Sankrathi festival
-
భోగి పండుగను ఇలా మాత్రం చెయ్యొద్దు!
అప్పటి వరకు సైలెంట్‌గా ఉన్న ఊళ్లు, పల్లెలు జనసందోహంతో కళకళలాడిపోతుంటాయి. ఎంతెంత దూరమైనా వ్యయప్రయాసలు కోర్చి మరీ పట్టణాలు, విదేశాల నుంచి సోంతూళ్లకి పయనమైపోతుంటారు. అంతటి సరదాలు, ఆనందాలు తెచ్చే పండుగ ఈ సంక్రాంతి పండుగ. ఈ నాలుగు రోజుల పండుగకి ఉన్న క్రేజ్ మరే పండుగకి ఉండదేమో అన్నంతలా చిన్న పెద్ద భేదం లేకుండా జరుపుకునే పండుగ. అలాంటి ఈ పండుగను మన పూర్వీకులు ఏ ఉద్దేశ్యంతో ఇలానే జరుపుకోండని మనకు ఒక సంప్రదాయన్ని అందిస్తే దానికి తిలోదాకాలు ఇచ్చేసి తప్పుగా అర్థం చేసుకుంటూ పిచ్చిపిచ్చిగా జరుపుకుంటున్నాం. అజ్ఞానంతో పర్యావరణానికి హాని కలిగించడమే గాకుండా లేనిపోనీ అనారోగ్య సమస్యలను కొనితెచ్చుకుంటున్నాం. ఈ విషయమై పర్యావరణ అధికారులు, వైద్యులు, ఆయా పాలనాధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైగా దయచేసి ఇలా చెయ్యొద్దు అని వేడుకుంటున్నారు. ఇంతకీ ఈ పండుగను ఎలా జరుపుకోవాలి? ఎలాంటివి చెయ్యకూడదు?. వాళ్లంతా భయాందోళనలు వ్యక్తం చేయడానికి రీజన్? నిజానికి ఈ సంక్రాంతి పండుగలో భోగితో మొదలయ్యే తొలి పండుగ అంటే అందరికీ సరదానే. ఎందుకంటే? బోగి మంటలతో ప్రారంభమయ్యే ఈ పండుగ సఓ సంబరంలా అంతా ఒక చోట చేరి ఐక్యమత్యంగా జరుపుకుంటారు. అయితే ఈ భోగి మంటలకు కావాల్సిన కలప, పిడకలు, వంటివి నగరాల్లో అందుబాటులో ఉండవు. అదీగాక అభివృద్ధి పేరుతో ఓ టౌన్ మాదిరివి కూడా నగరాల్లో మారిపోయాయి. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటవన్నీ అందుబాటులో ఉండవు. పైగా అందరికి వ్యయప్రయాసలు కోర్చి మరి సొంతూళ్లుకు వెళ్లడం కూడా కుదరదు. దీంతో వారంతా ఈ భోగమంటను ఇంట్లోని పాత వస్తువులను తగలబెట్టి భోగి మంట వేసుకోవడం లేదా టైర్లు, వేస్ట్ ప్లాస్టిక్‌ని తగలబెట్టడం వంట పనులు చేస్తారు. ఇలాంటి చలిమంట వల్ల పర్యావరణ కాలుష్యమే గాక, ఈ పొగ పీల్చడం వల్ల అనారోగ్య సమస్యల బారినపడతారు. ముఖ్యంగా ప్లాస్టిక్, టైర్లు వంటివి కాల్చడం వల్ల చాలా విషపూరితమైన వాయువులు గాల్లోకి విడుదల అవుతాయి. వీటిని పీల్చడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, కేన్సర్ వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయి. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యనిపుణులు, పర్యావరణ అధికారులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పండుగ అనేది మనకు కొత్త ఉత్తేజన్ని తీసుకొచ్చి ఆనందంగా గడిపేలా ఉండాలే కానీ మన వినాశనానికి కారణమయ్యేలా ఉండకూదనేది వారి ఆవేదన. కానీ చాలామంది ఇలానే చేసి చేజేతులారా తమ ఆరోగ్యాన్ని పక్కవారి ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నారు. అస్సలు మన పూర్వీకులు ఎందుకని పండగను ఇలా భోగిమంటలతో చేసుకోవాలని చెప్పారు? దానిలో దాగున్న అంతరార్థం ఏంటో తెలుసుకోకుండా అజ్ఞానంతో తప్పుగా జరుపుకుని లేనిపోనీ సమస్యలు కొనితెచ్చుకుంటున్నాం. ఇంతకీ ఎలా చేసుకోవాలంటే.. పర్యావరణ హితంగా మంచి ఔషధ చెట్ల కలప లేదా ఆవుపిడకలతో వేసిన భోగిమంటే అన్ని విధాల మంచిది. దీని నుంచి విడుదలయ్యే వాయువులు పీల్చేతే శ్వాస సంబంధ సమస్యలు తలెత్తవు. మన పూర్వీకులు ఈ భోగి మంటల వేయడానికి కారణం కూడా ఈ రోజుల్లో చలి ఎక్కువగా ఉంటుంది. అందుకని ఇలా రావి, వేప వంటి ఔషధ గుణాలు గల చెట్ల దుంగల్ని తెచ్చి మంట వేస్తారు. అందులోనే దేశీ ఆవు నెయ్యి, పిడకలు వంటివి కూడా వేస్తారు. ఇలా భోగిమంటను వేసి దాని నుంచి విడుదలయ్యే గాలిని పీల్చితే ఎలాంటి అనారోగ్య సమస్యల రావు. పైగా శ్వాసకోశ సమస్యలు కూడా ఉండవు. ఈ శీతాకాలంలో వచ్చే జలుబు, ఆయాసం వంటి సమస్యల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండాలని మన పెద్దలు ఈ ఆచారాన్ని తీసుకొచ్చారు. అయితే దీన్ని తప్పుగా అర్థం చేసుకుని ఇంట్లోని పాత వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు, పాత టైర్లతో చలిమంటలు వేసుకుని అనారోగ్యం పాలవ్వుతున్నారు. తెలియకుండానే అటు దేవుడి అనుగ్రహానికి నోచుకోక పోగా, ఇటు ఆరోగ్యాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నవారవమవుతున్నాం అని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల దయచేసి ఇలా మాత్రం చేసుకోవద్దు. అవన్నీ అందుబాటులో లేకపోతే కనీసం కొబ్బరి చిప్పలు, వేపాకులు వంటివి తెచ్చుకుని భోగిమంట వేసుకోండి. ఇది కూడా ఆరోగ్యానికి అన్ని విధాల మంచిదే అని హితవు చెబుతున్నారు పర్యావరణ నిపుణులు. అందువల్ల అందరం ఈ పండుగను ఆరోగ్యకరమైన రీతీలో పర్యావరణ హితంగా జరుపుకుని ఆరోగ్యమనే భాగ్యాన్ని, సంతోషమనే సంపదను పొందుదాం. -
ఖతార్‌లో అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
‘సంక్రాంతి‘ తెలుగు రాష్ట్రాల్లో కొత్త పంట కోత సందర్భంలో చేసుకునే ఈ ‘పెద్ద పండుగ‘ను ఖతార్‌లోని ‘ఆంధ్ర కళా వేదిక‘, వెంకప్ప భాగవతుల అధ్యక్షతన అత్యంత వైభవంగా నిర్వహించుకుంది. తెలుగు నేపథ్య గాయకులు ప్రవీణ్ కుమార్ కొప్పోలుకు తోడుగా సత్యభామ స్వాతి, ప్రముఖ జానపద గాయకురాలు శిరీష, అత్యంత ప్రజాదరణ పొందిన డాన్స్ షో ‘ఢీ(ఈఏఉఉ)‘ ఫేమ్ డాన్స్ మాస్టర్ పండు, మాధురి తమ పాటలతో, ఆటలు మాటలతో ప్రేక్షకులను ఆద్యంతం ఓలలాడించి ఉర్రూతలూగించారు. ముఖ్య అతిధిగా ఖతార్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి విచ్చేసిన మొదటి కార్యదర్శి (సాంస్కృతిక, విద్య – సమాచారం) సచిన్ దినకర్ శంక్పాల్ మాట్లాడుతూ.. బాషా, కళా, సాంస్కృతిక, సేవా రంగాలలో చేస్తున్న కృషికి ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. వినోద్ నాయర్ ప్రెసిడెంట్, ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్, కృష్ణ కుమార్ ప్రధాన కార్యదర్శి, ఇండియన్ కల్చరల్ సెంటర్, మెడికల్ అసిస్టెన్స్ హెడ్ రజని మూర్తి, అఓవీ సలహామండలి చైర్మన్ సత్యనారాయణ, తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు శ్రీనివాస్ గద్దె, హరీష్ రెడ్డి ఇతర ప్రముఖులు, తెలుగు సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఆనందించి వారి అభినందనలు తెలియజేసారు. ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ.. కార్యక్రమానికి సుమారు 1000 మందికి పైగా హాజరయ్యారని, సమయాభావాన్ని కూడా లెక్కచెయ్యకుండా ప్రేక్షకులు కార్యక్రమాన్ని పూర్తిగా ఆస్వాదించారు అని తెలిపారు. ఈ కార్యక్రమం కోసం తమ కార్యవర్గ సభ్యులు గొట్టిపాటి రమణ, విక్రమ్ సుఖవాసి, వీబీకే మూర్తి, సుధ, సోమరాజు, రవీంద్ర, శేఖరం రావు, సాయి రమేష్, ఓఖీ రావు, శిరీష రామ్ బృందం చేసిన కృషి అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన స్వచ్ఛంద సేవకులు(వాలంటీర్స్)కి ప్రత్యేకించి రమేష్, మెసయిద్ టీంకి, వేదిక ప్రాంగణ అలంకరణకు సహకరించిన మహిళలందరికీ, కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్న చిన్నారులను, వారి తల్లితండ్రులకు కూడా ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఖ్యాతి, అనన్యలు వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా చూడామణి, శ్రీ సుధ వారి వెన్నుండి సహకరించారు. ఆంధ్ర కళావేదిక ప్రధాన కార్యదర్శి విక్రమ్ సుఖవాసి ముగింపు సందేశ ధన్యవాదాలు తో కార్యక్రమం వైభవోపేతంగా ముగిసింది. -
కోనసీమ జిల్లాలో వైభవంగా సంక్రాంతి సంబరాలు
-
వాల్తేరు వీరయ్య Vs వీర సింహా రెడ్డి..! సంక్రాతి బరిలో ఎవరు గెలుస్తారో..!
వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలవగా.. తాజాగా ఈ రేసులోకి అగ్ర హీరోలు మెగాస్టార్, బాలకృష్ణ కూడా చేరిపోయారు. అయితే వీరిద్దరి చిత్రాలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం గమనార్హం. మెగా154 మూవీతో 'వాల్తేరు వీరయ్య'గా చిరు సంక్రాంతికి సందడి చేయనుండగా.. 'వీరసింహారెడ్డి' అనే మాస్ టైటిల్‌తో బాలయ్య పోటీలో నిలిచారు. మరీ ఇద్దరు లెజెండ్స్‌తో సినిమాలు నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ప్లానేంటి? మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీపడటం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ వీరిద్దరి సినిమాలు చాలాసార్లు సంక్రాంతికి విడుదలయ్యాయి. సాధారణంగా పెద్ద పండుగలకు స్టార్ హీరోల సినిమాలు పోటీలో నిలవడం సహజం. అందులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ బరిలో నిలవడం ఫ్యాన్స్‌కు పెద్ద పండగే. దాదాపు ఆరేళ్ల తర్వాత వీరిద్దరి ఓకేసారి పోటీలో నిలుస్తున్నారు. మరీ వీరిద్దలో ఎవరు హిట్ కొడతారో చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే. గతంలో వీరిద్దరి చిత్రాలు పోటీ పడిన కొన్ని సందర్భాలు 1.జననీ జన్మభూమి - ఛాలెంజ్ 2. మంగమ్మ గారి మనవడు - ఇంటి గుట్టు 3. అగ్ని గుండం - శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర 4. కథానాయకుడు - రుస్తుం 5.ఆత్మ బలం - చట్టంతో పోరాటం 6. కొండవీటి రాజా - నిప్పులాంటి మనిషి 7. రాక్షసుడు - అపూర్వ సహోదరులు 8. దొంగ మొగుడు - భార్గవ రాముడు 9. రాము - పసివాడి ప్రాణం 10.మంచి దొంగ - ఇన్స్పెక్టర్ ప్రతాప్ 11. యుద్ధ భూమి - రాముడు భీముడు 12. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు - భలే దొంగ -
AP: నేతన్నకు ఊతం.. ఆఫర్లతో ఆప్కోకు అందలం
సాక్షి, అమరావతి: క్రిస్మస్, సంక్రాంతి పండుగ సీజన్లలో ప్రకటించిన ఆఫర్ల కారణంగా ఆప్కో వస్త్ర వ్యాపారం ఊపందుకుంది. పండుగ సీజన్లలో అమ్మకాలు పెరగడమే ఇందుకు నిదర్శనం. పండుగ సీజన్లలో 30 శాతం డిస్కౌంట్‌పై ఆప్కో అమ్మకాలు సాగించడంతో ఆప్కో షోరూమ్‌ల ద్వారా గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకు ఏకంగా రూ.9 కోట్లకుపైగా వస్త్ర విక్రయాలు జరిగాయి. చదవండి: గుడివాడలో టీడీపీకి భంగపాటు రాష్ట్రంలోని పలు సొసైటీల వద్ద పేరుకుపోయిన చేనేత వస్త్రాల నిల్వలను కరోనా కష్టకాలంలోనూ కొనుగోలు చేస్తున్న ఆప్కో లాభాపేక్ష లేకుండా వినియోగదారులకు అందిస్తోంది. ఒక్క తూర్పుగోదావరి జిల్లా చేనేత సహకార సొసైటీల్లో పేరుకుపోయిన రూ.కోటి 60 లక్షల విలువైన బెడ్షీట్లను ఆప్కో కొనుగోలు చేసి విక్రయాలు జరిపింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 108 ఆప్కో షోరూమ్‌లున్నాయి. వాటిలో నామ మాత్రపు విక్రయాలు జరిగే వాటిని తొలగించి వ్యయప్రయాసలు తగ్గించేందుకు ఆప్కో సిద్ధమైంది. అయితే ఇటీవల ప్రారంభించిన గుంటూరు, ఒంగోలు, కడపలో రోజుకు రూ.లక్షకుపైగా అమ్మకాలు జరగడంతో రాష్ట్రంలో మరో పది మెగా షోరూమ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. -
కోనసీమ ప్రభ
-
ఒకే విస్తరిలో సకుటుంబం అరిటాకు భోజనం
-
పశువులను ప్రేమగా పూజించే పండగ
-
విశాఖపట్నంలో ప్రారంభమైన భోగి సంబరాలు
-
వీడిన ఉత్కంఠ.. జల్లికట్టుపై సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం
సాక్షి, చెన్నై: తమిళనాడు సాంప్రదాయ ఆట జల్లికట్టు నిర్వహణపై ఉత్కంఠ వీడింది. జల్లికట్టుపై సీఎం స్టాలిన్ సోమవారం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఏటా నిర్వహించే జల్లికట్టుకు ఈ ఏడాది కూడా అనుమతిస్టున్నట్టు ఆయన ప్రకటించారు. దాంతోపాటు జల్లికట్టు కార్యక్రమ నిర్వహణపై తమిళనాడు ప్రభుత్వం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. పోటీల్లో పాల్గొనేందుకు కేవలం 300 మందికి మాత్రమే అనుమతించింది. అలాగే పోటీలను తిలకించేందుకు 150 మంది ప్రేక్షకులు లేదా 50 శాతం సిట్టింగ్ సామర్థ్యానికి (ఏది తక్కువ అయితే అది) అనుమతి ఇచ్చింది. పోటీదారులు, ప్రేక్షకులు రెండుడోసుల వ్యాక్సిన్ తీసుకోవాలని, పోటీల ప్రారంభానికి 48 గంటల ముందు కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. చదవండి: తమిళనాడులో భర్త ఇంటి ముందు యువతి ధర్నా అయితే రాష్ట్రంలో కోవిడ్ కేసుల పెరుగుతున్న నేపథ్యంలో జల్లికట్టు కార్యక్రమాన్ని టీవీలలో చూడాలని, పెద్దఎత్తున గుమిగూడకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సూచించింది. కాగా మధురై జిల్లాలో ఈనెల 14 నుంచి జల్లికట్టు పోటీలు ప్రారంభంకానున్నాయి. కనుమ పండుగ రోజున జల్లికట్టును అంగరంగ వైభంగా నిర్వహిస్తారు. మదురైకి దగ్గర్లో ఉన్న అలంగనల్లూరు దగ్గర నిర్వహించే ఈ పోటీలను చూడడానికి భారీ సంఖ్యలో జనం హాజరవుతారు. చదవండి: అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి ప్రపంచంలోనే అతిపెద్ద తాళం! -
Sankranthi: రైళ్లు, బస్సులు ఫుల్..
సాక్షి, అమరావతి బ్యూరో: సంక్రాంతికి ఇంటికెళదామనుకునే వారికి కష్టాలు తప్పని పరిస్థితి తలెత్తింది. జనవరి 7 నుంచి 14 వరకు రైళ్లు, బస్సుల్లో బెర్తులు, సీట్లు ఇప్పటికే బుక్ అయిపోయాయి. ప్రధానంగా విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్లే రైళ్లు, బస్సులకు డిమాండ్ అధికంగా ఉంటోంది. ఈ రూట్లో జనవరి 7వ తేదీ నుంచి 14 వరకు రైళ్లలో బెర్తులు దొరకని పరిస్థితి నెలకొంది. రిజర్వేషన్ చేయించుకుందామంటే చాలా రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంటోంది. కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఇప్పటికే ‘రిగ్రెట్’ అని వస్తోంది. విజయవాడ నుంచి విశాఖపట్నం మీదుగా నిత్యం 85 రైళ్లకు పైగా వెళ్తుంటాయి. వీటిలో రోజూ నడిచే రెగ్యులర్ రైళ్లు 27 కాగా, వీక్లీ, బై వీక్లీ రైళ్లు 58 వరకు ఉన్నాయి. సెకండ్ సిట్టింగ్‌తో నడిచే విజయవాడ–విశాఖ (రత్నాచల్), గుంటూరు–విశాఖ (సింహాద్రి), లింగంపల్లి–విశాఖ(జన్మభూమి) రైళ్లలో మాత్రమే ప్రస్తుతానికి కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి. మిగిలిన అన్ని రైళ్లలో.. అన్ని క్లాసులూ వెయిటింగ్ లిస్టులతోనే దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ ప్రాంతాల నుంచి తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్లే వారి సంఖ్య అత్యధికంగా ఉంటుంది. వీరంతా సంక్రాంతికి తమ స్వస్థలాలకు వెళ్లడానికి ముందస్తుగానే రిజర్వేషన్లు చేయించుకోవడంతో రైళ్లలో సీట్లు, బెర్తులు లభ్యం కావడం లేదు. బస్సులదీ అదే దారి మరోవైపు బస్సుల్లోనూ విజయవాడ–విశాఖపట్నం రూటుకే అత్యధిక డిమాండ్ కనిపిస్తోంది. విశాఖపట్నం మీదుగా విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల వైపు వెళ్లే రెగ్యులర్ బస్సుల్లో నూరు శాతం రిజర్వేషన్లు అయిపోయాయి. ఆర్టీసీ కృష్ణా రీజియన్ నుంచి రాష్ట్రంలోని వివిధ దూరప్రాంతాలకు రోజూ 463 రెగ్యులర్ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో ఇప్పటివరకు సంక్రాంతి సమయంలో (జనవరి 8–14 మధ్య) అధిక శాతం సీట్లు భర్తీ అయ్యాయి. రెగ్యులర్ బస్సుల్లో సీట్లు ఫుల్ అయ్యాక స్పెషల్ సర్వీసులకు రిజర్వేషన్లు తెరుస్తారు. హైదరాబాద్ వైపు రైళ్లలో ఖాళీలు కాగా, సంక్రాంతి సీజన్లో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే రైళ్లలో సీట్లు, బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఈ రూట్లో 36 ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రయాణిస్తుండగా రోజువారీ 19, వీక్లీ/బైవీక్లీ ట్రైన్లు 17 వరకు నడుస్తున్నాయి. వీటిలో శాతవాహన, గోల్కొండ, జన్మభూమి, ఇంటర్సిటీ రైళ్లు సెకండ్ సీటింగ్వి కాగా.. మిగిలినవి స్లీపర్ క్లాసులున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లే. ప్రస్తుతం ఈ రైళ్లలో దాదాపు అన్ని క్లాసుల బెర్తులు, సీట్లు పదులు, వందల సంఖ్యలో ఖాళీలున్నాయి. సంక్రాంతికి 1,266 స్పెషల్ బస్సులు ఈ సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ కృష్ణా రీజియన్ నుంచి 1,266 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. వీటిలో విశాఖపట్నానికి 390, రాజమండ్రికి 360, హైదరాబాద్‌కు 362, చెన్నైకి 20, బెంగళూరుకు 14, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు 120 బస్సులను నడపాలని నిర్ణయించినట్టు రీజనల్ మేనేజర్ ఎంవై దానం ‘సాక్షి’కి చెప్పారు. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి మరిన్ని స్పెషల్ సర్వీసులను నడపనున్నట్టు తెలిపారు. కాగా కోవిడ్ ప్రభావం వల్ల గత సంక్రాంతికి ఈ రీజియన్ నుంచి 1,093 స్పెషల్ బస్సులు నడిపారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 173 సర్వీసులు ఎక్కువ. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో ఈ సంక్రాంతికి స్పెషల్ సర్వీసుల సంఖ్యను పెంచుతున్నారు. -
సంక్రాంతి స్టార్ వార్
-
లవ్లీ లుక్స్.. టెరిఫిక్ టీజర్స్
పండగకు బోలెడు పిండి వంటలు.. భోజన ప్రియులకు భలే సంతోషం. మరి సినీ ప్రియులకు? లవ్లీ లుక్స్.. టెరిఫిక్ టీజర్స్ వడ్డించింది సినిమా ఇండస్ట్రీ. ఆ విశేషాలేంటో టేస్ట్ చేయండి. ► వెంకటేశ్, ప్రియమణి జంటగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘నారప్ప’. సురేష్ బాబు, కలైపులి యస్. థాను నిర్మాతలు. కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, వేసవిలో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ► పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్ సాబ్’. శ్రుతీహాసన్, అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటించారు. ‘దిల్’ రాజు నిర్మించారు. ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. ► గోపీచంద్ కబడ్డీ కోచ్‌గా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’ పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో తమన్నా కథానాయిక. టనితిన్ చెస్ ఛాంపియన్‌గా చంద్రశేఖర్ యేలేటి రూపొందించిన చిత్రం ‘చెక్’. రకుల్ ప్రీత్, ప్రియా ప్రకాశ్ వారియర్ కథానాయికలు. ఆనంద్ ప్రసాద్ నిర్మాత. ఈ సినిమా కొత్త పోస్టర్ విడుదలైంది. ► నితిన్, కీర్తీ సురేశ్ జోడీగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన చిత్రం ‘రంగ్ దే’. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ► ఆదీ సాయికుమార్, సురభి జంటగా శ్రీనివాస్ నాయుడు తెరకెక్కించిన చిత్రం ‘శశి’. ఫిబ్రవరి 12న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ► నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకురాలు. కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, ఈ వేసవిలో సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ► నాగ శౌర్య, కేతికా శర్మ జంటగా సంతోష్ జాగర్లపుడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘లక్ష్య’. సంక్రాంతి సందర్భంగా స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ► రాజ్ తరుణ్ హీరోగా విజయ్ కుమార్ కొండా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పవర్ ప్లే’. ఈ సినిమా ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌ను రానా విడుదల చేశారు. ► అదిత్ అరుణ్, శివానీ రాజశేఖర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సైబర్ థ్రిల్లర్ ‘డబ్యూ డబ్ల్యూ డబ్ల్యూ’. కేవీ గుహన్ దర్శకుడు. సంక్రాంతి స్పెషల్‌గా ఈ చిత్రం టీజర్‌ను మహేశ్‌బాబు విడుదల చేశారు. ► ‘మత్తు వదలరా’తో పరిచయమయ్యారు కీరవాణి తనయుడు శ్రీ సింహా కోడూరి. తాజాగా ‘తెల్లవారితే గురువారం’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయింది. మణికాంత్ గిల్లి దర్శకుడు. మార్చిలో సినిమా విడుదల. ► కమెడియన్ సత్య హీరోగా చేస్తున్న చిత్రం ‘వివాహ భోజనంబు’. రామ్ అబ్బరాజు దర్శకుడు. హీరో సందీప్ కిషన్ ఓ నిర్మాత. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ► మధు చిట్టి, మమత, ఉమా ముఖ్య పాత్రల్లో నరసింహ నంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘జాతీయ రహదారి’. çఫస్ట్‌లుక్‌ను సి.కల్యాణ్ విడుదల చేశారు. -
ఏపీ భవన్లో ఘనంగా సంక్రాంతి వేడుకలు
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు భారీ సంఖ్యలో తెలుగు ప్రజలు హాజరయ్యారు. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయం ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. హరిదాసుల కీర్తనలు ఆహూతులను ఆకర్షించాయి. రంగు రంగుల ముగ్గులు వేసి గొబ్బెమ్మలతో అలంకరించారు. చిన్నారులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పలు సాంస్కృతిక కార్యాక్రమాలతో ఏపీ భవన్లో పండగ వాతావరణం నెలకొంది. -
టాలీవుడ్ సెలబ్రిటీల భోగి సందడి..
తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. మూడు రోజుల పండుగలో తొలి రోజైనా భోగి నాడు.. భోగి మంటలు వేసి, వాకిళ్లను రంగురంగుల ముగ్గులతో అలకరించారు. పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా భోగిని ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. ప్రతి ఏడాదిలాగే ఈ సారి కూడా మెగా ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరి సంక్రాంతిని జరుపుకుంటున్నారు. ఈ సంబరాల్లో చిరంజీవి, రామ్‌చరణ్, వరుణ్ తేజ్, సాయిధరమ్‌తేజ్, కల్యాణ్‌దేవ్, నిహారిక, సుష్మిత.. ఇతర కుటుంబసభ్యులు పాల్గొన్నారు. నిహారిక దోశ వేస్తున్న ఫొటోను సుష్మిత.. దోశ స్టెప్పు అని పేర్కొన్నారు. మరోవైపు కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కుటుంబం శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్‌లో భోగి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా భోగి శుభాకాంక్షలు తెలిపిన మంచు లక్ష్మి, విష్ణు, మనోజ్‌లు పలు ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘ కొత్తగా ప్రారంభించడానికి ఒక శుభ దినం, భోగ భాగ్యాలను అందించే పర్వదినం. మీ కుటుంబం సిరిసంపదలతో సుసంపన్నంగా విరాజిల్లాలని ఆకాంక్షిస్తూ భోగి శుభాకాంక్షలు’ అని లక్ష్మి పేర్కొన్నారు. అలాగే విక్టరీ వెంకటేశ్ కూడా భోగి శుభాకాంక్షలు చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ ఈషా రెబ్బా.. తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. -
మా ఇంట్లో భోగిపళ్లు
భోగి పండగ నాడు పిల్లలకు భోగి పండ్లు (రేగి పండ్లు) పోస్తారు. పిల్లలకు దిష్టి దోషం పోవడానికి తెలుగువారు పాటించే ఆచారమిది. అయితే అప్పట్లోనూ, ఇప్పట్లోనూ ఈ ఆచారం ఒకేలా ఉందా? ఓ జ్ఞాపకం చిన్నప్పటినుంచి భోగి అంటే ఎందుకో మహా ఇష్టం. పొద్దున్నే వెచ్చగా భోగిమంటలు వేసుకోవడం, ఆ మంటల్లో వేయడానికి పాత విరిగిపోయిన కిటికీ తలుపులు, మంచం కోళ్లు, నూనెతో తడిపిన పాత బట్టలు తీసుకువెళ్లేవాళ్లం. మంచి చలిలో, తెల్లారని ఆ చీకటిలో ఎర్రటి మంట లేచి వెచ్చదనం ఇస్తుంటే ఆ ఆనందమే వేరుగా ఉండేది. మా ఇరుగుపొరుగు కొందరు భోగిమంటల్లో తేగలు కాల్చుకుని తినేవారు. మేం మాత్రం అది అయ్యాక శుభ్రంగా నలుగు పెట్టుకుని స్నానం చేసి, కొత్తబట్టలేసుకుని, దేవుడికి దణ్ణం పెట్టుకుని మామ్మ చేసిన వేడివేడి కొత్తబియ్యం పొంగలిలో ఆరారగా ఆవునెయ్యి వేసుకుని బాదం ఆకుల్లో పెట్టుకుని ఉప్ఫు.. ఉఫ్పు.. అంటూ ఊదుకుంటూ తినేవాళ్లం. సాయంత్రం అయ్యేసరికి మా ముగ్గురికీ భోగిపళ్లు పోసేవారు. అందుకోసం పేరంటం పిలిచేవారు. కొంతమంది ఇళ్లకు వెళ్లి నన్నే చెప్పుకోమనేవారు. నేను నా స్నేహితుల ఇళ్లకు వెళ్లి ‘‘మరే, సాయంత్రం నాకు భోగిపళ్లు పోస్తారు. నువ్వు తప్పకుండా రావాలి’’ అంటూ సిగ్గుపడేవాణ్ణి. మా అక్కలు కూడా వాళ్ల ఫ్రెండ్సుకు చెప్పుకునేవాళ్లు. వడ్డేశ్వరం నుంచి రకరకాల బంతిపూలు, చేమంతి పూలు మామిడి మండలు తెచ్చిపడేసేవాడు మా సీను బాబాయి. తరాలుగా మా ఇంటిలో పని చేస్తున్న శివమ్మ, సుబ్బారావు, శేషమ్మ పురికొసకు మామిడి మండలు గుచ్చి, గుమ్మాలకు తోరణాల్లా కట్టేవాళ్లు. మా తాతయ్య రెండు మానికల రేగుపళ్లు కొని పడేసేవాడు. భోగిపళ్లలో కలిపేందుకు పూల రెక్కలు, చిల్లర డబ్బులు మేం ముగ్గురం పోటీలు పడుతూ సిద్ధం చేసేవాళ్లం. ఈ లోపు భోగి పళ్ల కోసం తెచ్చిన రేగిపళ్లను మెల్లగా గుటుకూగుటుకూ మింVó సేవాణ్ణి, గింజలు కనపడకుండా. పళ్లు పులిసిపోతాయర్రా... జాగర్త... అని పెద్దమ్మమ్మ బోసినోటిని నొక్కుకుంటూ చెప్పినా విననట్టు నటించేవాణ్ణి. రేగిపళ్ల గింజలు మింగేస్తున్నానని మా అక్కలు కనిపెట్టి నన్ను బెదిరించేవాళ్లు, అవి కడుపులోకెళ్లి చెట్లవుతాయంటూ. అయితే అప్పటికే ఒకసారి వేపపండు గింజ మింగేసి, ఇట్లాగే ఎవరో నన్ను బెదిరించటం, కడుపులో వేప చెట్టు మొలిస్తే ఆ చేదు ఎట్లా భరించాలిరా నాయనా అని నేను విపరీతంగా భయపడిపోయి, నాలో నేనే దిగులుగా ఉండటం చూసి మా నాన్న ‘‘ఓరి పిచ్చోడా... విత్తనం మొలకెత్తాలంటే గాలి, నీరు, ఎండ ఉండాలి. అది పెరగాలం టే మట్టి కావాలి కదా... నీ బొజ్జలో అవన్నీ ఉన్నాయా మరి?’’ అని అడిగి నేను భయం వదిలిపెట్టి ధైర్యంగా లేవని చెప్పాక ‘‘ఒకటి రెండు గింజలు పొరపాటున మింగినా ఏం కాదు, మర్నాడు అవే బయటికి వచ్చేస్తాయి’’ అని ఏకంగా అప్పుడే నాకు సైన్స్ పాఠం చెప్పేసి ఉండటం వల్ల నేను లెక్క చేయలేదసలు. సాయంత్రం కాగానే ముఖం కాళ్లూ చేతులూ కడిగి మమ్మల్ని ముగ్గురినీ కుర్చీల్లో కూచోబెట్టేవాళ్లు. హారతి పళ్లెం, అక్షింతలు సిద్ధంగా ఉండేవి. పేరంటాళ్లు మెల్లగా వస్తుండేవాళ్లు. వరండా సగం నిండిందనిపించగానే మా సాంబక్కాయమ్మమ్మ మా అమ్మని, మామ్మని ‘‘ఇంకా చూస్తారేం, భోగిపళ్ల బేసిను తీసుకురండి’’ అంటూ గాఠిగా ఓ కేక పెట్టేది. మామ్మ అమ్మ చేతికి రేగుపళ్లు, బంతిపూల రెక్కలు, చిల్లర డబ్బులు వేసి కలిపి ఉంచిన బేసినిచ్చేది. అమ్మ అది తీసుకుని వచ్చేది. ముందు మామ్మ, తాతయ్య, అమ్మ, ప్రభాతత్త మూడేసి సార్లు మా ముగ్గురికీ భోగి పళ్లు పోసేవాళ్లు. మా సాంబక్కాయమ్మమ్మ, బాబాయిలు అందరూ పోసిన తర్వాత పేరంటాళ్ల వంతొచ్చేది. ఎదురింటి శారదాంబ, మా బుల్లిమామ్మ, కిష్టారావు పంతులు పెళ్లాం, ఇంకొందరు వచ్చి భోగిపళ్లు పోసి చేతిలో రెండేసో ఐదేసో రూపాయలు పెట్టేవాళ్లు. అప్పట్లో అవే గొప్ప. వాళ్లు అట్లా భోగి పళ్లు పోసేటప్పుడు మా నాన్న తన పాత బ్లాక్ అండ్ వైట్ కెమెరాతో ఫొటోలు తీసేవాడు. తల మీది నుంచి ముఖం మీదికి జారుతున్న పూల రెక్క లను తుడుచుకుంటున్నట్టుగా నేను మెల్లగా చిల్లర డబ్బులని చేతికి చిక్కించుకుని చొక్కా జేబులోకి తోసేవాణ్ణి. అందరూ భోగి పళ్లు పోసిన తర్వాత హారతులిచ్చేవాళ్లు. ‘పిల్లలకి హారతిచ్చేది కర్పూరంతో కాదమ్మా, నూనెతో తడిపిన ఒత్తులతో ఇవ్వాలి’ అనేది మామ్మ. పేరంటం అయిపోయి అందరూ ఇళ్లకు వెళ్లేటప్పుడు నానబెట్టిన సెనగలు, పండు, తాంబూలం, రేగు పళ్లు కవర్లలో పోసి ఇచ్చేది ప్రభాతత్త. అంతా అయిపోయాక శేషమ్మ చేత దిష్టి తీయించేది సాంబక్కాయమ్మమ్మ. ఆ పళ్లు, పూలు, చిల్లర డబ్బులు కాళ్ల కింద పడకుండా జాగ్రత్తగా పోగు చేసి మూట కట్టుకుని ఇంటికి తీసుకెళ్లేది శేషమ్మ. ఇవన్నీ దాదాపు ముప్ఫై నలభై ఏళ్ల క్రితం సంగతులు. ఇప్పుడు నేను మా పిల్లలకు భోగి పళ్లు పోయాలంటే అర కిలోనో కిలోనో రేగి పళ్లు కొనాలంటే గుండె గుభేలుమంటుంది. హైదరాబాదులో ఉండే మాకు మామూలు రోజుల్లోనే పావు కిలో ముప్ఫై నలభైకి అమ్మేవాళ్లు, భోగికి రెండు మూడు రోజుల ముందు నుంచే కేజీ రెండు మూడొందలు పైనే పెట్టాలి. అవీ అంత నాణ్యంగా ఏమీ ఉండవు. అయినా తినేవేం కాదు, తలమీది నుంచి పోసేవే కదా అని సరిపెట్టుకోవటమే. ఇక తమలపాకులు, వక్కలు, అరటిపళ్లు, చిల్లర పైసలు మామూలే. పేరంటానికి పిలవాలంటే ఇంట్లో వాళ్లంతో కలిపి పట్టుమని పదిమంది కూడా కారు. అయినా వాళ్లతోనే ‘‘మన ఇంటి ఆచారం’’ అంటూ సంక్రాంతి రోజున అమ్మ మా చేత భోగి పళ్లు పోయిస్తుంది. చిల్లర పైసలంటే రూపాయి, రెండు రూపాయల బిళ్లలే తప్ప పావలాలూ, అర్ధ రూపాయిలూ ఎక్కడ, అవి కనిపించడం మానేసి చాలారోజులే అయిందిగా... పూలు, పళ్లు ఎత్తుకుని తీసుకువెళ్లే వాళ్లెవరున్నారు, అన్నిటినీ మా ఆవిడే ఎత్తి డస్ట్‌బిన్‌లో పోయకూడదంటే చెట్లల్లో పోసి వస్తుంటుంది. ఏం చేస్తాం అంతా పట్నవాసం కదా మరి! – బాచి -
పల్లె పులకింత
ఎన్నాళ్ల నిరీక్షణో ఇది.. సంక్రాంతి రూపంలో ఫలించింది. బతుకుపోరులో సుదూరాలకు తరలి వెళ్లిన తన బిడ్డ పాదాన్ని పల్లెతల్లి మళ్లీ సుతారంగా ముద్దాడింది. ఏడాదికోసారి ఊరికి ఉత్సవాన్ని తెస్తున్న ఆ బిడ్డను చూసి పులకించిపోయింది. ఉద్వేగంతో గుండెలకు హత్తుకుంంది. పుట్టి పెరిగిన నేలపైకి కాలుమోపగానే.. ఆ బిడ్డకూ ఏదో నూతనోత్తేజం. పైరగాలి తాకి తనువు పరవశించింది. పచ్చదనాన్ని పరుచుకున్న పొలాల్ని చూసి హృదయం ఉప్పొంగింది. ఓ వైపు.. పక్షుల కిలకిలారావాలు.. ఎక్కడో సుదూర తీరాన చెట్టుపై నుంచి లీలగా వినిపిస్తున్న కోయిలమ్మ కూనిరాగాలు. ఎహే... అంటూ ముల్లుగర్రతో ఎద్దును అదిలిస్తున్న రైతన్న కేకలు.. మరోవైపు.. ఇళ్ల ముందు రంగవల్లులు.. ఆ ముగ్గుల సిగలో గుమ్మడి పువ్వులతో ముస్తాబైన గొబ్బెమ్మలు.. పలుకే బంగారమాయెరా కోదండరామా.. అంటూ వీధుల్లో వీనుల విందుగా భక్తిపారవశ్యంలో తేలియాడిస్తున్న హరిదాసు కీర్తనలు.. లంగాఓణీల్లో పల్లె పడుచుల కేరింతలు.. పిండివంటల ఘుమఘుమలు.. పేక ముక్కల కోతలు.. కోడి పందేలు.. అమలాపురం: గ్రామాల్లో ఎటు చూసినా సంక్రాంతి సందడే కనిపిస్తోంది. ఉపాధి, ఉద్యోగాల కోసం సుదూర ప్రాంతాలకు వలస వెళ్లినవారు... వేలాది రూపాయల ప్రయాణ భారాన్ని లెక్కచేయకుండా సొంత ప్రాంతాలకు తరలివస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో పట్టణవాసులు తమ సొంతూళ్లకు చేరుకున్నారు. చివరి నిమిషంలో బయలుదేరిన వారితో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు ఇంకా కిటకిటలాడుతూనే ఉన్నాయి. బస్సులు, విమాన చార్జీలను ఒక్కసారిగా పెంచేయడంతో హైదరాబాద్, చెన్నై, విశాఖ వంటి నగరాల్లో ఉన్న వారు సొంతకార్లలో ఊళ్లకు చేరుకుంటున్నారు. ఆస్ట్రేలియా, అమెరికా, ఇంగ్లండ్ తదితర దేశాల్లో ఉన్న వారు సైతం కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాలు జరుపుకొనేందుకు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, అనంతపురం, రాజమహేంద్రవరం, విశాఖ.. ఇలా నగరాలు, పట్టణాలన్నీ నూతన వస్త్రాలు కొనుగోలు చేసేవారితో కిటకిటలాడుతుంటే సోమవారం భోగి పండుగ కావడంతో గ్రామాల్లో పండగ సందడి పతాక స్థాయికి చేరింది. ఆడపడుచులు ఇళ్ల ముంగిట ముగ్గులతో పోటీ పడుతుంటే మగవారి కోసం కోడి పందేల బరులు సిద్ధమయ్యాయి. ప్రభల తీర్థం ప్రత్యేకం తూర్పుగోదావరి అనగానే గుర్తుకొచ్చేది ప్రభల తీర్థం. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోనసీమలో సంక్రాంతి పండుగ మూడురోజులూ పెద్ద ఎత్తున ప్రభల తీర్థాలు జరుగుతాయి. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు, కృష్ణా జిల్లా కైకలూరు వంటి ప్రాంతాల్లో అక్కడక్కడా చిన్న చిన్న తీర్థాలు జరిగినా.. ఒక్క కోనసీమలోనే 90 వరకు తీర్థాలు జరుగుతాయి. వీటి నిర్వహణలో కోనసీమ సంప్రదాయం ఉట్టిపడుతుంది. అంబాజీపేట మండలం జగ్గన్నతోట, కొత్తపేట, మామిడికుదురు మండలం కొర్లగుంటల్లో జరిగే ప్రభల తీర్థాలకు రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు ఉంది. వేలాదిమంది భక్తులు తరలివస్తారు. ఎన్ఆర్ఐలు, ఇతర ప్రాంతాలకు వలసపోయిన వారు ఈ తీర్థాలకు తప్పనిసరిగా హాజరవుతుంటారు. 20 అడుగుల వెడల్పు, 42 అడుగుల ఎత్తున భారీ ప్రభలను తయారుచేసి కుల, మతాలకు అతీతంగా భక్తులు తీర్థాలకు తరలించుకొస్తారు. పంటపొలాలు, పంట బోదెలు, కౌశికలు దాటుకుని ప్రభలు వచ్చే తీరు అద్భుతంగా ఉంటుంది. కోడి పందేలు ఇప్పటికే జరుగుతుండగా.. పండుగ వేళ భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోడి పందేలకు అనుమతిచ్చేది లేదని పోలీసులు చేస్తున్న హెచ్చరికలను నిర్వాహకులు లెక్కచేయడం లేదు. బరులు సిద్ధం చేస్తున్నారు. కోడిపందేలతో పాటు పొట్టేలు పందేలు, గుండాటలకు సైతం రంగం సిద్ధమైంది. -
కోడి పందేల వెల రూ.2 వేల కోట్లు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్ : సంక్రాంతి పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా కోడిపందేల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఎన్ని ఆంక్షలు పెట్టినా రాజకీయ అండతో ఈసారి కూడా నిర్వాహకులు మరింతగా ‘బరి’తెగిస్తున్నారు. రూ.రెండు వేల కోట్లకు పైగా ఈ ఏడాది పందేలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం ఎన్నికల ఏడాది కావడంతో ఇందుకు ఎంతో ముందు నుంచే వీటికి కసరత్తు జరిగింది. పోలీసులూ చూసీచూడనట్లు ఉండాలని వారికి లోపాయికారిగా సంకేతాలు అందాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన పలువురు మంత్రులు, అధికార పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు భారీఎత్తున కోడిపందాలను ప్రోత్సహిస్తున్నారు. కాగా, ఎప్పటిలాగే ఈసారి కూడా పశ్చిమ గోదావరి జిల్లా ఈ పందేలకు ప్రధాన కేంద్రంగా నిలుస్తోంది. క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ వంటి పోటీలు అని చెప్పి బరులు పెద్దఎత్తున సిద్ధంచేశారు. పందేలు సోమవారం నుంచి ప్రారంభమవుతుండడంతో కోళ్ల గ్రేడింగ్ పూర్తిచేసి పందేలకు అర్హత కలిగిన పుంజులను ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆయా ప్రాంతాలకు తరలించారు. ఈసారి రూ.2వేల కోట్లు టార్గెట్ కోడి పందేలతో పాటు బరుల పక్కనే పెద్దఎత్తున జూదం జరుగుతుంటుంది. పేకాట, కోతాట, గుండాటల్లో పెద్ద మొత్తాల్లో చేతులు మారుతుంది. ఇలా గతేడాది దాదాపు రూ.వెయ్యి కోట్ల మేర చేతులు మారినట్టు అంచనా. ఈసారి పెద్దగా పోలీసుల ఆంక్షలు లేకపోవడంతో ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాలకు కోడి పందేలు, జూదాన్ని బాగా విస్తరించారు. ప్రధానంగా ఒక్కో జిల్లాలో కనీసం భారీ పందేలు వేసేలా 15 పెద్ద బరులు, చిన్నపాటి పందేలు వేసుకునేలా 600 నుంచి 800 బరులు సిద్ధమయ్యాయి. చిన్నపాటి పందాల్లో కనీసం రూ.5 వేల నుంచి లక్ష వరకు పందెం ఒడ్డుతుంటారు. అదే భారీ పందేల్లో అయితే కనీసం రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు బెట్టింగ్ వేస్తుంటారు. దీనికితోడు పుంజులను బరిలో దింపిన వారు తమ పుంజు నెగ్గుతుందని నేరుగా బెట్టింగ్ వేస్తే.. చుట్టూ చేరిన వారు పైపందేలు కాస్తుంటారు. ఒక్కో పందెంలో నేరుగా రూ.5 వేల నుంచి రూ.5 లక్షల వరకు పందెం వేస్తే దానికి పైపందేలు రూ.లక్ష నుంచి రూ.50 లక్షల వరకు జరుగుతుంటాయి. ఈ లెక్కన ఒక్కో బరిలో రోజుకు కనీసం 15 కోడి పందేలను వేస్తుంటారు. అదే సంక్రాంతి రోజైతే 24గంటలూ పందేలు వేస్తారు. దీంతో ఒక్కో బరిలో మూడు రోజుల్లో దాదాపు 60 పందేలు వేస్తుంటారు. దీనికితోడు పేకాట, కోతాట, గుండాట ఫలితాలు నిమిషాల్లో తేలిపోతుంటాయి. వాస్తవానికి కోడి పందాల కంటే జూదంలోనే పెద్దఎత్తున మొత్తాలు చేతులు మారుతుంటాయి. ఈ లెక్కన గతేడాది రాష్ట్రంలో దాదాపు రూ.వెయ్యి కోట్లు చేతులు మారితే ఈ ఏడాది రూ.1,500 నుంచి రూ.2 వేల కోట్లు మారుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. గ్రేడింగ్ ఇలా.. పందేలకు ఇక ఒకరోజే సమయం ఉండడంతో పెంపకం స్థావరాల్లో కోడి పుంజులకు గ్రేడింగ్ పూర్తిచేసి పందెం బరులకు తరలించారు. తొలుత డింకీ పందెం వేస్తారు. అందులో పందెం పుంజు తన ప్రత్యర్థి పుంజుపై నిమిషానికి నాలుగుసార్లు చొప్పున దాడిచేసి వరుసగా రెండు డింకీ పందేలలో ప్రతిభ చూపితే ఆ పుంజు మొదటి శ్రేణి పుంజుగా పరిగణిస్తారు. ఈ రకం పుంజు ధర రూ.1.50 లక్షలు ఉంటుంది. సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఎన్నికల సంవత్సరం కావడంతో రాజకీయంగా రాణించాలంటే కోడి పందేలకు అడ్డంకులు చెప్పకూడదని పలు జిల్లాల నేతలు ప్రభుత్వ పెద్దలపై ఒత్తిడి తెచ్చారు. దీంతో సర్కారు వీరికి లోపాయికారిగా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతేడాది కోడి పందాలు అడ్డుకుంటామంటూ నెలరోజుల ముందు నుంచే పోలీసులు హెచ్చరికలు చేయడంతోపాటు ముందస్తు దాడులు, కత్తులు కట్టే వారిపై బైండోవర్ కేసులు పెట్టి కట్టడిచేసే ప్రయత్నాలు చేశారు. అయినా, పందేలు ఆగకపోవడంతో పోలీసులు, అధికారులు న్యాయస్థానానికి సమాధానం చెప్పుకోవాల్సి వచ్చింది. వాటిని ఎందుకు అడ్డుకోలేకపోయారో వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర హైకోర్టు ఆదేశించడంతో డీజీపీ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టుకు హాజరయ్యారు. తాజాగా, విజయవాడలో హైకోర్టు కార్యకలాపాలు మొదలవడంతో ఈ విషయంలో న్యాయస్థానం ఎలా స్పందిస్తుందోనని నిర్వాహకుల్లో టెన్షన్ నెలకొంది. తోటల్లో బరులు.. అక్కడే అన్ని ఏర్పాట్లు ఇదిలా ఉంటే.. కోడి పందేల నిర్వహణకు మామిడి తోటలు, కొబ్బరి తోటలు, ఇతర పండ్ల తోటలను నిర్వాహకులు లీజుకు తీసుకుంటున్నారు. ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, ఇతర ముఖ్యమైన వారి కోసం బరుల వద్దే మద్యం విక్రయాలు ఏర్పాటుచేస్తున్నారు. కోడి పందేల బరులకు ఆనుకుని పేకాట, కోతాట, గుండాట వంటి జూదాల నిర్వహణకు కూడా రంగం సిద్ధమైంది. ఈ జూదాల్లో కేవుల్ (నిర్వహణ వాటా) వల్ల పెద్ద మొత్తాల్లో ఆర్థిక లాభం ఉండటంతో వీటి నిర్వహణకు గ్రామ, పట్టణాల్లో తీవ్ర పోటీ నెలకొంది. విదేశాల నుంచీ రాక మరోవైపు.. సంక్రాంతి పండుగ కోసం అమెరికా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో స్థిరపడిన వారు సైతం సొంతూళ్లకు వస్తుండగా పందేల్లో పాల్గొనేందుకు వారు ఇప్పటికే స్థానిక బ్యాంకుల్లోని తమ ఖాతాల్లోకి నగదును బదిలీ చేసేశారు. పురుషులకు తామేమీ తీసిపోమంటూ మహిళలు, యువతులు కూడా పందేలకు వస్తున్నారు. కోనసీమలోని దిండి పరిసర రిసార్ట్స్లతోపాటు పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని హోటళ్లు నెలరోజుల కిందటే బుక్ అయిపోయాయి. అమరావతి, విజయవాడ, రాయలసీమ ఉత్తరాంధ్రలతోపాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, నాగపూర్, భువనేశ్వర్, ఢిల్లీ తదితర ప్రాంతాల నుంచీ కూడా పందెం రాయుళ్లు చేరుకుంటున్నారు. ‘పశ్చిమ’లో అయితే పర్యాటక ఏజెంట్లు ప్రైవేటు నివాస గృహాలను కూడా సంప్రదిస్తున్నారు. ఒక మడత మంచం వేస్తే సాధారణ తాటాకు ఇల్లు కూడా స్టార్ హోటల్ రూమ్ ధర పలుకుతుందని ఒక పర్యాటక ఏజెంట్ ‘సాక్షి’కి చెప్పారు. మొక్కుబడిగా దాడులు.. కోడి పందాలకు కేంద్రంగా చెప్పుకునే ఉభయగోదావరి జిల్లాల్లో గడిచిన రెండు రోజులుగా పోలీసులు మొక్కుబడిగా దాడులు నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో బరులను ధ్వంసం చేసిన పోలీసులు కోడి పుంజులకు కత్తులు కట్టే వారిపై బైండోవర్ కేసులు పెట్టారు. అయితే, రాజకీయ అండదండలున్న వారు పోలీసులకు ఎదురు తిరుగుతున్నారు. ఎటువంటి హెచ్చరికలు లేకుండా ఈ దాడులేంటని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం సమీపంలో ఒక పోలీసు అధికారిని నిర్వాహకులే నిలదీశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కోనసీమ పుంజులకు అత్యధిక ధర కోడి పందేల్లో కోనసీమ పుంజులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి వాతావరణంలో పెరిగిన పుంజులు పందేలలో రాణిస్తాయన్న నమ్మకం ఉంది. పెంపకం, తర్ఫీదు కూడా అదేస్థాయిలో ఉంటుంది. ప్రస్తుత సంక్రాంతికి పందెం రాయుళ్ళు కోనసీమ పుంజులపై అత్యధికంగా నగదు పెట్టారని సమాచారం. ఈసారి కోనసీమ పుంజు ఏకంగా రూ.1.50 లక్షల ధర పలికింది. ఈ ధరకు సుమారు 300లకుపైగా పందెం పుంజులు పశ్చిమ గోదావరి జిల్లాకు వెళ్లినట్లు తెలిసింది. లక్షా యాభై వేలలోపు ధరలున్న పుంజులు కూడా అధికంగా అమ్ముడయ్యాయి. టీడీపీ నేతల అండదండలతో.. - రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేల అండదండలతో అనేకచోట్ల బరులు సిద్ధంచేశారు. - కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లులో అధికార పార్టీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు 10 ఎకరాలను చదును చేసి బరిని సిద్ధంచేశారు. - ఇదే జిల్లా గొడవర్రు గ్రామంలో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అనుచరులు కూడా ఆరు ఎకరాల్లో బరిని ఏర్పాటుచేశారు. - అలాగే, బాపులపాడు మండలం అంపాపురంలోనూ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు బరి ఏర్పాటుచేశారు. అంతేకాక, కొత్తూరు తాడేపల్లి, గుడివాడ, పామర్రు, కైకలూరు, మైలవరం మండలాల్లో అధికార పార్టీ నేతల అండదండలతో బరులు సిద్ధం చేశారు. - శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుచరులు ఐదు మండలాల్లో బరులను ఏర్పాటుచేస్తున్నారు. - ఇక గుంటూరు జిల్లాలో ఆదివారం నుంచే పందేలకు తెరలేపారు. రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో అనేక ప్రాంతాల్లో ఒక్కరోజే కోటికి పైగా చేతులు మారినట్లు సమాచారం. జిల్లాకు చెందిన ఓ టీడీపీ ఎంపీ డైరెక్షన్లో పెద్దఎత్తున బరులు ఏర్పాటుచేశారు. - విశాఖ తూర్పు నియోజకవర్గ పరిధిలోని ఆరిలోవలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు మూడేళ్లుగా పందేలు నిర్వహిస్తున్నారు. - తూర్పు గోదావరి జిల్లాలో హోంమంత్రి చినరాజప్ప సొంత ఇలాకా పెద్దాపురం నియోజకవర్గంలోనే భారీఎత్తున పందేలకు ఏర్పాట్లుచేశారు. అలాగే, ఆర్థికమంత్రి యనమల ఇలాకా తునిలోని తేటగుంటలో పెద్ద పందేలకు రంగం సిద్ధం చేశారు. -
పంతంగి టోల్‌ప్లాజా వద్ద సంక్రాంతి రద్దీ
చౌటుప్పల్: సంక్రాంతి పండుగ కోసం తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజలు తమ స్వస్థలాలకు బయలుదేరటంతో 65వ నంబరు జాతీయ రహదారి రద్దీగా మారింది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం వాహనాలు బారులు తీరాయి. రద్దీ పెరగడంతో వాహనదారులు ఇబ్బంది పడకుండా టోల్ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచి ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉంది. -
కోడి పందేల జాతర
కోడి పందేలకు వేళయింది. ఏటా సంక్రాంతి పండగకు రూ.లక్షల్లో కోడి పందేలు.. రూ.కోట్లలో పేకాట. ఏటా ఆనవాయితీగా వస్తున్న ఆటలో ఏడాదిపాటు చెమటోడ్చి పండించిన పంట కష్టం ఒక్కసారి పోగొట్టుకున్న అభాగ్యులెందరో. వీధిన పడిన కుటుంబాలు మరెన్నో. సత్తుపల్లి నియోజకవర్గం ఏపీ రాష్ట్రంలోని కృష్ణా, ఉభయగోదావరి జిల్లాల సరిహద్దుల్లో ఉండడంతో జూదాన్ని అరికట్టడం పోలీసులకు తలకుమించిన భారంగా మారింది. డిసెంబర్ చివరి నుంచి జనవరి నెలాఖరు వరకు పందేలకు సీజన్‌గా చెప్పుకుంటారు. నెల రోజులపాటు ఏ నలుగురు జూదగాళ్లు కలిసినా పందెం ఎక్కడ జరుగుతుంది.. పేకాట ఎక్కడ నడుస్తుందనే సంభాషణలే. ఇందులోనే సంకలో పుంజు పెట్టుకొని తిరిగేవాళ్లు. కేవలం గంట వ్యవధిలోనే పందెంరాయుళ్లు ఒకేచోట కలుసుకోవడం.. అక్కడికక్కడే పందెం వేసుకోవడం.. మళ్లీ స్థలం మార్చడం నిత్యకృత్యం. పది రోజుల నుంచే అక్కడక్కడా పందేలు జరుగుతున్నాయంటే ఎంత డబ్బు చేతులు మారుతుందో అర్థం చేసుకోవచ్చు. సత్తుపల్లి: ఆంధ్రా సరిహద్దు మామిడి తోటలన్నీ పందెం బిర్రులుగా మారుతున్నాయి. సత్తుపల్లి ప్రాంతానికి చెందిన పందెంరాయుళ్లు బిర్రులు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రూ.కోట్లలో కోడిపందేలు నిర్వహించేందుకు ఏర్పాట్లు కూడా చకచకా చేసుకుంటున్నారు. ఆంధ్రా ప్రాంతంలో అయితే పోలీసుల నుంచి ఎటువంటి ఇబ్బందులు ఉండవని.. సురక్షితంగా పందేలు వేసుకోవచ్చనే ఉద్దేశంతో పందెంరాయుళ్లు ఆంధ్రాకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిసింది. ఆయా ప్రాంతాల్లో జరిగే పందెం బిర్రులన్నీ సత్తుపల్లి పరిసర ప్రాంత జూదగాళ్లతోనే నడుస్తాయి. రూ.కోట్లలో పేకాట.. కోడిపందెం మాటున రూ.కోట్లలో పేకాట నడుస్తున్నట్లు సమాచారం. కోడిపందేలు ఒక ఎత్తయితే.. రాత్రి, పగలూ తేడా లేకుండా విద్యుత్ జనరేటర్లు అమర్చి మరీ లోనా.. బయటా(పేకాట) నిర్వహించడంతో రెప్పపాటులో రూ.కోట్లు చేతులు మారి జూదరులు వీధినపడిన సంఘటనలు కోకొల్లలు. ఇవే కాకుండా.. గుండుపట్టాలతో జూదం నిర్వహిస్తారు. దీనికి తగినట్లుగా ఈ ప్రాంతంలో ఘర్షణలు చోటు చేసుకుంటాయి. అయితే పది రోజుల నుంచే ఆంధ్రా సరిహద్దుల్లో పేకాట జోరుగా నడుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కుక్కుట శాస్త్రమంటే.. ముసుగు పందేలలో కుక్కుట శాస్త్రం చూసుకొని పందెం వేస్తుంటారు. ఏ సమయంలో.. ఏ నక్షత్రంలో.. ఏ రంగుపుంజు పొడుస్తుంది.. యజమాని పేరులోని మొదటి అక్షరాన్నిబట్టి కుక్కుట శాస్త్రాన్ని అనుసరించి పందెం వేయడం ఆనవాయితీగా వస్తోంది. కోడి పందేలు జరిగే ప్రదేశం.. కోళ్ల యజమానులు ఉండే ప్రదేశం.. పందెం రోజు జరిగే నక్షత్రం.. శుక్లపక్షంలో నెగ్గే కోళ్లనుబట్టి పందేలు వేస్తారంటే ఆశ్చర్యం కలగక మానదు. కోళ్ల పందెం ఏ దిశగా జరుగుతుందో పుంజు యజమాని తన కోడిపుంజును ఆ దిక్కుకు తీసుకెళ్లే విషయంపైనే జయాపజయాలు ఆధారపడి ఉంటాయని పందెంరాయుళ్ల విశ్వాసం. ఆ మూడు రోజులు ఫుల్ జోష్.. భోగి, సంక్రాంతి, కనుమ ఈ మూడు రోజులు సంక్రాంతి పందేలకు అడ్డూ అదుపూ ఉండదు. సత్తుపల్లి శివారులోని చింతలపూడి మండలంలో ఐదారుచోట్ల పందేలు పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. సత్తుపల్లి ప్రాంతంలోని కొందరు పందెం బిర్రులు తీసుకొని మరీ పందేలు నడిపిస్తారు. ఏపీ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం రాఘవాపురం, సీతానగరం, పోతునూరు, చింతంపల్లి, ధర్మాజిగూడెం, కళ్ల చెరువు, వెంకటాపురం, పంచాలకుంట, ప్రగడవరం, గోకారం, కృష్ణా జిల్లా తిరువూరు, కాకర్ల, విస్సన్నపేటల్లో పందేలు జోరుగా జరుగుతాయి. ఇంకా పెద్దపెద్ద పందేలు కొప్పాక, భీమవరంలో భారీ సెట్టింగ్‌ల మధ్య నిర్వహిస్తారు. పందెంకోళ్ల రకాలు.. పందెంకోళ్లు సుమారు 50 రకాల వరకు ఉన్నాయి. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, పర్ల, సేతువు, పూల, పింగళి, కౌజు, నల్లమచ్చల సేతువు, ఎర్రబోరా, నల్లబోరా, మైల, కొక్కిరాయి, నల్ల సవల ఇలా అనేక రకాలు ఉన్నాయి. ప్రాంతాలనుబట్టి పేర్లు మారిపోతుంటాయి. వీటిలో కాకి, డేగ, నెమలి పందేలకు పెట్టింది పేరు. వీటి ధరలు రూ.5వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతాయి. పూర్వ కాలంలో కోడిపందేల కోసం యుద్ధాలు జరిగినట్లు చరిత్ర చెబుతోంది. పల్నాటి చరిత్ర, బొబ్బిలి యుద్ధంలో కోడిపందేల చరిత్ర ఆనవాళ్లు కనిపిస్తాయి. -
ఘనంగా టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు
డాలస్/ ఫోర్ట్ వర్త్: అమెరికాలోని సాహిత్య, సంగీత సంస్కృతీ సంప్రదాయాలకు పెద్ద పీట వేసి, ఆధునికతను మేళవించి తెలుగు మనసులను రంజింపచేశారు. సాంస్కృతిక బృంద సమన్వయ కర్త పద్మశ్రీ తోట ఆధ్వర్యంలో, శీలం కృష్ణవేణి అధ్యక్షతన డాలస్‌లో జనవరి 27న స్థానిక మార్తోమా చర్చి ఆడిటోరియంలో టాంటెక్స్ సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా జరిగాయి. ప్రార్థనా గీతంతో ప్రారంభమైన కార్యక్రమాలు, సంస్కృతి సంప్రదాయాల మేళవింపుగా చాలా ఆసక్తికరంగా సాగాయి. కూచిపూడి నృత్యాలు, ‘దైర్యే సాహసే లక్ష్మి’ అనే నృత్యరూపకం పలువురిని ఆకట్టుకున్నాయి. సినిమా పాటలకు పిల్లలు చేసిన డ్యాన్స్‌లు హుషారును నింపాయి. వినూత్నంగా ‘అమ్మ’ పాటలతో సాగిన నృత్య రూపకం అందరిని ఎంతగానో అలరించింది. ఈ కార్యక్రమంలో టాంటెక్స్ నూతన అధ్యక్షులు శీలం కృష్ణవేణి మాట్లాడుతూ.. ఈ సంక్రాంతి పర్యదినాన నూతన ఉత్సాహంతో తెలుగు భాషకు, ప్రజలకు సేవ చేయడమే పరమార్దం అని అన్నారు. నిస్వార్ద కళా సేవకులు, నిర్విరామ శ్రామికులు తన కార్యవర్గ సభ్యుల అండదండలతో ఉత్తర అమెరికా తెలుగు ప్రజలకు తన శాయశక్తులా సహాయ పడతానని ఆమె అన్నారు. అంతేకాక 32 సంవత్సరాల చరిత్ర ఉన్న టాంటెక్స్ లాంటి విశిష్ట సంస్థకు అధ్యక్ష పదవి చేపట్టినందుకు సర్వదా కృతజ్ఞురాలునని, టాంటెక్స్ సంస్థ తెలుగు వారందరికి మరింత చేరువయ్యేలా చేసి, తెలుగు జాతి మొత్తం గర్వపడేలా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఉప్పలపాటి కృష్ణారెడ్డికి శాలువా కప్పి పుష్ప గుచ్చాలతో టాంటెక్స్ అధ్యక్షులు శీలం కృష్ణవేణి, కార్యవర్గ, పాలకమండలి సభ్యులు ఘనంగా సత్కరించారు. 2017 సంవత్సరంలో పోషక దాతలను కృష్ణారెడ్డి ఉప్పలపాటి, శీలం కృష్ణవేణి, మిగతా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు. కొత్తగా ఎన్నికైన సంస్థ కార్యనిర్వహక సభ్యులు కోడూరు కృష్ణారెడ్డి, పాలేటి లక్ష్మి, బండారు సతీష్, చంద్ర పోలీస్, బొమ్మ వెంకటేష్, యెనికపాటి జనార్ధన్‌లను, పాలక మండలి సభ్యులు నీలపరెడ్డి మధుసూదన్ రెడ్డి, మందాడి ఇందు రెడ్డి, నెల్లుట్ల పవన్ రాజ్, అర్రెబోలు దేవేందర్ రెడ్డిలను సాదరంగా కమిటీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ సినీ నటి రజిత విచ్చేశారు. నటి తన హాస్యోక్తులతో, చిరు నాటకతో ప్రేక్షకులను అలరించారు. అతిథి రజితకు సంస్థ కార్యవర్గ సభ్యులు శాలువ కప్పి, జ్ఞాపికతో సత్కరించారు. కార్యక్రమానికి సహాకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. జాతీయ గీతం ఆలపించడంతో, విచ్చేసిన వారందరినీ ఎంతో ఆహ్లాదపరచిన, శోభాయమానంగా నిర్వహించిన సంక్రాంతి సంబరాలకు తెరపడింది. -
జనం మధ్యలో జగన్ సంక్రాంతి సంబరాలు
హరిదాసులు, ముత్యాల ముగ్గులు, గంగిరెద్దులు, పూరిళ్లు, కొలువు దీరిన గొబ్బెమ్మలు, బంతిపూల హరివిల్లులు... సంక్రాంతి పర్వదినం సందర్భంగా సోమవారం వైఎస్ జగన్ బస చేసిన శిబిరం వద్ద కనిపించిన దశ్యాలివి. తెలుగింట పెద్ద పండగ అయిన సంక్రాంతి సందర్భంగా ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించిన జగన్.. తాను బస చేసిన శిబిరం వద్ద ప్రజలు, బంధు మిత్రులు, ప్రజా ప్రతినిధులు, శ్రేయోభిలాషుల మధ్య వేడుకలు జరుపుకున్నారు. సంప్రదాయ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. పల్లె వాతావరణాన్ని తలపించేలా వేసిన రెండు పూరిళ్ల మధ్య ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి నమస్కరించారు. సంప్రదాయబద్ధంగా పెద్దలకు బట్టలు పెట్టారు. పండగ సందర్భంగా కోలాటాన్ని, భజనలను, పతంగుల ఎగురవేతను ప్రత్యక్షంగా తిలకించారు. హరిదాసులు శ్రావ్యంగా కీర్తనలు ఆలపించారు. మహిళలు సంప్రదాయ నృత్యాలు చేశారు. గంగిరెద్దుల వాళ్లు తమ ఆటలతో అలరించారు. ఈ సందర్భంగా జగన్ రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు అష్ట ఐశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. జగన్‌ను వేదపండితులు ఆశీర్వదించారు. ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, రోజా, సునీల్ కుమార్, నారాయణ స్వామి, పార్టీ నేతలు బియ్యపు మధుసూదనరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ఆదిమూలం, జే శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
పల్లెల్లో ఆరంభమైన భోగి సందడి
-
కాలు దువ్వుతున్న నేతలు..
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘సంక్రాంతికి కోడిపందేలు వేయొద్దని ఇచ్చిన తీర్పును ఉల్లంఘిస్తే ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీలపై చర్యలు తప్పవు. అధికారులు ఎంత చిత్తశుద్దితో పనిచేస్తారో చూస్తాం’’ అని హైకోర్టు హెచ్చరించినా అధికారపార్టీ నేతలకు, ప్రజాప్రతినిధులకు చీమకుట్టినట్టయినా లేదు. పందెం కోళ్లను సిద్ధం చేశారు. బెట్టింగులకు కోట్ల కొద్దీ డబ్బు రెడీ చేశారు. పందేలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తిచేసేశారు. దీంతో అధికారులు వణికిపోతున్నారు. ఒకవైపు కోర్టు హెచ్చరికలు, మరోవైపు అధికార పార్టీ నేతల దూకుడుతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. గత ఏడాది జరిగిన పందేలపైనే కోర్టు సీరియస్ కావడంతోపాటు తహసీల్దార్లు, ఎస్సైలపై ఏం యాక్షన్ తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించింది. తాజాగా కొందరు నేతలు దీనిపై సుప్రీంను ఆశ్రయించడం, కోర్టు తీర్పు ఎలా ఉన్నా పందేలకు సన్నాహాలు జరుగుతుండడంతో తాము బలిపశువులుగా మారతామన్న ఆందోళన మండల స్థాయి అధికారుల నుంచి వ్యక్తం అవుతోంది. గతంలో ఉభయ గోదావరి జిల్లాలకే పరిమితమైన ఈ పందేలు ఇప్పుడు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ విస్తరించాయి. గత ఏడాది కోడిపందేలలో రూ.200 కోట్ల వరకు చేతులు మారగా ఈసారి రెట్టింపుకన్నా ఎక్కువే ఉండవచ్చని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాకే పెరిగిన పందేలు.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విష సంస్కృతి పెచ్చుమీరిపోయింది. దీంతో మూడేళ్లుగా వరుసగా హైకోర్టు జోక్యం చేసుకోవడం.. అయినా పండగ మూడు రోజులు ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఆదేశాలతో కోడి పందేలు నిర్వహించడం ఆనవాయితీగా మారిపోయింది. అయితే ఈసారి హైకోర్టు ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించడం, కోడిపందేలు జరిగితే డీజీపీతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బాధ్యులుగా చేస్తామని హెచ్చరించడంతో అధికారుల్లో కలకలం మొదలైంది. కోడిపందేలు నిర్వహించే మండలాల్లో రెవెన్యూ, పోలీసు, స్వచ్ఛంద సేవాసంస్థల బృందాలతో కమిటీలు వేశారు. గత ఏడాది పందేలు నిర్వహించిన ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గోదావరి జిల్లాల్లో సుమారు ఎనిమిది వందల మందిపై బైండోవర్ కేసులు పెట్టారని, కత్తులు కూడా స్వాధీనం చేసుకున్నారని వినిపిస్తోంది. అయితే చివరినిమిషంలో ఏమైనా జరగవచ్చని, పందేలను నిర్వహించేలా ప్రభుత్వ పెద్దల నుంచి మళ్లీ ఆదేశాలు రావచ్చని అధికారపార్టీనేతలు ధీమాగా ఉన్నారు. సిద్ధమౌతున్న బరులు.. ఆందోళనలో అధికారులు.. కోర్టు ఆంక్షలు, అధికారుల హడావిడి నేపథ్యంలో పందెంరాయుళ్లు ఈసారి కొత్త ప్రాంతాల్లో ఈ పందేలు నిర్వహించడానికి సన్నద్ధమవుతున్నారు. కృష్ణాజిల్లా ముసునూరులో బరులను ట్రాక్టర్లతో దున్నించారు. వాటిని ఎలా ఆపాలో తెలియక అధికారులు సతమతమవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో 2016లో తాము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని 43 మంది తహసీల్దార్లు, 49 మంది ఎస్హెచ్ఓలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఇప్పటికే కోర్టు ఆదేశించింది. వెంప గ్రామానికి చెందిన కలిదిండి రామచంద్రరాజు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీచేసింది. ఈ నెల 29కి వాయిదా వేయడంతో ఈలోపు కోడిపందేలు జరిగితే తాము బలిపశువులుగా మారతామనే భయం మండలస్థాయి అధికారుల్లో కనపడుతోంది. కొంతమంది అధికారులు సెలవుపై వెళ్లేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసి తమను తాము కాపాడుకుంటున్నారని, తమ పరిస్థితి ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. పలువురు ప్రజాప్రతినిధులు కోడి పందేలను నిర్వహించి తీరుతామని చెబుతుండగా, బీజేపీ నేత రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పండుగ మూడురోజులు పందేలు నిర్వహించుకుందామని తమ నేతలకు చెబుతున్నారు. ఒక ఎమ్మెల్యే అయితే ‘మా తోటలోనే వేస్తాను. ఎవరు అడ్డువస్తారో చూద్దాం’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. కోళ్లకు సహజంగానే ఎదురుపడితే కొట్టుకుంటాయని, వాటిని ఎలా ఆపగలమని ప్రభుత్వ విప్ చింతమనేని అంటున్నారు. గతంలో ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణాలో మెట్టప్రాంతానికి పరిమితం అయిన ఈ పోటీలు ఇప్పుడు ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తున్నాయి. అ«ధికార పార్టీ నేతల పుణ్యమా అని విశాఖపట్నంలో కూడా మూడేళ్లుగా కోడి పందేలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పందేలు ఎక్కడెక్కడ? విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు రెండేళ్లుగా ఆరిలోవ సమీపంలోని ముడసర్లోవలో నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా ముడసర్లోవ రిజర్వాయరు వెనుక రామకృష్ణాపురం సమీపంలో జీవీఎంసీ ఖాళీ స్థలంలో కోడి పందేలు నిర్వహించడానికి రామకృష్ణబాబు అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. కృష్ణాజిల్లాలో పెడన నియోజకవర్గంలోని కొంకేపూడి, నందమూరు, పుల్లపాడు, కాకర్లమూడి, బందరు రూరల్ మండలంలోని కానూరు, గోపువానిపాలెం, మేకవానిపాలెం, పోలాటితిప్ప, రుద్రవరం, మాలకాయలంక, చిన్నాపురం, ఘంటసాల మండలం కొడాలి, శ్రీకాకుళం, పాపవినాశనం, మొవ్వ మండలం కూచిపూడి, గోడపాడు, బార్లపూడి, భట్లపెనుమర్రు, గూడూరు, కంకిపాడు మండలం ఈడ్పుగల్లు, గుడివాడ, నూజివీడు, కైకలూరు ప్రాంతాల్లో జోరుగా నిర్వహిస్తారు. మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామంలో భారీస్థాయిలో పందేలు నిర్వహించనున్నారు. ఏటా 30 ఎకరాల్లో టెంట్లు వేసి మరీ పందేలు నిర్వహిస్తూ ఉంటారు. తూర్పుగోదావరి జిల్లాలో కోనసీమలో ఐ.పోలవరం, మలికిపురం, కొత్తపేట, రావులపాలెం, సఖినేటిపల్లి, అంబాజీపేట, అల్లవరం, ఉప్పలగుప్తం, కాట్రేనికోన ఇలా పలు మండలాల్లో కోడి పందేల బరులు వెలుస్తాయి. సామర్లకోట, పెద్దాపురం మండలాల్లో కూడా పందేలు జరుగుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రధానంగా వెంప, భీమవరం ఆశ్రమతోట, లోసరి, ఐ భీమవరం, సీసలి, మహదేవపట్నం, కొప్పాక, జంగారెడ్డిగూడెం, ధర్మాజీగూడెం, భీమడోలు, గుండుగొలను తదితర ప్రాంతాల్లో పందేలు నిర్వహిస్తున్నారు. ఈసారి హైకోర్టు బ్రేకులు వేయడంతో ఇప్పటికే గుండాట, లోపుబయట, కోత ముక్క వంటి జూదాలకు ముందుగానే డబ్బులు చెల్లించిన వారు ఆ డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ నిర్వాహకులపై ఒత్తిడి తెస్తున్నారు. హైకోర్టు ఏం చెప్పిందంటే.... ‘‘మీరు కళ్లు మూసుకుని ఉండొచ్చు. కాని మేం కళ్లు మూసుకోలేదు. వందల కోట్ల రూపాయల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. మీరు రూ.9.72 లక్షలు స్వాధీనం చేసుకున్నామంటారా! ఎక్కడెక్కడి నుంచో జనాలొస్తున్నారు.. టూరిస్ట్ బస్సులు నడుపుతున్నారు. మేం ఈసారి అధికారుల చిత్తశుద్ధిని పరీక్షించదలిచాం. కోడి పందేలపై 2016లో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాల్సిందే. ఉల్లంఘన జరిగితే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలపై చర్యలు తప్పవు. కోడి పందేలు జరగకుండా ఏం చర్యలు తీసుకున్నారో నివేదికలివ్వాలి’’ అంటూ హైకోర్టు ఈనెల 4న ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది కోడి పందేలు జరగకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలు గట్టి చర్యలు తీసుకుంటారని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ ఇచ్చిన హామీని కోర్టు నమోదు చేసింది. అంతేకాక 2016లో తాము ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయాలని 43 మంది తహసీల్దార్లు, 49 మంది ఎస్హెచ్ఓలపై ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ నివేదిక ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. గత సంక్రాంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం మండలం, వెంప, శ్రీరాంపురం గ్రామాల్లో కోడిపందేల పేరుతో జూదం, అశ్లీల నృత్యాలు, వ్యభిచారం నిర్వహించారని, రానున్న సంక్రాంతి సందర్భంగా ఇవేమీ జరగకుండా తగిన చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ కలిదిండి రామచంద్రరాజు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ జరిపిన హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. -
గాలిపటమా.. పద.. పద.. పద!
సంక్రాంతి.. తెలుగు నేలపై ఒక్కోచోటా ఒక్కో తీరుగా జరిగే పండుగ.. కొత్త అల్లుళ్లు, కొంటె మరదళ్లు.. కోడిపందేలు, డూడూ బసవన్నలు.. రంగవల్లులు, పిండివంటలు.. ఇలా సంక్రాంతి సంబరం అంబరాన్ని తాకుతుంది. వీటన్నింటితో పాటు సంక్రాంతికి కొత్త శోభ తీసుకొచ్చేది పతంగులే. సంక్రాంతి వచ్చిందంటే చాలు చిన్నా, పెద్దా గాలిపటాలైపోతారు.. పతంగ్‌లు ఎగరేస్తూ సందడి చేస్తుంటారు.. ఇక పతంగ్‌లు ఎగరేయడంలో హైదరాబాద్ స్టైలే వేరు.. రంగురంగుల్లో.. రకరకాల ఆకృతుల్లో గాలిపటాలు నగరంలో హల్చల్ చేస్తుంటాయి. గోల్కొండ కోటలో అయితే 400 ఏళ్ల నుంచి బసంత్‌లో పతంగులు ఎగరవేస్తుండటం గమనార్హం. అసలు పతంగుల చరిత్ర ఏమిటి? రంగుల గాలిపటాల వెనుక కార్మికుల కష్టం ఎంత? ఇప్పుడు వీటికి ఆదరణ ఎలా ఉంది..? ఈ అంశాలపై ‘సాక్షి’ప్రత్యేక కథనం.. – సాక్షి హైదరాబాద్ గాలిపటం.. గతం ఘనం.. 400 ఏళ్ల క్రితం గోల్కొండ కోటలో కుతుబ్‌షాహీ పాలకులు బసంత్ నెలలో పతంగులు ఎగురవేశారు. నగరం ఏర్పాటు తర్వాత ఆసిఫ్‌జాహీ పాలనాకాలంలో గాలిపటాల పోటీలు నిర్వహించారు. ఇక ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ పాలనలో అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా పతంగ్‌ల పోటీలు నిర్వహించి బహుమతులు సైతం అందజేసేవారు. రాను రాను ఈ పతంగ్‌ల ఉత్సవం తారస్థాయికి చేరింది. 80వ దశకం తర్వాత పతంగ్‌లకు ఆదరణ తగ్గిపోయింది. టీవీలు, వీడియోగేమ్స్, స్మార్ట్ మొబైల్స్ మొదలైన వాటి ప్రభావంతో పెద్దవారే కాదు.. పిల్లలు సైతం.. గాలిపటాలను ఎగరవేయడం తగ్గించేశారు. దీంతో పతంగులు తయారు చేసే కుటుంబాలు వ్యాపారాలు లేక ఇక్కట్లు పడుతున్నాయి. తగ్గుతున్న పతంగుల తయారీ.. నగరంలో సరైన మైదానాలు లేక పతంగులు ఎగరవేయడానికి పిల్లలు ఆసక్తి చూపడంలేదు. గత పదేళ్లుగా వీడియోగేమ్స్, స్మార్ట్ఫోన్లు కూడా వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఏదో పండుగ రోజు కాసేపు గాలిపటాలు ఎగరేసి మమ అనిపించేస్తున్నారు. దీంతో తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకుని బతుకుతున్న వందలాది కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. 150 ఏళ్ల క్రితం వివిధ రాష్ట్రాల నుంచి నగరానికి పతంగులు తయారీ చేయడానికి వందలాది కుటుంబాలు వచ్చాయి. గతంలో సంక్రాంతితో పాటు వేసవి సెలవులు, ఇతర సీజన్లలోనూ పతంగుల విక్రయాలు జోరుగా ఉండేవి. నాలుగు తరాలుగా ఇదే వృత్తిలో ఉన్న వందలాది కుటుంబాలు.. పతంగులకు ఆదరణ లేక ప్రస్తుతం పదుల సంఖ్యకు చేరుకున్నాయి. ధూల్‌పేట మాంజాకి గిరాకీ.. పతంగిని ముందు నడపాలన్నా.. గురిచూసి ప్రత్యర్థి పతంగిని పడగొట్టాలన్నా.. దాని మాంజా చాలా ముఖ్యం. మాంజాగా పిలిచే ఈ దారాన్ని ఓల్డ్‌సిటీలోనే తయారు చేస్తున్నారు. హైదరాబాదీ దూల్‌పేట మాంజాకు దేశమంతటా క్రేజ్ ఉంది. చైనా మాంజాను ప్రభుత్వం నిషేధించడంతో లోకల్ మాంజాకు ఈ ఏడాది గిరాకీ పెరిగింది. రూ.50 నుంచి రూ.300 వరకు ధర పలుకుతోంది. దీంతో గాలిపటాల కంటే మాంజా తయారీదారుల్లో కాస్త సంతోషం కనిపిస్తోంది. పతంగి.. ఎంతో ప్రత్యేకం.. పొలిటికల్ లీడర్.. సినిమా స్టార్స్.. కార్టూన్స్.. తదితర 25 రకాల ఫ్యాన్సీ పతంగుల కొనుగోలుకు నగరవాసులు ఆసక్తి చూపుతున్నారు. ప్లాస్టిక్ పేపర్‌తో తయారయ్యే పతంగులూ మార్కెట్లో ఉన్నాయి. డిమాండ్‌కు అనుగుణంగానే వీటి రేట్లు ఉన్నాయి. రకాన్నిబట్టి రూ.300 నుంచి రూ.3 వేల వరకు ధర పలుకుతున్నాయి. గాలిపటం ఓ జ్ఞాపకమైపోతుంది.. నిజాం కాలంలో సంక్రాంతికి నాలుగు నెలల ముందు నుంచే పతంగుల తయారీ మొదలయ్యేది. యావత్ తెలంగాణకు ఇక్కడి నుంచే సరఫరా అయ్యేది. సంక్రాంతి సీజన్లో రాత్రి, పగలు పనిచేసినా డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేకపోయే వారు. తరతరాలుగా వీటినే తయారు చేస్తున్నాం. గాలిపటాలకు ఆదరణ కరువైతే భవిష్యత్‌లో ఇది కూడా ఓ జ్ఞాపకంగా మారిపోతుంది. చేనేతకు చేయూత ఇచ్చినట్లే మమ్మల్నీ ప్రభుత్వం ఆదుకోవాలి. – లక్ష్మీబాయి, పతంగుల తయారీదారు -
48 శాతం ఫిట్మెంట్!
గత ప్రభుత్వం ఇచ్చిన పెంపు కంటే తక్కువ ఉండదు 69 శాతం ఫిట్‌మెంట్‌కు పట్టుబట్టనున్న ఉద్యోగ సంఘాలు రేపు ఉద్యోగ సంఘాలతో ఉపసంఘం చర్చలు సాక్షి, హైదరాబాద్: పదో పీఆర్సీలో 48 శాతానికి తక్కువ కాకుండా ప్రభుత్వం ఫిట్మెంట్ ప్రకటిస్తుందని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు. 69 శాతం ఫిట్‌మెంట్‌కు పట్టుబట్టాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా ఉన్నాయి. ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చల్లో ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం 48 శాతం వద్దే మొదలు పెడుతుందని ఉద్యోగులు విశ్వసిస్తున్నారు. గత పీఆర్సీలో ఐఆర్ మీద 77.27 శాతం పెంచి ఫిట్‌మెంట్‌ను నిర్ణయించారని, ఈ పీఆర్సీలో కూడా అంతకంటే తక్కువ పెంపు ఉండే అవకాశమే లేదని, ప్రస్తుత ఐఆర్ మీద 77.27 శాతం పెంపు ఇచ్చినా ఫిట్మెంట్ 48 శాతానికి చేరుతుందని ఉద్యోగులు లెక్కలుగడుతున్నారు. ఫిట్మెంట్ 48 శాతం నుంచి ఎక్కడి వరకు వెళుతుందనేది ఉద్యోగ సంఘాల పట్టు మీద ఆధారపడి ఉం టుందని సగటు ఉద్యోగి అంచనా వేస్తున్నారు. సంక్రాంతికి ప్రకటన చేసే అవకాశం సంక్రాంతి కానుకగా పీఆర్సీ అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పడంతో ఉద్యోగులు ఆశగా ఎదురు చూస్తున్నారు. సంక్రాంతికి ఒకరోజు ముందు.. 13న మంత్రివర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల చర్చలు జరగనున్నాయి. మంగళవారం జరగనున్న ఈ చర్చల్లో ఫిట్‌మెంట్‌ను తేల్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల నేతలు విశ్వసిస్తున్నారు. సంక్రాంతి కానుకగా కనీసం ఫిట్‌మెంట్‌పైన అయినా ప్రకటన చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆర్థిక లబ్ధి ఎప్పటి నుంచి ఇవ్వాలనే విషయాన్ని వాయిదా వేసే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాల ద్వారా తెలిసింది. 69 శాతం ఫిట్‌మెంట్‌ను ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఉద్యోగులు డిమాండ్ చేసినంత ఫిట్మెంట్ ఇవ్వకపోయినా, సంతృప్తికర స్థాయిలోనే నిర్ణయిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 48 శాతం కంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ ఉండే అవకాశం లేదని, అంతకంటే తక్కువ ఇస్తామని ఉపసంఘం కూడా ప్రతిపాదించదని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు. గత పీఆర్సీ సమయంలో మధ్యంతర భృతి (ఐఆర్) 22 శాతం ఇచ్చారు. తొమ్మిదో పీఆర్సీ 27 శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేసింది. ఉద్యోగ సంఘాలతో చర్చల తర్వాత 39 శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం 27 శాతం ఐఆర్ అమలవుతోంది. పదో పీఆర్సీ 29 శాతం ఫిట్‌మెంట్‌ను సిఫార్సు చేసిన విషయం విదితమే. గత పీఆర్సీ సిఫారసు చేసిన 27 శాతం మీద 44.5 శాతం అధికంగా 39 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ప్రకటించింది. ఈ పీఆర్సీలో కూడా సిఫారసు చేసిన దానికి కంటే 45 శాతం అధికంగా ప్రభుత్వం ఇస్తే.. 42 శాతం ఇవ్వాల్సి ఉంటుంది. గత పీఆర్సీ సమయంలో 22 శాతం ఐఆర్ ఉండగా, దాని మీద 77.27 శాతం అధికంగా ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పుడు అమల్లో ఉన్న 27 శాతం ఐఆర్ మీద 77 శాతం అధికంగా ఇస్తే.. ఫిట్మెంట్ 48 శాతానికి చేరుతుంది. గత ప్రభుత్వం నిర్ణయించిన దానికంటే తక్కువగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించే అవకాశం లేదని, ఉద్యోగులను సంతృప్తిపరిచే విధంగా ఫిట్మెంట్ ఉంటుందని ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఫిట్మెంట్ 48 శాతం కంటే ఎక్కువే ఉంటుందని ఉద్యోగులు విశ్వసిస్తున్నారు. ఉద్యోగుల కార్యాచరణ నేడు ఖరారు మంత్రివర్గ ఉపసంఘంతో చర్చల్లో అనుసరించాల్సిన కార్యాచరణ ప్రణాళికను ఉద్యోగ సంఘాల జేఏసీ సోమవారం ఖరారు చేయనుంది. ప్రభుత్వం ముందు ఉంచాల్సిన డిమాండ్లపై తుది నిర్ణయం తీసుకోవడానికి ఉద్యోగ సంఘాల జేఏసీ కార్యవర్గ సమావేశం సోమవారం ఉదయం 11 గంటలకు ఏపీఎన్జీవో హోమ్‌లో నిర్వహించనున్నారు. ఉద్యోగుల అంచనా ఇలా.. ఐఆర్‌ను పాయింట్లలో తీసుకుంటే.. గత పీఆర్సీలో ఐఆర్ = 22 పాయింట్లు గత ఫిట్మెంట్ = 39 పాయింట్లు ఐఆర్ మీద పెంపు శాతం = 77.27 శాతం (17 పాయింట్లు) ప్రస్తుతం ఐఆర్ = 27 పాయింట్లు గతంలో పెంపు శాతం = 77.27 శాతం పెంపు పాయింట్లు = 21 పాయింట్లు ఈమేరకు పెంచితే = 48 పాయింట్లు -
దారితోచని సూత్రధారులు
STAR - రిపోర్టర్ సాయిరామ్ శంకర్ సంక్రాంతి వేళ పల్లెవాకిట తిష్టవేసిన ధాన్యరాశులు పురవీధుల్లో వెతికినా కనిపించవు. కల్లాపి చల్లిన లోగిళ్లు, వాటిల్లో ముత్యాల ముగ్గులు, అందులో కొలువుదీరే గొబ్బిళ్లు సిటీలో ఎక్కడో గానీ కానరావు. పట్నంలో సంక్రాంతి శోభను వినువీధిలో గాలిపటాలు తెలిపితే..! రాజధాని వీధివీధిలో తెలియజేసేది డూడూ బసవన్నలను తోడ్కొని వచ్చే డుం డుం గంగిరెద్దు దాసరులే!! అయ్యగారికి దండం పెట్టు అంటూ సిటీవాసులకు రోజంతా వంద వందనాలు అందించినా వారికి వంద రూపాయలైనా గిట్టుబాటు కావు. బసవడితో సమానంగా తకిట తందనాలాడినా.. వచ్చేది ఓ పాత పంచ మాత్రమే. చాలీచాలని సంపాదనతో దారితెన్నూ లేకుండా సాగుతున్న ఈ సూత్రధారులను సాక్షి సిటీప్లస్ తరఫున సాయిరామ్ శంకర్ స్టార్ రిపోర్టర్‌గా పలకరించారు. సాయిరామ్ శంకర్: బసవన్నలు ఇళ్లముందుకు వచ్చి తలాడిస్తేనే సంక్రాంతి పండుగ సందడి మొదలవుతుంది. సాక్షి స్టార్ రిపోర్టర్‌గా ఈ రోజు నేను బసవన్నలుండే ప్రదేశానికి వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఎలా ఉన్నారు? ఎల్లయ్య: బాగనే ఉన్నం సార్. పండగకదా! ఈ నాలుగు రోజులు మంచిగనే ఉంటది. శీను: సంక్రాంతి పండుగ కదా సార్. మా బసవన్నల రోజులు. సాయిరామ్ శంకర్: ఏ ఊరు నుంచి వచ్చారు ఎల్లయ్య? ఎల్లయ్య: మా అందరిదీ మెదక్ జిల్లా మద్దూరు సార్. పండగ రోజులల్ల సిటీకొస్తం. సాయిరామ్ శంకర్: ఇక్కడ ఎన్నిరోజులుంటారు? ఎంకయ్య: నెల రోజులుంటం. సాయిరామ్ శంకర్: ఆ తర్వాత? ఎంకయ్య: మళ్లీ మా ఊరికి పోతం. సాయిరామ్ శంకర్: ఊళ్లో ఏం చేస్తుంటారు? ఎల్లయ్య: ఏం చేస్తం సార్. ఇదే పని. బసవన్నను ఎంట బెట్టుకుని బిచ్చమెత్తుకుంటం. సాయిరామ్ శంకర్: అలాగా, మీరు ఎలా చెబితే గంగిరెద్దులు అలా చేస్తుంటాయి. దండం పెట్టడం నుంచి ఆడటం వరకూ ట్రైనింగ్ మీరే ఇస్తారా..? ఎంకయ్య: మేమేడిత్తం సార్. దాని కోసం గుంటూరుల, తిరుపతిల మాకు గురువులు ఉన్నరు వాళ్ల కాడికి పంపుతం. ఆళ్లే నేర్పిస్తరు. సాయిరామ్ శంకర్: అవునా.. ఈ శిక్షణకు ఎన్ని రోజులు పడుతుంది, ఎంత ఖర్చవుతుంది? ఎంకయ్య: పదిహేను వేల వరకు కట్టాలి సార్. ఏడాది నేర్పిస్తరు. సాయిరామ్ శంకర్: వన్ ఇయరా.. అన్నీ ఫర్ఫెక్ట్గా వచ్చేస్తాయా? ఎల్లయ్య: అన్నీ ఒక తీరుంటాయా సార్. మన పిల్లగాళ్లను స్కూల్‌కు పంపిస్తున్నం. అందరికీ ఒక్క తీరుగ చదువొస్తదా? గిదీ అంతే. సాయిరామ్ శంకర్: నిజమే! నీ బసవన్నపేరు ఏంటి ఎల్లయ్య? ఎల్లయ్య: రాముడు. సాయిరామ్ శంకర్: మరి లక్ష్మణుడు, ఆంజనేయుడు? ఎంకయ్య: నా బసవన్న పేరు లక్ష్మణుడు. సాయిలు: మావోడు ఆంజనేయుడు. సాయిరామ్ శంకర్: పేర్లు బాగున్నాయి. ఏదీ ఓసారి రాముడి పనితనం చూపించు? ఎల్లయ్య: రాముడు.. రాముడు.. చూడు మనకాడికి ఎవరొచ్చిండ్రో.. సినిమాలా దొరొచ్చిండు. ఒక్కపారి అయ్యగారికి దణ్ణం పెట్టు.. దొర సంతోషపడ్తడు. సాయిరామ్ శంకర్: వావ్.. భలేగా పెట్టిందే! ఎల్లయ్య: మా రాముడు బతుకమ్మ ఆడినట్టు ఇంకెవ్వడు ఆడలేడు సార్. సాయిరామ్ శంకర్: అవునా.. గుడ్. మీరు పాడే పాటలు ఎవరి దగ్గర నేర్చుకుంటారు ? అంకయ్య: నేర్చుకునేదేం లేదు సార్. తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి ఆ పాటలు. సాయిరామ్ శంకర్: మరి బసవన్నల ద్వారా ఆదాయం, వాటిపై అయ్యే ఖర్చు గురించి చెప్పండి? సాయిలు: పండుగలప్పుడు బాగానే ఉంటది. మామూలు దినాలల్ల తిండికి కూడా తిప్పలే. మా కడుపు కాలుతున్నా.. బసవన్న పొట్ట మాత్రం మాడ్చలేం సార్. ఇంట్ల అందరూ పస్తు పడుకున్నా.. మా దేవుడికి బువ్వ పెట్టని రోజుండదు. పొద్దుగాళ్ల పిండి పెడ్తం. గడ్డి మామూలే. నెలకు వెయ్యి నుంచి పదిహేనొందల రూపాయలు అయితయి. సాయిరామ్ శంకర్: మీ ఆడవాళ్ల గురించి చెప్పలేదు. ఏమ్మా.. మాట్లాడండి. దుర్గమ్మ: ఏముంది సార్. మగోళ్లు బసవన్నను ఎంటబెట్టుకుని పోతే.. ఊర్లళ్ల ఉన్నప్పుడు పొలం పనికి పోతం. ఈడికొచ్చినప్పుడు అడుక్కోనికి పోతం. సాయిరామ్ శంకర్: మీలో ఆడపిల్లలకు చాలా చిన్న వయసులో పెళ్లిళ్లు చేస్తారట నిజమేనా? సాయమ్మ: ఒకప్పుడు చేసేటోళ్లు సార్. ఆడపిల్ల పుట్టిన 21 దినాలకే.. పెళ్లి ముచ్చట తెద్దురు. ఇప్పుడు అందరం పిల్లల్ని చదివించుకుంటున్నాం. ఎల్లయ్య: మేమంటే నాలుగు మాటలు పడి బతికినం సార్. మా పిల్లలకు ఇసొంటి బతుకొద్దు. అందుకే ఎంత కష్టమైనా పిల్లల్ని చదివిస్తున్నం. సాయిరామ్ శంకర్: మరి ఇక్కడ చాలామంది పిల్లలు ఆవులతో కనిపిస్తున్నారు? అంకయ్య: అందరి పరిస్థితి ఒక్కతీరుగ ఉంటదా సార్! సాయిరామ్ శంకర్: మీ ఊరిలో కనీసం ఇళ్లయినా ఉన్నాయా? భాషా: ఒక్కరికి కూడా సొంతిల్లు లేదు సార్. ఇక్కడ ఎట్లనైతే గుడిసెళ్లో ఉంటున్నమో.. ఊళ్లో కూడా అంతే. సాయిరామ్ శంకర్: పట్నం బసవన్నకు పల్లెటూరు బసవన్నకు తేడా ఏంటి ? శీను: పల్లెల్లో బసవన్నంటే దేవుడి లెక్క సార్. ఇంటిల్లిపాది వచ్చి దండం పెడ్తరు. ధాన్యం పెడ్తరు. వాడికి పంచ కప్పి, మాకు పైసలు ఇచ్చేటోళ్లు. పట్నంల ఆ మర్యాద లేద్సార్. అయితే పది రూపాయలు పడేస్తున్నరు. లేదంటే వెళ్లండి అనేస్తరు. సాయిరామ్ శంకర్: అంతేలే సిటీవాసులు సాటి మనుషుల మీదే అభిమానం చూపడం లేదు. అది సరే, ఏది నాలుగు పాటలు పాడి బసవన్నలతో నాట్యం చేయించండి. ఎల్లయ్య: రాముడు...లక్ష్మణా... ఆంజనేయులు రండ్రి బతుకమ్మ ఆడండి.... అంటూ పాటందుకున్నారు. బసవన్నలు కొమ్ములూపుతూ అడుగులు వేస్తూ నాట్యం చేశాయి. సాయిరామ్ శంకర్: థ్యాంక్యూ. మీకు, మీ బసవన్నలకు హ్యాపీ సంక్రాంతి. బై.. సాయిరామ్ శంకర్: వీటికీ మీకూ అనుబంధం ఎక్కువనుకుంటా..! ఎల్లయ్య: చానా సార్. బిడ్డలెక్కనే.. ఒక్కోసారి అవే మా యజమానుల్లా కనిపిస్తయి. వాటికేమైనా దెబ్బ తగిలినా, పాణం బాగోకపోయినా ఇంట్ల ఎవ్వరం బువ్వ ముట్టం. బసవన్న కాలం చేస్తే.. ఈడికెళ్లి ట్రాక్టరో, డీసీఎంనో మాట్లాడుకుని ఊరికి తీస్కవోయి బొందపెట్టి బంధువులందరికీ భోజనాలు పెట్టుకుంటం. శీను: గవ్వన్ని ఎందుకంటే.. అవికూడా మాలో ఒక్కటే. బసవన్న పలికినట్టు మా బిడ్డ కూడా పలకడు సార్. సాయిరామ్ శంకర్: బిడ్డకంటే గొడ్డు నయం అంటే ఇదే కాబోలు (నవ్వుతూ...). గ్రేట్... మీ అనుబంధం వింటుంటే కడుపు నిండిపోతుంది. ప్రజెంటేషన్: భువనేశ్వరి ఫొటోలు: ఎన్.రాజేష్‌రెడ్డి -
సికింద్రాబాద్-విశాఖ మధ్య 2 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్-విశాఖ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు బుధవారం తెలిపారు. ఈ ప్రత్యేక రైలు(08502) 18వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. మరోవైపు విశాఖ నుంచి ప్రత్యేక రైలు(08501) 17వ తేదీ రాత్రి 7.05 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైళ్లు కాజీపేట్, వరంగల్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయి. మరోవైపు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా స్లీపర్‌క్లాస్ బోగీని ఏర్పాటు చేస్తున్నారు. నేడు నర్సాపూర్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 16న నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలును దక్షిణమధ్య రైల్వే నడుపుతోంది. ఈ రైలు(07255) గురువారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరుతుంది.