NTR Statue
-
ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణపై హైకోర్టు స్టే
-
లకారం ట్యాంక్‌బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహం.. హైకోర్టు స్టే.. కీలక మార్పులు!
సాక్షి, ఖమ్మం: లకారం ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసే ఎన్టీఆర్ విగ్రహం.. శ్రీకృష్టుడి రూపాన్ని పోలి ఉండటంపై తీవ్ర దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు ఉత్వర్వులు, యాదవ సంఘాల అభ్యంతరాలు గౌరవిస్తూ ఎన్టీఆర్ విగ్రహంలో మార్పులు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విగ్రహం కిరీటంలోని నెమలి పింఛం, వెనుక భాగాన విష్ణుచక్రం, పిల్లనగ్రోవి తొలగించి ఈ నెల 28న ఆవిష్కరిస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు శ్రీకృష్ణావతారంలో రూపొందించిన ఎన్టీఆర్ విగ్రహం ఖమ్మం చేరుకుంది. భారీ వాహనంలో 54 అడుగుల విగ్రహాన్ని గురువారం లకారం ట్యాంక్‌బండ్ వద్దకు తీసుకొచ్చారు. విగ్రహాన్ని స్థానికులు పెద్ద సంఖ్యలో తిలకించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవతో ‘తానా’, ఎన్ఆర్ఐలు, పలువురు పారిశ్రామికవేత్తల సహకారంతో భారీ విగ్రహా న్ని నిజామాబాద్‌కు చెందిన కళాకారుడు వర్మ రూపొందించారు. కోర్టు ఉత్తర్వులు.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఖమ్మంలోని లకారం చెరువులో ఎన్టీఆర్ శ్రీకృష్ణుడి రూప విగ్రహాన్ని ప్రతిష్టించాలనుకోవడంపై హైకోర్టు గురువారం స్టే విధించింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. ఈ విగ్రహ ఏర్పాటు ను సవాల్ చేస్తూ భారత యాదవ సమితి, ఆల్ ఇండియా యాదవ సమితి, ఆదిభట్ల శ్రీకళాపీఠం, శ్రీకృష్ణ జేఏసీ సహా పలువురు లంచ్‌మోషన్ రూపంలో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అయితే శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపైనే అభ్యంతరం తెలుపుతున్నామన్నారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ప్రతిష్టించడాన్ని నిషేధిస్తూ 2016లో జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా ఉందన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. తుది తీర్పు వెలువరించే వరకు విగ్రహ ప్రతిష్టాపన ఆపాలని ఆదేశించింది. చదవండి: రూ. 3 వేల కోట్లతో.. ‘మెడ్‌ట్రానిక్’ విస్తరణ -
కృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం వద్దు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌కు ఖమ్మంలో విగ్రహం ఏర్పాటు చేయడంపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విగ్రహ ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు గురువారం స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయొద్దంటూ గురువారం హైకోర్టు ఆదేశాల్లో పేర్కొంది. ఖమ్మంలోని లకారం చెరువు మధ్యలో తీగల వంతెనకు ప్రత్యేక ఆకర్షణగా.. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల సందర్భంగా 54 అడుగుల ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ విగ్రహాన్ని ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్‌తో ప్రారంభింపజేయాలని భావించిన మంత్రి పువ్వాడ అజయ్.. ఆయనకు ఆహ్వానం సైతం అందించారు. ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్న క్రమంలోనే అసలు వివాదం మొదలైంది. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడంపైనా హిందూ సంఘాలతో పాటు పలువురి నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. ఓవైపు.. కాదని విగ్రహాన్ని ప్రారంభిస్తే కూలుస్తామంటూ భారత యాదవ సంఘం నేతలు హెచ్చరికలు సైతం జారీ చేశారు. మరోవైపు కృష్ణుడు రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై నటి కరాటే కల్యాణి అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఎన్టీఆర్‌పై చేసిన కామెంట్లకుగానూ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్(మా) నుంచి షోకాజ్ నోటీసులు కూడా అందుకుంది. ఇంకోవైపు.. ఈలోపు ముగ్గురు వ్యక్తులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పిటిషన్‌పై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఇవాళ స్టే ఇచ్చింది. ఎన్టీఆర్ విగ్రహాన్ని అయినా పెట్టుకోండి లేదంటే కృష్ణుడి విగ్రహాన్ని అయినా పెట్టుకోండి. శ్రీకృష్ణుడి రూపంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి వీల్లేదు అంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయొద్దు. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలి అని హైకోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. తానా అసోసియేషన్‌తోపాటు పలువురు ప్రముఖులు అందించిన ఆర్థిక సహకారంతో ఈ విగ్రహాన్ని నిర్మించారు. నిజామాబాద్‌కు చెందిన వర్మ అనే చిత్రకారుడు శ్రీ కృష్ణుడి రూపంలో ఉన్న ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. మే 28.. అయన జయంతి సందర్బంగా జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరించాలనుకున్నారు. బేస్‌మెంట్‌తో కలిసి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహం.. తల భాగం అయిదు అడుగులు, కాళ్ల భాగం అయిదు అడుగులు, ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు 45 అడుగులు ఉంది. -
జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసిన మంత్రి పువ్వాడ.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్ బండ్‌పై ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్‌ను కలిసి ప్రారంభ ఏర్పాట్లపై చర్చించారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.. ఎన్టీ రామారావు శత జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌తో కలిసి మే 28న తెలుగు సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆవిష్కరణ చేయనున్నారు. మే 28న శ్రీకృష్ణుని అవతారంలో ఎన్టీఆర్ పర్యాటకులను ఆకర్షించనున్నారు. ఇప్పటికే విగ్రహం తయారు పూర్తయి, విగ్రహ తరలింపునకు రంగం సిద్ధమైంది. మే 28న పండుగ వాతావరణంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ భారీ విగ్రహ ఆవిష్కరణను చేయనున్నారు. బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది. చదవండి: యాంకర్ ఉదయభాను నూతన గృహప్రవేశం.. ఎలా ఉందో చూశారా? (ఫొటోలు) ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్మెంట్ పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు. రూ.2.3 కోట్ల వ్యయం కానున్న ఈ విగ్రహం ఏర్పాటుకు అవసరమైన అన్ని అనుమతులను పొందడంలో రాష్ట్ర రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చొరవ చూపారు. అవసరమయ్యే నిధులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, తానా సభ్యులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, ఎన్నారైలు సహకరిస్తున్నారు. చదవండి: ఢిల్లీలో వ్యాపారం..హైదరాబాద్‌లో ఆస్తులు -
జూ ఎన్టీఆర్ నేను 60 లక్షలు పెట్టి మా సొంత స్థలంలో విగ్రహాలు పెట్టాం..
-
టీడీపీ నేతల కక్కుర్తి.. ఎన్టీఆర్ విగ్రహం పేరుతో డబ్బులు వసూలు!
సాక్షి, కర్నూలు: కర్నూలు నడిబొడ్డున గాయత్రి ఎస్టేట్‌లో టీడీపీ కార్యాలయం ఉంది. ఇక్కడ టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని శుక్రవారం ప్రతిష్టించనున్నారు. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హాజరుకానున్నారు. పనిలో పనిగా పార్టీ కార్యాలయాన్ని కూడా కాస్త ఆధునికీకరించారు. అయితే, విగ్రహం పేరుతో వసూలు చేసిన చందాలపై ఆపార్టీలో తీవ్ర చర్చ నడుస్తోంది. విగ్రహం ప్రతిష్టాపన పేరుతో జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు రూ.50లక్షలు వసూలు చేశారని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇందులో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డితో పాటు ఆపార్టీలోని మాజీ ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు భారీగా చందాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో, పాటు టైల్స్, కిటికీలు, తలుపులు ఇలా ఒక్కొక్కటీ ఒక్కో నేత విరాళంగా ఇచ్చినట్లు సమాచారం. ఇది చాలదన్నట్లు మండల స్థాయి, గ్రామ స్థాయి నేతల నుంచి కూడా సోమిశెట్టి విరాళాలు సేకరించారని, ఈ మొత్తం రూ.50 లక్షలదాకా ఉందని, ఇందులో రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు కూడా ఖర్చు కాలేదని, మిగిలిన నిధులు సోమిశెట్టి జేబులోకి వెళ్లాయని చంద్రబాబు పర్యటనకు హాజరైన టీడీపీ నేతలు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. -
సెట్టింగ్ ‘బంగార్రాజు’.. ఇదేందయ్యా ఇది..
నెల్లిమర్ల(విజయనగరం జిల్లా): బంగార్రాజా మజాకా.. టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర మార్కులు కొట్టేయడానికి, రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు దక్కించుకోవడానికి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, భోగాపురం మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు పడరాని పాట్లు పడుతున్నారు. ఈనెల 17న భోగాపురం విచ్చేసిన చంద్రబాబుతో పోలిపల్లిలో ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణకు అప్పటికప్పుడు ఏర్పాట్లు చేశారు. టూర్ షెడ్యూల్లో లేనప్పటికీ బాబు కాన్వాయ్‌ను వెనక్కి మళ్లించి మరీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. చదవండి: రచ్చ రచ్చ.. మైదుకూరు టీడీపీలో డీఎల్ ‘చిచ్చు’ అయితే ఆవిష్కరణ అనంతరం బాబు వెళ్లిన వెంటనే ఎన్టీఆర్ విగ్రహం అక్కడినుంచి మాయమైంది. సదరు విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి, బంగార్రాజు తన కారు షెడ్డులో పెట్టేశారు. ఇదే విషయమై ఆ పార్టీ నియోజకవర్గ నేతలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. కేవలం చంద్రబాబును ఆకర్షించడానికే ఆవిష్కరణ చేపట్టి, అనంతరం తొలగించారని గుసగుసలాడుకుంటున్నారు. బాబు కళ్లకే గంతలు కట్టిన ఘనుడు బంగార్రాజు అని ముక్కును వేలేసుకుంటున్నారు. -
నిమ్మకూరులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాంస్య విగ్రహాన్ని ఆయన స్వస్థలమైన నిమ్మకూరులో ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారని మంత్రి కొడాలి నాని తెలిపారు. మంత్రి కొడాలి నాని, పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్‌తో కలసి నిమ్మకూరులో ఉంటున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు సీఎం వైఎస్ జగన్‌ని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మంగళవారం కలిశారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించినందుకు వారు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. నిమ్మకూరులో ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని పెట్టాలని కోరగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు. అనంతరం క్యాంప్ కార్యాలయం వద్ద మంత్రి కొడాలి నాని విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు శతజయంతి సందర్భంగా నిమ్మకూరులో ఆయన కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారని చెప్పారు. ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు నిమ్మకూరులో తాగునీటి సమస్యను ప్రస్తావించారన్నారు. దీనిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి రూ.కోటి మంజూరు చేశారని చెప్పారు. నిమ్మకూరులో ఇతర సమస్యలను కూడా వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారన్నారు. -
టీడీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు
సాక్షి, అమరావతి: దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీరామారావు అంటే అందరికీ గౌరవమేనని, గుంటూరు జిల్లా దుర్గిలో ఆయన విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన ఘటన చాలా దురదృష్టకరమని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనపై సోమవారం ఆయన స్పందిస్తూ.. జరిగిన ఘటనను వైఎస్సార్సీపీ, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఖండిస్తున్నాయని చెప్పారు. ఈ ఘటనను టీడీపీ రాజకీయంగా వాడుకోవడానికి చూస్తోందని, ఆ పార్టీ నాయకుల దుష్ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని కోరారు. దివంగత ముఖ్యమంత్రులు వైఎస్సార్, ఎన్టీఆర్ లాంటి వారు రాష్ట్రాన్ని పరిపాలించిన గొప్ప వ్యక్తులని కొనియాడారు. వారి గౌరవార్థం విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెట్టుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి, ఆయన చావుకు కారణమైన చంద్రబాబు ఈ చిన్న ఘటనను రాజకీయంగా వాడుకోవాలని చూడటం హేయమైన చర్య అని దుయ్యబట్టారు. ఈ ఘటనకు, వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. నిందితుడిని అతని తండ్రే పోలీసులకు అప్పగించారని, పోలీసులు కూడా వెంటనే కేసు నమోదు చేశారని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్ విగ్రహాలను తీసి పక్కన పడేసిన సందర్భాలు ఎన్నోచూశామని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం పాటుబడ్డ నాయకుడిగా ఎన్టీఆర్‌ను తాము గుర్తించి, గౌరవిస్తామని.. అయితే 1995లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసిన చంద్రబాబే ఆయన నాయకత్వాన్ని గుర్తించలేదన్నారు. -
ఎమ్మెల్యే ప్రతాప్‌కు బాలకృష్ణ ఫోన్..
నెల్లూరు ,కావలి: పట్టణంలోని ముసునూరులో మహాలక్ష్మమ్మ ఆలయ స్థలంలో ఆలయానికి ఎదుట రెండేళ్ల క్రితం టీడీపీ నాయకుడు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడి నుంచి గ్రామస్తులు తొలగించి పక్కనే ఉన్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ప్రతిష్టించేందుకు నిర్వహిస్తున్న పనులు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా టీడీపీ నాయకులు పార్టీ అగ్రనాయకత్వం ఆదేశాల మేరకు ముసునూరులో హడావుడి చేసినప్పటికీ గ్రామంలో వాస్తవ పరిస్థితులను గమనించి వివాదం చేయడం సరికాదనే అభిప్రాయానికి వచ్చారు. ఇదిలా ఉండగా నెల్లూరుకు చెందిన టీడీపీ నాయకుడు కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ముసునూరులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు అంశానికి సంబంధించి వివాదాన్ని పెంచేందుకు చేసిన ప్రయత్నాలు ఆ పార్టీలోనే అంతర్గతంగా విమర్శలకు దారితీశాయి. కాగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి వాస్తవ పరిస్థితులను సినీ హీరో బాలకృష్ణకు వాట్సాప్ ద్వారా తెలియజేయడంతో బాలకృష్ణ నేరుగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి గురువారం ఫోన్ చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే మాట్లాడిన అనంతరం బాలకృష్ణ ఎమ్మెల్యే తీసుకొన్న చొరవను అభినందించినట్లు తెలిపారు. ఇదే విషయాన్ని బాలకృష్ణ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి తెలియజేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా రాజమండ్రి నుంచి కొత్తగా కొనుగోలు చేసిన ఎన్టీఆర్ విగ్రహం ముసునూరుకు చేరుకోవడంతో విగ్రహాన్ని ప్రతిష్టించే పనులు జరుగుతున్నాయి. పక్కనే ఉన్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద కూడా శిథిలమైన దిమ్మెను మెరుగుపరుస్తున్నారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి చెప్పినట్లుగానే విగ్రహాన్ని ముసునూరు కూడలిలోని బస్‌షెల్టర్ వద్దనే ఏర్పాటు చేస్తున్న తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
ఎన్నికల కోడ్ అమల్లోనూ పక్షపాతం!
సాక్షి, పొన్నూరు: ఎన్నికల కోడ్‌ను అమలు చేయాల్సిన అధికారుల పనితీరుపై విమర్శలొస్తున్నాయి. మండల పరిధిలోని బ్రాహ్మణకోడూరు, దొప్పలపూడి, మన్నవ, ఉప్పరపాలెం తదితర గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ను పంచాయతీ అధికారులు పట్టించుకోవటం లేదని ఆయా గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు. రాజకీయపార్టీ నాయకులకు చెందిన విగ్రహలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉంటే తొలగించాలని నిబంధనలు ఉన్నా వాటిని అమలు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో గ్రామాల్లో ఘర్షణలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడు వచ్చి 10 రోజులు దాటినా అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేయటంలో పూర్తిగా వైఫల్యం చెందారు. ఇప్పటికై నా ఎన్నికల అధికారులు స్పందించి అన్ని గ్రామాల్లో ఎన్నికల కోడ్ అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చేబ్రోలు: ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికి అధికార పార్టీ నాయకులు యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నా అధికారులు స్పందించికపోవటంపై విమర్శలు వ్యక్తంమవుతున్నాయి. మండల కేంద్రమైన చేబ్రోలులో పలు ప్రాంతాల్లో ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన బోర్డులు దర్శనమిస్తూనే ఉన్నాయి. చేబ్రోలు గ్రామ పంచాయతీ పరిధిలోని జీబీసీ ప్రధాన రహదారి పక్కన ఉన్న తల్లీ బిడ్డ చల్లగా కార్యాలయ గోడలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు లోకేష్, పరిటాల సునీత, ఎమ్మెల్యే నరేంద్రకుమార్ల ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీలు, వాల్ ఫోస్టర్లు తొలగింపునకు నోచుకోలేదు. చంద్రన్న సంచార చికిత్స వాహనంపై ముఖ్యమంత్రి ఫొటోను అలాగే ఉంచారు. నారాకోడూరు, చేబ్రోలు ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థతి. గ్రామాల్లో అధికారుల పనితీరు టీడీపీకి ఒక న్యాయం, వైఎస్సార్ సీపీకి మరో న్యాయం అన్న చందంగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. -
అర్ధరాత్రి ఇష్టారాజ్యం
ఉలవపాడు: అధికారం మనదే.. మన పార్టీ నాయకుని విగ్రహం .. అనుమతితో మనకు పనేంటి అనుకున్నారు..అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు. శనివారం రాత్రి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభించారు. అధికారులందరూ సహకరించినా పక్కన ఉన్న స్థలాలు, దుకాణాల చిరు వ్యాపారులు అడ్డుకుంటారని తెలిసి దిమ్మె గుట్టుచప్పుడు కాకుండా నిలబెట్టారు. ఉలవపాడు పాత బస్టాండ్ సెంటర్లో శనివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. వివరాలు.. సెంటర్లో చాలాకాలంగా ఎన్టీ రామారావు విగ్రహం పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. పదేళ్ల కాలంలో అప్పటి టీడీపీ ఇన్చార్జిలు, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు వివాదాస్పదంగా ఏర్పాటు చేయాలని ప్రయత్నించలేదు. దీని వలన ఇబ్బంది లేకుండా ఉండేలా చేయాలని అనుకున్నారు. కానీ ప్రస్తుతం వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యే పోతుల రామారావు నియమించిన మండల ఇన్చార్జి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహం నిర్మించాలని భావించారు. వైఎస్సార్ విగ్రహం పక్కనే ఎన్టీఆర్ విగ్రహం ఉండాలని రోడ్డు పక్కన ఆర్అండ్బీ రోడ్డులో విగ్రహ దిమ్మెను ఏర్పాటు చేశారు. ఒక్కసారిగా రాత్రికి రాత్రి దిమ్మె నిర్మించడంతో పక్క దుకాణాల యజమానులు విస్తుపోయారు. పట్టించుకోని అధికారులు ప్రస్తుతం అనుమతి లేకుండా ఎలాంటి విగ్రహాలు నిర్మించకూడదని ప్రభుత్వం స్పష్టంగా తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఆర్అండ్బీ రోడ్డులో పంచాయతీ అనుమతి లేకుండా విగ్రహ దిమ్మె నిర్మించారు. అధికారులు షరామామూలుగా అధికార పార్టీకి లొంగిపోయారు. గతంలో జగ్జీవన్‌రామ్ బొమ్మ దిమ్మెను నిర్మించినప్పుడు సీఐ, ఇద్దరు ఎస్ఐలు దగ్గరుండి దిమ్మె కట్టనీయకుండా అడ్డుకున్నారు. ఇక దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం విగ్రహం నిర్మించేందుకు కొందరు పనులు ప్రారంభిస్తే గంటకు పోలీసులు వచ్చి అడ్డుకున్నారు. హైస్కూల్ సంఘంలో మృతి చెందిన ఓ ఆర్మీ సైనికుడి విగ్రహం కోసం దరఖాస్తు చేసుకుంటే అనుమతి లేదని అలగాయపాలెం రోడ్డులో నిర్మించకుండా అడ్డుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క అధికారి, పోలీసులు ఆ పక్కకు రాకుండా పనులు జరిగాయంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం అవుతోంది. వ్యవహారం వివాదాస్పదం ప్రస్తుతం ఎన్టీఆర్ దిమ్మె అంశం చర్చనీయాంశంగా మారింది. దిమ్మె వెనుక ముఠా వర్కర్స్ యూనియన్ ఆఫీసు ఉంది. 20 ఏళ్ల క్రితం ఆ స్థలాన్ని కార్మికులు పోరాడి సాధించుకున్నారు. దాని ముందు ఎన్టీఆర్ విగ్రహ నిర్మాణానికి దిమ్మె ఏర్పాటు చేశారు. ఆ యూనియన్ అధ్యక్షుడు నోరు మెదపకుండా ఉండేందుకు ఓ లోన్ శాంక్షన్ చేయించారు. గ్రీన్ అంబాసిడర్లో ఉద్యోగం ఇప్పించారు. పార్టీకి అనుకూలంగా ఉన్న ఎస్సీ నాయకులతో వారిని మాట్లాడనీయకుండా చేశారు. ఇటీవలే ఓ ఎస్సీ అధికారిపై దాడి జరిగిన పరిస్థితుల నేపథ్యంలో బస్డాండ్‌లో ఎస్సీ యూనియన్‌కు ఉన్న స్థలాన్ని కనపడనీయకుండా ఎన్టీఆర్ విగ్రహ దిమ్మెనిర్మించడం గమనార్హం. స్థానిక ఎమ్మెల్యే వివాదాలను పెంచి పోషిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. -
ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటులో ఉద్రిక్తత
విజయవాడ : విజయవాడలో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కాలేజీ మైదానంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు టీడీపీ నేతలు యత్నించారు. దీనిపై విద్యార్థి సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. ప్రభుత్వ కాలేజీలో రాజకీయ నేత విగ్రహ ఏర్పాటుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. దీంతో టీడీపీ కార్యకర్తలకు, విద్యార్థి సంఘాలకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు పలువురు విద్యార్థి సంఘం నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. -
టీ కొట్టునూ వదల్లేదు..బాబు
విశాఖపట్నం : తోపుడు బండిపై ఆధారపడి బతుకుతున్న ఓ టీకొట్టు వ్యాపారి బతుకు బండి నెట్టి, ఓ బాబుగారు డాబు వెలగ బెడుతున్నారు. త్రీటౌన్ పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ ప్రాంతంలో ప్రహరీ గోడ పక్కన.. మద్దిలపాలెం నుంచి ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ రోడ్డుకు వెళ్లే మార్గం మలుపులో ఉన్న టీ కొట్టును ఎట్టకేలకు తొలగించారు. బండి తీయిస్తే బతుకు పోతుందని ఆ యజమాని బతిమిలాడినా పట్టించుకోలేదు. పంతం కోసం ఓ ‘పచ్చ’నాయకుడు పట్టుబట్టి మరీ బండి తొలగించేలా చేయించారు. తొలగించిన బండి స్థానంలో స్వర్గీయ ఎన్టీ రామారావు విగ్రహం పెట్టించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా దాని చూట్టు ఉన్న పోలీస్ క్వార్టర్స్ ప్రహరీ గోడపై బారెడు సైజులో బాబుగారి బొమ్మలు పచ్చరంగులో గీసి మారి ఆర్భాటం చేస్తున్నారు. పచ్చనాయకులు చేస్తున్న ఆగడాలను చూస్తున్న స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు. బాబు గారి ‘బొమ్మ’లు కనిపించేందుకేనా ఇంత ఆర్భాటమూ అంటున్నారు. -
విగ్రహాల విషయంలో బాబుది ద్వంద వైఖరి
-
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటా?
అనుమతుల్లేకుండా సన్నద్ధం న్యాయ పోరాటం చేస్తాం.. వైఎస్సార్ సీపీ పెదకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి కావటి మనోహర్‌నాయుడు అమరావతి: మండల కేంద్రమైన అమరావతి మద్దూరుడౌన్ సెంటర్లో ఎటువంటి అనుమతులు లేకుడా ఎన్టీఅర్ విగ్రహం ఏర్పాటు చేయడంపై పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కావటి శివనాగమనోహరనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం స్థానిక ఎస్.ఐ వెంకటప్రసాద్‌కు ఫిర్యాదు అందించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ నగరాల అభివృద్ది పేరుతో ఆలయాలను నేలమట్టం చేసిన ప్రభుత్వం విజయవాడలో ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వైఎస్సార్ విగ్రహన్ని తొలగించటం దారుణమన్నారు. ఇటీవల అమరావతిలో రోడ్డు విస్తరణ అడ్డుగా ఉన్నాయనే సాకుతో జాతీయ నాయకులైన మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు విగ్రహాలను తొలగించి, పక్కనే మూడు రోడ్ల కూడలిలో ఎన్టీఅర్ విగ్రహం ఏర్పాటు చేయడం టీడీపీ ద్వంద్వ నీతికి నిదర్శనమని చెప్పారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, న్యాయ పోరాటానికి దిగుతామని హెచ్చరించారు. -
రాజమహేంద్రవరం తరలిన ఎన్టీఆర్ కృష్ణ విగ్రహం
కొత్తపేట: రాజమహేంద్రవరం నగరంలోని పుష్కరాల రేవులో నెలకొల్పేందుకు శ్రీకృష్ణుని రూపంలో తీర్చిదిద్దిన ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని శనివారం రాత్రి కొత్తపేట నుంచి తరలించారు. స్థానిక శిల్పి డి.రాజ్‌కుమార్ వుడయార్ ఐదు టన్నుల కాంస్యంతో 15 అడుగుల ఎత్తు గల ఎన్టీఆర్ కృష్ణుని విగ్రహాన్ని తయారు చేశారు. కొత్తపేటలోని రాజకుమార్ శిల్పశాలకు శనివారం సాయంత్రం వచ్చిన రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితరులు ఆ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విగ్రహాన్ని ప్యాకింగ్ చేసి క్రేన్ ద్వారా ప్రత్యేక వాహనంపై ఎక్కించి తరలించారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తదితరులు పాల్గొన్నారు. -
నాలుగులైన్ల రోడ్డు విస్తరణ ప్రారంభం
► నాలుగు లైన్ల రోడ్డుగా సిరిసిల్ల బైపాస్ ► మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ కార్పొరేషన్ : పదికాలాల పాటు మన్నే విధంగా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ రోడ్ల విస్తరణ చేపడుతున్నామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సిరిసిల్ల బైపాస్ నాలుగులైన్ల రోడ్డు పనులను ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. కరీంనగర్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నివారించే ఉద్దేశంతోనే బైపాస్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఐదు కిలోమీటర్ల మేర రూ.13 కోట్లతో రోడ్డును అందంగా తీర్చిదిద్దుతామన్నారు. రద్దీ నివారణతో పాటు వేగంగా ప్రయాణించేందుకు అనువుగా రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాదరావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కార్పొరేటర్లు రూప్సింగ్, సునిల్‌రా వు, బోనాల శ్రీకాంత్, ఎ.వి. రమణ, నా యకులు ఈద శంకర్‌రెడ్డి, చల్ల హరిశంక ర్,జి.ఎస్‌ఆనంద్‌తదితరులు పాల్గొన్నారు. -
మంద కృష్ణమాదిగ అరెస్ట్ అన్యాయం
దుత్తలూరు: విజయవాడలో విలేకరుల సమావేశానికి వెళ్తున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను అరెస్ట్ చేయడం దారుణమని ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి శ్రీనివాస మాదిగ పేర్కొన్నారు. మంద కృష్ణ మాదిగ అరెస్ట్‌ను నిరసిస్తూ స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఎమ్మార్పీఎస్ నాయకులు సోమవారం కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరెస్ట్‌లతో ఎస్సీవర్గీకరణ ఉద్యమాన్ని ఆపలేరన్నారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు యద్దనపూడి రమణయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి గొల్లపల్లి మోహన్‌రావు, జిల్లా ప్రచార కార్యదర్శి ఇలారి దేవదాసు, మండల ఇన్చార్జి కే మనోజ్, ప్రధాన కార్యదర్శి విజయ్, బొజ్జా వెంకటసుబ్బమ్మ పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహం ఎదుట నిరసన కావలి అర్బన్: మంద కృష్ణ మాదిగ అరెస్టుకు నిరసనగా ఎమ్మార్పీఎస్ నాయకులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెం టర్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ రాస్ట్ర నేత వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు ఎస్సీ వర్గీకరణ చేపట్టకుంటే తీవ్రపరిణామాలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మార్పీఎస్ నాయకులు అక్కిలగుంట మార్టిన్ సుధాకర్ మాదిగ, మంద వెంకటేశ్వర్లు మాదిగ, చేవూరు మాల్యాద్రి మాదిగ, ఎలికా చంద్రశేఖర్ మాదిగ, మహేంద్ర మాదిగ, చంద్రశేఖర్, మోజెస్, తదితరులు పాల్గొన్నారు. -
ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు
ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం సుర్జాపూర్ గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహానికి గుర్తు తెలియని నిప్పుపెట్టారు. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో విగ్రహానికి స్వల్పంగా నష్టం వాటిల్లింది. సోమవారం గమనించిన పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలంటూ గ్రామంలో ధర్నా చేపట్టారు. -
'తగ్గిన' ఎన్టీఆర్ విగ్రహం
రాజమహేంద్రవరం కల్చరల్: రాజమహేంద్రవరం పుష్కరాల రేవులో శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీ రామారావు విగ్రహాన్ని మార్పు చేశారు. 13 అడుగుల విగ్రహాన్ని తీసివేసి 6 అడుగుల ఉన్న మరో విగ్రహాన్ని గురువారం రాత్రి నెలకొల్పారు. హఠాత్తుగా విగ్రహాన్ని మార్చడం వెనక కారణాలేమిటో తెలియరాలేదు. కాగా గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమండ్రి పుష్కరఘాట్ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అక్కడ విగ్రహ ఏర్పాటుపై విమర్శలు వెల్లువెత్తాయి. -
అన్నా...పార్టీని నాశనం చేస్తున్నారు..!
కొనసాగుతున్న నైషధం నిరసన సిటీబ్యూరో: కొందరు నాయకులు పార్టీని సర్వనాశనం చేస్తున్నారని, వారిపై తగుచర్యలు తీసుకోవడంతోపాటు నిజమైన కార్యకర్తలు, నాయకులకు తగిన న్యాయం చేయాలని కోరు తూ హైదరాబాద్ జిల్లా టీడీపీ నాయకుడు నైషధం సత్యనారాయణమూర్తి పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడికి మరో లేఖ రాశారు. బుధవారం ఆ లేఖను ఎన్టీఆర్ విగ్రహాని కి అందజేసి వినూత్నంగా నిరసన తెల పారు. కార్పొరేటర్ టిక్కెట్ దక్కకపోవడంతో మస్థాపానికి లోనైన నైషధం గత మూడు రోజులుగా వివిధ మార్గాల్లో నిరసన తెలియజేస్తున్నారు. టీ-టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ మరో ఇద్దరితో కలిసి టిక్కెట్లు అమ్ముకున్నారని, విచారణ జరిపిస్తే సాక్ష్యాధారాలను అందజేస్తానని తాజా లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు అందుబాటులో లేనందున స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి లేఖను అందజేస్తున్నానన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో టీడీపీని కాపాడాలంటే జూని యర్ ఎన్టీఆర్‌కు టీ-టీడీపీ బాధ్యతలు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ అప్రదిష్టపాలవుతుందని హెచ్చరించారు. -
'ఎన్టీఆర్ విగ్రహాన్ని వెంటనే తొలగించండి'
తూర్పుగోదావరి: రాజమండ్రి పుష్కరాల రేవు నుంచి ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్ చేశారు. పుష్కరాల రేవులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలన్నా సంకుచిత స్వభావం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ..పుష్కరాల రేవు వద్ద జరిగిన దుర్ఘటన ధార్మిక సంస్థల ఉత్సవాల్లో వచ్చిన నష్టం తప్ప..రాజకీయ వైఫల్యం కాదన్నారు. అందువల్ల సీఎం చంద్రబాబు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన అవసరంలేదన్నారు. కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లే దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నానన్నారు. బతికున్నప్పుడు తల్లిదండ్రులకు అన్నంపెట్టని వాళ్లు పుష్కరాల్లో పిండ ప్రధానం చేస్తే ఏం లాభమన్నారు. ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయనేతల ఓవరాక్షన్ ఎక్కువైందని నారాయణ విమర్శించారు. -
'గోదావరి ఒడ్డున ఎన్టీఆర్ విగ్రహం'
హైదరాబాద్: గోదావరి పుష్కరాలను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. పుష్కరాల కోసం 248 పుష్కర ఘాట్ లను సిద్ధం చేసినట్టు చెప్పారు. వసతుల విషయంలో ఎక్కడా రాజీ పడలేదన్నారు. మహానాడులో మూడో రోజు గోదావరి పుష్కరాలపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... పవిత్ర గోదావరిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. నదుల అనుసంధానంతో రెండు తెలుగు రాష్ట్రాలకు మేలు జరుగుతుందన్నారు. గోదావరి జలాలు ఇరు రాష్ట్రాలకు ఉపయోగపడేలా ప్రణాళిక రచిస్తున్నామని తెలిపారు. గోదావరి ఒడ్డున శ్రీకృష్ణుడి వేషధారణలో ఎన్టీఆర్ విగ్రహం ప్రతిష్టిస్తామని చంద్రబాబు ప్రకటించారు. -
అమెరికాకు ఎన్టీఆర్ విగ్రహం
కొత్తపేట: విశ్వవిఖ్యాత నట సౌర్వభౌముడిగా కీర్తి గడించిన ఎన్టీ రామారావు కృష్ణావతార పంచలోహ విగ్రహం తూర్పు గోదావరి జిల్లా కొత్తపేటలోని డి.రాజ్‌కుమార్ వుడయార్ శిల్పశాలలో రూపుదిద్దుకుంది. అమెరికా తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో వెస్ట్ కొవిన్ (కాలిఫోర్నియా)లోని పార్కులో నెలకొల్పేందుకు ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు వుడయార్ తెలిపారు. విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు శరత్ బి కామినేని దీని రూపకల్పనకు ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. జూలైలో తానా సభల సందర్భంగా ఆవిష్కరించనున్న ఈ ఎనిమిదడుగుల విగ్రహాన్ని 80 కిలోల పంచలోహాలతో తయారు చేసినట్లు చెప్పారు. విగ్రహాన్ని బుధవారం విమానంలో అమెరికా పంపించనున్నారు.