
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధానిలో దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, నందిగం సురేష్, బ్రహ్మానందరెడ్డి, వంగా గీత, బాలశౌరి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రఘురామ కృష్ణంరాజు, మర్గాని భరత్, పార్టీ సీనియర్ నాయకులు, ఢిల్లీలోని తెలుగువారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని వైఎస్సార్ అడుగుజాడల్లో అభివృద్ధి పథంలో నడుపుతున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలబడుతుందని ధీమా వ్యక్తం చేశారు.
వంగ గీత మాట్లాడుతూ.. రైతులతో మహానేత వైఎస్సార్‌కు విడదీయలేని అనుబంధం ఉందన్నారు. రైతుల గుండెల్లో వైఎస్సార్ చిరస్మరణీయ స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేశారు. మహానేత ఆశయ సాధనకు ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. మర్గాని భరత్ మాట్లాడుతూ.. వైస్సార్ జయంతి తమకు పర్వదినం అని అన్నారు. రైతు పక్షపాతి అయిన మహానేత వైఎసాసర్ అడుగుజాడల్లో తాము ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment