శబరికి ప్రత్యేక రైళ్లు | Special trains for sabarimala devotees due to rush | Sakshi
Sakshi News home page

శబరికి ప్రత్యేక రైళ్లు

Published Wed, Nov 12 2014 6:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

Special trains for sabarimala devotees due to rush

 హైదరాబాద్:  శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో  తెలిపారు. ఈ రైళ్లు కాచిగూడ, నర్సాపూర్, కాకినాడల నుంచి కొల్లాం(కేరళ) వరకు వెళ్తాయి. నేడు (బుధవారం) ఉదయం 8 గంటలకు ఈ ప్రత్యేక రైళ్లకు రిజర్వేషన్ ప్రారంభమవుతుంది.
 
 ఈ మేరకు కాచిగూడ-కొల్లాం ప్రత్యేక రైలు ఈ నెల 23, 27 తేదీల్లో ఉదయం 10.35 గంటలకు కాచిగూడ నుంచి బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5.40 గంటలకు కొల్లాం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 24, 28 తేదీల్లో రాత్రి 9.45 గంటలకు కొల్లాం నుంచి బయలుదేరి రెండో రోజు తెల్లవారు జామున 2.35 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఈ రైలు నల్లగొండ, గుంటూరు, రేణిగుంటల మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement