సాక్షి, హైదరాబాద్: దీపావళి పర్వదినం సందర్భంగా దక్షిణమధ్య రైల్వే పరిధిలోని కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ కౌంటర్లు 2వ తేదీ శనివారం ఒక్కపూట మాత్రమే పని చేస్తాయని దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఈ కేంద్రాలు పని చేస్తాయని ఆయన శుక్రవారం ఒక ప్రకటనలో వివరించారు.