నాలుగులైన్ల రోడ్డు విస్తరణ ప్రారంభం | The beginning of the four-lane expansion of the road | Sakshi
Sakshi News home page

నాలుగులైన్ల రోడ్డు విస్తరణ ప్రారంభం

Published Sat, Jun 25 2016 1:30 AM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

నాలుగులైన్ల రోడ్డు విస్తరణ ప్రారంభం

నాలుగులైన్ల రోడ్డు విస్తరణ ప్రారంభం

నాలుగు లైన్ల రోడ్డుగా సిరిసిల్ల బైపాస్
మంత్రి ఈటల రాజేందర్

 
కరీంనగర్ కార్పొరేషన్ : పదికాలాల పాటు మన్నే విధంగా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ రోడ్ల విస్తరణ చేపడుతున్నామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సిరిసిల్ల బైపాస్ నాలుగులైన్ల రోడ్డు పనులను ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. కరీంనగర్‌లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నివారించే ఉద్దేశంతోనే బైపాస్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఐదు కిలోమీటర్ల మేర రూ.13 కోట్లతో రోడ్డును అందంగా తీర్చిదిద్దుతామన్నారు.

రద్దీ నివారణతో పాటు వేగంగా ప్రయాణించేందుకు అనువుగా రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాదరావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, కార్పొరేటర్లు రూప్‌సింగ్, సునిల్‌రా వు, బోనాల శ్రీకాంత్, ఎ.వి. రమణ, నా యకులు ఈద శంకర్‌రెడ్డి, చల్ల హరిశంక ర్,జి.ఎస్‌ఆనంద్‌తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement