
యూకే పార్లమెంట్‌లో తనకు జరిగిన సన్మానంపై మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. చాలా మంది గౌరవనీయులైన పార్లమెంట్ సభ్యులు, మంత్రులు, సెక్రటరీలు, దౌత్యవేత్తలు సమక్షంలో అందుకున్న గౌరవంతో నా మనసు నిండిపోయిందని పోస్ట్ చేశారు. టీమ్ బ్రిడ్జ్ ఇండియా ద్వారా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుతో సత్కరించడంతో మనస్ఫూర్తిగా సంతోషాన్ని ఇచ్చిందని రాసుకొచ్చారు.
మెగాస్టార్ తన ట్వీట్‌లో రాస్తూ..' నాకు దక్కిన ఈ గౌరవం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. కానీ నా అద్భుతమైన ప్రేమగల అభిమానులకు, నా సోదర, సోదరిమణులకు, నా కుటుంబం, శ్రేయోభిలాషులు, స్నేహితులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా ప్రయాణానికి నాకు అన్ని విధాలుగా సహకరించి.. నా మానవతా కార్యక్రమాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. ఈ గౌరవం నన్ను మరింత కష్టపడేందుకు ప్రేరేపిస్తుంది. నాకు మరింత శక్తిని అందిస్తోంది' అంటూ పోస్ట్ చేశారు.
ఇక సినిమాల విషయానికొస్తే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సోషియో ఫాంటసీ యాక్షన్ చిత్రానికి బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.
Heart filled with gratitude for the honour at the House of Commons - UK Parliament by so many Esteemed Members of Parliament , Ministers & Under Secretaries, Diplomats. Humbled by their kind words. Heartened by the Life Time Achievement Award by Team Bridge India.
Words are not… pic.twitter.com/XxHDjuFIgM— Chiranjeevi Konidela (@KChiruTweets) March 20, 2025
Comments
Please login to add a commentAdd a comment