పార్థసారథి (ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : 2013 భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ రైతుల పొట్టకొట్టే చట్టాన్ని చంద్రబాబు నాయుడు తీసుకువస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. దేశంలో మొదటిసారి భూ ఆక్రమణ చట్టాన్ని చంద్రబాబు తెస్తున్నారని విమర్శించారు. ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఏ నాయకుడు ఇంతటి దుర్మార్గ చట్టాన్ని తేలేదన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్య వాదులందరూ ఈ చట్టాన్ని అడ్డుకోవాలని కోరారు.
చంద్రబాబు మూలంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని, ప్రజలందరి కళ్లుగప్పి చంద్రబాబు చీకటి జీవోలు తెస్తున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో 33 వేల ఎకరాలు సేకరించి ఇప్పటి వరకూ పరిహారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రైతుల భూములను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి చంద్రబాబు దోచుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. నాలుగేళ్ల కాలంలో ఏపీ రాజధానిలో ఒక్క శాశ్వత బిల్డింగ్ అయినా కట్టారా అని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ఏపీ ప్రభుత్వం 41 జీవోను తీసుకువచ్చిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment