Minister Puvvada Ajay Kumar Meet Jr NTR In Hyderabad - Sakshi
Sakshi News home page

జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసిన మంత్రి పువ్వాడ.. కారణం ఇదే..

Published Tue, May 2 2023 7:19 PM | Last Updated on Tue, May 2 2023 7:29 PM

Minister Puvvada Ajay Kumar Meet Jr Ntr In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 28న ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి ప్రారంభ ఏర్పాట్లపై  చర్చించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి మే 28న తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరణ చేయనున్నారు.

మే 28న శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్‌ పర్యాటకులను ఆకర్షించనున్నారు. ఇప్పటికే విగ్రహం తయారు పూర్తయి, విగ్రహ తరలింపునకు రంగం సిద్ధమైంది. మే 28న పండుగ వాతావరణంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ భారీ విగ్రహ ఆవిష్కరణను చేయనున్నారు. బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది.
చదవండి: యాంకర్ ఉదయభాను నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా? (ఫొటోలు)

ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్‌మెంట్​ పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు. రూ.2.3 కోట్ల వ్యయం కానున్న ఈ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను పొందడంలో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ చూపారు. అవసరమయ్యే నిధులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సహకరిస్తున్నారు.
చదవండి: ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్‌లో ఆస్తులు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement