land encroachment
-
కబ్జాకోరు రామోజీ
రోజూ ఉషోదయం నుంచే గురివింద నీతులు చెప్పే ఓ రామోజీ.. దీనికి మీరేం సమాధానం చెబుతారు? వక్ఫ్ బోర్డు ఆస్తుల గురించి, ఆ చట్టం గురించి నీకు తెలీదా? లేక ఈ చట్టం చంద్రబాబు చుట్టం అనుకున్నావా? నాకు వర్తించదనే గర్వమా? ఒక మత సంస్థ భూమిని ఇంత దౌర్జన్యంగా, నిస్సిగ్గుగా లాక్కొన్నదే కాకుండా.. దౌర్జన్యం చేయడం, బెదిరించడం, పోలీసులను అడ్డుపెట్టుకుని తప్పుడు కేసులు పెడతామని హెచ్చరించడం..ఇవన్నీ మీ చంద్రబాబును చూసుకునే కదా! ఈనాడును అడ్డుపెట్టుకుని ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నావా? అవునులే.. ఫిల్మ్ సిటీ భూములే కొట్టేశాను.. ఇవెంత అనుకున్నావేమో.. ఇలాంటి బాగోతాలు ప్రతి జిల్లాలోనూ లెక్కలేనన్ని ఉంటే ఇదొక్కటేగా బయటపడింది అనుకోవచ్చు.. తీగ లాగితే డొంక కదులుతుందన్న సామెతను ఓసారి గుర్తు చేసుకోండి.కర్నూలు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కర్నూలు నగర సమీపంలో అత్యంత విలువ చేసే వక్ఫ్ బోర్డు (మసీదుకు చెందిన) భూమిని ఈనాడు రామోజీరావు అక్రమంగా చేజిక్కించుకున్నారు. తనకున్న పలుకుబడి, పత్రికను అడ్డం పెట్టుకుని అడ్డదారిలో వెళ్లి విలువైన భూమిలో పాగా వేశారు. వక్ఫ్ బోర్డు నోటీసులు, కోర్టులను లెక్క చేయక తను చెప్పిందే వేదమంటూ ఏకంగా ఆ భూమి తనదేనంటూ బోర్డు కూడా పెట్టారు. కర్నూలు–హైదరాబాద్ రహదారిలో సంతోష్ నగర్ దాటిన తర్వాత ఈనాడు జిల్లా ఎడిషన్ (ఎడిటోరియల్ విభాగం + ప్రింటింగ్) ఏర్పాటు చేసిన చోటుకు పక్కనే వక్ఫ్ భూమి ఉంది. రామోజీ తన కుమారుడు, ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఎండీ సీహెచ్ కిరణ్ ద్వారా పావులు కదిపి.. ఈ కంపెనీ పేరుతో ఆ భూమిని కొనుగోలు చేసినట్లు మత పెద్ద ఒకరిని లోబరుచుకుని రికార్డులు సృష్టించారు. వక్ఫ్ భూములను కొనడం, అమ్మడం చట్టరీత్యా నేరమని అందరికీ గురివింద నీతులు చెప్పే రామోజీ రావు ఇలా అక్రమ మార్గంలో ఈ భూమిని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ భూమిని కాపాడుకునే విషయమై వక్ఫ్ అధికారులు పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రామోజీ పలుకుబడి ముందు అవి సరిపోలేదు. కన్ను పడింది.. కబ్జా చేశాడు.. కర్నూలు నగర శివారులోని మునగాలపాడు గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 80లో 4.68 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది. రెవెన్యూ రికార్డుల్లో, 1963 అక్టోబరు 24వ తేదీన ముద్రించిన వక్ఫ్ గెజిట్‌లో ఈ భూమి గ్రామ జామియా మసీదుకు చెందిన భూమి అని స్పష్టంగా నమోదై ఉంది. అంటే మసీదుకు చెందిన ఇనాం భూమి. కాశ్నిర్ – కన్యాకుమారి 44వ నంబర్ జాతీయ రహదారి (గతంలో ఎన్‌హెచ్–7)ని ఆనుకుని ఉంది.ఈ 4.68 ఎకరాల్లో ఈనాడు గ్రూపునకు చెందిన ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ సంస్థ 2.78 ఎకరాలను 1995 డిసెంబర్ 15న అప్పటి ముతవల్లి మజీద్ హుసేన్‌ను మభ్యపెట్టి, భయపెట్టి అక్రమంగా రిజిస్టర్ చేయించుకుంది. అప్పట్లో ఈ స్థలంలో తన పత్రిక కార్యాలయం భవన నిర్మాణానికి ప్రయత్నించగా, వివాదం చెలరేగి, స్థానికంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో వక్ఫ్ భూమి పక్కనే ఉన్న మరో ప్రైవేటు స్థలంలో ఈనాడు కార్యాలయాన్ని నిర్మించుకున్నారు. కానీ ఈ భూమిపై కన్ను పడటంతో ఆ తర్వాత తప్పుడు మార్గంలో చేజిక్కించుకుని అక్రమంగా తన ఆ«దీనంలోనే ఉంచుకున్నారు. ఎండీ కిరణ్ పేరుతో నోటీసులు మసీదులు, దర్గాల నిర్వహణ కోసం గతంలో పూరి్వకులు వక్ఫ్‌కు భూములు, స్థలాలు బోర్డుకు స్వా«దీన పరుస్తారు. వీటిని ముతవల్లులు నిర్వహించి, వాటి ద్వారా వచ్చే సొమ్ముతో మసీదు నిర్వహణ ఖర్చులు పోనూ మిగిలిన సొమ్ములో కొంత బోర్డుకు కౌలు (గుత్త) రూపంలో చెల్లించాలి. ఇలాంటి భూమిని రామోజీ అక్రమంగా పొందారని గుర్తించిన వక్ఫ్ బోర్డు.. ఆ భూమిని తమకు స్వా«దీన పరచాలని ఈనాడు సంస్థ, ఉషోదయ పబ్లికేషన్స్ ఎండీ కిరణ్ పేరుతో వక్ఫ్ అధికారులు పలుసార్లు నోటీసులు జారీ చేశారు. వాటన్నింటికీ రామోజీ, ఆయన తనయుడు ఇసుమంతైనా స్పందించలేదు. ముతవల్లిని అరెస్టు చేయించిన ఈనాడు జామియా మసీదుకు చెందిన సర్వే నంబర్ 80లోని మొత్తం 4.68 ఎకరాల ఇనాం భూమిలో ఈనాడు – ఉషోదయ సంస్థ 2.78 ఎకరాలను అప్పటి ముతవల్లి మజీద్ హుసేన్ నుంచి అక్రమంగా పొందడంతో మిగిలిన 1.90 ఎకరాల భూమిని సాగు చేసుకొని మసీదు బాగోగులు, నిర్వహణ కోసం ఉపయోగించుకుందామని ప్రస్తుత ముతవల్లి షేక్షావలి ఆ భూమిలోకి వెళ్లారు. ఈనాడు యాజమాన్యం తమ సంస్థ ప్రతినిధుల ద్వారా ముతవల్లి షేక్షావలిని తీవ్రంగా బెదిరించింది. ఆ భూమి అంశం కోర్టులో ఉందని, తమ భూమిలో అక్రమంగా ప్రవేశించారంటూ పోలీసులతో అరెస్టు చేయించింది. దీంతో వక్ఫ్ బోర్డు అధికారులు జోక్యం చేసుకుని వాస్తవాలన్నీ వివరించడంతో పోలీసులు ఆయన్ను వదిలేశారు. వక్ఫ్ చట్టం గురించి తెలీదా రారా.. వక్ఫ్ ఆస్తులు ఎప్పటికీ వక్ఫ్ బోర్డుకు చెందినవే అని గతంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు ఇచి్చంది. అవి మసీదులు, ఆ మత సంస్థలకే చెందాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. వక్ఫ్ ఆక్ట్ 52ఏ సవరణ (2013 నవంబరు 1వ తేదీ) ప్రకారం వక్ఫ్ బోర్డు భూములు కొనుగోలు చేసిన, అమ్మిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. ఇంత కఠినంగా చట్టాలున్నా, ఈనాడు రామోజీరావు (రారా) చంద్రబాబు ద్వారా వాటిని తన చుట్టాలుగా మార్చుకొని అనుభవిస్తున్నారు.కాగా, రాష్ట్రంలోనే అత్యధిక వక్ఫ్ ఆస్తులు కర్నూలు జిల్లాలో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,104 సంస్థలు వక్ఫ్ బోర్డు పరిధిలో ఉండగా, 741 సంస్థలు ఆస్తులు కలిగి ఉన్నాయి. వీటి పేర్లతో 22,599.89 ఎకరాల భూమి గెజిట్‌లో నమోదైంది. మరో 10 వేల ఎకరాలు గెజిట్‌లో నమోదు కాని భూములున్నాయి. ప్రస్తుతం రామోజీ రావు ఆక్రమించిన భూమి గెజిట్‌లో నమోదైనది కావడం గమనార్హం. చర్యలు తీసుకోకుండా ఒత్తిడి రామోజీరావు చెరలో అక్రమంగా ఉన్న వక్ఫ్ భూములను రక్షించాలని కోరుతూ అప్పట్లో స్థానికులు ఆందోళనలు చేశారు. జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాలిచ్చారు. దీంతో రాష్ట్ర వక్ఫ్ బోర్డు అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు. అక్రమంగా పొందిన వక్ఫ్ భూములను స్వా«దీనం చేసుకునే ముందు వక్ఫ్ యాక్ట్ 51, 52 సెక్షన్ల కింద బోర్డు నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అయితే బెదిరింపులు, ఒత్తిళ్ల కారణంగా అధికారులు వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 54 కింద ఉషోదయ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ కిరణ్‌కు 1999 జూన్ 7న నోటీసులిచ్చారు. ఈ సెక్షన్ నిందితులు అని నిర్ధారించాకే చర్య తీసుకోవడానికి వర్తిస్తుందని అధికారులు చెబుతున్నారు.అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిడి తేవడంతోనే అధికారులు ఈ తిరకాసు సెక్షన్ కింద నోటిసులిచ్చారని తెలుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న రామోజీరావు వక్ఫ్ బోర్డు నోటీసులను సవాలు చేస్తూ ఏపీ వక్ఫ్ ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. ఎనిమిదేళ్ల పాటు విచారణ సాగింది. 2008 ఏప్రిల్ 22న తీర్పు వెల్లడైంది. గెజిట్ నోటిఫికేషన్‌తో పాటు సర్వే కమిషనర్ రిపోర్టు ఆధారంగా సర్వే నంబర్ 80లో ఉన్న భూమి వక్ఫ్ భూమిగా నిర్ధారించింది. అధికారుల తప్పిదాన్ని ఎత్తి చూపి, వక్ఫ్ బోర్డు ఇచ్చిన నోటిసుల సెక్షన్లు సరైనవి కావని తప్పుబట్టింది.పూర్తి స్థాయి చర్యలకు ‘వక్ఫ్ యాక్ట్ సెక్షన్లు 51, 52 కింద నోటీసులిచ్చే అధికారం వక్ఫ్ బోర్డు సీఈఓకు సంపూర్ణంగా ఉందని తీర్పునిచి్చందని అధికారులు చెప్పారు. వక్ఫ్ యాక్ట్ సెక్షన్ 54 కింద నోటీసులు జారీ చేసి, భూమిని స్వా«దీనం చేసుకోడానికి చట్టం ఒప్పుకోదని.. సరైన మార్గంలో చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పింది. ఈ తీర్పు వెలువడిన మూడేళ్ల తర్వాత 2011 సెపె్టంబరు 20న ట్రిబ్యూనల్ సూచించిన సెక్షన్ 51 కింద బోర్డు సీఈఓ నోటీసులిచ్చారు. తర్వాత జిల్లా వక్ఫ్ అధికారులు కలెక్టర్‌కు పలుమార్లు లేఖలు రాశారు. ఈ భూమి రిజి్రస్టేషన్‌ను రద్దు చేయాలని 2019లో కర్నూలు జిల్లా కలెక్టర్ నోటీసులిచ్చారు. రామోజీ తన పలుకుబడితో రిజి్రస్టేషన్ అధికారులను భయపెట్టి నోటీసులు అమలు కాకుండా చూసుకున్నారు. దీంతో ఇప్పటికీ ఆ భూమి ఈనాడు చెరలోనే ఉండిపోయింది. రామోజీరావు ఆక్రమించిన భూమిలో రెండు బోర్డులు ఏర్పాటు చేశాడు. అందులో ‘‘దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్.. యాజ్ ఫర్ ది జడ్జిమెంట్ డేటెడ్ 22–04–2008 ఆఫ్ ఏపీ వక్ఫ్ ట్రిబ్యునల్.. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్’’ అని రాశాడు. దీన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటారట! అతిక్రమించింది ఎవరు రామోజీ? నువ్వు, నీ కుమారుడు కాదా? వక్ఫ్ చట్టాన్ని అతిక్రమించి కబ్జా చేసిందే మీరు. ఈ బోర్డు చూస్తుంటే దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్లుంది. మిమ్మల్ని చూసే ఈ నానుడి పుట్టుకొచి్చంది కాబోలు. ఆ జడ్జిమెంట్‌లో ఏముందో మీకు తెలియకపోతే ఇంగ్లిష్ తెలిసిన వాళ్లెవరితో అయినా చదివించుకోండి. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 54 ప్రకారం కాకుండా పూర్తి స్థాయి చర్యలకు ‘వక్ఫ్ యాక్ట్ సెక్షన్లు 51, 52 కింద నోటీసులిచ్చే అధికారం రాష్ట్ర వక్ఫ్ బోర్డు సీఈఓకు సంపూర్ణంగా ఉందని స్పష్టంగా చెప్పింది. ఆ తీర్పు మేరకే ఆ తర్వాత మీకు సెక్షన్ 51 కింద నోటీసులివ్వడం నిజం కాదా? ఆ భూమి రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని 2019లో కర్నూలు జిల్లా కలెక్టర్ నోటీసులు ఇవ్వడం వాస్తవం కాదా? ఆ ఆదేశాలు అమలు కాకుండా మీరు బెదిరించలేదా? ఇన్ని వాస్తవాలమధ్య ఆ భూమి తమదని బోర్డు పెట్టడానికి కొంచెమైనా సిగ్గుండాలి.సమగ్ర విచారణలో బండారం బట్టబయలుకలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దార్ తిరుపతి సాయి మండల సర్వేయర్‌తో కలిసి సమగ్ర విచారణ జరిపారు. 2019 ఆగస్టు 20వ తేదీన కలెక్టర్‌కు నివేదిక సమర్పించారు. సర్వే నంబర్ 80లోని 4.68 ఎకరాలు ఆర్.ఎస్.ఆర్, ఆర్.ఓ.ఆర్ రికార్డ్స్, ఆన్ లైన్ అడంగల్ ప్రకారం అది మసీదు ఇనామ్కు చెందిన భూమి అని స్పష్టం చేశారు. అదే సర్వే నంబర్లోని 2.78 ఎకరాల భూమిని 1995 డిసెంబరు 15 తేదీన ఈనాడు పేపర్‌కు చెందిన ఉషోదయ ఎంటర్ ప్రైజెస్ నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిందని నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక, ఇతరత్రా పరిశీలన అనంతరం 2019 అక్టోబర్ 14వ తేదీన అప్పటి జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ ఆ రిజి్రస్టేషన్‌ను రద్దు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.అది వంద శాతం వక్ఫ్ బోర్డు భూమే ఈనాడు సంస్థ ఆ«దీనంలో ఉన్న సర్వే నంబర్ 80లోని 4.68 ఎకరాల భూమి పక్కాగా వంద శాతం వక్ఫ్ బోర్డు భూమే. వక్ఫ్ గెజిట్‌లో కూడా స్పష్టంగా ఉంది. ఆ భూమి మసీదుకే దక్కాలని నేను పని చేసిన కాలంలో పలుసార్లు నోటీసులు జారీ అయ్యాయి. అయినా స్పందించ లేదు. రాష్ట్ర బోర్డు అధికారులకు చెప్పాం. వాళ్లు పలుమార్లు నోటీసులు ఇచ్చారు. వాటిని వాళ్లు ఖాతరు చేయలేదు. – నూర్ మహమ్మద్, వక్ఫ్ బోర్డు రిటైర్డు ఇన్స్పెక్టర్ మసీదు భూమిని అన్యాయంగా లాక్కున్నారు మునగాలపాడు గ్రామానికి చెందిన జామియా మసీదుకు చెందిన 4.68 ఎకరాల భూమిని గతంలో ముతవల్లి నుంచి ఈనాడు వాళ్లు అక్రమంగా పొందారు. చేసిన తప్పులను ఎత్తిచూపాల్సిన పత్రిక యజమానులే ఇలా అన్యాయానికి పాల్పడ్డారు. దీనిపై గతంలో మా సంఘం ఆందోళన చేసినా ఎవరూ పట్టించుకోలేదు. చాలా మంది కలెక్టర్లకు విన్నపాలు చేశాం. ఇప్పుడు ఆ భూమి విలువ రూ.25 కోట్లకు పైగా ఉంటుంది. – సయ్యద్ రోషన్ అలీ, రిటైర్డు తహశీల్దార్, ఏపీ ముస్లిం కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు పొలం వద్దకు వెళ్తే అరెస్టు చేయించారు ఈనాడు సంస్థ తమ ఆ«దీనంలో పెట్టుకున్న భూమి పక్కాగా మా గ్రామ మసీదుకు చెందినదే. దీనిని కాపాడుకునేందుకు మా గ్రామస్తులు, పెద్దలతో కలిసి ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఆ భూమి మసీదుకు చెందినదని బోర్డులు పెట్టబోయాము. అది మా భూమి అని ఈనాడు బోర్డు పెట్టింది. ఆ భూమి వద్దకు వెళ్లిన నన్ను పోలీసులతో అరెస్టు చేయించారు. మమ్మల్ని భయపెట్టారు. ఈ భూమి కోర్టులో ఉందని అనేక ఇబ్బందులకు గురి చేశారు. – షేక్షావలి, జామియా మసీదు ముతవల్లి, మునగాలపాడు, కర్నూలు మండలం, కర్నూలు జిల్లా -
మాజీ మంత్రి మల్లారెడ్డి అధీనంలోని స్థలం స్వాధీనం
మేడ్చల్ రూరల్/కంటోన్మెంట్: హైదరాబాద్ శివారు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కమలానగర్ హెచ్ఎండీఏ లే అవుట్లో మాజీమంత్రి, ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అధీనంలో ఉన్న 10 గుంటల (2,500 గజాలు) స్థలాన్ని (సర్వే నంబర్ 388 పార్ట్, 523, 524 పార్ట్లు) మున్సిపల్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఆ స్థలంలో వేసిన రోడ్డును ధ్వంసం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మల్లారెడ్డి మంత్రిగా అధికారాన్ని అడ్డుపెట్టుకుని 10 గుంటల స్థలాన్ని కబ్జా చేశారని, తన కళాశాలలకు వెళ్లేందుకు రోడ్డు ఏర్పాటు చేశారని పేర్కొంటూ ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి మల్కాజిగిరి ఎంపీగా ఉన్న సమయంలో అధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఆ ఫిర్యాదు పెండింగ్‌లోనే ఉంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇటీవల కాంగ్రెస్ నాయకులు కొందరు.. మల్లారెడ్డి లే అవుట్ స్థలాన్ని కబ్జాచేసి రోడ్డు వేసుకున్నారంటూ ఫిర్యాదు చేశారు. గతంలో రేవంత్‌రెడ్డి చేసిన ఫిర్యాదు పత్రాన్ని తమ ఫిర్యాదుకు జత చేశారు. దీంతో స్పందించిన ప్రభుత్వం కబ్జాపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కలెక్టర్ ఆదేశాలతో శనివారం ఉదయం మున్సిపల్ కమిషనర్ రాములు, అధికారులు సదరు స్థలంలో రోడ్డును ధ్వంసం చేసి, స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 10 గుంటల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మున్సిపల్ కమిషనర్ రాములు తెలిపారు. మల్లారెడ్డి గార్డెన్స్‌కు నోటీసులు మరోవైపు మల్లారెడ్డి కుటుంబం అధీనంలో ఉన్న మల్లారెడ్డి గార్డెన్స్ ఆవరణలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతకు కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇటీవల నోటీసులు (కంటోన్మెంట్స్ యాక్ట్ –2006, సెక్షన్ 320 ప్రకారం) జారీ చేశారు. దీంతో ఏ క్షణమైనా అధికారులు కూల్చివేతలు చేపట్టే అవకాశం ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. కంటోన్మెంట్ పరిధిలో పూర్తిగా రక్షణ శాఖ ఆధీనంలో ఉండే ఓల్డ్ గ్రాంట్ బంగళాలు (ఓజీబీ) 100కు పైగా ఉన్నాయి. ఇవి హోల్డర్ ఆఫ్ ఆక్యుపెన్సీ రైట్ (హెచ్ఓఆర్) కింద కేటాయించిన వారి పేరిట ఉంటాయి. అయితే ఈ బంగళాలను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇతరులకు విక్రయించకూడదు. చుట్టుపక్కల స్థలాల్లో నూతన నిర్మాణాలు చేపట్టకూడదు. కమర్షియల్‌గా మార్చకూడదు లాంటి పలు కఠిన నిబంధనలు ఉన్నాయి. అయితే కొన్ని బంగళాల్లో కొందరు అనధికారికంగా నివాసం ఉంటున్నారు. అంతేగాకుండా నిబంధనలు ఉల్లఘించారు. దీంతో 2007లో బోర్డు అధికారులు 42 బంగళాల్లో ఉంటున్నవారికి నోటీసులు జారీ చేశారు. దీనిపై కోర్టు స్టే ఇచ్చింది. అయితే 2013–2017 మధ్య కాలంలో 20కి పైగా బంగళా స్థలాల్లో అక్రమ నిర్మాణాలను బోర్డు అధికారులు కూల్చివేశారు. కొన్నింటిని స్వాధీనం చేసుకున్నారు. మల్లారెడ్డి గార్డెన్స్ సైతం నాటి కూల్చివేతల జాబితాలో ఉన్నప్పటికీ, వివిధ కారణాల వల్ల కూల్చివేతలు నిలిచిపోయాయి. తాజాగా హైకోర్టు స్టే ఎత్తివేయడంతో కూల్చివేతలకు రంగం సిద్ధం చేసిన బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు. జీఎల్ఆర్ సర్వే నంబర్ 537లోని 7.80 ఎకరాల్లో విస్తరించిన ఓజీబీ స్థలంలో మల్లారెడ్డి గార్డెన్స్, చందన గార్డెన్స్, సీఎంఆర్ హైస్కూల్, సీఎంఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ కొనసాగుతున్నాయి. -
ఆక్రమణల నుంచి దేవుడి భూములకు విముక్తి
సాక్షి, అమరావతి : దేవుడి భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేలా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బుధవారం పకడ్బందీ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది. ఆక్రమణలపై కోర్టు ప్రక్రియ ద్వారా కాలయాపన లేకుండా ఆక్రమణదారునికి కేవలం ఒక నోటీసు ఇచ్చి వారం తర్వాత ఆ భూమిని స్వాధీనం చేసుకునే అధికారాన్ని దేవదాయ శాఖ అధికారులకు కల్పించింది. ఈ మేరకు 1987, 2007 దేవదాయ శాఖ చట్టాల్లోని 83, 84, 85, 86, 93, 94 సెక్షన్లలో పలు మార్పులు చేస్తూ, కొన్నింటిని తొలగిస్తూ ప్రభుత్వం కొత్త ఆర్డినెన్స్‌ను రూపొందించింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదంతో న్యాయ శాఖ ఈ ఆర్డినెన్స్‌ను విడుదల చేసింది. తక్షణమే ఆర్డినె¯Œ్స అమలులోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. ఇప్పటివరకు జరుగుతున్నదిదీ.. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం దేవుడి భూములను ఎవరైనా ఆక్రమిస్తే దేవదాయ శాఖ అధికారులు ముందు ఎండోమెంట్ ట్రిబ్యునల్‌లో పిటీషన్ వేయాల్సి వచ్చేది. ట్రిబ్యునల్‌లో ఆక్రమణదారులు లాయర్ల ద్వారా వారి వాదనలు వినిపించుకోవచ్చు. ట్రిబ్యునల్ ఆ భూములు దేవదాయ శాఖవని తేల్చే వరకు వాటిని అనుభవించే వెసులుబాట ఆక్రమణదారులకే ఉంటుంది. ఒకవేళ ట్రిబ్యునల్ దేవదాయ శాఖకు అనుకూలంగా తీర్పు ఇస్తే, దానిపై కింద నుంచి పై కోర్టుల వరకు వెళ్లి, కాలయాపన చేసే వెసులుబాటు ఆక్రమణదారులకే ఉంది. దీంతో భూముల వివాదం ఏళ్ల తరబడి ఎండోమెంట్ ట్రిబున్యల్, కోర్టులలో కొనసాగుతోంది. అత్యధిక కేసుల్లో పదేళ్లకు పైనే సాగుతోందని, అంత కాలం ఆ భూములు ఆక్రమణదారులే అనుభవిస్తున్నారని అధికారులు వెల్లడించారు. ఫలితంగా వేలాది ఎకరాల దేవుడి భూములు ఆక్రమణదారుల చేతిలోనే ఉన్నాయి. ఇప్పుడు జరగబోయేది ఇదీ.. తాజా ఆర్డినెన్స్ ప్రకారం.. ఆక్రమణదారు నుంచి భూముల స్వాధీనం చేసుకోవడానికి దేవదాయ శాఖ అధికారులు ఆ భూమి దేవుడిదని పేర్కొంటూ ఒక నోటీసు ఇస్తారు. ఆక్రమణదారు జవాబు చెప్పుకోవడానికి ఓ వారం వ్యవధి ఇస్తారు. వారం దాటిన వెంటనే పోలీసు, రెవిన్యూ అధికారుల çసహాయంతో ఆ భూములను స్వాధీనం చేసుకోవచ్చు. ఈమేరకు తాజా ఆర్డినెన్స్ ద్వారా దేవదాయ శాఖ అధికారులకు అన్ని అధికారాలు దఖలు పడతాయి. న్యాయపరమైన చిక్కులు, ఆలస్యం లేకుండా దేవుడి భూములు దేవదాయ శాఖ చేతుల్లోకి వస్తాయి. ఈ స్వాధీన ప్రక్రియపై అభ్యంతరాలు ఉంటే ఆక్రమణదారుడే కోర్టులకు వెళ్లి, అవి తమ భూములని నిరూపించుకోవాల్సి ఉంటుందని దేవదాయశాఖ అధికారులు తెలిపారు. -
పేట్బషీరాబాద్లో రూ.కోట్ల విలువైన భూమికి రెక్కలు
జాతీయ రహదారికి దగ్గరలో ఉంది. ఇక్కడ గజం స్థలం విలువ లక్ష రూపాయల పైమాటే. ఇంకేముంది రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపట్టడం.. నోటరీలు అడ్డుపెట్టుకుని విద్యుత్ మీటర్లు తెచ్చుకోవడం..రెవెన్యూ అధికారులు కూల్చివేతకు వస్తే ‘చేతులు తడిపి’ వెళ్లగొట్టడం షరా మామూలుగా మారింది. ఈ కోవలోనే సుమారు రూ.200 కోట్ల విలువ చేసే 8 ఎకరాలకు పైగా ప్రభుత్వ స్థలం కబ్జాకు గురయ్యింది. కబ్జా వాస్తవమేనని నిర్ధారణకు వచ్చినప్పటికీ కోర్టు కేసులు ఉన్నాయంటూ వాటిని రెవెన్యూ యంత్రాంగం తొలగించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. కుత్బుల్లాపూర్ మండలం పేట్‌బషీరాబాద్ సర్వే నంబర్.25/1, 25/2 ఆక్రమణలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. కుత్బుల్లాపూర్: పేట్ బషీరాబాద్ సర్వే నంబర్.25/1, 25/2లలో 57.38 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. జాతీయ రహదారికి దగ్గరగా ఉండటంతో ఇక్కడ గజం ఏకంగా రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు పలుకుతుంది. ఈ స్థలంపై రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం వహించడంతో కబ్జాదారులకు కలిసి వచ్చింది. రాత్రికి రాత్రి బేస్మెంట్లు, గదులు, షెడ్ల నిర్మాణం చేస్తూ కబ్జాకు తెర లేపారు. ఈ క్రమంలో సుమారు 8.06 ఎకరాల స్థలం ఆక్రమణకు గురైందని రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించగా తేలింది. అయితే వాటిని తొలగించాల్సిన అధికారులు కేవలం నోటీసులు జారీ చేసి కబ్జాదారులు కోర్టుకు వెళ్లే విధంగా సహకరించినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో అక్కడ నిర్మాణం చేపట్టిన వారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుని కూల్చివేతల జోలికి రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ స్థలం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది. దేవుడు వరమిచ్చినా... 2008 మార్చి 25వ తేదీన జీఓ నంబర్ 424 ద్వారా అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పేట్‌బషీరాబాద్ సర్వే నంబర్.25/1, 25/2లలో మొత్తం 38 ఎకరాల స్థలాన్ని జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాటి నుంచి నేటి వరకు ఇక్కడ ఎన్నో అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు. కోర్టు వివాదంలో ఉన్న ఈ స్థలం విషయంలో 2022 ఆగస్టు 25వ తేదీన సర్వోన్నత న్యాయస్థానం.. సదరు స్థలాన్ని జర్నలిస్టులకు అప్పగించాలని తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మండల రెవెన్యూ అధికారులు అది తమ పరిధి కాదు అన్నట్లుగా వ్యవహరించడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ జరిగిన అక్రమ నిర్మాణాలపై జర్నలిస్టు ప్రతినిధులు మండల రెవెన్యూ అధికారులు, పోలీసులకు ఫిర్యాదు రూపంలో అందజేశారు. కాగా మల్కాజిగిరి ఆర్డీఓ మల్లయ్య ఈ స్థలాన్ని సందర్శించి వెళ్లారే తప్ప అక్రమ నిర్మాణాలను చూసి కూల్చివేయకుండా వదిలివేయడం గమనార్హం. ఐదెకరాల స్థలంపై ఆధిపత్యం... ప్రభుత్వ స్థలంపై ఓ వ్యక్తి మాజీ నక్సలైట్‌ని అంటూ కబ్జాకు దిగాడు. అప్పట్లో 60 గజాల్లో ఓ గది నిర్మించుకుని ఉంటూ వచ్చిన అతగాడు ఏకంగా 5 ఎకరాల స్థలం నాదే అంటూ.. ఇప్పుడు అధికారులకే సవాలు విసురుతున్నాడు. కోట్ల రూపాయల విలువ చేసే ఈ స్థలం ప్రభుత్వానిది. గతంలో పలు పర్యాయాలు చుట్టూ కంచె వేస్తే రెవెన్యూ అధికారులు తొలగించారు. ఇలా పలు పర్యాయాలు తొలగించినా.. తిరిగి అదే స్థలంలో కంచె ఏర్పాటు చేయడం జరుగుతూ వస్తోంది. అంతేకాకుండా ఇక్కడ విద్యుత్ మీటర్లు చెట్లకు ఉంటాయి. ముందస్తుగా పథకం ప్రకారం పదులకొద్దీ మీటర్లను తీసుకుని గదులు నిర్మించే లోపు రెవెన్యూ అధికారులు గుర్తిస్తారని తీసుకున్న మీటర్లు చెట్లకు వేలాడుతుండటం విశేషం. ఈ విషయమై ఆర్ఐ రేణుకను సాక్షి వివరణ కోరగా.. రెండు, మూడు రోజుల్లో సర్వే నిర్వహించి ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. (క్లిక్: మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది!) -
హద్దులు దాటిన ఆక్రమణ.. 136 కోట్ల సర్కార్ భూమికి ఎసరు!
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ప్రభుత్వ భూములకు రక్షణ కల్పించాల్సిన ప్రజాప్రతినిధులే వాటి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. మున్సిపల్ కార్పొరేషన్, హెచ్ఎండీఏ ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా భూమిని ప్లాట్లుగా మార్చి.. హద్దురాళ్లు నాటి అమ్మకానికి పెట్టారు. అధికార పార్టీకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త ఈ భూ ఆక్రమణలో ప్రధాన పాత్రదారుగా ఉండటంతో స్థానిక మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ అధికారులు, ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నా.. అధికారులు కిమ్మనకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.156 కోట్ల భూమిపై కన్ను రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం కుర్మల్‌గూడ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 80/1లో 5.32 ఎకరాలు, సర్వే నం. 80/2లో 7.07 ఎకరాలు సర్కారు భూమిగా నమోదైంది. దీనిని ఆనుకుని ఉన్న సర్వే నంబర్ 80/3లోని 4.23 ఎకరాల భూమి ప్రభుత్వం మోడల్ గ్రేవీ యార్డ్ (క్రిస్టియన్ శ్మశాన వాటిక)కు, సర్వే నం. 80/19లోని 10.27 ఎకరాల భూమిని మోడల్ గ్రేవీ యార్డ్ (ముస్లిం శ్మశాన వాటిక)గా నమోదై ఉంది. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ వెబ్సైట్లోనూ ఇదే స్పష్టం చేస్తోంది. బహిరంగ మార్కెట్లో ఈ 13 ఎకరాల విలువ రూ.156 కోట్ల పైమాటే. విలువైన ఈ ప్రభుత్వ భూములపై బడంగ్పేట్ నగరపాలక సంస్థ పరిధిలోని అధికార పారీ్టకి చెందిన ఓ కార్పొరేటర్ భర్త కన్నేశారు. వీటిపై తమకే హక్కులు ఉన్నాయని పేర్కొంటూ ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే సర్వే నం. 80/1లోని కొంత భూమిని ఆక్రమించారు. ఆ భూమిని చదును చేశారు. ప్లాట్లుగా చేసి అమ్మకానికి రంగం సిద్ధం చేశారు. మూడు ఎకరాలు గుర్తించాం ప్రభుత్వ భూములను ఆక్రమించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. సర్వే నం. 80/1, 80/2లోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు ఫిర్యాదు కూడా అందింది. గురువారం ఉదయం ఆర్ఐ సహా ఇతర సిబ్బంది క్షేత్రస్థాయికి చేరుకుని పరిశీలించారు. మూడు ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు గుర్తించి, ఆ మేరకు జేసీబీతో నాటిన హద్దు రాళ్లను కూడా తొలగించాం. ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ ఓ బోర్డును కూడా నాటించాం. ఈ భూములను ఎవరు ఆక్రమించారనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. వచి్చన వెంటనే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. – జనార్దన్, తహసీల్దార్, బాలాపూర్ -
నకిలీ పట్టాలు, భూ ఆక్రమణలపై ప్రభుత్వం కొరడా
సాక్షి ప్రతినిధి, కడప : భూ దందాలతోపాటు పలు అక్రమాలపై వైఎస్ జగన్ ప్రభుత్వం కన్నెర్ర చేసింది. నకిలీ పట్టాలు, భూ ఆక్రమణలతో కొందరు అక్రమార్కులు బద్వేలు ప్రాంతంలో అలజడులు సృష్టిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలు ప్రభుత్వం దృష్టికి చేరడంతో పేదలను ఇబ్బందులకు గురి చేస్తున్న వారెవరినీ వదిలి పెట్టవద్దంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్‌లను ఆదేశించారు. తన, పర తారమత్యం లేకుండా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం తేల్చి చెప్పారు. సీఎంఓ నుంచి ఆదేశాలు అందుకున్న బద్వేలు ఆర్డీఓ ఆకుల వెంకట రమణ స్పందించారు. లోతైన విచారణకు దిగారు. బాధితులు తన వద్దకు రావాలంటూ ప్రకటించారు. దీంతో కొందరు బాధితులు తమ స్థలాలు, భూములను ఆక్రమించిన వారి వివరాలను ఆర్డీఓ, కలెక్టర్లకు అందజేశారు. వీటిపై ఆర్డీఓ లోతైన విచారణ చేపట్టారు. నకిలీ సీళ్లు, బోగస్ సంతకాలతో కొందరు నకిలీ పట్టాలు సృష్టించి పేదల స్థలాలు, భూములను ఆక్రమిస్తున్న విషయం ఆయన దృష్టికి వచ్చింది. అటువంటి వారి జాబితాను సిద్ధ చేసుకున్న ఆర్డీఓ బద్వేలు ప్రాంతంలో పోలీసులతో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పలు నకిలీ పట్టాలు, సీళ్లు, ఇతర సామగ్రి దొరికింది. దీంతో ప్రాథమికంగా 18 మందిపై కేసులు నమోదు చేశారు. సీపీఐ, టీడీపీ, ప్రజా సంఘాలు, అధికార పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు సైతం ఈ వ్యవహారంలో ఉన్నట్లు బట్టబయలైంది. బుధవారం నాటికి వీరిలో 8 మందిని అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. విచారణ కొనసాగుతోంది. ఇంకొందరిపైన కేసులు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. బద్వేలుతోపాటు పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు, గోపవరం, అట్లూరు ప్రాంతాల్లోనూ ఈ తరహా అక్రమాలపై ఆర్డీఓ లోతైన విచారణ చేపట్టారు. ఆర్మీ వారి పేర్లతో బోగస్ ఐడీలు కొందరు ఆర్మీలో ఉన్న వారి పేర్లతో బోగస్ ఐడీలు సృష్టించి కొత్త తరహా అక్రమాలకు తెరలేపారు. ఆక్రమించిన స్థలాలు, భూములు పది సంవత్సరాల క్రితమే సైనికుల పేరున పట్టాలు చేయించుకున్నట్లు రికార్డులు మార్చి ఎన్ఓసీల ద్వారా వాటిని వెంచర్లు వేసి కొందరు అమ్మకాలకు పెట్టగా, మరికొందరు వందలాది ఎకరాల భూములను సైనికుల పేరున మార్చి వేరొకరికి కోట్లాది రూపాయలకు అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన ప్రాంతాలతోపాటు బద్వేలు, గోవపరంలోనూ ఈ తరహా అక్రమాలు జరిగినట్లు ఆర్డీఓ, కలెక్టర్ల దృష్టికి వచ్చింది. దీనిపై విచారణ చేపట్టారు. వీటితోపాటు వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి వివరాలను వెలికి తీస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో గత ప్రభుత్వంలోనే పెద్ద ఎత్తున భూ ఆక్రమణలు జరిగినట్లు విచారణలో బయటపడుతోంది. డీకేటీల అమ్మకాలు సహించం డీకేటీ స్థలాలు, భూముల కొనుగోళ్లు, అమ్మకాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని జిల్లా కలెక్టర్ విజయరామరాజు, బద్వేలు ఆర్డీఓ ఆకుల వెంకట రమణలు ఇప్పటికే ప్రకటించారు. ల్యాండ్ కన్వర్షన్ లేకుండా ప్లాట్ల అమ్మకాలకు సిద్ధం చేసిన పలు వెంచర్లను ఇప్పటికే నిలిపివేశారు. వ్యవసాయానికి ఇచ్చిన భూమిని ఎట్టి పరిస్థితుల్లో ప్లాట్ల అమ్మకాలకు అనుమతించేది లేదని తేల్చి చెప్పారు. అలా చేయాలనుకుంటే ల్యాండ్ కన్వర్షన్ (భూ బదలాయింపు) తప్పనిసరి అని స్పష్టం చేశారు. బాధితులు, ప్రజల హర్షం భూ ఆక్రమణలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా అధికారులను ఆదేశించడం, అందుకు కారకులైన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడంపై బాధితులు, జిల్లా ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం తన, పర అన్న బే«ధం లేకుండా నిస్పాక్షికంగా వ్యవహరించడాన్ని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారు. అక్రమాల్లో ఇంటి దొంగలు బద్వేలుతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో జరిగిన భూ దందాల్లో ఇంటి దొంగల పాత్ర కీలకంగా ఉన్నట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. బద్వేలు అక్రమాల్లో కీలకపాత్ర పోషించిన ఇద్దరు వీఆర్వోలపై ఇప్పటికే కేసులు నమోదు చేశారు. వీరు కాకుండా ముగ్గురు తహసీల్దార్లు, ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు ఆర్ఐలు, ఓ ఆర్డీఓ స్థాయి అదికారి సైతం గతంలో జరిగిన భూ ఆక్రమణలు, నకిలీ పట్టాల వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరి జాబితాను జిల్లా అధికారులు సిద్ధం చేశారు. త్వరలోనే వీరిపై కేసులు నమోదు చేయబోతున్నారు. పేదలకు అన్యాయం జరగనివ్వం బద్వేలు నియోజకవర్గంలో అర్హులైన పేదలకు అన్యాయం జరగనివ్వం. కొందరు అక్రమార్కులు నకిలీ సీళ్లు, ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలు సృష్టించి పేదల స్థలాలు, భూములను దౌర్జన్యకరంగా ఆక్రమించారు. ఇలాంటి చర్యలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయి. ప్రభుత్వ ఆదేశాలతో నియోజకవర్గంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టాం. ఇప్పటికే చాలామందిపై కేసులు పెట్టి అరెస్టులు చేశాం. మరికొంతమందిపైన కేసులు పెట్టబోతున్నాం. నియోజకవర్గంలో ఏ ఒక్కరికీ అన్యాయం జరిగినా నా దృష్టికి తీసుకు రండి...కచ్చితంగా వారికి న్యాయం జరిగేలా చూస్తా. – ఆకుల వెంకట రమణ, ఆర్డీఓ, బద్వేలు -
హార్సిలీహిల్స్‌లో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం
బి.కొత్తకోట: అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్‌లో రెవెన్యూ భూ ఆక్రమణలపై మదనపల్లె ఆర్డీఓ ఎంఎస్.మురళీ ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా గురువారం తహసీల్దార్ కీతలం ధనుంజయలు, ఎంపీడీఓ శంకరయ్య, డీఎల్పీఓ లక్ష్మీ, ఏఈ సంతోష్‌గౌడ్‌లతో సమావేశమయ్యారు. ఇక్కడి పరిస్థితులపై సమీక్షించారు. అనంతరం టూరిజం అసిస్డెంట్ మేనేజర్ నేదురుమల్లి సాల్వీన్‌రెడ్డి, అధికారులతో కలిసి కొండపై ప్రతి నిర్మాణాన్ని, ఆక్రమిత స్థలాలను స్వయంగా పరిశీలించారు. బీఎస్ఎన్ఎల్ ప్రాంగణానికి తాళం కొండపై బీఎస్ఎన్ఎల్ టవర్ నిర్వహణ కోసం రెవెన్యూ అధికారులు భూమిని కేటాయించారు. ఈ భవనాన్ని ప్రయివేటు వ్యక్తులకు లీజుకు అప్పగించడంతో ఇక్కడ అనుమతి లేకుండా నిర్మాణాలు, పాత భవనాన్ని ఆధునికీకరించడం, ఖాళీ స్థలంలో కొత్తగా నిర్మాణాలు, అతిథిగృహలను నిర్మించారు. వీటిని పరిశీలించిన ఆర్డీఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీ సమయంలో అక్కడ పనులు జరుగుతుండటంతో ఆధునికీకరణకు, అతిథిగృహల నిర్మాణాలకు ఎవరి అనుమతి పొందారు, లీజు నిబంధనలు ఏమిటి, దేన్ని లీజుకు ఇచ్చారు అని ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి అనుమతి ఉందని అక్కడివారు చెప్పడంతో పత్రాలతో కార్యాలయానికి రావాలని అంతవరకు పనులు నిలిపివేసి తాళం వేయాలని ఆర్డీఓ ఆదేశించగా గేటుకు తాళం వేశారు. బీఎస్ఎన్ఎల్కు కేటాయించిన రెవెన్యూ భూమి కేటాయింపును రద్దు చేసి స్వాధీనం చేసుకుంటామని ఆర్డీఓ ప్రకటించారు. కొండపై కోర్టుకేసులు నడుస్తున్న వివాదాస్పద భూముల్లో జరిగిన భారీ నిర్మాణాలను ఆర్డీఓ పరిశీలించారు. వీరు నిర్మాణాలు చేసుకోవడమేకాక రోడ్డును అక్రమించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తీర్ణం గుర్తించేందుకు తక్షణం సర్వే నిర్వహించి మార్కింగ్ ఇవ్వాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. కొండపై రెవెన్యూ స్థలాలను ఆక్రమించుకొని వాణిజ్య, గృహ నిర్మాణాలు చేసుకొన్న వారితో ఆర్డీఓ మాట్లాడారు. ప్రతిఒక్కరి వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. మీరు నిర్మించుకున్న నిర్మాణాలకు స్థలాన్ని ఎవరు కేటాయించారు, ఎవరి అనుమతి పొందారని ప్రశ్నించారు. కొండపై రెవెన్యూ భూమిని ప్రయివేటు సంస్థలకుకాని, వ్యక్తులకు కాని కేటాయించలేదు. అలాంటప్పుడు ఎలా ఇంటి నిర్మాణాలు చేశారని ప్రశ్నిస్తూ..ఇకపై గృహలు, దుకాణాలు హార్సిలీహిల్స్ టౌన్షిప్ కమిటీకి చెందుతాయని, ఎవరైనా ఇక్కడ ఉండాలంటే అద్దెలు చెల్లించాలని కోరారు. విద్యుత్ కనెక్షన్లు ఎలా ఇచ్చారు రెవెన్యూ స్థలాల్లో అక్రమంగా ఇళ్లు నిర్మించుకొన్న వారికి డిస్కం అధికారులు ఏ హక్కు పత్రాలతో విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారని ఆర్డీఓ మురళీ విస్మయం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై డిస్కం అధికారులతో సమావేశం నిర్వహించి కనెక్షన్లను టౌన్షిప్ కమిటీ పేరుపై బదిలీ చేయిస్తామని చెప్పారు. కొండపై ఇటుక పేర్చాలన్నా, కదిలించాలన్నా టౌన్షిప్ కమిటీ అనుమతి తప్పనిసరని, ఉల్లంఘించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొండపై ప్రభుత్వశాఖలకు కేటాయించిన భూములు, వాటి స్థితిగతులు, అసంపూర్తి క్రీడా ప్రాంగణ నిర్మాణ పనులను పరిశీలించారు. -
కూకట్‌పల్లిలో 5 ఎకరాలు ఆక్రమణ
సాక్షి, హైదరాబాద్: రూ.100 కోట్లకు పైగా విలువ చేసే భూమిని ఆక్రమించేశారు. రాజకీయ, అధికారుల అండదండలు మెండుగా ఉండటంతో అక్రమ ప్లాట్ల రిజిస్ట్రేషన్లూ జరిగిపోయాయి. రాత్రికి రాత్రే గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయినా స్థానిక మున్సిపల్ అధికారులు తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకోవటం విశేషం. ఈ మేరకు కబ్జా రాయుళ్లపై విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసింది. ఆ వివరాలివే.. ► సనత్‌నగర్‌లోని హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆస్బెస్టాస్) తన కంపెనీలో పని చేస్తున్న కార్మికులకు గృహ వసతి కోసం కూకట్పల్లి గ్రామ పరిధిలో 45 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. ఇందులో 40 ఎకరాలలో ఓపెన్ ప్లాట్లకు కేటాయించగా.. 5 ఎకరాలు ఆటస్థలాలు, పార్కులు, స్కూళ్ల వంటి 12 రకాల అభివృద్ధి పనుల కోసం కేటాయించింది. హుడా అనుమతితో ఈ లే–అవుట్లో 1,035 ప్లాట్ల చేసి కార్మికుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేశారు. ► కొంతకాలం తర్వాత కొందరు కార్మికులు హైదరాబాద్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ సొసైటీ పేరుతో 45 ఎకరాల భూమిని తమ ఆధీనంలోకి తీసుకొని అభివృద్ధి పనుల కోసం కేటాయించిన ఐదెకరాల స్థలంపై కన్నేశారు. స్థానిక రాజకీయ నాయకులు, రిజిస్ట్రేషన్, మున్సిపల్ అధికారులతో కుమ్మకై.. 12 ఖాళీ స్థలాల భూమిని 100 ప్లాట్లుగా విభజించి, ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించారు. వీటి విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుంది. (క్లిక్: రీజినల్’ రెండో గెజిట్ విడుదల..) ► ఆయా అక్రమ రిజిస్ట్రేషన్ స్థలాలలో గృహాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు జరుగుతున్నా.. మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభ రెడ్డి ఆరోపించారు. (క్లిక్: మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల బ్లాకింగ్.. దందాలో పెద్దలు?) -
తెరపైకి ‘పోడు’ గోడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అటవీ పరిరక్షణ, పోడు భూములు, ఆక్రమణల అంశానికి మరోసారి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటే నెపంతో అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల్లో వేసిన పంటలు నాశనం చేయడంతో పాటు మొక్కలు నాటి తమను వాటిల్లో వెళ్లకుండా అడ్డుకుంటున్నారని పోడు రైతులు వాపోతున్నారు. 2005 తర్వాత రాష్ట్రంలో కొత్తగా పోడు అనేదే లేదని, తెలంగాణ ఏర్పడ్డాక గత ఏడేళ్లలో అటవీ భూముల్లో ఆక్రమణలు భారీగా పెరగడంతో అటవీ విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోతోందని అటవీ, రెవెన్యూ అధికారులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీని నియమించి, జిల్లాల వారీగా పోడు భూములు, వాటిలో ఇంకా ఎవరెవరికి, ఎన్ని ఎకరాల్లో పట్టాలు ఇవ్వాలో లెక్క తేల్చే పనిలో పడింది. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లోనే పోడు భూముల విషయంలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రస్తుతం అటవీ శాఖ ఏయే జిల్లాల్లో పోడు కింద ఎంత భూమి ఉంది, ఎన్ని ఎకరాల్లో అటవీ ఆక్రమణలు జరిగాయి, అటవీహక్కుల పరిరక్షణ చట్టం (ఆర్వోఎఫ్ఆర్) కింద ఎంతమేర హక్కు పత్రాలు ఇచ్చారో లెక్కలు తీసేపనిలో పడింది. దేశ వ్యాప్తంగా అటవీ భూములు పంపిణీ చేస్తే అడవులతో పాటు పర్యావరణం దెబ్బతింటుందని కొన్ని ఎన్జీవో సంస్థలు కేసు వేయడంతో ఆర్వోఎఫ్ఆర్ కింద భూముల పంపిణీపై 2019 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు స్టే విధించింది. దీంతో తెలంగాణ సహా ఏపీ, త్రిపుర ఇతర రాష్ట్రాల్లో అప్పట్నుంచీ పోడు భూముల పంపిణీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అటవీ, రెవెన్యూ, సర్వే విభాగాలు ఉమ్మడిగా మొత్తం రాష్ట్రంలోని అటవీ భూముల సర్వే నిర్వహిస్తే అటవీ విస్తీర్ణం, ఆక్రమణలు, పోడు, ఇతర అన్ని విషయాలపై స్పష్టత వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తర్వాతే ప్రభుత్వపరంగా ఇతర చర్యలు తీసుకుంటే ఫలితం ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం తగ్గుదల: అడవుల విస్తీర్ణాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలోనే అత్యంత వేగంగా, అత్యధికంగా అటవీ విస్తీర్ణం తగ్గుతోందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 24 శాతం అడవులున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నా... క్షేత్రస్థాయిలో ఈ విస్తీర్ణం పది శాతం వరకే ఉంటుందని అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. అటవీ భూముల ఆక్రమణలు ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్రంలో దట్టమైన అడవే కనిపించకుండా పోయే స్థితి దాపురిస్తుందని హెచ్చరిస్తున్నారు. ఆర్ఓఎఫ్ఆర్ కింద హక్కు పత్రాల పంపిణీ రాష్ట్రంలో అటవీ హక్కుల గుర్తింపు చట్టం (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్–ఆర్ఓఎఫ్ఆర్) కింద 2017 చివరినాటికి 11 లక్షల ఎకరాల్లో హక్కులు కల్పించాలంటూ 1,86,534 క్లెయిమ్స్ అందాయి. వాటిలో 1,83,107 మంది వ్యక్తిగతంగా (6,30,714 ఎకరాలకు) దరఖాస్తు చేయగా సామూహిక (కమ్యూనిటీ) క్లెయిమ్స్ కింద 3,427 దరఖాస్తులు (4,70,605 ఎకరాలకు) అందాయి. వాటిలో వ్యక్తిగత క్లెయిమ్స్‌లో భాగంగా 93,494 మందికి 3 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు పంపిణీ చేశారు. 721 సామూహిక క్లెయిమ్స్ కింద 4,54,055 ఎకరాలకు హక్కు పత్రాలు అందజేశారు. మిగతా వాటి లో కొన్ని క్లెయిమ్స్ తిరస్కరించగా కొన్ని పెండింగ్‌లో ఉన్నట్టుగా అటవీ, ఎస్టీ సంక్షే మ శాఖలకు చెందిన రికార్డులను బట్టి స్పష్టమవుతోంది. గిరిజనేతరుల ఆక్రమణతో... పోడు వ్యవసాయం పేరుతో ఆదివాసీలు, గిరిజనులను తమ బినామీలుగా చేసుకుని ఆదివాసీలు కాని వారు, గిరిజనేతరులు పెద్ద మొత్తంలో అటవీ భూములను ఆక్రమించి తమ స్వాధీనంలో పెట్టుకోవడం పెద్ద సమస్యగా మారిందని అటవీ అధికారులు చెబుతున్నారు. వీరికి రాజకీయ పార్టీల అండకూడా ఉందని అంటున్నారు. పోడు పట్టాలున్న ఆదివాసీలు, పేద ఎస్సీ, బీసీ వర్గాల వారిని ముందుంచి, వారి భూముల పక్కల నుంచి ఆక్రమణలు మొదలుపెట్టి చెట్లు కొట్టడం, అటవీ భూఆక్రమణ విస్తీర్ణం క్రమంగా పెంచుకోవడంతో ఈ సమస్య మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చేసే ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. అమ్ముకోకూడదు.. కుదవ పెట్టకూడదు కొన్ని దశాబ్దాల క్రితం నుంచి మారుమూల అడవుల్లోని ఆదివాసీలకు పోడు సాగు జీవనాధారంగా ఉండేది. జీవనోపాధి కోసం అడవుల్లో చెట్లు లేని చోట సాగుచేసి ఆ భూమిలో సారం తగ్గగానే ఒకటి, రెండేళ్లలోనే చెట్లు కొట్టకుండానే మరోచోటుకు తరలిపోవడం జరిగేది. పారలు, ఎడ్లు వంటి వాటిని ఉపయోగించకుండా వ్యవసాయం చేసేవారు. కాలక్రమేణా పోడు నిర్వచనమే మారిపోయింది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో పోడు వ్యవసాయానికి 1907లో నిజాం నవాబు అనుమతించాడు. కొన్నేళ్ల తరబడి పోడు సాగు చేసుకునే వారికి ఆ భూమిపై హక్కును కల్పించినా, దున్నుకోవాలి తప్ప అమ్ముకోకూడదు, కుదవపెట్టకూడదు, ఈ భూములకు బ్యాంకులు రుణాలు సైతం ఇస్తాయి. 2006లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అటవీహక్కుల చట్టం ప్రకారం గ్రామసభ ఆమోదించిన వారికే ఈ పట్టాలు ఇవ్వాలి. రాజకీయ ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా.. రాష్ట్రంలో మొత్తం 7,37,595 ఎకరాల విస్తీర్ణంలో అటవీ భూమి ఆక్రమణలకు గురైనట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు నివేదికలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. ఇందులో నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు తలొగ్గి జిల్లాల్లో రెవెన్యూ శాఖ 1,09,584 ఎకరాల్లో పట్టాలిచ్చినట్టు అటవీ అధికారులు తమ నివేదికల్లో తేల్చారు. అత్యధికంగా కొత్తగూడెం జిల్లాలో 2.15 లక్షల ఎకరాలు, అత్యల్పంగా కామారెడ్డి జిల్లాలో 9 వేల ఎకరాల అటవీశాఖ భూములకు రెవెన్యూశాఖ పట్టాలు అందజేసినట్టు పేర్కొన్నారు. -
కలెక్టరేట్ ఎదుట యువతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, సూపర్‌బజార్(ఖమ్మం): రాజకీయ అండతో తమ స్థలాన్ని కొందరు ఆక్రమించుకునే యత్నం చేస్తున్నారనే ఆవేదనతో కొత్తగూడెంలోని కలెక్టరేట్ ఎదుట సోమవారం ఓ యువతి ఆత్మహత్యకు యత్నించింది. దీంతో పక్కనే ఉన్నవారు గుర్తించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. యువతి బండి హైమావతి తల్లి సరళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కొత్తగూడెంలోని రామవరం 7వ నంబర్ బస్తీకి చెందిన సరళ భర్త మృతి చెందగా, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తోంది. వీరి ఇంటిపక్కనే ఉన్న వంద గజాల స్థలాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకుడు మోత్కూరి ధర్మారావు అండతో అజయ్‌సింగ్ అనే వ్యక్తి ఆక్రమించే యత్నం చేస్తుండగా, రామవరంలోని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, ఎలాంటి న్యాయం జరగకపోగా మళ్లీ స్థల ఆక్రమణకు యత్నించడంతో సోమవారం కలెక్టర్‌లో ప్రజావాణికి సరళ తన చిన్నకుమార్తె హైమావతితో వచ్చింది. అప్పటికి ప్రజావాణి ప్రారంభం కాకపోగా ఆవేదనతో హైమావతి తన వెంట తెచ్చుకున్న హెయిర్ డై తాగింది. దీంతో అక్కడే ఉన్న ఆరోగ్య కార్యకర్త, మరికొందరు ఆమెను ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. కాగా, కొత్తగూడెం తహసీల్దార్ రామకృష్ణ ఆస్పత్రికి చేరుకుని యువతితో మాట్లాడి వివరాలు ఆరా తీశారు. చదవండి: ఏడు రోజుల్లో పెళ్లి.. బండరాయితో కొట్టుకొని పెళ్లి కొడుకు ఆత్మహత్య -
Devaryamjal: సీతారామారావు .. సీతారామయ్య!
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ నగర శివారు దేవరయాంజాల్‌లోని శ్రీసీతారామచంద్ర స్వా మి ఆలయ భూములపై కన్నేసిన కబ్జాదారులు స్వామివారి రకరకాల పేర్లతో ఆక్రమణలకు పాల్పడ్డారు. ఇది పురాతన ఆలయం. నిజాం పాలన సమయంలోనే ఓ భక్తుడు ఈ ఆలయానికి 1,531 ఎకరాల భూమిని ఇనామ్‌గా ఇచ్చా రు. ఆ భూములను ఆలయ భూమిగా రికార్డుల్లో చేర్చారు. ఇప్పటివరకు కచ్చితమైన భూ రికార్డులుగా చెప్పుకొనే 1924–25 రెవెన్యూ రికార్డుల్లో.. ఈ 1,531 ఎకరాల భూమి సీతారామచంద్రస్వామి ఆలయం పేరిట ఉన్నట్లు తెలుస్తోంది. కానీ తర్వాత చాలావరకు కబ్జాలకు గురైంది. భూమి యజమానిగా ఉన్న శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం పేరు కాస్తా.. సీతారామారావుగా, సీతారామయ్యగా, సీతారామరెడ్డిగా, సీతారాములుగా.. రకరకాల పేర్లతో మారి చివరికి కబ్జాదారుల పేర్లు రికార్డుల్లోకెక్కాయి. ప్రస్తుతం ఆ భూముల్లో గోదాములు, రిసార్టులు, పరిశ్రమలు, నివాసాలు, వాణిజ్య సముదాయాలు, ఫంక్షన్ హాళ్ళు వెలిశాయి. ప్రతి నెలా రూ.లక్షల్లో అద్దె ప్రస్తుతం ఈ ఆలయ భూములను తమ అధీనంలో ఉంచుకున్న వారి నుంచి ప్రతినెలా రూ.లక్షలు అద్దె/లీజు పేరిట వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఒక బృందం పనిచేస్తోందని.. ఆ సొమ్మును నేతలు, అధికారులు పంచుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు ఆక్రమణకు గురైన భూములను శాశ్వతంగా కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. లోకాయుక్తలో నమోదైన కేసు, దానికి సమాధానంగా దేవాదాయ శాఖ కమిషనర్ స్వయంగా దాఖలు చేసిన అఫిడవిట్‌తో ఈ భూముల బాగోతం కళ్లకు కడుతోంది. 174 ఎకరాల్లో 115 గోదాములు దేవరయాంజాల్ దేవాలయ భూములను ఆక్రమించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో రాజకీయ పలుకుబడి కలిగిన కొందరు ప్రముఖ వ్యక్తులతో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీనామీలతో పాటు అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరంతా బీనామీ పేర్లతో భూములను ఆక్రమించినట్లు తెలుస్తున్నది.1,531 ఎకరాల దేవాలయ భూముల్లో 389.12 ఎకరాలను పలుకుబడి ఉన్న వ్యక్తులు ఆక్రమించినట్లు ఆరోపణలు ఉండగా, ఇందులో 174.16 ఎకరాల భూముల్లో 2007 నుంచి 2016 వరకు దాదాపు 35 మంది వ్యక్తులు గోదాములు, ఫంక్షన్ హాళ్లు, కమర్షియల్ షెడ్లు ఇలా దాదాపు 115 వరకు నిర్మాణాలు చేపట్టారు. వీటిని అద్దె లేదా లీజుకు ఇచ్చి రూ.లక్షల్లో ఆదాయాన్ని పొందుతున్నారు. ఈ భూముల్లోనే 130 ఎకరాల్లో హకీంపేట ఎయిర్‌బేస్ ఉంది. 800 ఎకరాలు వ్యవసాయ భూమిగా ఉంది. ఇక ఇప్పటికీ ఎలాంటి నిర్మాణాలు లేని భూములు దాదాపు 800 ఎకరాల వరకు ఉన్నాయి. వీటిని తిరిగి దేవాలయం అధీనంలోకి తెచ్చి.. వాటి నుంచి ఆదాయం పొందే వీలున్నా దేవాదాయ శాఖ అందుకు సిద్ధపడకపోవడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. స్వాధీనానికి అవకాశం ఉన్నా.. సాధారణంగా దేవాలయ భూములను అమ్మేందుకు వీలు లేదు. 1924–25 రికార్డుల ప్రకారం అవి స్పష్టంగా దేవుడి భూములే. అంటే చట్టపరంగా ఆ భూములను స్వాధీనం చేసుకునేందుకు అవకాశముంది. అయినా నేతల జోక్యం, అవినీతి అధికారుల కారణంగా ఆ దిశగా ఎలాంటి చర్యలూ చేపట్టడం లేదనే ఆరోపణలున్నాయి. దేవదాయశాఖ చట్టం సెక్షన్Œ –83 ప్రకారం ‘యూజ్ అండ్ ఆక్యుపేషన్న్ చార్జీల’వసూలుకు కేసులు దాఖలు చేయవచ్చు. దీనితో ఆ భూముల యాజమాన్య వివాదం తేలేవరకు వాటిని అనుభవిస్తున్న ‘కబ్జాదారులు’మార్కెట్ విలువ మేరకు చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరగడం లేదు. కబ్జాదారులకే భూములు! ఈ భూములను ‘కబ్జా’లో ఉన్న వారికే ఇచ్చి డబ్బులు వసూలు చేయాలంటూ కొంతకాలం కిందట దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకున్పట్లు తెలుస్తోంది. కానీ ఈ భూముల వ్యవహారంపై ఏర్పాటైన జస్టిస్ వెంకటరామిరెడ్డి కమిషన్ ఈ వ్యవహారంలో అక్రమాలను నిగ్గుతేల్చి, దేవదాయ శాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని అప్పట్లో నివేదిక సమర్పించినట్లు సమాచారం. విజిలెన్స్, ఏసీబీ విచారణలు కూడా నాటి దేవదాయ కమిషనర్ , ముఖ్య కార్యదర్శి, సంయుక్త కమిషనర్, ఉప కమిషనర్లను బాధ్యులను చేస్తూ చర్యలకు సిఫారసు చేసినట్లు సమాచారం. కానీ వీరిలో ఎవరిపైనా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. పైగా క్లీన్చిట్ ఇవ్వటమే కాకుండా పదవీ విరమణ చేసిన వారు మినహా మిగతావారికి పదోన్నతులు కూడా కల్పించారనే ఆరోపణలు ఉన్నాయి. చదవండి: ఈటల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! -
కొంగరకలాన్‌లో దర్జాగా కబ్జా!
సాక్షి, ఇబ్రహీంపట్నం: కాదేదీ కబ్జాకనర్హం.. అనేలా సాగుతోంది అక్రమార్కుల వ్యవహారం. కాలువ, కుంట, చెరువు దేన్నీ వదలడం లేదు. కాసుల కోసం సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారు. చెరువులు, కుంటలను చెరబడుతున్నారు. వీరి దెబ్బతో జలాశయాలు, కాలువలు ఉనికిని కోల్పోతున్నాయి. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలున్నాయి. అందుకే ఫిర్యాదులను సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపంతో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ ప్రాంతంలో బహుళ జాతి సంస్థలు, ఔటర్ రింగ్‌రోడ్డు, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం రావడంతో ప్రస్తుతం ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదునుగా కబ్జారాయుళ్లు బరితెగిస్తున్నారు. అధికారులే అండ.. రియల్ ఎస్టేట్ అక్రమార్కులకు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు కబ్జాకు గురైనట్లు తెలిసినా కనీసం స్పందించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులను అడిగితే తాము రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని తప్పించుకుంటున్నారని చెబుతున్నారు. ఎట్టకేలకు అన్నింటి మీద అధికారులకు ఫిర్యాదు చేస్తే కంటి తుడుపు చర్యగా మంగళ్‌పల్లి సమీపంలోని ఫిరంగి నాలాపై వేసిన రోడ్డును ధ్వంసం చేశారు. పైపులను తొలగించారు.. కానీ బఫర్ జోన్లో నిర్మించిన ప్రహరీని మాత్రం కూల్చకుండా రియల్టర్లకు వత్తాసు పలుకుతున్నారు. దీంతో చెరువులు, కుంటలకు నీరొచ్చే దారులు మూసుకుపోయి వాటి ఉనికి ప్రశ్నార్థకమవుతోందని స్థానికులు, చెరువు ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కబ్జాలివి.. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ గ్రామంలో పెద్దబంధం వాగు నుంచి దాతర్ చెర్వులోకి నీరొచ్చే కాలువలను రియల్టర్లు పూర్తిగా కబ్జా చేశారు. ఏకంగా వాగుకు అడ్డంగా గోడను నిర్మించి దాతర్చెర్వులోకి నీరు రాకుండా అడ్డుకట్ట వేశారు. ప్రక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కూడా రియల్టర్లు కబ్జా చేశారు. ఇక కొత్త చెర్వు, సింగరాయకట్టను పూర్తిగా తవ్వి కబ్జా చేశారు. వడ్లవాని కుంటలోకి వచ్చే వాగు, కన్నారపోని కుంటను పూర్తిగా కబ్జాకు గురి చేసి ప్లాట్లుగా మార్చారు. ప్రస్తుతం కలెక్టరేట్ నిర్మిస్తున్న భవన సముదాయానికి వెళ్లే దారిలోనే వడ్లవాని కుంటలోకి నీరొచ్చే కాలువను, వడ్లవాని కుంటను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చారు. కొంగరకలాన్ నుంచి శేరిగూడ వరకు వచ్చే ఫిరంగి నాళాను కబ్జా చేశారు. మంగళ్‌పల్లి సమీపంలో ఫిరంగి నాలాపై ఏకంగా రోడ్డు వేసుకున్నారు. ఫిరంగి నాలా కట్టను ధ్వంసం చేసి దర్జాగా రహదారి నిర్మించారు. కాలువ పక్కనే బఫర్ జోన్‌ను విడిచిపెట్టకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టారు. వర్షకాలంలో వాగులో నుంచి పెద్దగా నీరు వచ్చిందంటే గోడలు కూలిపోతాయి. నాలాకు ఇరువైపులా 9 మీటర్లు స్థలం బఫర్‌జోన్ కోసం వదిలేయాలి. కానీ ఎక్కడా ఇలా చేయడం లేదు. హెచ్ఎండీఏ అధికారులకు చూపించే ప్లాన్ ఒకటైతే స్థానికంగా చేసే పని వేరేలాగా ఉంటుంది. మంగళ్‌పల్లి సమీపంలో ఓ వెంచర్‌కు ఏకంగా కాలువ మీదంగానే రోడ్డు వేసుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. కుమ్మరికుంట, కొమటికుంట కట్టలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఫిరంగి నాలా మీదుగానే పది కిలో మీటర్ల మేర అక్రమ కట్టడాలతో పాటు ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. చర్యలు తీసుకుంటాం అన్ని ప్రాంతాల్లో మా దృష్టికి వచ్చిన కబ్జాలపై స్పందిస్తున్నాం. ఇప్పటికే ఫిరంగి నాలాపై వేసిన రోడ్డును మంగళ్పల్లిలో రెండు చోట్ల తొలగించాం. మరెక్కడైనా చెరువులు, కుంటలు కబ్జాకు గురైతే మాకు ఫిర్యాదు చేయొచ్చు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు. – పరమేశ్వర్, డీఈఈ, ఇరిగేషన్ శాఖ కేసులు నమోదు చేస్తాం వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, కుంటలు కబ్జాలకు గురయితే ఇరిగేషన్ అధికారులు మాకు ఫిర్యాదు చేస్తే తప్పకుండా స్పందిస్తున్నాం. రికార్డులు పరిశీలించి పరిరక్షణ చర్యలు చేపడుతాం. నోటీసులు ఇచ్చినా మార్పు రాకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. – వెంకటేశ్వర్లు, తహసీల్దార్, ఇబ్రహీంపట్నం -
భూంఫట్!
సాక్షి, అమరావతి: అధికారం అండతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూమాఫియా చెలరేగిపోతోంది. నకిలీ పత్రాలు, ఫోర్జరీ సంతకాలతో విలువైన భూములను కాజేస్తున్నారు. వాగులు, చెరువులను సైతం ఆక్రమించి రెవెన్యూ అధికారులను బెదిరిస్తూ భూ రికార్డులను తారుమారు చేస్తున్నారు. భూములను కొట్టేసేందుకు కొన్నిచోట్ల బాధితుల బంధువులనే పావులుగా వాడుకోవడం గమనార్హం. బాధితుల బంధువులకు వాటాల ఎర... భూదందాల కోసం చిన్న చిన్న వివాదాలున్న విలువైన ఆస్తుల సమాచారాన్ని సేకరించి రంగంలోకి దిగుతున్నారు. వివాదాలు లేనిచోట కూడా ఏదో ఒక మెలికపెట్టి నకిలీ పత్రాలతో ఆస్తులు కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హక్కుదారుల బంధువులకు వాటాలిస్తామంటూ ఎరవేసి అప్పు ఇచ్చినట్లు తనఖా పత్రాలు సృష్టిస్తున్నారు. తనఖా పత్రం కూడా తమ పేర్లతో కాకుండా బినామీ పేర్లతోనే రాయించుకుంటూ జాగ్రత్త పడుతున్నారు. తనఖా పత్రం రాయించుకున్న వారి పేర్లతో ఆస్తి బదలాయించేందుకు నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారు. వీటి ఆధారంగా ఆస్తులు మ్యుటేషన్ చేయించి బినామీ పేర్లతో భూములు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో అధికార పార్టీ నాయకుల పేర్లు బయటకు రాకుండా వ్యవహరిస్తున్నారు. బాధితులు పోలీస్ స్టేషన్లకు వెళ్లినా ఇదంతా సివిల్ వివాదమంటూ కేసు నమోదు చేయకుండా తిరస్కరించేలా కబ్జాదారులు ముందే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విజయవాడలో మాఫియా రాజ్యం విజయవాడ సింగ్‌నగర్‌లోని సుమారు రూ.50 కోట్ల విలువైన 5.16 ఎకరాలను ఎమ్మెల్యే బోండా ఉమా తన భార్య, సన్నిహితుల పేరుతో రికార్డులు సృష్టించి కాజేసేందుకు ప్రయత్నించడం తెలిసిందే. స్వాతంత్య్ర సమరయోధుడు కేశిరెడ్డి సూర్యనారాయణ పేరుతో ఉన్న భూమిని నకిలీ పత్రాలతో చేతులు మార్పించి ఎమ్మెల్యే బోండా ఉమా భార్య సుజాత, తనకు సన్నిహితుడైన మాగంటి బాబులకు డెవలప్మెంట్ కోసం ఇచ్చినట్లు అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై వాస్తవ హక్కుదారులు ఆందోళన చేయడంతో పోలీసులతో కూడా కొట్టించారు. ఈ వ్యవహారం తీవ్ర వివాదాస్పదం కావడంతో చివరకు ఈ భూమిని వదులుకుంటున్నట్లు బోండా ఉమ ప్రకటించడం గమనార్హం. పెద్దలతో ఎందుకు?.. రాజీ చేసుకోండి! కృష్ణా జిల్లాకు చెందిన ఓ కీలక నేత అనుచరులు కూడా విజయవాడలో ల్యాండ్ మాఫియా నిర్వహిస్తున్నారు. గొల్లపూడి ప్రాంతంలో మంత్రి అనుచరులు ఆడింది ఆట పాడింది పాటగా మారింది. ఓ మహిళ 1978లో కొనుగోలు చేసిన 2.5 ఎకరాల భూమికి మంత్రి అనుచరులు నకిలీ పత్రాలు సృష్టించి స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడంతో బాధితురాలు పోలీసు, రెవెన్యూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ‘పెద్దవారితో మీకు ఎందుకు? ఏదో ఒకటి మాట్లాడుకుని రాజీ చేసుకోండి’ అని ఓ రెవెన్యూ అధికారి బాధితురాలికి సూచించినట్లు తెలిసింది. విశాఖలో కూడా ఓ స్వాతంత్య్ర సమరయోధుడికి చెందిన రూ. వంద కోట్ల విలువైన భూమిని నకిలీ పత్రాలతో కొనుగోలు చేసేందుకు ఓ మంత్రి బంధువులు అంతా సిద్ధం చేసుకున్నారు. వాగులూ వంకల ఆక్రమణ.. చిత్తూరు, వైఎస్సార్, కర్నూలు, అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో వందలాది చెరువులు ఆక్రమణదారుల చెరలో చిక్కుకుని సాగు భూములుగా మారిపోయాయి. భారీ వర్షాలు పడితే నీరు బయటకు వెళ్లే మార్గం లేక పంట పొలాలు కొట్టుకుపోతున్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో చెరువులు, నీటి ప్రవాహ మార్గాలను ఆక్రమించుకోవడం వల్ల తిత్లీ తుపాను సమయంలో భారీ నష్టం జరిగింది. పంట కాలువ ఆక్రమించి వంతెన.. వైఎస్సార్ జిల్లా పుల్లంపేట మండలం రెడ్డిపల్లె రెవెన్యూ గ్రామంలో పెద్దఓరంపాడు చెరువు నుంచి రామక్కపల్లెకు వెళ్లే పంటకాలువపై అధికార పార్టీ నాయకులు అక్రమంగా వంతెన నిర్మించి అలుగు పోరంబోకులో బోర్లు వేసి ఏకంగా చెరువు భూమిని చదును చేశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో రెవెన్యూ అధికారులు స్పందించి పనులను నిలిపివేశారు. కాలువ గుండా వర్షాకాలంలో నీరు ప్రవహిస్తే చెరువు నిండి 500 ఎకరాలకు నీరు అందుతుంది. కాలువకు అడ్డంగా వంతెన నిర్మిస్తే చెరువులోకి నీరు రాదు. అలుగు కింద భూమిని మొత్తం సాగు చేసుకోవాలని ఓ టీడీపీ నాయకుడి అనుచరుడు 8 ఎకరాలు ఆక్రమించుకున్నారు. వెంటనే వంతెనను తొలగించి చెరువు అలుగు వద్ద ఆక్రమణలను తొలగించాలని రామక్కపల్లె, అప్పారాజంపేట, అనంతంపల్లె గ్రామాల రైతులు కోరుతున్నారు. ఆవిలాల చెరువులో భారీ భవంతులు.. తిరుపతిలోని ఆవిలాల చెరువు చాలావరకూ ఆక్రమణలతో చిక్కిపోయింది. మట్టి తోలి ఎత్తు చేసి చెరువు భూమినే ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు. అక్కడ ఇప్పుడు బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుండటం గమనార్హం. ఈ వ్యవహారం వెనుక అధికార పార్టీకి చెందిన కీలక నాయకులు ఉండటంతో అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ఇదేం దారుణం! గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు పంచాయితీకి చెందిన సింగం శాంతాదేవి (టెకులమ్మ) నుంచి ముగ్గురు వ్యక్తులు 1998లో వీలునామా ద్వారా రాయించుకున్న, 2005లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేసి పంటలు సాగు చేసుకుంటున్న 10.78 ఎకరాల విలువైన భూములను 2013లో ఫోర్జరీ సంతకాలతో నకిలీ వీలునామా రాయించుకున్న సింగం ప్రసాదరెడ్డి అనే వ్యక్తికి తహసీల్దారు ఏకపక్షంగా బదలాయించి పట్టాదారు పాసుపుస్తకం జారీ చేయటం గమనార్హం. ఓ టీడీపీ ఎమ్మెల్యే కనుసన్నల్లో ఈ వ్యవహారం అంతా సాగినట్లు ఆరోపణలున్నాయి. 2005లో రిజిస్ట్రేషన్ సమయంలో శాంతాదేవి ఆంగ్లంలో సంతకం చేయగా ప్రసాద్‌రెడ్డి సమర్పించిన అన్ రిజిస్టర్డ్ వీలునామాలో ఆమె వేలిముద్ర ఉండటం ఫోర్జరీ వ్యవహారాలకు నిదర్శనం. దీనిపై బాధితులు ముఖ్యమంత్రితోపాటు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి వినతిపత్రం సమర్పించారు. తహసీల్దారు ఆదేశాలను తక్షణమే నిలిపివేయాలంటూ గుంటూరు ఆర్డీవో కోర్టులో అప్పీల్ కూడా చేసుకున్నారు. సెంటు రూ. 20 – 25 లక్షలకు అమ్మకం వైఎస్సార్ జిల్లా రాజంపేటలో మన్నూరు, ఊటుకూరు, పోలి, క్రిష్టం చెరువులు ఆక్రమణలపాలయ్యాయి. చిత్తూరు జిల్లా పుల్లంపేట మండలంలో పుల్లంగేరు, రాజంపేట ప్రాంతంలో చక్రాలమడుగు అని వ్యవహరించే వాగు ఆక్రమణలతో చిక్కి శల్యమైంది. భారీ వర్షం కురిస్తే రాజంపేటలో ఇళ్లలోకి నీరు చేరు ప్రమాదం పొంచి ఉంది. కడప – చెన్నై రహదారిని ఆనుకుని చక్రాలమడుగు వాగు ప్రాంతాన్ని ఆక్రమించుకున్న భూమిని స్థానిక టీడీపీ నాయకులు సెంటు రూ. 20 లక్షల నుంచి రూ. 25 లక్షల చొప్పున అమ్ముకుంటున్నారు. చక్రాలమడుగు వాస్తవంగా జలవనరుల శాఖది. ఈ భూమి క్రయ విక్రయాలకు అవకాశం లేదు. అయితే భూమి వర్గీవకరణనే నకిలీ రికార్డులతో మార్చేసి కోట్లు దండుకుంటున్నారు. -
విజయవాడ వించిపేటలో ఉద్రిక్తత
సాక్షి, విజయవాడ : నగరంలోని వన్ టౌన్ వించిపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మైనారిటీలకు చెందిన పవిత్రమైన పీర్ల సావడి స్థలాన్ని కబ్జా చేసేందుకు స్థానిక ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ప్రయత్నించిన బాగోతం బయటపడింది. పీర్ల సావడి స్థలం నుంచి పీర్లకు సంబంధించిన సామగ్రిని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అనుచరులు బయటపడేసి దౌర్జన్యానికి దిగారు. అంతేకాకుండా ఈ స్థలంలో మాంసం దుకాణాన్ని ఏర్పాటుచేశారు. స్థానిక ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యాన్ని, కబ్జాయత్నాన్ని వ్యతిరేకిస్తూ పీర్ల సావడి వద్ద ముస్లింలు ఆందోళనకు దిగారు. దీంతో ఇక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో విజయవాడలో కబ్జాలు పెరిగిపోయాయని, తాజాగా పవిత్రమైన ముస్లింల ప్రదేశాన్ని కూడా టీడీపీ నేతల అండగా కబ్జా చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ముస్లిం నేతలు, ముస్లిం ప్రజలు పీర్ల సావడి కబ్జాయత్నంపై భగ్గుమంటున్నారు. ఎమ్మెల్యే జలీల్ ఖాన్ నగరంలోని ఖాళీ ప్రదేశాలపై కన్నేసి.. కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడుతున్నారు. -
ఆపదలో మొక్కులవాడు!
ఆపద మొక్కులవాడా..అనాథ రక్షకా పాహిమాం..అని మనం మొక్కే కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి భూములకే ఇప్పుడు రక్షణ కరువైంది. అధికారులు పర్యవేక్షణ లేక, బాధ్యులు పట్టించుకోక కబ్జాకోరులు నేలకొండపల్లిలో ఏకంగా 50ఎకరాలకు గోవిందనామం పాడుతున్నారు. ఇంకా కాజేసేందుకు కాచుక్కూర్చున్నారు. మరి బాధ్యులను ఏం జేస్తారు..? దేవుడి మాణ్యాన్ని ఎలా రక్షిస్తారో..? అని భక్తులు, జనం ఎదురుచూస్తున్నారు. నేలకొండపల్లి: మండలకేంద్రం నేలకొండపల్లిలోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయానికి 358ఎకరాల ఆస్తులు ఉండగా..వీటిపై కొందరు కన్నేశారు. విలువైన భూములను ఎంచక్కా కాజేస్తున్నారు. నేలకొండపల్లి, కమలాపురం, గువ్వలగూడెం, చిరుమర్రి, ముదిగొండ, మంగాపురం తదితర గ్రామాల్లో 358 ఎకరాలు ఈ దేవాలయానికి ఉన్నాయి. అయితే మంగాపురం గ్రామంలోనే 294.22 ఎకరాల భూములు ఉన్నాయి. కానీ అక్కడ 100 ఎకరాలకే కౌలు వస్తోంది. అది కూడా కేవలం రూ.60 వేలు మాత్రమే. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన భూ ప్రక్షాళణ కార్యక్రమంలో అన్యాక్రాంతం వెలుగులోకి వచ్చింది. 294.22 ఎకరాలకుగాను 244 ఎకరాల భూమికి మాత్రమే పాస్ పుస్తకాలు ఇస్తున్నట్లు రెవెన్యూ అధికారులు ఆలయ కమిటీకి తెలపడంతో..వారు కంగు తిన్నారు. కాల్వ అవసరాల రీత్యా ఎన్నెస్పీ అధికారులు కొంతభూమి తీసుకోగా..దాదాపు 50 ఎకరాల భూములు అన్యాక్రాంతమైనట్లు వెలుగులోకి వచ్చింది. చెరువుమాధారంలో 38 కుంటల భూమికి గాను 28 కుంటలకు మాత్రమే పాస్ పుస్తకాలు ఇవ్వనున్నారు. ఇక్కడ 10 కుంటలు కబ్జా అయింది. దేవాలయం వెనుక కాసాయి గడ్డ కింద 9.23 ఎకరాలు భూములను నిరుపయోగంగా వదిలేయడంతో అవి బీడుబారాయి. ఉన్నతాధికారులు స్పందించకుంటే దేవుడి భూములు కనుమరుగవుతాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివిధ గ్రామాల్లోఆలయ భూముల వివరాలు ఇలా.. మంగాపురంతండా 294.22 ఎకరాలు చెరువుమాధారం 38 కుంటలు గంధసిరి 3.14 ఎకరాలు చిరుమర్రి 8.22 ఎకరాలు కమలాపురం 6.26 ఎకరాలు గువ్వలగూడెం 2.13 ఎకరాలు ముదిగొండ 3.26 ఎకరాలు నేలకొండపల్లి 30 ఎకరాలు భూములు అప్పగించాలి.. శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయానికి రికార్డుల్లో నమోదై ఉన్న భూములను అప్పగించాలి. ఆ లెక్కల ప్రకారమే పాస్ çపుస్తకాలు అందించాలి. 294.22 ఎకరాలకు గాను 244 ఎకరాలకే ఇస్తున్నారు. జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశా. బోర్లు వేసుకోవడానికి కౌలురైతుల పేరున రెవెన్యూ అధికారులు ఎలా అనుమతి ఇచ్చారు. దీనిపై కూడా ఫిర్యాదు చేశాను. – చవళం వెంకటేశ్వరరావు, దేవస్థానం చైర్మన్, నేలకొండపల్లి ఇక విచారిస్తాం.. నేలకొండపల్లి దేవాలయం భూములు గెజిట్ ప్రకారం తక్కువగా ఉందని ఫిర్యాదు అందింది. మంగాపురంతండాలో క్షేత్ర స్థాయిలో విచారించి ఎక్కడ జరిగిందో తెలుసుకుంటాం. – దొడ్డారపు సైదులు, తహసీల్దార్, నేలకొండపల్లి చర్యలు తీసుకోవాలి.. దేవాలయం భూములు అభివృద్ధికి ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలి. అన్యాక్రాంతమైన భూములపై క్షేత్ర స్థాయిలో సమగ్ర విచారణ జరిపించి..బాధ్యులను శిక్షించాలి. – వంగవీటి నాగేశ్వరరావు,సర్పంచ్ -
ఏపీ రాజధానిలో కబ్జా పర్వం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాల్లో అధికార టీడీపీ నేతల కబ్జాల పర్వం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమను ప్రాంతంలో తెలుగు తమ్ముళ్లు భూకబ్జాకు పాల్పడ్డారు. కొండ, దాని పక్కనున్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఫెన్సింగ్ వేసేశారు. 30 ఎకరాల పోరంబోకు భూమిని కబ్జాచేసి, పంచుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో అక్కడే పలువురికి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు తాము కబ్జా చేసిన భూములకు పట్టాలు సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కబ్జా విషయం తెలిసినా అధికారులు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. -
అమరావతిలో భారీ భూకబ్జా ప్రయత్నం
-
అమరావతిలో భారీ భూకబ్జా ప్రయత్నం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భారీ భూకబ్జాకు ప్రయత్నం జరుగుతోంది. ఉద్ధండరాయునిపాలెంలోని పెద్దలంకలో 75 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు కబ్జాదారులు యత్నిస్తున్నారు. 50 ఎకరాల భూమిలో రాత్రికి రాత్రి కొబ్బరి మొక్కలు నాటారు. మరో 25 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు గుంతులు తవ్వారు. కబ్జాదారులు తమను బెదిరించి ఇక్కడ మొక్కలు నాటారని స్థానికులు తెలిపారు. భూకబ్జాను అడ్డుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. అయితే కబ్జాదారులు ఎవరనేది స్పష్టంగా వెల్లడికాలేదు. ఈ వ్యవహారాన్ని మీడియా వెలుగులోకి తేవడంతో అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. -
భూకబ్జాపై సీఎం ఆశ్చర్యం
పట్నా: ఉత్తరప్రదేశ్ లోని మథురలో జరిగిన భూకబ్జాపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భూమిని కబ్జా చేయడమే కాకుండా సమాంతర పాలన సాగించడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఈ వ్యవహారంపై ముందే మేలుకుని ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ప్రారంభంలోనే చర్యలు తీసుకునివుంటే పరిస్థతి ఇంతదాకా వచ్చేదికాదన్నారు. మథురలోని జవహర్‌బాగ్ లో గురువారం అక్రమ కట్టడాల కూల్చివేత సందర్భంగా జరిగిన హింసాకాండలో 24 మంది చనిపోయారు. బిహార్ ఎడ్యుకేషన్ బోర్డు(బిఎస్ఈబీ) వ్యవహారాన్ని తాను పర్యవేక్షిస్తున్నానని, రాష్ట్ర విద్యాశాఖ కూడా దర్యాప్తు చేపట్టిందని నితీశ్ కుమార్ తెలిపారు. బాధ్యులపై చర్యలు తప్పవని, ఎవరినీ ఉపేక్షించబోమని ఆయన చెప్పారు. బీఎస్ఈబీ నిర్వహించిన పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన 14 మందికి తాము రాసిన సబ్జెక్టుల గురించి కూడా ఏమాత్రం తెలియదని వెల్లడికావడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. దీంతో వీరికి మళ్లీ పరీక్ష నిర్వహించారు. -
రూ.70 కోట్ల భూ కబ్జాకు టీడీపీ నేతల యత్నం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరం నడిబొడ్డున ఉన్న శ్రీతల్పగిరి రంగనాథస్వామి ఆలయానికి చెందిన రూ.70 కోట్లకు పైగా విలువైన 9.04 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు అధికార పార్టీ నాయకులు రంగం సిద్ధం చేశారు. నెల్లూరు పాత మినీబైపాస్‌రోడ్డులోని నీలగిరి సంఘం సమీపంలో సర్వే నంబర్లు 171, 172లో 5.25 ఎకరాలు, సర్వే నంబరు 184లో 3.79 ఎకరాలు కలిపి మొత్తం 9.04 ఎకరాల భూమి రంగనాథస్వామి ఆలయానికి డమ్మాయి మాన్యం (పూర్వం ఆలయ భజంత్రీల జీవనానికి ఇచ్చిన భూమి)గా ఉంది. ఈ ప్రాంతంలో ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం అంకణం భూమి రూ.లక్ష నుంచి మూడులక్షలు పలుకుతోంది. ఈ లెక్కన ఇది దాదాపు రూ.70 కోట్లు విలువ చేస్తుంది. ఆరేడేళ్ల కిందటి వరకు దీన్ని కొందరు రైతులు కౌలుకు చేసేవారు. చుట్టూ నివాసాలు ఏర్పడటం, సాగునీరందించే కాలువలు పూడిపోవడంతో కౌలుకు చేసేందుకు రైతులు ముందుకు రావడంలేదు. దీంతో ఈ భూమి తుంగతో నిండి మురుగుగుంతగా మారింది. ఎవరూ పట్టించుకోకుండా వదిలేసిన ఈ భూమి మీద మున్సిపల్ కార్పొరేషన్‌లోని ప్రజాప్రతినిధి ఒకరు, టీడీపీకి చెందిన నియోజకవర్గస్థాయి మాజీ ప్రజాప్రతినిధి ఒకరు కన్నేశారు. తమకు అనుకూలమైన పేదలనురంగంలోకి దించారు. ఐదంకణాల వంతున రంగనాథస్వామి భూమి కేటాయించేలా చేస్తామని, దుకాణాలు ఏర్పాటు చేయిస్తామని చెప్పి ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాలని పురమాయించారు. ఆ భూమిలో కొంత భాగాన్ని రాత్రికిరాత్రి మట్టి, కంకరతో చదును చేయించారు. దీనిపై దేవాదాయశాఖ అధికారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దేవాదాయశాఖ సహాయ కమిషనర్ వేగూరు రవీంద్రరెడ్డి భూమి చుట్టూ కంచె నాటించి హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశారు. సహాయ కమిషనర్ చర్యపై అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతకు మించి ఒక్క అడుగు ముందుకేసినా ఇబ్బందులు తప్పవని బెదిరించారు. దీంతో దేవాదాయశాఖ అధికారులు కబ్జాను అడ్డుకునే ప్రయత్నాలు ఆపేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్న సమయంలో కొంతమంది ఆ భూమి చుట్టూ వేసిన కంచెను కత్తిరించారు. ఈ భూమి రంగనాథస్వామి ఆలయానికి చెందినదని దేవాదాయశాఖ ఏర్పాటు చేసిన బోర్డును తొలగించారు. ఈ కబ్జా వెనుక అధికారపార్టీ నేతలుండటంతో దేవాదాయశాఖ అధికారులు అడ్డుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం పాత మినీ బైపాస్ రోడ్డును ఆనుకుని ఉన్న 9.04 ఎకరాల భూమి రంగనాథస్వామికి చెందినదే. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.70 కోట్లు ఉంటుంది. ఈ స్థలాన్ని కొందరు మట్టిపోసి, చదును చేసి ఆక్రమణలకు యత్నించిన మాట వాస్తవమే. వారి ప్రయత్నాలను అడ్డుకున్నాం. రెండురోజుల కిందట మళ్లీ కబ్జాకు ప్రయత్నించినట్లు మా దృష్టికి రాలేదు. ఆక్రమణలకు ప్రయత్నిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. - వేగూరు రవీంద్రరెడ్డి, దేవాదాయశాఖ సహాయ కమిషనర్ -
విచారణకు సిద్ధపడరేం?
⇒ రాజధానిలో బినామీలతో ⇒భూములు కొనుగోలు చేయించారు ⇒ఇతరులపై బురద జల్లుతున్నారు ⇒ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గడికోట, ఆళ్ల ధ్వజం హైదరాబాద్: రాష్ర్ట రాజధాని భూముల దురాక్రమణ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిజంగా సచ్ఛీలుడే అయితే సీబీఐతో గానీ, సిట్టింగ్ జడ్జీతోగానీ విచారణకు ఎందుకు సిద్ధపడడం లేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు కుమారుడు లోకేశ్తోసహా మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు బినామీ పేర్లతో భూములను కొనుగోలు చేయకపోతే విచారణకు ముందుకు రావాలన్నారు. వారు ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజధాని భూదందాపై ‘సాక్షి’ పత్రిక, టీవీలో ఆధార సహిత కథనాలు రావడంతో విచారణకు సిద్ధపడకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాజధానికి ఎక్కడో 500 , 1,000 కిలోమీటర్ల పరిధిలో భూములు కొన్న వారి వివరాలను సేకరించాలని అధికారులను సీఎం పురమాయించారని, దీనర్థం ఇతరులపై బురద జల్లడానికేనన్నారు. వెబ్సైట్ నుంచి లావాదేవీలు మాయం గతంలో హైదరాబాద్ ఔటర్ రింగురోడ్డు నిర్మాణంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిపై చంద్రబాబు లెక్కలేనన్ని ఆరోపణలు చేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గుర్తు చేశారు. ఈ ఆరోపణలు రాగానే వైఎస్ స్పందించి సీబీఐ విచారణకు ఆదేశించారన్నారు. ప్రస్తుతం చంద్రబాబు, ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పు చేశారు కాబట్టే విచారణకు జంకుతున్నారని పేర్కొన్నారు. పత్రికల్లో వచ్చినవన్నీ అవాస్తవాలైతే ప్రభుత్వ వెబ్సైట్ నుంచి భూముల రిజిస్ట్రేషన్ లావాదేవీలను ఎందుకు మాయం చేశారో చెప్పాలని గడికోట, ఆళ్ల నిలదీశారు. అది నిజం కాదు.. భూముల కొనుగోళ్లకు సంబంధించి చాలా తక్కువ లావాదేవీలు జరిగాయని చంద్రబాబు చెప్పడం నిజం కాద ని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. అసలు భూ లావాదేవీలకు సంబంధించి 99 శాతం అగ్రిమెంట్లు జరిగాయని, అవేవీ రిజిస్ట్రేషన్ కావని పేర్కొన్నారు.ఎక్కడో ఉత్తరాంధ్ర, రాయలసీమ నుంచి టీడీపీ వాళ్లను పిలిపించి ఎందుకు కొనిపించారని నిలదీశారు. చంద్రబాబుపై నమ్మకం లేదు సీఎం చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోదీకి, రాష్ట్ర ప్రజలకు నమ్మకం లేకుండా పోయిందని గడికోట, ఆళ్ల అన్నారు. రాజధాని నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ.2,200 కోట్ల నిధులకు సంబంధించి ఇప్పటికీ లెక్క చెప్పలేదన్నారు. లింగమనేని గెస్ట్‌హౌస్ అక్రమ కట్టడమే చంద్రబాబు తాను నివసిస్తున్న లింగమనేని అతిథి గృహం ప్రభుత్వ ఇల్లు అన్నట్లుగా మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారని, వాస్తవానికి అది అక్రమ కట్టడమేనని ఆళ్ల ఉద్ఘాటించారు. నదుల పరిరక్షణ చట్టం ప్రకారం తాడేపల్లి తహసీల్దార్ దానిని అక్రమ నిర్మాణంగా ప్రకటించి నోటీసులు ఇచ్చారని తెలిపారు. ఫిర్యాదు చేస్తేనే పరిశీలిస్తారా? బలవంతంగా భూములు లాక్కున్నట్లుగా రైతులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదని వైఎస్సార్సీసీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. చంద్రబాబు, ఆయన అనుచరుల బినామీలు రైతుల భూములను తీసుకుని వాటి పై అగ్రిమెంట్లు మాత్రమే చేసుకున్నారని చెప్పారు. రైతులకు ఇంకా పూర్తిగా డబ్బు అందలేదన్నారు. ఈ దశలో ఫిర్యాదు చేయడానికి వస్తే మిగతా డబ్బు కూడా రాదనే ఆందోళనలో రైతులు ఉన్నారని ఆర్కే అన్నారు. ఏది జరిగినా జగన్నే నిందిస్తారా? మంత్రి రావెల కిశోర్‌బాబు కుమారుడు మహిళను వేధించి జైలుకు వెళితే జగన్‌ను నిందించడం దారుణమని గడికోట విమర్శించారు. కాపు నేత ముద్రగడ పద్మనాభం లేఖ రాసినా జగన్ కుట్ర ఉందని, మంద కృష్ణమాదిగా మాట్లాడినా జగన్ హస్తం ఉందని నిందించడం ఏమిటని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నందమూరి బాలకృష్ణ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం వెనుక కూడా జగనే ఉన్నారంటారా? అని నిలదీశారు. -
దేవుడి మాన్యం.. కబ్జాల మయం
- ఆక్రమణల బారిన 206 ఎకరాలు - తీర్పులు అనుకూలంగా వచ్చినా స్వాధీనం చేసుకోలేకపోతున్న దేవాదాయ శాఖ - ప్రత్యర్థులకు ప్రజాప్రతినిధుల అండ ఏలూరు(ఆర్ఆర్ పేట) : జిల్లాలో 41 ఆలయాలకు సంబంధించిన 206 ఎకరాలు భూమి ఆక్రమణలకు గురైనట్టు దేవా దాయ శాఖ గుర్తించింది. జంగారెడ్డిగూడెం మండలం చల్లావారిగూడెం రామాలయానికి చెందిన 42 ఎకరాలు, ఏలూరు భగవత్ ప్రార్థనా సమాజానికి చెందిన 13 ఎకరాలు, తాడేపల్లిగూడెం తాళ్లముదునూరుపాడు బాలవెంకటేశ్వరస్వామి ఆలయానికి చెందిన 13 ఎకరాలు, చివటంలో ఏకాంబరేశ్వరస్వామి ఆలయానికి చెంది న 6ఎకరాలు, ఏలూరు మార్కండేయస్వామి ఆలయానికి చెందిన 1.10 ఎకరాలు పెద్ద విస్తీర్ణం కలిగినవి. చిన్నా చితకా కలిపి మొత్తంగా 206 ఎకరాల భూమి ఆక్రమణలోనే ఉంది. కోర్టు ఉత్తర్వులిచ్చినా .. ఆక్రమణలో ఉన్న దేవుడి మాన్యాలను స్వాధీనం చేసుకోవటానికిదేవాదాయ శాఖ కోర్టుల్లో కేసు లు దాఖలు చేసింది. తీర్పు దేవాదాయ శాఖకు అనుకూలంగా వచ్చిన సందర్భాల్లోనూ ఆయా భూములను స్వాధీనం చేసుకోవడంలో ఆ శాఖ అధికారులు విఫలమౌతున్నారు. కోర్డు ఉత్తర్వు లు వచ్చిన ఆలయాల భూములను స్వాధీనం చేసుకోవటానికి వెళ్లే అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులో, పలుకుబడి కలిగిన రాజకీయ నాయకులో జోక్యం చేసుకుని వాటిని స్వాధీనం చేసుకోకుండా అటంకం కలిగిస్తున్నారు. ఇప్పటి వరకూ జిల్లాలో 10 ఆలయాలు, సంస్థలకు చెందిన సుమారు 30 ఎకరాల భూమికి కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా వాటిని దేవాదాయ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోలేక పోయారు. సాధారణంగా కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిన భూముల విషయంలో ప్రైవేటు వ్యక్తులకు సైతం పోలీసులు రక్షణ కల్పించి భూములను స్వాధీనం చేసుకోవడంలో సహకరి స్తారు. కానీ దేవాదాయ శాఖ భూముల విషయంలో రాజకీయ నాయకులు, ప్రజాప్రతిని ధుల ప్రమేయంతో పోలీసులు కూడా వాటిని స్వాధీనం చేసుకోవడంలో సహకరించడం లేదు. గత ఏడాది ఏలూరులోని కంది అయ్యన్న సత్రం స్థలాన్ని స్వాధీనం చేసుకోవటానికి వెళ్లిన దేవాదాయ శాఖ అధికారులను స్థానికులు అడ్డగించడంతో పోలీసుల సహాయం కోరారు. అక్కడికి వచ్చిన పోలీసులు కూడా ఈ భూమిని స్వాధీనం చేసుకోవడంలో సహకరించలేదు. మంత్రి ఈ జిల్లా వారైనా.. జిల్లాకు చెందిన తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే పైడికొండల మాణిక్యాలరావు దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో జిల్లాలో ఆక్రమణలో ఉన్న దేవాదాయ భూములన్నీ తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియ వేగవంతం అవుతుందనుకున్నారంతా. ఆయన బాధ్యతలు స్వీకరించి ఏడాది దాటిునా ఇప్పటికీ ఒక్క భూమిని కూడా స్వాధీనం చేసుకోలేకపోవడంపై జిల్లా ప్రజలు పెదవి విరుస్తున్నారు. -
భూకబ్జాలపై 3 కమిటీలు
* సభా సంఘాలపై కసరత్తు ప్రారంభం * చైర్మన్లుగా ఇప్పటికే తెరపైకి ఇద్దరి పేర్లు * పార్టీల శాసనసభాపక్ష నేతలకు లేఖలు * సభ్యుల పేర్లను సూచించాలని కోరిన అసెంబ్లీ కార్యదర్శి సాక్షి, హైదరాబాద్: శాసనసభా సంఘాల ఏర్పాటుపై కసరత్తు మొదలైంది. గత నవంబర్‌లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వివిధ అంశాలపై సభా సంఘాలు వేస్తున్నట్లు ప్రకటించారు. ఆయా అంశాలపై విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని ఆయన చెప్పారు. దీనికి సంబంధించి రాజకీయ పార్టీల శాసనసభాపక్ష నేతలకు అసెంబ్లీ కార్యదర్శి తాజాగా లేఖలు రాశారు. హౌస్ కమిటీల్లో పనిచేయడానికి ఆయా పార్టీల తరఫున సభ్యుల పేర్లను సూచించాల్సిందిగా కోరినట్లు సమాచారం. సభా సంఘాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అంశాలన్నీ భూ సంబంధమైనవే కావడం గమనార్హం. అయితే, వాటిపై మూడు వేర్వేరు కమిటీలు వేయాలన్న నిర్ణయం జరిగింది. ఈ మేరకు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లను కమిటీల చైర్మన్లుగా పరిశీలిస్తున్నట్లు అనధికారిక సమాచారం. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(టీపీసీసీ) అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు సంబంధించిన భూముల వ్యవహారాన్ని టీఆర్ఎస్ సభ్యులు కాలింగ్ అటెన్షన్ ద్వారా లేవనెత్తిన సంగతి తెలిసిందే. ఆయన 8.39 ఎకరాల ఎస్సీ అసైన్డు భూములను తన కబ్జాలో పెట్టుకున్నారన్న ఆరోపణలపై చర్చ జరిగింది. అదే సమయంలో సీఎం కేసీఆర్ స్పందిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా 1.90 లక్షల ఎకరాల ప్రభుత్వ అసైన్డు భూములు కబ్జాకు గురైనట్లు ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిందని సభకు వివరించారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని పది జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇతర వర్గాలకు కేటాయించిన అసైన్డు భూముల కబ్జాపై నిజానిజాలు వెలుగులోకి తేవాలని, దీనిపై సభా సంఘం వేయాలని పేర్కొన్నారు. అదే మాదిరిగా, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై ఎంఐఎం కాలింగ్ అటెన్షన్ ద్వారా చర్చ జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని హౌసింగ్ సొసైటీల అక్రమాలను వెలికి తీయాలని, దీనికోసం మరో సభా సంఘం ఏర్పాటు చేయాలని సీఎం ప్రకటించారు. అంతేకాకుండా, వక్ఫ్ భూములు భారీ ఎత్తున అన్యాక్రాంతమయ్యాయన్న ఎంఐఎం చర్చతో వక్ఫ్, భూదాన్, దేవాదాయ, చర్చి భూములతో పాటు సీలింగ్ భూముల అన్యాక్రాంతంపైనా ప్రత్యేకంగా మరో కమిటీని ఏర్పాటు చే యాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో భూముల వ్యవహారాలపైనే మూడు కమిటీల ఏర్పాటుకు సర్కారు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో రెండు కమిటీలకు చైర్మన్లుగా మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఇతర పార్టీల్లోనూ సభ్యుల ఎంపికపై ఎమ్మెల్యేల్లో ఆసక్తి నెలకొంది. అయితే, వీటిని శాసనసభ, శాసనమండలి సభ్యులతో కలిపి ‘జాయింట్ లెజిస్లేచర్ కమిటీ’లుగా ఏర్పాటు చేస్తారా లేదా అన్న అంశంపై భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ అక్రమాలపై ఉభయ సభల్లోనూ చర్చ జరిగిన కారణంగా ఈ అంశంపై జాయింట్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. ఇక కమిటీల్లో సభ్యుల సంఖ్యపైనా ఎమ్మెల్యేల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా ఒక్కో కమిటీలో ఏడుగురు సభ్యులు ఉండే అవకాశముంది. అత్యధికంగా 15 మంది వరకు ఉండవచ్చని ఓ సీనియర్ ఎమ్మెల్యే పేర్కొన్నారు. అయితే, అధికారికంగా కమిటీలను ఎప్పుడు ప్రకటిస్తారన్నది ఇంకా స్పష్టంకాలేదు. వాస్తవానికి రానున్న బడ్జెట్ సమావేశాల నాటికే సభ ముందుకు నివేదికలు వస్తాయని మొదట అనుకున్నా, వాటి ఏర్పాటులోనే జాప్యం జరుగుతున్నందున ఆగస్టులో జరిగే వర్షాకాల సమావేశాల నాటికి నివేదికలు సిద్ధమయ్యే అవకాశముందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. కానీ, సభాసంఘం ఏర్పాటయ్యాక మూడు నెలల్లోగా నివేదిక అందజేయాల్సి ఉంటుందని కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. -
కబ్జాలపై కఠినం..
* అఖిలపక్ష భేటీలో సీఎం కేసీఆర్ * అన్ని పార్టీలకు కబ్జా భూముల వివరాలు * ప్రభుత్వ స్థలాల్లో ఉంటున్న పేదలకు ఇళ్ల పట్టాలు * 80 నుంచి 120 గజాల స్థలం ఉచితంగా క్రమబద్ధీకరణ * పేదలకే క్రమబద్ధీకరించాలన్న వామపక్షాలు * ‘ఓకే కామ్రేడ్స్.. విప్లవం వర్ధిల్లాలి’ అన్న కేసీఆర్ * పాతబస్తీలో మెట్రో మార్గంపై అన్ని పార్టీలతో చర్చ * ప్రతిపాదిత మార్పులను మ్యాప్‌లతో వివరించిన ప్రభుత్వం * హుస్సేన్‌సాగర్ ప్రక్షాళనకు అఖిలపక్షం మద్దతు * తుది కసరత్తు కోసం 16న మళ్లీ భేటీకి నిర్ణయం సాక్షి, హైదరాబాద్: రాజధానిలో అన్యాక్రాంతమైన భూముల వివరాలను అన్ని పార్టీలకు రెండు రోజుల్లోగా అందిస్తామని, వాటిపై అభిప్రాయాలు తెలుసుకుని నిర్ణయం తీసుకునేందుకు ఈ నెల 16న మళ్లీ అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. భూ కబ్జాలు, హుస్సేన్‌సాగర్ శుద్ధి, మెట్రో రైలు మార్గంలో మార్పులు తదితర అంశాలపై చర్చించేందుకు మంగళవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని నరసింహారెడ్డి, ఈటెల రాజేందర్, పద్మారావుతో పాటు కాంగ్రెస్ నుంచి కేఆర్ సురేష్‌రెడ్డి, భట్టి విక్రమార్క, టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎల్ రమణ, బీజేపీ తరఫున జి.కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, మజ్లిస్ పార్టీ నేత అక్బరుద్దీన్ ఒవైసీ, సీపీఎం నుంచి సున్నం రాజయ్య, తమ్మినేని వీరభద్రం, సీపీఐ తరఫున రవీంద్రకుమార్, చాడ వెంకటరెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌లో వేలాది ఎకరాలు కబ్జాకు గురయ్యాయి. ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే నిర్మాణాలు చేపట్టిన వారికి క్రమబద్ధీకరించుకునే అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నాం. కబ్జాకుగురై ఖాళీగా ఉన్న భూముల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భవిష్యత్తులో మళ్లీ కబ్జాలకు పాల్పడకుండా పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నాం’ అని అఖిలపక్ష నేతలకు వివరించారు. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు 80 నుంచి 120 చదరపు గజాల స్థలాన్ని ఉచితంగా క్రమబద్ధీకరించి, వారి పేరిట పట్టాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు కేసీఆర్ తెలిపారు. గూడు లేని పేదల కోసం బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తామని పేర్కొన్నారు. ‘భారీ ఆక్రమణలను క్రమబద్ధీకరించొద్దు. పేదల ముసుగులో బడా భూకబ్జాదారులకు కొమ్ముకాయొద్దు. 120 గజాలకన్నా ఎక్కువగా క్రమబద్ధీకరించడాన్ని మేం అంగీకరించం’ అని వామపక్ష ప్రతినిధులు వ్యాఖ్యానించినప్పుడు కేసీఆర్ స్పందిస్తూ.. ‘ఓకే కామ్రేడ్స్.. విప్లవం వర్ధిల్లాలి. పేదలకే క్రమబద్ధీకరిస్తాం. మిగిలిన విషయాలను 16న నిర్ణయిద్దాం’ అని అన్నారు. మెట్రో మార్గంపై భిన్న వాదనలు మెట్రో ప్రాజెక్టును పాత మార్గంలోనే పూర్తిచేయాలని బీజేపీ ప్రతినిధులు వాదించారు. అలా చేస్తే పాతబస్తీలో చాలా నష్టం జరుగుతుందని ఎంఐఎం అడ్డుచెప్పింది. ఇరు పార్టీల నేతలు తమ తమ అభిప్రాయాలను తెలియజేశారు. చివరకు రైలు మార్గం విషయంలో పాతబస్తీ వాసులకు ఏది మంచిదో అదే చేద్దామనుకున్నారు. ఈ విషయంపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ జోక్యం చేసుకుంటూ.. ‘మెట్రోరైల్ అలైన్మెంట్ మార్పువల్ల సమస్యలు వస్తున్నాయి. ఏదో గూడుపుఠాణి జరిగిందని ప్రభుత్వానికి అప్రదిష్ట వచ్చింది. కాంట్రాక్టు సంస్థలను ప్రభుత్వం వేధిస్తుందనే భావనతో ఇతర కంపెనీలు కూడా తెలంగాణకు రాకుండా పోతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. అయితే దీనిపై సీఎం తీవ్రంగా స్పందించారు. ‘ప్రభుత్వానికి అప్రదిష్ట అని ఎలా అంటారు? మెట్రోరైలుపై నాకు అవగాహన లేదా? ఇవన్నీ నాకు తెలియదని ఎలా అంటారు? ప్రపంచంలోనే ఇంతవేగంగా పనులు ఎక్కడా జరగడంలేదు. 28 కిలోమీటర్ల రైల్వే లైను కేవలం రెండేళ్లలో పూర్తయింది’ అని బదులిచ్చారు. హైదరాబాద్‌ను సింగపూర్‌గా మార్చాలని విపక్ష నేత ఒకరు సూచించినప్పుడు.. ‘హైదరాబాద్ నగరానికి ప్రపంచవ్యాప్తంగా ఓ గుర్తింపు ఉంది. మరో సిటీతో పోల్చాల్సిన అవసరం లేదు. హైదరాబాద్‌ను హైదరాబాద్‌లాగే అభివద్ధి చేస్తా’మని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. చారిత్రక ప్రాంతాల పరిరక్షణ కోసమే నగరంలోని చారిత్రక ప్రాంతాలు, వారసత్వ ఆస్తులు, ప్రార్థనా మందిరాలు, ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న చిహ్నాలు చెదిరిపోకుండా ఉండేలా మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకుపోనున్నట్లు అఖిలపక్ష నేతలకు సీఎం తెలిపారు. మూడు చోట్ల మెట్రో అలైన్మెంట్లో మార్పులు చేయాలని భావిస్తున్నట్లు వివరించారు. అసెంబ్లీ ముందు నుంచి కాకుండా వెనుకవైపు నుంచి, సుల్తాన్‌బజారు నుంచి కాకుండా కోఠి ఉమెన్స్ కాలేజీ వెనుకవైపు నుంచి వెళ్లే విధంగా మార్పులు చేశామన్నారు. పాతబస్తీ మార్గంలో వచ్చిన అభ్యంతరాలను కూడా ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఇందుకు సంబంధించిన మ్యాప్‌ను ప్రదర్శిస్తూ మెట్రో రైలు ప్రాజెక్టు ఎండీ ఎన్వీఎన్ రెడ్డి అన్ని వివరాలను తెలియజేశారు. ఇక హుస్సేన్‌సాగర్‌ను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అఖిలపక్షానికి ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రపంచంలో ఏ నగరానికి లేని గొప్ప అవకాశం హైదరాబాద్‌కు ఉన్నదని, నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ ఇప్పుడు మురికికూపంగా తయారవడం దురదృష్టకరమని అన్నారు. నాలాల నుంచి వచ్చే నీరు సాగర్‌లోకి చేరడం వల్ల కాలుష్యం పెరిగిపోయి మరీ ఇబ్బందిగా మారిపోయిందని కేసీఆర్ వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకునే చర్యలకు మద్దతిస్తామని అన్ని పార్టీల నేతలు చెప్పారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ ఆకాశహార్మ్యాలు నిర్మించాలన్న ప్రతిపాదనకూ సమ్మతించారు. అఖిలపక్షంపై పార్టీల స్పందన మెట్రో రూటుపై ఏకాభిప్రాయం తేవాలి మెట్రో పనులను వేగవంతం చేయాలని ప్రభుత్వాన్ని కోరాం. పాతబస్తీలో రూటు మార్పుపై ఎలాంటి సర్వేలు జరగలేదని ప్రభుత్వం తెలిపింది. మతపరమైన నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది క లగకూడదన్నదే మా అభిమతం. సుల్తాన్‌బజార్ రూటు మార్పుపై ఏకాభిప్రాయం సాధించేందుకు ప్రభుత్వమే కృషి చేయాలి. ఇక వినాయక్‌సాగర్‌లో వినాయక నిమజ్జనాలపై అన్ని సంఘాలు, మత పెద్దల అభిప్రాయం తీసుకోవాలి. సాధ్యాసాధ్యాలను కూడా తేల్చాలి. రాత్రికి రాత్రి నిర్ణయం మంచిది కాదు. - కేఆర్ సురేష్‌రెడ్డి, భట్టి, కాంగ్రెస్ నిమజ్జన ప్రాంతాన్ని మార్చవద్దు హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం తరతరాల నుంచి వస్తున్న సంప్రదాయం. సాగర్‌లోనే ఓ పక్కగా ఘాట్ ఏర్పాటు చేసి అక్కడ నిమజ్జనం చేసే చర్యలు తీసుకోండి. వినాయక్‌సాగర్ నిర్మాణంపై అక్కడి స్థానికుల నుంచి సైతం వ్యతిరేకత ఉందన్న విషయాన్ని గుర్తించాలి. కాబట్టి ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని చెప్పాం. పాతబస్తీలో రూట్ మార్పు సైతం ప్రజలకు ఎక్కువ ఉపయోగకరంగా ఉండాలి. దీనిపై సీఎం మొండిగా వ్యవహరించరాదు. నగరంలోని భూ కబ్జాదారులను కఠినంగా శిక్షించేలా చట్టాన్ని తేవాలి. దీనికి మా సహకారం ఉంటుందని చెప్పాం. - ఎర్రబెల్లి, రమణ, టీడీపీ మెట్రో మార్గాన్ని మార్చొద్దు ముందుగా ప్రతిపాదించిన మార్గంలోనే పాతబస్తీలో మెట్రో రైల్ నిర్మాణం జరగాలి. షాలిబండ, డబీర్‌పుర మార్గంలో మెట్రో వెళితే దాదాపు 10 లక్షల మందికి ప్రయోజనకరంగా ఉంటుంది. మిగతా నగరంతో పాతబస్తీకి అనుసంధానం కలగాలంటే మొదట ప్రతిపాదించిన మార్గమే మేలు. సుల్తాన్ బజార్, అసెంబ్లీ ప్రాంతాల్లో చారిత్రక కట్టడాలున్నందున అక్కడ అలైన్మెంట్ మారిస్తే అభ్యంతరం లేదు. ఇక ఎప్పటిలాగానే హుస్సేన్‌సాగర్ జలాశయంలోనే గణేష్ నిమజ్జనం జరగాలి. - కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, బీజేపీ సరైన నిర్ణయం తీసుకోవాలి హుస్సేన్ సాగర్ వద్ద పార్కింగ్, పరిశుభ్రత, రద్దీని దృష్టిలో ఉంచుకుని నిమజ్జనంపై సరైన నిర్ణయం తీసుకోవాలి. పాతబస్తీలో మెట్రో మార్గంపై అసలు సర్వే కూడా చేపట్టనప్పుడు ఎన్ని నిర్మాణాలు తొలగించాలో ఎలా చెప్పగలరు? రైలు మార్గం ఎలా ఉండాలో పాతబస్తీ ప్రజలకే వదిలేయాలి. - చాడ వెంకట్‌రెడ్డి, సీపీఐ క్రమబద్ధీకరణతోకబ్జాదారులకు మేలు క్రమబద్ధీకరణ ప్రతిపాదన కబ్జాదారులకు మేలు చేసేలా ఉంది. అన్యాక్రాంతమైన భూములన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. నగరంలో ఎక్కడిక్కడ నిమజ్జన కుంటలను ఏర్పాటు చేయాలి. ఈ విషయంలో ఉద్రేకాలు సృష్టించే ప్రయత్నం మంచిది కాదు. పాతబస్తీ ప్రజల కోరిక ప్రకారం మెట్రో నిర్మాణం జరగాలి. - తమ్మినేని వీరభద్రం, సీపీఎం హుస్సేన్‌సాగర్‌ను శుద్ధి చేయాలి 1980కి ముందు హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జన సంప్రదాయం లేదు. అందుకే నిమజ్జనాన్ని వికేంద్రీకరించి సాగర్‌ను పరిశుభ్రంగా ఉంచాలి. మెట్రో రైల్ మొదటి అలైన్మెంట్ ప్రకారం దాదాపు 1200 నిర్మాణాలు కూల్చేయాలి. ఇందులో 40కిపైగా మసీదులు, 20 మందిరాలు ఉన్నాయి. అలా కాకుండా మూసీ నది వెంట మార్గం నిర్మిస్తే కేవలం రెండు నిర్మాణాలు తొలగించాల్సి ఉంటుంది. మొదటి ప్రతిపాదిత మార్గంలో ఇప్పటికే ఎంఎంటీఎస్ ఉంది. అదే మార్గంలో మెట్రో వెళ్లడంలో అర్థం లేదు. - అక్బరుద్దీన్, ఎంఐఎం