డబ్బు కోసం బాలుడి కిడ్నాప్.. ఆపై హత్య
Published Mon, Apr 18 2016 3:36 PM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM
నర్సరావుపేట రూరల్ (గుంటూరు జిల్లా) : ఫిరంగిపురం మండలం తుళ్లూరులో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదేళ్ల బాలుడిని దుండగులు హత్య చేసి బావిలో పడేశారు. గ్రామం శివారులోని బావిలో బాలుడి మృతదేహాన్ని చూసిన స్థానికులు సోమవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. నోట్లో గుడ్డలు కుక్కి బాలుడ్ని హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు.
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం నర్సరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. బాలుడు గుంటూరు అరండల్‌పేట్‌లో ఈ నెల 14న అదృశ్యమైన ఆదిత్యరాజ్(8)గా పోలీసులు గుర్తించారు. బాలుడిని అపహరించిన దుండగులు తల్లిదండ్రులకు ఫోన్ చేసి రూ.15 లక్షలు డిమాండ్ చేయగా రూ.12 లక్షల వరకు ముట్టజెప్పినట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement