Traffic problem
-
బాబోయ్.. ఇదేం ట్రాఫిక్
బొమ్మనహళ్లి: బెంగళూరులో గత వారం పది రోజులుగా కురిసిన కుండపోత వానలకు అనేక ప్రాంతాలు వరద నీటిలో మునిగాయి. ట్రాఫిక్ సమస్య ఆకాశాన్నంటింది. ఎక్కడ చూసినా జామ్‌లు ఏర్పడ్డాయి. సెంట్రల్ సిల్క్‌బోర్డు నుంచి బొమ్మనహళ్లి మీదుగా ఉన్న ఎలక్ట్రానిక్ సిటీ వరకు ఈ నెల 23వ తేదీన వర్షంలో ఎన్నడూ లేనంత ట్రాఫిక్ జాం అయ్యింది. బొమ్మనహళ్లి నుంచి ఎలక్ట్రానిక్ సిటీ వరకు ఉన్న వంతెన పైన సుమారు 2 గంటలకు పైన వాహనాలు చిక్కుకుపోయాయి. వంతెన కింద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. ఆఫీసుల నుంచి ఇళ్ళకు బయల్దేరిన ఐటీ, బీటీ సిబ్బంది రోడ్లపై ఇరుక్కుపోయారు.నడుస్తూ వెళ్లిపోయారుచాలా మంది క్యాబ్‌లు వదిలేసి నడుస్తూ వెళ్లిపోయినట్లు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కారులో ఎలక్ట్రానిక్ సిటీలో ఉన్న ఆఫీసు నుంచి వంతెన పైకి చేరుకోవడానికి గంట సమయం పట్టింది. మరో దారిలేక క్యాబ్ దిగి నడుచుకుంటూ వెళ్లిపోయానని ఒకరు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 నుంచి 3 గంటల పాటు వాహనాలు ఒక్క అంగుళం కూడా ముందుకు కదలనంత రద్దీ ఏర్పడింది. ఇదీ బెంగళూరు నగర ట్రాఫిక్ సమస్య అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి మండిపడ్డారు. -
ఓఆర్ఆర్ యూనిట్‌గా విపత్తు నిర్వహణ
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్‌రోడ్డు యూనిట్‌గా తీసుకొని విపత్తు నిర్వహణ జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తాతో కలిసి కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు.ఔటర్ రింగ్‌రోడ్డు లోపల ఉన్న సీసీ కెమెరాలన్నింటినీ వీలైనంత త్వరగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేయాలని ఆదేశించారు. వానల వల్ల తలెత్తే సమస్యల పట్ల అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసేలా వ్యవస్థ ఏర్పాటు చేసేందుకు ఎలాంటి చర్య లు తీసుకుంటున్నారనే విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఫిజికల్ పోలీసింగ్ విధా నం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్య లు చరపట్టాలని సూచించారు.ఎఫ్ఎం రేడియో ద్వారా ట్రాఫిక్ అలర్ట్స్ హైదరాబాద్ ప్రజలకు అందించేలా ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు సిబ్బంది కొరత లేకుండా హోమ్ గార్డుల రిక్రూట్మెంట్ చేపట్టాలని కూడా ఆదేశించారు. జంటనగరాల్లో ఇప్పటికే వరద తీవ్ర త ఎక్కువగా ఉండే 141 ప్రాంతాలను గుర్తించామ ని, వరద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామని అధికారులు సీఎంకు వివరించారు. నీరు వచ్చి చేరే ప్రాంతాల నుంచి వరద నీరు వెళ్లేలా వాటర్ హార్వెస్ట్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
ట్రాఫిక్‌తో ఏటా బెంగళూరుకు రూ.20 వేల కోట్ల నష్టం
బెంగళూరు: తీవ్రమైన ట్రాఫిక్ సమస్యల కారణంగా బెంగళూరు నగరం ఏటా రూ.20 వేల కోట్ల మేర నష్టపోతోందని ఓ అధ్యయనంలో తేలింది. ‘నగర ఉత్పాదకత, ఆర్థిక వృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా ఉత్పాదకత గణనీయంగా తగ్గి, చిన్న, మధ్య తరహా సంస్థల రవాణా అవసరాలు ఆలస్యమవుతున్నాయి. ఇందుకు కాలుష్య సమస్య కూడా తోడవుతోంది’అని ఆ అధ్యయనం తెలిపింది.చాలా ఏళ్లుగా బెంగళూరు నగరం తీవ్ర ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతోంది. నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాలు సరిగ్గానే ఉన్నప్పటికీ నష్టాలను చవిచూస్తోందని ట్రాఫిక్ నిపుణుడొకరు చేపట్టిన ఈ అధ్యయనం పేర్కొంది. ట్రాఫిక్ జామ్ సమస్య కారణంగా ఎక్కువగా నష్టపోయేది బెంగళూరుకు ఆర్థిక దన్నుగా నిలుస్తున్న ఐటీ రంగమేనని తేల్చింది. ఉద్యోగులు తమ విలువైన సమయాన్ని ట్రాఫిక్ సమస్యలతోనే గడుపుతున్నారని కూడా వివరించింది. ట్రాఫిక్ సంబంధ కారణంగా ఒక్క ఐటీ రంగమే సుమారు రూ.7 వేల కోట్ల మేర ఏటా నష్టపోతోందని తెలిపింది. పౌరులు కూడా నాణ్యమైన జీవితాన్ని గడపలేకపోతున్నారని పేర్కొంది. అధ్యయనంలో భాగంగా రోడ్ ప్లానింగ్, ఫ్లై ఓవర్లు, ట్రాఫిక్ నిర్వహణ, మౌలిక సదుపా యాలను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు నిపుణులు పలు సూచనలు చేశారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, కొన్ని ప్రాంతాల్లో ప్రయాణించేందుకు ఎక్కువ చార్జీలు వసూలు చేయడం(కంజెషన్ ప్రైసింగ్), కార్‌పూలింగ్ వంటివి ఇందులో ఉన్నాయి. కెమెరాలు, సెన్సార్ వ్యవస్థలను నెలకొల్పి, ఎక్కువ మంది ట్రాఫిక్ సిబ్బందిని నియమించి నిబంధనలను అమలు చేయడం, మెట్రోలు, ప్రభుత్వ బస్సు సర్వీసులు నడిపేందుకు భూగర్భమార్గాల ఏర్పాటు కూడా ఇందులో ఉన్నాయి. ప్రభుత్వం, పౌర సంస్థలు, పౌరులు కలిసి కట్టుగా పనిచేసి రహదారులపై భారం తగ్గించొచ్చని తెలిపింది. -
ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ లో ఆపరేషన్ రోప్
-
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక ప్రకటన.. ఏడాదికి యాక్షన్ ప్లాన్
సాక్షి, హైదరాబాద్: ‘నగరంలోని ప్రతీ ఒక్కరి జీవితంపై నేరుగా ప్రభావితం చూపే అంశం ట్రాఫిక్. ఇది సజావుగా సాగేలా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజల సహకారం, సమన్వయం ఉంటే పూర్తి సాయి ఫలితాలు ఉంటాయి’ అని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. రానున్న ఏడాది కాలానికి సిద్ధం చేసుకున్న ట్రాఫిక్ పోలీసుల యాక్షన్ ప్లాన్‌పై గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. బంజారాహిల్స్‌లోని కొత్త కమిషనరేట్‌లో ట్రాఫిక్ చీఫ్ ఏవీ రంగనాథ్ సహా ఇతర అధికారులతో కలిని ట్రాఫిక్ పోలీసుల కొత్త లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొత్వాల్ ఏం చెప్పారంటే.. క్యారేజ్ వే క్లియరెన్స్ కోసం ‘రోప్’... రోడ్లపై ట్రాఫిక్ సజావుగా సాగాలంటే ఫుట్‌పాత్‌కు– ప్రధాన రహదారికి మధ్య ఉండే క్యారేజ్ వే క్లియర్‌గా ఉండాలి. ప్రస్తుతం ప్రధాన రహదారులు సహా అనేక చోట్ల అక్రమ పార్కింగ్, ఆక్రమణలతో క్యారేజ్ వే కనిపించట్లేదు. ఈ పరిస్థితిని మార్చేందుకు ఆపరేషన్ రోప్ (రివూవల్ ఆఫ్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ అండ్ ఎన్‌కరోజ్‌మెంట్స్) చేపడుతున్నాం. ఇందులో భాగంగా అదనపు క్రేన్లు సమకూర్చుకుని టోవింగ్ చేయడంతో పాటు అక్రమ పార్కింగ్ చేసిన వాహనాలకు క్లాంప్స్ వేస్తాం. వాహన చోదకుడికి ఇబ్బంది లేకుండా వాటిపై స్థానిక అధికారుల ఫోన్ నంబర్లు ఉంచుతాం. తోపుడు బండ్లు, చిరు వ్యాపారుల ఆక్రమణలనూ పరిగణనలోకి తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అపార్ట్మెంట్స్ సహా ప్రతి భవనానికీ పార్కింగ్ ఉండేలా చూస్తాం. ఆర్టీసీ సహకారంతో బస్ బేల పునరుద్ధరణ, ఆటో స్టాండ్లు పూర్తి స్థాయి వినియోగంలోకి తేస్తాం. చదవండి: ప్రజలను దోచుకుంటున్న వ్యాపారస్తులు.. ఇలా మోసం చేస్తున్నారు! పీక్ అవర్స్‌లో మార్పులు.. ఒకప్పుడు నగర వ్యాప్తంగా ఒకే సమయాలు రద్దీ వేళలుగా ఉండేవి. ప్రస్తుతం ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయం పీక్ అవర్‌గా మారుతోంది. ఆయా వేళల్లో అన్ని స్థాయిల అధికారులూ రోడ్లపైనే ఉంటారు. ట్రాఫిక్ పర్యవేక్షణే మా తొలి ప్రాధాన్యం. జరిమానా విధింపులో ఎన్ని జారీ చేశారనేది కాకుండా ఎలాంటి ఉల్లంఘనలపై చేశారన్నది చూస్తాం. ట్రాఫిక్ ఠాణా వారీగా వీటిని విశ్లేషిస్తాం. ఉల్లంఘనల వారీగా ప్రతి వారం ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్స్ ఉంటాయి. ఎన్ఫోర్స్మెంట్లో టెక్నాలజీ వినియోగిస్తాం. స్టాప్ లైన్ వద్ద డిసిప్లిన్ కనిపిస్తే ఇతర ఉల్లంఘనలు తగ్గుతాయని గుర్తించడంతో దీనిపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు వీలున్న ప్రతి జంక్షన్లో ఫ్రీ లెఫ్ట్ విధానం అమలు చేస్తాం. రద్దీ వేళల్లో అవసరమైన మార్గాలను రివర్సబుల్ లైన్లుగా మారుస్తాం. జంక్షన్లు, యూటర్నులను అభివృద్ధి చేయిస్తాం. తీవ్రమైన ఉల్లంఘలపై ప్రత్యేక దృష్టి పెడతాం. ఎడ్యుకేషన్ కోసం ప్రత్యేక చర్యలు.. వాహన చోదకుల్లో అవగాహన పెంచడానికి సోషల్ మీడియా, షార్ట్ఫిలింస్ తదితరాలను వినియోగిస్తాం. ట్రాఫిక్ పోలీసులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడంతో అవసరమైన స్థాయిలో అదనపు సిబ్బందిని కేటాయిస్తాం. బాటిల్‌నెక్స్‌ను అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటాం. పబ్స్ అంశంలో జీహెచ్ఎంసీ, ఎక్సైజ్ అధికారులతో సమావేశమవుతాం. ప్రస్తుతం సిబ్బంది కొరత కారణంగా 150 జంక్షన్లలో మోహరించలేకపోతున్నాం. ఆయా వర్గాలతో సంప్రదింపులు, సమావేశాలు, అవగాహన కార్యక్రమాల తర్వాతే చర్యలు ఉంటాయి. వ్యక్తిగత వాహనాల్లో గణనీయమైన పెరుగుదల ‘కొవిడ్ తర్వాత గ్రేటర్ పరిధిలో వ్యక్తిగత వాహనాలు గణనీయంగా పెరిగాయి. 2020 జనవరిలో 64 లక్షలున్న వీటి సంఖ్య ఈ ఏడాది ఆగస్టు నాటికి 18 శాతం పెరిగి 77.65 లక్షలకు చేరింది. కార్లు 11 లక్షల నుంచి 21 శాతం పెరిగి 14 లక్షలకు, ద్విచక్ర వాహనాలు 46.46 లక్షల నుంచి 17 శాతం పెరిగి 56 లక్షలకు చేరాయి. ప్రతి రోజూ డయల్–100కు వస్తున్న కాల్స్‌లో 70 నుంచి 80 శాతం ట్రాఫిక్ సమస్యల పైనే. భవిష్యత్తులో తీవ్రమైన ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా ఉండాలంటే అంతా కలిసి సమష్టిగా, సమన్వయంతో ముందుకు వెళ్లాలి’ -
కోవిడ్ ఎఫెక్ట్.. ఇంటింటికి తప్పనిసరిగా మారింది
సాక్షి,హైదరాబాద్: వాహన విస్ఫోటనం గ్రేటర్ హైదరాబాద్‌ను బెంబేలెత్తిస్తోంది. కోటిన్నర జనాభా ఉన్న నగరంలో వాహనాల సంఖ్య ఏకంగా 71 లక్షలు దాటింది. ఇందులో ప్రజా రవాణా వాహనాలు పట్టుమని పది లక్షలు కూడా లేవు. సింహభాగం వ్యక్తిగత వాహనాలే. రోజురోజుకూ వేల సంఖ్యలో రోడ్డెక్కుతున్న వాహనాలతో రహదారులు స్తంభించిపోతున్నాయి. ఇంచుమించు రెండేళ్ల పాటు కోవిడ్ కాలంలో స్తంభించిన ప్రజారవాణా వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తారస్థాయికి తీసుకెళ్లింది. దీంతో ఈ రెండేళ్లలోనే 5 లక్షలకుపైగా కొత్త వాహనాలు రోడ్డుపైకి వచ్చాయి. రహదారులను విస్తరించి, ఫ్లైఓవర్లను ఏర్పాటు చేసినప్పటికీ రద్దీ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు కోవిడ్ కంటే ముందు నుంచే ప్రజా రవాణా ప్రాధాన్యం తగ్గింది. 2020లో 65 లక్షల వాహనాలు ఉంటే ఇప్పుడు 71 లక్షలు దాటాయి. ఇంటింటికీ సొంత బండి... సొంత బండి ప్రతి ఇంటికీ తప్పనిసరిగా మారింది. రోజురోజుకూ నగరం విస్తరిస్తోంది. ఔటర్‌ను దాటి పెరిగిపోతోంది. ఇందుకు తగినట్లుగా ప్రజా రవాణా పెరగడం లేదు. దీంతో నగరానికి దూరంగా ఉండి, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం రాకపోకలు సాగించాల్సినవాళ్లు సొంత వాహనాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. నగర శివార్ల నుంచి, కాలనీల నుంచి ప్రధాన మార్గాలకు అనుసంధానం చేసే రవాణా సదుపాయాలు లేకపోవడంతో సొంత ఇల్లైనా, అద్దె ఇంట్లో ఉంటున్నా సరే బండి తప్పనిసరిగా మారింది. మొబైల్ ఫోన్ ఉన్నట్లే బైక్.. ఇప్పుడు ప్రతి మనిషికి ఒక మొబైల్ ఫోన్ అనివార్యమైన అవసరంగా మారింది. ఇంచుమించు యువతలో 80 శాతం మందికి బైక్ తప్పనిసరిగా మారింది. చదువు, ఉద్యోగ,వ్యాపార అవసరాలతో నిమిత్తం లేకుండా ఒక వయసుకు రాగానే పిల్లలకు బండి కొనివ్వడాన్ని తల్లిదండ్రులు గొప్పగా భావిస్తున్నారు. రవాణాశాఖలో నమోదైన 71 లక్షల వాహనాల్లో సుమారు 47 లక్షల వరకు బైక్‌లే కావడం గమనార్హం. మరో 20 లక్షల వరకు కార్లు ఉన్నాయి. మిగతా 5 లక్షల వాహనాల్లో ఆటోరిక్షాలు, క్యాబ్‌లు, సరుకు రవాణా వాహనాలు, స్కూల్ బస్సులు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులు, తదితర కేటగిరీలకు చెందిన వాహనాలు ఉన్నాయి. ప్రజా రవాణా పెరగాలి వాహన విస్ఫోటనాన్ని అరికట్టేందుకు ప్రజా రవాణా విస్తరణ ఒకటే పరిష్కారం. వ్యక్తిగత వాహనాలను నియంత్రించలేకపోతే రానున్న కొద్ది రోజుల్లోనే వాటి సంఖ్య కోటి దాటే అవకాశం ఉంది. – పాండురంగ నాయక్, జేటీసీ, హైదరాబాద్ చదవండి: అద్దెకు దొరకవు... అధిక కిరాయిలు! -
మున్సిపల్ శాఖ మంత్రిగా అందరూ నన్నే ట్రోల్ చేస్తారు: కేటీఆర్
హైదరాబాద్: క్యాన్సర్ రోగుల కోసం హైదరాబాద్‌లోని ఖాజాగూడలో నూతనంగా నిర్మించిన స్పర్శ్ హాస్పిస్ భవనాన్ని మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్పర్శ్ హాస్పిస్ నుంచి ఆహ్వానం వచ్చే వరకు పాలియేటివ్ కేర్ అంటే ఏంటో తెలియదని అన్నారు. పాలియేటివ్ కేర్ గురించి స్వయంగా తెలుసుకుంటే గొప్పగా అనిపించిందని తెలిపారు. ఐదేండ్లలోనే స్పర్శ్ హాస్పిస్‌కు మంచి భవనం రావడం సంతోషకరమని పేర్కొన్నారు. చదవండి: బతికుండగానే చంపేశారు.. రోటరీ క్లబ్ చేసే ఆరోగ్య కార్యక్రమాలకు ప్రభుత్వం తరపున సహకారం ఉంటుందన్నారు. స్పర్శ్ హాస్పిస్‌కు నీటి బిల్లు, విద్యుత్ బిల్లు, ఆస్తిపన్ను రద్దుచేస్తామని హామీ ఇచ్చారు. మహాకవి శ్రీశ్రీ అన్నట్లు స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదేనని పేర్కొన్నారు. ప్రభుత్వమే అన్ని చేయాలంటే కుదరదని, ప్రైవేటు సంస్థలతో కూడా ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో వర్షం పడితే ట్రాఫిక్ ఉంటుందన్నారు. అయితే ట్రాఫిక్‌కు సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా అందరూ తననే ట్రోల్ చేస్తారని, కానీ హైదరాబాద్‌లో వర్షం పడితే ట్రాఫిక్ జామ్‌కు తానొక్కడినే బాధ్యుడిని కాదన్నారు. చదవండి: మా పిన్ని ఓ లేడీ టైగర్.. రక్షించండి సార్ -
లగేరహో లక్సెంబర్గ్
యూరోపియన్ యూనియన్‌లోని లక్సెంబర్గ్ ఇప్పుడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజారవాణా వ్యవస్థని పటిష్టపరచడం ద్వారా ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు సరికొత్త మార్గానికి లగ్జెంబర్గ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బస్సులు, ట్రామ్‌లు, రైళ్లు ఈ మూడింటిలో ఏ రవాణామార్గాన్ని ఎంచుకున్నప్పటికీ అందులో మీరు హాయిగా పైసా ఖర్చు లేకుండా ప్రయాణం చేసేయొచ్చు. ప్రజలందరికీ ప్రభుత్వం ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తోంది. యావత్ ప్రజారవాణా వ్యవస్థని నిజంగానే ప్రజలకు అంకితమిచ్చింది. ఒకరోజో, రెండ్రోజులో కాదుసుమండీ. లక్సెంబర్గ్‌లో ప్రజలందరికీ ఇక ప్రయాణం ప్రతిరోజూ ఉచితమే. యూరప్‌లోని అతిచిన్న దేశమైన లక్సెంబర్గ్ జనాభా కేవలం 6,14,000. జనాభా గత 20 ఏళ్లలో 40 శాతం పెరిగింది. దీంతో విపరీతంగా పెరిగిన రద్దీని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఈ మార్గాన్ని ఎంచుకుంది. రద్దీని తగ్గించేందుకే.. ప్రపంచ ప్రజల ముందున్న ప్రధానమైన సవాళ్ళలో ట్రాఫిక్, పర్యావరణ సమస్యలు అత్యంత కీలకమైనవి. పర్యావరణం, రద్దీ (ట్రాఫిక్ సమస్య) ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్న సమస్యలు కూడా. ఇక లక్సెంబర్గ్ సంగతి సరేసరి. విపరీతమైన ట్రాఫిక్ సమస్య. ప్రధాన రోడ్లన్నీ పాడైపోయాయి. బస్సులు పాతబడిపోయాయి. రైళ్ళ రాకపోకలు అస్తవ్యస్తంగా ఉండడంతో ప్రభుత్వం విమర్శలనెదుర్కొంటోంది. దీనికి తోడు లక్సెంబర్గ్‌లో పనిచేస్తోన్న ఉద్యోగుల్లో సగానికి సగం మంది అంటే 2 లక్షల మంది బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీల నుంచి లక్సెంబర్గ్‌కి వచ్చేవారే. అక్కడ అధిక వేతనాలు ఉండడమే అందుకు కారణం. ఖర్చు మోపెడు దీనివల్ల టిక్కెట్ల ద్వారా నష్టపోయే మొత్తం 44 మిలియన్ డాలర్లు. అయితే ఈ మొత్తాన్ని పన్ను చెల్లింపుదారుల నుంచి వసూలు చేస్తారు. ఉచిత రవాణా మొత్తానికి అయ్యే ఖర్చు 50 కోట్ల యూరోలు. ఈ ప్రాజెక్టు కారణంగా ఎవ్వరూ ఉద్యోగాలు కోల్పోరు. ఫస్ట్‌క్లాస్ ప్రయాణికులే టిక్కెట్లు కొంటారు కనుక టిక్కెట్ల తనిఖీకి వెచ్చించాల్సిన సమయం తగ్గుతుంది. లక్సెంబర్గ్‌లో చాలా మంది కార్మికులకు సబ్సిడీతో కూడిన పాస్‌లు ఉంటాయి. టిక్కెట్టు కొనుక్కునేవారు తక్కువగానే ఉంటారు. ఇప్పుడు మిగిలిన వారికి కూడా ప్రయాణం ఉచితం కావడంతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో వ్యక్తిపై 600 యూరోలు ఉచిత ప్రయాణ సౌకర్యానికి మరో కారణం ప్రజారవాణా వ్యవస్థని బలోపేతం చేయడం. రాబోయే ఐదేళ్లలో ప్రజారవాణాని ఉపయోగించే వారి సంఖ్య 20 శాతం పెంచాలని అక్కడి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర యూరోపియన్ దేశాలకంటే లక్సెంబర్గ్ ప్రజారవాణా వ్యవస్థపై అత్యధికంగా ఖర్చు చేస్తోంది. ఒక్కో వ్యక్తిపై ఏడాదికి 600 యూరోలు ఖర్చు చేస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ లక్సెంబర్గ్‌లో కార్లు అధికం. వేతనాలు ఎక్కువ. పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువగా కావడంతో కార్ల వాడకం ఎక్కువ. ఈ ట్రాఫిక్‌ను తగ్గించేందుకే ఈ ఉచిత బాట. లక్సెంబర్గ్ ప్రజలతో పాటే పర్యాటకులకు సైతం అక్కడ ప్రయాణం ఉచితమే. అయితే ఫస్ట్ క్లాస్‌లో ప్రయాణించే వారికి మాత్రం టిక్కెట్టు వడ్డింపులు భారీగానే ఉంటాయి. -
‘ట్రాఫికర్’కు చెక్ పెట్టాలి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖలు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ సూచించారు. అన్ని శాఖలు తగిన సమన్వయంతో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. శనివారం జీహెచ్ఎంసీలో జరిగిన సిటీ కన్జర్వెన్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హెచ్ఎంఆర్ మార్గాల్లో రోడ్లు, ఫుట్‌పాత్‌ల పునరుద్ధరణ పనులు, సెంట్రల్ మీడియన్ల అభివృద్ధి పనులు పూర్తిచేయాలని, జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మార్గాన్ని జీహెచ్ఎంసీకి అప్పగించాలన్నారు. ప్రమాదాల నివారణకు 40 కి.మీ.ల వేగపరిమితి సూచికలు ఏర్పాటు చేయాలన్నారు. ఆయా శాఖలు రోడ్డు కటింగ్‌లకు సంబంధించిన ప్రతిపాదనలు సీఆర్ఎంపీ ఏజెన్సీలకు అందజేయాలన్నారు.రోడ్లు తవ్వకముందే యుటిలిటీస్ మ్యాపింగ్ తీసుకొని తదనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. వాటర్‌లాగింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. భూసేకరణకు సంబంధించిన అంశాల్లో జీహెచ్ఎంసీ, రెవెన్యూ అధికారులు పరస్పరం సహకరించుకోవాలని సూచించారు. విద్యుత్ స్తంభాల తరలింపు ప్రక్రియ జాప్యం లేకుండా పూర్తిచేయాలని, చెట్ల కొమ్మలను నరికివేసేటప్పుడు ఎవరికీ ఇబ్బందిలేకుండా తగిన విధంగా ట్రిమ్మింగ్ చేయాలన్నారు. కుడా అధికారులు ఏర్పాటు చేస్తున్న సివర్లైన్స్ శాస్త్రీయంగా లేవంటూ వాటిని ఏర్పాటు చేసేటప్పుడు జలమండలి అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. భూగర్భ పైప్లైన్ల లీకేజీలకు వెంటనే మరమ్మతులు చేయాలని జలమండలి అధికారులను కోరారు. చీకటి ప్రాంతాల్లో విద్యుత్‌దీపాలు ఈనెల 29వ తేదీలోగా ఏర్పాటు చేయాలన్నారు. మెట్రో అధికారులు పార్కింగ్ స్థలాలను గుర్తించి నోటిఫై చేయాలన్నారు. ఇన్‌సిటు విధానంలోని డబుల్ బెడ్రూమ్ఇళ్ల కేటాయింపులకు సంబంధించి పేర్లు, చిరునామా వంటి విషయాల్లో తప్పులున్నందున ఇబ్బందులు కలుగుతున్నాయని, ఆధార్వివరాలతో సరిచూసి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని పథకాల ఇళ్ల కేటాయింపుల డేటాను ఆన్లైన్లో పొందుపర్చాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం అప్డేట్చేస్తామన్నారు. రోడ్ సేఫ్టీకి ప్రత్యేక విభాగం ఉండాలి ట్రాఫిక్, రోడ్సేఫ్టీకి సంబంధించి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటుచేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని పోలీసు అధికారులు సూచించారు. రోడ్డు ప్రమాదాల మరణాల్లో 31 శాతం పాదచారులుంటున్నారని తెలిపారు. సెంట్రల్మీడియన్లలో గ్రిల్స్ ఎత్తు పెంచాల్సిందిగా హెచ్ఎంఆర్ అధికారులను కోరారు. చాలా ప్రాంతాల్లో.. ముఖ్యంగా కూకట్పల్లి, శేరిలింగంపల్లి మార్గంలో ఎక్కువమంది సెంట్రల్ మీడియన్లు దాటి వెళ్తూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు.బ్లాక్‌స్పాట్స్ గుర్తించి, రీ ఇంజినీరింగ్ చేయాలన్నారు. జలమండలి అధికారులు మాట్లాడుతూ తమ వాటర్‌ట్యాంకర్లకు కూడా జరిమానాలు విధిస్తున్నారనగా, అలాంటివి తమ దృష్టికి తెస్తే తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హామీ ఇచ్చారు. సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి, జీహెచ్ఎంసీ అడిషనల్, జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులు పాల్గొన్నారు. -
ట్రాఫిక్.. ట్రాక్‌లో పడేనా?
సాక్షి, హైదరాబాద్: నగరంలో ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్యల్లో ట్రాఫిక్ ఒకటి. రోజురోజుకు పెరిగిపోతున్న వాహనాలకు తగ్గట్లు రహదారులు పెరగకపోవడం, చాలాచోట్ల రోడ్లపై అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగడంతో నగరవాసికి రద్దీ ప్రాంతాల్లో ప్రయాణం నరకప్రాయంగా మారింది. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్యలపై అధ్యయనం కోసం ప్రత్యేక బృందాన్ని ఉన్నతాధికారులు బెంగళూరుకు పంపనున్నారు. ఎందుకో తెలుసా? అక్కడ మంచి ఫలితాలిస్తూ ట్రాఫిక్ పోలీసులకు వరంగా మారిన ‘బీ–ట్రాక్’ (బెంగళూరు ట్రాఫిక్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్)ను సిటీలో అమలు చేస్తే ఎలా ఉంటుందో వారు తెలుసుకుంటారు. ఈ క్రమంలో నగరంలోని రద్దీ ప్రాంతాలపై ఓ లుక్కేద్దామా.. -
ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యకు కొత్త పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యపై సైబరాబాద్ కమిషనరేట్‌లో సమన్వయ సమావేశం జరిగింది. ఈ భేటీలో జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్, సైబరాబాద్ సీపీ సజ్జన్నార్, ఐటీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. వర్షం కారణంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వర్షాలు పడినప్పుడు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా విడతలవారీగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు బయటకు రావాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు ఐటీ ప్రతినిధులు అంగీకరించినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ వెల్లడించారు. వర్షం పడినప్పుడు ఒకేసారి కాకుండా వేర్వేరు సమయాల్లో ఉద్యోగులను ఇళ్లకు పంపడానికి ఐటీ కంపెనీలు ఒప్పుకున్నాయని, ఆయా కంపెనీల పనివేళలకు నష్టం కలుగకుండా ఉద్యోగులను బయటకు పంపనున్నాయని ఆయన వివరించారు. ట్రాఫిక్ విభాగం నుంచి ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు సీపీ సజ్జన్నార్ తెలిపారు. 24 గంటల ముందే వర్షాలకు సంబంధించి హెచ్చరికలు జారీచేస్తామని, ట్రాఫిక్ పోలీసులు వివిధ ప్రాంతాల్లో రద్దీ గురించి అలర్ట్ చేస్తారని తెలిపారు. విడుతలవారీగా ఐటీ ఉద్యోగులు కంపెనీల నుంచి బయటకు రావడం వల్ల పెద్దగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఇంటికి చేరే అవకాశం ఉంటుందని చెప్పారు. ఐటీ కారిడార్‌లో ఇప్పుడు 5 లక్షలు మంది ఉద్యోగులు ఉన్నారని, ఒకేసారి మూడున్నర లక్షల కార్లు బయటకు వస్తుండటంతో రోడ్లు అన్ని ట్రాఫిక్ స్తంభించిపోతున్నాయని, అందుకే ఈ మేరకు పరిష్కార చర్యలు తీసుకున్నామని తెలిపారు. -
ట్రాఫిక్ సమస్యకు మాస్టర్ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తగిన ఫలితాలు ఇవ్వడం లేదని, దీని కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఫిజిక్స్ ప్రొఫెసర్ డాక్టర్ విపిన్ శ్రీవాత్సవ్ హైకోర్టుకు లేఖ రాశారు. ఏటా రోడ్లపై పెరిగిపోతోన్న వాహనాల సంఖ్యను నియంత్రించేందుకు ఓ విధానపరమైన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. లేఖపై స్పందించిన హైకోర్టు దీనిని పిల్‌గా మలిచింది. దీని పై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు, పురపాలక ముఖ్య కార్యదర్శి, రవాణా ముఖ్య కార్యదర్శి తదితరులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలంటూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. -
మెరుగైన రవాణా వ్యవస్థ.. ఓ భ్రమ!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ట్రాఫిక్ సమస్య అంతకంతకూ జటిలమవుతోంది. నగరాలు, పట్టణాల్లో ట్రాఫిక్ ఇబ్బందులతో ప్రజానీకం యాతన పడుతున్నారు. ఇక రాజధాని ప్రాంతమైన విజయవాడలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంది. ఈ సమస్య పరిష్కారంలో భాగంగా మెరుగైన రవాణా వ్యవస్థ నెలకొల్పుతామని ప్రభుత్వం హడావుడి చేసింది. కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఏళ్లు గడుస్తున్నా ప్రణాళికలు రూపొందించలేదు. మరోవైపు సమీకృత రవాణా వ్యవస్థ నెలకొల్పేందుకంటూ రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్(రైట్స్) అనే కేంద్ర ప్రభుత్వరంగ సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ అది కాగితాలను దాటలేదు. అదే సమయంలో ఈ పేరిట ప్రభుత్వాధికారులు రూ.లక్షలు వెచ్చించి అధ్యయన యాత్రలు చేస్తూ రాష్ట్రాలు, దేశాలు చుట్టి వస్తున్నారు తప్ప ప్రణాళికలు, ప్రతిపాదనలు రూపొందించట్లేదు. దీంతో మెరుగైన రవాణా వ్యవస్థ ఓ భ్రమగానే మిగిలిపోతోంది. మొక్కుబడి.. రాష్ట్రంలో సమీకృత రవాణా వ్యవస్థ ఏర్పాటుకోసమంటూ గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్ అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేశారు. సీఎస్‌తో కలిపి మొత్తం 13 మందితో కమిటీ ఏర్పాటైంది. కానీ ఇంతవరకూ ఒక్కసారి కూడా ఇది భేటీ కాలేదు. ఆర్అండ్బీ అధికారులను కమిటీలో సభ్యులుగా నియమించి రవాణా శాఖ కమిషనర్‌కు చోటు కల్పించలేదు. ఈ కమిటీ రాష్ట్రంలో పర్యాటకం, పరిశ్రమల అభివృద్ధి, ఏవియేషన్ సెక్టార్, జల రవాణా, సీఆర్డీఏలో రవాణా, రోడ్లు, రైల్వేలకు సంబంధించి మెరుగైన రవాణా వ్యవస్థకోసం ప్రణాళిక రూపొందించాలి. ఏళ్లు గడుస్తున్నా ఆ దిశగా చర్యల్లేవు. కమిటీని మొక్కుబడికే ఏర్పాటు చేశారనే విమర్శలు రవాణా రంగం నుంచే వినిపిస్తుండడం గమనార్హం. ‘రైట్స్’ ప్రతిపాదనలపైన సమీక్షేది? ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో మెరుగైన రవాణా వ్యవస్థకు సంబంధించి రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనమిక్ సర్వీస్(రైట్స్) సంస్థ కొన్ని ప్రతిపాదనలు చేసింది. మెట్రో, రోడ్డు రవాణాకు బహుళ ఫ్లై ఓవర్ల నిర్మాణాలు తదితరాలపై సర్వే నిర్వహించిన ఆ సంస్థ రాజధానిలో లైట్ మెట్రో, రోడ్డు రవాణాకు సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టవచ్చో.. తెలియజేస్తూ ప్రతిపాదనలిచ్చింది. అలాగే విశాఖ, తిరుపతి, గుంటూరు నగరాల్లో రవాణా వ్యవస్థపైనా సూచనలు చేసింది. అయితే ఈ సంస్థ ఇచ్చిన ప్రతిపాదనలపై ఇంకా సమీక్షించలేదు. ఆర్టీసీదీ ఇదే దారి.. ఆర్టీసీ కూడా ఇదే దారిలో నడుస్తోంది. మెరుగైన రవాణా వ్యవస్థకు రూ.కోట్లు ఖర్చు చేసి సలహా కమిటీలు ఏర్పాటు చేసుకుంటోంది తప్ప అవి ఇస్తున్న సూచనలను పట్టించుకోవట్లేదు. ఆర్టీసీలో నష్టాలను అధిగమించడంపై సూచనలిచ్చేందుకు యాజమాన్యం రెండేళ్లక్రితం రూ.10 కోట్లు ఖర్చు చేసి బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) సహకారాన్ని కోరింది. ప్రొఫెసర్ రవికుమార్ నేతృత్వంలో ఐఐఎం బృందం ఆర్టీసీ స్థితిగతుల్ని నెలల తరబడి అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. ప్రజారవాణా వ్యవస్థలో ఆర్టీసీ వాటాగా ఉన్న 35 శాతాన్ని 50 శాతానికిపైగా పెంచుకోవాలని, ఇందుకోసం రాష్ట్రంలో ప్రతి పల్లెకు బస్సులు నడపాలని సూచించింది. అంతేగాక ఏటా ఆర్టీసీకి ప్రభుత్వం గ్రాంట్ రూపంలో రూ.200 కోట్లు కేటాయించాలని సిఫారసు చేసింది. ఇటీవలే ఆర్టీసీలో మెరుగైన రవాణా సేవలకు అవసరమైన సలహాలకోసం ఢిల్లీకి చెందిన వరల్డ్ రిసోర్సెస్ ఇన్స్టిŠూట్యట్ ఇండియా(డబ్ల్యూఆర్‌ఐఐ)తో ఏపీఎస్ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఆర్‌ఐఐ ప్రతినిధులు పలు సూచనలు చేశారు. అయితే ఈ సలహాలను ఇంతవరకు ఆర్టీసీ అమలు చేయలేదు. -
మోదీకి చిన్నారి సెల్ఫీ వీడియో
బొమ్మనహళ్లి : స్కూల్‌కు వెళ్లి వచ్చే సమయంలో ఎదురవుతున్న ట్రాఫిక్ సమస్యను ఓ చిన్నారి వీడియో తీసి ప్రధాని నరేంద్ర మోదీకి పంపింది. బెంగళూరులో ని కోరమంగళ నుంచి సర్జాపుర వెళ్లే మార్గంలో కార్మాలారం వద్ద రైల్వే గేట్ ఉంది. రైళ్ల రాకపోకలతో అరగంటపాటు వాహనాలు భారీగా నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సెయింట్ ప్యాట్రిక్ పాఠశాల విద్యార్థి రియాంశి పట్నాయక్(6) తండ్రి దీపాంకర్ మొబైల్లో సమస్యను చిత్రీకరించి.. రైల్వేగేట్‌వద్ద 15 నిమిషాలు ఆగాల్సి వస్తోందని, దీంతో స్కూల్‌కు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని, సాయంత్రం ఇంటికి రావడం ఆలస్యమవుతోందని, ఈ సమస్యను పరిష్కరించాలి మోదీజీ అంటూ రికార్డు చేసింది. ఆమె తండ్రి ఆ వీడియోను ప్రధాని, రైల్వేమంత్రి పియూష్ గోయల్‌కు ట్విట్టర్ల ద్వారా పోస్ట్ చేశారు. -
పవన్ పాట.. ఇవాంక కోసం!
హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారాల పట్టి ఇవాంక అంతర్జాతీయ పారిశ్రామిక సదస్సు కోసం నగరానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ఇవాంక రాకతో హైదరాబాద్‌లో ఉదయం భారీగా ట్రాఫిక్ ఏర్పడింది. దీంతో హీరో నవదీప్ వెంటనే ‘అజ్ఞాతవాసి’ పాటను గుర్తు చేసుకున్నాడు. ఆమెకు.. ఆ పాటకు ఏం సంబంధం అనుకుంటున్నారా ? నగరంలో ఇవాళ ఉదయం 10 గంటలకు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. అందులో చిక్కుకున్న నవదీప్ వెంటనే తన ట్విట్టర్ ద్వారా ఆ విషయాన్ని వెల్లడించారు. ‘బయటికెళ్లి చూస్తే టైం ఏమో 10’O క్లాక్’. ఇంటికెళ్లే రోడ్డు మొత్తం ఇవాంక రోడ్డు బ్లాక్’ అని ట్రాఫిక్ కష్టాల గురించి హీరో ఫన్నీగా ట్విట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. Baitikelli chusthe time emo 10 o clock Intikelle road mothham ivanka road block !! #haha :) — Navdeep (@pnavdeep26) November 28, 2017 -
ఫ్లైఓవర్లు కట్టారు మరమ్మతులు మరిచారు!
- ఆర్ఓబీలు, ఫ్లైఓవర్లపై ప్రయాణానికి లేని భరోసా? - నిర్వహణను మరిచిన పలు ప్రభుత్వ విభాగాలు సాక్షి, హైదరాబాద్: మహానగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి నిర్మించినవే ఫ్లైఓవర్లు/రైల్వే ఓవర్ బ్రిడ్జీ(ఆర్ఓబీ)లు. నగర అవసరాల దృష్ట్యా వివిధ ప్రాంతాల్లో వీటిని నిర్మించిన ప్రభుత్వ విభాగాలు.. నిర్వహణను మాత్రం గాలికొదిలేశాయి. ఫ్లైఓవర్లు/ఆర్ఓబీలను నిర్మించి ఏళ్లకు ఏళ్లు గడిచిపోవడంతో ఎప్పుడు ఏ ముప్పు ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫ్లైఓవర్లపై ప్రయాణానికి భరోసా లేకుండాపోయింది. ఖైరతాబాద్, తెలుగుతల్లి, హఫీజ్‌పేట తదితర ఫ్లైఓవర్లపై ప్రయాణించేటప్పుడు కుదుపులు ఎక్కువ అవుతున్నాయని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 30 వరకూ ఫ్లైఓవర్లు/ఆర్ఓబీలు గ్రేటర్ పరిధిలో పాత ఎంసీహెచ్, ప్రస్తుత జీహెచ్ఎంసీ, పాత హుడా, ప్రస్తుత హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ నిర్మించిన ఫ్లైఓవర్లు/ఆర్ఓబీలు దాదాపు 30 వరకు ఉన్నాయి. కాలం గడిచే కొద్దీ ఫ్లైఓవర్లు/ఆర్ఓబీల్లోని ఎక్స్పాన్షన్ జాయింట్లు, వేరింగ్ కోట్స్ బలహీనమవుతాయి. బేరింగులు అరిగిపోతాయి. మెయిన్ గర్డర్స్ వంటి ప్రాంతాల్లో కాంక్రీట్ దెబ్బతింటుంది. ఉపరితలం వదులై బలహీనంగా మారుతుంది. స్తంభాల పైభాగాలు(పయర్ క్యాప్స్) తుప్పుపడతాయి. బాక్స్‌గర్డర్స్ ఏటవాలు గోడల్లో పగుళ్లు వస్తాయి. కొన్ని పర్యాయాలు ఎక్స్పాన్షన్ జాయింట్స్ కదలకుండా బిగుసుకుపోతాయి. వాహనాల భారంతో ఇలాంటి సమస్యలు ఏర్పడటం సహజం. వీటిని సరిచేసేందుకు నిర్ణీత సమయాల్లో అవసరమైన మరమ్మతులు చేయాలి. కానీ, గ్రేటర్లో చాలా ఫ్లైఓవర్లు నిర్మించి 15 ఏళ్లు అవుతున్నా ఇంతవరకు మరమ్మతులు చేసిన దాఖలాలు లేవు. కొన్నేళ్ల క్రితం ఖైరతాబాద్ ఆర్‌ఓబీపై కుదుపులు ఎక్కువ కావడంతో స్వల్ప మరమ్మతులు చేశారు. మళ్లీ ఇప్పుడు కుదుపులు ఎక్కువగా వస్తున్నాయని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మసాబ్‌ట్యాంక్, తెలుగుతల్లి, హఫీజ్‌పేట ఫ్లైఓవర్లపైనా సమస్యలు ఉన్నట్లు నగరవాసులు జీహెచ్ఎంసీ దృష్టికి తీసుకొచ్చారు. అధ్యయనంతో సరి.. ఏ సంస్థ నిర్మించిన ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలను ఆ సంస్థలే నిర్వహించాల్సి ఉండగా.. అన్నీ ఆ విషయమే మరిచాయి. జరగరానిదేదైనా జరిగితే స్థానిక సంస్థగా తమనే నిందిస్తారనే తలంపుతో జీహెచ్ఎంసీ నాలుగేళ్ల క్రితం ఫ్లైఓవర్లు/ఆర్ఓబీల స్ట్రక్చర్స్, జనరల్ కండిషన్లను తెలుసుకునేందుకు సిద్ధమైంది. ఇన్వెంటరీ కమ్ కండిషన్ సర్వే బాధ్యతలను స్టుప్ కన్సల్టెంట్స్‌కు అప్పగించింది. సర్వే నిర్వహించిన సంస్థ ఖైరతాబాద్, లాలాపేట ఆర్ఓబీలు, మాసాబ్‌ట్యాంక్ ఫ్లైఓవర్ల స్ట్రక్చరల్ స్టెబిలిటీ నిర్ధారణకు సమగ్ర అధ్యయనం అవసరమని సూచించింది. దాంతో వాటి సమగ్ర సర్వే బాధ్యతను సివిల్–ఎయిడ్ టెక్నో క్లినిక్ ప్రైవేట్ లిమిటెడ్‌కు అప్పగించారు. సర్వే నిర్వహించిన సదరు సంస్థ వాటి భద్రతకు పూర్తి భరోసా లేదని, గుర్తించిన లోపాలను వెంటనే సరిదిద్దాల్సిన అవసరముందని, తద్వారా వాటి జీవితకాలం పెరుగుతుందని సూచించింది. అయితే ఆ సూచనలు నేటికీ అమలు కాలేదు. దీంతో ఫ్లైఓవర్లు, ఆర్ఓబీలు ప్రమాదకరంగా మారుతున్నాయి. స్ట్రక్చరల్ స్టెబిలిటీ అవసరం ఏ నిర్మాణానికైనా నిర్ణీత సమయాల్లో స్ట్రక్చరల్ స్టెబిలిటీ పరిశీలించాలి. పాత ఫ్లైఓవర్లలో ఎక్స్పాన్షన్ జాయింట్లు పాడయ్యే అవకాశం ఉంది. బేరింగులు పాడవడం వంటివి ఉంటాయి. పునాది చుట్టూ ఆప్రాన్ కట్టడం వంటి చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు తగిన నిర్వహణ ఉండాలి. – ప్రొఫెసర్ ఎన్.రమణారావు, జేఎన్టీయూ మరమ్మతులపై దృష్టి సారిస్తాం కొన్ని ఫ్లైఓవర్లు జర్కులిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. పరిశీలన జరిపి అవసరమైన మరమ్మతులు చేసే ఆలోచన ఉంది. మరమ్మతుల కోసం ట్రాఫిక్‌ను మళ్లించాలి. స్పాన్ల మరమ్మతులకు పది నుంచి ఇరవై రోజుల సమయం పడుతుంది. అవసరమైన ఫ్లైఓవర్లకు తగిన మరమ్మతులు చేస్తాం. – జియావుద్దీన్, సీఈ, జీహెచ్ఎంసీ జాగ్రత్తలు అవసరం వానాకాలంలో వర్షాలకు ముందు తర్వాత ఫ్లైఓవర్లను పరిశీలించాలి. వాటి పరిస్థితి ఎలా ఉందో సరిచూసుకోవాలి. అవసరమైన ప్రాంతాల్లో తగిన మరమ్మతులు చేయాలి. – ఆర్.ధన్సింగ్, ఈఎన్సీ, ప్రజారోగ్య శాఖ సూచనలు ఇవీ.. ► మెయిన్ గర్డర్తోపాటు అన్ని గర్డర్స్‌ను క్షుణ్ణంగా పరిశీలించి, ఉపరితలం వదులుగా ఉన్న భాగాలను సమగ్రంగా అధ్యయనం చేయాలి. పాలిమర్ మోడిఫైడ్ మోర్టార్తో మరోమారు సామర్థ్య పరీక్షలు నిర్వహించి, లోపాలున్న చోట మైక్రోఫైన్ సిమెంట్‌తో నింపి సరిచేయాలి. ► బల్బ్, వెబ్ ప్రాంతాల్లో గుర్తించిన పగుళ్లను సరిచేసేందుకు లో వెలాసిటీ మానోమర్ను ఇంజెక్ట్ చేయాలి. ► తుప్పు కారణంగా దెబ్బతిన్న అడుగు భాగాలను, డయాఫ్రమ్ బీమ్స్‌ను పాలిమర్ మోడిఫైడ్ మోర్టార్తో పరీక్షించి గట్టిదనాన్ని అంచనా వేయాలి. ► కొన్ని స్తంభాల పైభాగాలు(పయర్క్యాప్స్) తుప్పుపట్టడం, పెచ్చులూడినందున శాండ్ బ్లాస్టింగ్ ద్వారా క్లీన్ చేయాలి. ► ఎక్స్పాన్షన్ జాయింట్స్ దెబ్బతిన్నందున కంప్రెషన్ స్టీల్ జాయింట్స్ అమర్చాలి. ► కన్స్ట్రక్షన్ జాయింట్లలోని పగుళ్ల ప్రాంతాల్లో మైక్రోఫైన్ సిమెంట్‌తో గ్రౌటింగ్ చేయాలి. ► బాక్స్ గర్డర్ల మొదటి, చివరి కంపార్ట్మెంట్లలో నీటి నిల్వ ప్రాంతాల్లో నీరు నిల్వకుండా ట్రీట్మెంట్ చేయాలి. అందుకుగానూ తగిన వాలు(స్లోప్)తో వాటర్ ప్రూఫ్ సిమెంట్ మోర్టార్తో ఉపరితలాన్ని నింపాలి. ► నీరు వెళ్లేందుకు వీలుగా అడుగుభాగంలో 50 మి.మీ. డయాతో రంధ్రాలు ఏర్పాటు చేయాలి. ► జాయింట్స్ ప్రాంతాల్లో కాంక్రీట్ మెటీరియల్ చిప్ వేయాలి. కేంటిలివర్ బీమ్స్ వదులుగా ఉన్న ప్రాంతాల్లోనూ చిప్పింగ్ చేయాలి. ► గర్డర్లలో తిరిగి పగుళ్లు ఏర్పడే అవకాశాల్లేవని భావించినప్పటికీ నిర్ణీత వ్యవధుల్లో వాహన భారం(లోడ్) పరీక్షలు నిర్వహించాల్సిన అవసరాన్ని కన్సల్టెంట్ సంస్థ నొక్కి చెప్పింది. పరీక్షల్లో ఫలితాల్ని బట్టి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. ► కొన్ని ప్రాంతాల్లో.. మెయిన్ గర్డర్, బేరింగ్ ప్రాంతాల్లో హనీకోంబ్స్ (కాంక్రీట్ అంతటా సమంగా లేక డొల్లలు) ఏర్పడ్డాయి. ► స్లోప్డ్ వాల్స్, కన్స్ట్రక్షన్ జాయింట్ల నడుమ కాంక్రీటు నాణ్యత అనుమానాస్పదంగా మారింది. లోపాలేమిటీ..? వివిధ ఫ్లైఓవర్లు/ఆర్ఓబీల్లో దిగువ లోపాలున్నట్లు కన్సల్టెంట్ సంస్థ గుర్తించింది. ► పయర్క్యాప్స్లోని రీయిన్‌ఫోర్స్‌మెంట్ బార్స్ తుప్పుపట్టి దెబ్బతిన్నాయి. ► ఇంటీరియర్స్‌లో కాంక్రీట్ నాణ్యత దెబ్బతిన్న ప్రదేశాల్లో స్వల్ప పగుళ్లు ఉన్నాయి. ► కొన్నిచోట్ల నీరు సాఫీగా వెళ్లకుండా ఆటంకాలున్నట్లు అంచనా వేశారు. ► ఎక్స్పాన్షన్ జాయింట్స్, వేరింగ్కోట్స్ తగినంత బలంగా లేవు. -
500 ఎకరాలు.. రూ.96 కోట్లు
- రెండు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి పరిహారం - రాష్ట్ర ప్రభుత్వం ముందు రక్షణ శాఖ ప్రతిపాదన సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్న వాహనదారులకు ఊరట కల్పించేందుకు ఉద్దేశించిన రెండు ఎలివేటెడ్ కారిడార్లకు అవసరమైన 100 ఎకరాల భూమిని ఇచ్చేందుకు రక్షణ శాఖ పెద్ద డిమాండ్‌నే రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ కూడలి నుంచి రాజీవ్ రహదారిపై శామీర్‌పేట వరకు, ప్యాట్నీ కూడలి నుంచి నిజామాబాద్ హైవేపై సుచిత్ర కూడలి వరకు రెండు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ రహదారుల నిర్మాణానికి కచ్చితంగా రక్షణ శాఖ భూములు సమీకరించాల్సి ఉంది. ఇందుకు అంగీకరిస్తే దాదాపు 100 ఎకరాల భూమిని రక్షణ శాఖ కోల్పోవాల్సి వస్తుంది. ఈ భూమికి ప్రతిగా హైదరాబాద్ శివారులోని జవహర్‌నగర్ పరిధిలో 500 ఎకరాల భూమి, రూ.96 కోట్ల నగదు ఇవ్వాలని తాజాగా రక్షణ శాఖ ప్రతిపాదించింది. రెండు రోజుల కింద ఢిల్లీలో రక్షణ శాఖ అధికారులతో రోడ్లు, భవనాల శాఖ అధికారి సునీల్‌శర్మ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి మీనా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యామ్నాయ భూమిపై దాదాపు కొలిక్కి తెచ్చారు. ఫైరింగ్ రేంజ్ కోసం.. రక్షణ శాఖ చాలాకాలం నుంచి రాష్ట్రంలో ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు యత్నిస్తోంది. ఇందుకు రంగారెడ్డి జిల్లా, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలో పలు ప్రాంతాల్లో భూమిని పరిశీలించింది. జవహర్‌నగర్ పరిధిలోకి వచ్చే యాప్రాల్ వద్ద తాత్కాలిక పద్ధతిలో ఫైరింగ్ రేంజ్ నిర్వహిస్తోంది. 503 ఎకరాల భూమిని 1995లో లీజు పద్ధతిలో ప్రభుత్వం నుంచి పొంది ఫైరింగ్ రేంజ్‌గా వాడుకుంటోంది. 2011లో లీజు గడువు పూర్తయింది. దీంతో ఆ స్థలాన్ని వెనక్కు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రక్షణ శాఖకు లేఖలు రాసింది. అయితే దాన్ని తమకే అమ్మాలని కోరుతున్న రక్షణ శాఖ ఆ భూమిని ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించలేదు. ఇప్పుడు కంటోన్మెంట్లో 100 ఎకరాలకు ప్రత్యామ్నాయంగా ఈ భూమి ఇవ్వాలని లింకు పెట్టింది. కంటోన్మెంట్ భూములు అతి ఖరీదైనవి అయినందున ఈ 503 ఎకరాలతో పాటు మరో రూ.96 కోట్లు కూడా ఇవ్వాలని అడిగింది. దీనిపై రాష్ట్ర అధికారులు ప్రభుత్వంతో సంప్రదించి సూత్రప్రాయ అంగీకారం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఢిల్లీ నుంచి వచ్చిన అధికారులు రాష్ట్రానికి నివేదిక సమర్పించారు. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. -
నోటిఫికేషన్ ఇచ్చే వరకు పనులు ఆపండి
కేబీఆర్ పార్క్ వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణంపై ఎన్జీటీ ఆదేశం సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి వ్యూహాత్మక రోడ్డు అభివృద్ధి ప్రణాళిక(ఎస్సార్డీపీ)లో భాగంగా కేబీఆర్ పార్క్ చుట్టూ నిర్మించ తలపెట్టిన ఆకాశ వంతెనలకు బ్రేక్ పడింది. ఫ్లై ఓవర్ల నిర్మాణం కేబీఆర్ పార్క్‌లోని జీవరాశి మనుగడకు ప్రమాదకరమంటూ పర్యావరణ, సామాజికవేత్తలు చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ)ను ఆశ్రయించడంతో పనులు చేపట్టకుండా గతంలో ఎన్జీటీ స్టే ఇచ్చింది. దీనికి సంబంధించి బుధవారం తుది తీర్పునిచ్చిన ఎన్జీటీ.. కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్(ఈఎస్‌జడ్)పై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తుది నోటిఫికేషన్ వెలువడేంత వరకు పనులు చేపట్టొద్దని జీహెచ్ఎంసీని ఆదేశించింది. దీంతో ఫ్లైఓవర్ల పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ మరికొంత కాలం ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈఎస్‌జడ్ తగ్గించాలని కేంద్రానికి ప్రతిపాదనలు.. కేబీఆర్ పార్క్ ఈఎస్‌జడ్ సగటున 25–35 మీటర్లుగా ఉంది. అందులో పార్క్ వాక్‌వే ఉంది. ఫ్లైఓవర్ల పనులు పూర్తయితే వాక్‌వే 3 నుంచి 7 మీటర్లకు తగ్గనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పెరిగిన నగరీకరణ, జనసమ్మర్థంతో పార్క్ నగరం మధ్యకు చేరడంతో ఎకో సెన్సిటివ్ జోన్‌ను సగటున 3 నుంచి 7 మీటర్లకు తగ్గించాలని ఒకసారి, జీరో మీటర్లకు తగ్గించాలని మరోసారి తెలంగాణ ప్రభుత్వం కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించింది. చెన్నైలోని గిండి జాతీయ పార్క్ ఈఎస్‌జడ్ జీరో మీటర్లకు తగ్గించడాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలపై కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తుది నోటిఫికేషన్ వెలువరించాల్సి ఉన్నందున, సదరు నోటిఫికేషన్ వెలువడేంత వరకు పనులు నిలుపుదల చేయాలని ఎన్జీటీ తన తీర్పులో పేర్కొంది. దీంతో ఆ నోటిఫికేషన్ వచ్చే వరకూ ఈ పనులు చేపట్టే అవకాశం లేదు. తుది నోటిఫికేషన్‌ను బట్టే ముందడుగు.. తుది నోటిఫికేషన్లో ఎకో సెన్సిటివ్ జోన్‌ను 3–7 మీటర్లకు లేదా జీరో మీటర్లకు తగ్గిస్తే.. జీహెచ్ఎంసీ ఫ్లైఓవర్ల పనులు చేపట్టవచ్చు. తుది నోటిఫికేషన్లో 25–35 మీటర్ల వరకు యథాత థంగా ఉంచితే ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం జీహెచ్ఎంసీ.. నేషనల్ బోర్డ్ ఆఫ్ వైల్డ్‌లైఫ్ స్టాండింగ్ కమిటీ నుంచి క్లియరెన్స్ పొందాలని పర్యావరణ నిపుణుడొకరు తెలి పారు. జాతీయ పార్కులకు ఈఎస్జడ్లు ఉన్నప్పటికీ రహదా రులు, ఇతర ప్రజావసరాల దృష్ట్యా కమిటీ తగిన మినహాయింపులిస్తుందని ఆయన పేర్కొన్నారు. -
ట్రాఫిక్ సమస్య లేకుండా చర్యలు
నల్లగొండ క్రైం : జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని ట్రాఫిక్ రద్దీ, ప్రమాదాలు జరిగే ప్రాంతాలతోపాటు ప్రకాశం బజారులోని కూరగాయల మార్కెట్‌ను బుధవారం జేసీ నారాయణరెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అన్ని ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో ప్రీ లెఫ్ట్ డైవర్షన్ మార్గాలు ఏర్పాటు చేసి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చేశామన్నారు. క్లాక్‌టవర్ వద్ద కూరగాయల విక్రయాలతో ట్రాఫిక్ సమస్య ఏర్పడిందన్నారు. వారి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా ప్రకాశం బజారులోని కూరగాయల మార్కెట్‌కు మార్చనున్నట్లు వెల్లడించారు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలు మళ్లింపు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు మున్సిపల్, జెడ్పీ, ఆర్అండ్బీ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జేసీ నారాయణరెడ్డి సూచించారు. డీఎస్పీ సుధాకర్, ట్రాఫిక్ సీఐ ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇంకెన్నాళ్లీ కష్టాలు ?
మార్కెట్లో మారని పరిస్థితులు దుమ్ము, దూళిలో వ్యాపారం డేరాల కిందనే విక్రయాలు రోడ్లపైనే యథేచ్ఛగా.. ట్రాఫిక్ జామ్‌తో సతమతం ఆధునికీకరణ మరచిన అధికారులు కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్‌లోని ప్రధాన కూరగాయల మార్కెట్లో సమస్యలు పరిష్కారం కావడం లేదు. మార్కెట్ బయట రోడ్డుపై కూరగాయలు విక్రయించొద్దనే అధికారుల ఆదేశాలు అమలుకావడం లేదు. మార్కెట్‌లోపలే విక్రయించాలంటున్న అధికారులు సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించడం లేదు. ఫలితంగా మళ్లీ వ్యాపారులు రోడ్డెక్కుతున్నారు. దుమ్ముదూళిలోనే కూరగాయలు విక్రయిస్తున్నారు. దీంతో మార్కెట్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యగా మారింది. మోడల్ మార్కెట్లు నిర్మిస్తామన్న ప్రభుత్వం ఆ మాటలు మరిచిపోయినట్లు ఉంది. ఏడాదిన్నర క్రితం అధికారులు ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకున్నారు. స్థలాలు చూపించినా.. గతేడాది మార్చిలో కూరగాయల మార్కెట్లోని ఆక్రమణలు తొలగించి రోడ్డుపైన విక్రయించే వారందరికీ లోపల స్థలాలు చూపించారు. అయితే ఇన్నాళ్లు రోడ్డుపై విక్రయించేందుకు అలవాటుపడ్డ వ్యాపారులు కొద్దీ రోజులకే మళ్లీ రోడ్డెక్కారు. రోడ్డుపై విక్రయాలు నిషేధిస్తూ..రోడ్డుపై వర్తకులకు రైతుబజార్లో చోటు కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. వ్యాపారులు ససేమిరా అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఆధునికీకరణ ఎప్పుడో? ప్రధాన కూరగాయల మార్కెట్లో నిలువ నీడలేకపోవడంతో వ్యాపారులు ఇబ్బం దులు పడుతున్నారు. మార్కెట్ లోపలిక ంటే బయటనే వ్యాపారం బాగుంటుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. యాబై ఏళ్ల క్రితం ఏర్పడిన మార్కెట్లో ఇన్నాళ్లు చిన్నపాటి వివాదాలున్నప్పటికీ ప్రస్తుతం అవి కూడా సమసిపోయాయి. దీంతో మార్కెట్ ఆధునికీకరిస్తామని చెప్పిన అధికారులు లోపల ఉన్న షెడ్లను కూల్చి చదును చేశారు. ఎండొస్తే ఎండుతూ, వానొస్తే తడుస్తూ వ్యాపారు లు డేరాల కింద కాలం వెల్లదీస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్, పోలీసుశాఖ దృష్టి సారించి మార్కెట్ ఆధునికీకరణతో పాటు రోడ్లపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. ట్రాఫిక్ సమస్య ప్రధాన మార్కెట్‌కు మూడు వైపులా ఉన్న రోడ్లపై ఇరువైపులా కూరగాయలు విక్రయిస్తున్నారు. మార్కెట్లోకి వెళ్లాలంటే రోడ్డుపై కదలడమే కష్టంగా మారింది. దీనికి తోడు ఆటోలు, ద్విచక్ర వాహనాలు మార్కెట్ రోడ్డుపైకి రావడంతో కాలినడక కష్టంగా మారింది. ప్రధాన మార్కెట్ ఏరియానే కాకుండా నగరంలో ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు. వారసంత, ఫారెస్ట్ ఆఫీసు ఎదుట, ట్రాన్స్‌కో కార్యాలయం ఎదుట, పాతబజార్, కార్ఖానగడ్డ, ముకరంపుర, ఆదర్శనగర్ ప్రాంతాల్లో రోడ్లపైనే కూరగాయలు విక్రయిస్తున్నారు. -
బ్రిడ్జిని ఢీ కొన్న లారీ...నిలిచిన ట్రాఫిక్
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ఓ లారీకి తృటిలో పెనుప్రమాదం తప్పింది. మద్నూర్ మండలం పెద్దఎక్లారం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున అతివేగంగా వస్తున్న లారీ బ్రిడ్జిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ వంతెనపై వేలాడుతూ నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో దాదాపు 10కి.మీ.మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో లారీని తొలగించి ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. -
మాస్ ట్రాన్స్పోర్ట్తో ట్రాఫిక్ సమస్యకు చెక్
కృష్ణరాజపుర: నగరంలో విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్ రద్దీని నివారించడానికి సమూహ సారిగె(మాస్ ట్రాన్స్పోర్ట్) వ్యవస్థను అత్యవసరంగా ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఎంపీ పీ.సీ.మోహన్ తెలిపారు. మహదేవపుర పరిధిలోని హూడీ సమీపంలో ఎంపీ నిధులతో నిర్మించిన కొత్త రైల్వేస్టేషన్‌ను ప్రారంభించిన అనంతరం పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించి మాట్లాడారు. ఐటీబీటీ రంగంలో ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న బెంగళూరు నగరం రోజురోజుకు వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో అదే స్థాయిలో ట్రాఫిక్ కూడా పెరిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ పరిస్థితుల్లో మాస్ట్రాన్స్పోర్ట్ వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ఐటీబీటీ ఉద్యోగులకు అనకూలంతో పాటు ట్రాఫిక్ రద్దీనీ నియంత్రించవచ్చని తెలిపారు. అదేవిధంగా దొడ్డనెక్కుందిలో కూడా ఇటువంటి రైల్వేస్టేషన్‌ను నిర్మించడానికి చర్చలు జరగుతున్నాయని తెలిపారు. కావేరి నదీ జలాల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యను పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కార్యక్రమంలో ఎంఎల్ఏ అరవింద లింబావళి,రైల్వే అధికారి సంజీవ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు. 3 గణపతి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ సాక్షి, బెంగళూరు : డీఎస్పీ గణపతి ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. తన తండ్రి మరణానికి రాష్ట్ర మంత్రి కే.జేజార్జ్తో పాటు ఇద్దరు ఉన్నతాధికారులు కారణమని పేర్కొంటూ గణపతి కుమారుడు నేహాల్ మడికేరి కోర్టులో ప్రైవేటు కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసు విచారణ జరిపిన సీఐడీ గణపతి ఆత్మహత్యకు కే.జేజార్జ్కు ఎటువంటి సంబంధం లేదని తేల్చుతూ ఈ విషయాన్ని కోర్టుకు ఇటీవల తెలియజేసింది. అయితే సీఐడీ చెప్పిన విషయంపై ఏమైనా అనుమానాలుంటే ఈనెల 29న కోర్టుకు విన్నవించుకోవచ్చునని న్యాయస్థానం నేహాల్కు సూచించింది. దీంతో గురువారం ఆయన కోర్టుకు హాజరై సీఐడీ దర్యాప్తుపై ఎటువ ంటి సందేహం లేదని చెప్పారు. ఈ విషయమై మీడియాతో మాట్లాడుతూ... తాను చదువుపై దృష్టి పెట్టాలన్నారు. అంతేకాకుండా కోర్టుకు పదేపదే రావడానికి కుదరదని తెలిపారు. అందువల్లే ఈ వివాదాన్ని ఇంతటికి ముగించాలనుకున్నానని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా తమ అన్న మరణంపై పలు సందేహాలు ఉన్నాయని అందువల్ల ఈ కేసును సీబీఐచేత విచారణ జరిపించాలని గణపతి తమ్ముడు మాచయ్య గురుఆవరం కోర్టులో ప్రత్యేక కేసు దాఖలు చేయడం గమనార్హం. ఈ కేసు విచారణను తదుపరి వచ్చే 24కు వాయిదా వేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
జంక్షన్ల వద్ద ఆంక్షలు!
హైదరాబాద్‌లో ట్రాఫిక్ నియంత్రణకు సర్కారు చర్యలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జంక్షన్లకు 300 మీటర్ల పరిధిలో భారీ భవనాల నిర్మాణంపై నిషేధం విధించింది. మల్టీప్లెక్స్‌లు, ఆస్పత్రులు, ఫంక్షన్ హాళ్లు, పాఠశాలలు, పెట్రోల్ బంకులు వంటి వాటిని ప్రధాన జంక్షన్లకు 300 మీటర్ల పరిధిలో ఏర్పాటు చేయవద్దని స్పష్టం చేసింది. దీంతోపాటు జంక్షన్ల పరిధిలో పార్కింగ్, ప్రకటనల హోర్డింగులనూ నిషేధించిం ది. ఈ మేరకు జీహెచ్ఎంసీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీనిపై పురపాలకశాఖ ఒకటి రెండు రోజుల్లోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. ప్రధాన జంక్షన్ల వద్ద అదనపు లేన్లు ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ (ఎస్ఆర్డీపీ)’ కింద రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి పనులు చేపట్టింది. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలు ఆగకుండా ఎడమ వైపు (ఫ్రీ లెఫ్ట్) మలుపు తిరిగే అవకాశాన్ని కల్పించేందుకు ప్రధాన జంక్షన్ల వద్ద జీహెచ్ఎంసీ అదనపు లేన్లను నిర్మిస్తోంది. జంక్షన్లకు సమీపంలో భారీ భవనాలకు అనుమతుల జారీపై ఆంక్షలు విధించాలని ప్రభుత్వానికి నివేదించింది. ప్రభుత్వం సైతం ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించింది. జంక్షన్ల వద్ద అమలు చేసే ఆంక్షలు.. ► జంక్షన్లకు 300 మీటర్ల పరిధిలో జనం గూమికూడడానికి కారణమయ్యే మల్టీప్లెక్స్‌లు, ఆస్పత్రులు, ఫంక్షన్ హాళ్లు, స్కూళ్లు, పెట్రోల్ బంక్‌లపై నిషేధం ► జంక్షన్ల స్ల్పే పోర్షన్ (మూలమలుపు భాగాలు) పరిధిలో భవనాల ప్రవేశం, నిష్ర్కమణ ద్వారాలు ఉండరాదు. స్ల్పే పోర్షన్‌కు చుట్టూ రెయిలింగ్‌తో రక్షణ కల్పించాలి. ► ఫ్రీ లెఫ్ట్ సౌకర్యం కోసం అదనపు లేన్‌ను నిర్మించాలి. ► రోడ్డు వైశాల్యం ఆధారంగా 15-25 మీటర్ల వ్యాసార్థంలో స్ల్పే (మూల మలుపుల వద్ద ఖాళీ ప్రదేశం)ను విడిచి పెట్టాలి. ► జంక్షన్లకు 300 మీటర్ల పరిధి వరకు వాహనాలను పార్కింగ్ చేయరాదు. 100 మీటర్ల పరిధిలోపు ప్రకటనల హోర్డింగ్‌లు ఉండకూడదు. -
అగ్రిగోల్డ్ డెయిరీ కార్మికుల రాస్తారోకో
లక్ష్మీనగర్ (ద్వారకాతిరుమల) : అగ్రిగోల్డ్ పాల డెయిరీని లాకౌట్ చేయడంతో రోడ్డున పడిన కార్మికులు శనివారం రాషీ్ట్రయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దాదాపు 3 గంటల పాటు ట్రాఫిక్ స్తంభించింది. సమాచారం అందుకున్న ద్వారకాతిరుమల ఎస్సై టి.నాగవెంకటరాజు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించి, పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. మారంపల్లి పంచాయతీ లక్ష్మీనగర్‌లోని అగ్రిగోల్డ్ అమృతవర్షిణి పాలడెయిరీని గురువారం రాత్రి యాజమాన్యం లాకౌట్‌ను ప్రకటించిన విషయం విధితమే. దీంతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న దాదాపు 70 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అకస్మాత్తుగా యాజమాన్యం లాకౌట్‌ను ప్రకటిస్తే తమ పరిస్థితి ఏమిటంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తూ రాషీ్ట్రయ రహదారిపై బైఠాయించారు. కార్మికులకు సీఐటీయూ నాయకులు ఆర్.లింగరాజు, వై.సాల్మన్‌రాజు మద్దతు ప్రకటించారు. వీరు రాస్తారోకోలో కార్మికులతో పాటు పాల్గొని ఆందోళన చేశారు. కార్మికులకు యాజమాన్యం న్యాయం చేయకుంటే తమ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం రాస్తారోకోను విరమించిన కార్మికులు ఫ్యాక్టరీ ఎదుట టెంట్ వేసి ఆందోళన చేపట్టారు. -
రోడ్ల విస్తరణకు మోక్షం
– వనపర్తిలో తీరనున్న ట్రాఫిక్ సమస్య – రెండు రోజుల్లో వెలువడనున్న జీఓ – ఫలించనున్న మూడు దశబ్దాల నిరీక్షణ వనపర్తిలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రోడ్ల విస్తరణ ఓ కొలిక్కి వచ్చింది. తొందరలోనే ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఇరుకురోడ్లలో నిత్యం అవస్థలు పడుతున్న వాహనదారులకు, పట్టణవాసులకు ఇకపై ఆ ఇబ్బందులు తొలగనున్నాయి. వనపర్తిటౌన్ : వనపర్తి పట్టణంలో దాదాపు 30ఏళ్లుగా ప్రజలను వేధిస్తున్న రోడ్ల విస్తరణ అంశం రెండు రోజుల్లో కొలిక్కి రానుంది. ఈమేరకు రెండురోజుల కిందట పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సంబంధిత ఫైల్‌పై సంతకం చేసి జీఓ జారీకి ఉన్నతాధికారులకు ఫైల్‌ను సిఫారసు చేసినట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చిన్నారెడ్డి ధ్రువీకరించారు. జీఓలో మునిసిపాలిటీలో ఎన్ని అడుగుల మేరకు రోడ్డు విస్తరణ చేయాలో తేలియనుంది. రోడ్ల విస్తరణ సమస్య 30ఏళ్లుగా పాలకులు నాన్చుతున్నారేతప్ప తేల్చడంలేదని పట్టణవాసులు ఏటా పెదవి విరవడం, అదిగో.. ఇదిగో అంటూ ప్రజాప్రతినిధులు కాలం వెల్లదీయడం తెలిసిందే. తెలంగాణ వచ్చిన తర్వాత 2014ఎన్నికల్లో రోడ్ల విస్తరణ అంశం ప్రధాన ఎజెండాగా అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుకున్నాయి. ఈ మేరకు 2014అక్టోబర్‌లో వనపర్తి మునిసిపాలిటీ పట్టణంలోని ఐదు రహదారులును 100అడుగుల మేరకు విస్తరించాలని తీర్మానం చేసి సంబంధిత కాపీని మునిసిపల్ ఉన్నతాధికారులకు పంపారు. మునిసిపల్ తీర్మానం నాటి నుంచి రోడ్ల విస్తరణ అంశం ఊపందుకుంటూనే ఉంది. మూడు నెలల కిందట మునిసిపల్ అధికారులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రోడ్ల విస్తరణ సంబంధించి సర్వేను నిర్వహించడం తెలిసిందే. దీనికితోడు ఆర్అండ్బీ అధికారులు వనపర్తిలో రహదారుల విస్తరణకు రూ.204కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వానికి ప్రతిపాదించారు. వనపర్తి జిల్లా ప్రకటన కంటే ముందే రోడ్ల విస్తరణ జరుగుతుందని భావించినప్పటికీ జిల్లా ప్రకటన వెలువడిన తర్వాత అందరి చర్చ రోడ్ల విస్తరణపై కేంద్రీకతమైంది. దీంతో పాలకులు వేగం పెంచడంతో రోడ్ల విస్తరణ ఓ కొలిక్కి వచ్చినట్లయ్యింది. 30ఏళ్లుగా నరకయాతనకు చెల్లు ఎప్పడో తాతల కాలం నాడు అప్పటి జనాభాకు అనుగుణంగా నిర్మించిన రోడ్లే నేటికీ వనపర్తికి దిక్కయ్యాయి. దీంతో 2003నుంచి ఇప్పటివరకు 66మంది ప్రాణాలు కోల్పోగా, 150మంది అవిటివాళ్లుగా మారిపోయారు. రోజురోజుకూ పట్టణ జనాభా లక్ష దాటడం, అందుకు తగ్గట్టుగానే వాహనాల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఇంటినుంచి బయటికి వెళ్తే తిరిగి వస్తామా లేదా? అనే పరిస్థితులు నెలకొన్నాయి. వనపర్తికి మహర్దశ – రమేష్‌గౌడ్, పుర చైర్మన్ వనపర్తి వనపర్తికి చాలాకాలంగా ఉన్న వెలితి రోడ్ల విస్తరణతో తీరనుంది. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా విస్తరణ ఉండాలని, మునిసిపాలిటీలో 100అడుగుల మేరకు విస్తరణకు తీర్మానం చేసినం. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్‌రెడ్డి రోడ్ల విస్తరణకు సంబంధించిన ఫైల్‌ను మువ్ చేయడంలో విశేషంగా కషిచేశారు. గత పాలకుల హయాంలో నిర్లక్ష్యం చేశారు. ఆర్అండ్బీ ప్రతిపాదనలు ఇవే 1)వనపర్తి– పానగల్ రోడ్డు విస్తరణకు రూ.40కోట్లు 2) వనపర్తి– కొత్తకోట రోడ్డుకు రూ.42కోట్లు 3)వనపర్తి – హైదరాబాద్ రోడ్డుకు రూ.50కోట్లు 4) వనపర్తి– ఘనపురం రోడ్డుకు రూ.40కోట్లు 5) వనపర్తి– పెబ్బేరు రోడ్డుకు రూ.32కోట్లు -
ఘాట్రోడ్లో రెండు వాహనాలు ఢీ
జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు అవస్థలు పడిన ప్రయాణికులు పోలీస్ చొరవతో కదిలిన వాహనాలు పి.కోనవలస(పాచిపెంట) : మండలంలోని పి.కోన వలస సమీపంలో గల మూడోనంబర్ జాతీయ రహదారిపై శనివారం ఉదయం రెండు వాహనాలు ఢీ కొనడంతో రోడ్డుకు అడ్డంగా ట్రైలర్ నిలిచిపోయింది. దీంతో వందలాది వాహనాలు పి.కోనవలస జాతీయ రహదారి నుంచి మూడో నంబర్ జాతీయ రహదారి వరకూ నిలిచిపోవడంతో వాహన యజమానులతో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న పాచిపెంట ఎస్ఐ జి.డి.బాబు సంఘటనా స్థలానికి చేరుకుని సాలూరు సీఐ జి.రామకష్టకు సమాచారం తెలియజేయడంతో ఆయన హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేశారు. ఆంధ్ర–ఒడిశా రాష్ట్రాలకు ప్రయాణాలు సాగిస్తున్న ఆర్టీసీ బస్సులు చాలా వరకూ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా ఘాట్ రోడ్డు కావడం వల్ల కనీసం మంచినీరు కూడా దొరకక పోవడంతో చిన్నపిల్లలతో వారు పడిన అవస్థలు వర్ణనాతీతం. దాదాపు మూడు గంటల అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ట్రాఫిక్‌ను నెమ్మదిగా క్లియర్ చేయడంతో వాహన రాక పోకలు సాగాయి. ట్రైలర్ రోడ్డుకు అడ్డంగా ఉండిపోవడంతో పక్కనే ఉన్న కొండ రాళ్లను పగులగొట్టి వాహన రాక పోకలకు అవకాశం కల్పించారు. కార్యక్రమంలో సాలూరు అగ్నిమాపక దళ సిబ్బందితో పాటు సాలూరు, పాచిపెంట పోలీసులు పాల్గొన్నారు. -
నాలుగులైన్ల రోడ్డు విస్తరణ ప్రారంభం
► నాలుగు లైన్ల రోడ్డుగా సిరిసిల్ల బైపాస్ ► మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ కార్పొరేషన్ : పదికాలాల పాటు మన్నే విధంగా నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ రోడ్ల విస్తరణ చేపడుతున్నామని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. శుక్రవారం నగరంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సిరిసిల్ల బైపాస్ నాలుగులైన్ల రోడ్డు పనులను ఎంపీ వినోద్‌కుమార్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. కరీంనగర్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య నివారించే ఉద్దేశంతోనే బైపాస్‌లను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఐదు కిలోమీటర్ల మేర రూ.13 కోట్లతో రోడ్డును అందంగా తీర్చిదిద్దుతామన్నారు. రద్దీ నివారణతో పాటు వేగంగా ప్రయాణించేందుకు అనువుగా రోడ్ల నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్‌రావు, భానుప్రసాదరావు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, కార్పొరేటర్లు రూప్సింగ్, సునిల్‌రా వు, బోనాల శ్రీకాంత్, ఎ.వి. రమణ, నా యకులు ఈద శంకర్‌రెడ్డి, చల్ల హరిశంక ర్,జి.ఎస్‌ఆనంద్‌తదితరులు పాల్గొన్నారు. -
గుం‘టూరు’లో నరకం
అధ్వానంగా మారిన రహదారులు ఆక్రమణలతో మూసుకుపోయిన వీధులు ఎక్కడికక్కడ నిలిచిపోతున్న వాహనాలు కనీసం నడిచేందుకూ అవస్థలే అధికారుల పర్యవేక్షణలేమి ఫలితం ఇది నరకం ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు గానీ... గుంటూరు నగరంలో నివసించే సగటుజీవికి మాత్రం కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. నిత్యం ట్రాఫిక్ సమస్యతో నగరవాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొన్ని రోజులుగా పెరిగిపోయిన వాహనాల రద్దీ, ఏ వీధిలో చూసినా తవ్వి వదిలేసిన డ్రెయిన్లు, అధ్వానంగా మారిన అంతర్గత రహదారులతో విలవిల్లాడిపోతున్నారు. కనీసం నడిచేందుకు వీలులేని విధంగా పరిస్థితి. సరైన ప్రణాళిక, అధికారుల పర్యవేక్షణలేమి కారణంగానే గుం‘టూరు’ నరకం చూపుతోంది. అరండల్‌పేట (గుంటూరు) : నగరంలో ప్రస్తుత రహదారులు అధ్వానంగా ఉన్నాయి. ఆక్రమణలతో ప్రధాన రోడ్లతో పాటు వీధులూ మూసుకు పోయాయి. దీని వల్ల ట్రాఫిక్ సమస్య జఠిలమైపోయింది. ఏ సెంటర్లో చూసినా వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. నరసరావుపేట, పిడుగురాళ్ల, చిలకలూరిపేట, పొన్నూరు, తెనాలి, బాపట్ల తదితర ప్రాంతాల నుంచి నగరంలోకి ప్రవేశిస్తున్న వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. నగరం ప్రజలతో పాటు బయట నుంచి వచ్చే వారూ గుంటూరులో నెలకొన్న పరిస్థితులను చూసి బెంబేలెత్తుతున్నారు. మరమ్మతులన్నీ ఒకేసారి.. నగరంలోని అన్ని ప్రధాన రహదారులకు మరమ్మతులు ఒకేసారి చేపట్టడం పెద్ద సమస్యగా మారింది. చిలకలూరిపేట,నరసరావుపేట, పిడుగురాళ్ల తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలన్నింటికీ కలిపి నగర ప్రవేశం కోసం ఒకే ఒక్క చిన్న రహదారి దిక్కైంది. తెనాలి, బాపట్ల, పొన్నూరు, చీరాల, నిజాంపట్నం తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలన్నింటికీ కూడా గుంటూరు ప్రవేశానికి మానసరోవరం రోడ్డు మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. సాగుతున్న రోడ్డు నిర్మాణం, మరమ్మతు పనులే ఈ దుస్థితికి కారణం. ఫలితంగా ఎక్కడికక్కడ గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోవాల్సి వస్తోంది. ఈ మార్గాల్లోనే ఇక్కట్లు... పొన్నూరు రోడ్డు పూర్తిగా ధ్వంసమైపోయింది. కొత్త రహదారి నిర్మాణం కోసం దాన్ని వన్వేగామార్చారు. తెనాలి, బాప ట్ల ప్రాంతాల నుంచి గుంటూరు వస్తున్న వాహనాలను ైబె పాస్ నుంచి మానస సరోవరం మీదుగా దారి మళ్లించారు. తెనాలి, బాపట్ల, నిజాంపట్నం, చీరాల తదితర ప్రాంతాల వాహనాలు మొత్తం మానస సరోవరం రోడ్డు ద్వారానే రాకపోకలు సాగిస్తుండటంతో ఆ మార్గం నిత్యం ట్రాఫిక్ మయమవుతోంది. అసలే అది గుంతల రోడ్డు. ఇప్పుడు మరింత అధ్వానంగా మారిపోయింది. బైపాస్ నుంచి ఎన్టీఆర్ బస్టాండ్‌కు రావడానికి ఒక్కో వాహనానికి అరగంట సమయం పడుతోంది. ప్రత్తిపాడు నుంచి వచ్చే వాహనాలకు కూడా బైపాస్ వద్ద బ్రేక్ పడుతోంది. వంతెన నిర్మాణ పనులు చేపట్టడంతో ఆ వాహనాలు కేవీపీ కాలనీ మీదుగా చుట్టుగుంట, కలెక్టరేట్ మీదుగా మార్కెట్ వైపునకు రావాల్సిన దుర్భర స్థితి నెలకొంది. గుంటూరు నుంచి బైపాస్ వైపునకు వెళ్లే ప్రతి రహదారి గుంతలమయమైపోయింది. ప్రస్తుత వర్షాలకు రోడ్లన్నీ చెరువుల్లా మారాయి. నగరంలో ఏ ప్రధాన రహదారిపై చూసినా గుంతలు, రోడ్డు పనులు చేస్తున్నారు. మూడు నెలల నుంచి ఇదే పరిస్థితి. జిల్లా కోర్టు, లక్ష్మీపురం రోడ్డు పొడువునా, బృందావన్గార్డెన్స్ సెంటర్, మెడికల్ క్లబ్, నాజ్‌సెంటర్, కొత్తపేట శివాలయం, విద్యానగర్ రెండో లైన్, గెస్ట్‌హౌస్, జేకేసీ కాలేజ్ రోడ్డు.. ఇలా దాదాపు అన్ని ప్రధాన కూడళ్లు, సెంటర్లలో పెద్ద పెద్ద గోతులు తవ్వి ఉన్నాయి. -
సా...గుతున్న పనులు
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం ఇప్పటికి పూర్తయిన పుష్కర పనులు 30 శాతమే.. కాంట్రాక్టర్లకు తాఖీదులు ఇవ్వనున్న అధికారులు చేపా.. చేపా.. ఎందుకు ఎండలేదే అంటే గడ్డిమోపు అడ్డొచ్చింది.. అన్న కథను గుర్తుకు తెచ్చేలా విజయవాడ నగరంలో కృష్ణాపుష్కరాల పనులు కొనసా...గుతున్నాయి. రూ.98 కోట్లతో చేపట్టిన రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు నత్తకే నడక నేర్పుతున్నాయి. వానలు ముంచుకు రావడంతో అసలు ఈ పనులు పూర్తవుతాయా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. విజయవాడ సెంట్రల్ : పుష్కరాల అభివృద్ధి పనులు మూడడుగులు ముందుకు ఏడడుగులు వెనక్కు నడుస్తున్నాయి. ఈనెలాఖరుకు పనులు పూర్తి చేయాలనేది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 30 శాతం మాత్రమే పూర్తయ్యాయి. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్ల నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు మూడు సర్కిళ్ల పరిధిలో 55 రోడ్లను రూ.98 కోట్లతో విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. 14 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. రెండు నెలల క్రితం ప్రారంభమైన పనులు ముందుకు కదలడం లేదు. పుష్కరాలకు ముహూర్తం ముంచుకొస్తుండటంతో అధికారుల్లో హైరానా మొదలైంది. సమన్వయలోపం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగానే పనులు చురుగ్గా సాగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్ కో అధికారులు ఆయా స్థలాల్లోని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను తొలగించకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్డు పనులు సాగడం లేదు. విద్యుత్‌స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను తొలగించి ఇస్తే కానీ పనులు చేయలేమని కొందరు కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. నగరపాలక సంస్థ ఇంజి నీరింగ్ అధికారులు పలుమార్లు ట్రాన్స్‌కో అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినప్పటికీ స్పందించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణదారులు, స్థల యజమానులు కోర్టు నుంచి స్టే తెస్తుండటంతో తొలగింపు ప్రక్రియకు బ్రేక్ పడుతోంది. చెట్లు తొలగించిన తరువాత వాటి తరలింపు సకాలంలో జరక్కపోవడంతో రోజుల తరబడి పనులు నిలిచిపోతున్నాయి. సబ్‌లీజులు పుష్కర పనులను 14 ప్యాకేజీలుగా విభజించగా బడా కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. వీరిలో కొందరు సొంతంగా ప్రారంభించగా, మరికొందరు సబ్‌లీజ్‌కు చిన్న కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ పనులకు సంబంధించి నిధులను ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడంతో చిన్న కాంట్రాక్టర్లు సందేహంలో పడ్డారు. హడావుడిగా పూర్తి చేశాక డబ్బులు రాకుంటే అడ్డంగా బుక్కైపోతామన్న భయం వారిని వెంటాడుతోంది. ఈక్రమంలో పనులు చేయాలా వద్దా అన్న డైలమాలో పడ్డారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో పనులు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయి. తాఖీదులు సిద్ధం కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు పనులు చేయడంలో వెనకబడ్డ కాంట్రాక్టర్లకు తాఖీదులు ఇచ్చేందుకు ఇంజినీరింగ్ అధికారులు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా నోటీసులు ఇచ్చి వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని భావిస్తున్నారు. సర్కిల్ -3 పరిధిలో పనులు చేపట్టిన వీఎస్ ఇంజినీరింగ్స్తో పాటు మరో ఇద్దరు కాంట్రాక్టర్ల పనితీరుపై కమిషనర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
‘ఎస్ఆర్డీపీ’ని అడ్డుకోండి..
- దీని వల్ల సహజ వనరులకు తీరని నష్టం కలుగుతోంది - హైకోర్టులో పర్యావరణవేత్త పురుషోత్తంరెడ్డి పిల్ సాక్షి, హైదరాబాద్: ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం నగరంలోని 20 కూడళ్లను కలుపుతూ మల్టీ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి అనుమతినిస్తూ జారీ చేసిన జీవోను, ఫ్లై ఓవర్ల నిర్మాణం నిమిత్తం చెట్ల నరికివేత కోసం అనుమతులు మంజూరు చేస్తూ జారీ చేసిన జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. ఈ జీవోలను చట్టవిరుద్ధంగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరుతూ ప్రముఖ పర్యావరణవేత్త కె.పురుషోత్తంరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో కేంద్ర, రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శులు, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి, హెచ్ఎండీఏలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రూ.4,051 కోట్ల వ్యయం తో మొదటి విడతలో మల్టీ ఫ్లై ఓవర్ల నిర్మాణం నిమిత్తం వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక(ఎస్ఆర్డీపీ)కి అనుమతులిస్తూ గత ఏడాది మేలో జీవో 208ని జారీ చేసిందని, అలాగే చెట్ల నరికివేతకు అనుమతులిస్తూ ఈ ఏడాది మే 13న జీవో 19ని జారీ చేసిందని పురుషోత్తంరెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ జీవోల వల్ల సహజ వనరులు ప్రమాదంలో పడ్డాయన్నారు. మల్టీ ఫ్లై ఓవర్ల నిర్మాణం వల్ల కాసు బ్రహ్మానందరెడ్డి పార్కులో భారీగా చెట్లను నరికేస్తున్నారని, ఇది పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే దుర్గం చెరువుకు కూడా ముప్పు వాటిల్లుతోందన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ట్రాఫిక్ సమస్య తీరకపోగా మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ ప్రాజెక్టు వల్ల కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగిపోయి ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 2,319 చెట్లు నరికివేతకు గురవుతున్నాయని, దీని వల్ల అనేక జీవరాశులు కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడిందని వివరించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ఇదే హైకోర్టుకు గతంలో హామీ ఇచ్చిందని, దాని ప్రకారం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. పర్యావరణ అధ్యయన నోటిఫికేషన్ ప్రకారం భారీ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే ముందు ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరిగా చేపట్టాల్సి ఉండగా, తెలంగాణ ప్రభుత్వం ఆ పని చేయకుండానే మల్టీ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ముందుకెళుతోందని పురుషోత్తంరెడ్డి ఆక్షేపించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో విచారణ జరుగుతోందని, ప్రాజెక్టు పనులపై ట్రిబ్యునల్ స్టే విధించిందని ఆయన తెలిపారు. అయితే జీవోల చట్టబద్దతను ట్రిబ్యునల్ ముందు సవాలు చేయడం కుదరదు కాబట్టి, హైకోర్టును ఆశ్రయించానని ఆయన వివరించారు. విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆయన కోర్టును కోరారు. -
ఇండస్ట్రియల్ టౌన్షిప్ నిర్మిస్తాం
కలెక్టర్ యువరాజ్ అచ్యుతాపురం:ఎస్ఈజెడ్ పరిశ్రమల్లో పనిచేసే ఉద్యోగులకు వసతి ఏర్పాటుకు ఇండస్ట్రియల్ టౌన్షిప్ నిర్మాణం చేపడతామని కలెక్టర్ యువరాజ్ తెలిపారు. సోమవారం ఆయన బ్రాండిక్స్ పరిశ్రమను సందర్శించారు. దూరప్రాంతాలనుంచి పరిశ్రమకు రావడం వల్ల ఎదుర్కొం టున్న సమస్యలను యాజమాన్యం, ఉద్యోగులనుంచి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉద్యోగులను తరలించడంలో పరిశ్రమలకు భారంగా ఉందన్నారు. ఉద్యోగులు వ్యయప్రయాసలు పడాల్సి వస్తుందన్నారు. ట్రాఫిక్ సమస్య, ఇంధన వినియోగం తగ్గించేందుకు ప్రత్యామ్నాయంగా టౌన్షిప్ నిర్మాణం చేపడతామని తెలిపారు. ఉద్యోగులు తమ జీతం నుంచి కొంత భాగాన్ని వాయిదాగా చెల్లించడానికి ముందుకు వస్తే ఇంటినిర్మాణం చేపట్టి అందిస్తామన్నారు. ఇందుకోసం చోడపల్లి సమీపంలో ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. సెజ్‌కు సమీపంలో మరికొంత ప్రభుత్వ స్థలాన్ని సేకరించి టౌన్‌ఫిప్‌కు సిద్ధం చేస్తామని వివరించారు. చదరపు అడుగు రూ.వెయ్యి నుంచి రూ.1500 ధరలో నిర్మాణం చేపట్టేలా సంస్థలకు అప్పగిస్తామన్నారు. ఉద్యోగికి తక్కువ ధరకు అపార్టమెంట్ అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మొదటి వాయిదా చెల్లించిన వెంటనే ఉద్యోగికి ఇల్లు అప్పగిస్తామని వాయిదాలు పూర్తయిన తరువాత ఇంటి డాక్యుమెంట్‌ను అందజేస్తామని చెప్పారు. మొదటి విడతగా 15 వేల మందికి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నామని వివరించారు. ప్రభుత్వం నిర్మించే పైపులైన్‌కు పూడిమడక మత్స్యకారులు సహకరించాలని కోరారు. ఉన్నఫలంగా 4,500 మందికి ఉద్యోగాలు కల్పించడం సాధ్యపడదన్నారు. ప్యాకేజీ తీసుకొని పైపులైన్‌క అంగీకరిస్తే అంచెలంచెలుగా ఉపాధి కల్పిస్తామని తెలిపారు. దీనిపై మత్స్యకారులతో బుధవారం చర్చించి నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో బ్రాండిక్స్ హెచ్ఆర్ మేనేజర్ రఘుపతి, భాస్కర్ , శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
కాసులు కావాలి
మరో ఏడు నెలల్లో కృష్ణా పుష్కరాలు అధ్వానంగా ఉన్న ఆర్ అండ్ బి రహదారులు రూ. 500 కోట్ల మంజూరుకు ప్రతిపాదనలు నిధుల కోసం అధికారుల ఎదురుచూపులు విజయవాడ : మరో ఏడు నెలల్లో కృష్ణా పుష్కరాలు మొదలుకానున్నాయి. కోట్లాదిమంది యాత్రికులు పుణ్యస్నానాలాచరించేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలివస్తారు. వేలాది వాహనాల రాకతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దీనికితోడు కృష్ణా తీరం వెంబడి ఉన్న రహదారులన్నీ గోతులమయంగా మారడంతో ప్రయాణికులు యాతన పడే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో జిల్లాలోని ఆర్ అండ్ బి రోడ్లకు పుష్కరాలనాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలి. రోడ్ల అభివృద్ధికి ఆ శాఖ అధికారులు అంచనాలైతే సిద్ధం చేశారు కాని అక్కడ్నుంచి మరో అడుగు ముందుకు పడలేదు. జిల్లాలో ఆర్ అండ్ బి శాఖ పరిధిలో వేల కిలోమీటర్ల రహదారులున్నాయి. ప్రధానంగా జగ్గయ్యపేట నుంచి హంసలదీవి వరకు ఉన్న కృష్ణా తీరంలో దాదాపు 800 కి.మీ. మేర రహదారులు విస్తరించాయి. ప్రధాన రహదారులతోపాటు అనేక సర్వీసు రోడ్లు, గ్రామాల్లో ఉన్న ప్రధాన రహదారులన్నీ ఆర్ అండ్ బి పరిధిలోనే ఉన్నాయి. పుష్కరాలను సమర్ధంగా నిర్వహించాలని కలెక్టర్ గత నెలలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందే జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా కూడా సమీక్ష నిర్వహించారు. ఎక్కడా నిధుల కొరత లేదని, అన్ని శాఖల అధికారులు అవసరమైన ప్రతిపాదనలు పంపితే ప్రత్యేకంగా ఆయా శాఖల నుంచి నిధులు మంజూరుచేయిస్తామని ప్రకటిం చారు. ఇది జరిగి కూడా రెండు నెలలు దాటింది. మళ్లీ మంత్రి వాటి గురించి కనీసం వాకబు కూడా చేసిన దాఖ లాలు లేవు. మరోవైపు దుర్గగుడి వద్ద కనకదుర ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్‌సహా జిల్లా ఉన్నతాధికారులంతా ఆ పనులపైనే దృష్టిసారించి మిగిలిన పనులను మరిచిపోయారు. అన్ని ప్రభుత్వ శాఖల్లానే ఆర్ అండ్ బి అధికారులు కూడా భారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసి గత నెలలో ఆమోదం కోసం పంపి కాసుల కోసం నిరీక్షిస్తున్నారు. 60 రహదారులకు మరమ్మతులు జిల్లాలో 2800 కిలోమీటర్ల పొడవున ఆర్ అండ్ బి రహదారులున్నాయి. అన్ని గ్రామాలను కలుపుతూ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఇవి ఉన్నాయి. వీటికి ఏటా సాధారణ మరమ్మతులు జిల్లాలో నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు కావడంతో ప్రభుత్వం దీనికి కొంత ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే జిల్లాలోని ఆర్ అండ్ బి రహదారులకు మరమ్మతులు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి పుష్కరఘాట్లను ప్రామాణికంగా తీసుకొని ఘాట్లకు అనుసంధానంగా ఉన్న రోడ్లను అధికారులు గత నెలలో పరిశీలించారు. దీనికి అనుగుణంగా అవసరమైన చోట నిర్వహించాల్సిన పనులను కూడా గుర్తించారు. ప్రాథమికంగా జగ్గయ్యపేటలోని వేదాద్రి నుంచి అవనిగడ్డ సమీపంలోని హంసలదీవి వరకు 90 ప్రధాన ఘాట్లు ఉన్నాయి. 60 ప్రధాన రహదారులకు మరమ్మతులు చేయడం, కొన్ని చోట్ల ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు వీలుగా రహదారుల విస్తరణ పనులు నిర్వహిం చాల్సి ఉంది. వీటికి సుమారు రూ. 500 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు వేసి 60 రహదారుల పనులను ఆమోదించాలని ప్రతిపాదనలు పంపారు. ముఖ్యంగా మైలవరం, తిరువూరు రోడ్డు, నూజివీడు రోడ్డు, యనమలకుదురు నుంచి చల్లపల్లి వరకు ఉన్న కరకట్ట మార్గం, గుడివాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న మార్గం, హైదరాబాద్ నుంచి తెలంగాణ ప్రాంతాల వాహనాల రద్దీ నియంత్రణకు జగ్గయ్యపేట నియోజకవర్గంలోని కీలక ఆర్ అండ్ బి రహదారులను అభివృద్ధి చేయడం, దాదాపు 15 చోట్ల రోడ్లను విస్తరించడం వంటి పనులు పూర్తిచేయాలి. పుష్కరాలకు సమయం దగ్గర పడుతున్నా ప్రభుత్వం మాత్రం నిధుల మంజూరు విషయంపై దృష్టి సారించడంలేదు. -
హైదరాబాద్ లో ఫ్రీ పార్కింగ్ స్థలాలివే...
ఉప్పల్‌కు చెందిన అరుణ్ ఉదయమే టిఫిన్ తెద్దామని సమీపంలోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌కు వెళ్లాడు... బైక్ రోడ్డు మీద పెట్టి టిఫిన్‌కు వెళ్లడంతో అక్కడంతా ట్రాఫిక్ జామ్ అయింది. నియంత్రించేందుకు ట్రాఫిక్ పోలీసులకు తలకు మించిన భారమైంది...ఇది ఒక్క ఉప్పల్లోనే కాదు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని చాలా ప్రాంతాల్లో ఇదే సమస్య ఉంది. అయితే జీహెచ్ఎంసీ పార్కింగ్ కాంట్రాక్టర్లమంటూ ఎక్కడ సందు దొరికితే అక్కడ వసూళ్ల పర్వం కొనసాగిస్తుండటంతో చాలా మంది ద్విచక్రవాహనదారులు తమ వాహనాన్ని రహదారులపైనే పార్కు చేసి వెళ్తున్నారు. నో పార్కింగ్ జోన్లో వందల సంఖ్యలో వాహనాలను పార్కింగ్ చేస్తుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనిపై అధ్యయనం చేసిన సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు ‘ఫ్రీ పార్కింగ్’ సౌకర్యాన్ని కల్పించారు. మాదాపూర్, కూకట్పల్లి, మియాపూర్, అల్వాల్, బాలానగర్, జీడిమెట్ల, ఉప్పల్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల పరిధిలో 49 ప్రాంతాలను గుర్తించారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ స్థలాలను శుభ్రం చేసి పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఎటువంటి రుసుం లేకుండా ఇక్కడ బైక్‌లు, కార్లను పార్క్ చేసుకోవచ్చు. ఇవీ ఫ్రీ పార్కింగ్ స్థలాలు... మాదాపూర్ ట్రాఫిక్ ఠాణా పరిధిలో: మాదాపూర్‌లోని అవసా హోటల్, ప్రైడ్ హోండా, హైటెక్స్ జంక్షన్‌కు వెళ్లే సీఐఐ, ఇమేజ్ గార్డెన్, కొండాపూర్‌లోని హర్ష టయోటా, కొత్తగూడలోని రత్నదీప్ సూపర్ మార్కెట్, శిల్పరామం నైట్ బజార్‌కు ఎదురుగా ఫోర్‌వీలర్స్‌ను పార్కింగ్ చేసుకోవచ్చు. కూకట్పల్లి ఠాణా పరిధిలో... జేఎన్టీయూ రైతు బజార్ సమీపంలో ద్విచక్ర వాహనాలు, రైతు బజార్‌కు ఎదురుగా బైక్‌లు, కారులు, రెడీమేడ్ ఆస్పత్రి సమీపంలోని సులభ్ కాంప్లెక్స్ రోడ్డు నంబర్ 3లో ఫోర్ వీలర్స్ పార్కింగ్ చేసుకోవచ్చు. మియాపూర్ పరిధిలో: చందానగర్‌లోని మైత్రి ఆస్పత్రి నుంచి ఈనాడు బ్యాంక్, అంగర హోటల్ నుంచి కేఎస్ బేకర్స్, గంగారామ్లోని చెన్నై షాపింగ్ మాల్ నుంచి నీల్కమల్ ఫర్నిచర్ ప్రాంతంలో ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. అల్వాల్ ఠాణా పరిధిలో... సుచిత్ర జంక్షన్, కొంపల్లిలోని బర్టన్‌గూడ జంక్షన్, ఏఎంఆర్ గార్డెన్లో బైక్‌లు, ఫోర్ వీలర్స్, ఓల్డ్ అల్వాల్‌లోని లైబ్రరీ బిల్డింగ్ ఎదురుగా, కుత్బుల్లాపూర్ మీ సేవా రోడ్డు సమీపంలో బైక్‌లు పార్క్ చేసుకోవచ్చు. బాలానగర్ ఠాణా పరిధిలో... బీబీఆర్ హాస్పిటల్, బొజయ్ గార్డెన్ ఓల్డ్, శోభనా, నర్సాపూర్ ఎక్స్ రోడ్డులోని రామ్ హోండా, బాలానగర్ టీ జంక్షన్‌లోని గణేశ్ మెడికల్ షాప్, మల్లికార్జున లాడ్జి రాజుకాలనీలో కమాన్ , ఫెరోజ్‌గూడ ఎస్బీహెచ్ ఎదురుగా బైక్‌లు పార్క్ చేసుకోవచ్చు, జీడిమెట్ల ఠాణా పరిధిలో... జీడిమెట్ల ఐడీఏలోని జేఎస్ఆర్ కాంప్లెక్స్, షాపూర్‌నగర్‌లోని కిరణ్మయి హాస్పిటల్, రంగ.. భుజంగ థియేటర్ సమీపంలోని విఘ్నేశ్వర కాంప్లెక్స్, ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంక్, గాజులరామారం ఎక్స్ రోడ్డులోని ఉషోదయ టవర్స్, షా సినీ ప్లానెట్‌లోని వాల్యూమార్ట్, గణేశ్‌నగర్‌లోని గౌరి వైన్స్ కాంప్లెక్స్, క్యూకాటన్ బిల్డింగ్, ఐడీపీఎల్ ఎక్స్ రోడ్డులోని భాగ్యరథీ డిగ్రీ కాలేజి బిల్డింగ్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వద్ద బైక్‌లు, ఫోర్‌వీలర్స్ నిలుపవచ్చు. ఉప్పల్ ఠాణా పరిధిలో... రామంతాపూర్ చెరువు సర్వీసు రోడ్డు, యూనియన్ బ్యాంక్ సమీపంలోని ఉప్పల్ ఎక్స్ రోడ్డు, సర్వీసు రోడ్డులోని ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా బైక్‌లు, ఫోర్‌వీలర్స్ నిలుపవచ్చు. మాల్కాజిగిరి ఠాణా పరిధిలో... మల్కాజిగిరి ఎక్స్ రోడ్డులోని గాంధీ పార్క్ వాల్ రోడ్డు, ఆనంద్‌బాగ్ నుంచి ఉత్తమ్‌నగర్ వరకు బైక్‌లు, ఫోర్‌వీలర్స్ నిలుపవచ్చు. నేరేడ్మెట్ ఎక్స్‌రోడ్డు, ఏఎస్‌రావ్ నగర్‌లోని కెనడీ హైస్కూల్, వెర్టక్స్ ప్లాజా, నార్త్ కమలానగర్‌లోని ఉడ్ ల్యాండ్స్ హోటల్, కుషాయిగూడ మార్కెట్, కమలానగర్‌లోని కాప్రా మున్సిపల్ కార్యాలయం వద్ద ద్విచక్ర వాహనాలు పార్క్ చేసుకోవచ్చు. ఎల్బీనగర్ ఠాణా పరిధిలో... దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా గుడి, కొత్తపేటలోని రైతు బజార్, రాజేంద్రనగర్‌లోని ఆర్డీఓ ఆఫీసు వద్ద బైక్‌లు పార్క్ చేయవచ్చు. -
ట్రాఫిక్ జామ్ ఝూటం
ఏమేవ్..ఆఫీసుకు వెళ్లాలి.. త్వరగా బాక్స్ రెడీ చెయ్..ఏంటండీ అంత తొందర.. ఇప్పుడు ఏడు గంటల కూడా కాలేదు..హడావుడి చేస్తున్నారు.. హడావుడి కాకపోతే నిన్న 8.30 గంటలకు బయలుదేరా.. ఐదు కిలోమీటర్ల దూరంలోని ఆఫీసుకు చేరేపాటికి 10.30 గంటలైంది.. బాసు గయ్యమన్నాడు.. అమ్మో...ఆ ట్రాఫిక్ తలుచుకుంటేనే భయమేస్తోంది..నేను త్వరగా వెళ్లాలి. నువ్వు కానీకానీ..ఇవీ నిత్యం గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఇంటింటికో కథలు..ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిలలాడుతున్న ప్రజల వెతలు. ట్రాఫిక్ సమస్య ఇక్కడ అధికం.. విజయవాడ నగరానికి ప్రవేశ ద్వారంగా ఉన్న కుమ్మరిపాలెం సెంటర్, రామవరప్పాడు రింగ్‌లో రోడ్డు వెడల్పు తక్కువగా ఉంది. బందరు రోడ్డులోని పశువుల ఆసుపత్రి సెంటర్, బెంజ్ సర్కిల్, పడమట, ఎన్టీఆర్ సర్కిల్, ఏలూరు రోడ్డులో మాచవరం డౌన్, గుణదల సెంటర్లోనూ ట్రాఫిక్ తిప్పలు ఎక్కువగా ఉన్నారుు. వన్‌టౌన్‌లో కాళేశ్వరరావు మార్కెట్, బొడ్డెమ్మ హోటల్, నెహ్రూ బొమ్మ సెంటర్, చిట్టినగర్, రథం సెంటర్ల ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారుు. కనకదుర్గ ఫ్లైఓవర్ పనుల కారణంగా వన్‌టౌన్ అంతా ట్రాఫిక్ అంక్షలు విధించారు. హైదరాబాద్ నుంచి నగరంలో వచ్చే వాహనాలు కుమ్మరిపాలెం మీదుగా సితార సెంటర్, కబేళా, వెంకట్రావ్ ఫ్లైఓవర్ పాల ఫ్యాక్టరీ మీదుగా ఎర్రకట్ట వైపు మళ్లిస్తున్నారు. ద్విచక్ర వాహనాలను సొరంగ మార్గం లోంచి అనుమతిస్తున్నారు. ఎర్రకట్ట రోడ్డు ఇరుకుగా ఉంది. గతంలో 30 అడుగులు ఉన్న ఎర్రకట్టను ఇటీవలే 12 అడుగులు వెడల్పు పెంచారు. ప్రస్తుతం ఈ మార్గంలో రోజు సగటున 25 వేల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో 42 అడుగులు రోడ్డు కావటంతో అందులోనూ మూడు రైల్వే బ్రిడ్జిలు శిథిలావస్థ చేరటంతో విజయవాడ : ట్రాఫిక్ పద్మ వ్యూహంలో జంట నగరాలు చిక్కుకున్నాయి. పక్కా ప్రణాళిక లేకపోవటం, ప్రధాన రహదారులకు అనుసంధానంగా ఉన్న రహదారులు ఇరుకుగా ఉంటడం, నగరానికి ప్రవేశ ద్వారాలుగా ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా చిన్న రోడ్లు ఉండటం వెరసి ట్రాఫిక్ సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. జంట నగరాలకు సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు, విదేశి ప్రతినిధుల తాకిడి పెరిగింది. వీఐపీల కోసం ట్రాఫిక్‌ను కొద్ది సేపు నిలువరిస్తే పునరుద్ధరించడానికి గంటపైనే పడుతుంది. రాజధాని నగర స్థాయికి తగ్గట్లుగా రోడ్లు లేవని సీఎంతో సహా అందరూ పదే పదే చెబుతున్నారు. వీటి అభివృద్ధికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. తెలంగాణ నుంచి ఒడిషా, చత్తీస్ఘడ్, తమిళనాడు, కర్ణాటక వెళ్లే వాహనాలు తప్పనిసరిగా నగరంలోకి రావాల్సిందే. పక్కా ప్రణాళిక ఏది ? విజయవాడలో దసరా ఉత్సవాలు, వీవీఐపీల బహిరంగ సభలు, భవానీ దీక్షల సమయంలో ట్రాఫిక్ మళ్లింపులు మినహా శాశ్వత పరిష్కారం దిశగా అధికారులు ఆలోచన చేయడం లేదు. గతంలో సీఎం రోడ్ల వెడల్పుకు వంద కోట్లు నిధులు మంజూరు చేస్తామని ప్రకటించారు. వరుస ప్రాజెక్ట్‌లతో అది అటకెక్కింది. నగర కమిషనర్‌గా గౌతం సవాంగ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత వివిధ అంశాలపై బిజీగా ఉండటంతో ట్రాఫిక్‌పై పూర్తి స్థాయిలో దృష్టి సారించ లేదు. గుంటూరులో నల్లపాడు, పొన్నూరు రోడ్లు పూర్తి స్థాయిలో విస్తరించకపోవడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రమాదం పొంచి ఉంది. గుంటూరులో.. గుంటూరులో బస్టాండ్, జిన్నాటవర్, మార్కెట్, గుజ్జనగుండ్ల, బ్రాడీపేట నాలుగో లైను, శంకర్‌విలాస్, లక్ష్మీపురం, రింగ్ రోడ్డు సెంటర్లలో ట్రాఫిక్ ఎక్కువగా నిలిచిపోతోంది. నగరంలో ఎక్కడా వంద అడుగుల రోడ్డు లేదు. ఉన్న రోడ్లను అవసరాలకు అనుగుణంగా పది అడుగులు విస్తరిస్తున్నారు. ప్రధాన రహదారుల్లో అక్రమణల కారణంగా విస్తరణ చేయడం లేదు. పట్నంబజార్ మెరుున్ రోడ్డులోకి వెళ్లి తిరిగి రావాలంటే కనీసం గంట సమయం పడుతుంది. -
ఐటీఎస్‌కు పోటాపోటీ!
రంగంలో ఆరు సంస్థలు టెక్నికల్ స్క్రూట్నీపై హెచ్ఎండీఏ కసరత్తు జనవరిలో ప్రాజెక్టు పనులకు శ్రీకారం గ్రేటర్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ సిటీబ్యూరో: రాజధాని హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరుగుతోన్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రూ.160 కోట్లతో హెచ్ఎండీఏ తలపెట్టిన ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టం (ఐటీఎస్) ప్రాజెక్టును దక్కించుకొనేందుకు ఆరు సంస్థలు పోటీ పడుతున్నాయి. ఐటీఎస్‌కు సంబంధించిన టెండర్స్‌ను ఓపెన్ చేసిన అధికారులు మొత్తం ఆరు బిడ్స్ దాఖలైనట్లు గుర్తించారు. వీటిలో సావ్రానిక్ (టర్కీ), ఏఆర్ఎస్ అండ్ పి అండ్ టి (నెదర్ల్యాండ్స్), కొరియా ఎక్స్‌ప్రెస్ వే కార్పొరేషన్ (కేఎక్స్సి- కొరియా)లు విదేశీ సంస్థలు కాగా, ఎల్‌అండ్‌టి, బీఈఎల్, ఎఫ్కాన్లు స్వదేశీ సంస్థలున్నాయి. వీటికి సంబంధించి త్వరలో టెక్నికల్ స్క్రూట్నీ పూర్తిచేసి అనంతరం టెక్నికల్ బిడ్స్‌ను ఓపెన్ చేస్తామని ఓఆర్ఆర్ సీజీఎం ఆనంద్‌మోహన్ తెలిపారు. అర్హత గల సంస్థను ఖరారు చేసే ప్రక్రియను రెండు నెలల్లో పూర్తి చేసి వచ్చే జనవరిలో ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. హెచ్ఎండీఏ ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న ఈ ప్రాజెక్టును 18 నెలల్లో పూర్తిచేయాలని ల క్ష్యంగా పెట్టుకొన్నారు. ఈ ప్రాజెక్టును దక్కించుకొన్న సంస్థ నిర్మాణంతో పాటు ఐదేళ్లు నిర్వహణ బాధ్యతలు కూడా చేపట్టాల్సి ఉంటుంది. సమగ్ర సమాచారం నగరంలోని ప్రధాన రహదారుల్లో ప్రయాణించే వాహనదారులకు సమగ్ర సమాచారాన్ని అందించేందుకు ఈ వ్యవస్థ ఉపకరిస్తుందని హెచ్ఎండీఏ చెబుతోంది. ప్రధానంగా ప్రయాణ సమయం ఆదా, ఖర్చు తగ్గించడం, ప్రమాదాల నివారణ, వాహన కాలుష్య నియంత్రణ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని శాస్త్రీయమైన ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఐటీఎస్ వల్ల నగర రోడ్లపై ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు ఎఫ్.ఎం రేడియో ద్వారా, వేరియబుల్ సైన్ బోర్డుల ద్వారా ముందుగానే ప్రజ లకు తెలిపేందుకు వీలవుతుందంటున్నారు. ప్రధాన మార్గాల్లోని తాగునీటి పైపులైన్, డ్రైనేజీ పనులు అత్యవసరంగా చేపట్టాల్సి వచ్చినప్పుడు తవ్వకాలు జరపడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురై ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని ముందగానే పసిగట్టి ఆ మార్గంలో వచ్చే వాహనదారులకు చేరవేయడం ద్వారా వారు మరో ప్రత్యామ్నాయ మార్గం గుండా వెళ్లేందుకు వీలవుతుంది. దీనివల్ల సమయం ఆదా అవ్వడంతో పాటు ట్రాఫిక్‌లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోవడం వల్ల పెట్రోలు వృథా, అలాగే వాహన కాలుష్యం వంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా నిరోధించవచ్చు. వర్షాకాలంలో రోడ్డుపై వరదనీరు నిలిచిపోయిన విషయాన్ని ముందుగానే వాహనచోదకులకు చేరవేయడం వల్ల ప్రమాదాలు జరగకుండా అడ్డుకోవచ్చు. ఈ ఆధునిక వ్యవస్థ కోసం నాన్రామ్గూడ, ఘట్కేసర్లలో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రెండు కేంద్రాలను ఏర్పాటు చేసి కేబుల్ నెట్వర్క్, వైర్లెస్ నెట్ వర్క్ ద్వారా దీనికి అనుసంధానం చేస్తారు. సింక్రనైజ్డ్ సిగ్నలింగ్ సిస్టం, వేరియబుల్ మెసేజ్ సైన్స్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు ఇన్ఫర్మేషన్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. వీటి ద్వారా నగర రోడ్లపై ప్రయాణం సాఫీగా సాగడంతో పాటు ప్రమాదాల సంఖ్య తగ్గుతుందంటున్నారు. సిగ్నల్స్ వద్ద వాహనాలు ఎక్కువ సేపు నిలపకుండా వ్యవస్థను అందుబాటులోకి తెస్తే వాహన కాలుష్యం కూడా గణనీయంగా తగ్గిపోతుందని అధికారులు చెబుతున్నారు. 3 దశల్లో నిర్మాణం... అత్యాధునిక హంగులతో కూడిన ఇంటలిజెంట్ ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టం (ఐటీఎస్) ప్రాజెక్టును 3 దశల్లో నిర్మించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.1175 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. తొలి దశలో రూ.160 కోట్లతో చేపట్టే ఐటీఎస్‌కు జైకా ఆర్థిక సాయం అందిస్తోంది. అలాగే రెండో దశను రూ.425 కోట్లు, మూడో దశను రూ.600 కోట్లతో తీర్చిదిద్దేందుకు హెచ్ఎండీఏ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. -
కాకినాడలో భారీ వర్షం
కాకినాడ టౌన్: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నగరంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఉదయం 10 గంటల నుంచి 12 గంటల దాకా కుండపోతగా వర్షం పడింది. దీంతో కాకినాడ మెయిన్ రోడ్డులో మోకాళ్ల లోతు వరకు నీళ్లు నిలిచాయి. ఈ క్రమంలోనే ఈ రోడ్డులో రాకపోకలు నిలిచిపోయాయి. నగరంలోని జగన్నాయకపూర్, ట్రెజరీకాలనీ, గోడారిగుంట, జె. రామారావుపేట తదితర ప్రాంతాల్లో వర్షం కారణంగా భారీగా నీరు నిలిచిపోయింది. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
సైక్లింగ్‌తో సంపూర్ణ ఆరోగ్యం
కాలు తీసి కాలు పెడితే ఖరీదైన కారు.. లేదా వాయువేగంతో వెళ్లే మోటారు సైకిల్.. ఇదీ నేటి సమాజ ధోరణి. ఫలితంగా పెరిగిన పెట్రోల్ వినియోగం..ట్రాఫిక్ సమస్య..రోజు రోజుకూ దెబ్బతింటున్న పర్యావరణం.. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఊబకాయం..అధిక కొలెస్ట్రాల్..బీపీ..మధుమేహం తదితర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టి సంపూర్ణ ఆరోగ్యం సాధించాలంటే సైకిలింగ్ బెస్ట్ అంటున్నారు వైద్యనిపుణులు. ఈ క్రమంలో సైకిలింగ్‌తో ఉపయోగాలపై ‘సాక్షి’ పాఠకుల కోసం ప్రత్యేక కథనం. పలమనేరు: సమాజంలో ఒకనాడు ఓ ఊపు ఊపిన సైకిళ్లు రకరకాల మోటారు సైకిళ్లు, కార్ల రాకతో తగ్గుముఖం పట్టాయి. ఖరీదైన కార్లు, మోటారు సైకిళ్ల వినియోగంతో పెట్రోల్ వినియోగం పెరిగింది. ఇక పట్టణాల్లో ట్రాఫిక్ పెరిగిపోయింది. మరోవైపు శ బ్ధ, వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఈ క్రమంలో ప్రజలకు ఆరోగ్యపరమైన సమస్యలు పెచ్చుమీరాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో పలువురు మళ్లీ సైకిళ్లపై మోజు పెంచుకున్నారు. ఏటా పెరుగుతున్న సైకిళ్ల వినియోగం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 29 లక్షలు, పట్టణాల్లో 12 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 1.50 లక్షల మంది సైకిళ్లు వినియోగిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మూడేళ్ల క్రితం కంటే నేడు సైకిళ్ల వినియోగం పెరిగింది. 1995 వరకు సైకిళ్ల వినియోగం భారీ గానే ఉండేది. ఆ తర్వాత క్రమేపి వీటి వినియోగం తగ్గిపోయింది. అయితే నేడు మళ్లీ ఊపందుకుంది. మార్కెట్లో పలు రకాల సైకిళ్లు ప్రస్తుతం మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన సుమారు 370 రకాల సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. చిన్నపిల్లలకు కిడ్ సైకిల్, విద్యార్థులకు రేంజర్, స్పోర్ట్స్, మహిళలకు లేడీ బర్డ్, మిగిలిన వారికి స్టాండర్డ్ సైకిళ్లు ఉన్నాయి. వీటి ధర రూ. 750 నుంచి రూ.4500 వరకు ఉన్నాయి. ఇంపోటెడ్ సైకిళ్ల ధర రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంది. అయితే హీరో, హెర్క్యులస్, అట్లాస్, అవెన్ కంపెనీల సైకిళ్లు మాత్రం ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. జిల్లాలో సుమారు 30 పట్టణాల్లో సైకిల్ దుకాణాలున్నాయి. అన్ని కంపెనీల సైకిళ్లు ఏడాదికి 30 వేల నుంచి 40 వేల వరకు అవుు్మడవుతున్నారుు. జిల్లాలో 20వేల మంది దాకా సైకిల్ మెకానిక్‌లకు ఉపాధి లభిస్తోంది. సైకిళ్లపై పెరిగిన మక్కువ ప్రస్తుతం పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఒకప్పుడు రూ.45 ఉన్న పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.71.50కి పెరిగింది. సామాన్య మధ్యతరగతి ప్రజలు కార్లు, మోటారు సైకిళ్ల వినియోగం కష్ట సాధ్యంగా మారింది. దీంతో పాటు పదిమందిలో ముగ్గురికి ఒబేసిటీ సమస్యలొస్తున్నాయి. వీటన్నింటికీ సైకిలింగ్ పరిష్కార మార్గంగా మారింది. ఈ క్రమంలో ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సైకిల్ వాడేందుకు ఆసక్తిని చూపుతున్నారు. మనిషిలోని కొలెస్ట్రాల్ తగ్గి, సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. శబ్ద, వాయు కాలుష్య నివారణ సాధ్యం. ఇంధన పొదుపుతో పాటు డబ్బు ఆదా అవుతుంది. ఎటువంటి మార్గాల్లోనైనా సులభంగా ప్రయాణించవచ్చు. బరువులు తీసుకెళ్లడానికి అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య నివారణ. ప్రమాదాలు నుంచి రక్షణ. బరువు తగ్గేందుకు ఇదో మంచి వ్యాయామం. తక్కువ ధరకు దొరికే ప్రయాణ సాధనం. -
ఎనిమిదో రోజు 30 లక్షలు
గత నాలుగు రోజులతో పోలిస్తే తెలంగాణలో తగ్గిన రద్దీ ట్రాఫిక్ సమస్య తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న భక్తులు నెట్వర్క్: గోదావరి పుష్కరాలకు ఎనిమిదో రోజూ కూడా భక్తులు పెద్ద సంఖ్యలోనే తరలి వచ్చారు. మంగళవారం సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 30 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే గత నాలుగు రోజులతో పోలిస్తే రద్దీ కాస్త తగ్గింది. రోడ్లపై ట్రాఫిక్ సమస్య కూడా పెద్దగా కనిపించలేదు. ప్రధాన పుణ్య క్షేత్రాలైన ధర్మపురి, కాళేశ్వరం, బాసర, భద్రాచలానికి భక్తుల తాకిడి తగ్గింది. సాధారణ భక్తులు గంటలోపే ధర్మపురి లక్ష్మీనర్సింహ స్వామిని సందర్శించుకున్నారు. భద్రాద్రి రామయ్య దర్శనానికి 4 గంటలు, కాళేశ్వర ముక్తేశ్వరుడి దర్శనానికి 3 గంటలు, బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పట్టింది. మిగిలిన జిల్లాలతో పోలిస్తే కరీంనగర్లో అత్యధికంగా 11.32 లక్షల మంది పుణ్యస్నానం చేశారు. ధర్మపురిలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పుష్కర స్నానం చేశారు. కోటిలింగాల పుష్కర ఘాట్ వద్ద వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, యువజన అధ్యక్షుడు వేణుమాధవరావు పుష్కర స్నానమాచరించి, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి పిండ ప్రదానం చేశారు. సుందిల్ల ఘాట్ వద్ద వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్ పుష్కర స్నానం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో సోన్ పుష్కర ఘాట్‌లో 1.4 లక్షల మంది స్నానాలు ఆచరించారు. నిజామాబాద్ నుంచి భైంసాకు వెళ్తున్న ఓ ఆటో బాసరా గోదారి వంతెన సమీపంలో అగ్ని ప్రమాదానికి గురవడంతో భక్తులు కొంత ఆందోళనకు గురయ్యారు. గోదావరిఖనిలో పుష్కర స్నానానికి వెళ్లి సుంకె ప్రసాద్ (26) అనే యువకుడు గల్లంతయ్యాడు. గోదావరి ఎగువ ప్రాంతం, ఏటూరు నాగారం ఏజెన్సీలో కురుస్తున్న వర్షాలతో వరంగల్‌లోని ఘాట్ల వద్ద నీటి ప్రవాహం పెరిగింది. జిల్లాలోని మంగపేట, రామన్నగూడెం, ముల్లకట్టె ఘాట్ల వద్ద ఇప్పటివరకు 13 లక్షల మంది స్నానాలు ఆచరించారు. మంగళవారం డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాదె నిరంజన్‌రెడ్డి దంపతులు మంగపేటలో పుష్కరస్నానం ఆచరించారు. -
ముక్కోటి దాటింది..
ట్రాఫిక్ సమస్య తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న భక్తులు ప్రధాన క్షేత్రాల్లోనూ తొందరగానే దర్శనం ఏపీలో మంగళవారం తగ్గిన పుష్కర భక్తులు రాజమండ్రి: పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని పవిత్ర గోదావరిలో ముక్కోటి మంది భక్తులు పుష్కర స్నానాలు చేశారు. భక్తజనం ఎక్కువవుతుండటంతో పుష్కరాలకు మరో 4 రోజు లుండగానే కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. అయితే ఉభయగోదావరి జిల్లాల్లో మంగళవారం భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గింది. కోటి లింగాల రేవు, పుష్కర ఘాట్లు మినహా మిగిలిన ఘాట్లలో తెల్లవారుజాము నుంచే పెద్దగా ర ద్దీ కనిపించలేదు. అలాగే సరస్వతీ (వీఐపీ) ఘాట్‌కు వచ్చే వీఐపీల తాకిడి కూడా తగ్గింది. ఉభయ గోదావరి జిల్లాల్లో సోమవారం 47 లక్షల మంది పుష్కర స్నానాలు ఆచరిస్తే మంగళవారం రాత్రి 8 గంటల సమయానికి 34,03,457 మంది భక్తులు మాత్రమే పుణ్య స్నానాలను ఆచరించారు. తూర్పున 24,06,858 మంది, పశ్చిమలో 10,86,201 మంది పుష్కర స్నానమాచరించారు. తూర్పులో లక్ష మంది, పశ్చిమలో 70 వేలమంది వరకు భక్తులు పుష్కరస్నానాల కోసం ఇంకా వేచి ఉన్నారు. దీంతో ఇప్పటివరకు ఉభయగోదావరి జిల్లాల్లో పుష్కర స్నానాలు ఆచరించిన వారి సంఖ్య 3,09,42, 618కు చేరింది. రాజమండ్రి అర్బన్ పరిధిలోని ఘాట్లలో 1,17,62,323 మంది పుష్కర స్నానం చేయగా, తూర్పుగోదావరిలోని గ్రామీణ ఘాట్లలో 93,78,081 మంది, పశ్చిమలో మరో 98,02,214 మంది పుణ్యస్నానాలు ఆచరించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
ఏం జనంరా.. బాబూ !
‘అబ్బో.. ఏం జనంరా బాబూ..! ఇంతకు ముందెప్పుడూ చూళ్లేదు’ తనయుడితో తల్లి. ‘మరేమనుకున్నావ్.. ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. నిన్న ఒక్కరోజే మన జిల్లాకు 20 లక్షలు దాటిపోయి జనమొచ్చారంట’ తనయుడి సమాధానం. ‘ఆళ్లందర్నీ గోదారమ్మ తల్లి చల్లగా చూడాలి. అందరిళ్లల్లో సిరిసంపదలు బాగుండాలి. ఆడోళ్లంతా జీవితకాలం సౌభాగ్యంతో బతకాలి. పుష్కరాలకొచ్చినోళ్లంతా సంతోషంగా ఇంటికెళ్లాల’ంటూ గోదారమ్మతోపాటు దేవుళ్లందరినీ ఆ తల్లి ప్రార్థించింది. జిల్లాలో ప్రతిచోట.. ప్రతి ఒక్కరి నుంచి ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయి. జన జాతర నడుమ పుష్కరోత్సవాలు అంబరాన్ని తాకుతున్నాయి. సాక్షి ప్రతినిధి, ఏలూరు : మఖ నక్షత్రం.. ఆదివారం వేళ పుష్కర సంబరం అంబరాన్ని తాకింది. రెండు రోజులుగా యాత్రికులను నరకయాతనకు గురిచేస్తున్న ట్రాఫిక్ సమస్యను కొంతమేర అధిగమించడంతో ఆదివారం జిల్లా వ్యాప్తంగా పుష్కర పర్వం ఒకింత సాఫీగానే సాగింది. శనివారం రోజంతా కొవ్వూరు, నరసాపురం పట్టణాలకు కిలోమీటర్ల దూరంలో వాహనాలు ఆగిపోవడం.. యాత్రికులు పుష్కర ఘాట్లకు చేరుకోలేక ప్రత్యక్ష నరకం చవిచూసిన పరిస్థితుల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచే అధికారులు ట్రాఫిక్ నియంత్రణపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. చెన్నై, విజయవాడ నుంచి వచ్చే భారీ వాహనాలను రాజమండ్రి, కొవ్వూరు వైపు రానివ్వకుండా రావులపాలెం, జొన్నాడ, రాజోలు మీదుగా విశాఖ వైపు మళ్లిం చారు. ఏలూరు-కొవ్వూరు-రాజమండ్రి మార్గంలో వచ్చే భారీ వాహనాలను మళ్లించి ప్రయాణికుల కార్లను, ఆర్టీసీ బస్సులను మాత్ర మే అనుమతించారు. గుండుగొలను మీదుగా రాజమండ్రి వెళ్లే వాహనాలను జాతీయ రహదారి మీదుగా, కొయ్యలగూడెం నుంచి రాజ మండ్రి వెళ్లే వాహనాలను నాలుగో వంతెన మీదుగా మళ్లించారు. శనివారం ప్రయాణికుల అనుభవాలు, అవస్థలు మీడియాలో హోరెత్తిన నేపథ్యమే కావొ చ్చు గానీ ఆదివారం భక్తుల తాకి డి అంచనాలకు మించి లేదనే చెప్పాలి. పుష్కరాల తొలిరోజు నుంచి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వేళల్లోనే పిండప్రదానాలు చేస్తున్నారు. ఆదివారం విపరీతమైన రద్దీ ఉంటుందని భావించిన యాత్రికులు, భక్తులు శనివారం అర్ధరాత్రి కూడా పిండప్రదానాలు చేశారు. దీంతో రాత్రి, పగలు తేడా లేకుండా పుష్కర ఘాట్లన్నీ కిటకిటలాడాయి. కొవ్వూరు ఘాట్లకు తమిళనాడు, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి భక్తులు పోటెత్తారు. బస్సుల కోసం ఎదురుచూపులు ఆర్టీసీ బస్సులు అవసరానికి తగ్గ సంఖ్యలో లేకపోవడంతో నరసాపురంలో భక్తులు అవస్థలు ఎదుర్కొన్నారు. ఉదయం పుష్కర స్నానాలు పూర్తి చేసుకున్న యాత్రికులు సాయంత్రం వరకు బస్టాండ్‌లోనే వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. నరసాపురం పట్టణంలో ఆదివారం ఏ వీధిలో చూసినా భక్తుల సందడి కనిపించింది. లక్షలాదిగా జనం రోడ్లపైకి రావడంతో అడుగు తీసి అడుగు వేయడం కష్టమైంది. ట్రాఫిక్ విషయంలో ఉన్న ఇబ్బందులను కొంతమేర అధిగమించగలిగారు. వాహనాలను పాలకొల్లు రోడ్డులో నిలుపుదల చేయడంతో ట్రాఫిక్ సమస్య పెద్దగా ఉత్పన్నం కాలేదు. ఘాట్ల వద్ద భక్తులు స్నానాల కోసం ఎండలో గంటల తరబడి వేచిచూడాల్సి వచ్చింది. దీంతో కొందరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆకుల శేషసాయి దంపతులు నరసారురంలో పుష్కర స్నానం చేసి పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. పెరవలిని వదలని ట్రాఫిక్ సమస్య పెరవలిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాకపోవడంతో భక్తులు నరకయాతన పడ్డారు. ట్రాఫిక్ నియంత్రణకు అదనపు పోలీసులను నియమిం చాల్సిన అవసరం ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం శాపంగా మారింది. పోలవరంలో లాంచీలు సరిపోక గంటల తరబడి భక్తులు వేచిచూడాల్సిన పరిస్థితి ఎదురైంది. ఘాట్ల వద్ద రద్దీ కారణంగా చిన్నపాటి తోపులాటలు చోటు చేసుకున్నాయి. రాష్ర్ట దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఇక్కడి ఘాట్లను పరిశీలించారు. యలమంచిలిలో అదే జోరు యలమంచిలి మండలంలో భక్తుల జోరు కొనసాగింది. లక్ష్మీపాలెం ఘాట్‌లో పైకిలేచిన రాళ్లవల్ల భక్తులకు స్వల్ప గాయాలయ్యాయి. ఇక్కడా ట్రాఫిక్ సమస్య జఠిలంగా మారింది. భారీగా వస్తున్న జనాన్ని నియంత్రించలేక పోలీసులు చేతులెత్తేశారు. ఇక్కడ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పుష్కర స్నానం ఆచరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి, రాజమండ్రి ఘటనలో మృతి చెందిన వారికి పిండప్రదానాలు చేశారు. యలమంచిలి ఘాట్‌లో ఓ ముస్లిం కుటుంబం పుష్కర స్నానమాచరించింది. సిద్ధాంతం కేదారీ ఘాట్‌లో వీల్చైర్లు లేక వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. రాత్రి 8 గంటలకే ఉచిత బస్సులు నిలిపివేత పుష్కర యాత్రికుల అవస్థలు కొవ్వూరు: పుష్కరాలకు తరలివచ్చే భక్తులను స్నానఘట్టాలకు చేరవేసేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ, ప్రైవేటు ఉచిత బస్సులను ప్రతిరోజు రాత్రి 8 గంటల తరువాత నిలిపివేస్తుండటంతో భక్తులు ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. రోజూ ఉదయం 7నుంచి రాత్రి 8 గంటల వరకు మాత్రమే ఉచిత బస్సు సర్వీసులు నడుపుతున్నారు. కొవ్వూరు ప్రాంతానికి ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్లు, ప్రత్యేక రైళ్లు రాత్రివేళ ఎక్కువగా వస్తున్నాయి. ఏలూరు, ఖమ్మం ప్రాంతాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు సైతం ఎక్కువగా తిరుగుతుంటాయి. రాత్రివేళ రైళ్లు, బస్సుల నుంచి దిగుతున్న యాత్రికులతోపాటు ప్రైవేటు వాహనాల్లో పార్కింగ్ జోన్లకు చేరుకున్న వారంతా సుమారు ఐదారు కిలోమీటర్ల దూరం నడిచి పుష్కర ఘాట్లకు చేరుకోవాల్సి వస్తోంది. అప్పటికే ప్రయాణం చేసి అలసిపోయిన యాత్రికులు కాలినడకన ఘాట్లకు వెళ్లలేక అవస్థలు పడుతున్నారు. పగటిపూట 250 ఉచిత బస్సులను నడుపుతున్న ప్రభుత్వం రాత్రివేళ కనీసం వాటిలో సగం బస్సులనైనా ఘాట్లవరకు నడపాలని యాత్రికులు కోరుతున్నారు. -
బస్సులు తక్కువ.. భక్తులు ఎక్కువ
ములుగు : మంగపేట పుష్కరఘాట్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని పుణ్యస్నానాల ప్రాంతానికి భక్తులను చేరవేసేందుకు ఉచిత షటిల్ సర్వీసులు ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినా ఆచరణలో సాధ్యంకాలేదు. శుక్రవారం అమావాస్య అరుునా సాయంత్రం వరకు సుమారు 60వేల మంది భక్తులు తరలివచ్చారు. వీరిని గంపోనిగూడెం తరలించే క్రమంలో ట్రాఫిక్ సమస్య తలెత్తగా ప్రైవేటు వాహనాలు నిలిచిపోయూరుు. సీఐ శ్రీధర్‌రావు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. శని, ఆదివారాలు సెలవు దినం కావడంతో భారీగా తరలివచ్చే వాహనాలు నిలిపేందుకు మంగపేట పార్కింగ్ ప్రాంతంలో మరో పార్కింగ్ స్థలం ఏర్పాటు చేశారు. కాగా, గంపోనిగూడెం నుంచి ఉచిత షటిల్ సర్వీసులు వేస్తామని చెప్పిన అధికారులు నిర్లక్ష్యం చేయడంతో తన భార్యాపిల్లలతో ఎండలో రెండు కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందని వరంగల్‌కు చెందిన భక్తులు వి.వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. -
మెట్రో-3 పూర్తయ్యేనా?
అడ్డంకిగా మారిన స్థల సేకరణ సాక్షి, ముంబై: నగరంలో ఉగ్రరూపం దాల్చిన ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి కొలాబా-బాంద్రా-సిబ్జ్ ప్రాంతాల మధ్య చేపట్టిన మెట్రో-3 ప్రాజె క్టు నిర్మాణం ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్టుకు సంబంధించిన రైలు మార్గం జనావాసాల మధ్యనుంచి వెళ్తుండటంతో స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రాజెక్టు కోసం బీఎంసీ కార్యాలయాలు, గోదాములు, రిజర్వుడు స్థలాలు, క్రీడా మైదానాలు, ఉద్యానవనాలు, రాజకీయ పార్టీ కార్యాలయాల స్థలాలు సేకరించాల్సి ఉంటుంది. వీటికోసం ఆయా శాఖల అనుమతి పొందాల్సి ఉంటుంది. బాధితుల ప్రత్యామ్నాయాలకు ఇబ్బంది ట్రాఫిక్ సమస్యను చెక్ పెట్టడానికి మెట్రో-3 నిర్మాణం చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రాజెక్టు పనులకు ‘పబ్లిక్ అర్బన్ ట్రాన్స్‌పోర్టు ప్రాజెక్టు’కు ఇటీవల ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో స్థల సేకరణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రాజె క్టుకు సంబంధించి మెట్రో రైలు పిల్లర్లకు, రైల్వే స్టేషన్ల నిర్మాణాలకు, మెట్లు, ఎస్కలేటర్ల నిర్మాణానికి భారీగా స్థలం సేకరించాల్సి ఉంటుంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణానికి స్థానికులనుంచి అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించినా, స్థలాలు కోల్పోయిన బాధితులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు ఇబ్బందులు ఎదురవనుండటంతో ప్రాజెక్టు నిర్మాణం ఎంతవరకు సఫలీకతమైతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. అడ్డంకులు ఎదురయ్యే ప్రాంతాలు ⇒ వర్లీ-ఇంజినీరింగ్ హబ్ భవనం ఎదురుగా బీఎంసీకి చెందిన భద్రత శాఖ భవనం ఉంది. ప్రత్యామ్నాయ స్థలం ఇచ్చేవరకు భవనం కూల్చివేసేందుకు బీఎంసీ అనుమతివ్వదు. ⇒ వర్లీ-సస్మీరా ఇన్స్టిట్యూట్ పరిసరాల్లో ఉన్న బీఎంసీ మార్కెట్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రైవేటు బిల్డర్‌కు అప్పగించారు. అందుకు సంబంధించిన ప్రతిపాదన న్యాయ శాఖ వద్ద పెండింగులో ఉంది. ఇది క్లియర్ అయితే తప్ప మెట్రోకు స్థలం లభించదు. ⇒ ప్రభాదేవి-సిద్ధివినాయక్ మందిరం స్టేషన్ నిర్మాణం కోసం 15,254 చ.మీ. స్థలం కావాలి. అందుకు మందిరం పక్కనే ఉన్న నర్దుల్లా ట్యాంక్ మైదానం స్థలాన్ని సేకరించాల్సి ఉంటుంది. ⇒ లోయర్‌పరేల్-సైన్స్ మ్యూజియం స్థలం రాష్ట్ర ప్రభుత్వం ఆదీనంలో ఉండడంతో దాన్ని స్వాధీనం చేసుకునే ప్రతిపాదన పెండింగులో ఉంది. ⇒ ముంబెసైంట్రల్-నాయర్ ఆస్పత్రి విస్తరణ, ఆస్పత్రిలో ఎల్పీజీ గ్యాస్ చాంబర్ స్థలాన్ని మెట్రో-3 కి ఇచ్చేందుకు అభ్యంతరం చెబుతున్నారు. ⇒ చర్చిగేట్-హుతాత్మ చౌక్ వద్ద ఉన్న పే అండ్ పార్కింగ్ స్థలాన్ని ఇచ్చేందుకు సాంకేతికపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ⇒ రాజకీయ పార్టీ కార్యాలయాలు-అసెంబ్లీ హాలు, మంత్రాలయ పరిసరాల్లో అనేక రాజకీయ పార్టీల కార్యాలయాలున్నాయి. మెట్రో-3 నిర్మాణానికి ఆ స్థలాలని ఖాళీ చేయించాలి. -
రిస్కీ జర్నీ
కిక్కిరిసిపోతున్న ఎంఎంటీఎస్ రైళ్లు రద్దీ వేళల్లో {పయాణికుల ఇబ్బందులు డిమాండ్ మేరకు బోగీలు పెంచని ద.మ.రైల్వే సిటీబ్యూరో మహా నగరంలో ఒక చోట నుంచి ఇంకోచోటికి ప్రయాణం ఎంతో కష్టతరంగా మారింది. ట్రాఫిక్ సమస్య, చాలీచాలని బస్సులు, అధ్వానపు రోడ్లతో నగరజీవి ప్రయాణమంటేనే హడలుతున్నాడు. ఈ దశలో నగరం నాలుగువైపుల నుంచి హైటెక్ సిటీకి మధ్య దక్షిణ మధ్యరైల్వే ప్రవేశపెట్టిన ఎంఎంటీఎస్(మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్) రైళ్లు ప్రయాణికులకు ఎంతగానో ఊరటనిచ్చాయి. అయితే ఇప్పుడు ఎంఎంటీఎస్ రైలు ప్రయాణం నరకప్రాయంగా మారుతోంది. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో సీట్లు లభించక ప్రయాణికులు గంటల తరబడి నిల్చొని ప్రయాణించవలసి వస్తోంది. కిటకిటలాడే బోగీల్లోకి దూరేందుకు అవకాశం లేక ఎంతోమంది ప్రయాణికులు మరో ట్రైన్ కోసమంటూ పడిగాపులు కాస్తూ విలువైన సమయాన్ని కోల్పోతున్నారు. సిటీబస్సు తరువాత ప్రధానమైన ప్రజా రవాణా వ్యవస్థగా నిలిచే ఎంఎంటీఎస్ సేవలు రోజురోజుకు వ్యధాభరితమవుతున్నాయి. మరి కొద్ది రోజుల్లో కేంద్రం రైల్వేబడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎంఎంటీఎస్ సేవలపై ప్రత్యేక కథనం.. సగానికి పైగా స్టాండింగే.... ఫలక్‌నుమా-లింగంపల్లి, నాంపల్లి-లింగంపల్లి, సికింద్రాబాద్-లింగంపల్లి, నాంపల్లి-సికింద్రాబాద్,ఫల క్‌నుమా-సికింద్రాబాద్ మార్గాల్లో ప్రతి రోజు 121 ఎంఎంటీఎస్ సర్వీసులు నడుస్తున్నాయి. లక్షా 70 వేల మంది ప్రయాణికులు పయనిస్తున్నారు. గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, చందానగర్, మియాపూర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డు తదితర ప్రాంతాల నుంచి నగరంలోని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లోకి వచ్చే ఉద్యోగులు, సికింద్రాబాద్, నాంపల్లి స్టేషన్ల నుంచి హైటెక్‌సిటీ, మాదాపూర్‌లోని ఐటీ సంస్థలకు వెళ్లే సాఫ్ట్వేర్ నిపుణులు, వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులు, వ్యాపారులతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ రైళ్లు కిక్కిరిసిపోతాయి. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు ఆఫీసులకు చేరే సమయంలో, సాయంత్రం 4 గంటల నుంచి 7.30 వరకు తిరిగి ఇళ్లకు చేరే సమయంలో రద్దీ నెలకొంటోంది. ఈ సమయంలోనే ప్రయాణికుల డిమాండ్‌కు తగినన్ని రైళ్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో సీట్ల సామర్ధ్యానికి మించి 70 శాతం ప్రయాణికులు నిల్చొనే ప్రయాణించవలసి వస్తోంది. ఒక ఎంఎంటీఎస్ ట్రైన్లో మొత్తం 715 సీట్లు ఉంటే రద్దీ వేళ ల్లో మరో 1000 మందికి పైగా నిలబడవలసి వస్తోంది. బోగీలు పెంచడమే పరిష్కారం... ఎంఎంటీఎస్ ట్రైన్‌కు ప్రస్తుతం 9 బోగీలే ఉన్నాయి. వీటిలో ట్రైలర్కార్ బోగీలో 78 సీట్లు ఉంటే, మోటార్కార్ బోగీలో 98 సీట్లు ఉన్నాయి. సగటున ఒక ట్రైన్లో 718 మంది మాత్రమే ప్రయాణించగలరు. కానీ డిమాండ్‌కు తగినవిధంగా బోగీలు పెరగకపోవడం వల్ల మరో వెయ్యిమంది అదనంగా నిలబడి పయనిస్తున్నారు. మహిళలు, పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా 9 బోగీలను 12కు పెంచ డమే ఏకైక పరిష్కారం. కానీ ఆ దిశగా దక్షిణమధ్య రైల్వే ఎలాంటి చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. లోకల్‌ట్రైన్ ఆయువుపట్టుగా ఉన్న ముంబయి నగరంలో ఒక్కో ట్రైన్లో 16 బోగీలు ఉన్నాయి. కోల్‌కత్తాలోనూ లోకల్ రైళ్లు 15 బోగీలతో ప్రయాణికులకు రవాణా సదుపాయం అందజేస్తుండగా, మన సిటీ ఎంఎంటీఎస్ మాత్రం 9 బోగీలకే పరిమితమైంది. ఇదీ ఎంఎంటీఎస్ ప్రస్థానం .... మల్టిమోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ నగరంలో 2003 లో ప్రారంభమైంది. మొదట్లో ఒక ట్రైన్‌కు 6 బోగీలే ఉండేవి. 2003 నుంచి 2007 వరకు 6 బోగీలు ఉన్న రైళ్లు ప్రతి రోజు 65 ట్రిప్పులు తిరిగేవి. మొదట్లో 30 వేల మంది ఉన్న ప్రయాణికులు క్రమంగా 50 వేలకు పెరిగారు. 2007 లో బోగీల సంఖ్యను 8 కి పెంచారు. సర్వీసులు కూడా 84 కు పెరిగాయి. 2009 లో కొన్ని సర్వీసులకు 9 బోగీలు పెంచారు. మరికొన్ని 8 బోగీలతోనే నడిచాయి. ఆ ఏడాది సర్వీసుల సంఖ్య 104 కు పెరిగింది. ప్రయాణికులు సైతం లక్ష దాటారు. 2011లో అన్ని ఎంఎంటీఎస్ సర్వీసులకు 9 బోగీలు పెంచారు. ఆ ఏడాది నుంచి సర్వీసులు కూడా 121 కి పెరిగాయి. ప్రయాణికుల సంఖ్య 1.2 లక్షలకు చేరుకుంది. 2012-13 నాటికి ప్రయాణికుల సంఖ్య 1.5 లక్షలకు పెరిగింది. {పస్తుతం లక్షా 70 వేల మంది ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకుంటున్నారు. -
రోడ్డుపై బంగారం కోసం అన్వేషణ
వేములపల్లి (నల్లగొండ): నల్లగొండ జిల్లా వేములపల్లి మండల కేంద్రంలోని రోడ్డుపై బంగారం ముక్కలు దొరుకుతున్నాయంటూ జనం వెతుకులాట ప్రారంభించటం కలకలం సృష్టించింది. గురువారం మధ్యాహ్నం మండలంలోని వేములపల్లి- మిర్యాలగూడ రహదారిలో ఒక లారీ వెళ్లిందని, అందులో నుంచి బంగారం ముక్కలు జారి పడ్డాయని వదంతులు వచ్చాయి. ఒకరికొకరు అనుకోవటం ద్వారా విన్న జనం బంగారం ముక్కల కోసమంటూ రోడ్డుపైకి చేరారు. చిన్నా పెద్దా అంతా కనకాన్వేషణలో పడటంతో ఆ మార్గంలో రాకపోకలు స్తంభించాయి. బంగారం రంగులో మెరుస్తున్న లోహపు ముక్కలు కొందరికి దొరకటంతో అది బంగారమేనని చర్చించుకున్నారు. అంతలోనే అటుగా వచ్చిన పోలీసులు కూడా విధులు మరిచి బంగారం కోసం వెతుకులాటలో మునిగిపోయారు. సాయంత్రానికి గాని ఈ హడావుడికి పుల్‌స్టాప్ పడలేదు. -
పార్కింగ్ స్థలం చూపితేనే వాహనం రిజిస్ట్రేషన్
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచన సాక్షి, ముంబై: ఇకపై యజమానులు పార్కింగ్ స్థలం చూపిస్తేనే వారి వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసే విషయాన్ని ప్రభుత్వం పరిశీలించాలని బొంబాయి హైకోర్టు సూచించింది. నగరంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతోపాటు, రోడ్డు, ఫూట్‌పాత్‌పై ప్రజలు సురక్షితంగా రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది. ‘జనహిత్ మంచ్’ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా కోర్టు సూచనలు చేసింది. అస్తవ్యస్తమైన పార్కింగ్, నగరంలో పెరుగుతున్న వాహనాల సమస్యను ఎలా అధిగమిస్తారని న్యాయమూర్తులు నరేష్ పాటిల్, అజయ్ గడ్కరిలతో కూడిన ధర్మాసనం ప్రభుత్వాన్ని, బీఎంసీని ప్రశ్నించింది. వచ్చే ఐదేళ్లకు మీ ప్రణాళిక ఏమిటని నిలదీసింది. రోడ్లపై కార్లను నిలపడాన్ని అనుమతించకూడదని ఆదేశించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సరైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించడం లేదని కోర్టు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్క ముంబైలోనే నో పార్కింగ్ జోన్లో వాహనాలు నిలిపినందుకు ట్రాఫిక్ పోలీసులు గత ఐదేళ్లలో రూ.25 కోట్లు జరిమానా రూపంలో వసూలు చేశారని ప్రభుత్వం తరఫు న్యాయవాది జస్బీర్ సలుజా కోర్టుకు తెలిపారు. దీంతో కోర్టు ప్రభుత్వంపై మరింత మండిపడింది. ఇలా చేయడంవల్ల ప్రభుత్వ ఖజానాలో భారీగానే ధనం చేకూరుతుంది, కానీ రాకపోకలు సాగించే జనానికి తగినంత స్థలం లేకపోవడం వల్ల ప్రయోజనమేంటని కోర్టు నిలదీసింది. ప్రభుత్వం స్కైక్ వాక్‌లు నిర్మించిందని, కానీ వాటిని ప్రజలు వినియోగించడం లేదన్న న్యాయవాది వ్యాఖ్యలను కూడా కోర్టు తిరస్కరించింది. ‘‘మీరు నిర్మించిన స్కై వాక్‌లు ప్రణాళికాబద్ధంగా లేవు. వాటిపై లైట్లు లేనందున అవి మహిళలకు సురక్షింతం కావు. వృద్ధులు వాటిపైకి ఎక్కి, దిగలేరు’’ అని మందలించింది. ‘‘విదేశాల్లో వాహన యజమానులు బాటసారులను గౌరవిస్తారు. వారికి రోడ్డు దాటే అవకాశం ఇస్తారు. కాని మనదేశంలో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇక్కడ వాహన యజమానులను ఆదరిస్తారు’’ అని ధర్యాసనం వ్యాఖ్యానించింది. ఈ వ్యవస్థను మార్చాలంటే ముందు వాహన యజమానులు పార్కింగ్ స్థలం చూపించాలి. ఆ తరువాతే ఆర్టీఓలో రిజిస్ట్రేషన్ పనులు జరగాలి. అప్పుడే నగరంలో వాహనాల కొనుగోళ్లు తగ్గుముఖం పడతాయని కోర్టు అభిప్రాయపడింది. -
'ట్రాఫిక్ సమస్యలేని నగరంగా హైదరాబాద్'
హైదరాబాద్: తెలంగాణ రహదారుల అభివృద్ధి కోసం రూ.14 వేల కోట్లు కేటాయించినట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్ అండ్ బీ అధికారులతో సోమవారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... తెలంగాణలో వేల కిలోమీటర్ల రహదారుల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. తమ రాష్ట్రం గుండా వెళుతున్న జాతీయ రహదారిని పొడిగించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. హైదరాబాద్ ను ట్రాఫిక్ సమస్యలేని నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ప్రధాన జిల్లా కేంద్రాల్లో ఫ్లైఓవర్లు, రింగ్ రోడ్లు వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. -
చిరు వ్యాపారులకు చుక్కలు
ప్రొద్దుటూరు టౌన్: రోడ్లపై వ్యాపారాలు చేస్తున్న వారికి (స్ట్రీట్ వెండర్స్‌కు) మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూపులు తప్పడం లేదు. రోడ్లపై పండ్లు, పూలు, బట్టలతోపాటు వివిధ రకాల సరుకులు, వస్తువులు తోపుడు బండ్లపై, గంపల్లో పెట్టుకుని విక్రయించే వ్యాపారులను స్థానిక మున్సిపాలిటీలు గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి ఎంపిక చేసిన ఖాళీ ప్రదేశాలు కేటాయించాలన్నది ఉద్దేశం. తద్వారా పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నది లక్ష్యం. అయితే ఈ నిర్ణయంపై 2009 నుంచి సర్వేల పేరుతో కాలయూపన సాగుతోంది. సర్వేలో మెప్మా సీఓలు, ఆర్పీలు పాల్గొని నివేదికలు కూడా తయారు చేసి అధికారులకు ఇచ్చారు. వీరికి అవగాహన సదస్సులు నిర్వహించి ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని కూడా సూచనలు ఇచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది వారి పేర్లను మున్సిపాలిటీల్లోని మెప్మా సెంటర్లలో నమోదు చేసుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో తిరిగి సర్వేలు చేసి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అయితే స్థలాలు గుర్తించి వారికి కేటాయించడం ఎప్పటికి పూర్తి అవుతందనేది అంతుచిక్కని విషయంగా మారింది. కడప జిల్లాలో సర్వే ఇలా... జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల పరిస్థితి చూస్తే కడపలో 2708 మందిని గుర్తించి వారిలో 502 మందికి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అలాగే బద్వేలులో 519కి 100 మందకి ఐడీ కార్డులు, జమ్మలమడుగులో 835కు 107 మందికి, మైదుకూరులో 235కి 108 మందికి, ప్రొద్దుటూరులో 1416లో 182కు, పులివెందులలో 710లో 132కి, రాజంపేటలో 401లో 70కి, రాయచోటిలో 805లో 385కి, ఎర్రగుంట్లలో 133లో 127కి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో శనివారం వరకు 1,42,202 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నట్లు ఆన్లైన్లో పొందు పరిచారు. కాగా అందులో 1,06,679 మంది పూర్తి వివరాలు లేవు. కంప్యూటర్లో మాత్రమే చూపుతున్నారు. పేరుకే లక్షకు పైగా స్ట్రీట్ వెండర్స్‌ని గుర్తించామని ఉన్నా అవన్నీ కాకి లెక్కలేనని స్పష్టంగా తెలుస్తోంది. ఐడీ కార్డులు సిద్ధం చేసిన వారందరూ 2013-14లో సర్వే చేసిన వారే... ఇటీవల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన తరువాత ప్రొద్దుటూరు టౌన్: రోడ్లపై వ్యాపారాలు చేస్తున్న వారికి (స్ట్రీట్ వెండర్స్‌కు) మంచి రోజులు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూపులు తప్పడం లేదు. రోడ్లపై పండ్లు, పూలు, బట్టలతోపాటు వివిధ రకాల సరుకులు, వస్తువులు తోపుడు బండ్లపై, గంపల్లో పెట్టుకుని విక్రయించే వ్యాపారులను స్థానిక మున్సిపాలిటీలు గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి ఎంపిక చేసిన ఖాళీ ప్రదేశాలు కేటాయించాలన్నది ఉద్దేశం. తద్వారా పట్టణాల్లో ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలన్నది లక్ష్యం. అయితే ఈ నిర్ణయంపై 2009 నుంచి సర్వేల పేరుతో కాలయూపన సాగుతోంది. సర్వేలో మెప్మా సీఓలు, ఆర్పీలు పాల్గొని నివేదికలు కూడా తయారు చేసి అధికారులకు ఇచ్చారు. వీరికి అవగాహన సదస్సులు నిర్వహించి ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవాలని కూడా సూచనలు ఇచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిమంది వారి పేర్లను మున్సిపాలిటీల్లోని మెప్మా సెంటర్లలో నమోదు చేసుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో తిరిగి సర్వేలు చేసి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అయితే స్థలాలు గుర్తించి వారికి కేటాయించడం ఎప్పటికి పూర్తి అవుతందనేది అంతుచిక్కని విషయంగా మారింది. కడప జిల్లాలో సర్వే ఇలా... జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల పరిస్థితి చూస్తే కడపలో 2708 మందిని గుర్తించి వారిలో 502 మందికి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అలాగే బద్వేలులో 519కి 100 మందకి ఐడీ కార్డులు, జమ్మలమడుగులో 835కు 107 మందికి, మైదుకూరులో 235కి 108 మందికి, ప్రొద్దుటూరులో 1416లో 182కు, పులివెందులలో 710లో 132కి, రాజంపేటలో 401లో 70కి, రాయచోటిలో 805లో 385కి, ఎర్రగుంట్లలో 133లో 127కి ఐడీ కార్డులు సిద్ధం చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీల్లో శనివారం వరకు 1,42,202 మంది స్ట్రీట్ వెండర్స్ ఉన్నట్లు ఆన్లైన్లో పొందు పరిచారు. కాగా అందులో 1,06,679 మంది పూర్తి వివరాలు లేవు. కంప్యూటర్లో మాత్రమే చూపుతున్నారు. పేరుకే లక్షకు పైగా స్ట్రీట్ వెండర్స్‌ని గుర్తించామని ఉన్నా అవన్నీ కాకి లెక్కలేనని స్పష్టంగా తెలుస్తోంది. ఐడీ కార్డులు సిద్ధం చేసిన వారందరూ 2013-14లో సర్వే చేసిన వారే... ఇటీవల సుప్రీం కోర్డు ఆదేశాలు జారీ చేసిన తరువాత సర్వే నిర్వహించిన వారికే ఐడీ కార్డులు సిద్ధం చేశారు. అధికారుల వద్ద, ప్రభుత్వం వద్ద కేవలం 35,523 మంది వివరాలే ఉన్నాయి. గతంలో కేవలం గుర్తింపు పేరుతో నామమాత్రపు సర్వేలు చేశారే తప్ప వారి నుంచి పూర్తి వివరాలు తీసుకోవడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఏళ్లు గడుస్తుండటంతో నమోదు చేసుకున్న వారు ఎక్కడ ఉన్నారన్న సమాచారం కూడా లేకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. మున్సిపాలిటీల్లో స్థలాలు ఎక్కడా... ప్రస్తుతం గుర్తించిన వారికన్నా స్థలాలు ఇచ్చేందుకు మున్సిపాలిటీల్లో కసరత్తు జరగడం లేదు. కనీసం స్థలాలు ఉన్నాయా అంటే అవీలేవు. ఉన్న స్థలాలన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. అయినా మున్సిపల్ కమిషనర్లు కానీ, టౌన్‌ప్లానింగ్ అధికారులు కానీ స్పందించిన దాఖలాలు లేవు. ఈ పరిస్థితుల్లో సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేస్తారా అన్న అనుమానం వ్యాపారులను పీడిస్తోంది. కేవలం ఎదురు చూపులు, పోలీసు వేధింపులు తప్ప తమకు ఎలాంటి న్యాయం జరగదన్నది వ్యాపారుల వాదన. -
‘లింక్’ కుదర్లే
రేడియల్ రోడ్లు... ట్రాఫిక్ సమస్యకు హెచ్ఎండీఏ ఎంచుకున్న పరిష్కార ‘మార్గం’. ఇన్నర్ రింగ్ రోడ్డుకు...ఔటర్ రింగ్ రోడ్డుకు ‘లింక్’ పెట్టడం ద్వారా రాజధాని నగరంలో ప్రయాణాన్ని ఆహ్లాదంగా మార్చాలనే ప్రయత్నం. నిత్యం పెరుగుతున్న వాహనాలు... అంతే స్థాయిలో చోటుచేసుకుంటున్న ప్రమాదాలు... పొరపాటున ఒక్క మోటార్ సైకిల్ ఆగినా రోడ్లపై వాహనాల బారులు... ఇవి నగర జీవికి నిత్యానుభవాలు. ‘లింక్’ రహదారులతో ఈ కష్టాలు తప్పించాలనేది హెచ్ఎండీఏ యత్నం.కాస్తంత దృష్టి పెడితే సిటీ జనానికి ఎంతో మేలు చేసే ఈ రహదారులపై ప్రభుత్వం శీతకన్ను వేస్తోంది. నిధులు విదల్చనంటోంది. సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ తలపెట్టిన రేడియల్ రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర బడ్జెట్లో చుక్కెదురైంది. రేడియల్ రోడ్ల కోసం హెచ్ఎండీఏ ప్రత్యేకంగా రూ.300 కోట్లు కావాలని ప్రతిపాదించగా... బడ్జెట్లో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. దీంతో వీటి నిర్మాణంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వాస్తవానికి ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయ్యే నాటికి నగరంలో మొత్తం 33 రేడియల్ రోడ్లు నిర్మించాలన్నది లక్ష్యం. వీటిలో ఇప్పటికే ఏడింటిని (53.72 కి.మీ. మేర) హెచ్ఎండీఏ, ఆర్అండ్బీలు సంయుక్తంగా నిర్మించగా...జాతీయ రహదారుల మీదుగా ఉన్న మరో ఐదింటిని (83.35 కి.మీ.) నేషనల్ హైవే అథార్టీ నిర్మించింది. జీడిమెట్ల, ఈసీఐఎల్ ఎక్స్‌రోడ్, నాగోల్, షేక్‌పేట్, కుషాయిగూడ ప్రాంతాల్లో మరో 5 రేడియల్ రోడ్ల నిర్మాణాన్ని జైకా నిధులతో గత ఏడాది హెచ్ఎండీఏ చేపట్టింది. మిగిలిన 16 రేడియల్ రోడ్లనూ పూర్తి చేసి ... నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని హెచ్ఎండీఏ భావించింది. గత ప్రభుత్వం నిధులు కేటాయించని కారణంగా అవి ఫైళ్లకే పరిమితమయ్యాయి. కొత్త ప్రభుత్వమూ అదే దారిలో వెళ్లడం అధికారులను విస్మయపరిచింది. పెండింగ్‌లో ఉన్న 16 రేడియల్ రోడ్లకు సంబంధించి ఇంతవరకు భూ సేకరణ జరుగలేదు. వీటిలో 6 రహదారులకు అసలు సర్వే కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తొలి దశలో కీలకమైన 10 రేడియల్ రోడ్లకుసర్వే చేయాలని నిర్ణయించినా... కేవలం నాలిగింటితో సరిపెట్టేశారు. సర్వే పూర్తి కాకపోవడంతో భూసేకరణ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలో రవాణా గ్రిడ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన ప్రభుత్వం రాజధాని నగరంలో రేడియల్ రోడ్ల నిర్మాణంపై దృషి ్టపెట్టకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ట్రాఫిక్ నరకం తప్పదా..? రాజధాని చుట్టూ 158 కి.మీ. దూరం నిర్మించిన ఔటర్ రింగ్ రోడ్డుకు నగరం నుంచి అనుసంధానం లేకపోతే ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించడం అసాధ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎంఎంటీఎస్, మెట్రోరైల్ వంటివి ప్రవేశపెట్టినా ప్రయోజనం ఉండదంటున్నారు. కోర్ ఏరియాలో రోడ్ల విస్తరణకు అవకాశం లేకపోవడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య నిత్యం నరకం చూపిస్తోంది. ప్రధాన ప్రాంతాలను ఇన్నర్ రింగ్ రోడ్డు నుంచి ఔటర్ రింగ్ రోడ్డుకు కలిపితే...50 శాతం ట్రాఫిక్ సమస్యలు తగ్గే అవకాశం ఉందని గతంలో హెచ్ఎండీఏ సర్వేలో వెల్లడైంది. ఇప్పుడు సంస్థ ఆర్థిక పరిస్థితి తల్లకిందులవడంతో రేడియల్ రోడ్లపై చేతులెత్తేసింది. ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించడమో... లేదా జీహెచ్ఎంసీ, ఆర్ అండ్ బి శాఖల నుంచి నిధులు మళ్లించడమో చేస్తే తప్ప అవి సాకార మయ్యే పరిస్థితి కనిపించడం లేదు. గతంలో పాత భూసేకరణ చట్టం ప్రకారం కీలకమైన 16 రేడియల్ రోడ్ల నిర్మాణానికి రూ.1470 కోట్లు వరకు ఖర్చవుతుందని అప్పటి ఉమ్మడి ప్రభుత్వం అంచనా వేసింది. ఇప్పుడు కొత్త చట్టం అమల్లోకి రావడంతో ఈ వ్యయం మరింత పెరగనుంది. మిగిలిపోయిన 16 రేడియల్ రోడ్ల అభివృద్ధికి ఎంత ఖర్చవుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
నెలరోజుల్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్
సాక్షి ప్రతినిధి, విజయవాడ : ‘నగరవాసులను ఇబ్బందులకు గురిచేస్తున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. నెల రోజుల్లో మీరే చూస్తారు.. ఇక్కడ ట్రాఫిక్ పరిస్థితిని ఎలా చక్కదిద్దుతామో. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడం అంటే అక్కడక్కడా కానిస్టేబుళ్లను పెడితే సరిపోదు. ఆధునిక పరిజ్ఞానాన్ని, పద్ధతులను వినియోగించుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది’ అని నగర పోలీస్ కమిషనర్ ఏబీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. నగర కమిషనరేట్ స్థాయి పెంపు, నేరాలకు అడ్డుకట్ట తదితర అంశాలపై మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. సాక్షి : కమిషనరేట్ పరిధి 80 కిలోమీటర్ల మేర పెరిగే అవకాశం ఉందంటున్నారు? సీపీ : ఇప్పటికిప్పుడే దీనిపై వ్యాఖ్యానించడం మంచిది కాదు. ఈ నెలాఖరులోగా రాజధానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అప్పుడు కమిషనరేట్ పరిధి ఎలా ఉండాలి, సిబ్బంది, విధి విధానాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని జీవో ఇస్తుంది. అప్పటి వరకు ఇంతే. ఇప్పటికిప్పుడు విషయాన్ని స్పెక్యులేట్ చేస్తే కొందరికి మంచి జరిగితే, కొందరికి ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంది. సాక్షి : నగరంలో ఆర్థిక నేరాలు పెరిగాయి. పలు చిట్ఫండ్సంస్థల మూసివేతతో రూ.500 కోట్ల మేర ప్రజలు నష్టపోయారు. భవిష్యత్తులో ఇటువంటివి జరగక్కుండా ఏం చేయబోతున్నారు? సీపీ : ఈ విషయంలో మోసపోతున్న వారి బాధ్యత కూడా కొంత ఉంది. ప్రారంభంలో తెలియక రిజిస్టర్ కాని సంస్థల్లో సభ్యులుగా చేరారంటే అర్థం ఉంది. మోసాలు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత కూడా దురాశకుపోయి స్కీములు, చిట్స్‌లో చేరి మోసపోయేవాళ్లకు సాయం చేయమంటే ఎలా? తప్పుడు కంపెనీల్లో పెట్టుబడి పెడితే పోలీసుశాఖ మాత్రం ఏం చేస్తుంది. పోలీసు యంత్రాంగం వీటి పైనే దృష్టిసారిస్తే దౌర్జన్యాలు, దొంగతనాలు, అల్లర్లను అరికట్టేది ఎవరు? సాక్షి : నగర విస్తరణతో పాటు వ్యాపారాలు విస్తరించాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలో భద్రతా పరంగా తీసుకునే చర్యలు ఏంటి? సీపీ : వ్యాపార సముదాయాలకు వచ్చే వారికి భద్రత కలిపించాల్సిన బాధ్యత ఆయా సంస్థల యాజమాన్యాలదే. ఇది ఎస్టాబ్లిష్ చట్టంలోనే ఉంది. ఖచ్చితంగా వారు రక్షణ చర్యలు తీసుకునేలా చూస్తాము. ఇక బహిరంగ ప్రదేశాల్లో పౌరుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. సాక్షి : గొలుసు దొంగతనాలు (చైన్ స్నాచింగ్స్) నిలువరించేందుకు ఏ చర్యలు తీసుకుంటారు? సీపీ : ఇది మాకో ముఖ్యమైన సవాల్, గొలుసు దొంగతనాల్లో విద్యార్థులు, కొందరు యువ కానిస్టేబుళ్ల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలిసింది. ఇంటికి కన్నం వేసి రూ.లక్షలు కాజేసిన దానికంటే ఇది తీవ్రమైన నేరం. ఇలాంటి చోరీలు మహిళలను భయానక స్థితిలోకి నెడతాయి. చైన్ స్నాచింగ్స్‌ను నివారించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతాం. -
ట్రాఫిక్ సమస్యకు ‘షేరింగ్’తో చెక్!
సాక్షి, ముంబై: రోజురోజుకు రోడ్లపైకి వస్తున్న ప్రైవేటు వాహనాల సంఖ్య పెరగడంతో తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ట్రాఫిక్‌ను నియంత్రించలేక పోలీసులు కూడా తలలు పట్టుకుంటున్నారు. వాహనాల సంఖ్య తగ్గితేనే ట్రాఫిక్‌ను నియంత్రించగలమని ట్రాఫిక్ విభాగం తేల్చేయడంతో వాహనాల సంఖ్యను తగ్గించే దిశగా రవాణా విభాగం చర్యలు తీసుకుంటోంది. సొంత కార్లలో ఆఫీసులకు వెళ్లేవారు ప్రజారవాణాను వినియోగించుకునేలా ప్రోత్సహిస్తే వాహనాల సంఖ్య తగ్గే అవకాశముందని భావించిన అధికారులు ఆ దిశగా చర్యలు ప్రారంభించారు. సొంత వాహనాలకు బదులుగా షేర్ ట్యాక్సీలను వినియోగించుకునేలా చేస్తే ఖర్చు తగ్గడంతోపాటు రహదారులపై ట్రాఫిక్ కూడా తగ్గుతుందని భావిస్తున్నారు. ఈ విషయమై ముందుగా అభిప్రాయ సేకరణ జరుపనున్నట్లు రవాణా విభాగా అధికారి ఒకరు తెలిపారు. వ్యాపార సంస్థలు ఎక్కువగా ఉన్న రైల్వే స్టేషన్ల ఆవరణలో షేర్ ట్యాక్సీలను అందుబాటులో ఉంచడం ద్వారా ఒకే ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులంతా ఈ ట్యాక్సీని ఆశ్రయిస్తారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా దూరప్రాంత ప్రయాణికుల కోసం కూడా ఈ సౌకర్యం కల్పించడం ద్వారా ఒకే రూట్లో వెళ్తున్న ట్యాక్సీల రద్దీని కూడా కొంత మేర తగ్గించవచ్చని చెబుతున్నారు. షేర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకు రావడంతో కార్లు ఉన్న వారు కూడా తమ కార్లను ఇంటి వద్దనే ఉంచుతారని, అంతేకాకుండా వీరికి పార్కింగ్ రుసుము చెల్లించే ఖర్చు కూడా తప్పుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా నవీముంబై, ఠాణే తదితర సుదూర ప్రాంతాల నుంచి నగరానికి పనుల నిమిత్తం వచ్చే ఉద్యోగులకు షేర్ ట్యాక్సీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కూడా చెబుతున్నారు. ములుండ్ నుంచి బాంద్రా కుర్లా కాంప్లెక్స్ వరకు, అంధేరి నుంచి చర్చ్‌గేట్ వరకు, బాంద్రా నుంచి పరేల్ వరకు షేర్ ట్యాక్సీలను నడిపితే ప్రయోజనకరంగా ఉంటుందంటున్నారు. దీంతో షేర్ ఆటోల కోసం స్టాండ్లను ఏర్పాటు చేయడానికి స్థలాన్ని గుర్తించాలని రవాణా విభాగం అధికారులు సూచించారు. ఈ సదుపాయం అందుబాటులో ఉన్నట్లు ప్రయాణికులకు తెలపడం కోసం ప్రకటనలు కూడా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. డ్రైవరు పూర్తి వివరాలతోపాటు షేర్ ఆటో చార్జీల వివరాలను ఆటో స్టాండ్లు, వెబ్సైట్లలో పొందుపర్చాలని, దీంతో ప్రయాణికులు కూడా తాము వెళ్లాల్సిన గమ్యస్థానానికి సంబంధించిన ఆటో స్టాండ్‌ను ఆశ్రయిస్తారని చెబుతున్నారు. ఈ వ్యవస్థ అమల్లోకి వస్తే చాలా మంది ఉద్యోగులకు ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఈ విషయమై స్థానిక ఉద్యోగి ఒకరు మాట్లాడుతూ... ఖార్గర్ నుంచి పరేల్ వరకు రోజు ట్యాక్సీలో వెళ్తాను. నాతోపాటు ఈ మార్గంలో వెళ్లే మరికొంతమంది ప్రయాణికులను కూడా డ్రైవర్ ట్యాక్సీలో ఎక్కించుకుంటాడు. అయితే నేను డ్రైవరుకు ఎప్పుడు అడ్డు చెప్పలేదు. నా ఒక్కడినే తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తే అతను అడిగినంత చార్జీ ఇవ్వాల్సి వస్తుంది. అదే మరికొంత మంది ట్యాక్సీలో ఎక్కడం ద్వారా చార్జీని మేమందరం షేర్ చేసుకున్నట్లవుతుంది. ఇప్పటికే కొన్ని మార్గాల్లో షేర్ ట్యాక్సీలు నడుస్తున్నాయ’న్నారు. ఇదిలాఉండగా ఈ ప్రక్రియను తాము కూడా స్వాగతిస్తామని ముంబై ట్యాక్సీమెన్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అల్ క్వాడ్రోస్ తెలిపారు. -
నగరం ‘హై’ఫైగా ఉండాలి
హైదరాబాద్ ట్రాఫిక్‌పై సీఎం సమీక్ష సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఉప మఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు మహేందర్‌రెడ్డి, టి.పద్మారావు, జీహెచ్ఎంసీ, పోలీసు, రవాణా శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ట్రాఫిక్ సమస్యపై సమీక్షించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల భద్రత, వాహనదారులు, పాదచారుల సౌకర్యం, ఆర్టీసీ బస్సుల సేవలు, డంప్‌యార్డులు తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా సమీక్షించారు. పెరుగుతున్న జనాభాకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సిస్టమే పరిష్కారమని ఆయన చెప్పారు. నగరంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలని సూచించారు.అలాగే బస్టాప్‌లను ఆధునికీకరించాల్సి ఉందని, ఎల్సీడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆయన అధికారులను కోరారు. ముంబైలో ప్రభుత్వం ట్రాన్స్‌పోర్టు సిస్టం చాలా బాగా పనిచేస్తోందని మంత్రి మహేందర్‌రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం అక్కడకు వెళ్లి పరిస్థితిని అధ్యయనం చేయాలని కేసీఆర్ సూచించారు.రవాణా, ఆర్టీసీ, జీహెచ్ఎంసీ, పోలీసు శాఖలు పరస్పరం సమన్వయంతో వ్యవహరించాలని, ఇందుకోసం ఓ సమావేశాన్ని కూడా పెట్టుకోవాలని అడ్మిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ) నోడల్ ఏజెన్సీగా పనిచేయాలని కేసీఆర్ సూచించారు. పోలీసు శాఖకు కొత్తగా సమకూరనున్న 1650 ఇన్నోవా వాహనాలు ఆగస్టు నాటికి కంపెనీ నుంచి డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. -
ఇక.. పెయిడ్ పార్కింగ్
నగరంలో ఏర్పాటుకు సన్నాహాలు పోలీస్, బల్దియా ఉన్నతాధికారుల నిర్ణయం రహదారుల వెంట వాహనాలు నిలిపితే బాదుడే... కార్పొరేషన్ :ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ప్రధాన రహదారుల్లో పెయిడ్ పార్కింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని పోలీస్, నగర పాలక సంస్థ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ అంశంపై వరంగల్ నగర పాలక సంస్థ కౌన్సిల్ హాల్లో మంగళవారం బల్దియా కమిషనర్ సువర్ణ పండాదాస్, అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్రావు, ట్రాఫిక్ డీఎస్పీ ప్రభాకర్‌రావు సమీక్షించారు. ఈ సందర్భంగా బల్దియా ఏసీపీలు శిల్ప, శైలజ ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్ సమస్య, అవాంతరాలు, పెయిడ్ పార్కింగ్‌కు అనువైన ప్రాంతాల వివరాలను పవర్ పాయింట్వరంగల్ చౌరస్తా నుంచి పోచమ్మమైదాన్ వరకు ఐదు ప్రాంతాల్లో రెండు కారు పార్కింగ్ సెంటర్లు... మూడు ద్విచక్ర వాహనాల పార్కింగ్ సెంటర్లు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అవాంతరాలను గూగుల్ మ్యాపులో అనుసంధానం చేసినట్లు తెలిపారు. ప్రధాన రహదారుల్లో ఉన్న ఆక్రమణలను తొలగించాల్సి ఉందని వివరించారు. చిరువ్యాపారులు, డబ్బాలను అక్కడి నుంచి తరలించాల్సి ఉందని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై చర్చించారు. తదుపరి పెయిడ్ పార్కింగ్ విధానం అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 100 నుంచి 150 వాహనాలు పార్కింగ్ చేసే విధంగా వీటిని రూపకల్పన చేయనున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు గుర్తించిన పెయిడ్ పార్కింగ్ సెంటర్ల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను మరోమారు పరిశీలించాలని నిర్ణయించారు. గతంలో రెండుమార్లు పెయిడ్ పార్కింగ్ సెంటర్ల నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. తీరా టెండర్లు పిలిచాక ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో వాటిని రద్దు చేశారు. ఈ దఫా బల్దియా, పోలీస్ అధికారులు పెయిడ్ పార్కింగ్ సెంటర్ల నిర్వహణ ఎలా చేపడతారో చూడాలి మరి. వాహనదారులకు భారమే.. నగరంలో వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. వాణిజ్య సంస్థల ఎదుట వాహనదారుల కష్టాలు చెప్పలేని విధంగా ఉన్నాయి. ఒకవైపు సెల్లార్లను వ్యాపార సంస్థలకు వాడేస్తున్నారు. మరోవైపు షాపుల ఎదుట దురాక్రమణకు పాల్పడుతున్నారు. దీంతో షాపుల ఎదుట వాహనాలను నిలపడం ఇబ్బందిగా మారింది. 2009 సంవత్సరంలో అప్పటి జాయింట్ కలెక్టర్, బల్దియా ఇన్చార్జ్ కమిషనర్ వాకాటి కరుణ పెయిడ్ పార్కింగ్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేపట్టారు. పార్కింగ్ స్థలాలు వద్దంటూ అప్పటి పాలకవర్గం, ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. 2013లో అప్పటి కమిషనర్ వివేక్‌యాదవ్ పెయిడ్ పార్కింగ్ కోసం మార్కింగ్ చేయించి, నిర్వహణ కోసం టెండర్లు పిలిచారు. వివిధ ప్రజా సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో వాటిని పక్కన పెట్టారు. వాహనాల సంఖ్య నానాటికి పెరుగుతున్నందున వాణిజ్య సముదాయాలు కలిగిన రోడ్లలో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారుతుంది. దీంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ తాజాగా 15 రోజుల నుంచి పార్కింగ్ స్థలాలను గుర్తించేందుకు బల్దియా టౌన్ ప్లానింగ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. బల్దియా కమిషనర్ సువర్ణదాస్ పండా, అర్బన్ ఎస్పీ పెయిడ్ పార్కింగ్ నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇక పెయిడ్ పార్కింగ్ సెంటర్ల ఏర్పాటు కానున్నాయి. ఇక మీదట బండి పెడితే తప్పనిసరిగా పైసలు చెల్లించాల్సి ఉంది. బల్దియాలో జరిగిన సమావేశంలో , బల్దియా సీపీ రమేష్‌బాబు, డీసీపీ భాగ్యవతి, ఏసీపీలు రాజేశ్వర్‌రావు, రవి, శైలజ, శిల్ప, టీపీఓ మహేందర్, సీఐలు పాల్గొన్నారు. పార్కింగ్ సెంటర్లు ఇవే... ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్ నుంచి బట్టలబజార్ మీదుగా పాపయ్యపేట చమన్ వరకు ఒక కారు, రెండు ద్విచక్ర .. బట్టలబజార్ నుంచి ఎంజీఎం వరకు ఒక ద్విచక్ర వాహన పార్కింగ్ సెంటర్ హన్మకొండ చౌరస్తా నుంచి పద్మాక్ష్మి రోడ్డులోని హనుమాన్ ఆలయం వరకు మూడు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు, ఒక చోట కారు పార్కింగ్ సెంటర్ హన్మకొండలోని డీసీసీ భవన్ నుంచి ఆర్టీసీ బస్ స్టేషన్ వరకు రెండు ప్రాంతాల చొప్పున ద్విచక్ర వాహన, కారు పార్కింగ్ సెంటర్లు. అశోక థియేటర్ ఎదుట మల్టీలెవల్ పార్కింగ్ సెంటర్ -
వానొస్తే.. మునకే!
గ్రేటర్లో భారీగా పెరిగిన వాటర్ లాగింగ్స్ ఏటా ఇదే సీన్.. పట్టించుకోని జీహెచ్ఎంసీ ఖర్చు కోట్లల్లో.. పరిష్కారం శూన్యం ఎవరైనా ఏమైనా సమస్యలు తలెత్తితే దశలవారీగా పరిష్కరించుకుంటారు. దాంతో ఇబ్బందులు ఒక్కొక్కటీ తీరి తెరిపిన పడతారు. కానీ ఘనత వహించిన జీహెచ్ఎంసీ అధికారులు సమస్యను గుర్తించినా దానిని పరిష్కరించకపోగా.. మరిన్ని సమస్యల్ని దానికి జతచేస్తారు. అందుకు నగరంలో వానొస్తే రోడ్లపై నీళ్లు నిలిచిపోయే ప్రాంతాలే (వాటర్ లాగింగ్ పాయింట్లు) ఉదాహరణ. ఉదాహరణకు గతేడాది నీళ్లు నిలిచిపోతున్న రోడ్లుగా 185 పాయింట్లను గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటికి ఇవి 284కి చేరాయి. అంటే దాదాపు మరో వందకు పెరిగాయి. అధికారులు సమస్య పరిష్కారంలో చూపుతున్న ‘శ్రద్ధ’కు ఇది నిదర్శనం. కానీ వీటి మరమ్మతుల పేరిట రూ.కోట్లు ఖర్చు చేస్తున్నట్టు రికార్డులు మాత్రం ఘనంగా చూపుతున్నారు. సిటీబ్యూరో: సాధారణ వర్షాలొచ్చినా నగరంలో వాటర్ లాగింగ్ పాయింట్లు పెరుగుతూ పోతున్నాయే తప్ప తగ్గడం లేదు. ఇందుకు కారణం సమస్య శాశ్వత పరిష్కారానికి అధికారులు శ్రద్ధ చూపకపోడం. ప్రతిసారీ వర్షాకాలానికి ముందే పనులు చేస్తామని ప్రకటించడం.. వర్షాలు మొదలయ్యేంతదాకా పనులు పూర్తి చేయకపోవడం.. ఆ పనుల పేరిట నిధులు మాత్రం ఖర్చయిపోవడం పరిపాటిగా మారింది. దీంతో వర్షాలొచ్చిన ప్రతిసారి నగరంలో ఎక్కడికక్కడ చెరువులుగా మారడం.. ట్రాఫిక్ సమస్యలతో జనం సతమతమవడం షరామామూలుగా మారింది. ఎప్పటికప్పుడు తాత్కాలిక చర్యలతో పైపై పూతలతో మమ అనిపిస్తుండటంతో ఈ దుస్థితి దాపురించింది. శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో ఒక లాగింగ్ పాయింట్ సమస్యను పరిష్కరిస్తే.. అక్కడ నిలువ ఉండే నీరు వేరే ప్రాంతాల్లో చేరి అక్కడ కొత్తగా లాగింగ్ పాయింట్లు వస్తున్నాయి. జీహెచ్ఎంసీ వద్ద ఏదీ సమాచారం? ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి జీహెచ్ఎంసీ అధికారుల వద్ద తగిన ప్రణాళిక లేదా.. ? అంటే లేదనే సమాధానం వస్తుంది. నగరంలో ఏ రోడ్ల కింద ఎన్ని నాలాలున్నాయి.. ఏ రోడ్డు కింద ఏ గండం పొంచి ఉంది.. ఏ చెరువులు ఎంత మేర కబ్జా అయ్యాయి.. ఎక్కడెన్ని పైప్లైన్లున్నాయి.. డ్రైనేజీ లైన్లు ఎక్కడున్నాయి.. ఏ నీరు ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్తుంది.. సివరేజి నీరు ఏయే ప్రాంతాల్లో వరదనీటి కాలువల్లో కలుస్తోంది.. అందుకు కారణాలేమిటి.. ఇత్యాది సమాచారమేదీ జీహెచ్ఎంసీ వద్ద లేదు. గ్రేటర్లో ఏ రహదారి పరిస్థితి ఏమిటో, ఏ ఫ్లై ఓవర్‌కు పొంచి ఉన్న ప్రమాదమెంతో, ఏ శిథిల భవనం ముప్పు ఎంతో తెలుసుకొని ప్రమాదాల్ని నివారించాలనే ధ్యాస అసలే లేదు. నాలాలు, పైపులైన్లు, రహదారులకు సంబంధించిన డేటేబేస్ అంటూ జీహెచ్ఎంసీ వద్ద లేదు. ఆస్తిపన్ను వసూళ్లు, డస్ట్బిన్ల నుంచి చెత్త తొలగింపు, అక్రమ నిర్మాణాల గుర్తింపు వంటి పనులకు ఐటీని వినియోగించుకోవడంలో ముందంజలో ఉన్న జీహెచ్ఎంసీ ఏ రోడ్డు పరిస్థితి ఏమిటో చెప్పగలిగే స్థితిలో లేదు. ఎన్ని నాలాలు అన్ కవర్డ్(రోడ్లు, బ్రిడ్జిలకింద)గా ఉన్నాయో అంచనాలు తప్ప సరైన లెక్కల్లేవు. ఏ రోడ్డుకింది నాలా ఏ సంవత్సరంలో నిర్మించారో తెలియదు. వాటి జీవితకాలమెంతో తెలియదు. రహదారులు చెరువులైనప్పుడో, రోడ్లు కుంగినప్పుడో తప్ప నాలాల స్థితిగతుల గురించి కానీ, వాటి మరమ్మతుల గురించి కానీ పట్టించుకోవడం లేరు. ఏ నాలాకు ఎప్పుడు మరమ్మతులు చేశారో కూడా జీహెచ్ఎంసీ వద్ద వివరాల్లేవు. ఆ మాటకొస్తే రో రోడ్డు కింద ఎన్ని నాలాలున్నాయో తెలియదు. రోడ్ల కింద దాదాపు ఎన్ని నాలాలు.. ఎంత దూరం మేర ఉన్నాయో ఉజ్జాయింపుగా చెబుతున్నారు తప్ప డేటాబేస్ లేదు. దీంతో, ఏ నాలాలకు ఎప్పుడు వురవ్ముతులవసరమో చెప్పగలిగే వ్యవస్థ లేదు. -
నర్సీపట్నం చుట్టూ రింగు రోడ్డు
పంచాయతీరాజ్ మంత్రి అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం టౌన్: నర్సీపట్నం చుట్టూ రింగ్ రోడ్డును నిర్మించనున్నట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఆయన శనివారం విలేకర్లతో మాట్లాడుతూ రింగురోడ్డు ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా విభాగం కింద 912 పంచాయతీల్లో 17 వేల 634 బోర్లు, 2,567 మంచినీటి పథకాలున్నాయన్నారు. వీటిలో పనిచేస్తున్నవి ఎన్ని, పని చేయనివి ఎన్ని తదితర వివరాలపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. వారిచ్చే నివేదిక ఆధారంగా పని చేయని వాటిని వినియోగంలోకి తీసుకొస్తామని తెలిపారు. జిల్లాలో విద్యకు ప్రాధాన్యం ఇచ్చేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. జిల్లాలో 247 ఉన్నత, 304 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయన్నారు. వీటిలో తాగునీరు, ఫ్లోరింగ్, మరుగుదొడ్ల సౌకర్యాలకు చర్యలు చేపట్టామన్నారు. పీఎంజీఎస్‌వై పథకం ద్వారా గిరిజన గ్రామాల్లో తారురోడ్ల నిర్మాణానికి గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ.201 కోట్లతో చేపట్టాల్సిన 62 పనులు అప్పటి గిరిజన సంక్షేమశాఖ మంత్రి బాలరాజు నిర్వాకంతో నిరుపయోగమైనట్టు తెలిపారు. వారం రోజుల్లో పాడేరులో అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. ఉపాధి పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో రూ.1500 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఇన్నీ నిధులు ఖర్చు చేసినా శాశ్వత పనులు కానరాలేదన్నారు. ఇకపై కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు శాశ్వత పనులకు ప్రాధాన్యమిస్తామన్నారు. ఈ పనుల్లో రూ.3 కోట్ల 72 లక్షల అవినీతి జరిగిందని అధికారులు చెబుతున్నా వాస్తవం కాదన్నారు. జరిగిన పనుల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించి చర్యలు తీసుకుంటామన్నారు. అవినీతి రుజువైతే సోషల్ అడిట్ అధికారులు కూడా తప్పు చేసినట్టవుతుందన్నారు. వాస్తవంగా ఉపాధి పనులకు వెళ్లే వారి సంఖ్య కంటే తప్పుడు మస్తర్లు వేస్తున్నారన్నారు. అమలాపురం పంచాయతీలో జీడిపిక్కల కర్మాగారానికి వెళ్లే మహిళలు పేరున మస్తర్లు వేశారన్నారు. వెంటనే ఆ వీఆర్పీని విధుల నుంచి తొలగించాలని పీడీని ఆదేశించినట్టు పేర్కొన్నారు. ఉపాధిలో అక్రమాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. ఆదర్శ రైతుల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు తెలిపారు. ప్రస్తుత మార్కెట్ కమిటీ, దేవాలయాల కమిటీలను రద్దు చేసి కొత్తవాటిని త్వరలో ఏర్పాటు చేస్తామన్నారు. సమర్థులను వాటిలో నియమించనున్నట్టు తెలిపారు. -
పేరుకే మార్కెట్ రోడ్డుపైనే బీట్
జహీరాబాద్ టౌన్, న్యూస్‌లైన్: జహీరాబాద్ పట్టణంలో నిర్మించిన పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. నిర్మాణం పనులు పూర్తయి నాలుగు సంవత్సరాలవుతున్నా దుకాణాలు వినియోగంలోకి రావడంలేదు. లక్షలు ఖర్చుచేసి నిర్మించిన దుకాణాల షెటర్లు దెబ్బతింటున్నాయి. పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవానికి నోచుకోకపోవడంతో వ్యాపారం రోడ్లపైనే సాగుతోంది. దీంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామిడి పండ్ల సీజన్ కావడంతో రహదారిపైనే బీట్లు జరుగుతున్నాయి. జహీరాబాద్ పట్టణంలోని పశువుల సంత ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో 2009లో పండ్ల మార్కెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు రూ.28 లక్షలు మంజూరు కాగా అప్పటి మార్కెట్ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే గీతారెడ్డి శంకుస్థాపన చేశారు. వ్యాపారుల కోసం 23 దుకాణాలను నిర్మించారు. సిమెంట్ రోడ్డు వేసి విద్యుత్ దీపాలు అమర్చారు. పండ్ల మార్కెట్ యార్డుకు గేటు నిర్మించారు. పనులు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా దుకాణాలను వ్యాపారులకు కేటాయించడం లేదు. పశువుల పంత పక్కనే పండ్ల మార్కెట్ సముదాయం ఉండడంతో పశువులపాకగా మారిం ది. వ్యాపారులు కొనుగోలు చేసిన పశువులను ఇక్కడే కట్టేస్తున్నారు.దీంతో చెత్తాచెదారం,పశువుల పేడ పేరుకపోయి ఆధ్వానంగా మారింది. పశువుల వ్యాపారులు,రైతులు దుకాణాల్లో ఉంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు దుకాణాల షెటర్లను ధ్వంసం చేస్తున్నారు. చుట్టూ ప్రహరీ కూడా దెబ్బతిం టోంది. ఇప్పుటికైనా సంబంధిత శాఖ అధికారులు చొరవ తీసుకొని పండ్ల మార్కెట్‌ను ప్రారంభించి వినియోగంలోనికి తేవాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డుపైనే మామిడి పండ్ల బీట్లు ప్రస్తుతం మామిడి పండ్ల సీజన్ నడుస్తోంది. జహీరాబాద్ ప్రాంతంలో పండిన మామిడి పండ్ల బీట్లు జరుగుతున్నాయి. పండ్ల మార్కెట్ ప్రారంభోత్సవంలో జాప్యం కారణంగా రోడ్లపై అమ్మకాలు చేపడుతున్నారు. తెల్లవారుజాము నుంచి పెద్ద మొత్తంలో పట్టణానికి పండ్లురావడం..అక్కడే బీట్లు జరగడంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతోంది. -
సమస్యల గూడెం
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్ : జిల్లాలో వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధ చెందిన తాడేపల్లిగూడెం సమస్యల నిలయంగా మారింది. పట్టణంలో ట్రాఫిక్ సమస్య నిత్యకృత్యమైంది. పూర్తికాని భూగర్భ డ్రెయినేజీ పనులు.. శివారు ప్రాంతాల్లో తాగునీటి సమస్య వేధిస్తున్నాయి. రెండో వేసవి జలాశయం, రెండో వంతెనకు అప్రోచ్ రోడ్ల నిర్మాణం కలగా మారింది. నవాబుపాలెంలో వంతెన నిర్మాణం మూడేళ్లుగా సాగుతోంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిధులు జల్లు కురిపించారు. 2004 నుంచి 2009 వరకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు తీయగా వైఎస్ మరణానంతరం పనులు నత్తనడకన సాగుతున్నాయి. మళ్లీ వైఎస్ లాంటి నాయకుడు వస్తేనే నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుంటుందని ఇక్కడి ప్రజలు భావిస్తున్నారు. పాలిటెక్నిక్ భవన నిర్మాణమెప్పుడో.. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు పాలిటెక్నిక్ విద్యను చేరువ చేసే కార్యక్రమంలో భాగంగా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం సమీపంలో కొంత భూమిని ప్రభుత్వ పాలిటెక్నిక్ భవన నిర్మాణం కోసం కేటాయించారు. ఇక్కడి మాజీ ప్రజాప్రతినిధి ప్రతిపాదించిన స్థలంలో భవన నిర్మాణానికి ఇష్టంలేని మరో ప్రజాప్రతినిధి మరో ప్రాంతంలో నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపారు. కాలం గడుస్తున్నా భవన నిర్మాణం ఊసులేదు. ప్రస్తుతం పెంటపాడు డీఆర్ గోయంకా కళాశాలలోని ఓ శిథిల భవనంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల కొనసాగుతోంది. జూనియర్ కళాశాలకు భవనం లేదు విద్యాపరంగా ఎంతో విస్తరించిన తాడేపల్లిగూడెంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సొంత భవనం లేదు. పదేళ్ల కాలంగా ఇదిగో జూనియర్ కళాశాలకు పక్కా భవనం అంటూ ఊరింపే కాని, ఉద్దరింపులేదు. కళాశాల నిర్మాణం కోసం పలుచోట్ల వేసిన శిలాఫలకాలు అలానే ఉండిపోయాయి. ఫలితంగా జెడ్పీ హైస్కూల్లోనే విద్యార్థులు ఇంటర్మీడియెట్ చదువులు కొనసాగిస్తున్నారు. దాహం కేకలు తాడేపల్లిగూడెంలో రెండో వేసవి జలాశయం ఎపిసోడ్ ఎంతకు కొలిక్కిరాకపోవడంతో శివారు ప్రాంతాలలో దాహం కేకలు వినిపిస్తున్నాయి. పెంటపాడు మండలం జట్లపాలెంలో ఇది నిత్యనూతనమై పోయింది. గతేడాది మార్చిలో రూ.30 లక్షలతో చెరువు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అయితే పనులు ముందుకుసాగడంలేదు. జట్లపాలెం చెరువు నిండా గుర్రపుడెక్కతో నిండిపోయింది. గూడు కల్పిస్తే ఒట్టు తాడేపల్లిగూడెంలో ఇళ్లులేని పేదలు పదివేలకు పైగా ఉన్నారు. 2009 సార్వత్రిక ఎన్నికల ముందు వీరి కోసం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రాజీవ్ గృహకల్ప వద్ద 52 ఎకరాల భూమిని కేటాయించారు. భూమి పూడికకు నిధులు విడుదల చేశారు. అయితే మహానేత మరణానంతరం ఈ విషయాన్ని పట్టించుకున్న నాథుడే లేరు. ఇదే ప్రాంతం సమీపంలో 2009లో 20 వార్డులలో అర్హులైన 480 మంది పేదలకు ఇళ్లు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వీటిలో 2013 నాటికి 240 ఇళ్లు కట్టి ఇవ్వగలిగారు. వాటిని ఆర్భాటంగా అప్పటి సీఎం కిరణ్ ప్రారంభోత్సవం చేశారు. అయితే ఇక్కడ మౌలిక వసతుల సమస్య ఉంది. 2007లో 280 మంది పేదలకు వైఎస్ హయాంలో కట్టించి ఇచ్చిన రాజీవ్ గృహకల్పలో సౌకర్యాల సంగతిని నేతలు విస్మరించారు. అబ్బో...అక్విడెక్టు నందమూరు పాత అక్విడెక్టు సమస్య ఏళ్ల తరబడి అలానే ఉంది. ప్రతిఏటా ఎర్రకాలువ వేలాది ఎకరాలను మింగేస్తున్నా సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేసిన దాఖలాలు లేవు. మహానేత వైఎస్ రా జశేఖరరెడ్డి హయాంలో స మస్య పరిష్కారానికి న్యా యపరమైన అభ్యంతరాలు తొలిగాయి. ఆ యన మరణానంతరం వీటిని పట్టించు కున్నది లేదు. -
పాతికేళ్లలో కుప్పానికి ఏంచేశారు?
బాబు తీరుపై ప్రజల ఆగ్రహం తప్పని నీటి కష్టాలు ట్రాఫిక్ సమస్య యథాతథం కుప్పంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా లేదు ‘కుప్పం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాష్ట్రానికి తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నారు. పది సంవత్సరాలు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అంతకు ముందు ఆర్థిక, రెవెన్యూ శాఖ మంత్రిగా పని చేశారు. కనీసం తాగునీటి కష్టం తీర్చలేకపోయారు. పిల్లలు చదువుకునేందుకు డిగ్రీ కాలేజీ లేదు. ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. ఎందుకు నీకు ఓటేయాలి బాబూ’ అంటూ కుప్పం ప్రజలు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుప్పం నుంచి ఎంపికవుతూ పాతికేళ్ల కాలంలో చంద్రబాబు అనేక ఉన్నత శిఖరాలు అధిరోహించారు తప్ప, తమను మాత్రం సరిగా పట్టించుకోలేదని కుప్పం మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవీ సమస్యలు సాగు, తాగునీటికి శాశ్వత సౌకర్యం కల్పించలేదు. నియోజకవర్గంలో చిన్నపాటి నీటి ప్రాజెక్టును కూడా నిర్మించలేదు. పాలారు ప్రాజెక్టు నిర్మాణం అప్పట్లో చేపట్టి ఉంటే ఇప్పుడు కుప్పం ప్రాంతంలో నీటి కొరత ఉండేది కాదు. ఇంటర్ విద్య వరకే కుప్పంలో అవకాశం ఉంది. కనీసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడా లేదు. రాతి పనిచేసేవారు అధికంగా ఉన్న కుప్పం ప్రాంతంలో కార్మికులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. సువూరు 8 వేల వుంది నిత్యం బెంగళూరు పట్టణానికి కూలి పనుల కోసం రాకపోకలు సాగిస్తున్నారు. పారిశ్రామిక వాడకు శంకుస్థాపన చేశారే గానీ, ఒక్క పరిశ్రవును కూడా తీసుకురాలేదు. కుప్పంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయినా ట్రాఫిక్ సవుస్య తీరలేదు. పట్టణంలోని ఆర్ఎస్ పేట, కొత్తపేటలకు అనుసంధానంగా ఉన్న రైల్వే గేట్‌ను వుూసివేయూలని రైల్వే అధికారులు ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇదే జరిగితే పట్టణం రెండు భాగాలై, కొత్తపేట వాసులతో పాటు అటువైపు ఉన్న గ్రావూల ప్రజలు వ్యాపార, రాకపోకలకు ఇబ్బంది పడాల్సిందే. అండర్ బ్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్ పదేళ్లుగా ప్రతిపాదనలకే పరిమితమైంది. నియోజకవర్గ పరిధిలోని రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. వీటికి వురవ్ము తులు చేసిన దాఖలాలు లేవు. జాతీయు రహదారి వురవ్ముతుల కోసం అధికారులు రూ.42 కోట్లతో పంపిన ప్రతిపాదనలు బుట్టదాఖలయ్యాయి. వుుందుచూపు లేకపోవడంతో రూ.కోటి వ్యయంతో నిర్మించిన కొత్తపేటలోని కాంప్లెక్స్ నిరుపయోగంగా వూరింది. రైల్వేగేట్ వుూసివేతకు గురైతే ఈ కాంప్లెక్స్‌లో గదులు అద్దెకు అడిగే వారుండరు. స్పోర్ట్స్ స్టేడియుం, వూర్కెట్ యూర్డు, గార్మెంట్స్ పరిశ్రవుల నిర్మాణం శిలాఫలకాలకే పరిమితమైంది. రూ.కోట్లతో నిర్మించిన వాటర్ ప్లాంట్ పట్టణ ప్రజల దాహార్తిని తీర్చడం లేదు. ప్రత్యావ్నూయు ఏర్పాట్లూ చేయలేదు. తాగునీరు ఇస్తున్న సాయిబాబా ట్రస్ట్ కుప్పం నియోజకవర్గంలోని ప్రతి గ్రావుంలోనూ పుట్టిపర్తి సారుుబాబా ట్రస్టు ఆధ్వర్యంలో వుంచినీటి ట్యాంకుల నిర్మాణం జరిగింది. ఈ ట్యాంకుల ద్వారానే ప్రస్తుతం ప్రజలకు తాగునీరు అందుతోంది. సాయిబాబా ట్రాస్ట్ వారికి ఉన్న మనస్సు కూడా ఆ నియోజకవర్గాన్ని పాలించే పాలకుడికి లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశం. తమను పట్టించుకోకున్నా ఇన్నేళ్లుగా ఓట్లు వేస్తున్న ప్రజలు, ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం ఆసన్నమయింది. -
రవాణాపై ‘మహా’ కసరత్తు
నిధుల సముపార్జనపై ఉన్నతస్థాయి సమీక్ష అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫండ్‌పై కసరత్తు ఆర్థిక ఆసరా కోసం హెచ్ఎండీఏ ఆరాటం సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నానాటికీ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి ప్రజా రవాణాను మెరుగుపర్చేందుకు సమగ్ర రవాణా వ్యవస్థను అమలు చేయాలని ెహ చ్‌ఎండీఏ యోచిస్తోంది. ఇందుకు అవసరమయ్యే నిధులను ఎలా సమకూర్చుకోవాలనే దానిపై కార్యచరణ ప్రణాళిక (యాక్షన్ ప్లాన్)ను రూపొందించేందుకు నడుం బిగించింది. ఈ విషయమై ఉన్నతస్థాయి అధికారులు గడచిన 3 రోజుల పాటు ప్రత్యేకంగా సమావేశమై సమీక్షించారు. నగరంలో ఆధునిక సమగ్ర రవాణా వ్యవస్థను అమల్లోకి తేవాలంటే అందుబాటులో ఉన్న ఆర్థిక వనరులను వినియోగించుకోవాలని ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా నిధుల సమస్య ఎదురవ్వకుండా ప్రత్యేకంగా ‘అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫండ్’ను ఏర్పాటు చేయాలని సమావేశం అభిప్రాయపడింది. రవాణా వ్యవస్థ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధుల్లేకుండా ముందుకె ళ్లడం అసాధ్యమని, విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇందుకోసం ఓ అకౌంట్‌ను తెరవాలని నిర్ణయించింది. ముఖ్యంగా రవాణా పన్ను, అభివృద్ధి ఆధారిత పన్నుల ద్వారా అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫండ్‌ను సముపార్జించుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. బెంగళూరులో రవాణా పన్ను కింద రూ.1 వసూలు చేయడం ద్వారా రూ.300కోట్ల నిధి తయారైందని, దీని ఆధారంగా అక్కడ మెట్రోరైల్ ఏర్పాటైందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ స్కీంల కింద ఆర్థిక ఆసరా ఇస్తే మెరుగైన వ్యవస్థను రూపొందించేందుకు అవకాశం ఉంటుంది, అలా వీలుగాని పక్షంలో పీపీపీ విధానం ద్వారానైనా వివిధ అభివృద్ధి పనులు చేపట్టి నగరంలో సమగ్ర రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. ప్రజా భాగస్వామ్యంతో అంటే... స్వల్పంగా రవాణా పన్ను వసూలు చేయడం ద్వారా కొంతమేర నిధులు సముపార్జించుకొని, వీటి ఆధారంగా విదేశీ ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అలాగే పెట్రోల్, డీజిల్ విక్రయ కేంద్రాల నుంచి కూడా నిర్ణీత సెస్స్ వసూలు చేయాలని నిర్ణయించారు. ఖర్చు ఎక్కువ... నగరంలో సమగ్ర రవాణా వ్యవస్థను ఏర్పాటుకు ఖర్చు ఎక్కువ... ఆదాయం తక్కువ కావడం హెచ్ఎండీఏను ఆందోళనలో పడేసింది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడంతో ‘ఉమ్టా’లో తీసుకొన్న ఏ నిర్ణయం కూడా అమలుకు నోచుకోకుండా పోతోంది. ప్రభుత్వంలోని 16 విభాగాలు క్రమం తప్పకుండా ఉమ్టా సమావేశంలో పాల్గొంటున్నా... నిధుల విషయానికొచ్చే సరికి దేనికవే వెనుకంజ వేస్తుండటంతో సమగ్ర రవాణా వ్యవస్థ ఫైళ్లకే పరిమితమైంది. ప్రజాధనాన్ని ఏ నగరంలో ఖర్చు చేస్తే దానివల్ల వచ్చే ఆదాయాన్ని కూడా ఆ నగరంలోనే ఖర్చు చేయాలి. హైదరాబాద్ నగరంలో అలా చేయకపోవడంతో అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల కొరత ఎదురవుతోంది. వాస్తవానికి మౌలిక సౌకర్యాలకు సంబంధించి ప్రభుత్వం కోటి రూపాయలు ఖర్చు చేస్తే... దీని ఆధారంగా రాజకీయ నేతలు, కాంట్రాక్టర్లు వందల కోట్ల రూపాయలు సంపాదించుకొంటున్నారు. ఉదాహరణకు ప్రభుత్వం రూ.7వేల కోట్ల వ్యయంతో ఔటర్ రింగ్‌రోడ్డును నిర్మిస్తే దానిచుట్టూ భూములకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీనివల్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోట్ల రూపాయల్లో జరగగా, ప్రభుత్వానికి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం వచ్చింది. ఈ ఆదాయం అంతా ప్రభుత్వ ఖజానాకు చేరటంతో నగరాభివృద్ధికి నిధులలేమి ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజా రవాణాకు నగరంలో ఆధునిక వ్యవస్థ అందుబాటులోకి తేవాలంటే ప్రత్యేకంగా‘అర్బన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఫండ్’ను ఏర్పాటు చేయడం తప్పని సరి అని హెచ్ఎండీఏ భావిస్తోంది. గ్రేటర్‌తో పాటు హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో సమగ్ర రవాణా వ్యవస్థపై అధ్యయనం జరిపిన లీ అసోసియేట్స్ సౌత్ ఏసియా ప్రైవేట్ లిమిటెడ్ (లాసా) సంస్థ రూపొందించిన నివేదికపై ఇటీవల ప్రజాభిప్రాయాలు సేకరించిన హెచ్ఎండీఏ ఇక నిధుల సముపార్జనకు కార్య ప్రణాళిక (యాక్షన్ ప్లాన్)పై దృష్టి సారించింది. -
ఆకాశవీధిలో...
మన రూట్లోనే అన్ని మెట్రోలు =పూర్తిస్థాయి తొలి ఎలివేటెడ్ మెట్రో మనదే =కొచ్చి, నవీ ముంబైలకు హైదరాబాద్ ఆదర్శం =అంతర్జాతీయ ప్రమాణాలతో హెచ్ఎంఆర్ నిర్మాణ పనులు =ఢిల్లీ కాకుండా మరో ఏడు నగరాల్లో మెట్రోల నిర్మాణం =బెంగళూరు, చెన్నై, ముంబై, జైపూర్లలో భూగర్భ నిర్మాణాలు =భవిష్యత్‌కు ఎలివేటెడే బెటర్ అంటున్న నిపుణులు సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కనిపిస్తున్న ఏకైక సమాధానం మెట్రోరైలు. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు దీని వైపే చూస్తున్నాయి. ప్రస్తుతం అధునాతన మెట్రోరైలు ఢిల్లీ నగరంలో పూర్తిస్థాయిలో సేవలందిస్తుండగా.. మరో ఏడు నగరాల్లో మెట్రోరైలు నిర్మాణపు పనులు చురుగ్గా సాగుతున్నాయి. వీటిలో రూ. 14వేల కోట్ల అంచనా వ్యయంతో నగర ంలోని మూడు లేన్లలో 72 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో ప్రత్యేకత సంతరించుకుంది. మిగతా మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్‌కున్న స్పెషాలిటీ ఏంటంటే పూర్తిస్థాయి ఎలివేటెడ్ (ఆకాశమార్గం) కావడం. ఇది భూగర్భ మెట్రోలతో పోలిస్తే తక్కువ ఖర్చుతో, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ప్రాజెక్టుగా నిపుణులు పేర్కొంటున్నారు. హైదరాబాద్ మెట్రో ఇతర రాష్ట్రాల్లో చేపడుతున్న మెట్రో ప్రాజెక్టులకు ఆదర్శంగా నిలవడమే గాక.. భవిష్యత్ ప్రతిపాదిత ప్రాజెక్టులూ ఇదే మార్గాన్ని అనుసరించడానికి కారణమైందని చెప్పవచ్చు. పూర్తిస్థాయి తొలి ఆకాశమార్గ మెట్రో మనదే దేశంలో మెట్రోరైలు స్వాతంత్య్రానికి ముందే కోల్‌కతా, చెన్నై నగరాల్లో భూగర్భ మార్గాన ఉంది. ఢిల్లీలో తలెత్తిన ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి 2002లో మెట్రో రైలు ప్రాజెక్టుకు అంకురార్పణ జరిగింది. తొలి ఆకాశ మార్గ(ఎలివేటెడ్) మెట్రో రైలు ఇక్కడే మొదలైంది. అయితే అది పాక్షికమే. తొలిదశలో ఢిల్లీలో 65.11 కిలోమీటర్ల మెట్రో మార్గం రూపొందించగా, అందులో 13 కిలోమీటర్లు భూగర్భ మార్గమే. ఢిల్లీ తరువాత 2005 నుంచే హైదరాబాద్‌లో మెట్రోరైలు ప్రతిపాదనలు ఊపందుకున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి దివంగత వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో మెట్రోరైలుకు హైదరాబాద్ నగ ర పాలక సంస్థ అదనపు కమిషనర్‌గా ఉన్న ప్రస్తుత మెట్రోరైలు ఎండీ ఎన్.వి.ఎస్. రెడ్డి ప్రాజెక్టును రూపొందించారు. నగరంలో నెలకొన్న పరిస్థితులు, భూగర్భ మార్గాన వెళితే ఎదురయ్యే కష్టనష్టాలు అధ్యయనం చేసిన ఆయన పూర్తిస్థాయి ఎలివేటెడ్ రైలుకు రూపకల్పన చేశారు. మూడు రూట్లలో 2006లో రూపొందించిన ప్రణాళిక కొన్ని తాత్కాలిక ఇబ్బందులు ఎదుర్కొన్నా... 2010 నుంచి ఆకాశమార్గానికి అంకురార్పణ చేసింది. దీంతో దేశంలో పూర్తిగా ఆకాశమార్గాన రూపకల్పన చేసిన తొలి ప్రాజెక్టు మనదే అయింది. భూగర్భ మార్గాలు ఇవే... ఢిల్లీతో పాటు బెంగళూరు, చెన్నై, జైపూర్, ముంబైలలో నిర్మిస్తున్న మెట్రోలు ఎలివేటెడ్‌తో పాటు భూగర్భ మార్గాలుగా రూపొందుతున్నాయి. తద్వారా నిర్మాణ పనుల్లో ఆలస్యంతో పాటు ఆర్థికంగా అధిక భారం పడుతోంది. బెంగళూరులో విధానసభ ముందు నిర్మిస్తున్న భూగర్భ మార్గం అంబేద్కర్ విగ్రహం తరలించే విషయంలో ఏర్పడ్డ వివాదం సందర్భంగా 9 నెలలుగా పనులు ఆగిపోయాయి. ముంబై, చెన్నై, బెంగళూరులలో ‘ఎలివేటెడ్’కు ఉన్నంత వేగం భూగర్భ మార్గానికి లేదు. ఈ పరిస్థితుల్లో అందరి దృష్టి ఎలివేటెడ్ మెట్రో మార్గాల పైనే పడుతోంది. భూగర్భ మార్గంలో కష్టాలెన్నో... నిరంతరం ట్రాఫిక్‌తో నిండిపోయే రోడ్లను తవ్వి భూగర్భ మెట్రోలను రూపకల్పన చేయడం కష్టసాధ్యమైన పనిగా నిపుణులు పేర్కొంటున్నారు. ఎలివేటెడ్ మెట్రో నిర్మాణానికి ఒక కిలోమీటరుకు అయ్యే ఖర్చు భూగర్భ మార్గాన మూడు రెట్లకు పెరుగుతుంది. హైదరాబాద్ వంటి నగరంలోని భూగర్భం రాళ్లు, గుట్టలతో కూడినది కావడంతో భూగర్భంలో దాదాపు 80 అడుగుల లోతుకు తవ్వాల్సి రావడం కష్టమే. అలాగే స్టేషన్ ఏర్పాటు చేయాలంటే భూగర్భంలో కనీసం రెండు ఎకరాల స్థలం అవసరం. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే మెట్రో నగరాలతో పాటు అభివృద్ధి చెందుతున్న ఇతర రాష్ట్రాల రాజధానుల్లో ఎలివేటెడ్ మెట్రోకు ప్రభుత్వాలు మెగ్గు చూపుతున్నాయి. ఇతర నగరాలకు ఆదర్శంగా... హైదరాబాద్ మెట్రో రూపకల్పన, అధునాతన పద్ధతిలో ఆకాశమార్గాన వంతెనలు, గడ్డర్లు, స్లాబ్‌లు, రైల్వేలైన్ ఏర్పాటుకు సంబంధించిన ప్రణాళికలు... మహారాష్ట్రలోని నవీ ముంబై, కేరళలోని కొచ్చిన్ నగరాలకు ఆదర్శమయ్యాయి. కొచ్చిలో ప్రతిపాదిం చిన 25 కి.మీ. మెట్రోలైన్ పూర్తిగా ఆకాశమార్గాన రూపొందిస్తున్నదే. ఈ పనులు ప్రస్తుతం సాగుతున్నాయి. అలాగే నవీముంబై మెట్రోరైలూ 106.4 కి.మీ. మేర ఆకాశమార్గాన్నే వె ళ్లేలా రూపకల్పన చేశారు. మెట్రోరైలు ప్రతిపాదిత నగరాలు అహ్మదాబాద్, భోపాల్, చండీగఢ్, ఇండోర్, కాన్పూర్, లక్నో, లుథియానా, నాగ్‌పూర్, నాసిక్, పాట్నా, పుణే, సూరత్, గౌహతిలలోనూ ఎలివేటెడ్ రూట్లకే ఆయా రాష్ర్ట ప్రభుత్వాలు మెగ్గు చూపుతున్నాయి.