1,2లలో కర్నూలు జిల్లాలో డా. ఖాదర్‌ వలీ సదస్సులు | Dr. Khader Wali tips on Absolute Health | Sakshi
Sakshi News home page

1,2లలో కర్నూలు జిల్లాలో డా. ఖాదర్‌ వలీ సదస్సులు

Published Tue, Nov 26 2019 7:00 AM | Last Updated on Tue, Nov 26 2019 7:00 AM

Dr. Khader Wali tips on Absolute Health - Sakshi

సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం, అటవీ కృషి పద్ధతులపై డిసెంబర్‌ నెల 1, 2 తేదీల్లో కర్నూలు జిల్లాలో జరిగే సదస్సుల్లో ప్రముఖ ఆహార, ఆరోగ్య, అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్‌ వలి ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. 1వ తేదీ (ఆదివారం) ఉ. 10 గం. నుంచి కర్నూలులోని బి.క్యాంపులో గల సిల్వర్‌జూబ్లీ కళాశాల ఆడిటోరియంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ద్రోణ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జరిగే సదస్సులో డా. ఖాదర్‌ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. సూర్యప్రకాశ్‌రెడ్డి – 96038 34633, ఆనందరావు – 93981 24711, ప్రశాంత్‌రెడ్డి – 95029 90938. డిసెంబర్‌ 1వ తేదీ సా. 5.30 గంటలకు నంద్యాలలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో డా. ఖాదర్‌ వలి సదస్సు జరుగుతుంది. వివరాలకు.. 94416 54002, 91006 70553. డిసెంబర్‌ 2వ తేదీ (సోమవారం) ఉ. 10 గంటలకు కోయిలకుంట్లలోని అయ్యప్పస్వామి గుడి హాల్‌లో కోయిలకుంట్ల పంచాయతీ, మానవతా సేవా సంస్థ, రోటరీక్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సదస్సులో డా. ఖాదర్‌ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. సుబ్బారెడ్డి – 94407 54184, వీరభద్రశివ – 93466 69655.

సిరిధాన్యాల సాగు, వాననీటి సంరక్షణపై సదస్సు నేడు
మిషన్‌ జలనిధి, వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఫోరం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సిరిధాన్యాల సాగు, వాననీటి సంరక్షణపై నేటి ఉదయం 9 గం. నుంచి సిద్ధిపేట జిల్లా జగ్దేవ్‌పూర్‌ మండలం చాట్లపల్లి గ్రామంలో రైతు సదస్సు జరగనుంది. సాక్షి సాగుబడి పేజీ ఇన్‌చార్జ్‌ పంతంగి రాంబాబు, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు సంగెం చంద్రమౌళి, వాటర్‌ మేనేజ్‌మెంట్‌ ఫోరం చైర్మన్‌ మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, మిషన్‌ జలనిధి చైర్మన్‌ జి.దామోదర్‌రెడ్డి అవగాహన కల్పిస్తారు. వివరాలకు.. కృష్ణమోహన్‌ – 99490 55225.

1న సేంద్రియ కూరగాయలు, ఆకుకూరల సాగుపై శిక్షణ
డిసెంబర్‌ 1(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు రైతునేస్తం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణ కేంద్రంలో సేంద్రియ వ్యవసాయ విధానంలో క్యాబేజి, కాలిఫ్లవర్, వంగ, బెండ, టమాట, గోరుచిక్కుడు, బీర, కాకర, సొరకాయలు, ఆకుకూరల సాగుపై ప్రకృతి వ్యవసాయదారులు శరత్‌బాబు, శివనాగమల్లేశ్వరరావు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255.

1న బసంపల్లిలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ
ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వివిధ పంటల సాగుపై అనంతపురం జిల్లా సి కె పల్లి మండలం బసంపల్లిలోని దేవాలయ ఆశ్రమ ప్రాంగణంలో డిసెంబర్‌ 1వ తేదీ(ప్రతి నెలా మొదటి ఆదివారం)న సీనియర్‌ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ఫీజు రూ. 100. వివరాలకు.. 91826 71819, 94403 33349.

29,30 తేదీల్లో హైదరాబాద్‌లో చిరుధాన్యాలపై సదస్సు
భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐ.ఐ.ఎం.ఆర్‌.) ఆధ్వర్యంలో ఈ నెల 29,30 తేదీల్లో హైదరాబాద్‌ కొండాపుర్‌లోని హెచ్‌.ఐ.సి.సి.లో న్యూట్రిసెరియల్స్‌ –2019 కాంక్లేవ్‌ జరగనుంది. వివరాలకు.. 040–24599331, 95501 14466.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement