K. sambasiva rao
-
పండగ కోసం ప్రత్యేక రైళ్లు
సికింద్రాబాద్: సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-విశాఖ మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ఈ నెల 10,17,24,31 తేదీల్లో రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి విశాఖకు ప్రత్యేక రైళ్లు బయలుదేరుతాయి. అదేవిధంగా ఈనెల 9,16,23,30 తేదీల్లో రాత్రి 7.05 గంటలకు విశాఖ నుంచి సికింద్రాబాద్ కు బయలుదేరుతాయని సీపీఆర్ఓ కె. సాంబశివరావు తెలిపారు. ప్రత్యేక రైళ్లకు ఈ నెల 6 నుంచి రిజర్వేషన్లు చేసుకోవచ్చన్నారు. -
పలు రైళ్లలో అదనపు బెర్తులు
సాక్షి,హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో డిసెంబర్ 31 నుంచి జనవరి మొదటివారం వరకు అదనపు బెర్తులు ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఏసీ చైర్ కార్, స్లీపర్ క్లాస్‌లలో ఈ బోగీలను ఏర్పాటు చేస్తారు. సికింద్రాబాద్-విశాఖ దురంతో ఎక్స్‌ప్రెస్, తిరుపతి-కొల్హాపూర్ హరిప్రియ ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ గరీబ్థ్,్ర గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్, నాందేడ్-ముంబై సీఎస్టీ తపోవన్ ఎక్స్‌ప్రెస్, ధర్మాబాద్-మన్మాడ్ డెయిలీ ఎక్స్‌ప్రెస్‌లలో అదనపు బోగీలు అందుబాటులోకి రానున్నాయి. -
శబరికి ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్: శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రైళ్లు కాచిగూడ, నర్సాపూర్, కాకినాడల నుంచి కొల్లాం(కేరళ) వరకు వెళ్తాయి. నేడు (బుధవారం) ఉదయం 8 గంటలకు ఈ ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్ ప్రారంభమవుతుంది. ఈ మేరకు కాచిగూడ-కొల్లాం ప్రత్యేక రైలు ఈ నెల 23, 27 తేదీల్లో ఉదయం 10.35 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.40 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 24, 28 తేదీల్లో రాత్రి 9.45 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి రెండో రోజు తెల్లవారు జామున 2.35 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు నల్లగొండ, గుంటూరు, రేణిగుంటల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. -
దీపావళికి ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: దీపావళి సందర్భంగా పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె. సాంబశివరావు తెలిపారు. సికింద్రాబాద్ - సిర్పూర్కాగజ్నగర్, భువనేశ్వర్-సికింద్రాబాద్, సికింద్రాబాద్ - అహ్మదాబాద్, తదితర మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతారు. సికింద్రాబాద్-సిర్పూర్కాగజ్నగర్ (07035)స్పెషల్ ట్రైన్ ఈ నెల 25వ తేదీ ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి సాయంత్రం 5.30 గంటలకు సిర్పూర్కాగజ్నగర్కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సిర్పూర్కాగజ్నగర్-సికింద్రాబాద్ (07036) స్పెషల్ ట్రైన్ 25వ తేదీ సాయంత్రం 7 గంటలకు సిర్పూర్కాగజ్నగర్ నుంచి బయలుదేరి రాత్రి 2 గంటల సమయంలో సికింద్రాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్-అహ్మదాబాద్ (07018/07017) ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ట్రైన్ నవంబర్ 1వ తేదీ ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.15కి అహ్మదాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 2వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు అహ్మదాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.45లకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. యశ్వంత్‌పూర్-శ్రీ మాతా వైష్ణోదేవి కాత్రా స్టేషన్ (02679/02680) ప్రీమియం సూపర్‌ఫాస్ట్ ట్రైన్ నవంబర్ 1, 8 తేదీలలో (శనివారం) ఉదయం 11.30 గంటలకు యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరి ఆదివారం ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరిగి 4.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి సోమవారం రాత్రి 7.45 గంటలకు వైష్ణోదేవి కాత్రా స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 4, 11 తేదీలలో (మంగళవారం) ఉదయం 5.15 గంటలకు వైష్ణోదేవి కాత్రా నుంచి బయలుదేరి బుధవారం సాయంత్రం 7.25 గంట లకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరి గి 7.35 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి గురువారం మధ్యాహ్నం 3 గంటలకు యశ్వంత్‌పూర్ చేరుకుంటుంది. ఈ ట్రైన్‌కు ఈ నెల 23 ఉదయం 8 గంటలకు ఐఆర్ సీటీసీ ఆన్లైన్ బుకింగ్ సదుపాయం అందుబాటులోకి వస్తుంది. ఆర్ఆర్సీ ఎగ్జామ్స్‌కు ప్రత్యేక రైళ్లు... రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఎగ్జామ్స్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేకంగా వీక్లీ స్పెషల్ ట్రైన్స్ నడుపనున్నట్లు సీపీఆర్వో తెలిపారు. ఈ మేరకు భువనేశ్వర్-సికింద్రాబాద్ వీక్లీ (08403/08404) ఎక్స్‌ప్రెస్ అక్టోబర్ 31, నవంబర్ 7, 14, 21, 28 తేదీలలో రాత్రి 10.10 గంటలకు భువనేశ్వర్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నవంబర్ 2, 9, 16, 23, 30 తేదీలలో సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 4.30 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది. అదనపు బోగీలు ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని వికారాబాద్-గుంటూరు పల్నాడు ఎక్స్‌ప్రెస్‌లో అదనపు బోగీలు ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె. సాంబశివరావు తెలిపారు. ఒక ఏసీ చైర్‌కార్, 2 సెకెండ్‌క్లాస్ చైర్‌కార్ బోగీలు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. దీనివల్ల ఈ నెల 31 వరకు 720 సీట్లు అదనంగా అందుబాటులోకి వస్తాయన్నారు. -
20న రైల్వే రిజర్వేషన్‌కు అంతరాయం
సాక్షి, హైదరాబాద్: కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (పీఆర్ఎస్) ఆధునీకరణ పనుల దృష్ట్యా ఈ నెల 20వ తేదీన పీఆర్ఎస్ సేవలను రెండున్నర గంటలపాటు నిలిపివేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 20న ఉదయం 11.30 నుంచి 12.30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.30 వరకు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ నిలిచిపోనుందని చెప్పారు. దీని వల్ల దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలోని అన్ని రిజర్వేషన్ కేంద్రాల వద్ద టికెట్ బుకింగ్ సేవలు ఆగిపోతాయి. అలాగే ద.మ.రైల్వే, సదరన్ రైల్వే, నైరుతి రైల్వే జోన్ల పరిధిలో ఇంటర్నెట్ టికెట్ బుకింగ్ సేవలు, పీఎన్ఆర్ సంబంధమైన సేవలు కూడా నిలిచిపోతాయి. కరెంట్ బుకింగ్ కూడా ఉండదు. పీఆర్ఎస్ ద్వారా జరిగే టికెట్ రద్దు, రిఫండ్ సేవలు కూడా ఉండవు. రిఫండ్ కోసం కౌంటర్ల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేస్తారు. -
సికింద్రాబాద్-విశాఖ మధ్య 2 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో సికింద్రాబాద్-విశాఖ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు బుధవారం తెలిపారు. ఈ ప్రత్యేక రైలు(08502) 18వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. మరోవైపు విశాఖ నుంచి ప్రత్యేక రైలు(08501) 17వ తేదీ రాత్రి 7.05 గంటలకు బయల్దేరుతుంది. ఈ రైళ్లు కాజీపేట్, వరంగల్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయి. మరోవైపు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో అదనంగా స్లీపర్‌క్లాస్ బోగీని ఏర్పాటు చేస్తున్నారు. నేడు నర్సాపూర్-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 16న నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలును దక్షిణమధ్య రైల్వే నడుపుతోంది. ఈ రైలు(07255) గురువారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరుతుంది. -
విజయవాడ-సికింద్రాబాద్ మధ్య 2 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో విజయవాడ-సికింద్రాబాద్ మధ్య 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మంగళవారం తెలిపారు. ఈ రెండు రైళ్ల ద్వారా 8 సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు. విజయవాడ-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఈ నెల 5,12,19,26 తేదీల్లో రాత్రి 11 గం.కు విజయవాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉ.5.40 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలు ఈ నెల 6,13,20,27 తేదీల్లో రాత్రి 11.15 గం.కు సికింద్రాబా ద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45 గ ం.కు విజయవాడ చేరుతుంది. -
శబరిమలైకి మరో రెండు ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: శబరిమలైకి వెళ్లే అయ్యప్ప భక్తుల కోసం మరో రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. నిజామాబాద్-కొల్లాం (07601) ప్రత్యేక రైలు డిసెంబర్ 10, 17 తేదీలలో మధ్యాహ్నం ఒంటిగంటకు నిజామాబాద్‌లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 11.30కి కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో డిసెంబర్ 11, 18 తేదీలలో తెల్లవారుజామున 1.45 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరుతుంది. ఈ రైళ్లకు అడ్వాన్స్ బుకింగ్ నవంబర్ 30 నుంచి ప్రారంభిస్తారు. -
రైల్వే రిజర్వేషన్ కౌంటర్లకు నేడు హాఫ్ డే
సాక్షి, హైదరాబాద్: దీపావళి పర్వదినం సందర్భంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలోని కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్లు 2వ తేదీ శనివారం ఒక్కపూట మాత్రమే పని చేస్తాయని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఈ కేంద్రాలు పని చేస్తాయని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో వివరించారు. -
తప్పిన పెనుముప్పు
సాక్షి,సిటీబ్యూరో : నాంపల్లి రైల్వేస్టేషన్లో బుధవారం చోటుచేసుకున్న ఎంఎంటీఎస్ ప్రమాద ఘటనలో పెనుముప్పు తప్పింది. అప్పటికే ప్రయాణికులు దిగిపోవడం, స్టేషన్లో డెడ్‌ఎండ్‌లో గోడకు ఇంజన్ తాకడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. రైలు పూర్తి వేగంతో నడుస్తుండగా ఘటన జరిగి ఉంటే పెనుముప్పు ఏర్పడేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. రైలు బోగీలను ముందుకు నెట్టే హై డ్రాలిక్ యంత్రాలు పాడైపోవడం వల్లే ఇంజన్ ముందుకు దూసుకెళ్లి గోడను ఢీకొట్టిందని అంటున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసులు ప్రారంభమయ్యాక ఇటువంటి ఘటన జరగడం ఇదే ప్రథమం. నిర్వహణలో నిర్లక్ష్యం.. నగరంలో 121 ఎంఎంటీఎస్ రైళ్లు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. రోజూ లక్షా 50 వేల మంది వీటిని ఆశ్రయిస్తున్నారు. ప్రయాణికులకు చేరువైన ఈ సర్వీసుల సంఖ్యను ఇటీవల పెంచడంతో లోకో పెలైట్లపై పని ఒత్తిడి పెరిగింది. అలాగే, రైళ్లను సకాలంలో తనిఖీ చేయకపోవడం, కొన్నిసార్లు తనిఖీలు లేకుండానే సర్టిఫికెట్లు ఇచ్చేస్తున్నారు. కీలకమైన హైడ్రాలిక్ యంత్రాలు పాడైనా, బ్రేక్బాక్సులు పనిచేయకున్నా అధికారులు పట్టించుకోవట్లేదని కిందిస్థాయిలో పనిచేసే ఇన్చార్జిలు సైతం నిర్లక్ష్యం వహిస్తున్నారని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫలక్‌నుమా-లింగంపల్లి, లింగంపల్లి-నాంపల్లి, నాంపల్లి-సికింద్రాబాద్ మధ్య ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లు నడుస్తున్నాయి. ప్రతి 2-3 ట్రిప్పులకు ఒకసారి రైలును ఐడియలింగ్లో ఉంచాలి. కానీ సర్వీసుల సంఖ్య పెరడంతో ఇందుకు సమయం లభించట్లేదు. మరోవైపు క్రమం తప్పకుండా ఇంటర్మీడియట్ ఓవర్ హాలింగ్ (ఐఓహెచ్), పీరియాడికల్ ఓవర్ హాలింగ్ (పీఓహెచ్) నిర్వహించట్లేదనే ఆరోపణలున్నాయి. పైపై తనిఖీలు జరిపి రైళ్లను పట్టాలపైకి ఎక్కించేస్తున్నారని ఎంఎంటీఎస్ డ్రైవర్లు వాపోతున్నారు. ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు నిపుణులైన లోకోపెలైట్లనే వినియోగించాలి. కానీ గూడ్స్ రైళ్లను నడిపే వారిని ఈ సెక్టార్లో వినియోగిస్తున్నారు. పైగా వీరిపై పని భారం పెరిగింది. 6 గంటలే రైలు నడపాల్సి ఉండగా 8-10 గంటల పాటు నడుపుతున్నారు. పనిభారానికి తోడు ఆరోగ్యం బాగోలేకున్నా సెలవులు ఇవ్వరని, దీనివల్ల ఒత్తిడి పెరుగుతోందని ఓ లోకోపెలైట్ చెప్పారు. ఉన్నతస్థాయి దర్యాఫ్తు: సీపీఆర్వో ఘటనపై ఉన్నతస్థాయి అధికారుల కమిటీ వేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. అన్ని కోణాల్లో సమగ్రంగా దర్యాఫ్తు చేస్తామన్నారు. ప్రమాదం కారణం గా నాంపల్లి-సికింద్రాబాద్, నాంపల్లి-లింగంపల్లి మధ్య నడిచే 5 సర్వీసులు రద్దయ్యాయి. వీటి రద్దుతో పాటు వర్షం కారణంగా బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో రవాణా సౌకర్యాలు అందుబాటులో లేక ప్రయాణికులు ఇబ్బందుల పాలయ్యారు. -
నేడు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ రద్దు
సాక్షి, హైదరాబాద్ : సికింద్రాబాద్ నుంచి విశాఖ వెళ్లవలసిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12806)ను బుధవారం (9వ తేదీ) రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కే సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ నుంచి సికింద్రాబాద్ రావలసిన రైలు మంగళవారం రద్దు కావడంతో బుధవారం నాటి సర్వీసును రద్దు చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే, బుధవారం సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్లవలసిన విశాఖ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి రాత్రి 10.30 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. గూడ్స్ రైళ్లను నియంత్రించండి : ద.మ. రైల్వే జీఎం సీమాంధ్ర ప్రాంతంలో బస్సులు నడవడంలేనందున రైళ్లనే నమ్ముకున్న ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా చూడాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం ఏకే మిట్టల్ ఆదేశించారు. సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లో రైళ్లకు అంతరాయం లేకుండా చూసేందుకు గూడ్స్ రైళ్లను నియంత్రించాలని సూచించారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన నేపథ్యంలో మంగళవారం ఆయన దక్షిణ మధ్య రైల్వేలోని అన్ని ప్రధాన విభాగాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. -
రెడీమేడ్ దుస్తుల రంగంలోకి ఎన్టీసీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జౌళి రంగంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ (ఎన్టీసీ) ‘ఇండియన్ రిపబ్లిక్’ బ్రాండ్ పేరుతో పురుషుల రెడీమేడ్ దుస్తుల రంగంలోకి ప్రవేశించింది. జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు, పర్యాటక శాఖ మంత్రి కె.చిరంజీవి చేతుల మీదుగా బుధవారమిక్కడ లోగోను ఆవిష్కరించింది. దుస్తుల ధరలు రూ.399-1,499 మధ్య ఉంటాయని ఎన్టీసీ డెరైక్టర్(హెచ్ఆర్) రాకేశ్ కుమార్ సిన్హా ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. ఆరు నెలల్లో మహిళల రెడీమేడ్ దుస్తులను మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్పారు. సొంతంగా అలాగే ఫ్రాంచైజీ విధానంలో 300 ఇండియన్ రిపబ్లిక్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను రెండేళ్లలో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 36 దాకా ఉంటాయన్నారు. బ్రాండెడ్ రెడీమేడ్ దుస్తుల మార్కెట్లో మూడేళ్లలో 10 శాతం వాటా దక్కించుకుంటామని కంపెనీ మార్కెటింగ్ డెరైక్టర్ అలోక్ బెనర్జీ వెల్లడించారు. ఎన్టీసీకి దేశవ్యాప్తంగా 24 మిల్లులున్నాయి. మూడు ప్లాంట్లు..: ఆంధ్రప్రదేశ్‌లో మూడు ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు ఎన్టీసీ వెల్లడించింది. స్పిన్నింగ్, వీవింగ్ కోసం రూ.500 కోట్లతో భారీ ప్లాంటును నెలకొల్పనుం ది. 25 ఎకరాల్లో ఏడాదిలో ఇది సాకారం అవుతుందని కంపెనీ విశ్వసిస్తోంది. గుంటూరు, పశ్చిమ గోదావరి లేదా నెల్లూరులో ఇది రానుంది. అలాగే టెక్నికల్ టెక్స్టైల్, రెడీమేడ్ దుస్తుల తయారీ కోసం వేర్వేరు ప్లాంట్లను స్థాపించనుంది. వీటి కోసం సుమారు 350 కోట్లు వెచ్చించనుంది. మూడు ప్లాంట్లలో ఒకటి హైదరాబాద్‌లో ఏర్పాటయ్యే అవకాశాలున్నాయి. పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యంతో(పీపీపీ) ఎన్టీసీ 12 టెక్నికల్ టెక్స్టైల్ ప్లాంట్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు రూ.3 వేల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్శించే పనిలో నిమగ్నమయ్యామని కావూరి తెలిపారు. ఇక్కడ 4 టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. -
వస్త్ర పరిశ్రమకు సింగిల్ విండో క్లియరెన్సులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: జౌళి పరిశ్రమల స్థాపనకై ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదుర్కొంటున్న కష్టాలకు తెర పడనుంది. ప్రస్తుతం కంపెనీ ఏర్పాటు చేయాలంటే అటూఇటూగా 50 అనుమతులు తీసుకోవాల్సి వస్తోంది. వీటన్నిటికీ చెక్ పెడుతూ సింగిల్ విండో క్లియరెన్సుల విధానానికి కేంద్ర జౌళి శాఖ శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం సంయుక్త కార్యదర్శి స్థాయిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు తెలిపారు. మంగళవారమిక్కడ ఫిక్కీ సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. మార్చికల్లా సింగిల్ విండో సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టెక్స్టైల్ పాలసీ ఒకట్రెండు నెలల్లో కార్యరూపం దాలుస్తుందని పేర్కొన్నారు. జౌళి పరిశ్రమకు ఇచ్చే రాయితీలు, టెక్నాలజీ అప్‌గ్రేడేషన్ ఫండ్ తదితర అంశాల విషయంలో పాలసీ స్పష్టతనిస్తుందని అన్నారు. ‘టఫ్’ పథకాన్ని 2017 వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. రూ.11,950 కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ నెల 9లోగా నోటిఫికేషన్ విడుదలవుతుందని వివరించారు. 50 శాతం నిధులిస్తాం: పారిశ్రామికవేత్తలు తమకు ప్రభుత్వం నుంచి ఏం కావాలో డిమాండ్లతోపాటే పరిష్కారాలు కూడా చూపాలని సాంబశివరావు సూచించారు. పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం 50 శాతం నిధులు సమకూరుస్తుందని హామీ ఇచ్చారు. -
కాకినాడ-సికింద్రాబాద్ మధ్య 4 ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-కాకినాడ (07101/07102) మధ్య కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్ల మీదుగా 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కే సాంబశివరావు గురువారం తెలిపారు. ఈ నెల 23న రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఆగస్టు 24న సాయంత్రం 6 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మరో 2 రైళ్లు కాకినాడ-సికింద్రాబాద్ (07002/07001) మధ్య భీమవరం, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్లగొండల మీదుగా నడవనున్నాయి. కాకినాడ నుంచి రైలు ఈ నెల 25 సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 26న రాత్రి 11.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.35 గంటలకు కాకినాడకు చేరుతుందని సీపీఆర్వో వివరించారు.