సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-కాకినాడ (07101/07102) మధ్య కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్ల మీదుగా 2 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కే సాంబశివరావు గురువారం తెలిపారు. ఈ నెల 23న రాత్రి 10.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.20 గంటలకు కాకినాడ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఆగస్టు 24న సాయంత్రం 6 గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మరో 2 రైళ్లు కాకినాడ-సికింద్రాబాద్ (07002/07001) మధ్య భీమవరం, గుడివాడ, విజయవాడ, గుంటూరు, నల్లగొండల మీదుగా నడవనున్నాయి. కాకినాడ నుంచి రైలు ఈ నెల 25 సాయంత్రం 4 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 4.15 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 26న రాత్రి 11.15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11.35 గంటలకు కాకినాడకు చేరుతుందని సీపీఆర్వో వివరించారు.
కాకినాడ-సికింద్రాబాద్ మధ్య 4 ప్రత్యేక రైళ్లు
Published Fri, Aug 23 2013 6:31 AM | Last Updated on Fri, Sep 1 2017 10:03 PM
Advertisement
Advertisement