రాజధాని భూ కుంభకోణం: ఇద్దరికి రిమాండ్‌ | Thullur Retired Tahsildar Arrested In Amaravati Land Scam Case | Sakshi
Sakshi News home page

రాజధాని భూ కుంభకోణం: కీలక అరెస్టులు

Published Wed, Jul 15 2020 4:33 PM | Last Updated on Wed, Jul 15 2020 5:58 PM

Thullur Retired Tahsildar Arrested In Amaravati Land Scam Case - Sakshi

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న రాజధాని భూ కుంభకోణంలో ఇద్దరు కీలక వ్యక్తులను సీఐడీ బుధవారం అరెస్టు చేసింది. అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసిన గుమ్మడి సురేశ్‌ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. విజయవాడకు చెందిన సురేశ్‌.. దళితులు సాగుచేసుకుంటున్న అసైన్డ్‌ భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన నేపథ్యంలో అతడిని అరెస్టు చేశారు. అదే విధంగా భూ రికార్డుల తారుమారు వ్యవహారంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న తుళ్లూరు రిటైర్డ్‌ తహసిల్దార్‌ సుధీర్ ‌బాబును కూడా అరెస్టు చేశారు. ఈ క్రమంలో వీరిద్దరిని మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈ నెల 29 వరకు న్యాయస్థానం రిమాండ్‌ విధించింది. దీంతో సురేశ్‌, సుధీర్‌ బాబును గుంటూరులోని జైలుకు తరలించారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితంగా మెలిగిన సుధీర్‌ బాబు.. టీడీపీ నాయకులతో కలిసి రికార్డులు తారుమారు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా అమరావతి ల్యాండ్‌ పూలింగ్‌లో అక్రమాలు, తప్పుడు రికార్డులు సృష్టించిన నేపథ్యంలో సీఆర్‌డీఏ నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్‌ కనికెళ్ల మాధురిని పోలీసులు ఇదివరకే అరెస్టు చేసిన విషయం తెలిసిందే.(డిప్యూటీ కలెక్టర్‌ మాధురి అరెస్ట్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement