ఏపీ భవన్‌లో ‘నందమూరి బొమ్మల కొలువు’ | NTR Statue in AP Bhavan | Sakshi
Sakshi News home page

ఏపీ భవన్‌లో ‘నందమూరి బొమ్మల కొలువు’

Published Sun, Jan 18 2015 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 7:52 PM

NTR Statue in AP Bhavan

 సాక్షి, న్యూఢిల్లీ: దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు వర్థంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఆదివారం టీమ్ ఆంధ్రప్రదేశ్ భవన్ ఆధ్వర్యంలో ‘అన్నగారి బొమ్మల కొలువు’ అనే చిత్రప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఏపీభవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన కె. బాలకోటేశ్వరరావు గీసిన 70 చిత్రాలను ప్రదర్శించారు. ఎన్టీఆర్ చిత్రాలను జీవం ఉట్టిపడేలా గీసిన చిత్రకారుడిని ఆహూతులు అభినందించారు. 2013లోనూ హైదరాబాద్ ఆర్ట్ గ్యాలరీలో మొట్టమొదటిసారిగా 150 చిత్రాలతో ప్రదర్శన నిర్వహించి నట్టు చిత్రకారుడు బాలకోటేశ్వరరావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీభవన్ ప్రత్యేకాధికారి కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement