
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు భారీ సంఖ్యలో తెలుగు ప్రజలు హాజరయ్యారు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. హరిదాసుల కీర్తనలు ఆహూతులను ఆకర్షించాయి. రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో అలంకరించారు. చిన్నారులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యాక్రమాలతో ఏపీ భవన్‌లో పండగ వాతావరణం నెలకొంది.


Comments
Please login to add a commentAdd a comment