
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణమద్య రైల్వే శబరిమలకు పలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు విజయవాడ డివిజన్ పబ్లిక్ రిలేషన్ అఫిసర్ మండురూపకర్ శనివారం తెలిపారు. సికింద్రబాద్ నుంచి కొల్లం వెళ్లే(ట్రైన్‌నంబర్07175)రైలు ఈనెల 19, 26తేదిలలో సికింద్రబాద్‌లో గురువారం రాత్రీ 8గంటకు బయలు దేరి శనివారం తెల్లవారుజామున 1.30కు కొల్లం చేరుతుంది.
కాకినాడ పొర్టునుంచి కొల్లం వెళ్లే(ట్రైన్‌నంబర్07173)ఈనెల 18,25తేదిలలో బుధవారం రాత్రీ 11.50కి కాకినాడ పొర్టులో బయలు దేరి శుక్రవారం ఉదయం 5.30కు కొల్లం చేరుతుంది. విజయవాడ నుంచి కొల్లం వెళ్లే(ట్రైన్‌నంబర్07177) 21, 28 తేదిలలో విజయవాడలో శనివారం రాత్రీ 10.15 బయలుదేరి సొమవారం ఉదయం 6.20కి కొల్లం చేరుతుంది.