
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాల్లో అధికార టీడీపీ నేతల కబ్జాల పర్వం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమను ప్రాంతంలో తెలుగు తమ్ముళ్లు భూకబ్జాకు పాల్పడ్డారు. కొండ, దాని పక్కనున్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఫెన్సింగ్ వేసేశారు. 30 ఎకరాల పోరంబోకు భూమిని కబ్జాచేసి, పంచుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.
గతంలో అక్కడే పలువురికి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు తాము కబ్జా చేసిన భూములకు పట్టాలు సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కబ్జా విషయం తెలిసినా అధికారులు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment