సాక్షి, ఢిల్లీ : దేశ రాజధానిలోని ఏపీ భవన్‌లో ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ఆంధ్రకేసరి చిత్ర ప్రదర్శన, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిపాలన సౌలభ్యం కోసమే రెండు రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. విడిపోయామన్న భావన లేకుండా తెలుగువారంతా కలిసిమెలిసి ఉండాలి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్టుగానే తెలుగువారంతా రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడాలి. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఏపీకి సహాయం అందించాల్సిన బాధ్యత తెలుగుమంత్రిగా నాపైనా ఉందని వెల్లడించారు. అనంతరం కళాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి కార్యదర్శి ఐవి సుబ్బారావు, రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా, స్పెషల్ కమిషనర్ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment