ప్రసాద్, తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ అవినాష్, నగర్ అధ్యక్షుడు భవ కుమార్, కార్యాలయ ఇంచార్జ్ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రతీక నవంబరు 1
బ్రిటిష్ ఇండియాలో భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం క్రీ.శ. 1910 నుండే భారతీయుల కృషి మొదలయ్యింది. 1912లో పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలులో జాతీయాభిమాని అయిన కొవ్వూరి చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ సభలు జరిగాయి. అప్పుడే కొండ వెంకటప్పయ్య పంతులు, జొన్నవిత్తుల గురునాథం తెలుగువారికి ప్రత్యేకరాష్ట్రం గురించి ఆలోచన మొదలుపెట్టారు. భోగరాజు పట్టాభి సీతారామయ్య వంటి స్వాతంత్య్ర సమరయోధులు, ఆచార్య మామిడిపూడి వెంకట రంగయ్య, సెనగపల్లి రామస్వామిగుప్త, మోచర్ల రామచంద్రరావు, పురాణం వెంకటప్పయ్య పంతులు, బి.యన్.శర్మ లాంటి మేధావులు తెలుగు భాష మాట్లాడేవాళ్ళందరికీ ఒక ప్రత్యేకరాష్ట్రం ఉండాలని, మద్రాసు ప్రెసిడెన్సీ నుండి విడిపోవాలని పోరాడారు. 1913 మే 20న బాపట్లలో సర్ బయ్యా నరసింహేశ్వరశర్మ అధ్యక్షతన జరిగిన సమగ్ర ఆంధ్రమహాసభలో ప్రత్యేక ఆంధ్రపై విస్తృతంగా చర్చ జరిగింది. పురాణం వెంకటప్పయ్య పంతులు ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర ప్రతిపాదనని బాపట్ల ఆంధ్రోద్యమ సభలో ప్రవేశపెట్టగా సమావేశమై ఉన్న 800 మంది ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఆ తరువాత జరిగిన ఆంధ్రోద్యమ సభలకు పానుగంటి రామారాయణింగారు, మోచర్ల రామచంద్రరావు, సర్వేపల్లి రాధాకృష్ణ పండితులు, సర్ విజయానంద గజపతి అధ్యక్షులుగా ఉండి ప్రత్యేక ఆంధ్రను బలపరిచారు. ఇందులో సర్వేపల్లి రాధాకృష్ణయ్య (ఆయన తెలుగులో అలానే సంతకం చేసేవారు) అధ్యక్షత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆయన ఆ సమయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా వున్నారు. ప్రత్యేక ఆంధ్రకు ప్రభుత్వం సుముఖంగా లేదు. స్వతహాగా మితవాది, ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండే విద్యాజీవి రాధాకృష్ణ పండితుడు సైతం ప్రత్యేక ఆంధ్ర ఆవశ్యకతని గుర్తించి ఆంధ్ర తీర్మానాన్ని బలపరిచే సభకు అధ్యక్షత వహించారు. అదే సభకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సర్ ముత్తా వెంకట సుబ్బారావు ముఖ్య అతిథి, సభాప్రారంభకులు. (చిరస్మరణీయుడు పొట్టి శ్రీరాములు) గుంటూరు నగరానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు ’దేశభక్త’ కొండ వెంకటప్పయ్య పంతులు 1940 వరకు జరిగిన ప్రత్యేక ఆంధ్రోద్యమానికి తన శక్తియుక్తులను సంపూర్ణంగా ధారపోశారు. కాంగ్రెస్, కమ్యూనిస్టు సహా జాతీయ రాజ కీయ పక్షాలన్నీ భాషాప్రయుక్తరాష్ట్రాలను బలపరిచాయి. కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్ర మహాసభ పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్ రాష్ట్రాన్ని కలిపి విశాలాంధ్ర ఏర్పడాలని, భాషా ప్రయుక్త రాష్ట్రాలు దేశ వ్యాప్తంగా ఏర్పడాలనీ ఉద్యమించారు. స్వాతంత్య్రం అనంతరం 1948లో నాటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో జరిగిన సైనిక చర్యతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమై హైదరాబాద్ రాష్ట్రంగా ఏర్పడింది. తరువాత కాలంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు, గాంధీజీ శిష్యులు అమరజీవి పొట్టి శ్రీరాములు 1952 అక్టోబర్ 19 నుండి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర డిమాండ్‌తో మహర్షి బులుసు సాంబ మూర్తిగారి యింటిలో మద్రాసులో ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించి డిసెంబర్ 15వ తేదీన ఆత్మార్పణ చేసుకున్నారు. వారి త్యాగాల ఫలితంగా నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కర్నూలు రాజధానిగా 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. గుంటూరులో హైకోర్టును ప్రారంభించి వికేంద్రీకరణకు నాడే బీజం నాటారు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా 11 జిల్లాలతో టంగుటూరి ప్రకాశం పంతులు ఎన్నికయ్యారు. తెలుగు ప్రజలందరూ ఒకే రాష్ట్రంలో ఉండాలనే బలమైన ప్రజల కోరికకు అనుగుణంగా 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయినారు. ఈవిధంగా మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. (నేడు ఘనంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు) తెలుగు జాతి ఐక్యంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ బలంగా ఉండాలని కోరుకున్న నేటి మన సీఎం వై.యస్. జగన్మోహన్ రెడ్డి నాడు సమైక్య ఉద్యమాన్ని బలపరుస్తూ పెద్ద ఎత్తున పోరాడారు. రాష్ట్రం బలంగా ఉంటేనే కేంద్రంతో పోరాడే శక్తి ఉంటుందని మన రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోగలమని భావించి తెలుగు ప్రజలతో మమేకమై సదస్సులు, బహిరంగ సభలు, నిరాహారదీక్షలు లాంటి బహుముఖ కార్యక్రమాలను వై.యస్.జగన్ నిర్వహించారు. అదే సమయంలో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు రెండు కళ్ళ సిద్ధాంతం అంటూ మోసపూరిత మాటలు చెబుతూ, ఒకవైపు ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని ఆమోదిస్తూ, మరొకవైపు సమైక్య ఉద్యమం బలపరుస్తున్నట్లు నటించారు. కాంగ్రెస్, బీజేపీలు ఏకమైన క్షణంలో తెలుగు జాతిని విచ్ఛిన్నం చేస్తూ 2014 జూన్ 2వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా కేంద్ర ప్రభుత్వం విడగొట్టింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తరచూ కాంగ్రెస్‌ని దుష్టకాంగీ అని అభివర్ణిస్తూ ఉండేవారు. ప్రముఖ కథారచయిత , ప్రబుద్దాంధ్ర పత్రికా సంపాదకులు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి తమ సంపాదకీయాలలో ‘కాంగ్రెస్ ఆంధ్రుల పాలిట నెత్తిమీద పిడుగు వంటిది. ఆంధ్రులకు ఎప్పటికయినా కాంగ్రెస్ చేటు తెస్తుంది’ అని స్వతంత్రానికి పూర్వమే హెచ్చరిస్తూ ఉండేవారు. ఆ మాటలను నిజం చేస్తూ పార్లమెంటు తలుపులను మూసి మరీ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రులను అవమానకరంగా విడదీసింది. ఆ తరువాత ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన చంద్రబాబు నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించకుండా.. అపాయింట్ డేగా ప్రకటించిన జూన్ 2ను నవ నిర్మాణదీక్షాదినంగా ప్రకటించి అమలు చేశారు. నేటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి నవంబర్ 1వ తేదీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించి అమలు చేయడం హర్షణీయం. మన సంస్కృతిని, మన పూర్వీకులు మనకు ఇచ్చిన గౌరవాన్ని కొనసాగించడాన్ని, తెలుగు ప్రముఖులను గౌరవించుకోవటానికి ఆంధ్రుల చరిత్రను స్మరించుకోవడానికి, రాబోవుకాలంలో దిశానిర్దేశాలు ఎంచుకోవటానికి గొప్ప అవకాశంగా నవంబర్ ఒకటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకుందాం. వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి వ్యాసకర్త చైర్మన్, మద్య విమోచన ప్రచార కమిటీ, రాష్ట్ర అధ్యక్షులు, జన చైతన్య వేదిక మొబైల్ : 99499 30670 -
అంకితభావం, నిబద్ధతతో ముందుకెళదాం
సాక్షి, అమరావతి: నేడు (నవంబర్ 1) రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన కార్యాలయం శనివారం ప్రకటన విడుదల చేసింది. ‘పొట్టి శ్రీరాములుతోపాటు ఇతర స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలు ఎంతగానో ప్రేరేపింపజేస్తున్నాయి.మహానుభావుల త్యాగాలను మననం చేసుకుంటూ.. వారిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం మనమంతా అంకితభావం, నిబద్ధతతో ముందుకెళదాం’ అని సీఎం పేర్కొన్నారు. ప్రజల ఆనందకర జీవనమే ప్రభుత్వానికి విజయసూచిక ప్రజల ఆనందకర జీవనమే ఏ ప్రభుత్వానికైనా విజయసూచికని.. ఆ మేరకు పాలన సాగాలని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆకాంక్షించారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు రాజ్‌భవన్ శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోంది. ప్రజలే ప్రాధాన్యతగా అమలు చేస్తున్న విధానాలను ప్రభుత్వం కొనసాగించాలి. సామాన్యుల కలలను సాకారం చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నా’ అని తన సందేశంలో గవర్నర్ పేర్కొన్నారు. -
'అందరికీ సంక్షమం దిశగా ఏపీ ప్రభుత్వం'
రాజ్‌భవన్ : ఆంద్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ర్ట ప్రజలకు ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలిపారు. క్షేత్రస్థాయిలో అందరికీ అభివృద్ధి ఫలాలు అందాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదలకు అవసరమైన సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని అభినందించారు. ప్రజలే ప్రాధాన్యతగా ప్రభుత్యం అమలు చేస్తున్న విధానాలను కొనసాగించాలన్నారు. పారదర్శకత, సుపరిపాలనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగాలని, సామాన్యుల కలలను సాకారం చేసేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కావాలని గవర్నర్ పేర్కొన్నారు. (సీఎం జగన్ వ్యక్తి కాదు.. వ్యవస్థ ) -
విజయవాడలో రెండొరోజు రాష్ట్రావతరణ వేడుకలు
-
రాష్ట్ర అవతరణ దినోత్సవం
-
వైభవంగా అవతరణ దినోత్సవం
-
రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో వైఎస్ జగన్, గవర్నర్
-
ఏపీకి గవర్నర్‌గా రావడం నా అదృష్టం
-
‘తెలుగు మంత్రిగా నాపైనా ఆ బాధ్యత ఉంది’
సాక్షి, ఢిల్లీ : దేశ రాజధానిలోని ఏపీ భవన్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ఆంధ్రకేసరి చిత్ర ప్రదర్శన, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిపాలన సౌలభ్యం కోసమే రెండు రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. విడిపోయామన్న భావన లేకుండా తెలుగువారంతా కలిసిమెలిసి ఉండాలి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్టుగానే తెలుగువారంతా రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడాలి. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఏపీకి సహాయం అందించాల్సిన బాధ్యత తెలుగుమంత్రిగా నాపైనా ఉందని వెల్లడించారు. అనంతరం కళాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి కార్యదర్శి ఐవి సుబ్బారావు, రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా, స్పెషల్ కమిషనర్ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు తల్లికి,తెలుగు నేలకు,తెలుగు వారికి వందనాలు
-
రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
-
ఆంధ్రప్రదేశ్ అవరతణోత్సవం
-
నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబర్ 1న నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజన అనంతరం గత చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికింది. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకోవాలో తెలియజేయాల్సిందిగా గత చంద్రబాబు ప్రభుత్వంలోని అధికారులు కేంద్ర హోం శాఖను కోరారు. దీనిపై కేంద్ర హోం శాఖ స్పందిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ఒరిజనల్ బ్రాండ్ ఇమేజ్ను కోల్పోకుండా ఉండాలంటే గతంలో లాగానే నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. దేశంలో విడిపోయిన నాలుగు రాష్ట్రాలు ఆ విభజన తేదీ నాడే అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయని, అసలు రాష్ట్రాలు మాత్రం పాత అవతరణ తేదీ నాడు దినోత్సవాలనే చేసుకుంటున్నాయని తెలిపింది. అయినా సరే చంద్రబాబు సర్కార్ గత ఐదేళ్లూ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించనే లేదు. దాని స్థానే జూన్ 2న నవనిర్మాణ దీక్ష పేరుతో కోట్ల రూపాయలను ప్రచారాలకు వెచ్చించింది. ఉత్సవాల నిర్వహణపై తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లపై సీఎస్ ఈ నెల 21న ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. -
‘ఏపీ అవతరణ’ తేదీ ఎప్పుడు?
‘‘తెలుగుజాతి మనది – నిండుగ వెలుగుజాతి మనది తెలంగాణ మనది – రాయలసీమ మనది సర్కారు మనది – నెల్లూరు మనది అన్నీ కలిసిన తెలుగునాడు – మనదే, మనదే మనదేరా’’! అలాంటి ప్రాచీనతా చరిత్ర గల తెలుగుజాతి పరస్పర పరిపాలనా సౌలభ్యం కోసం రెండు రాష్ట్రాలుగా (తెలంగాణ–ఆంధ్రప్రదేశ్) విడిపోయి అయిదేళ్ళు నిండి పోయాయి. కాగా విడిపోయిన సోదర తెలంగాణ రాష్ట్ర పాలకులు ఏటా జూన్ 2వ తేదీని తమ రాష్ట్రావతరణ దినోత్సవంగా ప్రకటించుకుని కడచిన అయిదేళ్లుగా వార్షికోత్సవాలు ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ, ఆగమేఘాల మీద రహస్యంగా ఢిల్లీ వెళ్లి ఆంధ్రప్రదేశ్ విభజనకు అంగీకారం తెల్పుతూ, ముఖ్యమంత్రి పదవి కోసం తహతహలాడుతూ కాంగ్రెస్ అధిష్టానం ఎదుట తెల్లకాగితంపై సంతకం చేసి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. దురదృష్టవశాత్తూ అధికారంలో ఉన్న గత అయిదేళ్లుగా ఏ ఒక్కనాడైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణోత్సవం జరిపిన పాపాన పోలేదు. యావత్ భారతదేశంలో నాటి స్వరాజ్య సమ రంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల అవతరణకు నాందీ ప్రస్తావన చేసిన త్యాగధనులు ఆంధ్రులేనన్నది చారిత్రక సత్యం. ఆ సత్యానికి నూనె పోసి, వత్తులు వెలిగించి, నిలిపి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అస్వతం త్రులుగా గడుపుతూ, మద్రాసీయులుగా అష్టకష్టాలు సహిస్తూ వచ్చిన ఆంధ్రుల గౌరవ ప్రతిష్టలు కాపాడేందుకు స్వతంత్ర భారత్‌లో తొలి సారిగా ఆమరణ దీక్షకు దిగి, ఆత్మబలిదానం ద్వారా ప్రత్యేకాంధ్ర రాష్ట్రాన్ని సాధించిన మహనీయుడు అమరజీవి పొట్టి శ్రీరాములు. ఆయన త్యాగనిరతిని కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం, నెహ్రూ ప్రభుత్వం గుర్తించకపోగా, తమిళనాడు నుంచి ఆంధ్ర విడిపోవడానికి అంగీకరిం చక తాత్సారం వహించిన ఫలితమే శ్రీరాములు బలవన్మరణం! ఆ అసమాన త్యాగఫలితంగా 1953 అక్టోబర్ 1న మద్రాస్ నగరం లేని ఆంధ్ర రాష్ట్రావతరణకు 20వ శతాబ్దపు గుంటనక్కగా నాటి రాజకీ యాల్లో ప్రసిద్ధిపొందిన చక్రవర్తుల రాజగోపాలాచారి ఎత్తుగడలకు నెహ్రూ సై అనడంతో మార్గం ఏర్పడింది. అమరజీవికి సైదోడుగా యావదాంధ్రలోకం ఒక్క గొంతుతో నినదించినదాని ఫలితమే ఇది. పరాయి పాలకుల కుట్రల ఫలితంగా చెల్లాచెదురైపోయిన ఆంధ్ర– తెలంగాణ ప్రాంతాల ఆంధ్రులను విశాలాంధ్రగా ఒక గొడుకు కిందికి చేర్చాలని ఆశించిన వాడు కూడా శ్రీరాములేనని మరవరాదు. యావత్ దక్షిణాంధ్రప్రజలకు శతాబ్దాలుగా తమ శ్రమజీవన సౌందర్యంతో తెలు గువారు దారిదీపాలై పెంచి మహానగరంగా రూపురేఖలు దిద్దిన మదరాసుతో కూడిన ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని అమరజీవి కోరుకున్నారు. ఎందుకంటే బళ్లారి నుంచి ఉత్తరాంద్ర సరిహద్దుల దాకా పక్కనున్న పొరుగు ఒడిశా ప్రాంతాల దాకా చెట్టుకొకరుగా, పుట్టకొకరుగా చెదిరి పోయిన ప్రాంతాలను, ప్రాంతీయ ఆంధ్రులను ఒక్కతాటిపైకి తేవడం ద్వారానే ఆంధ్రత్వానికి వ్యక్తిత్వమూ, పాలనా సౌలభ్యమూ సన్నిహిత మవుతాయని అమరజీవి ఆశించారు. ఆయన అనుపమానమైన త్యాగ ఫలితంగా (1953 అక్టోబర్ 1) దేశంలోనే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన సుదినం కాబట్టి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్టోబర్ ఒకటవ తేదీనే రాష్ట్రావతరణ దినోత్సవంగా జరపడం అన్నివిధాలుగా సబబుగా, శ్రేయస్కరంగా ఉంటుంది. పొట్టి శ్రీరాములు ఆత్మబలిదానా నికి నిండైన, మెండైనా నివాళిగా ఉంటుంది. ఇది ఒక్క మద్రాసు నగరానికి సంబంధించిన తెలుగువారి ఆనాటి గోడు మాత్రమే కాదు, చారిత్రకంగా తమిళనాడుతో ఆంధ్రులకు, ఆంధ్ర పాలకులకు ఉన్న అనుబంధాన్ని సమీక్షించుకుంటే.. తమిళ భూభాగం లోని తంజావూరు, మదుర, చెంచి రాజ్యాల్లో తమిళుల ఆదరాభిమా నాలు పొందుతూ తెలుగు పాలకులుగా ఖ్యాతికెక్కినవారు తెలుగు నాయకరాజులేనని మరవరాదు. వీరు తెలుగులో పరిపాలన నిర్వహించ డమే కాకుండా ప్రధానమతాల (హిందూ, క్రైస్తవ, మహమ్మదీయ) మధ్య సమన్వయాన్ని సమతుల్యంతో కాపాడారు. వీరే గాకుండా మరాఠా రాజులు తంజావూరు ఏలికలైనప్పుడు కూడా తెలుగు కవి త్వాన్ని ఆదరించి, తెలుగు సాహిత్య పోషణకు దోహదం చేశారు, ఆ రోజుల నుంచి పరాయి పాలకుల శకం ముగిసేదాకా తెలుగు ప్రము ఖులలో దక్షిణాంధ్ర దారిదీపాలుగా (నా పాత్రికేయ సహచరులు, ఆకాశ వాణి ప్రయోక్త నాగసూరి వేణుగోపాల్‌కు కృతజ్ఞతతో) ఉన్న మహనీ యులు ఎందరో! అమరజీవి బలిదానానికి, ఆయన పోరాట చరిత్రకు సంబంధించిన ఈతరం వారికి తెలియని పలు అంశాలను తెలియజేస్తూ ‘బలిదానం’ పేరిట వెలువడిన రచన కూడా ఈ తరానికి దారిదీపమే. ఈ సందర్భంగా మదరాసు నగరం పూర్తిగా తమిళులకే గానీ ఆంధ్రులకు ఏమాత్రం చెందదని ఆనాడు వాదించి ఆంధ్రనాయకుల వాదనను కొందరు పూర్వపక్షం చేస్తున్న రోజులలోనే సర్ శంకరన్ నాయర్ అనే తమిళ నాయకుడు మద్రాస్ శాసనమండలిలో (1936) తమిళులకు సంపూర్ణ స్వపరిపాలనా ప్రభుత్వం కావాలని కోరిన సందర్భంలోనే ఒక విస్పష్ట ప్రకటన చేశాడు. ‘ఏర్పర్చబోయే తమిళ ప్రత్యేక రాష్ట్రం పాలనా పరిధి నుంచి మద్రాసు నగరాన్ని వేరు చేయాలి. ఎందుకంటే, మద్రాసు నగరం పూర్తిగా తమిళనాడులో లేదు గనుక, సగం తమిళభాషీయులదైతే, మిగతా సగం మద్రాసు తెలుగు ప్రాంతీ యులదీ‘ అని నిండు పేరోలగంలో ప్రకటించారాయన. (ఆంధ్రోద్యమ నాయకులలో ఒకరైన గుమ్మడిదల వెంకటసుబ్బారావు రచించిన ‘హిస్టరీ ఆఫ్ ఆంధ్రా మూవ్మెంట్‘ వాల్యూం–2, పేజీ 505)! ఈ చరిత్ర పూర్తిగా తెలిసి ఉన్న వాడు కాబట్టే అమరజీవి శ్రీరాములు ఆనాడు ఆ సగ భాగంలో భారీ సంఖ్యలో ఉన్న దక్షిణాంధ్రులకు పూర్తి నిలయంగా ఉన్న మద్రాసు నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు తపన పడ్డారు. ఆ మాట కొస్తే తమిళనాడు ఏలికలుగా ఉన్న తెలుగువారు ఒకరా, ఇద్దరా, ఎందరో! 1920–2016 మధ్య కాలంలో తమిళనాడుకు 12 మంది తెలుగు ముఖ్యమంత్రులే ఉన్నారు. తమిళనాడులో ఉన్న ‘తమిళాంధ్ర పార్టీ’ విడుదల చేసిన సాధికార సమాచారం ప్రకారం ‘క్రీస్తు శకం ఒకటో శతాబ్దికి పూర్వం నుండీ తమిళనాడులోని తెలుగువారు దాదాపు అక్కడి స్థానికులే. అక్కడ పుట్టి, అక్కడ పెరిగి, అక్కడి పొలాల్ని దున్ని, వ్యాపారాలు చేసి అక్కడి సంపదను పెంచినవారు, అక్కడి సంస్కృతిని, తమిళాన్ని వికసింపజేసి పలు రకాల కళల్ని అభివృద్ధి పరిచినవారే’’. అంతేగాదు, మరోమాటలో చెప్పాలంటే, తమిళనాడులోని 30 జిల్లాల్లో తెలుగు లేని జిల్లా లేదు, అలాగే మొత్తం 165 తాలూకాల్లో తెలుగు పల్లెలు లేని తాలూకాయే లేదు. చివరికి ‘సంగం’ యుగం గురించి తమిళ సోదరులు ఎంత గొప్పగా చెప్పుకున్నా వారిలో సంగం యుగ కవుల్లో భాగమైన ఆళ్వా రులు వంటి కవుల్లో అత్యధికులు తెలుగువారై ఉండి, తమిళ రచనలూ చేసి ప్రసిద్ధికెక్కినవారే. ఈ సమన్వయ ప్రతిభ గల వారు కాబట్టే జస్టిస్ ఆవుల సాంబశివరావు, జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్ భాషా ప్రయుక్త రాష్ట్రాల వల్ల దేశ సమైక్యతకు ఆటంకం కాలేదనీ, ప్రాంతీయ దురభిమానాలనూ నిస్సారమైన కేంద్రీకరణ (సెంట్రలైజేషన్) వాదాన్నీ కాక, ఆచరణ యోగ్యమైన ఫెడరల్ (సమైక్య) రాజ్యాంగ వ్యవస్థ దృఢమైన పునాదులు నిర్మించుకోవాలనీ, అఖండ భారతజాతి ఏకతా భావానికి అదే రక్షణ అనీ స్పష్టం చేయవలసి వచ్చింది. 1905 నాటి బెంగాల్ విభజనకు ముందే, 1904 నాటి గుంటూరు యువజన మహాసభ, ఆ తర్వాత బయ్యా నరసింహశాస్త్రి అధ్యక్షతన బాపట్ల మహాసభ మొదలు అమరజీవి శ్రీరాములు ప్రాణత్యాగం దాకా, ఆంధ్ర రాష్ట్రావతరణకు, స్వపరిపాలనకు ఆంధ్ర దేశమంతటా మహోద్య మాలు ఉవ్వెత్తున కొనసాగుతూనే వచ్చాయి. వాటి ఫలితమే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం అవతరణ. ఈ మహోద్యమాలలో అంతర్భాగంగానే మద రాసులోని ‘ఆంధ్ర పత్రిక’ స్థాపకులు పండిత కాశీనాథుని నాగేశ్వర్రావు బస చేసిన ‘శ్రీబాగ్’ (నివాసం పేరు)లో ఆనాటి కోస్తా, రాయల సీమాంధ్ర నేతల మధ్య రాయలసీమ వెనుకబాటు తనానికి పరిష్కారం ప్రాతిపదికపైన ప్రత్యేక ఒడంబడిక కుదిరి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఈ ఒప్పందంలోని అంశాలు సంపూర్ణమైన పరిష్కారం కోసం ఈ రోజుకీ ఉభయ ప్రాంతాల నాయకుల మధ్య సంప్రతింపుల పర్వం నడుస్తూనే ఉంది. పెక్కుమంది రాష్ట్ర నాయకులు తమ వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాటకు ప్రాధాన్యమిచ్చి, ఒప్పం దంలోని ప్రధానాంశాల అమలుపై కేంద్రీకరించి ఆయా ప్రాంతాల కరువు ప్రాంతాల సమస్యల పరిష్కారానికి సమన్వయపూర్వక వైఖరిని ప్రదర్శించక పోవడంవల్లనే ప్రజలు ఆందోళన చెందవలసి వస్తోంది. కనుకనే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, సీమ ప్రాంత సమస్యలు ఉన్నాయి. రాయలసీమ కరువు ప్రాంతానికి ఆర్థిక రాజధాని అవసరమని, దర్శి, కనిగిరి, పొదిలి, దొనకొండ, మార్కాపురం, కంభం, గిద్దలూరు ప్రాంతాల మధ్య అతి తక్కువ సమయంలోనే ఆర్థిక–వాణిజ్య రాజధాని (ఫైనాన్షియల్ కాపిటల్) అభివృద్ధి కాగలదని పలువురు ప్రజా ప్రతిని ధులు భావిస్తున్నారు. తద్వారా ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచే అవకాశమూ దొరుకుతుందన్నది వారి విశ్వాసం. ఇలా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలోనూ రకరకాల సమస్యలను ప్రజలు ఎదు ర్కొంటున్నారు. అన్ని ప్రాంతాలలోనూ పూర్తయిన ప్రాజెక్టులకన్నా, పూర్తి కాని లేదా పదే పదే శంకుస్థాపన దశలు దాటని ప్రాజెక్టుల సంఖ్య పెరిగిపోతోంది. అలాంటి పరిస్థితులలోనే ప్రాంతీయవాదాలూ, ఆందో ళనలూ పెరుగుతుంటాయి. కనుకనే నదీ జల వివాదాలు, పంపిణీ విధానాలూ కొన్ని జల వివాద ట్రిబ్యునళ్ల వివాదాస్పద తీర్పులవల్ల కూడా ప్రాంతీయ తగాదాలు పెచ్చరిల్లుతున్నాయి. వీటన్నిటినీ ఏపీ నూతన మంత్రివర్గం, సీఎంగా జగన్ చైతన్యవంతమైన సారథ్యంలో సామరస్యంగా పరిష్కరించడం సాధ్యమనే విశ్వాసం ప్రజలకు ఉంది. ఈ పురోగమనంలో అంతర్భాగంగానే అమరజీవి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కొనసాగింపుగా విశాలాంధ్ర విభజనానంతరం ఏర్పడిన ఏపీకి ఏటా అక్టోబర్ ఒకటవ తేదీని రాష్ట్రా వతరణ దినోత్సవంగా జరుపు కోవడం సకల విధాలా శ్రేయస్కరమని ప్రతిపాదన. పైగా రాయలసీమకు ముఖ ద్వారమైన కడప కేంద్రంగా అనేక ప్రత్యేకాంధ్ర మహాసభలూ జరిగాయని మరవరాదు. ప్రతి పాలకుడూ ’కర్పూర వసంతరాయలు’ కాకపోవచ్చు! కానీ పాలకుడు ప్రజాహితుడైతే మాత్రం కర్పూర ఘుమఘుమలు నలుదిక్కులా వ్యాపించి, సంక్షేమ కార్యాచరణతో నిత్యవసంతాన్నే ప్రజలకు పంచగలుగుతాడు. ఏబీకే ప్రసాద్,సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
స్తంభించిన ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలు
ఆరు నెలలుగా నిలిచిన ప్రచారం సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (టీసాక్స్)లో కార్యక్రమాలు స్తంభించాయి. ఎయిడ్స్‌పై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాల్సి ఉండగా ఆరు నెలలుగా నిలిచిపోయాయి. దీంతో ఎయిడ్స్ రోగులకు అవగాహన కల్పించే పరిస్థితి లేకుండా పోయింది. ఎయిడ్స్‌పై దృష్టిపెట్టాల్సిన ఆ సంస్థ నిర్లక్ష్యం నీడలో ఉందన్న ఆరోపణలున్నాయి. మరోవైపు అందులో పనిచేసే 800 మంది ఉద్యోగులకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. స్వచ్ఛంద సంస్థలకు నిధులు ఇవ్వకపోవడంతో వాటి పనితీరూ మందగించింది. రెగ్యులర్ ప్రాజెక్టు డెరైక్టర్ లేకపోవడంతో ఈ పరిస్థితి దాపురించిందనే విమర్శలున్నాయి. ఇన్చార్జి పీడీకి కుటుంబ సంక్షేమ కమిషనర్‌గా పూర్తిస్థాయి బాధ్యతలుండటంతో ఎయిడ్స్ నియంత్రణపై దృష్టి సారించడం లేదనే విమర్శలున్నాయి. ఏపీ ఖజానాలో నిధుల జమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (ఏపీసాక్స్)ను పదో షెడ్యూల్లో చేర్చడంతో ప్రస్తుతం ఏపీ సాక్స్‌పై ఉన్న ఖాతా టీసాక్స్ పేరిట బదలాయించారు. అదే సమయంలో ఏపీలో కొత్తగా మరో సాక్స్‌ను ఇంకా నెలకొల్పకపోవడంతో నిధుల వినియోగంపై సమస్యలు మొదలయ్యాయి. కేంద్రం నుంచి రూ. 26.86 కోట్ల నిధులు మొదటి విడతగా విడుదలైనా వాటిని ఏపీ ఖజానాలో జమ చేయడంతో చిక్కు వచ్చిపడింది. టీసాక్స్లోకి రూపాయి కూడా కేంద్రం నుంచి అందలేదు. దీంతో అనేక కార్యక్రమాలు మూలన పడ్డాయి. గత నాలుగైదు నెలలుగా హెచ్ఐవీ, సీడీ4 వంటి నిర్ధారణ పరీక్ష కిట్ల సరఫరా నిలిచిపోయినట్లు తెలిసింది. -
ఆ అధికారం బాబుకు ఎవరిచ్చారు
రాష్ట్ర అవతరణ దినోత్సవం మార్పుపై ప్రముఖుల నిలదీత విశాఖపట్నం: రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని మార్చే అధికారం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎవరిచ్చారని విశ్రాం త ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, నాగార్జున యూనివర్సిటీ మాజీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ బాలమోహన్‌దాస్, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి ప్రశ్నించారు. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. తెలుగుజాతి విచ్ఛిన్నమైన రోజును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం చారిత్రక తప్పిదమన్నారు. 2014జూన్ 2న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిందని, అది తెలుగుజాతి ఐక్యతాజ్యోతి కొడిగట్టిపోయిన రోజు అని గుర్తించాలన్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రజల దృష్టిలో జూన్2 ఎంతో అవమానకరమైన, అన్యాయంగా, అక్రమంగా, అసమతుల్యంగా విభజన జరిగిన రోజని సమైక్యవాదులు భావిస్తున్నారని చెప్పారు. తెలుగుప్రజల మనోభావాలను కించపరిచే విధంగా జూన్2 ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా ప్రకటించడం దుర్మార్గపు చర్యన్నారు. తెలుగు ప్రజల ఐక్యత కోసం పోరాడిన రోజుని మార్చడం ప్రజాస్వామ్య విరుద్ధమన్నారు. అంతకీ మార్చాలనుకుంటే 1953 అక్టోబర్ ఒకటిన రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు బలిదానం అయిన రోజుకైనా మార్చుకోవాలే తప్ప ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్రను తిరగరాయాలని భావించడం క్షంతవ్యం కాదన్నారు. ప్రజల ఆగ్రహానికి గురికాకముందే తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని పునఃపరిశీలించి నవంబర్ ఒకటినే ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టిన చంద్రబాబు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ప్రకటించడానికి ఎందుకు ప్రజాభిప్రాయసేకరణ చేపట్టలేదో తెలపాలన్నారు. బెల్టుషాపులు వద్దంటూనే.. డిస్టిలరీలా... బెల్టుషాపులు వద్దంటూనే మరో వైపు ప్రభుత్వ ఆదాయం కోసం మద్యం డిస్టిలరీలను విపరీతంగా విడుదల చేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మద్యం ఉత్పత్తులకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది తప్ప..వేరొకటి లేదన్నారు. ప్రభుత్వ ఆదా యం కోసం మంత్రి యనమల రామకృష్ణుడు లిక్కర్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ భావాలను గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఎక్సైజ్ ఆదాయంలో కనీసం ఒక శాతం మద్యం దుష్ఫలితాలపై ప్రచార కార్యక్రమాలకు కేటాయించాలని, రాష్ట్రం అదనంగా ఉత్పత్తి చేస్తున్న మద్యంను వెంటనే నిలిపివేయాలని పలు డిమాండ్లు చేశారు. సమావేశంలో ఏఆర్టీసీ సంస్థ ప్రతినిధి ప్రగడ వాసు తదితరులు పాల్గొన్నారు. -
ఆ రోజున అవతరణ దినోత్సవం చేస్తారా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం తేదీ మార్చడాన్ని పలువురు నేతలు ఖండించారు. నవంబర్ 1నే రాష్ట్ర అవతరణ దినంగా కొనసాగించాలని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి. లక్ష్మణ్ రెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు సంఘం నేత నాగిరెడ్డి, విశాలాంధ్ర మహాసభ ప్రధాన కార్యదర్శి చేగొండి హరిరామజోగయ్య డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజలు బాధతో ఉన్న రోజును ఏపీ అవతరణ దినోత్సంగా ఎలా జరుపుతారని ప్రశ్నించారు. 13 జిల్లాల ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర అవతరణ దినోత్సవం జరిపించాలని సూచించారు. జూన్ రెండో తేదీన ఆంధ్రప్రదేశ్ అవరతరణ దినంగా పాటించాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. -
'ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలి'
హైదరాబాద్ : రాష్ట్రావతరణ వేడుకలపై టీడీపీ సర్కార్ నిర్ణయం రాష్ట్ర ప్రజలను ఆవేదనకు గురి చేసిందని వైఎస్ఆర్ సీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకల్లో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధర్మాన మాట్లాడుతూ ప్రభుత్వం బేషజాలకు పోకుండా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు. అవతరణ వేడుకలపై వైఎస్ఆర్ సీపీ నిర్ణయాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వాగతిస్తున్నారని ఆయన అన్నారు. వైఎస్ఆర్ సీపీ నేత లక్ష్మీపార్వతి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29 అని, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు 1996 సెప్టెంబర్ 1న ప్రమాణ స్వీకారం చేశారన్నారు. మరి చంద్రబాబు టీడీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా మార్చాలి కదా? ఎందుకు మార్చలేదని ప్రశ్నించారు. -
'రాష్ల్రావతరణపై బాబుది ఏకపక్ష నిర్ణయం'
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏకపక్షంగా ఎలా నిర్ణయిస్తారని రఘువీరా ప్రశ్నించారు. వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి అన్ని పార్టీలు, మేథావుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే దీనిపై ముందుకు వెళ్లాలని ఆయన శనివారమిక్కడ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలను ప్రభుత్వం జూన్ 2వ తేదీన నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని రఘువీరా తప్పుబట్టారు. తక్షణమే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలన్నారు. -
వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రాష్ట్రావతరణ వేడుకలు
కర్నూలు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కర్నూలు వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో రాష్ట్రావతరణ వేడుకలు జరిగాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయిరెడ్డి, పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మణిగాంధీ, ఎస్వీ మోహన్ రెడ్డి, గౌరు చరిత తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగానే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని జిల్లాల్లో రాష్ట్ర అవతరణ వేడుకలను వైఎస్ఆర్ సీపీ జరుపుతుందని తెలిపారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు జూన్ 2న నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
జూన్ 2న ఏపీ అవతరణ దినోత్సవం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జూన్ 2న జరపాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని కోసం భూసేకరణపై ప్రధానంగా చర్చ జరిగింది. 60:40 నిష్పత్తిలో భూసమీకరణ చేపట్టాలన్న వచ్చిన ప్రతిపాదనపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. అవసరమైన మేరకు ఉద్యోగ బదిలీలు చేసేందుకు మంత్రులకు సీఎం చంద్రబాబు స్వేచ్ఛ నిచ్చారు. కేబినెట్ నిర్ణయాలు కేంద్రం నుంచి అదనపు తుపాను సహాయం కోసం అభ్యర్థన న్యాయసలహాకు డీఆర్ డీఏ ఏర్పాటు ఫైల్ ఏపీ డ్రైవర్లకు రూ. 5 లక్షల వరకు బీమా కల్పన శనగ పంట క్వింటా రూ. 3100లకు కొనుగోలు ధరల నియంత్రణకు మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పరిటాల సునీతలతో కమిటీ ఏర్పాటు నవంబర్ 2న ఎర్రన్నాయుడు వర్థంతి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహణ -
సమైక్యంగానే ఉందాం
అన్నానగర్, న్యూస్‌లైన్: ఎన్ని సమస్యలు, సంక్షోభాలు ఎదురైనా మనమంతా సమైక్యంగానే ఉండాలని నగరానికి చెందిన తెలుగు ప్రముఖులు తీర్మానించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా మైలాపూర్ పొట్టి శ్రీరాములు స్మారక మందిరంలో ఏర్పాటు చేసిన ‘ఆంధ్రప్రదేశ్ అవతరణ నేపథ్యం’ అనే అంశంపై ఏరాపటుచేసిన కార్యక్రమంలో పలువురు వక్తలు ఉపన్యసించారు. ఈఎస్ రెడ్డి మాట్లాడుతూ మద్రాసు ప్రెసిడెన్సీలో శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పు గోదావ రి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలో మాత్రమే ఉండేవని గుర్తుచేశారు. మద్రాసు ప్రెసిడెన్సీలో తమిళుల ప్రాబల్యం అధికంగా ఉండడంతో ఆంధ్రుల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించాలనే కోరికను బలపరిచిందని తెలియజేశారు. ఫలితంగా 1912 మే నెలలో నిడదవోలులో మొట్టమొదటి సారిగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ప్రతిపాదన చేశారన్నారు. 1913 మే 20న గుంటూరు జిల్లా బాపట్లలో సమగ్ర ఆంధ్ర మహాసభ జరిగిందన్నారు. ఇందులో భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రముఖ పాత్ర పోషించి ప్రజాభిప్రాయాన్ని సేకరించారని తెలియజేశారు. 1914న విజయవాడ, కాకినాడల్లో జరిగిన రెండు, మూడు ఆంధ్ర మహాసభల్లో భోగరాజు, కొండా వెంకటప్పయ్య కలిసి భారత రాష్ట్రాల పునర్నిర్మాణంపైన కరపత్రాలను రూపొదించి దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ వాదులకు పంచారని పేర్కొన్నారు. దీంతో 1914లో మద్రాసులో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో ప్రత్యేకాంధ్రపై తొలిసారిగా జాతీయ స్థాయి చర్చ జరిగిందన్నారు. మొదటి నుంచీ చిన్నచూపే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో జాతీయ నాయకులు అందరూ తొలి నుంచి చిన్నచూపే చూశారని రెడ్డి విమర్శించారు. నెహ్రూ, పటేల్‌పై నిరంతర ఒత్తిడి తేవడం వల్ల 1949లో కాంగ్రెస్ జేవీపీ కమిటీని ఏర్పాటు చేసి మద్రాసును ఆంధ్రులు వదులుకునే పక్షంలో ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తామని షరతు విధించారన్నారు. టంగుటూరి ప్రకాశం, బెజవాడ గోపాలరెడ్డి, కళా వెంకటరావు, నీలం సంజీవరెడ్డి తదితరులు దీన్ని వ్యతిరేకించారన్నారు. గొల్లపూడి సీతారామశాస్త్రి 35 రోజులు చేసిన ఆమరణ దీక్ష సైతం జాతీయ నాయకులను కరిగించలేకపోయిందన్నారు. 1952లో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో రాజాజీ మద్రాసు ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రి అయినా కృష్ణా-పెన్నా ప్రాజెక్టు వివాదంలో చిక్కుకున్నారన్నారు. దీంతో ఆంధ్రులకు మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోవాలనే కోరిక పూర్తిగా బలపడిందని చెప్పారు. ఆంధ్రులకు మద్రాసులో జరుగుతున్న అన్యాయాన్ని నిరసి స్తూ పొట్టి శ్రీరాములు దీక్షకు దిగి మరణించడంతో హింసాత్మక సంఘటనలు చెలరేగడం నెహ్రూకు దడ పుట్టించిందన్నారు. ఈ సంఘటనలతో నెహ్రూ 1952 డిసెంబరు 19న ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటించారన్నారు. ఆ విధంగా ఆంధ్రాలో ధైర్యంతో ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించారన్నా రు. తెలుగువారికి తొలుత శ్రీకాకుళం, కర్నూలు, అమరావతి రాజధానులుగా ఉండేవన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బషీర్, రామకృష్ణ, జేకే రెడ్డి, నాగరాజు, నాగసూరి వేణుగోపాల్, జీవీఎస్సార్ కృష్ణమూర్తి, రచయిత్రి ఆముక్త మాల్యాదులు పాల్గొన్నారు. -
బాసటగా ఉంటాం కలెక్టర్ సిద్ధార్థజైన్
ఏలూరు, న్యూస్‌లై న్ : జిల్లా రైతులకు అన్నివిధాలా బాసటగా నిలుస్తామని జిల్లా కలెక్టర్ సిద్ధార్థజైన్ భరోసా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో శుక్రవారం నిర్వహించిన సభలో జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ స్ఫూర్తితో జిల్లా సమగ్రాభివృద్ధికి, పేదలను ఆదుకునే సంక్షేమ పథకాల అమలులో ముందడుగు వేసేందుకు జిల్లా యంత్రాంగం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. ఉచిత విద్యుత్, పంట రుణాలు, సాగునీటి సరఫరా, పంటలకు మద్దతు ధర వంటి అంశాల్లో రైతులకు జిల్లా యంత్రాంగం అండగా నిలుస్తుందన్నారు. ప్రస్తుత ఖరీఫ్‌లో రూ.3,114 కోట్లను పంట రుణాలుగా అందించామని చెప్పారు. 1.24 లక్షల మంది కౌలు రైతులకు రుణార్హత కార్డులను అందించామన్నారు. ఈ ఏడాది 54వేల మంది కౌలుదారులకు రూ.132 కోట్లను రుణాలు ఇచ్చామని చెప్పారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను కోలుకోలేని దెబ్బ తీశాయని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం 1 లక్షా 47 వేల 500 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. నష్టపోరుున రైతులందరినీ ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పండించిన ప్రతి గింజకు గిట్టుబాటు ధర అందించేందుకు 100 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ వివరించారు. డెల్టా ఆధునికీకరణకు రూ.1,464 కోట్లు : సాగునీరు సక్రమంగా పంపిణీ అయ్యేందుకు, లోతట్టు ప్రాంతాలను ముంపు బారినుంచి కాపాడేందుకు రూ.1,464 కోట్లతో చేపట్టిన డెల్టా ఆధునికీకరణ పనులను వేగవంతం చేస్తామని సిద్ధార్థజైన్ చెప్పారు. కొల్లేరు ప్రాంతాన్ని ముంపునుంచి రక్షించేందుకు రూ.12కోట్లతో ఇన్ఫాలింగ్ డ్రెయిన్లు, రూ.81 కోట్లతో యనమదుర్రు డ్రెయిన్, రూ.87 కోట్లతో ఎర్రకాల్వ అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. పేదలకు మెరుగైన వైద్యసేవలు, మాతా శిశు మరణాలను మరింతగా తగ్గించేందుకు, గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ప్రతి ఇంటికి మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలన్న సంకల్పంతో నిర్మల్ భారత్ అభియాన్ పథకం కింద జిల్లాలో 75 వేల కుటుంబాలకు వాటిని నిర్మించేందుకు కార్యాచరణ అమలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం రూ.75 కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. పాల ఉత్పత్తిని పెంచేందుకు రాష్ట్ర కృషి వికాస యోజన, పశుక్రాంతి పథకాల కింద రూ.77 లక్షల సబ్సిడీతో 250 పాడి పశువులను అందించినట్టు చెప్పారు. పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్న దృష్ట్యా విద్యార్థులు మంచి మార్కులతో నూరు శాతం ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు. జారుుంట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు, ఎస్పీ ఎం .రమేష్, డీఆర్వో కె.ప్రభాకరరావు, విజిలెన్స్ ఎస్పీ ఎం.నారాయణ, గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు బి.చ ంద్రారెడ్డి, ఆర్డీవోలు బి.శ్రీనివాస్, గోవిందరావు, డీపీవో అల్లూరి నాగరాజు వర్మ, జెడ్పీ సీఈవో వి.నాగార్జునసాగర్, తహసిల్దార్ ఏజీ చిన్నికృష్ణ, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఎం.లక్ష్మీనారాయణ, వ్యవసాయ శాఖ జేడీ వీడీవీ కృపాదాస్, డీఎస్వో డి.శివశంకర్‌రెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏడీ కె.శ్రీనివాస్ శర్మ, ప్రణాళిక శాఖ జేడీ కె.సత్యనారాయణ, పంచాయతీరాజ్ ఎస్ఈ కె.వేణుగోపాల్, డీఈవో నరసిం హరావు, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ కె.జ్ఞానేశ్వరరావు, డ్వామా పీడీ ఎన్.రామచంద్రారెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎన్వీవీ సత్యనారాయణ, హౌసిం గ్ పీడీ జి.సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్ ఈడీ పెంటోజీరావు, మెప్మా పీడీ వీవీ శేషారెడ్డి, సెట్వెల్ సీఈవో ఎండీహెచ్ మెహర్రాజ్ పాల్గొన్నారు. -
వేడుకలు వెలవెల
సాక్షి, నెట్వర్క్: తెలంగాణలో శుక్రవారం రాష్ట్ర అవతరణ వేడుకలకు నిరసన సెగ తగలింది. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు దూరంగా ఉండటంతో సభా ప్రాంగణాలు వెలవెలబోయాయి. అయితే టీఆర్ఎస్ అవతరణదినాన్ని ‘బ్లాక్ డే’గా ప్రకటించగా.. ఉద్యోగుల జేఏసీ నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలిపింది. టీఆర్ఎస్, టీజేఏసీ, టీఎస్‌జేఏసీ, టీఎన్జీవోస్, తెలంగాణ జాగృతి సంస్థలతోపాటు తెలంగాణ ఉద్యమ సంస్థల ఆధ్వర్యంలో విద్రోహదినంగా పాటిస్తూ నల్లజెండాలు ఎగురవేశారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తెలంగాణవాదులు పలుచోట్ల పలు ప్రభుత్వ కార్యాలయాలపై నల్లజెండాలను ఎగురవేశారు. అన్ని జిల్లాల్లో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్‌లో కలెక్టర్ అహ్మద్ బాబు, జేసీ సుజాత శర్మ, ఎస్పీ భూపాల్ వేడుకల్లో పాల్గొనగా, పరేడ్ గ్రౌండ్లో జనం లేకున్నా కలెక్టర్ ప్రసంగించారు. నిజామాబాద్‌లో టీఎన్జీవోస్ భవన్ ఎదుట ఉద్యోగ జేఏసీ నాయకులు, జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు నల్ల జెండాలను ఆవిష్కరించారు. ఆర్మూర్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, నాగిరెడ్డిపేటలో ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి నల్లజెండాలను ఎగుర వేశారు. జిల్లా కేంద్రంలో అవతరణ వేడుకల్లో జనాలు లేక గ్యాలరీలు బోసిపోగా కలెక్టర్ ప్రద్యుమ్న జాతీయ జెండాను ఆవిష్కరించారు. కరీంనగర్లోనూ ఇదే పరిస్థితి. ఇన్చార్జి కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ తూతూమంత్రంగా కార్యక్రమాన్ని ముగించారు. వరంగల్‌లో కలెక్టర్ కిషన్ కలెక్టరేట్లో జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవానికి వెళ్తుండగా విద్యార్థులు ఆయన వాహనానికి అడ్డుగా వెళ్లారు. హన్మకొండ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 300 మీటర్ల భారీ నల్లజెండాతో మానవహారం ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా న్యాయవాదులు, ఉద్యోగులు నల్లజెండా ఆవిష్కరించి అవతరణ దినోత్సవాలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. భూపాలపల్లి సింగరేణిలో బొగ్గుబావుల వద్ద టీ బిజీకేఎస్ ఆధ్వర్యంలో నల్లజెండాలు ఆవిష్కరించి నిరసన తెలిపారు. ఖమ్మం జిల్లాలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నల్లజెండాలు ఎగురవేశారు. రాజకీయ జేఏసీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నల్లజెండా ఎగురవేయగా, తెలంగాణ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్ లోనికి చోచ్చుకుపోయేందుకు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకోగా తోపులాట జరిగింది. పీఆర్ ఉద్యోగులు భోజన సమయంలో జెడ్పీలో నిరసన తెలిపారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో ఎమ్మెల్యే రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నివాసంలో జాతీయ, తెలంగాణ జెండాలను ఎగరవేశారు. మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరోసభ్యుడు జితేందర్‌రెడ్డి నల్ల పావురాన్ని ఎగురవేసి నిరసన తెలిపారు. జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ చౌరస్తాలో నల్లజెండాను ఎగురవేశారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా తాండూరు, మేడ్చల్, వికారాబాద్‌లో తెలంగాణవాదులు ర్యాలీలు జరిపి, నల్ల జెండాలతో నిరసన తెలిపారు. జిల్లాలో అధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. -
మరింత ఉధృతంగా..
సాక్షి నెట్వర్క్ : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు సహా ఎందరో త్యాగధనుల ఫలమైన సమైక్యాంధ్రప్రదేశ్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ముక్కలు కానివ్వబోమంటూ సీమాంధ్ర ప్రజ దిక్కులు పిక్కటిల్లేలా నినదించింది. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సమైక్య రాష్ట్ర పరిరక్షణ దినోత్సవంగా జరుపుకుంది. వరుసగా 94వరోజైన శుక్రవారం కూడా రాష్ర్ట విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సమైక్యవాదులు మరింత ఉద్ధృతంగా ఆందోళనలు చేపట్టారు. విశాఖలో ఏయూ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకంతో భారీ మానవహారం నిర్వహించారు. న్యాయవాదులు కోర్టు వద్ద తెలుగు తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ర్యాలీ చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విద్యార్థులు మానవహారం నిర్వహించారు. అమలాపురం, పెద్దాపురంలలో సమైక్యవాదులు అమరజీవి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అంబాజీపేటలో విద్యార్థులు సమైక్య గర్జన చేశారు. పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు, తెలుగుతల్లి విగ్రహాలకు సమైక్యవాదులు, ఏన్జీవోలు పాలాభిషేకాలు నిర్వహించారు. తాడేపల్లిగూడెంలోవిద్యార్థులు భారీ ప్రదర్శన చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో విద్యార్థులు ర్యాలీ చేశారు. విజయనగరంలో న్యాయవాదుల బైక్ ర్యాలీని పోలీసులు భగ్నంచేసి సంఘం అధ్యక్షుడిని, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడిని పోలీస్ వ్యాన్‌లో స్టేషన్‌కు తరలించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో శ్రీకాకుళంలో భారీ ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. వర్షంలో తడుస్తూ... వైఎస్సార్ జిల్లా బద్వేలులో వేలాది మంది విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలిలో వర్షంలోనే తడుస్తూ నిరసన చేపట్టారు. కడపలో ఎన్జీఓలు కొవ్వొత్తులతో ర్యాలీ చేశారు. పొట్టి శ్రీరాములు త్యాగాన్ని వృథాగా పోనీయ్యబోమని ప్రొద్దుటూరులో ఆర్యవైశ్యులు ప్రతినబూనారు. అనంతపురంలో ఎన్జీవోలు, సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి సభ్యులు, ఇంజనీరింగ్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. గుంతకల్లు, కదిరి, లేపాక్షిలో విద్యార్థులు మహా మానవహారం నిర్మించారు. హిందూపురంలో భారీ ర్యాలీ చేపట్టారు. తిరుపతిలో ఎన్జీవోలు, న్యాయవాదులు, మెడికల్ జేఏసీ నాయకులు, విద్యార్థులు, ర్యాలీ నిర్వహించారు. శ్రీకాళహస్తిలో గాండ్ల, చేనేత, బలిజ సంఘాలు విద్యార్థిగర్జన నిర్వహించాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డలో మానవహారం నిర్వహించారు. అఖిలపక్షంలో సమైక్యవాదం వినిపించండి ‘కేంద్రం నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా పాల్గొనాలి. ఆ సమావేశంలో సమైక్యవాదం వినిపించి తీరాలి. లేకపోతే ఆయా పార్టీల నాయకులను రోడ్లపై తిరగనివ్వం’ అని కర్నూలు జిల్లా విద్యాసంస్థల జేఏసీ నాయకులు హెచ్చరించారు.కర్నూలులో వేలాది మంది విద్యార్థులతో భారీ బహిరంగసభ నిర్వహించారు. నెల్లూరులో భారీ ర్యాలీ నిర్వహించారు. ఉపాధ్యాయులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. -
రాష్ట్రాన్ని ఆవహేళన చేయవద్దు:ఆళ్ల నాని
రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని ఆ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే ఆళ్లనాని స్పష్టం చేశారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రాన్ని అవహేళన చేయవద్దని ఆయన తెలంగాణ వాదులకు విజ్ఞప్తి చేశారు. సమైక్య రాష్ట్రం కోసం తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రాణ త్యాగానికైనా సిద్ధంగానే ఉన్నాట్లు ఆయన తెలిపారు. భారీ వర్షాల కారణంగా వరద ముంపునకు గురైన నల్గొండ, ఖమ్మం జిల్లాలో బాధితులను పరామర్శించడానికి తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ వెళ్తే తెలంగాణ వాదులు, కాంగ్రెస్ నేతలు ఎందుకు భయపడుతున్నారని ఆళ్లనాని ఈ సందర్భంగా ప్రశ్నించారు. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం. అయితే తెలంగాణవాదులు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని బ్లాక్ డేగా వ్యవహరించడం పట్ల ఆళ్లనాని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆళ్లనానిపై విధంగా స్పందించారు. -
అవతరణ వేడుకలకు తెలంగాణ మంత్రులు దూరం
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం వేడుకలకు తెలంగాణ మంత్రులు దూరంగా ఉన్నారు. దాంతో తెలంగాణ జిల్లాల్లో మంత్రులకు బదులు కలెక్టర్లే జెండా ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వమే ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినం సందర్భంగా నవంబర్ 1న తెలంగాణవ్యాప్తంగా విద్రోహదినాన్ని పాటించాలని టీ జేఏసీ పిలుపునిచ్చింది. తెలంగాణలోని గ్రామస్థాయి వరకు నిరసనర్యాలీలు నిర్వహించాలని సూచించింది. ఇక ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. -
ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆవతరణ వేడుకలు
-
ఎన్టీఆర్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ వేడుకలు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, రఘువీరారెడ్డి, టీజీ వెంకటేష్, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణి, ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా రాష్ట్ర విజభన నేపథ్యంలో అంధ్రప్రదేశ్ ఆవతరణ వేడుకలను తెలంగాణవాదులు అడ్డుకునే అవకాశం ఉందనే అనుమానంతో పోలీసు ఉన్నతాధికారులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. అందులోభాగంగా ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఇందిరా పార్క్ వైపు వచ్చే తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌ను భద్రత చర్యల్లో భాగంగా మూసివేశారు. రాష్ట్ర మంత్రులతోపాటు పలువురు ఉన్నతాధికారులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అయితే తెలంగాణ మంత్రులు మాత్రం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నారు. -
సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా నేడు మహిళా పోరు
=నియోజకవర్గ కేంద్రాల్లో మానవహారాలు =వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమైక్యపోరు సాక్షి, విజయవాడ : సమైక్యాంధ్ర పరిరక్షణే లక్ష్యంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం మహిళా మానవహారం కార్యక్రమాలు జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరగనున్నాయి. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల రెండో తేదీ గాంధీ జయంతి నుంచి నవంబర్ ఒకటి ఆంధ్ర అవతరణ దినోత్సవం వరకు నిరసన కార్యక్రమాలకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రూపకల్పన చేశారు. ఆ మేరకు పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో, నియోజకవర్గ సమన్వయకర్తల నేతృత్వంలో నిరసనలు కొనసాగుతున్నాయి. మహిళా మానవహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉదయభాను కార్యకర్తలను కోరారు. ఎడతెగని పోరు... ఇప్పటివరకు పార్టీ చేపట్టిన సమైక్య ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. ఈ నెల రెండో తేదీ నుంచి అసెంబ్లీ సమన్వయకర్తలు నిరవధిక నిరాహారదీక్షలు చేశారు. వాటిని ప్రభుత్వం భగ్నం చేశాక రిలేదీక్షలు జరిగాయి. ఏడో తేదీన మంత్రులు, కాంగ్రెస్, టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేయాలని వారి నివాసాల ఎదుట శాంతియుత ధర్నాలు చేశారు. పదిన అన్ని మండల కేంద్రాల్లో రైతులతో దీక్షలు చేపట్టారు. 17న నియోజకవర్గ కేంద్రాల్లో ఆటో, రిక్షాలతో ర్యాలీలు నిర్వహించారు. అనేకచోట్ల పార్టీ నేతలు స్వయంగా ఆటోలు, రిక్షాలు నడిపి నిరసన తెలిపారు. ఇక 24న అన్ని కేంద్రాల్లో బైక్ ర్యాలీలు చేయాలని నిర్ణయించారు. దాంతోపాటు హైదరాబాద్‌లో 26న పార్టీ నిర్వహించనున్న సమైక్య శంఖారావానికి జిల్లా నుంచి పెద్ద ఎత్తున తరలివెళ్లేందుకు కార్యకర్తలు, సమైక్యవాదులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సమైక్య శంఖారావానికి తరలిరావాల్సిందిగా కోరుతూ విస్తృత ప్రచారం చేస్తున్నామని కన్వీనర్ సామినేని ఉదయభాను వివరించారు.