బ్రిడ్జిని ఢీ కొన్న లారీ...నిలిచిన ట్రాఫిక్ | lorry crashes to bridge in nizamabad huge traffic problem | Sakshi
Sakshi News home page

బ్రిడ్జిని ఢీ కొన్న లారీ...నిలిచిన ట్రాఫిక్

Published Sat, Oct 1 2016 10:22 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

బ్రిడ్జిని ఢీ కొన్న లారీ...నిలిచిన ట్రాఫిక్ - Sakshi

బ్రిడ్జిని ఢీ కొన్న లారీ...నిలిచిన ట్రాఫిక్

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలో ఓ లారీకి తృటిలో పెనుప్రమాదం తప్పింది. మద్నూర్ మండలం పెద్దఎక్లారం జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున అతివేగంగా వస్తున్న లారీ బ్రిడ్జిని ఢీ కొట్టింది. 
 
ఈ ప్రమాదంలో లారీ వంతెనపై వేలాడుతూ నిలిచిపోయింది. దీంతో ఆ మార్గంలో దాదాపు 10కి.మీ.మేర ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ సాయంతో లారీని తొలగించి ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement