సైక్లింగ్‌తో సంపూర్ణ ఆరోగ్యం
కాలు తీసి కాలు పెడితే ఖరీదైన కారు.. లేదా వాయువేగంతో వెళ్లే మోటారు సైకిల్.. ఇదీ నేటి సమాజ ధోరణి. ఫలితంగా పెరిగిన పెట్రోల్ వినియోగం..ట్రాఫిక్ సమస్య..రోజు రోజుకూ దెబ్బతింటున్న పర్యావరణం.. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఊబకాయం..అధిక కొలెస్ట్రాల్..బీపీ..మధుమేహం తదితర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టి సంపూర్ణ ఆరోగ్యం సాధించాలంటే సైకిలింగ్ బెస్ట్ అంటున్నారు వైద్యనిపుణులు. ఈ క్రమంలో సైకిలింగ్‌తో ఉపయోగాలపై ‘సాక్షి’ పాఠకుల కోసం ప్రత్యేక కథనం.
పలమనేరు:
సమాజంలో ఒకనాడు ఓ ఊపు ఊపిన సైకిళ్లు రకరకాల మోటారు సైకిళ్లు, కార్ల రాకతో తగ్గుముఖం పట్టాయి. ఖరీదైన కార్లు, మోటారు సైకిళ్ల వినియోగంతో పెట్రోల్ వినియోగం పెరిగింది. ఇక పట్టణాల్లో ట్రాఫిక్ పెరిగిపోయింది. మరోవైపు శ బ్ధ, వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఈ క్రమంలో ప్రజలకు ఆరోగ్యపరమైన సమస్యలు పెచ్చుమీరాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో పలువురు మళ్లీ సైకిళ్లపై మోజు పెంచుకున్నారు.
ఏటా పెరుగుతున్న సైకిళ్ల వినియోగం
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 29 లక్షలు, పట్టణాల్లో 12 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 1.50 లక్షల మంది సైకిళ్లు వినియోగిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మూడేళ్ల క్రితం కంటే నేడు సైకిళ్ల వినియోగం పెరిగింది. 1995 వరకు సైకిళ్ల వినియోగం భారీ గానే ఉండేది. ఆ తర్వాత క్రమేపి వీటి వినియోగం తగ్గిపోయింది. అయితే నేడు మళ్లీ ఊపందుకుంది.
మార్కెట్‌లో పలు రకాల సైకిళ్లు
ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ కంపెనీలకు చెందిన సుమారు 370 రకాల సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. చిన్నపిల్లలకు కిడ్ సైకిల్, విద్యార్థులకు రేంజర్, స్పోర్ట్స్, మహిళలకు లేడీ బర్డ్, మిగిలిన వారికి స్టాండర్డ్ సైకిళ్లు ఉన్నాయి. వీటి ధర రూ. 750 నుంచి రూ.4500 వరకు ఉన్నాయి. ఇంపోటెడ్ సైకిళ్ల ధర రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంది. అయితే హీరో, హెర్‌క్యులస్, అట్లాస్, అవెన్ కంపెనీల సైకిళ్లు మాత్రం ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. జిల్లాలో సుమారు 30 పట్టణాల్లో సైకిల్ దుకాణాలున్నాయి. అన్ని కంపెనీల సైకిళ్లు ఏడాదికి 30 వేల నుంచి 40 వేల వరకు అవుు్మడవుతున్నారుు. జిల్లాలో 20వేల మంది దాకా సైకిల్ మెకానిక్‌లకు ఉపాధి లభిస్తోంది.
సైకిళ్లపై పెరిగిన మక్కువ
ప్రస్తుతం పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఒకప్పుడు రూ.45 ఉన్న పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.71.50కి పెరిగింది. సామాన్య మధ్యతరగతి ప్రజలు కార్లు, మోటారు సైకిళ్ల వినియోగం కష్ట సాధ్యంగా మారింది. దీంతో పాటు పదిమందిలో ముగ్గురికి ఒబేసిటీ సమస్యలొస్తున్నాయి. వీటన్నింటికీ సైకిలింగ్ పరిష్కార మార్గంగా మారింది. ఈ క్రమంలో ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సైకిల్ వాడేందుకు ఆసక్తిని చూపుతున్నారు.
మనిషిలోని కొలెస్ట్రాల్ తగ్గి, సంపూర్ణ ఆరోగ్యం
వస్తుంది.
శబ్ద, వాయు కాలుష్య నివారణ సాధ్యం.
ఇంధన పొదుపుతో పాటు డబ్బు ఆదా అవుతుంది.
ఎటువంటి మార్గాల్లోనైనా సులభంగా
ప్రయాణించవచ్చు.
బరువులు తీసుకెళ్లడానికి అనువుగా ఉంటుంది.
ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య నివారణ.
ప్రమాదాలు నుంచి రక్షణ.
బరువు తగ్గేందుకు ఇదో మంచి వ్యాయామం.
తక్కువ ధరకు దొరికే ప్రయాణ సాధనం.