సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్-విశాఖ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు బుధవారం తెలిపారు. ఈ ప్రత్యేక రైలు(08502) 18వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. మరోవైపు విశాఖ నుంచి ప్రత్యేక రైలు(08501) 17వ తేదీ రాత్రి 7.05 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైళ్లు కాజీపేట్, వరంగల్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయి. మరోవైపు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా స్లీపర్‌క్లాస్ బోగీని ఏర్పాటు చేస్తున్నారు.
నేడు నర్సాపూర్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు
ఈ నెల 16న నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలును దక్షిణమధ్య రైల్వే నడుపుతోంది. ఈ రైలు(07255) గురువారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరుతుంది.
సికింద్రాబాద్-విశాఖ మధ్య 2 ప్రత్యేక రైళ్లు
Published Thu, Jan 16 2014 1:10 AM | Last Updated on Sat, Sep 2 2017 2:38 AM
Advertisement