ఓఆర్‌ఆర్‌ యూనిట్‌గా విపత్తు నిర్వహణ | Revanth wants ORR cams linked to Command Control: Telangana | Sakshi
Sakshi News home page

ఓఆర్‌ఆర్‌ యూనిట్‌గా విపత్తు నిర్వహణ

Published Sun, Jun 16 2024 3:40 AM | Last Updated on Sun, Jun 16 2024 3:40 AM

Revanth wants ORR cams linked to Command Control: Telangana

వర్షాకాలంలో పటిష్ట చర్యలు చేపట్టాలి: సీఎం రేవంత్‌రెడ్డి 

ట్రాఫిక్‌ సమస్యను పరిష్కరించేందుకు హోంగార్డుల రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలి 

మంత్రులతో కలిసి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించిన ముఖ్యమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌రోడ్డు యూనిట్‌గా తీసుకొని విపత్తు నిర్వహణ జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తాతో కలిసి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను సందర్శించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు.

ఔటర్‌ రింగ్‌రోడ్డు లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ వీలైనంత త్వరగా కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. వానల వల్ల తలెత్తే సమస్యల పట్ల అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చర్య లు తీసుకుంటున్నారనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫిజికల్‌ పోలీసింగ్‌ విధా నం ద్వారా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చర్య లు చరపట్టాలని సూచించారు.

ఎఫ్‌ఎం రేడియో ద్వారా ట్రాఫిక్‌ అలర్ట్స్‌ హైదరాబాద్‌ ప్రజలకు అందించేలా ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్‌ సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కొరత లేకుండా హోమ్‌ గార్డుల రిక్రూట్‌మెంట్‌ చేపట్టాలని కూడా ఆదేశించారు. జంటనగరాల్లో ఇప్పటికే వరద తీవ్ర త ఎక్కువగా ఉండే 141 ప్రాంతాలను గుర్తించామ ని, వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని అధికారులు సీఎంకు వివరించారు. నీరు వచ్చి చేరే ప్రాంతాల నుంచి వరద నీరు వెళ్లేలా వాటర్‌ హార్వెస్ట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement