
చేబర్తిలో ఎన్‌టీఆర్ విగ్రహానికి నిప్పు
చర్యలకు టీడీపీ నేతల డిమాండ్
జగదేవ్‌పూర్ : మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఈ సంఘటన మండల పరిధిలోని చేబర్తి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. గురువారం రాత్రి వరకు ఎన్టీఆర్ విగ్రహం బాగానే ఉన్నా.. శుక్రవారం ఉదయం ఆయన విగ్రహానికి తల భాగంలో కిరోసిన్ పోసి నిప్పు పెట్టారు. దీంతో తల భాగం నల్లగా మారిపోయింది. విషయం తెలుసుకున్న టీడీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు సంఘటనా స్థలానికి చేరుకుని ఎన్టీఆర్ విగ్రహనికి పాలాభిషేకం చేశారు.
అలాగే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్‌ఐ వీరన్న గ్రామానికి విగ్రహానికి నిప్పు పెట్టిన విషయమై ఆరా తీశారు. గ్రామ సర్పంచ్ జామున బాయి అర్జున్‌సింగ్‌లు, టీడీపీ టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి భూమయ్య యాదవ్‌లు విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు పెట ్టడం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్ నాయకుల పనేనని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి భూమయ్య, నాయకులు శ్రీకాంత్, ఇంద్రసేనారెడ్డిలు ఆరోపించారు.