Absolute Health
-
సంతోషమే బలం
మానవుడు ఆనంద స్వరూపుడు. ఆనందం కోసమే నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చిత్రంగా ఆ ప్రయత్నంలో దానినే విస్మరించటం, కోల్పోవటం జరుగుతుంది. ఆనందంగా ఉండటం సహజ స్థితి. అప్పుడే పుట్టిన పిల్లలు చూడండి. ఆనందంగా నవ్వుతూ ఉంటారు. ఆకలి వేసినప్పుడో ఇబ్బంది కలిగినప్పుడో మాత్రమే ఏడుస్తారు. అది వాళ్ళు తమ భావాలను ప్రకటించగల ఒకే ఒక భాష. ఎవరికైనా కష్టం వస్తే బ్రహ్మాండంగా ఓదారుస్తాం – కష్టాలు మనుషులకి కాక మాకులకి వస్తాయా? కలకాలం ఉండవు, మంచి కాలం ముందు ఉంది అని. తనదాకా వస్తే ధైర్యానికి మూలకారణమైన జ్ఞానం నశిస్తుంది. చదివిన చదువంతా నట్టేట్లో కలిసి΄ోతుంది. తెలివి΄ోయాక ఏమి ఉంటుంది? అందువల్ల శోకాన్ని మించిన శత్రువు లేదు అన్నది కౌసల్య. నిజమే కదా! ఆనందాన్ని క్రమక్రమంగా వయసుతోపాటు కోల్పోతున్నాడు మానవుడు. దానికి కారణం శోకం. అందుకే అర్జునుడు విషాదంలో కూరుకుపోయినప్పుడు శ్రీ కృష్ణుడు ‘‘నీకు శోకించే అధికారం లేదు’’ అని వరుసగా ఎన్నో శ్లోకాలలో నొక్కి వక్కాణించాడు. శోకం మనిషిని మానసికంగా క్రుంగదీస్తుంది. మనోబలం తగ్గటంతో శరీరం కూడా సరిగా సహకరించదు. అది అన్ని రుగ్మతలకి ఆహ్వానం. ‘‘ఈడుపు కాళ్ళు ఏడుపు మొఖం’’ అన్ని పనులకు ఆటంకం కలిగిస్తాయి. ఏడుపుగొట్టు ముఖం దరిదాపుల్లోకి ఏ శుభాలు రావు. ఎందుకంటే ఏడుపు మొహం రాగానే కాళ్ళు ఈడవటం జరుగుతుంది. ఇంక పనులు ఏమవుతాయి? విజయానికి మూలం ఉత్సాహం. శోకం ఉత్సాహాన్ని తరిమికొడుతుంది. ఇంకా ఏం చేస్తుందో తెలుసా? ‘‘శోకో నాశయతే ధైర్యం శోకో నాశయతే శ్రుతమ్ శోకో నాశయతే సర్వం నాస్తి శోక సమో రిపుః’’ ఎప్పుడూ జీవితంలో ఎవరినీ పల్లెత్తు మాట అనని కౌసల్య రాముడు వనవాసం చేయటానికే నిశ్చయించుకున్నాడు అని తిరిగి వచ్చిన సుమంత్రుడు చెప్పగానే శోకోపహతచేతస అయి దశరథుడితో నిష్ఠురంగా మాట్లాడుతుంది. దశరథుడు ఆమెను బ్రతిమాలుతుంటే తన తప్పు తెలుసుకుని ఈ మాటలు అంటుంది. తాను ఆ విధంగా కఠినంగా మాట్లాడటానికి శోకమే కారణం అని దానిని మించిన శత్రువు లోకంలో లేదు అంటుంది. నొప్పి వేరు, బాధ వేరు, శోకం వేరు. నొప్పి భౌతిక మైనది. శరీర సంబంధం. బాధ మనస్సుకి సంబంధించినది. శోకం మనస్సు లోలోపలి ΄÷రలలోకి చొచ్చుకొని ΄ోయి జీవుణ్ణి వేదనకి గురి చేస్తుంది. తనకో తనవారికో కష్టం కలిగింది అనే భావన జోడించబడి ఉంటుంది. ఎప్పుడైతే నేను, నా అన్న భావన కలిగిందో మనస్సు నిర్మలంగా, నిష్పక్ష΄ాతంగా ఆలోచించలేదు. ఎదుటివారి సమస్యలని తేలికగా పరిష్కరించగలవారు తమకి వచ్చిన చిన్న సమస్యని కూడా పరిష్కరించ లేక΄ోవటానికి ఇదే కారణం. అది తమది కాదు ఎవరిదో అని ఆలోచించగానే తాము అందులో ఉండరు గనుక వెంటనే పరిష్కారం లభిస్తుంది. శోకంలో ముందుగా వచ్చేదే ‘నేను’ అన్నది. దానితో ముందుగా ధైర్యం జారిపోతుంది. అర్జునుడికి వచ్చింది కూడా శోకమే. ధైర్యం కోల్పోవటం వల్ల శరీరం వణకటం, చేతిలో ఉన్న గాండీవం జారిపోవటం వంటివి జరిగాయి. ఆ శోకాన్ని పోగొట్టి ధైర్యాన్ని, దానికి మూలమైన జ్ఞానాన్ని ఇచ్చే ముందు నీకు శోకించే అర్హత, అధికారం లేదు అని గట్టిగా చె΄్పాడు. మరేం చేయాలి అంటే ‘‘సమస్యలు వస్తే క్రుంగి΄ోక వాటితో యుద్ధం చేయాలి.’’ అని ఆదేశించాడు. అది అర్జునుడికి మాత్రమే కాదు. భారతీయులు అందరూ. మనం అన్నివిధాల సమస్యలతోను ΄ోరాడి విజయం సాధించాలి. – డా. ఎన్. అనంతలక్ష్మి -
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
నందిగామ (షాద్‌నగర్): ధ్యానం, యోగాతోనే మానసిక ప్రశాంతత, తద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని యోగా గురు బాబా రాందేవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కాన్హా శాంతివనంలో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్, శ్రీ రామచంద్ర మిషన్ వార్షికోత్సవం సందర్భంగా జరిగే కార్యక్రమాలకు ఆయన మంగళవారం హాజరై రాత్రి అక్కడే బస చేశారు. వార్షికోత్సవంలో రెండోరోజైన బుధవారం ఉదయం జరిగిన ధ్యాన కార్యక్రమంలో గురూజీ కమ్లేష్ డీ పటేల్(దాజీ)తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాబా దేవ్ మాట్లాడుతూ..ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ధ్యానంతో పాటు యోగా సాధన చేయాలని, అప్పుడే సమాజం బాగుంటుందన్నారు. అనం తరం ఆశ్రమంలో మొక్కను నాటి, రోడ్డును ప్రారంభించారు. ఈ రోడ్డుకు యోగర్షి స్వామీ రాందేవ్ మార్గ్‌గా నామకరణం చేశారు. ఈ ధ్యాన వేడుకలకు 2వరోజు 40వేల మంది హాజరైనట్లు నిర్వహకులు తెలిపారు. -
1,2లలో కర్నూలు జిల్లాలో డా. ఖాదర్ వలీ సదస్సులు
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం, అటవీ కృషి పద్ధతులపై డిసెంబర్ నెల 1, 2 తేదీల్లో కర్నూలు జిల్లాలో జరిగే సదస్సుల్లో ప్రముఖ ఆహార, ఆరోగ్య, అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. 1వ తేదీ (ఆదివారం) ఉ. 10 గం. నుంచి కర్నూలులోని బి.క్యాంపులో గల సిల్వర్‌జూబ్లీ కళాశాల ఆడిటోరియంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ద్రోణ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జరిగే సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. సూర్యప్రకాశ్‌రెడ్డి – 96038 34633, ఆనందరావు – 93981 24711, ప్రశాంత్‌రెడ్డి – 95029 90938. డిసెంబర్ 1వ తేదీ సా. 5.30 గంటలకు నంద్యాలలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో డా. ఖాదర్ వలి సదస్సు జరుగుతుంది. వివరాలకు.. 94416 54002, 91006 70553. డిసెంబర్ 2వ తేదీ (సోమవారం) ఉ. 10 గంటలకు కోయిలకుంట్లలోని అయ్యప్పస్వామి గుడి హాల్లో కోయిలకుంట్ల పంచాయతీ, మానవతా సేవా సంస్థ, రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. సుబ్బారెడ్డి – 94407 54184, వీరభద్రశివ – 93466 69655. సిరిధాన్యాల సాగు, వాననీటి సంరక్షణపై సదస్సు నేడు మిషన్ జలనిధి, వాటర్ మేనేజ్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సిరిధాన్యాల సాగు, వాననీటి సంరక్షణపై నేటి ఉదయం 9 గం. నుంచి సిద్ధిపేట జిల్లా జగ్దేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో రైతు సదస్సు జరగనుంది. సాక్షి సాగుబడి పేజీ ఇన్చార్జ్ పంతంగి రాంబాబు, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు సంగెం చంద్రమౌళి, వాటర్ మేనేజ్మెంట్ ఫోరం చైర్మన్ మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, మిషన్ జలనిధి చైర్మన్ జి.దామోదర్‌రెడ్డి అవగాహన కల్పిస్తారు. వివరాలకు.. కృష్ణమోహన్ – 99490 55225. 1న సేంద్రియ కూరగాయలు, ఆకుకూరల సాగుపై శిక్షణ డిసెంబర్ 1(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణ కేంద్రంలో సేంద్రియ వ్యవసాయ విధానంలో క్యాబేజి, కాలిఫ్లవర్, వంగ, బెండ, టమాట, గోరుచిక్కుడు, బీర, కాకర, సొరకాయలు, ఆకుకూరల సాగుపై ప్రకృతి వ్యవసాయదారులు శరత్‌బాబు, శివనాగమల్లేశ్వరరావు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255. 1న బసంపల్లిలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వివిధ పంటల సాగుపై అనంతపురం జిల్లా సి కె పల్లి మండలం బసంపల్లిలోని దేవాలయ ఆశ్రమ ప్రాంగణంలో డిసెంబర్ 1వ తేదీ(ప్రతి నెలా మొదటి ఆదివారం)న సీనియర్ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ఫీజు రూ. 100. వివరాలకు.. 91826 71819, 94403 33349. 29,30 తేదీల్లో హైదరాబాద్‌లో చిరుధాన్యాలపై సదస్సు భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐ.ఐ.ఎం.ఆర్.) ఆధ్వర్యంలో ఈ నెల 29,30 తేదీల్లో హైదరాబాద్ కొండాపుర్‌లోని హెచ్.ఐ.సి.సి.లో న్యూట్రిసెరియల్స్ –2019 కాంక్లేవ్ జరగనుంది. వివరాలకు.. 040–24599331, 95501 14466. -
పరిశుభ్రత, త్రికరణశుద్ధితోనే సంపూర్ణ ఆరోగ్యం
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు విజయనగర్‌కాలనీ: శస్త్ర చికిత్స అవసరమైన వారు కూడా మెడిటేషన్‌తో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారారని కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. ప్రధాని నరేంద్రమోడి ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మాసబ్‌ట్యాంక్ జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ(జేఎన్ఏఎఫ్ఏయూ) ప్రాంగణంలోని ఆడిటోరియం హాలులో ‘క్లీన్ నేచర్-క్లీన్ నేషన్’ పేరిట నిర్వహించిన ప్రచారోద్యమ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కావూరి మాట్లాడుతూ... పరిసరాల పరిశుభ్రతతో పాటు మానవుని ఆలోచనలు కూడా త్రికరణ శుద్ధిగా ఉన్నప్పుడే సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించిగలడన్నారు. ఈ ప్రచారోద్యమంలో బ్రహ్మకుమారీలు పర్యావరణ పరిరక్షణ పట్ల మన పూర్వీకుల విజ్ఞత తెలియజేసి ఆ సాంప్రదాయాన్ని ప్రజలు కొనసాగించేందుకు ప్రోత్సహిస్తారన్నారు. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. విజయకిశోర్ మాట్లాడుతూ కళాశాలలోని 1400 మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి కళాశాల ప్రాంగణాన్ని ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచుతూ పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతారన్నారు. ప్రతి విద్యార్థి ఈ కళాశాలలో చదివే నాలుగు సంవత్సరాలలో చదువుతో పాటు ప్రకృతి పరిశుభ్రత, దేశ పరిశుభ్రతతో పాటు శాంతి సామరస్యంతో సుందరమైన జీవనాన్ని సాగించగలిగే ఎన్నో అంశాలను నేర్చుకుంటారన్నారు. శుక్రవారం ప్రారంభమైన ఈ ప్రచారోద్యమం తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలో పర్యటిస్తూ ఈ నెల 29న కరీంనగర్లో ముగిస్తుందన్నారు. బ్రహ్మకుమారిస్ సరళా దీదీ, మోహన్ సింఘాల్, లేఖ, జ్యోతి, శాంతి సరోవర్ రిట్రీట్ సెంటర్, గచ్చిబౌలి డెరైక్టర్ రాజయోగిని కులదీప్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణాలతో పాటు గ్రామాలు, పల్లెలు కూడా కాలుష్య కోరల్లో చిక్కుకుపోతున్నాయంటూ జానపద కళాకారులు ఆలపించిన గేయాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేశాయి. -
సైక్లింగ్‌తో సంపూర్ణ ఆరోగ్యం
కాలు తీసి కాలు పెడితే ఖరీదైన కారు.. లేదా వాయువేగంతో వెళ్లే మోటారు సైకిల్.. ఇదీ నేటి సమాజ ధోరణి. ఫలితంగా పెరిగిన పెట్రోల్ వినియోగం..ట్రాఫిక్ సమస్య..రోజు రోజుకూ దెబ్బతింటున్న పర్యావరణం.. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఊబకాయం..అధిక కొలెస్ట్రాల్..బీపీ..మధుమేహం తదితర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టి సంపూర్ణ ఆరోగ్యం సాధించాలంటే సైకిలింగ్ బెస్ట్ అంటున్నారు వైద్యనిపుణులు. ఈ క్రమంలో సైకిలింగ్‌తో ఉపయోగాలపై ‘సాక్షి’ పాఠకుల కోసం ప్రత్యేక కథనం. పలమనేరు: సమాజంలో ఒకనాడు ఓ ఊపు ఊపిన సైకిళ్లు రకరకాల మోటారు సైకిళ్లు, కార్ల రాకతో తగ్గుముఖం పట్టాయి. ఖరీదైన కార్లు, మోటారు సైకిళ్ల వినియోగంతో పెట్రోల్ వినియోగం పెరిగింది. ఇక పట్టణాల్లో ట్రాఫిక్ పెరిగిపోయింది. మరోవైపు శ బ్ధ, వాయు కాలుష్యం పెరిగిపోతోంది. ఈ క్రమంలో ప్రజలకు ఆరోగ్యపరమైన సమస్యలు పెచ్చుమీరాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో పలువురు మళ్లీ సైకిళ్లపై మోజు పెంచుకున్నారు. ఏటా పెరుగుతున్న సైకిళ్ల వినియోగం జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 29 లక్షలు, పట్టణాల్లో 12 లక్షల మంది జనాభా ఉన్నారు. వీరిలో ప్రస్తుతం 1.50 లక్షల మంది సైకిళ్లు వినియోగిస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. మూడేళ్ల క్రితం కంటే నేడు సైకిళ్ల వినియోగం పెరిగింది. 1995 వరకు సైకిళ్ల వినియోగం భారీ గానే ఉండేది. ఆ తర్వాత క్రమేపి వీటి వినియోగం తగ్గిపోయింది. అయితే నేడు మళ్లీ ఊపందుకుంది. మార్కెట్లో పలు రకాల సైకిళ్లు ప్రస్తుతం మార్కెట్లో వివిధ కంపెనీలకు చెందిన సుమారు 370 రకాల సైకిళ్లు అందుబాటులో ఉన్నాయి. చిన్నపిల్లలకు కిడ్ సైకిల్, విద్యార్థులకు రేంజర్, స్పోర్ట్స్, మహిళలకు లేడీ బర్డ్, మిగిలిన వారికి స్టాండర్డ్ సైకిళ్లు ఉన్నాయి. వీటి ధర రూ. 750 నుంచి రూ.4500 వరకు ఉన్నాయి. ఇంపోటెడ్ సైకిళ్ల ధర రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు ఉంది. అయితే హీరో, హెర్క్యులస్, అట్లాస్, అవెన్ కంపెనీల సైకిళ్లు మాత్రం ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. జిల్లాలో సుమారు 30 పట్టణాల్లో సైకిల్ దుకాణాలున్నాయి. అన్ని కంపెనీల సైకిళ్లు ఏడాదికి 30 వేల నుంచి 40 వేల వరకు అవుు్మడవుతున్నారుు. జిల్లాలో 20వేల మంది దాకా సైకిల్ మెకానిక్‌లకు ఉపాధి లభిస్తోంది. సైకిళ్లపై పెరిగిన మక్కువ ప్రస్తుతం పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. ఒకప్పుడు రూ.45 ఉన్న పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.71.50కి పెరిగింది. సామాన్య మధ్యతరగతి ప్రజలు కార్లు, మోటారు సైకిళ్ల వినియోగం కష్ట సాధ్యంగా మారింది. దీంతో పాటు పదిమందిలో ముగ్గురికి ఒబేసిటీ సమస్యలొస్తున్నాయి. వీటన్నింటికీ సైకిలింగ్ పరిష్కార మార్గంగా మారింది. ఈ క్రమంలో ధనిక, పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సైకిల్ వాడేందుకు ఆసక్తిని చూపుతున్నారు. మనిషిలోని కొలెస్ట్రాల్ తగ్గి, సంపూర్ణ ఆరోగ్యం వస్తుంది. శబ్ద, వాయు కాలుష్య నివారణ సాధ్యం. ఇంధన పొదుపుతో పాటు డబ్బు ఆదా అవుతుంది. ఎటువంటి మార్గాల్లోనైనా సులభంగా ప్రయాణించవచ్చు. బరువులు తీసుకెళ్లడానికి అనువుగా ఉంటుంది. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య నివారణ. ప్రమాదాలు నుంచి రక్షణ. బరువు తగ్గేందుకు ఇదో మంచి వ్యాయామం. తక్కువ ధరకు దొరికే ప్రయాణ సాధనం. -
సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ నటిస్తా
అనారోగ్యాన్ని జయించి సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ సినిమాల్లో నటిస్తానని సీనియర్ నటీమణి మనోరమ దృఢమైన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తమిళ చిత్ర పరిశ్రమలో అందరూ అభిమానంగా ఆచ్చి అని పిలుచుకునే గొప్పనటి మనోరమ. ఎంజీఆర్, శివాజీగణేశన్‌ల కాలం నుంచి నటనే జీవితంగా ముందుకు సాగుతున్నారు. మనోరమ సుమారు 1200కు పైగా చిత్రాల్లో నటించారు. నాయికగా, ముఖ్య పాత్రధారిగా, హాస్యపాత్రధారిగా, ప్రతినాయకిగా ఇలా ఆమె పోషించని పాత్ర లేదంటే అతిశయోక్తి కాదు. మనోరమ నటించారంటే ఆ పాత్రకు పరిపూర్ణత చేకూరినట్లే. మనోరమ హాస్యం పోషించారంటే ఆ చిత్రంలో నవ్వు లు విరబూయాల్సిందే. అంత అంకితభావం తో ఆమె నటిస్తారు. అలాంటి నటీమణి కొం తకాలం క్రితం బాత్రూమ్లో కాలుజారి పడి తలకు బలమైన దెబ్బ తగలడంతో అనారోగ్యానికి గురయ్యారు. ఆ తరువాత వెన్నునొప్పి, మూత్రనాళ సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ప్రస్తుతం ఇంట్లోనే విశ్రాంతి పొందుతు న్న మనోరమ మళ్లీ మూత్రనాళ సమస్యలతో బాధపడుతున్నట్లు ప్రచారం సాగుతోంది. నటుడు మన్సూర్ అలీఖాన్ ఇటీవల తన కూతురు వివాహ ఆహ్వాన పత్రిక అందించడానికి మనోరమ ఇంటికి వెళ్లినప్పుడు ఆమె దయనీయ పరిస్థితి చూసి బాధేసిందంటూ వాపోయారు. మనోరమకు తగిన వైద్య చికి త్స అందిస్తే ఆమె మరిన్ని చిత్రాల్లో నటిస్తారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మనోరమను కాపాడుకోవలసిన బాధ్యత ఆమె అభిమానులైన సినీ ప్రముఖలందరికీ ఉందంటూ ప్రకటించారు. మనోరమ ఒక తమిళ పత్రికకు ఇచ్చిన భేటీని చూద్దాం... ‘నేను సినిమా రంగ ప్రవేశంచేసి 50 ఏళ్లు దాటింది. మొట్టమొదటిసారిగా సింహళ భాషా చిత్రంలో నటించాను. తమిళంలో ముల్లైతొట్ట మంగై చిత్రం లో పరిచయమయ్యాను. దివంగత ప్రఖ్యాత రచయిత కన్నదాస్ నన్ను తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. అప్పుడు నా వయసు 19 ఏళ్లు. ఆ తరువాత వరుసగా అన్ని భాషల్లోనూ నటించాను. ప్రస్తుతం పేరాండి అనే చిత్రంతో పాటు మరో తమిళ చిత్రంలో నటిస్తున్నాను. కొన్ని నెలలుగా బయటకు వెళ్లడం లేదు. అలాంటిది సీనియర్ నటుడు ఎస్ఎస్ రవిచంద్రన్ కన్నుమూశారన్నవార్త విని ఆయన ఇంటికి వెళ్లి భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి వచ్చాను. నా ఆరోగ్యం బాగుండలేదని తెలిసి కొందరు సినీ ప్రముఖులు ఫోన్ చేస్తూ పరామర్శిస్తున్నారు. ఎంజీఆర్ జ్ఞాపక చిహ్నం, శివాజీ గణేశన్ ఇల్లు చూడడానికి వచ్చే అభిమానులు నన్ను చూడడానికి వస్తుంటా రు. ఇది నాకెంతో మనశ్శాంతిని కలిగిస్తున్న విష యం. కమలహాసన్ జన్మదినం నాడు ఆయనకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపాను. అప్పుడు కమ ల్ అమ్మలేని కొరతను తీర్చారు అని అన్నారు. ప్రస్తుతం షూటింగ్‌లకు వెళ్లడం లేదు. ఇప్పుడిక నాకు కాలక్షేపం టీవీనే. నేను నటించిన పాత చిత్రాల సన్నివేశాలను చూస్తుంటే నాటి మధుర జ్ఞాపికలు గుర్తుకొస్తుంటాయి. నా కొడుకొకసారి నీ ఒంట్లో విషం చేరుతోందని చెప్పారు. తను అన్నట్లు గానే ఇప్పుడు జరిగింది. నా ఈ పరిస్థితి అశాశ్వతమే. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మళ్లీ నటిస్తాను’ అంటూ మనోరమ తన మనసులోని మాటను బయటపెట్టారు.