Assigned lands
-
పూర్తిగా అమ్మేసి కాష్ చేసుకుంటున్నారు.. ఏపీ అసైన్డ్ భూములపై షాకింగ్ నిజాలు
-
అమరావతిలో అసైన్డ్ భూముల దోపిడీకి రాజముద్ర!
-
‘అసైన్డ్’ దోపిడీకి రాజముద్ర!
అదే.. అమరావతి! అంతా.. రైతన్నలే..! కానీ రాజధాని ప్రాంతంలో.. గత ప్రభుత్వం పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను రద్దు చేసిన కూటమి ప్రభుత్వం.. అదే చోట నిరుపేద రైతుల నుంచి అసైన్డ్ భూములను కాజేసిన పచ్చ ముఠాలను ‘రాజముద్ర’తో సత్కరిస్తోంది. అమరావతిలో ఏకంగా 1,300 ఎకరాల అసైన్డ్ భూములు రిటర్న్‌బుల్ ప్లాట్ల ముసుగులో పచ్చ రాబందులకు ఫలహారంగా మారిపోతున్నాయి! అసలు అసైన్డ్ భూములను కొనడమే పెద్ద తప్పు.. ఇక వాటిని కొనుగోలు చేసిన టీడీపీ నేతలకు బదులుగా ప్లాట్లు కేటాయించడం అంతకంటే పెద్ద నేరం కాదా? రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్ భూములను సాగు చేసుకుంటున్న లక్షలాది మంది పేద రైతుల సమస్యకు పరిష్కారం చూపుతూ వాటిపై వారికి పూర్తి యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్) కల్పిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అయితే దీన్ని సైతం కూటమి సర్కారు వివాదాస్పదంగా మార్చింది. గత సర్కారు 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన లక్షలాది ఎకరాల భూములు, ఫ్రీ హోల్డ్ భూములపై తీసుకున్న నిర్ణయాలను తిరగతోడి వాటిని పారిశ్రామిక పార్కులు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకోవడంపై ప్రతిపాదనలు రూపొందించాలని ఇప్పటికే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయించింది. ఒకవైపు ల్యాండ్ టైట్లింగ్ చట్టం, భూముల రీ సర్వే, అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కుల కల్పన, చుక్కల భూములకు పరిష్కారం లాంటి అన్ని భూ సంబంధిత అంశాలను వివాదాలతో ముంచెత్తుతూ మరోవైపు ప్రక్షాళన పేరుతో తూతూమంత్రంగా రెవెన్యూ సదస్సులను నిర్వహించింది.సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో 2014–19 మధ్య బరితెగించి సాగించిన ‘అసైన్డ్’ భూముల దోపిడీకి చంద్రబాబు ప్రభుత్వం రాజముద్ర వేస్తోంది. అమాయక ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు మాయ మాటలు చెప్పి రూ.5 వేల కోట్లకు పైగా విలువ చేసే 1,300 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు బినామీలు, సన్నిహితులు చేజిక్కించుకున్నట్లు అప్పట్లోనే వెల్లడైంది. వీటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు అధికారులు అంగీకరించకపోవడంతో ఈ దోపిడీదారులు హైకోర్టుకు వెళ్లి రైతుల ఫోర్జరీ సంతకాలతో ఏకంగా న్యాయస్థానాన్నే మోసగించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో భూ సమీకరణ కింద తీసుకున్న ఈ భూములకు అమరావతిలో ప్లాట్లు కేటాయించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ భూ దోపిడీకి వ్యతిరేకంగా అసైన్డ్ రైతులు న్యాయ పోరాటానికి సిద్ధపడ్డారు. తమకు న్యాయం చేయాలని తాజాగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేస్తున్నారు.పరిహారం ఇవ్వరంటూ భయపెట్టి..కేంద్ర ప్రభుత్వ అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, అప్పటి రెవెన్యూ అధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ 2014–19 మధ్య టీడీపీ హయాంలో చంద్రబాబు బృందం ఏకంగా 1,300 ఎకరాల అసైన్డ్ భూముల దోపిడీకి పాల్పడింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన ఈ భూములను చేజిక్కించుకోవడానికి పక్కా పన్నాగం పన్నింది. రాజధాని కోసం అన్ని భూములను సమీకరణ కింద ప్రభుత్వం తీసుకుంటుందని, ఇవి అసైన్డ్ భూములైనందున ఎలాంటి పరిహారం ఇవ్వదని మొదట రెవెన్యూ అధికారుల ద్వారా గ్రామాల్లో ప్రచారం చేయించింది. ఇందులో భాగంగా భూ సమీకరణ విధానాలు ఖరారు చేస్తూ జారీ చేసిన జీవో 1 లోనూ అసైన్డ్ భూములకు భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించలేదు. దీంతో పేద రైతులు భయాందోళనకు గురయ్యారు. అదే అదునుగా టీడీపీ పెద్దల బినామీలైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు రంగ ప్రవేశం చేశారు. అసైన్డ్ భూములు తమకు అమ్మేయాలని, లేకపోతే ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా వాటిని తీసేసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను భయపెట్టారు. అతి తక్కువ ధరకు సేల్ డీడ్ అగ్రిమెంట్లతో భూములను బదలాయించుకున్నారు. మొత్తం 1,300 ఎకరాలను చేజిక్కించుకున్నాక చంద్రబాబు ప్రభుత్వం వీటికి కూడా భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో 41 జారీ చేసింది. అంటే అసైన్డ్ భూములను అక్రమంగా అతి తక్కువకు కొట్టేసిన టీడీపీ ముఠాకు రాజధానిలో విలువైన వాణిజ్య, నివాస స్థలాలను కేటాయిస్తామని తెలిపింది. దాంతో తాము మోసపోయామని అసైన్డ్ రైతులు గుర్తించి, ఆందోళన వ్యక్తం చేసినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటికి ఎకరా రూ.కోటి విలువ ఉన్న భూములకు రాజధాని నిర్మిస్తే ఎకరా రూ.4 కోట్లు పలుకుతాయంటూ నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. అంటే టీడీపీ ముఠా కొల్లగొట్టిన 1,300 ఎకరాల మార్కెట్ విలువ ఏకంగా రూ.5 వేల కోట్లు పైనే!రికార్డుల గల్లంతు మాయాజాలం1954 తర్వాత ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు నిబంధనలకు విరుద్ధమని రెవెన్యూ అధికారులు అభ్యంతరం తెలిపారు. అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే కూడా ఈ మేరకు లిఖిత పూర్వకంగా స్పష్టం చేశారు. ఈ భూముల రిజిస్ట్రేషన్లను అప్పటి మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ తిరస్కరించారు. దాంతో దోపిడీదారులు ఆ భూములన్నీ 1954కు ముందు రైతులకు కేటాయించినవంటూ తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేశారు. వాస్తవానికి అవన్నీ 1980 – 2006 మధ్య రైతులకు కేటాయించినవే. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2006లో కేటాయించిన భూములు కూడా వీటిలో ఉన్నాయి. ఆ వాస్తవాన్ని కప్పిపుచ్చేందుకు టీడీపీ పెద్దలు గుంటూరు కలెక్టరేట్లో అసైన్డ్ భూముల రికార్డులను ఏకంగా మాయం చేశారు.ఫోర్జరీ సంతకాలతో హైకోర్టుకే మస్కాఅసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో చంద్రబాబు బినామీలు, సన్నిహితులు హైకోర్టుకు వెళ్లారు. 1954కు ముందు కేటాయించిన ఈ భూములను ఎస్సీ, ఎస్టీ రైతులు తమకు స్వచ్ఛందంగానే విక్రయించారని హైకోర్టుకు తెలిపారు. ఇందుకోసం ఆ రైతుల సంతకాలను ఫోర్జరీ చేసి అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసేలా అధికారులను ఆదేశించాలని, వాటికి భూ సమీకరణ కింద రాజధానిలో అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించేలా సీఆర్డీఏను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. ఓ వైపు హైకోర్టులో ఈ వ్యాజ్యం సాగుతుండగా.. మరోపక్క అమరావతిలో అసైన్డ్ భూముల దోపిడీకి ఆమోద ముద్ర వేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమవుతోంది. భూ సమీకరణ కింద తీసుకున్న ఆ 1,300 ఎకరాల అసైన్డ్ భూములకు అమరావతిలో రిటర్నబుల్ ప్లాట్లు కేటాయించాలని సీఆర్డీఏను ఆదేశించింది. తదనుగుణంగా చంద్రబాబు బృందం సభ్యుల పేరిట రిటర్నబుల్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు సీఆర్డీఏ సన్నాహాలు చేస్తోంది.ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను అడ్డుకోండి..టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్రను గుర్తించిన అసైన్డ్ రైతులు పలువురు హైకోర్టును ఆశ్రయించారు. తాము అసలు భూములు విక్రయించనే లేదని స్పష్టం చేశారు. తాము స్వచ్ఛందంగా భూములు విక్రయించినట్టు తమ సంతకాలు ఫోర్జరీ చేసి అఫిడవిట్లు దాఖలు చేశారని పలువురు అసైన్డ్ రైతులు న్యాయస్థానానికి నివేదించారు. తమ భూములకు ప్లాట్లను తమకే కేటాయించేలా సీఆర్డీఏను, ఇతరుల పేరిట ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేశారు.భూ దోపిడీని ఆధారాలతో నిగ్గు తేల్చిన సిట్2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే అమరావతిలో అసైన్డ్ రైతులు తమకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేశారు. దాంతో గత ప్రభుత్వం విచారణకు సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) నియమించింది. సిట్ దర్యాప్తులో చంద్రబాబు బృందం భూ బాగోతం మొత్తం ఆధారాలతో బట్టబయలైంది. అసైన్డ్ భూముల పరిరక్షణ చట్టానికి విరుద్ధంగా భూముల బదలాయింపు చేయకూడదని లిఖిత పూర్వకంగా అభ్యంతరం తెలిపామని అప్పటి గుంటూరు కలెక్టర్‌గా ఉన్న కాంతిలాల్ దండేతో సహా పలువురు అధికారులు సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలాలు ఇచ్చారు. దాంతో ఏ1గా చంద్రబాబు, ఏ 2గా నారాయణతో పాటు పలువురిపై గతంలో సిట్ కేసు నమోదు చేసి న్యాయస్థానంలో చార్జిషీటు కూడా దాఖలు చేసింది. -
అసైన్డ్ భూములపై హక్కులు ఎప్పుడు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే అంశంలో అడుగు ముందుకుపడటం లేదు. రాష్ట్రంలోని 18 లక్షల మందికిపైగా పేద రైతులు అసైన్డ్ భూములపై హక్కులు ఎప్పుడు కల్పిస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు వెంటనే దీనిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. భూపరిపాలన అంశాలపై దృష్టి సారించి ఎంతో కొంత ముందుకెళుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. అసైన్డ్‌పై హక్కుల అంశాన్ని మాత్రం పక్కన పెట్టినట్టు వ్యవహరిస్తోందని విమర్శిస్తున్నారు. చట్టాన్ని సవరించాల్సిందే! భూమి లేని పేదలకు ఆర్థిక భద్రత కల్పించడం, సామాజిక గుర్తింపు ఇవ్వడమే ప్రధాన ఉద్దేశంగా తెలంగాణలో దశాబ్దాలుగా భూమి పంపిణీ జరుగుతోంది. పలు రకాల భూములను పేదలకు కేటాయిస్తూ వస్తున్నారు. ఇలా అసైన్ చేసిన భూములు అన్యాక్రాంతం కాకూడదనే ఉద్దేశంతో అసైన్మెంట్ భూముల బదలాయింపు నిషేధ చట్టం (పీవోటీ)– 1977 తీసుకొచ్చారు. దాని ప్రకారం ప్రభుత్వం నుంచి ఉచితంగా భూమి పొందినవారు.. ఆ భూమిని ఇతరులకు విక్రయించకూడదు. దానం చేయకూడదు. కౌలుకు కూడా ఇవ్వకూడదు. వారసత్వంగా అనుభవిస్తూ వెళ్లే హక్కులు మాత్రమే ఉంటాయి. అయితే మాజీ సైనికులు పదేళ్ల తర్వాత, రాజకీయ బాధితులు మార్కెట్ ధర చెల్లించి ఉంటే వెంటనే అమ్ముకునే హక్కులు కల్పించారు. అయితే రైతుల అసైన్డ్ భూముల క్రయ, విక్రయ లావాదేవీలు జరగాలంటే భూబదలాయింపు నిరోధ చట్టాన్ని సవరించాలి. ఇందుకోసం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చేశారు! అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పించడంలో కొన్ని దక్షిణాది రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయి. అసైన్ చేసి 20 ఏళ్లు దాటితే వాటిపై అసైనీలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలో 15 ఏళ్లకు, తమిళనాడులో 20 ఏళ్లకు, కేరళలో 25 ఏళ్లకు అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు వస్తాయి. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో అయితే పదేళ్లకే యాజమాన్య హక్కులు వస్తాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా అసైన్డ్ భూములపై హక్కులు కల్పించాలనే డిమాండ్ రోజురోజుకూ ఊపందుకుంటోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ దిశగా పలుమార్లు హామీ ఇచ్చినా కార్యరూపం దాల్చలేదు. దీనిపై ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. భిన్నాభిప్రాయాలతో.. అసైన్డ్ భూములపై పేదలకు హక్కులు కల్పించే అంశంలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ హక్కుల కల్పన ద్వారా తెలంగాణలో పెరిగిన భూముల ధరలతో పేద రైతులకు ఆర్థిక స్థిరత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కు టుంబ అవసరాల కోసం అత్యవసర పరిస్థితుల్లో భూములను అమ్ముకుని గట్టెక్కవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇలా హక్కులిస్తే ఎస్సీ, ఎస్టీల చేతుల్లో ఉన్న భూకమతాల సంఖ్య తగ్గిపోతుందని.. సంపన్నుల చేతుల్లోకి భూమి వెళుతుందనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో కమిటీ వేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందనే చర్చ జరిగింది. కానీ ప్రభుత్వం భూభారతి చట్టం, ఇతర భూసంబంధిత అంశాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడంతో ఈ అసైన్డ్ భూముల అంశం పక్కన పడింది. ఇప్పటికైనా అసైన్డ్ భూ ముల విషయంలో ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలనే వాదన వినిపిస్తోంది. -
‘ఫ్రీ హోల్డ్’ అన్నీ సక్రమమే!
మహారాణిపేట (విశాఖ): పేదల భూములు కాజేశారంటూ ఎన్నికలకు ముందు కూటమి నాయకులు చేసిన ప్రకటనలు అవాస్తవాలు అని తేలిపోయింది. ఆసైన్డ్ భూములు, డీ పట్టా భూములకు హక్కులు కల్పించేందుకు చేపట్టిన ఫ్రీ హోల్డ్ వ్యవహారంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని డిప్యూటీ కలెక్టర్ల కమిటీ నిగ్గు తేల్చింది. ఇదే నివేదికను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి పంపించింది. భూములపై విచారణకు వెళ్లిన డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు అక్కడ పరిస్థితిని చూసి షాక్ అయ్యారు. ముందుగా వీరికి చెప్పి పంపిన పద్ధతి వేరు, గ్రామంలోకి వెళ్లిన తర్వాత పరిస్థితి వేరుగా కనిపించింది. గ్రామంలో అడుగడుగునా విచారణ చేసిన డిప్యూటీ కలెక్టర్ల బృందానికి అక్రమాలు జరిగినట్టు ఒక్క ఫిర్యాదు కూడా అందలేదు. దీంతో డిప్యూటీ కలెక్టర్లు అయోమయంలో పడ్డారు. బెడిసికొట్టిన గోబెల్స్ ప్రచారం ఫ్రీ హోల్డ్ పేరిట పేదల భూములను బలవంతంగా లాక్కున్నారని చేసిన గోబెల్స్ ప్రచారం కమిటీ విచారణతో బెడిసికొట్టినట్టు అయ్యింది. అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎంతో హడావుడిగా ఫ్రీ హోల్డ్ భూములకు సర్టిఫికెట్ల జారీకి బ్రేకులు వేసి, రిజి్రస్టేషన్ల ప్రక్రియ నిలుపుదల చేశారు. అంతేకాకుండా ఈ భూముల కొనుగోలు, ఇతర లావాదేవీలపై విచారణ చేయాలని నిర్ణయించి విచారణ కమిటీలను నియమించారు. మొత్తం నాలుగు మండలాల్లో జరిగిన ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ల జారీపై జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విచారణ ముమ్మరంగా కొనసాగింది. ఒక్కో మండలానికి ఒక డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి చేత విచారణ చేపట్టారు. వీరు గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి, అవకతవకలపై ప్రశ్నించారు. భూముల కోసం ఎవరైనా ఇబ్బందులు పెట్టారా? అని అడిగారు. ఎక్కడా ఫిర్యాదులు రాలేదు. గ్రామ సభలో చెప్పలేకపోతే తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి చెప్పవచ్చని డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు చెప్పడం విశేషం. అయినా ఎవరూ ముందుకు రాలేదు. వచ్చిన ఫిర్యాదుల్లో లీగల్ హెయిర్ (కుటుంబ సభ్యులు) అయిన తమకు డబ్బులు ఇవ్వకుండా తీసుకున్నారని, ఈ భూముల్లో తమకూ వాటా ఉందని, న్యాయం చేయాలనే ఫిర్యాదులు వచ్చాయి. వీటిని పరిశీలించిన డిప్యూటీ కలెక్టర్లు తలలు పట్టుకున్నారు. పేదల భూములకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం హక్కులు పేదల భూములకు హక్కులు కల్పించాలని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్ణయించింది. డీ పట్టా భూములకు హక్కులు కల్పిస్తూ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు జారీ చేసేందుకు జీవో 596 జారీ చేసింది. 2002 సంవత్సరానికి ముందు మంజూరు చేసిన డీ పట్టా భూములకు హక్కులు కల్పించడమే జీవో ముఖ్య ఉద్దేశం. హక్కులతో పాటు రిజిస్ట్రేషన్లు చేసి పేదలకు అందించేందుకు అప్పట్లో శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత జీవనాధారం కోసం భూమి క్రయ, విక్రయాలకు అవకాశం కల్పించారు. 609 ఎకరాలు ఫ్రీ హోల్డ్ ఈ జీవో ప్రకారం జిల్లాలో 609 ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేశారు. వీటిలో 190 ఎకరాలకు రిజి్రస్టేషన్లు పూర్తి చేశారు. అయితే ఈ ప్రక్రియపై టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఎన్నికలకు ముందు తీవ్ర ఆరోపణలు చేశారు. పేదల భూముల విషయంలో అక్రమాలు జరుగుతున్నాయని అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే హడావుడిగా ఫ్రీ హోల్డ్ ప్రక్రియను నిలిపివేసింది. స్వయంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఈ భూములను పరిశీలించి వెళ్లారు. తాజాగా డిప్యూటీ కలెక్టర్ల కమిటీ కూడా ఫ్రీ హోల్డ్, రిజి్రస్టేషన్ చేసిన భూముల రికార్డులతో పాటు యజమానులను కలిసి విచారించారు. ఇందులో ఆనందపురం మండలంలో 407.77 ఎకరాలు, పద్మనాభంలో 129.60 ఎకరాలు, పెందుర్తిలో 20.04 ఎకరాలు, భీమిలిలో 52.51 ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో ఎటువంటి అవకతవకలు, అక్రమాలు జరిగినట్టు నిర్ధారణ కాలేదు. దీంతో కమిటీ ఇదే విషయాన్ని జిల్లా యంత్రాంగం ద్వారా ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది. -
పేదలపై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పేదలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు దిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావు విమర్శించారు. 20 ఏళ్లు పూర్తయిన అసైన్డ్ భూములపై లబ్ధిదారులైన పేదలకు పూర్తి హక్కులు కల్పిస్తూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడు ఆ అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు ఆపాలంటూ ఆదేశాలివ్వడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలైన లబ్ధిదారుల పేరుపై మాత్రమే రిజిస్టర్ చేసి వారికి మాత్రమే అమ్ముకునే అవకాశం వైఎస్ జగన్ హయాంలో ఇచ్చారని, ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం వల్ల లక్షలాది రైతుల పరిస్థితి గందరగోళంగా మారిందని చెప్పారు. ఆ అసైన్డ్ భూములపై ఇప్పటికే అధికార పార్టీ నాయకులు కన్నేశారని, పలు చోట్ల వారు పేదలను బెదిరించి భూములు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలో పలు రకాల భూములను నిషేధిత జాబితాల నుంచి తొలగించి, భూములపై హక్కులు కల్పించడం ద్వారా రైతులకు మేలు చేస్తే, చంద్రబాబు ఇప్పుడు వారిని ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒక్క సెంటు భూమి కూడా రైతులకు ఇవ్వలేదని, కానీ గత ప్రభుత్వం కొత్తగా 42,307 మంది రైతులకు 46,463 ఎకరాల అసైన్డ్ భూములు పంపిణీ చేసిందని తెలిపారు. మేనిఫెస్టో హామీలను అమలు చేయలేక, ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. -
ఇచ్చిన మాట, చేసిన దానం తిరిగి తీసుకోవటమే చంద్రబాబు చరిత్ర
-
రైతులకు కొత్త కష్టాలు తెచ్చిన చంద్రబాబు సర్కార్..
-
‘అసైన్డ్’ ఆగడం! రిజిస్ట్రేషన్లను నిలిపివేసిన చంద్రబాబు సర్కారు
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై వైఎస్సార్ సీపీ హయాంలో యాజమాన్య హక్కులు (ఫ్రీ హోల్డ్) పొందిన రైతన్నలపై కూటమి సర్కారు కక్ష సాధింపులకు దిగింది. దశాబ్దాల తర్వాత తమ భూములపై ఆంక్షలు తొలగిపోవడంతో సంతోషంగా సాధారణ రైతులుగా సాగు చేసుకుంటున్న వారిని మళ్లీ కష్టాల్లోకి నెట్టింది. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల చట్ట సవరణ ద్వారా ఫ్రీ హోల్డ్ అయిన భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేయాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం తాజాగా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా ఫ్రీ హోల్డ్ అయిన భూములన్నింటిపైనా విచారణ నిర్వహించాలని, రీ వెరిఫికేషన్ చేయాలని స్పష్టం చేసింది. వాస్తవానికి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లను అనధికారికంగా నిలిపివేసింది. ఇప్పుడు దాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో లక్షలాది రైతు కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత ప్రభుత్వం ఒరిజినల్ అసైనీలకు న్యాయబద్ధంగా, ఇష్టపూర్తిగా అమ్ముకునే హక్కు కల్పించింది. అసైన్డ్ పేదలకు భూములపై పూర్తి హక్కులతోపాటు అవసరాలకు విక్రయించుకునే అవకాశమిచ్చింది. ఒకవేళ ఇప్పటికే చేతులు మారినా ఒరిజినల్ అసైనీలకే హక్కులు ఉండేలా చర్యలు తీసుకుంది. మరి అలాంటప్పుడు అది బడుగు, బలహీన వర్గాల రైతులకు మేలు చేసినట్లా? కీడు చేసినట్లా? అని కూటమి ప్రభుత్వాన్ని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.చిరకాల వాంఛ నెరవేర్చిన వైఎస్ జగన్ ప్రభుత్వాల నుంచి భూములు పొందిన లక్షలాది మంది నిరుపేద రైతుల చిరకాల కోరికను నాడు వైఎస్ జగన్ ప్రభుత్వం నెరవేర్చింది. పేదలకు అసైన్ చేసిన (కేటాయింపు) భూములపై వారికి కేటాయించిన తేదీ నుంచి 20 సంవత్సరాల తర్వాత హక్కులు లభించేలా 1977–అసైన్డ్ భూముల చట్టానికి 2023లో కీలక సవరణ చేసింది. దీంతో 27 లక్షల మంది అసైన్డ్ భూముల రైతన్నలు తమ భూములపై హక్కులు (ఫ్రీ హోల్డ్) పొందే అవకాశం కలిగింది. అయితే అసైన్డ్ భూములు చాలా వరకు అన్యాక్రాంతమయ్యాయనే ఫిర్యాదుల నేపథ్యంలో ఒరిజినల్ అసైనీ (ఒరిజినల్ కేటాయింపుదారు)కే యాజమాన్య హక్కులు కల్పించింది. ఎవరు పడితే వారు అసైన్డ్ భూములను సొంతం చేసుకునే ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంది. చట్ట ప్రకారం ప్రభుత్వం నుంచి భూములు పొందిన వారు లేక వారి వారసులకు మాత్రమే అసైన్డ్ భూములపై హక్కులు కల్పించింది. ఈ క్రమంలో పూర్తి వెరిఫికేషన్ తర్వాత 9 లక్షల ఎకరాలపై సంబంధిత రైతులకు హక్కులు కల్పించి ఆ భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించింది. మిగిలిన భూములపైనా వెరిఫికేషన్ పూర్తి చేసి 22 ఏ జాబితా నుంచి తొలగించాల్సి ఉండగా కూటమి సర్కారు ఆ పని నిలిపివేసింది. అంతటితో ఆగకుండా గత ప్రభుత్వం 22ఏ జాబితా నుంచి తొలగించిన భూములకు చెందిన రైతులపైనా విచారణ పేరుతో కక్ష సాధింపులకు దిగింది. విచారణలో సక్రమమని తేలిన భూములపైనా ఆంక్షలు కొనసాగించాలని, ప్రభుత్వానికి తెలియకుండా వాటిని 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించకూడదని స్పష్టం చేయడాన్ని బట్టి చంద్రబాబు సర్కారు పేద అసైన్డ్ రైతులపై ఎంత క్షక్ష పూరితంగా వ్యవహరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.రైతుల చేతుల్లోనే 97.22 శాతం భూములు వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో పేదల అసైన్డ్ భూములు ఫ్రీ హోల్డ్ కావడం, వాటిపై వారికి సంపూర్ణ హక్కులు లభించడంతో ఏదో గోల్మాల్ జరిగిందని, అన్యాక్రాంతమయ్యాయని కూటమి సర్కారు దుష్ప్రచారం చేస్తోంది. వాస్తవానికి 22 ఏ జాబితా నుంచి తొలగించిన 9 లక్షల ఎకరాల్లో విక్రయాలు జరిగింది కేవలం 25 వేల ఎకరాలు (2.78 శాతం) మాత్రమే. అంటే ఒరిజినల్ అసైనీలు మాత్రమే ప్రయోజనం పొందారు. మిగిలిన 97.22 శాతం భూములపై కూడా హక్కులు ఒరిజినల్ రైతుల చేతుల్లోనే ఉన్నాయి. దీన్ని చంద్రబాబు ప్రభుత్వం తప్పుగా చిత్రీకరిస్తూ అసైన్డ్ భూముల చట్ట సవరణను తప్పు పడుతోంది. అదే సమయంలో చట్ట సవరణను కొనసాగిస్తామని ప్రకటించింది. దీన్నిబట్టి అసైన్డ్ భూములపై దళితులకు, బడుగులకు హక్కులు దక్కకూడదన్నదే చంద్రబాబు సర్కారు లక్ష్యంగా కనపడుతోంది.విస్తృత అధ్యయనం తర్వాతే చట్ట సవరణఅసైన్డ్ భూములపై పేద రైతులకు యాజమాన్య హక్కులు కల్పించటానికి ముందు వైఎస్ జగన్ ప్రభుత్వం విస్తృతంగా అధ్యయనం చేసింది. అప్పటి రెవెన్యూ మంత్రి నేతృత్వంలో ఎమ్మెల్యేలతో కమిటీని నియమించింది. వివిధ రాష్ట్రాల్లో పర్యటించిన కమిటీ అసైన్మెంట్ భూముల చట్టాలు, నియమ నిబంధనలను క్షుణ్నంగా పరిశీలించి గత ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత ఒరిజినల్ లబ్ధిదారులకు లేదా వారి వారసులకు అవసరమైనప్పుడు అమ్ముకునేందుకు వీలు కల్పించాలని, అందుకు అనుగుణంగా ఏపీ అసైన్మెంట్ చట్టం (పీఓటీ)– 1977కి సవరణలు చేయాలని కమిటీ సిఫారసు చేసింది.పీఓటీ 1977 చట్టం స్ఫూర్తిని గౌరవిస్తూ.. అసైన్డ్ భూములపై లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని గత ప్రభుత్వానికి కమిటీ సిఫారసు చేయగా దీనికి నాటి మంత్రివర్గం ఆమోదం తెలిపి చట్టానికి సవరణలు చేసింది. 20 ఏళ్లకు ముందే ఎవరైనా పేద రైతుల నుంచి భూములు కొనుక్కుంటే వారికి ఎలాంటి ప్రయోజనం దక్కని విధంగా కూడా అదే సందర్భంలో చట్ట సవరణ చేసింది. తద్వారా అసైన్డ్ భూములు అన్యాక్రాంతం కాకూడదన్న ఒరిజినల్ పీఓటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్)–1977 చట్టం స్ఫూర్తిని గౌరవించింది. తద్వారా అసైన్మెంట్ అయిన దగ్గర నుంచి 2023లో చట్ట సవరణ జరిగే వరకూ అసైన్డ్ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న నిరుపేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన రైతులకు మాత్రమే మేలు జరుగుతుంది. ఇలా ఒరిజనల్ అసైనీలకు మాత్రమే ప్రయోజనం దక్కేలా చర్యలు తీసుకున్నారు.పేద రైతులను రోడ్డుకీడ్చేసి..గత ప్రభుత్వం ఇంత పకడ్బందీగా చట్ట సవరణ చేసి అసైన్డ్ భూములపై విప్లవాత్మక నిర్ణయం తీసుకుంటే దాన్ని వక్రీకరించి భూములన్నీ అన్యాక్రాంతమైనట్లు ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ కుట్ర మినహా మరేమీ లేదని స్పష్టమవుతోంది. వైఎస్సార్సీపీ నేతలు అసైన్డ్ భూములను సొంతం చేసుకున్నట్లు కూటమి సర్కారు అభాండాలు మోపుతోంది. ఫ్రీ హోల్డ్ అయిన 9 లక్షల ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు జరిగింది కేవలం 25 వేల ఎకరాలే. అందులో ఎక్కడైనా తేడాలున్నాయని భావిస్తే విచారణ నిర్వహించుకోవచ్చు. అంతేగానీ ఒరిజినల్ అసైనీల చేతుల్లో ఉన్న మొత్తం ఫ్రీహోల్డ్ భూములన్నింటిలోనూ తప్పులు జరిగాయని వితండవాదం చేస్తూ ఆ రైతులను రోడ్డు కీడ్చడం కచ్చితంగా పేదలపై కక్ష సాధించడమే. పేదలంతా వైఎస్ జగన్‌కు అండగా ఉండడాన్ని జీర్ణించుకోలేని కూటమి సర్కారు వారిని ఇక్కట్లకు గురి చేస్తూ బురద జల్లడానికి సిద్ధపడినట్లు స్పష్టమవుతోంది. ఆ ఉత్తర్వులు అన్యాయం..ఏళ్ల తరబడి అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములపై రైతులకు సంపూర్ణ హక్కులను మాజీ సీఎం వైఎస్ జగన్ కల్పించారు. పేద రైతులపై కక్ష సాధించేలా అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదని, వాటిపై విచారణ జరపాలని కూటమి ప్రభుత్వం ఆదేశించడం దారుణం. చిప్పాడ పంచాయితీలో మా అమ్మ వెంకాయమ్మ పేరుతో 2 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. రిజిస్ట్రేషన్ కోసం మేం చేసుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉండగా నిలిపివేయాలని ఆదేశిచడం అన్యాయం.– కొయ్య అప్పల సూర్యనారాయణరెడ్డి, పాత మూలకుద్దు, భీమిలి మండలంబ్యాంకు రుణాలు రాకుండా చేసింది..ప్రభుత్వం పంపిణీ చేసిన భూములు 20 ఏళ్లకు పైబడి లబ్ధిదారుల అధీనంలో ఉంటే సంపూర్ణ యాజమాన్య హక్కులు దక్కేలా గత ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఆ ప్రక్రియ కొనసాగుతుండగా టీడీపీ కూటమి ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయడం దారుణం. భూములు చేతిలో ఉన్నా అవసరానికి బ్యాంకు రుణాలు పొందేందుకు అవకాశం లేకుండా చేసింది. గత ప్రభుత్వం కల్పించిన వెసులుబాటును రద్దు చేయడం సరికాదు. – ఆండ్రా వెంకట సుబ్బారెడ్డి, రైతు, ఆత్మకూరుమళ్లీ కష్టాలు మొదలుఏళ్ల తరబడి అసైన్డ్ భూములను అనుభవిస్తున్న రైతులకు మేలు కలిగేలా గత ప్రభుత్వం చొరవ తీసుకుని యాజమాన్య హక్కులు కల్పించింది. ఇప్పుడు రైతులకు కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. భూములను తనఖా పెట్టి రుణాలు పొందేందుకు అవకాశం లేకుండా చేసింది.– మెట్టుకూరు చంద్రశేఖర్‌రెడ్డి, రైతు, గోవిందంపల్లి, అనంతసాగరం మండలంనిలిపివేయడం అన్యాయం..గత ప్రభుత్వం అసైన్డ్ భూములపై పేదలకు కల్పించిన యాజమాన్య హక్కులను కూటమి సర్కారు హరించడం దారుణం. ఇది పేద రైతుల కడుపు కొట్టడమే. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లతో ఎంతో మంది పేద రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకున్నారు. – బోస నర్సింగరావు, జేవి అగ్రహారం, భీమిలి నియోజకవర్గంరోడ్ల పైకి రైతులుమాకు భూములున్నా యాజమాన్య హక్కులు కల్పించకుండా కూటమి ప్రభుత్వం అడ్డుపడటం సరికాదు. సక్రమంగా రిజిస్ట్రేషన్లు జరిగిన వాటిని కూడా పెండింగ్‌లో ఉంచాలని నిర్ణయించడం ఏమిటి? కూటమి ప్రభుత్వం దీన్ని ఉపసంహరించుకోకుంటే లక్షల మంది పేద రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది.– పెద్దాడ వెంకటప్పారావు, జేవి అగ్రహారం, భీమిలి నియోజకవర్గం. పేదల కడుపుకొడుతున్నారు..మాకు తిరుపతి సమీపంలో నాలుగు ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. గత ప్రభుత్వం సర్వ హక్కులు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడంతో ఎంతో సంతోషపడ్డాం. గతంలో ఎంతో మంది పాలకులు హామీలిచ్చినా నెరవేర్చలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వం మాత్రమే రిజిస్ట్రేషన్‌కు అనుమతి ఇచ్చింది. కొత్త ప్రభుత్వం రాగానే ఫ్రీ హోల్డ్ పేరుతో అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌ను నిలుపుదల చేయడం దారుణం. పేదల పట్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సమంజసం కాదు. చంద్రబాబు నిరుపేదల కడుపు కొడుతున్నారు. –ప్రభాకర్, భైరాగిపట్టెడ, తిరుపతి అన్యాయం చేయొద్దు..మాకున్న అసైన్డ్ భూమికి గత ప్రభుత్వంలో సర్వహక్కులు కల్పించారు. రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. చాలా ఆనందం వేసింది. చాలా ఏళ్లుగా ఉన్న సమస్య గత ప్రభుత్వంలో పరిష్కారమైంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నిలిపి వేయడం వల్ల ఎంతో మంది రైతులు నష్టపోతారు. సీఎం చంద్రబాబు రైతులకు మేలు చేయాలే కానీ అన్యాయం చేయకూడదు. ప్రీహోల్డ్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. – సుబ్బానాయుడు, రైతు, 50 బసివిరెడ్డిపల్లి గ్రామం, గంగాధర నెల్లూరు, చిత్తూరు జిల్లా రైతులకు తీవ్ర ఇబ్బందులు..ఫ్రీ హోల్డ్ అయిన చుక్కల భూములు, అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం దారుణం. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. గత ప్రభుత్వం అన్ని రకాల విచారణలు నిర్వహించాకే అనుమతించింది.– జీ రామయ్య, రైతు, పొదలకూరు మండలంకథ మళ్లీ మొదటికే..దశాబ్దాల తర్వాత రైతులు కష్టాలు తీరాయనుకుంటే మళ్లీ మొదలవుతున్నాయి. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని సంతోషపడుతున్న సమయంలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం వల్ల కథ మొదటికి వస్తుంది. ప్రభుత్వం దీనిపై పునరాలోచించాలి.– వి.దయాకర్‌రెడ్డి, పొదలకూరు మండలం -
ఎసైన్డ్ కు ఎసరు.. YSRCP ప్రభుత్వ పథకాలను తొలగించడమే బాబు టార్గెట్..
-
పేదల పొట్ట కొట్టాలని చూస్తున్నారా?
సాక్షి, అమరావతి: పేదలకు సంబంధించిన అసైన్డు భూముల విషయంలో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే అసైన్డ్ భూములపై కట్టుకథలు అల్లుతున్నారని ధ్వజమెత్తారు. పేదల కోసం తెచ్చిన చట్టాన్ని కూడా తప్పుదారి పట్టించేలా వార్తలు రాశారని ఈనాడుపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు భజనే తప్ప పేదల బాగోగులు ఎల్లో మీడియాకు పట్టవా? అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తిగా గతి తప్పిన ఈనాడు రోజూ రోత రాతలు రాస్తోందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం పట్టించుకోక పోయినా చంద్రబాబు పల్లకి మోయడమే ఈనాడు లక్ష్యం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా బాధ్యతను పూర్తిగా వదిలేసిన ఈనాడు.. చంద్రబాబు ఒక్కరే బాగుంటే చాలన్నట్లు వ్యవహరిస్తోందన్నారు. గత ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా రద్దు చేయాలి.. లబ్ధిదారుల సంఖ్యను ఎలా తగ్గించాలి.. అనే విషయాలపైనే ప్రభుత్వ పెద్దలు దృష్టి పెట్టారని, దీనికి ఎల్లో మీడియా.. ముఖ్యంగా ఈనాడు వంత పాడుతోందని చెప్పారు. అనిల్ కుమార్ ఇంకా ఏమన్నారంటే..అసైన్డ్ భూముల సమస్య ఎప్పటిది? » అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడింది ఎవరు? చంద్రబాబునాయుడి ప్రభుత్వం కాదా? పేదల భూములను వారు కొట్టేయ లేదా? రాజధాని పేరు చెప్పి అమరావతిలో ఇదివరకు టీడీపీ ప్రభుత్వం చేసింది దోపిడీ కాదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మభ్యపెట్టి, మోసం చేసి 1100 ఎకరాలు కొట్టేశారు. మీ చేతిలో భూములు ఉంటే, పరిహారం రాదని, ప్లాట్లు రావని చెప్పి.. పేదల భూములు లాగేసుకుని, ఆ తర్వాత జీవో ఇచ్చి, చేతులు మారిన భూములను పూలింగ్‌లోకి తీసుకున్నారు. ఆ తర్వాత బినామీలకు ప్లాట్లు కేటాయించి రూ.కోట్లు కొల్లగొట్టారు. అమరావతి ప్రాంతంలో దాదాపు 1336 మంది బినామీలు ఉన్నారు. దీనిపై కేసు నడుస్తోంది. ఇవన్నీ వాస్తవాలు కావా? » నిజానికి అసైన్డ్ భూముల సమస్య ఈనాటిది కాదు. భూమి ఉన్నా కష్టం వస్తే, దాన్ని ఏదో ఒకటి చేసుకుందామనుకున్నా, చేసుకోలేని పరిస్థితి ఉండేది. చివరకు పైసాకో, పరక్కో ఏదో ఒక కాగితం మీద రాసిచ్చి ఎంతో కొంత తీసుకుని భూములను అప్పగించే పరిస్థితి ఉండేది. 70 ఏళ్లుగా ఆ సమస్య కొనసాగింది.పేదలకు న్యాయం చేయడం కోసమే..» పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల చట్టానికి సవరణలు చేశారు. దానికి సంబంధించి గత ఏడాది అక్టోబరు 27న గెజిట్ జారీ అయింది. ఆ మేరకు ఒరిజనల్ అస్సైనీలు, ఒకవేళ వారు లేకపోతే వారి చట్టబద్ధ వారసులను గుర్తించి, ఆ భూములపై హక్కులు కల్పించారు.» జగన్ ప్రభుత్వం ఆనాడు ఏ స్వార్థం లేకుండా నిరుపేదలకు న్యాయం జరగాలన్న ఆలోచనతో మంచి చట్టాన్ని రూపొందించింది. అయితే ఎల్లో మీడియా.. ముఖ్యంగా ఈనాడు కుటిలమైన ఆలోచనతో దుష్ప్రచారం చేస్తోంది.ప్రజలు, రైతులు.. ముఖ్యంగా నిరుపేదలకు మంచి జరగకూడదు... వారి పొట్ట కొట్టాలి.. వారిని రోడ్డు మీదకు ఈడ్చాలనే లక్ష్యంతో తప్పుడు రాతలు రాస్తోంది. » రైతుల సమస్యలు పరిష్కరించేలా గత సీఎం జగన్ చొరవ తీసుకున్నారు. షరతులతో కూడిన పట్టాలకు సంబంధించి 22 వేల మంది రైతులకు మేలు చేస్తూ 35 వేల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించారు. చుక్కల భూములను కూడా నిషేధిత జాబితా నుంచి తొలగించారు. అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఏకంగా 2,00,083 ఎకరాలకు సంబంధించి హక్కు పత్రాలు జారీ చేశారు. 15,21,160 మంది భూమి లేని నిరుపేదలకు, వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించారు. ఆ భూములన్నీ 1954 తర్వాత అసైన్మెంట్ చేసినవే. -
పేదలపై అక్కసు.. అసైన్డ్ భూములకు హక్కులపై ‘ఈనాడు’ వక్రభాష్యం
అసైన్డ్ భూములకు హక్కులపై ‘ఈనాడు’ వక్రభాష్యం దళిత, పేద రైతులకు యాజమాన్య హక్కులివ్వడం తప్పా? దశాబ్దాలుగా తమ భూములపై హక్కులు లేకుండా బతికిన పేద రైతులు వారిని సంపూర్ణ భూ యజమానులుగా మార్చేందుకే అసైన్డ్ చట్టం తెచ్చిన జగన్ ప్రభుత్వం ప్రజాప్రతినిధుల కమిటీ విస్తృత అధ్యయనం తర్వాతే నిర్ణయం ఇదివరకెన్నడూ లేని విధంగా 27 లక్షల మంది రైతులకు ప్రయోజనం తమ భూములపై హక్కులొచ్చాక కొందరు రైతులు అమ్ముకుంటే మీకేంటి బాధ?అసైన్డ్ భూముల రైతులకు చరిత్రాత్మక రీతిలో వైఎస్ జగన్ హయాంలో దక్కిన యాజమాన్య హక్కులను ప్రశ్నించేలా ఎల్లో మీడియా.. ప్రధానంగా ‘ఈనాడు’ వింత ధోరణి ప్రదర్శిస్తోంది. వారి భూములపై వారికి హక్కులు ఇవ్వడమే నేరమన్నట్లు వక్ర భాష్యాలు చెబుతోంది. పేద రైతులు, దళితులు ఇంకా బానిసత్వంలోనే బతకాలని కోరుకుంటోంది. వారి భూములకు వారు యజమానులుగా మారడం సరికాదంటూ ఏడుపుగొట్టు రాతలతో దుష్ప్రచారం చేస్తోంది. పేదలు, దళితులు ఆరి్థకంగా ఎదగడానికి వీల్లేదంటూ పెడబొబ్బలు పెడుతూ కోడిగుడ్డుపై ఈకలు పీకుతోంది. దశాబ్దాలుగా తాము సాగు చేసుకుంటున్న భూములపై హక్కులు లేక రాష్ట్రంలో లక్షలాది మంది అసైన్డ్ రైతులు అష్టకష్టాలు అనుభవించారు. ఏళ్ల తరబడి ఆ భూములకు హక్కులివ్వాలని ప్రాధేయపడినా ఏ ప్రభుత్వం కనికరించడంలేదు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా వైఎస్ జగన్ ప్రభుత్వంలో దళిత, ఇతర పేద రైతులకు ప్రభుత్వాలు ఇచ్చిన భూములకు యాజమాన్య హక్కులు లభించాయి. తద్వారా 20 ఏళ్లకు పైబడి తమ ఆధీనంలో ఉన్న అసైన్డ్ భూములపై పేద, దళిత రైతులకు సంపూర్ణ అధికారాలు దఖలు పడ్డాయి. లక్షలాది మంది పేద రైతులు వారి భూములపై యాజమాన్య హక్కులు పొంది సంపూర్ణ రైతులుగా మారారు. తమ భూములపై ఆంక్షలు లేకపోవడం, మంచి ధర రావడంతో కొంత మంది రైతులు వాటిని విక్రయించారు. ఆ సొమ్ము ద్వారా పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ఇళ్లు, ఇతరత్రా ఆరి్థక ఇబ్బందుల నుంచి గట్టెక్కారు. చంద్రబాబు అండ్ గ్యాంగ్‌ను వెనకేసుకొస్తున్న ‘ఈనాడు’కు ఇది ఏమాత్రం గిట్టడం లేదు.సాక్షి, అమరావతి: ఏపీలో అసైన్డ్ భూముల చట్టాన్నే అపహాస్యం చేసేలా ఈనాడు, ఇతర ఎల్లో మీడియా దిగజారి వ్యవహరిస్తోంది. అసైన్డ్ భూములకు ఎసరు పెట్టేశారంటూ పేద, దళిత రైతులు తమ భూములపై నిర్ణయం తీసుకోవడాన్ని అవమానకరంగా వక్రీకరిస్తోంది. ఆ భూములను అధికారులు, వైఎస్సార్సీపీ నేతలు కారుచౌకగా కొనుగోలు చేశారని నిరాధారంగా నిందిస్తోంది. పేద రైతులు కొత్తగా వచ్చిన యాజమాన్య హక్కుల ఆధారంగా తమ భూమిని అమ్ముకుంటే దాన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ విపరీత అర్థాలు తీస్తోంది. ఎంత మంది పిల్లలుంటే అంత మందికి ఏటా రూ.15 వేల చొప్పున ‘తల్లికి వందనం’ పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు తల్లికి మాత్రమే ఇస్తామని బొంకుతున్న విషయం బయట పడటంతో.. తమ మోసాన్ని ప్రజలు గ్రహించకుండా దృష్టి మళ్లించడానికి ‘బాబు అండ్ కో’ అసైన్డ్ హక్కుల వ్యవహారాన్ని తెర మీదకు తెచ్చింది. మేనిఫెస్టోలో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయడంపై దృష్టి పెట్టకుండా, ప్రజలకు మేలు చేసేలా గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ఎలా తొలగించాలన్న దానిపైనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎల్లో మీడియా, ప్రధానంగా ఈనాడు శకుని పాత్ర పోషిస్తోంది. ఏ ప్రభుత్వమైనా ఒక కార్యక్రమాన్ని అమలు చేసినప్పుడు ఎలాంటి పక్షపాతం లేకుండా పరిశీలించి.. ఇంకా ఎలా మంచి చేయొచ్చు అని చెప్పే బాధ్యత పత్రికలకు ఉంటుంది. కానీ మేలు చేస్తున్న కార్యక్రమాలను ఎత్తివేయాలని, తీసివేయాలంటూ పనిగట్టుకుని తప్పుడు రాతలు రాయడం దారుణం. దీనివల్ల అంతిమంగా నష్టపోయేది పేదవాళ్లు. పేదలకు నష్టం చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం, ఎల్లో మీడియా ఉన్నట్టు మరోసారి రుజువైంది. చంద్రబాబు, తాము బాగుంటే చాలని ఈనాడు కిరణ్ అనుకోవడం దుర్మార్గం. అసైన్డ్ భూములు దోచిందెవరు? నిజంగా అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడింది ఎవరు? గతంలో చంద్రబాబు ప్రభుత్వం కాదా? రాజధాని పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మభ్యపెట్టి, మోసం చేసి 1,100 ఎకరాలు కొట్టేశారు. వాళ్ల చేతిలో ఉంటే పరిహారం రాదని, ప్లాట్లు రావని చెప్పి లాగేసుకున్నారు. ఆ తర్వాత జీవో ఇచ్చి చేతులు మారిన భూములను పూలింగ్‌లోకి తీసుకుని టీడీపీ బినామీలకు ప్లాట్లు కేటాయించి కోట్లు కొల్లగొట్టారు. 1,336 మంది బినామీలు ఇంకా ఉన్నారు. దీనిపై కేసు నడుస్తోందిం. ఈ కేసు దర్యాప్తు ఎంత వరకు వచ్చిందని ఇదే ఈనాడు ఏనాడైనా నాలుగు వాక్యాలు రాసిందా? అసైన్డ్ భూముల సమస్య ఈనాటిది కాదు. పేదలు, రైతులు అందరూ ఇబ్బందులు పడుతున్నారు. భూమి ఉన్నాం కష్టం వస్తే.. దాన్ని ఏదోలా ఉపయోగించుకుందామన్నా.. చేసుకోలేని పరిస్థితి. పైసాకో, పరక్కో ఏదో ఒక కాగితం మీద రాసిచ్చి ఎంతో కొంత తీసుకునే పరిస్థితి. రికార్డుల్లో ఒక పేరు.. భూమి దగ్గరకు వస్తే మరొకరి పేరు. దేనికీ పొంతన లేదు. ఒకరేమో కష్టం తీర్చుకోవడం కోసం అమ్ముకుంటే, దాన్ని కొనుక్కున్నవాడికీ కంటిమీద కునుకులేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టానికి సవరణలు చేసింది. గతేడాది అక్టోబరు 27న దీనికి గెజిట్ జారీ అయ్యింది. నిజంగా ఎవరో ఒకరికి లబ్ధి చేకూర్చాలనుకుంటే.. ఎవరి ఆధీనంలో భూమి ఉంటే వారికే ఇచ్చేయండి అని చెప్పేవారు. కాని అలా జరగలేదు. ఏ పేదవాడు అయితే లబ్ధిదారో, ఒరిజనల్ అసైనీగా ఉన్నాడో, వారు లేకపోతే వారసులు ఎవరున్నారో వారికే సర్వహక్కులూ ఇవ్వండని చెప్పింది. ఇందులో తప్పు ఏముంది? ఇప్పుడు వీరందర్నీ రోడ్డు మీదకు ఈడ్చాలని చూస్తున్నారా? పేదల పొట్టకొట్టాలని చూస్తున్నారా? ఇదీ అసైన్డ్ భూముల నేపథ్యం వివిధ కేటగిరీలకు చెందిన లబ్ధిదారులకు వ్యవసాయం కోసం భూమి అసైన్డ్ చేసే విధానం కొన్ని దశాబ్దాల క్రితం మొదలైంది. 1954కు ముందు అసైన్ చేసిన భూములది ఒక కేటగిరీ, 1954 తర్వాత మరో కేటగిరీ. 1954కు ముందు అసైన్డ్‌దారులకు ఇచ్చిన పట్టాల్లో ఎక్కడా అమ్ముకోకూడదనే షరతు లేదు. 1954 తర్వాత ఇచ్చిన అసైన్డ్ పట్టాల్లో మాత్రం ఈ నిబంధన పెట్టారు. దీంతో ఆ భూములన్నీ నిషేధిత జాబితాలో చేరాయి. వాటిని అమ్ముకునే అవకాశం లేదు. గతంలో బాబు ప్రభుత్వం చేసిన వెబ్‌ల్యాండ్ దుర్మార్గాల వల్ల 1954కు ముందు అసైన్డ్ చేసిన భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. వాటిని తొలగించుకోవడానికి రెవిన్యూ అధికారుల చుట్టూ తిరిగిం, లంచాలు ఇచ్చిం విసిగిపోయిన రైతులు ఎంతో మంది ఉన్నారు. 1954 నుంచి కూడా పేదలకు భూములు ఇవ్వడం జరుగుతూనే ఉంది. 70 ఏళ్ల తర్వాత కూడా ఆ భూముల మీద వారికి హక్కులు లేవు. అదే స్వాతంత్య్ర సమరయోధులో, ఎక్స్ సర్వీస్‌మెన్ అయితే అసైన్ చేసిన తర్వాత పదేళ్లకు అమ్ముకునే అవకాశాన్ని చట్టం కల్పించింది. ఈ విషయంలో వారికి పూర్తి హక్కులు ఉన్నాయి. భూమి లేని నిరుపేదలకు మాత్రం హక్కులు లేవు. 2, 2.5 ఎకరాల వరకూ అసైన్మెంట్ పట్టా ఉన్న వాళ్లు తమ అవసరాలకు ఒక అరెకరం అమ్ముకోవాలనుకుంటే చట్ట ప్రకారం అమ్ముకోవడం కుదరదు. దీంతో సాదా బైనామా పద్ధతిలో భూముల అమ్మకాలు జరిగాయి. దీనివల్ల నిరుపేదలైన అసైనీలకు రావాల్సిన రేటులో కనీసం 25 శాతం కూడా వచ్చేది కాదు. భూమిని అమ్ముకోకుండా సాగు చేసుకున్న వారు కూడా టైటిల్ లేకపోవడం వల్లం రెవిన్యూ శాఖ నుంచి ఎప్పుడైనా నోటీసులు వస్తాయని, ఆ భూమిని ప్రభుత్వం ఎక్కడ తీసేసుకుంటుందోనని, ఎక్కడ రిజర్వ్ చేస్తుందోనని భయాందోళనలు ఉండేవి. ఇటు అసైనీకి.. అటు కొనుక్కున్న వారికి లబ్ధి లేదు.రెవెన్యూ రికార్డులు క్షేత్ర పరిస్థితిని తెలియజెప్పేలా లేవు. రికార్డులు ఒకరి పేరు మీద ఉంటే.. భూములు మరొకరి ఆదీనంలో ఉన్నాయి. ఇప్పటివరకు 19,21,855 మందికి 33,29,908 ఎకరాలను ప్రభుత్వాలు అసైన్మెంట్ చేస్తే.. ఆ రికార్డులేవీ క్షేత్ర స్థాయికి అనుగుణంగా లేవు. పూర్తి అధ్యయనం తర్వాతే అసైన్డ్ చట్ట సవరణ జిల్లా కలెక్టర్లు పలుమార్లు జగన్ ప్రభుత్వం దృష్టికి అసైన్డ్ భూముల సమస్యను తీసుకు వచ్చాక రెవెన్యూ మంత్రి నేతృత్వంలో 13 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో 2022 ఆగస్టు 30వ తేదీన ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ కర్ణాటక, తమిళనాడులో పర్యటించిం అక్కడి విధానాలపై అధ్యయనం చేసింది. అసైన్మెంట్ భూములకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చింది. కేరళలో అయితే అసైన్ చేసిన మూడేళ్ల తర్వాత, కర్ణాటకలో 25 ఏళ్ల తర్వాత, తమిళనాడులో పదేళ్ల తర్వాత కొన్ని నిబంధనలతో అమ్ముకునే అవకాశం ఉంది. కర్ణాటకలో ఐదేళ్ల తర్వాత కలెక్టర్ అనుమతితో అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు. మిగులు భూముల్లో ఇచ్చిన అసైన్మెంట్ అయితే 25 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చని తమిళనాడులో నిబంధన ఉంది. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత అసలైన ఒరిజనల్ లబ్ధిదారులకు, లేదా వారి వారసులకు అవసరమైనప్పుడు అమ్ముకునేందుకు వీలు కల్పించాలని, దానికి అనుగుణంగా ఏపీ అసైన్మెంట్ చట్టం (పీఓటీ) 1977కు సవరణలు చేయాలని ఆ కమిటీ సిఫారసు చేసింది. అంటే అసైన్డ్ భూములపై లబ్ధిదారులకు పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వాలని కమిటీ సిఫారసు చేయగా, దీనికి అప్పటి మంత్రివర్గం ఆమోదం తెలిపి, చట్టానికి సవరణలు చేసింది. అదే సందర్భంలో 20 ఏళ్లకు ముందే ఎవరైనా పేద రైతుల నుంచి భూములు కొనుక్కుని ఉంటే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారికి ఎలాంటి హక్కులూ రావు. వారి విషయంలో 1977 నాటి పీఓటీ చట్టం అమల్లో ఉన్నట్టే. 2007,2008 నాటి సవరణలు కూడా వర్తిస్తాయి. దీనివల్ల అసైన్మెంట్ అయిన దగ్గర నుంచి 2023లో చట్ట సవరణ జరిగే వరకు అసైన్మెంట్ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన రైతులకే మేలు కలుగుతుంది. అంటే ఒరిజనల్ అసైనీలకు మాత్రమే లబ్ధి చేకూరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో.. అందులో తప్పులు జరిగాయని, రద్దు చేయాలనే వాదనలో ఏమైనా అర్థం ఉందా? ఎవరికైనా లబ్ధి చేకూర్చాలనుకుంటే ఒరిజనల్ అసైనీలకే హక్కులు ఇవ్వాలనే షరతు చట్టంలో ఎందుకు పెడతారు? 27 లక్షల ఎకరాలపై పేదలకు హక్కులువైఎస్ జగన్ హయాంలో జరిగిన అసైన్డ్ చట్ట సవరణ ద్వారా సుమారు 15,21,160 మంది భూమిలేని నిరుపేదలకు వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. 20 సంవత్సరాలకు ముందు ఇచ్చిన భూములన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఈ భూములన్నీ 1954 తర్వాత అసైన్మెంట్ చేసినవే. అలాగే ప్రభుత్వం వ్యవసాయ భూములే కాకుండా ఇళ్ల పట్టాలు కూడా నిరుపేదలకు ఇచ్చింది. జగన్ ప్రభుత్వంలో 31 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మల పేరుమీద నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇచ్చారు. గతంలో 20 సంవత్సరాల తర్వాత ఇళ్ల పట్టాలపై సర్వ హక్కులు కల్పించేలా ఉన్న చట్టాన్ని, జగన్ హయాంలో 10 సంవత్సరాలకు తగ్గిస్తూ పీఓటీ చట్టంలో సవరణ చేశారు. ఫలితంగా నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు పొందినవారితోపాటు, మిగిలిన వారికీ ప్రయోజనం చేకూరింది. చంద్రబాబు ఎప్పుడైనా ఒక్క సెంటు భూమి పేదలకు ఇచ్చారా? పైగా అమరావతిలో 50 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే అడ్డుపడటం వాస్తవం కాదా? భూముల పేరుతో అన్యాయం చేసింది చంద్రబాబు కాదా? 2016లో ఒక్క మెమో ద్వారా 2,06,171 ఎకరాల చుక్కల భూములను ఉద్దేశ పూర్వకంగా అప్పటి చంద్రబాబు ప్రభుత్వం 22ఎలో పెట్టి ఆ రైతులను సర్వనాశనం చేసింది. జగన్ ప్రభుత్వం వచ్చాక చుక్కల భూముల విషయంలో నష్టపోయిన 97,472 రైతులకు ఊరటనిచ్చింది. ఇప్పుడు వారిని కూడా రోడ్డుకు లాగేస్తారా? షరతులు గల పట్టా భూములున్న వేల మంది రైతులకు సంబంధించిన 35 వేల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించి వైఎస్ జగన్ మేలు చేశారు. ఇప్పుడు వీరిని కూడా రోడ్డున పడేస్తారా? గిరిజనులకు 2.83 లక్షల ఎకరాలపై హక్కు పత్రాలు ఇచ్చారు. వాళ్లనూ రోడ్డున పడేస్తారా? ఇవన్నీ పేద రైతులకు మంచి చేస్తూ తీసుకున్న నిర్ణయాలు. వాళ్లందరినీ రోడ్డున పడేయాలన్న చంద్రబాబు కోరికకు ఎల్లో మీడియా అక్షర రూపం ఇస్తోంది. దళిత రైతులను అవమానిస్తారా? అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడాన్ని ఎల్లో మీడియో ఓర్వలేకపోతోంది. తమ భూములపై హక్కుల కోసం ఏళ్ల తరబడి దళితులు ఎదురుచూశారు. భూములపై హక్కు వస్తే తమకు సమాజంలో గౌరవం పెరుగుతుందని భావించారు. దాన్ని వైఎస్ జగన్ నెరవేర్చారు. దీన్ని తప్పు పట్టడం అన్యాయం. హక్కులు వచ్చిన కొందరు రైతులు తమ భూములను అమ్ముకోవడం తప్పెలా అవుతుంది? వారి అవసరాల కోసమో, లేక ఆ భూమికి ఎక్కువ రేటు రావడం వల్లో అమ్ముకుని ఉండవచ్చు. ఆ భూములన్నింటినీ వైఎస్సార్సీపీ వాళ్లు కొన్నారనడం నిరాధారం. దళితులను అవమానించడానికే ఇలాంటి రాతలు రాస్తున్నారు. – జూపూడి ప్రభాకర్‌రావు, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడుపెత్తందార్ల కాళ్ల కిందే నలిగిపోవాలా? అసైన్డ్ భూములపై 20 సంవత్సరాల తర్వాత హక్కులు కల్పించడం ద్వారా వైఎస్ జగన్ దళితులు, పేద రైతుల తల రాతను మార్చారు. 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం చేయని పనిని ఆయన చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ధైర్యంగా ఈ పని చేసింది. ఫలితంగా లక్షలాది మంది రైతులకు తమ భూములపై సర్వ హక్కులు లభించాయి. సమాజంలో వారికి గౌరవం పెరిగింది. మావి అసైన్డ్ భూములు కావు, పట్టా భూములని చెప్పుకుంటున్నారు. అవసరమైతే ఎవరైనా అమ్ముకుంటున్నారు. దాని కోసమే, ఆ హక్కు కోసమే వారు పోరాడారు. సాధించుకున్న భూమిపై వారికి హక్కు ఉండదా? దళితులు పెత్తందార్ల కాళ్ల కిందే నలిగిపోవాలా? – మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడులక్షల మంది అసైన్డ్ రైతులకు లబ్ధి దళిత, పేద రైతులకు మేలు చేయడాన్ని కూడా తప్పు పట్టడం దారుణం. అసైన్డ్ భూములకు హక్కులివ్వడం వల్ల లక్షల మంది పేద, దళిత రైతులు ప్రయోజనం పొందారు. అసైన్డ్ భూములంటేనే వివాదాస్పద భూములుగా చిత్రీకరించిన పరిస్థితి ఉండేది. ప్రభుత్వం ఇచ్చిన 50 ఏళ్ల తర్వాత కూడా ఆ భూమిపై వారికి హక్కు ఉండేది కాదు. తమకు హక్కు ఇస్తే ఆ భూమిని అవసరానికి ఉపయోగించుకుంటామని, అవసరమైతే రుణాలు తీసుకుంటామని రైతులు ఎన్నో ఏళ్లుగా మొత్తుకుంటున్నారు. ఎవరూ వినలేదు. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. వైఎస్ జగన్ మాత్రమే విన్నారు. ఆయన ప్రభుత్వం మాత్రమే పట్టించుకుంది. అసైన్డ్ రైతులకు యాజమాన్య హక్కులిచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. దాన్ని వక్రీకరించి ఇష్టానుసారం మాట్లాడడం తగదు. – నత్తా యోనారాజు, జాతీయ అధ్యక్షుడు, మాల మహానాడు -
డైవర్షన్ పాలిటిక్స్‌లో చంద్రబాబు దిట్ట: కైలే అనిల్ కుమార్
సాక్షి, తాడేపల్లి: అసైన్డ్ భూముల విషయంలో ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోందన్నారు మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్. ఎప్పుడూ చంద్రబాబు భజనే తప్ప పేదల బాగోగులు ఎల్లో మీడియాకు పట్టదా? అని ప్రశ్నించారు. అసైన్డ్ భూముల విషయంలో అక్రమాలు చేసిందే చంద్రబాబు అని అన్నారు.కాగా, అనిల్ కుమార్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. అసైన్డ్ భూముల విషయంలో పేదల కోసం తెచ్చిన చట్టాన్ని కూడా తప్పు దారి పట్టించేలా ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. ప్రభుత్వ హామీల నుంచి ప్రజల దృష్టి మళ్లించేలా ఎల్లో రాతలు రాస్తున్నారు. చంద్రబాబు భజనే తప్ప పేదల బాగోగులు ఎల్లోమీడియాకు పట్టదా?. ఎసైన్డ్ భూముల విషయంలో అక్రమాలు చేసిందే చంద్రబాబు. రాజధానిలో 1,336 మంది పేదల నుండి అసైన్డ్ భుములను లాక్కున్నదే చంద్రబాబు. అలాంటి వారు నేడు అసైన్డ్ భూముల గురించి మాట్లాడటమేంటి?. గతంలో పేదోడికి కష్డం వస్తే ఆ అసైన్డ్ భూములను అమ్ముకునే పరిస్థితి కూడా లేదు. అలాంటి కష్టాల నుండి పేదలను కాపాడటానికే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చట్టం తెచ్చారు. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేశాకే చట్టం తీసుకురావడం జరిగింది. రాష్ట్రంలో 2.88 లక్షల ఎకరాలపై గిరిజనులకు హక్కులు కల్పించారు. లక్షలాది ఎకరాల అసైన్డు భూములను పేదలకు పట్టాలుగా ఇచ్చారు.డైవర్షన్ పాలిటిక్స్ చేయటంలో చంద్రబాబు దిట్ట. ఏదో చేసేస్తున్నట్టు మీడియాలో హడావుడి చేస్తున్నారు. తల్లికి వందనం పేరుతో పిల్లలు అందరికీ ఇవ్వాల్సిన రూ.15 వేల నగదు ఇవ్వలేదు. ఇతర హామీలనూ గాలికి వదిలేశారు. వాటి గురించి ప్రశ్నిస్తారనే ఎల్లోమీడియాతో కలిసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. 45ఏళ్ల రాజకీయ చరిత్ర ఉందనే చంద్రబాబుకు ఏనాడూ ఎస్సీ, ఎస్టీలు గుర్తుకు రాలేదు.అమరావతిలో పేదల భూములను పెద్దోళ్లకు కట్టబెట్టినట్టే మరో కుట్ర జరుగుతోంది. అందుకే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అసైన్డ్ భూములపై తప్పుడు కథనాలు రాయిస్తున్నారు. చంద్రబాబు ఎన్నిసార్లు సీఎం అయినా ఏనాడైనా ఒక్క పేదోడికైనా సెంటు భూమి ఇచ్చారా?. ఏ ప్రభుత్వ ఆఫీసు చుట్టూ తిరగకుండానే పేదులకు పట్టాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌ది. బాధ్యత కలిగిన పత్రికలు వాస్తవాలు రాయాలని కోరుతున్నాను అంటూ కామెంట్స్ చేశారు. -
‘అసైన్డ్’ ఆక్రమణ.. బడుగుల భూముల్లో వాలిన పచ్చ గద్దలు
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి రాజధాని పేరిట చంద్రబాబు సొంత సంస్థానాన్ని సృష్టించుకున్నారు. స్వతంత్య్ర దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని భూదోపిడీకి బాటలు వేశారు. ఆధునిక జమీందారులా మారిపోయి బడుగుల భూములకు ఎసరు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయభ్రాంతులకు గురి చేసి అసైన్డ్ భూములను లాక్కున్నారు. రికార్డులు తారుమారు చేసి ప్రభుత్వ భూములను చెరబట్టారు. ప్రైవేట్ భూములను హస్తగతం చేసుకున్నారు. అధికారం అండతో భూ దందాలకు మార్గదర్శిగా నిలిచారు. 2014 – 19 మధ్య అధికారంలో ఉండగా భూసమీకరణ ప్యాకేజీ మార్కెట్ విలువ ప్రకారం ఏకంగా రూ.5,500 కోట్ల విలువైన భూములను కొల్లగొట్టడం దేశ చరిత్రలోనే అతిపెద్ద భూ దోపిడీగా రికార్డులకు ఎక్కింది. చంద్రబాబు బృందం అరాచకాలు సీఐడీ విచారణలో పూర్తి ఆధారాలతో నిగ్గు తేలాయి. దీనిపై సీఐడీ ఇప్పటికే న్యాయస్థానంలో చార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది.బెదిరించి లాక్కుని తాపీగా ప్యాకేజీ..అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు టీడీపీ పెద్దలు పక్కా వ్యూహం రచించారు. అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వబోమంటూ బెదిరించి 814 మంది బినామీల ముసుగులో కాజేశారు. అనంతరం అసైన్డ్ భూములకు ప్యాకేజీని ప్రకటించడం వారి కుతంత్రానికి నిదర్శనంగా నిలుస్తోంది. భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015 జనవరి 1న టీడీపీ సర్కారు జీవో నంబరు 1 జారీ చేసింది. ఆ జీవోలో ప్రైవేట్ భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. అనంతరం తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను హడలగొట్టారు. దీంతో గత్యంతరం లేక కారు చౌకగా ఎకరా కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్ భూములను సేల్ డీడ్ల ద్వారా విక్రయించే పరిస్థితి కల్పించారు. ఆ తరువాత అసైన్డ్ భూములకు కూడా భూసమీకరణ ప్యాకేజీని ప్రకటిస్తూ 2016 ఫిబ్రవరి 17న తాపీగా జీవో నంబరు 41 జారీ చేశారు. అప్పటికే అసైన్డ్ భూములు టీడీపీ పెద్దల బినామీల పరం కావడంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా స్కెచ్ వేశారు.ఉన్నతాధికారుల అభ్యంతరాలు బేఖాతర్ చట్ట ప్రకారం దేశంలో 1954కు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశం ఉంది. ఆ తరువాత పంపిణీ చేసిన అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చట్ట విరుద్ధం. ఈమేరకు నాటి కలెక్టర్, సీఆర్డీయే, రెవెన్యూ, న్యాయ శాఖ ఉన్నతాధికారులు, అడ్వకేట్ జనరల్ తమ అభ్యంతరాలను జీవో 41 నోట్ ఫైళ్లలో ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా వెల్లడించారు. వీటిని లెక్క చేయకుండా బినామీల ద్వారా హస్తగతం చేసుకున్న భూములకు చంద్రబాబు ప్యాకేజీని ప్రకటించారు.అసైన్డ్ భూ దోపిడీదారులు..ఏ–1: చంద్రబాబు నాయుడుఏ–2 : పొంగూరు నారాయణఏ–3 : అన్నే సుధీర్‌బాబు (అప్పటి తుళ్లూరు మండల తహసీల్దార్)ఏ–4 : కేపీవీ అంజనీకుమార్ (ఎండీ, రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్)1,100 ఎకరాలు.. 1,336 మంది బినామీలుచంద్రబాబు బృందం అమరావతి పరిధిలో ఏకంగా 1,100 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టింది. మొత్తం 1,336 మంది బినామీల పేరిట ఆ భూములను హస్తగతం చేసుకున్నారు. భూ సమీకరణ ప్యాకేజీ ప్రకారం ఆ భూముల విలువ ఏకంగా రూ.5,500 కోట్లు కావడం చంద్రబాబు భారీ భూదోపిడీకి నిదర్శనం.కోర్టును మోసం చేసి మరీ...అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఏకంగా న్యాయస్థానాన్నే మోసం చేయడం విస్మయపరుస్తోంది. ఈ కుట్రను అమలు చేసేందుకు రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను మాయం చేశారు. 1954 తరువాత భూ పంపిణీ రికార్డులేవీ లేవంటూ మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల రెవెన్యూ అధికారులతో ఓ నివేదిక ఇప్పించి న్యాయస్థానానికి సమర్పించారు. వాస్తవానికి 1954 తరువాత పలుదఫాలు పేదలకు అసైన్డ్ భూముల పంపిణీ జరిగింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2004–05లో అసైన్డ్ భూములను పంపిణీ చేశారు. అమరావతి అసైన్డ్ భూములలో 1954 తరువాత పంపిణీ చేసిన భూములు ఉన్నట్లు రుజువు చేసే రికార్డులు వెలుగులోకి వచ్చాయి. వాటిలో 1987, 2004–05లో పంపిణీ చేసిన అసైన్డ్ భూములు ఉన్నట్లు వెల్లడైంది. సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమగ్ర విచారణలో మొత్తం భూబాగోతం బట్టబయలైంది.ఉన్నతాధికారుల వాంగ్మూలంటీడీపీ ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూముల బదలాయింపు చేసినట్లు రెవెన్యూ ఉన్నతాధికారులు 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి తనను అప్రూవర్‌గా పరిగణించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఏ 1 బాబు, ఏ 2 నారాయణఅమరావతి భూ దోపిడీ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణలతోపాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ చార్జ్‌షీట్ కూడా దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 506, 166, 167, 217, 120 (బి), 109 రెడ్‌విత్ 34, 35, 36, 37.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లు 3(1),(జి), 3(2), అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద వారిపై అభియోగాలు నమోదు చేసింది. -
‘అసైన్డ్’పై తప్పుడు కథనాలు
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో అసైన్డ్ భూముల వ్యవహారంపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని జిల్లా కలెక్టర్ డా.మల్లికార్జున అన్నారు. నిజానిజాలు తెలుసుకోకుండా.. ప్రజల్ని తప్పుదారి పట్టించేలా ఆ కథనాలున్నాయని ఆయన తీవ్రంగా ఖండించారు. ఆనందపురం మండలం రామవరం గ్రామంలోని సర్వే నం.164–3లో 1.53 ఎకరాలు, సర్వే నం.169–2లో 0.87 ఎకరాల్ని జీఓ నం.596 ప్రకారం ఫ్రీహోల్డ్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు కథనాలు వచ్చాయన్నారు. అయితే, 1977 రెÐవెన్యూ చట్టానికి లోబడే ప్రొసీడింగ్స్ మంజూరు చేశామని స్పష్టంచేశారు. అక్కిరెడ్డి బంగారయ్యకి సంబంధించి సర్వే నంబర్ 169–2లోని 0.87 ఎకరాలకు ఎలాంటి ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ జారీచేయలేదన్నారు. అదేవిధంగా.. 2020లో భీమునిపట్నం మండలం అన్నవరం, భోగాపురం మండలం తూడెం గ్రామాల్లో జరిగిన ల్యాండ్ పూలింగ్ విషయంలో ఈనాడు రాసిన కథనంపై కలెక్టర్ మండిపడ్డారు. వాస్తవానికి.. అన్నవరం గ్రామంలోని సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్, భీమునిపట్నం మండలం అన్నవరం గ్రామంలోని సర్వే నం.1/101.పరిధిలోని భూమి వర్గీకరణ, మొత్తం విస్తీర్ణం 199.28 ఎకరాలు గయాలుగా నమోదైందన్నారు. ఇందులో తాము అనుభవిస్తున్నట్లుగా సదరు రైతులు ఆధారాలతో తమకెలాంటి ఫిర్యాదులూ చేయలేదన్నారు. హక్కు పత్రాలు ఏమైనా ఉంటే సమర్పించాలని పలుమార్లు రైతుల్ని కోరినా ఇవ్వలేదన్నారు. నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రాంతంలో పేదలందరికీ ఇళ్ల స్థలాలిచ్చేందుకు ఆనందపురం, పద్మనాభం మండలాల్లో పూలింగ్ జరిపినప్పుడు హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే చేపట్టామని కలెక్టర్ స్పష్టంచేశారు. గ్రామసభలు సైతం నిర్వహించామని.. ఇందులో భాగంగానే 2019 నవంబర్ 28న ఎంజాయ్మెంట్ సర్వేచేసి రైతుల సమ్మతితోనే భూ సమీకరణ చేసుకునేందుకు అదే నెల 30న ఫారం–1 నోటీసులు సైతం జారీచేసినట్లు ఆయన వివరించారు. ఈ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు రాలేదనీ, దానికనుగనంగా.. సమీకరణ చేపట్టామన్నారు. రిజి్రస్టేషన్ల ప్రక్రియ కూడా తుదిదశలో ఉందని.. ఎవరైనా రైతులు మిగిలి ఉంటే.. తగిన డీ–పట్టాలతో అ«దీకృత అధికారిని సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ప్రతి ఒక్క రైతుకీ న్యాయం చేసేలా వ్యవహరించామే తప్ప.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించినట్లుగా ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వలేదని కలెక్టర్ డా.మల్లికార్జున స్పష్టంచేశారు. -
సీఎస్ మా భూముల వద్దకు రాలేదు..
విశాఖ సిటీ: అసైన్డ్ భూముల వ్యవహారంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డిపై బురద జల్లడానికి ప్రయత్నించిన ఎల్లో మీడియా యత్నాలు బెడిసికొట్టాయి. సీఎస్‌పై విశాఖ జీవీఎంసీ 22వ వార్డు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని వెల్లడైంది. సీఎస్ ఎన్నడూ తమ భూముల వద్దకు రాలేదని, భోగాపురం విమానాశ్రయానికి వెళ్లే సమయంలో రోడ్డు మీదుగా మాత్రమే వెళ్లారని జనసేన, టీడీపీ నేతలు నిర్వహించిన మీడియా సమావేశంలో రైతులు కుండబద్ధలు కొట్టారు. విశాఖలో 800 ఎకరాల అసైన్డ్ భూములను సీఎస్ రైతుల నుంచి బలవంతంగా రాయించుకొని ఫ్రీ హోల్డ్ అనుమతులు పొందినట్లు పీతలమూర్తి యాదవ్ ఆరోపణలు చేశారు. దీన్ని ఆధారాలతో నిరూపిస్తానని బీరాలు పలికిన ఆయన శుక్రవారం టీడీపీ కార్యాలయంలో రైతులు చిట్టెమ్మ, అప్పన్న, నారాయణతో ప్రెస్‌మీట్ నిర్వహించి చివరకు తెల్లమొహంవేశారు. అగ్రిమెంట్లు చేయలేదన్న రైతులు తమ భూములను ఎవరికీ అగ్రిమెంట్ చేయలేదని మీడియా సమావేశంలో రైతులు స్పష్టం చేశారు. సీఎస్ ఎప్పుడైనా మీ భూములు ఇవ్వాలని బలవంతం చేశారా? అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అసలు జవహర్‌రెడ్డి ఎన్నడూ తమ భూముల వద్దకే రాలేదని రైతులు స్పష్టం చేశారు. ఇటీవల భోగాపురం విమానాశ్రయం పనుల పరిశీలన నిమిత్తం వచ్చినప్పుడు ఇటుగా వెళ్లడంతో అలా భావించామనడంతో టీడీపీ నేతలు, జనసేన కార్పొరేటర్ కంగుతిన్నారు. 700 ఎకరాలకే ఫ్రీ హోల్డ్ ప్రొసీడింగ్స్ గత ఎనిమిది నెలల్లో విశాఖ జిల్లాలో 700 ఎకరాల అసైన్డ్ భూములకు మాత్రమే ఫ్రీ హోల్డ్ ప్రొసీడింగ్స్ ఇచ్చారు. రాష్ట్రంలో అత్యల్పంగా అనుమతులు ఇచ్చిన జిల్లాల్లో విశాఖ రెండో స్థానంలో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.1 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల ప్రకారం తెలుస్తోంది. దళితులకు అసైన్డ్ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో జీవో 596 ఇచ్చింది. ఇరు గ్రామాల మధ్య ఐదేళ్లుగా వివాదం టీడీపీ, జనసేన నేతలు తీసుకొచ్చిన రైతుల మధ్య భూ వివాదాలు ఐదేళ్లుగా నలుగుతున్నాయి. భీమిలి మండలం అన్నవరం, భోగాపురం మండలం తూడెం పంచాయతీల మధ్య అసైన్డ్ భూముల వివాదాన్ని సీఎస్‌కు అంటగట్టేందుకు ప్రయత్నించి జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ భంగపడ్డాడు. రైతులు మాట్లాడుతుండగా సీఎస్ పేరు చెప్పాలని ఆయన గదమాయించడం గమనార్హం. జవహర్‌రెడ్డి పేరు కూడా తెలియని వారంతా తడబడుతూ జవర్ అని పేర్కొన్నారు. పార్టీకి సంబంధం లేదు.. సీఎస్‌పై పీతల మూర్తి యాదవ్ ఆరోపణల గురించి జనసేన విశాఖ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్‌ను ఇటీవల మీడియా ప్రతినిధులు వివరణ కోరగా ఆయన వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని తేల్చి చెప్పడం గమనార్హం. ఆయన బయట చేసే వ్యాఖ్యలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. -
అసైన్డ్ భూములపై రామోజీవి రోత రాతలు
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నారనే దుగ్ధతో రామోజీరావు, పచ్చ మీడియా అసైన్డ్ భూములపై రోత రాతలు రాస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున మండిపడ్డారు. ఆయన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ దళితులకు వారి భూములపై హక్కులు కల్పించాలనే సీఎం జగన్ చట్టం తెచ్చారని, అది కూడా 2003కు ముందు ఉన్న భూములపైనే హక్కులు కల్పించారని తెలిపారు. ఇదంతా పారదర్శకంగానే చేశారన్నారు. అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడింది తెలుగుదేశం పార్టీ నేతలు, పచ్చ మీడియానే అని ఆరోపించారు. చంద్రబాబు అమరావతిలో దళితుల భూములు ఎకరం కేవలం రూ.5 లక్షలకు కొని రూ. కోట్లు దోపిడీ చేశారని చెప్పారు. రామోజీరావు దళితుల భూములు దోచుకుని ఫిలిం సిటీని నిర్మించింది వాస్తవం కాదా.. అని నిలదీశారు. అందరి గురించి లేనివి ఉన్నట్లు, ఉన్నవి లేనట్లు పిచ్చి రాతలు రాసే రామోజీరావు ఈ విషయాలను ఈనాడులో ఎందుకు రాయలేదన్నారు. ఆయన అక్రమాలు చేసినా మంచి, ఇతరులు మంచి చేసినా అక్రమమా.. అని నిలదీశారు. వయస్సు పెరిగినా రామోజీ బుద్ధి మారలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ బడుగు, బలహీన వర్గాలను అక్కున చేర్చుకున్నారని తెలిపారు. చంద్రబాబు దళితవ్యతిరేకి అని చెప్పారు. దళితులలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా.. అన్న చంద్రబాబును ప్రజలు ఎప్పుడో చెత్తబుట్టలో పడేశారని తెలిపారు. చంద్రబాబుకు, రామోజీకి దళితుల అభ్యున్నతి ఇష్టంలేదని, అందుకే దళితులకు లబ్ధి చేకూర్చే సీఎం జగన్ నిర్ణయంపై విషం కక్కుతున్నారని చెప్పారు. తాము చంద్రబాబులా దళితుల భూములను కొట్టేసి తప్పుడు పనులు ఎన్నటికీ చేయబోమన్నారు. రామోజీ వాస్తవాలు గ్రహించాలని, సీఎం జగన్ ప్రభుత్వంపై పిచ్చి రాతలు మానుకోవాలని అన్నారు. -
క్షమాపణ చెప్పాలి... లేకుంటే దావా
సాక్షి, అమరావతి: జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనపైన, తన కుమారుడిపైన చేసిన నిరాధార తప్పుడు ఆరోపణలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు శనివారం సీఎస్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఆరోపణలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని మూర్తి యాదవ్‌ను ఆయన డిమాండ్ చేశారు. లేదంటే వ్యక్తిగతంగా పరువు నష్టం దావా వేయడంతో పాటు చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటానని సీఎస్ హెచ్చరించారు. రెండు నెలలుగా ఒక పథకం ప్రకారం వ్యక్తిత్వ హననం చేసే కుట్రలో భాగంగా చేస్తున్న ప్రచారమే ఈ ఆరోపణలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో తాను గానీ, తన కుమారుడు, బంధువులు ఎలాంటి అసైన్డ్ భూములు కొనలేదని స్పష్టం చేశారు. తన స్నేహితుడైన రిటైర్డ్ ఆర్మీ అధికారి కుమార్తె వివాహం ఏప్రిల్‌లో జరిగిందని, ఎన్నికల దృష్ట్యా ఆ వివాహానికి హాజరు కాలేకపోయినందున రెండు రోజుల విశాఖ పర్యటలో భాగంగా ఆదివారం కొత్త దంపతులను ఆశీర్వదించడానికి వెళ్లానని సీఎస్ తెలిపారు. ఆ మరుసటి రోజు భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించానన్నారు. ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్ల రూపాయల విలువైన 800 ఎకరాలు అసైన్డ్ భూములు కొట్టేసినట్లు యాదవ్ చేసిన ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు.అసైన్డ్ భూముల చట్ట సవరణకు సంబంధించి అసెంబ్లీలో 2023 అక్టోబర్‌లో సభ ఆమోదం తెలిపిందని, ఆ సవరణను అనుసరించి అసైన్డ్ భూములపై జీవో 586ను రెవెన్యూ శాఖ జారీ చేసిందని సీఎస్ పేర్కొన్నారు. చట్ట సభ ఆమోదం మేరకే జీవో జారీ అయితే దాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆపాదించడం ఎంత వరకు సబబని ఆయన ప్రశ్నించారు. ఈ జీవో ఆధారంగా తన కుమారుడి ద్వారా విశాఖలో 800 ఎకరాలకు పైగా భూములు కొనుగోలుకు డీల్స్ చేసినట్లు చేసిన ఆరోపణ పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. ఇప్పటికే 400 ఎకరాల అసైన్డ్ భూములను తన కుమారుడిని అడ్డంపెట్టుకుని బినామీల పేరిట చేజిక్కించుకున్నాననడంలో ఎంత మాత్రం నిజం లేదన్నారు.మరో 400 ఎకరాలను రిజిస్రే్టషన్ చేయించేందుకు యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాననడం పూర్తిగా అవాస్తవమని సీఎస్ తెలిపారు. ఈ భూముల రిజిస్ట్రేషన్లను పూర్తి చేసేందుకు విశాఖ, విజయనగరం జిల్లాల అధికారులపై ఒత్తిడి చేశాననడాన్నీ ఆయన తీవ్రంగా ఖండించారు. ఐదేళ్లలో తన కుమారుడు విశాఖకు గానీ, ఉత్తరాంధ్రలో ఏ జిల్లాకూ గాని వెళ్లలేదని సీఎస్ స్పష్టం చేశారు. మరో వైపు భోగాపురం విమానాశ్రయ పనుల పరిశీలన పేరుతో సీఎం జగన్ మళ్లీ సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లపై తాను సమీక్షించానని చేసిన ఆరోపణా అసంబద్ధమేనని ఖండించారు. -
లాక్కునేవి కాదు..ఇచ్చే చేతులివి..
ఒక్క ఎకరం భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి ఏళ్ల తరబడి తిరిగినా పని జరగని రాష్ట్రంలో ఏకంగా 35 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించిన ఘనత వైఎస్ జగన్ ప్రభుత్వానిది. ఏళ్ల తరబడి ఆంక్షల చట్రంలో ఇరుక్కు పోయిన చుక్కల భూములు, ఈనాం భూములు, షరతుల గల పట్టా భూములు వంటి లక్షల ఎకరాలపై ఆంక్షలు తొలగించారు. చుక్కల భూములు, షరతుగల పట్టా భూముల్ని చంద్రబాబు ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టి లక్షలాది మంది రైతులను రోడ్డున పడేసింది. వాటికి విముక్తి కల్పించి వాటిపై సర్వ హక్కులు కల్పించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.కేటాయించి 20 ఏళ్లు దాటిన అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ విప్లవాత్మక రీతిలో అమలు చేశారు. భూములున్నా వాటికి విలువ లేకుండా పోవడంతో హక్కులు కల్పించాలని దీర్ఘ కాలికంగా ఉన్న దళిత, పేద రైతుల కోరికను వైఎస్ జగన్ నెరవేర్చారు. 27.41 లక్షల ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించారు. ఇందుకోసం వాటిని 22ఏ జాబితా నుంచి తొలగించారు. అన్ని లక్షల భూములపై ఆంక్షలు తొలగి వాటి లావాదేవీలు ప్రారంభమవడంతో ఆరి్థక వ్యవస్థకు ఊతం లభించింది. దేశంలోనే తొలిసారిగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలపై హక్కులు కల్పించింది. ఇందుకోసం ఆ పట్టాలను వారి పేరు మీద ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడంతోపాటు కన్వేయన్స్ డీడ్స్ (సర్వ హక్కులతో భూ బదిలీ పత్రం) చేసి ఇచ్చి చరిత్ర సృష్టించింది. స్థిరాస్థి రిజిస్ట్రేషన్ జరిగిన తర్వాత మళ్లీ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరక్కుండానే ఆటోమేటిక్‌గా యాజమాన్య హక్కు మారి్పడి జరిగే ఆటో మ్యుటేషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు.వైఎస్ జగన్ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో సాహసోపేతంగా వేసిన అడుగులు రెవెన్యూ శాఖ చరిత్రలోనే సువర్ణాధ్యాయాన్ని లిఖించారు. చరిత్రలో ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారి రాష్ట్రంలో అమలైన రెవెన్యూ సంస్కరణలు దేశానికే దిక్సూచిగా మారాయి. పేదల జీవితాల్లో మార్పు తెచ్చే దిశగా చేపట్టిన ఈ సంస్కరణల్ని ఒక విప్లవంలా మేధావులు చెబుతున్నారు. సంస్కరణ: పేదలకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములపై 20 సంవత్సరాలు పూర్తయిన తర్వాత యాజమాన్య హక్కుల కల్పన. ఇళ్ల స్థలాలకు పదేళ్ల తర్వాత యాజమాన్య హక్కులు. హక్కులు కల్పిస్తున్న భూములు: 27,41,698 ఎకరాలు హక్కులు పొందుతున్న రైతుల సంఖ్య : 15,21,160 (ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు)ప్రయోజనం: ఆ భూములను నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఏ) నుంచి తొలగింపు. లక్షలాది కుటుంబాల జీవన ప్రమాణాలు పెరిగాయి. తద్వారా రాష్ట్ర ఆరి్థక వృద్ధికి బాటలు. అసైన్డ్ రైతులు తమ అవసరాల కోసం ఆ భూములను వినియోగించుకునే వీలు ఏర్పడింది. సర్విస్ ఈనాం భూములపై ఆంక్షల తొలగింపుగతం : గతంలో ఈనాం చట్టం ప్రకారం దేవదాయ భూములతోపాటు కుల వృత్తులకు ఇచ్చిన సర్వీస్ ఈనాం భూములను కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. దీనివల్ల లక్షలాది మంది భూములు స్తంభించిపోయాయి. సంస్కరణ:నిషేధిత జాబితా నుంచి ఆ భూముల తొలగింపుఆంక్షలు తొలగిన భూములు: 1,61,584 ఎకరాలు లబ్ధి పొందిన రైతుల సంఖ్య : 1,58,113 ప్రయోజనం: ఆంక్షలు తొలగడంతో కుమ్మరి, కమ్మరి, చాకలి, మంగలి వంటి పలు వృత్తుల వారికి కేటాయించిన సర్విస్ ఈనాం భూముల రైతుల కుటుంబాల్లో వెలుగులు.షరతులు గల పట్టా భూములపై ఆంక్షలు తొలగింపుగతం: పూర్వం నుంచి అనుభవిస్తున్న షరతులు గల పట్టా భూములను నిషేధిత జాబితాలో చేర్చిన చంద్రబాబు ప్రభుత్వం సంస్కరణ: ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగింపు తొలగించిన భూములు: 33 వేల ఎకరాలు లబ్ధి పొందిన రైతులు: 30 వేల మంది ప్రయోజనం: నిలిచిపోయిన ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. వాటిపై రుణాలు వస్తున్నాయి. అమ్మకాలు జరుగుతున్నాయి. అనాదీనం, ఖాళీకాలమ్ భూముల సమస్య పరిష్కారంగతం : చుక్కల భూములు మాదిరిగానే ఆర్‌ఎస్‌ఆర్‌లో అనాధీనం, ఏమీ రాయకుండా ఖాళీగా వదిలేసిన భూముల సమస్య. సంస్కరణ: అలాంటి భూములను గుర్తించి నిషేధిత జాబితా నుంచి తొలగింపు తొలగించిన భూములు: సుమారు 50 వేల ఎకరాలు లబ్ధి పొందిన రైతులు: సుమారు 30 వేల మంది ప్రయోజనం: భూములపై వారికి సర్వ హక్కులు ఏర్పడ్డాయి. రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. సుదీర్ఘకాలం తర్వాత భూ పంపిణీకి శ్రీకారం పంపిణీ చేసిన భూమి: 46,463 ఎకరాలు లబి్ధదారులు: 42,307 ప్రయోజనం: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలను ఆరి్థకంగా పైకి తీసుకువచ్చే కార్యక్రమంలంక భూములకు డీకేటీ పట్టాలు కృష్ణా, గోదావరి లంక గ్రామాల్లో రైతుల సాగులో ఉన్న లంక భూములకు పట్టాలు జారీ. దశాబ్దాల లంక భూముల సమస్యకు పరిష్కారం పట్టాలిచ్చిన భూమి: 9,064 ఎకరాలు లబ్ధి పొందిన రైతులు: 17,768 ప్రయోజనం: ఆ భూములపై రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ, పంటల బీమాలాంటివి పొందవచ్చు. దళిత వాడలకు శ్మశాన వాటికలు శ్మశాన వాటికలు లేని దళిత వాడలు ఉండకూడదనే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం దళిత వాడల కోసం కేటాయించిన శ్మశాన వాటికలు: 1,563 ఇందుకోసం ప్రభుత్వం కేటాయించిన భూమి: 951 ఎకరాలు ప్రయోజనం: స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత కూడా అంత్యక్రియలు చేసుకోవడానికి స్థలాలు లేని గ్రామాల సమస్యకు పరిష్కారం కొత్త రిజిస్ట్రేషన్ల విధానంరిజిస్ట్రేషన్ల విధానాన్ని ఆధునీకరించి మరింత సులభంగా ప్రజలకు రిజిస్ట్రేషన్ల సేవలు. కార్డ్ ప్రైమ్ 2.0 ద్వారా ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్లు. అందులోనే డాక్యుమెంట్లు తయారు చేసుకునే అవకాశం. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్. ఆధార్ సైన్ ద్వారా అవకతవకలకు ఆస్కారం లేని విధానం. ఆటో మ్యుటేషన్ పాత రిజిస్ట్రేషన్ల విధానంలో వ్యవసాయ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక మళ్లీ వ్యక్తిగతంగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. కొత్త విధానంలో రిజిస్ట్రేషన్ పూర్తవగానే ఆటో మ్యుటేషన్ జరిగిపోతోంది. అంటే రిజిస్ట్రేషన్ సమయంలోనే ఆన్లైన్లో పేరు మారుతుంది. ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్లు ఒకేసారి 30.61 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ప్రభుత్వం వాటిని లబ్ధిదారుల పేరు మీద రిజిస్టర్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందుకోసం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత కన్వేయన్స్ డీడ్లు పంపిణీ చేసింది. దీనివల్ల ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలపై లబ్ధిదారులకు హక్కులు లభించాయి. వాటిని బ్యాంకు ల్లో పెట్టి రుణాలు తీసుకోవచ్చు. పదేళ్ల తర్వాత ఎన్ఓసీ అవసరం లేకుండానే కన్వేయన్స్ డీడ్లు సేల్ డీడ్లుగా మారతాయి. అప్పుడు ఆ పట్టాలు ప్రైవేటు పట్టాల మాదిరిగా వినియోగించుకోవచ్చు. కుల ధ్రువీకరణ పత్రం శాశ్వతం గతం : సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులను ప్రతిసారీ కుల ధ్రువీకరణ పత్రాలను అడగడం వల్ల ఇబ్బందులు ఏర్పడేవి. సంస్కరణ: ఒకసారి కుల ధ్రువీకరణ పత్రం తీసుకుంటే దాన్ని శాశ్వతంగా ప్రకటించింది ప్రభుత్వం. మీ సేవ ద్వారా గతంలో కుల ధ్రువీకరణ పత్రాలు పొందితే ఆ డేటా ఆధారంగానే మళ్లీ పత్రాలు జారీకి అవకాశం. ఆదాయ ధ్రువీకరణ సులభతరంగతం : స్కాలర్íÙప్లు, ప్రభుత్వ పథకాలు, ఫీజు మినహాయింపుల కోసం కుటుంబాల ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకునేందుకు ప్రతిసారి విచారణ చేయాల్సివచ్చేది. సంస్కరణ: ప్రతిసారి విచారణ చేయకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో నిర్వహించే ఆరు దశల నిర్ధారణ ప్రక్రియనే ఉపయోగించుకునేలా మార్పులు. గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు వ్యవసాయం చేసుకునేందుకు అటవీ ప్రాంతంలో ఇచ్చిన పట్టాలు. గత ప్రభుత్వాల కంటే ఎక్కువ పట్టాలు ఇచ్చారు. పట్టాలిచ్చిన భూమి విస్తీర్ణం: 2,87,710 ఎకరాలు లబ్ధిదారులు: 1,30,368చుక్కల భూములకు విముక్తి గతం: చంద్రబాబు హయాంలో జరిగిన తప్పిదంతో 22(ఏ) జాబితాలో చేరిన 22.06 లక్షల ఎకరాల చుక్కల భూముల సమస్య. సంస్కరణ: 22ఏ జాబితా నుంచి వాటిని తొలగించి విముక్తి కల్పించిన ప్రభుత్వం ప్రయోజనం: చాలా సంవత్సరాల నుంచి నిలిచి పోయిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు జరుగుతున్నాయి. పంట రుణాలు కూడా వస్తున్నాయి. ఆ భూములను రైతులు స్వేచ్ఛగా అమ్ముకునే హక్కు ఏర్పడింది.భూమి కొనుగోలు పథకం భూములకు హక్కులు గతం : భూమి లేని నిరుపేద దళితులకు భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములు ఎస్సీ కార్పొరేషన్ తనఖాలో ఉండడంతో వాటిపై కొనసాగుతున్న ఆంక్షలు. సంస్కరణ: ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగింపు నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములు : 22,837 ఎకరాలు విముక్తి పొందిన రైతులు : 22,346 ప్రయోజనం: ఆ భూములపై హక్కులు పొందిన దళిత రైతులు. ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్న రైతుల సమస్యకు పరిష్కారం.గిరిజనులకు డీకేటీ పట్టాలు గిరిజనులు అటవీ ప్రాంతంలోని భూములపై ఫల సాయాన్ని పొందేందుకు వీలుగా వారికి డీకేటీ పట్టాల పంపిణీ. పట్టాలిచ్చిన భూముల విస్తీర్ణం: 39,272;లబ్ధిదారులు: 26,287 – బి ఫణికుమార్, సాక్షి అమరావతి -
రాజధాని కేసుల్లో..బాబుకు జైలే..
సాక్షి, అమరావతి: చట్టాల్ని ఏమార్చి పదుల కేసుల్లో స్టేలు తెచ్చుకొని.. సచ్చిలుడని విర్రవీగిన చంద్రబాబు అవినీతి పుట్ట పగిలింది. మేకవన్నె పులికి మారుపేరైన ఆయన అసలు రూపం కోర్టుల సాక్షిగా సాక్షాత్కారమైంది. ఎంతో నేర్పుగా చేసిన స్కిల్ స్కామ్.. అమరావతి అసైన్డ్ భూ దోపిడీ.. ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం.. ఇలా అవినీతి దందాలతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయాడు. అవినీతి చేశాను.. అయితే నాకు చట్టాలు వర్తించవనే జిత్తులమారి తెలివితేటలతో సెక్షన్ 17–ఏను అడ్డం పెట్టుకొని తప్పించుకుందామన్న పన్నాగం బెడిసికొట్టింది. చంద్రబాబుపై కేసుల్లో నేరం నిరూపితమైతే రాజధాని కుంభకోణం కేసుల్లో యావజ్జీవ ఖైదు తప్పదని న్యాయ నిపుణులు అంటున్నారు. ఒక్కో కేసులో భారీ అవినీతి స్కిల్ స్కామ్: జర్మనీకి చెందిన సీమెన్స్ కంపెనీ పేరిట ఆ కంపెనీకే తెలియకుండా ప్రాజెక్ట్‌ను సృష్టించి స్కిల్ స్కామ్‌కు పాల్పడ్డారు. ఈ కేసులోనే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేయడంతోపాటు న్యాయస్థానం రిమాండ్ విధించగా.. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో 52 రోజలపాటు ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అసైన్డ్ భూదోపిడీ:అమరావతిలో ఏకంగా రూ.5 వేల కోట్ల భూదోపిడీకి పాల్పడ్డారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు స్కామ్: అలైన్మెంట్లో అక్రమాల ద్వారా క్విడ్ ప్రోకోతో రూ.2,500 కోట్ల మేర అవినీతి.. అందుకోసం కేబినెట్ ఆమోదం లేకుండానే జీవోలు జారీ. నోట్ ఫైళ్లపై స్వయంగా చంద్రబాబే సంతకాలు చేసి అక్రమాల కథ నడిపించారు. అనంతరం నోట్ ఫైళ్లను గల్లంతు చేశారు. సీఐడీ ఆ అవినీతిని వెలికి తీయడంతో అతని బాగోతం బట్టబయలైంది. ఈ కుంభకోణాలన్నిటికీ సూత్రధారి చంద్రబాబే అని కీలక సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు నమోదు చేశారు. ఈ కుంభకోణాల్లో చంద్రబాబు ప్రధాన కుట్రదారు, ప్రధాన లబ్ధిదారుడిగా ఉన్నారని డాక్యుమెంటరీ ఆధారాలు, కీలక సాక్షుల వాంగ్మూలాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ కేసుల నుంచి చంద్రబాబు తప్పించుకోవడం ఇక అసాధ్యమని న్యాయ నిపుణుల అభిప్రాయం. కేబినెట్‌కు తెలియకుండా చీకటి జీవోలు చంద్రబాబు అవినీతి విశ్వరూపాన్ని ఛేదించడం అంత తేలిక కాదు. కొన్ని సార్లు తప్పించుకోవచ్చు.. అన్నిసార్లూ తప్పించుకోలేరు.. చివరకు పక్కా ఆధారాలతో దొంగ దొరికాడు. ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు సర్వం తానై కుంభకోణాలకు పాల్పడ్డారు. 2014 నుంచి 2019 వరకు బరితెగించి సాగించిన అన్ని కుంభకోణాల్లోనూ కర్త, కర్మ, క్రియ చంద్రబాబేనని సీఐడీ పూర్తి ఆధారాలతో నిగ్గు తేలి్చంది. కేబినెట్‌కు తెలియకుండా చీకటి జీవోలు జారీ చేసి ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టేశారు. ప్రభుత్వ నిధులు అస్మదీయులకు మళ్లించి.. షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా ఆ డబ్బును విదేశాలకు తరలించారు. అవి హవాలా మార్గంలో తన బంగ్లాకే చేరేలా పక్కా వ్యూహం అమలుచేశారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదు: సుప్రీంకోర్టు స్కిల్ స్కామ్‌లో సీఐడీ దర్యాప్తు చేసి చంద్రబాబును అరెస్ట్ చేశాక విజయవాడ ఏసీబీ న్యాయ స్థానంలో హాజరుపర్చింది. దాదాపు 10 గంటలు ఇరుపక్షాల వాదనల అనంతరం ఆయనకు న్యాయమూర్తిజ్యుడిíÙయల్ రిమాండ్ విధించారు. సీఐడీ అభియోగాలు, అందులో పేర్కొన్న సెక్షన్లతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఈ నిర్ణయం ప్రకటించారు. చంద్రబాబు 52 రోజులపాటు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అనంతరం అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరైంది. సెక్షన్ 17–ఏను వక్రీకరిస్తూ కేసుల నుంచి తప్పించుకునేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 17–ఏ వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సర్వం తానై.. కుట్రదారు, లబ్ధిదారుగా సర్వం తానై చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని సీఐడీ ఆధారాలతో నిగ్గు తేల్చింది. సిŠక్ల్, అసైన్డ్ భూములు, ఐఆర్ఆర్ అలైన్మెంట్ కుంభకోణాల్లో చంద్రబాబును ఏ1గా చేరుస్తూ కేసు నమోదు చేయడంతోపాటు న్యాయస్థానాల్లో చార్జిïÙట్లు దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 120(బి), 166, 167, 418, 420, 465, 468, 471, 477(ఎ), 409, 201, 109 రెడ్‌విత్ 34, 37తోపాటు అవినీతి నిరోధక చట్టం 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద అభియోగాలు నమోదు చేసింది. ఇప్పటికే చంద్రబాబుకు 74 ఏళ్లు. నేరం నిరూపితమై శిక్షలు పడితే యావజ్జీవం తప్పదు. ఇన్నర్ రింగ్ రోడ్, అసైన్డ్ భూముల కేసుల్లో లోకేశ్ నిందితుడిగా ఉన్నారు. నారాయణతోపాటు టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పని చేసిన వారు ఈ కేసుల్లో ఉన్నారు. వారంతా శిక్ష అనుభవించాల్సిందేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ముఖ్యమంత్రిగా ఉంటూ అవినీతికి పాల్పడిన కేసుల్లో హరియాణా మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతాలాకు 16 ఏళ్ల తర్వాత జైలు శిక్ష పడింది. తాజాగా తమిళనాడులో మంత్రిగా చేసిన సెంథిల్ బాలాజీ, మద్యం కేసుల్లో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు ఇప్పటికీ బెయిల్ రాకపోవడాన్ని ప్రస్తావిస్తున్నారు. వేర్వేరుగా శిక్షలు అనుభవించాల్సిందే అత్యంత కీలకమైన సెక్షన్ 409 కింద నేరం నిరూపితమైతే యావజ్జీవం విధిస్తారు. అవినీతి నిరోధక చట్టంలోని 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద నేరం నిరూపితమైతే గరిష్టంగా పదేళ్ల వరకు జైలు శిక్ష.. ఒక్కో కేసులో గరిష్టంగా పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశముంది. ఇతర సెక్షన్ల కేసుల్లో తీర్పులు వేర్వేరుగా వస్తాయి. నేరం నిరూపితమై శిక్ష పడితే చంద్రబాబు వేర్వేరుగా శిక్షలు అనుభవించాలి. -
ఓం భూం స్వాహా!
‘నా పరిశీలనకు వచ్చిన, తెలియవచ్చిన విషయాల్ని ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను’ అని చెబుతూ 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం కుర్చిలో కూర్చున్నాక.. కుట్రలు చేయడంలో, నమ్మిన ప్రజల్ని మోసగించడంలో సిద్ధ హస్తుడైనచంద్రబాబు ఆ ప్రమాణాన్ని నిస్సిగ్గుగా ఉల్లంఘించారు. అత్యంత కీలకమైన రాజధాని రహస్యాన్ని ఎల్లో గ్యాంగ్‌కు లీక్ చేసి సీఎం పదవికే కళంకం తెచ్చారు. అంతర్జాతీయ రాజధాని అంటూ ప్రధానితో పాటు ప్రముఖుల్ని పిలిచి హడావుడి చేసినప్పుడు.. బాబు కుట్రల్ని జనం పసిగట్టలేకపోయారు. ఇదంతా పేదల అసైన్డ్ భూముల స్వాహాకు, ఇన్సైడర్ ట్రేడింగ్ కోసం చంద్రబాబు వేసిన ఎత్తులు, జిత్తులని అప్పుడు వారికి తెలియలేదు. ‘రాజధాని ఫైల్స్’ డ్రామాలో పేద రైతుల అసైన్డ్ భూములను బెదిరించి బినామీల రూపంలోసొంతం చేసుకుని కథ నడిపించారు. ఎవరికీ చెందని ప్రభుత్వ అసైన్డ్ భూములు తమ వారివే అంటూ రికార్డులు సృష్టించి స్వాహా చేశారు. తన పని పూర్తయ్యాక.. గ్రాఫిక్స్ రాజధాని కట్టలేక చేత్తులేత్తేసి ఎన్నికల ముందు కొత్త డ్రామాలు అందుకున్నారు. ఈ డ్రామాలో బాబు బృందంలోనిమంత్రులు, ఎమ్మెల్యేలు...ఆయనకు ఆప్తులు అందరూ పాత్రధారులే.. ‘చేసేది నువ్వు.. చేయించేది నేను..’ రాజధాని ఫైల్స్‌లో చంద్రబాబు డైలాగ్ ఇదే. తెరముందు రాజధాని రూపశిల్పి.. తెరవెనుక రాజధాని లీక్స్ సూత్రధారి. అసలు సూత్రధారులు చంద్రబాబు, లోకేశ్ కాగా.. పాత్రధారులు నారాయణ, లింగమనేని రమేష్, ప్రత్తిపాటి పుల్లారావు, సుజనా చౌదరి, వేమూరి రవికుమార్, మాగంటి మురళీ మోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావు ఇలా 1,336 మంది బినామీలున్నారు. అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్‌తో రూ.లక్షల కోట్ల భూ దందాకు తెగించారు. అసైన్డ్ దోపిడీ, ఇన్సైడర్ ట్రేడింగ్‌లో 1,336 మంది బినామీ ‘బాబు’ల బాగోతం సాక్షి, అమరావతి : అమరావతి భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ చంద్రబాబే. అసైన్డ్ భూములు, ప్రైవేటు భూములు, క్విడ్ ప్రోకో భూములు, బంగ్లాలు.. ఇలా ఒకటేమిటి.. చంద్రబాబు అక్రమ సామ్రాజ్యంలో అన్నీ భాగమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో అక్రమాలతో క్విడ్ ప్రోకో ద్వారా చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌కు 14 ఎకరాలు దక్కాయి. కృష్ణానది కరకట్ట మీద ఉన్న లింగమనేని బంగ్లా ఆయన పరమైంది. ఎస్సీ, ఎస్టీ, రైతులను భయపెట్టి బినామీల పేరిట కొల్లగొట్టిన వందలాది ఎకరాలు చంద్రబాబు ఖాతాలోకే వెళ్లాయి. సింగపూర్ కంపెనీ పేరిట స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులోని భూముల అసలు హక్కుదారూ చంద్రబాబు కుటుంబమే. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌కు ఇరువైపులా, అమరావతి సీడ్ క్యాపిటల్ పరిధి దాటి బినామీల పేరిట కొనుగోలు చేసిన దాదాపు 5 వేల ఎకరాల అసలు యజమాని చంద్రబాబు కుటుంబమే. చినబాబుది పెద్ద వాటానే అమరావతి భూ కుంభకోణంలో లోకేశ్‌ది పెద్ద వాటానే. తన బినామీ, ఎన్నారై వ్యవహారాల సలహాదారుగా వ్యవహరించిన వేమూరి రవికుమార్‌తో పాటు మరికొందరు బినామీల పేరిట వేలాది ఎకరాలు దక్కించుకున్నారు. వేమూరి రవికుమార్‌తోపాటు ఆయన భార్య అనూరాధ గోష్పాది గ్రీన్‌ఫీల్డ్స్ పేరిట అమరావతిలోని కోర్ క్యాపిటల్ ప్రాంతంలోనే 500 ఎకరాలకుపైగా స్వాహా చేశారు. అవినీతి తిమింగలం లింగమనేని అమరావతిలో అవినీతి తిమింగలం లింగమనేని రమేశ్. చంద్రబాబు భూ దోపిడీలో ఇతనూ ఒక ప్రధాన పాత్రధారి. ఆయన కుటుంబానికి చెందిన 355 ఎకరాలను ఆనుకునే ఇన్నర్ రింగ్ రోడ్డు నిరి్మంచేలా అలైన్మెంట్ ఖరారు చేశారు. తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట కొనుగోలు చేసిన వందలాది ఎకరాలను భూ సమీకరణ ప్రక్రియ నుంచి తప్పించారు. అమరావతిలో దాదాపు వెయ్యికి పైగా ఎకరాలు లింగమనేని హస్తగతం చేసుకున్నారు. నారాయణ తంత్రం.. సుజనా, ప్రత్తిపాటి భూదందా చంద్రబాబు తరువాత అమరావతి భూ దోపిడీలో రెండో పెద్ద దోపిడీదారు నారాయణ. లింగమనేని కుటుంబంతో క్విడ్ ప్రో కో లో ప్రధాన పాత్రధారు. కృష్ణా నదికి ఇటువైపు.. అటువైపు, కృష్ణా జిల్లా పరిధిలో ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్‌కు దగ్గరలో వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. అక్కడ నారాయణ విద్యా సంస్థల భూములు ఉన్నాయి. రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా తన ఉద్యోగులను బినామీలుగా చేసి 162 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్, ప్రైవేటు భూములు కలిపి దాదాపు 3 వేల ఎకరాల వరకు బినామీల పేరిట గుప్పిట పట్టారు. నారాయణ బినామీ కంపెనీ రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్‌ది అమరావతి భూ కుంభకోణంలో కీలక పాత్ర. అసైన్డ్ భూముల దోపిడీలో ఆ కంపెనీ ఎండీ అంజనీకుమార్ కీలకంగా వ్యవహరించారు. అమరావతిలో దాదాపు 2 వేల ఎకరాలను బినామీలు, ఉద్యోగుల పేరిట రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ కొల్లగొట్టింది. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు సుజనా చౌదరి అమరావతి భూ దోపిడీలో అతిపెద్ద వాటాదారు. ఆయన తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఏకంగా 700 ఎకరాల వరకు కొల్లగొట్టారు. అమరావతి భూదోపిడీలో బినామీల పేరిట అసైన్డ్ భూములతో సహా 196 ఎకరాలు దోచుకున్నారు. -
మాయోపాయాలు.. బెదిరింపులు
► చంద్రబాబు అల్లిన ‘రాజధాని ఫైల్స్’ డ్రామాలో ట్విస్టుల మీద ట్విస్టులు.. కుట్రల మీద కుట్రలు.. పదేళ్లు అధికారానికి మొహం వాచి.. ఒక్క దెబ్బకు వేల కోట్లు ఎలా కొల్లగొట్టాలో పచ్చ దండు పన్నాగం ఈ డ్రామాకే హైలైట్. రాజధానిగా రోజుకో పేరు తెరపైకి తెచ్చి రియల్టర్లు, సామాన్యులకు నిజంగానే సినిమా చూపించారు. అసలు రాజధాని ఎక్కడో తన పరివారం చెవిలో బాబు ముందే ఊదేయడంతో అమరావతి ప్రాంతంలో పచ్చదండు వాలి గద్దల్లా భూములు తన్నుకెళ్లింది. ఇతర ప్రాంతాల్లో భూములు కొన్న రియల్టర్లు, సామాన్యులు ఘొల్లుమంటే.. బాబు అనుచరగణం పండుగ చేసుకుంది. ► విభజనతో తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన చంద్రబాబు.. రావడమే రాజధాని పాటందుకున్నారు. సింగపూర్‌ను తలదన్నేలా రాజధానిని కట్టేస్తాను.. బడుగుల బతుకుల్ని బాగుచేస్తానంటే నిజమనుకున్నారు. తెరవెనుక ఆ బడుగుల భూములపై కన్నేసిన చంద్రబాబు పన్నాగాన్ని వారు పసిగట్టలేకపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పేదలు తేరుకునేలోపు వారి అసైన్డ్ భూముల్ని బినామీల రూపంలో గద్దల్లా తన్నుకుపోయారు. కుట్రలను పక్కాగా అమలు చేయడంలో సిద్ధహస్తుడైన చంద్రబాబు భూదాహానికి బలయ్యింది నిరుపేద రైతులే.. ► రూ.3,737.30 కోట్ల విలువైన 617.70 ఎకరాల భూ దోపిడీ సమిధలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే సాక్షి, అమరావతి : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలంటే చులకన భావన అడుగడుగునా జీర్ణించుకున్న చంద్రబాబు కన్ను వాళ్ల భూములపై పడింది. కేటగిరీ 1 నుంచి 4 కింద వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల అసైన్డ్ భూములను అడ్డగోలుగా కాజేయడానికి చట్టాన్ని తన చుట్టంగా మలచుకుని కోర్టులను కూడా బురిడీ కొట్టించారు. రాజధానిలో 617.70 ఎకరాల అసైన్డ్ భూ దోపిడీలో రూ.3,737.30 కోట్లను స్వాహా చేసి దేశ చరిత్రలోనే అతిపెద్ద భూకుంభకోణానికి పాల్పడ్డారు. అసైన్డ్ భూముల పరిరక్షణ కోసం చేసిన అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి భూముల్ని చెరబట్టారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదల భూముల దోపిడీకి రోడ్ మ్యాప్ ముందుగానే సిద్ధం చేసుకున్నారు. భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జీవో నెంబరు 1 జారీ చేశారు. అందులో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ఇస్తామని, అసైన్డ్ భూములకు ప్యాకేజీ లేదని ముందుగా సిద్ధం చేసుకున్న ప్లాన్‌ను బయటపెట్టారు. అప్పుడే చంద్రబాబు, నారాయణ బినామీలైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి ఏజెంట్లు రంగంలోకి దూకారు. తమకు అసైన్డ్ భూములు విక్రయిస్తే ఎంతో కొంత డబ్బులొస్తాయని, లేదంటే భూములు కోల్పోతారని భయపెట్టారు. దీంతో ఆందోళనకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద రైతులు ఎకరా కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే అసైన్డ్ భూములను బాబు బినామీలకు సేల్ డీడ్ ద్వారా విక్రయించారు. అనంతరం వాటిని ఆరు కేటగిరీలుగా విభజిస్తూ భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016 ఫిబ్రవరి 17న జీవో నెంబరు 41 జారీ చేశారు. వాటికి భారీ ప్యాకేజీ దక్కేలా చూసుకున్నారు. రాజధానిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీ పేద రైతులకు స్థానం లేకుండా చేశారు. అధికారుల అభ్యంతరాలూ బేఖాతరు అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించడానికి వీల్లేదు. 1954కు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు పంపిణీ చేసిన భూములు మాత్రమే ఇతరులకు విక్రయించుకోవచ్చు. ఆ విషయాన్ని రె వెన్యూ ఉన్నతాధికారులతో పాటు అడ్వకేట్ జన రల్ సైతం గుర్తిస్తూ భూసమీకరణ ప్యాకేజీని వ్యతిరేకించారు. ఉన్నతాధికారులు తాము చెప్పినట్లు చేయాల్సిందేనని చంద్రబాబు, నారా యణ హుకుం జారీ చేశారు. కోర్టుల్ని బురిడీ కొట్టించి.. అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఏకంగా కోర్టునే మోసం చేశారు. అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను చంద్రబాబు, నారాయణ మాయం చేశారు. 1954 తరువాత భూపంపిణీ రికార్డులు ఏమీ లేవని కోర్టుకు నివేదిక ఇచ్చారు. 1954 తరువాత చాలాసార్లు పేదలకు అసైన్డ్ భూ ములు పంపిణీ చేశారు. వైఎస్సార్ ప్రభుత్వ హ యాంలో 2004–05లో అసైన్డ్ భూములు పంపిణీ చేశారు. ఆ రికార్డులు మాయం చేశారు. అసైన్డ్ భూ ముల్లో 1954 తరువాత పంపిణీ చేసిన భూము లు ఉన్నాయన్న విషయం సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. ఇలా 617.70 ఎకరాల అసైన్డ్ భూములు చంద్రబాబు, నారాయణలు బినామీల పేరిట దోపిడీ చేశారు. ఈ భూములకు ప్యాకేజీ ద్వారా వారి గ్యాంగ్ ఏకంగా రూ.3,737.30 కోట్లు కొల్లగొట్టింది. పచ్చ కుట్ర బట్టబయలు ప్రభుత్వ అసైన్డ్ భూముల కేటగిరీ 5, 6లో చూపించిన 522 మంది రైతుల్లో ఒక్కరూ అసలు అమరావతి గ్రామాల్లోనే లేరన్న నిజం సిట్ దర్యాప్తులో బృందాన్ని నివ్వెరపరిచింది. కేవలం భూసమీకరణ ప్యాకేజీ కింద రాజధానిలో అత్యంత విలువైన స్థలాలను కొల్లగొట్టేందుకే చంద్రబాబు ముఠా ఈ పన్నాగానికి పాల్పడిందన్నది ఆధారాలతో సహా తేటతెల్లమయింది. ప్రభుత్వ భూములకు ఎసరు ప్రభుత్వ అసైన్డ్ భూములను దర్జాగా దోచేశారు. 29 గ్రామాల పరిధిలోని ప్రభుత్వ స్థలాలు తమ బినామీలైన ప్రైవేటు వ్యక్తుల అనుభవంలో ఉన్నాయని తప్పుడు రికార్డులు సృష్టించి వాటిని గుప్పిట పట్టారు. ఏకంగా 328 ఎకరాల ప్రభుత్వ భూమిని 522 మంది బినామీల పేరిట చూపిస్తూ హస్తగతం చేసుకున్నారు. భూసమీకరణ ప్యాకేజీలో రూ.760.25 కోట్లు కొల్లగొట్టారు. ప్రభుత్వ భూములన్నీ గుర్తు తెలియని వ్యక్తుల ఆ«దీనంలో ఉన్నట్టుగా రికార్డుల్లో చూపించారు. అందుకోసం అసైన్డ్ భూముల జాబితాను 5, 6 కేటగిరీలుగా పేర్కొన్నారు. అన్యాక్రాంతమైనప్పటికీ అభ్యంతరాలు లేని భూములను కేటగిరీ 5గా, అన్యాక్రాంతమైన, అభ్యంతరాలు ఉన్న భూములను కేటగిరీ 6గా చూపిస్తూ జీవో 41 జారీ చేశారు. కేటగిరీ 5లో 237.60 ఎకరాలు గుర్తించారు. ఆ భూములన్నీ 295 మంది ఆదీనంలో ఉన్నట్లుగా చూపించారు. కేటగిరీ–6లో 90.52 ఎకరాలు చూపి అవి 227 మంది స్వా«దీనంలో ఉన్నట్టు కనికట్టు చేశారు. వాస్తవానికి అవి ఎవరి ఆధీనంలోనూ లేవు. -
భూ బకాసురుడు!
తమ సొమ్ము సోమవారం.. ఒంటి పొద్దులుంటారు.. మంది సొమ్ము మంగళవారం... ముప్పొద్దుల తింటారు..అనే నానుడి చంద్రబాబు నాయుడికి అక్షరాలా సరిపోతుంది. శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లు విశాఖపట్నం, దొనకొండ, తిరుపతి, శ్రీకాళహస్తిల్లో ఎక్కడో ఒక చోట రాజధానిని ఏర్పాటు చేస్తే తనకు మిగిలేదేముండదనే దురాలోచన బాబు మెదడులో మొలకెత్తింది. ఇంకేముంది.. ఆ 29 గ్రామాల ప్రాంతంలో మూడు పంటలు పండే జరీ భూములపై కన్నేశారు. ఈ క్రమంలో తన సహచరుడు పొంగూరు నారాయణను ముందు పెట్టి సరికొత్త డ్రామాకు తెరలేపారు. తన పరివారం చెవిలో అసలు రాజధాని ఎక్కడొస్తుందో చెప్పేశారు. వారి ద్వారా ఆ ప్రాంతంలో భూములు కొనిపించి, ఆ భూములకు కోట్ల విలువ వచ్చేలా కుట్ర పన్నారు. బాబు అమరావతి నాటకంలో అసైన్డ్ భూముల్ని కోల్పోయిన ఎస్సీ, ఎస్టీ, బీసీలు సమిధలయ్యారు. బాబు అండ్ కో మాత్రం లక్షల కోట్ల విలువైన భూ కుంభకోణానికి పాల్పడింది. సాక్షి, అమరావతి: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్‌లో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలనే విషయాన్ని నిర్ణయించేందుకు కేంద్ర ప్రభుత్వం శివరామకృష్ణన్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి... భూముల లభ్యత, వ్యవసాయ అవసరాలు, భవిష్యత్తు ప్రయోజనాలను శాస్త్రీయంగా విశ్లేషించి సహేతుకమైన సిఫార్సులు చేసింది. ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, ప్రకాశం జిల్లాలోని దొనకొండ, రాయలసీమలోని తిరుపతి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఎక్కడైనా రాజధానిని ఏర్పాటు చేయవచ్చని సూచించింది. 2014లో అధికారంలోకి వచి్చన చంద్రబాబు.. శివరామకృష్ణన్ కమిటీ సిఫార్సులను బుట్టదాఖలు చేశారు. తన బినామీ, సన్నిహితుడైన మంత్రి పొంగూరు నారాయణ నేతృత్వంలో మరో కమిటీని నియమించి.. పలు నాటకీయ పరిణామాల మధ్య రాజధానిగా అమరావతిని ఖరారు చేశారు. సామాన్య రియల్టర్లను ముంచిన బాబు... అమరావతిలో భూ దోపిడీకి పాల్పడటానికి ముందు రాజధాని లీక్స్ పేరిట చంద్రబాబు రాష్ట్రంలోని సామాన్య రియల్టర్లు, సాధారణ ప్రజలను బురిడీ కొట్టించారు. రాజధానిగా ఏలూరు అని ఓసారి... నూజివీడు అని మరోసారి... కాదు కాదు... నాగార్జున యూనివర్సిటీ సమీపంలో అని ఇంకోసారి ప్రచారంలోకి తీసుకువచ్చారు. తన ఎల్లో మీడియా ద్వారా ఉద్దేశ పూర్వకంగా లీకులు ఇప్పించి వార్తలు రాయించారు. ఆ పచ్చమాటలు నమ్మి సాధారణ రియల్టర్లు అప్పులు చేసి మరీ ఆ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేశారు. మధ్య, ఎగువ మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు కొద్దికొద్దిగా పొదుపు చేసిన మొత్తాలతో అక్కడ స్థలాలు కొన్నారు. చివరికి చంద్రబాబు ఆ మూడు ప్రాంతాల్లో కాకుండా గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాలను రాజధాని ప్రాంతంగా ఎంపిక చేసి అమరావతి అని నామకరణం చేశారు. చంద్రబాబు కుట్రను గ్రహించలేక ఏలూరు, నూజివీడు, నాగార్జున యూనివర్సిటీ సమీప ప్రాంతాల్లో వేలాది ఎకరాలను కొనుగోలు చేసిన రియల్టర్లు వందల కోట్ల రూపాయలు నష్టపోయి నిండా మునిగారు. వారిలో కొందరు ఆత్మహత్యలకు పాల్పడటం అందరినీ కలచివేసింది. ముందస్తు పన్నాగంతోనే... ► చంద్రబాబు పక్కా పన్నాగంతోనే గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల చుట్టుపక్కల ఆయన, తన సన్నిహితులు, బినామీలు అతి తక్కువ ధరలకు వేలాది ఎకరాలను కొనుగోలు చేశారు. అనంతరం ఆ ప్రాంతాన్ని రాజధానిగా టీడీపీ ప్రభుత్వం ప్రకటించే సరికి ఆ ప్రాంతంలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. తద్వారా కేవలం రాజధాని ప్రకటనతోనే చంద్రబాబు రూ.లక్ష కోట్ల భూ దోపిడీకి పాల్పడ్డారు. ► రాజధాని కోసం భూ సమీకరణ పేరిట చంద్రబాబు బరితెగించి రైతుల భూములపై దండయాత్రకు పాల్పడ్డారు. రైతులను మభ్య పెట్టి వారి భూములు కొల్లగొట్టడం... అసైన్డ్ భూముల దోపిడీ... ప్రభుత్వ భూముల కబ్జా... లంక భూముల ఆక్రమణ... ఇలా యథేచ్ఛగా దోపిడీకి బరితెగించారు. తద్వారా మరో రూ.లక్ష కోట్ల భూకుంభకోణానికి పాల్పడిన చంద్రబాబు తానొక భూబకాసురుడినని నిరూపించుకున్నారు. ► అమరావతి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయభ్రాంతులకు గురి చేసి, వారి అసైన్డ్ భూములను చంద్రబాబు ముఠా కొల్లగొట్టింది. భూ సమీకరణ కింద అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వబోమని బెదిరించి.. వాటినీ చెరబట్టింది. తర్వాత ఆ భూములకు భూ సమీకరణ ప్యాకేజీ ప్రకటించడం ద్వారా చంద్రబాబు ప్రభుత్వ అధినేత హోదాలోనే దాదాపు 1,500 ఎకరాల అసైన్డ్, ప్రభుత్వ, లంక భూముల దోపిడీకి పాల్పడ్డారు. సింగపూర్ ముసుగులో స్విస్ చాలెంజ్ ► రాజధాని ప్రాంతంలో స్టార్టప్ ఏరియా అభివృద్ధి పేరిట చంద్రబాబు అంతర్జాతీయ భూ కుంభకోణానికి తెరతీశారు. సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపిన స్విస్ చాలెంజ్ విధానం ద్వారా భారీ కుంభకోణానికి తెగబడ్డారు. ► సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం అని చెబుతూ... తన సన్నిహితుడైన సింగపూర్ మంత్రికి చెందిన ప్రైవేటు కంపెనీతో వ్యవహారం నడిపారు. రైతుల నుంచి సేకరించిన భూమిని సింగపూర్ కంపెనీకి అప్పగించి ప్రభుత్వమే రూ.5 వేల కోట్లతో మౌలిక వసతులను అభివృద్ధి చేస్తే.. సింగపూర్ కంపెనీ స్టార్టప్ ఏరియాను అభివృద్ధి చేస్తుందనే ఓ మాయామోహ ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు. ► భూములు, నిధులు కలి్పస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి 48 శాతం వాటా... సింగపూర్ కంపెనీకి 52 శాతం వాటా కల్పించేలా ఒప్పందాన్ని ఖరారు చేశారు. సింగపూర్ కంపెనీ ముసుగులో తమ కుటుంబం గుప్పిట్లోనే స్టార్టప్ ఏరియా ఉండేలా చంద్రబాబు కుతంత్రం రచించి రూ.66 వేల కోట్ల దోపిడీకి పన్నాగం పన్నారు. ► కట్టని రాజధాని... అమరావతిలో నిరి్మంచని ఇన్నర్ రింగ్ (ఐఆర్ఆర్) రోడ్డు పేరిట చంద్రబాబు, నారాయణ ద్వయం తమ భూముల ధరలను అమాంతం పెంచేలా కుట్ర పన్నింది. ఇందుకు లింగమనేని రమేశ్ కుటుంబంతో క్విడ్ ప్రో కోకు పాల్పడింది. ► లింగమనేని, చంద్రబాబు, నారాయణ కుటుంబాలకు చెందిన భూములను ఆనుకుని నిరి్మంచేలా ఐఆర్ఆర్ అలైన్‌మెంట్‌ను అష్ట వంకర్లు తిప్పింది. తద్వారా కృష్ణా నదికి అటు వైపు, ఇటువైపు ఉన్న తమ భూముల విలువ రూ.2 వేల కోట్లకుపైగా పెరిగేలా స్కెచ్ వేసింది. లింగమనేని కుటుంబానికి అడ్డగోలుగా ప్రయోజనం కలి్పంచినందుకు ప్రతిఫలంగా ఆ కుటుంబం నుంచి చంద్రబాబుకు కరకట్ట నివాసం, హెరిటేజ్ ఫుడ్స్‌కు భూములను పొంది క్విడ్ ప్రో కోకు పాల్పడ్డారు. నిర్మాణాలు తాత్కాలికం.. దోపిడీ శాశ్వతం ► మిడతల దండు దాడి చేసి పచ్చని పంటలను నాశనం చేసినట్టు చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రభుత్వంలో మంత్రులు, టీడీపీ నేతలు, వారి బినామీలు అమరావతి భూములపై దాడికి తెగబడ్డారు. చంద్రబాబు, లోకేశ్‌లతో పాటు టీడీపీ నేతలు, నారాయణ, సుజనా చౌదరి, ప్రత్తిపాటి పుల్లారావు, మాగంటి మురళీమోహన్, కొమ్మాలపాటి శ్రీధర్, కోడెల శివప్రసాద్ కుమారుడు శివరామకృష్ణ, ధూళిపాళ్ల నరేంద్ర, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ వియ్యంకుడు ఎంఎస్పీ రామారావులతో కూడిన పచ్చ దండు భూములను కొల్లగొట్టింది. ► అమరావతిలో తాత్కాలిక రాజధాని భవనాల ముసుగులో టీడీపీ ప్రభుత్వ పెద్దలు అడ్డూ అదుపూ లేకుండా అవినీతికి పాల్పడ్డారు. శాసన మండలి, సచివాలయం, విభాగాధిపతుల భవనాలు, ఇతర నిర్మాణాల పేరిట అస్మదీయులకు అడ్డగోలుగా కాంట్రాక్టులు కట్టబెట్టారు. అంచనా వ్యయం కంటే భారీగా అధిక శాతానికి టెండర్లు ఖరారు చేసి భారీగా కమిషన్లు దండుకున్నారు. కాంట్రాక్టు సంస్థలు అత్యంత నాసిరకంగా తాత్కాలిక రాజధాని భవనాలను నిర్మించి చేతులు దులుపుకున్నాయి. చిన్నపాటి చినుకులకే కారిపోయేలా.. ఎక్కడికక్కడ పెచ్చులు, ఫ్లోరింగ్ ఊడిపోతూ ఉన్న ఆ భవనాలు చంద్రబాబు ప్రభుత్వ అవినీతికి అద్దం పడుతున్నాయి. ► రైతులను మభ్యపెట్టి తీసుకున్న అమరావతిలోని భూములను చంద్రబాబు తన అస్మదీయులకు అడ్డగోలుగా కేటాయించేశారు. ప్రభుత్వ రంగ సంస్థల భవనాలకు అధిక ధరలకు భూములు కేటాయించిన టీడీపీ ప్రభుత్వం.. ఆ పారీ్టకి సన్నిహితులైన ప్రైవేటు, కార్పొరేట్ సంస్థలకు మాత్రం కారుచౌకగా భూములు కేటాయించడం చంద్రబాబు వంటి కుంభకోణాల సామ్రాట్‌కే సాధ్యమైంది. -
బుద్వేల్ భూమి కోసం భారీ లాబీయింగ్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లలోని బుద్వేల్‌లో ఉన్న 26 ఎకరాల భూమిని కాజేయడానికి వెస్సెల్లా గ్రూప్ సీఈఓ, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి లాబీయింగ్ చేసినట్లు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీ ఎన్.శ్వేత బుధవారం తెలిపారు. దాని ఫలితంగానే అప్పట్లో ఎమ్మార్వోకు సాధారణ మెమో జారీ అయిందని, దీని ద్వారానే ఆ భూముల కన్వర్షన్ జరిగిందని వివరించారు. తన అనుచరులతో కలిసి శివానందరెడ్డి చేసిన కుట్ర, అసైన్డ్ భూములు ఖరీదు చేయడం వంటి ఆరోపణలపై సీసీఎస్‌లో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయని చెప్పారు. వీటిపై విచారించేందుకు సోమవారం అల్లూరు వెళ్లగా... శివానందరెడ్డి పారిపోయారని డీసీపీ వివరించారు. ఈ కేసులు, వాటి పూర్వాపరాలపై బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. రియల్టర్ల కన్ను..అసైనీలకు దగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 1994లో బుద్వేల్లోని సర్వే నం.282 నుంచి 299 వరకు ఉన్న 281 ఎకరాల భూములను 66 మందికి అసైన్ చేసింది. వీరికి రాజేంద్రనగర్ మండల అధికారులు అసైనీ పాస్ పుస్తకాలను సైతం జారీ చేశారు. ఆ తర్వాత మరో 82 మంది అక్కడ మిగిలి ఉన్న భూమిని ఆక్రమించారు. 2000లో అసైనీలు తమ భూములను ఎస్కే డెవలపర్స్ సంస్థకు లీజుకు ఇచ్చారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో రెవెన్యూ అధికారులు అసైన్మెంట్ పట్టాలు రద్దు చేశారు. చేవెళ్ల ఆర్డీఓ ఆ భూమిని నిబంధనల ప్రకారం హెచ్ఎండీఏ, పర్యాటక శాఖలకు అప్పగించారు. దీన్ని సవాల్ చేస్తూ అసైనీలు గుంటి నర్సింçహులు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపి కేసు పరిష్కరించాలంటూ చేవెళ్ల ఆర్డీఓను కోర్టు ఆదేశించింది. దీంతో అసైనీలు ఆర్డీఓకు వివరణ ఇచ్చినా.. దాన్ని ఆయన తిరస్కరించారు. ఆర్డీఓ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ 2002లో అసైనీలు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఇదిలా ఉండగా.. అదే భూమిని అభివృద్ధి చేసి, తమకు ప్లాట్లు ఇవ్వాలంటూ అసైనీలు ప్రభుత్వానికి విన్నవించారు. దీనిపై సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకోక ముందే దీన్ని క్యాష్ చేసుకోవడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు టీజే ప్రకాష్, కోనేరు గాం«దీ, దశరథ రామారావు రంగంలోకి దిగారు. అసైనీలతో పాటు ఇతరులను సంప్రదించారు. అసైనీలకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చేలా తాము ప్రభుత్వ అధికారులతో పాటు రాజకీయ నాయకులను మ్యానేజ్ చేస్తా మని నమ్మబలికారు. ఇది నమ్మిన అసైనీలు వీరితో అగ్రిమెంట్లు, ఎంఓయూలు చేసుకున్నారు. వాటిని చూపించిన ఈ ముగ్గురూ ఆ స్థలం అమ్ముతామంటూ కొందరి నుంచి డబ్బు వసూలు చేసి మోసం చేశారు. దీంతో బాధితుల ఫిర్యాదు మేరకు సీసీఎస్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. ప్రకా‹Ù, గాం«దీ, రామారావు 2021లో రియల్ ఎస్టేట్ బ్రోకర్ దయానంద్‌ను సంప్రదించి అసైనీలు ప్లాట్లు పొందేలా సహకరించాలని కోరారు. ఇతడి ద్వారానే టీజే ప్రకాష్ మాజీ పోలీసు అధికారి, వెస్సెల్లా గ్రూపు సీఈఓ మాండ్ర శివానందరెడ్డిని సంప్రదించారు. రియల్టర్లకు శివానందరెడ్డి ఎర బుద్వేల్ భూమి పూర్వాపరాలు తెలిసిన ఆయన తన çపలుకుబడి వినియోగించి సమస్య పరిష్కరిస్తానని చెప్పారు. ఆ 26 ఎకరాల భూమి తానే తీసుకుంటానని, చదరపు గజానికి రూ.12 వేల చొప్పున ఇస్తానని ఎర వేశాడు. 2021–22 మధ్య కాలంలో అసైనీలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు చెక్కుల రూపంలో చెల్లించారు. కన్వర్షన్ కోసం ముమ్మర యత్నం అసైన్డ్ ల్యాండ్ కన్వర్షన్ కోసం శివానందరెడ్డి తదితరులు 2022–23 మధ్య కాలంలో లాబీయింగ్ చేశారు. దీని ఫలితంగా అసైనీలు, ఆక్రమణదారులకు కన్వేయన్స్ డీడ్స్ ద్వారా అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించాలంటూ రాజేంద్రనగర్ ఎమ్మార్వోకు ఓ సాధారణ మెమో జారీ అయింది. దీంతో గతేడాది ఏప్రిల్–సెపె్టంబర్ మధ్య కన్వేయన్స్ డీడ్స్ జరిగాయి. వీటి ఆధారంగా అసైనీలు, ఆక్రమణదారులు ఆ భూమిని ఏ అండ్ యూ ఇన్ఫ్రా పార్క్, వెస్సెల్లా గ్రీన్ కంపెనీలకు చెందిన శివానందరెడ్డి, ఆయన భార్య ఉమాదేవి, కుమారుడు కినిష్కలతో పాటు ప్రశాంత్‌రెడ్డిలకు రిజి్రస్టేషన్ చేశారు. ఇలా శివానందరెడ్డి తదితరులు అసైనీలను భయపెట్టి, ప్రభుత్వ ఉత్తర్వులు, మంత్రివర్గం ఆమోదం లేకుండా అసైన్డ్ భూములు లాక్కోవడానికి కుట్ర పన్నారు. -
పోలీసు భూమిపై మాజీ పోలీస్ భార్య కన్ను
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ ల్యాండ్స్ స్కామ్, ప్రీలాంచ్ ఆఫర్స్ పేరుతో మోసాలకు పాల్పడిన కేసులో హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసుల నుంచి తప్పించుకుపోయిన ఏపీలోని నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ పోలీసు అధికారి మాండ్ర శివానందరెడ్డి భార్య ఉమాదేవిపై మరో కేసు కూడా ఉంది. మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ విభాగం గ్రేహౌండ్స్‌కు చెందిన భూమిపై ఆమె కన్నేశారు. తన సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిసి కాజేయడానికి కుట్ర పన్నారు. రెవెన్యూ అధికారుల ఫిర్యాదుతో సీసీఎస్ పోలీసులు గతంలో కేసు నమోదు చేశారు. దీన్ని దర్యాప్తు చేసిన అధికారులు నిందితులపై సప్లిమెంటరీ చార్జ్‌షిట్ ఫైల్ చేశారు. శివానందరెడ్డికి సంబంధించిన తాజా ఎపిసోడ్ నేపథ్యంలో ఈ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఇందులో త్వరలో పూర్తిస్థాయి అభియోగ పత్రాలు దాఖలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేహౌండ్స్ ఆధీనంలోనే ఉన్న ఆ భూమి మార్కెట్ విలువ రూ.2,500 కోట్లకు పైనే ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. తాజా కేసులో శివానందరెడ్డితో పాటు ఆయన భార్య ఉమాదేవి కూడా నిందితురాలిగా ఉన్న విషయం విదితమే. 1993లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్) గండిపేట మండలం మంచిరేవుల గ్రామంలో ఉన్న సర్వే నంబర్ 393/1 నుంచి 392/20 వరకు ఉన్న భూమిని గ్రేహౌండ్స్‌కు కేటాయించింది. మొత్తం 142 ఎకరాల 39 కుంటల విస్తీర్ణంలో ఉన్న ఈ భూమి అప్పటి నుంచి గ్రేహౌండ్స్ ఆధీనంలోనే ఉంది. అ స్టే ఉత్తర్వులు ఉన్నా.. కాగా.. ఈ భూమిని 1961లో ప్రభుత్వం తమకు కేటాయించిందంటూ 20 మంది అసైనీలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం దీనిపై న్యాయస్థానం విధించిన స్టేటస్ కో (యధాత«థ స్థితి) ఉత్తర్వులు కొనసాగుతున్నాయి. ఓ దశలో ఈ వివాదాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. హైకోర్టులోనే తేల్చుకోవాలంటూ ఆ న్యాయస్థానం స్పష్టం చేయడంతో స్టేటస్ కో కొనసాగుతోంది. ఈ వివాదాల నేపథ్యంలో ఉమాదేవి తన సమీప బంధువు ఆరోగ్యరెడ్డితో కలిసి రంగంలోకి దిగారు. యూ అండ్ ఏ పేరుతో ఉన్న కంపెనీ ముసుగులో కథ నడిపారు. ఆ భూమికి సంబంధించిన అసైనీల వారసుల పేరుతో కొందరి నుంచి తమ కంపెనీ పేరుతో ఒప్పందాలు చేసుకున్నారు. ఎకరం రూ.4 కోట్లకు బేరమాడుకుని, రూ.8 లక్షల చొప్పున అడ్వాన్స్ చెల్లిస్తూ అనేక మంది వారసులతో ఒప్పందాలు చేసుకున్నారు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఆ భూములపై హక్కు పొందేందుకు తమవేనంటూ జీపీఓ కూడా చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రేహౌండ్స్ ఉన్నతాధికారులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రాథమిక విచారణ అనంతరం వారు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సర్కారు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో రాజేంద్రనగర్ రెవెన్యూ అధికారులు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉమాదేవి, ఆరోగ్యరెడ్డి తదితరులు గ్రేహౌండ్స్ స్థలం కాజేయడానికి కుట్ర పన్నారని ఆరోపిస్తూ పోలీసులు ఐపీసీ 406, 420, 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. నేరం జరిగినట్టు నిర్ధారణ కావడంతో ఉమాదేవి, ఆరోగ్యరెడ్డితో పాటు అసైనీ వారసులుగా చెప్పుకుని ఒప్పందాలు చేసుకున్న 60 మందికి సీసీఎస్ పోలీసులు సీఆరీ్పసీ 41ఏ కింద నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు తుది దశకు చేరిన నేపథ్యంలో ఉమాదేవి సహా మరికొందరిపై సప్లిమెంటరీ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంలోనూ తెరవెనుక శివానందరెడ్డి పాత్ర ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. భూ వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఆ భూమి ప్రభుత్వానిదే అని, సర్కారే గ్రేహౌండ్స్‌కు కేటాయించడంతో ప్రస్తుతం ఆ విభాగానికి చెందినదే అంటూ తీర్పు కూడా ఇచ్చింది. అరెస్టులు వద్దు మరోవైపు బుద్వేల్ అస్సైన్డ్ భూముల కబ్జా కేసులో తదుపరి విచారణ వరకు నంద్యాల టీడీపీ అభ్యర్థి, మాజీ ఎస్పీ శివానందరెడ్డి, అతని భార్య ఉమాదేవి, కుమారుడు కని‹Ù్కలను అరెస్టు చేయవద్దని సీసీఎస్ పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బుద్వేల్‌లో 26 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయించారన్న ఆరోపణలపై శివానందరెడ్డితోపాటు ఉమాదేవి, కనిష్క్(నిందితులు)లపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి 8వ తేదీ వరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించారు. -
518 ఎకరాలు.. హాంఫట్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: అవి పంటలు పండించుకుని జీవనాధారం పొందేందుకు పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములు.. క్రయ విక్రయాలు, వ్యవసాయేతర పనులు చేయడానికి వీల్లేని భూములు.. కానీ ధరణి పోర్టల్‌లో రికార్డులను తారుమారు చేశారు. అసైన్డ్ భూములను పట్టా భూములుగా మార్చేశారు. దీనితో ఒకటీ, రెండూ కాదు.. ఏకంగా 518 ఎకరాల అసైన్డ్ భూములు బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపో యాయి. సంగారెడ్డి జిల్లా కంది మండలంలో చోటుచేసుకున్న ఈ భూదందా.. తాజాగా ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ సందర్భంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండటం, రెండు జాతీయ రహదారులు, ఐఐటీ ఉండటంతో కంది మండలంలో భూముల ధర ఎకరా రూ.ఐదు కోట్ల వరకు పలుకుతోంది. అంటే అక్రమాలు జరి గిన 518 ఎకరాల భూముల విలువ రెండున్నర వేల కోట్లకుపైనే ఉంటుందని అంచనా. 11 గ్రామాల పరిధిలో.. సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ భూముల వెరిఫి కేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములున్నాయి, ఎక్కడైనా అన్యా క్రాంతం అయ్యాయా? వాటి రికార్డుల పరిస్థితే మిటనే అంశాలను పరిశీలిస్తున్నారు. ఇద్దరు అదనపు కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ స్థాయి అధికారులకు ఒక్కో మండలం చొప్పు న బాధ్యతను అప్పగించారు. ఈ క్రమంలోనే కంది మండలం పరిధిలోని 11 గ్రామాల్లో 518 ఎకరాల అసైన్డ్ భూములను పట్టా భూము లుగా రికార్డులను మార్చేసినట్టు తేలింది. అత్య ధికంగా బ్యాతోల్‌లో 181 ఎకరాలు, చిద్రుప్ప లో 154 ఎకరాలు, జుల్కల్లో 57 కాశీపూర్‌లో 41 ఎకరాలు, ఉత్తర్‌పల్లిలో 17 ఎకరాలు మిగ తాచోట్ల కలిపి 68 ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను మార్చేసినట్టు గుర్తించారు. ఈ మండలంలో మొత్తం 17 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. మరో ఆరు గ్రామాల రికార్డులను వెరిఫికేషన్ చేయాల్సి ఉంది. వాటిలోనూ తని ఖీ పూర్తయితే.. మరిన్ని అక్రమాలు వెలుగు లోకి వస్తాయని అధికారులు చెప్తున్నారు. ధరణి పోర్టల్‌లో మార్చేసి.. అధికారులు, దళారులు కుమ్మక్కై ధరణి పోర్ట ల్ను ఆసరాగా చేసుకుని ఈ భూదందాకు తెరలేపారు. అసైన్డ్భూములను ధరణి పోర్టల్‌లో పట్టా భూము లుగా మార్చేశారు. ఈ మేరకు పట్టాదారు పాసు పుస్తకాలు కూడా జారీ చేశారు. తర్వాత ఆ పాసు పుస్తకాల ఆధారంగా.. చాలావరకు భూముల క్రయవిక్రయాలు చేతులు మారాయి. బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోయాయి. రాజకీయ నేతలు, బడాబాబులకు భూములు దక్కేలా చేసిన కొందరు రెవెన్యూ అధికారులు భారీగా దండుకున్నారని.. కోట్లకు పడగలెత్తారని ఆరోపణలు ఉన్నాయి. వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది కలెక్టర్ ఆదేశాల మేరకు కంది మండలంలో ప్రభుత్వ భూముల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టాం. భూములకు సంబంధించిన రికా ర్డులను క్షుణ్నంగా పరిశీలిస్తున్నాం. అసైన్డ్ భూములను పట్టాభూములుగా మార్చి నట్టు గుర్తించాం. అన్ని గ్రామాల్లో వెరిఫి కేషన్ పూర్తిచేసి నివేదిక ఇస్తాం. – విజయలక్ష్మి, కంది మండల తహసీల్దార్. -
బడుగుల భూచోరుడు చంద్రబాబే..
రాజధాని పేరిట అమరావతిలో చోటుచేసుకున్న భూదోపిడీకి కర్త, కర్మ, క్రియ అంతా చంద్రబాబు ముఠానేనని సీఐడీ తేల్చింది. ఈ కేసులో ఏ–1గా చంద్రబాబు, ఏ–2గా నారాయణలతోపాటు పలువురిపై విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సోమవారం చార్‌్జషీట్ కూడా దాఖలు చేసింది. ఐపీసీ సెక్షన్లు 420, 409, 506, 166, 167, 217, 120 (బి), 109 రెడ్‌విత్ 34, 35, 36, 37.. ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్లు 3(1),(జి), 3(2), అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2) రెడ్‌విత్ 13(1), (సి), (డి) కింద వారిపై అభియోగాలు నమోదు చేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి పరిధిలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల అసైన్డ్ భూములను చంద్రబాబు బ్యాచ్ కొల్లగొట్టిందన్నది ఆధారాలతో సహా సీఐడీ వెలుగులోకి తీసుకొచి్చన విషయం తెలిసిందే. కేంద్ర అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టాన్ని ఉల్లంఘించి మరీ సాగించిన ఈ భూబాగోతం యావత్ దేశాన్ని విస్మయపరిచింది. ఏకంగా రూ.4,400 కోట్లు విలువైన 1,100 ఎకరాల అసైన్డ్ భూములను చంద్రబాబు, నారాయణ తమ బినావీులు, సన్నిహితుల పేరిట గుప్పెట పట్టారన్నది సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణలో తేలింది. జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో భూదోపిడీ 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. అందుకోసం పక్కా పన్నాగంతో రాజధాని కోసం భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జీఓ–1ను జారీచేశారు. అందులో అమరావతిలో ప్రైవేటు భూములకే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ఎలాంటి ప్యాకేజీ ప్రకటించలేదు. అనంతరం.. చంద్రబాబు, నారాయణ తమ బినావీులైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి ఏజెంట్లను గ్రామాల్లోకి పంపించి భయపెట్టారు. తమకు ఆ భూములు విక్రయిస్తే కొంతైనా డబ్బులు వస్తాయని చెప్పారు. తీవ్ర ఆందోళనకు గురైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినావీులకు అసైన్డ్ భూములను సేల్డీడ్ల ద్వారా విక్రయించేలా చేశారు. చంద్రబాబు, నారాయణ తమ బినావీులైన కేపీవీ అంజనీకుమార్ (రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్), గుమ్మడి సురేశ్, కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, కొల్లి శివరామ్లతోపాటు నారాయణ కుటుంబ సభ్యుల పేరిట ఆ అసైన్డ్ భూములు బదలాయించారు. అనంతరం.. మంగళగిరి తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారులపై ఒత్తిడి తెచ్చి వాటిని అక్రమంగా బదలాయిస్తూ ‘జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) ద్వారా రిజిస్ట్రేషన్లు చేయించారు. అసైన్డ్ భూములను అలా జీపీఏ పేరిటగానీ ఇతరత్రా విధాలుగాగానీ బదిలీ చేయడం చట్టవిరుద్ధం. ఆ తర్వాత ఆ భూములకు కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటిస్తూ 2016, ఫిబ్రవరి 17న జీఓ–41 జారీచేశారు. తద్వారా తాము బినామీల పేరిట హస్తగతం చేసుకున్న అసైన్డ్ భూములకు సీఆర్డీఏ భారీ ప్యాకేజీ దక్కేలా చేశారు. ప్రభుత్వ ఒత్తిడితోనే అంటూ అధికారుల వాంగ్మూలం నిజానికి.. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్టవిరుద్ధం. వాటికి భూసమీకరణ కింద ప్యాకేజీ ప్రకటించడానికి వీల్లేదు. అదే విషయాన్ని స్పష్టంచేస్తూ రెవెన్యూ ఉన్నతాధికారులతోపాటు అడ్వకేట్ జనరల్ కూడా అసైన్డ్ భూముల బదలాయింపును గుర్తిస్తూ వారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. కానీ.. చంద్రబాబు, నారాయణ ఉన్నతాధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసి తాము చెప్పినట్లు చేయమని హుకుం జారీచేశారు. నిబంధనలకు విరుద్ధం అయినప్పటికీ అప్పటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే అసైన్డ్ భూముల బదలాయింపు చేశామని నాటి రెవెన్యూ ఉన్నతాధికారులు న్యాయస్థానంలో 164 సీఆర్పీసీ కింద వాంగ్మూలం ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్న కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి తనను అప్రూవర్‌గా పరిగణించమని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. 1,100 ఎకరాలు.. 1,336 మంది బినామీలు నారాయణ కుటుంబసభ్యుల పేరిటే 162 ఎకరాలు ► అసైన్డ్ భూదోపిడీ కోసం చంద్రబాబు ముఠా రెవెన్యూ రికార్డుల ట్యాంపరింగ్‌కు తెగబడింది. రెవెన్యూ రికార్డులు, సీఆర్డీఏ భూసమీకరణ రికార్డులను సీఐడీ అధికారులు పరిశీలించగా మొత్తం వ్యవహారం బయటపడింది. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న పేర్లకు విరుద్ధంగా సీఆర్డీఏ భూసమీకరణ ప్యాకేజీ ఇచ్చిన వాటిలో 1,336 మంది బినామీల పేర్లు ఉండటం గమనార్హం. ► నారాయణ విద్యా సంస్థల బ్యాంకు ఖాతాల నుంచే రూ.16.5 కోట్ల నిధులను రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేశారు. అనంతరం ఆ నిధులను నారాయణ విద్యా సంస్థల ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించి వారి పేరున అసైన్డ్ భూములను అక్రమంగా జీపీఏ రిజిస్ట్రేషన్లు చేయించారు. ► నారాయణ కుటుంబ సభ్యుల పేరిటే అక్రమంగా 162 ఎకరాల అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేశారు. వీటి విలువ రూ.650కోట్లు. నారాయణ 16.5 కోట్లు పెట్టుబడి పెట్టి రూ.650కోట్ల భూములు కొల్లగొట్టారు. ► అంతేకాక.. దాదాపు రూ.4వేల కోట్ల విలువైన మరో 1,000 ఎకరాల వరకు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట అక్రమంగా జీపీఏ రిజిస్ట్రేషన్లు చేయించారు. -
ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్‌కు ఆర్డినెన్స్ జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 30 లక్షల మందికిపైగా పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడానికి వీలుగా 1977 అసైన్డ్ భూముల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఈ మేరకు ఆర్డినెన్స్ జారీ చేసింది. పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను రిజిస్ట్రేషన్ చేసి ఒక ఆస్తిగా వారికి అప్పగించేందుకు ఈ చట్ట సవరణ చేసింది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పేదలకు వైఎస్ జగన్ ప్రభుత్వం 30.65 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చింది. పేదలు ఒక ఆస్తిలా ఆ స్థలాలపై బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందే అవకాశం కల్పించాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఆ స్థలాలను వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి, కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసమే అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. కాగా, ఈ నెల 29వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాలకు రిజిస్ట్రేషన్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనుంది. ఇందుకు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఇళ్ల స్థలాలను లబ్ధిదారుల పేరు మీద రిజిస్టర్ చేసేందుకు ఆయా గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే వీఆర్వోలను ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తూ ప్రభుత్వం శనివారం జీవో నంబర్ 36 జారీ చేసింది. కన్వేయన్స్ డీడ్స్ ద్వారా పేదలకు భరోసా ఇంతకుముందు పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాలపై వారికి హక్కులు పొందడానికి 20 ఏళ్ల గడువు ఉండేది. దాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం 2021లోనే పదేళ్లకు తగ్గించింది. అంటే ప్రభుత్వం ఇచ్చిన పదేళ్ల తర్వాత ఆ స్థలాలపై వారికి హక్కులు వస్తాయి. గతంలో ఉన్న విధానంలో లబ్ధిదారులకు హక్కులు రావాలంటే వారు లేదా వారి వారసులకు తహసీల్దార్లు నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వడం, దాన్ని రిజిస్ట్రేషన్ల శాఖకు పంపిన తర్వాత హక్కులు కల్పించడం అంతా ఓ పెద్ద ప్రహసనం. అసైన్డ్ భూముల రికార్డులు సరిగా లేకపోవడం, అసైన్ చేసినప్పుడు ఇచ్చిన డి–పట్టాలు పోవడం వంటి రకరకాల కారణాలతో అసైన్డ్ ఇళ్ల పట్టాలపై హక్కులు పొందడం పేదలకు కష్టంగా మారిపోయింది. ఈ పరిస్థితిని నివారించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్ల పట్టాలను ఇచ్చినప్పుడే పేదల పేరు మీద వాటిని రిజిస్ట్రేషన్ చేసేందుకు అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. రిజిస్టర్ అయిన వెంటనే వారికి కన్వేయన్స్ డీడ్స్ జారీ చేయడం వల్ల పదేళ్ల తర్వాత ఎవరి ప్రమేయం లేకుండా ఆ స్థలాలపై వారికి పూర్తి హక్కులు వస్తాయి. తహసీల్దార్ల నుంచి ఎన్వోసీ కూడా అవసరం ఉండదు. ఎందుకంటే ఆ స్థలాలు వారి పేరు రిజిస్టరై ఉండడం, కన్వేయన్స్ డీడ్లు కూడా ఇవ్వడంతో వాటిని ఆస్తిపత్రాలు (సేల్ డీడ్)గా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఇళ్ల పట్టాలను మహిళల పేరు మీద ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా వారి పేరు మీదే చేయడం ద్వారా మహిళలకు ప్రభుత్వం భరోసా ఇవ్వనుంది. -
మా అవినీతినే బయటపెడతారా.. మీ అంతు చూస్తాం
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇష్టారాజ్యంగా.. యథేచ్ఛగా బరితెగించి భారీ ఎత్తున అవినీతికి పాల్పడిన చంద్రబాబు ముఠా ఇప్పుడు మీ అంతు చూస్తామంటూ ఏకంగా ఉన్నతాధికారులకే తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తోంది. మా అవినీతినే బయటపెడతారా అంటూ బెదిరింపులకు పాల్పడుతోంది. అక్రమాలు, అవినీతితో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ముఠా కేసుల నుంచి తప్పించుకునేందుకు మరిన్ని వక్రమార్గాలు వెతుకుతోంది. ప్రధానంగా 950 ఎకరాల అసైన్డ్ భూముల బాగోతం ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో పచ్చ ముఠా ఠారెత్తిపోతోంది. ఈ కేసులో న్యాయస్థానాల్లో సమర్పించిన అధికారుల వాంగ్మూలాలను కూడా గుప్పిట పట్టి మరీ సాక్షులను బెదిరిస్తుండటం విస్మయపరుస్తోంది. నిబంధనలకు వ్యతిరేకం అని తాము అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ అప్పుడు సీఎం హోదాలో చంద్రబాబు ఒత్తిడి చేసి మరీ అవినీతి దందాకు పాల్పడ్డారని.. అసైన్డ్ భూముల కేసులో కీలక అధికారులు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా నాడు సీఎంగా ఉన్న చంద్రబాబు అంతా తానై అసైన్డ్ భూముల దందాకు ఎలా పాల్పడిందో సవివరంగా వెల్లడించారు. ఈ కుంభకోణంపై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుండటంతో చంద్రబాబు ముఠా బెంబేలెత్తుతోంది. దీంతో ఈ కేసులో కీలక సాక్షులుగా ఉన్న ఉన్నతాధికారులు, ఇతరులను బెదిరించేందుకు చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేశ్ కుట్రలకు తెరతీశారు. సర్వం చేసింది చంద్రబాబే.. ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ చంద్రబాబు, నారాయణ అమరావతిలో 950 ఎకరాల అసైన్డ్ భూములను తమ బినామీల పేరిట కొల్లగొట్టారు. బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వం పంపిణీ చేసిన అసైన్డ్ భూములను అన్యాక్రాంతం చేయడం చట్ట విరుద్ధమని అప్పటి సీఆర్డీఏ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అజయ్ జైన్, గుంటూరు కలెక్టర్‌గా ఉన్న కాంతిలాల్ దండే, సీఆర్yీ ఏ కమిషనర్‌గా ఉన్న చెరుకూరి శ్రీధర్ స్పష్టం చేశారు. ఆ మేరకు చట్ట నిబంధనలను ప్రస్తావిస్తూ నోట్ ఫైళ్లలో పేర్కొన్నారు. కానీ అసైన్డ్ భూములను ఎలాగైనా తమ హస్తగతం చేసుకోవాలని భావించిన అప్పటి సీఎం చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి నారాయణ ఉన్నతాధికారుల అభ్యంతరాలను బేఖాతరు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములను తమ సన్నిహితులు, బినామీలకు బదలాయించారు. ఎస్సీ, ఎస్టీ రైతులను భయపెట్టి.. అసైన్డ్ భూములపై కన్నేసిన చంద్రబాబు ముఠా కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారిని రంగంలోకి దించింది. సీఆర్డీఏ అధికారులను గ్రామాల్లోకి పంపించి అసైన్డ్ భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా రాజధాని కోసం తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ రైతులను బెదరగొట్టారు. అనంతరం బ్రహ్మానందరెడ్డి ద్వారా తమ ఏజెంట్లను గ్రామాల్లోకి పంపారు. ఎస్సీ, ఎస్టీ రైతుల నుంచి కారుచౌకగా భూములను నిబంధనలకు విరుద్ధంగా దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టీడీపీ ప్రభుత్వంలో అసైన్డ్ భూముల కుంభకోణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐడీ అధికారులకు విస్మయకర వాస్తవాలు తెలిశాయి. తాము అభ్యంతరం తెలిపినప్పటికీ చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోలేదని ఉన్నతాధికారులు అజయ్ జైన్, కాంతిలాల్ దండే, చెరుకూరి శ్రీధర్ సీఐడీకి తెలిపారు. అంతేకాకుండా ఆ మేరకు 164 సీఆర్పీసీ కింద న్యాయస్థానంలో వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూముల కేసు విచారణలో వారి వాంగ్మూలాలు అత్యంత కీలకంగా మారాయి. అప్రూవర్‌గా మారతానన్న బ్రహ్మానందరెడ్డి మరోవైపు చంద్రబాబు ఒత్తిడితోనే ఎస్సీ, ఎస్టీ రైతులను మోసగించి అసైన్డ్ భూములు కొల్లగొట్టామని బ్రహ్మానందరెడ్డి కూడా అంగీకరించారు. ఆ మేరకు తాను అప్రూవర్‌గా మారి కేసు దర్యాప్తునకు సహకరించేందుకు అనుమతించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఆయన వాంగ్మూలం కూడా అసైన్డ్ భూముల కేసు దర్యాప్తులో ప్రధాన పాత్ర పోషించనుంది. కేసును నీరుగార్చేందుకు రంగంలోకి బాబు ముఠా తమ భూబాగోతం బట్టబయలు అవుతుండటంతో చంద్రబాబు ముఠా బెంబేలెత్తింది. దీంతో కేసు దర్యాప్తును నీరుగార్చేందుకు రంగంలోకి దిగింది. ఈ కేసులో కీలక సాక్షులైన ఉన్నతాధికారులు అజయ్ జైన్, కాంతిలాల్ దండే, చెరుకూరి శ్రీధర్, రియల్ ఎస్టేట్ వ్యాపారి బ్రహ్మానందరెడ్డిలను లక్ష్యంగా చేసుకుంది. అందులో భాగంగానే చంద్రబాబుపై కేసులో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల సంగతి తేలుస్తామని.. వారిని వదిలేది లేదని మీడియా ముఖంగా నారా లోకేశ్ హెచ్చరించడం గమనార్హం. అధికారుల పేర్లను రెడ్ డైరీలో రాశానని.. అధికారంలోకి వచ్చాక ఎవరినీ విడిచిపెట్టేది లేదని.. అంతు చూస్తానని బెదిరించడం లోకేశ్ బరితెగింపునకు నిదర్శనం. మరోవైపు ఏసీబీ న్యాయస్థానంలో నమోదు చేసిన వాంగ్మూలాల కాపీలను కూడా టీడీపీ పెద్దలు తీసుకోవడంతో ఈ వ్యవహారం సున్నితంగా మారింది. ఏకంగా అజయ్ జైన్, కాంతిలాల్ దండే, చెరుకూరి శ్రీధర్ వంటి ఉన్నతాధికారులనే లక్ష్యంగా చేసుకుని టీడీపీ బెదిరింపులకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఐఏఎస్ అధికారులనే టీడీపీ పెద్దలు బెదిరిస్తుంటే.. ఇక తమ పరిస్థితి ఏమిటని ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ రైతులు బెంబేలెత్తుతున్నారు. అలాగే అప్రూవర్‌గా మారతానని పిటిషన్ దాఖలు చేసిన బ్రహ్మానందరెడ్డికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఫోన్లు వస్తుండటంతో ఆయన ఆందోళన చెందుతున్నారు. అధికారుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి చంద్రబాబు ముఠా బెదిరింపుల నేపథ్యంలో సీనియర్ అధికారి చెరుకూరి శ్రీధర్ విజ్ఞప్తిపై ఆయనకు ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కల్పించింది. అజయ్ జైన్, కాంతిలాల్ దండేల పట్ల కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి భద్రత పట్ల కూడా ప్రత్యేకంగా దృష్టి సారించింది. మరోవైపు ఈ వ్యవహారంపై సీఐడీ హైకోర్టును కూడా ఆశ్రయించింది. ఉన్నతాధికారులు 164 సీఆర్పీసీ కింద ఇచ్చిన వాంగ్మూలాల కాపీలు బయటకు వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీఐడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. -
అసైన్డ్ భూములకు హక్కులపై మరింత స్పష్టత
సాక్షి, అమరావతి : అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చింది. పలు కారణాలతో హక్కులు కల్పించేందుకు వెనుకాడుతున్న నేపథ్యంలో వాటన్నింటిపైనా ఎలా ముందుకెళ్లాలో తెలియజేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ మంగళవారం జీవో నంబర్ 596 జారీ చేశారు. పలు జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో ఇటీవల నిర్వహించిన వర్క్‌షాప్‌లో చర్చించిన మీదట అసైన్డ్ భూములపై ఆంక్షలు తొలగించే అంశాలపై తాజా ఆదేశాలు జారీ చేశారు. చుక్కల భూములు, ఈనాం భూములు, జాయింట్ ఎల్పీఎంల విభజన, ప్రొవిజనల్ పట్టాలు, ఎస్సీ కార్పొరేషన్ భూములకు సంబంధించి స్పష్టత ఇచ్చారు. ఈ కేసుల్లో యాజమాన్య హక్కులివ్వాలి ► డీకేటీ రిజిస్టర్, డీకేటీ పట్టా ఆఫీస్ కాపీ, అసైన్మెంట్ కమిటీ మినిట్స్ లేకపోయినా వెబ్లాండ్ అడంగల్, పీఓఎల్ఆర్, పాత అడంగల్, 10 (1) రిజిస్టర్ వంటి ఏదో ఒక రెవెన్యూ రికార్డులో సంబంధిత రైతు పేరు ఉన్నా, 2017 22ఏ జీవోలు లేక 20 సంవత్సరాల క్రితం జారీ అయిన పట్టాదారు పాస్‌బుక్ ఆధారంగానైనా సంబంధిత భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలి. ఆ భూమిని కేటాయించిన పట్టాదారు ఆదీనంలో ఉంటేనే హక్కులు ఇవ్వాలి. ఒకవేళ ఎవరైనా పట్టాదారు సమర్పించిన పాస్‌బుక్ నకిలీదని తహశీల్దార్ ధ్రువీకరిస్తే, దానిని నిరూపించే బాధ్యత కూడా సంబంధిత తహశీల్దార్‌దే. కాల క్రమంలో రెవెన్యూ పరిపాలనలో జరిగిన మార్పుల వల్ల రికార్డులు అందుబాటులో లేవనే కారణంతో అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులను నిరాకరించకూడదు. ► భూ బదలాయింపు జరగకపోయినప్పటికీ, సుప్రీంకోర్టు ఉత్తర్వులు, హైకోర్టు రిట్ పిటిషన్ 140/2022 ఆదేశాల ప్రకారం మినహాయింపు పొందిన భూములకు హక్కులు కల్పించాలి. ► ఏడబ్ల్యూడీ భూములుగా మార్చకుండా తోపు/మేత పోరంబోకులను అసైన్ చేస్తే ఇప్పుడు జిల్లా కలెక్టర్లు ఏడబ్ల్యూడీగా మార్చి వాటికి యాజమాన్య హక్కులివ్వొచ్చు. ► డి పట్టా జారీ అయినా, రికార్డుల్లో ఆ సర్వే నంబర్‌తో సరిపోలకపోతే, వారి ఆదీనంలో ఉన్న భూమి సర్వే నంబర్‌ను నమోదు చేయాలి. అలాంటి భూములకు యాజమాన్య హక్కులు ఇవ్వడం కోసం వారికి భూమి అసైన్ చేసిన పాత తేదీని పరిగణనలోకి తీసుకోవాలి. ► ఖాతా నంబర్ 10 వేల లోపు ఉండి, మిగులు భూమిగా రికార్డయి, అసైన్డ్ భూములుగా నమోదవని వాటిని అసైన్మెంట్ రీ వెరిఫికేషన్‌కు పంపాలి. ఇలాంటి భూములకు యాజమాన్య హక్కులిచ్చేందుకు ఎల్రక్టానిక్ రెవెన్యూ రికార్డుల్లో పట్టాదార్ పేరును మార్చవచ్చు. ► అసైన్మెంట్ చేసిన రాస్తా పోరంబోకు భూములను ఇప్పుడు భూ మారి్పడి (లాండ్ కన్వర్షన్) చేసి వాటికి హక్కులివ్వాలి ► ఆర్‌ఎస్‌ఆర్‌లో అటవీ భూమిగా నమోదైన భూమి అసైన్మెంట్ జరిగి ఆర్ఓఆర్ రికార్డుల్లోనూ నమోదై ఉంటే.. ఆ భూమిని అటవీ చట్టంలోని సెక్షన్ 4(1) కింద నోటిఫికేషన్ జారీ చేయకపోతే దానిపై హక్కులివ్వొచ్చు. ► భూమి స్వభావంలో ‘ప్రభుత్వ భూమి – నాట్ ఎలాటెడ్’గా నమోదై.., వాస్తవానికి అసైన్మెంట్ జరిగి ఉన్న కేసులను జిల్లా స్థాయి వెరిఫికేషన్‌కు పంపాలి. వెరిఫికేషన్‌లో ఆ భూముల హక్కుల కల్పనకు అర్హత సాధిస్తే అప్పుడు వాటిపై హక్కులు ఇవ్వొచ్చు. ► అర్హత ఉన్న అసైన్డ్ భూములు పొరపాటున పట్టా భూమిగా నమోదై 22ఎ జాబితాలో ఉంటే, జిల్లా కలెక్టరు వాటిని ఆ జాబితా నుండి తొలగించాలి. రిమార్క్స్ కాలమ్‌లో యాజమాన్య హక్కులు ఇచ్చిన విధానాన్ని నమోదు చేయవచ్చు. ► 20 సంవత్సరాల క్రితం జారీ అయిన తాత్కాలిక పట్టాలైనా, డీకేటీ పట్టాలు జారీ అయ్యాయా లేదా అనే దాంతో సంబంధం లేకుండా వాటిపై యాజమాన్య హక్కులివ్వాలి. ► భూ బదలాయింపు (లాండ్ కన్వర్షన్) జరిగి, అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన జల వనరుల పోరంబోకు భూములపై యాజమాన్య హక్కులివ్వాలి. ► అసైన్డ్ భూములైనా ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లో నమోదుకాని భూములను అసైన్డ్ భూముల జాబితాలో చేర్చేలా దరఖాస్తులను స్వీకరించడానికి ఏపీ సేవా పోర్టల్‌లో ఆప్షన్ ఉంది. ఇలాంటి కేసులను సుమోటోగా స్వీకరించేందుకు జేసీల లాగిన్‌లో అవకాశం కల్పిస్తాం. ఆ తర్వాత నిబంధనల ప్రకారం ఆ భూములకు హక్కులు ఇవ్వాలి. ► రికార్డులు అందుబాటులో లేని, నీటి వనరులుగా గుర్తించిన కారణంగా యాజమాన్య హక్కులు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకోలేని అసైన్డ్ భూములన్నింటినీ మళ్లీ ధ్రువీకరణ కోసం వీఆర్వో లాగిన్‌కు పంపాలి. ధ్రువీకరణలో అర్హత పొందితే వాటికి హక్కులివ్వాలి. -
పేదలను బెదిరించారు..‘అసైన్డ్’ కాజేశారు
సాక్షి, అమరావతి: టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు బరితెగించి పాల్పడిన భారీ భూదోపిడీ బండారం బట్టబయలైంది. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు కేటాయించిన అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు పక్కాగా అమలుచేసిన కుతంత్రం ఆధారాలతో సహా నిగ్గుతేలింది. ఏకంగా రూ.3,737.30 కోట్ల విలువైన 617.70 ఎకరాల అసైన్డ్ భూదోపిడీ విస్మయపరుస్తోంది. ఈ భూములకు పరిహారం ఇవ్వబోమని అప్పట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను బెదిరించి వారి భూములను చంద్రబాబు, నారాయణ, తదితర టీడీపీపెద్దలు 814 మంది బినామీల ముసుగులో హస్తగతం చేసుకుని దేశ చరిత్రలోనే అత్యంత భారీ అసైన్డ్ భూకుంభకోణానికి తెగబడ్డారు. అనంతరం.. అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించి వారి కుతంత్రాన్ని చాటుకున్నారు. ఈ భూములను అన్యాక్రాంతం చేయడానికిగానీ దాన్ని అధికారికంగా గుర్తించడానికిగానీ వీల్లేదన్న ఉన్నతాధికారుల లిఖితపూర్వక అభ్యంతరాలను వారు బేఖాతరు చేశారు. పైగా.. రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను గల్లంతు చేసేసి.. అసలు 1954 నుంచి 2014 వరకు అమరావతి పరిధిలో పేదలకు భూ పంపిణీనే చేయలేదని ఏకంగా న్యాయస్థానాన్ని మోసంచేసిన తీరు వ్యవస్థలను మోసం చేయడంలో చంద్రబాబు తెగింపునకు అద్దంపడుతోంది. కానీ, ఇప్పుడు వీరి పాపం పండింది.. కథ అడ్డం తిరిగింది. చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌ల కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో సాగిన ఈ అసైన్డ్ భూదోపిడీ ఆధారాలతో సహా బట్టబయలైంది. 1954 తరువాత పంపిణీ చేసిన అసైన్డ్ భూముల పంపిణీ రికార్డులు కూడా వెలుగులోకి రావడంతో పచ్చముఠా పన్నాగం బెడిసికొట్టినట్లయింది. అందుకు సంబంధించిన కీలక ఆధారాలు ‘సాక్షి’ సేకరించింది. పచ్చ గద్దల అసైన్డ్ భూదోపిడీపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనాల్లో మొదటి భాగం ఇది.. జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో దోపిడీ 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు దేశ చరిత్రలో ఏ పాలకుడు కూడా పాల్పడని దారుణానికి తెగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి మరీ వారి అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నారు. అందుకోసం పక్కా పన్నాగంతో రాజధాని కోసం భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జారీచేసిన జీఓ నంబరు 1ను జారీచేశారు. ఆ జీఓలో అమరావతిలోని ప్రైవేటు భూములకు మాత్రమే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ప్రకటించలేదు. అనంతరం.. చంద్రబాబు, నారాయణ తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయపెట్టారు. కాబట్టి తమకు ఆ భూములు విక్రయిస్తే ఎంతోకొంతైనా డబ్బులు వస్తాయని మభ్యపెట్టారు. అందుకోసం ఆర్కే హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతోపాటు తమ బినామీలైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి ఏజెంట్లను గ్రామాల్లోకి పంపించి దుష్ప్రచారం చేయించారు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన పేద రైతులు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు సేల్డీడ్ల ద్వారా తమ అసైన్డ్ భూములను విక్రయించారు. అలా.. ఆ ముఠా ఏడాదిపాటు తమ పన్నాగాన్ని పక్కగా అమలుచేసి అసైన్డ్ భూములన్నింటినీ తమ బినామీల పరం చేశారు. ఆ తరువాత చంద్రబాబు అసలు కుట్రను తెరపైకి తెచ్చారు. అసైన్డ్ భూములకు కూడా ఆరు కేటగిరీల కింద విభజించి 2016, ఫిబ్రవరి 17న జీఓ నంబరు 41 ద్వారా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అంటే.. అప్పటికే అసైన్డ్ భూములు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట ఉండటంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా చూసుకున్నారు. ఎంతగా అంటే.. ఎకరాలోపు ఉన్న భూమికి కూడా ఎకరా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. ఎందుకంటే అసైన్డ్ భూములను చిన్నచిన్న బిట్లుగానే తమ బినామీల పేరిట పచ్చ ముఠా చేజిక్కిచ్చుకుంది. తద్వారా ఎక్కువ ప్యాకేజీ వచ్చేలా కథ నడిపింది. ఆ మేరకు చంద్రబాబు, నారాయణ, టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్ భూముల సమీకరణ ప్యాకేజీని సీఆర్డీఏ వర్తింపజేసింది. అలా చంద్రబాబు చట్ట ప్రకారం ఆ ప్యాకేజీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను దారుణంగా మోసగించారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలు బేఖాతరు.. నిజానికి.. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం. అలా చట్ట విరుద్ధంగా కొనుగోలు చేసిన వారికి భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడానికే వీల్లేదు. చట్ట ప్రకారం దేశంలో 1954కు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు పంపిణీ చేసిన భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశముంది. 1954 తరువాత పంపిణీ చేసిన అసైన్డ్ భూములను కొనుగోలు చేయడంగానీ విక్రయించడంగానీ చట్ట విరుద్ధం. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం తీసుకొచ్చింది. ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ రెవెన్యూ ఉన్నతాధికారులు అసైన్డ్ భూముల బదలాయింపును గుర్తిస్తూ వారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. ఈ మేరకు అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్‌తోపాటు సీఆర్డీఏ, సీసీఎల్ఏ అధికారులు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వ్యక్తంచేశారు. కానీ, అప్పటి మున్సిపల్–సీఆర్డీఏ శాఖ మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ ఉన్నతాధికారలుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అది మీకు సంబంధంలేని వ్యవహారం. మేం చెప్పినట్లు చేయండి. పైస్థాయిలో నేను మాట్లాడతాను’.. అని వారికి హుకుం జారీచేశారు. అప్పటి అడ్వకేట్ జనరల్ కూడా అసైన్డ్ భూముల అన్యాక్రాంతాన్ని గుర్తించడానికి చట్టం అనుమతించదని స్పష్టంచేశారు. ఈ మేరకు అప్పటి కలెక్టర్, సీఆర్డీఏ, రెవెన్యూ, న్యాయ శాఖ ఉన్నతాధికారులు, అడ్వకేట్ జనరల్ తమ అభ్యంతరాలను జీఓ–41 నోట్ ఫైళ్లలో లిఖితపూర్వకంగా తెలిపారు. కానీ, వారి అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేశారు. కోర్టును సైతం మోసం చేసి మరీ.. అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఏకంగా న్యాయస్థానాన్నే మోసం చేయడం విస్మయపరుస్తోంది. చట్ట ప్రకారం 1954 తరువాత పంపిణీ చేసిన భూములను విక్రయించడం, కొనుగోలు చేయకూడదు. కానీ, తమ కుట్రను అమలుచేసేందుకు ఏకంగా అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను చంద్రబాబు, నారాయణ మాయం చేశారు. 1954 తరువాత భూపంపిణీ రికార్డులు ఏమీలేవని అమరావతి పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల రెవెన్యూ అధికారులతో ఓ నివేదిక ఇప్పించారు. ఆ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అంటే.. అమరావతి పరిధిలో ఉన్న అసైన్డ్ భూములన్నీ కూడా 1954కు ముందు పంపిణీ చేసినవే తప్ప.. ఆ తరువాత 2015లోగా అసలు భూపంపిణీయే చేయలేదని ఏకంగా న్యాయస్థానాన్నే పక్కదారి పట్టించారు. కానీ, 1954 తరువాత చాలాసార్లు పేదలకు అసైన్డ్ భూములు పంపిణీ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా 2004–05లో అసైన్డ్ భూములు పంపిణీ చేశారు. కానీ, ఆ రికార్డులన్నీ మాయం చేసేశారు. అమరావతిలో ఉన్న భూములన్నీ కూడా 1954కు ముందు పంపిణీ చేసినవే అని చెబుతూ, వాటిని విక్రయించేందుకు.. కొనుగోలు చేసేందుకు చట్టం అనుమతిస్తుందని వక్ర భాష్యం చెబుతూ న్యాయస్థానాన్ని మోసగించిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుంది. పత్రాలు వెలుగులోకి.. పచ్చ కుట్ర బట్టబయలు ఇలా.. ఎంత మసిపూసి మారెడుకాయ చేయాలని చూసినా చంద్రబాబు భూదోపిడీ కుట్ర బట్టబయలైంది. అమరావతిలోని అసైన్డ్ భూములలో 1954కు తరువాత పంపిణీ చేసిన భూములు ఉన్నాయన్న రికార్డులు వెలుగులోకి వచ్చాయి. వాటిలో 1987, 2004–05లలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని తేలింది. దీనిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమగ్ర విచారణలో మొత్తం భూబాగోతం వెలుగుచూసింది. అమరావతి పరిధిలో 1954 తరువాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు అసైన్డ్ భూములు పంపిణీ చేశారని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. 2014–19 మధ్య జరిగిన అసైన్డ్ భూముల అన్యాక్రాంతం కుంభకోణంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని కూడా లిఖితపూర్వకంగా నివేదించారు. సిట్ బృందాలు అమరావతి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి సర్వే నిర్వహించడంతోపాటు సబ్ రిజిస్ట్రార్, తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాయి. దాంతో గణాంకాలతో సహా పూర్తి ఆధారాలతో అసైన్డ్ భూముల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూముల రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లు, సీఆర్డీఏ ప్రకటించిన భూసమీకరణ ప్యాకేజీలోని అసైన్డ్ రైతుల పేర్లను సరిపోల్చి చూడగా అసలు బండారం బయటపడింది. రెవెన్యూ రికార్డుల్లోని అసైన్డ్ భూముల రైతులకు, సీఆర్డీఏ ప్రకటించిన ప్యాకేజీలోని అసైన్డ్ భూముల రైతుల పేర్లకు ఏమాత్రం పొంతన లేనేలేదు. దాంతో చట్ట విరుద్ధంగా చంద్రబాబు, నారాయణ కొల్లగొట్టిన అసైన్డ్ భూముల చిట్టా బయటపడింది. ఏకంగా 617.70 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ ముఠా కొల్లగొట్టిందన్నది తేలిపోయింది. కేటగిరీలూ అనుకూలంగానే.. ఇక జీఓ–41 ప్రకారం ఆరు కేటగిరీల కింద నాటి ప్రభుత్వం ప్యాకేజిని ప్రకటించింది. వాటిలో నాలుగు కేటగిరీల కింద చంద్రబాబు, నారాయణ తమ బినామీల పేరిట అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నారు. ఆ నాలుగు కేటగిరీలకు జరీబు భూములకు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన భూసమీకరణ ప్యాకేజీ ఇలా ఉంది.. రూ.3,737.30 కోట్ల అసైన్డ్ భూదోపిడీ మరోవైపు.. నాలుగు కేటగిరీ కింద దోపిడీ చేసిన 617.70 ఎకరాల అసైన్డ్ భూములకు చంద్రబాబు, నారాయణ గ్యాంగ్ ప్యాకేజీ ద్వారా ఏకంగా రూ.3,737.30 కోట్లు దక్కించుకుంది. ఎందుకంటే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించిన తరువాత అమరావతిలో నివాస స్థలం చ.గజం మార్కెట్ ధర కనీసం రూ.30వేలు, వాణిజ్య స్థలం మార్కెట్ ధర చ.గజం కనీసం రూ.50వేలు చొప్పున విక్రయాలు సాగాయి. ఇక అమరావతి నిర్మించిన తరువాత వాటి విలువ మరింత భారీగా పెరుగుతుంది కూడా. ఇక భూసమీకరణ ప్యాకేజీలో కనీస విలువగా ఎకరా ప్యాకేజీ ప్రకటించారు. అంటే.. ఎకరా లోపు భూమిని తీసుకున్నా సరే ఎకరాకు ప్యాకేజీ ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు, నారాయణ తమ బినామీలు ఎక్కువ మంది ద్వారా చిన్న చిన్న కమతాలను చేజిక్కించుకున్నారు. తద్వారా ప్రతీ బినామీకి కనీసం ఎకరా ప్యాకేజీ వచ్చేలా చేశారు. -
పత్రాలు మార్చి అసైన్డ్ అరాచకం.. చంద్రబాబు హయాంలో భారీ భూ కుంభకోణం!
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనోడైతే కడ బంతిలో కూర్చున్నా ఫర్వాలేదంటారు! పాలకుడు తమవాడైతే బరితెగించి భూదోపిడీకి పాల్పడవచ్చని టీడీపీ పెద్దలు నిరూపించారు! అమరావతి ముసుగులో ఏకంగా 964 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన భారీ కుంభకోణం వెనక చంద్రబాబు సర్కారు పన్నాగం తాజాగా వెలుగు చూసింది. నిబంధనలు ఉల్లంఘించి.. పత్రాలు మార్చి.. అందర్నీ ఏమార్చి ప్రత్యేకంగా జీవోలు జారీ చేసి చట్టబద్ధంగా భూ దోపిడీకి వేసిన స్కెచ్ బహిర్గతమైంది. అమరావతిలో అసైన్డ్ భూములను కాజేసేందుకు టీడీపీ పెద్దలు రెండంచెల వ్యూహం వేశారు. అయితే సాంకేతికపరమైన అంశాలు ప్రతిబంధకంగా మారడంతో మూడో ఎత్తుగడగా భూ దోపిడీకి రాజముద్ర వేస్తూ జీవోలు జారీ చేశారు. రూ.4 వేల కోట్ల విలువైన భూ దోపిడీ కోసం చంద్రబాబు సర్కారు అమలు చేసిన పన్నాగం ఇదిగో.. రెండంచెల్లో అసైన్డ్ భూ దోపిడీ అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలోని 29 గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 964 ఎకరాల అసైన్డ్ భూములను సొంతం చేసుకునేందుకు టీడీపీ పెద్దలు తొలుత రెండంచెల పన్నాగాన్ని అమలు చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుంటుందంటూ రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. అనంతరం టీడీపీ ముఖ్య నేతల దళారీలు గ్రామాల్లో వాలిపోయారు. ప్రభుత్వానికి అప్పగిస్తే పరిహారం ఏమీ రాదని ఆందోళనకు గురి చేయడంతో పేద అసైన్డ్ రైతులు చేసేదిలేక వారికే విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇలా అసైన్డ్ భూ దోపిడీ వ్యవహారాన్ని 2014 జూన్ నుంచి 2015 డిసెంబరులోగా పూర్తి చేశారు. ఆ భూములన్నీ టీడీపీ నేతలు, వారి బినామీల గుప్పిట్లోకి వచ్చిన తరువాత అసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసింది. రూ.4 వేల కోట్ల విలువైన అసైన్డ్ భూములు తమ హస్తగతమయ్యాయని భావించింది. అసైన్డ్ భూములను టీడీపీ నేతలకు విక్రయించినట్లు మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు యత్నించారు. అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పెండింగ్ రిజిస్ట్రేషన్లుగా నమోదు చేశారు. మరోవైపు ఆ భూములను రాజధాని కోసం భూ సమీకరణ కింద టీడీపీ నేతలు, వారి బినామీలు ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. సబ్ రిజిస్ట్రార్ రికార్డుల్లో భూములు అసైన్డ్ రైతుల పేరున ఉండగా సీఆర్డీఏ రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతలు, బినామీలు ఇచ్చినట్లు చూపించారు. ఏమార్చిన విధానం ఇలా.. టీడీపీ నేతల పేరిట అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు నిబంధనలు అడ్డంకిగా మారడంతో చంద్రబాబు ప్రభుత్వం భూ కుంభకోణంలో మూడో అంకానికి తెర తీసింది. 2018 మే 18న జీవో 258, నవంబరు 16న జీవో 575, 580 జీవోలు జారీ చేసింది. 1954 జూన్‌కు ముందు కేటాయించిన అసైన్డ్ భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు అందులో ప్రకటించింది. 22 ఏ జాబితా నుంచి తొలగించింది. టీడీపీ నేతలు దక్కించుకున్న అసైన్డ్ భూములన్నీ 1954 జూన్‌కు ముందే రైతులకు కేటాయించినవిగా చూపించి అధికారికంగా కాజేసే ఎత్తుగడ వేసింది. ఆమేరకు తహశీల్దార్ కార్యాలయాల్లో రికార్డులను తారుమారు చేశారు. అనంతరం జీవోలు 258, 575, 580 ద్వారా సీఆర్డీఏ కార్యాలయంలో కథ నడిపించారు. అయితే అమరావతిలో అసైన్డ్ భూములన్నీ 1970 నుంచి 1995 మధ్యలో కేటాయించినవే కావడం గమనార్హం. ఈ క్రమంలో అసైన్డ్ భూములన్నీ 1954కు ముందే కేటాయించినట్లుగా చూపిస్తూ వాటిని సొంతం చేసుకున్న టీడీపీ నేతలు భూ సమీకరణ కింద సీఆర్డీఏకు ఇవ్వడాన్ని క్రమబద్ధీకరించే ప్రక్రియ చేపట్టారు. 2019లో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చేసరికి దాదాపు 400 పెండింగ్ రిజిస్ట్రేషన్లను సీఆర్డీఏ రికార్డుల్లో ఇలా క్రమబద్ధీకరించేశారు. భూ సమీకరణ ప్యాకేజీ కింద ఇచ్చే నివాస, వాణిజ్య స్థలాలతోపాటు ఏటా పంట పరిహారం టీడీపీ పెద్దల బినామీలకే దక్కేలా స్కెచ్ వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను నిండా ముంచారు. 2019లో మళ్లీ అధికారంలోకి వస్తే మొత్తం 964 ఎకరాలను టీడీపీ పెద్దల పేరిట క్రమబద్ధీకరించాలని భావించారు. కానీ చంద్రబాబు ఒకటి తలిస్తే దైవం మరోలా తలచింది. టీడీపీ ఘోర పరాజయంతో చంద్రబాబు అసైన్డ్ భూముల కుంభకోణం కథ అడ్డం తిరిగింది. జీవోలిచ్చి క్రమబద్ధీకరణ.. ► కురగల్లులో సర్వే నంబరు 538, 316/2, 534తో ఉన్న 2.46 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న నారాయణకు సన్నిహితుడైన తేళ్ల శ్రీనివాసరావు (మైత్రి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్) కొనుగోలు చేశారు. 2015 సెప్టెంబరు 4న ఆ లావాదేవీని సబ్ రిజిస్ట్రార్ పెండింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ 593/2015గా నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వం 2018లో జీవోలు 258, 575, 580 జారీ చేసిన తరువాత 2019 మార్చి 5న వాటిని 4420/2019 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ► ఇదే తరహాలో 3534/2015 పెండింగ్ రిజిస్ట్రేషన్‌ను 2018 డిసెంబరులో 14113/18 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ఇంకేం రుజువులు కావాలి? మా కుటుంబానికి ప్రభుత్వం 1987లో రెండు ఎకరాల అసైన్డ్ భూమి కేటాయించింది. ఇదిగో ఆ పత్రం. అయితే మాకు అసైన్డ్ భూమిని 1954 కంటే ముందే కేటాయించినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేశారు. మా భూమిని టీడీపీ నేతలు పంపిన దళారులు సీఆర్డీఏకి ఇచ్చినట్లుగా రికార్డుల్లో చేర్చి క్రమబద్ధీకరించేశారు. ప్యాకేజీ కింద స్థలాలు, కౌలు పరిహారం వారికే ఇస్తున్నారు. మేం కనీసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా వెళ్లకున్నా టీడీపీ నేతల పేరిట క్రమబద్ధీకరించి మోసగించారు. – దావు మోహన్‌రావు, అసైన్డ్ రైతు, కురగల్లు -
అసైన్డ్ పట్టాలపైనే తొలి తీర్మానం
సాక్షి, రంగారెడ్డి జిల్లా/ సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘రాష్ట్రంలో మళ్లీ వచ్చేది వందకు వందశాతం బీఆర్ఎస్ ప్రభుత్వమే. గెలుపొందిన తర్వాత మంత్రివర్గం చేసే తొలి తీర్మానం అసైన్డ్ భూములకు సంబంధించిన పట్టాల అంశంపైనే ఉంటుంది. పట్టాలు ఇవ్వడమే కాదు.. వాటిని అమ్ముకునే అవకాశం కూడా కల్పిస్తాం. అసైన్డ్ భూములు గుంజుకుంటారని కాంగ్రెస్ నేతలు చేస్తున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. అసైన్డ్‌దారులకే అన్ని హక్కులు కల్పిస్తాం..’ అని భారత్ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కేసీఆర్ చెప్పారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి కాంగ్రెసోళ్లు రైతుబంధును నిలిపి వేయించారని విమర్శించారు. ‘ఇలా ఎన్ని రోజులు ఆపుతారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఆపితే ఈ పథకం ఆగిపోదు. కేసీఆర్ బతికున్నంత కాలం నిరాటంకంగా కొనసాగుతుంది. డిసెంబర్ మూడో తేదీన బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది. 6వ తేదీ నుంచి రైతులందరికీ రైతుబంధు ఇస్తాం. ఈ విషయంలో రైతులు బాధపడాల్సిన అవసరం లేదు..’ అని స్పష్టం చేశారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్, చేవెళ్ల, సంగారెడ్డి జిల్లా కేంద్రం, ఆందోల్ పట్టణాల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. సంక్షేమంలో దేశానికే ఆదర్శం ‘సంక్షేమంలో దేశానికే ఆదర్శంగా నిలిచాం. కాంగ్రెస్ యాభై ఏళ్లు పాలిస్తే.. బీఆర్ఎస్ పదేళ్లు పాలించింది. అప్పుడు, ఇప్పుడు ఎలాంటి మార్పులు వచ్చాయో గమనించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.200 పెన్షన్ ఇస్తే..బీఆర్ఎస్ రూ.2 వేలకు పెంచింది. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.5 వేలకు పెంచుతాం. గర్భిణులకు న్యూట్రిషన్ కిట్లు అందిస్తున్నాం. అమ్మ ఒడి వాహనాలు ఏర్పాటు చేశాం. ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రసవం తర్వాత అదే వాహనంలో ఊర్లో దించుతున్నాం. కేసీఆర్ కిట్ కింద మగ బిడ్డపుడితే రూ.12 వేలు, ఆడబిడ్డ పుడితే రూ.13 వేలు ఇస్తున్నాం. 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి, కళ్లద్దాలు ఇచ్చాం. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారాక్ కింద రూ.లక్ష ఆర్థిక సహాయం చేస్తున్నాం. రైతుబంధు దుబారా చేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నాడు. రైతుబంధు దుబారానా? కాంగ్రెస్‌లోనూ రైతుబంధు తీసుకునే రైతులు, నాయకులు ఉన్నారు. వారికి సిగ్గు ఉందా? కాంగ్రెస్‌ను ఎలా సపోర్ట్ చేస్తారు? గుండెపై చేయి వేసుకుని ఆలోచించాలి. గత ఆరేళ్లుగా రెండు విడతల్లో రైతుబంధు వేస్తున్నాం. కానీ కాంగ్రెస్ వాళ్లు ఒక్క విడత రైతుబంధు వేస్తేనే మాకు ఓట్లు పడతాయని అనుకుంటున్నారు. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి పథకం ఆపారు. యాసంగి పంటల కోసం నేను చెప్పిన తర్వాత అనుమతి ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆపారు..’ అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎవరు బాగుపడ్డారు? ‘నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అన్నీ బాధలే. ఇందిరమ్మ రాజ్యంలో ఎవరు బాగుపడ్డారు? ఎన్టీఆర్ పార్టీ పెట్టి రూ.2 కేజీ బియ్యం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? మాట్లాడితే మత కల్లోలాలు, కర్ఫ్యూలు ఉండేవి. తద్దినం అని భోజనానికి పిలిస్తే మీ ఇంట్లో రోజూ ఇలాగే జరగాలని కోరుకున్నట్లు ఉంది కాంగ్రెసోళ్ల పరిస్థితి. టైలర్ బట్టలు కుడుతున్నాడు.. సూది కింద పడిపోయింది.. సూది దొరికితే కిలోశక్కరి పంచి పెడతానని దేవునికి మొక్కాడు.. ఇదేంటని ఆయన భార్య అడితే.. సూదైతే దొరకని.. శక్కరి పంచిపెట్టకపోతే దేవుడేం చేస్తాడు.. అన్న మాదిరిగా ఉంది వారి వైఖరి..’ అని ఎద్దేవా చేశారు. రైతులకు ధరణే శ్రీరామ రక్ష ‘ధరణి పోర్టల్ పుణ్యమా అని రైతులు నిశ్చితగా ఉన్నారు. కాంగ్రెసోళ్ళు దాన్ని తొలగించి భూమాత తెస్తామంటున్నారు. అది భూ మాతనా? భూ మేతనా? ధరణి పోతే..రైతుబంధు డబ్బులు ఎలా వస్తాయి? మళ్లీ మొదటికే వస్తుంది. నీ భూమి నాకు..నా భూమి నీకు రాసి పంచాయితీ పెట్టే కాంగ్రెస్ కావాలా? తేల్చుకోవాలి. కాంగ్రెసోళ్లు డబ్బులు కౌలుదారులకు ఇస్తామంటున్నారు రైతులకు ఇవ్వం అంటున్నారు. రైతు మెడకు కౌలు రైతులను దూలం లెక్క పెడతామంటున్నారు. పెట్టించుకుందామా? ధరణే రైతుల భూములకు శ్రీరామ రక్ష. కాంగ్రెస్ నేతల మాటలు నమ్మితే కైలాసంలో పెద్ద పాము మింగినట్లే..’ అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఇంకో పార్టీకి మతం పెచ్చి ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే రాష్ట్రంలో ఎక్కువ వేతనాలు ఇస్తున్నాం. పీఆర్సీ కూడా వేశాం. ఆర్టీసీని ఇటీవలే ప్రభుత్వంలో విలీనం చేశాం. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆర్టీసీ ఉద్యోగులు కూడా ప్రభుత్వ ఉద్యోగులవుతారు. మైనార్టీల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేక ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం. హిందూ, ముస్లింలు నాకు రెండు కళ్లు లాంటి వారు. మైనార్టీల సంక్షేమ నిధులను రూ.2 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్లకు పెంచాం. కాంగ్రెస్ తన 50 ఏళ్ల పాలనలో మైనార్టీలను ఓటు బ్యాంకుగా భావించింది. ఇంకో పార్టీకి మతం పిచ్చి. మంటలు పెట్టడం, మసీదులు తవ్వుదామా.. దర్గాలు తవ్వుదామా.. ఇదే తప్ప వేరే లేదు.. ప్రజలను విభజించి పాలిస్తుంది..’ అని ధ్వజమెత్తారు. నెలన్నరలో మాస్లర్ ప్లాన్ క్లియర్ ‘తెలంగాణ ఉద్యమంలో నేను కనిపెట్టిన ప్రాజెక్టు లక్ష్మీదేవిపల్లె. ఎక్కువ భూములు మునగకుండా సాధ్యమైనంత త్వరలో రిజర్వాయర్‌ను పూర్తి చేస్తాం. షాద్‌నగర్‌కు సాగునీళ్ల బాధపోతుంది. చేవెళ్ల నియోజకవర్గం హైదరాబాద్‌కు దగ్గలో ఉంది. గత పాలకులు ఈ ప్రాంతంపై కొన్ని (111 జీఓ రూపంలో) ఆంక్షలు పెట్టారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వాళ్లెవరూ వాటిని ఎత్తేసే ప్రయత్నం చేయలే. పరిశ్రమలు తెచ్చే ప్రయత్నం చేయలే. బీఆర్ఎస్ హయాంలో షాబాద్‌లో వెల్స్పన్ కంపెనీ, చందనవెళ్లిలో అమెజాన్ కంపెనీ, సీతారాంపురంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీ, కొండకల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చాయి. గత ఎన్నికల్లో 111 జీఓ ఎత్తివేస్తామని హామీ ఇచ్చాం. ఈ మేరకు పూర్తిగా ఎత్తేశాం. అయితే దానికి మాస్టర్ ప్లాన్ కొంత అడ్డంకిగా మారింది. నెలన్నరలో మాస్టర్ ప్లాన్ క్లియర్ అవుతుంది. జీఓను పూర్తిగా ఎత్తివేయించే బాధ్యత నాదే. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆన్ చేశాం. మీ వాటా మీకే ఉంది. ఉద్ధండపూర్ రిజర్వాయర్‌ను పూర్తి చేస్తాం. కాలువలు తవ్వితే చాలు వికారాబాద్, చేవెళ్ల నియోజకవర్గాలకు సాగునీరు, తాగు నీరు వస్తుంది. ఇక్కడికి కాలుష్య రహిత పరిశ్రమలు తీసుకొస్తాం. ఉపాధి అవకాశాలు కల్పిస్తాం..’ అని కేసీఆర్ హామీ ఇచ్చారు. రాయేదో, రత్నమేదో గుర్తించాలి ‘ఎన్నికలొస్తే దేశంలో ఆగమాగం ఉంటుంది. అలా ఉండకూడదు. ప్రజాస్వామ్యంలో చాలా పరిణితి రావాలి. మంచేదో.. చెడేదో? రాయేదో.. రత్నమేదో? గుర్తించాలి. అభ్యర్థులపై ఆరా తీయాల్సిందే. వీరి వెనుక ఉండే పార్టీల నడవడిక, ప్రజల గురించి ఆలోచించే విధానంపై ఆరా తీయాలి. గ్రామాల్లో చర్చలు పెట్టాలి. ఆలోచించి ఓటు వేయాలి. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి..’ అని సీఎం విజ్ఞప్తి చేశారు. బహిరంగ సభల్లో మంత్రి హరీశ్‌రావు, అభ్యర్థులు చింత ప్రభాకర్ (సంగారెడ్డి), చంటి క్రాంతికిరణ్ (ఆందోల్), అంజయ్య యాదవ్ (షాద్‌నగర్), కాలె యాదయ్య (చేవెళ్ల) తదితరులు పాల్గొన్నారు. -
ఈ ‘అసైన్డ్’ భూములపై పట్టాదారులకే హక్కులు
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో ప్రభుత్వం మరింత స్పష్టతనిచ్చింది. అర్హత ఉన్న అసైన్డ్ భూములకు సైతం యాజమాన్య హక్కులు కల్పించేందుకు రెవెన్యూ అధికారులు వివిధ కారణాలతో వెనుకాడుతుండడంతో, వారికి ఉన్న అనుమానాలన్నింటినీ నివృత్తి చేస్తూ ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది. చట్ట ప్రకారం అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన భూములన్నింటిపైనా ఆంక్షలు తొలగించి యాజమాన్య హక్కులు కల్పించాలని తెలిపింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, జేసీలు, ఆర్డీవోలు, తహశీల్దార్లతో ఇటీవల జరిగిన వర్క్‌షాప్‌లో అసైన్డ్ భూములు, చుక్కల భూములు, ఈనాం భూములు, జాయింట్ ఎల్పీఎంల విభజన, ప్రొవిజినల్ పట్టాలు, ఎస్సీ కార్పొరేషన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించే విషయంలో రెవెన్యూ యంత్రాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై కూలంకషంగా చర్చించారు. అనంతరం వీటిపై స్పష్టత ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసుల్లో యాజమాన్య హక్కులు ఇవ్వొచ్చు ♦ డీకేటీ రిజిస్టర్, డీకేటీ పట్టా ఆఫీస్ కాపీ, అసైన్మెంట్ కమిటీ మినిట్స్ లేకపోయినా వెబ్‌ల్యాండ్, పీఓఎల్ఆర్ వంటి ఏదో ఒక రెవెన్యూ రికార్డులో రైతు పేరు ఉన్నా, 2017 22ఏ జీవోలు లేక 20 సంవత్సరాల క్రితం జారీ అయిన పట్టాదార్ పాస్ బుక్ ఆధారంగానైనా ఆ భూములకు యాజమాన్య హక్కులివ్వాలి. భూమి పట్టాదారు ఆదీనంలో ఉంటేనే హక్కులు ఇవ్వాలి. ఎవరైనా పట్టాదారు పాస్‌బుక్ నకిలీదని తహశీల్దార్ ధృవీకరిస్తే, దానిని నిరూపించే బాధ్యత కూడా తహశీల్దార్‌దే. ♦ భూ బదలాయింపు (ల్యాండ్ కన్వర్షన్), అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన జల వనరుల పోరంబోకు భూములపై యాజమాన్య హక్కులివ్వాలి. ఈ తరహా భూముల రికార్డులు లభించకపోయినా, లోతుగా పరిశీలన జరిపి, యాజమాన్య హక్కులివ్వాలి. ♦ భూ బదలాయింపు జరగని సందర్భాల్లో కూడా సుప్రీంకోర్టు ఉత్తర్వులు, రిట్ పిటిషన్ 140/2022పై హైకోర్టు ఆదేశాల ప్రకారం మినహాయింపు పొందిన భూములకు హక్కులు కల్పించాలి. ♦ ఏడబ్ల్యూడీ భూములుగా మార్చకుండా తోపు/మేత పోరంబోకులను అసైన్ చేస్తే ఇప్పుడు జిల్లా కలెక్టర్లు ఏడబ్ల్యూడీగా మార్చి యాజమాన్య హక్కులివ్వొచ్చు. ♦ డి పట్టా జారీ అయినా, రికార్డుల్లో ఆ సర్వే నంబర్‌తో సరిపోలకపోతే, వారి ఆ«దీనంలో ఉన్న భూమి సర్వే నంబర్‌ను నమోదు చేయాలి. యాజమాన్య హక్కులివ్వడానికి వారికి భూమి అసైన్ చేసిన పాత తేదీని పరిగణనలోకి తీసుకోవాలి. ♦ ఖాతా నంబర్ 10 వేల లోపు ఉండి, మిగులు భూమిగా రికార్డయి అసైన్డ్ భూములుగా నమోదవని వాటిని అసైన్మెంట్ రీ వెరిఫికేషన్‌కు పంపాలి. ఈ భూములకు యాజమాన్య హక్కులిచ్చేందుకు ఎల్రక్టానిక్ రెవెన్యూ రికార్డుల్లో పట్టాదార్ పేరును చేర్చడానికి సాఫ్ట్‌వేర్‌ను మారుస్తారు. ♦ ఆన్లైన్ రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాని అసైన్డ్ భూములను అసైన్డ్ జాబితాలో చేర్చేందుకు దరఖాస్తుల కోసం ఏపీ సేవా పోర్టల్‌లో ఓ ఆప్షన్ ఏర్పాటు. ఇలాంటి కేసులను సుమోటోగా స్వీకరించేందుకు జేసీల లాగిన్‌లో అవకాశం కల్పిస్తారు. ఆ తర్వాత నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఆ భూములకు హక్కులు ఇవ్వొచ్చు. ♦ అసైన్మెంట్ చేసిన రాస్తా పోరంబోకు భూములకు భూ మార్పిడి (ల్యాండ్ కన్వర్షన్) చేసి వాటికి హక్కులివ్వాలి. ♦ ఆర్‌ఎస్‌ఆర్‌లో అటవీ భూమిగా నమోదైన భూమి, అసైన్మెంట్ జరిగి ఆర్ఓఆర్ రికార్డుల్లోనూ నమోదై ఉంటే.. ఆ భూమిని అటవీ చట్టం సెక్షన్ 4(1) కింద నోటిఫికేషన్ జారీ చేయకపోతే దానిపై హక్కులివ్వొచ్చు. ♦ భూమి స్వభావంలో ‘ప్రభుత్వ భూమి–నాట్ ఎలాటెడ్’గా నమోదై.. వాస్తవానికి ఆ భూమి అసైన్మెంట్ జరిగి ఉన్న కేసులను జిల్లా స్థాయి వెరిఫికేషన్‌కు పంపాలి. పరిశీలనలో అర్హత సాధిస్తే అప్పుడు వాటిపై హక్కులు ఇవ్వొచ్చు. ♦ అర్హత ఉన్న అసైన్డ్ భూములు పొరపాటున పట్టా భూమిగా నమోదై 22ఎ జాబితాలో ఉంటే జిల్లా కలెక్టరు వాటిని ఆ జాబితా నుండి తొలగించాలి. రిమార్క్స్ కాలమ్‌లో యాజమాన్య హక్కులు ఇచ్చిన విధానాన్ని నమోదు చేయవచ్చు. ♦ రికార్డులు అందుబాటులో లేని, నీటి వనరులుగా గుర్తించిన కారణంగా యాజమాన్య హక్కులు ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకోలేని అసైన్డ్ భూములన్నింటినీ మళ్లీ ధృవీకరణ కోసం వీఆర్వో లాగిన్‌కు పంపాలి. ధృవీకరణలో అర్హత పొందితే వాటికి హక్కులివ్వాలి. ♦ 20 ఏళ్ల క్రితం జారీ అయిన తాత్కాలిక పట్టాలైనా, డీకేటీ పట్టాలు జారీ అయ్యాయా లేదా అనే దానితో సంబంధం లేకుండా యాజమాన్య హక్కులివ్వాలి. చుక్కల భూములపై.. 1.12 లక్షల ఎకరాల చుక్కల భూములు అసైన్డ్ భూములు కావడంతో అవి నిషేధిత జాబితాలో ఉన్నాయి. ఈ భూములన్నీ 20 ఏళ్ల క్రితం అసైన్మెంట్ చేసినవి. ఈ భూములన్నింటినీ 22ఏ జాబితాతోపాటు చుక్కల భూముల జాబితా నుంచి కూడా తొలగించాలి. ఈనాం భూములపై.. ♦ 22ఎ జాబితా నుండి తొలగించిన గ్రామ సర్విస్ ఈనాం భూములు వెబ్‌ల్యాండ్ ఎల్రక్టానిక్ రికార్డుల్లో కనపడాలి. ఆలయాలు, ఎండోమెంట్, వక్ఫ్, ధార్మిక సేవా ఈనాంలు మినహా మిగిలిన అన్ని ఈనాం భూములను 22ఎ జాబితా నుండి తొలగించాలి. అలాంటి ఈనాం భూములన్నీ ఈనాం/ఎస్టేట్/రైత్వారీ గ్రామంలో భాగమైనా, దాంతో సంబంధం లేకుండా తొలగించాలి. ♦ భవిష్యత్తులో ఏ రీ సర్వే గ్రామాల్లోనూ ఉమ్మడి ఎల్పీఎంలు సృష్టించకూడదు. ఎక్కడైనా ప్రజా సంఘాలు ఉమ్మడి ఎల్పీఎంల కోసం అభ్యర్థిస్తే తహశీల్దార్లు వారి స్టేట్మెంట్లు రికార్డు చేసి వాటి ఆమోదం కోసం ఆర్డీవోలకు పంపాలి. ♦ తనఖాలో ఉన్న భూములు యాజమాన్య హక్కుల కల్పనకు అర్హత కలిగి ఉంటే కేవలం తనఖాలో పెట్టారనే కారణంతో వాటిని తిరస్కరించకూడదు. యాజమాన్య హక్కులు కల్పించిన వెంటనే వాటిని 22ఏ జాబితా నుంచి తొలగించాలి. -
చంద్రబాబు అన్ని వర్గాలను మోసం చేశారు: సీఎం జగన్
సాక్షి, ఏలూరు: చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను మోసం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. బాబు సీఎంగా ఉన్నప్పుడు అంతా దోపిడినే జరిగిందని మండిపడ్డారు. ప్రజలకు మంచి చేసి చంద్రబాబు ఎప్పుడూ సీఎం కాలేదని అన్నారు. తొలిసారి వెన్నుపోటుతో, రెండోసారి కార్గిల్ యుద్ధం పుణ్యాన, మూడోసారి రుణమాఫీతో అధికారంలోకి వచ్చారని ప్రస్తావించారు. త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయన్న సీఎం జగన్.. చంద్రబాబుకు మిగతా సామాజిక వర్గాలపై ఎలాంటి అభిప్రాయం ఉందో గుర్తు తెచ్చుకోవాలని ప్రజలకు సూచించారు. ఎస్సీలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోకలు కత్తిరిస్తానని చంద్రబాబు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఇచ్చిన మేనిఫెస్టోలపై కమిట్మెంట్ లేని నాయకుడు చంద్రబాబు అని విమర్శించారు. ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తోడేళ్లంతా ఏకమవుతున్నారని సీఎం జగన్ మండిపడ్డారు. దొంగల ముఠా అంతా ఏకమై ప్రతి ఇంటికి బెంజ్ కారు ఇస్తామంటారు.. నమ్మి మోసపోవద్దని హితవు పలికారు. 2014 చంద్రబాబు, పవన్ ఏకమై ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని ఆలోచించాలని సూచించారు. తనకు ప్రజా దీవెనలు ఉన్నంత వరకు ఎవరితోనూ పొత్తు పెట్టుకోనని స్పష్టం చేశారు. చదవండి: నిమ్మగడ్డ రమేష్ కొత్త పన్నాగం.. దానికి సమాధానముందా? సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46,463.82 ఎకరాలను వ్యవసాయం కోసం కొత్తగా 42,307 మందికి డీకేటీ పట్టాలు పంపిణీ చేశారు. నిరుపేదలకు భూముల పంపిణీని ప్రారంభించడంతోపాటు అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం, లంక భూములకు పట్టాలు అందజేశారు. చుక్కల భూములు, షరతుల గల పట్టా భూములు, సర్వీస్ ఈనాం భూములను 22 ఏ జాబితా నుంచి తొలగించడం, భూమి కొనుగోలు పథకం కింద ఇచ్చిన భూములపై హక్కుల కల్పన, గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల పంపిణీని సీఎం జగన్ ఈ సభలో ప్రారంభించారు. శ్మశాన వాటికలు లేని దళిత వాడల కోసం రాష్ట్రంలో 1,563 గ్రామాల్లో 951 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రైతుల భూ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ.. కొత్తగా డీకేటీ పట్టాలను అందిస్తున్నామని తెలిపారు. చుక్కుల భూములకు సైతం పరిష్కారం చూపించామని, అసైన్డ్ భూములు, లంక భూములకు భూ హక్కులు కల్పిస్తున్నామని చెప్పారు. భూ తగాదాలకు పరిష్కారం చూపిస్తూ రికార్డులు అప్డేట్ చేస్తున్నామన్నారు. వేలమంది సర్వేయర్లతో వేగంగా సర్వే చేపడుతున్నామని తెలిపారు. ‘మొదటి దశలో 18 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. రెండవ దశలో 24.6 లక్షల ఎకరాల సర్వే పూర్తి చేశాం. మొత్తంగా 45 లక్షల ఎకరాల సరిహద్దు అంశాలు పరిష్కరించాం. 4 వేల గ్రామాల్లో రీసర్వే పూర్తయింది. సర్వే పూర్తయిన గ్రామాల్లో అక్కడి సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. గిరిజన రైతులకు పోడు భూములపై హక్కు కల్పించాం లంక భూమి సాగు చేసుకుంటున్న రైతులకు హక్కు కల్పించాం. గ్రామ ఇనామ్ సర్వీస్ భూములనునిషేధిత జాబితా నుంచి తొలగించాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన భూములకూ హక్కులు కల్పిస్తున్నాం. దళిత వర్గాల కోసం రాష్ట్ర వ్యాప్తంగా స్మశానవాటికలకు స్థలాలు కేటాయించాం. సామాజిక న్యాయాన్ని ఒక విధానంగా అమలు చేస్తున్నాం. అధికారంలోకి వచ్చాక 2 లక్షల 7 వేల ఉద్యోగాలు భర్తీ చేశాం. ఇళ్ల పట్టాల లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: చంద్రబాబుకు సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్ -
రెవె'న్యూ' విధానాలతో భూ హక్కు
సాహసోపేత నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రెవిన్యూ సంస్కరణలు, కొత్త కార్యక్రమాలతో ఇటు ప్రజలు, అటు ప్రభుత్వ ఆదాయం గణనీయంగా పెరుగుతోంది. ప్రధానంగా భూముల విలువ అనూహ్యంగా పెరిగిపోవడంతో పేద రైతుల తల రాత మారిపోతోంది. ఎందుకూ పనికి రావనుకున్న భూములకు సైతం మంచి ధరలు కళ్లెదుటే కనిపిస్తుండటంతో అసైన్డ్ రైతుల పంట పండింది. ‘కొనుగోళ్లు – అమ్మకాలు – రిజిస్ట్రేషన్లు’ చక్రం ద్వారా లక్షల కోట్ల రూపాయల లావాదేవీలు ఇకపై మరింతగా ఊపందుకోనున్నాయి. తద్వారా రాష్ట్రంలో సంపద సృష్టి ఏమేరకు జరిగిందన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వీటన్నింటికీ తోడు ఇన్నాళ్లూ అనుభవంలో ఉన్నప్పటికీ రికార్డు పరంగా హక్కు లేని భూమికి ఇప్పుడు ‘ఇది నా భూమి’ అని సంతృప్తిగా చెప్పుకునే పరిస్థితిని రైతులకు కలిగించింది. సాక్షి, అమరావతి : వివాదాలు, సమస్యలు, ఎడతెగని జాప్యంతో కునారిల్లిన రెవెన్యూ శాఖను వైఎస్ జగన్ ప్రభుత్వం నాలుగేళ్లలో సమూలంగా మార్చేసింది. ఆ వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన ప్రతి సమస్యను పరిష్కరించేందుకు మార్గం చూపింది. సర్టిఫికెట్లు పొందడాన్ని సులభతరం చేయడం దగ్గర నుంచి కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన నిషేధిత భూముల చిక్కు ముడులు విప్పడం, సాహసోపేతమైన రీతిలో అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా లక్షలాది రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపింది. భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తొలిసారి భూముల రీ సర్వేను చేపట్టి విజయవంతంగా నిర్వహిస్తోంది. రాష్ట్ర విభజన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని ప్రాంతాల అభిప్రాయాలు, సంప్రదాయాలను గౌరవిస్తూ పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలు ఏర్పాటు చేసి రాష్ట్రానికి ఒక కొత్త స్వరూపాన్ని ఇచ్చింది. మొత్తంగా నాలుగేళ్లలో రెవెన్యూ శాఖలో చోటుచేసుకున్న మార్పులు ఇలా ఉన్నాయి. మహా యజ్ఞంలా భూముల రీ సర్వే ► అస్తవ్యస్థంగా మారిన భూముల వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సాహసోపేతంగా భూముల రీ సర్వే చేపట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం సత్ఫలితాలు సాధిస్తోంది. బ్రిటీష్ కాలం నాటి భూముల రికార్డుల స్థానంలో ఆధునిక డిజిటల్ భూ రికార్డులను అందుబాటులోకి తీసుకువస్తోంది. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటి వరకు జరగని విధంగా మొత్తం భూ విస్తీర్ణాన్ని కొలిచే బృహత్తర కార్యక్రమం ఇది. ఇందుకోసం ఏకంగా 14,630 మంది సర్వేయర్లను నియమించడం ఒక రికార్డు. ► రికార్డుల ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా భూ యజమానులకు స్పష్టమైన హక్కు కల్పించడం, అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా భూముల హద్దులను గుర్తించి.. ఆ భూమికి రక్షణ కల్పించడమే ధ్యేయంగా రీ సర్వే అత్యంత ఆధునిక రీతిలో సాగుతోంది. అత్యంత సంక్లిష్టమైన ఈ సర్వే తొలి దశలో 2 వేల గ్రామాల్లో అన్ని దశల్లోనూ పూర్తి కాగా, మరో 2 వేల గ్రామాల్లో త్వరలో పూర్తవనుంది. ప్రతి మూడు నెలలకు 2 వేల గ్రామాల చొప్పున సర్వే పూర్తికానుంది. ► సర్వే పూర్తయిన గ్రామాల్లో ఇప్పటి వరకు 4.80 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. 16.55 లక్షల మంది రైతులకు భూ హక్కు పత్రాలు పంపిణీ చేశారు. 8.70 లక్షల భూ కమతాలకు సంబంధించి ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు తయారయ్యాయి. రైతులకు శ్రమ లేకుండా, వారి డబ్బు ఖర్చు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఎంతో క్లిష్టమైన ఈ పనుల్ని పూర్తి చేసింది. ► ఆయా గ్రామాల్లోని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు సైతం అందుబాటులోకి వచ్చాయి. తొలిసారి భూముల హద్దులను నిర్ధారించి, భూ రక్ష సర్వే రాళ్లను రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో పాతుతున్నారు. గ్రామాలు, మున్సిపాల్టీల్లోని భూములను కూడా తొలిసారి సర్వే చేసి, ఇళ్ల యజమానులకు ఓనర్షిప్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రతి దళితవాడకు శ్మశాన వాటిక రాష్ట్రంలోని దళిత వాడలకు శ్మశాన వాటిక సమస్య లేకుండా చేసేందుకు ఆ దిశగా నడుం బిగించింది. శ్మశాన వాటికలు లేని దళిత వాడలను గుర్తించి, వెంటనే ఏర్పాటు చేస్తోంది. రాష్ట్రంలోని 1,700 గ్రామాల్లో 1050.08 ఎకరాల భూమిని శ్మశాన వాటికలకు కేటాయించింది. సుదీర్ఘకాలం తర్వాత భూ పంపిణీ రాష్ట్రంలో సుదీర్ఘ కాలం తర్వాత నిరుపేదలకు వ్యవసాయ భూములు పంపిణీ చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 23 జిల్లాల్లో 50 వేల ఎకరాలను అర్హులైన పేదలకు పంచనున్నారు. 46 వేల మందికి భూములివ్వడానికి ఎంపిక చేయగా, అందులో ఎక్కువ మంది దళితులే. వ్యవసాయ కూలీలుగా, ఇతర పనులు చేసుకుంటూ జీవించే వారిని ప్రభుత్వం రైతులుగా మార్చనుంది. రాష్ట్రంలో 2013 తర్వాత మళ్లీ భూ పంపిణీకి వైఎస్సార్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు ► అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడంతో లక్షలాది మంది దళిత, పేద రైతుల ఆర్థిక స్థితి ఒక్కసారిగా పెరిగిపోయింది. అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత అసైన్దారులు లేకపోతే వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు లభించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించింది. ► తమ భూములపై తమకు హక్కులు ఇవ్వాలని అసైన్డ్ రైతులు చాలా ఏళ్లుగా కోరుతున్నారు. దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ప్రభుత్వం అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత హక్కుదారులు వారికి అవసరమైనప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించింది. దీనివల్ల తమ భూములపై హక్కులు లేని 15,21,160 మంది పేద దళిత, ఇతర పేద వర్గాల రైతులకు సంబంధించిన 27,41,698 ఎకరాల భూమిపై యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. ‘ఇక ఇది నా భూమి’ అని ఆ రైతులు గర్వంగా చెప్పుకునే పరిస్థితి కల్పించింది. ► ఇన్ని లక్షల ఎకరాల లావాదేవీలు మార్కెట్లోకి రావడంతో ఆర్థిక వృద్ధి కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. విలువ లేని పేద రైతుల భూమికి విలువ పెంచడంతోపాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే నిర్ణయంగా దీన్ని నిపుణులు అభివర్ణిస్తున్నారు. కొత్త జిల్లాల కల సాకారం ► ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్ జగన్ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల వారీగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించింది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా, 51 రెవెన్యూ డివిజన్లను 77 డివిజన్లుగా పునర్వ్యవస్థీకరించింది. జిల్లా కేంద్రాలు, భౌగోళిక, సామాజిక, ఆర్థిక, చారిత్రక, సాంస్కృతిక అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని విభజన పూర్తి చేసింది. ► పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని 25 జిల్లాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ, గిరిజన ప్రాంతం విస్తృతి దృష్ట్యా అరకు పార్లమెంట్‌ను రెండు జిల్లాలుగా ఏర్పాటు చేసింది. పరిపాలనా వికేంద్రీకరణ, భౌగోళిక అనుకూలతలతోపాటు ప్రజల మనోభావాలకు ప్రాధాన్యత ఇచ్చింది. ► ప్రతి జిల్లాకు అక్కడి పరిస్థితులను బట్టి పేరు పెట్టి, ఆయా ప్రాంతాల ప్రాధాన్యాన్ని మరింత పెంచింది. గత టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ను విస్మరిస్తే.. ఆయన జన్మించిన కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం ద్వారా వైఎస్ జగన్ ప్రభుత్వం ఆయన గౌరవాన్ని నిలబెట్టింది. 1.68 లక్షల సర్వీసు ఈనాం భూములకు విముక్తి గ్రామాల్లో కుల వృత్తుల వారికి ఇచ్చిన ఈనాం భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని నిర్ణయించారు. 1,68,604 ఎకరాల ఈనాం భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించి యాజమాన్య హక్కులు కల్పిస్తున్నారు. లంక భూములకు డి పట్టాలు అనేక సంవత్సరాలుగా అపరిష్కృత సమస్యగా ఉన్న లంక భూములకు డీకేటీ పట్టాలిస్తున్నారు. 8 జిల్లాల్లో ఉన్న కృష్ణా, గోదావరి లంకల్లోని 9,062 ఎకరాలకు సంబంధించిన 19,176 మంది రైతులకు పట్టాలు దక్కనున్నాయి. మూడు కేటగిరీల్లో లంక భూములను సాగు చేసుకుంటున్న రైతులు తమకు పట్టాలు ఇవ్వాలని కోరుతుండడంతో వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సి కేటగిరీలోని కొన్ని భూములకు ఐదేళ్ల లీజుకు ఇవ్వనుంది. చుక్కల భూముల సమస్యకు పరిష్కారం ► అత్యంత వివాదాస్పదమై ఏళ్ల తరబడి లక్షలాది మంది రైతుల కుటుంబాల్లో చీకట్లు నింపిన చుక్కల భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం సునాయాసంగా పరిష్కరించింది. 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22 ఏ (1) ఇ) నుంచి ఒకేసారి తొలగించి చరిత్ర సృష్టించింది. ► చుక్కల భూములుగా ఆర్‌ఎస్‌ఆర్‌లో రికార్డు చేసిన భూములు ప్రభుత్వానికి చెందినవా, ప్రైవేటు పట్టాదారులవా అనే అంశాన్ని గత ప్రభుత్వం ఖరారు చేయకుండా నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. ఆ రికార్డులన్నింటినీ పరిశీలించి చుక్కల భూములకు విముక్తి కల్పించింది. ఈ నిర్ణయం వల్ల 1,07,134 మంది రైతులకు వారి భూములపై శాశ్వత హక్కులు లభించాయి. షరతులు గల పట్టా భూములపై తొలగిన ఆంక్షలు ► చుక్కల భూముల తరహాలోనే సమస్యాత్మకంగా తయారైన షరతులు గల పట్టా భూములకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. 33 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ఆ రైతులకు మేలు చేకూర్చింది. ► బ్రిటీష్ హయాం నుంచి రైతుల చేతుల్లో ఉన్న భూములను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 22ఏ కేటగిరీలో పెట్టగా, అలా పెట్టడం అన్యాయమని భావించి నిబంధనల ప్రకారమే వాటిని ఆ జాబితా నుంచి ఈ ప్రభుత్వం తీసివేసింది. ► ఇలా ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసివేశారు. 2022 అక్టోబర్ 20న అవనిగడ్డలో బహిరంగ సభలో సీఎం వైఎస్ జగన్ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి కొందరికి పట్టాలిచ్చారు. అనాదీనం, ఖాళీ కాలమ్ భూముల సమస్యకు చెక్ అనాదీనం, ఖాళీ కాలమ్ భూములను చుక్కల భూముల చట్టం పరిధిలోకి తీసుకువచ్చి, వాటిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాలకు సంబంధించిన 35 నుంచి 40 వేల మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందారు. సాదాబైనామా కేసుల పరిష్కారం గతంలో భూముల లావాదేవీలను తెల్ల కాగితాల మీద రాసుకోవడం, నోటి మాటగా జరిగిన భూముల లావాదేవీల (సాదాబైనామా విధానం) సమస్యకు పరిష్కారం చూపింది. ఒక నిర్ధిష్ట విధానాన్ని రూపొందించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించింది. మ్యుటేషన్లలో పారదర్శకత ► మ్యుటేషన్ల పేరుతో జరిగే అక్రమాలకు ముగింపు పలికేలా ప్రభుత్వం అనేక మార్పులు చేపట్టింది. ఇష్టానుసారం మ్యుటేషన్లు చేయడాన్ని నిలిపివేసి, పట్టాదారుకు నోటీసు ఇచ్చి, విచారణ జరిగిన తర్వాతే రెవెన్యూ రికార్డులో మార్పు జరిగేలా సాఫ్ట్‌వేర్‌ను మార్చారు. దీంతో కరెక్షన్ పేరుతో జరిగే మ్యుటేషన్లు నిలిచిపోయాయి. ► మ్యుటేషన్లు తిరస్కరించే అధికారాన్ని తహశీల్దార్లకు తీసివేసి ఆర్డీఓలకు అప్పగించడంతో ఇబ్బందులు తగ్గిపోయాయి. రిజిస్ట్రేషన్‌కు ముందే సర్వే నంబర్ సబ్ డివిజన్ చేసుకునే విధానాన్ని ప్రవేశ పెట్టడంతో డబుల్ రిజిస్ట్రేషన్లు తగ్గాయి. రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో ఆటో మ్యుటేషన్ విధానాన్ని తీసుకువస్తున్నారు. ఇప్పటికే పలుచోట్ల ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. సర్టిఫికెట్ల జారీ సులభతరం ► ప్రజలకు అవసరమైన ముఖ్యమైన సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను వైఎస్ జగన్ ప్రభుత్వం సులభతరం చేసింది. సర్టిఫికెట్లు జారీ చేయడానికి దరఖాస్తులు తీసుకునే గ్రామ, వార్డు సచివాలయం, మీసేవా కేంద్రాలు, ఆన్లైన్ వెబ్ అప్లికేషన్, కాల్ సెంటర్ వంటి వ్యవస్థలన్నింటికీ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చి వాటి ప్రకారమే పని చేయిస్తోంది. ► హౌస్ హోల్డ్ డేటా బేస్‌లో ఉన్న కుటుంబానికి వెంటనే ఫ్యామిలి మెంబర్ సర్టిఫికెట్ ఇవ్వడం, ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ గతంలో జారీ అయి ఉంటే ప్రస్తుత తహశీల్దార్ డిజిటల్ సంతకం, ప్రస్తుత తేదీతో మళ్లీ వెంటనే ఇవ్వడం లాంటి అనేక మార్పులు తీసుకువచ్చి అమలు చేస్తోంది. ఆస్తిని సంపదగా మార్చే ప్రక్రియ ముమ్మరం భూములకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలు ఏదైతే జరగాలని చెబుతున్నారో.. అలాంటి మార్పులన్నీ ఇప్పుడు ఏపీలో జరుగుతున్నాయి. ఎక్కడైనా సరే ఆస్తిని సంపదగా మార్చుకున్న దేశాలు అభివృద్ధి చెందుతాయి. ఆస్తి సంపదగా మారాలంటే అడ్డంకులను ప్రభుత్వమే తొలగించాలి. ఆ పని ఏపీ ప్రభుత్వం చేస్తోంది. భూ హక్కులకు భద్రత కల్పించడం, సరిహద్దుల స్పష్టత, అమ్మకాలు–కొనుగోళ్లను సులభం చేయడం, ఆంక్షలను తొలగించడం, మంచి భూ పరిపాలన యంత్రాంగాన్ని తయారు చేయడం ప్రధానమైనవి. ఏపీ ప్రభుత్వం ఈ పనులన్నీ చేస్తోంది. అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తేయడం, చుక్కల భూములు, అనా«దీనం భూములపైనా ఆంక్షలు తొలగించడం ఇందులో భాగమే. రిజిస్ట్రేషన్ ప్రక్రియ గ్రామ స్థాయికి రావడం పెద్ద మార్పు. ఇలా ఆస్తిని సంపదగా మార్చే ప్రక్రియలో ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేసింది. తద్వారా వేల కోట్ల సంపద ఆవిష్కృతమైంది. – ఎం.సునీల్‌కుమార్, భూ చట్టాల నిపుణుడు, నల్సార్ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ -
అసైన్డ్ భూముల యాజమాన్య హక్కులపై భారీ కసరత్తు
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భారీ కసరత్తు చేస్తోంది. అసైన్డ్ రైతులకు హక్కులిచ్చేందుకు అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించిన ప్రభుత్వం దాన్ని అమలు చేసే దిశగా వేగంగా అడుగులేస్తోంది. అందులో భాగంగా జిల్లాల్లో అసైన్డ్ భూముల లెక్కలు తేల్చేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు చురుగ్గా వెరిఫికేషన్ జరుగుతోంది. ఈ ఏడాది జూలై 31 నాటికి అసైన్ చేసి 20 ఏళ్లు పూర్తయిన భూముల వివరాలను వీఆర్వోలు తనిఖీ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాథమికంగా 27.41 లక్షల ఎకరాలపై హక్కులివ్వాలని ఇప్పటికే నిర్ణయించగా క్షేత్ర స్థాయిలో ఆ భూములను పరిశీలిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో నిశిత పరిశీలన.. ప్రతి రెవెన్యూ గ్రామంలో అసైన్డ్ భూములు అసైన్‌దారుల చేతుల్లో ఉన్నాయా, లేదా అనే విషయాన్ని వీఆర్వోలు నిశితంగా పరిశీలిస్తున్నారు. ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన పట్టాను పరిశీలించి ఆ పట్టాదారు ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యక్తా లేక అతని వారసుడా? అనే విషయాన్ని నమోదు చేస్తున్నారు. సంబంధిత భూమి వారి ఆధీనంలోనే ఉందా? రెవెన్యూ రికార్డుల ప్రకారం.. ఆ భూమి లంక భూమా? లేక నీటి వనరులకు సంబంధించిన భూమా? ఆ భూమి అతనికి ప్రభుత్వం ఎప్పుడు అసైన్ చేసింది? వంటి వివరాలను సేకరిస్తున్నారు. అసైన్డ్ భూములకు సంబంధించి డీకేటీ రిజిస్టర్లు, 1బీ అడంగల్, 22ఎ జాబితా, ఇతర రెవెన్యూ రికార్డులు చూసి వాటికి తగ్గట్టు క్షేత్ర స్థాయి పరిస్థితి ఉందా లేదా?, వాస్తవ పరిస్థితి ఏమిటనే విషయాలను నమోదు చేస్తున్నారు. 4 వేల గ్రామాల్లో పూర్తి.. ఇప్పటివరకు 4 వేల గ్రామాల్లోని 8 లక్షల ఎకరాల్లో వీఆర్వోలు వెరిఫికేషన్ పూర్తి చేశారు. తహశీల్దార్లు 2,600 గ్రామాల్లో తనిఖీలు పూర్తి చేయగా, ఆర్డీవోలు వెయ్యికి పైగా గ్రామాల్లో, జేసీలు 150కిపైగా గ్రామాల్లో వెరిఫికేషన్ ముగించారు. దీంతో తనిఖీలు పూర్తయిన గ్రామాల్లో తహశీల్దార్లు అసైన్డ్ భూముల జాబితాలను తయారు చేస్తున్నారు. వీఆర్వోలు, తహశీల్దార్ల స్థాయిలో జరిగిన వెరిఫికేషన్‌ను ఆర్డీవోలు, సబ్ కలెక్టర్లు పరిశీలిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి వెరిఫికేషన్‌ను పూర్తి చేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో అసైన్డ్ భూముల జాబితాలను తయారు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఇవన్నీ తయారైన తర్వాత వచ్చే నెలలో పూర్తి స్థాయిలో తనిఖీ చేసి జిల్లా కలెక్టర్లకు పంపనున్నారు. వారి నుంచి జిల్లా రిజిస్ట్రార్లకు 22(ఎ) నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాల్సిన భూముల జాబితాను పంపడానికి కసరత్తు జరుగుతోంది. -
అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో సీఐడీ కేసు కొట్టేయాలంటూ నారాయణ పిటిషన్
-
October 1st, 2023: చంద్రబాబు కేసు అప్డేట్స్
Updates.. 7:45 PM పవన్ వారాహి యాత్రకు అంబటి కౌంటర్ 1+1 = 2 గణితంలో... కొన్నిసార్లు రాజకీయాలలో 1+1 = 0 అవుతుందని ఫ్లాప్ అయిన అవనిగడ్డ "వరాహగళం" నిరూపించింది ! @PawanKalyan@JaiTDP @naralokesh @JanaSenaParty — Ambati Rambabu (@AmbatiRambabu) October 1, 2023 వారాహి యాత్ర +యువగళం = వరాహగళం @naralokesh @PawanKalyan — Ambati Rambabu (@AmbatiRambabu) October 1, 2023 7:30 PM లోకేష్, అచ్చెన్నాయుడు, యనమలకు విజయసాయిరెడ్డి కౌంటర్ ప్రజాధనం దోచుకుని అడ్డంగా దొరికిన చంద్రబాబు గారు అరెస్టయితే, సామాన్యులను డబ్బుకు ప్రలోభపెట్టి గుండు గీయించడం ఇంకా పెద్ద నేరం అవుతుంది. జుట్టు అనేది ఓ వ్యక్తి ఆత్మగౌరవానికి సంబంధించినది. అంతగా నిరసన తెలపాలనుకుంటే లోకేశ్, అచ్చెన్న, యనమలలాంటి ‘ఉద్ధండులు’ కేశ సమర్పణ చేసి యజమానిపై… — Vijayasai Reddy V (@VSReddy_MP) October 1, 2023 5:40 PM ఆశలన్నీ అక్టోబర్ 3 మీదే.. ►అక్టోబర్ మూడో తేదీపై టీడీపీ కోటీ ఆశలు ►సుప్రీంకోర్టులో కేసు నెగ్గేందుకు దారులపై సీనియర్ నేతలతో సమాలోచనలు ► సాంకేతిక కారణాలు తప్ప బలమైన గ్రౌండ్ చంద్రబాబుకు ఈ కేసులో లేవంటున్న లాయర్లు ►గవర్నర్ అనుమతి తీసుకోలేదని బలంగా వాదించాలని సూచన 5:30 PM రంగంలోకి బీజేపీలోని టీడీపీ లీడర్లు.. ►జైలులో ఉన్న చంద్రబాబు కోసం రంగంలోకి బీజేపీలోని టీడీపీ లీడర్లు ►చంద్రబాబును రక్షించేందుకు ఏం చేయాలో సమాలోచనలు ►భువనేశ్వరి, బ్రాహ్మణిలను కలిసిన సీఎం రమేష్ ►రాజమండ్రిలో చంద్రబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎం రమేష్ ►బీజేపీ పెద్దలతో ఎలాగైనా అపాయింట్మెంట్ ఇప్పించాలని సూచన ►ఢిల్లీలో ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ఆదేశాలు 2:30 PM శంషాబాద్‌లో టీటీడీపీ శ్రేణుల ఓవరాక్షన్.. ►శంషాబాద్ ఎయిర్ పోర్టులో టీటీడీపీ శ్రేణుల ఓవర్‌యాక్షన్ ►చంద్రబాబు అరెస్టును వ్యతిరేకిస్తూ ప్రధాని వచ్చే సమయంలో ఎయిర్ పోర్టులో నిరసన ►ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ప్రధాని మోదీ ►చంద్రబాబును ప్రధాని మోదీ కాపాడాలంటూ బ్యానర్ ప్రదర్శించిన మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన ►చంద్రబాబు అరెస్టుపై ప్రధాని స్పందించాలని విజ్ఞప్తి 12:50PM ప్రగల్భాలు పలికేవాళ్లంతా ఆత్మావలోకనం చేసుకోండి: పేర్ని నాని ►చంద్రబాబు వ్యవహారం చూస్తుంటే ఎన్ని కన్నీళ్ల ఉసురు ఇదీ.. నీడల్లే వెంటాడుతోందీ.. అనే పాట గుర్తొస్తోంది ►కాపులకు రిజర్వేషన్ అమలు చేస్తానని ఓట్లేయించుకుని తర్వాత మోసం చేశారు ►ముద్రగడ పద్మనాభం పిలుపుతో అప్పట్లో ఉద్యమం చేశారు ►కానీ నిన్నటి చంద్రబాబు ఉద్యమంలో అందరూ నవ్వుకుంటూ విజిల్స్ వేశారు ►అంటే చంద్రబాబు జైలుకు పోవటంపై ఆ పార్టీ వారికి కించిత్ కూడా బాధ లేదు ►చంద్రబాబు మీద అక్రమ కేసులు పెడితే కోర్టులు ఎందుకు జైలుకు పంపుతాయి? ►ప్రజాసొమ్ము కైంకర్యం చేయకపోతే కోర్టులు ఎందుకు వదిలేయలేదు? ►లంచాలు తిని కంచాలు మోగించటం చూస్తుంటే.. తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్టుంది ►టీడీపీకి కోటిమంది సభ్యత్వం ఉన్నట్టు చెప్పుకునేవారు ►మరి నిన్న ఎంతమంది గంట కొట్టారు? ►అంటే వారందరు కూడా చంద్రబాబు అవినీతి చేసినట్టు అనుకుంటున్నారు ►ఇప్పటికైనా ప్రగల్భాలు పలికేవాళ్లంతా ఆత్మావలోకనం చేసుకోవాలి ►ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తే జైల్లో వేస్తాం అని అప్పట్లో చంద్రబాబు అన్నారు 12:24PM చంద్రబాబు లాయర్ సిద్ధార్ధ లూథ్రా ట్వీట్ నిర్వేదం ►ఇప్పటి వరకూ బాబు కేసులో లూథ్రాకు దొరకని బలమైన వాదం ►ఎంత సేపు సెక్షన్ 17a తప్ప మరో వాదన లేదు ►గవర్నర్ అనుమతి అడగలేదని అంటున్నారు, కాని తప్పు చేయలేదని లూథ్రా చెప్పలేకపోతున్నారు ►జడ్జిలు త్వరగా తీర్పులు ఇవ్వడం ముఖ్యమన్న లూథ్రా ►ఓ కేసు విషయాన్ని ప్రస్తావించిన సిద్ధార్ధ లూథ్రా Our Indian SC has in its judgement in Balaji Baliram Mupade [29.10.2020] written of the need for judicial discipline requires promptness in delivery of judgements https://t.co/etrm1sXw7s — Sidharth Luthra (@Luthra_Sidharth) October 1, 2023 11:50AM ►చంద్రబాబుకు పవన్ కొమ్ముకాయడం విడ్డూరం: ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ►చంద్రబాబు నాయుడుకి జైల్లో దోమలు కుడుతున్నాయి అనడం హాస్యాస్పదం ►ప్రజల సొమ్ము 375 కోట్లు స్వయానా చంద్రబాబు నాయుడు ఖాతాల్లోకి స్కిల్ డెవలప్మెంట్ పేరుతో వెళ్ళాయన్న వాస్తవం సిఐడి స్పష్టం చేసింది ►దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ అమ్మను అవమానించిన ,అన్నని అవమానపాలు చేసిన చంద్రబాబు కోమ్ము కాయటం విడ్డూరం ►చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన రోజు ఎన్టీఆర్ దంపతులు స్వర్గంలో ఆనంద భాష్పాలు రాల్చుంటారు. 10:45AM జైలు జీవితానికి అలవాటు పడిన చంద్రబాబు ►ఉదయం న్యూస్ పేపర్ లతో కాలక్షేపము ►5 చానెల్ తో regular గా tv చూస్తున్న బాబు ►రాజమండ్రి జైల్లో 22వ రోజు రిమాండ్ ఖైదీగా కొనసాగుతున్న చంద్రబాబు ►చంద్రబాబుకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్న జైలు వర్గాలు ►ఎప్పటికప్పుడు ఇంటి నుంచి బోజనము ►వేడి నీళ్లు స్నానం ►ప్రతీ వారం ములాఖత్ 10:31AM సానుభూతి కోసం టిడిపి అష్ట కష్టాలు ►ఏపీ వ్యాప్తంగా నారా భువనేశ్వరి బస్సు యాత్ర? ►ఈ నెల మొదటి వారంలో ప్రారంభిస్తారని సమాచారం ►అన్ని జిల్లాలను కవర్ చేసేలా భువనేశ్వరి బస్సు యాత్ర ►టీడీపీ శ్రేణుల్లో మనోధైర్యం నింపేలా భువనేశ్వరి యాత్ర 9:24AM విద్యార్థుల తల్లిదండ్రుల రక్తం పీల్చే దుర్మార్గుడు నారాయణ: ఎమ్మెల్యే అనిల్ ►సీఐడీ తనను కూడా అరెస్ట్ చేయబోతోందని మాజీ మంత్రి నారాయణ కి తెలుసు. ►చంద్రబాబు, నారాయణ విచారణకు సహజరించకుడదని మాట్లాడుకునేందుకు జైలులో బాబుకు కలిసారు ►స్టూడెంట్స్ తల్లిదండ్రుల రక్తం పీల్చుకునే దుర్మార్గుడు నారాయణ ►రూ. 800 కోట్ల విలువ చేసే పేదల భూములను కొట్టేసిన నువ్వు సత్య హరిచంద్రుడి వా..? ►నారాయణ, చంద్రబాబు చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు.. ►టిడిపి నేతలు గంటలు కొట్టడం దేవుడి స్క్రిప్ట్.. ముద్రగడ కి చేసిన అన్యాయం గుర్తు వచ్చింది ►చంద్రబాబు చేసిన ద్రోహం టిడిపి నేతలకు కూడా కనిపిస్తుంది ►రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాత్రమే మనస్ఫూర్తిగా బాధపడుతూ ఉన్నారు. ►ముద్రగడను , ఆయన కుటుంబ సభ్యులను చిత్ర హింసలు పెట్టి. ఇబ్బందులు పెట్టిన విషయం టిడిపి నేతలకు గుర్తు లేదా..? ►లోకేష్ ఒక పులికేశి.. ఢిల్లీలో లాయర్స్ తో మాట్లాడుతూ ఉన్నాడని టిడిపి నేతలు బిల్డప్ ఇస్తున్నారు ►సీఐడీ అధికారులకు దొరక్కుండా లోకేష్ దొంగలగా తప్పించుకుని తిరుగుతూ ఉంటే.. నిన్న అధికారులు పట్టుకుని నోటీస్ లు ఇచ్చారు.. 9.05AM పవన్ కళ్యాణ్ వారాహి యాత్రపై నారా లోకేశ్ ట్వీట్ ►4వ విడత వారాహి యాత్ర సక్సెస్ కావాలి.. జనసేనకు జైకొట్టాలి ►అవనిగడ్డలో జరగబోయే వారాహి యాత్ర బహిరంగ సభ విజయవంతం చేసేందుకు జనసేనతో కలిసి నడవాలని టీడీపీ శ్రేణులను కోరుతున్నా రేపటి నుంచి ప్రారంభం అయ్యే జనసేన అధ్యక్షుడు @PawanKalyan గారి నాలుగో విడత వారాహి యాత్ర విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను. అవనిగడ్డలో జరగబోయే వారాహి బహిరంగ సభకి సైకో జగన్ సర్కార్ అడ్డంకులు కల్పించే అవకాశాలు ఉన్నాయి. వారాహి యాత్ర విజయవంతం చేసేందుకు తెలుగుదేశం శ్రేణులు జనసేనతో… — Lokesh Nara (@naralokesh) September 30, 2023 8:29AM తిరుమలలో టీడీపీ పచ్చ రాజకీయాలు. ►ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో టీడీపీ కార్యకర్తల ఓవరాక్షన్ ►స్కామ్ లో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతు అంటూ నిరసనలు ►టీడీపీ జెండాలతో శ్రీవారి ఆలయం వద్ద రాజకీయం ►తిరుమలలో స్టీల్ గ్లాసులతో చప్పుడు చేస్తూ వీడియో రికార్డింగ్ ►సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసేందుకు ప్రయత్నం ►టీడీపీ తీరుపై మండిపడుతున్న హైందవ సంఘాలు, భక్తులు ►టీడీపీకి గుణపాఠం చెప్తామంటున్న శ్రీవారి భక్తులు 7:50AM చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై 3న సుప్రీంకోర్టులో విచారణ ►స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం కేసులో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు సుప్రీం కోర్టులో క్రిమినల్ ఎస్ఎల్పీ దాఖలు ►3వ తేదీన విచారణ చేపట్టనున్న జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం ►ఈ ధర్మాసనం ముందు ఆఖరి ఐటెం నంబర్ 63గా రిజిస్ట్రీ వెబ్సైట్లో పొందుపరిచారు ►గత విచారణ సందర్భంగా చంద్రబాబు పిటిషన్ విచారణకు జస్టిస్ ఎస్వీఎన్ భట్టి నిరాకరించిన విషయం విదితమే. ►దీంతో ఈ పిటిషన్ జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం వద్దకు విచారణకు వచ్చింది. 7:30AM 4న ఓటుకు కోట్లు కేసు విచారణ ►తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసును ఈ నెల 4న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు. ►తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ను ప్రలోభాలకు గురిచేసిన విషయం విదితమే. ►ఈ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయపోరాటం ►ఇందులో భాగంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు ►ఈ పిటిషన్‌ను 4వ తేదీ నవిచారణ చేపట్టనున్న జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బాబు మాజీ పీఎస్ ‘పెండ్యాల’ సస్పెన్షన్ ►మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ పీఎస్ పెండ్యాల శ్రీనివాసరావుపై సస్పెన్షన్ వేటు. ►ఈయన ప్రస్తుతం ప్రణాళికా శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ►స్కిల్ కుంభకోణం కేసుతో పాటు ఐటీ నోటీసుల్లో పెండ్యాల శ్రీనివాసరావు పేరు ఉంది. ►విచారణ నిమిత్తం సీఐడీ గతంలో ఆయనకు నోటీసులు కూడా జారీ ►అయితే, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అమెరికాకు పారిపోయిన పెండ్యాల. ప్రభుత్వం అనుమతిలేకుండా అమెరికాకు వెళ్లడం సర్వీస్ రూల్స్‌ను అతిక్రమించడం కిందకు వస్తుంది. ►మరోవైపు.. శ్రీనివాసరావు శుక్రవారంలోగా రాష్ట్రానికి తిరిగి రావాల్సిందిగా నోటీసు పంపిన ప్రభుత్వం. ►అయితే, ఆయన రాకపోవడంతో సర్వీసు నిబంధనల మేరకు ఆయనను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 2న భువనేశ్వరి నిరాహారదీక్ష ►నంద్యాల: చంద్రబాబు అరెస్టుకు నిరసనగా అక్టోబర్ 2వ తేదీన ఆయన సతీమణి భువనేశ్వరి ఒక్క రోజు నిరాహారదీక్ష ►టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పష్టీకరణ 7:00AM అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు ► అసైన్డ్ భూములు హస్తగతం చేసుకునేందుకు వెచ్చించిన నల్లధనం గుట్టు రట్టు ►నారా , నారాయణ నల్లధనం నెట్వర్క్ బట్టబయలు ►అమరావతిలోని బడుగు, బలహీనవర్గాల అసైన్డ్ రైతులను బెదిరించి భూములు కొట్టేశారు ►ఎన్‌స్పైర నుంచి ఆర్కే హౌసింగ్‌కు నిధుల బదిలీ.. అక్కడి నుంచి బినామీలకు నగదు ►అసైన్డ్ రైతుల భూముల లూటీ ►తమ బినామీలకే భూసమీకరణ ప్యాకేజీ స్థలాలు దక్కేలా వ్యూహం ►అవినీతి నెట్‌వర్క్‌ను బట్టబయలు చేసిన సిట్ దర్యాప్తు ►పచ్చగద్దల జాబితాలో గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా, రావెల తదితరులు ►ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీవీ వియ్యంకుడు కూడా ►రూ.16 కోట్లతో.. రూ. 816 కోట్లు కొట్టేసిన నారాయణ 6:40AM అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు ♦నారా చంద్రబాబునాయుడు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) ♦ నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ రావెల కిశోర్ బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ తెనాలి శ్రావణ్ కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) ♦ గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) ♦ మండల ఎస్.ఎస్.కోటేశ్వరరావు (రియల్టర్) ♦ మండల రాజేంద్ర (రియల్టర్) ♦ కేవీపీ అంజనీ కుమార్ (రియల్టర్) ♦ దేవినేని రమేశ్ (రియల్టర్) ♦ బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్ (రియల్టర్) ♦ హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) ♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) ♦ దోనేపూడి దుర్గా ప్రసాద్ (రియల్టర్) 6:35AM నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు ♦ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్మెంట్ స్కామ్‌లో 41ఏ కింద నారా లోకేష్‌కు నోటీసులు ♦ఈ కేసులో ఏ14గా లోకేశ్ ♦ఢిల్లీలో ఎంపీ జయదేవ్ ఇంట్లో అందజేసిన అధికారులు ♦4వ తేదీన తాడేపల్లి కార్యాలయంలో హాజరు కావాలి ♦హెరిటేజ్ ఫుడ్స్ బ్యాంకు ఖాతా, భూలావాదేవీల బోర్డు మినిట్స్ తేవాలి ♦విచారణకు సహకరించాలి.. నిబంధనలు పాటించకుంటే అరెస్టు తప్పదు ♦నోటీసుల్లో పేర్కొన్న దర్యాప్తు అధికారులు -
అసైన్డ్ భూములు కొట్టేసేందుకు.. ‘నల్ల’మార్గం
సాక్షి, అమరావతి: అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు తీగ లాగితే నారా, నారాయణ నల్లధనం నెట్వర్క్ బట్టబయలైంది. అమరావతిలోని బడుగు, బలహీనవర్గాల అసైన్డ్ రైతులను బెదిరించి వారి భూములు కొల్లగొట్టడం కోసం నల్లధనం తరలించేందుకు చంద్రబాబు ముఠా పన్నిన పన్నాగం బయటపడింది. బంధువులు, బినామీలు, సన్నిహితులు, తమ ఉద్యోగుల పేరిట అసైన్డ్ భూములు హస్తగతం చేసుకునేందుకు వెచ్చించిన నల్లధనం గుట్టు రట్టయింది. అమరావతిలో అసైన్డ్ భూముల కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆ నల్లధనం నెట్‌వర్క్‌ను ఛేదించింది. అసైన్డ్ భూముల జాబితాలోని కేటగిరీ 1 నుంచి 4 వరకు ఉన్న 617.65 ఎకరాలను కొట్టేసేందుకు ఏర్పాటు చేసుకున్న ‘నల్ల’మార్గాన్ని ఆధారాలతోసహా బట్టబయలు చేసింది. బినామీల పేరిట అసైన్డ్ భూములు కొల్లగొట్టిన ముఠా జాబితా తవ్వుతుంటే.. చంద్రబాబు, లోకేశ్, నారాయణ, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా ఇలా టీడీపీ పెద్దల పేర్లు బయటపడుతున్నాయి. నల్లధనం కోసం కంపెనీ ఏర్పాటు నారాయణ విద్యా సంస్థలకు మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల జీతాల చెల్లింపు కోసమని ‘ఎన్‌స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. అసైన్డ్ భూములు కొల్లగొట్టడం కోసమే నారాయణ కుమార్తె సింధూర, అల్లుడు పునీత్ డైరెక్టర్లుగా ఎన్‌స్పైర కంపెనీని నెలకొల్పారు. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్‌స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపారు. ఇదే అవకాశంగా ఎన్‌స్పైరలోకి ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. ఎన్‌స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపడం గమనార్హం. ఒలంపస్ క్యాపిటల్ ఏషియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ. 400 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు చూపించారు. ఇక 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ. 613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు రికార్డుల్లో చూపారు. దీంతో రెండు విడతల్లో ఎన్‌స్పైర కంపెనీలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్‌స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. ఎన్‌స్పైర టు రామకృష్ణ హౌసింగ్ నారాయణ సమీప బంధువు కేవీపీ అంజని కుమార్ రంగంలోకి వచ్చారు. ఆయన మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను నల్లధనం తరలింపునకు మార్గంగా చేసుకున్నారు. అక్రమ నిధులను ఎన్‌స్పైర నుంచి రామకృష్ణ హౌసింగ్ కార్పొరేషన్ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. అప్పటికే నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, మరికొందరిని తమ బినామీలుగా ఎంపిక చేసుకున్నారు. రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాల నుంచి ఆ బినామీల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లోకి నిధులను మళ్లించారు. వారు ఆ నగదు డ్రా చేసుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను తీసుకుంటుందని బడుగు, బలహీనవర్గాల రైతులను అప్పటికే భయపెట్టారు. తద్వారా ఆ రైతుల అసైన్డ్ భూములను తమ బినామీలైన ఉద్యోగులు, ఇతరులకు అతి తక్కువకు విక్రయించేలా కథ నడిపించారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములు తమ బినామీల ద్వారా హస్తగతం చేసుకున్నారు. తర్వాత బినామీలే సీఆర్డీఏకు ఆ భూములను ఇచ్చినట్టు చూపించి వారికే భూసమీకరణ ప్యాకేజీ వచ్చేలా చేశారు. ఆ విధంగా 617.65 ఎకరాలకు గాను రూ. 3,737 కోట్ల విలువైన భూసమీకరణ ప్యాకేజీ స్థలాలను పొందారు. జీపీఏ, సేల్డీడ్ల ద్వారా హస్తగతం కేటగిరీ 1 నుంచి 4 వరకు 617.65 ఎకరాలకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న అసైన్డ్ రైతుల జాబితా, సీఆర్డీఏ రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లను పరిశీలిస్తే అక్రమాల బాగోతం బయటపడుతోంది. ఈ జాబితాలో చంద్రబాబు, నారాయణ, గంటా శ్రీనివాసరావు, వారి సన్నిహితులు, బంధువులు, బినామీలే బయటపడుతున్నారు. అమరావతి పరిధిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, నేలపాడు తదితర గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 617.65 ఎకరాల అసైన్డ్ భూములను జీపీఏ, సేల్ డీడ్లు ద్వారా హస్తగతం చేసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల నుంచి అసైన్డ్ భూములను బినామీల ద్వారా కొల్లగొట్టిన టీడీపీ పెద్దలు ♦ నారా చంద్రబాబునాయుడు (టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి) ♦ నారా లోకేశ్ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ పొంగూరు నారాయణ (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ గంటా శ్రీనివాసరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ దేవినేని ఉమామహేశ్వరరావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ ప్రత్తిపాటి పుల్లారావు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ రావెల కిశోర్ బాబు (టీడీపీ ప్రభుత్వంలో మంత్రి) ♦ తెనాలి శ్రావణ్ కుమార్ (టీడీపీ మాజీ ఎమ్మెల్యే) ♦ గుమ్మడి సురేశ్ (టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు వియ్యంకుడు) ♦ మండల ఎస్.ఎస్.కోటేశ్వరరావు (రియల్టర్) ♦ మండల రాజేంద్ర (రియల్టర్) ♦ కేవీపీ అంజనీ కుమార్ (రియల్టర్) ♦ దేవినేని రమేశ్ (రియల్టర్) ♦ బొబ్బ హరిశ్చంద్ర ప్రసాద్ (రియల్టర్) ♦ హరేంద్రనాథ్ చౌదరి (రియల్టర్) ♦ పొట్లూరి సాయిబాబు (సిటీ కేబుల్) ♦ దోనేపూడి దుర్గా ప్రసాద్ (రియల్టర్) రూ.16 కోట్లతో.. రూ. 816 కోట్లు కొట్టేసిన నారాయణ రాజధానిలో నారాయణ బంధువులు, బినామీల పేరిట 148 ఎకరాలు ఉన్నట్టుగా సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అందుకోసం నారాయణ రూ.16.50 కోట్లను అక్రమంగా తరలించారు. అందుకు ప్రతిగా 148 ఎకరాలను పొందారు. ఆ 148 ఎకరాలకు సీఆర్డీఏ భూసమీకరణ కింద ఇచ్చింది రూ.816 కోట్లు విలువైన స్థలాల ప్యాకేజీ. ఆ భూములకు పదేళ్లపాటు కౌలు కూడా పొందగలుగుతారు. బినామీ రైతులకు సీఆర్డీఏ ఇప్పటికే చెల్లించిన కౌలు మొత్తం రూ. 50 లక్షలు మళ్లీ రామకృష్ణ హౌసింగ్ బ్యాంకు ఖాతాలో జమ చేశారు. అక్కడ నుంచి ఆ మొత్తాన్ని మళ్లీ నారాయణ విద్యా సంస్థల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడం గమనార్హం. అంటే అసైన్డ్ భూములు దక్కించుకుంది నారాయణే అన్నది స్పష్టమైంది. అదే రీతిలో చంద్రబాబు, గంటా, ప్రత్తిపాటి, దేవినేని ఉమా, ఇతర టీడీపీ పెద్దలు, వారి బంధువులు బినామీల ద్వారా 617 ఎకరాల్లో ఎంత భారీ దోపిడీకి పాల్పడ్డారో స్పష్టమవుతుంది. -
పేదలను బెదిరించారు..‘అసైన్డ్’ కాజేశారు
(వడ్డాది శ్రీనివాస్/సాక్షి, అమరావతి): టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి ముసుగులో చంద్రబాబు బరితెగించి పాల్పడిన భారీ భూదోపిడీ బండారం బట్టబయలైంది. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు కేటాయించిన అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు పక్కాగా అమలుచేసిన కుతంత్రం ఆధారాలతో సహా నిగ్గుతేలింది. ఏకంగా రూ.3,737.30 కోట్ల విలువైన 617.70 ఎకరాల అసైన్డ్ భూదోపిడీ విస్మయపరుస్తోంది. ఈ భూములకు పరిహారం ఇవ్వబోమని అప్పట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను బెదిరించి వారి భూములను చంద్రబాబు, నారాయణ, తదితర టీడీపీపెద్దలు 814 మంది బినామీల ముసుగులో హస్తగతం చేసుకుని దేశ చరిత్రలోనే అత్యంత భారీ అసైన్డ్ భూకుంభకోణానికి తెగబడ్డారు. అనంతరం.. అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించి వారి కుతంత్రాన్ని చాటుకున్నారు. ఈ భూములను అన్యాక్రాంతం చేయడానికిగానీ దాన్ని అధికారికంగా గుర్తించడానికిగానీ వీల్లేదన్న ఉన్నతాధికారుల లిఖితపూర్వక అభ్యంతరాలను వారు బేఖాతరు చేశారు. పైగా.. రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను గల్లంతు చేసేసి.. అసలు 1954 నుంచి 2014 వరకు అమరావతి పరిధిలో పేదలకు భూ పంపిణీనే చేయలేదని ఏకంగా న్యాయస్థానాన్ని మోసంచేసిన తీరు వ్యవస్థలను మోసం చేయడంలో చంద్రబాబు తెగింపునకు అద్దంపడుతోంది. కానీ, ఇప్పుడు వీరి పాపం పండింది.. కథ అడ్డం తిరిగింది. చంద్రబాబు, నారాయణ, లోకేశ్‌ల కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో సాగిన ఈ అసైన్డ్ భూదోపిడీ ఆధారాలతో సహా బట్టబయలైంది. 1954 తరువాత పంపిణీ చేసిన అసైన్డ్ భూముల పంపిణీ రికార్డులు కూడా వెలుగులోకి రావడంతో పచ్చముఠా పన్నాగం బెడిసికొట్టినట్లయింది. అందుకు సంబంధించిన కీలక ఆధారాలు ‘సాక్షి’ సేకరించింది. పచ్చ గద్దల అసైన్డ్ భూదోపిడీపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనాల్లో మొదటి భాగం ఇది.. జీఓ–1తో భయపెట్టి.. జీఓ–41తో దోపిడీ 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజధాని పేరిట భారీ భూదోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారు. అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు దేశ చరిత్రలో ఏ పాలకుడు కూడా పాల్పడని దారుణానికి తెగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను బెదిరించి మరీ వారి అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నారు. అందుకోసం పక్కా పన్నాగంతో రాజధాని కోసం భూసమీకరణ ప్యాకేజీని నిర్ణయిస్తూ 2015, జనవరి 1న జారీచేసిన జీఓ నంబరు 1ను జారీచేశారు. ఆ జీఓలో అమరావతిలోని ప్రైవేటు భూములకు మాత్రమే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అసైన్డ్ భూములకు ప్రకటించలేదు. అనంతరం.. చంద్రబాబు, నారాయణ తమ బినామీలు, ఏజెంట్లను అమరావతి గ్రామాల్లోకి పంపి ప్రభుత్వం అసైన్డ్ భూములను ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ఉచితంగా తీసుకుంటుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను భయపెట్టారు. కాబట్టి తమకు ఆ భూములు విక్రయిస్తే ఎంతోకొంతైనా డబ్బులు వస్తాయని మభ్యపెట్టారు. అందుకోసం ఆర్కే హౌసింగ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థతోపాటు తమ బినామీలైన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వారి ఏజెంట్లను గ్రామాల్లోకి పంపించి దుష్ప్రచారం చేయించారు. దీంతో తీవ్ర ఆందోళన చెందిన పేద రైతులు అత్యంత తక్కువ ధరకు అంటే ఎకరాకు కేవలం రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకే చంద్రబాబు, నారాయణ, ఇతర టీడీపీ పెద్దల బినామీలకు సేల్డీడ్ల ద్వారా తమ అసైన్డ్ భూములను విక్రయించారు. అలా.. ఆ ముఠా ఏడాదిపాటు తమ పన్నాగాన్ని పక్కగా అమలుచేసి అసైన్డ్ భూములన్నింటినీ తమ బినామీల పరం చేశారు. ఆ తరువాత చంద్రబాబు అసలు కుట్రను తెరపైకి తెచ్చారు. అసైన్డ్ భూములకు కూడా ఆరు కేటగిరీల కింద విభజించి 2016, ఫిబ్రవరి 17న జీఓ నంబరు 41 ద్వారా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. అంటే.. అప్పటికే అసైన్డ్ భూములు చంద్రబాబు, నారాయణ బినామీల పేరిట ఉండటంతో వారికే భూసమీకరణ ప్యాకేజీ దక్కేలా చూసుకున్నారు. ఎంతగా అంటే.. ఎకరాలోపు ఉన్న భూమికి కూడా ఎకరా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించారు. ఎందుకంటే అసైన్డ్ భూములను చిన్నచిన్న బిట్లుగానే తమ బినామీల పేరిట పచ్చ ముఠా చేజిక్కిచ్చుకుంది. తద్వారా ఎక్కువ ప్యాకేజీ వచ్చేలా కథ నడిపింది. ఆ మేరకు చంద్రబాబు, నారాయణ, టీడీపీ పెద్దల బినామీలకు అసైన్డ్ భూముల సమీకరణ ప్యాకేజీని సీఆర్డీఏ వర్తింపజేసింది. అలా చంద్రబాబు చట్ట ప్రకారం ఆ ప్యాకేజీకి అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులను దారుణంగా మోసగించారు. ఉన్నతాధికారుల అభ్యంతరాలు బేఖాతరు.. నిజానికి.. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడం చట్ట విరుద్ధం. అలా చట్ట విరుద్ధంగా కొనుగోలు చేసిన వారికి భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడానికే వీల్లేదు. చట్ట ప్రకారం దేశంలో 1954కు ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతులకు పంపిణీ చేసిన భూములను ఇతరులకు విక్రయించుకునే అవకాశముంది. 1954 తరువాత పంపిణీ చేసిన అసైన్డ్ భూములను కొనుగోలు చేయడంగానీ విక్రయించడంగానీ చట్ట విరుద్ధం. అలాగే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేద రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అసైన్డ్ భూముల అన్యాక్రాంత నిరోధక చట్టం తీసుకొచ్చింది. ఇదే విషయాన్ని స్పష్టంచేస్తూ రెవెన్యూ ఉన్నతాధికారులు అసైన్డ్ భూముల బదలాయింపును గుర్తిస్తూ వారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించడాన్ని వ్యతిరేకించారు. ఈ మేరకు అప్పటి ఉమ్మడి గుంటూరు జిల్లా కలెక్టర్‌తోపాటు సీఆర్డీఏ, సీసీఎల్ఏ అధికారులు తమ అభ్యంతరాలను లిఖితపూర్వకంగా వ్యక్తంచేశారు. కానీ, అప్పటి మున్సిపల్–సీఆర్డీఏ శాఖ మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ ఉన్నతాధికారలుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘అది మీకు సంబంధంలేని వ్యవహారం. మేం చెప్పినట్లు చేయండి. పైస్థాయిలో నేను మాట్లాడతాను’.. అని వారికి హుకుం జారీచేశారు. అప్పటి అడ్వకేట్ జనరల్ కూడా అసైన్డ్ భూముల అన్యాక్రాంతాన్ని గుర్తించడానికి చట్టం అనుమతించదని స్పష్టంచేశారు. ఈ మేరకు అప్పటి కలెక్టర్, సీఆర్డీఏ, రెవెన్యూ, న్యాయ శాఖ ఉన్నతాధికారులు, అడ్వకేట్ జనరల్ తమ అభ్యంతరాలను జీఓ–41 నోట్ ఫైళ్లలో లిఖితపూర్వకంగా తెలిపారు. కానీ, వారి అభ్యంతరాలను చంద్రబాబు బేఖాతరు చేశారు. కోర్టును సైతం మోసం చేసి మరీ.. అసైన్డ్ భూములను కొల్లగొట్టేందుకు చంద్రబాబు ఏకంగా న్యాయస్థానాన్నే మోసం చేయడం విస్మయపరుస్తోంది. చట్ట ప్రకారం 1954 తరువాత పంపిణీ చేసిన భూములను విక్రయించడం, కొనుగోలు చేయకూడదు. కానీ, తమ కుట్రను అమలుచేసేందుకు ఏకంగా అమరావతి పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో అసైన్డ్ భూముల రికార్డులను చంద్రబాబు, నారాయణ మాయం చేశారు. 1954 తరువాత భూపంపిణీ రికార్డులు ఏమీలేవని అమరావతి పరిధిలోని మంగళగిరి, తుళ్లూరు, తాడికొండ మండల రెవెన్యూ అధికారులతో ఓ నివేదిక ఇప్పించారు. ఆ నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. అంటే.. అమరావతి పరిధిలో ఉన్న అసైన్డ్ భూములన్నీ కూడా 1954కు ముందు పంపిణీ చేసినవే తప్ప.. ఆ తరువాత 2015లోగా అసలు భూపంపిణీయే చేయలేదని ఏకంగా న్యాయస్థానాన్నే పక్కదారి పట్టించారు. కానీ, 1954 తరువాత చాలాసార్లు పేదలకు అసైన్డ్ భూములు పంపిణీ చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో కూడా 2004–05లో అసైన్డ్ భూములు పంపిణీ చేశారు. కానీ, ఆ రికార్డులన్నీ మాయం చేసేశారు. అమరావతిలో ఉన్న భూములన్నీ కూడా 1954కు ముందు పంపిణీ చేసినవే అని చెబుతూ, వాటిని విక్రయించేందుకు.. కొనుగోలు చేసేందుకు చట్టం అనుమతిస్తుందని వక్ర భాష్యం చెబుతూ న్యాయస్థానాన్ని మోసగించిన చరిత్ర చంద్రబాబుకే దక్కుతుంది. పత్రాలు వెలుగులోకి.. పచ్చ కుట్ర బట్టబయలు ఇలా.. ఎంత మసిపూసి మారెడుకాయ చేయాలని చూసినా చంద్రబాబు భూదోపిడీ కుట్ర బట్టబయలైంది. అమరావతిలోని అసైన్డ్ భూములలో 1954కు తరువాత పంపిణీ చేసిన భూములు ఉన్నాయన్న రికార్డులు వెలుగులోకి వచ్చాయి. వాటిలో 1987, 2004–05లలో పంపిణీ చేసిన అసైన్డ్ భూములు కూడా ఉన్నాయని తేలింది. దీనిపై సీఐడీ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సమగ్ర విచారణలో మొత్తం భూబాగోతం వెలుగుచూసింది. అమరావతి పరిధిలో 1954 తరువాత కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు అసైన్డ్ భూములు పంపిణీ చేశారని రెవెన్యూ అధికారులు వెల్లడించారు. 2014–19 మధ్య జరిగిన అసైన్డ్ భూముల అన్యాక్రాంతం కుంభకోణంపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని కూడా లిఖితపూర్వకంగా నివేదించారు. సిట్ బృందాలు అమరావతి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి సర్వే నిర్వహించడంతోపాటు సబ్ రిజిస్ట్రార్, తహశీల్దార్, కలెక్టర్ కార్యాలయాల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాయి. దాంతో గణాంకాలతో సహా పూర్తి ఆధారాలతో అసైన్డ్ భూముల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. అసైన్డ్ భూముల రికార్డుల్లో ఉన్న రైతుల పేర్లు, సీఆర్డీఏ ప్రకటించిన భూసమీకరణ ప్యాకేజీలోని అసైన్డ్ రైతుల పేర్లను సరిపోల్చి చూడగా అసలు బండారం బయటపడింది. రెవెన్యూ రికార్డుల్లోని అసైన్డ్ భూముల రైతులకు, సీఆర్డీఏ ప్రకటించిన ప్యాకేజీలోని అసైన్డ్ భూముల రైతుల పేర్లకు ఏమాత్రం పొంతన లేనేలేదు. దాంతో చట్ట విరుద్ధంగా చంద్రబాబు, నారాయణ కొల్లగొట్టిన అసైన్డ్ భూముల చిట్టా బయటపడింది. ఏకంగా 617.70 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ ముఠా కొల్లగొట్టిందన్నది తేలిపోయింది. కేటగిరీలూ అనుకూలంగానే.. ఇక జీఓ–41 ప్రకారం ఆరు కేటగిరీల కింద నాటి ప్రభుత్వం ప్యాకేజిని ప్రకటించింది. వాటిలో నాలుగు కేటగిరీల కింద చంద్రబాబు, నారాయణ తమ బినామీల పేరిట అసైన్డ్ భూములను చేజిక్కించుకున్నారు. ఆ నాలుగు కేటగిరీలకు జరీబు భూములకు చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన భూసమీకరణ ప్యాకేజీ ఇలా ఉంది.. రూ.3,737.30 కోట్ల అసైన్డ్ భూదోపిడీ మరోవైపు.. నాలుగు కేటగిరీ కింద దోపిడీ చేసిన 617.70 ఎకరాల అసైన్డ్ భూములకు చంద్రబాబు, నారాయణ గ్యాంగ్ ప్యాకేజీ ద్వారా ఏకంగా రూ.3,737.30 కోట్లు దక్కించుకుంది. ఎందుకంటే భూసమీకరణ ప్యాకేజీ ప్రకటించిన తరువాత అమరావతిలో నివాస స్థలం చ.గజం మార్కెట్ ధర కనీసం రూ.30వేలు, వాణిజ్య స్థలం మార్కెట్ ధర చ.గజం కనీసం రూ.50వేలు చొప్పున విక్రయాలు సాగాయి. ఇక అమరావతి నిర్మించిన తరువాత వాటి విలువ మరింత భారీగా పెరుగుతుంది కూడా. ఇక భూసమీకరణ ప్యాకేజీలో కనీస విలువగా ఎకరా ప్యాకేజీ ప్రకటించారు. అంటే.. ఎకరా లోపు భూమిని తీసుకున్నా సరే ఎకరాకు ప్యాకేజీ ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు, నారాయణ తమ బినామీలు ఎక్కువ మంది ద్వారా చిన్న చిన్న కమతాలను చేజిక్కించుకున్నారు. తద్వారా ప్రతీ బినామీకి కనీసం ఎకరా ప్యాకేజీ వచ్చేలా చేశారు. -
మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు విచారణ
రాజధాని అసైన్డ్ భూముల వ్యవహారంలో తనపై పెట్టిన 2 కేసులు కొట్టివేయాలని పిటిషన్ విచారణ ను ఈ నెల 25 కు వాయిదా వేసిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిన న్యాయస్థానం -
వియ్యంకుల వారి భూ విందు
సాక్షి, అమరావతి: ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..? చంద్రబాబు బృందం అమరా వతిలో ఏకంగా రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టితే ఆయన మంత్రివర్గ సహచరులు పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావు అదే రీతిలో భారీ భూదోపిడీకి పాల్పడ్డారు. వియ్యంకులు కూడా అయిన వారిద్దరూ బినామీల పేరిట 48 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసినట్లు సీఐడీకి చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆధారాలతో సహా వెలికి తీసింది. టీడీపీ సర్కారు ఒక్క రూపాయి కూడా పరిహారం ఇవ్వకుండానే అసైన్డ్ భూములను రాజధాని కోసం తీసుకుంటుందని బడుగు రైతులను బెదిరించి నారాయణ – గంటా తమ పన్నాగాన్ని అమలు చేశారు. అందుకోసం సీఆర్డీఏ అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారు. అసైన్డ్ భూముల చట్టాన్ని ఉల్లంఘించి తమ విద్యా సంస్థల సిబ్బంది, సమీప బంధువులు 37 మందిని బినామీలుగా చేసుకుని 142 సేల్ డీడ్ల ద్వారా 150 ఎకరాలను దక్కించుకు న్నారు. దీనిపై సిట్ అధికారులు పూర్తి ఆధారా లతో కేసు నమోదు చేశారు. రూ.18 కోట్లతో హస్త గతం చేసుకున్న ఆ 150 ఎకరాల విలువ ల్యాండ్ పూలింగ్ వర్తింపజేసిన అనంతరం అమాంతం రూ.550 కోట్లకు చేరుకోవడం గమనార్హం. బినామీల ఖాతాల్లోకి డబ్బులు.. వియ్యంకులైన పొంగూరు నారాయణ, గంటా శ్రీనివాసరావులు పన్నాగం పన్ని, అధికార బలంతో అమరావతిలో అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కళ్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెంలోని అసైన్డ్ భూములపై కన్నేశారు. భూసమీకరణ కింద తీసుకునే అసైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదని సీఆర్డీఏ, రెవెన్యూ అధికారుల ద్వారా ఆయా గ్రామాల్లోని పేద రైతులను నమ్మించారు. అనంతరం తమ బినామీలు అయిన ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులతో ఆ భూములను కారు చౌకగా కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరిపారు. అందుకోసం నారాయణ విద్యా సంస్థల ద్వారా రూ.18 కోట్లను ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు మళ్లించారు. నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువులను బినామీలుగా చేసుకుని వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఆర్కే హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆ బినామీల బ్యాంకు ఖాతాల్లోకి నిధులు మళ్లించారు. అనంతరం నారాయణ విద్యా సంస్థల సిబ్బంది, తమ సమీప బంధువుల పేరిట అసైన్డ్ భూములను సేల్ డీడ్ ద్వారా హస్తగతం చేసుకున్నారు. మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కేంద్రంగా 37 మంది పేరుతో 142 సేల్డీడ్లు రిజిస్టర్ చేయడం గమనార్హం. ఇలా కేవలం రూ.18 కోట్లకు 150 ఎకరాలను గుప్పిట పట్టారు. ఈ వ్యవహారం అంతా 2015 సెప్టెంబరు, అక్టో బర్, నవంబరులో పూర్తి చేశారు. రూ.532 కోట్లు నష్టపోయిన అసైన్డ్ రైతులు అసైన్డ్ పేద రైతుల నుంచి 150 ఎకరాలు తమ హస్తగతం అయ్యాక నారాయణ, గంటాలు అసలు విషయాన్ని తెరపైకి తెచ్చారు. అప్పటికే చంద్రబాబు పన్నాగం ప్రకారం అసైన్డ్ భూము లకు కూడా భూసమీ కరణ ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించారు. కానీ ఆ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అసైన్డ్ భూములు తమ గుప్పిట్లోకి వచ్చిన తరువాత ఆ నిర్ణయాన్ని తాపీగా 2016 ఫిబ్రవరి లో ప్రకటించారు. అంతేకాదు అసైన్డ్ చట్టానికి విరుద్ధంగా అసైన్డ్ భూములను కొనుగోలు చేసినవారికి కూడా భూసమీకరణ ప్యాకేజీ వర్తింపజేస్తామని చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించడం గమనార్హం. తద్వారా అమరావతిలో భూముల మార్కెట్ విలువ అమాంతం పెరిగేలా చేశారు. అమరావతిలో ఎకరా మార్కెట్ విలువ రూ.4 కోట్లు అని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే చెప్పడం గమనార్హం. నారాయణ, గంటా బినామీల ద్వారా దక్కించుకున్న 150 ఎకరాలకు భూసమీకరణ ప్యాకేజీని వర్తింపచేసుకున్నారు. దీని ప్రకారం జరీబు భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలం, 450 గజాల వాణిజ్య స్థలం కేటాయించారు. ఈమేరకు 150 ఎకరాలకుగాను 1.50 లక్షల గజాల నివాస స్థలం, 67,500 గజాల వాణిజ్య స్థలం దక్కాయి. మార్కెట్ విలువ ప్రకారం ఆ భూముల విలువ దాదాపు రూ.550 కోట్లకు చేరింది. కేవలం రూ.18 కోట్లతో అక్రమంగా భూములను దక్కించుకుని 3 నెలల్లో ఆ భూముల విలు వను రూ.550 కోట్లకు పెంచేసుకున్నారు. అస త్య ప్రచారాలు, బెదిరింపులకు పాల్పడకుండా ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అసైన్డ్ రైతుల భూముల విలువ రూ.550 కోట్లకు పెరి గి ఆ ప్రయోజనం వారికే దక్కేది. దశాబ్దాలుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులు సాగు చేసుకుంటున్న భూములను నారాయణ, గంటా బెదిరించి కా రుచౌకగా గద్దల్లా తన్నుకుపోయారు. కాగా, నారాయణ ఇప్పటికే ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. -
‘అసైన్డ్’ సవరణపై వివరాలు అందజేయండి
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్‌దారులకు హక్కులు కల్పించే తెలంగాణ అసైన్డ్ భూముల చట్ట సవరణపై వివరాలు అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన న్యాయమూర్తి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శితోపాటు చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ (సీసీఎల్ఏ)కు ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అసైన్డ్ భూముల చట్టం–1977కు 2018లో సవరణ చేయడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ రిపబ్లికన్ పార్టీ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసింది. చట్టంలోని సెక్షన్ 4(1)(b) ప్రకారం నిర్దేశించిన విధంగా 2007, జనవరి 29 నుంచి థర్డ్ పార్టీలకు అనుకూలంగా అసైన్డ్ భూముల రీఅసైన్మెంట్ కోసం కటాఫ్ తేదీని 2017, డిసెంబర్ 31 వరకు పొడిగించిందని.. ఇది చట్టవిరుద్ధమని, రాజ్యాంగ వ్యతిరేకమని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ నంబర్ 12ను కొట్టివేయాలని కోరారు. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పేదల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అర్హులైన వారికి 1969లో సాగు భూమిని అందజేసిందని చెప్పారు. అయితే వారి నిరక్ష్యరాస్యత, అజ్ఞానం, సామాజిక, ఆర్థిక వెనుకబాటును అలుసుగా తీసుకున్న కొందరు వారి భూములను స్వల్ప ధరలకు కొనుగోలు చేశారన్నారు. రూ.50 లక్షల నుంచి కోటి విలువైన భూములను రూ.5 లక్షలు చెల్లించి పలుకుబడి ఉన్న వారు సొంతం చేసుకున్నారని వెల్లడించారు. అసలు లబ్ధిదారులు ఆ భూముల ద్వారా లబ్ధిపొందలేకపోయారని పేర్కొన్నారు. లబ్దిదారుల నుంచి కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి భూములను స్వాదీనం చేసుకుని, అంతకు ముందు కేటాయించిన వారికి తిరిగి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. 1977, తెలంగాణ అసైన్డ్ భూముల చట్టం సెక్షన్ 3 ప్రకారం అసైన్డ్ భూముల అమ్మకం చెల్లదన్నారు. ఇప్పుడు అసైన్డ్ భూములను థర్డ్ పార్టీల (ఇప్పుడు అ«దీనంలో ఉన్న వారు)కు అప్పగించేలా ప్రభుత్వం చట్ట సవరణ చేయడం సమర్థనీయం కాదని చెప్పారు. ఇలాంటి భూములు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల ఎకరాలు ఉండగా, ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 74 వేల ఎకరాలున్నాయన్నారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ, విచారణ వాయిదా వేసింది. -
తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్‌స్టర్‌లే
సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిన స్కామ్.. సీమన్స్, అమరావతి భూకుంభకోణాల దారులన్నీ ఒకే చోటుకు చేరుతున్నాయని మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) చెప్పారు. ఐటీ శాఖ చంద్రబాబుకు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న వ్యక్తులే.. సీమన్స్, అమరావతి అసైన్డ్ భూకుంభకోణాల్లో ప్రధానపాత్ర పోషించారని సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. ఈ కుంభకోణాల మూలాలు చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ల వద్దే ఉన్నాయని చెప్పారు. తండ్రీకొడుకులు ఇద్దరూ స్కామ్‌స్టర్‌లేనన్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిలో ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూములు చేతులు మార్చే క్రమంలో పెద్ద స్కామ్ జరిగిందని గతంలోనే సీఐడీ తేల్చిందని గుర్తుచేశారు. అమరావతి పేరుతో జరిగిన స్కామ్‌లన్నింటిలో డొల్ల కంపెనీలు పెట్టి, వాటిద్వారా తండ్రీకొడుకులు ముడుపులు పుచ్చుకున్న విషయాలు ఇప్పటికే సీఐడీ విచారణలో రట్టయిందని ఎత్తిచూపారు. డొల్ల కంపెనీలతో డబ్బును జేబులో వేసుకోవడం.. హవాలా ద్వారా తండ్రీకొడుకులకు చేరవేయడంలో ఈ మధ్య కూడా మరో స్కామ్ బయటకొచ్చిందని చెప్పారు. అమరావతిలో రాజధాని కడతానని, ప్రతి ఇటుకకు డబ్బులివ్వండని.. మనల్ని అందర్నీ తాకట్టు పెట్టి బాండ్స్ ఇష్యూచేసి చంద్రబాబు తెచ్చిన డబ్బులు ఆయా కంపెనీలకు ఇచ్చారని తెలిపారు. ఆ కంపెనీల ద్వారా నిధులు డొల్ల కంపెనీలకు మళ్లించారని, ఐటీ శాఖ నోటీసులు చూస్తే.. చంద్రబాబు మొత్తం రూ.160 కోట్ల రూపాయలు కొట్టేశారని తేలిందని చెప్పారు. లోకేశ్ మిత్రుడు రాజేశ్, చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా అమరావతి పేరుతో జనం సొమ్మును కొట్టేశారన్నారు. ఐటీ శాఖ నోటీసుల్లో పేర్కొన్న తరహాలోనే.. ఇప్పటికే సీఐడీ విచారణలో తేలిన స్కిల్ స్కాం, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం, కాంట్రాక్ట్ పనుల్లో అక్రమాలు, ఫైబర్‌నెట్ స్కామ్‌లలోను ఈ వ్యక్తుల ద్వారా ఇదే విధమైన రూటింగ్ జరిగిందని చెప్పారు. ఎంవీపీ, పీఏ శ్రీనివాస్, రాజేశ్ తదితరులు ఆ కుంభకోణాల్లోను ప్రధానపాత్ర పోషించారన్నారు. ఐదేళ్లలో రకరకాల స్కీమ్‌ల పేరుతో స్కామ్‌లు చేసిన చంద్రబాబు వేలకోట్ల రూపాయలు దోచుకుని హైదరాబాద్‌లో దాచుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయన్నారు. ప్రజాధనాన్ని దోచేసిన తండ్రీకొడుకులను వలేసి భలే పట్టుకున్నారని ఐటీ శాఖను ప్రశంసించాల్సింది పోయి విమర్శించడం సిగ్గుచేటని చెప్పారు. తండ్రీకొడుకులు ఏయే పాపాలు చేశారని నాలుగేళ్లుగా చెబుతున్నామో అవన్నీ ఒక్కొక్కటిగా ఆధారాలతో దొరుకుతున్నాయని తెలిపారు. కచ్చితంగా చంద్రబాబు పాపం పండే రోజు వచ్చింది.. అవినీతి బట్టబయలైంది.. పరిహారం చెల్లించాల్సిన రోజు వస్తుంది.. అని పేర్ని నాని చెప్పారు. -
సీఎం జగన్ ముమ్మాటికీ దళిత బంధువే
సాక్షి, అమరావతి: ఈనాడు అధినేత రామోజీరావు తెలుగు రాష్ట్రాల మధ్య శకుని పాత్ర పోషిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) జూపూడి ప్రభాకర్‌రావు విమర్శించారు. దేశ స్వాతంత్య్రమంత వయసు కలిగిన రామోజీరావు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నంత మాత్రాన మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులంతా దళిత వ్యతిరేకులని రామోజీ భావిస్తున్నారా? అని ప్రశ్నిచారు. అసైన్డ్ భూములను ఆక్రమించి ఫిలింసిటీని నిర్మించుకున్నది రామోజీరావు అయితే అసైన్డ్ భూములపై బడుగు, బలహీన వర్గాలకు హక్కులు కల్పించిన ధీరోదాత్తుడు వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. దళితులు కళ్లు తెరిస్తే ఫిల్మ్‌సిటీని దున్నేస్తారని హెచ్చరించారు. పేదోడి బిడ్డలకు ఇంగ్లిష్ మీడియం చదువులను అడ్డుకున్న దురహంకారి రామోజీ అని మండిపడ్డారు. ఏపీలో అమలవుతున్న అమ్మ ఒడి తెలంగాణలో ఉందా? అని ప్రశ్నిచారు. సీఎం జగన్ పట్ల దళితులకున్న ప్రేమను చంద్రబాబు బృందం ఎప్పటికీ కొనలేదని స్పష్టం చేశారు. దళితుల కష్టాలు టీడీపీ నేతలకు, ఈనాడు రామోజీరావుకు తెలియవన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై తప్పుడు కథనాలు ప్రచురించటాన్ని ఖండించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవేమిటి మరి? పేదల జీవన ప్రమాణాలను పెంపొందిస్తూ నాలుగేళ్లలో పారదర్శకంగా రూ.2.31 లక్షల కోట్లు డీబీటీ ద్వారా అందించిన సీఎం జగన్ ఖచ్చితంగా దళిత బంధువు అవుతారని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం జగన్ 31 లక్షల ఇళ్ల స్థలాలిస్తే లబ్ధిదారుల్లో దళిత కుటుంబాలే అధికంగా ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా ఐదు లక్షల కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలా మెరుగైన స్థితికి తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని ఇటీవల సర్వే ద్వారా కేంద్రమే గుర్తించిందని తెలిపారు. దళితుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని విజయవాడ నడి»ొడ్డులో ఏర్పాటు చేస్తున్న సీఎం జగన్ ముమ్మాటికీ దళిత బంధువేనని స్పష్టంచేశారు. -
‘అసైన్డ్’ రాబందు నీతి రాగాలు!
సాక్షి, అమరావతి: పేదల అసైన్డ్ భూములను రాబందులా ఆక్రమించి ఫిలింసిటీ కోట కట్టుకున్న ఈనాడు రామోజీ దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా నీతులు వల్లించడం విస్మయం కలిగిస్తోంది! ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎస్సీలకు సమున్నత స్థానంతోపాటు అసైన్డ్ భూములపై హక్కులు కల్పించి జీవన ప్రమాణాలను పెంపొందించేందుకు తీసుకుంటున్న చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నా ‘మీరెలా దళిత బంధువు జగన్?’ అని బరితెగింపు కథనాలను రామోజీ నిస్సిగ్గుగా ప్రచురించారు. దేశమంతా ప్రశంసిస్తున్న నవరత్నాల సంక్షేమ పథకాలను పొరుగు రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని అడిగే ధైర్యం రామోజీకి ఉందా? ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు? అని టీడీపీ పెద్దలు దురహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తే రామోజీ కలం కదల్లేదు ఎందుకు? దళితులు శుభ్రంగా ఉండరని, వారికి చదువు రాదని, అయినాసరే సూపరింటెండెంట్లు అయిపోతారంటూ నాటి మంత్రి ఒకరు తమ పెత్తందారీతనాన్ని బయటపెట్టుకుంటే రామోజీ ఎక్కడ నక్కారు? రాజకీయాలు మీకెందుకురా? అంటూ దళితులనుద్దేశించి నాటి టీడీపీ ఎమ్మెల్యే పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలు రామోజీ మరచిపోయినా ప్రజలు మరువరు. రాజధాని అమరావతి ప్రాంతంలో చంద్రబాబు సర్కారు దళితులను భయపెట్టి భూములను కాజేయడం నిజం కాదా? వ్యవసాయ భూమి ఉన్న దళితులకు కనీసం మోటారు కనెక్షను కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది నిజంకాదా? ఎస్సీ కార్పొరేషన్ రుణాల పేరుతో పారదర్శకతకు పాతరేసి అయినవారికి కాంట్రాక్టులు కట్టబెట్టిన ఘనత గత ప్రభుత్వానిది కాదా? ప్రభుత్వ విద్య, వైద్య రంగాలను చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యం చేయడంతో పేదలపైన దళితులపై పెనుభారం పడలేదా? ఉన్నత చదువులు, వైద్యానికి పేదలు దూరం కాలేదా? ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి పథకానికి తూట్లు పొడవటంతో దళిత బిడ్డల చదువులు అర్థాంతరంగా నిలిచిపోలేదా? దళితులకు కనీసం ఒక్క ఇంటి పట్టా అయినా గత ప్రభుత్వం పంపిణీ చేసిందా? నాలుగేళ్లలో అంతకు మించి.. పొరుగు రాష్ట్రంలో రూ.10 లక్షల చొప్పున దళిత బంధు పధకం కింద సాయం అందిస్తున్నట్లు ఒక పోలిక తెచ్చే ప్రయత్నాన్ని ఈనాడు చేసింది. ఆయా రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు, ప్రాధాన్యతలను అనుసరించి బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వివిధ వృత్తుల్లో వున్న ఎస్సీ కుటుంబాలకు డీబీటీ, నాన్ డీబీటీతో అంతకంటే ఎక్కువ లబ్ధి చేకూర్చింది. ఐదేళ్లలో టీడీపీ సర్కారు ఎస్సీల కోసం రూ.24,677.63 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రూ.38,445.35 కోట్లను డీబీటీ ద్వారా 1,31,05,372 మంది దళితులకు నేరుగా పారదర్శకంగా అందించింది. వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ వాహనమిత్ర, జగనన్న చేదోడు, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ బీమా, డాక్టర్ వైఎస్సార్ ఉచిత పంటల బీమా, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ సున్నా వడ్డీ లాంటివి ఇందులో ఉన్నాయి. ఇక పరోక్ష నగదు బదిలీ ద్వారా జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, వైఎస్సార్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యాకానుక, ఇళ్ల స్థలాల పంపిణీ, తదితర పధకాలతో ఇప్పటివరకు 68,62,813 మంది లబ్ధిదారులకు మరో రూ.21,475 కోట్ల మేర సాయం అందింది. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణాల ద్వారా దళిత కుటుంబాలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరింది. రాష్ట్రవ్యాప్తంగా 31 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలిస్తే అందులో 6,36,732 మంది దళిత వర్గాలకు చెందిన అక్కచెల్లెమ్మలే ఉన్నారు. దీనిద్వారా ఆయా కుటుంబాలకు రూ.10,949 కోట్ల మేర లబ్ధి చేకూరింది. ఇక వారి కోసం 4,18,646 ఇళ్ల నిర్మాణాల రూపంలో మరో రూ.10,949 కోట్ల లబ్ధి చేకూరుతోంది. చరిత్రలో ఈ స్థాయిలో దళితులకు ఏ ప్రభుత్వమూ అండగా నిలబడలేదు. లోపాలను సరిదిద్ది విదేశీ విద్యా పథకం విదేశీ విద్యా పథకం రద్దైందని, బెస్ట్ అవైలబుల్ పథకం లేదని, పోటీ పరీక్షల శిక్షణ కార్యక్రమాలు లేవంటూ ఈనాడు అవాస్తవాలను కుమ్మరించింది. విదేశీ విద్యా పథకంలో లోపాలు, అక్రమాలను నివారించి ఆ స్థానంలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం తెచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు కల్పించేలా, ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు సాధించిన వారికి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లిస్తూ పథకాన్ని సమున్నతంగా తీర్చిదిద్ది అమలు చేస్తున్నారు. అభ్యర్ధులు ఎంచుకోదగ్గ 21 కోర్సుల్లో క్యూఎస్ ర్యాంకింగ్, టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంక్‌ల ప్రకారం 50 ఉత్తమ ర్యాంకుల గల విద్యాసంస్థలలో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్ధులకు గరిష్టంగా రూ 1.25 కోట్లు/ట్యూషన్ ఫీజు100 శాతం చెల్లించేలా పథకాన్ని గొప్పగా మార్చి అమలు చేస్తున్నారు. మిగిలిన వర్గాలకు రూ.కోటి గానీ ట్యూషన్ ఫీజు గానీ (ఏది తక్కువ అయితే అది) చెల్లిస్తున్నారు. ఈ స్థాయిలో విదేశీ విద్యకు గత ప్రభుత్వం భరోసా ఇవ్వగలిగిందా? కనీస ప్రమాణాలు పాటించని స్కూళ్లకూ బెస్ట్ అవైలబుల్ స్కీంను గత ప్రభుత్వంలో అమలు చేశారు. ఇప్పుడు ఆ స్కూళ్ల కంటే మెరుగ్గా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియంలో చదువులు అందుతున్నాయి. అత్యుత్తమంగా తరగతి గదులను డిజిటలైజ్ చేస్తున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు అందిస్తున్నారు. బైలింగ్యువల్ టెక్టŠస్‌బుక్స్, డిక్షనరీ, యూనిఫారం, షూలతో విద్యాకానుక అందిస్తున్నారు. నాడు–నేడు ద్వారా స్కూళ్లన్నీ సర్వాంగ సుందరంగా మారుతున్నాయి. స్టడీ సర్కిళ్లపై తప్పుడు ప్రచారం పోటీ పరీక్షల కోసం ఆంధ్రప్రదేశ్ స్టడీ సర్కిల్ కోచింగ్ ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో స్టడీ సర్కిల్లున్నాయి. తిరుపతి స్టడీ సర్కిల్లో బ్యాంక్ పీఓ పరీక్షల కోచింగ్ కార్యక్రమాన్ని నూతన భవనంలో ప్రారంభించారు. సివిల్ సర్వీస్ పరీక్షల కోచింగ్ ప్రోగ్రామ్ విశాఖపట్నం బ్రాంచ్‌లో ప్రారంభించారు. గ్రూప్ 1 సేవల కోచింగ్ విజయవాడలో ప్రారంభమైంది. మరి రామోజీ వీటిని తెలుసుకుంటున్నారా? ♦ గత ప్రభుత్వం విద్యోన్నతి పథకం కింద 9,775 మంది అభ్యర్థులను శిక్షణ కోసం ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లకు పంపగా ఒక అభ్యర్థి మాత్రమే ఎంపికయ్యారు. ఆ పథకాన్ని సవరించి సివిల్స్ సర్వీస్ పరీక్షకు ఏపీ స్టడీ సర్కిల్లోనే ఇప్పుడు కోచింగ్ ఇస్తున్నారు. ♦ రాష్ట్రంలో 27 ఎస్సీ, ఎస్టీ పథకాలు నిర్వీర్యం అయ్యాయంటూ ఈనాడు చేసిన మరో ఆరోపణ అవాస్తవం. షెడ్యూల్డ్ కులాల లబ్ధిదారులకు స్థిరమైన జీవనోపాధి కోçÜం ప్రభుత్వం రూ.133.67 కోట్లతో 2,300 ఎస్సీలకు ఫోర్ వీలర్ మినీ ట్రక్ మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ వాహనాలను రేషన్ సరుకుల డోర్ డెలివరీ కోసం అందించింది. ♦ గత ప్రభుత్వాలు కమ్యూనిటీ డెవలప్మెంట్కు 30 శాతం నిధులు వినియోగించినట్టు ఈనాడు బాకా ఊదుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అంతకు మించి ఖర్చు చేసిందన్నది వాస్తవం. 2019–20 నుంచి 2022–23 వరకు ఎస్సీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం షెడ్యూల్డ్ కులాల కాంపోనెంట్లో క్యాపిటల్ కింద రూ.3,440.15 కోట్లను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, రోడ్లు భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, మైనర్ ఇరిగేషన్, పురపాలక, మహిళా శిశు సంక్షేమ తదితర శాఖలు ఖర్చు చేశాయి. ♦ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన విప్లవాత్మక భూ సంస్కరణలతో పెద్దసంఖ్యలో ఎస్సీలు లబ్ధి పొందారు. అసైన్డ్ భూముల మీద 33.29 లక్షల ఎకరాల భూములపై వారికి యాజమాన్య హక్కులు కల్పించారు. ఇది ఆయా కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు దోహదపడుతోంది. ఎస్సీ కాంపోనెంట్లో టాప్ ఎస్సీ కాంపొనెంట్ అమల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్ కింద చేసిన ఖర్చు కన్నా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో చేసిన ఖర్చే అధికంగా ఉంది. ఎస్సీ కాంపొనెంట్ ద్వారా దేశవ్యాప్తంగా 12.41 లక్షల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటైతే మన రాష్ట్రంలోనే 8.54 లక్షల సంఘాలు ఏర్పాటయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన నివేదికలోని గణాంకాలు ఇవి. షెడ్యూల్డ్ కులాల కాంపోనెంట్‌కు గత ప్రభుత్వం ఐదేళ్లలో కేవలం రూ.33,625.49 కోట్లు ఖర్చు చేయగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నాలుగేళ్లలోనే రూ.59,936.48 కోట్లు వెచ్చించింది. -
అసైన్డ్ భూములపై సర్వహక్కులు!
సాక్షి, హైదరాబాద్/ చేవెళ్ల: రాష్ట్రంలోని దళిత, గిరిజన ఓటర్లను తమ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈసారి తమకు అధికారమిస్తే.. గతంలో వారికి అసైన్ చేసిన భూములపై సర్వహక్కులు కల్పిస్తామని, ఆ భూములను అమ్ముకోవడం సహా అన్నిరకాల యాజమాన్య హక్కులను అనుభవించవచ్చని హామీ ఇవ్వనుంది. ఈ మేరకు శనివారం చేవెళ్ల వేదికగా జరగనున్న ‘ప్రజాగర్జన’సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ప్రకటించనున్నారు. భూముల అంశమే ప్రధానంగా.. కాంగ్రెస్ తమ డిక్లరేషన్‌లో ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీ అంశాన్నే ప్రధానంగా ప్రస్తావించనున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. గతంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు వివిధ రూపాల్లో పేదలకు అసైన్ చేసిన భూముల్లో.. ఎస్సీ, ఎస్టీలకు చెందిన 24 లక్షల ఎకరాలపై వారికి పూర్తిస్థాయిలో యాజమాన్య హక్కులు కల్పిస్తామని ప్రకటించనున్నట్టు వివరిస్తున్నా యి. అదే విధంగా రాష్ట్రంలోని గిరిజన, ఆదివాసీలు సాగుచేసుకుంటున్న 12 లక్షల ఎకరాల భూములకు అటవీ హక్కుల చట్టం అ మలు ద్వారా పట్టాలు అందజేస్తామని.. వాటిపై కూడా గిరిజనులకు సర్వహక్కులు కల్పిస్తామని హామీ ఇవ్వనున్నట్టు వెల్లడిస్తున్నాయి. అదనపు ఆర్థిక సాయంతో.. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచి్చన దళిత బంధు పథకం కింద రూ.10 లక్షలు ఇస్తుండగా.. తాము రూ.12 లక్షలు ఇస్తామని, గిరిజనబంధు కూడా అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రకటించనున్నట్టు తెలిసింది. దళితులు, గిరిజనులకు ఇళ్లు కట్టుకునేందుకు రూ.6 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తా మని హామీ ఇవ్వనున్నట్టు సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల చొప్పున ఇస్తామన్న కాంగ్రెస్.. ఎస్సీ, ఎస్టీలకు మరో రూ.లక్ష అదనంగా ఇవ్వనుంది. ఇక ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులన్నీ భర్తీ చేస్తామని.. విద్య, వైద్య రంగాల్లో దళిత, గిరిజనులకు ప్రాధాన్యత కల్పించి సంక్షేమ పథకాలను అమలు చేస్తామనే హామీలు కూడా ప్రకటించనున్నట్టు సమాచారం. నేడు 4 గంటలకు‘ప్రజాగర్జన’ సభ చేవెళ్లలో ప్రజాగర్జన సభ శనివా రం సాయంత్రం 4 గంటలకు ప్రారంభం కానుంది. మల్లికార్జున ఖర్గే ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీడబ్ల్యూసీ ఆహా్వనితుడు దామోదర రాజనర్సింహ తదితరులు హాజరుకానున్నారు. ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌ను ఖర్గే ప్రకటిస్తారని గాందీభవన్ వర్గాలు చెప్పాయి. బెంగళూరు నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి రానున్న ఖర్గే.. అక్కడి నుంచి నేరుగా చేవెళ్ల వెళ్లి సభలో పాల్గొంటారని, రాత్రికి హైదరాబాద్ చేరుకుని బస చేస్తారని తెలిపాయి. బీఆర్ఎస్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిస్తాం ప్రత్యేక రాష్ట్రం వస్తే ప్రజల జీవన స్థితిగతులు బాగుపడతాయని భావించామని.. కానీ బీఆర్ఎస్ సర్కారు పాలనలో ప్రజలు ఆత్మగౌరవం కోల్పోయి బతుకుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. శుక్రవారం రాత్రి ఆయన చేవెళ్లలోని కేవీఆర్ గ్రౌండ్లో కాంగ్రెస్ ‘ప్రజాగర్జన సభ’ఏర్పాట్లను పార్టీ నేతలు శ్రీధర్‌బాబు, అంజన్‌కుమార్‌యాదవ్, ప్రీతమ్, వేం నరేందర్‌రెడ్డి, గడ్డం ప్రసాద్‌కుమార్, బలరాంనాయక్, కేఎల్ఆర్, చల్లా నర్సింహారెడ్డి, తదితరులతో కలసి పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ను నమ్మి పదేళ్లుగా మోసపోతున్న ప్రజలకు కాంగ్రెస్ రూపంలో విముక్తి లభించనుందన్నారు. దళిత, గిరిజనుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ఏం చేయబోతోందో చెప్పేందుకు సభ ఏర్పాటు చేశామన్నారు. చేవెళ్ల ప్రాంతానికి కాంగ్రెస్‌తో ప్రత్యేక అనుబంధం ఉందని, వైఎస్ హయాంలోనే ఇది నిరూపితమైందని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో దళితులకు ఇచ్చిన భూములను బీఆర్ఎస్ సర్కార్ లాక్కుంటోందని ఆరోపించారు. శనివారం సాయంత్రం జరగనున్న ప్రజాగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదలకు భరోసా అని శ్రీధర్‌బాబు, బలరాంనాయక్ పేర్కొన్నారు. -
AP: 20 లక్షల మంది రైతుల చేతికి.. 'సరికొత్త సంపద'
ఎక్కడైనా వివాదంలో ఉన్న మన 4 సెంట్ల భూమి మన సొంతమైతే ఆ ఆనందమే వేరు. ఆ కుటుంబానికి అది స్థిరాస్తిగా నిలిచిపోతుంది. అలాంటిది ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 32 లక్షల ఎకరాల భూములపై రైతులకు సర్వ హక్కులు కల్పించడమంటే మాటలు కాదు. ఒక్కసారిగా ఆ రైతుల ఆర్థిక పరిస్థితి మారిపోతుంది. సంపద సృష్టి ద్వారా ఇటు రైతులు, అటు ప్రభుత్వానికి లబ్ధి కలుగుతుంది. ఇంతటి కీలక నిర్ణయానికి కారణమైన ఏపీ ప్రభుత్వంపై భూ చట్టాల నిపుణులు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాష్ట్రంలో లక్షల కోట్ల విలువైన సంపద అన్నదాతల చేతుల్లోకి రావడం దేశంలోనే విప్లవాత్మక మార్పు అని కొనియాడుతున్నారు. సాక్షి, అమరావతి: భూములపై ఆంక్షలు తొలగేలా వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రంలో సరికొత్త సంపదను సృష్టించాయి. ఈ కొత్త సంపద సృష్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులు తీసుకువచ్చేందుకు దోహద పడుతుందని భూ చట్టాల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. 32 లక్షల ఎకరాలను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడం ద్వారా వాటిపై సంబంధిత రైతులకు సంపూర్ణ హక్కులు లభించనున్నాయి. అంటే ఆ భూములన్నీ కొత్తగా మార్కెట్లోకి ప్రవేశించినట్లే. ఇప్పటి వరకు ఎటువంటి లావాదేవీలు జరగని ఆ భూములన్నీ కొత్తగా మార్కెట్లోకి రావడం వల్ల వాటిపై జరిగే వ్యాపారం ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. ఆ భూములకు చెందిన 20 లక్షల మంది రైతుల ఆర్థిక స్థితిగతులు మారతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పేదల భూములకు విలువ పెంచడం ద్వారా పేదరిక నిర్మూలనకు ఇది ఉపయోగపడుతుందని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఇది గొప్ప ఆర్థిక సంస్కరణగా అభివర్ణిస్తున్నారు. 32 లక్షల ఎకరాలకు విముక్తి అత్యంత వివాదాస్పదంగా ఏళ్ల తరబడి లక్షలాది మంది రైతుల కుటుంబాల్లో చీకట్లు నింపిన నిషేధిత జాబితా భూముల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం సునాయాసంగా పరిష్కరించింది. ఎక్కడైనా నాలుగైదు ఎకరాలను నిబంధనల ప్రకారం నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తేనే వివాదాలు ఏర్పడేవి. ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ ఏకంగా లక్షల ఎకరాలను ఆ జాబితా నుంచి తొలగిస్తోంది. తద్వారా దశాబ్దాలుగా అనేక కష్టాలు పడుతున్న సుమారు 20 లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. అసైన్డ్ భూములు, చుక్కల భూములు, షరతులు గల పట్టాలు, అనాధీనం, ఖాళీ కాలమ్, సర్వీసు ఈనాం భూములతోపాటు ఇవే తరహా మరికొన్ని కేసుల్లో మొత్తం 32 లక్షల ఎకరాలను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి ప్రభుత్వం తొలగిస్తోంది. 27.41 లక్షల ఎకరాల భూములపై హక్కులు రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చట్టాన్ని సవరించింది. కేటాయించిన 20 సంవత్సరాల తర్వాత అసైన్డ్ భూముల యజమానులకు సర్వ హక్కులు కల్పించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 19,21,855 మందికి 33,29,908 ఎకరాలు అసైన్మెంట్ చేస్తే ఆ రికార్డులు క్షేత్రస్థాయికి తగ్గట్టుగా లేవు. అసైన్మెంట్ జరిగి 20 ఏళ్లు పూర్తయిన భూములకు హక్కులు కల్పించడం ద్వారా 15,21,160 మంది భూమి లేని నిరుపేదలకు వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తున్నాయి. రైతుల ప్రమేయం లేకుండా రెవిన్యూ యంత్రాంగం 20 సంవత్సరాలు పూర్తయిన భూముల జాబితాను తయారు చేసి వాటిని 22(ఎ) నుంచి తొలగిస్తుంది. నెల రోజుల్లో ఆంక్షలు తొలగిపోయేలా చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం చకచకా అడుగులు ముందుకు వేస్తోంది. 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములకు విముక్తి 15 జిల్లాల్లో 2.06 లక్షల ఎకరాల చుక్కల భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22 ఏ (1) ఇ) నుంచి ఒకేసారి తొలగించింది. రాష్ట్ర వ్యాప్తంగా చుక్కల భూముల పేరుతో ఉన్న 4.06 లక్షల ఎకరాలను సుమోటోగా రీ వెరిఫికేషన్ చేసింది. ఆర్డీఓలు, తహశీల్దార్లు 1.81 లక్షల సర్వే నంబర్లలోని 4.06 లక్షలపైగా ఎకరాలకు సంబంధించిన భూములను రీ వెరిఫికేషన్ చేశారు. రికార్డుల్లో రైతు పేరు ఉన్నట్లు ధృవీకరించుకోవడంతోపాటు 11 ఏళ్లుగా అతని ఆధీనంలోనే భూమి ఉంటే ఆ భూమిని 22 (ఏ)1ఇ నుంచి తొలగించారు. తద్వారా చుక్కల భూములపై సంబంధిత రైతులకు సర్వ హక్కులు లభించాయి. తద్వారా చాలా సంవత్సరాల నుంచి నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడు జరుగుతున్నాయి. పంట రుణాలు కూడా వస్తున్నాయి. నెల్లూరు జిల్లా కావలిలో నిర్వహించిన సభలో చుక్కల భూముల రైతులకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. షరతుల పట్టా భూములు 33 వేల ఎకరాలు చుక్కల భూముల తరహాలోనే సమస్యాత్మకంగా తయారైన షరతులు గల పట్టా భూములకు ప్రభుత్వం పరిష్కారం చూపింది. 33 వేల ఎకరాల షరతులు గల పట్టా భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించి ఆ రైతులకు మేలు చేకూర్చింది. బ్రిటీష్ హయాం నుంచి రైతుల చేతుల్లో ఉన్న భూములను తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో తమకెలాంటీ ఉపయోగం ఉండదని భావించి, వాటిని 22(ఏ) కేటగిరీలో పెట్టింది. అలా పెట్టడం అన్యాయమని భావించి నిబంధనల ప్రకారమే ప్రస్తుత ప్రభుత్వం వాటిని ఆ జాబితా నుంచి తీసివేసింది. 17,730 సర్వే నెంబర్లకు సంబంధించిన 33 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తొలగించింది. ఈ నిర్ణయం మోడు వారిన సుమారు 50 వేల మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఒక్క కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలోనే 18 వేలకుపైగా ఎకరాలను 22ఏ నుంచి తీసేశారు. 2022 అక్టోబర్ 20న అవనిగడ్డలో బహిరంగ సభ ఏర్పాటు చేసి సీఎం వైఎస్ జగన్ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించి కొందరికి పట్టాలిచ్చారు. ఇప్పుడు ఆ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. బ్యాంకు రుణాలు వస్తున్నాయి. ఆ భూములను సర్వ హక్కులతో రైతులు అనుభవిస్తున్నారు. అనాధీనం, ఖాళీ కాలమ్ భూములు 50 వేల ఎకరాలు చుక్కల భూముల మాదిరిగానే కొన్ని ప్రాంతాల్లో అనాధీనం, ఖాళీ కాలమ్ భూముల సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది. ఈ భూములను చుక్కల భూముల చట్టం పరిధిలోకి తీసుకువచ్చి వాటిని నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించేందుకు మార్గం సుగమం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల ఎకరాలకు సంబంధించిన 35 నుంచి 40 వేల మంది రైతులు దీనివల్ల లబ్ధి పొందారు. 1.68 లక్షల సర్వీసు ఈనాం భూముల సమస్యకు పరిష్కారం సర్వీసు ఈనాం భూముల సమస్యనూ సానుకూలంగా పరిష్కరించింది. నిషేధిత ఆస్తుల జాబితా 22(ఎ) నుంచి 1.68 లక్షల ఎకరాల సర్వీసు ఈనాం భూములను తొలగిస్తోంది. 25 జిల్లాల్లో 1.13 లక్షల మంది కుల వృత్తులు చేసుకునే రైతుల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది. 1956లో ఈనాం చట్టం రావడంతో ఈనాం భూములను రద్దు చేసి వారికి రైత్వారీ పట్టాలు ఇచ్చారు. 2013 వరకు ఇవి రైత్వారీ పట్టా భూములుగానే ఉన్నాయి. 2013లో జరిగిన ఈనాం భూముల చట్ట సవరణతో నిషేధిత భూముల జాబితాలో చేరాయి. గ్రామ సర్వీసు ఈనాం భూములను అందరి మేలు కోసం పనిచేసిన కుల వృత్తుల వారికి (నాయీబ్రాహ్మణులు, రజకులు, వడ్రంగి వంటి వృత్తులు) ఇచ్చారు. ఆ భూములు ఆ వృత్తులు చేసుకునే వ్యక్తులు, వారి వారసులకు వస్తాయి. ఇలా సర్వీసు చేసిన కుల వృత్తుల వారి సంఖ్య గ్రామాల్లో చాలా పెద్ద సంఖ్యలో ఉండడం వల్లే వారికి రైత్వారీ పట్టాలు మంజూరు చేశారు. ఈ నేపథ్యంలో 2013లో ఈనాం చట్టానికి చేసిన సవరణలు గ్రామ సర్వీసు ఈనాం భూములకు వర్తించవని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ భూములన్నింటినీ త్వరలో 22(ఎ) నుంచి తొలగించనుంది. కొత్త ఆర్థిక వ్యవస్థకు మార్గం సుగమం భూములపై ఆంక్షలన్నింటినీ ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ రావాలని గత 20 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం, అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. మార్కెట్లో పెన్ను, పేపర్ ఎంత సులభంగా అమ్ముకుని, కొనుక్కుంటున్నామో.. భూమిని కూడా అలాగే కొనుక్కుని, అమ్ముకునే పరిస్థితి ఉండాలి. అలా ఉంటేనే పేదరిక నిర్మూలన, సంపద సృష్టి జరుగుతుందనే వాదన అన్ని దేశాల్లో బలంగా వినిపిస్తోంది. ఆ దిశగానే ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. 32 లక్షల ఎకరాలపై ఆంక్షలు తొలగించడం అందులో భాగంగానే జరిగిందని భావించాలి. ఈ భూములపై హక్కులు కల్పించడం ద్వారా ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆర్థిక వ్యవస్థను సృష్టించింది. ఉన్న భూమికి సరైన కాగితాలు, సంపూర్ణమైన హక్కులు లేకపోవడం వల్ల ఆ రైతుకు, సమాజానికి ఆర్థికంగా జరిగే నష్టం చాలా ఎక్కువ. ఆస్తి ఉన్నా.. దాన్ని సంపదగా మార్చుకోలేకపోతున్నాం. ఈ సమస్యను పరిష్కరిస్తే మన దేశం సుసంపన్న దేశంగా మారుతుందని అంతర్జాతీయంగా మేధావులు చెబుతున్నారు. అంటే ఉన్న భూమికి పత్రాలు సక్రమంగా ఉండేలా చూడాలి. ఆ భూముల మీద వారికి పూర్తి హక్కులు కల్పించాలి. ఇప్పుడు ఏపీలో ఇదే జరుగుతోంది. ఏపీలో 33 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. అసైన్డ్ భూముల చట్ట సవరణ ద్వారా అసైన్మెంట్ జరిగిన 20 ఏళ్లు పూర్తయిన భూములన్నీ పట్టా భూములుగా మారతాయి. అప్పుడు రైతులకు అన్ని విధాలా లాభమే. విలువ పెరిగి, సంపద సృష్టి జరుగుతుంది. సమస్యలకూ పరిష్కారం లభిస్తుంది. వాటితో ముడిపడిన గొడవలూ తగ్గిపోతాయి. – ఎం. సునీల్‌కుమార్, భూ చట్టాలనిపుణుడు, నల్సార్ యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్, హైదరాబాద్ -
నిషేధిత జాబితా నుంచి నెలలో ‘అసైన్డ్’కు విముక్తి
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన ప్రభుత్వం.. దాన్ని వేగంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయగా, ఎప్పటిలోగా పూర్తి చేయాలనే విషయంపై తాజాగా అధికార యంత్రాంగానికి టైం లైన్ నిర్దేశించింది. నెల రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కసరత్తు ముగించి అసైన్మెంట్ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన అసైన్డ్ భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22)ఏ నుంచి తొలగించాలని ఆదేశించింది. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన గత నెల 31వ తేదీకి ఈ భూములు సంబంధిత రైతులు, వారి వారసులు లేదా లీగల్ హైర్స్ ఆదీనంలో ఉంటే వారికి యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి. సాయిప్రసాద్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. వారం నుంచి నెల రోజుల గడువు రైతుకు కేటాయించి 20 సంవత్సరాలు పూర్తయిన అసైన్డ్ భూములను 22 (ఎ) నుంచి తొలగించేందుకు వీఆర్వో నుంచి తహశీల్దార్, జేసీ, కలెక్టర్లు చేయాల్సిన పనులను కూడా వివరిస్తూ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఇప్పుడు 50 ఎకరాల వరకు అసైన్డ్ భూములున్న గ్రామాల్లో వారం రోజుల్లో వాటిని 22(ఎ) నుంచి తొలగించాలని సూచించింది. 150 వరకు ఉంటే రెండు వారాలు, 250 ఎకరాలు ఉంటే మూడు వారాలు, 250 ఎకరాలకు పైబడి అసైన్డ్ భూములుంటే నాలుగు వారాల్లో (నెల రోజుల్లో) ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. ఈ గడువు ప్రకారం పని జరిగేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఎకరాల అసైన్డ్ భూములపై రైతులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఈ భూములపై హక్కులు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్న 15 లక్షల మందికిపైగా రైతులు లబ్ధి పొందనున్నారు. వారిలో మెజారిటీ రైతులు దళితులే. -
అసైన్డ్ భూముల సవరణ చట్టం అమలుకు మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ అసైన్డ్ చట్టంలో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిన ప్రభుత్వం దాన్ని అమలు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్ ఆదివారం జిల్లా కలెక్టర్లకు ఈ–ఫైల్ విధానంలో ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యక్తి, అతను లేకపోతే అతని వారసుల ఆదీనంలో ఆ భూమి ఉంటేనే యాజమాన్య హక్కులు కల్పించాలని సూచించారు. ఆ భూములను 1908 రిజిస్ట్రేషన్ల చట్టంలోని నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఎ) నుంచి తొలగించాలని ఆదేశించారు. లంక భూములు, నీటి వనరులకు సంబంధించిన భూములకు ఇందులో నుంచి మినహాయించాలని సూచించారు. ఇందుకోసం వీఆర్ఓలు, తహశీల్దార్లు, ఆర్డీఓలు–సబ్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, కలెక్టర్లు ఏం చేయాలనే అంశాలను నిర్దిష్టంగా మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. వీఆర్ఓలు ఇలా చేయాలి.. రికార్డులను సంస్కరించడంలో (పీఓఎల్ఆర్–ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్) భాగంగా తహశీల్దార్లు వ్యవసాయం, ఇళ్ల పట్టాల కోసం అసైన్ చేసిన భూములను గుర్తించారు. వాటిని బట్టి వీఆర్ఓలు ఆన్లైన్ అప్లికేషన్ కోసం వివరాలను సమకూర్చాలి. ఇప్పటికే గుర్తించిన సర్వే నంబర్ల ప్రకారం ఆ భూముల డీకేటీ రిజిష్టర్లు, 1బీ, అడంగల్, 22 (ఎ) జాబితా, ఇతర రెవెన్యూ రికార్డులను పరిశీలించి క్షేత్ర స్థాయిలో వంద శాతం తనిఖీలు నిర్వహించాలి. ప్రతి సర్వే నంబర్‌కు సంబంధించిన పట్టాను పరిశీలించి, ఆ పట్టాదారు.. ప్రభుత్వం భూమి కేటాయించిన వ్యక్తా లేక అతని వారసుడా? (ఒరిజినల్ అసైనీనా లేక లీగల్ హైరా), సంబంధిత భూమి వారి ఆ«దీనంలోనే ఉందా? రెవెన్యూ రికార్డుల ప్రకారం అది లంక భూమా? లేక నీటి వనరులకు సంబంధించిన భూమా? ఆ భూమి అతనికి ప్రభుత్వం ఎప్పుడు అసైన్ చేసింది? వంటి వివరాలను కచ్చితంగా సేకరించాలి. ఇందుకోసం అన్ని రికార్డులను పరిశీలించి క్షేత్ర స్థాయి విచారణ నిర్వహించాలి. తహశీల్దార్ల పాత్ర వీఆర్ఓలు ఇచ్చిన అసైన్డ్ భూముల సర్వే నంబర్లను తహశీల్దార్లు క్షుణ్ణంగా పరిశీలించాలి. మండలంలోని అన్ని అసైన్డ్ భూముల వివరాలు ఆ జాబితాలో ఉన్నాయో.. లేదో.. చూడాలి. ఈ కసరత్తులో ఏ అసైన్డ్ భూమిని వదిలి వేయకూడదు. ఒకవేళ ఏదైనా భూమిని వదిలివేసినట్లు గుర్తిస్తే వెంటనే ఆ వివరాలను సీసీఎల్ఏ కార్యాలయంలోని సీఎంఆర్ఓ (కంప్యూటరైజేషన్ ఆఫ్ మండల రెవెన్యూ ఆఫీసెస్) సెక్షన్‌కు ఈ–ఫైల్ విధానంలో పంపి కసరత్తులో చేర్చాలి. పక్కాగా తనిఖీ చేసిన తర్వాత తహశీల్దార్ అసైన్డ్ భూముల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో పబ్లిక్ నోటీస్ బోర్డులో పెట్టాలి. సూచనలు, అభ్యంతరాల కోసం 7 రోజుల సమయం ఇవ్వాలి. ఏవైనా అభ్యంతరాలు వస్తే పరిశీలించి, నిబంధనల ప్రకారం వాటిని వెంటనే క్లియర్ చేయాలి. ఆ తర్వాత మొత్తం రికార్డుల్లో 5 శాతాన్ని ఆర్డీఓలు తనిఖీ చేయాలి. జాయింట్ కలెక్టర్ల పాత్ర ఆర్డీఓలు/సబ్ కలెక్టర్లు తనిఖీ చేసిన 5 శాతం రికార్డుల్లో 1 శాతం రికార్డులను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేసి, అన్నీ సరిగా ఉన్నాయో లేదో చూడాలి. వీఆర్వో నుంచి ఆర్డీఓ స్థాయి వరకు జరిగిన కసరత్తును పూర్తిగా పర్యవేక్షిస్తూ అన్ని దశల్లోనూ పారదర్శకంగా జరిగిందో లేదో పరిశీలించాలి. వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత 22 (ఎ) జాబితా నుంచి ఎంపిక చేసిన సర్వే నంబర్లను తొలగించాలని కోరుతూ జిల్లా రిజిస్ట్రార్లకు ముసాయిదా లేఖ సిద్ధం చేయాలి. కలెక్టర్ దాన్ని జిల్లా రిజిస్ట్రార్‌కు పంపాలి. ప్రతి సంవత్సరం ఆగస్టు 5వ తేదీన ఇదే విధంగా నిబంధనల ప్రకారం 22 (ఎ) నుంచి తొలగించాల్సిన అసైన్డ్ భూముల వివరాలను జిల్లా రిజిస్ట్రార్లకు పంపాలి. అసైన్డ్ భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించే ప్రక్రియను జిల్లా కలెక్టర్లు జాగ్రత్తగా పరిశీలించాలి. మొత్తం కసరత్తు పూర్తయిన తర్వాత కలెక్టర్.. జిల్లా రిజిస్ట్రార్‌కు 22 (ఎ) నుంచి తొలగించాల్సిన సర్వే నంబర్ల జాబితాను పంపి, తర్వాత దాన్ని జిల్లా గెజిట్‌లో ప్రచురించాలి. -
22(ఎ) జాబితా నుంచి.. ఆ భూముల్ని తొలగించవచ్చు
సాక్షి, అమరావతి: పేదలకు 1954వ సంవత్సరానికి ముందు ఇచ్చిన (అసైన్డ్) భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించవచ్చని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు స్పష్టతనిస్తూ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ), ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయిప్రసాద్ తాజాగా సర్క్యులర్ జారీచేశారు. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ తమ జిల్లాలో ఉన్న పరిస్థితిని వివరిస్తూ దీనిపై స్పష్టత ఇవ్వాలని సీసీఎల్‌ఏని కోరారు. కర్నూలు జిల్లాలో 5,382.78 ఎకరాల ప్రభుత్వ భూమిని 1954 జూన్ 18 నాటికి 2,755 మంది నిరుపేదలకు వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చారని, ఈ భూములను నిషేధిత ఆస్తుల జాబితా 22 (ఎ) 1 నుంచి తొలగించడంపై పలు ప్రతిపాదనలు వచ్చాయని తెలిపారు. ఆ భూముల్ని 22 (ఎ) జాబితా నుంచి తొలగించవచ్చా? లేదా? అనే దానిపై తగు సూచనలు ఇవ్వాలని కోరారు. దీనిపై సీసీఎల్ఏ స్పష్టతనిస్తూ 22 (ఎ) కేసులను త్వరితగతిన పరిష్కరించడం కోసం 2022 సెప్టెంబర్ ఒకటో తేదీన జిల్లా కలెక్టర్లకు అన్ని అంశాలపైనా తగిన వివరణలు, సూచనలతో ఒక సర్క్యులర్ ఇచ్చినట్లు తెలిపారు. మరోసారి దీనిపై స్పష్టతనిస్తూ.. 1954 జూన్ 18కి ముందు పేదలకు (డిప్రెస్డ్ క్లాసెస్) షరతులతోగానీ, షరతులు లేకుండా గానీ ఇచ్చిన భూములను 22 (ఎ) జాబితా నుంచి తొలగించవచ్చని స్పష్టంచేశారు. ఆ భూములకు సంబంధించిన పట్టాలు అందుబాటులో ఉన్నా, లేకపోయినా రెవెన్యూ రికార్డుల ఆధారంగా సుమోటోగా నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆదేశించారు. అసైన్డ్ భూముల వ్యవహారంపై తరచూ ప్రశ్నలు వస్తుండడంతో ప్రభుత్వం ఇప్పుడు మళ్లీ ఈ సర్క్యులర్ ఇచ్చింది. స్వాతంత్య్రానికి ముందు పేదలకిచ్చిన భూములను 22(ఎ) జాబితా నుంచి తీసివేయాలని గతంలోనే ప్రభుత్వం స్పష్టంచేసినా జిల్లా కలెక్టర్లు, జేసీలు రకరకాల కారణాలు, వివాదాల భయంతో వాటి జోలికి వెళ్లడంలేదు. నిబంధనల ప్రకారం చేయాల్సిన వాటిని కూడా చేయకుండా నాన్చుతున్నారు. అందులో భాగంగానే తమ వద్దకు వచ్చే ఇలాంటి పిటిషన్లపై తాము నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నా సీసీఎల్ఏకి పంపుతున్నారు. ఈ నేపథ్యంలో.. రెవెన్యూ వ్యవస్థకి సంబంధించి అనేక అంశాలపై జిల్లా కలెక్టర్లకు అధికారాలు ఉన్నాయని సీసీఎల్ఏ తరచూ స్పష్టంచేస్తూనే ఉన్నారు. ఇలాంటి అంశాలపై తామిచ్చిన మార్గదర్శకాల ప్రకారం కలెక్టర్లే నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు. అందులో భాగంగానే 1954 ముందు పేదలకిచ్చిన భూములను 22 (ఎ) నుంచి నిరభ్యంతరంగా తొలగించవచ్చని తాజా సర్క్యులర్ ఇచ్చారు. -
అసైన్డ్ భూములపై లబ్దిదారులకు యాజమాన్య హక్కులు.. ఆర్డినెన్స్ జారీ
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూముల రైతుల తలరాతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సమూలంగా మార్చేసింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అసైన్డ్ భూములు పొందిన పేదలకు వాటిపై సంపూర్ణ హక్కులు కల్పి స్తూ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. అసైన్డ్ భూములు కేటాయించి (అసైన్ చేసి) 20 ఏళ్లు పూర్తయితే వాటిని పొందిన వారికి ఆయా భూములపై యాజమాన్య హక్కులను కల్పించింది. ఈమేరకు 1977 ఏపీ అసైన్డ్ భూముల చట్టం (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్) సవరణను ఆమోదిస్తూ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. మంత్రివర్గ కమిటీ సిఫారసు మేరకు భూమి లేని నిరుపేదలు వ్యవసాయం చేసుకుని దానిపై వచ్చే ఆదాయంతో జీవించేందుకు ప్రభుత్వాలు భూమిని కేటాయిస్తాయి. స్వాతం్రత్యానికి ముందు, ఆ తర్వాత రాష్ట్రంలో ఇలా లక్షల ఎకరాలను పేదలకు ఇచ్చారు. వాటికి చట్టపరంగా రక్షణ కల్పించేందుకు 1977లో అసైన్డ్ భూముల చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. దీని ప్రకారం ప్రభుత్వం అసైన్ చేసిన భూములపై అమ్మకాలు, కొనుగోళ్లు జరిపే అవకాశం లేకుండా నిషేధం విధించారు. దీంతో అత్యవసర సమయాల్లో భూమిని విక్రయించుకునేందుకు నిరుపేదలకు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో భూములపై తమకు యాజమాన్య హక్కులు కల్పించాలంటూ నిరుపేద అసైన్డ్ రైతుల నుంచి ప్రభుత్వానికి చాలాసార్లు వినతులు వచ్చాయి. ఈ క్రమంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో నలుగురు మంత్రులు, ఎమ్మెల్యేలతో గతేడాది సెపె్టంబర్ 30న కమిటీని నియమించిన రాష్ట్ర ప్రభుత్వం దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై విస్తృతంగా అధ్యయనం చేసిన కమిటీ అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించిన తమిళనాడు, కర్నాటకలో పర్యటించి అక్కడి విధానాలను పరిశీలించింది. అసైన్డ్ భూములపై హక్కులు కల్పించిన కేరళలో కూడా అధ్యయనం చేసింది. వాటన్నింటినీ పరిశీలించడంతోపాటు రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వానికి నివేదిక సమరి్పంచింది. కేటాయించి 20 ఏళ్లు పూర్తయితే సంబంధిత రైతులకు అసైన్డ్ భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది. ప్రభుత్వం ఎవరికి భూమి కేటాయించిందో వారికే యాజమాన్య హక్కులు ఇవ్వాలని స్పష్టం చేసింది. జిల్లాలవారీగా జాబితాలు.. కమిటీ సిఫారసులను ఆమోదించిన మంత్రివర్గం అందుకు అనుగుణంగా అసైన్డ్ భూముల చట్టాన్ని సవరించాలని తీర్మానించింది. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు లేనందున వెంటనే చట్ట సవరణ కోసం ఆర్డినెన్స్ జారీ చేసింది. ప్రభుత్వం అసైన్ చేసిన వ్యవసాయ భూములతోపాటు పేదలకిచ్చిన ఇళ్ల పట్టాలకు సైతం ఇది వర్తిస్తుందని సవరణ చట్టంలో స్పష్టం చేశారు. కేటాయించి పదేళ్లు దాటితే ఆయా ఇళ్ల స్థలాలపై లబ్దిదారులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. దీనిపై 2021లోనే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయగా ఇప్పుడు చట్టంలోనూ అందుకు వీలు కల్పించింది. వ్యవసాయ భూములైతే కేటాయించిన 20 ఏళ్లకు, ఇళ్ల స్థలాలైతే కేటాయించి పదేళ్లు పూర్తయిన వెంటనే వాటిపై సంబంధిత రైతులు, పేదలు, వారి వారసులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. వ్యవసాయేతర భూములను ఆనుకుని ఏవైనా అసైన్డ్ భూములు ఉంటే వాటిని అమ్ముకున్నప్పుడు ప్రస్తుత బేసిక్ మార్కెట్ విలువ చెల్లించాల్సి ఉంటుంది. చట్టం అమలుకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను విడుదల చేయనుంది. వాటి ప్రకారం జిల్లాలవారీగా 20 ఏళ్లు పూర్తయిన అసైన్డ్ భూముల జాబితాను రూపొందిస్తారు. 1954 నుంచి 2014 వరకు రాష్ట్రంలో 33.29 లక్షల ఎకరాలను పేదలకు అసైన్ చేశారు. తాజా చట్ట సవరణ ప్రకారం 2003కి ముందు ఇచ్చిన భూములన్నింటిపైనా యాజమాన్య హక్కులు లభిస్తాయి. 1954 నుంచి 2003 వరకు 28 లక్షల ఎకరాలకుపైగా భూములను పేదలకివ్వగా వారంతా ఇప్పుడు లబ్ధి పొందనున్నారు. -
పేదల భూములు కొల్లగొట్టి.. హైకోర్టుకొచ్చి స్టే తెచ్చుకున్నారు
సాక్షి, అమరావతి : రాజధానిలో నిరుపేదల నుంచి కారుచౌకగా అసైన్డ్ భూములను కొల్లగొట్టిన వ్యవహారంలో సీఐడీ కేసు నమోదు చే సిన వెంటనే చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ హైకోర్టు నుంచి స్టే తె చ్చుకున్నారని సీఐడీ గురువారం హైకోర్టుకు నివేదించింది. వారి అక్రమాలు బ యటకు వస్తాయన్న ఉద్దేశంతోనే దర్యాప్తును ఎఫ్ఐఆర్ దశలోనే అడ్డుకున్నారని సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి హైకోర్టుకు వివరించారు. వారు అక్రమాలకు పాల్పడకపోతే స్టే పొందాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. సచ్చీలురని భావిస్తే స్టే ఎత్తివేయాలని కోరి దర్యాప్తునకు సహకరించాలన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా రాజధాని అసైన్డ్ భూముల బదలాయింపులో భారీ అక్ర మాలపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు, నారాయణ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. దర్యాప్తుతో పాటు తదుపరి చర్యలపై స్టే విధించింది. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ తుది విచారణ జరుపుతున్నారు. దర్యాప్తు జరపకపోతే ఆధారాలెలా వస్తాయి? అసైన్డ్ భూముల కొనుగోళ్లపై ఫిర్యాదు అందిన తర్వాత సీఐడీ ప్రాథమిక విచా రణ జరిపి, అందులో లభించిన ఆధారాలకు అనుగుణంగా బాబు, నారా యణ పై కేసు నమోదు చేసిందని ఏఏజీ చెప్పారు. ఆ విచారణ గురించి వారికి తెలి యదని, లేదంటే దానిపైనా స్టే తెచ్చుకునే వారని అన్నారు. అత్యంత శక్తివంతు లు, పలుకుబడి కలిగిన వారైనందునే ఆఘమేఘాలపై హైకోర్టుకొచ్చి స్టే తెచ్చు కోగలిగారన్నారు. ఒకవైపు దర్యాప్తు జరగకుండా స్టే తెచ్చుకుని, మరోవైపు అక్ర మాలకు ఎలాంటి ఆధారాల్లేవని చెబుతున్నారన్నారు. దర్యాప్తు జరగకపోతే ఆ ధారాలెలా వస్తాయని ప్రశ్నించారు. స్టే ఎత్తేసి దర్యాప్తునకు అనుమతివ్వా లన్నారు. అప్పుడు ఎలాంటి ఆధారాలు సమర్పిస్తామో వారు చూడవచ్చన్నారు. ఆరేళ్ల తరువాత కేసు నమోదు చేశారు.. నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. హైకోర్టు స్టే ఇచ్చినా సీఐడీ దర్యాప్తు కొనసాగించిందన్నారు. రాజ కీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జీవో 41 జారీ చేసిన ఆరేళ్ల తరువాత కేసు నమోదు చేశారన్నారు. ఆ తరువాత జీవో 41ని సవరించారని చెప్పారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ, సవరణ సమయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయా అని ప్రశ్నించగా పోసాని సమాధానం చెప్పలేదు. అనంతరం విచారణను న్యాయమూర్తి బుధవారానికి వాయిదా వేశారు. -
మంచిరేవుల భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
న్యూఢిల్లీ: మంచిరేవుల భూముల విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. 143 ఎకరాల మంచిరేవుల భూములపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెలువరించింది. ఓఆర్ఆర్కు ఆనుకొని ఉన్న అసైన్డ్ భూములు తెలంగాణ ప్రభుత్వం, గ్రే హౌండ్స్‌కే చెందుతాయని సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది. కాగా 143 ఎకరాల అసైన్డ్ భూమిని 1993లో ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా విక్రయించి ప్లాట్లుగా మార్చారు. రాష్ట్ర ప్రభుత్వం 1977 అసైన్మెంట్ చట్టం ప్రకారం వారికి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులపై ఆక్రమణదారులు హైకోర్టును ఆశ్రయించగా.. ఈ భూములు ప్రైవేటు వ్యక్తులకే చెందుతాయని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ..2021లో డివిజన్ బెంచ్‌లో ప్రభుత్వం సవాలు చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను అనుమతించి.. సింగిల్ జడ్జి తీర్పును తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ పక్కన పెట్టేసింది. దీంతో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను ఆక్రమణ దారులు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఈ పిటిషన్‌పై నేడు విచారణ జరగ్గా.. ప్రైవేటు వ్యక్తుల పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇకపై ఈ భూముల విషయంలో కిందస్థాయి కోర్టులు, హైకోర్టులు ఎలాంటి జోక్యం చేసుకునే అధికారం లేదని సుప్రీం తేల్చి చెప్పింది. ఇప్పుడు తాము ఇచ్చిన ఆదేశాలే ఫైనల్ అని, ఇకపై ఎలాంటి జోక్యాలు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. పోలీసు విభాగంలోని గ్రేహౌండ్స్‌కు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు సరైనవే అని, అవి చట్టబద్ధమైనవని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తల ధర్మాసనం తీర్పులో స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది శ్రీహర్ష తుది వాదనలు వినిపించారు. చదవండి: 108కు కొత్త వాహనాలు.. ప్రారంభించిన సీఎం కేసీఆర్ -
సాహసోపేత నిర్ణయాలు.. వారికి వైఎస్ జగన్ సర్కార్ ఐదు వరాలు
కలలో సైతం ఊహించని భూ సంస్కరణలివి. భారతదేశ సామాజిక చరిత్రలో ఇది మేలి మలుపు. బహుశా ఇప్పటిదాకా ఈ రీతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మేలు చేసిన దాఖలాలు ఎక్కడా ఉండకపోవచ్చు. ప్రధానంగా దళిత వర్గాల స్థితిగతుల్లో వేగవంతంగా మార్పు కనిపించడం ఖాయం. బహిరంగ సభల్లో సీఎం జగన్ ‘నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ’ అని చెప్పే మాటలు ఆయన హృదయాంతరాల్లోంచి వచ్చేవేనని రుజువైంది. సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా భూములకు సంబంధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సాహసోపేతంగా తీసుకున్న ఐదు నిర్ణయాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లోని పేదల తల రాతలు మార్చనున్నాయి. ప్రధానంగా దళితుల పాలిట ఐదు వరాలుగా భావించవచ్చు. నిరుపేద దళితులకు సమాజంలో గౌరవనీయమైన స్థానాన్ని కల్పించడమే లక్ష్యంగా ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఐదు కీలక ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేశారు. అసైన్డ్ భూముల రైతులకు యాజమాన్య హక్కులు కల్పించాలనే చరిత్రాత్మక నిర్ణయంతో 15.21 లక్షల మంది రైతులు లబ్ధి పొందితే అందులో అత్యధికులు దళిత వర్గానికి చెందిన వారే. రాష్ట్రంలో సుదీర్ఘకాలం తర్వాత భూమి లేని నిరుపేదలకు భూముల పంపిణీకి శ్రీకారం చుట్టడం ద్వారా ఎక్కువ లబ్ధి పొందబోతున్నదీ దళిత సోదరులే. అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న లంక భూములకు డి పట్టాలు ఇవ్వడం ద్వారా దళితులు, ఇతర వర్గాల వారి కష్టాలకు ప్రభుత్వం చరమగీతం పాడింది. భూమి కొనుగోలు పథకం కింద దళితులకు ఇచ్చిన భూములపై పూర్తి హక్కులు కల్పించి వారికి మేలు చేకూర్చుతోంది. శ్మశాన వాటికలు లేని దళిత వాడ ఉండకూడదనే లక్ష్యంతో ఎవరూ అడగకుండానే 1,700 గ్రామాల్లో వాటి ఏర్పాటుకు 1,050 ఎకరాలు కేటాయించింది. వీటన్నింటి వల్ల 16 లక్షల మంది దళితులు, ఇతర పేద వర్గాల బతుకు చిత్రాలు మారనున్నాయి. ఇన్నాళ్లూ కాగితాలపైనే విలువ అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించడంతో అనేక సంవత్సరాలుగా భూమి ఉన్నా లేనట్లే జీవిస్తున్న లక్షలాది మంది దళిత, పేద రైతులకు మేలు జరగనుంది. ప్రభుత్వం నుంచి భూమిని పొంది 20 ఏళ్లు పూర్తయితే ఆ అసైన్మెంట్దారులు.. వారు లేకపోతే వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి. అసైన్డ్ భూముల చరిత్రలో ఇదొక గొప్ప నిర్ణయం. స్వాతం్రత్యానికి ముందు, తర్వాత.. భూమి లేని నిరుపేదలకు జీవనోపాధి కల్పించడానికి ప్రభుత్వాలు భూమిని ఇచ్చేవి. ఇలా భూమి పొందే వారిలో ఎక్కువ మంది దళితులే ఉండేవారు. వారికి ప్రభుత్వాలు అసైన్ (ఇచ్చిన) చేసిన భూములను వారు సాగు చేసుకోవడమే తప్ప వాటిపై వారికి ఎటువంటి హక్కులు ఉండవు. అసైన్డ్ చట్టాల ప్రకారం ఆ భూములను అమ్మడం, కొనడం నిషేధం. ఏదైనా అవసరం వచ్చి తనకున్న అసైన్డ్ భూమిలో కొంత భాగాన్ని అమ్ముదామంటే సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే ఆ భూముల రిజి్రస్టేషన్ జరగదు. దీంతో ఇతర భూములకు, అసైన్డ్ భూములకు చాలా తేడా ఏర్పడింది. అవసరాల రీత్యా తప్పనిసరి పరిస్థితుల్లో సాదా బైనామాల పద్ధతిలో కాగితాల మీద రాసుకుని కొందరు తమ భూములను ఉన్న విలువ కంటే చాలా తక్కువకు అమ్ముకునే పరిస్థితి ఏర్పడింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూపులు ► తమ భూములపై తమకు హక్కులు ఇవ్వాలని అసైన్డ్ రైతులు ఎన్నో ఏళ్ల నుంచి కోరుతున్నారు. స్వాతం్రత్యానికి ముందు.. 1954లో ఇచ్చిన భూములపై సంబంధిత రైతులకు యాజమాన్య హక్కులు కల్పించే అవకాశం ఇచ్చారు. కానీ అది కూడా అమలులోకి రాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అలాంటి భూములపై యాజమాన్య హక్కులు కల్పించే ప్రక్రియను ప్రారంభించింది. ► 1954 తర్వాత అసైన్మెంట్ చేసిన భూములపైనా యాజమాన్య హక్కులు ఇవ్వాలనే అభ్యర్థనపై గత ప్రభుత్వాలు చర్చించడం, కమిటీలు వేసి కాలయాపన చేయడం తప్ప ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం కూడా అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించే విషయంపై ఒక కమిటీ నియమించి చేతులు దులుపుకుంది. ► వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చాక దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో 13 మంది దళిత, గిరిజన ఎమ్మెల్యేలు సభ్యులుగా 2022 ఆగస్టు 30న ప్రజాప్రతినిధుల కమిటీని నియమించి దీనిపై నివేదిక ఇవ్వాలని సూచించింది. ఈ కమిటీ కర్ణాటక, తమిళనాడులో అసైన్డ్ భూములపై హక్కులు ఇవ్వడంతో ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధానాలపై అధ్యయనం చేసింది. అసైన్డ్ భూములకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు, నిబంధనలను పరిశీలించింది. ► వాటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మన రాష్ట్రంలోని పరిస్థితులను బట్టి అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత లబ్ధిదారులు.. వారు లేకపోతే వారి వారసులు వారికి అవసరమైనప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇందుకు రాష్ట్రం మంత్రివర్గ ఆమోదం తెలిపింది. ► అసైన్డ్ రైతుల్లో దాదాపు 70 శాతం మంది దళితులు ఉంటారని అంచనా. ఆ తర్వాత బీసీ, ఎస్టీ, మైనార్టీ రైతులకూ మేలు జరుగుతుంది. అదే సమయంలో ఎవరైనా 20 ఏళ్లకు ముందే పేద రైతుల నుంచి భూములు కొనుక్కుని ఉంటే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఆ భూములపై వారికి ఎటువంటి హక్కులు రావు. 54,129.45 వేల ఎకరాల్లో దళితులకే ఎక్కువ ► సుదీర్ఘకాలం తర్వాత రాష్ట్రంలో నిరుపేదలకు వ్యవసాయ భూములు పంపిణీ చేయడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం వల్ల దళితులకు ఎక్కువ ప్రయోజనం కలగనుంది. భూమి లేని నిరుపేదల్లో వారే ఎక్కువగా ఉన్నారు. 23 జిల్లాల్లో 54,129.45 వేల ఎకరాలను అర్హులైన పేదలకు పంచనున్నారు. 46,935 మందికి భూములివ్వడానికి ఎంపిక చేయగా అందులో దళితులే ఎక్కువ. ► వ్యవసాయ కూలీలుగా, ఇతర పనులు చేసుకుంటూ జీవించే వారిని ప్రభుత్వం రైతులుగా మార్చనుంది. రాష్ట్రంలో చివరిసారిగా 2013లో భూ పంపిణీ జరిగింది. తక్కువ భూమి అయినా పేదలకివ్వడం అదే చివరిసారి. ఆ తర్వాత భూ పంపిణీ గురించి ఎవరూ పట్టించుకోలేదు. పేదలు మాత్రం తమ జీవనోపాధికి కొంత భూమి ఇవ్వాలని అధికారులు, ప్రజాప్రతినిధులను కోరినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. ఎవరూ అడగకుండానే దళితులు, ఇతర వర్గాల్లోని నిరుపేదలకు మేలు చేయాలనే సంకల్పంతో భూ పంపిణీకి శ్రీకారం చుట్టారు. లంక భూముల్లో 80 శాతం వీరివే ► లంక భూములకు డీకేటీ పట్టాలివ్వాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనివల్ల 8 జిల్లాల్లో ఉన్న కృష్ణా, గోదావరి లంకల్లోని 9,062 ఎకరాలకు సంబంధించిన 19,176 మంది రైతులకు పట్టాలు దక్కనున్నాయి. వారిలో అత్యధికులు దళిత రైతులే. ► కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో మూడు కేటగిరీల్లో లంక భూములను సాగు చేసుకుంటున్న అనేక మంది రైతులకు పట్టాలు లేవు. తమకు పట్టాలు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలను కోరుతున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం దళిత రైతుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని వివాదాల్లేకుండా సాగు చేసుకుంటున్న అర్హులకు పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. సి కేటగిరీలోని కొన్ని భూములకు ఐదేళ్ల లీజుకు ఇవ్వనుంది. అప్పు మాఫీతో భూమి చేతికొచ్చింది ► భూమి కొనుగోలు పథకం ద్వారా భూములు పొందిన దళిత రైతుల కష్టాలకు వైఎస్ జగన్ ప్రభుత్వం చరమగీతం పాడింది. ఆ భూములపై రుణాలను మాఫీ చేస్తోంది. రుణాలు చెల్లించినా నిషేధిత జాబితాలో కొనసాగుతున్న భూములకు సైతం విముక్తి కల్పిస్తోంది. ఈ రెండు నిర్ణయాల వల్ల మొత్తం 22 వేల మందికిపైగా రైతులకు వారి భూములపై సంపూర్ణ హక్కులు లభించనున్నాయి. ► భూమి లేని దళిత రైతుల జీవనోపాధి కోసం గతంలో రాష్ట్ర ఎస్సీ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ భూములను కొనుగోలు చేసి అర్హులకు ఇచ్చింది. ఆ భూములపై ఇచ్చిన రుణాలను కొందరు తిరిగి చెల్లించినా, కొందరు చెల్లించలేకపోయారు. దీంతో 16,213.51 ఎకరాలకు సంబంధించి 14,223 మంది రైతుల భూముల పత్రాలు తనఖాలో ఉన్నాయి. ► ఇప్పుడు ఆ రుణాలను ప్రభుత్వం మాఫీ చేసి భూములపై దళిత రైతులకు పూర్తి హక్కులు కల్పించింది. ఎలాంటి రుసుం తీసుకోకుండా వాటిని దళిత మహిళా రైతుల పేరుతో రిజిష్టర్ డాక్యుమెంట్లుగా ఇవ్వనున్నారు. ► రుణాలు చెల్లించి తాకట్టు నుంచి విడిపించుకున్న రైతుల భూములు కూడా నిషేధిత జాబితాలోనే కొనసాగుతున్నాయి. ఆ భూములను 22 (ఏ) నిషేధిత జాబితా నుంచి తొలగిస్తున్నారు. ఈ ప్రక్రియ కోసం చెల్లించాల్సిన రిజి్రస్టేషన్ ఫీజు, యూజర్ ఛార్జీలను ప్రభుత్వం మినహాయించింది. దళిత రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే భూములపై హక్కులు లభిస్తాయి. నెరవేరిన దశాబ్దాల కల ► రాష్ట్రంలో దళిత వాడలకు స్మశాన వాటికల సమస్య లేకుండా చేసేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. శ్మశాన వాటికలు లేని దళిత వాడల్లో వెంటనే ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో 17,564 రెవెన్యూ గ్రామాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్లు 1,900కు పైగా గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవని నివేదిక ఇచ్చారు. 1,700 గ్రామాల్లో వాటి ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆ గ్రామాల్లో జనాభాను బట్టి అర ఎకరం లేదా ఎకరం కేటాయించే బాధ్యతను ప్రభుత్వం కలెక్టర్‌కు అప్పగించింది. ► మొత్తంగా 1,700 గ్రామాల్లో 1,050.08 ఎకరాలను శ్మశాన వాటికలకు కేటాయిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దళిత వాడల్లో ఎన్నో దశాబ్దాలుగా ఈ సమస్య నలుగుతోంది. తమకు శ్మశాన వాటికలు కావాలని ఎస్సీలు.. ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులను ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా, ఏ ప్రభుత్వం దానిపై ఇంత వరకు చిత్తశుద్ధితో దృష్టి పెట్టలేదు. మొట్టమొదటిసారిగా సీఎం వైఎస్ జగన్ ఈ విషయంపై దృష్టి సారించి, 1050 ఎకరాలు కేటాయించారు. అతి త్వరలో ఆయా గ్రామాల్లో వారికి శ్మశాన వాటికలు ఏర్పాటు కానున్నాయి. పెరగనున్న రైతుల స్థితిగతులు సీఎం జగన్ నిర్ణయాలతో రైతుల చేతిలో ఉన్న భూముల విలువ పెరిగింది. తద్వారా ఆయా రైతుల స్థితిగతులు, ఆదాయ హోదాలు పెరుగుతున్నాయి. అత్యవసర కాలంలో తనకంటూ విలువైన ఆస్తి ఉందంటూ ఆ భూముల్ని చూసుకుని మురిసిపోయే పరిస్థితులొచ్చాయి. ఈ సంస్కరణల వల్ల రాష్ట్ర జీడీపీ కూడా పెరుగుతుంది. దాదాపు 22 లక్షల మంది బడుగు, బలహీన వర్గాల వారికి ప్రయోజనం. – కె. నారాయణ స్వామి, ఉప ముఖ్యమంత్రి (ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి) భూ సంస్కరణలు సీఎం జగన్‌కే సాధ్యం.. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులపై సీఎం జగన్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది. సామాజిక న్యాయ చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయంగా చెప్పవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతులకు అధిక ప్రయోజనం. అంబేడ్కర్ ఆశయసాధనకర్తగా సీఎం వైఎస్ జగన్ తెలుగుజాతి ఉన్నంతవరకు మిగిలిపోతారు. ఈ కాలంలో అంటరానితనంపై అవిశ్రాంత పోరాటం చేస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్ అని చెప్పక తప్పదు. – పీడిక రాజన్న దొర, ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ మంత్రి) అంటరానితనంపై సవాల్ పేదలకు మేలు చేసే విషయాలపై గత పాలకులు సగం సగం నిర్ణయాలే తీసుకున్నారు. సీఎం జగన్ మాత్రం చిత్తశుద్ధితో అసైన్డ్ భూములపై నిర్ణయం తీసుకున్నారు. అంటరానితనంపై ప్రభుత్వ పరిపాలన సవాల్ విసిరినట్లు ఉంది. నాలుగేళ్ల పాలనలో విప్లవాత్మక సంస్కరణల ద్వారా సీఎం తన విశ్వరూపం చూపారు. – పినిపె విశ్వరూప్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి చరిత్రాత్మక నిర్ణయం అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించడం చరిత్రాత్మక నిర్ణయం. ఎంతటి కష్టమొచ్చినా ఇన్నాళ్లూ అసైన్డ్ భూములను అమ్ముకోడానికి వీలు లేని పరిస్థితి. ఇకపై ఆ బెంగ తీరనుంది. దీనివల్ల 15.21 లక్షల మంది పేదలకు చెందిన 27.41 లక్షల ఎకరాల భూమిని పేదలు అమ్ముకోడానికి అవకాశం కలుగుతోంది. వాళ్లకు హక్కులు కల్పిస్తే వారి జీవితాలు బాగు పడతాయనే ఆలోచనే గొప్ప మార్పునకు నాంది. – మేరుగు నాగార్జున, రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి దేశంలో గొప్ప భూ సంస్కరణ అసైన్డ్ భూములపై దళితులకు సర్వహక్కులు కల్పించడం దేశంలోనే గొప్ప భూ సంస్కరణ. 20 ఏళ్లపాటు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూమిపై ఉన్న ఆంక్షలన్నీ ఎత్తేసి ఆ భూమిపై సర్వహక్కుల్ని లబ్ధిదారులకు కల్పించడం నిజంగా గొప్ప విషయం. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఇలాంటి భూ సంస్కరణ జరగలేదు. భూములపై హక్కు కల్పించడం అంటే వారి హోదాను పెంచడమన్న విషయాన్ని విపక్షాలు గుర్తించాలి. – ఆదిమూలపు సురేష్, పురపాలక శాఖ మంత్రి సీఎం జగన్‌కు సెల్యూట్ అసైన్డ్ భూములపై సంస్కరణలు పేద రైతుల హోదాను పెంచే మహత్తర నిర్ణయంగా భావించాలి. దళిత ప్రజాప్రతినిధులమంతా సీఎం జగన్‌కు సెల్యూట్ చేస్తున్నాం. ఈ భూ సంస్కరణల ద్వారా 15.21 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుంది. భూ రీసర్వే ద్వారా ఇప్పటికే 19 లక్షల మ్యుటేషన్లు జరిగాయి. – నందిగం సురేష్, వైఎస్సార్సీపీ బాపట్ల ఎంపీ గొప్ప ఫలితాలు ఖాయం వైఎస్ జగన్ ప్రభుత్వం విలువ లేకుండా ఉన్న భూములపై ఆంక్షలు తొలగించి, వాటిపై అనుభవదారులకు సర్వ హక్కుల్ని కల్పించింది. తద్వారా పేద రైతుల సామాజిక హోదాను పెంచే దిశగా అడుగులు ముందుకు వేసింది. ప్రభుత్వ ఆస్తులు, ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో ఉన్న ఆస్తుల్ని వేర్వేరుగా రికార్డుల్లో చేర్చి, వివాదాలను పరిష్కరిస్తోంది. స్వాతంత్య్రం వచ్చాక తొలిసారి భూ హక్కుల సంస్కరణలు గొప్ప ఫలితాల్ని ఇవ్వనున్నాయి. – తానేటి వనిత, రాష్ట్ర హోం శాఖ మంత్రి రైతు హోదాను పెంచే మహత్తర నిర్ణయం 20 ఏళ్లపాటు అనుభవమున్న భూమిపై సర్వహక్కులు కల్పించటం, ఆంక్షలు ఎత్తివేత సహసోపేత నిర్ణయం. ఒక మేజర్ సంస్కరణ తీసుకు రావాలని రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచించారు. 20 ఏళ్లపాటు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూమిపై ఆంక్షలన్నీ ఎత్తేసి ఆ భూమిపై సర్వహక్కుల్ని లబ్ధిదారులకు కల్పించారు. రైతుకు తన భూమిపై హక్కు ద్వారా తన హోదాను పెంచే నిర్ణయంగా భావించాలి. – మేకతోటి సుచరిత, మాజీ మంత్రి దేశ చరిత్రలో సువర్ణాధ్యాయం సీఎం వైఎస్ జగన్ సామాజిక బాధ్యతతో తీసుకున్న ఈ నిర్ణయం భారత సామాజిక న్యాయ చరిత్రలో సువర్ణ అధ్యాయం. అసైన్డ్ భూములకూ ఇక మంచి ధర వస్తుంది. ఆయా రైతుల స్థితిగతులు, ఆదాయ హోదాలు పెరుగుతాయి. విలువైన ఆస్తి అని వారు సంబరపడుతున్నారు. – జూపూడి ప్రభాకర్‌రావు, ప్రభుత్వ సలహాదారు -
అసైన్డ్ భూముల అంశంలో సీఎం జగన్‌ది సాహసోపేత నిర్ణయం: మంత్రి ధర్మాన
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూముల అంశంలో సీఎం జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ఈ నిర్ణయంతో ఇకపై అసైన్డ్ భూముల లబ్ధిదారులైన పేదలకు సర్వహక్కులు లభించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. భూమి యాజమాన్యానికి సంబంధించి మార్పులు, సంస్కరణలు, ప్రయోజనకరమైన నిర్ణయాల్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘మొదట్లో వ్యవసాయం తప్ప మరొక ఉపాధిమార్గం ఉండేది కాదు. అలాంటిది, ఈ ప్రభుత్వం వచ్చాక 20 ఏళ్లుగా తమకిచ్చినటువంటి భూమిపై సాగుచేసుకుంటున్న వ్యక్తికి ఆ భూమిపై అన్నిరకాల హక్కుల్ని కల్పించింది ఈ ప్రభుత్వం. ఇంతవరకు ఏ ప్రభుత్వం ఇలాంటి మహత్తర గొప్ప నిర్ణయం తీసుకోలేదని స్పష్టంచేస్తున్నాను’ అని చెప్పారు. 20 ఏళ్లపాటు అనుభవమున్న భూమిపై సర్వహక్కులు.. ఈ అంశంపై ఆయన మాట్లాడుతూ.. ‘ 1977లో ఏపీ శాసనసభ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ (పీఓటీ)–1977 అనే చట్టాన్ని తీసుకొచ్చింది. ఆ చట్టం ఏ నేపథ్యంలో వచ్చిందంటే, ఆనాడు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసిన పెద్దలు, ప్రభుత్వం.. పేదలకు ఇస్తున్న భూమి జమీందార్లకు, భూస్వాములకు అమ్మకం చేస్తున్నారని.. తద్వారా వారికి ఉపాధికల్పించడానికి ఇచ్చిన భూమి వారి వద్ద లేకుండా పోతుందనే విషయాన్ని గ్రహించారు. దీంతో ప్రభుత్వ లక్ష్యం దెబ్బతింటున్న నేపథ్యంలో 1977 చట్టాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికి 40 ఏళ్లు దాటాయి. దేశంలోనూ సమాజంలోనూ అనేక మార్పులు వచ్చాయి. నిరుపేదల్లో అక్షరాస్యత పెరిగింది. గ్రామాల్లో భూస్వాములు, జమీందార్లు లేకుండా.. అందరికీ అనేక ఉపాధిమార్గాలు అందుబాటులోకొచ్చాయి. ఈనేపథ్యంలో ఒక మేజర్ సంస్కరణ తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచన చేశారు. ఆ ఆలోచనే.. ఏపీ కేబినెట్లో తీర్మానించినట్టుగా, 20 ఏళ్లపాటు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూమిపైనున్న ఆంక్షలన్నీ ఎత్తేసి ఆ భూమిపై సర్వహక్కుల్ని లబ్ధిదారులకు కల్పించారు. అంటే, ఒక ప్రయివేటు భూమిపై వ్యక్తులకున్న హక్కులన్నీ... నేటికి 20 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న అసైన్డ్భూమి రైతులకు కూడా ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేస్తుంది’ అని అన్నారు. రైత్వారీ పట్టాపొందిన వారికే ఆ భూమిపై హక్కు చట్టాలు తెలియక, లేదంటే అన్యాక్రాంతం చేసినా, లేక ఇప్పటికే భూములు అమ్ముకున్నట్లైతే.. వాటిని కొనుగోలు చేసిన వారికి మాత్రం పీఓటీ చట్టంలో రిలీఫ్ ఉండదని చెప్పారు. చట్టంలో దాని స్థాయి యథారీతిగానే ఉంటుందని.. ఆ భూమిపై హక్కు అప్పట్లో ఒరిజినల్ రైత్వారీ పట్టా పొందిన రైతుకు మాత్రమే చెందుతుందని స్పష్టంచేశారు. కనుక ఇప్పటికే సదరు అసైన్డ్ భూములు కొనుగోలు చేసుకున్నవారికి హక్కులు ఉండవని అర్ధం చేసుకోవాలని సూచించారు. అసైన్డ్ భూమి పొంది, 20 ఏళ్లకు పైబడి సాగుచేసుకుంటున్న భూమిపై సంబంధిత రైతుకు పూర్తిహక్కుల్ని ఈ ప్రభుత్వం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. 15.21 లక్షల మంది రైతులకు లబ్ధి.. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల... రాష్ట్రంలో సుమారుగా 15.21లక్షల మంది అసైన్డ్ రైతులు లబ్ధిపొందుతున్నారని అన్నారు. ‘20 ఏళ్లుదాటి ప్రభుత్వ భూమి అనుభవంలో ఉన్నవారి సంఖ్య ఇది. ఇప్పటికి ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాల ప్రకారం 33.29 లక్షల ఎకరాల్ని రైతులకు అసైన్డ్ చేయగా 19.21 లక్షలమంది లబ్ధిదారులు ఉన్నారని.. వీటిల్లో 27.41 లక్షల ఎకరాల భూమిపై ప్రస్తుతం కేబినెట్ నిర్ణయంతో ఆంక్షల్ని ఎత్తివేయనున్నట్లు తెలిపారు. చదవండి: తప్పు చేసింది టీడీపీ హయాంలో.. విషం వీరిపైనా! -
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అసైన్డ్ భూములపై సర్వ హక్కులు
-
చరిత్రాత్మక నిర్ణయం.. ‘అసైన్డ్’ రైతుల జీవితాల్లో వెలుగు
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కేటాయించిన 20 సంవత్సరాల తర్వాత అసైన్డ్ భూముల యజమానులకు సర్వ హక్కులు ఇవ్వడం భూముల వ్యవహారాల్లోనే మేలి మలుపు. దీనివల్ల 15 లక్షల మందికిపైగా రైతులకు ప్రయోజనం చేకూరడంతోపాటు రాష్ట్రంలో అసైన్డ్ భూముల వివాదాలకు తెరపడనుంది. సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో లక్షలాది మంది రైతుల బతుకు చిత్రాన్ని మార్చే అత్యంత కీలకమైన ఈ ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. భూమి లేని నిరుపేదలు, ఆర్మీలో పని చేసిన వారు, స్వాతంత్య్ర సమర యోధులకు వ్యవసాయ భూములు ఇస్తారు (అసైన్ చేస్తారు). తమకు ఇచ్చిన భూములను స్వాతంత్య్ర సమర యోధులు, ఆర్మీలో పని చేసిన వారు (ఎక్స్ సర్వీస్‌మెన్).. పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. కానీ నిరుపేదలు మాత్రం అమ్ముకునే అవకాశం లేదు. 1954కు ముందు భూములు ఇచ్చిన వారికి పట్టాల్లో ఎక్కడా వాటిని అమ్మకూడదనే షరతు లేదు. 1954 తర్వాత ఇచ్చిన అసైన్డ్ చట్టాల్లో మాత్రం భూములు అమ్మకూడదనే నిబంధన ఉంది. దీంతో ఈ భూములన్నింటినీ నిషేధిత జాబితా 22 (ఎ)లో పెట్టారు. దీనివల్ల వాటి క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా పోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1954కు ముందు అసైన్డ్ అయిన భూములను నిషేధిత జాబితా నుంచి తీసివేసే ప్రక్రియ ప్రారంభించింది. 1954 తర్వాత అసైన్డ్ అయిన భూములు మాత్రం నిషేధిత జాబితాలో ఉన్నాయి. 1977లో ఏపీ అగ్రికల్చరల్ ల్యాండ్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్–పీఓటీ) చట్టం వచ్చింది. దీని ప్రకారం భూమి లేని నిరుపేదలకు వ్యవసాయం కోసం ఇచ్చిన భూములు అమ్ముకోకూడదు. ఎలాంటి కష్టం వచ్చినా, అవసరం వచ్చినా, చదువుల కోసమైనా, ఆరోగ్యం కోసమైనా అమ్ముకునే అవకాశం లేదు. ఈ చట్టం రూపొందించడానికి ముందు ఉన్న అసైన్డ్ భూములు కూడా ఈ చట్టం వల్ల నిషేధిత జాబితాలోకి వచ్చేశాయి. హక్కు లేక.. అమ్ముకోలేక.. తమకు ఇచ్చిన భూమిలో ఏదైనా అవసరం వచ్చి అరెకరం, ఇంకొంత గానీ అమ్ముకోవాలనుకుంటే చట్ట ప్రకారం అమ్ముకోలేని పరిస్థితి ఉండడంతో అసైన్డ్ రైతులు తమ భూములు రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేక కాగితాల మీద రాసి అమ్మకాలు జరిపారు. ఫలితంగా వారికి రావాల్సిన రేటులో కనీసం 25 శాతం కూడా దక్కేది కాదు. తక్కువ రేటుకే తమ భూములను సాదాబైనామాల పద్ధతిలో అమ్ముకునేవారు. ఆ భూమిపై హక్కు లేకపోవడం వల్ల రెవెన్యూ శాఖ ఎప్పుడైనా వారికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉండేది. ఆ భూమి ప్రభుత్వం తీసేసుకుంటుందని, వేరే అవసరాలకు రిజర్వు చేస్తోందనే భయాందోళనలు రైతుల్లో ఉండేవి. మరో వైపు రెవిన్యూ రికార్డులు క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితిని తెలిపేలా లేవు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సుమారు 19,21,855 మందికి 33,29,908 ఎకరాలు అసైన్డ్ చేస్తే ఆ రికార్డులు క్షేత్ర స్థాయికి తగ్గట్టుగా లేవు. 1954 నుంచి అసైన్మెంట్లు (కేటాయింపులు) జరుగుతూనే ఉన్నాయి. అంటే 70 సంవత్సరాల తర్వాత కూడా అసైన్డ్ భూములపై రైతులకు హక్కులు లేవు. ప్రజాప్రతినిధుల కమిటీతో విస్తృత అధ్యయనం ఈ భూములపై అనేక విజ్ఞప్తులు అందడంతో వీటిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో 13 మంది ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలతో 2022 ఆగస్టు 30న సీఎం జగన్ ప్రజాప్రతినిధుల కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కర్ణాటక, తమిళనాడులో పర్యటించి అక్కడి విధానాలపై అధ్యయనం చేసింది. అసైన్డ్ భూములకు సంబంధించి ఇతర రాష్ట్రాల్లో ఉన్న చట్టాలు, నియమ నిబంధనలను సైతం క్షుణ్ణంగా పరిశీలించింది. కేరళ రాష్ట్రంలో అసైన్ చేసిన మూడేళ్ల తర్వాత, కర్ణాటకలో 25 ఏళ్ల తర్వాత, తమిళనాడులో పదేళ్ల తర్వాత కొన్ని నిబంధనలతో అమ్ముకునే అవకాశం ఉందన్న విషయాన్ని కమిటీ పరిగణనలోకి తీసుకుంది. కర్ణాటకలో ఐదేళ్ల తర్వాత కలెక్టర్ అనుమతితో అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చు. తమిళనాడులో మిగులు భూముల్లో ఇచ్చిన అసైన్మెంట్ అయితే 25 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. వీటన్నింటినీ పరిశీలించిన తర్వాత మన రాష్ట్రంలో అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత లబ్ధిదారులు, వారు లేకపోతే వారి వారసులు (హక్కుదారులు) వారికి అవసరమైనప్పుడు అమ్ముకునే అవకాశం కల్పించాలని కమిటీ భావించింది. ఇందుకోసం ఏపీ అసైన్మెంట్ (పీఓటీ)–1977కు సవరణలు చేయాలని కమిటీ ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చింది. అంటే అసైన్మెంట్ జరిగి 20 ఏళ్లు పూర్తయితే అసైన్దారులు, వారి వారసులకు పూర్తి యాజమాన్య హక్కులు ఇవ్వాలని సిఫారసు చేసింది. దీనికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 15.21 లక్షల మంది రైతుల జీవితాల్లో వెలుగు ప్రభుత్వ తాజా నిర్ణయం వల్ల పేద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రైతులకు మేలు జరుగుతుంది. సుమారు 15,21,160 మంది భూమి లేని నిరుపేదలకు వారికి సంబంధించిన 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి. 20 ఏళ్లకు ముందు ఇచ్చిన భూములన్నింటికీ ఇది వర్తిస్తుంది. ఈ భూములన్నీ 1954 తర్వాత అసైన్మెంట్ చేసినవే. ఈ 20 ఏళ్లలో 4,00,695 మందికి 5,88,211 ఎకరాల భూమిని అసైన్ చేశారు. ప్రతి సంవత్సరం రెవిన్యూ విభాగం 20 ఏళ్లు పూర్తయిన భూముల జాబితాను తయారు చేసి, వాటిని 22(ఎ) నుంచి తొలగిస్తుంది. గతంలో మాదిరిగా ఒక భూమిని 22(ఎ) నుంచి తొలగించాలంటే అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. రెవెన్యూ శాఖ తనకు తానే 20 ఏళ్లు దాటిన భూములను జాబితా నుంచి తీసివేస్తుంది. అసైన్డ్ రైతులు ఆఫీసుల చుట్టూ తిరిగే బాధ ఉండదు. అవినీతి ఉండదు. పారదర్శకంగా ఈ ప్రక్రియ నడుస్తుంది. అదే సమయంలో ఎవరైనా 20 ఏళ్లకు ముందే పేద రైతుల నుంచి భూములు కొనుక్కుని ఉంటే వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారికి ఎటువంటి హక్కులు రావు. అలాంటి వారి విషయంలో 1977 పీఓటీ చట్టం అమల్లో ఉంటుంది. పదేళ్ల తర్వాత ఇళ్ల పట్టాలు అమ్ముకోవచ్చు వ్యవసాయ భూములే కాకుండా ప్రభుత్వం ఇళ్ల పట్టాలు నిరుపేదలకు అసైన్ చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 31 లక్షల ఇళ్ల పట్టాలను అక్కచెల్లెమ్మలకు ఇచ్చింది. ఇలా ఇచ్చిన ఇళ్లపై 20 సంవత్సరాల తర్వాత గత చట్టాల ప్రకారం సర్వ హక్కులు లభించేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక దాన్ని 10 ఏళ్లకు తగ్గిస్తూ పీఓటీ చట్టంలో సవరణ చేసింది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాలు పొందిన వారితోపాటు, మిగిలిన వారికీ ఇది వర్తిస్తుంది. -
భూమిని నమ్ముకున్నందుకు న్యాయం...రైతులుగా మారనున్న 46 వేల మంది
-
అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు.. కీలక నిర్ణయం దిశగా సర్కార్
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూములపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. కేటాయించి (అసైన్ చేసి) 20 సంవత్సరాలు పూర్తయిన భూములపై సంబంధిత రైతులకు యాజమాన్య హక్కులు కల్పించనుంది. బుధవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదముద్ర వేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వాలు గతంలో తమకు కేటాయించిన భూములను (అసైన్డ్ భూములు) అమ్ముకునేందుకు హక్కు కల్పించాలని పలు జిల్లాల్లో రైతులు జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులను కోరుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోనున్నారు. తమకు కేటాయించిన భూములను పేదలు అనుభవించడం మినహా వాటిపై అమ్ముకునే హక్కులు లేవు. 1954కి ముందు కేటాయించిన భూములను మాత్రమే అమ్ముకునేందుకు హక్కు ఉంది. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి భూములు పొందిన లక్షలాది మంది రైతులు వాటిల్లో వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వాటిని అమ్ముకోవడానికి, వాటిపై బ్యాంకు రుణాలు తీసుకోవడానికి అవకాశం లేదు. కాగా, అసైన్డ్ రైతులకు పూర్తి యాజమాన్య హక్కుల విషయంపై గత ప్రభుత్వాలు కమిటీలు వేసినా నిర్ణయం మాత్రం తీసుకోలేదు. అసైన్డ్ భూములపై నిర్ణయం తీసుకుని అర్హులైన రైతులకు మేలు చేయాలని ఇప్పుడు ప్రభుత్వం భావించింది. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు నేతృత్వంలో నలుగురు మంత్రులు, 9 మంది ఎమ్మెల్యేలతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ పలుమార్లు సమావేశమై అధ్యయనం చేసింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ పర్యటించి అక్కడ అసైన్డ్ భూములపై అర్హులకు హక్కులు కల్పించిన తీరు, అందుకు అనుసరించిన విధానం, పర్యావసానాలు తదితర అంశాలపై ఆ రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో కమిటీ చర్చించింది. అసైన్డ్ భూములపై హక్కులు కల్పించేందుకు ఉన్న అవకాశాలపై విస్తృతంగా పరిశోధించింది. వాటన్నింటినీ క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కేటాయించి 20 సంవత్సరాలు పూర్తయిన భూములపై యాజమాన్య హక్కులు కల్పించాలని సిఫారసు చేసింది. ఈ సిఫారసులను మంత్రివర్గం ఆమోదించనున్నట్లు తెలిసింది. అసైన్డ్ భూముల్లో కేటాయించిన వ్యక్తుల చేతుల్లో ఉంటేనే అమ్ముకునే హక్కు ఇవ్వనున్నారు. 22 (ఎ) నుంచి 1.60 లక్షల ఎకరాలకు విముక్తి గ్రామాల్లో సర్వీస్ ఈనాం భూములను 22 (ఎద) జాబితా నుంచి తొలగించేందుకు మంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. గ్రామాల్లో రజక, నాయీబ్రాహ్మణ, కంసాలి, కుమ్మరి, కమ్మరి, బారికి వంటి సేవలు (గ్రామానికి సేవ చేసే వృత్తులు) చేసే వారికి గతంలో ఈనాం కింద భూములు ఇచ్చారు. కాలక్రమంలో వాటిని నిషేధిత ఆస్తుల జాబితాలో పెట్టారు. అలాంటి విలేజ్ సర్వీస్ ఈనాం భూములు రాష్ట్రంలో 1.60 లక్షల ఎకరాలు ఉన్నాయి. వాటిని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించడం ద్వారా లక్షల మందికి మేలు చేకూర్చనున్నారు. 1,700 దళితవాడలకు శ్మశాన వాటికలు శ్మశాన వాటికలు లేని దళితవాడలకు వాటిని ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఇందుకోసం 1,700 గ్రామాల్లో 1,000 ఎకరాలు కేటాయించనున్నారు. ఎకరం లోపు భూమిని శ్మశాన వాటికల ఏర్పాటు నిమిత్తం కేటాయించే అధికారాలను కలెక్టర్లకు ఇవ్వనున్నారు. -
పట్టాలెక్కని హక్కు.. ఏళ్ల తరబడి అసైన్డ్ పట్టాదారుల నిరీక్షణ
హద్దుల సమస్యే అడ్డంకి.. రెవెన్యూ శాఖ ద్వారా అసైన్డ్ పట్టాలు పొందిన రైతులు పలు ప్రాంతాల్లోని ఆయా భూముల్లో సాగు చేసుకుంటున్నారు. అయితే కొన్ని చోట్ల అసైన్డ్ భూములు ఫారెస్ట్ పరిధిలోకి వస్తున్నాయని ఆ శాఖ అధికారులు దిమ్మలు ఏర్పాటు చేసి కందకాలు తవ్వారు. దీంతో చాలా చోట్ల రైతులు, అటవీ సిబ్బంది మధ్య గొడవలు చోటుచేసుకోగా పోలీస్ కేసులు నమోదయ్యాయి. కోర్టుల్లో సైతం కేసులు నడుస్తున్నాయి. ఈ విషయాల్లో రెవెన్యూ శాఖ ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉంది. జిల్లాలో అటవీ, రెవెన్యూ భూమికి సంబంధించి పక్కా హద్దులు లేకపోవడంతోనే సమస్య జఠిలంగా మారినట్లు తెలుస్తోంది. అటవీ సరిహద్దుల్లోని సర్వే నంబర్లలో ఇచ్చిన అసైన్డ్ పట్టా భూములకు సంబంధించి ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు అంచనా. ఈ సమస్య పరిష్కారానికి ఫారెస్ట్, రెవెన్యూ శాఖలు సంయుక్తంగా సర్వే నిర్వహించి హద్దులు గుర్తించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలోనే నిర్ణయించాయని.. ప్రస్తుతం ఆ మాటే మరిచాయని అసైన్డ్ పట్టాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఈ సమస్యపై దృష్టి సారించి.. తమకు హక్కులు కల్పించి న్యాయం చేయాలని కోరుతున్నారు. 38,770 ఎకరాల్లో అసైన్డ్ భూములు.. జిల్లాలోని 11 మండలాలు 52 రెవెన్యూ గ్రామాల పరిధిలో మొత్తం 66,901.05 ఎకరాల్లో అటవీ విస్తీర్ణం కలిగి ఉంది. ఇందులో 1,630 మంది రైతులు 3,195.68 ఎకరాల్లో ఆక్రమణలో ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. మరోవైపు ప్రభుత్వ భూముల్లో రిజర్వ్ ఫారెస్ట్‌కు కేటాయించిన భూమి పోను.. మిగతా దాంట్లో కొంత మేర పేద రైతులకు అసైన్డ్ కింద పట్టాలు అందజేశారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో మొత్తం 48,320 ఎకరాల భూమిని అసైన్డ్ పట్టా కింద పేదలకు ఇవ్వగా.. ఇందులో అటవీ పరివాహక గ్రామాలున్న 11 మండలాల్లో అసైన్డ్ పట్టా భూములు దాదాపు 38,770 ఎకరాలున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. ఏం చేయాలో తోచడం లేదు.. నాకు చిన్నదర్పల్లి గ్రామ శివారు సర్వే నంబర్ 16లో మూడు ఎకరాల విస్తీర్ణంలో లావణిపట్టా భూమి ఉంది. సుమారు 50 ఏళ్లుగా ఈ భూమిని సాగు చేసుకుంటూ జీవిస్తున్నాం. ఈ సీజన్లో పంట వేసేందుకు భూమిని చదును చేస్తుంటే అటవీ అధికారులు అడ్డుకున్నారు. దీంతో హన్వాడ తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి మా భూమిలో పంటలు వేసుకోనివ్వాలని వేడుకున్నా. తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూమిలో ఇప్పుడు పంటలు వేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో తెలియడం లేదు. నాకు ఏం చేయాలో తోచడం లేదు. – వడ్డె తిరుమలయ్య, చిన్నదర్పల్లి, హన్వాడ -
అసైన్డ్ భూములను లాక్కోవడం లేదు: హరీశ్
సాక్షి, హైదరాబాద్: ల్యాండ్ పూలింగ్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం బలవంతంగా అసైన్డ్ భూములను లాక్కోవట్లేదని మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. బడ్జెట్ పద్దులపై గురువారం అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఈ అంశంపై ఈ మేరకు విపక్షాలు ఆరోపించగా వాటిలో వాస్తవం లేదని మంత్రి తోసిపుచ్చారు. అసైన్డ్ భూములకు ప్రభుత్వం రూ.70 లక్షల నుంచి రూ.కోటి పరిహారాన్ని రైతులకు ఇచ్చిందని, స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిస్తేనే తీసుకుంటున్నామని చెప్పారు. సాగుకు యోగ్యంకాని అసైన్డ్ భూములనే తీసుకుంటున్నామన్నారు. కాగా, ఎస్టీల జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఓ బీజేపీ ఎంపీ ఇటీవల ప్రధాని మోదీని కలిశారని, ఇది ఆ పార్టీ విధానామా? లేక ఆ ఎంపీ వ్యక్తిగత అభిప్రాయమో చెప్పాలని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ సోయం బాపురావు పేరును నేరుగా ప్రస్తావించకుండా పరోక్షంగా ఆయన తీరును తప్పుబట్టారు. ఒకవేళ ఈ చర్య ఆ ఎంపీ వ్యక్తిగత అభిప్రాయమైతే ఆయనను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని, లేకుంటే బీజేపీ క్షమాపణ చెప్పాలని కోరారు. -
టీడీపీ పెద్దల అక్రమాలు బట్టబయలు.. నా‘రాబంధువులే’!
సాక్షి, అమరావతి: అసైన్డ్ భూముల్లో వాలిపోయిన భూ రాబందుల అక్రమాలు బహిర్గతమయ్యాయి. బడుగు, బలహీన వర్గాల రైతులను బెదిరించి 932.72 ఎకరాల అసైన్డ్ భూములను పచ్చ గద్దలు కాజేసినట్లు వెల్లడైంది. గ్రామాలవారీగా ఎల్లో గ్యాంగ్ అసైన్డ్ భూముల అక్రమాల చిట్టా రట్టైంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2014– 18 మధ్య చోటు చేసుకున్న ఈ దారుణాలు సీఐడీ దర్యాప్తులో ఆధార సహితంగా, రియల్ ఎస్టేట్ అక్రమ సామ్రాజ్యం భౌగోళిక సరిహద్దులతో సహా వెలుగు చూశాయి. ఇప్పటివరకు బట్టబయలైన అసైన్డ్ భూములు 932.72 ఎకరాలు. చంద్రబాబు చెప్పిన ప్రకారం వాటి మార్కెట్ విలువ ఏకంగా రూ.3,730.88 కోట్లకు పైమాటే! కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తులో మరిన్ని అసైన్డ్ బాగోతాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. కార్యాలయాల వారీగా రికార్డుల పరిశీలన.. రాజధాని అమరావతి ప్రాంతంలో 2014 నాటికి ఎస్సీ, బీసీ రైతుల పేరిట ఉన్న అసైన్డ్ భూములు గత సర్కారు హయాంలో ఇతరుల పేరుతో సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు కావడం గమనార్హం. సీఐడీ దర్యాప్తులో గుర్తించిన అసైన్డ్ భూముల రికార్డులను గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు ప్రత్యేక బృందాల ద్వారా తనిఖీ చేయించారు. అమరావతి పరిధిలో 932.72 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ పెద్దలు కొల్లగొట్టినట్టు ఇప్పటివరకు నిర్ధారించారు. భూ సమీకరణ కోసం ఏర్పాటైన సీఆర్డీఏ కార్యాలయాల వారీగా రికార్డులను పరిశీలించి నిజాలు నిగ్గు తేల్చారు. మొత్తం 23 సీఆర్డీఏ కార్యాలయాల పరిధిలో 932.72 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసినట్లు ఆధారాలతో సహా నిరూపితమైంది. రాజధాని నిర్మాణం తరువాత అమరావతిలో ఎకరా మార్కెట్ విలువ కనీసం రూ.4 కోట్లకు చేరుతుందని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబే ప్రకటించారు. ఆ ప్రకారం టీడీపీ పెద్దలు హస్తగతం చేసుకున్న 932.72 ఎకరాల అసైన్డ్ భూముల మార్కెట్ విలువ రూ.3,730.88 కోట్లకు పైమాటేనని పరిశీలకులు చెబుతున్నారు. మొత్తం అసైన్డ్ అక్రమాలు రూ.5,600 కోట్లు! సీఐడీ దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ మరిన్ని అసైన్డ్ భూముల అక్రమాలు వెలుగు చూసే అవకాశాలున్నాయి. అమరావతి పరిధిలో మొత్తం 1,400 ఎకరాల అసైన్డ్ భూముల రికార్డులను తారుమారు చేసినట్లు గతంలోనే సీఐడీ ప్రాథమికంగా గుర్తించింది. ఆ ప్రకారం టీడీపీ నేతలు దక్కించుకున్న అసైన్డ్ భూముల విలువ రూ.5,600 కోట్లని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ‘నారా’యణ బంధువులు, బినామీలే.. అసైన్డ్ భూముల అక్రమాల తీగ లాగితే నారా చంద్రబాబు, పొంగూరు నారాయణ బంధువులు, బినామీల ఇళ్లల్లో డొంక కదులుతోంది. బినామీలు, బంధువుల పేరిట అసైన్డ్ భూములను జీపీఏ, సేల్ డీడ్లు ద్వారా హస్తగతం చేసుకున్నట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. టీడీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సమీప బంధువు పేరిట కూడా అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. నారాయణ విద్యా సంస్థలు, ఆయన సమీప బంధువుకు చెందిన రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ చిరుద్యోగుల పేరిట అసైన్డ్ భూములను కాజేశారు. ఇప్పటివరకు గుర్తించిన 932.72 ఎకరాల అసైన్డ్ భూముల సేల్డీడ్లు, జీపీఏలను సీఐడీ అధికారులు విశ్లేషించగా ఈ అక్రమాలు వెలుగుచూశాయి. ‘ఎన్‌స్పైర’లో కీలక ఆధారాలు స్వాధీనం మాజీ మంత్రి పి.నారాయణ కుటుంబానికి చెందిన హైదరాబాద్‌లోని ‘ఎన్ స్పైర’ మేనేజ్మెంట్ సర్వీసెస్ కార్యాలయంలో సీఐడీ అధికారుల సోదాలు బుధవారం ముగిశాయి. కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, బ్యాంకు ఖాతా లావాదేవీల పత్రాలు, ఇతర కీలక రికార్డులను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకుని విశ్లేషిస్తున్నారు. మునుముందు మరిన్ని కీలక అంశాలు బహిర్గతమవుతాయని భావిస్తున్నారు. -
మా భూమి.. మాకే కౌలు
సాక్షి, అమరావతి: టీడీపీ పెద్దలు తమను మభ్యపెట్టి కాజేసిన అసైన్డ్ భూములను తిరిగి దక్కించుకునేందుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. ఈ మేరకు గతంలోనే పలువురు అసైన్డ్ రైతులు రెవెన్యూ అధికారులకు వినతి పత్రాలు సమర్పించగా మంగళవారం విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయానికి చేరుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు అక్రమంగా దక్కించుకున్న తమ అసైన్డ్ భూములను తిరిగి ఇప్పించాలని కోరారు. అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం చెల్లించకుండా గత ప్రభుత్వం తీసుకుంటుందని బెదిరించి తమ వద్ద నుంచి కాజేశారని సీఆర్డీఏ అధికారుల దృష్టికి తెచ్చారు. తమ భూములను కారుచౌకగా తీసుకున్న తరువాత టీడీపీ సర్కారు వాటికి ప్యాకేజీని ప్రకటించిందన్నారు. ఇప్పటికీ అవి రెవెన్యూ రికార్డుల్లో తమ పేరిటే ఉన్నాయని గుర్తుచేశారు. టీడీపీ నేతలు వాటిని భూసమీకరణ కింద సీఆర్డీఏకు ఇచ్చినట్లు చూపటాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. అసైన్డ్ భూములకు సీఆర్డీఏ ఇస్తున్న కౌలును తమకే చెల్లించాలని వినతిపత్రం అందించారు. భూసమీకరణ కింద అసైన్డ్ రైతులకు అందిస్తున్న ప్యాకేజీ తమకే ఇవ్వాలని, లేదంటే తమ భూములు తమకు తిరిగిస్తే సాగు చేసుకుంటామని విజ్ఞప్తి చేశారు. ఇకనైనా న్యాయం చేయాలి ‘టీడీపీ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది. న్యాయం చేయాలని గతంలో అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలని సీఆర్డీయే అధికారులకు వినతి పత్రం సమరి్పంచాం. ప్రభుత్వం స్పందించి మా భూముల కౌలు మాకే ఇప్పించాలని కోరుతున్నాం. – టి.బాబూరావు, అసైన్డ్ రైతు, రాయపూడి బెదిరించి తీసుకున్నారు.. అసైన్డ్ భూమికి పరిహారం ఇవ్వరని టీడీపీ సర్కారు ప్రచారం చేసి మమ్మల్ని మోసం చేసింది. దీంతో భయపడి టీడీపీ నేతలకు అమ్మేందుకు ఒప్పుకున్నాం. కానీ తరువాత మా నిర్ణయం మార్చుకున్నాం. ఇప్పటికీ ఆ భూములు మాపేరునే రెవెన్యూ రికార్డుల్లో ఉన్నాయి. సీఆర్డీయే రికార్డుల్లో కూడా వాటిని మా పేరిట మార్చాలని కోరాం. – ఆర్.పున్నారావు, అసైన్డ్ రైతు, రాయపూడి మా భూములిస్తే సాగు చేసుకుంటాం ‘అసైన్డ్ భూమికి ప్రభుత్వం పరిహారం ఇవ్వదని టీడీపీ నేతలు, దళారులు మమ్మల్ని ఆందోళనకు గురి చేశారు. ఎకరం రూ.కోటి పలికే భూమికి మాకు కేవలం రూ.6 లక్షలే ఇచ్చారు. మేం సంతకాలు చేసిన తరువాత టీడీపీ ప్రభుత్వం అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించింది. టీడీపీ పెద్దలు మోసం చేశారు. మా భూములు రిజిస్ట్రే షన్ కాలేదు కాబట్టి ప్యాకేజీ మాకే ఇవ్వాలి. లేదా మా భూములు మాకు తిరిగిస్తే సాగు చేసుకుంటాం. – రేమర్ల కోటేశ్వరరావు, అసైన్డ్ రైతు, వెంకటపాలెం ప్యాకేజీ, కౌలు ఇప్పించండి ‘మా భూమి పెండింగ్ రిజిస్ట్రేషన్‌లో ఉంది. సీఆర్డీయే రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతల పేరిట ఉంది. ఇప్పటికైనా మాకు న్యాయం చేయాలి. భూసమీకరణ ప్యాకేజీ, కౌలు మాకే ఇప్పించాలి’ – వి.నరసింహారావు, అసైన్డ్ రైతు, రాయపూడి -
‘నారా’యణ.. నల్లధనం ఓ ‘ఎన్‌స్పైర’!
సాక్షి, అమరావతి: రాజధాని ముసుగులో టీడీపీ పెద్దలు రూ.వెయ్యి కోట్లకుపైగా నల్లధనాన్ని మళ్లించి 169.27 ఎకరాల అసైన్డ్ భూములను సిబ్బంది, పని మనుషుల పేరుతో కాజేసిన బాగోతం బట్టబయలైంది. అమరావతిలో చంద్రబాబు సర్కారు అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. టీడీపీ హయాంలో మొత్తం రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నట్లు ఇప్పటికే గుర్తించగా నల్లధనాన్ని మళ్లించేందుకు ‘ఎన్‌స్పైర’ అనే షెల్ కంపెనీని వాడుకున్నట్లు తాజాగా తేలింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ‘ఎన్‌స్పైర’ కార్యాలయంలో మంగళవారం విస్తృతంగా సోదాలు నిర్వహించిన సీఐడీ అధికారుల బృందం 45 హార్డ్ డిసు్కలు, బ్యాంకు ఖాతా లావాదేవీల కీలక పత్రాలను స్వాదీనం చేసుకుంది. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పొంగూరు నారాయణ తమ కుటుంబ వ్యాపార సంస్థ ‘ఎన్‌స్పైర’ ద్వారా సాగించిన అక్రమాల బాగోతం ఇలా ఉంది. కుమార్తె, అల్లుడు డైరెక్టర్లుగా.. మాజీ మంత్రి నారాయణ తమ కుటుంబం నిర్వహించే నారాయణ విద్యా సంస్థల కోసమంటూ ‘ఎన్‌స్పైర మేనేజ్మెంట్ సర్వీసెస్’ అనే కంపెనీని ఏర్పాటు చేశారు. నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి కొనుగోళ్లు, మౌలిక వసతుల కల్పన, ఉద్యోగులు, సిబ్బందికి జీతాల చెల్లింపుల కోసం దీన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నారాయణ విద్యాసంస్థను లాభాపేక్షలేని సంస్థగా ఏపీ సొసైటీల చట్టం ప్రకారం ఏర్పాటుచేశారు. విద్యాసంస్థ నిధులను నారాయణ తమ వ్యక్తిగత, కుటుంబ అవసరాలకు మళ్లించేందుకు వీలులేదు. దీంతో నిధుల మళ్లింపు కోసం ఎత్తుగడ వేసిన నారాయణ తన కుమార్తె పొంగూరు సింధూర, అల్లుడు పునీత్ డైరెక్టర్లుగా ఎన్‌స్పైర అనే కంపెనీని నెలకొల్పారు. నల్లధనం భారీగా మళ్లింపు.. నారాయణ విద్యా సంస్థలకు అన్ని రకాల చెల్లింపులు నిర్వహిస్తున్నందుకు ఎన్‌స్పైరకు 10 శాతం కమిషన్ చెల్లిస్తున్నట్లు రికార్డుల్లో చూపారు. ఇదే అవకాశంగా ఎన్‌స్పైరలోకి ఇతర సంస్థల నుంచి భారీగా నిధులు మళ్లించారు. ఎన్‌స్పైరలో ఇతర కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టినట్లు చూపడం గమనార్హం. ఒలంపస్ క్యాపిటల్ ఏషియా క్రెడిట్ అండ్ సీఎక్స్ పార్టనర్స్ మ్యాగజైన్ అనే కంపెనీ 2016లో ఏకంగా రూ.400 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు చూపించారు. ఇక 2018లో మోర్గాన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏషియా, బన్యాన్ ట్రీ గ్రోత్ క్యాపిటల్ అనే సంస్థలు 75 మిలియన్ డాలర్లు (రూ.613.27 కోట్లు) పెట్టుబడి పెట్టినట్టు రికార్డుల్లో చూపడం గమనార్హం. రెండు విడతల్లో ఎన్‌స్పైర కంపెనీలోకి రూ.1,013.27 కోట్లు వచ్చి చేరాయి. ఇలా భారీగా నల్లధనాన్ని ఎన్‌స్పైరలోకి మళ్లించినట్లు తెలుస్తోంది. ఆ నిధులు రామకృష్ణ హౌసింగ్‌లోకి.. వివిధ మార్గాల్లో ఎన్‌స్పైరలోకి మళ్లించిన నిధులను నారాయణ తమ సమీప బంధువైన కేవీపీ అంజనికుమార్ ఎండీగా ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌లోకి తరలించారు. దీంతోపాటు నారాయణ విద్యా సంస్థల సిబ్బంది బ్యాంకు ఖాతాల్లోకి కూడా నిధులు మళ్లించడం గమనార్హం. అనంతరం ఆ చిరుద్యోగుల పేరిట అమరావతిలో అసైన్డ్ భూములను కొనుగోలు చేశారు. తమ వద్ద పనిచేసే చిరుద్యోగులను బినామీలుగా మార్చుకుని 169.27 ఎకరాల అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. మొత్తం రూ.5,600 కోట్ల అసైన్డ్ దందా అమరావతిలో రూ.5,600 కోట్ల విలువైన 1,400 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ పెద్దలు కొల్లగొట్టినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. టీడీపీ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా అమరావతి వ్యవహారాల్లో చక్రం తిప్పిన నారాయణ కనుసన్నల్లోనే భూ దందాలు జరిగాయి. రాజధాని కోసం సమీకరించే అసైన్డ్ భూములను గత ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా తీసుకుంటుందని రెవెన్యూ, పురపాలక శాఖ అధికారుల ద్వారా ప్రచారం చేశారు. ఇదే అదనుగా దళితులు, బీసీల భయాందోళనలను సొమ్ము చేసుకునేందుకు రియల్ ఎస్టేట్ కంపెనీలను రంగంలోకి దించారు. అసైన్డ్ భూములను అయినకాడికి అమ్ముకోకుంటే ప్రభుత్వ పరమైపోతాయని పేదలను బెదిరించి కారుచౌకగా కాజేశారు. అసైన్డ్ భూములున్న వారికి నగదు చెల్లింపులు చేసి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) పొందారు. అనంతరం సేల్ డీడ్ల ద్వారా కథ నడిపించారు. రిజిస్ట్రేషన్ చట్టం 22 ఏ కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న వీటిని పకడ్బందీగా సొంతం చేసుకున్నారు. ఆ విధంగా అమరావతి పరిధిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం, బోరుపాలెం, నేలపాడు, రాయపూడి తదితర గ్రామాల్లోని అసైన్డ్ భూములను టీడీపీ పెద్దలు కాజేశారు. అనంతరం అసైన్డ్ భూములకు గత ప్రభుత్వం తాపీగా ప్యాకేజీ ప్రకటించడం గమనార్హం. అక్రమాలు బహిర్గతం.. అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్న కేసులో మాజీ మంత్రి పి.నారాయణను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అసైన్డ్ భూముల బదిలీ నిషేధిత చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు ఐపీసీ 34, 35, 36, 37, 409, 420, 506 తదితర సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా వ్యవహరించిన నారాయణ సన్నిహితులైన ఐదుగురిని గతంలో అరెస్టు చేశారు. కాగా అసైన్డ్ భూములు కొల్లగొట్టేందుకు ఎన్‌స్పైర కంపెనీ ద్వారా నల్లధనాన్ని మళ్లించి అక్రమాల కథ నడిపించినట్లు సీఐడీ దర్యాప్తులో తాజాగా బహిర్గతమైంది. -
అసైన్డ్ భూములకూ సమానంగా పరిహారం
సాక్షి, హైదరాబాద్: భూసేకరణలో పట్టా భూములతోపాటు అసైన్డ్ భూములకూ సమానంగా పరిహారమివ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలి్సన అవసరం లేదని చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్లో మెరిట్ లేదంటూ కొట్టివేసింది. ఒకే పరిహారం కోరుతూ.. ఉదయ సముద్రం ప్రాజెక్టు కోసం సేకరిస్తున్న పట్టాభూములకు, అసైన్డ్ భూములకు ఒకే పరిహారం ఇవ్వాలంటూ కిన్నెర శ్యామ్‌తోపాటు మరో 26 మంది 2016లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఒకేలా పరిహారం ఇవ్వాలని ఆదేశిస్తూ 2022 మార్చి 10న తీర్పు ఇచ్చారు. ఆ విచారణ సందర్భంగా భూసేకరణ అధికారి వర్సెస్ మేకల పాండు కేసులో గతంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును సింగిల్ జడ్జి పరిగణనలోకి తీసుకున్నారు. అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ నల్లగొండ జిల్లా ప్రత్యేక కలెక్టర్, మరికొందరు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు. దీనిపై ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున పి.భావనారావు, ప్రతివాదుల తరఫున శ్రీనివాస్‌రావు, కీర్తి వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవాలి్సన అవసరం లేదని, సమానంగా పరిహారం ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం పూర్తిగా పరిహారం చెల్లించకుండానే భూమిని సేకరించడాన్ని తప్పుబట్టింది. ఈ ఆదేశాల మేరకు ప్రభుత్వం పరిహారం చెల్లించకుంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్లకు సూచించింది. ఉదయ సముద్రం ప్రాజెక్టు పరిహారంలో.. ఉమ్మడి నల్లగొండ జిల్లా పానగల్ వద్ద ఉదయ సముద్రం ప్రాజెక్టు నిర్మాణం కోసం 1998 జనవరిలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. భూసేకరణ పరిహారాన్ని నిర్ణయిస్తూ అదే ఏడాది జూలైలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఉత్తర్వులిచ్చారు. పట్టాభూములకు ఎకరానికి రూ.31,500 పరిహారం నిర్ణయించారు. అసైన్డ్ భూములకు సంబంధించిన రైతులకు ఎకరానికి ఇంత అని కాకుండా, కొంతమొత్తం పరిహారం ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పరిహారంపై సంతృప్తి చెందని పట్టాదారులు పలుమార్లు కోర్టును ఆశ్రయించగా పరిహారం ఎకరానికి రూ.1,10,000కు పెరిగింది. ఈ క్రమంలో తమకు కూడా పరిహారాన్ని పెంచాలంటూ 2011 నుంచి 2015 వరకు అసైన్్డదారులు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చారు. స్పందన రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. -
కేసీఆర్ సర్కార్ కాసుల వేట.. అసైన్డ్ భూములపై స్పెషల్ ఫోకస్!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్ర సర్కారు కాసుల వేట సాగిస్తోంది. ఖజానా నింపుకునేందుకు అసైన్డ్ భూములను అన్వేషిస్తోంది. వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తున్న భూములను సేకరించి.. లేఅవుట్లుగా అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తోంది. ధరలు ఆకాశాన్నంటడంతో.. - రాజధానికి చేరువలో ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. పారిశ్రామికాభివృద్ధి, ఐటీ కంపెనీల తాకిడితో ఈ రెండు జిల్లాల్లో నగరీకరణ శరవేగంగా జరుగుతోంది. దీంతో స్థిరాస్తి రంగం మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అసైన్డ్ భూములు సైతం పరాదీనమవుతున్నాయి. భూమిలేని నిరుపేదలకు జీవనోపాధి నిమిత్తం వివిధ దశల్లో రాష్ట్ర ప్రభుత్వం భూములను పంపిణీ (అసైన్మెంట్) చేసింది. - ఈ భూములను వ్యవసాయ సాగుకు మాత్రమే వినియోగించుకోవాలని నిర్దేశించింది. ఒకవేళ ఇతర అవసరాలకు మళ్లించినా.. క్రయ విక్రయాలు జరిపినా చట్టరీత్యా నేరం. ఇవేమీ పట్టని కొందరు ఈ భూములను యథేచ్ఛగా విక్రయించారు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే కారుచౌకగా ఈ భూములు అందుబాటులో ఉండడంతో బడాబాబులు, ప్రజాప్రతినిధులు ఇబ్బడిముబ్బడిగా కొనుగోలు చేశారు. - ఇలా అసైన్మెంట్ చట్టాన్ని ఉల్లంఘించినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఈ భూములక్రయ విక్రయాలకు అడూ అదుపూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అన్యాక్రాంతమవుతున్న అసైన్డ్ భూములను గుర్తించిన ప్రభుత్వం.. వీటిని ప్లాట్లుగా అభివృద్ధి చేయడం ద్వారా నిధుల సమీకరించుకోవాలనే ఆలోచన చేసింది. నగరానికి సమీపంలో ఉన్న ఈ తరహా భూములను గుర్తించి.. వాటిని లేఅవుట్లుగా అభివృద్ధి చేసి వేలం వేయాలని నిర్ణయించింది. ఈ అభివృద్ధి చేసిన భూమిలో ఎకరాకు 600 చదరపు గజాలను అసైన్డ్‌దారులకు ఇచ్చే విధంగా ప్రణాళికను రూపొందించింది. గజం రూ.40 వేల చొప్పున.. - ఉప్పల్ భగాయత్‌లో పట్టాదారుల భాగస్వామ్యంతో సేకరించిన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) లేఅవుట్లుగా అభివృద్ధి చేసింది. దీంట్లో డెవలప్ చేసి ఎకరాకు వేయి గజాల చొప్పున పట్టాదార్లకు కేటాయించింది. ఇదే పద్ధతిని అసైన్డ్ భూములకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలను ఖరారు చేసి భూములను గుర్తించాలని కలెక్టర్లకు లేఖ రాసింది. ఈ మేరకు చర్లపటేల్ గూడ, కుర్మల్‌గూడ, తొర్రూర్, కవాడిపల్లి, చందానగర్, మునగనూరు, కొల్లూరు, పసుమాముల, తుర్కయంజాల్, లేమూరు, కొల్లూరులలో దాదాపు 3వేల ఎకరాలను ప్రాథమికంగా ఎంపిక చేసింది. - సేకరిస్తున్న అసైన్డ్ భూములకు ఆయా ప్రాంతాల్లో ఉన్న విలువ ఆధారంగా ఎకరాకు 600 గజాల నుంచి 800 వరకు ఇవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రైవేటు భూములతో పోలిస్తే అసైన్డ్ భూములకు ధర తక్కువ. వీటి క్రయవిక్రయాలపై నిషేధం ఉన్నందున.. ఇవి ఎకరాకు రూ.25 లక్షలు కూడా లభిస్తున్నాయి. - ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్కారు వీటిని లేఅవుట్లుగా అభివృద్ధి చేయడం ద్వారా గజాన్ని సగటున రూ.40వేల చొప్పున విక్రయించవచ్చని అంచనా వేస్తోంది. దీంతో అటు అసైన్డ్‌దారులు.. ఇటు ప్రభుత్వానికి ఉభయతారకంగా లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడం.. సంక్షేమ పథకాలకు నిధులు భారీగా అవసరం ఉండడంతో సాధ్యమైనంత త్వరగా అసైన్డ్ భూములను సేకరించి వెంచర్లుగా అభివృద్ధి చేసి నిధులను సమకూర్చుకోవాలనుకుంటోంది. దీంతో ఈ ప్రక్రియను వడివడిగా పూర్తి చేయాలని కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. -
అసైన్డ్ భూములపై తర్జనభర్జన!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అసైన్డ్ భూములపై రాష్ట్రప్రభుత్వం దృష్టి సారించింది. ఈ భూములకు సంబంధించి నిరుపేదలకు హక్కులు కల్పించే విషయమై సమాలోచనలు చేస్తోంది. ఈ భూములపై లబ్ధిదారులకు హక్కులు కల్పించడానికి ఉన్న అవకాశాలేంటి? కల్పిస్తే జరిగే పరిణామాలేంటి? హక్కులు ఇవ్వడం ద్వారా పేదల నుంచి భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వం తీసుకోగలిగిన చర్యలేమైనా ఉన్నాయా? లబ్ధిదారుల నుంచి ఇప్పటికే ఇతరుల చేతుల్లోకి వెళ్లిన భూములను ఏం చేయాలి? వీలున్నచోట్ల అసైన్డ్ భూములను ప్రభుత్వమే కొనుగోలు చేసే అవకాశముందా? అనే అంశాలపై ప్రభుత్వం లోతుగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే, ఏది చేయాలన్నా తెలంగాణ అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధచట్టం–1977 (పీవోటీ యాక్ట్)కు కచ్చితంగా సవరణ చేయాల్సి ఉన్నందున డిసెంబర్లో నిర్వహించే శీతాకాల లేదంటే బడ్జెట్ సమావేశాల్లో ఇందుకు సంబంధించిన బిల్లు పెట్టే అవకాశముందని తెలుస్తోంది. ఆర్థిక భరోసా వచ్చేనా..? వాస్తవానికి, గత కొన్నేళ్లుగా రాష్ట్రంలోని వ్యవసాయ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రభుత్వవర్గాల కథనం ప్రకారం ఏ మారుమూల ప్రాంతంలోనైనా ఎకరం భూమి 15–20 లక్షలు పలుకుతోంది. డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో ఎకరా కోట్లు పలుకుతుంటే రాజధాని శివార్లలో పదుల కోట్లు దాటుతోంది. ఈ నేపథ్యంలో ఆ భూములను అనుభవించే వీలులేకుండా కేవలం సాగు హక్కులు కల్పించడంవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, వ్యవసాయాన్నే నమ్ముకుని బతుకుతున్న పేదలు వారి అవసరాలకు వాటిని ఇతరులకు అమ్ముకోగలిగితే కొంత ఆర్థిక భరోసా వస్తుందనే వాదన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా పలుమార్లు రాష్ట్రంలోని అసైన్డ్ భూముల పరిస్థితిపై ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంది. అసైన్డ్ భూములు అసైనీల చేతుల్లోనే ఉన్నాయా? అన్యాక్రాంతమైన భూములెన్ని? అసైనీల దగ్గరి నుంచి కొనుగోలు చేసిన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులేంటి? అన్నదానిపై రెవెన్యూ వర్గాలు ప్రభుత్వానికి వివరాలు పంపాయి. ఈ వివరాల ప్రకారం దాదాపు 40 శాతం భూములు అసైనీల చేతుల్లో లేవని సమాచారం. ఈ నేపథ్యంలో అన్యాక్రాంతమైన భూములను ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది. 1/70 చట్టం తరహాలో... రాజధాని శివార్లలోని అసైన్డ్ భూములకు పరిహారం ఇవ్వడం(కొనుగోలు చేయడం) ద్వారా ఆ భూములను సొంతం చేసుకుని వాటిని వేలం వేయాలనే ప్రతిపాదన గతంలోనే ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఈ మేరకు శంషాబాద్సహా కొన్ని మండలాల్లోని అసైన్డ్ భూముల కొనుగోలు, అమ్మకాలపై ప్రభుత్వం వద్ద నివేదిక కూడా ఉంది. దీనికితోడు అసైన్డ్ భూములను ప్రభుత్వమే కొనుగోలు చేసే వెసులుబాటు కూడా ఉంది. కేంద్ర ప్రభుత్వపరిధిలోని 1/70 చట్టం ప్రకారం(అటవీ చట్టం) గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూములుంటే వాటిని కేవలం గిరిజనులకు మాత్రమే అమ్మాలి. కొనేందుకు గిరిజనులెవరూ ముందుకు రాకపోతే ప్రభుత్వమే వాటిని కొనుగోలు చేయవచ్చు. ఈ వెసులుబాటు ఆధారంగానే రాష్ట్రంలోని అసైన్డ్ భూములను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. అయితే, రాష్ట్రవ్యాప్తంగా అన్ని భూములను కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై న్యాయనిపుణుల సలహాలు కూడా తీసుకున్నట్టు సమాచారం. మొత్తం మీద అసైన్డ్ భూములకు హక్కులు కల్పించే విషయంలో అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్న ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తుందనే చర్చ రెవెన్యూ వర్గాల్లో జరుగుతోంది. అన్నీ క్షుణ్ణంగా ఆలోచించిన తర్వాతే... గత కొన్నేళ్ల పరిణామాలను చూస్తే దేశవ్యాప్తంగా భూముల అమ్మకాలు, కొనుగోళ్ల మీద ఆంక్షలన్నింటినీ సడలించుకుంటూ వస్తున్నాం. 2004లో ప్రపంచ బ్యాంకు తయారు చేసిన నివేదిక కూడా ఆంక్షలను తొలగించాలని, భూక్రయ, విక్రయ లావాదేవీలు సులభతరం చేయాలని ప్రతిపాదించింది. ‘ల్యాండ్ పాలసీస్ ఫర్ గ్రోత్ అండ్ పావర్టీ రిడక్షన్’ పేరిట భారతదేశం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన నివేదిక ఇది. ఆర్థిక సరళీకరణ సూత్రం మార్కెట్లో భూలావాదేవీలు సులభతరంగా ఉండాలని చెబుతోంది. మనం వద్దనుకున్నా, కావాలనుకున్నా ఆంక్షలు ఎత్తివేయడమే మన ముందున్న మార్గం. అయితే, ఆంక్షలు ఎత్తివేసే సమయంలో ఎవరి రక్షణ కోసం చట్టాలు చేశామో వారు నష్టపోకుండా చూసుకోవాలి. ఈ పరిస్థితుల్లో పేదల భూములపై కొంతమేరకు ఆంక్షల సడలింపు అవసరం. అసైన్డ్ భూములను ప్రభుత్వం కొనుగోలు చేసే అంశం లేదా ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లు కొనుగోలు చేయాలన్న కోనేరు రంగారావు నివేదికను పరిశీలించాలి. లేదంటే కొంత కాలపరిమితికి అమ్ముకునే అవకాశమివ్వాలి. అలా అమ్ముకునే సమయంలో కూడా ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న తర్వాతనే ఆ భూమిపై హక్కులు బదలాయించాలి. –భూమి సునీల్, భూచట్టాల నిపుణుడు, నల్సార్ విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ స్ఫూర్తికి విఘాతం కలిగితే..! తెలంగాణలో దాదాపు 15 లక్షల మందికిపైగా పేదలకు 24 లక్షల ఎకరాలను అసైన్ చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే, ఈ భూములపై సదరు పేదలకు హక్కు ఉండదు. కేవలం సాగు మాత్రమే చేసుకోవాలి. ఇతరులకు అమ్మడం ద్వారా అసైనీలు వారి హక్కులను బదలాయించే వెసులుబాటు లేదు. పొరుగునే ఉన్న కర్ణాటకలో అసైన్ చేసిన 20 ఏళ్ల తర్వాత అమ్ముకునే అవకాశముంది. మనరాష్ట్రంలో ఆ హక్కులు కల్పిస్తే బడుగుల చేతుల్లో ఉన్న ఆ కొద్ది భూమి ధనవంతులు, భూస్వాముల చేతుల్లోకి వెళ్లిపోతుందని, తద్వారా అసైన్డ్ స్ఫూర్తికే విఘాతం కలుగుతుందని, రాష్ట్రంలో భూముల్లేని పేదలసంఖ్య పెరిగిపోతుందనే వాదన ఉంది. ఈ వాదనను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం పలు ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తోందని తెలుస్తోంది. -
‘అసైన్డ్’ ప్లాట్లు అమ్ముతాం! అమరావతిలో పచ్చ గ్యాంగ్ నయా దందా
సాక్షి, అమరావతి: ‘ప్లాట్లు అమ్ముతాం బాబూ.. అమరావతిలో ప్లాట్లు అమ్ముతాం.. కొంత తక్కువ ధరకే ఇస్తాం.. మంచి అవకాశం.. త్వరగా వచ్చి కొనుగోలు చేయండి.’ ఇదీ అమరావతి పరిరక్షణ సమితిలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు నేతల తాజా నినాదం. ఇందులో విశేషం ఏముందీ అంటారా.. అక్కడే ఉంది అసలు గుట్టు. అమరావతి కోసం ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వం సమీకరించిన భూముల్లో వారికి సంబంధించిన భూమి ఒక్క సెంటు కూడా లేదు. కానీ ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చినట్టుగా కనికట్టు చేసి ప్లాట్లు పొందారు. ఈ బండారం సీఐడీ దర్యాప్తుతో బట్టబయలు అవుతుండటంతో గుట్టు చప్పుడు కాకుండా ఆ ప్లాట్లు విక్రయించి సొమ్ము చేసుకునే యత్నాల్లో నిమగ్నమయ్యారు. అమరావతిలో మరో కొత్త భూదందాకు తెరతీశారు. ఇదీ ఉద్యమ నేత తీరు.. ఆయన అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమనేత. టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు కనుసన్నల్లో అమరావతి ఉద్యమాన్ని నడుపుతున్నారు. అమరావతిలో ఆయనకున్న 20 ప్లాట్లను ఒక్కొక్కటిగా అమ్మకానికి పెడుతున్నారు. ల్యాండ్ పూలింగ్ కింద ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతుల జాబితాలో ఆయన పేరే లేదు. కానీ అసైన్డ్ రైతుల పేరిట అక్రమంగా ఆయనకు గత ప్రభుత్వం 20 ప్లాట్లు కేటాయించింది. రిజిస్టర్ సేల్ డీడ్ కింద వాటిని ఆయన పేరిట రిజస్టర్ చేశారు. అవన్నీ తుళ్లూరు మండలం మందడం పరిధిలోనివే కావడం గమనార్హం. సర్వే నంబర్లు 199, 133, 131, 242, 236, 321, 308, 307, 268, 295, 408, 296, 413, 465తో ఉన్న ఆ ప్లాట్లను ఆయన విక్రయించేందుకు యత్నిస్తుండటం అమరావతిలో చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం ఆ భూములన్నీ పలువురి రైతుల పేరిట ఉన్నాయి. కానీ సీఆర్డీయే రికార్డుల్లో మాత్రం అమరావతి పరిరక్షణ సమితి నేత పేరిట నమోదు కావడం గమనార్హం. ఆ భూముల కొనుగోలుకు ఆసక్తి కనబరిచిన కొందరు సబ్ రిజిస్టార్ కార్యాలయాన్ని సంప్రదించడంతో అసలు విషయం వెలుగుచూసింది. వెంకటపాలెంలో సర్వే నంబరు 295/10, 296/5, మందడంలో సర్వే నంబరు 454/3సీ, కురగల్లులో సర్వే నంబరు 500/1లో ఉన్న ప్లాట్లు కూడా విక్రయించేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. 964 ఎకరాల అసైన్డ్ భూములు కొల్లగొట్టారు అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో కూడిన కోర్ క్యాపిటల్ ప్రాంతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో టీడీపీ పెద్దలు అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. సీఐడీ దర్యాప్తులో ఈ బండారం మొత్తం బయటపడింది. అమరావతిలో 2014 వరకు అసైన్డ్ భూములు ఎవరి పేరుతో ఉన్నాయి? 2016లో భూ సమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో పేర్కొన్న పేర్లు ఏమిటన్నది పరిశీలించినప్పుడు టీడీపీ భూ బాగోతం గుట్టు రట్టయింది. రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్ భూముల హక్కుదారుల జాబితాలో ఉన్న రైతుల పేర్లకు, సీఆర్డీఏకు భూములిచ్చిన వారుగా పేర్కొన్న జాబితాలోని పేర్లకు ఎక్కడా పొంతనే లేదు. బడుగు, బలహీన వర్గాల రైతుల స్థానంలో టీడీపీ పెద్దల బినామీలు, సన్నిహితుల పేర్లు కనిపించాయి. ఇలా 29 గ్రామాల పరిధిలో 964.88 ఎకరాలకు సంబంధించి భూ హక్కుదారుల పేర్లను గల్లంతు చేశారు. వాటిలో బడుగు, బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూములు 636.75 ఎకరాలున్నాయి. వాటిలో అత్యధిక భాగం టీడీపీ పెద్దలు తమ బినామీల పేరిట కొల్లగొట్టారు. అనంతరం ఆ భూములను ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చినట్టుగా చూపించి ప్లాట్లు తీసుకున్నారు. బినామీలుగా ఉన్నందుకు కొందరు అనుయాయులకు కూడా కొన్ని ప్లాట్లు కేటాయించారు. వారిలో టీడీపీ మంత్రుల వ్యక్తిగత సహాయకులు, అమరావతి ప్రాంతంలో ఆ పార్టీ కార్యకర్తలు మొదలైన వారు ఉన్నారు. ప్రస్తుతం వారే అక్రమంగా పొందిన అసైన్డ్ ప్లాట్లను విక్రయించేందుకు యత్నిస్తున్నారు. ఆ ప్లాట్లను ఎలా విక్రయిస్తారన్నది తాడేపల్లి, మంగళగిరిలో హాట్ టాపిక్‌గా మారింది. సీఐడీ దర్యాప్తుతో బెంబేలు అమరావతి అక్రమాలపై సీఐడీ దరా>్యప్తుతో అసైన్డ్ దొంగలు కలవరపడుతున్నారు. మొత్తం వ్యవహారం నిగ్గు తేలితే తాము అక్రమంగా పొందిన ప్లాట్ల కేటాయింపును రద్దు చేస్తారని వారు ఆందోళన చెందుతున్నారు. దాంతో ఆ ప్లాట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేందుకు యత్నిస్తున్నారు. ప్రధానంగా టీడీపీ నిర్వహిస్తున్న అమరావతి పరిరక్షణ సమితి ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నవారే తమ ప్లాట్లను విక్రయించేందుకు యత్నిస్తుండటం గమనార్హం. భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చి, వారు మాత్రమే పాదయాత్రలో పాల్గొనాలని న్యాయస్థానం చెప్పింది. దాంతో బోగస్ అమరావతి రైతు ఉద్యమ నేతలకు ఝలక్ ఇచ్చినట్లయింది. గుర్తింపు కార్డులు లేకపోవడంతో పాదయాత్ర నిలిపివేశారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయన్నది స్పష్టత లేదు. దాంతో తాము అక్రమంగా పొందిన ప్లాట్లను గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేసి సొమ్ము చేసుకోవాలని భావిస్తున్నారు. భూమి చూపించకుండానే కేవలం సేల్ డీడ్ పత్రాలను చూపించి ప్లాట్ల విక్రయాల దందాకు తెరతీశారు. తుళ్లూరు, మందడం, ఉద్దండరాయునిపాలెం, కురగల్లు, పెనుమాక, నవులూరు తదితర గ్రామాల్లో అక్రమంగా పొందిన అసైన్డ్ ప్లాట్లను విక్రయించేందుకు లావాదేవీలు జోరందుకున్నాయి. -
అమరావతి అసైన్డ్ భూముల కేసులో సాక్షులకు టీడీపీ బెదిరింపులు
సాక్షి, అమరావతి: ఇంటి గుట్టు రట్టు లంకకు చేటు తెచ్చిందని ఆనాడు రావణుడు నేలకొరుగుతూ వాపోయాడు. అమరావతి భూదందా గుట్టు రట్టవడం టీడీపీకి చేటు అంటూ ఇప్పుడు చంద్రబాబు చుర్రుబుర్రులాడుతున్నారు. అమరావతిలో రూ.4,000 కోట్ల అసైన్డ్ భూములు కొల్లగొట్టిన దందా బట్టబయలు కావడంతో సీఐడీ కేసులు నమోదు చేసింది. టీడీపీ నేతలు ఆ భూములు ఎలా కొల్లగొట్టారో కొందరు సాక్షులు సీఐడీకి వివరంగా చెప్పడంతో చంద్రబాబు గొంతులో వెలక్కాయ పడినట్లయింది. టీడీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా ఈ కేసులో సాక్షుల వాంగ్మూలం కాపీలు దక్కించుకోవడమే కాకుండా .. వాటి ఆధారంగా సాక్షులను బెదిరిస్తున్నారు. చంద్రబాబు, నారాయణ ఒత్తిడితోనే అసైన్డ్ జీవో అమరావతిలో అసైన్డ్ భూములు కొల్లగొట్టిన పచ్చ గద్దల కుట్ర కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ అధికారులు పలువురు ఉన్నతాధికారులు, ఇతర కీలక వ్యక్తులను విచారించారు. టీడీపీ ప్రభుత్వ పెద్దలు, వారి బినామీలు అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను భయభ్రాంతులకు గురి చేసి అసైన్డ్ భూములు కొల్లగొట్టిన వైనంపై ప్రధానంగా దృష్టిసారించారు. టీడీపీ ప్రభుత్వ పెద్దలు ఏకంగా 964 ఎకరాలను అసైన్డ్ భూముల చట్టానికి విరుద్ధంగా హస్తగతం చేసుకున్నారు. ఆ తరువాత అసైన్డ్ భూములకు కూడా భూసమీకరణ కింద ప్యాకేజీ ప్రకటిస్తూ చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసింది. దాంతో ఏకంగా రూ. 4 వేల కోట్ల విలువైన 964 ఎకరాలు చంద్రబాబు బినామీలు, అస్మదీయుల గుప్పిట్లోకి చేరాయి. అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటిస్తూ జీవో ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమని ఆనాటి ఉన్నతాధికారులు ఎంతగా చెప్పినా, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ ససేమిరా అన్నారు. వారిద్దరి ఒత్తిడితోనే ఉన్నతాధికారులు జీవో 41 జారీ చేశారు. ఇదే విషయాన్ని ఆ ఉన్నతాధికారులు, ఇతర కీలక వ్యక్తులు సీఐడీ దర్యాప్తులో వెల్లడించారు. ఈ మేరకు సెక్షన్ 164 కింద వాంగ్మూలాలు కూడా ఇచ్చారు. దాంతో చంద్రబాబు సాగించిన భూదందా అధికారికంగా బట్టబయలైంది. ఈ కేసు విచారణ న్యాయస్థానంలో కొనసాగుతోంది. టీడీపీ చేతిలో వాంగ్మూలం కాపీలు.. సాక్షులపై ఒత్తిళ్లు రోజురోజుకు వ్యవహారం ప్రతికూలంగా మారుతుండటంతో అసైన్డ్ భూముల కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు అండ్ కో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ కేసులో సాక్షులను లక్ష్యంగా చేసుకున్నారు. సీఐడీకి సాక్షులు సెక్షన్ 164 కింద ఇచ్చిన వాంగ్మూలం ప్రతులను నిబంధనలకు విరుద్ధంగా సంపాదించారు. వీటిలో సాక్షులు వెల్లడించిన వాస్తవాలతో చంద్రబాబు బ్యాచ్‌కు ముచ్చెమటలు పడుతున్నాయి. దాంతో సాక్షులపై ఒత్తిళ్లు, పరోక్ష బెదిరింపులకు పాల్పడుతున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ‘మనం మనం’ ఒకటి కదా అంటూ బతిమాలుతూనే, బెదిరింపులకూ పాల్పడుతున్నట్లు సమాచారం. తమ వర్గాల ద్వారా వేర్వేరు మార్గాల్లో ఒత్తిళ్లు తీవ్రతరం చేశారు. దాంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తాము ఇచ్చిన వాంగ్మూలం కాపీలు టీడీపీ చేతుల్లోకి పోవడంతో అసైన్డ్ భూముల కేసులో కీలక సాక్షులు ఆందోళన చెందుతున్నారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ ఎంతకైనా తెగిస్తుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని కోర్టు దృష్టికి తీసుకురావాలని భావిస్తున్నట్టు సమాచారం. చదవండి: మూడేళ్లుగా ఏపీ నంబర్ వన్.. ఇదీ మన ఘనత -
పచ్చ గద్దల భూ దందాపై ‘అసైన్డ్’ తిరుగుబాటు
సాక్షి, అమరావతి: పచ్చ గద్దల భూ దందాపై అసైన్డ్ రైతులు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. అమరావతిలో టీడీపీ పెద్దలు కాజేసిన తమ అసైన్డ్ భూములు తిరిగి దక్కించుకునేందుకు ఉద్యుక్తులమవుతున్నారు. రిజిస్ట్రేషన్ చేయని ఆ భూముల ప్యాకేజీ తమకే దక్కాలని, వాటిని వెనక్కి ఇస్తే సాగు చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. 964 ఎకరాల అసైన్డ్ భూ దోపిడీపై ‘సాక్షి’కథనాలతో చైతన్యమైన అసైన్డ్ రైతులు రెవెన్యూ కార్యాలయాల తలుపుతడుతున్నారు. అమరావతిలో పలు గ్రామాల రైతులు రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. ఇది 29 గ్రామాలకూ విస్తరిస్తుండటంతో టీడీపీ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తప్పుడు రికార్డులు సవరించాలి అమరావతి గ్రామాల్లో అసైన్డ్ రైతులు సంఘటితమవుతున్నారు. చిన్న పాయగా మొదలైన ఈ ఉద్యమం ఊపందుకుంటోంది. నవులూరు, కురగల్లు, ఎరబాలెం తదితర గ్రామాలకు చెందిన అసైన్డ్ రైతులు రెండు రోజులుగా మంగళగిరి తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్ భూములు తమవేనని, వాటిని ఎవరికీ విక్రయించలేదని పేర్కొంటున్నారు. టీడీపీ హయాంలో ఆ పార్టీ నేతలు పోలీసులతో బెదిరించి రాత్రికి రాత్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తరలించి బలవంతంగా సంతకాలు చేయించారని వెల్లడించారు. ఆ భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు చట్టం సమ్మతించకపోవడం తమకు కాస్త ఊరట నిచ్చిందన్నారు. ఆ భూములు ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో తమ పేరిటే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. వాటిని టీడీపీ నేతలు భూసమీకరణ కింద సీఆర్డీఏకు ఇచ్చినట్లు తప్పుగా చూపటాన్ని సరిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. భూసమీకరణ కింద అసైన్డ్ భూములకు చెల్లించిన ప్యాకేజీ తమకే ఇవ్వాలని, అందుకు సమ్మతించకుంటే తమ భూములు తమకు తిరిగిస్తే సాగు చేసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. రూ.కోటి భూమికి రూ.6 లక్షలే మాకు కురగల్లులో 3.36 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. టీడీపీ నేతలు, దళారులు మమ్మల్ని ఆందోళనకు గురి చేసి ఎకరం రూ.కోటి పలికే భూమిని రూ.6 లక్షలకే కాజేశారు. మేం సంతకాలు చేశాక టీడీపీ ప్రభుత్వం అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించింది. మమ్మల్ని టీడీపీ పెద్దలు మోసం చేశారు. మా భూములు రిజిస్ట్రేషన్ కాలేదు కాబట్టి వాటి ప్యాకేజీ మాకే ఇవ్వాలి. లేదా మా భూములు మాకు తిరిగిస్తే సాగు చేసుకుంటాం. – మార్కంపూడి అశోక్, అసైన్డ్ రైతు, కురగల్లు అసైన్డ్ ఖాతాలో పట్టా భూమి మా కుటుంబానికి ఐదెకరాల పట్టా భూమి ఉంది. రాజధాని ప్రకటించిన తరువాత అది అసైన్డ్ భూమి అని బెదిరించడంతో భయపడి టీడీపీ నేతలకు విక్రయించేందుకు ఒప్పుకున్నాం. తరువాత నిర్ణయం మార్చుకోవడంతో పోలీస్ స్టేషన్‌కు పిలిచి బెదిరించారు. మా భూమి మాకు ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. – దావు బిచ్చారావు, రైతు, ఎర్రబాలెం న్యాయం చేయాలి.. మాకు 1.10 ఎకరాల భూమి ఉంది. టీడీపీ నేతలు, పోలీసులు మమ్మల్ని బెదిరించి తక్కువ ధరకు విక్రయించేలా ఒప్పించారు. బలవంతంగా అర్థరాత్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తరలించి సంతకాలు తీసుకున్నారు. మా భూమి పెండింగ్ రిజిస్ట్రేషన్‌లో ఉంది. సీఆర్డీఏ రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతల పేరిట ఉంది. మాకు న్యాయం చేయాలి. భూసమీకరణ ప్యాకేజీ, కౌలు మాకే ఇప్పించాలి. – నాగేశ్వరరావు, అసైన్డ్ రైతు, ఎర్రబాలెం -
పత్రాలు మార్చి అసైన్డ్ అరాచకం.. బాబు హయాంలో భారీ భూ కుంభకోణం!
సాక్షి, అమరావతి: వడ్డించేవాడు మనోడైతే కడ బంతిలో కూర్చున్నా ఫర్వాలేదంటారు! పాలకుడు తమవాడైతే బరితెగించి భూదోపిడీకి పాల్పడవచ్చని టీడీపీ పెద్దలు నిరూపించారు! అమరావతి ముసుగులో ఏకంగా 964 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టిన భారీ కుంభకోణం వెనక చంద్రబాబు సర్కారు పన్నాగం తాజాగా వెలుగు చూసింది. నిబంధనలు ఉల్లంఘించి.. పత్రాలు మార్చి.. అందర్నీ ఏమార్చి ప్రత్యేకంగా జీవోలు జారీ చేసి చట్టబద్ధంగా భూ దోపిడీకి వేసిన స్కెచ్ బహిర్గతమైంది. అమరావతిలో అసైన్డ్ భూములను కాజేసేందుకు టీడీపీ పెద్దలు రెండంచెల వ్యూహం వేశారు. అయితే సాంకేతికపరమైన అంశాలు ప్రతిబంధకంగా మారడంతో మూడో ఎత్తుగడగా భూ దోపిడీకి రాజముద్ర వేస్తూ జీవోలు జారీ చేశారు. రూ.4 వేల కోట్ల విలువైన భూ దోపిడీ కోసం చంద్రబాబు సర్కారు అమలు చేసిన పన్నాగం ఇదిగో.. రెండంచెల్లో అసైన్డ్ భూ దోపిడీ అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలోని 29 గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 964 ఎకరాల అసైన్డ్ భూములను సొంతం చేసుకునేందుకు టీడీపీ పెద్దలు తొలుత రెండంచెల పన్నాగాన్ని అమలు చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుంటుందంటూ రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల ద్వారా విస్తృత ప్రచారం చేశారు. అనంతరం టీడీపీ ముఖ్య నేతల దళారీలు గ్రామాల్లో వాలిపోయారు. ప్రభుత్వానికి అప్పగిస్తే పరిహారం ఏమీ రాదని ఆందోళనకు గురి చేయడంతో పేద అసైన్డ్ రైతులు చేసేదిలేక వారికే విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇలా అసైన్డ్ భూ దోపిడీ వ్యవహారాన్ని 2014 జూన్ నుంచి 2015 డిసెంబరులోగా పూర్తి చేశారు. ఆ భూములన్నీ టీడీపీ నేతలు, వారి బినామీల గుప్పిట్లోకి వచ్చిన తరువాత అసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేసింది. రూ.4 వేల కోట్ల విలువైన అసైన్డ్ భూములు తమ హస్తగతమయ్యాయని భావించింది. అసైన్డ్ భూములను టీడీపీ నేతలకు విక్రయించినట్లు మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు యత్నించారు. అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పెండింగ్ రిజిస్ట్రేషన్లుగా నమోదు చేశారు. మరోవైపు ఆ భూములను రాజధాని కోసం భూ సమీకరణ కింద టీడీపీ నేతలు, వారి బినామీలు ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేయడం గమనార్హం. సబ్ రిజిస్ట్రార్ రికార్డుల్లో భూములు అసైన్డ్ రైతుల పేరున ఉండగా సీఆర్డీఏ రికార్డుల్లో మాత్రం టీడీపీ నేతలు, బినామీలు ఇచ్చినట్లు చూపించారు. ఏమార్చిన విధానం ఇలా.. టీడీపీ నేతల పేరిట అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్‌కు నిబంధనలు అడ్డంకిగా మారడంతో చంద్రబాబు ప్రభుత్వం భూ కుంభకోణంలో మూడో అంకానికి తెర తీసింది. 2018 మే 18న జీవో 258, నవంబరు 16న జీవో 575, 580 జీవోలు జారీ చేసింది. 1954 జూన్‌కు ముందు కేటాయించిన అసైన్డ్ భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు అందులో ప్రకటించింది. 22 ఏ జాబితా నుంచి తొలగించింది. టీడీపీ నేతలు దక్కించుకున్న అసైన్డ్ భూములన్నీ 1954 జూన్‌కు ముందే రైతులకు కేటాయించినవిగా చూపించి అధికారికంగా కాజేసే ఎత్తుగడ వేసింది. ఆమేరకు తహశీల్దార్ కార్యాలయాల్లో రికార్డులను తారుమారు చేశారు. అనంతరం జీవోలు 258, 575, 580 ద్వారా సీఆర్డీఏ కార్యాలయంలో కథ నడిపించారు. అయితే అమరావతిలో అసైన్డ్ భూములన్నీ 1970 నుంచి 1995 మధ్యలో కేటాయించినవే కావడం గమనార్హం. ఈ క్రమంలో అసైన్డ్ భూములన్నీ 1954కు ముందే కేటాయించినట్లుగా చూపిస్తూ వాటిని సొంతం చేసుకున్న టీడీపీ నేతలు భూ సమీకరణ కింద సీఆర్డీఏకు ఇవ్వడాన్ని క్రమబద్ధీకరించే ప్రక్రియ చేపట్టారు. 2019లో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చేసరికి దాదాపు 400 పెండింగ్ రిజిస్ట్రేషన్లను సీఆర్డీఏ రికార్డుల్లో ఇలా క్రమబద్ధీకరించేశారు. భూ సమీకరణ ప్యాకేజీ కింద ఇచ్చే నివాస, వాణిజ్య స్థలాలతోపాటు ఏటా పంట పరిహారం టీడీపీ పెద్దల బినామీలకే దక్కేలా స్కెచ్ వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను నిండా ముంచారు. 2019లో మళ్లీ అధికారంలోకి వస్తే మొత్తం 964 ఎకరాలను టీడీపీ పెద్దల పేరిట క్రమబద్ధీకరించాలని భావించారు. కానీ చంద్రబాబు ఒకటి తలిస్తే దైవం మరోలా తలచింది. టీడీపీ ఘోర పరాజయంతో చంద్రబాబు అసైన్డ్ భూముల కుంభకోణం కథ అడ్డం తిరిగింది. జీవోలిచ్చి క్రమబద్ధీకరణ.. ► కురగల్లులో సర్వే నంబరు 538, 316/2, 534తో ఉన్న 2.46 ఎకరాల అసైన్డ్ భూములను టీడీపీ హయాంలో మంత్రిగా ఉన్న నారాయణకు సన్నిహితుడైన తేళ్ల శ్రీనివాసరావు (మైత్రి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్) కొనుగోలు చేశారు. 2015 సెప్టెంబరు 4న ఆ లావాదేవీని సబ్ రిజిస్ట్రార్ పెండింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ 593/2015గా నమోదు చేశారు. టీడీపీ ప్రభుత్వం 2018లో జీవోలు 258, 575, 580 జారీ చేసిన తరువాత 2019 మార్చి 5న వాటిని 4420/2019 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ► ఇదే తరహాలో 3534/2015 పెండింగ్ రిజిస్ట్రేషన్‌ను 2018 డిసెంబరులో 14113/18 నంబరుతో క్రమబద్ధీకరించేశారు. ఇంకేం రుజువులు కావాలి? మా కుటుంబానికి ప్రభుత్వం 1987లో రెండు ఎకరాల అసైన్డ్ భూమి కేటాయించింది. ఇదిగో ఆ పత్రం. అయితే మాకు అసైన్డ్ భూమిని 1954 కంటే ముందే కేటాయించినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేశారు. మా భూమిని టీడీపీ నేతలు పంపిన దళారులు సీఆర్డీఏకి ఇచ్చినట్లుగా రికార్డుల్లో చేర్చి క్రమబద్ధీకరించేశారు. ప్యాకేజీ కింద స్థలాలు, కౌలు పరిహారం వారికే ఇస్తున్నారు. మేం కనీసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి కూడా వెళ్లకున్నా టీడీపీ నేతల పేరిట క్రమబద్ధీకరించి మోసగించారు. – దావు మోహన్‌రావు, అసైన్డ్ రైతు, కురగల్లు -
అమరావతి అసైన్డ్ అక్రమాలు.. పచ్చ గద్దల కొత్త చిట్టా
వడ్డాది శ్రీనివాస్ ఊరందరిదీ ఒక దారైతే, ఉలిపికట్టెది మరోదారన్న సామెత చంద్రబాబుకు, ఆయన పచ్చ గ్యాంగ్‌కు అతికినట్లు సరిపోతుంది. ఏమీ లేని అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా ఉండాలని వారు మాత్రమే డిమాండ్ చేస్తుండగా.. యావత్ రాష్ట్ర ప్రజలంతా అన్ని ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తూ మూడు రాజధానులకు జై కొడుతున్నారు. న్యాయమైన వీరందరి ఘోషను ఏమాత్రం వినిపించుకోని బాబు అండ్ కో ఎందుకు ఇంతగా ఒక్క అమరావతి కోసమే పట్టుపట్టిందంటే వాస్తవాలు విస్తుగొలుపుతున్నాయి. భూ సమీకరణకు అవతల కారుచౌకగా కొట్టేసిన భూములను కాపాడుకునేందుకే ఈ తాపత్రయమని స్పష్టమవుతోంది. ఆ భూములను బంగారు బాతుగా మార్చుకునే అవకాశం చేజారిపోతోందన్న భయం వారిని బెంబేలెత్తిస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసైన్డ్ భూములను ఎల్లో గ్యాంగ్ కాజేసే నాటికే ఆ ప్రాంతంలో ఎకరం రూ.కోటి పలుకుతోంది. ప్రభుత్వం లాక్కుంటే ఏమీ ఇవ్వదనే ఆందోళనతో అసైన్డ్ రైతులు తమ భూములను చంద్రబాబు బినామీలకు విక్రయించారు. ఆ తర్వాత వాటిని టీడీపీ నేతలే ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదైంది. ప్రభుత్వ పోరంబోకు భూములను కూడా టీడీపీ నేతలే భూ సమీకరణ కింద ఇచ్చినట్టు రికార్డుల్లో పొందుపరిచారు. ఈ కుట్ర అంతా 2014 జూన్ నుంచి 2015 డిసెంబర్‌లోగా పూర్తి చేశారు. ఆ తర్వాత తాపీగా అసైన్డ్ భూములకు కూడా పరిహారం చెల్లిస్తామంటూ 2016 ఫిబ్రవరి 17న గత సర్కారు జీవో 41 జారీ చేసింది. ఇలా టీడీపీ పెద్దలు ఏకంగా 964 ఎకరాలకుపైగా అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. నాటి సీఎం చంద్రబాబు అధికారికంగా వెల్లడించిన ప్రకారమే అభివృద్ధి చేసిన తర్వాత అమరావతిలో భూముల విలువ ఎకరా కనీసం రూ.4 కోట్లు. అంటే వారు సొంతం చేసుకున్న అసైన్డ్ భూముల విలువ ఏకంగా రూ.4 వేల కోట్లు! అప్పటికే రాజధాని ఎక్కడ వస్తుందో వారికి ముందే తెలుసు కాబట్టి చంద్రబాబు, టీడీపీ నేతలు అమరావతిలో భూ సమీకరణ పరిధికి అవతల వేలాది ఎకరాలను బినామీల పేరిట కొనుగోలు చేశారు. వాటి విలువ కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది. అసైన్డ్ భూముల దోపిడీ వాటికి అదనం. అమరావతిలో టీడీపీ నేతలు కొల్లగొట్టిన అసైన్డ్ భూములు (మార్క్ చేసినవి) 964 ఎకరాల అసైన్డ్ భూములు కొల్లగొట్టారు అమరావతి పరిధిలోని 29 గ్రామాలతో కూడిన ప్రాంతాన్ని కోర్ క్యాపిటల్‌గా చంద్రబాబు సర్కారు మాస్టర్ ప్లాన్‌లో ప్రకటించింది. అదే ప్రాంతంలో ఎల్లో గ్యాంగ్ అసైన్డ్ భూములను కాజేసింది. 2014 వరకు అసైన్డ్ భూములు ఎవరి పేరుతో ఉన్నాయి? 2016లో భూ సమీకరణ కింద అసైన్డ్ భూములిచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో పేర్కొన్న పేర్లు ఏమిటి? అనే విషయంపై అధికారుల దర్యాప్తులో బండారం మొత్తం బయట పడింది. రెవెన్యూ రికార్డుల్లో అసైన్డ్ భూముల హక్కుదారుల జాబితాలో ఉన్న రైతుల పేర్లకు, సీఆర్డీఏకు భూములిచ్చిన వారుగా పేర్కొన్న జాబితాలోని పేర్లకు ఎక్కడా పొంతనే లేదు. ఆ స్థానంలో టీడీపీ పెద్దల బినామీలు, సన్నిహితుల పేర్లు కనిపించాయి. ఇలా 29 గ్రామాల పరిధిలో 964.88 ఎకరాలకు సంబంధించి భూ హక్కుదారుల పేర్లను గల్లంతు చేశారు. అందులో 20 గ్రామాల పరిధిలో బడుగు, బలహీన వర్గాలకు కేటాయించిన అసైన్డ్ భూములు 636.75 ఎకరాలున్నాయి. ఇక ప్రభుత్వ పోరంబోకు భూములను కూడా వదల్లేదు. ఏకంగా 328.13 ఎకరాల ప్రభుత్వ భూములను టీడీపీ పెద్దలు తమ బినామీల ఆధీనంలో ఉన్నట్లుగా రికార్డులు తారుమారు చేశారు. 2014 నాటి రెవెన్యూ రికార్డుల్లో సర్వే నంబర్లతో సహా ఉన్న వివరాలకు, భూ సమీకరణ కింద తీసుకున్నట్లు సీఆర్డీఏ రికార్డుల్లో ఉన్న వివరాలు సరిపోలడం లేదు. ఆ భూములన్నీ అసైన్డ్ జాబితాలోని 3, 4 కేటగిరీల కిందకు వస్తాయి. వెరసి టీడీపీ పెద్దలు ఏకంగా 964.88 ఎకరాల అసైన్డ్ భూములను కాజేశారు. ఇదిగో.. దందా ఇలా.. ►అమరావతి పరిధిలోని వెంకటపాలెం రెవెన్యూ సర్వే నంబరు 295/10తో ఉన్న 1.02 ఎకరాల అసైన్డ్ భూమి రికార్డుల ప్రకారం గొర్రెముత్తు కాంతారావు అనే రైతు పేరిట 2015 వరకు ఉంది. కానీ ఆ భూమిని భూ సమీకరణ కింద ఇచ్చినట్లుగా సీఆర్డీఏ రికార్డుల్లో బడే ఆంజనేయులు పేరుతో ఉంది. అందుకు ప్రతిగా రాజధానిని అభివృద్ధి చేసిన తర్వాత ఎకరాకు 800 గజాల కమర్షియల్ స్థలం, 200 గజాల నివాస స్థలాన్ని బడే ఆంజనేయులుకు ఇస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. అసైన్డ్ భూమి హక్కుదారు కాంతారావు కాగా, సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది మాత్రం బడే ఆంజనేయులతో కావడం గమనార్హం. ►అమరావతిలోని మందడంలో ‘454/3సీ’ సర్వే నంబరుతో 1.50 ఎకరాల అసైన్డ్ భూమి పిల్లి వెంకయ్య అనే రైతుకు అసైన్ చేసినట్లు రెవెన్యూ రికార్డుల్లో ఉంది. అదే భూమిని గుమ్మడి సురేశ్ భూ సమీకరణ కింద ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదైంది. ఎకరాకు 800 గజాల కమర్షియల్ స్థలం, 200 గజాల నివాస స్థలం గుమ్మడి సురేశ్‌కు ఇస్తామని సీఆర్డీఏ ఒప్పందం చేసుకుంది. అసైన్డ్ భూమి హక్కుదారు వెంకయ్య కాగా, సీఆర్డీఏ నుంచి అభివృద్ధి చేసిన భూమిని పొందేది గుమ్మడి సురేశ్. సీఆర్డీఏ రికార్డుల్లో ఇలాంటి చిత్రాలెన్నో కనిపిస్తాయి. వీరంతా పాత్రధారులు కాగా, అసలు సూత్రధారులు టీడీపీ పెద్దలే. ►వెంకటపాలెంలో సర్వే నంబరు 296/5తో ఉన్న 0.94 ఎకరాల అసైన్డ్ భూమి అన్నూరి హేమలత అనే రైతు పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కానీ ఆ భూమిని భూ సమీకరణ కింద కొట్టి కృష్ణ దొరబాబు ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేశారు. ►కురగల్లు సర్వే నంబరు 500/1తో ఉన్న 0.72 ఎకరాలు కత్తిపోగు కోటేశ్వరరావు పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉంది. ఈ భూమిని శీలం శ్రీను అనే వ్యక్తి ఇచ్చినట్లు సీఆర్డీఏ రికార్డుల్లో ఉంది. ఇదే గ్రామంలో సర్వే నెం 501/1తో ఉన్న 0.80 ఎకరాల అసైన్డ్ భూమి బుల్ల కోటమ్మ పేరిట రెవెన్యూ రికార్డుల్లో ఉండగా, గడిపర్తి శ్రీను సీఆర్డీఏకు ఇచ్చినట్లు నమోదైంది. పాదయాత్ర అసలు గుట్టు ఇదే.. అమరావతిలో బినామీల పేరిట అసైన్డ్ భూములను కాజేసిన టీడీపీ నేతలు భూ సమీకరణ పరిధికి అవతల కూడా వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. వాటిలో చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ కంపెనీ, ఆయన సన్నిహితుడు లింగమనేని రమేశ్, బాలకృష్ణ చిన్న అల్లుడు భరత్ కుటుంబం, పి.నారాయణ, పరిటాల సునీతలతోపాటు టీడీపీ హయాంలో మంత్రులు, ఆ పార్టీ ప్రజాప్రతినిధులకు చెందిన వేలాది ఎకరాలున్నాయి. ఆ భారీ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యం కోసమే మూడు రాజధానుల విధానాన్ని చంద్రబాబు అండ్ కో వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ప్రాంతాల మధ్య చిచ్చుపెడుతూ రైతుల ముసుగులో పెత్తందారులు, రియల్ ఎస్టేట్ సిండికేట్ పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు రెవెన్యూ, సీఆర్డీఏ రికార్డుల సాక్షిగా బట్టబయలైంది. ఓ బ్రాహ్మణుడు పాల కోసం మేకను కొనుక్కొని వెళ్తుంటే దారిలో ముగ్గురు దొంగలు ఒకరి తర్వాత ఒకరు అటకాయించి అది మేక కాదు.. కుక్క అని నమ్మబలుకుతారు. ముగ్గురూ అదే మాట చెప్పడంతో ఆయన తన వెంట ఉన్నది కుక్కేనని భ్రమించి మేకను వదిలేసి వెళ్లిపోతాడు. ఇదే అదనుగా కాచుకున్న ఆ ముగ్గురు దొంగలు మేకను అపహరిస్తారు. ఈ కథ దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. సరిగ్గా అదే రీతిలో గత ప్రభుత్వ హయాంలో పచ్చ దొంగలు అమరావతిపై గద్దల్లా పడ్డారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన రైతులను భయాందోళనలకు గురిచేసి.. అసైన్డ్ భూములు, ప్రభుత్వ పోరంబోకు భూములను కాజేశారు. అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం రాదంటూ రెవెన్యూ, సీఆర్డీఏ అధికారుల ద్వారా బెదిరించి కారుచౌకగా కొట్టేశారు. ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే అమరావతి జపం చేస్తున్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని అడ్డుకుంటూ మూడు రాజధానులపై విషం చిమ్ముతున్నారు. -
గంటా అనుచరుడు దొరబాబు ఇంట్లో సీఐడీ సోదాలు
విశాఖపట్నం: అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణంలో అరెస్టయిన ఏయూ దూరవిద్య కేంద్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ (కాంట్రాక్ట్) కె.దొరబాబు ఇంట్లో సీఐడీ పోలీసులు బుధవారం తనిఖీలు చేసినట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ పోలీసులు ఐదుగురిని అరెస్టు చేశారు. టీడీపీ హయాంలో గంటాకు అనుచరునిగా ఉంటూ అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో దొరబాబు పాత్ర ఉండటంతో సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఏయూ దూరవిద్య కేంద్రంలో ఆయన గదిని ఏయూ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఏయూ దూరవిద్య కేంద్రం అధికారులు సీజ్ చేశారు. నారాయణకు మధ్యంతర ముందస్తు బెయిల్ సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ముసుగులో దళిత, బలహీనవర్గాల రైతులకు చెందిన 1,100 ఎకరాల అసైన్డ్, లంక భూములను కాజేసిన వ్యవహారంపై సీఐడీ నమోదు చేసిన కేసులో టీడీపీ మాజీ మంత్రి పొంగూరు నారాయణకు హైకోర్టు బుధవారం మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 14 నుంచి డిసెంబర్ 14 వరకు మూడు నెలలు మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మూడు నెలలూ నారాయణను అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది. తుది విచారణను డిసెంబర్ 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ 2020లో నమోదు చేసిన ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యంపై కోర్టు బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. రాజధానికి సంబంధించిన మరో కేసులో హైకోర్టు పిటిషనర్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసి, చికిత్సకు అమెరికా వెళ్లేందుకు అనుమతి ఇచ్చిందన్నారు. ఈ వాదనను ఏఏజీ తోసిపుచ్చారు. పిటిషనర్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదై ఉన్నందున, ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదని చెప్పారు. ప్రయాణానికి ఒక్క రోజు ముందు పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు. వాదనలు విన్న కోర్టు నారాయణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. (క్లిక్ చేయండి: నారాయణ స్వాహా.. బంధుగణంతో ‘అసైన్డ్’ మేత) -
నారాయణ స్వాహా.. బంధుగణంతో ‘అసైన్డ్’ మేత
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతి ముసుగులో టీడీపీ పెద్దల మరో భూబాగోతం బట్టబయలైంది. దళితులు, బలహీన వర్గాలకు చెందిన 1,110 ఎకరాల అసైన్డ్, లంక భూములను కొల్లగొట్టిన వ్యవహారం వెలుగు చూసింది. చంద్రబాబు సర్కారు అక్రమాల చిట్టాను సీఐడీ అధికారులు ఆధారాలతో సహా వెలికితీశారు. అసైన్డ్ భూముల దోపిడీ వ్యవహారంపై దుగ్గిరాలకు చెందిన వై.ప్రసాద్‌కుమార్ ఫిర్యాదు మేరకు సీఐడీ కేసు నమోదు చేసి చేపట్టిన దర్యాప్తులో మొత్తం అక్రమాల బండారం బయటపడింది. దళితులను బెదిరించి అసైన్డ్ భూములను కాజేయడంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహితుడు, బినామీగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి పొంగూరు నారాయణే కీలకంగా వ్యవహరించారు. రామకృష్ణా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నారాయణ తన కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల పేరిట 169.27 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టినట్లు తేలింది. ఇందులో నారాయణతోపాటు మాజీ మంత్రి గంటా పాత్ర కూడా స్పష్టంగా వెలుగులోకి వస్తోంది. పలు సెక్షన్ల కింద కేసులు.. ఐదుగురి అరెస్టు అసైన్డ్ భూములను హస్తగతం చేసుకున్న కేసులో మాజీ మంత్రి పి.నారాయణను ప్రధాన నిందితుడిగా పేర్కొంటూ అసైన్డ్ భూముల బదిలీ నిషేధిత చట్టం 1977, ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంతో పాటు 409, 420, 506 తదితర సెక్షన్ల కింద సీఐడీ అధికారులు తాజాగా కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణంలో పాత్రధారులుగా వ్యవహరించిన నారాయణ సన్నిహితులైన ఐదుగురిని సీఐడీ అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. రామకృష్ణా హౌసింగ్ లిమిటెడ్ సిబ్బంది కొల్లి శివరామ్, గట్లెం వెంకటేశ్‌ను రాత్రి విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానంలో హాజరు పరచగా 41 ఏ సీఆర్పీసీ కింద నోటీసులిచ్చి దర్యాప్తు కొనసాగించాలని న్యాయమూర్తి ఆదేశించారు. మరో ముగ్గురు నిందితులను విశాఖలో అరెస్టు చేసి విజయవాడ తరలించారు. పరిహారం రాదంటూ ఫలహారం.. టీడీపీ హయాంలో పురపాలక శాఖ మంత్రిగా వ్యవహరించిన నారాయణ కనుసన్నల్లోనే భూ దందాలు జరిగాయి. ప్రధానంగా టీడీపీ పెద్దల కళ్లు అమరావతిలోని 1,100 ఎకరాల అసైన్డ్, పోరంబోకు, లంక భూములపై పడ్డాయి. అవన్నీ దళితులు, బలహీన వర్గాలకు చెందినవే. అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చట్ట విరుద్ధమని అప్పటి సీఆర్డీయే కమిషనర్, గుంటూరు కలెక్టర్లతోపాటు పలువురు అధికారులు నారాయణకు వివరించినా ఖాతరు చేయలేదు. వాటిని సొంతం చేసుకునేందుకు పక్కాగా పథకం వేశారు. రాజధాని కోసం అసైన్డ్ భూములను ప్రభుత్వం ఎలాంటి పరిహారం చెల్లించకుండా తీసుకుంటుందని రెవెన్యూ, పురపాలక శాఖ అధికారుల ద్వారా ప్రచారం చేయించారు. నారాయణ ఆదేశాలతో అధికారులు గ్రామాల్లో పర్యటించి కేవలం పట్టా భూములకే సర్వేలు చేశారు. అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి సర్వే చేయడం లేదని అధికారులతో ప్రచారం చేయించారు. ఇదే అదనుగా నిరు పేదలైన దళితులు, బీసీల భయాందోళనలను సొమ్ము చేసుకునేందుకు నారాయణ తన సమీప బంధువైన కేవీపీ అంజని కుమార్ డైరెక్టర్‌గా ఉన్న రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను రంగంలోకి దించారు. అసైన్డ్ భూములను తాము కొనుగోలు చేస్తామని, లేదంటే అవన్నీ ప్రభుత్వ పరమైపోతాయని రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు పేదలను నమ్మించారు. వారిని బెదిరించి అతి తక్కువ ధరకు వాటిని తమపరం చేసుకున్నారు. నారాయణ అందుకోసం రామకృష్ణ హౌసింగ్ లిమిటెడ్ బ్యాంకు ఖాతాల ద్వారా లావాదేవీలు నిర్వహించారు. అసైన్డ్ భూములున్న వారికి నగదు చెల్లింపులు చేసి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ(జీపీఏ) పొందారు. అనంతరం సేల్ డీడ్ల ద్వారా కథ నడిపించారు. ఇటు కాజేసి.. అటు లాగేసి! మాజీ మంత్రి నారాయణ తన బంధువులు, సన్నిహితుల ద్వారా 89.90 ఎకరాల అసైన్డ్ భూములను కొల్లగొట్టారు. రిజిస్ట్రేషన్ చట్టం 22–ఏ కింద నిషేధిత భూముల జాబితాలో ఉన్న వీటిని పకడ్బందీగా సొంతం చేసుకున్నారు. ఈ భూములు అమరావతిలోని అనంతవరం, కృష్ణాయపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెం పరిధిలో ఉన్నాయి. నారాయణ వీటిని 84 సేల్ డీడ్ల ద్వారా తన బంధువులు, సన్నిహితులైన ధూళిపాళ్ల వెంకట శివ పానకాలరావు, ఆయన భార్య పద్మావతి, కోడలు డి.సృజన, లక్ష్మిశెట్టి సుజాత, లక్ష్మిశెట్టి సూర్య నారాయణ, అంబటి సీతారాము, లక్కాకుల హరిబాబు, లక్కాకుల పద్మావతి, చిక్కాల విజయ సారథి, పరుచూరి వెంకయ్య భాస్కరరావు, పరుచూరి వి.ప్రభాకరరావు (గంటా బంధువులు), కొండయ్య బాలసుబ్రహ్మణ్యం, భార్య కొండయ్య విజయ, కొండయ్య వెంకటేశ్ తదితరుల పేర్లతో కొనుగోలు చేశారు. నారాయణ తన బంధువులు, సన్నిహితులైన యాగంటి శ్రీకాంత్, కొల్లి శివరామ్, గుమ్మడి సురేశ్ పేరిట ఏకంగా 72 జీపీఏలు చేసి మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేసేందుకు అప్పటి సబ్ రిజిస్ట్రార్ ఏ.గోపాల్ నిరాకరించారు. ఆయనపై టీడీపీ పెద్దలు ఎంత ఒత్తిడి తెచ్చినా సమ్మతించలేదు. దీంతో అసైన్డ్ భూములపై తాము చేసుకున్న సేల్ డీడ్ల ఆధారంగానే ఆ భూములను నారాయణ బంధువులు హస్తగతం చేసుకున్నారు. అనంతరం ఆ అసైన్డ్ భూములను రాజధాని కోసం ప్రభుత్వం సమీకరించినప్పుడు వాటిని తామే సీఆర్డీయేకు ఇచ్చినట్లుగా చూపించారు. అందుకు ప్రతిగా రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు, వాణిజ్య స్థలాలు పొందే జాబితాలో తమ పేర్లు ఉండేలా చేసుకున్నారు. తద్వారా భూసమీకరణ కింద ఇచ్చిన భూములకు ప్రతిగా ఎకరానికి 800 గజాల నివాస స్థలం, వంద గజాల వాణిజ్య స్థలాన్ని రాజధాని ప్రాంతంలో తమకు వచ్చేటట్లు చూసుకున్నారు. వియ్యంకుడితో భూ విందు! అమరావతిలో టీడీపీ పెద్దలు కొల్లగొట్టిన 1,100 ఎకరాల్లో 169.27 ఎకరాల అసైన్డ్ భూములను మాజీ మంత్రి పొంగూరు నారాయణ తన బంధువులు, సన్నిహితుల పేరిట దక్కించుకున్నట్లు సీఐడీ అధికారులు గుర్తించారు. అందులో 89.90 ఎకరాలను బంధువుల పేరిట నారాయణ కొల్లగొట్టగా మరో 79.45 ఎకరాలను ఆయన వియ్యంకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సమీప బంధువుల పేరిట గుప్పిట పట్టారు. నారాయణ కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల నుంచి రూ.15 కోట్లు రామకృష్ణ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్‌కు బదలాయించి అసైన్డ్ భూములను కాజేసినట్లు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది. కాగా 1,100 ఎకరాల అసైన్డ్, పోరంబోకు, లంక భూముల్లో మిగిలినవి టీడీపీ ముఖ్యులు, వారి కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఉన్నాయి. వాటిపై సీఐడీ దర్యాప్తు కొనసాగుతోంది. సీఐడీ అరెస్టు చేసిన ఐదుగురు నిందితులు ► కొల్లి శివరామ్, విజయవాడ (రామకృష్ణా హౌసింగ్ లిమిటెడ్ ఉద్యోగి) ► గట్లెం వెంకటేశ్, విజయవాడ (రామకృష్ణా హౌసింగ్ లిమిటెడ్ ఉద్యోగి) ► చిక్కాల విజయ సారథి, విశాఖపట్నం ► బడే ఆంజనేయులు, విశాఖపట్నం ► కొట్టి కృష్ణ దొరబాబు, విశాఖపట్నం గంటా కోటాలో మరో 79.47 ఎకరాలు అమరావతిలో మరో 79.47 ఎకరాల అసైన్డ్ భూములను కూడా నారాయణ తన వియ్యంకుడైన గంటా శ్రీనివాసరావు బంధువులు, సన్నిహితుల ద్వారా దక్కించుకున్నారు. బోరుపాలెం, కురగల్లు, లింగాయపాలెం, మందడం, నెక్కల్లు, నేలపాడు, నవులూరు, రాయపూడి, తుళ్లూరు, ఉద్దండరాయునిపాలెం, వెంకటపాలెంలోని వివిధ సర్వే నంబర్లలో 79.47 ఎకరాలను 76 సేల్ డీడ్ల ద్వారా తమపరం చేసుకున్నారు. కొట్టి కృష్ణ దొరబాబు, గుమ్మడి సురేశ్, కొల్లి శివరామ్‌లు వాటిపై జీపీఏ ఒప్పందాలు చేసుకుని ఆ భూములు తమకు చెందినవని చూపారు. దళారీలు కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి, గుమ్మడి సురేశ్, సఫియుల్ రహమాన్, పొట్లూరి జయంత్, ఆల వెంకట సుబ్బయ్య, పిడపర్తి టిటుస్ బాబు, శీలం శ్రీనివాసరావు తదితరులు ఈ అసైన్డ్ భూములను నారాయణ తన బంధుగణం ద్వారా దక్కించుకోవడంలో పాత్ర పోషించారు. కాగా సీఐడీ అధికారులు అరెస్టు చేసిన కొట్టి కృష్ణ దొరబాబు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు నమ్మిన బంటు కావడం గమనార్హం. టీడీపీ హయాంలో గంటా మంత్రిగా ఉండగా ఆయన్ను ఆంధ్రా వర్సిటీ దూరవిద్యా కేంద్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కాంట్రాక్టు విధానంలో నియమించారు. జాగ్రఫీలో పీహెచ్డీ చేసిన ఆయన ఉద్యోగం పొందిన సమయంలో వర్సిటీలో అలాంటి కోర్సు లేకున్నా అవకాశం కల్పించారు. -
అసైన్డ్‌పై రియల్ కన్ను! ఎకరాకు రూ.20 లక్షలకు చెల్లింపు, ధరణిలోనూ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: అసైన్డ్ భూములపై కొంత మంది రియల్టర్ల కన్నుపడింది. వీటిని అమ్మడం, కొనడం నేరమని తెలిసినా చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడైనా వీటిని స్వాధీనం చేసుకోవచ్చని స్థానికంగా ప్రచారం చేస్తూ.. రైతులను భయాందోళనకు గురిచేస్తున్నారు. వీరి నుంచి తక్కువ ధరకు కొల్లగొట్టే కుట్రకు తెరలేపారు. రెవెన్యూ శాఖలోని లొసుగులకు తోడు అధికార పార్టీ పెద్దల అండదండలు వీరికి కలిసొస్తోంది. న్యాయపరమైన చిక్కులు, అధికారులతో ఏ సమస్యలు ఎదురైనా అన్నీ తామే చూసుకుంటామని నమ్మబలుకుతున్నారు. రిజిస్ట్రేషన్‌కు ముందే అసైన్డ్‌దారుల పేరుతో ఎన్ఓసీ సంపాదించి రూ.కోట్లు విలువ చేసే భూములను చవక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ వ్యవహారాన్ని అడ్డుకోవాల్సిన యంత్రాంగం వీరిచ్చే కమీషన్లకు కక్కుర్తి పడి అడ్డగోలుగా ఎన్ఓసీలు జారీ చేసి, రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భూ అగ్రిమెంట్ సమయంలో అసైన్డ్ దారులకు వ్యాపారులునగదు రూపంలో కాకుండా చెక్కుల రూపంలో చెల్లిస్తుండటం గమనార్హం. అబ్దుల్లాపూర్‌మెట్‌లో.. పెద్దఅంబర్‌పేట్‌లోని సర్వే నంబర్ 244లో నాలుగెకరాలు, సుర్మాయిగూడ సర్వే నంబర్ 128లో వంద ఎకరాలకుపైగా, బాటసింగారం సర్వే నంబర్ 10లో సుమారు 20 ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. రూ.కోట్లు విలువ చేసే ఈ భూములపై వరంగల్, కరీంనగర్, నల్లగొండ జిల్లాకు చెందిన అధికార పార్టీ నేతలు, అనుచరుల కన్నుపడింది. రెవెన్యూలోని లొసుగులను అడ్డుపెట్టుకుని అసైన్డ్ దారుని పేరుతోనే ఎన్ఓసీ పొందేందుకు యత్నిస్తున్నారు. అగ్రీమెంట్లు చేసుకుని, కొంత అడ్వాన్స్ కూడా ఇస్తున్నట్లు తెలిసింది. అబ్దుల్లాపూర్‌మెట్ కొత్త పోలీసు స్టేషన్ వెనుకభాగంలో సర్వే నంబర్ 283లోని 350పైగా ఎకరాల అసైన్డ్ భూమి ఉంది. ప్రస్తుతం వంద ఎకరాల వరకు ఖాళీగా ఉంది. దీనిపై రియల్టర్ల కన్ను పడింది. మహేశ్వరంలో.. మహేశ్వరం మండలం మహబ్బుత్నగర్లో రంగనాథసాయి పేరిట 9.06 ఎకరాల భూములున్నాయి. ప్రభుత్వం వీటిని 1988లోనే సీలింగ్ భూములుగా గుర్తించి, స్వాధీనం చేసుకుని స్థానిక తహసీల్దార్‌కు అప్పగించింది. ఆ తర్వాత ఇందులోని ఆరెకరాలను అప్పటి ఆర్డీఓ ఉత్తర్వుల (ఎ/ 6345/1987) మేరకు 1989 జనవరిలో భూమిలేని ఆరుగురు పేదలకు అసైన్ చేశారు. మరో 3.06 ఎకరాలను ఇద్దరు ఎక్స్ సర్వీస్మెన్లకు కేటాయించారు. బహిరంగ మార్కెట్లో ప్రస్తుతం దీని విలువ ధర రూ.60 కోట్ల పైమాటే. విలువైన ఈ భూమిపై ఓ ప్రముఖ సంస్థ కన్నుపడింది. పక్కనే ఉన్న తమ భూమిలో అసైన్డ్ భూములను కలిపేసుకుంది. ఇందుకు సంబంధించిన పత్రాలను బ్యాంకులో తనఖా పెట్టి రుణం కూడా తీసుకుంది. ఈ విషయం బ్యాంకు, రెవెన్యూ అధికారులకు తెలిసి ఒత్తిడి చేయడంతో.. తీసుకున్న లోన్ డబ్బులు తిరిగి చెల్లించింది. కానీ సదరు భూమి మాత్రం ఇప్పటికీ సంస్థ ఆధీనంలోనే ఉండటం, స్వాధీనం చేసుకునేందుకు అధికారులు వెనకడుగు వేస్తుండటం విశేషం. ఇబ్రహీంపట్నంలో చెర్లపటేల్‌గూడ రెవెన్యూలోని సర్వే నంబర్ 710లో 83 ఎకరాల భూమిని 70 మందికి అసైన్ చేశారు. కొంత సాగుకు అనుకూలంగా ఉండగా, మరికొంత ప్రతికూలంగా ఉంది. ఈ భూమిని దక్కించుకునేందుకు కొంత మంది రియల్టర్లు యత్నిస్తున్నారు. నల్లగొండ, వరంగల్ జిల్లాలకు చెందిన రాజకీయ నాయకులు, వారి అనుచరులు, వ్యాపారులు ఈ భూములపై కన్నేశారు. స్థానికంగా ఉన్న రెవెన్యూ అధికారులు కూడా వీరికి సహకరిస్తున్నారు. పొల్కపల్లి, దండుమైలారం, రాయపోలు రెవెన్యూ పరిధిలో కూడా అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు జోరుగా సాగుతున్నాయి. యాచారంలో.. మొండిగౌరెల్లి, నల్లవెల్లి, కొత్తపల్లి, తక్కెళ్లపల్లి, మా ల్, మంతన్‌గౌరెల్లి రెవెన్యూ పరిధిలో అసైన్డ్ భూము లు అధికంగా ఉన్నాయి. ఇప్పటికే కుర్మిద్ద, తాడిపర్తి, నానక్‌నగర్, నక్కర్తమేడిపల్లిలోని సుమారు పది వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం ఫార్మాసిటీ పేరుతో సేకరించింది. బాధితులకు రూ.8 లక్షలు నష్టపరిహారంగా ఇచ్చింది. ఫార్మాసిటీ భూ సేకరణను బూచిగా చూపిస్తున్న రియల్టర్లు మిగిలిన గ్రామాల్లోని రైతులను భయాందోళనలకు గురి చేస్తున్నారు. రైతుకు ఎకరాకు రూ.17 లక్షలు చెల్లిస్తూ, మరో రూ.2 లక్షలు మధ్యవర్తులు కమీషన్‌గా తీసుకుంటున్నారు. ఇప్పటికే 60– 70 ఎకరాలకు అడ్వాన్స్‌లు కూడా చెల్లించినట్లు సమాచారం. మొండిగౌరెల్లిలో సర్వే నంబర్ 19లో 575.30 ఎకరాలు ఉండగా, సర్వే నంబర్ 68లో 625.20 గుంటలు, సర్వే నంబర్ 127లో 122.22 ఎకరాల భూమి ఉంది. వీటిపై నగరానికి చెందిన కొంత మంది రియల్టర్ల కన్నుపడింది. ఈటల వ్యవహారంతో కలకలం బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హేచరీస్ ఆధీనంలో (మెదక్ అచ్చంపేట) ఉన్న ఎనిమిది సర్వే నంబర్లలో 85.19 ఎకరాల అసైన్డ్ భూమిని 65 మంది లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో జిల్లాలోని అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మన జిల్లాలోని 26 మండలాల పరిధిలో 321 గ్రామాల్లో 6,471.03 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా, 5,440 మందికి 6,198.11 ఎకరాలు అసైన్ చేశారు. వీటిలో ఇప్పటికే చాలా భూములు పరాధీనమయ్యాయి. రైతులను మభ్యపెట్టి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసిన రియల్టర్ల నుంచి మళ్లీ భూములు స్వాధీనం చేసుకునేందుకు అనేక మంది యత్నిస్తుండటంతో వీటిని కొనుగోలు చేసిన రియల్టర్లలో ఆందోళన మొదలైంది. అమ్మడం, కొనడం నేరం అసైన్డ్ భూములు అమ్మడం, కొనడం నేరం. వీటిని రిజిస్ట్రేషన్ చేయలేము. అమ్మిన రైతులతో పాటు కొనుగోలు చేసిన వ్యాపారులపై కూడా కేసులు నమోదు చేస్తాం. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరిగినా మా దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటాం. –వెంకటాచారి, ఆర్డీఓ, ఇబ్రహీంపట్నం -
అసైన్డ్ భూమికీ పరిహారం చెల్లించాలి
సాక్షి, అమరావతి: ప్రజోపయోగం కోసం వెనక్కి తీసుకున్న అసైన్డ్ భూమికి కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం చెల్లించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. అసైన్డ్‌దారులు 2013 భూ సేకరణ చట్టం లేదా రాష్ట్రంలో అమల్లో ఉన్న ఇతర చట్టం కింద పరిహారానికి అర్హులని చెప్పింది. ప్రభుత్వం 2016లో జారీ చేసిన జీవో 259 ఆధారంగా ఈ ఆదేశాలు ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు ఇచ్చారు. ఇండస్ట్రియల్ పార్క్ కోసం అధికారులు వెనక్కి తీసుకున్న తమ అసైన్డ్ భూములకు ఎలాంటి పరిహారం ఇవ్వడంలేదని, చట్ట ప్రకారం పరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలంటూ చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం మంగళం గ్రామానికి చెందిన కె.నాగవేణి మరో ఇద్దరు 2018లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, భూ సేకరణ ప్రొసీడింగ్స్‌పై స్టే విధించింది. ఇటీవల ఈ వ్యాజ్యంపై జస్టిస్ సత్యనారాయణమూర్తి తుది విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫు న్యాయవాది కాలవ సురేష్ కుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారానికి అర్హులని వివరించారు. 2016లో జారీ చేసిన జీవో 259 ప్రకారం అసైన్డ్ భూమికి పట్టా భూమితో సమానంగా పరిహారం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మేకల పాండు కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించిందని తెలిపారు. ఆ స్టే ఎత్తివేసేంత వరకు జీవో 259 ప్రకారం పిటిషనర్లు కోరిన విధంగా ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు. ప్రభుత్వ సహాయ న్యాయవాది వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2016లో జారీ చేసిన జీవో 259 ప్రకారం అసైన్డ్ భూమిని ప్రజోపయోగం కోసం వెనక్కి తీసుకున్నప్పటికీ పట్టా భూమితో సమానంగా పరిహారం చెల్లించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తేల్చి చెప్పారు. ప్రస్తుత కేసులో కూడా పిటిషనర్లకు ఆరు నెలల్లో పరిహారం చెల్లించాలని ఆదేశించారు. -
అసైన్డ్ భూముల్లో
► నగరాలు, పట్టణ శివార్లలోని అసైన్డ్ భూములు చాలావరకు పడావుగా ఉన్నాయి. నీటి వనరులు తగ్గిపోవడం, చుట్టుపక్కల పొలాలు రియల్ ఎస్టేట్ బూమ్‌లో ప్లాట్లుగా మారిపోవడంతో నిరుపయోగంగా ఉండిపోతున్నాయి. వాటిల్లో లబ్ధిదారులు వ్యవసాయం చేయలేని స్థితి, ఆ భూములను అమ్ముకోలేని పరిస్థితి ఉంది. ► ఇలా పడావు పడిన అసైన్డ్ భూములను గుర్తించిన ప్రభుత్వం వాటిని ల్యాండ్ పూలింగ్ కింద తీసుకోవాలనుకుంటోంది. అయితే అసైన్డ్ భూములను లబ్ధిదారులు నేరుగా అమ్ముకునేందుకు వీల్లేదు. అందుకే అసైనీల ఆమోదంతో ఆ భూముల్లో లే అవుట్లను అభివృద్ధి చేయాలని సర్కారు నిర్ణయించింది. ► సమీకరిస్తున్న భూములకు ప్రతిఫలంగా అసైన్డ్ భూముల లబ్ధిదారులకు ఒక్కో ఎకరానికి 600–800 చ.గ. చొప్పున అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. ► అసైన్డ్ భూముల్లోని అభివృద్ధి చేసిన లే అవుట్లలో ప్లాట్లను అసైనీలకు కేటాయించడం ద్వారా వాటిని వారు విక్రయించుకునే అవకాశం కలుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: దశాబ్దాల కిందట భూములు లేని నిరుపేదలకు ప్రభుత్వం లభ్యత ఆధారంగా ఒకటి నుంచి మూడెకరాల వరకు అసైన్డ్ భూములుగా పంపిణీ చేసింది. అయితే ఈ భూములు చాలావరకు నిరుపయోగంగా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అవసరాల కోసం బలవంతంగా అయినా ఈ భూములను తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించినా, రైతుల నుంచి వ్యతిరేకత రావడం, బలవంతంగా తీసుకోవడంలో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కొంత వెనక్కి తగ్గింది. తాజాగా అసైనీల (ప్రభుత్వం నుంచి అసైన్డ్ భూములు పొందినవారు) సమ్మతితోనే ల్యాండ్ పూలింగ్ జరపాలనే నిర్ణయానికి వచ్చింది. ప్లాట్లు, ఇళ్ల స్థలాల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో అసైన్డ్ భూములను సమీకరించి, ప్రభుత్వమే లే అవుట్లు అభివృద్ధి చేసి సామాన్య ప్రజలకు విక్రయించనుంది. కనీసం 25 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో ఇలాంటి ప్రాజెక్టులను అభివృద్ధి పరచాలని భావిస్తోంది. అభివృద్ధి చేసిన లేఅవుట్లో 800 చదరపు గజాల ప్లాటు విలువ భారీగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. హెచ్ఎండీఏ లేఅవుట్లు కావడంతో ఆదరణ ప్రైవేట్ లే–అవుట్లలో రియల్టర్లు ఎలాంటి అనుమతులు లేకుండానే, సరైన రీతిలో అభివృద్ధి చేయకుండానే.. ప్లాట్లుగా విభజించి అమ్ముకుంటున్నారు. ఇలాంటి ప్లాట్లను కొనుగోలు చేసిన వారు రిజిస్ట్రేషన్లతో పాటు ఇంటి నిర్మాణ అనుమతులు పొందడానికి ఇబ్బందులు పడుతున్నారు. రూ.లక్షలు కట్టి ఎల్ఆర్ఎస్ కింద ఈ ప్లాట్లను తప్పనిసరిగా క్రమబద్ధీకరించుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తామే అస్సైన్డ్ భూములను క్రమపద్ధతిలో అభివృద్ధి చేయడం వల్ల నగరాలు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చెందుతాయని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీఏ చేసే లే అవుట్లు కావడం వల్ల ప్లాట్లకు ఆదరణ బాగా ఉంటుందని, అటు లబ్ధిదారులకు, ప్రభుత్వానికి కూడా ఆదాయం భారీగా సమకూరుతుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులతోనే అభివృద్ధి లే అవుట్లలో రహదారులు, మంచినీటి పైపులైను, ఖాళీ స్థలాలు, మురుగునీటి వ్యవస్థ, విద్యుత్ స్థంభాలు, ఈ లేఅవుట్లకు అనుసంధానంగా రహదారుల ఏర్పాటు పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే చేపడ్తారు. ఎలాంటి వివాదం లేకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్ చేయనుండడంతో కొనుగోలు దారులకు టైటిల్ గ్యారెంటీ సైతం లభించనుంది. ప్లాట్లకు డిమాండ్ అధికంగా ఉన్న జిల్లాల్లో తొలుతగా ల్యాండ్ పూలింగ్ చేపట్టేందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. తొలుత ఈ జిల్లాల్లోనే.. తొలుత రంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని డిమాండ్ ఉన్న పట్టణాల సమీపంలో లే అవుట్లు అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్క రంగారెడ్డి జిల్లాలోనే 6,470 ఎకరాల అస్సైన్డ్ భూములున్నాయి. హైదరాబాద్ శివార్లలోని కుంట్లూరు, మోకిల, తుర్కయాంజాల్, కుమ్మరిగూడ, గుర్రంగూడ, గుండ్లపోచంపల్లి తదితర ప్రాంతాల్లో ఈ లే అవుట్ల అభివృద్ధికి సిద్ధమైంది. ఉప్పల్ భగాయత్‌లో సేకరించిన ప్రైవేట్ భూముల యజమానులకు ఒక ఎకరానికి 1,000 నుంచి 1,200 చదరపు గజాల చొప్పున ప్లాట్లను హెచ్ఎండీఏ కేటాయించింది. -
మహబూబ్‌నగర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు .. వెనక్కి తగ్గిన తెలంగాణ సర్కార్!
సాక్షి, హైదరాబాద్: వెంచర్లు చేసేందుకు ఉపయోగపడే అసైన్డ్ భూములను సేకరించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం ఓ అడుగు వేసినట్టే వేసి వెనక్కు తగ్గింది. గతంలో పేదలకు కేటాయించిన అసైన్డ్ భూముల్లో జాతీయ రహదారులు, ప్రధాన రహదారుల పక్కన, రియల్ బూమ్ ప్రాంతాల్లో ఉన్న వాటిని గుర్తించి అభివృద్ధి చేయాలని ఇటీవలే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మహబూబ్‌నగర్ జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకుంది. ఈ జిల్లాలోని జడ్చర్ల, రాజాపూర్, భూత్పూర్, బాలానగర్ మండలాల్లో ఖాళీగా ఉన్న అసైన్డ్ భూములను సర్వే చేయాలని, అసైనీలతో మాట్లాడి ఎకరానికి 400 గజాలను వారికి ఇచ్చేవిధంగా ఒప్పించాలని ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. గత వారం రోజులుగా ఆయా మండలాల అధికారులు ఈ సర్వేలో నిమగ్నమయ్యారు. జాతీయ రహదారుల వెంట ఉన్న భూములను గుర్తించి అసైనీలతో మాట్లాడి ఆయా భూముల్లో ప్రభుత్వ బోర్డులు పెట్టే ప్రయత్నం చేశారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు అంగీకరించగా, మరికొన్ని చోట్ల రైతుల నుంచి పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. ఎకరం భూమి తీసుకుని అందులో 10 శాతం ఇస్తామంటే ఎలా కుదురుతుందని, కనీసం 50:50, 60:40 లాంటి ప్రతిపాదనలతో వస్తే ఆలోచిస్తామని తేల్చిచెప్పారు. జడ్చర్ల లాంటి ప్రాంతాల్లో ప్రతిపక్ష పార్టీలు ఆందోళనకు కూడా దిగాయి. దీంతో తాత్కాలికంగా ఈ ప్రతిపాదనను విరమించుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆయా మండలాల రెవెన్యూ అధికారులకు మళ్లీ మౌఖికంగానే ఆదేశాలు జారీ కావడం గమనార్హం. చదవండి: సీఎస్ సోమేశ్‌ను ఏపీకి కేటాయించండి: కేంద్రం మరిన్ని ప్రతిపాదనలతో మళ్లీ.. రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూములున్నాయి. ఇందులో వ్యవసాయ యోగ్యం కాని భూములూ పెద్దఎత్తున ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఈ భూముల వల్ల అసైనీలకూ ఉపయోగం లేనందున వాటిని స్వాధీనం చేసుకోవాలని భావించింది. స్వాధీనం చేసుకున్న భూములను ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడిన అధికారులు ఈ భూముల్లో ప్రభుత్వమే వెంచర్లు చేయాలని, హెచ్ఎండీఏకి అప్పగించి భూములను అభివృద్ధి చేసి విక్రయించాలని, అసైన్డ్ భూములను ఇచ్చినందుకు అసైనీలకు కొంత వాటా ఇవ్వాలని నిర్ణయించారు. అందులోభాగంగానే ఎకరానికి 400 గజాల ప్రతిపాదనతో పాలమూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టు చేపట్టారు. అయితే, ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత రావడంతో ప్రస్తుతానికి విరమించుకున్నప్పటికీ ప్రభుత్వం మరిన్ని ప్రతిపాదనలతో మళ్లీ వచ్చే అవకాశం లేకపోలేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. పేదల అసైన్డ్ భూములను లాక్కోవద్దు: తమ్మినేని సాక్షి,హైదరాబాద్: పేదలకిచ్చిన అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆక్రమించి ప్లాట్లు చేసి అమ్ముకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ప్రభుత్వం చట్టాలను అమలు చేయకపోగా వాటిని ఉల్లంఘించడం అన్యాయమని గురువారం ఓ ప్రకటనలో ఆయన విమర్శించారు. ప్రభుత్వ ఖజానాను నింపుకునేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల అసైన్డ్ భూములను లాక్కోవడం సరికాదన్నారు. చదవండి: వరంగల్ ఎన్ఐటీకి ఉద్యోగాల పంట.. అత్యధిక ప్యాకేజీ 62.5 లక్షలు పట్టణాలకు దగ్గరగా అసైన్డ్ భూముల విలువ కొన్ని చోట్ల రూ.కోటి పైగా పలుకుతోందని అలాంటి భూముల నుంచి పేద అసైన్డ్‌దారులను బయటకు గెంటివేసి ప్రభుత్వం జెండాలు పాతి శాంతి–భద్రతల సమస్యను సృష్టించడం దారుణమన్నారు. ప్రభుత్వం తన తప్పుడు విధానాన్ని విరమించుకుని అసైన్డ్ భూములున్న పేదవారికి రక్షణ కల్పించాలని కోరారు. -
అసైన్డ్ భూముల లెక్క తేలింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అసైన్డ్ భూముల లెక్క తేలింది. కొత్త జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని అసైన్డ్ భూములన్నాయి.. ఎంతమంది అసైనీలకు ఈ భూములను కేటాయించారు.. అందులో ఎంత భూమి వ్యవసాయ యోగ్యంగా ఉందనే లెక్కలను ఇటీవల ప్రభుత్వం సేకరించింది. ఈ లెక్కల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా 22,52,340.37 ఎకరాల అసైన్డ్ భూములుండగా, 15,87,021 అసైనీలకు ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. ఇందులో 18,96,898.75 ఎకరాలు వ్యవసాయ యోగ్య భూములు కాగా, వ్యవ సాయ యోగ్యం కానివి 3,55,441.62 ఎకరా లున్నాయి. ఆసిఫాబాద్ జిల్లాలో అత్యధికంగా అసైన్డ్ భూములున్నాయని రెవెన్యూ వర్గాల ద్వారా సేకరించిన వివరాల ప్రకారం తేలింది. ఈ జిల్లాలో మొత్తం 1.85 లక్షల ఎకరాల అసైన్డ్ భూములుండగా, అందులో 1.78 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ యోగ్యమైన భూములుగా గుర్తించారు. ఇక, అతి తక్కువగా హైదరాబాద్‌లో 291 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా, అందులో ఒక్క ఎకరం కూడా వ్యవ సాయ యోగ్యం కాదని తేలింది. ఇక, వ్యవసాయ యోగ్యం కాని భూములు ఎక్కువగా నల్లగొండ(1.38 లక్షల ఎకరాలు)లో ఉండగా, అందులో 1,386 ఎకరాలే సాగుకు అనుకూలంగా ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆసిఫాబాద్ తర్వాత ఎక్కువ అసైన్డ్ భూములుండగా.. ఒక్క ఎకరం మినహా అంతా సాగుయోగ్యమైన భూమే కావడం గమనార్హం. 15–20% వరకు థర్డ్‌పార్టీ చేతుల్లో.. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల వారీగా అసైన్డ్ భూముల వివరాలను సేకరించిన ప్రభుత్వం త్వరలోనే ఈ విషయమై నిర్ణయం తీసుకో నుందని సమాచారం. ఈ భూములకు సంబంధించి వాస్తవ అసైనీల చేతుల్లో ఎంత భూమి ఉంది, థర్డ్ పార్టీల చేతుల్లో ఎంత భూమి ఉందనే వివరాలను కూడా సేకరిం చింది. మొత్తం అసైన్డ్ భూముల్లో 15–20% వరకు థర్డ్‌పార్టీ చేతుల్లో ఉన్నాయని, అది కూడా హైదరాబాద్ శివారు జిల్లాలో ఎక్కు వగా అన్యాక్రాంతమైనట్లు గుర్తించారు. అయితే, అసైనీలతోపాటు థర్డ్‌పార్టీ సామా జిక, ఆర్థికస్థితికి సంబంధించిన వివరాలనూ తీసుకున్న ప్రభుత్వం.. అసైనీల చేతిలో ఉన్న వ్యవసాయయోగ్య భూములపై వారికే సర్వ హక్కులు కల్పించనుందని తెలుస్తోంది. ఇందుకోసం అసైన్డ్ చట్టానికి సవరణ అవసర మని నిపుణులు చెబుతున్నారు. ఈ సవరణ మేరకు అసైనీలకు ఆ భూములను క్రమబద్ధీ కరిస్తారని, థర్డ్‌పార్టీ చేతుల్లో ఉన్న సాగు యోగ్యభూములనూ వారి సామాజిక, ఆర్థిక స్థితి ఆధారంగా రెగ్యులరైజ్ చేసే అవకాశాలు న్నాయని తెలుస్తోంది. ఇక అసైనీల చేతుల్లో లేని వ్యవసాయ అయోగ్య భూములను మాత్రం ప్రభుత్వం తన స్వాధీనం చేసుకుం టుందని రెవెన్యూ వర్గాలంటున్నాయి. అసైనీలకు కొంత పరిహారం చెల్లించి వాటిని తీసుకుంటుందని తెలుస్తోంది. -
ధరణిలో ఇబ్బందాయె రైతు‘బందాయె’!
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక రెవెన్యూ పరిధిలో ఉన్న 972 సర్వే నంబర్లో 14.20 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఏడెకరాల వరకు భూమిని ప్రభుత్వం ముగ్గురు పేదలకు అసైన్ చేసింది. వీరికి పాస్‌పుస్తకాలు కూడా వచ్చాయి. ఇందులో ఒకరి పాస్ పుస్తకానికి సంబంధించి డిజిటల్ సంతకం పెండింగ్ అని ధరణి పోర్టల్‌లో చూపిస్తోంది. భూమి రకం కూడా తప్పుగా నమోదయింది. ఇప్పుడు వాటిని సరిచేసుకునేందుకు ధరణిలో ఆప్షన్ లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో గత యాసంగి నుంచి ఆ రైతుకు సంబంధించిన 3.10 ఎకరాల భూమికి రైతుబంధు కూడా రావడం లేదు. మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకుంటే దాన్ని తిరస్కరించారు. ఇప్పుడు ఏం చేయాలో ఆ రైతుకు పాలుపోవడం లేదు. మెజార్టీ రైతులది ఇదే పరిస్థితి: రాష్ట్రంలోని దాదాపు 14 లక్షల మంది అసైన్డ్ భూముల లబ్ధిదారుల్లో (అసైనీలు) మెజార్టీ రైతులు ధరణిపోర్టల్ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. ధరణి పోర్టల్‌లో ఈ భూముల్లో కొన్నింటిని నిషే ధిత జాబితాలో చూపెట్టడంతో కనీసం వాటిపై ఇతర లావాదేవీలు చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. అసైనీలు చనిపోతే పౌతీ చేసే (భూమిని వారసుల పేరిట మార్చుకో వడం) ఆప్షన్ కూడా లేదు. ఈ భూముల నమోదులో తప్పులు జరిగితే సవరించే అవకా శం లేదు. దీంతో ఆ పేద రైతులకు రైతుబంధు రావడం లేదు. రికార్డులు సరిచేసుకునేందుకు, పేర్లు మార్చుకునేందుకు ఆప్షన్ లేకపోవడంతో ఏం చేయాలో వారికి పాలుపోవడం లేదు. తహసీల్దార్, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఉపయోగం లేకుండా పోతోంది. క్రమబద్ధీకరణ ఊసేది?: ధరణి పోర్టల్‌లో ఎదురవుతున్న సమస్యల మాట అటుంచితే ఈ భూముల విషయంలో భూరికార్డుల ప్రక్షాళన సమయంలోనే ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేసింది. అసైన్డ్ చట్టానికి సవరణలు చేసి ఈ భూములపై అసైనీలకు సర్వహక్కులు కల్పించే దిశలో అన్ని వివరాలు సేకరించింది. జిల్లాల వారీగా అసైన్డ్ భూములెన్ని ఉన్నాయి? అవి అసైనీల చేతుల్లో ఉన్నాయా లేవా? అసైనీల సామాజిక, ఆర్థిక హోదా ఏంటి? అసైన్డ్ భూములు చాలావరకు అన్యాక్రాంతం అయిన నేపథ్యంలో థర్డ్ పార్టీల సామాజిక హోదా ఏంటి? అనే వివరాలను సేకరించింది. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం అసైన్ చేసిన భూములు సాగు చేసుకుంటున్న రైతుల ఇబ్బందులు మరింత ఎక్కువయ్యాయి. వెంటనే నిర్ణయం తీసుకోవాలి ఈ భూములపై ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోవాలని రైతు సంఘాలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 14 లక్షల మందికి పైగా అసైనీలు కోరుతున్నారు. నామమాత్రపు ధరకు ఈ భూములను క్రమబద్ధీకరిస్తే అటు పేద రైతులకు పూర్తి స్థాయిలో హక్కులు లభిస్తాయని, మరోవైపు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుందని వారంటున్నారు. ఈ విషయాన్ని రెవెన్యూ ఉన్నతాధికారులు కూడా అంగీకరిస్తున్నారు. అసైన్డ్ భూముల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వారు చెబుతున్నా ఇప్పటివరకు తీసుకోలేదు. నా పేరిట మార్చుకోలేకపోతున్నా అందె గ్రామంలో నలభై ఏండ్ల క్రితం మా తాత తండ్రుల పేరున 258 సర్వే నంబర్లో రెండెకరాల సర్కారు భూమి ఇచ్చారు. గత ఇరవై ఏళ్లుగా నేను ఆ భూమిని సాగు చేస్తున్నాను. ఆ భూమిని పౌతీ కింద నా పేరిట మార్చుకుందామంటే అవకాశం లేకుండా పోయింది. దీంతో రైతు బంధు రావడం లేదు. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. – సూకూరి బాలరాజు, రైతు, అందె, మిరుదొడ్డి మండలం -
కేశవాపూర్ ప్రాజెక్టుకు ‘అసైన్డ్’ చిక్కులు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ సిగలో భారీ జల భాండాగారం ఏర్పాటు చేసే పనులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. శామీర్‌పేట్ మండలం కేశవాపూర్ లో 5 టీఎంసీల గోదావరి జలాల నిల్వ సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన రిజర్వాయర్‌కు అసైన్డ్ భూములు, అటవీ భూముల సేకరణ ప్రక్రియ కత్తిమీద సాములా మారింది. ప్రధానంగా అసైన్డ్ భూములకు.. ఎకరాకు రూ.37 లక్షలు పరిహారంగా చెల్లిస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కానీ ఎకరానికి రూ. కోటి పరిహారంగా అందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. భూసేకరణ విషయమై రెవెన్యూ అధికారులు పలుమార్లు నిర్వాసితులయ్యే రైతులతో చర్చించినప్పటికీ వారు మెట్టుదిగడంలేదని సమాచారం. తాము కోరిన పరిహారాన్ని చెల్లించకుండా బలవంతంగా తమ భూములు లాక్కుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని స్పష్టంచేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అవుతుందా లేదా అన్న అంశం సస్పెన్స్‌గా మారింది. కాగా.. సుమారు అరవై నాలుగు ఎకరాలకు సంబంధించిన అసైన్డ్ భూములకు 200 మంది యజమానులు ఉన్నారు. వీరంతా తమకు న్యాయం చేయాలని పట్టుబడుతున్నారు. ఈ వివాదాన్ని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందన్న అంశం హాట్ టాపిక్ గా మారింది. అటవీ భూములు సైతం.. కేశవాపూర్ భారీ స్టోరేజి రిజర్వాయర్ నిర్మాణానికి సుమారు 1245 ఎకరాల అటవీ భూములను సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ శాఖకు అంతే మొత్తంలో భూములను కేటాయించాల్సి ఉంది. ఇందుకోసం జగిత్యాల్, సూర్యాపేట్, భూపాలపల్లి తదితర జిల్లాల్లో అటవీశాఖ సూచనల మేరకు ఫారెస్ట్ రిజర్వ్‌ల ఏర్పాటుకు అనుమతించాలని ప్రభుత్వం కేంద్ర అటవీశాఖను కోరింది. ఇక ఈ ప్రాజెక్టుకు పర్యావరణ, అటవీ, పర్యావరణ మంత్రిత్వశాఖలు సైతం ప్రాథమిక అనుమతులు మంజూరు చేసినా.. తుది అనుమతులు జారీచేయాల్సి ఉంది. (చదవండి: మనీ గురించి ఆలోచించకు.. లగ్జరీగా ఉంటే చూడు) -
ఆ ప్లాట్ల రద్దు విషయంలో తొందరపడొద్దు
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలో అసైన్డ్‌దారుల నుంచి భూములు కొనుగోలు చేసి, వాటిని భూ సమీకరణ కింద ఇచ్చిన వారికి అప్పటి ప్రభుత్వం కేటాయించిన నివాస, వాణిజ్య ప్లాట్లను రద్దు చేసే విషయంలో ఎలాంటి తొందరపాటు చర్యలొద్దని హైకోర్టు ఆదేశించింది. కేటాయింపుల రద్దు కోసం జారీ చేసిన జీవో 316, తదనుగుణ నోటీసు విషయంలో తదుపరి చర్యలేవీ వద్దని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ దొనడి రమేశ్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతి రాజధాని అవుతుందని ముందే తెలుసుకుని అప్పటి అధికార పార్టీకి చెందిన పలువురు వ్యక్తులు రాజధాని చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన అసైన్డ్‌దారుల నుంచి నామమాత్రపు ధరకు భూములు కొనుగోలు చేశారు. వాటిని భూ సమీకరణ కింద ప్రభుత్వానికి స్వాధీనం చేసి అందుకు ప్రతిగా రాజధాని ప్రాంతంలో నివాస, వాణిజ్య ప్లాట్లు పొందారు. అసైన్డ్ భూముల విక్రయం చట్ట విరుద్ధం కావడంతో అలా భూములు కొని ప్లాట్లు పొందిన వారి ప్లాట్లను రద్దు చేసే నిమిత్తం ప్రభుత్వం జీవో 316 తీసుకొచ్చింది. ఈ జీవోను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన పెండ్యాల మరియదాసు మరికొందరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్లాట్ల రద్దు నిమిత్తం అధికారులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ విచారణ జరిపి, జీవో 316కు అనుగుణంగా ఎలాంటి తదుపరి చర్యలొద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. -
టీడీపీ నాయకులకు అసైన్డ్ భూముల రైతులు సవాల్
-
బినామీల ముసుగులో 'భూబకాసురులు'
సాక్షి, అమరావతి: ఇవి.. అమరావతి పరిధిలోని ఉద్దండరాయునిపాలెంలోని 2.05 ఎకరాల భూమి అమ్మకం రిజిస్ట్రేషన్ పత్రాలు. ‘ఆ భూమి అసైన్డ్ భూమి కాదు’ అని రాసి ఉంది. ఆ విధంగా పేర్కొంటూ ఆ భూమిని ఎంచక్కా విక్రయించి రిజిస్ట్రేషన్ కూడా చేసేశారు. కానీ ఆ భూమి అసైన్డ్ భూమి. నిబంధనల ప్రకారం ఆ భూమి క్రయవిక్రయాలు చెల్లవు. అది అసైన్డ్ భూమి కాదని చెప్పి 2015 సెప్టెంబరు 9న అమ్మేశారు. ఈ భూమి విక్రయానికి ఉద్దండరాయునిపాలెం గ్రామానికి చెందిన పూల రవి సాక్షి సంతకం చేశారు. రాజధాని ముసుగులో చంద్రబాబు ప్రభుత్వం పాల్పడ్డ భారీ భూబాగోతానికి ఇది చిన్న ఉదాహరణ.. ఈ విధంగా ఒకటి కాదు.. రెండు కాదు.. వేలాది ఎకరాల అసైన్డ్, లంక భూములను అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల బినామీలు హస్తగతం చేసుకుని వేలకోట్లు కొల్లగొట్టారు. ప్రస్తుత ప్రతిపక్ష నేత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌ల సన్నిహితులు, బినామీల పేరిటే ఈ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. కృష్ణా, గుంటూరు, చిత్తూరు, విశాఖపట్నం జిల్లాలకు చెందిన పలువురు, హైదరాబాద్‌లో, అమెరికాలో ఉంటున్న కొందరు చంద్రబాబు సన్నిహితులు బినామీలుగా మారారు. అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన రియల్ ఎస్టేట్ సంస్థల ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వేలాది ఎకరాలను చాపచుట్టేశారు. అందుకు ఒక ఉదాహరణగా.. భూమిపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ, దాని యజమాని బ్రహ్మానందరెడ్డి భూబాగోతం చూద్దాం.. భూమిపుత్ర.. దళితుల భూములపై కుట్ర 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు అమరావతి ప్రాంతంలో వేలాది ఎకరాల అసైన్డ్ భూములపై కన్నేశారు. దళితుల వేళ్లతోనే దళితుల కళ్లు పొడిచే కుట్రకు పథకరచన చేశారు. అందులో భాగంగా భూమిపుత్ర రియల్ ఎస్టేట్‌సంస్థ ప్రముఖంగా తెరపైకి వచ్చింది. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామానికి చెందిన ఆ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి అప్పటి సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ తరఫున రంగంలోకి దిగారు. దళితుల అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి, మళ్లీ చంద్రబాబు సన్నిహితులు, బినామీలపరం చేసే బాధ్యతను నెత్తికెత్తుకున్నారు. తన సంస్థలో ఉద్యోగులుగా పలువురు దళితులను చేర్చుకుని వారి ద్వారానే భూములున్న దళితులతో సంప్రదింపులు జరిపించారు. రాజధాని వస్తుందన్న విషయాన్ని దాచిపెట్టి.. అప్పటికి ఆ ప్రాంతంలో ఎకరా రూ.20 లక్షలు వరకు ఉన్న భూములను కేవలం రూ.3 లక్షల చొప్పున కొనుగోలు చేశారు. ఇక రాజధాని ప్రకటన తరువాత కూడా దళితుల భూములపై కుట్రను మరో కోణంలో కొనసాగించారు. రాజధాని ప్రకటనతో అమరావతి ప్రాంతంలో ఎకరా రూ.కోటిపైగా ధర పలికింది. కానీ అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని ప్రచారం చేశారు. ఆ విధంగా భయపెట్టి ఎకరా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకే కొనుగోలు చేశారు. విజయవాడలోని పటమటలో ఓ కార్యాలయం ఏర్పాటు చేసి మొత్తం వ్యవహారం అక్కడ నుంచి నడిపించారు. ఒక్క భూమిపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ ద్వారానే 2,500 ఎకరాల అసైన్డ్, లంక భూముల్ని టీడీపీ పెద్దలు నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసి తమ చేతుల్లో పెట్టుకున్నారు. ఐనవోలు, బేతపూడి, శాఖమూరు, తుళ్లూరు, ఎర్రబాలెం, నేలటూరు, దొండపాడు, అనంతవరం, నెక్కల్లు తదితర గ్రామాల్లో అసైన్డ్ భూములను చుట్టేశారు. దళితులకు వ్యక్తిగతంగా ఇచ్చిన అసైన్డ్ భూములు మాత్రమే కాదు.. దళితులకు ఉమ్మడిగా సొసైటీల కింద ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా వదల్లేదు. రాయపూడిలోని అంబేడ్కర్ సొసైటీకి చెందిన 160 ఎకరాలు, లెనిన్ సొసైటీకి చెందిన 100 ఎకరాలు, బాపూజీ నగర్‌లోని దళితులకు ఇచ్చిన జగ్గప్ప చెరువు భూములు.. ఇలా అసైన్డ్, లంక భూములను తమపరం చేసుకున్నారు. 2 రోజులు.. 51 రిజిస్ట్రేషన్లు.. ఒకే సాక్షి భూమిపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థ ఎంత అడ్డగోలుగా అసైన్డ్ భూములను కొల్లగొట్టిందో తెలుసుకోవడానికి పూల రవి సంతకాలే సాక్ష్యం. భూమిపుత్ర రియల్ ఎస్టేట్ సంస్థలో ఉద్యోగి అయిన పూల రవి.. ఆ సంస్థ యజమాని బ్రహ్మానందరెడ్డికి ప్రధాన అనుచరుడు. 2015 సెప్టెంబర్ 21, 22 తేదీల్లో 60.27 ఎకరాల అసైన్డ్, లంక భూములకు సంబంధించి ఏకంగా 51 విక్రయ రిజిస్ట్రేషన్లకు అతడు సాక్షి సంతకం చేశారు. అసైన్డ్ భూములను కూడా జిరాయితీ భూములుగా పేర్కొంటూ మరీ రిజిస్ట్రేషన్లు చేసేశారు. దీనిపై తాజాగా సీఐడీ అధికారులు పూల రవికి నోటీసులు జారీచేశారు. ఆ 51 రిజిస్ట్రేషన్లకు సంబంధించిన వివరాలు తెలపాలని పేర్కొంటూ 8 ప్రశ్నలతో నోటీసులు ఇచ్చారు. భూములు కొన్న నిరుపేద దళితుడు! పేద దళితుడైన యెల్లమటి ప్రసాద్ అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున అసైన్డ్ భూములు కొనుగోలు చేసి.. మళ్లీ పలువురికి విక్రయించినట్టు రికార్డుల్లో ఉంది. దీనిపై సీఐడీ అధికారులు ప్రశ్నించడంతో ఆయన అవాక్కయ్యారు. ఎందుకంటే ఆ వ్యవహారం గురించి ఆయనకు ఏమాత్రం తెలియదు. భూమిపుత్ర రియల్ ఎస్టేట్సంస్థలో ఉద్యోగిగా చేసిన ఆయన 2015 సెప్టెంబరులో జరిగిన 24.56 ఎకరాల అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లకు ఆయనే సాక్షి. ఈ క్రమంలో ఆయన కూడా కొన్ని భూములు కొన్నట్లు, వాటిని అప్పటి టీడీపీ పెద్దల సన్నిహితులకు అమ్మినట్లు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఈ విషయం తెలిసిన తరువాత ఆయన అప్పట్లో జరిగిన అసైన్డ్ భూముల అక్రమాలపై గత ఏడాది సీఐడీకి ఫిర్యాదు చేశారు. దీనిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అక్రమాలకు రాజముద్ర వేలాది ఎకరాల అసైన్డ్, లంక భూములను కొల్లగొట్టిన తెలుగుదేశం పెద్దలు.. అనంతరం ఆ అక్రమాలకు ప్రభుత్వంతో రాజముద్ర వేయించారు. అసైన్డ్, లంక భూములకు కూడా భూసమీకరణ కింద నివాస, వాణిజ్య ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు 2016 ఫిబ్రవరిలో జీవో 41 జారీచేసింది. ఈ అక్రమాలకు ఆమోదముద్ర వేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడింది. మాకు తెలియకుండానే మా పేరుతో కొన్నారు, అమ్మారు టీడీపీ ప్రభుత్వంలో అసైన్డ్ భూముల వ్యవహారాల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. మా ఆధార్ కార్డులు తీసుకుని మాకు తెలియకుండానే మా పేరున భూముల కొనుగోళ్లు, అమ్మకాలు చేశారు. విజయవాడ, గుంటూరుతోపాటు హైదరాబాద్, అమెరికా నుంచి కూడా పలువురు వచ్చి అసైన్డ్ భూములు కొనుగోలు చేశారు. వారికి ఇక్కడ భూముల విషయమే తెలియదు. వారంతా అప్పటి టీడీపీ ప్రభుత్వంలో పెద్దలకు బినామీలే. – యెల్లమటి ప్రసాద్ -
భూ వ్యవహారంలో ఈటల కొడుకుపై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ భూ వ్యవహారంలో ఓ భూ బాధితుడు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావుకి ఫిర్యాదు చేశాడు. ఈటల రాజేందర్ కొడుకు నితిన్ తన భూమిని కబ్జా చేడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నాడు. మేడ్చల్ మండలం రావల్‌కోల్‌కు చెందిన మహేష్.. తనకు న్యాయం చేయాలంటూ సీఎంను కోరాడు. బాధితుడు మహేష్ ఫిర్యాదుపై స్పందించిన సీఎం కేసీఆర్.. తక్షణమే దార్యాప్తు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను ఆదేశించారు. ఏసీబీ, రెవిన్యూ శాఖలు సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక తన భుమిని ఇనాం భూమిగా చూపుతూ కొనుగోలు చేసి ఇప్పుడు తమను ఆ భూమిలోకి రాకుండా బెదిరిస్తున్నారని మహేష్ బుధవారం మేడ్చల్ జిల్లా కలెక్టర్, కీసర ఆర్డీఓ కార్యాలయాల్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. చదవండి: Huzurabad: వదిలే ప్రసక్తే లేదు.. ఈటల భూదందాలు బయటపెడతా! -
Land Suneel: ఎలాంటి సందర్భాల్లో అసైన్డ్ భూములు అమ్మవచ్చు?
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూముల అంశం పరిష్కరించలేనిది ఏమీ కాదని, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే నిర్దిష్ట కార్యా చరణ, విస్తృత చర్చలతో దీనికి శాశ్వత పరిష్కారం తేవొచ్చని భూ చట్టాల నిపుణుడు, నల్సర్ అనుబంధ ప్రొఫెసర్ ఎం. సునీల్ కుమార్ (భూమి సునీల్) తెలిపారు. అసలు అసైన్డ్ చట్టంలో ఉన్న వెసులుబాట్లు, లోటుపాట్లు సరిదిద్దేలా మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారిన అసైన్డ్ భూములకు సంబంధించిన అనేక అంశాలు, సందేహాలపై ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు. సాక్షి: పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్ముకోవచ్చా? సునీల్: ప్రభుత్వం పేదలకు రెండు సందర్భాల్లో భూములిస్తుంది. ఒకటి వ్యవసాయం కోసం. రెండు ఇళ్లు కట్టుకునేందుకు. ఈ అసైన్మెంట్ భూములను తరతరాలుగా వారసత్వంగా అనుభవించవచ్చు కానీ అమ్మడం లేదా మరే విధంగానూ ఇతరులకు బదలాయింపు చేయడానికి వీల్లేదు. సాక్షి: ఎలాంటి సందర్భాల్లో అసైన్మెంట్ భూములను అమ్మే వీలుంది? సునీల్: ఇందుకు పీవోటీ చట్టంలోనే మినహాయింపులిచ్చారు. 1977లో వచ్చిన చట్టంలో ఇప్పటి వరకు 11 రకాల వెసులుబాట్లు కల్పించారు. అసైన్డ్ పట్టాలో అమ్మకూడదు అనే నిబంధన పేర్కొనకపోతే, భూమిలేని నిరుపేదలు ఎవరైనా 1977 కంటే ముందు కనుక అసైన్డ్ భూములను కొనుగోలు చేసి ఉంటే అమ్ముకోవచ్చు. అసైన్డ్ భూములను బ్యాంకులకు, సహకార సమాఖ్యలకు కుదువ పెట్టవచ్చు. అప్పు తీర్చకపోతే కుదువ పెట్టిన భూములను బ్యాంకులు వేలం వేసి విక్రయించవచ్చు. అలా వేలంలో కొన్న వారికి పూర్తి యాజమాన్య హక్కులు వస్తాయి. మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు, రాజకీయ బాధితులకు భూములిస్తే వాళ్లు పదేళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. రాజకీయ బాధితులైతే పట్టా చేతికి వచ్చిన మరుక్షణమే అమ్ముకోవచ్చు. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం నిర్దేశించిన ధర చెల్లించిన వారికి అసైన్ చేస్తారు. వారికి ఫామ్–జీ పట్టాలిస్తారు. అవి పట్టాభూములే. వాటిని తక్షణమే అమ్ముకోవచ్చు. 1977 నుంచి 2007 వరకు ఆంధ్రప్రదేశ్‌లో, 2017 వరకు తెలంగాణలో ఎవరైనా భూమి లేని పేదలు అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తే కొన్న వారికి మళ్లీ అసైన్మెంట్ పట్టా ఇవ్వవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంటి స్థలాల కోసం ఇచ్చిన పట్టా భూములను 20 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. 2019 జనవరి కంటే ముందు అమ్ముకుని ఉంటే క్రమబద్ధీకరించుకోవచ్చు. అలాగే, రక్తసంబంధీకులకు దానం కానీ వీలునామా రూపంలో కానీ ఇవ్వవచ్చు. వారసుల పేరిట పట్టా మార్పిడి చేయొచ్చు. సాక్షి: చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సునీల్:అసైన్డ్ భూములను చట్టాన్ని ఉల్లంఘించి కొనుగోలు చేస్తే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంది. సివిల్ చర్యల కింద వారిని ఆ భూమి నుంచి తొలగించి ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంటుంది. పీవోటీ చట్టం సెక్షన్–7 ప్రకారం తహసీల్దార్ క్రిమినల్ కేసు (కొనుగోలు చేసిన వారిపై, అడ్డుపడిన వారిపై) పెట్టవచ్చు. సాక్షి: అసైన్డ్ భూముల విషయంలో ఇప్పుడెలాంటి నిబంధనలుండాలి? సునీల్: దీన్ని విçస్తృత కోణంలో ఆలోచించాలి. బ్యాంకుల్లో కుదువపెట్టి వేలం వేయించుకోవడం కొందరికి దొడ్డిదారిగా మారింది. అసైన్డ్ భూములు వేలానికి వెళితే వాటిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోనేరు రంగారావు కమిటీ సిఫారసు చేసింది. కానీ అమల్లోకి రావడం లేదు. ఇప్పటి వరకు జరిగిన అమ్మకాలు, కొనుగోళ్లకు సంబంధించి వాళ్లకు పట్టాలివ్వాలని చట్టంలోనే ఉంది. కానీ అదీ అమలు చేయడం లేదు. ఇప్పుడు దాన్ని అమలు చేస్తే సరిపోతుంది. 2017తర్వాత కొను గోలు చేసినా ఇదే నిబంధన వర్తింపు చేస్తే చాలు. సాక్షి: పెద్దలు ఈ భూములను కొనుగోలు చేసినా, కబ్జా చేసినా పరిస్థితేంటి? సునీల్: పేదలు కాని వారు అసైన్డ్ భూములను కొనుగోలు చేస్తే ఏం చేయాలన్న దానిపై మూడు అభిప్రాయాలున్నాయి. మొదటిది అసైన్మెంట్ చట్టాన్ని తు.చ. తప్పకుండా అమలు చేయాలి. ప్రభుత్వం ఆ భూములను తీసుకుని, మళ్లీ అసైన్‌చేయాలి లేదంటే ప్రజావసరాల కోసం వినియోగించుకోవాలి. రెండోది.. క్రమబద్ధీకరణ. మార్కెట్ విలువ కట్టించుకుని వారికి యాజమాన్య హక్కులివ్వాలి. ఇప్పుడున్న పీవోటీ చట్టంలో అలాంటి వెసులుబాటు లేదు. చట్టాన్ని మార్చుకుంటే కానీ ఇది సాధ్యం కాదు. ఇక, మూడోది.. ఫలానా తేదీ తర్వాత పెద్దలు ఈ భూములను కొనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వకూడదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే భూమిని కొనుగోలు చేసి భూమిలేని మరో నిరుపేదకు పంపిణీ చేయాలి.. లేదా విస్తృత ప్రజా ప్రయోజనం కోసం వాడొచ్చు. సాక్షి: అసైన్డ్ భూముల విషయంలో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా? సునీల్: వారసత్వంగా అసైన్మెంట్ భూమి వచ్చి నా ఇంకా పట్టా మార్చడం లేదు. వారసుల పేరు మీద మ్యుటేషన్ చేసేందుకు చట్టంలో ఎక్కడా అడ్డంకులు లేవు. ఈ మ్యుటేషన్ ఫీజు ఎకరాకు రూ.2,500 భారమవుతుంది కనుక ఉచితంగా చే యాలి. లావుణి పట్టాలకు సంబంధించి ఇంకా కొత్త పాస్‌పుస్తకాలు ఇవ్వలేదు. ఇదేమంటే అసైన్డ్ భూమి అంటున్నారు. కానీ చట్టప్రకారం కొత్త పాస్ పుస్తకా లు ఇచ్చేందుకు అడ్డంకులు లేవు. అసైన్మెంట్ పట్టాలో ఉన్న సర్వే నెంబర్‌కు, అసైనీ కబ్జాలో ఉన్న భూమి సర్వే నెంబర్‌కు తేడాలున్నాయి. వీటిని పరిష్కరించకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు వస్తాయి. వీటన్నింటినీ పరిష్కరిస్తేనే అసైన్డ్ భూములకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. సాక్షి: చట్ట ఉల్లంఘన జరిగితే చర్యలు తీసుకునేందుకు అవలంబించాల్సిన పద్ధతులేంటి? సునీల్:అసైనీదారులు, కొనుగోలుదారులకు మొదట నోటీసులివ్వాలి. ఆ తర్వాత తహసీల్దార్ విచారణ జరపాలి. చట్ట ఉల్లంఘన జరిగిందని ప్రకటిస్తే కొనుగోలుదారుడు లేదా కబ్జాదారులను ముందు ఆ భూమి నుంచి తొలగించాలి. ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనపర్చుకోవాలి. క్రిమినల్ చర్యల్లో భాగంగా కేసు పెట్టాల్సింది తహసీల్దార్ మాత్రమే. తహసీల్దార్ లేదంటే ఆ పై స్థాయి అధికారి పెట్టవచ్చు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సాక్షి: అసైన్డ్ భూములను ప్రభుత్వం తన విచక్షణతో స్వాధీనం చేసుకోవచ్చా?నష్టపరిహారం ఇస్తారా? సునీల్: అసైన్‌పట్టాను పరిశీలిస్తే ‘ప్రభుత్వానికి ఎలాంటి అవసరం వచ్చినా ఎలాంటి నష్టపరిహారం చెల్లించకుండా ఆ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటుంది’ అనే నిబంధన ఉంటుంది. దీని ప్రాతిపదికగా చాలా సందర్భాల్లో అసైన్ భూములను ప్రభుత్వం తీసుకుంది. ఏ ఉద్దేశం కోసమైతే ప్రభుత్వం అసైన్ చేస్తుందో మూడేళ్లలో ఆ ఉద్దేశం నెరవేరకపోతే తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు. అసైనీనే ప్రభుత్వానికి భూమిని సమర్పించవచ్చు. ప్రభుత్వం తీసుకుంటే 1992 వరకు నష్ట పరిహారం ఇవ్వలేదు. ఆ తర్వాత ఎకరానికి కంటితుడుపుగా ఎక్స్‌గ్రేషియా ఇచ్చేవారు. రెండు నెలల క్రితం వచ్చిన కోర్టు తీర్పుల ప్రకారం కూడా ఏ విధంగా అసైన్డ్ భూములను ప్రభు త్వం తీసుకున్నా పరిహారం ఇవ్వాల్సిందే. పట్టా భూములకు ఎంత చెల్లిస్తారో అంత చెల్లించాల్సిందే. భూమి హక్కులకు ఉల్లంఘన జరిగితే ఎన్నేళ్ల తర్వాత వచ్చి అడిగినా పరిహారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. సాక్షి: అసైన్మెంట్ చట్టాల్లో మార్పులేమైనా చేయాలా? సునీల్: ఈ చట్టాల్లో కచ్చితంగా మార్పులు చేయాల్సిందే. కొన్ని నిబంధనలను తొలగించడం, కొన్నింటిని చేర్చడం జరగాలి. ఈ చట్టంలో మార్పులు చేసేటప్పుడు స్థానిక పరిస్థితులు, పరిస్థితుల్లో మార్పు, పక్క రాష్ట్రాల్లో అనుభవాలు లాంటి అంశాలను విస్తృతంగా చర్చించి మార్పులు చేయాలి. -
సీఎం జగన్ మరో చరిత్రాత్మక నిర్ణయం
సాక్షి, అమరావతి: బడుగులకు బాసటగా నిలుస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడైనా తప్పనిసరిగా భూ సేకరణ చేయాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైతే ఇకపై ఎస్సీ, ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములకు రైత్వారీ పట్టా భూముల కంటే 10 శాతం అదనంగా పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. ఈమేరకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదించడం ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచారు. అసైన్డ్ భూములంటే పప్పు బెల్లాలు ఇచ్చి గుంజుకోవడం తమ హక్కుగా వ్యవహరించిన గత పాలకులకు భిన్నంగా పేదలకు భరోసా కల్పిస్తూ కొత్త ఒరవడి సృష్టించారు. జాతీయ చట్టం కంటే అధికంగా... జాతీయ భూ సేకరణ చట్టం–2013లో పేర్కొన్న దానికంటే అధికంగా పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైత్వారీ భూములతో సమానంగా ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం 2013లో తెచ్చిన జాతీయ భూసేకరణ చట్టం నిర్దేశిస్తోంది. అయితే ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు రైత్వారీ పట్టాల కంటే 10 శాతం అధికంగా పరిహారం చెల్లించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించడం విశేషం. వైఎస్సార్ స్ఫూర్తితో.. ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం ఇవ్వాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2007లో నిర్ణయించారు. ఆ విధానాన్నే స్ఫూర్తిగా తీసుకుని 2013లో కేంద్ర ప్రభుత్వం ‘జాతీయ భూసేకరణ చట్టం’ చేసింది. తాజాగా ముఖ్యమంత్రి జగన్ దేశంలోనే తొలిసారిగా రైత్వారీ భూముల కంటే అసైన్డ్ భూములకు 10 శాతం అదనంగా పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలను దగా చేసిన చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలను మోసగించడంలో చంద్రబాబు సర్కారు సరికొత్త విధానాలను అనుసరించింది. ఉమ్మడి రాష్ట్రంలో 1995–2004 మధ్య చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలో ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు అతి తక్కువ పరిహారం ఇచ్చి వేలాది ఎకరాలు గుంజుకున్నారు. 2014లో మళ్లీ సీఎం అయ్యాక మరో ఎత్తుగడ వేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు కూడా పట్టా భూములతో సమానంగా పరిహారం ఇవ్వాల్సి ఉండగా అందుకు సమ్మతించని చంద్రబాబు రాజధాని అమరావతి కోసం భూ సమీకరణ విధానం అమలు చేశారు. ల్యాండ్ పూలింగ్ విధానానికి జాతీయ భూ సేకరణ చట్టం వర్తించదని వక్ర భాష్యం చెబుతూ ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు అతి తక్కువ ప్రతిఫలం ఇచ్చారు. పూలింగ్ పేరుతో ఎస్సీ, ఎస్టీలను మోసగించారిలా ► రైత్వారీ పట్టాలున్న మెట్ట భూములకు ఎకరాకు వెయ్యి గజాల అభివృద్ధి చేసిన నివాస స్థలంతోపాటు 250 గజాల వాణిజ్య స్థలం ప్రకటించారు. ► రైత్వారీ పట్టాలున్న జరీబు భూములకు ఎకరాకు వెయ్యి గజాల నివాస స్థలంతోపాటు 450 గజాల వాణిజ్య స్థలం ఇస్తామన్నారు. ► కానీ ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు మాత్రం మెట్టకు ఎకరాకు కేవలం 800 గజాల అభివృద్ధి చేసిన నివాస స్థలం, 100 గజాల వాణిజ్య స్థలాన్ని మాత్రమే ప్రకటించారు. జరీబు భూమికి ఎకరాకు 800 గజాల అభివృద్ధి చేసిన నివాస స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం ఇస్తామన్నారు. రైత్వారీ పట్టాల కంటే ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు తక్కువ పరిహారం ఇచ్చి మోసం చేశారు. ఆ విధంగా ఎస్సీ, ఎస్టీల నుంచి దాదాపు 5 వేల ఎకరాలను తీసుకున్నారు. అసైన్డ్ భూములు అక్రమంగా టీడీపీ నేతల పరం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన విషయాన్ని అధికారికంగా ప్రకటించక ముందే అప్పటి సీఎం చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు ఉప్పందించారు. దీంతో దళితులను భయపెట్టి వారి నుంచి అసైన్డ్ భూములను టీడీపీ నేతలు కారుచౌకగా కొనుగోలు చేశారు. నిబంధనల ప్రకారం ఆ భూముల రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలి. భూ సమీకరణ కింద అసైన్డ్ రికార్డుల్లో ఉన్న ఎస్సీ, ఎస్టీలకే పరిహారం చెల్లించాలి. అయితే చంద్రబాబు సర్కారు ఆ అక్రమ కొనుగోళ్లను గుర్తిస్తూ జీవో 41 జారీ చేసింది. దీంతో ఎస్సీ, ఎస్టీలు తీవ్రంగా నష్టపోయారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆ జీవోను రద్దు చేశారు. బడుగుల పక్షపాతి సీఎం జగన్ – కల్లూరి చెంగయ్య, ఐక్య దళిత మహానాడు జాతీయ అధ్యక్షుడు ‘బడుగులు, పేదల పక్షపాతినని ముఖ్యమంత్రి జగన్ మరోసారి నిరూపించుకున్నారు. అసైన్డ్ భూములకు 10 శాతం అదనపు పరిహారం చెల్లించాలన్న నిర్ణయం దేశానికే ఆదర్శప్రాయం’ చరిత్రాత్మక నిర్ణయం.. – జలుమూరు అమర్నాథ్, ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర రెల్లి హక్కుల పోరాట సమితి ‘ఎస్సీలు, ఎస్టీలు, పేదల సంక్షేమం కోసం వైఎస్సార్ రెండు అడుగులు వేస్తే తాను నాలుగు అడుగులు వేస్తానని ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. నామమాత్రపు పరిహారంతో టీడీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను గుంజుకుంది. సీఎం జగన్ దళితులు, గిరిజనులకు అండగా నిలుస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు’ చంద్రబాబు దగా చేశారు... – పులి ప్రభుదాస్, అసైన్డ్ రైతు, వెంకటపాలెం, అమరావతి ‘రాజధాని భూ సమీకరణ పేరుతో చంద్రబాబు ఎస్సీ, ఎస్టీలను దగా చేశారు. 1977 అసైన్డ్ చట్టానికి విరుద్ధంగా టీడీపీ నేతలు కొనుగోలు చేసిన భూములను గుర్తిస్తూ అధికారంలో ఉండగా ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు రక్షణ కల్పించారు. భూ సేకరణ కింద తీసుకోవాల్సి వస్తే రైత్వారీ పట్టా భూముల కంటే 10 శాతం అదనంగా పరిహారాన్ని ప్రకటించడం సంతోషాన్ని కలిగిస్తోంది’ చదవండి: ఇళ్ల నిర్మాణంతో ఎకానమీకి బూస్ట్.. -
పార్టీలో ప్రాధాన్యత లేదనడం సత్యదూరం
-
ఈటల రాజేందర్ మేక వన్నె పులి; మంత్రుల కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వంపై ఈటల రాజేందర్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం సరికాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఈటల వ్యాఖ్యలపై మంత్రులు కౌంటర్ ఇచ్చారు. ఆయన వ్యవహారంపై మంత్రులు మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈటలకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఇచ్చామని.. ఆయనకు ఎక్కడ ఆత్మగౌరవం దెబ్బతిందని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారే పదవుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘ఎల్పీ నాయకుడిగా ఈటలకు అవకాశం ఇచ్చారు. ఈటలకు మంత్రి పదవితో పాటు కీలక శాఖలు కూడా ఇచ్చారు. పార్టీలో గౌరవం దక్కినా ఈటల విమర్శలు చేస్తున్నారు. ఈటలకు మంత్రి పదవితో పాటు కీలక శాఖలు అప్పగించారు. పార్టీలో ప్రాధాన్యత లేదనడం సత్యదూరం. అసైన్డ్ భూములను కొనరాదు.. అమ్మరాదు అనే విషయం తెలియదా?. మంత్రిగా ఉండి అసైన్డ్ భూములను ఎందుకు కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఈటల నష్టం చేశారని’’ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ‘‘కుటుంబ అవసరాల కోసం అసైన్డ్ భూములు కొనడం తప్పు కాదా?. దేవరయాంజల్లో దేవాదాయ భూములను ఎందుకు కొన్నారు?’ అంటూ మంత్రి ఈశ్వర్ ప్రశ్నలు సంధించారు. ఆరోపణలపై సమాధానం ఇవ్వకుండా సీఎంపై విమర్శలు చేస్తున్నారని.. రెండేళ్లుగా ఈటల పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మంత్రి కొప్పుల నిప్పులు చెరిగారు. బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల రాజేందర్.. ఈటల రాజేందర్ మేక వన్నె పులి అంటూ మంత్రి గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ను దొర అని సంభోదించడం సరికాదన్నారు. ‘‘బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల రాజేందర్. ముదిరాజులు, బలహీనవర్గాల గురించి ఈటల ఏనాడూ ఆలోచించలేదు. కమలాపూర్‌లో చీమలు పెట్టిన పుట్టలో పాములా చేరారు. ఈటల పార్టీలోకి రాకముందే కమలాపూర్ జడ్పీ పీఠం గెలిచాం. పార్టీ గెలిస్తే ఏడవడం.. పార్టీ ఓడితే నవ్వడం ఈటల పని’’ అంటూ మంత్రి గంగుల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చదవండి: Etela:హైకోర్టును ఆశ్రయించిన ఈటల కుటుంబం ఈటల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! -
హైకోర్టును ఆశ్రయించిన జమున హ్యాచరీస్
-
Etela:హైకోర్టును ఆశ్రయించిన ఈటల కుటుంబం
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా అసైన్డ్ భూముల వివాదం వ్యవహారంలో జమున హ్యాచరీస్ హైకోర్టును ఆశ్రయించింది. కలెక్టర్ నివేదిక తప్పులతడకగా ఉందంటూ పిటిషన్ దాఖలు చేసింది. తమకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా విచారణ చేశారని పిటిషన్లో పేర్కొంది. అధికారులపై చర్యలు తీసుకోవాలని జమున హ్యాచరీస్ పిటిషన్లో కోరింది. అచ్చంపేటలో తమ భూమిలోకి అక్రమంగా ప్రవేశించి సర్వే చేశారని పిటిషన్లో పేర్కొంది. కాగా, జమున హ్యాచరీస్ భూ వివాదాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ దర్యాప్తునకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఒకదాని వెంట మరొకటిగా వేగంగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. ఇక మెదక్ జిల్లా అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే మంత్రివర్గం నుంచి ఈటలను తొలగించగా, తాజాగా దేవరయాంజాల్ భూముల వ్యవహారంపైనా నలుగురు ఐఏఎస్‌లతో కూడిన కమిటీ విచారణ, విజిలెన్స్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ క్రమంలో మెదక్ జిల్లా అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందింది. ఏసీబీ, ఇంటిలిజెన్స్ ఇతర విభాగాలు రంగంలోకి దిగి ముమ్మర విచారణ కొనసాగిస్తున్నాయి. మరోవైపు సోమవారం కమిటీ ఏర్పాటు చేయగానే పంచాయతీరాజ్ అధికారులు కూడా రంగంలో దిగి పౌల్ట్రీ నిర్మాణ అనుమతులు, పన్నుల చెల్లింపు కోణాల్లో విచారణ మొదలు పెట్టారు. ఏ ప్రభుత్వ శాఖల పరిధిలో నిబంధనలు ఉల్లంఘించారో నివేదికలు తయారు చేస్తున్నారు. చదవండి: ఈటల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు! చావునైనా భరిస్తా.. ఆత్మ గౌరవం కోల్పోను -
ఈటల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు!
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఒకదాని వెంట మరొకటిగా వేగంగా జరుగుతున్న పరిణామాలు ఈ విషయం స్పష్టం చేస్తున్నాయి. మెదక్ జిల్లా అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే మంత్రివర్గం నుంచి ఈటలను తొలగించగా, తాజాగా దేవరయాంజాల్ భూముల వ్యవహారంపైనా నలుగురు ఐఏఎస్‌లతో కూడిన కమిటీ విచారణ, విజిలెన్స్ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. మెదక్ జిల్లా అసైన్డ్ భూముల వ్యవహారంలో ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందింది. ఏసీబీ, ఇంటిలిజెన్స్ ఇతర విభాగాలు రంగంలోకి దిగి ముమ్మర విచారణ కొనసాగిస్తున్నాయి. మరోవైపు సోమవారం కమిటీ ఏర్పాటు చేయగానే పంచాయతీరాజ్ అధికారులు కూడా రంగంలో దిగి పౌల్ట్రీ నిర్మాణ అనుమతులు, పన్నుల చెల్లింపు కోణాల్లో విచారణ మొదలు పెట్టారు. ఏ ప్రభుత్వ శాఖల పరిధిలో నిబంధనలు ఉల్లంఘించారో నివేదికలు తయారు చేస్తున్నారు. చదవండి: (చావునైనా భరిస్తా.. ఆత్మ గౌరవం కోల్పోను) అన్ని విధాలుగా ఆలోచించే.. తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీలో చేరిన ఈటల తర్వా కీలక స్థాయికి ఎదిగారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏర్పాటైన రెండు ప్రభుత్వాల్లోనూ ముఖ్యమైన శాఖలకు మంత్రిగా వ్యవహరించారు. పార్టీ శాసనసభా పక్ష నేతగానూ వ్యవహరించారు. అలాంటి ఈటల రాజేందర్‌ను తప్పించడంపై సీఎం కేసీఆర్ అన్ని విధాలా ఆలోచించే నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ ఆవిర్భావం మొదలుకుని ఎంతో మంది నేతలు పార్టీని వీడినా ఉద్యమ ఉధృతిలో వారి ప్రభావం టీఆర్ఎస్పై పెద్దగా లేకుండా పోయింది. అయితే పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక కీలక నేతను తప్పించాల్సి రావడంతో, అన్నీ పరిశీలించే చర్యలకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఈటలకు ఘన స్వాగతం సోమవారం రాత్రి భారీ కాన్వాయ్‌తో హుజూరాబాద్‌కు వచ్చిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. అనుచరులు, అభిమానులు బాణసంచా కాల్చారు. కాబోయే సీఎం ఈటల అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినదించారు. కాగా.. ఈటల రెండు రోజులు హుజూరాబాద్ నియోజకవర్గం లోనే మకాం వేసి, అన్ని స్థాయిల నాయకులతో మండలాల వారీగా సమావేశమయ్యే యోచనలో ఈటల ఉన్నట్టు తెలిసింది. ఆ తర్వాతే, ఎమ్మెల్యే పదవితోపాటు పార్టీకి కూడా రాజీనామా ప్రకటించే అవకాశముందని అంటున్నారు. ఏకాకి అయ్యారా? మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన ఈటల ఎమ్మెల్యే పదవిలో కొనసాగడంపై తన కేడర్, అభిమానులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. ఒకటిరెండు రోజుల్లో ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి రాజీనామా చేసే సూచ నలు కనిపిస్తున్నాయి. అసైన్డ్ భూముల వ్యవహారం తెరమీదకు వచ్చినప్పటి నుంచి మూడు రోజులుగా హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈటల నివాసానికి బారులు తీరారు. వివిధ కుల సంఘాల నేతలు, కొందరు ఉస్మానియా వర్సిటీ విద్యార్థులు కూడా కలిసి సంఘీభావం ప్రకటించారు. కానీ ఇప్పటివరకు సన్నిహితంగా మెలిగిన పార్టీ నేతలు కానీ, ఎమ్మెల్యేలు, మంత్రులు కానీ ఈటల ప్రస్తావనే ఎత్తకపోవడం గమనార్హం. పలువురు మంత్రులు, ఇతర నేతలు వేర్వేరు అంశాలపై మాట్లాడుతున్నా.. భూకబ్జాలు, ఈటల బర్తరఫ్‌పై ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఇలా పార్టీ ముఖ్యులెవరూ ఈటల వైపు మొగ్గు చూపే అవకాశం లేదని కేసీఆర్ ముందుగానే అంచనా వేశారని నేతలు చెబుతున్నారు. అయితే ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలు ఈటల నివాసం వద్ద జరుగుతున్న పరిణామాల వివరాలు సేకరిస్తున్నారని, ఈటలతో సన్నిహితంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల కదలికలపైనా నిఘా పెరిగిందని సమాచారం. -
చావునైనా భరిస్తా.. ఆత్మ గౌరవం కోల్పోను
సాక్షి, హైదరాబాద్: ‘చావునైనా భరిస్తాను తప్ప ఆత్మగౌరవాన్ని కోల్పోను. ప్రజలను, ధర్మాన్ని, కష్టాన్ని నమ్ముకున్న వాడు చెడిపోడు. ఆత్మగౌరవంతో తెలంగాణ సమాజం వెంట నిలుస్తా..’ అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. మెదక్ జిల్లాలో అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి బర్తరఫ్కు గురైన ఈటల సోమవారం దేవరయాంజాల్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ‘ఈటల రాజేందర్ ప్రేమకే తప్ప ఇలాంటి చర్యలకు లొంగడు. కేసులు పెట్టి జైలుకు పంపితే వెళ్తా. నా వ్యాపారాన్ని మూసి వేస్తావేమో. కట్టుబట్టలతో వచ్చా, మళ్లీ ఆ స్థాయికి వెళ్లేందుకు సిద్ధపడతా తప్ప నా ఆత్మను అమ్ముకునే ప్రయత్నం చేయను. మీకున్న అధికారంతో నన్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. కారు గుర్తు మీద గెలిచావ్ కదా.. రాజీనామా చేయాలని మీరు అంటారు. కానీ హుజూరాబాద్ ప్రజల ఆశీర్వాదంతో నేను ఆరుసార్లు ఎమ్మెల్యేనయ్యా. రాజీనామా చేసే ముందు నన్ను 20 ఏండ్లుగా ఎత్తుకుని ప్రేమించిన హుజూరాబాద్ ప్రజల సలహాలు, సూచనలు, ఆశీర్వాదం తీసుకుని నిర్ణయం తీసుకుంటా’అని ఈటల అన్నారు. చదవండి: (తెలంగాణ కాంగ్రెస్ సారథి ఎవరు?) తెలంగాణ బిడ్డలను మెప్పించలేరు ‘నేను పదవుల కోసం పెదవులు మూసుకునే రకం కాదు. మీ శిష్యరికంలోనే టీఆర్ఎస్ గులాబీ జెండా కింద ఈ స్థాయికి వచ్చినం. రాష్ట్రం వస్తే ఎమ్మెల్యేలు, మంత్రులం అవుతమని మీ వెంట రాలేదు. ఒక లక్ష్యం కోసం ఉద్యమ స్వభావంతో మీ వెంట నడిచినం. మా వ్యాపారం, కుటుంబ జీవితాన్ని త్యాగం చేసి ఉద్యమంలో పనిచేశాం. 19 ఏండ్లు నీతో ఉన్న మేము ఒక్కసారి దెయ్యం ఎలా అయ్యాం. పార్టీ పెడతామని, మారతామని ఏ ఒక్కరికీ చెప్పలేదు. ఉద్యమ నాయకుడిగా, మంత్రిగా.. ఎన్నడూ కేసీఆర్‌కు, ప్రభుత్వానికి మచ్చ తెచ్చే ప్రయత్నం చేయలేదు. ఈటల రాజేందర్ లాంటి మామూలు మనిషి మీద మీ శక్తిని ప్రయోగించడం మీ గౌరవాన్ని, స్థాయిని పెంచదు. ఈ విషయంలో మీరు తెలంగాణ బిడ్డలను మెప్పించలేరు..’అని రాజేందర్ పేర్కొన్నారు. సర్దుకుపోని వారిని మీరు ఎలా ఖతం చేస్తారో తెలుసు నేను ఒక్కడినే కావచ్చు, మంత్రులు, ఎమ్మెల్యేలు నాకు సానుభూతి తెలపకపోవచ్చు. నాది ఆత్మ గౌరవ సమస్య. నేను ఎందుకు దూరమయ్యానో మీ అంతరాత్మకు తెలుసు. మంత్రిగా చూడకపోయినా మనిషిగా చూడాలని కోరుకున్నాం. పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు గౌరవంగా ఉన్నట్లు అనుకోవడం లేదు. మీతో సర్దుకుపోని వారిని చట్టాలు, వ్యవస్థను పక్కన పెట్టి మీరు ఎలా ఖతం చేస్తారో తెలుసు. నా మొత్తం సంపాదన, వ్యాపారం, ఆస్తుల మీద సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి..’అని ఈటల డిమాండ్ చేశారు. చదవండి: ('పుర' పీఠాలపై గులాబీ జెండా) నోటీసులు ఇవ్వలేదు.. వివరణ కోరలేదు ‘నోటీసులు ఇవ్వకుండా పోలీసులతో భయానక వాతావరణం సృష్టించి భూములు కొలవడం ఎంతవరకు సమంజసం? మీ అధికారులు వావి వరుసలు మరిచి నివేదికలు ఇచ్చారు. కనీసం మా వివరణ కూడా అడగలేదు. మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా దోషిగా నిరూపిస్తే శిక్షకు సిద్ధం. మీ వ్యవసాయ క్షేత్రానికి రోడ్లు వేసేటప్పుడు భూములు తీసుకుని ఉంటారు కదా. అందులోనూ అస్సైన్డ్ భూములున్నాయి. మీరు మీ భూములను కొన్నప్పుడు రెండు మూడు లక్షలకు కొన్నారు. ఇప్పుడు కోట్లు పలుకుతున్నాయి. నేను అలానే కొన్నాను. ఇప్పుడు వాటి విలువ పెరిగితే.. కోట్లు ఎక్కడ నుంచి వచ్చాయంటారా..? దేవరయాంజాల్‌లో ఆరు ఎకరాలు కొన్నా. అవి దేవాలయాల భూములంటున్నారు. అప్పట్లో రాజశేఖరరెడ్డి టీకే దివాన్ కమిటీని నియమించారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రుల దృష్టికీ, మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ దృష్టికి కూడా ఈ విషయం తీసుకువచ్చా. ఇప్పుడే ఎందుకులే అని పెండింగ్‌లో పెట్టారు. నా ఒక్కడి కోసం వందలాది మంది రైతులకు అన్యాయం చేయొద్దు..’అని ఈటల అన్నారు. గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో బియ్యం కొనుగోలుపై తనపై ఆరోపణలు చేసే అవకాశం ఉందని చెప్పారు. -
‘అసైన్డ్ స్కామ్’పై సీఐడీ దూకుడు
సాక్షి, అమరావతి: టీడీపీ అక్రమాలకు రాజధానిగా మారిన అమరావతిలో అసైన్డ్ భూస్కామ్‌పై నేర పరిశోధన విభాగం (సీఐడీ) మరింత దూకుడు పెంచింది. ఇప్పటికే పలు కేసులను నమోదు చేసిన సీఐడీ భిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నేరుగా రైతులను కలిసి వారి వాంగ్మూలం నమోదు చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలో శనివారం సీఐడీ అధికారులు ఐదు బృందాలుగా ఏర్పడి రైతుల నుంచి సమాచారాన్ని సేకరించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం మల్కాపురం గ్రామానికి చెందిన 50 మంది అసైన్డ్ భూములు రైతులను మందడం గ్రామానికి పిలిచిన సీఐడీ ప్రత్యేక బృందాలు అన్ని కోణాల్లో వారిని విచారించాయి. రెండు రోజుల క్రితం తాళ్లాయపాలెం, రాయపూడి గ్రామాల రైతులను తుళ్లూరు తహసీల్దార్ కార్యాలయంలో సీఐడీ విచారించిన సంగతి తెలిసిందే. భయపెట్టి భూములు గుంజుకున్నారు.. తాజాగా సీఐడీ బృందాల విచారణలో రైతులు తమకు జరిగిన అన్యాయాన్ని అధికారులు ముందు ఏకరువు పెట్టారని తెలుస్తోంది. టీడీపీ నేతలు తమను భయపెట్టి అయినకాడికి తమ భూములను గుంజుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్ భూములకు ప్రభుత్వం ఎలాంటి పరిహారం ఇవ్వదంటూ ఆందోళనకు గురిచేసి.. అతి తక్కువ ధరకే తమ భూములను అమ్ముకునేలా చేశారని రైతులు వాపోయారు. ఇలా తమ భూములను కొల్లగొట్టిన టీడీపీ నేతలు వాటిని కోట్ల రూపాయలకు అమ్ముకుని.. తమను నిలువెల్లా మోసం చేశారని కన్నీటిపర్యంతమయ్యారు. అంతేకాకుండా భూములను అమ్మడానికి ఇష్టపడని రైతులను అనేక విధాలుగా బెదిరించి, భయపెట్టారని సీఐడీ ముందు గోడు వెళ్లబోసుకున్నారు. బినామీల పేర్లతో అమ్మలేదనే అక్కసుతో.. మల్కాపురంలో ఉద్ధంరాయునిపాలెం సొసైటీకి చెందిన ఆరుగురు రైతులను సీఐడీ విచారించింది. తాము భూములు పూలింగ్‌కు ఇస్తామన్నా తీసుకోకుండా ఇబ్బందులకు గురిచేశారని రైతులు తెలిపారు. ఈ అంశంపై అప్పటి కలెక్టర్‌తోపాటు, సీఆర్డీఏ అధికారులు, ఎస్సీ కమిషన్ చైర్మన్, నాటి సీఎం చంద్రబాబును సైతం కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీంతో కోర్టుకు వెళ్లి తమ భూములను పూలింగ్‌కు తీసుకోవాలని కోరగా, కలెక్టర్‌ను కలవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. దీంతో కలెక్టర్‌ను కలిసినా ఆయన ఉద్దేశపూర్వకంగా మాట దాటవేయడంతో తాము పూలింగ్‌కు ఇవ్వలేకపోయామన్నారు. బినామీ పేర్లతో అమ్మలేదనే అక్కసుతోనే తమ భూములను పూలింగ్‌కు తీసుకోలేదని రైతులు విమర్శించారు. తమ పేర్ల మీద భూములు ఉన్నా.. వాటిని ప్రభుత్వ భూములుగా మార్చి ఇతరుల పేర్లపై నమోదు చేయాలని ప్రయత్నించారని ఆరోపించారు. ఇందుకు సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న ఆధారాలే నిదర్శనమన్నారు. కోర్టును ఆశ్రయించడంతో తిరిగి రికార్డుల్లో ప్రభుత్వ భూములనే పేర్లు తొలగించి తమ పేర్లను నమోదు చేశారని వివరించారు. అక్రమంగా భూములు సొంతం చేసుకునేందుకు ప్రయత్నించి సాధ్యపడకపోవడంతో రికార్డుల ట్యాంపరింగ్‌కు యత్నించారని రైతులు వాపోయారు. రైతులతోపాటు స్థానికులు కూడా దీనిపై సీఐడీ అధికారులకు పలు ఫిర్యాదులు చేశారు. తప్పించుకోవడానికి టీడీపీ నేతల ప్రయత్నాలు.. కాగా, అసైన్డ్ భూముల కుంభకోణంలో బలమైన ఆధారాలు కనిపిస్తుండటంతో దాని నుంచి తప్పించుకోవడానికి టీడీపీ నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలో తమకు అనుకూలంగా ఉండే కొందరిని తెర మీదకు తెచ్చారు. రైతుల పేరుతో వారిని సీఐడీ, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ) అధికారుల దగ్గరకు పంపించి అసైన్డ్ భూములను తాము ఇష్టపూర్వకంగానే ఇచ్చామని, గత టీడీపీ ప్రభుత్వం తమను ఆదుకుందని చెప్పే ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. అసైన్డ్ భూముల కుంభకోణంపై సీఐడీ మరింత లోతుగా దర్యాప్తు చేస్తే టీడీపీ ప్రభుత్వ పాపాలు బట్టబయలవుతాయని అమరావతి ప్రాంతానికి చెందిన దగా పడ్డా దళిత రైతులు చెబుతున్నారు. -
అసైన్డ్‌లో గోల్మాల్
మంగళగిరి: టీడీపీ హయాంలో రాజధాని గ్రామాల్లోని అసైన్డ్, లంక భూముల వ్యవహారంలో జరిగిన అవకతవకలు కోకొల్లలు. అత్యధికంగా అసైన్డ్ భూములున్న కురగల్లు, కరకట్ట రోడ్డు వెంట ఉన్న కృష్ణాయపాలెంతో పాటు పలు గ్రామాల్లోని లంక భూముల క్రయ విక్రయాలపై నిషేధం ఉంది. రాజధాని ప్రకటనకు ముందే వందలాది ఎకరాలు కొనుగోలు చేసినవారు భూముల రిజిస్ట్రేషన్లు లేకపోవడంతో కొందరు అధికారుల సహకారంతో పెండింగ్ రిజిస్ట్రేషన్లు చేయించారు. ఒక్క 2015 సంవత్సరంలోనే మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అసైన్డ్, లంక భూములకు సంబంధించి 495 పెండింగ్ రిజిస్ట్రేషన్లు జరిగాయి. అసైన్డ్, లంక భూములపై ఆరోపణలు వెల్లువెత్తడంతో అప్పటి రిజిస్ట్రార్ సస్పెండ్ అయ్యారు. దీంతో ఏడాది పాటు అసైన్డ్, లంక భూముల రిజిస్ట్రేషన్ల జోలికి అధికారులు వెళ్లలేదు. ఆ తర్వాత గత ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో పెండింగ్ దస్తావేజులను రెగ్యులర్ చేయడం ప్రారంభించారు. 2017 సంవత్సరంలో 125కిపైగా పెండింగ్ దస్తావేజులను రెగ్యులర్ చేసిన అధికారులు 2018, 2019లో 129 పెండింగ్ దస్తావేజులను రెగ్యులర్ చేశారు. అసైన్డ్, లంక భూముల పెండింగ్ రిజిస్ట్రేషన్లతో భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. దస్తావేజులను రెగ్యులర్ చేయడంలో లక్షలాది రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. కురగల్లులోనే రూ.వంద కోట్ల మేర... విశాఖపట్నానికి చెందిన మైత్రీ ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ తేళ్ళ శ్రీనివాసరావు పేరుతో కురగల్లులో సర్వే నంబర్ 538, 316/02, 534లలో 2.46 ఎకరాలను కొనుగోలు చేశారు. 2015 సెప్టెంబర్ 4న పెండింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ 593/2015గా రిజిస్ట్రేషన్ చేశారు. అదే దస్తావేజుకు 2019 మార్చి 5వ తేదీన 4420/2019గా రెగ్యులర్ నంబర్ ఇవ్వడం విశేషం. అలాగే 3534/2015లో పెండింగ్ నంబర్‌గా ఉన్న దస్తావేజు 2018లో 14113/18 రెగ్యులర్ నంబర్‌గా మారింది. తొలుత పెండింగ్ రిజిస్ట్రేషన్లు చేయడం, అనంతరం రెగ్యులర్ రిజిస్ట్రేషన్ నంబర్లు ఇవ్వడం ద్వారా ఒక్క కురగల్లు గ్రామంలోనే రూ.100 కోట్ల మేర గత సర్కారు హయాంలో దళారులు, కొందరు అధికారులు లబ్ధి పొందారనే ఆరోపణలున్నాయి. ఇలాంటి దస్తావేజులు 250కిపైగా రెగ్యులర్ నంబర్లు పొందడంపై పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్న సీఐడీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు నోటీసులు ఇవ్వడం రాజధాని గ్రామాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. అసైన్డ్, లంక భూములను కొనుగోలు చేసిన టీడీపీ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దళారుల్లో కలవరం మొదలైంది. ఈ విషయమై మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ రాధాకృష్ణను వివరణ కోరగా తాను విధుల్లో చేరి ఆరు నెలలు మాత్రమే అయిందన్నారు. తాను వచ్చిన తర్వాత అలాంటి దస్తావేజులు రాలేదని, తాను రాకముందు అవి జరిగాయని తెలిపారు. అసైన్డ్ లంక భూముల రిజిస్ట్రేషన్ల విషయాలు తనకేమీ తెలియదన్నారు. -
చంద్రబాబు – నారాయణపై విచారణకు బ్రేక్ 4 వారాలు ‘స్టే’
సాక్షి, అమరావతి: అమరావతి భూ కుంభకోణానికి సంబంధించి అసైన్డ్ భూముల బదలాయింపు వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో విచారణతో పాటు తదుపరి చర్యలపై హైకోర్టు తాత్కాలికంగా ‘స్టే’ విధించింది. సీఆర్డీఏ చట్టం కింద చేపట్టిన చర్యల విషయంలో ప్రభుత్వం, అధికారులు, అథారిటీలకు వ్యతిరేకంగా ఎలాంటి సూట్ దాఖలు చేయడం గానీ, ప్రాసిక్యూట్ చేయడంగానీ చేయరాదంటూ సీఆర్డీఏ చట్టం సెక్షన్ 146లో నిషేధం ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో సీఐడీ విచారణార్హతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయంది. ఈ ప్రశ్నలను తేల్చేంత వరకు, ప్రస్తుతం ఉన్న ప్రాథమిక ఆధారాలను బట్టి చంద్రబాబు, నారాయణలపై సీఐడీ నమోదు చేసిన కేసులో నాలుగు వారాల పాటు స్టే విధిస్తున్నట్లు తెలిపింది. ప్రాసిక్యూషన్‌పై సెక్షన్ 146 నిషేధం విధిస్తున్న నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారంపై లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. సీఐడీ, ఫిర్యాదుదారు ఆళ్ల రామకృష్ణారెడ్డిని కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్ 16వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయమూర్తి చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు ఆధారంగా సీఐడీ తమపై నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు, నారాయణ హైకోర్టులో వేర్వేరుగా క్వాష్ పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, నారాయణ తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ జాస్తి నాగభూషణ్ వాదనలను వినిపించారు. కక్ష సాధింపులో భాగం.. ప్రభుత్వ పెద్దలు వరుసగా పిటిషనర్లపై దాడులు చేస్తున్నారని, ఇప్పుడు సీఐడీతో కేసులు నమోదు చేయించారని సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి వాదనలు వినిపించారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో చంద్రబాబుపై ఒక కేసు (ఓటుకు కోట్లు) వేశారని, అది సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ కేసు నమోదైందన్నారు. రాజధాని భూ సమీకరణలో అసైన్డ్ భూములను చేరుస్తూ జారీ చేసిన జీవో 41 విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకే జీవో జారీ అయిందన్నారు. సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ 146 ప్రకారం ప్రాసిక్యూషన్‌పై నిషేధం ఉందన్నారు. చంద్రబాబు నుంచి ఆదేశాలు.. అసైన్డ్ భూములను భూ సమీకరణలో భాగం చేయాలని మంత్రి మండలి నిర్ణయం తీసుకోకముందే నిర్ణయించారని అదనపు ఏజీ నాగభూషణ్ న్యాయస్థానానికి నివేదించారు. టీడీపీ వారికి లబ్ధి చేకూర్చాలనే ఇలా చేశారని వివరించారు. గుంటూరు జిల్లా నవులూరులో 70 ఎకరాల అసైన్డ్ భూమి తీసుకుని ప్లాట్ల పంపిణీని మాత్రం 105 ఎకరాల మేర చేశారని, ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు. వారికి కావాల్సిన వారికి మరో 35 ఎకరాల మేర లబ్ధి చేకూర్చారన్నారు. మిగిలిన చోట్ల కూడా ఇలాగే జరిగిందన్నారు. తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారన్నారు. అప్పటి తహసీల్దార్ అన్నే సుధీర్‌బాబు పాత్రపై విచారణ జరుగుతోందని కోర్టు దృష్టికి తెచ్చారు. అసైన్డ్ భూముల బదలాయింపులో చంద్రబాబు, నారాయణలకు సంబంధం ఉందని, వారి ఆదేశాల మేరకే జీవో 41 జారీ అయిందన్నారు. ఇదే విషయాన్ని రూఢీ చేస్తూ అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ సీఆర్పీసీ సెక్షన్ 161 కింద వాంగ్మూలం కూడా ఇచ్చారని నివేదించారు. ఈ వ్యవహారానికి సంబంధించి నోట్ ఫైళ్లు, అడ్వొకేట్ జనరల్ సలహాలు లేవన్నారు. జీవో 41 వల్ల అసైనీలు మాత్రమే కాకుండా సీఆర్డీఏ, ప్రభుత్వం కూడా నష్టపోయిందన్నారు. సదుద్దేశ చర్యలకే సెక్షన్ 146 నిషేధం వర్తిస్తుంది... ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్ రాయ్ స్పందిస్తూ.. సీఆర్‌ఏడీ చట్టం సెక్షన్ 146 కింద ప్రాసిక్యూషన్‌పై నిషేధం ఉంది కదా? అని ప్రశ్నించారు. దీనిపై ఏజీ నాగభూషణ్ సమాధానమిస్తూ సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలకే అది వర్తిస్తుందన్నారు. చంద్రబాబు, నారాయణ దురుద్దేశాలతో వ్యవహరించారని, కావాల్సిన వారికి లబ్ధి చేకూర్చాలనే జీవో 41 తెచ్చారన్నారు. వాదనల అనంతరం ఈ కేసులో నాలుగు వారాల పాటు స్టే విధిస్తున్నట్లు న్యాయమూర్తి ప్రకటించారు. అయితే విచారణపై స్టే కేవలం చంద్రబాబు, నారాయణకే వర్తిస్తుందా? లేక అధికారులతోపాటు ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న వారికి కూడా వర్తిస్తుందా? అని అదనపు ఏజీ భూషణ్ వివరణ కోరడంతో, ఈ కోర్టుకు చంద్రబాబు, నారాయణ మాత్రమే వచ్చారని, అందువల్ల ఈ ఉత్తర్వులు వారికి మాత్రమే వర్తిస్తాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. -
తుళ్లూరు ఎమ్మార్వో కేసులో ఊహించని పరిణామం
సాక్షి, అమరావతి: అనేక మలుపులు తిరుగుతున్న అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి దాఖలైన కేసులో ఎవరూ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తనపై సీఐడీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ అప్పటి తుళ్లూరు ఎమ్మార్వో అన్నే సుధీర్‌బాబు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌పై సోమవారం వాదనలు విని తీర్పును రిజర్వ్ చేసిన న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ గురువారం ఆకస్మాత్తుగా ఈ పిటిషన్‌ను రిలీజ్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. (దేశ చరిత్రలో తొలిసారి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం) ►రాజధానికి భూములిస్తే పరిహారం రాదంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందిన అసైన్డ్ భూములను అప్పటి అధికార పార్టీ నేతలకు కట్టబెట్టడంలో అప్పటి తుళ్లూరు ఎమ్మార్వో అన్నే సుధీర్‌బాబు, మరికొందరు సహకరించారంటూ సీఐడీ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ►ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సుధీర్‌బాబు మార్చి 23న హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు, ఆ మరుసటి రోజే సీఐడీ దర్యాప్తునకు సంబంధించిన తదుపరి చర్యలన్నింటిపై స్టే విధించింది. ►హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇవ్వడంపై విస్మయం వ్యక్తం చేసింది. అసాధారణ పరిస్థితులు ఉంటే తప్ప దర్యాప్తుపై స్టే ఇవ్వడం సరికాదని, దర్యాప్తును కొనసాగనివ్వాలని అభిప్రాయపడింది. ►వారంలో విచారణ జరిపి తేల్చాలని ఈ నెల 1న సుప్రీంకోర్టు హైకోర్టుకు సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఈ వ్యాజ్యం రోస్టర్ మేరకు జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ ముందు విచారణకు రాగా, ఈ నెల 12న ఇరుపక్షాల వాదనలు విని, తీర్పును రిజర్వ్ చేశారు. ►అయితే గురువారం ఈ పిటిషన్ జస్టిస్ రాయ్ ముందున్న కేసుల విచారణ జాబితాలో ‘ఫర్ బీయింగ్ మెన్షన్డ్’ శీర్షిక కింద లిస్ట్ అయింది. ఈ పిటిషన్‌ను తాను రిలీజ్ చేస్తున్నానని, దీనిని మరో న్యాయమూర్తికి నివేదించాలని రిజిస్ట్రీని ఆదేశించారు. దీనిపై పాలనా పరమైన నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఈ కేసు ఫైళ్లను ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఉంచాలని పేర్కొన్నారు. తీర్పు రిజర్వ్ చేసిన కేసును రిలీజ్ చేయడానికి గల కారణాలు నిర్దిష్టంగా తెలియరాలేదు. -
రూ.80 కోట్ల భూమికి ఎసరు
రెవెన్యూ అధికారుల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ప్రభుత్వ నిబంధనల్లోని లొసుగులను అడ్డం పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు. కీసర తహసీల్దార్ నాగరాజు,, మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేశ్ అవినీతి బాగోతం మరవకముందే.. తాజాగా సంగారెడ్డి జిల్లాలో మంగళవారం మరో భూబాగోతం వెలుగుచూసింది. కాసులకు కక్కుర్తి పడిన రెవెన్యూ అధికారులు.. ఏకంగా రూ. 80 కోట్ల విలువైన అసైన్డ్ భూమికి ఎసరు పెట్టారు. పైగా చనిపోయిన తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి కుట్రకు తెర తీశారు. ఎన్ఓసీ కోసం దరఖాస్తు పెట్టుకోవడంతో.. అనుమానం వచ్చి కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో ఈ అక్రమార్కుల గుట్టు రట్టయింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం.. ఈ కేసుకు సంబంధం ఉన్న ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ సహా మరొకరిపై సస్పెన్షన్ వేటు వేసింది. మరో ఆరుగురు ఉద్యోగులు, నలుగురు మాజీ సైనికులపై క్రిమినల్ చర్యలకు ఆదేశించింది. సాక్షి, సంగారెడ్డి/సంగారెడ్డి టౌన్: సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి గ్రామంలో సర్వే నంబరు 181లో అసైన్డ్ భూమి ఉంది. రాష్ట్ర రాజధానికి చేరువలో ఉన్న ఈ భూమి రూ.కోట్లలో విలువ చేస్తుండటంతో.. 2013లో జిన్నారంలో తహసీల్దార్‌గా పనిచేస్తున్న జి.నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ కె.నారాయణ, ఖాజీపల్లి వీఆర్ఓ జే.వెంకటేశ్వర్రావు తదితరుల కన్ను పడింది. అయితే.. అసైన్డ్భూమి మాజీ సైనికులకు కేటాయించే వెసులుబాటు ఉండటంతో.. తోట వెంకటేశ్వర్లు, ఉప్పు రంగనాయకులు, ఎన్.గంగాధర్‌రావు, ఎం.మధుసూదన్‌లను మభ్యపెట్టి రంగంలోకి దింపారు. పథకం ప్రకారం.. వీరు జిన్నారం తహసీల్ కార్యాలయంలో భూమి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఐదెకరాల చొప్పున నలుగురికి 20 ఎకరాల భూమిని అధికారులు కేటాయించారు. ప్రస్తుతం దాని విలువ రూ.80 కోట్లు ఉంది. అయితే.. మాజీ సైనికులు, రెవెన్యూ అధికారుల మధ్య ఏ మేరకు ఒప్పందం జరిగిందో ఇంకా తెలియాల్సి ఉంది. మృతి చెందిన తహసీల్దార్ పేరుతో నకిలీ పట్టాలు అసైన్డ్ భూమిని తాము నేరుగా కేటాయిస్తే ఇరుకున పడతామనే ఉద్దేశంతో అప్పటి తహసీల్దార్ తదితరులు పకడ్బందీ వ్యూహం రచించారు. ఇందుకుగాను 2010 కంటే ముందు జిన్నారంలో పనిచేసి మృతి చెందిన తహసీల్దార్ పరమేశ్వర్ సంతకంతో పాస్ పుస్తకాలు ఇవ్వాలని పథక రచన చేశారు. ఈ మేరకు నోట్ కూడా తయారు చేశారు. తాము ఎంపిక చేసిన నలుగురు మాజీ సైనికులకు ఒక్కొక్కరికి ఐదు ఎకరాల చొప్పున మొత్తం 20 ఎకరాలు.. మృతి చెందిన తహసీల్దార్ ఫోర్జరీ సంతకాలతో నకిలీ పట్టాలను సృష్టించారు. అయితే.. ఎవరికీ అనుమానం రాకుండా 2007 నుంచి పహాణీ మొదలుకొని ఇందుకు సంబంధించిన అన్ని భూ రికార్డులు మాజీ సైనికుల పేర్లతో ఉన్నట్లుగా రికార్డులలో దిద్దడం చేశారు. నిందితులపై క్రిమినల్ చర్యలు జిన్నారం మండలం భూ బాగోతంతో సంబంధం ఉన్న ఎనిమిది మంది రెవెన్యూ అధికారులు, నలుగురు మాజీ సైనికులపై చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో జిన్నారం తహసీల్దార్‌గా పనిచేసి.. ప్రస్తుతం కామారెడ్డి ఆర్డీఓ నరేందర్, అప్పటి డిప్యూటీ తహసీల్దార్ నారాయణలను సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే.. వీఆర్వో వెంకటేశ్వర్ రావు, ఆర్ఐ విష్ణువర్ధన్, సర్వేయర్ లింగారెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఈశ్వరప్ప, సూపరింటెండెంట్ సహదేవ్, 2019లో సంగారెడ్డి ఆర్డీఓపై కూడా శాఖాపరమైన, క్రిమినల్ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మాజీ సైనికులు వెంకటేశ్వర్లు, ఉప్పు రంగనాయకులు, ఎన్ గంగాధర్‌రావు, ఎం మధుసూదన్‌లకు కేటాయించిన అసైన్డ్ పట్టాలను కూడా రద్దు చేయడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గుట్టు రట్టయిందిలా.. మాజీ సైనికులకు కేటాయించినది అసైన్డ్ భూమి కావడంతో ఎన్ఓసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికెట్) అవసరమైంది. ఎవరికైనా అసైన్డ్ భూమి కేటాయించిన పదేళ్ల తర్వాత వారికి ఈ భూమికి సంబంధించి యాజమాన్య హక్కులు (అమ్ముకోవడానికి వీలుగా) లభిస్తాయి. దీం తో 2019లో వారు ఎన్ఓసీకి దరఖాస్తు చేసుకున్నారు. కలెక్టర్‌కు పంపిన ఫైళ్లలో రెవెన్యూ అధికారులు రాసుకు న్న ప్లాన్ పేపర్ (నోట్) కూడా ఉంది. దీంతో కలెక్టర్ హనుమంతరావుకు అనుమానం వచ్చింది. వెంటనే మైనార్టీ సంక్షేమ అధికారి తిరుపతిరావును విచారణ అధికారిగా నియమించారు. పూర్తి విచారణ అనంతరం.. అప్పట్లో జిన్నారం తహసీల్దార్‌గా పనిచేసిన, ప్రస్తుత కామారెడ్డి ఆర్డీఓ జి.నరేందర్, డిప్యూటీ తహసీల్దార్ కె.నారాయణ, వీఆర్వో వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడింది నిజమేనంటూ నివేదిక ఇచ్చారు. ఈ నివేదికను కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించారు. అక్రమాలు వాస్తవమే జిన్నారం మండలం ఖాజీపల్లి సర్వే నం.181లో అసైన్డ్ భూమి ఉన్నమాట వాస్తవమే. చనిపోయిన తహసీల్దార్ పరమేశ్వర్ సంతకం ఫోర్జరీ అయినట్లు అనుమానంతో విచారణకు ఆదేశించా. దీంతో అసలు విషయం బయటపడింది. నలుగురు మాజీ సైనికులకు కేటాయించిన 20 ఎకరాల భూమిని ప్రస్తుతం సుమారుగా రూ.80 కోట్లు విలువ చేస్తుంది. – హనుమంతరావు, కలెక్టర్, సంగారెడ్డి -
అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ !
సాక్షి, హైదరాబాద్: అన్యాక్రాంతమైన అసైన్డ్భూములను క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. నిరుపేదల జీవనోపాధి నిమిత్తం పంపిణీ చేసిన భూములు చేతులు మారితే.. వారికి యాజమాన్య హక్కులు కల్పించేదిశగా యోచిస్తోంది. ఈ మేరకు చట్ట సవరణ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. అయితే, అసైన్డ్‌దారు నుంచి పరాధీనమైన భూములను పీవోటీ చట్టం కింద వెనక్కి తీసుకున్న తర్వాతే భూముల ను క్రమబద్ధీకరించనుంది. అసైన్మెంట్ నిబంధనల ప్రకారం అసైన్డ్ భూముల క్రయ విక్రయాలు చెల్లవు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 24 లక్షల ఎకరాల మేర భూములను పేదలకు పంపిణీ చేయగా.. ఇందులో సుమారు 2.41 లక్షల ఎకరాల వరకు ఇతరుల గుప్పిట్లోకి వెళ్లినట్లు రెవెన్యూశాఖ తేల్చింది. పట్టణీకరణతో అసైన్డ్ భూముల్లో ఇళ్లు వెలిశాయి. కొన్ని చోట్ల బడాబాబులు, సంపన్నవర్గాల చేతుల్లోకి వెళ్లి ఫాంహౌస్, విలాసకేంద్రాలుగా మారిపోయాయి. అర్హులుగా తేలితేనే రీఅసైన్ అసైన్డ్‌దారుల నుంచి కొనుగోలు చేసినవారిలో అసైన్మెంట్ చట్ట ప్రకారం అర్హులుగా తేలితే(భూమిలేని పేదలైతే) వారికి రీఅసైన్ చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ) పరిధిలో గాకుండా ఇతరచోట్ల 2017 నుంచి ఈ విధానాన్ని అమలు చేస్తోంది. అయితే, అసైన్డ్‌దారుల నుంచి కొనుగోలు చేసినవారు దారిద్య్రరేఖకు ఎగువన ఉంటే వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది. ఒకవేళ ఆర్థిక సమస్యలతో భూములను అమ్ముకున్న అసైనీలు భూమిలేని పేదలైతే మాత్రం పీవోటీ చట్టం కింద స్వాధీనం చేసుకున్న భూమిని తిరిగివారికే కేటాయిస్తారు. ఒకవేళ కొనుగోలు చేసిన వారు ఈ చట్టానికి అర్హులుగా లేకపోతే మాత్రం రుసుం చెల్లించి క్రమబద్ధీకరించుకోవాల్సివుంటుంది. అది కూడా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటేనే. కాలనీలు.. కాసులు! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలను 20 ఏళ్ల తర్వాత విక్రయించుకునే అవకాశం కల్పించింది. ఇదే తరహాలోనే మన రాష్ట్రంలోనూ ఇతరుల చెరలో ఉన్న భూముల క్రమబద్ధీకరించడం ద్వారా భారీగా ఆదాయం రాబట్టుకోవడమేగాకుండా.. భూమి యజమాన్యహక్కులను కల్పించవచ్చని ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ జీవోల ద్వారా ఆక్రమిత ప్రభుత్వ స్థలాలను క్రమబద్ధీకరిస్తున్న సర్కారు అసైన్డ్ భూముల్లో వెలిసిన స్థలాలను రెగ్యులరైజ్ చేయడం లేదు. ఇన్నాళ్లూ రిజిస్ట్రేషన్లు జరిగినా.. కొత్త చట్టం ప్రకారం ఎల్ఆర్ఎస్ తప్పనిసరి చేయడం, ప్రభుత్వ భూముల జాబితాలో ఉండడంతో మరింత కష్టంగా మారనుంది. ఈ నేపథ్యంలో కాలనీలుగా వెలిసిన అసైన్డ్ భూములను క్రమబద్ధీకరిస్తే ఖజానాకు కాసుల వర్షం, ప్రజలకు ఊరట లభిస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ మేరకు త్వరలోనే చట్ట సవరణ చేయాలని భావిస్తున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. -
రాజధాని భూ కుంభకోణం: కీలక అరెస్టులు
-
రాజధాని భూ కుంభకోణం: ఇద్దరికి రిమాండ్
సాక్షి, అమరావతి: గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న రాజధాని భూ కుంభకోణంలో ఇద్దరు కీలక వ్యక్తులను సీఐడీ బుధవారం అరెస్టు చేసింది. అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన గుమ్మడి సురేశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుంది. విజయవాడకు చెందిన సురేశ్.. దళితులు సాగుచేసుకుంటున్న అసైన్డ్ భూములను నిబంధనలకు విరుద్ధంగా కొనుగోలు చేసిన నేపథ్యంలో అతడిని అరెస్టు చేశారు. అదే విధంగా భూ రికార్డుల తారుమారు వ్యవహారంలో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న తుళ్లూరు రిటైర్డ్ తహసిల్దార్ సుధీర్ బాబును కూడా అరెస్టు చేశారు. ఈ క్రమంలో వీరిద్దరిని మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా.. ఈ నెల 29 వరకు న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో సురేశ్, సుధీర్ బాబును గుంటూరులోని జైలుకు తరలించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత సన్నిహితంగా మెలిగిన సుధీర్ బాబు.. టీడీపీ నాయకులతో కలిసి రికార్డులు తారుమారు చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కాగా అమరావతి ల్యాండ్ పూలింగ్‌లో అక్రమాలు, తప్పుడు రికార్డులు సృష్టించిన నేపథ్యంలో సీఆర్డీఏ నెక్కల్లు డిప్యూటీ కలెక్టర్ కనికెళ్ల మాధురిని పోలీసులు ఇదివరకే అరెస్టు చేసిన విషయం తెలిసిందే.(డిప్యూటీ కలెక్టర్ మాధురి అరెస్ట్) -
ఇన్సైడర్ ట్రేడింగ్: ఐటీ చీఫ్ కమిషనర్‌కు ఏపీ సీఐడీ లేఖ
-
చీఫ్ కమిషనర్‌కు ఏపీ సీఐడీ లేఖ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ నేర పరిశోధన విభాగం(సీఐడీ) అడిషనల్ డైరెక్టర్ పీవీ సునీల్ కుమార్ అమరావతి అసైన్డ్ భూముల కొనుగోలుపై విచారణ చేయాలని కోరుతూ ఐటీ చీఫ్ కమిషనర్‌కు శనివారం లేఖ రాశారు. లేఖతో పాటు 106 మంది 2018 నుంచి 2019 వరకు కొనుగోలు చేసిన భూములపై విచారణ జరపాలని ఆయన లేఖలో పేర్కొన్నారు. రూ. 2లక్షలకు మించి జరిగిన లావాదేవీలపై విచారణ చేపట్టాలని ఐటీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఐటీ చట్టాలను ఉల్లంఘిస్తూ అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోలులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 106 మంది అసైన్డ్ భూముల కొనుగోలులో ఉన్న వ్యక్తుల వివరాలు, భూముల సర్వే నెంబర్లు, అడ్రసుతో సహా పూర్తి వివరాలను ఎక్సెల్ షీట్లో చీఫ్ కమిషనర్‌కు లేఖతో పాటే పంపించారు. ఇన్సైడర్ ట్రేడింగ్; ఏడుగురిపై కేసు కాగా 2018-2019 మధ్య జరిగిన అసైన్డ్ భూముల కొనుగోలు ట్రాన్సాక్షన్లపై విచారణ చేపట్టేందుకు ఐటీ అధికారులు రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుపై సీఐడీ విచారణను వేగవంతం చేసింది. కాగా ఈ కేసులో టీడీపీ మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పి.నారాయణలతో పాటు పలువురిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో ఐదుగురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. -
అసైన్డ్ భూములపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
సాక్షి, అమరావతి: సీఆర్డీఏ పరిధిలోని రాజధాని అసైన్డ్ భూములకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసి ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన అసైన్డ్ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపు రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో అసలైన అసైన్డ్ దారులకు ప్రభుత్వ నిర్ణయం భారీ ఊరటనిచ్చింది. అసలైన అసైన్డ్‌దారులకు నివాస, వాణిజ్య ప్లాట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ నిర్ణయించింది. ఫిబ్రవరి 17,2016న జీఓఎంఎస్ –41 ప్రకారం ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చిన అసైన్డ్ భూములకు రెసిడెన్షియల్, కమర్షియల్ ప్లాట్ల కేటాయింపు రద్దు చేస్తూ... ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్)–1977 నాటి చట్టాన్ని ఉల్లంఘించారన్న మంత్రివర్గం..అసలైన అసైన్డ్‌దారులకు రెసిడెన్షియల్, కమర్షియల్‌పాట్లు కేటాయించాలని నిర్ణయించింది. కాగా గత ప్రభుత్వ నిర్ణయంతో అసలైన అసైన్డ్ దారులకు నష్టం కలిగిన విషయం తెలిసిందే. కేబినెట్ కీలక నిర్ణయాలు బుధవారం సాయంత్రం సమావేశమైన మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. మహిళలు, చిన్నారులకు అండగా చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఇటీవల ‘దిశ’ సహా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఘటనల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. (ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్ పేరుతో కొత్త చట్టం)ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం 2019 ( ఏపీ దిశ యాక్ట్) మరియు ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కోర్టు ఫర్ స్పెసిఫైడ్ అఫెన్సెస్ అగైనిస్ట్ విమెన్ అండ్ చిల్ట్రన్ యాక్ట్ 2019కి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయాలపై సమీక్ష, పర్యవేక్షణలకు బలోపేతమైన యంత్రాగం ఏర్పాటు చేయడానికి కొత్త శాఖ ఏర్పాటుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.సకాలంలో లక్ష్యాలను సాధించడానికి ఇతర శాఖలతో సమన్వయం చేసుకునే దిశగా అడుగులు వేసింది. ఉద్యోగులను సమర్థవంతంగా వినియోగించుకోవడంతోపాటు వారిలో లక్ష్యాలపై స్పష్టత తీసుకురావడం, భాగస్వామ్యంద్వారా మెరుగైన ఫలితాలు రాబట్టడమే ఉద్దేశంతో కొత్త శాఖను ఏర్పాటు చేసింది. ప్రభుత్వంలో ఏపీఎస్ ఆర్టీసీ విలీనం కొరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏర్పాటుకు అనుమతి. రవాణా, రోడ్లు– రహదారులు–భవనాలశాఖలోనే ఈ విభాగం ఏర్పాటు కనుంది. ఏపీఎస్ ఆర్టీసీలో వివిధ కేటగిరీల్లో ఉన్న 51,488 మంది ఉద్యోగుల సంఖ్యకు తగినట్టుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పోస్టుల ఏర్పాటుకు కేబినెట్ అంగీకరించింది. ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవల కొనసాగనున్నాయి. కాపు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసుల ఉపంసహరణకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. తుని ఘటన సహా కాపు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసుల ఉపసంహరణకు ఆమోదం తెలిపింది. అలాగే భోగాపురం భూసేకరణ సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని నిర్ణయం వైఎస్సార్ పెన్షన్ కానుక మార్గదర్శకాలకు మంత్రివర్గం ఆమోదంతో పాటు గతంలో ఉన్న మార్గ దర్శకాలను సవరించిన సవరించింది. గ్రామీణ ప్రాంతాల్లో నెల ఆదాయం రూ.10వేల లోపు, పట్టణ ప్రాంతాల్లో రూ.12లోపు ఆదాయం ఉన్నవారికి వైఎస్సార్ పెన్షన్ కానుక వర్తించనుంది. గతంలో కన్నా.. నెలవారీ ఆదాయపరిమితి పెంపు. మూడు ఎకరాల పల్లం లేదా, 10 ఎకరాల్లోపు మెట్ట లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉన్నవారికి వైఎస్సార్ పెన్షన్ కానుక వర్తిస్తుంది. సొంతంగా కారు ఉన్నవారు అనర్హులు. ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు ఉన్నవారికి మినహాయింపు. పట్టణ ప్రాంతాల్లో 750 చదరపు అడుగుల్లోపు ఇల్లు ఉన్నవారు అర్హులు. కుటుంబంలో ఆదాయపు పన్ను చెల్లించేవారు అనర్హులు. ఆంధ్రప్రదేశ్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. రూ. 101 కోట్లతో షేర్ క్యాపిటల్‌తో ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ మిల్లెట్‌బోర్డు చట్టం 2019 ముసాయిదాకు కేబినెట్ ఆమోదం. కరవు, వర్షభావ ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగును పెంచేందుకు బోర్డు ఏర్పాటు. చిరుదాన్యాల బోర్డులు ఏర్పాటు ముసాయిదా బిల్లులకు ఆమోదం. అలాగే ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రుణ పరిమితి మరో రూ.3వేల కోట్లు పెంచేందుకు అంగీకారం. ప్రస్తుతం ఉన్న పరిమితి రూ.22వేల కోట్లు ఇక ఆంధ్రప్రదేశ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ సవరణ ముసాయిదా బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే అక్రమంగా మద్యాన్ని తయారు చేసినా, విక్రయించినా, రవాణా చేసినా కఠిన శిక్షలకు ఉద్దేశించిన బిల్లు ముసాయిదాకు మంత్రివర్గం ఆమోదించింది. ఈ నేరాలను నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తున్న బిల్లు. 6నెలల నుంచి ఐదేళ్ల వరకూ జైలు శిక్ష. మొదటిసారి పట్టుబడితే జరిమానా రూ.2 లక్షలు, రెండోసారి పట్టుబడితే జరిమానా రూ.5 లక్షలు.బార్లలో మద్యం అక్రమాలకు పాల్పడితే లైసెన్స్ ఫీజు కన్నా 2 రెట్లు జరిమానా, రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్ రద్దు. ఆంధ్రప్రదేశ్ టాక్స్ ఆన్ ప్రొఫెషన్స్, ట్రేడ్స్, కాలింగ్స్ అండ్ ఎంప్లాయిమెంట్ అమెండమెంట్ బిల్ –2019కు కేబినెట్ అంగీకారం తెలిపింది. అలాగే వీఓఏ, సంఘమిత్ర, యానిమేటర్ల జీతాల పెంపుదలకు మంత్రివర్గం అంగీకారం. వారికి రూ.10వేల చొప్పున జీతాలు పెంచుతూ ఇటీవలే నిర్ణయం. తాజా నిర్ణయంతో 27,797 మందికి లబ్ధి. ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సొసైటీస్ (ఏపీసీఎస్) చట్టం 1964లో సెక్షన్ 21–ఎ (1) (ఇ) సవరణకు ఆమోదం. చిత్తూరుజిల్లా ఏర్పేడు మండలం పంగూరు గ్రామంలో 15 ఎకరాల 28 సెంట్ల భూమి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి కేటాయింపునకు అంగీకారం. అన్ని పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు తప్పనిసరిచేస్తూ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 6వ తరగతి వరకూ ఇంగ్లిషు మాధ్యమంలో బోధన.తదుపరి సంవత్సరాల్లో ఒక్కో ఏడాది ఒక్కో తరగతి చొప్పున ఇంగ్లిషు మాధ్యమంలో బోధన తప్పనిసరి. ఏపీ స్టేట్ యూనివర్శిటీ యాక్ట్‌లో సవరణలతో పాటు, వైఎస్సార్ జిల్లాలో వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు. యూనివర్శిటీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, కాలేజ్ ఆఫ్‌ఫైన్ ఆర్ట్స్ ఏర్పాటు. రెండు కాలేజీల్లో ఐదు విభాగాలు. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ లేదా ఆయనచే నియమించబడిన వ్యక్తి అన్ని యూనివర్శిటీల్లో ఎక్స్ అఫీషియో సభ్యుడిగా నియామకానికి ఆమోదం తెలిపింది. అలాగే కర్నూలులో క్లస్టర్ యూనివర్శిటీ ఏర్పాటుకు నిర్ణయం. సిల్వర్ జూబ్లీ డిగ్రీకాలేజీ, కేవీఆర్ గవర్నమెంట్ డిగ్రీకాలేజీ, గవర్నమెంట్ డిగ్రీకాలేజీలను విలీనం చేస్తూ క్లస్టర్ యూనివర్శిటీగా ఏర్పాటు చేసేందుకు ఆమోదం. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక విభాగం కమిషన్ ఛైర్మన్ గా వంగపండు ఉష నియామకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. -
దళిత ద్రోహి చంద్రబాబు
తుళ్లూరు: రాజధాని అసైన్డ్ భూముల రైతులకు తీరని అన్యాయం చేసిన మాజీ సీఎం చంద్రబాబు దళిత ద్రోహిగా మిగిలిపోతారని రాజధాని ప్రాంత అసైన్డ్ భూముల రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాజధాని గ్రామమైన రాయపూడిలోని సీడ్ యాక్సెస్ రహదారిపై వారు సమావేశమయ్యారు. రాజధానిలో చంద్రబాబు పర్యటనను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు, జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమను తీవ్రంగా మోసగించి.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని రాజధానికి వస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని ప్రకటించాక అసైన్డ్ భూములకు ఏడాది పాటు ప్యాకేజీ, కౌలు చెక్కులు ఇవ్వకుండా టీడీపీ నేతలు, బినామీలతో తప్పుడు ప్రచారాలు చేయించి తమను భయాందోళనలకు గురి చేశారన్నారు. అసైన్డ్ భూములను కారుచౌకగా కొనుగోలు చేశాకే ప్రభుత్వం తమ భూములకు పరిహారం ప్రకటించిందని గుర్తు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా రాజధానిలో 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని నిధులు ఎందుకు విడుదల చేయలేదో చెప్పాలన్నారు. ఇప్పటికైనా తప్పు చేశానని క్షమాపణ చెప్పాలని లేదంటే చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. -
అసైన్డ్ భూములు హాంఫట్
సాక్షి, పటాన్చెరు: నియోజకవర్గంలో భూముల విలువ అమాంతంగా పెరిగిపోతుంది. దీంతో అక్రమార్కుల కన్ను అసైన్డ్ భూములపై పడింది. అధికారుల నిర్లక్ష్యంతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. పటాన్‌చెరుమండలం పరిధిలోని చిట్కుల్, ముత్తంగి గ్రామాల శివారులోని అసైన్డ్ భూములను దర్జాగా కబ్జా చేసినా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. రెండు గ్రామాల శివారులో ఉండటం మూలంగా కబ్జాదారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ముత్తంగి పరిధిలోని సర్వేనెంబర్ 540లో ఉన్న అసైన్డ్ భూమిని చిట్కుల్ పరిధిలోని ఓ వెంచర్లో కలుపుకొని దస్తావేజులను సృష్టించారు. ఇక ఆ దస్తావేజులతో ముత్తంగి పంచాయతీ నుంచి ఇంటి నెంబర్లు తీసుకుని రెండెకరాల భూమిని దర్జాగా కబ్జా చేశారు. ఆ భూముల క్రయవిక్రయాలు నిర్వహిస్తున్నారు. దాదాపు ఆ స్థలం విలువ రూ.12 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఆ భూమిని కాపాడాలని ముత్తంగిలోని స్థానికులు కొందరు రెవెన్యూ, పంచాయతీ అధికారులను కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇటీవలె ముత్తంగిలో నిర్వహించిన ఓ గ్రామ సభలో ఈ అంశం వెలుగులోకి వచ్చింది. స్థానిక కార్యదర్శిని ప్రజలు నిలదీశారు. పట్టా భూములకే ఇంటి నిర్మాణాలకు అనుమతులు దొరకడం లేదని కాని అసైన్డ్ భూమికి ఇంటినెంబర్లు ఎలా వచ్చాయంటూ వారు నిలదీశారు. అయితే స్థానిక కార్యదర్శి మాత్రం తనకే సంబంధం లేదని చేతులెత్తేశారు. వాస్తవానికి గ్రామ హద్దురాళ్లు ఇతర ఆనవాళ్లను బట్టి ఆ భూమి ముత్తంగిదేనని స్థానిక గ్రామ పెద్దలు స్పష్టం చేస్తున్నారు. కానీ ఆ అసైన్డ్ భూమిని కబ్జా చేసిన వ్యక్తులు చిట్కుల్ నుంచి అనుమతులు పొందారని అధికారులు చెప్తున్నారు. అధికారులు కూడా తమ ప్రైవేటు సంభాషణల్లో అసైన్డ్ భూమి అన్యాక్రాంతం అయ్యిందని ఒప్పుకుంటున్నారు. అయితే ఓ వెంచర్ నిర్వాహకులు ఆ భూమిని తమ పరిధిలోకి చేర్చుకొని దానికి ఇంటి నెంబర్ పొందారని చెప్తున్నారు. సర్వే నెంబర్ 540లో దుంపల్లి విఠలయ్య, పిచ్చకుంట్ల లక్ష్మయ్యకు దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణం అసైన్డ్ భూములు ఉన్నాయి. దుంపల్లి విఠలయ్య మృతి చెందారు. ఆయన సతీమణి సుగుణమ్మ పేరు మీద నేటికీ పాస్‌బుక్‌లు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. చర్యలు తీసుకుంటాం రెండు గ్రామాల పరిధిలోని అసైన్డ్ భూమి ఉందనే అంశంపై సర్వే చేయించి తగిన చర్యలు తీసుకుంటాం. అసైన్డ్ భూములను అమ్ముకోవడం, కొనడం నేరం. పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. – యాదగిరిరెడ్డి, తహసీల్దార్,పటాన్చెరు ఇంటి నంబర్లు ఇవ్వలేదు అసైన్డ్ భూమి ఏ గ్రామ పరిధిలో ఉందనేది తేల్చాల్సి ఉంది. ఆ భూమిలోని ఇళ్లకు ఈ పంచాయతీ నుంచి ఇంటి నంబర్ ఇవ్వలేదు. రెవెన్యూ అధికారులు ఆ భూమి ఏ పంచాయతీ పరిధిలోకి వస్తుందో తేల్చితే తప్ప చర్యలు తీసుకోలేం. – కిషోర్, గ్రామ కార్యదర్శి, ముత్తంగి అలాంటిది మా దృష్టికి రాలేదు మా దృష్టికి అలాంటి అంశం రాలేదు. వివరాలు తెలుకొని చర్యలు తీసుకుంటాం. నా హయాంలో ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదు. గతంలో జరిగి ఉంటుందని భావిస్తున్నాం. –సంజయ్, కార్యదర్శి చిట్కుల్ -
‘అసైన్డ్’ లెక్కేంటి?
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూముల చిట్టాను రాష్ట్ర ప్రభుత్వం వెలికితీస్తోంది. నిరుపేదలకు వివిధ దశల్లో కేటాయించిన భూముల వివరాలను రాబడుతోంది. 1954 నుంచి ఇప్పటివరకు పంపిణీ చేసిన భూమి, లబ్ధిదారుల జాబితాను సేకరి స్తోంది. సామాజికవర్గాలవారీగా జరిగిన కేటాయింపుల సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్లో పంపాలని స్పష్టం చేసింది. ఈ మేరకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లకు లేఖ రాశారు. పేదలు జీవనోపాధి పొందేం దుకు ఐదెకరాల్లోపు భూములను ప్రభుత్వం అసైన్మెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే చాలా చోట్ల ఈ భూములు చేతులు మారాయి. భూముల విలువలు గణనీయంగా పెరగడంతో పరాధీనమయ్యాయి. వాస్తవానికి అసైన్మెంట్ చట్టం ప్రకారం ఈ భూముల క్రయవిక్రయాలు చెల్లవు. కానీ ఈ నిబంధనలను తోసిరాజని అనేకచోట్ల ఈ భూములు అన్యాక్రాంతమయ్యాయి. ప్రజాప్రతినిధులు, బడాబాబులు కారుచౌకగా లభించే ఈ భూములను కొల్లగొట్టారు. ఒకవేళ అసైనీ (లబ్ధిదారు) చేతి నుంచి భూమి మారితే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది పని ఒత్తిడో లేక చేతివాటమో తెలియదు కానీ ఇలా పక్కదారి పట్టిన భూములను వెనక్కి తీసుకోవ డం నామమాత్రమే. 2005లో కాస్తోకూస్తో ఇలా చేతులు మారిన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. గతేడాది అసైన్మెంట్ భూములు కొనుగోలు చేసిన వారికి కూడా వెసులుబాటు కల్పించడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. భూమిలేని పేదలు ఈ భూములను కొంటే వారి పేరిట అసైన్ చేసేందుకు సర్కారు అంగీకరించింది. 1954 నుంచి గత నెల 31 వరకు జరిగిన భూ పంపిణీ సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎనిమిది విడతల్లో భూ కేటాయింపులు జరగ్గా ఎంత మంది లబ్ధిదారులకు ఎంత విస్తీర్ణంలో భూములు అసైన్ చేశారో నిర్దేశిత ఫార్మాట్లో మూడు రోజుల్లో పంపాలని స్పష్టం చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, ఇతరులకు పంపిణీ చేసిన భూమి ఎంత? అయా భూముల్లో పోజిషన్లో ఉన్న లబ్ధిదారులు ఎందరు? ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా క్రమబద్ధీకరించిన విస్తీర్ణం ఎంత? ప్రజావసరాల కోసం సేకరించినది.. ప్రభుత్వానికి స్వచ్ఛందంగా అప్పగించినది, చట్టాన్ని ఉల్లంఘించడంతో వెనక్కి తీసుకున్న భూ విస్తీర్ణమెంతో లెక్క తేల్చాలని ఆదేశించింది. అలాగే అసైనీల అధీనంలో ఉన్న భూమి వివరాలను పంపాలని సూచించింది. ఈ లెక్కల అనంతరం అసైన్డ్ భూములపై స్పష్టత వస్తుందని తద్వారా ప్రభుత్వ భూముల వివరాలు కూడా తేలుతాయని అంచనా వేస్తున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఐదెకరాల్లోపు క్రమబద్ధీకరణ? అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించే దిశగా ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐదెకరాల్లోపు భూములను క్రమబద్ధీకరించే వెసులుబాటు కల్పించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం..లబ్ధిదారులకు యాజమాన్య హక్కును కల్పించ వచ్చని భావిస్తున్నట్లు రెవెన్యూ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పట్టాదార్ పాస్‌పుస్తకం జారీ చేయడం ద్వారా ఆ భూమిపై అప్పులు పొందడం సులభతరంగా మారుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు చేతులు మారిన భూములను వెనక్కి తీసుకోవడమే కాకుండా.. ఆయా భూముల్లో పాగా వేసిన వారి పేరిట క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఈ కేటగిరీ భూములను మార్కెట్ రేటుకు అటుఇటుగా అమ్మే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అసైన్డ్ భూముల లెక్క తేలాక గ్రేటర్, పట్టణ సంస్థల్లో ఇలాంటి భూముల్లో వెలిసిన కట్టడాలను కూడా క్రమబద్ధీకరించడం ద్వారా ఇబ్బడిముబ్బడిగా ఆదాయం వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆలోచన చాన్నాళ్లుగా ఉన్నప్పటికీ ఈ ముసుగులో భూదందాలు జరిగితే నిలువరించడం కష్టమనే భావనతో ఎప్పటికప్పుడు వెనక్కి తగ్గుతోంది. -
భూఫలహారం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఒకటి కాదు, రెండు కాదు... ఏకంగా 358 ఎకరాల సర్కారు భూమి. 20 ఏళ్ల క్రితం వరకు ప్రభుత్వం ఆధీనంలోనే ఉన్న ఈ భూమి అసైన్డ్ రూపంలో కనుమరుగవడం మొదలైంది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్‌కు సమీపంలో ఉన్న 476 సర్వే నంబర్లోని ఈ భూమి గత కొన్నేళ్లుగా ఎక్కడికక్కడ కబ్జాకు గురైంది. ఇళ్ల నిర్మాణం కోసం ‘ఏదోలా’ గుంట, గుంటన్నరకు పట్టాలు తెచ్చుకోవడం.. దానికి రెండు మూడింతలు ఆక్రమించుకుని ప్రహరీలు నిర్మించుకోవడం పరిపాటిగా మారింది. దీంతో గత పదేళ్లలో ఈ భూమికి పెద్ద సంఖ్యలో ప్రైవేట్ యజమానులు తయారయ్యారు. అసైన్మెంట్ కమిటీతో సంబంధం లేకుండా తహసీల్దార్, స్థానిక ప్రజాప్రతినిధులు తలుచుకున్నదే తడువు... గుంటల కొద్దీ భూములకు పట్టాలు తయారయ్యాయి. రెండేళ్ల క్రితం వరకు సాగిన ఈ దందా అప్పటి కలెక్టర్ ఆదేశాలతో నిలిచిపోయినా తాజాగా మళ్లీ మొదలైంది. ఈ సర్వే నంబర్లోని 358 ఎకరాల భూమిలో కబ్జాలు పెరిగిపోయాయని, ఒకే కుటుంబం నుంచి నిబంధనలకు విరుద్ధంగా ఇతర సభ్యులకు సైతం అసైన్మెంట్లు జరిగాయని పెద్దపల్లి జాయింట్ కలెక్టర్‌కు సోమవారం ప్రజావాణిలో కొందరు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు స్పందించిన జేసీ పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని మండల తహసీల్దార్ సంపత్ ను ఆదేశించారు. దీంతో రెవెన్యూ అధికా రులు హుటాహుటిన ధర్మారం వెళ్లారు. సోమ, మంగళవారాల్లో మండల కేంద్రం లోనే భూరికార్డులను పరిశీలిస్తూ, అసైన్మెంట్, కబ్జా భూముల వివరాలను సేకరించే పనిలో పడ్డారు. 1998 నుంచే పందేరం సర్వే నంబర్ 476లోని 358.07 ఎకరాల ప్రభుత్వ భూమిలో 1998–99 సంవత్సరంలో వ్యవసాయ మార్కెట్ యార్డు సమీపంలో స్థానికులైన ఎనిమిది మందికి ఓ ప్రజాప్రతినిధి సిఫారసుతో గుంటన్నర చొప్పున స్థలాలను కేటాయించారు. అక్కడి నుంచి మొదలైన భూపందేరం ఆగలేదు. ఎవరైనా అడిగిందే తడువుగా ఈ ప్రభుత్వ భూమిలో గుంటల కొద్దీ రాసిచ్చేశారు. అర్హుల పేరిట గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తులు సర్కారు భూమిని ఆక్రమించుకున్నారు. భూమి లేని పేదలు, అనాథల పేరుతో కొందరు అనర్హులకు సైతం ఎకరాల చొప్పున కట్టబెట్టారు. ఒక కుటుంబంలో ఒకరికి భూమి లభించగానే, ఆయన దగ్గరి బంధువులకు కూడా పేదల పేరిట ఇళ్ల కోసం స్థలాలు కేటాయిస్తూ పోవడంతో ఇప్పుడు సర్కారు భూమి ఎంత మిగిలి ఉందో కూడా రెవెన్యూ అధికారులకే తెలియని పరిస్థితి. రిటైర్డ్ అయిన తహసీల్దార్ల దగ్గరికి వెళ్లి ప్రొసీడింగ్స్ తయారు చేయించి కూడా ఇక్కడ భూములను కాజేశారనే ఫిర్యాదులు సైతం ఉన్నాయి. పదేళ్లలో ఇక్కడ తహసీల్దార్లుగా పనిచేసిన వారు, వీఆర్ఓల కనుసన్నల్లోనే విలువైన భూమి ఫలహారంగా మారిందని స్థానికులు చెపుతున్నారు. ఎమ్మెల్యే స్థాయి మొదలు జెడ్పీటీసీ, ఎంపీపీ తదితర ప్రజాప్రతినిధుల నోటిమాటే వేదంగా భూపందేరం జరిగాయని సమాచారం. మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి తనకు ఉన్న ఎనిమిది గుంటల పట్టా భూమికి 4 గుంటల ప్రభుత్వ భూమిని కలుపుకున్నారని స్థానికులు బహిరంగంగానే చెబుతారు. పేదల కోసం గుంట, రెండు గుంటల భూమి కేటాయిస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఇక్కడ ఒక్కొక్కరు 5 నుంచి 7 గుంటల వరకు ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేస్తున్నారని పెద్దపల్లి జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు అందింది. ఈ నేపథ్యంలో జేసీ దీనిని అత్యంత ముఖ్యమైన ఫిర్యాదుగా భావించాలని ఆదేశిస్తూ తహసీల్దార్‌కు సిఫారసు చేశారు. మళ్లీ మొదలైన సర్వే! 476 సర్వే నంబర్లో ఉన్న సర్కారు భూమిలో నుంచి పేదలు, దళితులకు అసైన్డ్ చేసిన భూమి ఎంత? ఎలాంటి అసైన్మెంట్ ఆర్డర్ లేకుండా ఆక్రమణలోకి వెళ్లిన భూమి ఎంత అనే విషయాలను తేల్చేందుకు తహసీల్దార్ నేతృత్వంలో రెవెన్యూ సిబ్బంది సర్వే చేస్తున్నారు. వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి కేటాయించిన భూమికి సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో ఉన్న వివరాల ఆధారంగా కొలతలు తీస్తున్నారు. ఈ మేరకు ఎక్కడికక్కడ హద్దులు నిర్ణయించి, ఆక్రమణలో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని తహసీల్దార్ సంపత్ తెలిపారు. -
అసైన్డ్ భూమిలో అక్రమ క్వారీయింగ్
గుంటూరు, చేబ్రోలు(పొన్నూరు): అధికార పార్టీ నాయకులు అసైన్డ్ భూముల్లో అక్రమ క్వారీయింగ్ చేస్తూ ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఎటువంటి అనుమతులు లేకుండా గ్రావెల్ మాఫియా అడ్డూఅదుపు లేకుండా అక్రమాలకు పాల్పడుతోంది. అవినీతి అక్రమాలను అడ్డుకోవలసిన మైనింగ్, రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చేబ్రోలు మండలం వేజండ్ల గ్రామంలో అర్ధరాత్రి సమయంలో అక్రమ క్వారీయింగ్ చేస్తున్న వారిని గుర్తించి గ్రామస్తులు అడ్డుకొని రెవెన్యూ, పోలీసు శాఖలకు సమాచారం ఇచ్చినప్పటికీ వారిపై ఎటువంటి చర్య తీసుకోకపోవటానికి అధికార పార్టీ నాయకుల అండదండలే కారణమని విమర్శలు ఉన్నాయి. మూడు పొక్లెయినర్లు, 17లారీలు, రెండు హెవీ లోడ్ లారీలను పోలీసులకు స్వాధీనం చేసినప్పటికీ వారిపై ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. సుద్దపల్లి గ్రామంలో సొంత స్థలాన్ని చదును చేసుకుంటున్న వారిపై రెవెన్యూ అధికారులు పొక్లెయినర్, రెండు ట్రాక్టర్లను స్వాదీనం చేసుకుని కేసులు నమోదు చేయడంతో పాటు, రెండు నెలల పాటు పోలీసు స్టేషన్లో వాహనాలు ఉంచారు. అదే రెవెన్యూ, పోలీసు శాఖలు నేడు అక్రమ క్వారీయింగ్ చేస్తున్న వారిపై నామమాత్రంగా నైనా చర్యలు తీసుకోకపోవటంపై పలు ఆరోపణలు వస్తున్నాయి. చేబ్రోలు మండలం వీరనాయకునిపాలెం గ్రామంలోని అర ఎకరం స్థలంలో రైల్వే లైన్ పనులకు గ్రావెల్ అవసరాల కోసం అని అనుమతులు తీసుకొని విక్రయాలు చేస్తున్నారు. స్థలం పక్కనే ఉన్న అసైన్డ్ భూమిలో కూడా అధికార పార్టీ నాయకులు యంత్రాల సహాయంతో తవ్వి ట్రాక్టర్లు, లారీలతో గ్రావెల్‌ను తరలిస్తున్నారు. లక్షల విలువైన ప్రభుత్వ భూముల్లో క్వారీయింగ్ జరుపుతుండటంతో అవి పెద్ద పెద్ద అగాధాలను తలపిస్తున్నాయి. వేజండ్ల, వడ్లమూడి, సుద్దపల్లి, శేకూరు, చేబ్రోలు గ్రామాల్లో అక్రమ క్వారీయింగ్ జరుగుతోంది. ప్రభుత్వ భూములనే టార్గెట్ చేసుకొని అధికార పార్టీ నాయకులు అక్రమాలకు పాల్పడుతూ నాయకులు జేబులు నింపుకొంటున్నారు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం ప్రభుత్వ భూములు, జిల్లా పరిషత్ భూములు, చెరువులను టార్గెట్ చేసుకొని అక్రమార్కులు తవ్వకాలు జరుపుకొని గ్రావెల్‌ను విక్రయించుకుంటున్నారు. వీరనాయకునిపాలెం గ్రామంలో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్‌పై తహసీల్దారు జి.సిద్దార్థను ‘సాక్షి’ వివరణ కోరగా అర ఎకరంలో క్వారీయింగ్‌కు అనుమతులు ఇచ్చినట్టు తెలిపారు. పక్కనే ఉన్న అసైన్డు భూమిలో తవ్వకాలు జరుగుతున్నట్టు తమ దృష్టికి రాలేదన్నారు. పరిశీలించి ప్రభుత్వ స్థలంలో క్వారీయింగ్ జరుగుతున్నట్లు నిర్ధారణ అయితే మైనింగ్ అధికారులకు ఫిర్యాదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.–తహసీల్దార్ జి.సిద్దార్థ -
‘పారిపోయి అమరావతికి వచ్చిన చంద్రబాబు’
సాక్షి, అమరావతి : తమ పార్టీ అధికారంలోకి రాగానే రైతులను బెదిరించి ప్రభుత్వం కొనుగోలు చేసిన అసైన్డ్ భూములను తిరిగి వారికి ఇస్తామని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. రాజధాని లంక అసైన్డ్ భూముల పరిరక్షణ కమిటీ, వైఎస్సార్ సీపీ నాయకుల బృందం గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నుంచి పారిపోయి అమరావతికి వచ్చారని ఎద్దేవా చేశారు. ఇక్కడికి వచ్చి రాజధాని నిర్మాణం పేరిట రైతులను బెదిరించి వారి నుంచి బలవంతంగా పచ్చని పొలాలను, అసైన్డ్ భూములను లాక్కున్నారని విమర్శించారు. చంద్రబాబు లాంటివాడు ఉంటాడనే అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారన్న ఆర్కే... రాజధాని పేరుతో అరాచకం చేసిన అధికారుల్ని సైతం వదలమని హెచ్చరించారు. దళితుల పట్ల వివక్ష: నందిగం సురేష్ రాజధానిలో ప్రభుత్వం దళితుల పట్ల వివక్ష చూపుతోందని రాజధాని లంక అసైన్డ్ భూముల పరిరక్షణ కమిటీ చైర్మన్ నందిగం సురేష్ ఆరోపించారు. పట్టా భూములు ఒక ప్యాకేజీ, దళితులు సాగుచేస్తున్న అసైన్డ్ భూములకు మరొక ప్యాకేజీ ఇవ్వటం దారుణమన్నారు. అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంపై వెంటనే విచారణ చేయాలని, చట్టప్రకారం అసైన్డ్ భూములు రైతులు కూడా సమాన ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంజాయ్మెంట్ సర్వే చేయని పొలాలను వెంటనే సర్వే చేయాలన్నారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.రాజధానిలో రైతులు రైతు కూలీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసాయిచ్చారు. వైఎస్సార్ సీపీ నాయకులు మేరుగుల నాగార్జున మాట్లాడుతూ... దళితులు పండించుకునే భూములను తీసుకోవడానికి ప్రభుత్వానికి అర్హత లేదని పేర్కొన్నారు. రాజధానిలో పట్టా భూములకు ఇచ్చే ప్యాకేజీ.. అసైన్డ్ భూముల రైతులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోజురోజుకు రాష్ట్రవ్యాప్తంగా దళితులపై పెరిగిపోతున్నాయన్న నాగార్జున.. చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో దళితులే బుద్ది చెప్తారన్నారు. దళితుల అభివృద్ధి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ముడిపడి ఉందని వ్యాఖ్యానించారు. దళితులను మోసం చేసే జూపూడి ప్రభాకర్, కారెం శివాజీ లాంటి వాళ్ల పట్ల దళితులంతా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చంద్రబాబు దళిత ద్రోహి: కిలారి రోశయ్య పట్టా భూములు ఉన్న రైతులకు ఒక ప్యాకేజీ దళితులకు మరొక ప్యాకేజీ ఇవ్వడం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కిలారి రోశయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను భయపెట్టి భూములు లాక్కోవాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే తామంతా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుని ప్రజలంతా తొందర్లోనే ఇంటికి పంపుతారని వ్యాఖ్యానించారు. -
అమరావతిలో అసైన్డ్ భూముల పరిరక్షణ కమిటీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని లంక, అసైన్డ్ భూముల పరిరక్షణ కమిటీ పర్యటించింది. ఈ పర్యటనలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి, నేతలు కిలారి రోశయ్య, నందిగామ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసైన్డ్ భూములున్న రైతుల సమస్యలను కమిటీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. లంక, అసైన్డ్ భూముల ప్యాకేజీ విషయంలో తీవ్రమైన అన్యాయం జరుగుతుందంటూ కమిటీ సభ్యుల ముందు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతు కూలీలకు ప్రభుత్వం ఇచ్చే రూ.2500 కూడా సరిగా ఇవ్వడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు దేశం ప్రభుత్వం అన్ని విధాలుగా అన్యాయం చేస్తోందని రైతులు, రైతు కూలీలు కమిటీ ఎదుట మొరపెట్టుకున్నారు. -
అమరావతిలో అసైన్డ్ భూముల రైతులు విడుదల
-
రాజధానిలో ‘భూ’మంతర్
రాజధాని అమరావతిలో అసైన్డ్ భూములు: 2,028 ఎకరాలు లంక, శివామ్ జమీందార్ భూములు: 2,284 ఎకరాలు ఎకరం అసైన్డ్ జరీబు భూమి విలువ: దాదాపు రూ.2.28 కోట్లు ఎకరం అసైన్డ్ మెట్ట భూమి విలువ: దాదాపు రూ.2.02 కోట్లు సాక్షి, తుళ్లూరు: రాష్ట్ర రాజధాని అమరావతిలో పేద దళిత, గిరిజన రైతులను ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు దారుణంగా వంచించారు. భూసమీకరణ కింద పరిహారం రాదంటూ మభ్యపెట్టి అసైన్ట్ భూములను కారుచౌకగా కొట్టేశారు. వాటిని భూసమీకరణలో భాగంగా ప్రభుత్వానికి ఇచ్చి, పరిహారం కింద నివాస, వాణిజ్య స్థలాలు సొంతం చేసుకున్నారు. అమాయక దళిత, గిరిజనుల భూములను లాక్కోవడానికి భూబకాసురులు సాగించిన కుట్రలు, కుతంత్రాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. రాజధాని నిర్మాణం పేరుతో తెలుగుదేశం సర్కారు మోసపూరితంగా వ్యవహరించింది. అమరావతి ప్రాంతంలో రాజధాని నగరాన్ని నిర్మిస్తారనే ప్రకటన వచ్చాక ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతల కన్ను పేదలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములపై పడింది. తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి పరిధిలోని 29 గ్రామాల్లో అసైన్డ్, లంక, శివాయ్ జమీందార్ భూములు 4,312 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 2,028 ఎకరాలు అసైన్డ్, మరో 2,284 ఎకరాలు లంక, శివాయ్ జమీందార్ భూములు. వీటిని 1954, 1971, 1976, 2005 సంవత్సరాల్లో భూమిలేని నిరుపేదలకు అప్పటి ప్రభుత్వం పంచి పెట్టింది. రాజధాని ప్రకటన వెలువడగానే ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయనే వివరాలను ప్రభుత్వ పెద్దలు తెప్పించుకున్నారు. అందులో నవులూరు, కురగల్లు, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, ఐనవోలు, తుళ్లూరు, ఉద్ధండ్రాయునిపాలెం, లింగాయపాలెం, బోరుపాలెం, అనంతవరం, మందడం, వెంకటపాలెం, నెక్కల్లు, నేలపాడు గ్రామాల్లోని ప్రభుత్వ భూములను టార్గెట్ చేశారు. వీటి అనుభవదారుల వివరాలు తీసుకుని రంగంలోకి దిగారు. బినామీలతో తప్పుడు ప్రచారం అసైన్డ్ భూములను గతంలో ప్రభుత్వాలే ఇచ్చాయి కాబట్టి వాటిని భూసమీకరణ కింద సీఆర్డీఏ వెనక్కి తీసుకుని పైసా కూడా పరిహారం ఇవ్వదు అంటూ టీడీపీ నాయకులు, మంత్రులు తమ బినామీలతో ప్రచారం చేయించారు. ఇప్పుడు అమ్ముకుంటే ఎంతో కొంత సొమ్ము వస్తుందంటూ అసైన్డ్ భూముల అనుభవదారులను మాటలతో వంచించారు. అసైన్డ్ భూములకు ప్రభుత్వం పరిహారం ఇవ్వదంటూ సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు కూడా వంతపాడారు. దీంతో భయాందోళనకు గురైన అసైన్డ్ రైతులు తమ భూములను నామమాత్రపు ధరకు అధికార పార్టీ నేతలకు రాసి ఇచ్చేశారు. ఆ వెంటనే సీఆర్డీఏ అధికారులు అసైన్డ్ భూములకు ప్యాకేజీ ప్రకటించారు. తక్కువ ధరకు పేదల నుంచి భూములను కొట్టేసిన బడాబాబులు వాటిని ప్రభుత్వానికి ఇచ్చి, భారీగా పరిహారం జేబులో వేసుకున్నారు. అసైన్డ్ రైతులకు తీరని అన్యాయం అధికార పార్టీ నేతలు అసైన్డ్ రైతులను బెదరగొట్టి ఎకరా భూమికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల్లోపే చెల్లించారు. ప్రభుత్వం ప్రకటించిన అసైన్డ్ భూముల ప్యాకేజీ ప్రకారం.. ఎకరానికి 500 గజాల చొప్పున నివాస స్థలం, 100 గజాల చొప్పున వాణిజ్య స్థలం దక్కించుకున్నారు. నివాస స్థలం గజం విలువ రూ.22,000, వాణిజ్య స్థలం రూ.26,000 పలుకుతోంది. దాని ప్రకారం 500 గజాల విలువ రూ.1.10 కోట్లు. 100 గజాల వాణిజ్య స్థలం విలువ రూ.26 లక్షలు. అంటే ఎకరానికి రూ.1.36 కోట్ల విలువ ఉంది. అసైన్డ్ రైతులే తమ భూములను నేరుగా ప్రభుత్వానికి ఇచ్చి ఉంటే జరీబు ప్యాకేజీ ప్రకారం.. 800 గజాల నివాస స్థలం, 200 గజాల వాణిజ్య స్థలం దక్కేది. 800 గజాల నివాస స్థలం విలువ రూ.1.76 కోట్లు, 200 గజాల వాణిజ్య స్థలం విలువ రూ.52 లక్షలు. అంటే ఎకరం భూమిని కారుచౌకగా ప్రభుత్వ పెద్దలకు విక్రయించడం వల్ల అసైన్డ్ రైతు రూ.2.28 కోట్లు నష్టపోయినట్లు లెక్క. మెట్ట భూమి ప్యాకేజీ ప్రకారం.. 800 గజాల నివాస స్థలం, 100 గజాల వాణిజ్య స్థలం ఇస్తారు. ఈ లెక్కన ఎకరం మెట్ట భూమి విలువ రూ.2.02 కోట్లు. జరీబు రైతులకు రూ.50 వేలు, మెట్ట రైతులకు రూ.30 వేల చొప్పున పదేళ్లపాటు ప్రభుత్వం నుంచి పరిహారం ఆందుతుంది. ఈ పరిహారాన్ని కూడా అసైన్డ్ రైతులు కోల్పోయారు. మా భూములు మాకిప్పించండి ‘‘రాష్ట్ర మంత్రులు, అధికార టీడీపీ నాయకులు తమ బినామీలను గ్రామాల్లోకి పంపించి.. అసైన్డ్ భూములకు పరిహారం రాదు, వీటిని తీసేసుకుంటుంది, కొనేవాళ్లు దొరికితే ఇప్పుడే అమ్మేసుకోండి అంటూ పుకార్లు పుట్టించారు. అధికారులు కూడా ఇవే మాటలు చెప్పారు. దీంతో భయపడి ఎకరా రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకే అమ్మేసుకున్నాం. ఇప్పుడు ఆ భూములు రూ.కోట్లు పలుకుతున్నాయి. ప్రభుత్వం మా భూములను మాకు ఇప్పించి న్యాయం చేయాలి’’ – పొన్నూరి నాగేశ్వరరావు, అసైన్డ్ రైతు, ఉద్ధండ్రాయునిపాలెం చట్టం.. మాకు చుట్టమే! చట్టం ప్రకారం పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములను ఇతరులెవరూ కొనుగోలు చేయకూడదు. ఎవరైనా కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఆయా భూములను తొలుత కేటాయించిన పేదలు ఉంటే వారికి ఇవ్వాలి. వారు లేకపోతే ఇతర పేద కుటుంబాలకు పంపిణీ చేయాలి. అయితే, అధికార పార్టీ నాయకులు చట్టాన్ని సైతం లెక్కచేయలేదు. అసైన్డ్ రైతులను భయపెట్టి భూములను లాగేసుకున్నారు. ఇదంతా బహిరంగంగానే జరిగినా అదేమిటని అడిగే నాథుడే లేకుండాపోయాడు. -
రాజధానిలో హైటెన్షన్
-
అసెంబ్లీ ముట్టడికి పిలుపు.. రాజధానిలో హైటెన్షన్
సాక్షి, అమరావతి : అసైన్డ్ భూముల రైతులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ముట్టడికి పిలుపున్వివటంతో అమరావతిలో హైటెన్షన్ నెలకొంది. సోమవారం ప్రభుత్వ తీరును నిరసిస్తూ అసెంబ్లీ ముట్టడికి రైతులు పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం అసైన్డ్ భూముల రైతులకు అన్యాయం చేస్తోందని అసైన్డ్ భూముల రైతులు ఆరోపించారు. తమకు కూడా పట్టా భూములతో పాటు సమాన ప్యాకేజీ ఇవ్వాలని, రైతు కూలీలకు ఒక్కొక్కరికి నెలకు 9000 పింఛన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అసైన్డ్ భూముల రైతుల్ని ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. పలువురు రైతులతో పాటు ప్రజా సంఘాల నాయకులను సైతం హౌస్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన రైతుల్ని ఏ స్టేషన్‌కు తరలించారో అర్థం కాక వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. అసెంబ్లీ చుట్టూ పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి వెళ్లే అన్ని మార్గాలలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అసెంబ్లీకి వెళ్లే వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల్ని కూడా అధికారులు తనిఖీ చేస్తున్నారు. -
‘భూసేకరణ కాదు భూ ఆక్రమణ’
సాక్షి, హైదరాబాద్ : 2013 భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ రైతుల పొట్టకొట్టే చట్టాన్ని చంద్రబాబు నాయుడు తీసుకువస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. దేశంలో మొదటిసారి భూ ఆక్రమణ చట్టాన్ని చంద్రబాబు తెస్తున్నారని విమర్శించారు. ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఏ నాయకుడు ఇంతటి దుర్మార్గ చట్టాన్ని తేలేదన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్య వాదులందరూ ఈ చట్టాన్ని అడ్డుకోవాలని కోరారు. చంద్రబాబు మూలంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని, ప్రజలందరి కళ్లుగప్పి చంద్రబాబు చీకటి జీవోలు తెస్తున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో 33 వేల ఎకరాలు సేకరించి ఇప్పటి వరకూ పరిహారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రైతుల భూములను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి చంద్రబాబు దోచుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. నాలుగేళ్ల కాలంలో ఏపీ రాజధానిలో ఒక్క శాశ్వత బిల్డింగ్ అయినా కట్టారా అని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ఏపీ ప్రభుత్వం 41 జీవోను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
సమాన ప్యాకేజీ ఇవ్వాలి: మేరుగ
అమరావతి : తుళ్లూరు మండలం లింగాయపాలెంలో అసైన్డ్ భూములను వైఎస్సార్సీపీ నేతలు మేరుగ నాగార్జున, హెన్ని క్రిష్టినా పరిశీలించారు. అనంతరం క్రిస్టినాతో కలిసి మేరుగ నాగార్జున విలేకరులతో మాట్లాడారు. 50 ఏళ్ల నుంచి అసైన్డ్ భూమలు సాగు చేసుకుంటుంటే..ఎంజాయ్ మెంట్ సర్వే చెయ్యకుండా అధికారులు ప్రభుత్వ భూములుగా చూపిస్తున్నారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని వివరించారు. వెంటనే దళితులు సాగు చేసుకుంటున్న భూములను వెంటనే ఎంజాయ్ మెంట్ సర్వే చెయ్యాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే 41 జీవోను రద్దు చెయ్యాలని కోరారు. అసైన్డ్ భూములకు పట్టా భూమితో సమానంగా ప్యాకేజి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళితులకు చంద్రబాబు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఎంజాయ్ మెంట్ సర్వే చేసి దళితులకు న్యాయం చెయ్యకపోతే సీఆర్డీఏ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరికలు పంపారు. -
ఆ భూములకు పాస్‌పుస్తకాలు ఇప్పట్లో లేనట్టే
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూములకు పాస్‌పుస్తకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెలిక పెట్టింది. అసైన్డ్ భూముల్లో కబ్జాలో ఉండి సాగు చేసుకున్న లబ్ధిదారులకు మాత్రమే పాస్‌పుస్తకాలివ్వాలని, ఇతరుల ద్వారా కొనుగోలు చేసిన భూములను రీ అసైన్ చేసినప్పటికీ వాటికి పాస్‌పుస్తకాలు ముద్రించవద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో అసైన్డ్ భూములను గతంలో కొనుగోలు చేసి ఇప్పుడు రీఅసైన్ అయిన రైతులకు కూడా పాస్‌పుస్తకాలు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇది న్యాయపరంగా సమ్మతం కాదని, అసైన్మెంట్ కమిటీ ఆమోదం పొంది, డీఫాం పట్టా వచ్చిన తర్వాతే వాటికి పాస్‌పుస్తకాలు ముద్రించాలని గత వారం సీసీఎల్ఏ నుంచి ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో పాటు సాదాబైనామాల కింద పరిష్కారం చేసిన భూములకు కూడా పాస్‌పుస్తకాలు ముద్రించవద్దని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వాస్తవానికి, సాదాబైనామాల కింద రైతులకు భూములపై యాజమాన్య హక్కులు కల్పించారు. అయితే, ఆ తర్వాత సాదాబైనామాలు రాసిన వారి వారసులు, ఇతరుల నుంచి ఫిర్యాదులు వచ్చిన సంఖ్య కూడా చాలా ఎక్కువగానే ఉందని రెవెన్యూ వర్గాలు చెపుతున్నాయి. ఆ క్రమంలోనే సాదాబైనామాల ద్వారా పరిష్కారమయి, వివాదాస్పదమయిన భూములకు కూడా పాస్‌పుస్తకాలు ముద్రించవద్దని తాజా ఉత్తర్వుల్లో జిల్లా స్థాయి యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఈరెండు కేటగిరీల సర్వే నెంబర్లను ప్రత్యేకంగా నోషనల్ ఖాతాల్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. దీంతో రీఅసైన్, సాదాబైనామా కోటాలో యాజమాన్య హక్కులు పొందిన రైతులకు పాస్‌పుస్తకాలు ఇప్పట్లో వచ్చే అవకాశం లేదని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇచ్చే రబీ సీజన్ పెట్టుబడి సాయానికి కూడా పుస్తకాలు వచ్చే అవకాశం లేదని అంటున్నారు. దీంతో పాస్‌పుస్తకాలు వచ్చేంతవరకు రైతులు ఎదురుచూడాల్సిన పరిస్థితి. -
నిషేధిత భూములపై నాన్చుడే!
సాక్షి, అమరావతి: రెవెన్యూ రికార్డులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలకు వాస్తవాలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. 1954కు ముందు పేదలకు ఇచ్చిన ‘డి’ పట్టా భూముల విషయంలో వివాదం ఇంతవరకు పరిష్కారం కాలేదు. వంశపారంపర్యంగా సంక్రమించిన వాటితోపాటు రిజిస్ట్రేషన్ల ద్వారా తాము కొనుగోలు చేసిన భూములు, స్థలాలను రిజిస్ట్రేషన్ చట్టం ‘22–ఏ’ (నిషేధిత ఆస్తుల జాబితా)లో చేర్చారని లక్షల మంది భూ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చడంతో అత్యవసర సమయాల్లో అమ్ముకోవాలన్నా, తాకట్టు పెట్టి రుణం తీసుకోవాలన్నా వీలు కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న బాధితులు తమ స్థిరాస్తులను ‘22–ఏ’ జాబితా నుంచి తొలగించాలంటూ అందిన లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో మూలుగుతున్నాయి. బాధితులు నిత్యం రెవెన్యూ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు ఇచ్చిన భూములను పదేళ్లు దాటితే నేరుగా విక్రయించుకోవచ్చనే ఉత్తర్వులున్నా అవి కూడా ‘22 ఏ’ కింద చేరిపోవడంతో జీవో అమలు కావడం లేదు. రెవెన్యూ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఉన్నతాధికారుల సమావేశంలో స్వయంగా ఈ విషయాన్ని అంగీకరించడమే కాకుండా సమస్యను తక్షణమే పరిష్కరించి ప్రజలకు ఇబ్బందులు నివారించాలని ఆదేశించారు. తప్పుల తడకగా వెబ్‌ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెబుతున్న మీభూమి వెబ్‌ల్యాండ్‌లో వివరాలు తప్పుల తడకలుగా ఉన్నాయి. లక్షలాది సర్వే నంబర్లకు చెందిన భూముల వివరాలు ఇప్పటికీ వెబ్‌ల్యాండ్‌లో నమోదు కాలేదు. రెవెన్యూ శాఖ ప్రామాణికంగా చెబుతున్న రీ సెటిల్మెంట్ రిజిస్టర్ (ఆర్ఎస్ఆర్), రైతులకు సంబంధించిన భూ అనుభవ రిజిస్టర్ (అడంగళ్) మధ్య రాష్టవ్యాప్తంగా 16.47 లక్షల ఎకరాల విస్తీర్ణం తేడా ఉంది. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం గత నాలుగేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ‘పట్టాదారు పాసు పుస్తకాల ప్రకారం వెబ్సైట్లో నమోదు చేస్తే వాస్తవంగా ఉన్న భూమి కంటే 16.47 లక్షల ఎకరాలు ఎక్కువగా రికార్డు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల అనేక చిక్కులు వస్తాయి. లేని భూమిని విక్రయించి సొమ్ము చేసుకునే వారూ ఉంటారు. ఈ సమస్యను పరిష్కరించాలంటే సబ్ డివిజన్ చేయాల్సిందే..’ అని భూ వ్యవహారాలపై బాగా అనుభవం ఉన్న ఒక జిల్లా కలెక్టరు చెప్పారు. ‘డి’ పట్టాలపై దాగుడుమూతలు 1954కు ముందు ప్రభుత్వం అసైన్మెంట్ కింద పేదలకు ఇచ్చిన ‘డి’ (డీకేటీ) పట్టాలను అసైనీలు అమ్ముకోవచ్చు. 1954 తర్వాత ఇచ్చిన ‘డి’ పట్టాలకు మాత్రం అనుభవ హక్కులు మాత్రమే ఉంటాయి. వాటిని హక్కుదారులు విక్రయించడానికి వీల్లేదని ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ (పీవోటీ) చట్టం స్పష్టంగా చెబుతోంది. అయితే రెవెన్యూ యంత్రాంగం 1954కు ముందు ఇచ్చిన ‘డి’ పట్టాలను కూడా నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చింది. దీనిపై పలువురు హైకోర్టును ఆశ్రయించగా ఇది సరి కాదని, 1954కు ముందు ఇచ్చిన డీకేటీ పట్టాలను 22–ఏ నుంచి తొలగించాలని ఆదేశించింది. ఇందుకు చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలంటూ సీసీఎల్ఏ గత నాలుగేళ్లలో నాలుగు సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రెవెన్యూ శాఖ ఒకసారి ఈ అంశాన్ని కేబినెట్ అజెండాగా కూడా చేర్చింది. అయితే కేబినెట్ ఏ నిర్ణయం తీసుకోకుండా తర్వాత చర్చిస్తామంటూ ఈ అంశాన్ని పక్కన పెట్టేసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం నిర్వహిస్తున్న రెవెన్యూ సభల్లో డీకేటీ పట్టాల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. ప్రభుత్వం దీనిపై తేల్చకుండా కాలయాపన చేస్తుండటంతో అర్జీలన్నీ పెండింగ్‌లో పెట్టక తప్పదని కలెక్టర్లు తేటతెల్లం చేస్తున్నారు. పేదల గోడు పట్టదా? 1954కి ముందు డీకేటీ పట్టా భూముల విషయంలో ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోంది. ఈ భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించినా ప్రభుత్వంఅమలు చేయడంలేదు. 1954కు ముందు ఇచ్చిన డీకేటీ భూములను పట్టా భూములుగానే పరిగణిస్తున్నట్లు సీఆర్డీఏ పరిధికి సంబంధించి పురపాలక శాఖ 2017 ఫిబ్రవరి 17వ తేదీన జీవో 41 జారీ చేసింది. ఈ జీవో ఆధారంగానే గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు, నవులూరు గ్రామాల్లో ఈ తరహా భూములను నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగిస్తూ రెవెన్యూ శాఖ గత నెల 18వ తేదీన జీవో 258 జారీ చేయడం గమనార్హం. సీఆర్డీఏ పరిధిలో అసైన్డ్ భూములను పలువురు మంత్రులు, అధికార పార్టీ నేతలు కొనుగోలు చేయడంతో వారి పేరుతో ప్లాట్లు, కౌలు ఇచ్చేందుకే ప్రభుత్వం వీటిని నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తప్పించింది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది పేదలకు సంబంధించి ఇదే తరహా (1954కు ముందు ఇచ్చిన డీకేటీ పట్టా) భూములను మాత్రం నిషేధిత ఆస్తుల జాబితా నుంచి తొలగించకపోవడం గమనార్హం. ఇలా ప్రభుత్వమే ద్వంద్వ వైఖరి అనుసరిస్తే పేదల గోడు పట్టించుకునేదెవరని అధికారులు ప్రశ్నిస్తున్నారు. భూముల వ్యవహారంలో విధాన నిర్ణయాలు తీసుకోవాల్సింది రెవెన్యూ శాఖ కాగా పురపాలక శాఖ జీవోలు జారీ చేయడం ఏమిటని విస్తుపోతున్నారు. వీటిని సవాల్ చేయాల్సిన రెవెన్యూ శాఖ ఆ జీవోలనే ప్రామాణికంగా తీసుకుని మరో జీవో జారీ చేయడంపై అధికారులు మరింత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పక్షపాత వైఖరికి రుజువు ‘అందరికీ ఇదే తరహా జీవో వర్తింపజేస్తే ఇబ్బందులు ఉండవు. సీఆర్డీఏలో పెద్దలకు అనుకూలంగా జీవో ఇవ్వడం కోసం మాత్రం హైకోర్టు ఆదేశాలను ఉటంకిస్తూ మిగిలిన ప్రాంతాల్లో ఇదే తరహా భూములకు దీన్ని వర్తింపజేయకపోవడం ప్రభుత్వ పక్షపాత వైఖరికి నిదర్శనం’ అని రెవెన్యూ వ్యవహారాలపై అపార అనుభవం కలిగిన రిటైర్డు ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ‘రెవెన్యూ శాఖలో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చాం. రెవెన్యూ రికార్డులన్నీ అప్డేట్ చేశాం. సమస్యలన్నీ పరిష్కరించాం. భూ రికార్డులను ఎవరైనా నేరుగా కంప్యూటర్లో ఇంటి నుంచే చూసుకునేలా మీభూమి వెబ్సైట్లో పొందుపరిచాం’ – తరచూ సీఎం ప్రకటనలు -
600 కోట్లకు మోగిన గంటా
-
రూ.600 కోట్లకు ‘గంటా’రావం
సాక్షి, అమరావతి: విశాఖపట్నంలోని పేదలకు చెందిన విలువైన 358 ఎకరాల అసైన్డ్ భూములను కాజేసి వాటి ద్వారా రూ.600 కోట్లు కొట్టేసేందుకు ఆ ప్రాంత మంత్రి గంటా శ్రీనివాసరావు మరోసారి రంగం సిద్ధం చేశారు. గతంలోనే ఇందుకు ప్రయత్నించగా విషయం రచ్చవడంతో అప్పట్లో తాత్కాలికంగా వెనక్కి తగ్గిన ఆయన తన ప్రయత్నాలు మానలేదు. తెరవెనక మంత్రాంగం కొనసాగించారు. బినామీ పేర్లతో వాటిని కొనేసిన మంత్రి వాటిని చట్టబద్ధం చేసుకునేందుకు పకడ్బందీ ప్రణాళిక రచించారు. భూసమీకరణ పేరిట విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ(వుడా)కు ఈ భూములు అప్పగించి.. అందుకు ప్రత్యామ్నాయంగా ప్లాట్లను సొంతం చేసుకునేందుకు వ్యూహం పన్నారు. ఇందుకోసం ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ‘చినబాబు’తో మాట్లాడి రంగం సిద్ధం చేసుకున్నారు. తద్వారా రూ.600 కోట్లకుపైగా అప్పనంగా కొట్టేసేందుకు సిద్ధమయ్యారు. ఈ ప్రతిపాదనకు సీఎం నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్ లభించడం గమనార్హం. అసైన్డ్ భూములను కొనుగోలు చేసి... విశాఖపట్నం జిల్లాలోని భీమిలి, పెందుర్తి, ఆనందపురం మండలాల పరిధిలో సుమారు 358 ఎకరాల అసైన్డ్ భూములను మంత్రి గంటా శ్రీనివాసరావు బినామీ(బంధువులు, సంస్థ ఉద్యోగుల) పేర్లతో చట్టవిరుద్ధంగా కారుచౌకగా కొనుగోలు చేశారు. అసైన్డ్ భూములను అమ్మడానికి, కొనడానికి వీలులేదని ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్(పీఓటీ) చట్టం స్పష్టంగా చెబుతోంది. పీఓటీ చట్టం ప్రకారం అసైన్డ్ భూముల్ని కొనడం నేరం. ఈ చట్టాన్ని అతిక్రమించిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ‘‘ఈ భూములను వుడా తీసుకుంటోంది. ఇది ప్రభుత్వం ఉచితంగా ఇచ్చిన అసైన్డ్ భూమి అయినందున వుడా నష్టపరిహారం ఇవ్వకుండా ఉచితంగా లాగేసుకుంటుంది. మాకు ఇస్తే ఎకరాకు రూ.లక్ష ఇస్తాం.. అంటూ మంత్రి బంధువులు, ఆయనకు చెందిన సంస్థలోని ఉద్యోగులతో ప్రచారం చేయించడం ద్వారా అసైనీల్లో భయం సృష్టించారు. దీంతో ఊరికే భూములు పోగొట్టుకోవడంకంటే ఎంతో కొంత తీసుకుని విక్రయించడం మేలనే భావనతో ఎకరా రూ.లక్ష నుంచి లక్షా ఇరవై వేల ధరతో అమ్మేశారు. మొత్తం 358 ఎకరాలను రూ.40 కోట్లలోపు మొత్తానికే మంత్రి బినామీ పేర్లతో కైవసం చేసుకున్నారు. ఇందులో భాగంగా రికార్డులను సైతం తారుమారు చేశారు. ఈ భూముల్ని అమ్ముకుంటే రూ.800 కోట్ల నుంచి రూ.900 కోట్లదాకా వస్తుంది. అయితే పీఓటీ చట్టం ప్రకారం అమ్ముకోవడం వీలుకాదు. అందువల్ల ఈ భూమిని వుడాకు సమీకరణ కింద కట్టబెట్టి వుడా నుంచి ఎకరాకు 1,120 గజాల చొప్పున ప్లాట్లు తీసుకోవాలని మంత్రి పథకం రూపొందించారు. ఇలా తీసుకున్న ప్లాట్లు మంత్రి బినామీల పేరుతో రిజిస్ట్రేషన్ అవుతాయి. దీంతో చట్టబద్ధంగా అమ్ముకుని సొమ్ము చేసుకోవచ్చు. తమ చేతికి మట్టి అంటనివిధంగా వ్యవహారాన్ని చక్కబెట్టుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఆ మేరకు భూసమీకరణ కింద ఈ భూములను తీసుకోవాలని వుడాపై ఒత్తిడి తెచ్చారు. ‘చినబాబు’ నుంచి కూడా ఒత్తిడి రావడంతో వుడా మౌఖికంగా అంగీకరించింది. సీఎం గ్రీన్‌సిగ్నల్ వుడా భూసమీకరణకు అనుమతించాలని విశాఖ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ గత నెలలో జరిగిన కలెక్టర్ల సదస్సులో కోరగా సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ‘గతంలో ఈ వ్యవహారం ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చింది. మళ్లీ ఇలా జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి’ అంటూ వుడా భూ సమీకరణ ప్రతిపాదనకు సీఎం పచ్చజెండా ఊపడం గమనార్హం. రూ.40 కోట్ల పెట్టుబడికి రూ.600 కోట్లకుపైగా రాబడి.. భూసమీకరణ కింద మంత్రి బినామీల నుంచి 358 ఎకరాలను సమీకరించినందుకు ప్రతిగా వుడా వారికి ఎకరాకు 1,120 గజాల చొప్పున ప్లాట్లు ఇవ్వాలని ప్రతిపాదనలతో గతంలో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పట్లో దీనిపై తీవ్ర విమర్శలు రావడం, విశాఖ ప్రాంతానికి చెందిన మరో మంత్రి స్వయంగా మీడియా సమావేశం పెట్టి విమర్శలు చేయడంతో ఇది ఆగిపోయింది. అయితే ఇప్పుడు గత ప్రతిపాదనల ప్రకారమే ముందుకు వెళుతున్నారు. ఆ మేరకు 358 ఎకరాల సమీకరణకుగాను భూయజమానులైన బినామీలకు వుడా 4,00,960 గజాల మేరకు ప్లాట్లను ఇవ్వాల్సి ఉంటుంది. వుడా ఇవ్వడానికి ప్రతిపాదించిన ప్రాంతంలో గజం విలువ రూ.15,000 నుంచి రూ.18,000 వరకు ఉంది. కనిష్ట ధరను ప్రామాణికంగా తీసుకున్నా గజానికి రూ.15,000 ప్రకారం 400960 గజాలకు రూ.601.44 కోట్లు అవుతుంది. మధ్యస్తంగా గజం రూ.17,000 ధరతో విక్రయిస్తే రూ.681.63 కోట్లు వస్తుంది. ఏతావాతా రూ.40 కోట్లతో మంత్రి కొట్టేసిన అసైన్డ్ భూమిని వుడాకు కట్టబెట్టడం ద్వారా ఆయన కొట్టేసే మొత్తం రూ.600 కోట్లుపైమాటే. ఇందులో చినబాబు, మంత్రి పంచుకోగా మిగిలిన దానిలో కొంత మొత్తాన్ని ఎన్నికల ఖర్చుకోసం ఇస్తామని మంత్రివర్యులు చెప్పినట్లు సమాచారం. దీంతో ఈ విషయంపై ఇక రాద్ధాంతం చేయవద్దని చినబాబు మరో మంత్రికి హితవు పలికినట్టు సమాచారం. -
‘అసైన్డ్’ చట్ట సవరణ!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర అసెంబ్లీ శనివారం ఆరు బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇందులో అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు, రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో తెలుగును తప్పనిసరి చేసే బిల్లు, డీజీపీ ఎంపిక, నియామకం బిల్లు, న్యాయవాదుల సంక్షేమ నిధి చట్ట సవరణ బిల్లు, న్యాయవాదుల గుమస్తాల సంక్షేమ నిధి సవరణ బిల్లు, మెడికల్ ప్రాక్టీషనర్ల రిజిస్ట్రేషన్ల చట్ట సవరణ బిల్లు ఉన్నాయి. దళితులు, పేదల అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ దళితులు, గిరిజనులు, పేదలు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అసైన్డ్ భూములు(మార్పిడి నిషేధం) చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం మహమూద్ అలీ శాసనసభలో ప్రవేశపెట్టారు. కేవలం ఎస్సీ, ఎస్టీ, పేదలు కొనుగోలు చేసిన 2.5 ఎకరాల వరకు ఆరుతడి, 5 ఎకరాల వరకు మెట్ట భూములను మాత్రమే క్రమబద్ధీకరిం చేందుకు ఈ బిల్లును తెచ్చామని తెలిపారు. ధనికులు కొనుగోలు చేసిన అసైన్డ్ భూముల ను క్రమబద్ధీ కరించమని, హెచ్ఎండీఏ పరిధి లోని అసెన్డ్ భూములను సైతం క్రమబద్ధీకరిం చబోమని పేర్కొన్నారు. రాష్ట్రంలో 20,13,863 ఎకరాల అసైన్డ్ భూములుంటే అందులో 2,41,126 ఎకరాలు వివాదాల్లో ఉన్నాయ న్నారు. ఈ వివాదాలను పరిష్కరించడం కోసమే ఈ బిల్లును తెచ్చామన్నారు. హైదరా బాద్‌తో పాటు జిల్లా, మండల కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేసిన అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించేందుకే ప్రభుత్వం ఈ బిల్లు తెస్తోందని టీడీపీ సభ్యుడు సండ్ర వెంకట వీరయ్య విమర్శించారు. నిర్బంధ వైద్య సేవలు అక్కర్లేదు మెడికల్ ప్రాక్టీషనర్లుగా రిజిస్ట్రేషన్ పొందేం దుకు ఎంబీబీఎస్, పీజీ వైద్యులు తప్పనిసరిగా ఏడాది పాటు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలలో నిర్బంధ వైద్య సేవలు అందించాలనే నిబంధ నను తొలగిస్తూ రూపొందించిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ సందర్భంగా మంత్రి సి.లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మారిన పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నిర్బంధ వైద్యుల సేవలు అవసరం లేదన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పీజీ వైద్య విద్య సీట్లను 250కు పైగా పెంచామన్నారు. అన్ని జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో డీఎన్బీ కోర్సులు ప్రారంభించనున్నామన్నారు. రెగ్యులర్ ప్రాతిపదికన అన్ని వైద్య విభాగాల్లో 2,673 స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టు వైద్యుల పోస్టులు భర్తీ చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల సంఖ్య పెరుగుతుందని, అందువల్లే చట్టానికి సవరణలు చేస్తున్నామన్నారు. న్యాయవాదులు, గుమస్తాల స్టాంపు విలువ పెంపు తెలంగాణ న్యాయవాదుల సంక్షేమ నిధి చట్టం, తెలంగాణ న్యాయవాదులు, గుమస్తాల సంక్షేమ నిధి చట్టాలకు సంబంధించిన రెండు వేర్వేరు సవరణæ బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. న్యాయవాదులు, గుమస్తాల సంక్షేమ నిధి స్టాంపుల విలువను రూ.50 నుంచి రూ.100కు పెంచుతూ ఈ సవరణలను చేపట్టినట్టు న్యాయశాఖ మంత్రి ఎ.ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పలు శాఖల పద్దులకు ఆమోదం రాష్ట్ర హోం, కార్మిక, ఉపాధి కల్పన, గృహ నిర్మాణం, న్యాయ, దేవాదాయ, అడవులు, పర్యావరణ, పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, వాణిజ్యం, సమాచార సాంకేతిక, ప్రభుత్వ రంగ సంస్థల, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి శాఖల వార్షిక బడ్జెట్ ప్రతిపాదనలను అసెంబ్లీ ఆమోదించింది. అన్ని బడుల్లో తెలుగు తప్పనిసరి రానున్న విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ఇతర భాషా పాఠశాలల్లో తెలుగు తప్పనిసరి అమలు చేయాలనే ఉద్దేశంతో బిల్లును తెచ్చామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తొలిదశలో ప్రభుత్వ, ప్రైవేటు, రాష్ట్ర, కేంద్ర, ఇతర భాషా ప్రాథమిక స్కూళ్లలో మొదటి తరగతిలో తెలుగు భాషను ప్రవేశపెడుతు న్నామన్నారు. ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి తెలుగు భాషను ప్రవేశపెడ తామన్నారు. సిలబస్ రూపకల్పన బాధ్యతలను తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలుగు యూనివర్సిటీలకు అప్పగించామన్నారు. రాష్ట్రం పరిధిలోనే డీజీపీ నియామకం డీజీపీ ఎంపిక, నియామకం కోసం రాష్ట్రాలు సొంత చట్టం తయారుచేసుకునే వరకు.. యూపీపీఎస్సీ సిఫారసు చేసిన ముగ్గురు అధికారుల్లో ఒకరిని డీజీపీగా నియమించుకోవాలని 2006లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని మంత్రి టి.హరీశ్ రావు తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు డీజీపీ నియామకానికి సంబంధించి సొంత చట్టాలు రూపొందించుకున్నాయని, ఇప్పుడు తెలంగాణలో కూడా తీసుకొస్తున్నామన్నారు. ఇకపై డీజీపీ నియామకంలో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఉండదని, పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి ఈ అంశం వస్తుందన్నారు. ఈ మేరకు ప్రవేశపెట్టిన బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. -
లేని భూములు సృష్టించి పరిహారం స్వాహా చేశారు
-
పది మండలాల్లోనే రీ అస్సైన్డ్..!
చేతులు మారిన అసైన్డ్ భూములను కబ్జాలో ఉన్నవారికే రీఅసైన్డ్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం జిల్లాలో కేవలం పది మండలాలకు మాత్రమే వర్తించనుంది. రీ అసైన్డ్‌కు సంబంధించి ప్రభుత్వం తాజాగా రూపొందించిన నిబంధనల్లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)ను చేర్చకపోవడంతో ఆ పరిధిలోకి వచ్చే 17 మండలాలకు ఈ అవకాశం చేజారనుంది. జిల్లావ్యాప్తంగా మొత్తం 5180 ఎకరాల మేర అసైన్డ్ భూములు చేతులు మారగా.. అందులో రెండు వేలకు పైగా ఎకరాల్లో మాత్రమే రీ అసైన్డ్ చేసే అవకాశం ఉన్నట్లు రెవెన్యూ వర్గాలు తెలిపాయి. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎటువంటి జీవనాధారమూ లేని పేదలకు ప్రభుత్వం గతంలో భూములను పంపిణీ చేసింది. భూమిలేని నిరుపేదలకు మాత్రమే వీటిని అసైన్డ్ చేసింది. అయితే, కాలగమనంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కొందరు.. కుటుంబ అవసరాలరీత్యా మరికొంత మంది ఈ భూములను అమ్ముకున్నారు. ఇలా చేతులు మారిన భూముల్లో కొన్నిచోట్ల బడాబాబులు పాగా వేశారు. కొన్ని భూములు మాత్రం మరికొందరు పేదల చేతుల్లోకి వెళ్లాయి. పీఓటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్) చట్టం ప్రకారం అసైన్డ్ భూములు పరాధీనమైతే స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఈ క్రమంలో చట్టాన్ని ఉల్లంఘించినట్లు గుర్తించిన భూములను వెనక్కి తీసుకుంది. 3705.02 ఎకరాలు స్వాధీనం జిల్లావ్యాప్తంగా 87,064.35 ఎకరాలను పేదలను పంపిణీ చేశారు. ఇందులో సుమారు 3705.02 ఎకరాల మేర సంపన్నవర్గాలు, బహుళజాతి సంస్థల చేతుల్లోకి వెళ్లినట్లు జిల్లా యంత్రాంగం తేల్చింది. ముఖ్యంగా నగర శివార్లలో విలువైన ఈ భూములపై కన్నేసిన పెద్దలు తమ విలాసాలకు కేంద్రాలుగా మలుచుకున్నారు. ఫామ్‌హౌస్, రిసార్టులు నిర్మించడమేగాకుండా ఇంజనీరింగ్ కాలేజీలు, వైద్య కళాశాలలను కూడా ఏర్పాటు చేశారు. దీంతో కొన్ని చోట్ల ఈ భూములను రెవెన్యూ యంత్రాంగం వెనక్కి తీసుకుంది. పది మండలాలకే పరిమితం! భూ రికార్డుల ప్రక్షాళనతో పరాధీనమైన అసైన్డ్ భూముల చిట్టా వెలుగులోకి వచ్చింది. ఏయే భూములు ఎవరి ఆక్రమణల్లో ఉన్నాయనేది తేలింది. ఈ క్రమంలో పీఓటీ చట్టానికి విరుద్ధంగా పాగా వేసిన వారి భూముల వివరాలను సేకరించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 5180 ఎకరాల మేర భూములు చేతులు మారినట్లు గుర్తించింది. అయితే, తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను కొనుగోలు చేసిన భూముల్లేని పేదల పేరిట రీఅసైన్డ్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. గతేడాది 31వ తేదీ నాటికి ఆయా భూముల్లో కబ్జా ఉన్నవారికి ఈ అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అయితే, రీఅసైన్డ్ చేసే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టింది. కాగా, ప్రభుత్వ తాజా నిర్ణయం మన జిల్లాలో సంపూర్ణంగా అమలు కావడం లేదు. గతంలో హెచ్ఎండీఏ పరిధిలో అసైన్డ్ భూముల క్రయ విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం.. భూముల పంపిణీ వ్యవహారంపై న్యాయస్థానాల్లో పలు కేసులు నడుస్తుండడంతో శివారు మండలాలకు రీ అసైన్డ్ వర్తించదని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. దీంతో హెచ్ఎండీఏ పరిధిలోకి రాని పది మండలాలు కొందుర్గు, చౌదరిగూడ, కేశంపేట, ఆమనగల్లు, మాడ్గుల, తలకొండపల్లి, మంచాల, యాచారం(పార్ట్), ఫరూఖ్‌నగర్(పార్ట్), కడ్తాల్‌లో మాత్రమే భూముల రీఅసైన్డ్‌కు వీలు కలుగనుంది. -
అర్హులకే అసైన్డ్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పరాధీనమైన అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుని.. అర్హత ఉంటే తిరిగి వారికే అసైన్ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్ భూములు ఆక్రమణకు గురయ్యాయని, ఇతరుల చేతిలో ఉన్నాయని భూ ప్రక్షాళనలో గుర్తించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అలాంటి భూములను గుర్తించి, రీఅసైన్ చేసే అధికారాలను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. తక్షణమే ఈ ఆదేశాలను అమలు చేయాలని సీసీఎల్ఏకు, అన్ని జిల్లాల కలెక్టర్లకు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దాదాపు 60 శాతం భూములు.. రాష్ట్రంలో మొత్తం 22.63 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా.. అందులో దాదాపు 60 శాతం అసైన్డ్ భూములు లబ్ధిదారుల అధీనంలో లేవని, ఇతరుల చేతుల్లోకి వెళ్లాయని గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో ఇతరులపరం కావడంతో ఆందోళన చెందిన ప్రభుత్వం.. అలాంటి భూములన్నింటినీ అర్హులైన వారికి రీఅసైన్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ మెమో (నం.4233) జారీ చేశారు. దీని ప్రకారం.. లబ్ధిదారులు కాకుండా ఆక్రమణలో ఉన్న అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ప్రస్తుతం ఎవరి చేతుల్లో ఉంటే వారికి తిరిగి పంపిణీ (రీఅసైన్) చేస్తుంది. 2017 డిసెంబరు 31వ తేదీ నాటికి అసైన్డ్ భూములను కొనుగోలు లేదా బదిలీ చేసుకున్న వారందరికీ ఇది వర్తిస్తుంది. అయితే ఇలా రీఅసైన్ చేసేటప్పుడు భూమి లేని నిరుపేదలు, ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటున్న వారు, ఇంటిని నిర్మించుకున్న వారిని అర్హులుగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. కలెక్టర్లకు అధికారాలు.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 84,706 మంది ఆక్రమణదారుల జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. అయితే 2017 డిసెంబరు 31వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించటంతో.. ఆక్రమణలో ఉన్న వారిలో చాలా మందికి ప్రయోజనం చేకూరనుంది. ఆ తేదీ నాటికి అసైన్డ్ భూములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయో.. వారి పేరిట రీఅసైన్ చేస్తారు. ఇక తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) యాక్ట్–1977 ప్రకారం అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవాలన్నా, తిరిగి ఇతరులకు అప్పగించాలన్నా అసైన్మెంట్ రివ్యూ కమిటీలు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఆ కమిటీలకు బదులుగా జిల్లా కలెక్టర్లకు అధికారాలను అప్పగిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. బడాబాబులకే ప్రయోజనం! అసైన్డ్ భూముల రీఅసైన్మెంట్ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆక్రమణలకు గురైన అసైన్డ్ భూములన్నీ బడాబాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పారిశ్రామికవేత్తల చేతుల్లో ఉన్నాయని.. ప్రభుత్వ నిర్ణయం వారికి ప్రయోజనకరంగా మారుతుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆ భూములు ఆధీనంలో ఉన్నవారికి రీఅసైన్ చేయాలన్న నిర్ణయంతో.. భూములన్నీ బడాబాబుల చేతుల్లోకి వెళ్లిపోతాయనే వాదనలు వినిపిస్తున్నాయి. -
పేదల భూములే టార్గెట్
సాక్షి, అమరావతి: ‘‘పేదలకు చెందిన భూముల స్వాధీనంపై గత ప్రభుత్వం ఇచ్చిన జీవోలను నిలిపివేస్తాం. పేదలకు ఇచ్చిన భూములను ప్రైవేట్ సంస్థలకు బదిలీ చేసే విధానాన్ని రద్దు చేస్తాం. పరిశ్రమల పేరుతో దళితుల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న అసైన్డ్ భూముల వివరాలను సేకరిస్తాం. దళితులకు న్యాయం చేస్తాం. భూమి లేని గిరిజన కుటుంబాలకు రెండెకరాల చొప్పున కొనుగులు చేసి పంపిణీ చేస్తాం’’... ఇదీ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ. వీలైనంత త్వరగా సేకరించండి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని తెలుగుదేశం ప్రభుత్వం తుంగలో తొక్కుతోంది. పేదల పొట్టకొట్టి పెద్దల జేబులు నింపడమే లక్ష్యంగా పని చేస్తోంది. పరిశ్రమలు, వాణిజ్య అవసరాల కోసం ప్రధానంగా పేదల భూములపైనే సర్కారు గురి పెట్టింది. పేదలకు జీవనోపాధి కోసం గతంలో కేటాయించిన అసైన్డ్, పట్టా భూములను బలవంతంగా లాక్కొని, బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతోంది. విశాఖపట్నం, మచిలీపట్నం, దొనకొండ, శ్రీకాళహస్తి–ఏర్పేడు పారిశ్రామిక నోడ్స్ పేరుతో 20,603.65 ఎకరాల పేదల భూములను, 22,015.27 ఎకరాల పట్టా భూములను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ భూములను ఇప్పటికే పరిశ్రమల శాఖ గుర్తించింది. గుర్తించిన భూములను వీలైనంత త్వరగా సేకరించి, ఏపీఐఐసీకి అప్పగించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీ చేసింది. నాలుగు పారిశ్రామిక నోడ్స్ కోసం అసైన్డ్, పట్టా భూములతోపాటు ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 61,315.38 ఎకరాలను గుర్తించింది. చట్టమంటే లెక్కలేదా? చట్టం ప్రకారం.. పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను ఇతరులెవరూ కొనుగోలు చేయరాదు. ఎవరైనా కొనుగోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి. అలా స్వాధీనం చేసుకున్న భూమిని తొలుత కేటాయించిన పేదలు ఉంటే వారికే ఇవ్వాలి. వారు లేకపోతే ఇతర పేదలకు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం లెక్కచేయడం లేదు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలకు చరమగీతం పాడేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు భూపంపిణీ కోసం పైసా కూడా ఖర్చు చేయకపోగా, వారి భూములను ఇతర అవసరాల కోసం ప్రభుత్వమే లాగేసుకోవడం బాధాకరమని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
సీఎం కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకురానున్న ఆర్డినెన్స్ వెనుక వేల కోట్ల రూపాయల కుంభకోణం దాగి ఉందని, చుట్టాలకు మేలు చేసేందుకే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు దీన్ని తెస్తున్నారని కాంగ్రెస్ నేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. అసైన్డ్ భూములను అస్మదీయులకు దోచిపెట్టాలని, తన సమీప బంధువైన మైహోం సిమెంట్స్ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావుకు లబ్ధి చేకూర్చేందుకే ఈ బాగోతానికి సీఎం తెరలేపారని దుయ్యబట్టారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో రేవంత్ విలేకరులతో మాట్లాడుతూ ఆర్డినెన్స్ విషయంలో ప్రభుత్వానికి సదుద్దేశమే ఉంటే ఈ నెలలోనే బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి చర్చించకుండా, హడావుడిగా శాసనసభ, మండలిని ప్రొరోగ్ చేసి మరీ ఆర్డినెన్స్‌ను ఎందుకు తేవాల్సి వస్తోందని ప్రశ్నించారు. ఈ విషయంలో తాను సీఎం కేసీఆర్‌పైనే ఆరోపణలు చేస్తున్నానని, కావాలంటే తనపై కేసులు పెట్టుకోవచ్చన్నారు. సీఎం బినామీ అయిన రామేశ్వర్రావు, ఆయన బంధువులు శంషాబాద్, మహేశ్వరం మండలాల్లోని ముచ్చింతల, నాగారం, నాగిరెడ్డిపల్లి తదితర పది గ్రామాల్లో 4 వేల నుంచి 5 వేల ఎకరాల భూములను సేకరించారని, ఇందులో 1,500 నుంచి 2,000 ఎకరాల అసైన్డ్ భూములున్నాయని రేవంత్ ఆరోపించారు. వేల ఎకరాలను రామేశ్వర్‌రావుకు బదిలీ చేయడానికి, సీఎం బంధువైన కలెక్టర్ ద్వారా కేసీఆర్ దోపిడీకి పాల్పడుతున్నారని, హెచ్ఎండీఏ పరిధిలోని భూముల విషయంలో సహాయ నిరాకరణ చేసినందుకే ఐఏఎస్ అధికారి బి.ఆర్.మీనాను ఉన్నపళంగా బదిలీ చేశారని ఆరోపించారు. నయీమ్ ఎన్కౌంటర్ కుట్ర గురించి తెలియాలంటే ముచ్చింతల భూముల్లో ఏం జరిగిందో ఆ గ్రామస్తులను అడిగితే తెలుస్తుందని, నయీమ్ ఎన్కౌంటర్ వెనుక ఈ భూముల చీకటి కోణం ఉందన్నారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి... ప్రస్తుతం ప్రభుత్వం తేవాలనుకుంటున్న ఆర్డినెన్స్ 2007లోనే శాసనసభ ఆమోదం పొందిందని, అయితే న్యాయవా ది బొజ్జా తారకం కోర్టుకు వెళ్లడంతో దీని అమలు ఆగిందని రేవంత్ చెప్పారు. కేసీఆర్ నిజంగా పేదల మేలు కోసమే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్లయితే శాసనసభలో దీనిపై చర్చించాకే నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ల చట్టం–1908 ప్రకారం అసైన్డ్ భూములను రిజిస్టర్ చేసినా చెల్లదని, అలాంటప్పుడు రామేశ్వర్రావు, ఆయన బంధువుల పేరిట చేసిన రిజిస్ట్రేషన్లను రద్దు చేసి వెంటనే ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. భూ రికార్డుల ప్రక్షాళనలో తేలి న అసైన్డ్ భూముల వివరాలు, వాటి ఆక్రమణదారుల వివరాలను ప్రభుత్వం వెబ్సైట్లో పెట్టాలని కోరారు. మహేశ్వరం, శంషాబాద్ మండలాల్లో మై హోం గ్రూప్ అధీనంలో ఉన్న పది గ్రామాల భూముల వివరాలను బయటపెడతామని, విచారణాధికారిని నియమిస్తే ఈ విషయాన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని రేవంత్ సవాల్ విసిరారు. తన ఆరోపణలకు ప్రభు త్వం సమాధానం చెప్పాలని, ఈ వ్యవహారంపై దీర్ఘకాలిక పోరాటం చేస్తానన్నారు. -
లక్షలాది ఎకరాల అసైన్డ్ భూముల రీ అసైన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పరాధీనంలో ఉన్న అసైన్డ్ భూములను రీ అసైన్ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మార్చిలో మొదలయ్యే బడ్జెట్ సమావేశాల్లోగా ఈ మేరకు ఆర్డినెన్స్ తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీంతోపాటు అన్ని విద్యా సంస్థల్లో ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేసేందుకు మరో ఆర్డినెన్స్ తీసుకు రానుంది. ప్రస్తుతం ఈ రెండు ప్రతిపాదనలు న్యాయ శాఖ పరిశీలనలో ఉన్నాయి. అసైన్డ్ భూములు అసలు లబ్ధిదారులకు బదులుగా ఇతరుల చేతిలో ఉంటే వాటిని స్వాధీనం చేసుకోవాలని, ఒకవేళ నిరుపేద వర్గాల చేతుల్లో ఉంటే క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలో మొత్తం 22.63 లక్షల ఎకరాల అసైన్డ్ భూములున్నాయి. ప్రతి గ్రామంలో దాదాపు 60 శాతానికి పైగా అసైన్డ్ భూములు ఆక్రమణలకు గురైనట్లు ఇటీవల చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అంచనాకు వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 84,706 మంది ఆక్రమణదారుల జాబితాలను సిద్ధం చేసింది. ఇప్పటివరకు ఉన్న నిబంధన ప్రకారం 2007 జనవరి 29 నాటికి ఆక్రమణలో ఉన్నవారికే ప్రయోజనం చేకూరుతుంది. తాజాగా ఈ కటాఫ్ తేదీని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2014 జూన్ 2 నాటికి అసైన్డ్ భూములు ఎవరి పేరిట ఉన్నాయో గుర్తించి.. వారి పేరిట రీ అసైన్ చేస్తారు. అందుకు అనుగుణంగా తెలంగాణ అసైన్డ్ ల్యాండ్స్(ప్రొహిబిష¯Œన్ ఆఫ్ ట్రాన్స్ఫర్) యాక్ట్– 977లో పలు నిబంధనల్ని సవరించటం తప్పనిసరి. అందుకే అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు ఆర్డినెన్స్ జారీ చేయాల్సి ఉంటుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 12కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్డినెన్స్‌కు అధికార యంత్రాంగం రూపకల్పన చేస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ చేపట్టి పేద వర్గాలకు రీ అసైన్డ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగుపై వచ్చే వారమే ఆర్డినెన్స్! అన్ని పాఠశాలలు, విద్యా సంస్థల్లో తెలుగు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుంది. రాష్ట్రంలో ఉన్న సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఇంటర్నేషనల్ స్కూళ్లన్నింటా తెలుగును తప్పనిసరి చేసేలా ఈ ఆర్డినెన్స్ ఉంటుంది. వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనే దీనికి చట్టరూపం కల్పించాలని సీఎం భావిస్తున్నారు. ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా సీఎం హామీ ఇచ్చిన మేరకు ఆర్డినెన్స్‌ను అధికారులు తయారు చేశారు. ప్రస్తుతం ఆర్డినెన్స్ ముసాయిదా న్యాయ శాఖ పరిశీలనలో ఉంది. గవర్నర్ ఆమోదంతో వచ్చే వారంలో ఆర్డినెన్స్‌ను జారీ చేసే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
లైన్ క్లియర్!
ప్రభుత్వ తాజా నిర్ణయంతో.. అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన పేదలకు ఊరట లభించనుంది. భూమిలేని బీపీఎల్ కుటుంబాలకు ఈ భూములను అనుభవించే హక్కు దక్కనుంది. అయితే, ఇలా భూ బదలాయింపు జరిగిన పేదలకు భూమిపై యాజమాన్య హక్కు ఉండదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చేతులు మారిన భూములపై కొనుగోలుదారులకు అనుభవించే హక్కులు ఇవ్వడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దారిద్య్రరేఖ దిగువ ఉన్న పేదలకు మాత్రమే ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు రెవెన్యూ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. సాగు చేసుకొని జీవనం సాగించేందుకు ఈ భూములను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఈ భూముల క్రయ విక్రయాలు నిషేధం. ఎవరైనా భూమి అమ్మినట్లు తేలితే.. పీఓటీ చట్టం– 1977 ప్రకారం ఆ భూమిని వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంది. అలా తిరిగి తీసుకున్నదానిని మరో భూమిలేని పేదకు పంపిణీ చేసే విచక్షణాధికారం కూడా ఉంది. ధరలు నింగినంటడంతో.. భూముల విలువలు గణనీయంగా పెరగడంతో అసైన్మెంట్ భూములకు రెక్కలొచ్చాయి. చాలా చోట్ల ఇవి పక్కదారి పట్టాయి. బడాబాబులు, ప్రజాప్రతినిధులు కారుచౌకగా ఈ భూములను కొల్లగొట్టారు. రికార్డుల్లో అసైన్డ్‌దారుల పేర్లే కొనసాగుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరాధీనమయ్యాయి. వీటిలో చాలావరకు వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుండగా.. కొంతమంది మాత్రం ఫామ్‌హౌస్, రిసార్టులుగా మార్చారు. మరికొందరు ఏకంగా ఈ భూముల్లో బహుళ అంతస్తు భవనాలు, వాణిజ్య సముదాయాలు, ఇంజనీరింగ్ తదితర విద్యాసంస్థలను ఏర్పాటు చేశారు. పలుకుబడి గల వ్యక్తుల గుప్పిట్లో ఉన్న భూములను వెనక్కి తీసుకోవడం రెవెన్యూయంత్రాంగానికి తలకుమించిన భారంగా మారింది. దీంతో అటువైపు కన్నెత్తి చూసేందుకే సాహసించడం లేదు. 77వేల ఎకరాలు అన్యాక్రాంతం జిల్లాలో ఇప్పటివరకు 87,064.35 ఎకరాలను పేదలకు పంపిణీ చేయగా.. ఇందులో 77,179.22(88.65%) ఎకరాల మేర ఆక్రమణకు గురైనట్లు అధికార యంత్రాంగం లెక్కతేల్చింది. నిబంధనలు ఉల్లంఘించి విక్రయించిన 3,705.02 ఎకరాలను మాత్రమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. భూముల స్వాధీనాన్ని తప్పుబడుతూ 4,135 కేసులు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో భూముల స్వాధీనం ప్రహసనంగా మారింది. జిల్లావ్యాప్తంగా 25,697 మంది ఈ భూముల్లో పాగా వేసినట్లు ప్రభుత్వ సర్వేలో వెల్లడైంది. క్రమబద్ధీకరణ ఇలా..! ప్రభుత్వ తాజా నిర్ణయం ఈ భూములు కొనుగోలు చేసిన పేదలకు ఊరట లభించనుంది. భూమిలేని బీపీఎల్ కుటుంబాలకు ఈ భూములను అనుభవించే హక్కు దక్కనుంది. గతంలో భూములు కొనుగోలు చేసినా.. అమ్మినా చట్ట విరుద్ధం. కొన్ని చోట్ల మాత్రం భూమిలేని పేదలు కొంటే వారికే కేటాయించేవారు. అయితే, ఇదంతా స్థానిక అధికారుల విచక్షణాధికారాన్ని బట్టి ఉంటుంది. ఈ క్రమంలో తాజా నిర్ణయంతో అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన భూమిలేని పేదలకు ప్రయోజనం కలుగనుంది. అయితే, ఇలా భూ బదలాయింపు జరిగిన పేదలకు భూమిపై యాజమాన్య హక్కు ఉండదని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఇదిలావుండగా, హెచ్ఎండీఏ పరిధిలో పరాధీనమైన అసైన్డ్ భూములను వెనక్కి తీసుకొని ప్రజోపయోగ కార్యక్రమాలకు ఉపయోగించాలని ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో మన జిల్లా సింహభాగం హెచ్ఎండీఏ ఆధీనంలో ఉన్నందున.. ఈ ప్రయోజనం మారుమూల మండలాలకే వర్తించే అవకాశాలున్నట్లు తెలుస్తోందని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. తాజాగా జరుగుతున్న రెవెన్యూ రికార్డుల భూ ప్రక్షాళనలో భాగంగా.. చేతులు మారిన భూములపై స్పష్టత వచ్చిందని, అలాగే అందులో భూమిలేని పేదల జాబితాను కూడా సేకరించామని, దీని ఆధారంగానే వీటి బదలాయింపు ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో పంపిణీ చేసిన అసైన్డ్ భూమి(ఎకరాల్లో) అసైన్డ్ చేసిన భూమి లబ్ధిదారుల ఆధీనంలో పరాధీనం 87,064.35 9,885.13 77,179.22 -
భూములు రీ అసైన్?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములు పేదల అధీనంలో ఉంటే వాటిని వారికే తిరిగి అసైన్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. కబ్జాలో లేని, విక్రయించేసుకున్న వారికి చేసిన అసైన్మెంట్లను రద్దు చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వాస్తవానికి అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు చట్టపరంగా నేరం. ఆ లావాదేవీలు కూడా చెల్లవు. అయినా ఆ అసైన్డ్ భూములను దారిద్య్రరేఖకు దిగువన (బీపీఎల్) ఉన్న కుటుంబాలు కొనుగోలు చేసి, వినియోగించుకుంటున్నట్లయితే వారికే తిరిగి అసైన్ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో భాగంగా అసైన్డ్ భూముల సమస్యకు పరిష్కారం చూపాలని యోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఈ మేరకు త్వరలోనే నిర్ణయం వెలువరించనుందని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ఆరు లక్షల ఎకరాలు అన్యాక్రాంతం.. రాష్ట్రంలో పేదలకు భూముల అసైన్మెంట్ ప్రక్రియ చాలా ఏళ్లుగా జరుగుతోంది. దాదాపు ఆరు దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు తెలంగాణవ్యాప్తంగా 20 లక్షల ఎకరాల వరకు పేదలకు అసైన్ చేసినట్లు అంచనా. కానీ ఈ భూమిలో 30 శాతానికిపైగా అన్యాక్రాంతమైంది. భూమి పొందిన పేదలే ఇతరులకు అమ్ముకున్నారు. వీటిలో చాలా వరకు పేదలే కొనుగోలు చేశారు. అన్యాక్రాంతమైన అసైన్డ్ భూముల్లో బీపీఎల్ కేటగిరీలో ఉన్న పేదలు కొన్నవే 60 శాతానికి పైగానే ఉంటాయని.. మిగతావి వివిధ సంస్థలు, బడాబాబుల చేతిలోకి వెళ్లాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అంటే దాదాపు 3 లక్షల ఎకరాల మేర అసైన్డ్ భూమి చేతులు మారినా పేదల ఆధీనంలోనే ఉన్నట్లయింది. ప్రక్షాళనలో వెలుగులోకి.. చాలా కాలంగా అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై చర్చలు జరుగుతున్నా.. తాజాగా భూరికార్డుల ప్రక్షాళనలో లెక్కలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన ప్రక్షాళనలో దాదాపు 40వేలకు పైగా సర్వే నంబర్ల పరిధిలోని 1.25 లక్షల ఎకరాలకుపైగా అసైన్డ్ భూమి ఇతరుల చేతుల్లో ఉన్నట్లుగా తేలింది. ప్రక్షాళన కార్యక్రమం పూర్తయ్యే సరికి ఇది ఐదారు లక్షల ఎకరాల దాకా చేరుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో భూబదలాయింపు నిరోధక చట్టం (పీవోటీ)–1977 ప్రకారం ఈ భూములపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనిని ముందే ఊహించిన ప్రభుత్వం రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం మొదలైనప్పుడే తగిన మార్గదర్శకాలు జారీ చేసింది. అసైన్డ్ భూముల్లో ఇతరులు కబ్జాలో ఉంటే వారి సామాజిక, ఆర్థిక వివరాలను కూడా సేకరించి నమోదు చేయాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ మేరకు వివరాల సేకరణ కూడా జరుగుతోంది. ఈ సమాచారం ఆధారంగా.. బీపీఎల్ పరిధిలోకి వచ్చే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, ఈబీసీలు కనుక అసైన్డ్ భూముల కబ్జాలో ఉంటే వారి పేరిట మళ్లీ అసైన్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్, రెవెన్యూ ఉన్నతాధికారులు ఇప్పటికే అంతర్గత సమావేశాల్లో రెవెన్యూ యంత్రాంగానికి సంకేతాలు ఇస్తున్నారు. ఈ అంశంపై అధ్యయనం కోసం ప్రభుత్వం ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అధ్యక్షతన 10 మంది మంత్రులతో కేబినెట్ సబ్‌కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీ త్వరలో రెవెన్యూ ఉన్నతాధికారులతో చర్చిస్తుందని, అనంతరం ప్రభుత్వం అసైన్డ్ భూములపై నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడిస్తుందని సమాచారం. మూడు లక్షల ఎకరాలు రీ అసైన్! అన్యాక్రాంతమై పేదల చేతుల్లో ఉన్న సుమారు 3 లక్షల ఎకరాల భూమిని రీ అసైన్ చేసే అవకాశముందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అయితే కచ్చితంగా కబ్జాలో ఉండి, సాగుచేస్తున్న వారికే రీఅసైన్ చేయనున్నారు. చాలాచోట్ల అసైన్డ్ భూముల పట్టాలున్నా.. భూమి లేని పరిస్థితి ఉంది. కొందరు లబ్ధిదారులకు ఫలానా చోట 2 ఎకరాలు అసైన్ చేసినట్టు రికార్డులు ఉన్నా.. ఆ సర్వే నంబర్లో తగినంత భూమి లేదు. ఇలాంటి కేసుల విషయంలో అసైన్మెంట్ను రద్దు చేయాలని, కబ్జాలో ఉండి సాగు చేస్తున్న వాటిని మాత్రమే అసైన్డ్ భూమిగా గుర్తించాలని నిర్ణయించారు. దీనివల్ల నష్టపోయే లబ్ధిదారులకు మరో రూపంలో లబ్ధి చేకూర్చాలని యోచిస్తున్నారు. బడా బాబులకు లీజు..! కొన్ని ప్రాంతాల్లోని అసైన్డ్ భూములు పలు బడా సంస్థలు, వ్యక్తుల ఆధీనంలో ఉన్నాయి. అసైనీలకు ఎంతోకొంత ముట్టజెప్పి ఆయా సంస్థలు, వ్యక్తులు అసైన్డ్ భూములను తీసుకున్నారు. ఈ భూముల విషయంగానూ ప్రభుత్వం స్పష్టతతోనే ఉన్నట్టు సమాచారం. బీపీఎల్ పరిధిలోనికి రాని వ్యక్తుల చేతుల్లో అసైన్డ్ భూమి ఉంటే... ఆ భూమి వివరాలను నేరుగా తెలంగాణ రాష్ట్ర భూనిర్వహణ సంస్థ (టీఎస్ఎల్ఎంఏ)కు పంపాలని నిర్ణయించారు. టీఎస్ఎల్ఎంఏ సమావేశంలో నిర్ణయించిన మేర సదరు భూమిని లీజుకు ఇవ్వడం, లేదా భారీగా రుసుము కట్టించుకుని రెగ్యులరైజ్ చేయడం వంటివి చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే అసైన్డ్ భూమిని రెగ్యులరైజ్ చేసేందుకు పీవోటీ చట్టం అంగీకరించదు. ఈ నేపథ్యంలో పీవోటీ చట్టానికి పకడ్బందీ సవరణలు చేయడం ద్వారా రెగ్యులరైజ్ చేయవచ్చని ఉన్నతాధికారులు చెబుతున్నారు. లేదంటే సదరు భూమిని లీజుకు ఇవ్వవచ్చని పేర్కొంటున్నారు. మొత్తంగా కేబినెట్ సబ్‌కమిటీ భేటీ తర్వాత పూర్తి స్పష్టత రానుంది. -
‘అసైన్డ్’ సమస్యకు ‘ప్రక్షాళన’తో పరిష్కారం!
భూ రికార్డుల ప్రక్షాళనలో అసైన్డ్ భూముల సమస్యకు చెక్ - అన్యాక్రాంతమైన భూముల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు - కబ్జాలో ఉన్న వారి ‘సామాజిక, ఆర్థిక హోదా’ వివరాలు చెప్పాలని ఉత్తర్వులు - నివేదికల ఆధారంగా రీ అసైన్ లేదా క్రమబద్ధీకరణ! - లక్షల ఎకరాలు పట్టాలయ్యే చాన్స్ - దళితులైతే మూడెకరాల పంపిణీ కింద అందజేత సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ వ్యవస్థలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న మరో సమస్యకు భూ రికార్డుల ప్రక్షాళన పరిష్కారం చూపుతుందా.. అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ఈనెల 15 నుంచి జరగనున్న ఈ ప్రక్రియలో అసైన్డ్ భూముల సమస్యకు ఫుల్స్టాప్ పెట్టే దిశలో రెవెన్యూ యంత్రాంగం నిబంధనలు రూపొందించింది. అసైన్డ్ భూములు నిజమైన లబ్ధిదారుల చేతిలో ఉంటే మళ్లీ వారి పేరు మీద రికార్డుల్లో నమోదు చేసుకోవాలని, వేరొకరి కబ్జాలో ఉంటే తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం ‘సామాజిక, ఆర్థిక హోదా’ అనే పదాన్ని భూ రికార్డుల ప్రక్షాళన కోసం రూపొందించిన మార్గదర్శకాల్లో చేర్చింది. 20 లక్షల ఎకరాల పైమాటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పటి నుంచే భూమి లేని నిరుపేదలకు భూ పంపి ణీ చేశారు. వ్యవసాయ, నివాస భూముల ను దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారికి అసైన్ చేసేవారు. తర్వాత రాజకీయ బాధి తులు, స్వాతంత్య్ర సమరయోధులకు భూములు అసైన్ చేశారు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలకు పైగానే అసైన్ చేసిన భూములు ఉంటాయని అంచనా. 40 శాతం అన్యాక్రాంతం అయితే ఈ అసైన్డ్ భూములను అమ్ముకునే అవకాశం లేదు. వేరొకరి పేరు మీద రిజిస్టర్ కూడా కావు. కానీ దాదాపు 40 శాతం పైగా అసైన్డ్ భూములు అన్యాక్రాంతం అయ్యాయని రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన భూములను లబ్ధిదారులు అమ్ముకోవడం.. లేదంటే వ్యవసాయ యోగ్యం కాక వదిలివేయడంతో వేరొకరు కబ్జా చేశారని, ఇలా రాష్ట్రంలో 8 లక్షల వరకు అసైన్డ్ భూములు ఇతరుల చేతుల్లో ఉన్నాయని అంటున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ కూడా ఓ నివేదిక ఇచ్చింది. అసైన్డ్ భూములు అన్యాక్రాంతమైతే వాటిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చని చట్టాలు చెబుతున్న నేపథ్యంలో.. 15 నుంచి ప్రారంభం కానున్న భూ రికార్డుల ప్రక్షాళనలో అసైన్డ్ భూముల వాస్తవ పరిస్థితి తేలనుంది. అన్యాక్రాంత అసైన్డ్ భూములను ఏకపక్షంగా తిరిగి తీసుకునే దానికంటే కబ్జాలో ఉన్న వారి జీవన పరిస్థితి ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసైన్డ్ భూముల కబ్జాలో ఉన్న వారి సామాజిక ఆర్థిక హోదా వివరాలు పేర్కొంటూ ప్రత్యేక నివేదిక పంపాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ప్రక్షాళనకు వెళ్లినప్పుడు ఏం చేస్తారంటే? రికార్డుల ప్రక్షాళనకు వెళ్లినప్పుడు ప్రభుత్వం అసైన్ చేసిన భూముల్లో నిజమైన లబ్ధిదారులే ఉంటే అక్కడే వారికి 1–బీ రిజిస్టర్ ప్రతిని అందజేస్తారు. పాసు పుస్తకాలు లేని వారుంటే వివరాలు నమోదు చేసుకుంటారు. ఒకవేళ లబ్ధిదారు కాకుండా వేరొకరు కబ్జాలో ఉంటే వారి సామాజిక, ఆర్థిక హోదాను తెలి యజేస్తూ నివేదిక పంపాలని కలెక్టర్లకు పంపిన మార్గదర్శకాల్లో సీఎస్ ఎస్పీ సింగ్ స్పష్టంగా పేర్కొన్నారు. కబ్జాలో ఉన్న వారి పేరు, విస్తీర్ణం, వ్యవసాయ యోగ్యమా కాదా, వారి సామాజిక, ఆర్థిక పరిస్థితి ఏంటి, కులం తదితర వివరాలను పేర్కొనాలని సూచించారు. ఈ వివరాలు తెలుసుకోవడం ద్వారా కబ్జాలో ఉన్నది నిజంగా పేదలైతే వారికే రీ అసైన్ లేదా నామమాత్రపు ధర మీద క్రమబద్ధీకరించే ఆలోచనతోనే ఈ నిబంధన చేర్చామని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఇక కులం తెలుసుకోవడం ద్వారా కబ్జాలో ఉన్నది దళితులైతే వారికి మూడెకరాల భూ పంపిణీ కింద నేరుగా పట్టాలిచ్చే యోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొంటున్నాయి. -
అసైన్డ్ భూములను ఏం చేద్దాం?
అన్యాక్రాంతమైన భూములపై సర్కారు తర్జనభర్జన - రాష్ట్రంలో 98 వేల ఎకరాలు పరాధీనం - పరిశీలనలో గుర్తించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ - క్రమబద్ధీకరించాలన్న దిశగా ప్రభుత్వ యోచన సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసైన్డ్ భూముల అన్యాక్రాంతంపై ప్రభుత్వం దృష్టి సారించింది. అయితే వాటిని చట్టం ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకోవాలా లేక చట్టాలను సవరించి పొజిషన్లో ఉన్నవారికే క్రమబద్ధీకరించాలా అని తర్జనభర్జన పడుతోంది. 98 వేల ఎకరాలు పరాధీనం రాష్ట్రంలో ఇప్పటివరకు అసైన్ చేసిన భూముల్లో సుమారు 98 వేల ఎకరాల మేర పరాధీనమైనట్టు తేలింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 22 లక్షల ఎకరాలకు పైగా భూములను పేదలకు అసైన్ చేశారు. కానీ అందులో 14.28 లక్షల ఎకరాలను మాత్రమే పంపిణీ చేశారు. ఈ 14 లక్షల పైచిలుకు ఎకరాల్లో 98 వేల ఎకరాలకుపైగా అన్యాక్రాంతమయ్యాయని.. ఒకరికి అసైన్ చేస్తే ఇతరులెవరో అనుభవిస్తున్నారని వెల్లడైంది. సీనియర్ ఐఏఎస్ అధికారి ఎస్.కె.సిన్హా నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ.. జిల్లా కలెక్టర్ల నుంచి సమాచారం తీసుకుని ప్రభుత్వానికి నివేదించినట్టు తెలుస్తోంది. పలు ఇబ్బందులు కూడా..! పీవోటీ చట్టం ప్రకారం అసైన్డ్ భూమి అన్యాక్రాంతమైతే దానిని ప్రభుత్వం బేషరతుగా స్వాధీనం చేసుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని సమస్యలు ఉన్నాయని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. రిజిస్ట్రేషన్ పత్రాలు సహా పక్కా సాక్ష్యాలు లేకుండా ఆ భూములను స్వాధీనం చేసుకోవడం కుదరదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంటే అసైన్ భూమిలో ఎవరున్నా.. ఆ భూమి ఎవరి పేరు మీద రిజిస్టరై ఉంది, ఆ వ్యక్తి అనుభవంలో ఉన్నాడా? అనే దానిపై రెవెన్యూ యంత్రాం గం సాక్ష్యాలను సేకరించాల్సి ఉంటుంది. కానీ అలా చేస్తే జాప్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలోని 77 వేల ఎకరాల్లో పీవోటీ ఉల్లంఘనలు కనిపిస్తుంటే ఇప్పటివరకు 4,135 కేసులు నమోదు చేసి.. 3,705 ఎకరాలను స్వాధీనం చేసుకోగలిగారు. క్రమబద్ధీకరిస్తే భారీగా ఆదాయం ఈ అంశంలో ప్రభుత్వం వద్దకు మరో ప్రతిపాదన వచ్చింది. ఎలాగూ ప్రభుత్వ భూములక్రమబద్ధీకరణ ఎప్పటి నుంచో కొనసాగుతున్నందునా ... అసైన్డ్ భూములనూ క్రమబద్ధీకరించాలని, తద్వారా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుందని సూచనలు అందాయి. దీనికి ప్రభుత్వం అంగీకరిస్తే.. పీవోటీ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. ఇక క్రమబద్ధీకరిస్తే.. మార్కెట్ విలువలో ఎంత శాతం వరకు రుసుము కింద తీసుకోవాలనే దానిపైనా చర్చలు జరుగుతున్నాయి. అన్యాక్రాంతమైన భూమి ఉన్న ప్రాంతాన్ని బట్టి ఈ రుసుములో మార్పులు చేయాలని... ఎన్నేళ్లుగా ఆ భూమి అనుభవిస్తున్నారు, ఆ భూమిలో ఏం చేస్తున్నారన్న అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుని.. భారీ జరిమానాతో క్రమబద్ధీకరించుకునే అవకాశం ఇవ్వవచ్చని రెవెన్యూ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇంకా తేలలేదు. వేల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమైన అసైన్డ్ భూముల విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుందని అం చనా. రంగారెడ్డి జిల్లాలో వేల ఎకరాలకుపైగా ఇతరుల చేతుల్లో ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్ నివేది కలో తేలింది. ఈ జిల్లాలో ఇప్పటివరకు 87,064 వేల ఎకరాల మేర అసైన్ చేయగా.. 9,885 ఎకరాల్లో మాత్రమే అసలైన పట్టాదారులు ఉన్నారు. మిగతా 77,179 ఎకరాల్లో పీవోటీ చట్టం ఉల్లంఘనలు ఉన్నట్లు అంచనా. ఇందులో కనీసం 20 వేలకుపైగా ఎకరాల్లో ఇతరులు పాగా వేశారని చెబుతున్నారు. ముఖ్యంగా సరూర్‌నగర్, బాలాపూర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, షాద్‌నగర్, చేవెళ్ల, శంషాబాద్, ఇబ్రహీంపట్నం, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మేడ్చల్ లాంటి డిమాండ్ ఉన్న చోట్ల పెద్ద ఎత్తున ఈ భూములు చేతులు మారినట్టు అధికారులు గుర్తించారు. అన్యాక్రాంతమైన భూములు 98 వేల ఎకరాలు పీవోటీ చట్టం ఉల్లంఘన 77 వేల ఎకరాలు పీవోటీ ఉల్లంఘనులపై నమోదైన కేసులు 4,135 స్వాధీనం చేసుకున్నవి 3,705 ఎకరాలు -
జాగీరు భూముల పాస్ పుస్తకాలు రద్దు
ఆర్వోఆర్ చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ సిద్ధం - నేటి కేబినెట్ భేటీలో ఆమోదం సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూముల తరహాలో జాగీరు భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆర్వోఆర్ (రికార్డ్స్ ఆఫ్ రైట్స్) చట్టానికి సవరణలతో ఆర్డినెన్స్ తెచ్చేందుకు రెవెన్యూ శాఖ ముసాయిదా సిద్ధం చేసింది. వీటితోపా టు పలు కీలక ఆర్డినెన్స్‌లను ఆమోదించేందు కు శనివారం సాయంత్రం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం కానుంది. ఇదే సమావేశంలో పోలీస్ శాఖలో కొత్తగా పదివేల ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే అవకాశాలున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఏర్పడ్డ కొత్త పోలీస్ స్టేషన్లు, పెరిగిన అవసరాల దృష్ట్యా ఎస్సైలు, కానిస్టేబుళ్లు సహా దాదాపు 18 వేల అదనపు సిబ్బంది కావాలని ఆర్థిక శాఖకు హోంశాఖ ప్రతిపాదనలు పంపింది. అందులో దాదాపు 10 వేల పోస్టులకు ఆమోదం తెలిపే అవకాశా లున్నాయి. ఇదే సందర్భంగా తెలంగాణ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. కానీ పదో షెడ్యూల్ సంస్థల విభజన ఇంకా పూర్తి కాలేదు. విభజన చట్టం ప్రకారం మానవ హక్కుల కమిషన్ పదో షెడ్యూల్లో ఉంది. అందుకే దీన్ని కేబినెట్ ముందుంచాలా లేదా అని అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. జాగీరు భూముల మ్యుటేషన్లకు చెక్ నిజాం హయాంలోని జాగీర్దార్లకు సంబంధిం చిన భూములను ప్రభుత్వం అప్పట్లోనే రద్దు చేసింది. వీటిని ప్రభుత్వ భూములుగా గుర్తించింది. అదే సమయంలో ఏడుగురు జాగీర్దార్లకు సంబంధించిన భూములు పెం డింగ్‌లో పడ్డాయి. నలుగురు ఆచూకీ లేకపోగా మిగతా ముగ్గురికి సంబంధించి దాదాపు 2,200 ఎకరాల భూములు తమకే చెందుతా యని కోర్టులో కేసులు నమోదయ్యాయి. మియాపూర్‌లో ఇటీవల వెలుగులోకి వచ్చిన అవినీతి భాగోతానికి సంబంధించిన భూములు ఇవే. ఈ భూములను సొంతం చేసుకునేందుకు ప్రయత్నించిన పైరవీకారుల ప్రయత్నాలకు తలొగ్గి ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఈ భూములను వారి పేరిట మ్యుటేషన్ చేయాలని రెండుసార్లు మెమోలు జారీ చేసింది. మియాపూర్ భూము ల భాగోతంతో ఒక్కొక్కటిగా అక్రమాలు వెలుగులోకి రావటం ఇప్పుడు ప్రభుత్వం మెడకు చుట్టుకుంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం చట్టాన్ని సవరించి అక్రమాలకు అడ్డుకట్ట వేసే ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ఆర్వోఆర్ చట్టం ప్రకారం... రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయరు. రెవెన్యూ రికార్డుల్లో మార్పులు చేయటం కుదరదు. పట్టాదారు పాసు పుస్తకాలు లేకుంటే మ్యుటేషన్ చేసుకునే అవకాశం లేదు. అందుకే ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములతోపాటు జాగీరు భూములను ఆర్వోఆర్ చట్టంలో చేర్చుతూ సవరణ తెచ్చేలా ఆర్డినెన్స్‌ను ప్రభుత్వం తయారు చేసింది. దీంతో పాసు పుస్తకాలు రద్దు చేసి, తదుపరి ఇవ్వకుండా నిలిపేస్తే గతంలో జారీ చేసిన మ్యుటేషన్ ఆర్డర్లు చెల్లకుండా పోతాయని న్యాయశాఖ ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్ జారీకి రెవెన్యూ శాఖ ముసాయిదా ను సిద్ధం చేసింది. సబ్ రిజిస్ట్రార్లకున్న అధికారాలకు కత్తెర వేయనున్నారు. రిజిస్ట్రేషన్ చట్టంలో మార్పులు చేర్పులు చేస్తూ ఆర్డినెన్స్ విడుదల చేయనున్నారు. పీడీ యాక్ట్ విస్తరణ నకిలీలు, మోసాలపై ఉక్కుపాదం మోపేందు కు ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టులో మరిన్ని అంశాలను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు మరో ఆర్డినెన్స్‌ను రూపొందించారు. ప్రధానంగా నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ నోట్లు, నకిలీ డాక్యుమెంట్లు, అక్రమంగా చెట్ల నరికివేత, గ్యాంబ్లింగ్, మట్కా, జూదం, గుడుంబా అమ్మకాలన్నీ ఇందులో చేర్చనున్నారు. నకిలీ విత్తన నిరోధక చట్టం నకిలీ విత్తనాలతో నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు నకిలీ విత్తన నిరోధక చట్టం తీసుకు వస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇప్పటికే ప్రకటించారు. ఈ ఖరీఫ్ నుంచే అమలయ్యేలా ఈ ఆర్డినెన్స్ జారీ చేయాలని భావిస్తున్నారు. నకిలీ విత్తనాలు అమ్మితే జైలు శిక్షతోపాటు రైతులకు నష్టపరిహారం చెల్లించేలా ఆర్డినెన్స్ సిద్ధం చేశారు. గవర్నర్‌తో సీఎం భేటీ కేబినెట్ భేటీ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ గవర్నర్‌తో భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు వెళ్లి దాదాపు గంటపాటు చర్చలు జరిపారు. ప్రధానంగా కొత్తగా రూపొందించిన ఆర్డినెన్స్‌లను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అసెంబ్లీ సమావేశాలు ఇప్పట్లో లేనందున ఆర్డినెన్స్‌లు జారీ చేయాల్సిన అవసరాన్ని సీఎం నివేదించినట్లు సమాచారం. -
అసైన్డ్‌పై గద్దలు!
►పరాధీనమవుతున్న వందల ఎకరాల అసైన్డ్ భూమి ►నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న రిజిస్ట్రేషన్లు ►అధికారుల అండతో రెచ్చిపోతున్న బడాబాబులు ►చేతులు మారుతున్నా పట్టించుకోని యంత్రాంగం ►ఈ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలదే కీలకపాత్ర..! ►కేవలం నోటీసులతోనే సరిపుచ్చుతున్న ప్రభుత్వం ►విలువైన భూములను కాపాడుకోవడంపై నిర్లక్ష్యం ఇటీవల శంషాబాద్ మండలం ఘాంసీమియాగూడ, బహుదూర్‌గూడ, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం, మేడ్చల్ మండలం గిర్మాపూర్ మొదలు అనేక చోట్ల అసైన్డ్ భూములు చేతులు మారినట్లు తేలింది. ఈ క్రమంలోనే రోజుకోతీరుగా మరిన్ని అక్రమాలు బయటపడుతున్నాయి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో 1,15,218 మంది భూమిలేని నిరుపేదలకు 1,58,646.25 ఎకరాల మేర భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. దీనిని కేవలం వ్యవసాయ అవసరాలకే వినియోగించాలని స్పష్టం చేసింది. ఒకవేళ చేతులు మారినా.. ఇతరత్రా అవసరాలకు మార్పు చేసినా పీఓటీ చట్టం కింద అసైన్మెంట్ను రద్దు చేసి భూమిని స్వాధీనం చేసుకునే అధికారం ప్రభుత్వానికుంది. ప్రభుత్వ భూములకు రెక్కలొస్తున్నాయి. అసైన్డ్ భూముల క్రయవిక్రయాలు చెల్లవని తెలిసినా యథేచ్ఛగా చేతులు మారుతున్నాయి. నగరీ కరణతో భూముల విలువలు నింగినంటాయి. దీంతో అసైన్డ్ భూములు కూడా పరాధీనమవుతున్నాయి. అత్యంత విలువైన ప్రభుత్వ భూముల్ని అడ్డగోలుగా అక్రమార్కులు ఎగురేసుకుపోతున్నా రెవెన్యూ యంత్రాంగం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. అప్పుడప్పుడు క్షేత్రస్థాయిలో సర్వేలు నిర్వహించి పీఓటీ చట్టం–1977 కింద వెనక్కి తీసుకుంటున్నట్లు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకుంటోంది. అసైనీల స్థానే బినామీలు పుట్టుకొస్తున్నా.. నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో విలువైన స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : భూముల ధరలు పెరిగిపోవడంతో అసైన్డ్ భూములపై కన్నేసిన బడాబాబులు, ప్రజాప్రతినిధులు పేద రైతులను నయానో భయానో ఒప్పించి వాటిల్లో పాగా వేస్తున్నారు. కారుచౌకగా లభించే ఈ భూములను కొందరు ఫామ్హౌస్లుగా మార్చుకుంటుండగా.. మరికొందరు మాత్రం విద్యాసంస్థలు, వాణిజ్య భవనాలు నిర్మిస్తున్నారు. ఇంకొందరు ఏకంగా ప్లాట్లు చేసి విక్రయించేస్తున్నారు. ఈ తతంగమంతా బహిరంగంగానే జరుగుతున్నా.. రెవెన్యూ యంత్రాంగానికి మాత్రం కనిపించదు. ప్రభుత్వ పెద్దలు సైతం ఈ వ్యవహారంలో కీలకపాత్ర పోషిస్తుండడంతో అటువైపు కన్నెత్తి చూసేందుకు సాహసించదు. అక్రమ రిజిస్ట్రేషన్లు! ప్రభుత్వ భూములుగా పరిగణించే వీటిని 22ఏ కింద నిషేధిత జాబితాలో పొందుపరిచింది. ఈ భూముల క్రయ విక్రయాలు జరుగకుండా నిరోధిస్తూ ఈ జాబితాను స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు పంపింది. అయినప్పటికీ గుట్టుగా భూముల అమ్మకాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల ఈ భూములు ఏకంగా రిజిస్ట్రేషన్ కూడా అవుతున్నాయి. రియల్టర్లు, బడాబాబులతో మిలాఖత్ అయిన కొందరు సబ్రిజిస్ట్రార్లు వీటిని కూడా రిజిస్ట్రేషన్ చేస్తుండడం గమనార్హం. ఇటీవల శంషాబాద్ మండలం ఘాంసీమియాగూడ, బహుదూర్‌గూడ, ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం, మేడ్చల్ మండలం గిర్మాపూర్ మొదలు అనేక చోట్ల అసైన్డ్ భూములు చేతులు మారినట్లు తేలింది. కోర్టు కేసులను సాకుగా చూపి విలువైన ఈ భూములను ఎగురేసుకుపోతుండడంతో రెవెన్యూయంత్రాంగం చేష్టలుడిగిచూస్తోంది. జిల్లా అధికారుల లెక్కల ప్రకారం గతేడాది వరకు పరాధీనమైన 3,553 ఎకరాలను వెనక్కి తీసుకుంది. ఈ మేరకు ఆయా భూముల్లో బోర్డులు నాటినప్పటికీ, చాలా చోట్ల పొజిషన్లో మాత్రం ఆక్రమణదారులే కొనసాగుతుండడం గమనార్హం. కొన్ని ప్రాంతాల్లో పేదలు భూములు అమ్ముకోవడం.. అమాయక రైతులు కొని మోసపోగా.. శివార్లలో మాత్రం పలుకుబడి గల సంపన్నవర్గాలు ఈ భూముల్లో తిష్ట వేశాయి. ముఖ్యంగా హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, మొయినాబాద్, చేవెళ్ల, మహేశ్వరం, బాలాపూర్, కందుకూరు మండలాల్లో అసైన్డ్ భూములు పెద్దల గుప్పిట్లోకి వెళ్లాయి. దీంతో ఈ భూములను వెనక్కి తీసుకోవడం రెవెన్యూయంత్రాంగానికి కత్తిమీద సాములా మారింది. దీనికితోడు న్యాయపరమైన వివాదాలు కూడా అడ్డువస్తుండడం ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవడం కష్టమవుతోంది. -
అసైన్డ్ భూముల్లో బడాబాబుల పాగా!
రికార్డుల్లో మాత్రం సర్కారు భూమి - రింగ్ రోడ్డు చేరువలో రూ.450 కోట్ల విలువైన భూమికి రెక్కలు - అజీజ్‌నగర్‌లో చేతులు మారిన 151 ఎకరాల ప్రభుత్వ భూమి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.450 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది. భూమిలేని పేదల జీవనోపాధికి పంపిణీ చేసిన అసైన్డ్ భూమి బడాబాబుల పాలైంది. రింగ్ రోడ్డు చేరువలో ఉన్న ఈ భూములపై కన్నేసిన భూమాఫియా.. రెవెన్యూ శాఖలోని లొసుగులను ఆసరాగా చేసుకుని రూ.కోట్ల విలువైన భూమిని కొల్లగొట్టింది. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా చలామణి అవుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం కొందరు పెద్దల కబ్జాల్లో మగ్గుతున్నాయి. దీంతో రంగా రెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ రెవెన్యూ పరిధిలో రూ.450 కోట్ల విలువైన 151 ఎకరాల భూమిలో ప్రజా ప్రతి నిధులు, ఐపీఎస్ అధికారులు తిష్ట వేశారు. అడ్డగోలుగా వ్యవహారం అసైన్డ్ భూములను వ్యవసాయ అవసరాలకే వినియోగించాలి. అయితే, చేతులు మారిన ఈ భూముల్లో అక్రమ నిర్మా ణాలు వెలిశాయి. ఈ భూ బాగోతం గురించి రెవెన్యూ యంత్రాంగానికి తెలిసినా.. చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది. అజీజ్‌నగర్ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 176లో 220.37 ఎకరాలు, సర్వే నం.177లో 162.08 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ సర్వే నంబర్లలో 237 ఎకరాల మేర భూమిలేని నిరుపేదలకు 1961–62లో ప్రభుత్వం అసైన్ మెంట్ చేసింది. కాలక్రమేణా చాలా మంది రైతులు ఆ భూములను అమ్ముకున్నారు. రికార్డుల్లోనే స్వాధీనం అసైన్డ్ భూములు పరాధీనం కావడంతో 2002లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది. పీఓటీ చట్టాన్ని ప్రయోగించి 131 ఎకరాలను స్వాధీనం చేసుకుంది. అయితే, ఈ తతంగమంతా కాగితాల్లోనే సాగింది. సర్కారు భూములని బోర్డులు ఉన్నా.. కబ్జాలో అక్రమార్కులే ఉన్నారు. హైదరాబాద్ రాజకీయాలను శాసించే ఓ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈ భూముల్లో ఇంజనీరింగ్, వైద్యకళాశాలను ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వంలో కీలక భూమిక పోషించిన మాజీ మంత్రికి కూడా ప్రభుత్వం ఇక్కడ అప్పనంగా భూమిని ‘దానం’ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ రాజకీయాలను ‘అల్లాడి’ంచిన మాజీ రాజ్యసభ సభ్యుడు కూడా అసైన్డ్ భూములకు ఎసరు పెట్టారు. జంట నగరాలకు చెందిన మరో మాజీ ఎంపీ కూడా పేద రైతులను నయానో భయానో ఒప్పించి భూములను సేకరించారు. ఇక సర్వే నంబర్ 176లో దిల్ సంస్థకు కేటాయించిన 126.29 ఎకరాల భూమిలో ఓ ఐపీఎస్ అధికారి పాగా వేశారు. పోలీసుశాఖలో ‘అదనపు’సేవలందిస్తున్న ఆ అధికారి ప్రహరీగోడ కూడా నిర్మించేశారు. ఇదే సర్వే నంబర్లో ఓ ఇంజనీరింగ్ కాలేజీ కూడా వెలిసింది. తన జిల్లాలో కొలువుదీరిన దేవుడి పేరిట ఏర్పాటు చేసిన ఈ విద్యాసంస్థ ఓ మాజీ ఎంపీది కావడం గమనార్హం. కోర్టు కేసులు నడుస్తున్నాయి అజీజ్‌నగర్ రెవెన్యూలోని సర్వే నంబర్ 176, 177లోని అసైన్డ్ భూములు కొంత వరకు చేతులు మారాయి. రైతుల చేతుల్లో లేని భూములను గతంలోనే పీఓటీ కింద స్వాధీనం చేసుకున్నాం. రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే కొనసాగుతోంది. దీనిపై కొంత మంది కొనుగోలు దారులు కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కోర్టులో కేసులు నడుస్తున్నాయి. – నాగయ్య, తహసీల్దార్, మొయినాబాద్ -
తిమింగలాలను వదిలి...తహసీల్దార్లపై వేటా!
విశాఖ భూ కుంభకోణాల్లో విచారణ వైచిత్రి.. సూత్రధారులంతా అధికార పార్టీ నేతలే.. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ.. సమైక్యాంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్రలో ఏకైక పెద్ద నగరం.. ఫలితంగా నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. ఇదే సమయంలో టీడీపీ నేతల భూదాహం పరాకాష్టకు చేరింది. అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, చుక్కల భూములు.. అన్న తేడా లేకుండా వేలాది ఎకరాలను అధికారం దన్నుతో అడ్డంగా ఆక్రమించేశారు. చివరికి హుద్‌హుద్ తుపాను విలయాన్ని కూడా అనుకూలంగా మార్చుకుని భూములు కొల్లగొట్టేశారు. వీటిపై సాక్షిలో వరుస కథనాలు రావడంతో ఎట్టకేలకు స్పందించిన అధికారులు తూతూ మంత్రంగా విచారణ చేపట్టారు. అయితే సూత్రధా రులైన టీడీపీ నేతల జోలికి వెళ్లే సాహసం చేయలేని రెవెన్యూ ఉన్నతాధికారులు.. రాజకీయ పలుకుబడి లేని ఇద్దరు తహసీల్దార్లను మాత్రం బలి చేశారు. లక్ష ఎకరాలకు చెందిన ఎఫ్‌ఎంబీలు మాయమైపోయాయని చెబుతు న్న అధికారులు ఆయా భూములు ఎవరి చేతుల్లో చిక్కుకున్నాయనే వాస్తవాలను మాత్రం వెల్లడించలేకపోతున్నారు. వందల కోట్ల విలువైన భూములు కాజేసిన టీడీపీ ప్రజాప్రతినిధులను పరిశీలిస్తే.... మంత్రి భూ దాహం రూ.600 కోట్లు భీమిలి పరిసరాల్లో మంత్రి బినామీల పాగా విశాఖ నగర శివారులో ఆర్ధిక నగరాలను నిర్మిస్తామని, ఇందుకోసం అసైన్డ్ భూములు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు సేకరించి విశాఖ పట్టణాభివృద్ధి సంస్థ(వుడా) ఆధ్వర్యం లో ఇళ్ల నిర్మాణం చేస్తామని ప్రభుత్వం కొద్దికా లంగా ప్రకటిస్తూ వస్తోంది. ప్రభుత్వం ఈ ప్రకటన చేయకముందే, వుడా ల్యాండ్ పూలిం గ్ పథకం అమలు ఊసెత్తకముందే జిల్లాకు చెందిన ఓ మంత్రి ముందస్తు వ్యూహరచన చేశారు. ప్రధానంగా భీమిలి నియోజకవర్గంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, (అసైన్డ్)డీ పట్టా భూములను ముందుగానే గుప్పిట్లో పెట్టుకున్నారు. ఆయా గ్రామాల్లోని డీ పట్టా భూములకు ఎకరాకు రూ.12 లక్షల వరకు, ఆక్రమణలో ఉన్న భూములకు ఎకరా రూ.3 లక్షలు చొప్పున బేరం కుదుర్చుకున్నారు. ఆ మేరకు రైతులకు అడ్వాన్సులుగా రూ. 2 లక్షల వరకూ చెల్లించి, క్రయ పత్రాలు రాయించుకున్నారు. వాటితో పాటు ఖాళీ పేపర్ల పై సంతకాలు తీసుకుని వాటన్నిటినీ తమ వద్దనే ఉంచుకున్నారు. తర్వాత సదరు మంత్రి.. ప్రభుత్వంలో తన పరపతి ఉపయోగించి ల్యాండ్ పూలింగ్ ప్రకటన చేయించారు. పూలింగ్‌లో భాగంగా వుడా.. రైతు వాటా కింద ఇచ్చే మొత్తాన్ని బినామీలే బొక్కేసి ఏడాది కితం అనుకున్న నామమాత్రపు సొమ్మును రైతుకు చెల్లించేస్తున్నారు. విశాఖ నగర శివారును మింగేస్తున్న ఈ భారీ భూ కుంభకోణం విలువ దాదాపు 600 రూ.కోట్ల పైమాటే. ఎమ్మెల్సీ కబ్జా 35 ఎకరాలు 1976లో భూమిలేని పేదలకు సాగుచేసుకునే నిమిత్తం ఎండాడ, రిషికొండ పరిధిలోని సర్వే నెంబర్ 35, 37, 38ల్లో పట్టాలిచ్చారు. ఆ భూములపై తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ వ్యాపార వేత్త, ఎమ్మెల్సీ కన్నుపడింది. ఆ స్థలాలను తనకు కేటాయించాల్సిందిగా 2008లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పేదల పక్షాన నిలచిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. విలువైన ఆ భూములపై కన్నేసిన టీడీపీ నాయకుడు.. వైఎస్ హఠాన్మరణం తర్వాత మళ్లీ ప్రతిపాదన లు పంపారు. అయితే ఈసారి అప్పటి ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి ఐవీఆర్ కృష్ణారావు అడ్డుకున్నారు. ఆ తర్వాత 2012–13 మధ్య కాలంలో అప్పటి జిల్లా కలెక్టర్ శేషాద్రి ఆ ప్రతి పాదనలను జిల్లా స్థాయిలోనే అడ్డుకున్నారు. శేషాద్రి బదిలీ తర్వాత వచ్చిన అధికారులు మాత్రం సదరు టీడీపీ నాయకుడికి తలొగ్గారు. ఇక 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన దరి మిలా అధికార యంత్రాంగం ఆ నేతకు పూర్తిగా దాసోహమంది. సర్వే నంబర్ 35లో రెండు ఎకరాల 6సెంట్లు, సర్వే నంబర్ 37లో 5ఎక రాల 14సెంట్లు, సర్వే నంబర్ 38లో 8ఎకరాల 44సెంట్లు మొత్తంగా 15ఎకరాల 64సెంట్ల భూమిని సదరు టీడీపీ నేతకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేశారు. జిల్లా స్థాయి నుంచి వెళ్లిన ప్రతిపాదనలకు ఉన్నత స్థాయిల్లోనూ క్లియరెన్స్ వచ్చేసిందని, ఆ ఫైల్‌పై కేవలం సీఎం చంద్రబాబు సంతకమే మిగిలి ఉందని తెలుస్తోంది. మాజీ మంత్రి భూదందా పెందుర్తి మండలం గుర్రమ్మపాలెంలో 2016లో జరిగిన ఏపీఐసీసీ భూముల సేకరణను తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఆదాయ మార్గంగా మలచుకున్నారు. పెందుర్తి మండలం ముదపాకలో దళిత రైతులకిచ్చిన అసైన్డ్ భూమిని కొట్టేసేందుకు ఈ మాజీ మంత్రి భారీ స్కెచ్ వేశారు. అసైన్డ్ భూములన్నింటినీ ప్రభుత్వం తిరిగి తీసేసుకుంటుందని,, అలా తీసుకుంటే ఎకరానికి రెండులక్షల కంటే పరిహారం రాదని దళిత రైతులకు చెప్పుకొచ్చాడు. అవే భూములు తమకిస్తే ఎకరానికి పదిలక్షలు ఇస్తామని అడ్వాన్స్‌లు ఇచ్చాడు. మాజీ మంత్రి మాటలు నమ్మిన 236మంది రైతులు 280 ఎకరాల భూమి రికార్డులను అప్పజెప్పేశారు. ఆ తర్వాత సదరు మాజీ మంత్రి వుడా ల్యాండ్ పూలింగ్‌లోకి తీసుకువచ్చి ఎకరానికి దాదాపు రూ. 2కోట్లకు పైగా కొట్టేసేందుకు రంగం సిద్ధం చేశాడు.ఈ కుంభకోణం విలువ రూ. 500కోట్లపైనే ఉంటుందని అంచనా. చుక్కల భూములపైనా కన్ను స్వాతంత్య్రానంతరం రెవెన్యూ రికార్డులను తిరగరాసే సమయంలో కొన్ని సర్వే నెంబర్లకు చెందిన భూమి ప్రభుత్వానిదా? ప్రైవేటు వ్యక్తులదా అన్న విషయం తేలలేదు. దాంతో ఆ భూముల రికార్డుల్లో హక్కుదారుల కాలమ్‌లో చుక్క పెట్టి వదిలేశారు. వీటన్నింటిని చుక్కల భూములుగా పిలుస్తారు. ఇలాంటి భూములు రాష్ట్రంలో 24 లక్షల ఎకరాలుండగా, విశాఖలోనే మూడు లక్షల ఎకరాలు ఉన్నాయి. ఈ భూముల హక్కులపై వివాదం నడుస్తోంది. ఈ వివాదం శాశ్వత పరిష్కారానికి శాసనసభలో బిల్లు తీసుకురావాలని సర్కారు నిర్ణయించింది. ఇదే అదనుగా భావించిన టీడీపీ నేతలు ఆయా భూముల అనుభవదారులుగా తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. జిల్లాలోని ఓ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన ఓ మంత్రి విశాఖ భూములను చక్కబెట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. 1బీ రికార్డుల ట్యాంపరింగ్తోనూ టీడీపీ ప్రజాప్రతినిధుల భూ దోపిడీకి రికార్డుల ట్యాంపరింగ్‌ను ఎంచుకున్నారు. ఇందుకోసం తమకు అనుకూలంగా ఉన్న తహశీల్దార్లను పావులుగా వాడుకున్నారు. సదరు తహశీల్దార్లతో రికార్డుల ట్యాంపరింగ్ చేయించారు. ప్రధానంగా భూమి ధరలు ఆకాశాన్నంటిన విశాఖ రూరల్, గాజువాక, భీమిలి, ఆనందపురం, పెందుర్తి మండలాల్లోనే ప్రధానంగా రికార్డులు ట్యాంపరింగ్ అయ్యాయి. ప్రభుత్వ భూముల్ని ట్యాంపరింగ్ చేసి 1బీల్లో నమోదు చేయించేశారు. రికార్డుల్లో అసలు పేర్లు, చిరునామాలు గల్లంతు చేసి.. వేరే వాళ్ల ఫొటోలతో పట్టాలు తయారు చేశారు. అయితే ఇటీవల భూ కుంభకోణాలపై వరుస కథనాలు రావడంతో ట్యాంపరింగ్ బాగోతం బయటపడింది. దీంతో భీమిలి తహశీల్దార్ రామారావు, విశాఖ రూరల్ తహశీల్దార్ శంకరరావులపై సస్పెన్షన్ వేటుపడింది. వారిద్దరిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టిన అధికారులు వారిని ఆడించిన టీడీపీ పెద్దల భాగోతాన్ని మాత్రం బయటపెట్టడం లేదు. ఆక్రమణల చెరలో దస్పల్లా హిల్స్ విశాఖలోని దస్పల్లా హిల్స్‌లోని 62.97 ఎకరాల భూమిపై దస్పల్లా రాణి కమలాదేవికి, ప్రభుత్వానికి వివాదం నడిచింది. హైకోర్టులో రాణి కమలాదేవికి అను కూలంగా తీర్పు వచ్చింది. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఆలస్యంగా అప్పీలుకు వెళ్లకపోవడంతో కోర్టు తిరస్కరించింది. దీంతో టీడీపీకి చెందిన బడా వ్యాపార, పారిశ్రామికవేత్తలు సుమారు రూ.1500 కోట్ల విలువ చేసే ఈ భూములపై కన్నేశారు. ఈ భూముల్లోనే జిల్లా టీడీపీ కార్యాలయం కూడా ఉంది. కొట్టుకుపోయిన భూ రికార్డులు 2014లో సంభవించిన హుద్‌హుద్ తుపానులో విశాఖ జిల్లా భీమిలి మండలంలో 4,500 ఎకరాలు, పెందుర్తిలో 3,500, అనకాపల్లిలో 6,500, యలమంచిలిలో 4,000, విశాఖ నగరంలో 300 ఎకరాల భూముల రికార్డులు అదృశ్యమైనట్టు అధికారులే ప్రకటించారు. మరి ఈ రెండున్నరేళ్ల కాలంలో రికార్డుల గల్లంతు గురించి ఏం చర్యలు తీసుకున్నారంటే మాత్రం రెవిన్యూ అధికారుల వద్ద సమాధానం లేదు. -
రాజధానిలో 'బినామీ' దెయ్యం
-
రాజధానిలో 'బినామీ' దెయ్యం
దళితుల భూముల్లో కాసుల వేట.. 15 గ్రామాల్లో 990 ఎకరాలు హాంఫట్ - దొడ్డిదారిన అసైన్డ్,లంక భూముల రిజిస్ట్రేషన్ - బినామీల ముసుగులో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేల దందా - రిజిస్ట్రేషన్లకు ముందే అడంగల్, 1 బీలోకి అసైన్డ్ భూములు - రెగ్యులరైజ్ చేసి పూలింగ్ యత్నం - విలువైన ప్లాట్లు కొట్టేసే పన్నాగం - ఆక్రమించుకున్న భూముల విలువ రూ.1,980 కోట్లు - కృష్ణా తీర భూముల్లో రిసార్టులు, మల్టీప్లెక్స్‌లు కట్టాలని ప్లాన్ సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర రాజధాని అమరావతిలో మరో భారీ భూ బాగోతం బయటపడింది. అమరావతి పరిధిలో పేదల జీవనాధారం కోసం ప్రభుత్వం ఇచ్చిన అసైన్డ్, లంక భూములను మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు బినామీ పేర్లతో దొడ్డిదారిన రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. పేదలను భయపెట్టి, ఒత్తిడి తెచ్చి, ఎంతోకొంత చేతిలో పెట్టి నోరు మూయించారు. రాజధాని పరిధిలోని 15 గ్రామాల్లో రూ.1,980 కోట్ల విలువైన 990 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూములను స్వాహా చేశారు. అయితే, ఇందులో 507 రిజిస్ట్రేషన్లకు సంబంధించి 660 ఎకరాలను అధికారులు పెండింగ్‌లో పెట్టారు. వీటికోసం ప్రత్యేక జీవో తెచ్చి, రెగ్యులరైజ్ చేసుకుని, ల్యాండ్ పూలింగ్(భూ సమీకరణ)కు ఇచ్చి, ప్రభుత్వం నుంచి విలువైన ప్లాట్లు కొట్టేయటానికి అక్రమార్కులు పన్నాగాలు పన్నుతున్నారు. 330 ఎకరాలకు రిజిస్ట్రేషన్లు జరిగి, డాక్యుమెంట్ నంబర్లు కూడా వచ్చినట్లు సమాచారం. సర్కారు భూములే టార్గెట్ అమరావతిని రాజధానిగా ప్రకటించిన వెంటనే ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నేతలు.. పేదలు సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములపై కన్నేశారు. తుళ్లూరు, మంగళగిరి,తాడేపల్లి పరిధిలో 29 గ్రామాల్లో అసైన్డ్, లంక, శివాయ్ జమీందార్ భూములు 4,312 ఎకరాలు ఉన్నాయి. ఇందులో 2,028 ఎకరాలు అసైన్డ్, మరో 2,284 ఎకరాలు లంక, శివాయ్ జమీందార్ భూములు ఉన్నాయి. వీటిని 1954, 1971, 1976, 2005లో భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం పంచిపెట్టింది. రాజధాని ప్రకటన వెలువడగానే ఈ భూములు ఎవరి ఆధీనంలో ఉన్నాయనే వివరాలను ప్రభుత్వ పెద్దలు, అధికార పార్టీ నాయకులు తెప్పించుకున్నారు. అందులో నవులూరు, కురగల్లు, కృష్ణాయపాలెం, ఉండవల్లి, రాయపూడి, ఐనవోలు, తుళ్లూరు, ఉద్ధండ్రాయునిపాలెం, లింగాయపాలెం, బోరుపాలెం, అనంతవరం, మందడం, వెంకటపాలెం, నెక్కల్లు, నేలపాడు గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ భూములను టార్గెట్ చేశారు. 990 ఎకరాల అనుభవదారుల వివరాలు తీసుకుని రంగంలోకి దిగారు. ఒత్తిళ్లు.. బెదిరింపులు.. పైరవీలు అసైన్డ్ భూముల సాగుదారులను దళారుల సహకారంతో బెదిరించారు. కొందరికి డబ్బు ఆశ చూపించారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారు డబ్బుకు లొంగి, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేశారు. మరికొందరిని బెదిరించి సంతకాలు చేయించుకున్నారు. ఇంకొందరిని బం«ధువుల ద్వారా పైరవీలు చేయించి లొంగదీసుకున్నారు. వేటికీ లొంగని వారిని పోలీసుల చేత భయపెట్టారు. అక్రమ కేసులు బనాయిస్తామని హెచ్చరించారు. అలా ఒప్పించి ప్రాంతాన్ని బట్టి ఎకరానికి రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల చొప్పున అనుభవదారులకు ముట్టజెప్పారు. రూ.కోట్ల విలువైన భూములను కారుచౌకగా కొట్టేశారు. తెరముందు బినామీలే.. వెంకటపాలెం గ్రామానికి చెందిన కొలికిపూడి ఏసుదాసుకి సర్వే నంబర్ 298/2లో 1.17 ఎకరాల భూమి ఉంది. ఆయన మరణించాక భార్య కొలికిపూడి ఎస్తేరురాణి పేరిట పాసుపుస్తకం, టైటిల్ డీడ్ ఇచ్చారు. అయితే, ఈ భూమిని 2015 అక్టోబర్ 19న అరుణ్‌కుమార్ కంటి మహంతి పేరున రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందుకుగాను ఎస్తేరురాణికి రూ.10 లక్షలు ముట్టజెప్పినట్లు తెలిసింది. సర్వే నంబర్ 293/3లో నీలం నాగమణి అలియాస్ నాగమ్మ పేరిట 99 సెంట్లు, 302/9లో పులి అబ్రహం పేరిట 1.98 ఎకరాల భూములు ఉన్నాయి. వీటిని విశాఖపట్నానికి చెందిన అరుణ్‌కుమార్ కంటి మహంతి, సెరీన్ వివేక కంటి మహింతి, కోనేరు కుటుంబరావు, కోనేరు హిమబిందుకు విక్రయించినట్లు 2015 అక్టోబర్‌లో రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీరంతా గుంటూరు జిల్లాకు చెందిన మంత్రి బినామీలని సమాచారం. వెంకటపాలెం గ్రామంలో 330 ఎకరాల లంక, అసైన్డ్ భూములను రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఉద్ధండ్రాయునిపాలెం, రాయపూడి, నవులూరు, కురగల్లు పరిధిలో అత్యధికంగా ప్రభుత్వ, లంక భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఆన్లైన్లో రికార్డులు మాయం అసైన్డ్, లంక భూములను కొట్టేసే కుట్రలో భాగంగా టీడీపీ పెద్దలు ముందుగా రెవెన్యూ అధికారులను రంగంలోకి దింపారు. ప్రభుత్వ భూములను రెవెన్యూ రికార్డులైన అడంగల్, 1బీలో నమోదు చేయించారు. వాటి ఆధారంగా రిజిస్ట్రార్లపై ఒత్తిడి చేసి, అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ తతంగమంతా పూర్తయ్యాక ఆన్లైన్లో అడంగల్, 1బీలను మాయం చేశారు. మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. అనంతరం వాటిని ల్యాండ్‌పూలింగ్‌కి ఇచ్చి, పరిహారం కింద ప్రభుత్వం నుంచి అత్యంత విలువైన ప్లాట్లు తీసుకోవాలని భావిస్తున్నారు. కృష్ణా నదీ తీరాన ఉన్న భూములను మాత్రం పూలింగ్‌కు ఇవ్వకుండా అందులో రిసార్టులు, మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఆక్రమించుకున్న అసైన్డ్, లంక భూముల విలువ దాదాపు రూ.1,980 కోట్లు ఉంటుందని అంచనా. -
దళితుల భూములపై సర్కారు డేగ
పరిశ్రమల కోసమంటూ అసైన్డ్ భూములు లాక్కుంటున్న ప్రభుత్వం సాక్షి, అమరావతి: తరతరాలుగా స్వేదం చిందించి సాగులోకి తెచ్చుకున్న దళితుల భూములను ప్రభుత్వం లాగేసుకుంటోంది. అడ్డొస్తే అక్రమ కేసులు బనాయిస్తామని బెదిరిస్తోంది. ప్రభుత్వ భూముల్లో ఉన్న దళితులకు పట్టాలిస్తామని, అసైన్డ్ భూములకు నీళ్లిస్తామని ఎన్నికలప్పుడు మాయమాటలు చెప్పిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడా భూములను బడాబాబులకు కట్టబెడతానంటోంది. ఈ పరిణామాలకు రాష్ట్రంలో ఏ ఒక్క ప్రాంతం మినహాయింపు కాదు. యావత్ రాష్ట్రంలోని దళిత వర్గాలు సర్కారు భూదాహానికి దిక్కుతోచని స్థితిలో ఉన్నాయి. ప్రాణాలకు తెగించి పోరుబాటకు సిద్ధమవుతున్నాయి. సర్కారు ఏర్పడి మూడేళ్లయినా ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ రాలేదు. పట్టుమని వంద మందికి ఉపాధి లభించిందీ లేదు. ప్రభుత్వం మాత్రం కుప్పలు తెప్పలుగా పరిశ్రమలు వస్తాయని, అందుకోసం 15 లక్షల ఎకరాలతో భూ బ్యాంక్ సిద్ధం చేయాలని ఏపీఐఐసీని ఆదేశించింది. దీంతో ఎస్సీ, ఎస్టీ పేద వర్గాల అసైన్డ్ భూములపై ఉక్కుపాదం మోపేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ‘సీమ’లో బడుగు రైతులపై ఉక్కుపాదం చిత్తూరు జిల్లాలోని 22 మండలాల పరిధిలో 1,60,938 ఎకరాల ల్యాండ్ బ్యాంక్‌ను తయారు చేసేందుకు ఏపీఐఐసీ సిద్ధమైంది. ఇందులో దళిత వర్గాల అధీనంలో ఉన్న అసైన్డ్ భూములే ఎక్కువగా ఉన్నాయి. తూర్పు నియోజకవర్గాలైన సత్యవేడు, శ్రీకాళహస్తిపై ప్రధానంగా కన్నేశారు. కర్నూలు జిల్లాలో 45,166 ఎకరాల భూమిని భూ బ్యాంక్‌గా గుర్తించారు. కర్నూలు, నంద్యాల, పాణ్యం, కల్లూరు, ఆదోని, పెద్దకడుబూరు, ఎమ్మిగనూరు, ఓర్వకల్లు, మిడుతూరు, జూపాడుబంగ్లా మండలాల పరిధిలోని దళిత కుటుంబాల చేతుల్లో ఎన్నో ఏళ్లుగా దాదాపు 25 వేల ఎకరాల భూములున్నాయి. ఈ భూములను స్వాధీనం చేసుకునేందుకు కసరత్తు మొదలైంది. అనంతపురం జిల్లా ధర్మవరం, అనంతపురం, పెనుకొండ, కళ్యాణదుర్గం, కదిరి రెవెన్యూ డివిజన్ల పరిధిలో 20 వేల ఎకరాల దళితుల భూములపై కార్పొరేట్ సంస్థలు కన్నేశాయి. వైఎస్ఆర్ జిల్లాలో 1.05 లక్షల ఎకరాల భూమిని పారిశ్రామిక పెద్దలకు అప్పగించే ప్రయత్నం జోరుగా సాగుతోంది. ఇప్పటికే 78 వేల ఎకరాలు సేకరించినట్టు ప్రభుత్వం తెలిపింది. మిగిలిన భూమిని సేకరించేందుకు సర్వేలు పూర్తయ్యాయి. కన్ను పడితే చాలు ఖాళీ చేయాల్సిందే.. విజయనగరం జిల్లా గజపతినగరం పరిధిలోని కొణిశ రెవెన్యూ పరిధిలో 15 ఎకరాల భూమి 30 ఏళ్లుగా దళితుల అధీనంలో ఉంది. కొండలు తవ్వి, డొంకలు, తుప్పలు తొలగించి మరీ ఈ భూమిని స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. అధికార పార్టీకి చెందిన నేతల కన్నుపడటంతో దళితులను ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం పూనుకుంది. ఇదంతా ప్రభుత్వ భూమి అంటూ ఇటీవలే బోర్డులు కూడా పెట్టింది. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా మంటలు రేపుతోంది. భోగాపురం మండలం పరిధిలోని 15 గ్రామాలకు చెందిన 1205 కుటుంబాలను రోడ్డున పడేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. మొత్తం 5,311 ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 2 వేల ఎకరాల్లో పేద దళిత వర్గాలున్నారు. ఇప్పటికే 2,628 మంది రైతులు తమ అభ్యంతరాలను రాత పూర్వకంగా తెలిపారు. అయినా ప్రభుత్వం కనికరం లేకుండా ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేయించే ప్రయత్నాల్లోనే ఉంది. ► శ్రీకాకుళం జిల్లాలో థర్మల్ పొగలు దళితుల జీవితాల్లో కార్చిచ్చు పెడుతున్నాయి. ఇప్పటికి 4,601 ఎకరాలను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో 3 వేల ఎకరాలు దళిత వర్గాలకు చెందినదే. జిల్లాలో పొలాకీ థర్మల్ ప్లాంట్ కోసం 8 గ్రామాల పరిధిలోని 2 వేల ఎకరాలను ప్రభుత్వం లాక్కునేందుకు కసరత్తు చేస్తోంది. ► కృష్ణా జిల్లాలో బందర్ పోర్టు పేరుతో పేద దళిత వర్గాలపై సర్కారీ పెద్దలు స్వారీ చేస్తున్నారు. 22 గ్రామాల్లో 14,472 ఎకరాల పట్టా భూములకు ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చింది. ఇది కాకుండా 14,800 ఎకరాల దళితుల అసైన్డ్ భూమిపై కన్నేసింది. ఇప్పటికే 30 మంది తహసీల్దార్లు, 40 మంది సర్వేయర్లతో సర్వే చేయిం చింది. 26 వేల ఎకరాల అటవీ భూమిని డీనో టిఫై చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా గిరిజన, హరిజనులే జీవనం సాగిస్తున్నారు. ► తూర్పుగోదావరి జిల్లాలో 49,427 ఎకరాలను పరిశ్రమల కోసం సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే 25 వేల ఎకరాలను గుర్తించారు. ఇందులో 18,413 ఎకరాలు దళిత వర్గాలకు చెందిన అసైన్డ్ భూములే. పశ్చిమగోదావరి జిల్లాలో 16 వేల అటవీ భూములను తీసుకునే ప్రయత్నం ఊపందుకుంది. ► నెల్లూరు జిల్లాలో సెజ్‌లు, పోర్ట్‌లు దళితుల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తున్నాయి. ఈ జిల్లాలో 75 వేల ఎకరాల భూ బ్యాంక్ టార్గెట్. ప్రకాశం జిల్లాలో 1,97,067 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించారు. ఇందులో 41,304 ఎకరాల భూమి దళిత వర్గాల చేతుల్లో ఉంది. ఏ ఎదను కదిపినా అదే బాధే.. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చినరావుపల్లి, పెదరావుపల్లి, కాటకాపల్లి, గొల్లపేట, ఎల్ కోట మండలం భీమాళిలో దళిత కుటుంబాలే ఎక్కువ. అక్కడ వందలాది మంది దళితులు 200 ఎకరాల ప్రభుత్వ భూమిలో తరతరాలుగా మామిడి, జీడిమామిడి తోటలను సాగు చేస్తున్నారు. తాతల కాలంలోనే కొండలు.. గుట్టలు బాగు చేసుకుని బతుకు బాటలు వేసుకున్నారు. ఇప్పుడీ భూమిలో 173 ఎకరాలు పతంజలి ఫుడ్ పార్క్‌కు ప్రభుత్వం రాసిచ్చేసింది. దళితులను ఖాళీ చేయమంటూ అధికారులు వేధిస్తున్నారు. డాక్యుమెంట్లు లేవంటూ అరకొర పరిహారం ఇవ్వడానికి ఇబ్బందులు పెడుతున్నారు. ఈ ప్రాంతంలో ఏ దళిత కుటుంబాన్ని కదిలించినా ఆందోళనే కన్పిస్తోంది. వేపాడు మండలం మారిక గ్రామ భూములపై అధికార పార్టీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారుల కన్ను పడటంతో గిరిజనులను బెదిరిస్తున్నారు. -
పొన్నాల మా భూములు ఆక్రమించారు
⇒ అసెంబ్లీ హౌస్ కమిటీకి దళితుల ఫిర్యాదు ⇒ భూములను పరిశీలించిన హౌస్ కమిటీ మడికొండ: వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం రాంపూర్‌లోని తమ అసైన్డ్భూములను తిరుమల హేచరీస్ కంపెనీ పేరిట పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆక్రమించారని స్థానిక దళితులు ఫిర్యాదు చేశారు. ఈ భూములను అసెంబ్లీ హౌస్ కమిటీ సోమవారం పరిశీలించింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డిని కలిసిన స్థానిక దళితులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు. 1971లో రాంపూర్‌కు చెందిన సర్వేనంబర్ 337, 339లోని 8 ఎకరాల 27 గుంటలను అదే గ్రామానికి చెందిన దళితులకు ప్రభుత్వం అసైన్ చేసింది. తర్వాత పరిశ్రమల కోసమని 1987లో ఈ భూమిని ఏపీఐఐసీకి అప్పగించింది. ఈ భూమిని ఏపీఐఐసీ తిరుమల హేచరీస్‌కు అప్పగించారు. అయితే, తమ భూములను తిరుమల హేచరీస్ పేరిట కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య అక్రమ పద్దతిలో స్వాధీనం చేసుకున్నారని దళితులతో పాటు ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలు చేశాయి. 1994, 1997లో తిరుమల హేచరీస్ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. 2005లో తిరుమల హేచరీస్‌కు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. తెలంగాణ ఏర్పాటైన తర్వాత రాంపూర్ గ్రామానికి చెందిన చిట్యాల రూబేన్, సండ్ర కొమురయ్య, చిట్యాల పురుషోత్తం, సండ్ర కనుకయ్య వారసులు సీఎం కేసీఆర్‌ను కలసి ఈ విషయమై ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్యాక్రాంతమైన అసైన్డ్, దేవాలయ, సొసైటీ భూములపై అధ్యయనానికి ఆసెంబ్లీలో ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేశారు. అసైన్డ్ భూములపై ఏర్పాటైన కమిటీ మొదటిసారిగా తిరుమల హేచరీస్ భూములు పరిశీలించింది. ఈ సందర్భంగా కమిటీ అధ్యక్షుడు సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ అన్ని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు. -
అసైన్డ్ భూముల్లో డాంబర్ అక్రమ దందా
-
అసైన్డ్, పట్టాదారులు మధ్య తేడా ఎందుకు?
⇒ హైకోర్టుకు రైతుల తరఫు న్యాయవాదుల నివేదన ⇒ తదుపరి విచారణ నేటికి వాయిదా సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రాజెక్టుల నిమిత్తం భూములు సేకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్‌దారులు, పట్టాదారుల మధ్య తేడా చూపుతుండటాన్ని రైతుల తరఫు న్యాయవాదులు బుధవారం హైకోర్టులో ప్రశ్నించారు. భూ సేకరణ చట్టం 2013 ప్రకారం అసైన్డ్‌దారులు, పట్టాదారులు సమానమేనని, పరిహారం చెల్లింపు విషయంలో వీరి మధ్య ఎటువంటి వివక్ష చూపడానికి వీల్లేదని వారు తెలిపారు. భూములను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చినట్లు చెబుతోందన్నారు. జీవో 123 కింద భూ సేకరణ చేపడుతుండటాన్ని సవాలు చేస్తూ రైతులు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలపై పలుమార్లు విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది. ఈ సందర్భంగా రైతుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ, మహబూబ్‌నగర్‌లో పట్టాదారులకు ఎకరాకు రూ.5 లక్షలు ఇస్తుండగా, అసైన్డదారులకు రూ.3.5 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ.. పరిహారం చెల్లింపులో ప్రభుత్వం ఎటువంటి వివక్ష చూపడం లేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, 2013 భూ సేకరణ చట్టం ప్రకారం అసైన్డ్‌దారులు, పట్టాదారులు ఒకటేనని గుర్తు చేసింది. రైతుల తరఫు న్యాయవాదులు 2013 చట్ట ప్రకారం భూ సేకరణ ముందు సామాజిక, పర్యావరణ ప్రభావ అధ్యయనాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అయితే ప్రభుత్వం సెక్షన్ 40 కింద అత్యవసర క్లాజు ద్వారా భూ సేకరణ జరుపుతోందన్నారు. ప్రభుత్వం పరిహారం చెల్లించకుండా రైతులను వారి భూముల నుంచి ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దీంతో తదుపరి విచారణ గురువారానికి వాయిదా పడింది. -
వాళ్ల భూములే టార్గెట్ అవుతున్నాయ్
హైదరాబాద్: భూ సేకరణలో అంతిమంగా ఆదివాసీల అసైన్డ్ భూములే టార్గెట్ అవుతున్నాయని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మాసూటికల్ కంపెనీలు మొదలుకొని ఏ అవసరానికి భూ సేకరణ చేసినా.. అక్కడ ఆదివాసీలకు ఇచ్చిన భూములను యథేచ్ఛగా గుంజుకుంటున్నారని అన్నారు. తెలంగాణలో గిరిజనులకు జరుగుతోన్న 'అన్యాయాలు - భవిష్యత్ కార్యాచరణ' అనే అంశంపై గిరిజన విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వెంకటేశ్ చౌహాన్ అధ్యక్షతన సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి కోదండరాం ముఖ్య వక్తగా హాజరయ్యారు. అసైన్డ్ భూములంటే ఎప్పుడైనా గుంజుకోవచ్చనే ధోరణి సరికాదని ఆ భూమిని ఎవ్వరికీ అమ్మకూడదు, కొనకూడదనే నియమం తప్ప దానిపై ఇతర రైతులకున్నట్టే ఆదివాసీలకూ అన్ని హక్కులు ఉంటాయని స్పష్టం చేశారు. అడవుల పెంపకానికి ఎవరూ వ్యతిరేకం కాదని, అయితే అడవుల పెంపకం పేరుతోనో, అభివృద్ధి పేరుతోనో ఆదివాసీల హక్కులకు భంగం కలిగించవద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచీలతో ఒక మాన్యువల్‌ని తయారు చేసిందని, దాన్ని అనుసరిస్తే తెలంగాణలో విషజ్వరాల నుంచి గిరిపుత్రులను కాపాడుకోగలుగుతామని చెప్పారు. తెలంగాణ గిరిజనుల సమస్యల పరిష్కారానికి జేఏసీ కార్యాచరణను తయారుచేస్తుందని తెలిపారు. -
ఆక్రమిత స్థలాల పరిశీలన..
ప్రొద్దుటూరు: ఆక్రమణలో ఉన్న వక్ఫ్‌బోర్డు స్థలాలను రాష్ట్ర స్థాయి అధికారుల బృందం పరిశీలించింది. హైదరాబాద్ నుంచి వచ్చిన వక్ఫ్‌బోర్డు సీఈఓ ఎల్.అబ్దుల్ ఖాదర్, టాస్క్ఫోర్సు ఆఫీసర్ అబ్దుల్ ఉద్దూస్, డెరైక్టర్ మేనేజ్ మెంట్ క్లర్క్ ఖాజామొహిద్దీన్, జిల్లా వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ షేక్ మహ్మద్షఫివుల్లా, జూనియర్ అసిస్టెంట్ గౌస్ కర్నూలు జిల్లా నుంచి మధ్యాహ్నం ప్రొద్దుటూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా మోడంపల్లె మసీదు పరిధిలో అక్రమంగా అమ్మిన స్థలాల గురించి ఆరా తీశారు. అలాగే చౌసేన్వలి ఆస్తుల వివరాల గురించి చర్చించినట్లు తెలిసింది. అనంతరం డీఎస్పీ నీలం పూజితను కలిశారు. ఈ నెల 11న సాక్షిలో ‘ఆక్రమణలకు అడ్డేది’ శీర్షికన వక్ఫ్‌బోర్డు స్థలాల ఆక్రమణపై కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోండి: వరద వక్ఫ్‌బోర్డు భూములను, ఆస్తులను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి నంద్యాల వరదరాజులరెడ్డి స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో శుక్రవారం సాయంత్రం అధికారులను స్వయంగా కలిసి విన్నవించారు. ప్రొద్దుటూరు పరిధిలో కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నాయని ఆయన తెలిపారు. పోలీసు కేసులకే పరిమితమైతే ఫలితం ఉండదని, వీటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది. అలాగే టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు ఖాజామొహిద్దీన్ కూడా వక్ఫ్‌బోర్డు ఆస్తుల అన్యాక్రాంతపై అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రధానంగా వక్ఫ్ బోర్డు ఆస్తుల ఆక్రమణకు సంబంధించి కేసుల్లో ఉన్న వారు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మల్లేల లింగారెడ్డి వర్గీయులుగా ఉండటం కొసమెరుపు. -
అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణ!
సాక్షి, హైదరాబాద్: అసైన్డ్ భూములను సద్వినియోగం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఆక్రమణకు గురైన అసైన్డ్ భూములను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 25 లక్షల ఎకరాలను ప్రభుత్వం పేదలకు అసైన్ చేసింది. కానీ ఈ భూముల్లో చాలావరకు ఉపయోగపడటం లేదని, అసైన్‌దారులకు బదులుగా ఆ భూములన్నీ ఇతరుల చేతుల్లోకి వెళ్లాయని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూముల వివరాలను సేకరించేందుకు దృష్టి సారించింది. అసైన్‌దారుల వద్దే భూమి ఉందా? ఆ భూమిలో వ్యవసాయం చేస్తున్నారా? అసలు ఆ భూమి ఎక్కడుంది? ఎంత ఉంది.. అనే వివరాలన్నీ జూన్ 30లోగా సేకరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఇదివరకే ఆదేశాలు జారీ చేశారు. ఈ వివరాలన్నీ అందుబాటులోకి వస్తే ఇతరుల చేతుల్లోకి వెళ్లిన భూమిని స్వాధీనం చేసుకొని తిరిగి అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అసైన్దారులు సాగులో ఉంటే వారు వ్యవసాయం చేసుకునేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా పెట్టుబడి సాయం అందించాలని సీఎం ఇప్పటికే సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అన్ని జిల్లాల్లో రెవెన్యూ యంత్రాంగం అసైన్డ్ భూముల వివరాల సేకరణలో నిమగ్నమైంది. కాగా, దాదాపు 70 % భూములు అసైన్‌దారుల చేతిలో లేవని పలు జిల్లాల్లో చేపట్టిన సర్వేలతో తేలింది. నెరవేరని లక్ష్యం.. సాగుకు పనికి రాని భూమిని, రాళ్లు రప్పలతో కూడిన భూమిని పంపిణీ చేయటంతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరలేదు. ఈ నేపథ్యంలో అసైన్డ్ భూములను సద్వినియోగం చేసేందుకు క్రమబద్ధీకరించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అసైన్డ్ భూముల్లో అసలైన లబ్ధిదారులు లేకున్నా.. అర్హులైన నిరుపేదలు ఉంటే వారికే ఆ భూములు అప్పగించాలని యోచిస్తోంది. ఎస్సీ లబ్ధిదారుల భూములు ఎస్సీలు, ఎస్టీల చేతుల్లో ఉంటేనే క్రమబద్ధీకరించాలని, బీసీలు, ఓసీల చేతుల్లో ఉంటే వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆలోచన చేస్తోంది. ఇదే సమయంలో ప్రభుత్వ భవనాలు, కార్యాలయాలు, పాఠశాలలు అసైన్డ్ భూముల్లో ఉంటే క్రమబద్ధీకరించి.. వాటిని అసైన్డ్ భూముల జాబితాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. జిల్లాల వారీగా అసైన్డ్ భూముల వివరాలన్నీ వచ్చాక ఏమేం చర్యలు చేపడితే.. ఈ భూములు వినియోగంలోకి వస్తాయనే కోణంలో తుది నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
భూసేకరణ చట్టానికి తిలోదకం
- భూయజమానులతో చర్చలద్వారా భూముల కొనుగోలు - బేసిక్ వేల్యూపై రెండున్నర రెట్ల ధర నిర్ధారణ - అసైన్డ్ భూములకూ ఇదే విధానం అమలు - రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు సంస్థలకు, పారిశ్రామికవేత్తలకు భారీఎత్తున భూపందేరం చేసేందుకు సిద్ధమైన రాష్ట్రప్రభుత్వం ఇందుకోసం పెద్దమొత్తంలో భూముల్ని సేకరించడంపై దృష్టిపెట్టింది. ఈ సేకరణలో కేంద్రం చేసిన చట్టాన్ని అమలు చేయకుండా ఇష్టానుసారం వ్యవహరించాలని నిర్ణయించింది.కేంద్రప్రభుత్వం చేసిన 2013 నాటి భూసేకరణ చట్టం కింద అధిక పరిహారం చెల్లించాల్సి రావడంతోపాటు అందులోని నిబంధనల వల్ల భూ సేకరణ అంత సులువు కాదు. ఈ ఇబ్బందుల్లేకుండా పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూముల్ని సులభంగా అప్పగించేందుకు వీలుగా ఆ చట్టానికి రాష్ట్రప్రభుత్వం తిలోదకాలిచ్చింది. కొత్త విధానం అమలుకు నిర్ణయించింది. భూసేకరణకు స్వస్తిచెప్పి భూయజమానులతో చర్చలద్వారా భూముల్ని కొనుగోలు చేయాలని నిశ్చయించింది. ఇటీవల జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఈ కొత్త విధానం అమలుకు నిర్ణయం తీసుకుంది. కేంద్ర చట్టం ప్రకారమైతే.. 2013 భూసేకరణ ద్వారా భూమి సేకరించాలంటే తొలుత సామాజిక ప్రభావం(సోషల్ ఇంపాక్ట్) అధ్యయనం చేయాలి. ఆ నివేదికను నిపుణుల కమిటీ ఆమోదానికి పంపాలి. అది ఆ భూముల సేకరణ వల్ల పర్యావరణానికి లేదా ఆహారధాన్యాల ఉత్పత్తికి హాని కలుగుతుందని భావించి.. తిరస్కరిస్తే ఆ భూముల్ని సేకరించడానికి వీలుండదు. ఇక చర్చలద్వారానే కొనుగోలు.. దీంతో భూ యజమానులతో చర్చలద్వారా భూముల్ని కొనుగోలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు పారిశ్రామిక, వాణిజ్యవేత్తలకు అవసరమైన భూముల్ని ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ(ఏపీఐఐసీ) రైతులనుంచి, ప్రైవేట్ వ్యక్తుల నుంచి కొనుగోలు చేయనుంది. ఆ ప్రకారం పారిశ్రామికవేత్తలకు అవసరమైన భూమి ఎంత కావాలో.. ఎక్కడ కావాలో జిల్లా కలెక్టర్లకు ఏపీఐఐసీ తెలియజేస్తుంది. ఆ జిల్లా కలెక్టర్ ధర నిర్ధారణకు ఆర్డీవో/సబ్ కలెక్టర్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ ఆ భూమి కనీస విలువ(బేసిక్ వేల్యూ)పై రెండున్నర రెట్లు ధరను నిర్ధారిస్తుంది. ప్రాథమికంగా భూ యజమానులు ఎవరనేది విచారణ చేపడుతుంది. తరువాత జాయింట్ కలెక్టర్ ఆ ప్రతిపాదనలను పరిశీలిస్తారు. ఆ భూమి కొనుగోలుపై చర్చలకు రావాలంటూ సదరు భూమి యజమానులకు నోటీసు జారీచేస్తారు. పత్రికల్లోనూ ప్రచురిస్తారు. తదుపరి భూమి కొనుగోలు కమిటీ భూయజమానులతో సంప్రదింపులు జరిపి కొనుగోలు చేస్తుంది. ఇందుకు సంబంధించి కొనుగోలు కమిటీ, భూయజమాని మధ్య ఒప్పందం చేసుకుంటారు. ఆ ఒప్పందానికి, పరిహారం చెల్లింపునకు జిల్లా కలెక్టర్ ఆమోదం తెలుపుతారు. ఆ భూమిని కొనుగోలు చేసినట్లు పత్రికల్లో ప్రచురించడంతోపాటు అభ్యంతరాలుంటే తెలపాలని కోరతారు. ఏమైనా అభ్యంతరాలుంటే ఆర్డీవో వాటిని పరిష్కరిస్తారు. ఆ భూమిని తహసీల్దారు ఏపీఐఐసీకి రిజస్ట్రేషన్ చేయడంతోపాటు ఫిజికల్‌గా పొజిషన్ ఇస్తారు. సబ్ కలెక్టర్, ఆర్డీవో.. భూయజమాని బ్యాంకు అకౌంట్‌కు పరిహారాన్ని జమ చేస్తారు. అసైన్డ్ భూములకూ ఇదే విధానం.. అసైన్డ్ భూములుంటే ఏపీఐఐసీ స్వాధీనం చేసుకుంటుంది. ఒకవేళ అసైన్డ్ భూముల్ని సేకరించాల్సి ఉంటే చర్చలద్వారానే వాటినీ కొనుగోలు చేయనున్నారు. 95 వేల ఎకరాలకుపైగా అవసరమన్న ఏపీఐఐసీ ఇదిలా ఉండగా ప్రాధాన్యతలో భాగంగా ప్రస్తుతం అసైన్డ్, పట్టా, ప్రభుత్వ భూములు కలపి మొత్తం 95,622.75 ఎకరాలు అవసరమని ఏపీఐఐసీ నివేదిక సమర్పించింది. ఈ భూముల్ని ప్రభుత్వం ఏపీఐఐసీకి ఇవ్వాల్సి ఉంది. జిల్లాలవారీగా కావాల్సిన భూముల వివరాలను కూడా రాష్ట్రప్రభుత్వానికి అందజేసింది. ఇందులో పట్టా భూములు 22,411.09 ఎకరాలు, 37,190.61 ఎకరాలు అసైన్డ్ భూములు, 36,021.05 సర్కారు భూములున్నాయని నివేదికలో స్పష్టం చేసింది. ఈ భూముల్ని ప్రైవేటు సంస్థలకు కేటాయించడం జరుగుతుంది. -
అసైన్డ్.. అక్రమాల పుట్ట
► జిల్లాలో 4.47 లక్షల ఎకరాలు ► బడాబాబుల అధీనంలో నిరుపేదల భూములు ►చెరబట్టిన నేతలు, రియల్టర్లు, బడా కాంట్రాక్టర్లు ► అసైన్డ్ భూములపై దృష్టి సారించిన సర్కారు సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : అసైన్డ్ భూముల అక్రమాల పుట్ట పగలనుంది. భూమిలేని నిరుపేదలు సాగు చేసుకునేందుకు ప్రభుత్వం పంపిణీ చేసిన ఈ భూములు చాలా మట్టుకు చేతులు మారాయి. ముఖ్యంగా పట్టణ పరిసర గ్రామాల్లోని రూ.కోట్లు విలువ చేసే ఈ భూములన్నీ బడాబాబుల అధీనంలోకి వెళ్లిపోయాయి. నేతలు, రియల్టర్లు, బడా కాంట్రాక్టర్లు నయానో భయానో ఈ భూములను కొనుగోలు చేసి కోట్లకు పడగలెత్తారు. అన్యాక్రాంతమైన ఈ భూములను చెరబట్టిన వారిపై తాజాగా ప్రభుత్వం దృష్టి సారించడంతో బడాబాబుల భూ బాగోతం వెలుగులోకి రానుంది. నిరుపేదల సాగు కోసం పంపిణీ చేసిన ఈ అసైన్డ్ భూములు ఎవరి అధీనంలో ఉన్నాయి.. వాటిని సాగు చేసుకుంటున్న వారెందరు.. విక్రయాలు జరిగాయా..? లేదా వారి వారసులు సాగు చేసుకుంటున్నారా..? ఇలా ఈ భూముల వెరిఫికేషన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లా రెవెన్యూ అధికారులు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌తో జరిగిన కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్ల సదస్సులో ఇది ప్రధాన అంశంగా చర్చ జరిగింది. పలువిడతల్లో భూ పంపిణీ జిల్లాలో ఇప్పటి వరకు ప్రభుత్వం సుమారు 4.47 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమిని నిరుపేదలకు పంపిణీ చేసింది. 1.44 లక్షల మంది భూమిలేని కూలీలకు అసైన్డ్ చేసింది. ఇందులో సగానికిపైగా భూములు చేతులు మారాయి. అసైన్డ్ నిబంధనలకు విరుద్ధంగా ఈ భూములు ఇతరులకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. ముఖ్యంగా ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, భైంసా, బెల్లంపల్లి, మందమర్రి, కాగజ్‌నగర్ వంటి పట్టణాల సమీపంలోని అసైన్డ్ భూములన్నీ రియల్టర్లు, నేతలు, కాంట్రాక్టర్లు కొనుగోలు చేశారు. నయానో భయానో నిరుపేదలను బెదిరించి, నిబందనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఇందుకు చాలా చోట్ల రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులతో చేతులు కలిపి అసైన్డ్ చట్టానికి విరుద్ధంగా భూముల దందా కొనసాగింది. కేవలం పట్టణాల సమీపంలోని భూములే కాదు, తాండూరు, రెబ్బెన, ఖనాపూర్ వంటి మండల కేంద్రాల పరిసరాల్లోని అసైన్డ్ భూములు కూడా పరాధీనమయ్యాయి. ముఖ్యంగా పట్టణాల సమీపంలోని అసైన్డ్ భూములన్నీ రియల్ ఎస్టేట్ ప్లాట్లుగా మారాయి. అసైన్డ్‌దారులను నయానో భయానో మభ్యపెట్టి తక్కువ ధరకు కొనుగోలు చేసిన రియల్టర్లు, వాటి ప్లాట్లుగా చేసి రూ.కోట్లు దండుకున్నారు. తీరా ఇప్పుడు ప్రభుత్వం ఈ అసైన్డ్ భూముల రికార్డుల దుమ్ము దులుపుతుండటంతో ఈ అసైన్డ్‌భూముల్లో ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారుకానుంది. పట్టణాల్లోనే అక్రమాలు.. ముఖ్యంగా ఆదిలాబాద్ పట్టణ సమీపంలోని మావల, బట్టిసావర్గాం వంటి గ్రామాల్లో వందలాది ఎకరాల్లో అసైన్డ్ భూములు వివిధ పార్టీల నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు చేశారు. చాలా మట్టుకు ప్లాట్లుగా చేసి, రూ.కోట్లు దండుకున్నారు. ఈ భూములు చాలా మట్టుకు చేతులు మారాయి. నిర్మల్ పట్టణ సమీపంలోని గ్రామాల పరిధిలోని భూముల్లో పలు రియల్వెంచర్లు వెలిశాయి. తూర్పు జిల్లా కేంద్రంగా పేరున్న మంచిర్యాలలో ఈ అసైన్డ్ భూముల దందా మూడు వెంచర్లు.. ఆరు ఎకరాలు అన్న చందంగా మారాయి. అసైన్డ్ భూముల్లో ప్లాట్ల దందా ఇప్పటికీ కొనసాగుతోంది. నస్పూర్ పంచాయతీ పరిధిలోనైతే రూ.కోట్లు విలువ చేసే అసైన్డ్భూములు పరాధీనంలో ఉన్నాయి. అలాగే మంచిర్యాల సమీపంలోని మందమర్రి మండల పరిధిలోకి వచ్చే గద్దెరాగడి, క్యాతన్‌పల్లి గ్రామాల పరిధిలోని అసైన్డ్ భూములు కూడా రియల్ఎస్టేట్ వ్యాపారుల చేతుల్లో ఉన్నాయి. మంచిర్యాల టౌన్, వేంపల్లి, హాజీపూర్, ముల్కల్ల, పాత మంచిర్యాల, గుడిపేట్, దొనబండల్లో చాలాచోట్ల అసైన్డ్ భూములు రియల్ఎస్టేట్ ప్లాట్లుగా మారాయి. ఈ వెంచర్లలో వివిధ పార్టీల నేతలే భాగస్వాములుగా ఉండటంతో ప్రభుత్వం తలపెట్టిన చర్యలు ఏ మేరకు ఫలితాలనిస్తాయో ప్రశ్నార్థకంగా మారనుంది. -
అసైన్డ్ లెక్కెంతా?
► అసైన్డ్‌భూములపై సర్వే ► ఆక్రమణదారులకు నోటీసులు జారీ ► జిల్లావ్యాప్తంగా 1.88 లక్షల ఎకరాలు పంపిణీ ► అందులో సగానికిపైగా అన్యాక్రాంతం ► నిరుపేదలకే దక్కాలని ప్రభుత్వ నిర్ణయం ► సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం ముకరంపుర : ‘రాష్ట్రంలో చాలావరకు అసైన్డ్భూములు అన్యాక్రాంతమయ్యాయి. వాటిని తిరిగి నిరుపేదలకే అప్పగించాలి..లేదా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి.. అసైన్డ్‌భూముల వివరాలను జూన్ 30లోగా సేకరించాలి.. అసైన్డ్‌దారులే కాస్తు చేసుకుంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా వ్యవసాయం చేసుకునేందుకు ఆర్థిక సాయమందిస్తాం.. లేకుంటే తిరిగి పేదలకు పంపిణీ చేద్దాం’ ఇటీవల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి.. జిల్లాలో అసైన్డ్ భూముల లెక్క తేల్చేం దుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. భూమిలేని పేదలకు పంపిణీచేసిన భూములు చేతులు మారడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీనిపై పూర్తిస్థాయిలో సర్వేచేసి అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. ఆ భూములను సొంతదారులకు(అసైన్డ్‌దారులకు), నిరుపేదలకు సొంతం చేయాలనడంతో అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించింది. ఆక్రమణదారులకు నోటీసులు జారీచేస్తుండడంతో వారి గుండెల్లో గుబులు మొదలైంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం వివిధ సందర్భాల్లో 1,88,464 ఎకరాలను లక్షా 39వేల మంది నిరుపేదలకు పంపిణీ చేసింది. ఈ భూముల చిట్టాను సేకరించేందుకు జిల్లా యంత్రాంగం క్షేత్రస్థాయిలో సర్వేను వేగవంతంచేస్తోంది. అసైన్డ్ భూముల విషయంలో భూములు చూపించారా?.. అసైన్డ్ చేసిన వారే అనుభవిస్తున్నారా? లేక వేరే వారున్నారా?.. వేరే వారు ఉంటే వారి పరిస్థితి ఏంటి? అసైన్డ్ భూమి సాగులో ఉందా? లేకుంటే సాగుకు తీసుకోవాల్సిన చర్యలపై తహసీల్దార్లనుంచి కలెక్టర్ నీతూప్రసాద్ నివేదిక కోరారు. జిల్లాలో పంపిణీచేసిన అసైన్డ్భూములను సాగు యోగ్యంగా మలుచుకునేందుకు ప్రభుత్వం రుణాలూ మంజూరుచేసింది. లబ్ధిదారుల ఆర్థికావసరాలు, భూముల విలువలు విపరీతంగా పెరగడంతో సగానికిపైగా ఇతరులకు విక్రయించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి పీవోటీ చట్టంప్రకారం అసైన్డ్ భూముల అమ్మకం, కొనుగోలు చేయరాదు. అయినా లోపాయికారీ ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లతో భూముల క్రయవిక్రయాలు భారీగానే జరిగాయి. అయితే జిల్లా రెవెన్యూయంత్రాంగం ఎంతమేర అన్యాక్రాంతమైందో ప్రాథమికంగా అంచనా గుర్తించకపోవడం విమర్శలకు తావిస్తోంది. నోటీసులు జారీ షురూ.. తాజాగా సర్కార్ ఆదేశాలతో అసైన్డ్ భూములను అక్రమంగా కలిగిన్న వారికి లావోణీ భూముల నిషేధం రూల్స్ 2007 కింద నోటీసులు జారీచేస్తున్నారు. ఆ భూములను ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోరాదో సమాధానం కోరుతున్నారు. క్రయవిక్రయాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడం, రిజిస్ట్రేషన్లలో చేతివాటంతో చాలావరకు భూములు అమ్ముకున్న పరిస్థితులే కనిపిస్తున్నాయి. కొన్ని భూమాఫియా చేతుల్లోకి వెళ్లగా.. మరికొన్ని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసుకోవడానికి కొనుగోలు చేశారు. రాళ్లురప్పలతో చాలావరకు సాగుయోగ్యం లేనివి పూర్తిగా అమ్ముకున్నారు. పట్టణప్రాంతాల్లో మాత్రం ఈ అసైన్డ్‌భూముల్లో నిర్మాణాలు చేసుకున్నారు. ఈ నిర్మాణాలను తొలగిస్తారా? క్రమబద్ధీకరిస్తారా? అనే విషయాలపై స్పష్టతలేదు. అన్యాక్రాంతమైన భూములను స్వాధీనం చేసుకుని సొంతదారులకు అప్పగించాలని, లేనిపక్షంలో పీవోటీ చట్టం ప్రకారం వెనక్కి తీసుకోవాలని సర్కార్ నిర్ణయించింది. 2008లో అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం 1958 నుంచి 2008 ఫిబ్రవరి 8 వరకు అసైన్డ్భూములు వేరేవ్యక్తి కొంటే సదరు కుటుంబం నిరుపేదలైతే వారికే వర్తింపజేసేలా చట్టం తీసుకొచ్చారు. ఈక్రమంలో విక్రయాలు జరిగిన భూముల్లో నిరుపేదలే సాగు చేసుకుంటే వారి కుటుంబ పరిస్థితులు విచారించి వారికే అప్పగించనున్నారు. అసైన్డ్‌దారులు ఆ భూముల్లో వ్యవసాయం చేసుకునేందుకు బీసీ ఎస్సీ, ఎస్టీ, కార్పొరేషన్ల ద్వారా రుణాలు కూడా మంజూరు చేయనున్నారు.