kurnnol
-
చిరుత దాడిలో మహిళ మృతి..
నంద్యాల జిల్లా శిరివెళ్ల మండలం పచర్లలో దారుణం జరిగింది. చిరుత దాడిలో మాజీ సర్పంచ్ షేక్ మెహరున్నిసా మృతి చెందింది. కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన షేక్ మెహరున్నిసాపై చిరుత దాడి చేసింది. తలను తినేసింది. మొండాన్ని వదిలేసింది. అయితే కట్టెల కోసం వెళ్లిన మెహరున్నిసా రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ గాలింపు చర్యల్లో మెహరున్నిసా మొండెం లభ్యం కావడంతో హతాశులయ్యారు. స్థానికులు సమాచారంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. చిరుతను పట్టుకోవడానికి 10 కెమెరాలు , 2 బొన్లు ఏర్పాటు చేశారు. చిరుత కోసం అన్వేషణ ప్రారంభించారు. కాగా, నాలుగు రోజుల క్రితం కూలీ షేక్ బీబీపై చిరుత దాడి చేసింది. -
సీఎం జగన్ రాకతో దద్దరిల్లిన కర్నూలు
-
కబ్జాకోరు రామోజీ
రోజూ ఉషోదయం నుంచే గురివింద నీతులు చెప్పే ఓ రామోజీ.. దీనికి మీరేం సమాధానం చెబుతారు? వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి, ఆ చట్టం గురించి నీకు తెలీదా? లేక ఈ చట్టం చంద్రబాబు చుట్టం అనుకున్నావా? నాకు వర్తించదనే గర్వమా? ఒక మత సంస్థ భూమిని ఇంత దౌర్జన్యంగా, నిస్సిగ్గుగా లాక్కొన్నదే కాకుండా.. దౌర్జన్యం చేయడం, బెదిరించడం, పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెడతామని హెచ్చరించడం..ఇవన్నీ మీ చంద్రబాబును చూసుకునే కదా! ఈనాడును అడ్డుపెట్టుకుని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? అవునులే.. ఫిల్మ్ సిటీ భూములే కొట్టేశాను.. ఇవెంత అనుకున్నావేమో.. ఇలాంటి బాగోతాలు ప్రతి జిల్లాలోనూ లెక్కలేనన్ని ఉంటే ఇదొక్కటేగా బయటపడింది అనుకోవచ్చు.. తీగ లాగితే డొంక కదులుతుందన్న సామెతను ఓసారి గుర్తు చేసుకోండి.కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కర్నూలు నగర సమీపంలో అత్యంత విలువ చేసే వక్ఫ్ బోర్డు (మసీదుకు చెందిన) భూమిని ఈనాడు రామోజీరావు అక్రమంగా చేజిక్కించుకున్నారు. తనకున్న పలుకుబడి, పత్రికను అడ్డం పెట్టుకుని అడ్డదారిలో వెళ్లి విలువైన భూమిలో పాగా వేశారు. వక్ఫ్ బోర్డు నోటీసులు, కోర్టులను లెక్క చేయక తను చెప్పిందే వేదమంటూ ఏకంగా ఆ భూమి తనదేనంటూ బోర్డు కూడా పెట్టారు. కర్నూలు–హైదరాబాద్ రహదారిలో సంతోష్ నగర్ దాటిన తర్వాత ఈనాడు జిల్లా ఎడిషన్ (ఎడిటోరియల్ విభాగం + ప్రింటింగ్) ఏర్పాటు చేసిన చోటుకు పక్కనే వక్ఫ్ భూమి ఉంది. రామోజీ తన కుమారుడు, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఎండీ సీహెచ్ కిరణ్ ద్వారా పావులు కదిపి.. ఈ కంపెనీ పేరుతో ఆ భూమిని కొనుగోలు చేసినట్లు మత పెద్ద ఒకరిని లోబరుచుకుని రికార్డులు సృష్టించారు. వక్ఫ్ భూములను కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరమని అందరికీ గురివింద నీతులు చెప్పే రామోజీ రావు ఇలా అక్రమ మార్గంలో ఈ భూమిని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ భూమిని కాపాడుకునే విషయమై వక్ఫ్ అధికారులు పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రామోజీ పలుకుబడి ముందు అవి సరిపోలేదు. కన్ను పడింది.. కబ్జా చేశాడు.. కర్నూలు నగర శివారులోని మునగాలపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 80లో 4.68 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో, 1963 అక్టోబరు 24వ తేదీన ముద్రించిన వక్ఫ్ గెజిట్‌లో ఈ భూమి గ్రామ జామియా మసీదుకు చెందిన భూమి అని స్పష్టంగా నమోదై ఉంది. అంటే మసీదుకు చెందిన ఇనాం భూమి. కాశ్నిర్ – కన్యాకుమారి 44వ నంబర్ జాతీయ రహదారి (గతంలో ఎన్‌హెచ్–7)ని ఆనుకుని ఉంది.ఈ 4.68 ఎకరాల్లో ఈనాడు గ్రూపునకు చెందిన ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ 2.78 ఎకరాలను 1995 డిసెంబర్ 15న అప్పటి ముతవల్లి మజీద్ హుసేన్‌ను మభ్యపెట్టి, భయపెట్టి అక్రమంగా రిజిస్టర్ చేయించుకుంది. అప్పట్లో ఈ స్థలంలో తన పత్రిక కార్యాలయం భవన నిర్మాణానికి ప్రయత్నించగా, వివాదం చెలరేగి, స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో వక్ఫ్ భూమి పక్కనే ఉన్న మరో ప్రైవేటు స్థలంలో ఈనాడు కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. కానీ ఈ భూమిపై కన్ను పడటంతో ఆ తర్వాత తప్పుడు మార్గంలో చేజిక్కించుకుని అక్రమంగా తన ఆ«దీనంలోనే ఉంచుకున్నారు. ఎండీ కిరణ్ పేరుతో నోటీసులు మసీదులు, దర్గాల నిర్వహణ కోసం గతంలో పూరి్వకులు వక్ఫ్‌కు భూములు, స్థలాలు బోర్డుకు స్వా«దీన పరుస్తారు. వీటిని ముతవల్లులు నిర్వహించి, వాటి ద్వారా వచ్చే సొమ్ముతో మసీదు నిర్వహణ ఖర్చులు పోనూ మిగిలిన సొమ్ములో కొంత బోర్డుకు కౌలు (గుత్త) రూపంలో చెల్లించాలి. ఇలాంటి భూమిని రామోజీ అక్రమంగా పొందారని గుర్తించిన వక్ఫ్ బోర్డు.. ఆ భూమిని తమకు స్వా«దీన పరచాలని ఈనాడు సంస్థ, ఉషోదయ పబ్లికేషన్స్ ఎండీ కిరణ్ పేరుతో వక్ఫ్ అధికారులు పలుసార్లు నోటీసులు జారీ చేశారు. వాటన్నింటికీ రామోజీ, ఆయన తనయుడు ఇసుమంతైనా స్పందించలేదు. ముతవల్లిని అరెస్టు చేయించిన ఈనాడు జామియా మసీదుకు చెందిన సర్వే నంబర్ 80లోని మొత్తం 4.68 ఎకరాల ఇనాం భూమిలో ఈనాడు – ఉషోదయ సంస్థ 2.78 ఎకరాలను అప్పటి ముతవల్లి మజీద్ హుసేన్ నుంచి అక్రమంగా పొందడంతో మిగిలిన 1.90 ఎకరాల భూమిని సాగు చేసుకొని మసీదు బాగోగులు, నిర్వహణ కోసం ఉపయోగించుకుందామని ప్రస్తుత ముతవల్లి షేక్షావలి ఆ భూమిలోకి వెళ్లారు. ఈనాడు యాజమాన్యం తమ సంస్థ ప్రతినిధుల ద్వారా ముతవల్లి షేక్షావలిని తీవ్రంగా బెదిరించింది. ఆ భూమి అంశం కోర్టులో ఉందని, తమ భూమిలో అక్రమంగా ప్రవేశించారంటూ పోలీసులతో అరెస్టు చేయించింది. దీంతో వక్ఫ్ బోర్డు అధికారులు జోక్యం చేసుకుని వాస్తవాలన్నీ వివరించడంతో పోలీసులు ఆయన్ను వదిలేశారు. వక్ఫ్ చట్టం గురించి తెలీదా రారా.. వక్ఫ్ ఆస్తులు ఎప్పటికీ వక్ఫ్ బోర్డుకు చెందినవే అని గతంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచి్చంది. అవి మసీదులు, ఆ మత సంస్థలకే చెందాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. వక్ఫ్ ఆక్ట్ 52ఏ సవరణ (2013 నవంబరు 1వ తేదీ) ప్రకారం వక్ఫ్ బోర్డు భూములు కొనుగోలు చేసిన, అమ్మిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. ఇంత కఠినంగా చట్టాలున్నా, ఈనాడు రామోజీరావు (రారా) చంద్రబాబు ద్వారా వాటిని తన చుట్టాలుగా మార్చుకొని అనుభవిస్తున్నారు.కాగా, రాష్ట్రంలోనే అత్యధిక వక్ఫ్ ఆస్తులు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,104 సంస్థలు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉండగా, 741 సంస్థలు ఆస్తులు కలిగి ఉన్నాయి. వీటి పేర్లతో 22,599.89 ఎకరాల భూమి గెజిట్‌లో నమోదైంది. మరో 10 వేల ఎకరాలు గెజిట్‌లో నమోదు కాని భూములున్నాయి. ప్రస్తుతం రామోజీ రావు ఆక్రమించిన భూమి గెజిట్‌లో నమోదైనది కావడం గమనార్హం. చర్యలు తీసుకోకుండా ఒత్తిడి రామోజీరావు చెరలో అక్రమంగా ఉన్న వక్ఫ్ భూములను రక్షించాలని కోరుతూ అప్పట్లో స్థానికులు ఆందోళనలు చేశారు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలిచ్చారు. దీంతో రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. అక్రమంగా పొందిన వక్ఫ్ భూములను స్వా«దీనం చేసుకునే ముందు వక్ఫ్ యాక్ట్ 51, 52 సెక్షన్ల కింద బోర్డు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అయితే బెదిరింపులు, ఒత్తిళ్ల కారణంగా అధికారులు వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 54 కింద ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్‌కు 1999 జూన్ 7న నోటీసులిచ్చారు. ఈ సెక్షన్ నిందితులు అని నిర్ధారించాకే చర్య తీసుకోవడానికి వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు.అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి తేవడంతోనే అధికారులు ఈ తిరకాసు సెక్షన్ కింద నోటిసులిచ్చారని తెలుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న రామోజీరావు వక్ఫ్ బోర్డు నోటీసులను సవాలు చేస్తూ ఏపీ వక్ఫ్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. ఎనిమిదేళ్ల పాటు విచారణ సాగింది. 2008 ఏప్రిల్ 22న తీర్పు వెల్లడైంది. గెజిట్ నోటిఫికేషన్‌తో పాటు సర్వే కమిషనర్ రిపోర్టు ఆధారంగా సర్వే నంబర్ 80లో ఉన్న భూమి వక్ఫ్ భూమిగా నిర్ధారించింది. అధికారుల తప్పిదాన్ని ఎత్తి చూపి, వక్ఫ్ బోర్డు ఇచ్చిన నోటిసుల సెక్షన్లు సరైనవి కావని తప్పుబట్టింది.పూర్తి స్థాయి చర్యలకు ‘వక్ఫ్ యాక్ట్ సెక్షన్లు 51, 52 కింద నోటీసులిచ్చే అధికారం వక్ఫ్ బోర్డు సీఈఓకు సంపూర్ణంగా ఉందని తీర్పునిచి్చందని అధికారులు చెప్పారు. వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 54 కింద నోటీసులు జారీ చేసి, భూమిని స్వా«దీనం చేసుకోడానికి చట్టం ఒప్పుకోదని.. సరైన మార్గంలో చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ తీర్పు వెలువడిన మూడేళ్ల తర్వాత 2011 సెపె్టంబరు 20న ట్రిబ్యూనల్ సూచించిన సెక్షన్ 51 కింద బోర్డు సీఈఓ నోటీసులిచ్చారు. తర్వాత జిల్లా వక్ఫ్ అధికారులు కలెక్టర్‌కు పలుమార్లు లేఖలు రాశారు. ఈ భూమి రిజి్రస్టేషన్‌ను రద్దు చేయాలని 2019లో కర్నూలు జిల్లా కలెక్టర్ నోటీసులిచ్చారు. రామోజీ తన పలుకుబడితో రిజి్రస్టేషన్ అధికారులను భయపెట్టి నోటీసులు అమలు కాకుండా చూసుకున్నారు. దీంతో ఇప్పటికీ ఆ భూమి ఈనాడు చెరలోనే ఉండిపోయింది. రామోజీరావు ఆక్రమించిన భూమిలో రెండు బోర్డులు ఏర్పాటు చేశాడు. అందులో ‘‘దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్.. యాజ్ ఫర్ ది జడ్జిమెంట్ డేటెడ్ 22–04–2008 ఆఫ్ ఏపీ వక్ఫ్ ట్రిబ్యునల్.. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్’’ అని రాశాడు. దీన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారట! అతిక్రమించింది ఎవరు రామోజీ? నువ్వు, నీ కుమారుడు కాదా? వక్ఫ్ చట్టాన్ని అతిక్రమించి కబ్జా చేసిందే మీరు. ఈ బోర్డు చూస్తుంటే దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్లుంది. మిమ్మల్ని చూసే ఈ నానుడి పుట్టుకొచి్చంది కాబోలు. ఆ జడ్జిమెంట్‌లో ఏముందో మీకు తెలియకపోతే ఇంగ్లిష్ తెలిసిన వాళ్లెవరితో అయినా చదివించుకోండి. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం కాకుండా పూర్తి స్థాయి చర్యలకు ‘వక్ఫ్ యాక్ట్ సెక్షన్లు 51, 52 కింద నోటీసులిచ్చే అధికారం రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓకు సంపూర్ణంగా ఉందని స్పష్టంగా చెప్పింది. ఆ తీర్పు మేరకే ఆ తర్వాత మీకు సెక్షన్ 51 కింద నోటీసులివ్వడం నిజం కాదా? ఆ భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని 2019లో కర్నూలు జిల్లా కలెక్టర్ నోటీసులు ఇవ్వడం వాస్తవం కాదా? ఆ ఆదేశాలు అమలు కాకుండా మీరు బెదిరించలేదా? ఇన్ని వాస్తవాలమధ్య ఆ భూమి తమదని బోర్డు పెట్టడానికి కొంచెమైనా సిగ్గుండాలి.సమగ్ర విచారణలో బండారం బట్టబయలుకలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ తిరుపతి సాయి మండల సర్వేయర్‌తో కలిసి సమగ్ర విచారణ జరిపారు. 2019 ఆగస్టు 20వ తేదీన కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. సర్వే నంబర్ 80లోని 4.68 ఎకరాలు ఆర్.ఎస్.ఆర్, ఆర్.ఓ.ఆర్ రికార్డ్స్, ఆన్ లైన్ అడంగల్ ప్రకారం అది మసీదు ఇనామ్కు చెందిన భూమి అని స్పష్టం చేశారు. అదే సర్వే నంబర్లోని 2.78 ఎకరాల భూమిని 1995 డిసెంబరు 15 తేదీన ఈనాడు పేపర్‌కు చెందిన ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిందని నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక, ఇతరత్రా పరిశీలన అనంతరం 2019 అక్టోబర్ 14వ తేదీన అప్పటి జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆ రిజి్రస్టేషన్‌ను రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.అది వంద శాతం వక్ఫ్ బోర్డు భూమే ఈనాడు సంస్థ ఆ«దీనంలో ఉన్న సర్వే నంబర్ 80లోని 4.68 ఎకరాల భూమి పక్కాగా వంద శాతం వక్ఫ్ బోర్డు భూమే. వక్ఫ్ గెజిట్‌లో కూడా స్పష్టంగా ఉంది. ఆ భూమి మసీదుకే దక్కాలని నేను పని చేసిన కాలంలో పలుసార్లు నోటీసులు జారీ అయ్యాయి. అయినా స్పందించ లేదు. రాష్ట్ర బోర్డు అధికారులకు చెప్పాం. వాళ్లు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. వాటిని వాళ్లు ఖాతరు చేయలేదు. – నూర్ మహమ్మద్, వక్ఫ్ బోర్డు రిటైర్డు ఇన్స్పెక్టర్ మసీదు భూమిని అన్యాయంగా లాక్కున్నారు మునగాలపాడు గ్రామానికి చెందిన జామియా మసీదుకు చెందిన 4.68 ఎకరాల భూమిని గతంలో ముతవల్లి నుంచి ఈనాడు వాళ్లు అక్రమంగా పొందారు. చేసిన తప్పులను ఎత్తిచూపాల్సిన పత్రిక యజమానులే ఇలా అన్యాయానికి పాల్పడ్డారు. దీనిపై గతంలో మా సంఘం ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చాలా మంది కలెక్టర్లకు విన్నపాలు చేశాం. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.25 కోట్లకు పైగా ఉంటుంది. – సయ్యద్ రోషన్ అలీ, రిటైర్డు తహశీల్దార్, ఏపీ ముస్లిం కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు పొలం వద్దకు వెళ్తే అరెస్టు చేయించారు ఈనాడు సంస్థ తమ ఆ«దీనంలో పెట్టుకున్న భూమి పక్కాగా మా గ్రామ మసీదుకు చెందినదే. దీనిని కాపాడుకునేందుకు మా గ్రామస్తులు, పెద్దలతో కలిసి ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆ భూమి మసీదుకు చెందినదని బోర్డులు పెట్టబోయాము. అది మా భూమి అని ఈనాడు బోర్డు పెట్టింది. ఆ భూమి వద్దకు వెళ్లిన నన్ను పోలీసులతో అరెస్టు చేయించారు. మమ్మల్ని భయపెట్టారు. ఈ భూమి కోర్టులో ఉందని అనేక ఇబ్బందులకు గురి చేశారు. – షేక్షావలి, జామియా మసీదు ముతవల్లి, మునగాలపాడు, కర్నూలు మండలం, కర్నూలు జిల్లా -
చలానాల్లో కొత్త చిక్కులు..
ఈ చిత్రంలోని చలానాను నన్నూరుకు చెందిన రవీంద్రబాబు ఎస్బీఐ ట్రెజరీ బ్యాంకులో ఆగస్టు 24న భూమి రిజిస్ట్రేషన్ కోసం రూ.11,580 కట్టి తీసుకున్నాడు. చలానా మొత్తం ఆన్లైన్లో సక్సెస్ అయినట్లు బ్యాంకు అధికారులు రసీదు ఇచ్చి పంపారు. దాన్ని తీసుకొని రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్తే చలానా వివరాలు డిస్ ప్లే కావడం లేదంటూ సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. ‘వారం రోజులవుతుంది. చలానా కాల పరిమితి సెప్టెంబర్ 5 వరకే ఇచ్చారు. ఇక రెండు రోజులే ఉంది. ఎవరిని అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదు.’ అంటు బాధితుడు వాపోతున్నాడు. రిజిస్ట్రేషన్ శాఖలో చలానాల కుంభకోణం తరువాత తీసుకున్న చర్యలతో నెలకొన్న పరిస్థితి ఇది. సాక్షి, కర్నూలు(సెంట్రల్): కర్నూలు, నంద్యాల జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో 24 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. అన్ని చోట్లా ఇదే పరిస్థితి. సీఎఫ్ఎంఎస్ లాగిన్‌లో విక్రయదారులు చెల్లించిన పలు చలానాల వివరాలు డిస్ప్లే కాకపోవడంతో సబ్ రిజిస్ట్రార్లు రిజిస్ట్రేషన్లను తిరస్కరిస్తున్నారు. బ్యాంకులకు వెళ్లి వివరణ కోరాలని చెప్పి పంపుతున్నారు. అక్కడికి వెళ్తే చలానా మొత్తం రిజిస్ట్రేషన్ శాఖ ఖాతాలకు వెళ్లిందని, పదే పదే రావద్దని గట్టిగా చెప్పి పంపుతున్నారు. ఫలితంగా ఎవరిని అడగాలో తెలియక, ఏమి చేయాలో తోచక క్రయ, విక్రయదారులు ఆందోళన చెందుతున్నారు. చలానా కాల పరిమితి దాటిపోతే మరోసారి డబ్బు చెల్లించి చలానా తీసుకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటీ రెండు రోజులైతే ఏమో అనుకోవచ్చు. దాదాపు 15 రోజుల క్రితం చెల్లించిన చలానాలు సైతం యాక్టివ్ కాకపోవడమేమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అసలు ఏమి జరిగిందంటే.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో వెలుగులోకి వచ్చిన చలానాల కుంభకోణం తరువాత అధికారులు సర్వర్‌లో మార్పులు చేశారు. గతంలో ఆన్లైన్లో చెల్లించిన చలానాల నంబర్లను సీఎఫ్ఎంఎస్(కాంప్రెహెన్సివ్ ఫైనాన్సియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) లాగిన్‌లో అప్లోడ్ చేస్తే సంబంధిత చలానా మొత్తం డిస్ప్లే అయ్యేది కాదు. దీంతో కొందరు తక్కువ మొత్తంలో చలానాలను చెల్లించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద కుంభకోణం జరిగిందని ఇటీవల ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. చాలా చోట్ల బాధ్యులైన సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసింది. మరోసారి అక్రమాలకు చోటులేకుండా సీఎఫ్ఎంఎస్ సర్వర్‌లో కొన్ని మార్పులు చేసింది. క్రయ, విక్రయదారులు చెల్లించిన సీఎఫ్ఎంఎస్ ట్రాన్సాక్షన్ ఐడీ నంబర్ ఎంటర్ చేయగానే లాగిన్‌లో ఎంత మొత్తం చలానా తీశారు? ఏ బ్యాంక్‌లో ఎప్పుడు చెల్లించారనే విషయాలు డిస్ప్లే అయ్యేలా మార్పులు చేశారు. సర్వర్ సమస్య.. ఆన్లైన్ చలానాల చెల్లింపులో నెలకొన్న కొత్త సమస్యలకు సీఎఫ్ఎంస్ లాగిన్ సర్వరే కారణమని అధికారులు అంటున్నారు. నెట్ స్లోగా ఉండడంతో ఈ సమస్య తలెత్తుతోందని నిపుణులు భావిస్తున్నారు. కాగా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు 2 ఎంబీ లైన్ స్పీడు బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్‌ను వేసుకోవాలని చెప్పినా పనులు నిదానంగా కొనసాగుతున్నాయి. దీంతో ఈసీలు తీసుకోవడానికి కూడా రోజుల సమయం పడుతోంది. రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది నేను కర్నూలులో సైట్ కొన్నాను. అందుకోసం రూ.11,500 చలానా తీశాను. బ్యాంకు అధికారులు దానిపై సక్సెస్ అయినట్లు సీలు వేసి ఇచ్చారు. దానిని తీసుకొచ్చి కల్లూరు సబ్ రిజిస్ట్రార్‌కు చూపితే ఆన్లైన్లో రావడంలేదని రిజిస్ట్రేషన్ నిలిపేశారు. దాదాపు 10 రోజులవుతోంది. బ్యాంకు అధికారులను అడిగితే సమస్య మావద్ద లేదంటున్నారు. డబ్బు చూపడంలేదని రిజిస్ట్రేషన్ అధికారులు చెబుతున్నారు. దిక్కుతోచడంలేదు. – బాషా, నందికొట్కూరు -
శ్రీశైలంలో మంత్రి కొడలి నాని ప్రత్యేక పూజలు
-
1,2లలో కర్నూలు జిల్లాలో డా. ఖాదర్ వలీ సదస్సులు
సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం, అటవీ కృషి పద్ధతులపై డిసెంబర్ నెల 1, 2 తేదీల్లో కర్నూలు జిల్లాలో జరిగే సదస్సుల్లో ప్రముఖ ఆహార, ఆరోగ్య, అటవీ కృషి నిపుణులు డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. ప్రవేశం ఉచితం. 1వ తేదీ (ఆదివారం) ఉ. 10 గం. నుంచి కర్నూలులోని బి.క్యాంపులో గల సిల్వర్‌జూబ్లీ కళాశాల ఆడిటోరియంలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, ద్రోణ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో జరిగే సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. సూర్యప్రకాశ్‌రెడ్డి – 96038 34633, ఆనందరావు – 93981 24711, ప్రశాంత్‌రెడ్డి – 95029 90938. డిసెంబర్ 1వ తేదీ సా. 5.30 గంటలకు నంద్యాలలోని శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల ఆవరణలోని ఆడిటోరియంలో డా. ఖాదర్ వలి సదస్సు జరుగుతుంది. వివరాలకు.. 94416 54002, 91006 70553. డిసెంబర్ 2వ తేదీ (సోమవారం) ఉ. 10 గంటలకు కోయిలకుంట్లలోని అయ్యప్పస్వామి గుడి హాల్లో కోయిలకుంట్ల పంచాయతీ, మానవతా సేవా సంస్థ, రోటరీక్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే సదస్సులో డా. ఖాదర్ వలి ప్రసంగిస్తారు. వివరాలకు.. సుబ్బారెడ్డి – 94407 54184, వీరభద్రశివ – 93466 69655. సిరిధాన్యాల సాగు, వాననీటి సంరక్షణపై సదస్సు నేడు మిషన్ జలనిధి, వాటర్ మేనేజ్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సిరిధాన్యాల సాగు, వాననీటి సంరక్షణపై నేటి ఉదయం 9 గం. నుంచి సిద్ధిపేట జిల్లా జగ్దేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామంలో రైతు సదస్సు జరగనుంది. సాక్షి సాగుబడి పేజీ ఇన్చార్జ్ పంతంగి రాంబాబు, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం అధ్యక్షులు సంగెం చంద్రమౌళి, వాటర్ మేనేజ్మెంట్ ఫోరం చైర్మన్ మేరెడ్డి శ్యాంప్రసాద్‌రెడ్డి, మిషన్ జలనిధి చైర్మన్ జి.దామోదర్‌రెడ్డి అవగాహన కల్పిస్తారు. వివరాలకు.. కృష్ణమోహన్ – 99490 55225. 1న సేంద్రియ కూరగాయలు, ఆకుకూరల సాగుపై శిక్షణ డిసెంబర్ 1(ఆదివారం)న ఉ. 10 గం. నుంచి సా. 4 గం. వరకు రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కొర్నెపాడులోని రైతు శిక్షణ కేంద్రంలో సేంద్రియ వ్యవసాయ విధానంలో క్యాబేజి, కాలిఫ్లవర్, వంగ, బెండ, టమాట, గోరుచిక్కుడు, బీర, కాకర, సొరకాయలు, ఆకుకూరల సాగుపై ప్రకృతి వ్యవసాయదారులు శరత్‌బాబు, శివనాగమల్లేశ్వరరావు శిక్షణ ఇస్తారు. వివరాలకు.. 97053 83666, 0863–2286255. 1న బసంపల్లిలో ప్రకృతి వ్యవసాయ శిక్షణ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వివిధ పంటల సాగుపై అనంతపురం జిల్లా సి కె పల్లి మండలం బసంపల్లిలోని దేవాలయ ఆశ్రమ ప్రాంగణంలో డిసెంబర్ 1వ తేదీ(ప్రతి నెలా మొదటి ఆదివారం)న సీనియర్ రైతు నాగరాజు శిక్షణ ఇస్తారు. ఉ. 9 గం. నుంచి సా. 4 గం. వరకు శిక్షణ ఉంటుంది. ఫీజు రూ. 100. వివరాలకు.. 91826 71819, 94403 33349. 29,30 తేదీల్లో హైదరాబాద్‌లో చిరుధాన్యాలపై సదస్సు భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ(ఐ.ఐ.ఎం.ఆర్.) ఆధ్వర్యంలో ఈ నెల 29,30 తేదీల్లో హైదరాబాద్ కొండాపుర్‌లోని హెచ్.ఐ.సి.సి.లో న్యూట్రిసెరియల్స్ –2019 కాంక్లేవ్ జరగనుంది. వివరాలకు.. 040–24599331, 95501 14466. -
కాంట్రాక్టు ఉద్యోగులతో వెట్టిచాకిరీనా..?
కర్నూలు(హాస్పిటల్) : రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులతో వెట్టిచాకిరీ చేయించుకుంటూ, వారి మెడపైనే జీవో నెం.27 అనే కత్తి వేలాడ దీసిందని ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంసీ.నరసింహులు, ఎన్డీ. సంపత్‌కుమార్ అన్నారు. వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా నరసింహులు, సంపత్‌కుమార్ మాట్లాడుతూ జీవో నెం.27 కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. వెంటనే ఆ జీవోను సవరించి సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం ఒకే పనికి...ఒకే వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఎంహెచ్ఓ డాక్టర్ జేవీవీఆర్‌కే ప్రసాద్‌కు వారు వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్. వెంకటేశ్వర్లు, కోశాధికారి సత్యనారాయణ, నాయకులు సాయిరామ్, బాలకృష్ణయ్య, హరికృష్ణగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ పాదయాత్ర 14వ రోజు షెడ్యూల్
-
వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 14వ రోజు షెడ్యూల్
సాక్షి, బేతంచర్ల (కర్నూలు జిల్లా): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర కర్నూలు జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. 14వ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు డోన్ నియోజకవర్గం బేతంచర్ల మండలం గోరుగుట్ల నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగించనున్నారు. ఉదయం 9 గంటలకు షైక్‌షావలీ దర్గాను చేరుకొని డోన్ నియోజకవర్గం పార్టీ నేతలతో ముచ్చటించనున్నారు. ఉదయం 10 గంటలకు పాణ్యం నేతలతో మాట్లాడతారు. మధ్యాహ్నం 12. 30 గంటలకు వైఎస్ జగన్ భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు బేతంచర్ల నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర కొనసాగించనున్నారు. మధ్యాహ్నం 3.3 గంటలకు బేతంచర్ల బస్టాండ్ సర్కిల్ లో నిర్వహించే బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి కోలుములెపల్లి చేరుకొని.. పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. రాత్రి 7.30 గంటలకు వైఎస్ జగన్ బస చేస్తారు. -
సమాజశ్రేయస్సే పోలీస్ లక్ష్యం
► జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ ► అడిషనల్ ఎస్పీ, ఎస్బీ డీఎస్పీ పదవీవిరమణ కర్నూలు: కుటుంబం కన్నా సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పని చేసేది పోలీసులు మాత్రమేనని ఎస్పీ ఆకే రవికృష్ణ అన్నారు. అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) శివరామప్రసాద్, స్పెషల్ బ్రాంచి డీఎస్పీ ఏజీ కృష్ణమూర్తి, నంద్యాల పీసీఆర్ ఎస్ఐ అబ్దుల్సలాం, నంద్యాల యూనిట్‌కు చెందిన హోంగార్డు దేవదాసు తదితరులు పదవీవిరమణ పొందారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంగళవారం ఎస్పీ ఆధ్వర్యంలో మన కుటుంబం పదవీవిరమణ కార్యక్రమం పేరుతో వేడుకలు నిర్వహించారు. పదవీవిరమణ పొందిన అధికారులను శాలువాలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపిక, బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఎస్పీ సతీమణి ఆకే పార్వతి, కూతురు, కుమారుడు దీక్షిత, హేమకేషు పాల్గొన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కుటుంబాలతో సంతోషంగా జీ వితం గడపాలని వారికి ఎస్పీ సూచించారు.విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంటు ప్రాం తీయ అధికారి శివకోటి బాబురావు, ఓఎస్డీ రవిప్రకాష్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, డీఎస్పీలు రమణమూర్తి, జె.బాబుప్రసాద్, మురళీధర్, వినోద్‌కుమార్, రాజశేఖర్‌రాజు, హుసేన్‌పీరా, వెంకటాద్రి, సీఐలు ములకన్న, సుబ్రహ్మణ్యం, రామకృష్ణ, ఆర్ఐ రంగముని, పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు నారాయణ పాల్గొన్నారు.