thullur
-
కిక్కిరిసిన సీఎం జగన్ సభా ప్రాంగణం
-
రాజధాని భూ కుంభకోణం: ఇద్దరికి రిమాండ్
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న రాజధాని భూ కుంభకోణంలో ఇద్దరు కీలక వ్యక్తులను సీఐడీ బుధవారం అరెస్టు చేసింది. అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన గుమ్మడి సురేశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. విజయవాడకు చెందిన సురేశ్.. దళితులు సాగుచేసుకుంటున్న అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన నేపథ్యంలో అతడిని అరెస్టు చేశారు. అదే విధంగా భూ రికార్డుల తారుమారు వ్యవహారంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న తుళ్లూరు రిటైర్డ్ తహసిల్దార్ సుధీర్ బాబును కూడా అరెస్టు చేశారు. ఈ క్రమంలో వీరిద్దరిని మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈ నెల 29 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో సురేశ్, సుధీర్ బాబును గుంటూరులోని జైలుకు తరలించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితంగా మెలిగిన సుధీర్ బాబు.. టీడీపీ నాయకులతో కలిసి రికార్డులు తారుమారు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో అక్రమాలు, తప్పుడు రికార్డులు సృష్టించిన నేపథ్యంలో సీఆర్డీఏ నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్ కనికెళ్ల మాధురిని పోలీసులు ఇదివరకే అరెస్టు చేసిన విషయం తెలిసిందే.(డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్) -
పోలీసులతో బయటకు నెట్టించి.. తొలి రిజిస్ట్రేషన్
తుళ్లూరు రూరల్ (తాడికొండ): రాజధాని అమరావతిలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ప్రభుత్వం కేటాయించిన స్థలాలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గుంటూరు జిల్లా తుళ్లూరులో శుక్రవారం ప్రారంభమైంది. ఐనవోలు గ్రామ రెవెన్యూ పరిధిలో ఈ స్థలాలను కేటాయించినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తొలి రిజిస్ట్రేషన్ చేయించుకోగా, చివరి రిజిస్ట్రేషన్ హోంశాఖ ప్రధాన కార్యదర్శి అనురాధ చేయించుకున్నారు. ప్రతి ఒక్క అధికారికి 500 చదరపు గజాల స్థలాన్ని కేటాయించగా, ఇప్పటివరకు దాదాపు 20 మంది అధికారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తుళ్లూరు కార్యాలయ రిజిస్ట్రార్ తెలిపారు. కాగా, అధికారులకు స్థలాలు కేటాయించడం, వాటిని హుటాహుటిన రిజిస్ట్రేషన్ చేయడంపై రాజధాని ప్రాంత రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన తమ సమస్యలను పరిష్కరించడంలేదు కానీ అధికారుల స్థలాలకు మాత్రం తొందరొచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారుల అనుమతి కావాలి రిజిస్ట్రేషన్ చేయించుకున్న అధికారుల వివరాలు తెలియజేయడానికి ఉన్నతాధికారుల నుంచి అనుమతులు లేవు. సీఆర్డీఏ విజయవాడ కార్యాలయం నుంచి సేల్ డీడ్ పట్టాలను అధికారుల పేరు మీద విడుదల చేస్తున్నారు. వాటి ఆధారంగా సీఆర్డీఏ అధికారుల పర్యవేక్షణలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నాం. – సీహెచ్ భీమాబాయ్, రిజిస్ట్రార్, తుళ్లూరు ఇంత శ్రద్ధ పేదలపై ఎందుకులేదు? పేదలకు రాజధానిలో ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదు. పేదవాడి దగ్గర రెండింతలు కట్టించుకుంటున్నారు. అధికారులకు మాత్రం చదరపు గజం దాదాపు రూ.28 వేలు ఉన్న ప్రాంతంలో కేవలం రూ.4 వేలకే ఇస్తున్నారు. అధికారులపై ఉన్న శ్రద్ధ పేదలపై ఎందుకు లేదు? – బెజ్జం రాంబాబు, నిరుపేద గృహ లబ్ధిదారుడు మా భూములను ప్రభుత్వం అధికారులకు పంచుతోంది మా దగ్గర భూములు తీసుకుని ప్రభుత్వం అధికారులకు పంచుతోంది. మా సమస్యలు చెప్పుకోవడానికి గుంటూరు కలెక్టర్ కార్యాలయానికి వెళితే కలెక్టర్ శశిధర్ పోలీసులతో బయటకు నెట్టించారు. మూడు రోజులుగా రైతులు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పట్టించుకున్న నాథుడు లేడు. భూములు పంచుతుంటే మాత్రం అధికారులందరూ వచ్చి తీసుకుంటున్నారు. – తిప్పనబోయిన ధనలక్ష్మి, రాయపూడి మహిళా రైతు -
రాజధాని రైతులపై పోలీసుల దౌర్జన్యం
తుళ్లూరురూరల్ : రాజధాని అమరావతి ప్రాంతం రైతులకు తాత్కాలిక సచివాలయం సాక్షిగా అణచివేతకు గురవుతున్నారు. వెలగపూడికి చెందిన గద్దే మీరాప్రసాద్ అనే రైతు తన పొలంలో రహదారి నిర్మాణం జరపడానికి వీలులేదని అడిగినందుకు రైతును పోలీసులు దారుణంగా బట్టలు చిరిగేలా కొట్టారు. సీఐ సుధాకర్ బాబు రైతుపై చేయికూడా చేసుకున్నాడు. అనంతరం బలవంతంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైతు సొమ్మసిల్లి పడిపోవడంతో, రైతు వద్ద నుంచి పోలీసులు వెళ్లిపోయారు.. బాధిత రైతుకు మద్దతు తెలిపిన సీపీఎం, వైఎస్సార్ సీపీ నాయకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజధానికి ఇవ్వని పొలంలో రోడ్డు ఎలా వేస్తారంటూ రైతు మీరా ప్రసాద్ నిలదీశారు. తాత్కాలిక సచివాలయం వెనుకనున్న సీఆర్డీఏ నిర్మిస్తున్న ఎన్9 రహదారి నిర్మాణ పనులు నిలిపి వేయాలని సర్వేనెంబర్ 214/ఏ లో గద్దే మీరాప్రాద్ అనే రైతు భూమిలో రహదారి నిర్మాణం జరుగుతుందని, నిర్మాణాలను నిలిపివేయాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే సీఆర్డీఏ అధికారులు మాత్రం హైకోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కి పోలీసులను అడ్డుపెట్టి రైతులను భయభ్రాంతులకు గురిచేశారు. సంఘటనా స్థలానికి వచ్చిన సీఆర్డీఏ డెప్యూటీ కలెక్టర్ విజయకుమారిని వివరణ కోరగా తాము పోలీసులకు భద్రత మాత్రమే కల్పించమని అడిగినట్లు తెలిపారు. -
ఏపీ రాజధానిలో కబ్జా పర్వం
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతాల్లో అధికార టీడీపీ నేతల కబ్జాల పర్వం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వడ్డమను ప్రాంతంలో తెలుగు తమ్ముళ్లు భూకబ్జాకు పాల్పడ్డారు. కొండ, దాని పక్కనున్న ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుని ఫెన్సింగ్ వేసేశారు. 30 ఎకరాల పోరంబోకు భూమిని కబ్జాచేసి, పంచుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో అక్కడే పలువురికి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టాలు మంజూరు చేసింది. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు తాము కబ్జా చేసిన భూములకు పట్టాలు సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కబ్జా విషయం తెలిసినా అధికారులు తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తెలుగు తమ్ముళ్లు ఆక్రమించిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరుతున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. -
కృష్ణమ్మ కబ్జాపై సాక్షి ఎఫెక్ట్
-
ప్రకంపనలు సృష్టిస్తోన్న ‘సాక్షి’ కథనం
-
ప్రకంపనలు సృష్టిస్తోన్న ‘సాక్షి’ కథనం
అమరావతి: ‘కృష్ణమ్మ గర్భంలో.. పెద్దలకబ్జా’ శీర్షికతో ‘సాక్షి’ దినపత్రిక ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏకంగా కృష్ణా నదినే అధికార పార్టీ నేతలు ఆక్రమించుకుంటున్న వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తేవడంతో అధికారుల్లో కదిలిక మొదలైంది. నదిలో నది మధ్యలో రిసార్ట్స్, మల్టీప్లెక్స్‌లు నిర్మించుకునేందుకు సుమారు 150 ఎకరాల విస్తీర్ణం చుట్టూ హద్దులతో ఎర్ర జెండాలు ఏర్పాటు చేయడం అధికారుల్లో తీవ్రమైన చర్చకు దారితీసింది. అధికార పార్టీ నేతలు కబ్జాకు పాల్పడ్డారని వెల్లడికావడంతో విషయం పెద్దది కాకుండా చూసేందుకు అధికారులు చర్యలు మొదలుపెట్టినట్టు సమచారం. కబ్జాదారులు వేసిన ఫెన్సింగ్ ను గుట్టుచప్పుడు కాకుండా తొలగిస్తున్నారు. నది కబ్జాపై విచారణను అధికారులు గాలికొదిలేశారు. రిసార్ట్స్‌ల కోసం నదినే పూడ్చి వేయటానికి అధికార పార్టీ నాయకులు బరితెగించడాన్ని పర్యావరణవేత్తలు, రైతులు, మత్స్యకారులు, స్థానికులు ఖండిస్తున్నారు. సంబంధిత కథనం: కృష్ణమ్మ గర్భంలో.. పెద్దలకబ్జా -
రాజధాని బురద
-
ఆ రెండూళ్లు ఇక ఉండవు
సాక్షి, అమరావతి: తుళ్లూరు మండలం ఉద్దండరాయుని పాలెం, లింగాయపాలెం గ్రామాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాజధాని నిర్మాణాన్ని గుంటూరు జిల్లా మంగళగిరి, తాడికొండ నియోజక వర్గాల పరిధిలో 29 గ్రామాల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా భూ సమీకరణ పేరుతో 22వేల మంది రైతుల నుంచి ఇప్పటికే 33వేల ఎకరాలను లాక్కుంది. అమరావతి సీడ్ కేపిటల్లో స్టార్టప్ అభివృద్ధి చేసేందుకు తుళ్లూరు మండల పరిధిలోని 1,691 ఎకరాలను మూడు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అందుకు సంబంధించి నమూనాను సీఆర్డీఏ ఇటీవల విడుదలచేసింది. ఈ 1,691 ఎకరాలను పూర్తిగా చదునుచేసి ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలి. అందులో ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం గ్రామాలున్నాయి. ఈ రెండు గ్రామాలు 45 ఎకరాలు విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి. రెండు గ్రామాల్లో మొత్తం జనాభా 3,057 కాగా, 792 నివాసాల్లో 850 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇంకా 6 హిందూ దేవాలయాలు, 7 ప్రార్థనా మందిరాలు ఉన్నాయి. ప్రభుత్వం వీటన్నింటినీ కూల్చేసి, చదునుచేసి ఏడీపీ, జీవీసీ,సీసీడీఎంసీఎల్ సంస్థలకు అప్పగించేందుకు సిద్ధమవుతోంది. ఈ ప్రాంతంలో రాజధానిని ప్రకటించటంతో గ్రామస్తులు కొందరు పాత నివాసాలను పడగొట్టి రూ.లక్షల రూపాయలు వెచ్చించి కొత్త భవనాలను నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు తమ రెండు గ్రామాలను స్టార్టప్ ఏరియాలో చేర్చారని తెలుసుకున్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. -
అడ్డగోలు మార్కింగ్లతో ఇళ్ల కూల్చివేత
తుళ్ళూరు : రహదారుల వెంట ఆక్రమణల తొలగింపులో అధికారులు అడ్డగోలుగా మార్కింగ్ చేయడంతో పలువురు నివాసాలు కోల్పోయి వీధిన పడుతున్నారు. నవ్యాంధ్ర రాజధాని ప్రధాన కేంద్రమైన తుళ్ళూరులో ఆక్రమణల తొలగింపునకు సీఆర్డీఏ అధికారులు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. సీఎం చంద్రబాబు రాజధాని గ్రామాలను సుందరీకరణ చేయాలని అధికారులకు ఇచ్చిన ఆదేశాల మేరకు తుళ్ళూరు మండలంలోని పెదపరిమి, మందడం, వెలగపూడి, రాయపూడి గ్రామాలలో రహదారుల వెంట వున్న ఆక్రమణలను సీఆర్డీఏ అధికారులు తొలగించారు. మండలకేంద్రమైన తుళ్ళూరులో గత వారం రోజులుగా జరుగుతున్న ఆక్రమణల తొలగింపు వివాదాలకు దారి తీసింది. తుళ్ళూరు ఎస్సీ కాలనీలో రెవెన్యూ సర్వేయర్ల తప్పుడు లెక్కలతో నాలుగు అడుగులు ఎక్కువ దూరం మార్కింగ్ ఇవ్వడంతో అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. గత 50 సంవత్సరాలుగా పంచాయితీకి పన్నులు కూడా కడుతున్నామని, అధికారులు వచ్చి ఈ స్థలాలు ప్రభుత్వానివేనంటూ నివాసాలు తొలగించారని కాలనీకి చెందిన వృద్ధురాలు మరియమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. తమకు ఉన్న గూడు పడగొట్టారని, తాను ఎలా బతకాలని ఆమె రోదిస్తోంది. స్థానికులు అధికారులను నిలదీయడంతో సోమవారం మరోసారి సర్వే చేసిన అధికారులు పొరపాటు జరిగిందంటూ పాత మార్కింగ్‌ను కొట్టివేసి, నాలుగు అడుగులు వెనక్కి కొత్తగా మార్కింగ్ ఇచ్చారు. దీంతో తప్పుడు మార్కింగ్‌తో తాము ఇళ్లు కోల్పోయామని పలువురు కన్నీటి పర్యంతమవుతున్నారు. చెండాచెట్టు కూడా తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో ప్రత్యామ్నాయం చూపాలని తుళ్ళూరు ముస్లింలు అధికారులను కోరుతున్నారు. దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న పేదలను అర్ధంతరంగా ఖాళీచేయిస్తే వారు ఎలా బతకాలని వైఎస్సార్సీపీ తాడికొండ నియోజకవర్గ నాయకుడు కత్తెర సురేష్‌కుమార్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. అధికారులు మానవతా ధర్మంతో బాధితులను ఆదుకోవాలని, లేకుంటే బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదు : తహశీల్దార్ దీనిపై తుళ్ళూరు తహశీల్దార్ సుధీర్‌బాబును వివరణ కోరగా సాధ్యమైనంత వరకు అందరికీ ముందస్తు సమాచారం ఇచ్చామని, ఎవ్వరినీ ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదన్నారు. ఎవరికైనా సొంతస్థలాలు, ఆస్తుల నష్టం జరిగితే నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవసరమైతే రీ సర్వే చేయిస్తామని వివరణ ఇచ్చారు. -
డబ్బు కోసం బాలుడి కిడ్నాప్.. ఆపై హత్య
నర్సరావుపేట రూరల్ (గుంటూరు జిల్లా) : ఫిరంగిపురం మండలం తుళ్లూరులో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలుడిని దుండగులు హత్య చేసి బావిలో పడేశారు. గ్రామం శివారులోని బావిలో బాలుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు సోమవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. నోట్లో గుడ్డలు కుక్కి బాలుడ్ని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం నర్సరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడు గుంటూరు అరండల్‌పేట్‌లో ఈ నెల 14న అదృశ్యమైన ఆదిత్యరాజ్(8)గా పోలీసులు గుర్తించారు. బాలుడిని అపహరించిన దుండగులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.15 లక్షలు డిమాండ్ చేయగా రూ.12 లక్షల వరకు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది. -
తుళ్లూరులో మావోయిస్టు అరెస్టు కలకలం
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం జరుగుతున్న తుళ్లూరులో మావోయిస్టుల కలకలం రేగింది. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలో మావోయిస్టు పార్టీ మహిళా నేత భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణ అలియాస్ పద్మను మంగళవారం మధ్యాహ్నం పోలీసులు అదుపులోకి తీసుకోవడం తీవ్ర సంచలనం కలిగించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి సమీపంలోని తాళ్లాయపాలెంలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకోవడం చూస్తుంటే మావోయిస్టుల టార్గెట్ రాజధాని ప్రాంతంపై పెట్టినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోన్ సీనియర్ కమాండెంట్ నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్న భార్య, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో డిప్యూటీ కమాండెంట్‌గా పనిచేసిన ఆమెను ఎస్ఐబీ పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలోని తన సోదరి వెంకటరత్నం ఇంట్లో చికిత్స పొందుతుండగా అన్నపూర్ణను ఎస్ఐబీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. టవేరా వాహనంలో సివిల్ డ్రస్సులో వచ్చిన ఎస్ఐబీ పోలీసులు అరుణను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే, ఛత్తీస్‌గఢ్ నుంచి అందిన సమాచారం మేరకే హైదరాబాద్ నుంచి ఎస్ఐబీ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం తాళ్లాయపాలెం చేరుకుని అన్నపూర్ణను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అన్నపూర్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. అయితే, ఆమె రెక్కీలో భాగంగానే పలుమార్లు రాజధాని ప్రాంతంలో సంచరించినట్లు ఎస్ఐబీ అధికారులు భావిస్తున్నారు. రాజధాని ప్రాంతంతోపాటు జిల్లాలో జరుగుతున్న ఇసుక మాఫియా, భూమాఫియాపై మావోయిస్టు నేతలు దృష్టి సారించినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిలో భాగంగా ఇప్పటికే అధికార పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధుల సోదరులు, తనయులకు వీరి నుంచి హెచ్చరికలు వచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి తోడు రాజధాని ప్రాంతంలో పనులు లేక రైతు కూలీలు అల్లాడిపోతుండడంతో మావోయిస్టు నేతలు ఇదే అదనుగా భావించి రంగంలో దిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఆమెను గుంటూరుకు చేరుస్తున్నారా, లేదా విజయవాడకు తరలించి విచారిస్తున్నారనే విషయంలో స్పష్టత లేదు. కీలక నేతల తనయులపై వీరు రెక్కీ నిర్వహిస్తున్నట్లు అనుమానంతో అరుణను అత్యంత రహస్యంగా పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రాజధాని ప్రాంతంలో మావోయిస్టు కీలక మహిళా నేత పోలీసుల అదుపులో తీసుకోవడం తీవ్ర సంచలనం కలిగిస్తోంది. అన్నపూర్ణపై రూ. 5 లక్షల రివార్డు భూతం అన్నపూర్ణ అలియాస్ అరుణ ఆలియాస్ పద్మ జన్మస్థలం గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లు గ్రామం. ఈమె గతంలో మావోయిస్టు నల్లమల జిల్లా కమాండర్‌గా పనిచేసి అనేక కీలకమైన సంఘటనల్లో పాల్గొంది. బొల్లాపల్లి మండలం బండ్లమోడు-రేమిడిచర్ల మధ్య 2002లో మందు పాతర పేల్చిన ఘటనలో అన్నపూర్ణ కీలక బాధ్యతలు నిర్వర్తించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అన్నపూర్ణ తలపై రూ. 5లక్షల రివార్డు ప్రకటించినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. ఆమె అరెస్టుపై పోలీసు అధికారులు మాత్రం పెదవి విప్పడం లేదు. అయితే మరోవైపు అన్నపూర్ణ సోదరి వెంకటరత్నం భర్త బాలస్వామిని సైతం తుళ్లూరు పోలీసుస్టేషన్‌కు పిలిచి విచారిస్తున్నట్లు సమాచారం. -
మార్చి నెలాఖరు వరకు గడువు ఇవ్వాలి..
-
ఆటవిక పాలన
♦ భూములివ్వని రైతులపై చంద్రబాబు దాష్టీకం ♦ రాజధాని పేరుతో దుర్మార్గం ♦ నిప్పులు చెరిగిన వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, విజయవాడ బ్యూరో: ‘బిహార్‌లో జంగల్ రాజ్ (ఆటవిక పాలన) ఉండేదని విన్నాం... ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన అంతకన్నా దుర్మార్గంగా మారిపోయింది. చంద్రబాబు రాక్షసుడిలా మారిపోయాడు. రాజధానికి భూములు ఇవ్వని రైతులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. నానా ఇబ్బందులు పెడుతున్నారు. పొలాల్లో డ్రిప్‌లు తీసేస్తున్నారు. పాస్‌బుక్‌లు ట్యాంపర్ చేసేస్తున్నారు. చివరకు రైతుల పంటలు కూడా కాల్చేస్తున్నారు.’ అని ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సోమవారం రాజధాని ప్రాంతంలో పర్యటించిన ఆయన తుళ్లూరు మండలం మల్కాపురంలో దగ్ధమైన చెరకు తోటను పరిశీలించారు. చెరకుతోట రైతు గద్దె చంద్రశేఖరరావును పరామర్శించారు. అక్కడకు చేరుకున్న రైతులు తాము పడుతున్న కష్టాలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన ఉద్ధండరాయునిపాలెంలోనూ పర్యటించారు. రెండుచోట్లా రైతులను ఊరడించిన జగన్ రాష్ర్టప్రభుత్వ దాష్టీకాలపై తీవ్రంగా మండిపడ్డారు. మల్కాపురంలో ఆయనేమన్నారంటే... అక్కడ కేసులుండవ్ అరెస్టులుండవ్.. రాజధానికి భూములు ఇవ్వని రైతుల పంటలు కాల్చేస్తున్నారు. పోలీస్ స్టేషన్‌కి వెళితే కేసులు పెట్టరు. కేసులు పెట్టినా ఎవరినీ అరెస్టు చేయరు. పంటలు తగులబెట్టిన సంఘటనలు ఇప్పటికి 13 జరిగాయి. ఇంతవరకూ ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదు. పంట తగలబెట్టారని కాకుండా తగలబడిందని రాయాలని శేఖరన్న (చెరకుతోట రైతు)కు డీఎస్పీ చెప్పారట. ఎవరో సిగరెట్ తాగి పడేస్తే పంట కాలిపోయిందని చెబుతాడా? డీఎస్పీ సిగరెట్ ఏమైనా ఇక్కడ పొరపాటున పడిందా? లేకపోతే ఆయనే తగులబెట్టించాడా? చంద్రబాబు పురమాయిస్తూనే ఉన్నాడు, ఆయన మంత్రులు చేయిస్తూనే ఉన్నారు, ఎవరినీ అరెస్టు కూడా చేయరు. చంద్రబాబు, మంత్రుల భూముల మీద ఇదే మాదిరిగా ఎవరైనా వచ్చి.. మీ భూముల్ని బలవంతంగా లాక్కుంటాం, ఇవ్వకపోతే తగులబెడతామంటే ఒప్పుకుంటారా? చంద్రబాబు, వాళ్ల మంత్రులు ఒప్పుకోనప్పుడు, ఒప్పుకోని రైతుల మీద, శేఖరన్న లాంటి వారి మీద ఇలా దాష్టీకం చేయడం ఎంతవరకూ ధర్మం? ఇలా చేయడం న్యాయమేనా. మనుషులం రాక్షసులం అవుతున్నాం. చంద్రబాబు మానవత్వం అన్న గీతను దాటి అధికార మత్తుతో రాక్షసుడైపోయాడు. ఇది ధర్మమేనా అని చంద్రబాబు తన మనస్సాక్షిని అడగాలి. అధికారం శాశ్వతం కాదు. కోర్టుకెళ్లి అడ్డుకుంటాం... పూలింగ్‌కు భూమి ఇవ్వలేదని పాస్‌పుస్తకాలను రద్దుచేశారు. ఇంతకన్నా హేయం మరొకటి ఉంటుందా?. ఈ మాదిరిగా దౌర్జన్యాలు చేయడం నిజంగా భావ్యం కాదు. ఎవరైతే ఇస్తానన్నారో వాళ్ల దగ్గర భూములు తీసుకోండి. ఎవరైతే ఇవ్వనంటారో వాళ్లని వదిలేయండి. అధికారం ఉంది కదా అని దౌర్జన్యంగా లాక్కునే కార్యక్రమం మాత్రం పూర్తిగా ఖండించదగ్గ విషయం. చంద్రబాబు ఇప్పటికైనా మనసు మార్చుకోవాలి. శేఖరన్నలాంటి రైతులందరికీ అండగా ఉంటాం. చంద్రబాబు బలవంతంగా లాక్కునే కార్యక్రమం చేస్తే కోర్టుకు వెళదాం. కేసు వేసి దీన్ని అడ్డుకునే కార్యక్రమం చేద్దాం. బలవంతంగా లాక్కునే ప్రక్రియను పూర్తిగా అడ్డుకుంటాం. అయినా కూడా చంద్రబాబు తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బలవంతం చేస్తే అది ఎల్లకాలం చెల్లదు. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లుంటుందో, మూడేళ్లుంటుందో... అంతకంటే ఎక్కువుండదు. తర్వాత మనం వస్తాం. రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూముల్ని అప్పుడు తిరిగి వెనక్కిస్తాం. బీదలపైనే ప్రతాపం... పేదవాళ్లకు అంతో ఇంతో ఎక్కువ ఇవ్వాల్సిందిపోయి తక్కువ ఇస్తున్నారు. పూలింగ్‌కి భూములిస్తే వేరేచోట 1200 గజాలు ఇస్తూ అసైన్డ్ భూములిచ్చిన పేదలకు మాత్రం 800 గజాలు ఇస్తున్నాడు చంద్రబాబు. అది కూడా ఇష్టం వచ్చినట్లు లాక్కోవాలని చూస్తున్నాడు. పేదలకు ఒకసారి భూములిచ్చిన తర్వాత తిరిగి లాక్కునే అధికారం చంద్రబాబుకు ఎక్కడుంది? సంతకాలు పెట్టకపోయినా రెవెన్యూ రికార్డులను మార్చేసుకుని వాళ్లంతట వాళ్లే భూములను లాక్కునే నీచమైన కార్యక్రమానికి సాక్షాత్తూ ప్రభుత్వం ఒడిగడుతోంది. ఇంతకన్నా అన్యాయం ఏదైనా ఉంటుందా? బీదవాడికి అన్యాయం చేసిన ఉసురు చంద్రబాబుకు తప్పక తగులుతుంది. రైతుల దగ్గర భూములు లాక్కుంటున్నారు. చంద్రబాబు బినామీలు మురళీమోహన్, సుజనాచౌదరి లాంటి వాళ్లు మాత్రం ఇక్కడ తక్కువకు వాటిని కొని గజం రూ.15 వేలకుపైగా అమ్ముకుంటున్నారు. వాళ్ల భూములు మాత్రం ఎవరూ తీసుకోరు. భూములివ్వడంలేదని పెన్షన్లు కూడా ఎత్తేస్తున్నారు. పనులు లేని వాళ్లకి రూ 2,500 పెన్షన్ ఇస్తామన్నారు. దాని సంగతి దేవుడెరుగు ఇచ్చే వెయ్యి రూపాయలుకూడా ఇవ్వడంలేదు. పనులు లేవని అడిగితే రోడ్లు ఊడవడానికి రావాలని బలవంతం చేస్తున్నారు. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా? ఈ భూములపై కోర్టుకు వెళదాం. మనం వచ్చాక అసైన్డ్ భూముల చట్టాన్ని మారుస్తాం. ఒకసారి భూములిచ్చిన తర్వాత వారి అంగీకారం లేకుండా బలవంతంగా తీసుకునే అవకాశం లేకండా మార్పులు చేస్తాం. అన్ని రకాలుగా పోరాటం చేద్దాం. చంద్రబాబుకు రాబోయేరోజుల్లో దేవుడు మొట్టికాయలు వేస్తాడు. ఆయన ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసే రోజు వస్తుంది. ఆరోజు దగ్గర్లోనే ఉంది. ఆ తర్వాత మన ప్రభుత్వం వస్తుంది’ అసైన్డ్ భూములు బాబు అత్తగారి సొత్తు కాదు మల్కాపురం నుంచి ఉద్దండరాయునిపాలెం దళితవాడకెళ్లిన జగన్మోహన్రెడ్డికి అక్కడి రైతులు తమ గోడు వినిపించారు. అందరి సమస్యలు అడిగి తెలుసుకున్న జగన్ ఆ తర్వాత మాట్లాడారు... ‘ఈ గ్రామంలో పేదవాళ్లు బతకడం కోసం అసైన్డ్ భూములను ఇచ్చారు. వాటిని చంద్రబాబు తన అత్తగారి సొత్తు అన్నట్లు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు, ఇష్టం వచ్చినట్లు తీసుకునే కార్యక్రమం చేస్తున్నాడు. మనకు సంబంధం లేకుండా, ఒప్పుకోకపోయినా, ఇష్టం వచ్చినట్లు బలవంతంగా తీసుకుంటున్నాడన్న విషయం అందరికీ తెలియాలి. అసైన్డ్ భూములంటే చంద్రబాబు అత్త సొత్తు కాదని, అవి పేదవాడి భూములని, వాటిని తీసుకునే హక్కు వాళ్ల నాయనక్కూడా లేదని అర్థమయ్యేట్లు చెప్పాలి. రైతులు ఒప్పుకోకపోయినా రికార్డుల్ని వారే రాసేసుకుని ఈ భూముల్ని తీసుకుంటున్నారు. 50, 60 సంవత్సరాల నుంచి ఈ భూములను రైతులు సాగుచేసుకుంటున్నారు. పన్నులు వాళ్లే కడుతున్నారు. రశీదులు వారివద్దే ఉన్నాయి. సంతకాలు పెట్టకపోయినా, వాళ్ల అంగీకారం లేకపోయినా భూములు తీసుకుంటున్నారు. బొంగులు వాళ్లు తగులబెట్టి... మా నాయకుడు జగన్మోహన్రెడ్డి చెబితే చేశానని చెప్పాలంటూ రైతులను చిత్రహింసలు పెట్టారు. అయినా వారు నిజాయితీగా జగన్మోహన్రెడ్డిని ఇంతవరకూ చూడనేలేదని చెప్పారు. ఆ పేదరికంలో నిజాయితీ ఉంది, ఆ నిజాయితీ మంత్రులకు, చంద్రబాబుకు లేదు. రైతులు ఒప్పుకోకపోయినా వారి భూములను తీసుకుని శంకుస్థాపన కోసం అందులోనే హెలీప్యాడ్లు కూడా కట్టారు. -
'చంద్రబాబు అత్తసొత్తు కాదు'
-
'మూడు రోజులు చిత్రహింసలు పెట్టారు'
ఉద్ధండరాయుడనిపాలెం: రాజధానికి భూములు ఇవ్వడం ఇష్టంలేదని ఉద్ధండరాయుడనిపాలెం గ్రామానికి చెందిన పలువురు స్పష్టం చేశారు. తమ వద్ద నుంచి బలవంతంగా ప్రభుత్వం లాక్కుంటోందని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. భూములు ఇవ్వకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారని సురేశ్ అనే వ్యక్తి తెలిపాడు. అతడు ఇంకా ఏమన్నాడంటే.... భూములు మాకు ఇవ్వడం ఇష్టం లేదు 50 ఏళ్లుగా ఈ అసైన్డ్ భూముల్లో ఉంటున్నాం ఎన్టీఆర్ శిస్తు రద్దు చేశారు. మిగతా పన్నులు అన్నీ కడుతున్నాం మాది మూడో తరం, మా తాతలు కూడా ఇక్కడే ఉన్నారు భూములు ఇస్తున్నామని మేము ఎటువంటి సంతకాలు పెట్టలేదు అయినా బలవంతంగా భూములు తీసుకుంటున్నారు పంటలు దగ్ధం చేశారని వైఎస్ఆర్ సీపీ పార్టీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారు నన్ను పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లి మూడు రోజులు చిత్రహింసలు పెట్టారు వైఎస్ జగన్ నిప్పుపెట్టమన్నాడని చెప్పమన్నారు అసైన్డ్ భూముల లీజులు ముగిసిందని మమల్ని భయపెట్టారు ఏ ఒక్కరికి భూములు ఇవ్వడం ఇష్టం లేదు శంకుస్థాపన కార్యక్రమానికి మమ్మల్ని ఎవరినీ ఆహ్వానించలేదు శ్మశానంలోని సమాధిని ధ్వంసం చేసి రోడ్డు వేశారు మాకు రుణమాఫీ చేయలేదు. వృద్ధాప్య ఫించన్లు కూడా ఎవరికీ ఇవ్వలేదు భూములు ఇవ్వలేదన్న అక్కసుతో మాపై ప్రభుత్వం కక్ష సాధిస్తోంది -
ఇదా మాకు దక్కే న్యాయం?
-
టీడీపీకి ఓటు వేసినందుకు...
-
టీడీపీకి ఓటు వేసినందుకు...
మల్కాపురం: 'ల్యాండ్ పూలింగ్ కు భూమి ఇవ్వనందుకు నా పంటను తగులబెట్టారు. గత ఎన్నికల్లో టీడీపీకే ఓటు వేశాం. తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినందుకు మాకు పట్టిన దుర్గతి ఇది' అని గద్దె చిన చంద్రశేఖర్ వాపోయారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం చెందిన చంద్రశేఖర్ తన గోడును ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందు వెళ్లబోసుకున్నారు. రాజధానికి తన పొలం ఇవ్వలేదన్న కక్షతో పంటకు నిప్పుపెట్టారని ఆయన ఆరోపించారు. భూములు ఇవ్వకపోవడం తాము చేసిన నేరమా అని ప్రశ్నించారు. చంద్రశేఖర్ కు చెందిన చెరుకు తోటను దుండగులు శుక్రవారం దగ్ధం చేశారు. కాగా, తాము భూములు ఇవ్వబోమని చెబుతున్నా ప్రభుత్వం బలవంతంగా లాక్కుంటోందని వైఎస్ జగన్ తో పలువురు రైతులు చెప్పారు. తమకు అండగా నిలవాలని జననేతను కోరారు. రైతులను నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వైఎస్ జగన్ అన్నారు. అన్నదాతల తరపున పోరాడతామని, అవసరమైతే కోర్టుకు వెళతామని చెప్పారు. దుండగులు దగ్ధం చేసిన చంద్రశేఖర్ చెరకు తోటను వైఎస్ జగన్ పరిశీలించారు. అనంతరం పలువురు రైతులతో ఆయన మాట్లాడారు. -
భూములివ్వని రైతుల్లో గుబులు
రాజధాని భూముల్లో పంట దగ్ధం ఘటనపై అనుమానాలు సాక్షి ప్రతినిధి, గుంటూరు: రాష్ట్ర రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతులు... ఏ రోజు కారోజు ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. భయం గుప్పిట్లో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. పది నెలల వ్యవధిలో జరిగిన పలు సంఘటనలను ఇందుకు ఉదాహరణగా పేర్కొంటున్నారు. తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామంలో శుక్రవారం జరిగిన చెరుకు తోట దగ్ధం టీడీపీ కార్యకర్తల దుందుడుకు చర్యగా రైతులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై అధికారులు, పాలకులు స్పందించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోందంటున్నారు. భూములు ఇవ్వని రైతులు సాగులో ఉన్న పంటను కాపాడుకునే యత్నంలో ఉంటే, మిగిలిన రైతులు సాగును చేపట్టాలా వద్దా అనే సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. భూములు ఇవ్వలేదన్న కక్షతోనే... తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన గద్దె చిన చంద్రశేఖర్ చెరుకు పంట దగ్ధం వెనుక అధికార పార్టీ కార్యకర్తల హస్తం ఉందనే విమర్శలు వినపడుతున్నాయి. మొదటి నుంచీ భూ సమీకరణను వ్యతిరేకిస్తున్న చంద్రశేఖర్‌పై అక్కడి టీడీపీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఇంకా ఆ పరిసర గ్రామాల్లో 1,000 ఎకరాలకుపైగానే భూములను రైతులు ఇవ్వాల్సి ఉంది. ఆ రైతులంతా చంద్రశేఖర్, మరి కొందరి సూచనల మేరకు భూ సమీకరణను వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించారు. వీరిని భయపెట్టి దారికి తీసుకువచ్చేందుకు ఈ ప్రయత్నం జరిగినట్టుగా అక్కడి రైతులు చెబుతున్నారు. ఈ విషయమై చంద్రశేఖర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ, భూ సమీకరణకు భూములు ఇవ్వలేదన్న కక్షతోనే తన చెరుకు పంటను దగ్ధం చేశారని, అధికారులు ఈ కేసు విచారణపై ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. డీఎస్పీ శనివారం పొలాన్ని పరిశీలించారని, ఎవరో సిగరెట్ వేయడం వలన ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పోలీస్ యంత్రాంగం సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ తరహా సంఘటనలు పునరావృతం అవుతున్నాయని చెప్పారు. గతంలోనూ అనేకసార్లు... గత డిసెంబర్లో రాజధాని నిర్మాణానికి భూములను భూ సమీకరణ విధానంలో తీసుకుంటామని అధికారులు ప్రకటించారు. దీన్ని కొన్ని గ్రామాల రైతులు వ్యతిరేకించి ఆందోళనలు చేశారు. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 28న రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లో గుర్తు తెలియని దుండగులు పలు దుశ్చర్యలకు పాల్పడ్డారు. తాడేపల్లి, తుళ్లూరు మండలాల్లోని ఐదు గ్రామాల్లో 13 చోట్ల షెడ్లు, వెదురుబొంగులు, డ్రిప్ పరికరాలను తగులబెట్టారు. ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, మందడం, లింగాయపాలెం గ్రామాల్లోని పంట పొలాలపై తెగబడ్డారు. రాయపూడి గ్రామస్థులు గోరగంటి శ్రీనివాసరావుకు చెందిన 1,500 వెదురు బొంగులు, షేక్ చినమీరాసాహెబ్కు చెందినవి 2,500, లింగాయిపాలెం గ్రామస్థుడు గుంటుపల్లి సాంబశివరావుకు చెందిన 310, మందడం గ్రామస్థులు ముప్పాళ్ల వెంకటేశ్వరరావుకు చెందిన 1,300, యర్రమనేని శ్రీనివాసరావుకు చెందిన 2,500 వెదురు బొంగులు, యంపరాల అప్పారావుకు చెందిన 500 మీటర్ల డ్రిప్వైరును దుండగులు తగులబెట్టారు. వెంకటపాలెం గ్రామస్థుడు లంకా రఘునాథరావుకు చెందిన అరటి బొత్తలకు నిప్పు పెట్టారు. తాడేపల్లి మండలం పెనుమాక సర్పంచి కల్లం పానకాలరెడ్డికి చెందిన 2,500 బొంగులు, బోనం శంకరరెడ్డికి చెందిన డ్రిప్వైరు, పశువులపాకలను తగులబెట్టారు. నెమలికంటి నాగేశ్వరరావుకు చెందిన 500 బొంగులు కాలిపోయాయి. ఉండవల్లి గ్రామస్థులు కుర్రపోలు మల్లికార్జునరెడ్డికి చెందిన 600 బొంగులు, పల్లప్రోలు సాంబిరెడ్డికి చెందిన 2వేల బొంగులు, 20 బస్తాల ఎరువులు కాలి బూడిదగా మారాయి. వీటి విలువ సుమారు రూ.20 లక్షలకు పైగానే ఉంటుందని అంచనా వేశారు. అప్పట్లో పోలీసులు హడావిడి చేసి కేసు నమోదు చేశారు. కానీ ఇప్పటికీ ఆయా కేసుల్లో పురోగతి కనిపించలేదు. భూములు ఇవ్వని వారిపై అన్ని రకాల ఒత్తిళ్లు: బోయపాటి సుధారాణి కృష్ణాయపాలెం గ్రామానికి చెందిన బోయపాటి సుధారాణి భూ సమీకరణను వ్యతిరేకిస్తూ అప్పట్లో మీడియా ముందు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తీవ్రంగా ఎండగట్టారు. అప్పటి నుంచి ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. పలువురు నేతలు ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చి, తనకున్న 70 సెంట్ల భూమిని రాజధాని నిర్మాణానికి ఇస్తున్నట్టు ప్రకటన చేయించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్.శ్రీధర్, ఇతర రెవెన్యూ అధికారులు ఆమెతో గుంటూరులో చర్చలు జరిపి ఆ భూమిని రాజధాని నిర్మాణానికి స్వచ్ఛందంగా ఇస్తున్నట్లు ప్రకటన చేయించారు. తాజాగా తుళ్లూరులో జరిగిన సంఘటనను ఆమె వద్ద ప్రస్తావిస్తే, ‘ఈ ప్రభుత్వానికి ఇటువంటివి అలవాటే. భూములు ఇవ్వని వారిపై అన్ని రకాలుగా బంధువులు, స్నేహితులు, అధికారుల ద్వారా ఒత్తిడి తీసుకువస్తారు. బెదిరిస్తారు. మానవ హక్కులకు భంగం కలిగిస్తారు. తీరా భూములు ఇచ్చిన తర్వాత ప్రకటించిన ప్యాకేజీలు, ఇతర సౌకర్యాలు కల్పించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తారు’ అని చెప్పారు. -
మంత్రి వ్యాఖ్యలపై దుమారం
మంగళగిరి: సీఆర్డీఏ పరిధిలోని డిప్యూటీ కలెక్టర్లను ఉద్దేశించి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు చేసిన వ్యాఖ్యలు సీఆర్డీఏ అధికారుల్లో దుమారం లేపుతున్నాయి. ఈనెల 26న గుంటూరు జిల్లా తుళ్లూరు సీఆర్డీఏ కార్యాలయంలో మంత్రి రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు గ్రామకంఠాలపై నిలదీయడంతో మంత్రి.. ప్రభుత్వానికి తెలియకుండా డిప్యూటీ కలెక్టర్లే గ్రామకంఠాల జాబితాలను ప్రకటించారని, మా రైతులు మంచివారు కాబట్టి ఊరుకున్నారని, లేకుంటే డిప్యూటీ కలెక్టర్లను చెట్టుకు కట్టివేసి కొట్టేవారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో మనస్తాపం చెందిన ఒక డిప్యూటీ కలెక్టర్ కన్నీరు పెట్టుకుని సమావేశం నుంచి వెళ్లిపోయనట్టు సమాచారం. మంత్రి వ్యాఖ్యలపై సీఆర్డీఏ అధికారులు తమ సంఘ సమావేశంలో.. మంత్రులు చెప్పినట్లు తాము సహకరిస్తున్నా రైతుల మెప్పుకోసం తమను కించపరచడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు మూకుమ్మడి సెలవు పెట్టి నిరసన తెలపాలని నిర్ణయించినట్లు ఒక అధికారి తెలిపారు. -
మాస్టర్ ప్లాన్‌లో మార్పులు!
చంద్రబాబు కనుసన్నల్లో సాగుతున్న డిజైన్ సింగపూర్‌కు నేడు మంత్రి నారాయణ హైదరాబాద్: ఏపీ రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. సీఎం చంద్రబాబు చేసిన సూచనల మేరకు మార్పులు చేర్పులను పరిశీలించడానికి మంత్రి నారాయణ శుక్రవారం సింగపూర్ బయలుదేరుతున్నారు. మంత్రి పర్యటనను ప్రభుత్వం గురువారం వెల్లడించింది. సీఆర్డీఏ ప్రణాళికాధికారి జి.నాగేశ్వరరావు, సీఆర్డీఏ సంచాలకులు వి.రాముడు, మంత్రి వ్యక్తిగత కార్యదర్శి పి.గోపీనాథ్‌లు కూడా నారాయణ వెంట వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ క్రమంలో ముగ్గురు అధికారులనూ విధుల నుంచి తక్షణమే రిలీవ్ చేయాలని సీఆర్డీఏ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కాగా, రాజధాని మాస్టర్ ప్లాన్ మొత్తం సీఎం కనుసన్నల్లోనే సాగుతోందని, మార్పు చేర్పులు పరిశీలించడానికి మంత్రి నారాయణ త్వరలోనే సింగపూర్ వెళ్లనున్నారని ‘సాక్షి’ ఇటీవలే చెప్పిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. సీడ్ కేపిటల్ పరిధి పెంచే యోచన రాజధానిలోని 8 చదరపు కిలో మీటర్ల సీడ్ కేపిటల్(ప్రధాన రాజధాని ప్రాంతం) పరిధిని 14 చదరపు కిలోమీటర్లకు పెంచడానికి మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేస్తున్నట్టు తెలిసింది. ఆ మార్పులు చేయించడానికే మంత్రి సింగపూర్ వెళుతున్నట్టు సమాచారం. 13న సింగపూర్‌కు సీఎస్ బృందం :ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) కృష్ణారావు నేతృత్వంలోని అధికారుల బృందం కూడా సింగపూర్ పర్యటనకు వెళ్లనుంది. సీఎస్‌తోపాటు ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీవీ రమేష్, ప్రణాళిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సంజయ్గుప్తాలు ఈ నెల 13 నుంచి 15 వరకు సింగపూర్‌లోని ఆర్థికాభివృద్ధి బోర్డు(ఈడీబీ)తోపాటు ముఖ్యమైన ఆర్థిక సంస్థల పనితీరును పరిశీలిస్తారు. అమెరికాకు అజయ్‌జైన్ ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్ ఈ నెల 11 నుంచి 13 వరకు అమెరికాలో పర్యటించనున్నారు. వాషింగ్టన్ డీసీలో జరగనున్న ఎనర్జీ ఎఫిషియన్సీ గ్లోబల్ ఫోరం సదస్సులో పాల్గొంటారు. ఇక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ విభాగం కార్యదర్శి బి.శ్రీధర్ ఈ నెల 13 నుంచి 15 వరకు జపాన్‌లో పర్యటించనున్నారు. -
'మరో 500 ఎకరాల భూమి అవసరం'
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని కోసం ఇప్పటివరకు భూ సమీకరణ ద్వారా 33 వేల ఎకరాల భూమి సేకరించామని ఆ రాష్ట్ర మునిసిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ వెల్లడించారు. గుంటూరు జిల్లా తుళ్లురు మండలం మందడం గ్రామంలో భూమిని చదును చేసే కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రాజధాని కోసం మరో 500 ఎకరాల భూమి అవసరం అవుతుందన్నారు. ఆ భూమి కూడా భూ సేకరణ ద్వారానే తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రాజధాని రైతుల రుణమాఫీ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి పి.నారాయణ ప్రకటించారు. -
తూళ్లూరులో ఉగాది వేడుకలు!
-
రాజధానిలో అద్దెలు ఎక్కువై.. అడవుల్లో పాగ!
-
'అర్థం పర్థం లేని ప్రకటనలు మానండి'
-
ప్రపంచస్థాయి ప్రజా రాజధాని నిర్మిస్తా
-
ప్రపంచస్థాయి ప్రజా రాజధాని నిర్మిస్తా
* తుళ్లూరులో నూతన సంవత్సర వేడుకల్లో సీఎం * స్వార్థమే ఉంటే.. తిరుపతిలో రాజధాని * కావాలనే విపక్షం చిచ్చు పెడుతోంది * టీడీపీ ఓడితే ఇడుపులపాయలో రాజధాని పెట్టేవారు * కడప రౌడీయిజం చేస్తే ఖబడ్దార్ * వైకుంఠ ఏకాదశి రోజున రైతులతో గడపడం అదృష్టం * నమ్మి భూములిచ్చినవారిని అభివృద్ధి చేస్తా సాక్షి, గుంటూరు: సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రపంచంలో మేటి రాజధానులను తలదన్నే లా తుళ్లూరులో ప్రజా రాజధాని నిర్మిస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు. ఎవరెన్ని అవరోధాలు కల్పించినా, మొక్కవోని సంకల్పంతో ముందుకు సాగుతానని ధీమా వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణంలో తనకెలాంటి స్వార్థమూ లేదని, అదే ఉంటే తిరుపతిలో రాజధాని కట్టుకునేవాడినన్నారు. నిస్వార్థంగా అన్ని ప్రాంతాలకు అనుకూలంగా ఉండేలా రాజధాని నిర్మాణానికి పూనుకుంటే ప్రతిపక్షం పచ్చని పల్లెల్లో చిచ్చు పెడుతోందని ఆరోపించారు. ఒకవేళ టీడీపీ ఓడిపోయి ఉంటే రాజధానిని ఇడుపులపాయకు తరలించుకు పోయేవారన్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరులో గురువారం అధికారికంగా నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో సీఎం పాల్గొన్నారు. మేరీ మాత స్కూల్ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో కేక్ కట్‌చేసి లాంఛనంగా సంబరాలకు శ్రీకారం చుట్టారు. కడప మార్కు రౌడీయిజం చేయాలని చూస్తే ఖబడ్దార్, భయపడేవారెవరూ లేరంటూ హెచ్చరించారు. 2014 మర్చిపోలేని ఎన్నో చేదు అనుభవాలను మనకు మిగిల్చి వెళ్ళిందని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని ఐక్యంగా ఉంచేందుకు మనమెన్ని పోరాటాలు చేసినా కాంగ్రెస్ ఓట్లు-సీట్లు రాజకీయాలతో హేతుబద్ధత లేకుండా అడ్డగోలుగా విభజించిందని ఆరోపించారు. తాను అధికారంలోకి వచ్చి చూసుకుంటే 15 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందన్నారు. ఏం చేయాలో అర్థం కాకపోయినా ధైర్యంగా ప్రజల ముందుకొచ్చినట్లు చెప్పారు. ప్రజల అండతో అదే ఆత్మ విశ్వాసాన్ని 2015లో కొనసాగిస్తానని తెలిపారు. ఇంకా ఆయనేం చెప్పారంటే... టీడీపీ ఓడిపోతే ఇడుపులపాయలో రాజధాని కొంతమందికి ఇక్కడ రాజధాని రావడం ఇష్టం లేదు. అందుకే రాజధానికి ఇంత భూమి ఎందుకంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలాంటి వారి పార్టీ కార్యాలయాలకు మాత్రం వేల ఎకరాలు కావాలా? అడవిలో నిర్మిస్తే పోతుంది కదా... అంటూ ఉచిత సలహా ఇచ్చేవారి ఇల్లు మాత్రం విమానాశ్రయానికి దగ్గర్లో ఉండాలా? కొంతమంది బెదిరించి భూముల విలువ పోగొట్టేలా చేస్తున్నారు. కడప రాజకీయాలు ఇక్కడ సాగవు. ఖబడ్దార్ జాగ్రత్తగా ఉండండి. * ఓ వైపు నూతన సంవత్సరం మరోవైపు వైకుంఠ ఏకాదశి కలసి వచ్చిన ఈ పవిత్ర దినాన అందరూ కలియుగ వేంకటేశ్వరుడిని దర్శించుకుంటుంటే... నేను మాత్రం త్యాగమూర్తులైన తుళ్ళూరు వాసులను దర్శించుకోవడం నా జీవితంలో మర్చిపోలేని రోజు. రైతు ధనేకుల రామారావు 50 ఎకరాల పొలం ఇవ్వడంతోపాటు స్వచ్ఛందంగా నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి 50వేలు ఇచ్చారు. ఆయన కుమారుడు ఇక్కడ రాజధాని వార్తతో షిరిడీలో సాయినాధునికి బంగారు కిరీటం సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. * రాజధాని ప్రాంతంలో రైతులకు రూ.250 కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నాం. మీరు నమ్మి నాకు భూమిచ్చారు. మిమ్మల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత నాదే. ఏ జోన్లో భూమి పోతే అక్కడే లాటరీ వేసిస్తాం. ఒక రైతుకు నాలుగైదు చోట్ల భూమి ఉంటే కలిపి ఒకే చోట ఇస్తాం. ఐదారుమంది రైతులు కలసి పూలింగ్‌కు భూమిచ్చి ఒకేచోట కావాలంటే ఇస్తాం. భూ సమీకరణలో భాగస్వాములయ్యేవారికి స్టాంపులు, నాలా, మౌలిక వసతుల ఫీజులు వన్‌టైమ్ సెటిల్మెంట్ చేస్తాం. రాజధాని ప్రాంతంలో 12వేల మందికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తాం. * దేవాలయాలు, ట్రస్టు భూములకు అన్యాయం జరగకుండా మామూలు రైతులకిచ్చినట్లే డబ్బులిస్తాం. గ్రామ కంఠాలకు పట్టాలిస్తాం. రోడ్ల వెంబడి ఇళ్ళుపోతే ఉచితంగా ఇళ్ళు కట్టిస్తాం. 2014 డిసెంబర్ 8 లోపల ఉన్న వారినే రాజధానివాసులుగా గుర్తిస్తాం. రాజధాని ప్రాంత వాసులకు విద్య, వైద్యం చదువు ఉచితంగా కల్పిస్తాం. ఎన్టీఆర్ క్యాంటిన్లు, వృద్ధాశ్రమాల ద్వారా ఆదుకుంటాం. కూలీలు, కౌలు రైతులకు నైపుణ్యాల శిక్షణ ఇస్తాం. పేదలకు రూ. 25 లక్షల వరకు వడ్డీలేని రుణ సౌకర్యం కల్పిస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వమే తీసుకుంటుంది. * భూ యజమానుల జాబితా బహిరంగంగా ప్రకటిస్తాం. సామాజిక అవసరాల కోసం భూమి కేటాయిస్తాం. గ్రామాల్లో డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులతో హెల్ప్ డెస్క్‌లు పెడుతున్నాం. ప్రస్తుతం మాన్యువల్ పాస్ పుస్తకాలు ఇచ్చి, తర్వాత వాటిని కంప్యూటరీకరణ చేస్తాం. ఇక్కడివారు ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు, అధికారులు వారి వద్దకే వస్తారు. ఈ పంట నూర్పిళ్ళు జరిగిన వెంటనే సర్వేకు అనుగుణంగా పంటలు వేయవద్దు. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాల్సి ఉంటుంది. జూన్, జూలై లోపు డెరైక్టరేట్లు, కమిషనరేట్లు ఈ ప్రాంతంలో వస్తాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్లు బ్యాన్ చేసే ప్రసక్తే లేదు. ఎవరైనా చవగ్గా భూములు అమ్ముకుంటే నష్టపోతారు. అధికారులకు ప్రశంసల వెల్లువ సీఆర్డీఎ కమిషనర్ శ్రీకాంత్ డైనమిక్ అధికారి. జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, జాయింట్ కలెక్టర్ డాక్టర్ చెరుకూరు శ్రీధర్, ఆర్డీవో భాస్కర్‌నాయుడు, తుళ్ళూరు తహశీల్దార్ సుధీర్ చాలా చక్కగా పని చేస్తున్నారు. వీరిని ఏరికోరి వేశాం. వీరితో పాటు మంత్రులు పుల్లారావు, నారాయణ, రావెల కిషోర్‌బాబు, దేవినేని ఉమాతో పాటు స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, ఇతర ఎమ్మెల్యేలు, ఎంపీ గల్లా జయదేవ్ కృషికి అభినందనలు. శ్రీకాంత్, మంత్రి నారాయణ, ఎంపీ గల్లా జయదేవ్ రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారు. సంక్రాంతిలోపు భూ అంగీకార పత్రాలు ఇస్తే మూడేళ్ళలో సింగపూర్ తరహా రాజధాని నిర్మించి చూపిస్తాను. భవానీ ఐలాండ్‌ను బ్రహ్మాండమైన పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతాను. పూలింగ్‌కు స్వచ్ఛందంగా అంగీకార పత్రాలిచ్చిన రైతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు తుళ్ళూరుకు చెందిన రైతు ధనేకుల రామారావు 50 ఎకరాలు, పోతూరు శ్రీనివాసరావు 50, జమ్మాల మురళి 5, దామినేని శ్రీనివాసరావు 34, గణేష్‌ప్రసాద్ 21 ఎకరాలకు సంబంధించిన పాస్ పుస్తకాలను స్వచ్ఛందంగా అందజేశారు. రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావడం శుభపరిణామమని సీఎం ప్రశంసించారు. కార్యక్రమంలో మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా, రావెల కిషోర్‌బాబు, శాసన మండలి చీఫ్ విప్ నన్నపనేని రాజకుమారి, స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌తోపాటు జిల్లాలోని టీడీపీ శాసనసభ్యులు ప్రసంగించారు. తొలుత జిల్లా పరిషత్ హైస్కూల్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ నుంచి ఓపెన్‌టాప్ జీపులో బయల్దేరిన చంద్రబాబును తుళ్ళూరు ప్రజలు మేళతాళాలతో ఘనంగా ఊరేగిస్తూ గ్రామంలోకి స్వాగతం పలికారు. -
తూళ్లూరు న్యూయిర్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు!
-
రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు
-
నీతి + నిజాయితీ + క్రమశిక్షణ = సింగపూర్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి తుళ్లూరు ప్రాంతం సరైందని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రంలోని కేంద్రభాగంలోనే రాజధాని ఉండాలని తాము నిర్ణయించామని తెలిపారు. అందుకు తుళ్లూరు ప్రాంతాన్ని ఎంపిక చేశామని చెప్పారు. గురువారం తుళ్లూరులో ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. రాజధాని ప్రాంతంలోని రైతులకు పూర్తి న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీడీపీని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ కుట్ర పన్నిందని... కానీ ఆ పార్టీయే కుదేలైందని చెప్పారు. మనతో సంప్రదించకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ మనల్ని అవమానించిందని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ ఫలితాన్ని ఆ పార్టీ అనుభవిస్తుందన్నారు. నీతి, నిజాయితీ, క్రమశిక్షణకు మారు పేరు సింగపూర్ అని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణం కోసం సహకరించిన వారికి జీవిత కాలం రుణపడి ఉంటానని చంద్రబాబు తెలిపారు. రాజధాని ప్రాంతంలో అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. -
తూళ్లూరులో అన్నీ సింగపూర్ రేట్లే!
-
రాజధాని గ్రామాల్లో మనీ.. మనీ
* భూములు అమ్మిన రైతుల ఇళ్లకే బ్యాంకులు.. డిపాజిట్ల కోసం పోటాపోటీ * అధిక వడ్డీలు, పథకాల పేరిట ఆఫర్లు * వారంలోగా 3 గ్రామాల్లో ఆంధ్రాబ్యాంకు కొత్త శాఖలు * నేడో రేపో తాడికొండలో ఎస్బీఐ శాఖ ప్రారంభం * రూ. 20 కోట్ల కొత్త డిపాజిట్లు సేకరించిన బ్యాంకులు సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని జోన్లో జోరందుకున్న భూ విక్రయాల నేపథ్యంలో సొమ్ములున్న రైతులను ఆకట్టుకునేందుకు బ్యాంకులు పోటీ పడుతున్నాయి. డిపాజిట్ల వేట ప్రారంభించి నూతన శాఖల ఏర్పాటుకు సమాయత్తమయ్యాయి. ఈ నెలాఖరులోగా తుళ్లూరు మండలంలో వివిధ బ్యాంకులు కొత్తగా 6 శాఖలను ప్రారంభిస్తున్నాయి. భూ క్రయవిక్రయాలు బాగా జరుగుతున్న గ్రామాలను ఎంపిక చేసుకుని డిపాజిట్లపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. గత పది రోజుల్లో ఇక్కడ పలు బ్యాంకులు రూ.20 కోట్లకు పైగా డిపాజిట్లను చేయించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. రైతుల వద్దకు బ్యాంకు అధికారులు రాజధాని ప్రతిపాదిత తుళ్లూరు, మంగళగిరి మండలాల్లో ఇప్పటి వరకూ 1,600 ఎకరాలకు పైగా అమ్ముడుపోయాయని ‘రియల్’ వ్యాపార వర్గాల అంచనా. ఇవన్నీ రిజిస్ట్రేషన్ పూర్తయినవి మాత్రమే. ఇవి కాకుండా మరో 1,000 ఎకరాలకు పైగా క్రయవిక్రయాల ఒప్పందాల్లో ఉన్నాయి. ఎకరా ధర రూ. కోటి నుంచి రూ. 1.50 కోట్ల వరకూ పలికింది. ఈ లెక్కన సుమారు రూ. 2 వేల కోట్ల విలువైన భూముల వ్యాపారం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. భూములు అమ్మిన రైతులు తమ దగ్గర కోట్ల రూపాయల నగదును ఉంచుకునేందుకు భయపడుతున్నారు. కొందరు రైతులు కొత్త ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసే పనిలో ఉండగా మరికొందరు విజయవాడ, గుంటూరు, మంగళగిరి లాంటి చోట్ల డబుల్ బెడ్రూం ఫ్లాట్లు కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతుల వద్ద డబ్బును డిపాజిట్లుగా మలుచుకునేందుకు బ్యాంకులు రంగ ప్రవేశం చేశాయి. జిల్లా లీడ్‌బ్యాంక్ ఆంధ్రాబ్యాంకు, భారతీయ స్టేట్‌బ్యాంకు, ఎస్బీహెచ్, చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంకుల జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక బిజినెస్ బృందాలను గ్రామాలకు పంపుతున్నాయి. ఏబీ అమెరాల్డ్ డిపాజిట్ పథకం గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్న ఆంధ్రాబ్యాంకు జీవన్ అభయ, డబుల్, ట్రిపుల్ ప్లస్ బీమా పథకాలను వివరిస్తూ డిపాజిట్లను సేకరిస్తోంది. చీఫ్ మేనేజర్ మదన్మోహన్, సీనియర్ మేనేజర్ శ్రీనివాస్‌లు బిజినెస్ బృందాలను సమన్వయపర్చుకుంటున్నారు. భారతీయ స్టేట్‌బ్యాంక్ గుంటూరు ఆర్ఎం శ్రీనివాస్‌ప్రసాద్, హైదరాబాద్ నుంచి వచ్చిన బిజినెస్ మేనేజర్ ఆదిరాజు రెండ్రోజుల పాటు తుళ్లూరు, మందడం గ్రామాల్లో పర్యటించి రైతులతో సమావేశమయ్యారు. చైతన్యగోదావరి గ్రామీణ బ్యాంకు చైర్మన్ బ్రహ్మానందరెడ్డి ఆదేశాలపై బ్యాంకు ఉద్యోగులు మూడు బృందాలుగా విడిపోయి గ్రామాల్లో డిపాజిట్లు సేకరిస్తున్నారు. 6 కొత్త శాఖలు ప్రారంభం.. ఎస్బీఐ, ఆంధ్రా, చైతన్యగోదావరి బ్యాంకులు రాజధాని జోన్లో ఎంపిక చేసుకున్న గ్రామాల్లో అతి త్వరలో 6 కొత్త శాఖలను ప్రారంభించనున్నాయి. తాడికొండలో భారతీయ స్టేట్‌బ్యాంకు 29వతేదీ లేదా 30న కొత్త బ్రాంచిని ప్రారంభించనుందని ఏజీఎం శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. ఆంధ్రాబ్యాంకు అధికారులు తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి గ్రామాల్లో కొత్త శాఖలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు ఆర్బీఐ నుంచి అనుమతి లభించినట్లు గుంటూరు సీనియర్ మేనేజర్ శ్రీనివాసరావు తెలిపారు. రైతులకు దగ్గరగా ఉండే చైతన్యగోదావరి బ్యాంకు తుళ్లూరు, అనంతవరం, వెలగపూడి, రాయపూడి, దొండపాడు గ్రామాల్లో శాఖలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఏఎన్‌యూలో ఎస్ఎల్బీసీ... నాగార్జున యూనివర్సిటీ ఆవరణలో నూతనంగా నిర్మించే ఆంధ్రా బ్యాంకు భవనంలో స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. ఆంధ్రాబ్యాంకు జనరల్ మేనేజర్ కార్యాలయం ఇక్కడికే రానుంది. యూనివర్సిటీ అధికారులు బ్యాంకు భవన నిర్మాణం కోసం 1,000 గజాల స్థలాన్ని కేటాయించగా రూ. 5 కోట్ల అంచనా వ్యయంతో నాలుగు అంతస్తుల్లో భవనాన్ని నిర్మించేందుకు ప్రతిపాదనలు వెళ్లాయి. జనవరిలో టెండర్లు ఖరారై పనులు మొదలయ్యే అవకాశాలున్నాయని అధికారవర్గాలు చెబుతున్నాయి. -
''రాజధాని ప్రాంత రైతులకు అండగా ఉంటాం''
-
రాజధాని జోన్‌పై ‘ఐ’టీ
* రూ. కోట్లలో భూముల లావాదేవీల వివరాల సేకరణ * పూర్తి వివరాలు లభ్యమయ్యాక ఆదాయ పన్ను వసూళ్లు చేసే యోచన * రంగంలోకి రెవెన్యూ, పోలీస్, విజిలెన్స్ సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర రాజధాని జోన్ వ్యవహారం మొత్తం భూమి చుట్టూ తిరుగుతోంది. సమీకరణ పేరుతో ప్రభుత్వం తమ భూములు లాగేసుకుని మళ్లీ ఇస్తుందో, ఇవ్వదో అనే ఆందోళనతో చాలా మంది రైతులు తమ పొలాలను బేరానికి పెడుతున్నారు. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలతో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వివిధ ప్రాంతాల కుబేరులు, రియల్ వ్యాపారులు రాజధాని జోన్లో భూమి కోసం ఎగబడుతున్నారు. ఈ భూ లావాదేవీల్లో రూ.కోట్లు చేతులు మారుతున్నాయి. తుళ్లూరుపై రెవెన్యూ, పోలీస్, విజిలెన్స్ శాఖలు ఇప్పటికే దృష్టి సారించాయి. రెండు రోజుల నుంచి ఆదాయ పన్ను శాఖ కూడా రాజధాని జోన్లో వ్యాపార లావాదేవీల మీద కన్నేసింది. తుళ్లూరు తదితర ప్రాంతాల్లో భూముల క్రయవిక్రయాలతో కోట్లాది రూపాయలు చేతులు మారడంతో ఆదాయ పన్ను వసూళ్లకు ఐటీ శాఖ సిద్ధమవుతోంది. గ్రామాల వారీగా భూ క్రయవిక్రయాలపై రిజిస్ట్రార్ కార్యాలయం, రెవెన్యూ శాఖల నుంచి సమాచారం సేకరించే పనిలో ఐటీ అధికారులు నిమగ్నమయ్యారు. భూ లావాదేవీలకు సంబంధించిన పూర్తి సమాచారం అందాక పన్ను వసూలు కోసం రంగంలోకి దిగే ఆలోచన చేస్తున్నారు. ‘సమీకరణ’ భూములపై విజిలెన్స్ ఆరా... రాజధాని జోన్లో భూముల లావాదేవీలు, లొసుగులపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ నెల 21న గుంటూరు వచ్చిన విజిలెన్స్ డీజీపీ టి.పి.దాసు భూ లావాదేవీలపై దృష్టి సారించాలని గుంటూరు, కృష్ణా జిల్లాల విజిలెన్స్ ఎస్పీలను ఆదేశించారు. రెండు రోజులుగా రంగంలోకి దిగిన విజిలెన్స్ బృందాలు రాజధాని జోన్ పరిధిలోని 29 గ్రామాల్లో భూముల మారకంపైనా.. ల్యాండ్ పూలింగ్‌కు అనుకూల, వ్యతిరేక సమీకరణలపైనా వివరాలు సేక రిస్తోంది. భూముల క్రయవిక్రయాలపై కూడా ఆరా తీస్తున్నారు. దీంతో ప్రభుత్వ కార్యక్రమాలకు వ్యతిరేక, అనుకూల పరిస్థితులను ఆరా తీసి ఉన్నతాధికారులను నివేదించడం కోసమే తుళ్లూరు మీద కన్ను వేశామని విజిలెన్స్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. భూ లావాదేవీల్లో అక్రమాలకు చోటు లేకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు ఇప్పటికే రెవెన్యూ శాఖ బృందాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. -
భూములు కొంటే తప్పేంటి?
* నేను బిల్డర్‌ని, రియల్ ఎస్టేట్ వ్యాపారిని * రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ తుళ్లూరు: ‘నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని, బిల్డర్‌ను.. భూములు కొంటే తప్పేంటి..’ అని రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మందడంలోని గ్రామపెద్ద పెద్దారావు ఇంటివద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నూతన రాజధాని పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజారాజాధానిగా రూపొందాలని తుళ్లూరు మండలాన్ని ముఖ్యమంత్రి ఎంపిక చేశారని చెప్పారు. ఇక్కడి యువకులకు విద్య, ఉపాధి అవకాశాలు లభిస్తాయని, దేశవిదేశాలకు చెందిన ఎంతోమంది ఇక్కడకు వస్తారని, విజన్ ఉన్న ముఖ్యమంత్రి కాబట్టే ఇలా భవిష్యత్ తరాలు చెప్పుకొనే రీతిలో రాజధాని నిర్మిస్తారని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో భూములు కొన్నారా అని అడగ్గా ఒక్క సెంటు భూమి కూడా కొనలేదని, కొన్నట్లు నిరూపిస్తే పేదలకు రాసి ఇచ్చేస్తానని చెప్పారు. స్వతహాగా తాను రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు బిల్డర్‌నని ఒకవేళ కొంటే మాత్రం తప్పేమిటని ప్రశ్నించారు. ఆయన వెంట ఎంకేఆర్ ఫౌండేషన్ అధ్యక్షుడు ముప్పవరపు కృష్ణారావు, స్నేహహస్తాలు ఫౌండేషన్ గౌరవాధ్యక్షుడు అనుమోలు సత్యనారాయణ తదితరులున్నారు.