
'ఎన్టీఆర్ విగ్రహాన్ని వెంటనే తొలగించండి'
తూర్పుగోదావరి: రాజమండ్రి పుష్కరాల రేవు నుంచి ఎన్టీఆర్ విగ్రహాన్ని తక్షణమే తొలగించాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్ చేశారు. పుష్కరాల రేవులో ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలన్నా సంకుచిత స్వభావం ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. రాజమండ్రిలో విలేకరులతో మాట్లాడుతూ..పుష్కరాల రేవు వద్ద జరిగిన దుర్ఘటన ధార్మిక సంస్థల ఉత్సవాల్లో వచ్చిన నష్టం తప్ప..రాజకీయ వైఫల్యం కాదన్నారు.
అందువల్ల సీఎం చంద్రబాబు ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాల్సిన అవసరంలేదన్నారు. కేవలం ప్రభుత్వ వైఫల్యం వల్లే దుర్ఘటన జరిగినట్లు భావిస్తున్నానన్నారు. బతికున్నప్పుడు తల్లిదండ్రులకు అన్నంపెట్టని వాళ్లు పుష్కరాల్లో పిండ ప్రధానం చేస్తే ఏం లాభమన్నారు. ధార్మిక కార్యక్రమాల్లో రాజకీయనేతల ఓవరాక్షన్ ఎక్కువైందని నారాయణ విమర్శించారు.