![Vijayasaireddy Suggests Ap Bhavan Employees To Work For Devolopment - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/11/Vijayasai-Reddy.jpg.webp?itok=0I6GPaSd)
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగులంతా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పిలుపు ఇచ్చారు. రాష్ట్రానికి, కేంద్రానికి మధ్య ఏపీ భవన్ వారధిగా పనిచేయాలని కోరారు. కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకుని రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని అన్నారు. ఏపీ భవన్‌లో గురువారం ఆంధ్రప్రదేశ్ ఎంపీలకు ఘనసన్మానం జరిగింది.
ఉద్యోగుల కోసం గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అవిశ్రాంతంగా పనిచేశారని, ఆయన బాటలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ముందడుగు వేస్తున్నారని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికే ఎంపీలమంతా పనిచేస్తున్నామని వైఎస్సార్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment