వచ్చే ఏడాది సంక్రాంతికి టాలీవుడ్ చిత్రాలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే పలు చిత్రాలు సంక్రాంతి బరిలో నిలవగా.. తాజాగా ఈ రేసులోకి అగ్ర హీరోలు మెగాస్టార్, బాలకృష్ణ కూడా చేరిపోయారు. అయితే వీరిద్దరి చిత్రాలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండటం గమనార్హం. మెగా154 మూవీతో 'వాల్తేరు వీరయ్య'గా చిరు సంక్రాంతికి సందడి చేయనుండగా.. 'వీరసింహారెడ్డి' అనే మాస్ టైటిల్‌తో బాలయ్య పోటీలో నిలిచారు. మరీ ఇద్దరు లెజెండ్స్‌తో సినిమాలు నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ ప్లానేంటి?
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ మరోసారి బాక్సాఫీస్ వద్ద పోటీపడటం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలోనూ వీరిద్దరి సినిమాలు చాలాసార్లు సంక్రాంతికి విడుదలయ్యాయి. సాధారణంగా పెద్ద పండుగలకు స్టార్ హీరోల సినిమాలు పోటీలో నిలవడం సహజం. అందులో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ బరిలో నిలవడం ఫ్యాన్స్‌కు పెద్ద పండగే. దాదాపు ఆరేళ్ల తర్వాత వీరిద్దరి ఓకేసారి పోటీలో నిలుస్తున్నారు. మరీ వీరిద్దలో ఎవరు హిట్ కొడతారో చూడాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
గతంలో వీరిద్దరి చిత్రాలు పోటీ పడిన కొన్ని సందర్భాలు
1.జననీ జన్మభూమి - ఛాలెంజ్
2. మంగమ్మ గారి మనవడు - ఇంటి గుట్టు
3. అగ్ని గుండం - శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
4. కథానాయకుడు - రుస్తుం
5.ఆత్మ బలం - చట్టంతో పోరాటం
6. కొండవీటి రాజా - నిప్పులాంటి మనిషి
7. రాక్షసుడు - అపూర్వ సహోదరులు
8. దొంగ మొగుడు - భార్గవ రాముడు
9. రాము - పసివాడి ప్రాణం
10.మంచి దొంగ - ఇన్‌స్పెక్టర్ ప్రతాప్
11. యుద్ధ భూమి - రాముడు భీముడు
12. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు - భలే దొంగ
Comments
Please login to add a commentAdd a comment