కర్నూల్లో అత్యంత విలువైన మసీదు భూమి ఆక్రమణ
రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ఎన్నో భూములు కబ్జా
కర్నూలు–హైదరాబాద్ జాతీయ రహదారిలో ఈనాడు ఎడిషన్ పక్కనే 4.68 ఎకరాలు కబ్జా
1995లో ముతవల్లిని బెదిరించి 2.78 ఎకరాలు అక్రమ రిజి్రస్టేషన్
ఆ తర్వాత మిగిలిన 1.90 ఎకరాలను కూడా కలిపేసుకున్న వైనం
కనీసం ఈ భూమి అయినా ఇవ్వాలని కోరిన ప్రస్తుత ముతవల్లి
తన ప్రతినిధుల ద్వారా తీవ్రంగా బెదిరించిన రామోజీ
ఏకంగా పోలీసులను పిలిపించి దుర్మార్గంగా అరెస్ట్ చేయించిన వైనం
పలుమార్లు వక్ఫ్ బోర్డు నోటీసులు.. ఖాతరు చేయని రామోజీ
బెదిరింపులు, ఒత్తిడితో నేరుగా చర్యలు తీసుకోలేకపోయిన వక్ఫ్ అధికారులు
ఎట్టకేలకు వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 54 కింద నోటీసులు జారీ
సాంకేతిక కారణాలతో ఆ నోటీసులను సవాలు చేసిన ఈనాడు ఎండీ కిరణ్
అది ముమ్మాటికీ వక్ఫ్ భూమే అని నిర్ధారించిన రాష్ట్ర వక్ఫ్ ట్రిబ్యునల్
వక్ఫ్ యాక్ట్ సెక్షన్లు 51, 52 కింద నేరుగా చర్యలు తీసుకోవచ్చని తీర్పు
దీంతో 2011లో సెక్షన్ 51 కింద నోటీసులు జారీ చేసిన సీఈఓ
రిజి్రస్టేషన్ రద్దు చేయాలని 2019లో కలెక్టర్ ఉత్తర్వులు
తన పలుకుబడితో ఆ ఉత్తర్వులు అమలు కాకుండా చూసిన రామోజీ
ఇప్పటికీ రామోజీ చేతిలోనే ఈ విలువైన భూమి
రోజూ ఉషోదయం నుంచే గురివింద నీతులు చెప్పే ఓ రామోజీ.. దీనికి మీరేం సమాధానం చెబుతారు? వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి, ఆ చట్టం గురించి నీకు తెలీదా? లేక ఈ చట్టం చంద్రబాబు చుట్టం అనుకున్నావా? నాకు వర్తించదనే గర్వమా? ఒక మత సంస్థ భూమిని ఇంత దౌర్జన్యంగా, నిస్సిగ్గుగా లాక్కొన్నదే కాకుండా.. దౌర్జన్యం చేయడం, బెదిరించడం, పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెడతామని హెచ్చరించడం..
ఇవన్నీ మీ చంద్రబాబును చూసుకునే కదా! ఈనాడును అడ్డుపెట్టుకుని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? అవునులే.. ఫిల్మ్ సిటీ భూములే కొట్టేశాను.. ఇవెంత అనుకున్నావేమో.. ఇలాంటి బాగోతాలు ప్రతి జిల్లాలోనూ లెక్కలేనన్ని ఉంటే ఇదొక్కటేగా బయటపడింది అనుకోవచ్చు.. తీగ లాగితే డొంక కదులుతుందన్న సామెతను ఓసారి గుర్తు చేసుకోండి.
కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కర్నూలు నగర సమీపంలో అత్యంత విలువ చేసే వక్ఫ్ బోర్డు (మసీదుకు చెందిన) భూమిని ఈనాడు రామోజీరావు అక్రమంగా చేజిక్కించుకున్నారు. తనకున్న పలుకుబడి, పత్రికను అడ్డం పెట్టుకుని అడ్డదారిలో వెళ్లి విలువైన భూమిలో పాగా వేశారు. వక్ఫ్ బోర్డు నోటీసులు, కోర్టులను లెక్క చేయక తను చెప్పిందే వేదమంటూ ఏకంగా ఆ భూమి తనదేనంటూ బోర్డు కూడా పెట్టారు. కర్నూలు–హైదరాబాద్ రహదారిలో సంతోష్ నగర్ దాటిన తర్వాత ఈనాడు జిల్లా ఎడిషన్ (ఎడిటోరియల్ విభాగం + ప్రింటింగ్) ఏర్పాటు చేసిన చోటుకు పక్కనే వక్ఫ్ భూమి ఉంది.
రామోజీ తన కుమారుడు, ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఎండీ సీహెచ్ కిరణ్ ద్వారా పావులు కదిపి.. ఈ కంపెనీ పేరుతో ఆ భూమిని కొనుగోలు చేసినట్లు మత పెద్ద ఒకరిని లోబరుచుకుని రికార్డులు సృష్టించారు. వక్ఫ్ భూములను కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరమని అందరికీ గురివింద నీతులు చెప్పే రామోజీ రావు ఇలా అక్రమ మార్గంలో ఈ భూమిని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ భూమిని కాపాడుకునే విషయమై వక్ఫ్ అధికారులు పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రామోజీ పలుకుబడి ముందు అవి సరిపోలేదు.
కన్ను పడింది.. కబ్జా చేశాడు..
కర్నూలు నగర శివారులోని మునగాలపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 80లో 4.68 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో, 1963 అక్టోబరు 24వ తేదీన ముద్రించిన వక్ఫ్ గెజిట్‌లో ఈ భూమి గ్రామ జామియా మసీదుకు చెందిన భూమి అని స్పష్టంగా నమోదై ఉంది. అంటే మసీదుకు చెందిన ఇనాం భూమి. కాశ్నిర్ – కన్యాకుమారి 44వ నంబర్ జాతీయ రహదారి (గతంలో ఎన్‌హెచ్–7)ని ఆనుకుని ఉంది.
ఈ 4.68 ఎకరాల్లో ఈనాడు గ్రూపునకు చెందిన ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ 2.78 ఎకరాలను 1995 డిసెంబర్ 15న అప్పటి ముతవల్లి మజీద్ హుసేన్‌ను మభ్యపెట్టి, భయపెట్టి అక్రమంగా రిజిస్టర్ చేయించుకుంది. అప్పట్లో ఈ స్థలంలో తన పత్రిక కార్యాలయం భవన నిర్మాణానికి ప్రయత్నించగా, వివాదం చెలరేగి, స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో వక్ఫ్ భూమి పక్కనే ఉన్న మరో ప్రైవేటు స్థలంలో ఈనాడు కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. కానీ ఈ భూమిపై కన్ను పడటంతో ఆ తర్వాత తప్పుడు మార్గంలో చేజిక్కించుకుని అక్రమంగా తన ఆ«దీనంలోనే ఉంచుకున్నారు.
ఎండీ కిరణ్ పేరుతో నోటీసులు
మసీదులు, దర్గాల నిర్వహణ కోసం గతంలో పూరి్వకులు వక్ఫ్‌కు భూములు, స్థలాలు బోర్డుకు స్వా«దీన పరుస్తారు. వీటిని ముతవల్లులు నిర్వహించి, వాటి ద్వారా వచ్చే సొమ్ముతో మసీదు నిర్వహణ ఖర్చులు పోనూ మిగిలిన సొమ్ములో కొంత బోర్డుకు కౌలు (గుత్త) రూపంలో చెల్లించాలి. ఇలాంటి భూమిని రామోజీ అక్రమంగా పొందారని గుర్తించిన వక్ఫ్ బోర్డు.. ఆ భూమిని తమకు స్వా«దీన పరచాలని ఈనాడు సంస్థ, ఉషోదయ పబ్లికేషన్స్ ఎండీ కిరణ్ పేరుతో వక్ఫ్ అధికారులు పలుసార్లు నోటీసులు జారీ చేశారు. వాటన్నింటికీ రామోజీ, ఆయన తనయుడు ఇసుమంతైనా స్పందించలేదు.
ముతవల్లిని అరెస్టు చేయించిన ఈనాడు
జామియా మసీదుకు చెందిన సర్వే నంబర్ 80లోని మొత్తం 4.68 ఎకరాల ఇనాం భూమిలో ఈనాడు – ఉషోదయ సంస్థ 2.78 ఎకరాలను అప్పటి ముతవల్లి మజీద్ హుసేన్ నుంచి అక్రమంగా పొందడంతో మిగిలిన 1.90 ఎకరాల భూమిని సాగు చేసుకొని మసీదు బాగోగులు, నిర్వహణ కోసం ఉపయోగించుకుందామని ప్రస్తుత ముతవల్లి షేక్షావలి ఆ భూమిలోకి వెళ్లారు. ఈనాడు యాజమాన్యం తమ సంస్థ ప్రతినిధుల ద్వారా ముతవల్లి షేక్షావలిని తీవ్రంగా బెదిరించింది. ఆ భూమి అంశం కోర్టులో ఉందని, తమ భూమిలో అక్రమంగా ప్రవేశించారంటూ పోలీసులతో అరెస్టు చేయించింది. దీంతో వక్ఫ్ బోర్డు అధికారులు జోక్యం చేసుకుని వాస్తవాలన్నీ వివరించడంతో పోలీసులు ఆయన్ను వదిలేశారు.
వక్ఫ్ చట్టం గురించి తెలీదా రారా..
వక్ఫ్ ఆస్తులు ఎప్పటికీ వక్ఫ్ బోర్డుకు చెందినవే అని గతంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచి్చంది. అవి మసీదులు, ఆ మత సంస్థలకే చెందాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. వక్ఫ్ ఆక్ట్ 52ఏ సవరణ (2013 నవంబరు 1వ తేదీ) ప్రకారం వక్ఫ్ బోర్డు భూములు కొనుగోలు చేసిన, అమ్మిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. ఇంత కఠినంగా చట్టాలున్నా, ఈనాడు రామోజీరావు (రారా) చంద్రబాబు ద్వారా వాటిని తన చుట్టాలుగా మార్చుకొని అనుభవిస్తున్నారు.
కాగా, రాష్ట్రంలోనే అత్యధిక వక్ఫ్ ఆస్తులు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,104 సంస్థలు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉండగా, 741 సంస్థలు ఆస్తులు కలిగి ఉన్నాయి. వీటి పేర్లతో 22,599.89 ఎకరాల భూమి గెజిట్‌లో నమోదైంది. మరో 10 వేల ఎకరాలు గెజిట్‌లో నమోదు కాని భూములున్నాయి. ప్రస్తుతం రామోజీ రావు ఆక్రమించిన భూమి గెజిట్‌లో నమోదైనది కావడం గమనార్హం.
చర్యలు తీసుకోకుండా ఒత్తిడి
రామోజీరావు చెరలో అక్రమంగా ఉన్న వక్ఫ్ భూములను రక్షించాలని కోరుతూ అప్పట్లో స్థానికులు ఆందోళనలు చేశారు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలిచ్చారు. దీంతో రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. అక్రమంగా పొందిన వక్ఫ్ భూములను స్వా«దీనం చేసుకునే ముందు వక్ఫ్ యాక్ట్ 51, 52 సెక్షన్ల కింద బోర్డు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అయితే బెదిరింపులు, ఒత్తిళ్ల కారణంగా అధికారులు వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 54 కింద ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్‌కు 1999 జూన్ 7న నోటీసులిచ్చారు. ఈ సెక్షన్ నిందితులు అని నిర్ధారించాకే చర్య తీసుకోవడానికి వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు.
అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి తేవడంతోనే అధికారులు ఈ తిరకాసు సెక్షన్ కింద నోటిసులిచ్చారని తెలుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న రామోజీరావు వక్ఫ్ బోర్డు నోటీసులను సవాలు చేస్తూ ఏపీ వక్ఫ్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. ఎనిమిదేళ్ల పాటు విచారణ సాగింది. 2008 ఏప్రిల్ 22న తీర్పు వెల్లడైంది. గెజిట్ నోటిఫికేషన్‌తో పాటు సర్వే కమిషనర్ రిపోర్టు ఆధారంగా సర్వే నంబర్ 80లో ఉన్న భూమి వక్ఫ్ భూమిగా నిర్ధారించింది. అధికారుల తప్పిదాన్ని ఎత్తి చూపి, వక్ఫ్ బోర్డు ఇచ్చిన నోటిసుల సెక్షన్లు సరైనవి కావని తప్పుబట్టింది.
పూర్తి స్థాయి చర్యలకు ‘వక్ఫ్ యాక్ట్ సెక్షన్లు 51, 52 కింద నోటీసులిచ్చే అధికారం వక్ఫ్ బోర్డు సీఈఓకు సంపూర్ణంగా ఉందని తీర్పునిచి్చందని అధికారులు చెప్పారు. వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 54 కింద నోటీసులు జారీ చేసి, భూమిని స్వా«దీనం చేసుకోడానికి చట్టం ఒప్పుకోదని.. సరైన మార్గంలో చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ తీర్పు వెలువడిన మూడేళ్ల తర్వాత 2011 సెపె్టంబరు 20న ట్రిబ్యూనల్ సూచించిన సెక్షన్ 51 కింద బోర్డు సీఈఓ నోటీసులిచ్చారు. తర్వాత జిల్లా వక్ఫ్ అధికారులు కలెక్టర్‌కు పలుమార్లు లేఖలు రాశారు. ఈ భూమి రిజి్రస్టేషన్‌ను రద్దు చేయాలని 2019లో కర్నూలు జిల్లా కలెక్టర్ నోటీసులిచ్చారు. రామోజీ తన పలుకుబడితో రిజి్రస్టేషన్ అధికారులను భయపెట్టి నోటీసులు అమలు కాకుండా చూసుకున్నారు. దీంతో ఇప్పటికీ ఆ భూమి ఈనాడు చెరలోనే ఉండిపోయింది.
రామోజీరావు ఆక్రమించిన భూమిలో రెండు బోర్డులు ఏర్పాటు చేశాడు. అందులో ‘‘దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్.. యాజ్ ఫర్ ది జడ్జిమెంట్ డేటెడ్ 22–04–2008 ఆఫ్ ఏపీ వక్ఫ్ ట్రిబ్యునల్.. ట్రెస్‌పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్’’ అని రాశాడు. దీన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారట! అతిక్రమించింది ఎవరు రామోజీ? నువ్వు, నీ కుమారుడు కాదా? వక్ఫ్ చట్టాన్ని అతిక్రమించి కబ్జా చేసిందే మీరు. ఈ బోర్డు చూస్తుంటే దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్లుంది. మిమ్మల్ని చూసే ఈ నానుడి పుట్టుకొచి్చంది కాబోలు.
ఆ జడ్జిమెంట్‌లో ఏముందో మీకు తెలియకపోతే ఇంగ్లిష్ తెలిసిన వాళ్లెవరితో అయినా చదివించుకోండి. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం కాకుండా పూర్తి స్థాయి చర్యలకు ‘వక్ఫ్ యాక్ట్ సెక్షన్లు 51, 52 కింద నోటీసులిచ్చే అధికారం రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓకు సంపూర్ణంగా ఉందని స్పష్టంగా చెప్పింది. ఆ తీర్పు మేరకే ఆ తర్వాత మీకు సెక్షన్ 51 కింద నోటీసులివ్వడం నిజం కాదా? ఆ భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని 2019లో కర్నూలు జిల్లా కలెక్టర్ నోటీసులు ఇవ్వడం వాస్తవం కాదా? ఆ ఆదేశాలు అమలు కాకుండా మీరు బెదిరించలేదా? ఇన్ని వాస్తవాలమధ్య ఆ భూమి తమదని బోర్డు పెట్టడానికి కొంచెమైనా సిగ్గుండాలి.
సమగ్ర విచారణలో బండారం బట్టబయలు
కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ తిరుపతి సాయి మండల సర్వేయర్‌తో కలిసి సమగ్ర విచారణ జరిపారు. 2019 ఆగస్టు 20వ తేదీన కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. సర్వే నంబర్ 80లోని 4.68 ఎకరాలు ఆర్.ఎస్.ఆర్, ఆర్.ఓ.ఆర్ రికార్డ్స్, ఆన్ లైన్ అడంగల్ ప్రకారం అది మసీదు ఇనామ్‌కు చెందిన భూమి అని స్పష్టం చేశారు. అదే సర్వే నంబర్‌లోని 2.78 ఎకరాల భూమిని 1995 డిసెంబరు 15 తేదీన ఈనాడు పేపర్‌కు చెందిన ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిందని నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక, ఇతరత్రా పరిశీలన అనంతరం 2019 అక్టోబర్ 14వ తేదీన అప్పటి జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆ రిజి్రస్టేషన్‌ను రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.
అది వంద శాతం వక్ఫ్ బోర్డు భూమే
ఈనాడు సంస్థ ఆ«దీనంలో ఉన్న సర్వే నంబర్ 80లోని 4.68 ఎకరాల భూమి పక్కాగా వంద శాతం వక్ఫ్ బోర్డు భూమే. వక్ఫ్ గెజిట్‌లో కూడా స్పష్టంగా ఉంది. ఆ భూమి మసీదుకే దక్కాలని నేను పని చేసిన కాలంలో పలుసార్లు నోటీసులు జారీ అయ్యాయి. అయినా స్పందించ లేదు. రాష్ట్ర బోర్డు అధికారులకు చెప్పాం. వాళ్లు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. వాటిని వాళ్లు ఖాతరు చేయలేదు. – నూర్ మహమ్మద్, వక్ఫ్ బోర్డు రిటైర్డు ఇన్‌స్పెక్టర్
మసీదు భూమిని అన్యాయంగా లాక్కున్నారు
మునగాలపాడు గ్రామానికి చెందిన జామియా మసీదుకు చెందిన 4.68 ఎకరాల భూమిని గతంలో ముతవల్లి నుంచి ఈనాడు వాళ్లు అక్రమంగా పొందారు. చేసిన తప్పులను ఎత్తిచూపాల్సిన పత్రిక యజమానులే ఇలా అన్యాయానికి పాల్పడ్డారు. దీనిపై గతంలో మా సంఘం ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చాలా మంది కలెక్టర్లకు విన్నపాలు చేశాం. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.25 కోట్లకు పైగా ఉంటుంది. – సయ్యద్ రోషన్ అలీ, రిటైర్డు తహశీల్దార్, ఏపీ ముస్లిం కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు
పొలం వద్దకు వెళ్తే అరెస్టు చేయించారు
ఈనాడు సంస్థ తమ ఆ«దీనంలో పెట్టుకున్న భూమి పక్కాగా మా గ్రామ మసీదుకు చెందినదే. దీనిని కాపాడుకునేందుకు మా గ్రామస్తులు, పెద్దలతో కలిసి ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆ భూమి మసీదుకు చెందినదని బోర్డులు పెట్టబోయాము. అది మా భూమి అని ఈనాడు బోర్డు పెట్టింది. ఆ భూమి వద్దకు వెళ్లిన నన్ను పోలీసులతో అరెస్టు చేయించారు. మమ్మల్ని భయపెట్టారు. ఈ భూమి కోర్టులో ఉందని అనేక ఇబ్బందులకు గురి చేశారు. – షేక్షావలి, జామియా మసీదు ముతవల్లి, మునగాలపాడు, కర్నూలు మండలం, కర్నూలు జిల్లా
Comments
Please login to add a commentAdd a comment