Andhra pradesh bhavan
-
ఏపీ భవన్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు భారీ సంఖ్యలో తెలుగు ప్రజలు హాజరయ్యారు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. హరిదాసుల కీర్తనలు ఆహూతులను ఆకర్షించాయి. రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో అలంకరించారు. చిన్నారులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యాక్రమాలతో ఏపీ భవన్లో పండగ వాతావరణం నెలకొంది. -
ఏపీభవన్‌లో అంబేద్కర్‌కు ఘన నివాళి
సాక్షి,న్యూఢిల్లీ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 63వ వర్ధంతిని పురస్కరించుకొని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రాంగణంలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్ ఎన్వి రమణారెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం "మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, ప్రజల సామాజిక బాద్యత" అంశంపై ఎఐడిఆర్ఎఫ్, ఏపీ భవన్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురజాడ సమావేశ మందిరంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ఏపీ భవన్ అధికారులు,సిబ్బంది, ఢిల్లీలోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొని డాక్టర్ అంబేద్కర్ చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు -
‘తెలుగు మంత్రిగా నాపైనా ఆ బాధ్యత ఉంది’
సాక్షి, ఢిల్లీ : దేశ రాజధానిలోని ఏపీ భవన్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకల్లో ఆంధ్రకేసరి చిత్ర ప్రదర్శన, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పరిపాలన సౌలభ్యం కోసమే రెండు రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. విడిపోయామన్న భావన లేకుండా తెలుగువారంతా కలిసిమెలిసి ఉండాలి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నట్టుగానే తెలుగువారంతా రాష్ట్రాల అభివృద్ధి కోసం పాటుపడాలి. ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. ఏపీకి సహాయం అందించాల్సిన బాధ్యత తెలుగుమంత్రిగా నాపైనా ఉందని వెల్లడించారు. అనంతరం కళాకారులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి కార్యదర్శి ఐవి సుబ్బారావు, రెసిడెంట్ కమిషనర్ భావన సక్సేనా, స్పెషల్ కమిషనర్ రమణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఏపీ భవన్ ప్రత్యేక కమిషనర్‌గా ఎన్వీ రమణారెడ్డి..
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్, ఎక్స్ అఫిషియో కమిషనర్‌గా నియమితులైన ఎన్వి రమణారెడ్డి గురువారం ఉదయం ఆంధ్రప్రదేశ్ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్ భవన్ అసిస్టెంట్ కమిషనర్లు, అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛా లతో ఆయనకు స్వాగతం పలికారు. ఐఆర్పీఎస్ (1986) బ్యాచ్ అధికారి అయిన రమణారెడ్డి ఇండియన్ రైల్వే లోను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రోటోకాల్ విభాగం సెక్రటరీగా, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం మాతృ సంస్థ అయిన ఇండియన్ రైల్వేలోని దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ విభాగంలో పనిచేస్తూ తిరిగి డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కి వచ్చిన రమణారెడ్డిని న్యూఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ప్రత్యేక కమిషనర్, ఎక్స్ అఫీషియో కమిషనర్, టూరిజం శాఖ కమిషనర్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. -
రాష్ట్ర అభివృద్ధికి ఏపీ భవన్ వారధిగా పని చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగులంతా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పిలుపు ఇచ్చారు. రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య ఏపీ భవన్ వారధిగా పనిచేయాలని కోరారు. కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకుని రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఏపీ భవన్లో గురువారం ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు ఘనసన్మానం జరిగింది. ఉద్యోగుల కోసం గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవిశ్రాంతంగా పనిచేశారని, ఆయన బాటలో సీఎం జగన్మోహన్రెడ్డి ముందడుగు వేస్తున్నారని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికే ఎంపీలమంతా పనిచేస్తున్నామని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి తెలిపారు. -
మహానేత అడుగుజాడల్లో సాగుతాం
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని ఏపీ భవన్లో వైఎస్సార్సీపీ ఎంపీలు మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నందిగం సురేష్, బ్రహ్మానందరెడ్డి, వంగా గీత, బాలశౌరి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రఘురామ కృష్ణంరాజు, మర్గాని భరత్, పార్టీ సీనియర్ నాయకులు, ఢిల్లీలోని తెలుగువారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని వైఎస్సార్ అడుగుజాడల్లో అభివృద్ధి పథంలో నడుపుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు. వంగ గీత మాట్లాడుతూ.. రైతులతో మహానేత వైఎస్సార్‌కు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. రైతుల గుండెల్లో వైఎస్సార్ చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేశారు. మహానేత ఆశయ సాధనకు ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. మర్గాని భరత్ మాట్లాడుతూ.. వైస్సార్ జయంతి తమకు పర్వదినం అని అన్నారు. రైతు పక్షపాతి అయిన మహానేత వైఎసాసర్ అడుగుజాడల్లో తాము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. -
ఏపీ భవన్లో ఘనంగా వైఎస్సార్ జయంతి
సాక్షి, న్యూఢిల్లీ: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. సోమవారం వర్కింగ్ డే కావడంతో ముందుగానే ఏపీ భవన్లో వేడుకలు నిర్వహించినట్లు భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు. జూలై 8న వైఎస్సార్ జయంతిని పురస్కరించుకొని ఆ రోజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే. వైఎస్సార్ జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’చిత్రాన్ని అంబేడ్కర్ ఆడిటోరి యంలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్రా న్ని వీక్షించేందుకు స్థానిక తెలుగు ప్రజలు పెద్దఎత్తున హాజరయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ చీఫ్ కమిషనర్, వైఎస్సార్ హయాంలో ఆర్థికశాఖ కార్యదర్శిగా పనిచేసిన సంపత్‌కుమార్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం చిత్ర విరామం వేళలో చిన్నారులతో కలసి ఆయన కేక్ కట్ చేశారు. నిబద్ధత, అంకితభావానికి వైఎస్సార్ మారుపేరని కొనియాడారు. -
ఏపీ భవన్లో ప్రభుత్వ ప్రతినిధిగా విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డిని ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎటువంటి జీత భత్యాలు, కేబినెట్ ర్యాంకు లేకుండా ఆయన్ను నియమించినట్టు అధికార వర్గాలు తెలిపాయి. కేవలం సేవా భావంతోనే ఢిల్లీలోని ఏపీ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డి వ్యవహరించనున్నారు. ఆయనకు ఎటువంటి అధికారిక సదుపాయాలను కల్పించడం లేదని తెలిసింది. గత నెల 22వ తేదీన విజయసాయిరెడ్డిని కేబినెట్ ర్యాంకుతో ఢిల్లీలోని ఏపీ భవన్లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ మరో లాభదాయక పదవి (ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్) చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని తేలడంతో విజయసాయిరెడ్డి నియామక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 4వ తేదీన రద్దు చేసింది. తాజాగా ఎటువంటి జీత భత్యాలు, కేబినెట్ తదితర హోదా లేకుండా ఢిల్లీలోని ఏపీ భవన్లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన్ను నియమించేందుకు వీలుగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనల్లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆర్డినెన్స్ జారీ చేసింది. -
ఏపీ భవన్లో ఘనంగా వైఎస్సార్ జయంతి వేడుకలు
న్యూఢిల్లీ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నిబద్ధత, అంకితభావానికి మారుపేరని భారత ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి వీఎస్ సంపత్ అన్నారు. మహానేత జయంతి వేడుకలను ఆదివారం ఏపీ భవన్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆడిటోరియంలో అధికారులు ఘనంగా నిర్వహించారు. సోమవారం మహానేత జయంతిని పురస్కరించుకుని అధికారులు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏపీ భవన్లో మహానేత పాదయాత్ర నేపథ్యంగా తెరకెక్కిన ‘యాత్ర’ చిత్రాన్ని ప్రదర్శించారు. ఈ వేడుకల్లో సంపత్‌కుమార్, రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్‌లు పాల్గొన్నారు. మహానేతతో తమకున్న అనుబంధాన్ని వారు గుర్తుచేసుకున్నారు. యాత్ర సినిమా విరామ సమయంలో వారు చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సంపత్ మాట్లాడుతూ.. అధికారుల సమన్వయంతో ప్రజల సంక్షేమం, అభివృద్ధి పథకాల లక్ష్య సాధనకు వైఎస్సార్ స్థిర సంకల్పంతో కృషి చేశారని కొనియాడారు. ఆరోగ్యశ్రీ, 108 సేవలతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నప్పుడు వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రజల హృదయాల్లో స్థిరస్థాయి ముద్ర వేసుకున్న ప్రజానాయకుడు వైఎస్సార్ అని కొనియాడారు. సోమవారం వైఎస్సార్ జయంతిని పురస్కరించుకుని హస్తినాలోని తెలుగువారి కోసం ఏపీ భవన్లో యత్రా చిత్రం ప్రదర్శించినట్టు తెలిపారు. -
ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డిని ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎటువంటి జీత భత్యాలు, కేబినెట్ ర్యాంకు లేకుండా ఆయన్ను నియమించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆయనకు ఎటువంటి అధికారిక సదుపాయాలను కూడా కల్పించడం లేదు. కేవలం సేవా భావంతోనే ఢిల్లీలోని ఏపీ భవన్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా విజయసాయిరెడ్డి వ్యవహరించనున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ గత నెల 22వ తేదీన విజయసాయిరెడ్డిని కేబినెట్ ర్యాంకుతో ఢిల్లీలోని ఏపీ భవన్లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ మరో లాభదాయక పదవి (ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్) చేపట్టడం నిబంధనలకు విరుద్ధమని తేలడంతో విజయసాయిరెడ్డి నియామక ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 4వతేదీన రద్దు చేసింది. తాజాగా ఎటువంటి జీత భత్యాలు, కేబినెట్ తదితర హోదా లేకుండా ఢిల్లీలోని ఏపీ భవన్లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఆయన్ను నియమించేందుకు వీలుగా ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనల్లో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆర్డినెన్స్ జారీ చేసింది. విజయసాయిరెడ్డిని ఢిల్లీలోని ఏపీ భవన్లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమిస్తూ ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. -
ఏపీ భవన్లో ‘నందమూరి బొమ్మల కొలువు’
సాక్షి, న్యూఢిల్లీ: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్థంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ భవన్లో ఆదివారం టీమ్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఆధ్వర్యంలో ‘అన్నగారి బొమ్మల కొలువు’ అనే చిత్రప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఏపీభవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన కె. బాలకోటేశ్వరరావు గీసిన 70 చిత్రాలను ప్రదర్శించారు. ఎన్టీఆర్ చిత్రాలను జీవం ఉట్టిపడేలా గీసిన చిత్రకారుడిని ఆహూతులు అభినందించారు. 2013లోనూ హైదరాబాద్ ఆర్ట్ గ్యాలరీలో మొట్టమొదటిసారిగా 150 చిత్రాలతో ప్రదర్శన నిర్వహించి నట్టు చిత్రకారుడు బాలకోటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీభవన్ ప్రత్యేకాధికారి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న నృత్యప్రదర్శనలు
ఢిల్లీ తెలుగు అకాడమీ వార్షిక సాంస్కృతికోత్సవాలు మొదలు సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ తెలుగు అకాడమీ 27వ వార్షిక సాంస్కృతికోత్సవాలు ఆంధ్రప్రదేశ్ భవన్‌లోని అంబేద్కర్ ఆడిటోరియంలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. సంప్రదాయ వస్త్రధారణ, అబ్బురపరిచే నృత్యాలతో కళాకారులు ఆకట్టుకున్నారు. తొలి రోజున కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. గురు సీతా నాగజ్యోతి శిష్యురాలు ఎం. వైష్ణవి కూచిపూడి నాట్యంలో భాగంగా ప్రదర్శించిన పురంధర దాసుకీర్తన గజవదనాబేడువే , ఆదిశంకరాచార్య విరచితమైన లింగాష్టకం, నారాయణతీర్థులు రాసిన కృష్ణలీలాతరంగిణి గోవర్దన గిరిధారి తరంగం ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. పళ్లెంలోనే తన శరీరాన్ని వెనక్కి వంచి ఆమె గోవర్దన పర్వతాన్ని ప్రదర్శించిన తీరు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. గురు జయరామారావు శిష్యురాలు టి. రెడ్డి లక్ష్మి ప్రదర్శించిన జయదుర్గే నృత్యం, కృష్ణ లీలలు, శివతరంగం ప్రేక్షకులను మైమరిపించాయి. ఇంకా గురు వెంపటి చినసత్యం శిష్యురాలు జయప్రియ విక్రమన్ ప్రదర్శించినశ్రీ కృష్ణపారిజాతం నృత్యరూపకం మొత్తం కార్యక్రమానికి తలమానికంగా నిలిచింది. చివరగా గురు ఉషారావు శిష్యుబందం అన్నమయ్య కీర్తనలు, త్యాగరాజకీర్తనపై ప్రదర్శించిన భరతనాట్యం, థిల్లానా అలరించాయి. మాజీ ఎన్నికల కమిషనర్ జీవీఈ కృష్ణమూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇంకా గురుజయరామారావు తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆద్యంతం ఈ కార్యక్రమం ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది.కాగా మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులోభాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించడంతో పాటు వివిధ రంగాలలో నిష్ణాతులైన వారిని సన్మానించనున్నారు. శనివారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు గురు కె. రామాచారి , లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ విద్యార్థుల ఆధ్వర్యంలో సినీ భక్తి సంగీత విభావరి కార్యక్రమం జరగనుంది. -
ఏపీ భవన్ ఓఎస్డీగా శ్వేతా తియోతియా
సాక్షి, హైదరాబాద్: నర్సీపట్నం సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న శ్వేతా తియోతియాను ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ ఓఎస్డీగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఐఏఎస్ అధికారి గైర్హాజరు కాలం క్రమబద్ధీకరణ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) మహంతి కార్యాలయంలో ‘రాష్ట్ర విభజన’ సమాచార సేకరణలో కీలక పాత్ర పోషిస్తున్న 1991 బ్యాచ్ ఐఏఎస్ అధికారి కె.రామకృష్ణారావు.. ఉద్యోగానికి గైర్హాజరైన కాలాన్ని ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. 01-08-2007 నుంచి 18-06-2013 వరకు గైర్హాజరైన కాలాన్ని ఆర్జిత, వేతన, అసాధారణ సెలవుగా క్రమబద్ధీకరిస్తూ బుధవారం సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. -
ఏపీ భవన్లో జేపీపై దాడి
కాలర్ పట్టుకుని లాగేందుకు యత్నం ప్రెస్‌మీట్ అనంతరం చుట్టుముట్టిన టీ న్యాయవాదులు అదేసమయంలో అక్కడికి వచ్చిన ఓయూ జేఏసీ విద్యార్థులు రక్షణ వలయంతో ఏపీభవన్ లోపలికి తీసుకెళ్లిన పోలీసులు దాడికి నిరసనగా నేడు అంబేద్కర్ విగ్రహాలవద్ద ధర్నాలు సాక్షి, న్యూఢిల్లీ/ హైదరాబాద్: లోక్‌సత్తా నేత డాక్టర్ జయప్రకాశ్ నారాయణ(జేపీ)పై తెలంగాణ న్యాయవాదుల జేఏసీ, ఓయూ జేఏసీకి చెందిన నేతలు మంగళవారం ఇక్కడి ఆంధ్రప్రదేశ్ భవన్లో దాడికి దిగారు. కాలర్ పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు. సాయంత్రం నాలుగు గంటలకు ఏపీ భవన్ ఆవరణలో జేపీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ముందుగా తమ పార్టీకి చెందిన ఉపాధ్యక్షుడు బాబ్జీ, వర్కింగ్ కమిటీ సభ్యురాలు గీతామూర్తి, కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు మాజిద్‌లను మీడియాకు పరిచయం చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ... లోక్‌సత్తా సూచించిన రోడ్‌మ్యాప్‌నకు అనుగుణంగా రాష్ట్రవిభజన చేస్తామన్న కేంద్రం కేవలం రెండు సూచనలనే స్వీకరించిందని, అన్ని ప్రాంతాలు సంతృప్తికరంగా ఉండేలా కేంద్రం వ్యవహరించాలని చెప్పారు. పరిసరాల్లో ఉన్న తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నాయకులు జేపీ సమావేశం ముగించబోతున్న తరుణంలో ఒక్కసారిగా జై తెలంగాణ.. జేపీ డౌన్‌డౌన్.. జేపీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఇదేసమయంలో ఏపీభవన్ ఆవరణలోకి వచ్చిన ఓయూ జేఏసీ నేతలు వారికి తోడయ్యారు. అందరూ కలిసి జేపీని చుట్టుముట్టారు. ఒక ఆందోళనకారుడు జేపీ గల్లాపట్టుకుని లాగేందుకు ప్రయత్నించబోగా.. జేపీ వారించారు. అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులను లాగేసి, ఎట్టకేలకు జేపీని సురక్షితంగా ఏపీ భవన్‌లోకి తీసుకెళ్లారు. జేపీపై దాడికి నిరసనగా ఆ పార్టీ కార్యకర్తలు కొందరు హైదరాబాద్ ట్యాంక్బండ్వద్దనున్న అంబేద్కర్ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తంచేశారు. దాడుల్లాంటి అప్రజాస్వామిక, పెడధోరణుల వల్లే తెలంగాణ అంశం ఇప్పటిదాకా పరిష్కారం కాకుండా పీటముడి పడిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు చెప్పారు. దాడిని ఖండిస్తూ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా లోక్‌సత్తా పార్టీ శ్రేణులు అంబేద్కర్ విగ్రహాల వద్ద ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. సంయమనం పాటించండి: కోదండరాం సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చివరిదశకు చేరుకున్న తరుణంలో ఎవరూ ఉద్రేకాలకు లోనుకావొద్దని.. సంయమనంతో వ్యవహరించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ైచె ర్మన్ కోదండరాం సూచించారు. తెలంగాణ ఉద్యమం ఎంతో గొప్పదని.. అనవసర ఉద్రేకాలతో దానిని చెడగొట్టవద్దని కోరారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని ఏపీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. విధానాలపైనే వ్యతిరేకత వ్యక్తం చేయాలిగానీ, వ్యక్తులపై కాదని జేపీపై జరిగిన దాడి ఘటనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆ సంఘటన పట్ల చింతిస్తున్నామన్నారు.