pardha saradhi
-
రివెంజ్ లీడర్
తన ప్లాన్‌ను మార్చుకుని ఆడియన్స్ కోసం కొత్త స్కెచ్ వేశాడు పార్థసారధి. గ్యాంగ్ సాహసాలను వచ్చే నెల చూపిస్తానంటున్నాడు. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో నాని హీరోగా నటించిన చిత్రం ‘‘నాని’స్ గ్యాంగ్‌లీడర్’’. ఈ చిత్రంలో రివెంజ్ రైటర్ పార్థసారధి పాత్రలో నటించారు నాని. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, చెరుకూరి మోహన్ నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీని సెప్టెంబరు 13న నిర్ణయించినట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్, ఫస్ట్ సాంగ్, టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఓ ఆసక్తికరమైన పాయింట్‌తో విక్రమ్‌కుమార్ బాగా తెరకెక్కించారు’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు అనిరు«ద్ రవిచందర్ సంగీతం అందించారు. -
వ్యవసాయానికి పెరిగిన ప్రాధాన్యం
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టు ల నిర్మాణం, సాగునీరు అం దుబాటులోకి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయానికి ప్రాధాన్యం మరింత పెరిగిందని ఆ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నా రు. సోమవారం సచివాలయంలోని తన చాంబర్లో వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. సమష్టిగా పనిచేసి వ్యవసాయశాఖ గౌరవం మరింత పెంచుకుందామని మంత్రి చెప్పారు. వ్యవసాయశాఖ ఉద్యోగులతో ప్రేమతో వ్యవహరించి పని చేయించుకోవాలని అధికారులకు సూచించారు. పండ్ల తోటలు, కూరగాయల సాగుపై దృష్టి పెట్టాలని, ఉద్యానశాఖ వ్యవసాయ శాఖతో పోటీ పడి ఉద్యాన పంటలను మరింత విస్తరించాలన్నారు. రాష్ట్రంలోని కొన్ని మార్కెట్ యార్డుల్లో రైతులు, కూలీలకు తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని నిరంజన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. త్వరలోనే సీఎం కేసీఆర్ వ్యవసాయశాఖ మీద లోతుగా సమీక్ష నిర్వహించి మార్గనిర్దేశం చేస్తారని తెలిపారు. కాగా, తెలంగాణలో మద్దతు ధర కింద మరో 30 వేల మెట్రిక్ టన్నుల కందులు కొనుగోలు చేసేందుకు అవకాశమివ్వాలని కోరుతూ కేంద్ర మంత్రి రాధామోహన్‌సింగ్‌కు నిరంజన్‌రెడ్డి సోమవారం లేఖ రాశారు. -
‘నిప్పు అయితే విచారణ జరిపించుకో’
సాక్షి, విజయవాడ : వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వ సొమ్ముతో ఆదుకుంటామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ప్రకటించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం కుట్రల కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నాయని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ది లేని కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితుల తరుఫున పోరాడుతున్న న్యాయవాది రవిచంద్రన్‌ను సీఎం చంద్రబాబు, లోకేష్‌లు బెదిరిస్తున్నారని తెలిపారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘హాయ్‌లాండ్ ఆస్తులను కొట్టేయాలనే ఉద్దేశ్యంతోనే అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని తప్పుదోవపట్టిస్తున్నారు. అందుకే సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని 2017లోనే చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. కానీ ఇంతవరకు దాని ఊసే లేదు. అగ్రిగోల్డ్‌పై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలి. దాని వెనుక ఉన్న వ్యక్తులెవరో బయటకు రావాలి. ఏపీపై ప్రజలకున్న ప్రేమను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాటకాలు అడుతున్నారు. రాజధాని తాత్కాలిక భవనాలకు వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ వర్షం వస్తే కురిసే విధంగా నిర్మాణం చేశారు. అలాంటి భవనాలకు కోట్లు ఖర్చు అవుతాయా? మాజీ సీఎస్‌లు లేవనెత్తిన ప్రశ్నలకు చీఫ్ సెక్రటరీతో జవాబు చెప్పించండి. చంద్రబాబు నీవు నిప్పు అని చెబుతుంటావు. నిజంగా నిప్పు అయితే నీపై విచారణ జరిపించుకో’’ అని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ నేత, అగ్రిగోల్డ్ బాధిత బాసట కమిటీ చైర్మన్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కొనటానికి వచ్చిన ఎస్సెల్ గ్రూపును చంద్రబాబు కలిసిన తరువాత వారు వెనక్కు తగ్గారని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులందరికి తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
‘భూసేకరణ కాదు భూ ఆక్రమణ’
సాక్షి, హైదరాబాద్ : 2013 భూసేకరణ చట్టానికి సవరణ చేస్తూ రైతుల పొట్టకొట్టే చట్టాన్ని చంద్రబాబు నాయుడు తీసుకువస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి మండిపడ్డారు. దేశంలో మొదటిసారి భూ ఆక్రమణ చట్టాన్ని చంద్రబాబు తెస్తున్నారని విమర్శించారు. ఆయన మంగళవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఏ నాయకుడు ఇంతటి దుర్మార్గ చట్టాన్ని తేలేదన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాస్వామ్య వాదులందరూ ఈ చట్టాన్ని అడ్డుకోవాలని కోరారు. చంద్రబాబు మూలంగా రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతోందని, ప్రజలందరి కళ్లుగప్పి చంద్రబాబు చీకటి జీవోలు తెస్తున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో 33 వేల ఎకరాలు సేకరించి ఇప్పటి వరకూ పరిహారం ఇవ్వలేదని ధ్వజమెత్తారు. రైతుల భూములను బ్యాంకుల్లో తాకట్టుపెట్టి చంద్రబాబు దోచుకుంటున్నారని అన్నారు. హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు.. నాలుగేళ్ల కాలంలో ఏపీ రాజధానిలో ఒక్క శాశ్వత బిల్డింగ్ అయినా కట్టారా అని ప్రశ్నించారు. 2013 భూ సేకరణ చట్టానికి సవరణలు చేస్తూ ఏపీ ప్రభుత్వం 41 జీవోను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. -
ప్రజల కళ్లుగప్పి చంద్రబాబు చీకటి జీవోలు
-
మీ పాలనలో ఒక్క బీసీకైనా న్యాయం జరిగిందా?
-
చంద్రబాబు సీబీఐ విచారణకు సిద్ధమా?
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలోని బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న అన్యాయంపై అందరూ రగిలిపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ప్రశ్నించారు. బీసీలపై జస్టిస్ ఈశ్వరయ్య లేవనెత్తిన అంశాలపై చంద్రబాబు సూటిగా సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన శనివారమిక్కడ మాట్లాడుతూ... చంద్రబాబు నాయుడు దయాదాక్షిణ్యాలపై బీసీలు ఆధారపడరని, చంద్రబాబు బీసీలను వ్యతిరేకంగా రిపోర్టు ఇచ్చింది వాస్తవంకాదా? అని ప్రశ్నించారు. ‘ముఖ్యమంత్రిపై సీబీఐ విచారణ జరిపించాలి. చంద్రబాబు పాలనలో ఒక్క బీసీకైనా న్యాయం జరిగిందా? బలహీన వర్గాల ప్రజలు చంద్రబాబుకు తగ్గిన బుద్ధి చెబుతారు. ఒకవేళ నిజం అయితే చంద్రబాబుని వెంటనే బర్తరఫ్ చేయాలి’ అని పార్థసారథి డిమాండ్ చేశారు. -
'ఆ పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారు'
విజయవాడ: ఉచిత ఇసుక పేరుతో టీడీపీ నేతలు దోచుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పార్థసారథి ఆరోపించారు. అవినీతికి తావులేకుండా ఇసుక ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సోమవారం విజయవాడలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జన్నభూమి కమిటీలతో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోందని మండిపడ్డారు. ఆ కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా తయారయ్యాయని పార్థసారథి విమర్శించారు. -
రాజధాని పేరుతో చేస్తున్నది ‘రియల్’ వ్యాపారమే
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణంలో తాము చేస్తున్నది రియల్ ఎస్టేట్ వ్యాపారమేనని ముఖ్యమంత్రి చంద్రబాబే ఒక టీవీ చానెల్ ఇంటర్వ్యూలో పరోక్షంగా అంగీకరించారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి చెప్పారు. తమ పార్టీ ఇంతకాలంగా చెబుతున్నది నిజమేనని సీఎం మాటలతో తేలిందన్నారు. ‘రాజధాని పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని, వ్యాపారుల మాదిరిగా బ్రోచర్లు ముద్రించి మార్కెటింగ్ చేస్తున్నారని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి కదా?’ అని ఆ టీవీ ప్రతినిధి ప్రశ్నిస్తే.. సీఎం దానికి సమాధానం చెప్పకుండా ‘వీళ్లదేం పోయింది... అది రైతుల భూమి కదా...’ అని అన్నారని పార్థసారథి చెప్పారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలకు సమాధానం దాటవేసిన చంద్రబాబు.. రైతులు చాలా విజ్ఞులనీ, టీవీ వాళ్లు, సామాజిక ఉద్యమకారులు, రాజకీయ నాయకులు విజ్ఞులు కారన్నట్లుగా మాట్లాడారని పార్థసారథి విమర్శించారు. అన్నాహజారే, మేథాపాట్కర్ వంటి వారిని ప్రతిపక్షంలో ఉండగా పొగిడి, వాళ్ల కార్యక్రమాల్లో పాల్గొనడానికి తాపత్రయపడి.. ఇప్పుడు వారంతా విజ్ఞత లేని వాళ్లన్నట్లుగా బాబు మాట్లాడుతున్నారన్నారు. రైతులు తనపై నమ్మకంతో భూములు ఇచ్చారని చంద్రబాబు అనడం శుద్ధ అబద్ధమని, భూములివ్వకపోతే భూసేకరణ చట్టాన్ని అమలు చేసి బలవంతంగా సేకరిస్తామన్న ఆయన బెదిరింపులకు భయపడి ఇచ్చారని తెలిపారు. బాబు ఏంచేసినా తాబేదార్ల లబ్ధి కోసమే! అభివృద్ధి పేరుతో చంద్రబాబు ఎక్కడ ఏది ఏర్పాటు చేసినా తన వర్గం, తన పార్టీ వారికి, తన తాబేదార్లకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకుంటారని ఆయన విధానాలపై అధ్యయనం చేసిన ఓ విదేశీ విద్యార్థి స్పష్టం చేశారని, ఇప్పుడు రాజధాని విషయంలోనూ అదే నిజమైందని పార్థసారథి చెప్పారు. గతంలో హైటెక్ సిటీకి స్థలాన్ని ఎంపిక చేసి తన కార్యాలయానికి చేరుకోగానే బాబు చేసిన తొలి ఫోన్‌కాల్ మురళీమోహన్‌కు అని, తనకీ విషయాన్ని కొందరు అధికారులే చెప్పారన్నారు. హైటెక్ సిటీ పక్కన జయభేరీ విల్లాలు తప్ప మరొకటి అప్పట్లో కనిపించలేదన్నారు. ఇప్పుడు తుళ్లూరును రాజధానిగా ప్రకటించడం కూడా బాబు తాబేదారుల లబ్ధి కోసమేనన్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించడానికి ముందే ఆ చుట్టుపక్కల భూములను తన వారితో బాబు కొనిపించారని తెలిపారు. -
రెండో పంట.. రైతుల హక్కు: పార్థసారధి
హైదరాబాద్: త్వరలో వైఎస్ఆర్సీపీ రైతుహక్కు పరిరక్షణ కమిటీ ఏపీ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నట్టు వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను రెండో పంట వేయొద్దని ఏపీ ప్రభుత్వం చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. రెండో పంట వేసుకునే రైతులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని పార్థసారధి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం రాజధాని ప్రాంత రైతుల నుంచి భూములు కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుల తరపున వైఎస్ఆర్సీపీ పోరాడుతుందుని ఆయన చెప్పారు. అమాయక రైతుల భూములు లాక్కుని ఏపీ రాజధాని నిర్మించాలనుకోవడం దారుణమన్నారు. రాజధానికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదని పార్థసారధి స్పష్టం చేశారు. అవసరమైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, శాసనసభ ప్రతిపక్ష నేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి కూడా రాజధాని గ్రామాల్లో పర్యటిస్తారని పార్థసారధి చెప్పారు. -
ఐపీఏఏ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్థసారథి
హైదరాబాద్: ఇండియన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అసోసియేషన్(ఐపీఏఏ) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రొఫెసర్ వై. పార్థసారథి నియమితులయ్యారు. హరియాణాలో ఈ నెల 20, 21 తేదీల్లో జరిగిన ఐపీఏఏ రెండు రోజుల వర్క్‌షాప్‌లో భాగంగా ఈ నియామకం చేపట్టారు. పార్థసారథి ప్రస్తుతం జమ్మూ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఐపీఏఏ జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెలుగు వ్యక్తి నియమితులు కావడం ఇదే మొదటిసారి. -
బియ్యం కోటా పెంచండి
కేంద్రానికి టీ సర్కారు వినతి మరో 8 లక్షల మెట్రిక్ టన్నులు ఇవ్వాలని విన్నపం జనవరి నుంచి ఆహార భద్రత చట్టాన్ని అమలు చేస్తాం కేంద్ర ఆహార శాఖ సమావేశంలో పౌర సరఫరాల కమిషనర్ పార్థసారథి వెల్లడి సాక్షి, హైదరాబాద్: దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఆహార భద్రత చట్టాన్ని జనవరి నుంచి అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి స్పష్టం చేసింది. అయితే కేంద్రం చెబుతున్న లబ్ధిదారుల సంఖ్యకు, రాష్ట్రంలోని లబ్ధిదారుల సంఖ్యకు మధ్య భారీ వ్యత్యాసం ఉండటం, దీనికి తోడు లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున బియ్యం ఇచ్చేందుకు రాష్ట్రం సిద్ధపడినందున అందుకు తగ్గట్టుగా కేంద్రం అదనంగా ఏటా 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కోటా పెంచాలని కోరింది. ఈ మేరకు బుధవారం కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి రాంవిలాస్‌పాశ్వాన్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సమావేశానికి రాష్ట్రం తరఫున పౌరసరఫరాల శాఖ కమిషనర్ సి.పార్థసారథి హాజరై అదనపు బియ్యం అవసరాలపై విజ్ఞాపన చేసినట్లు తెలిసింది. వచ్చే మార్చి వరకు గడువు కావాలని, ఏప్రిల్ నుంచి పథకాన్ని అమలు చేస్తామని మెజార్టీ రాష్ట్రాలు కేంద్రానికి విన్నవించగా, జనవరి నుంచే అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కమిషనర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. తెలంగాణలో ప్రస్తుత లెక్కల మేరకు బీపీఎల్ కుటుంబాలు: 80,13,478 మొత్తం లబ్ధిదారులు: 2.68 కోట్లు కొత్తగా ఆహార భద్రత కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులు: 96,48,936 ఆహార భద్రత కింద కేంద్రం గుర్తించిన లభ్ధిదారులు: 1.91 కోట్లు ఆహార భద్రత పథకం కింద రాష్ట్రంలోని 60.96 శాతం గ్రామీణ, 41.14 శాతం పట్టణ ప్రాంతాల్లోని బీపీఎల్ లబ్ధిదారునికి ఒక్కొక్కరికి రూ.3 చొప్పున 5 కేజీల బియ్యాన్ని అందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో మొత్తంగా 1.91 కోట్ల మంది అర్హులకు ఏటా 13.367లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కేంద్రం గతంలోనే సుముఖత తెలిపింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న లెక్కల మేరకు అదనంగా 80 లక్షల మంది లబ్ధిదారులున్నారని, దీనికితోడు కొత్తగా జారీచేయనున్న కార్డుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్న విషయాన్ని ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. దీంతోపాటే ప్రతి లభ్ధిదారుడికి కోటాను 6 కేజీలకు పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో బియ్యం అవసరాలు మరింత పెరిగే అవకాశం ఉందని వివరించింది. అదనపు బియ్యం అవసరం ఏటా 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉండగా ఈ భారం మొత్తంగా ప్రభుత్వంపై రూ.1,800 కోట్ల వరకు ఉంటుందని, ఈ దృష్ట్యా మెజార్టీ భారాన్ని కేంద్రం భరించేందుకు ముందుకు రావాలని కోరింది. దీనిపై కేంద్రం స్పందన ఎలా ఉండనుందో త్వరలోనే తేలుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. -
లెక్కలడిగితే భయమెందుకు?
టీడీపీ సర్కారుపై వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి ధ్వజం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన సమగ్ర సమాచారం వెల్లడించేందుకు అధికార పక్ష నేతలు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్ సీపీ నిలదీసింది. టీడీపీ నేతలు తిన్నవి, దోచుకున్నవి బయట పడతాయనేనా అని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి సూటిగా ప్రశ్నిం చారు. అసెంబ్లీలో అర్థవంతమైన చర్చల కోసం ప్రభుత్వ రాబడులు, వ్యయాల వివరాలు కావాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అడిగితే మంత్రులు ఆయనపై ఎందుకు ఎదురు దాడికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. పార్థసారథి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలన్నీ అధికారిక వెబ్సైట్లో ఉంచాలని జగన్ అడగడం తప్పా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా అది ఆయన హక్కన్నారు. తక్కువ కేటాయింపులతో ఎలా అన్నీ అమలు చేస్తారని జగన్ అడిగితే తప్పా? మంత్రులు ఆయనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతారా? అని పార్థసారథి దుయ్యబట్టారు. -
వైఎస్ఆర్ సీపీ నేత పార్థసారధి కారుపై రాళ్ల దాడి
విజయవాడ: అధికార పార్టీ నేతల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తమదే అనే అహంకారంతో టీడీపీ కార్యకర్తలు.. వైఎస్ఆర్ సీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లాలోని పెనమలూరులో గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై టీడీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డాయి. టీడీపీ నేత బోడె ప్రసాద్ వర్గీయులు వైఎస్ఆర్ సీపీ బ్యానర్లను తగులబెట్టారు. ఈ ఘటనపై ప్రశ్నించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పార్థసారధి కారుపై టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పెనమలూరులో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. -
పెట్టుబడి రాయితీగా రూ.137 కోట్లు విడుదల
{పకృతి వైపరీత్యాలబాధిత రైతులకు ఊరట 2.77 లక్షల మందికి ప్రయోజనం హైదరాబాద్: రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాలవల్ల పంటలు కోల్పోయిన రైతులకు పెట్టుబడి రాయితీ కింద పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 137,76,58,120 విడుదల చేసింది. 2009 నుంచి గత ఏడాది వరకూ పలుమార్లు సంభవించిన భారీ వర్షాలు, వరదలు, వడగండ్ల వానలవల్ల 2.96 లక్షల ఎకరాల్లో 50 శాతం మించి పంట నష్టం జరిగింది. 2012లో నీలం తుపాను, కరువు వల్ల 50 శాతం మించి పంట దెబ్బతిన్నది. ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చినెలల్లో వడగండ్ల వర్షం, పెనుగాలుల వల్ల 1.09 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. ఇలా మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్, రంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, అనంతపురం, విశాఖపట్నం, కడప, విజయనగరం, శ్రీకాకుళం, ప్రకాశం , కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మొత్తం 4.05 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. దీనివల్ల 2,77,019 మంది రైతులు నష్టపోయారు. వీరికి పెట్టుబడి రాయితీ కింద ప్రభుత్వం రూ. 137.76 కోట్లు విడుదల చేస్తూ మంగళవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. రైతులకు పెట్టుబడి రాయితీ మొత్తాన్ని వారి అకౌంట్లలో ఆన్లైన్ ద్వారా జమ చేయాలని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ కమిషనర్ పార్థసారథి ఉత్తర్వులు జారీ చేశారు. రైతుల అకౌంట్లలో డబ్బు జమ చేసే బాధ్యతను ఉద్యాన, వ్యవసాయ శాఖల కమిషనర్లకు అప్పగించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
పార్థసారథి భార్య అరెస్టు: విడుదల
హైదరాబాద్, న్యూస్‌లైన్: నగదు తరలింపు కేసులో మాజీ మంత్రి పార్థసారథి సతీమణి కమలను గురువారం వనస్థలిపురం పోలీసులు అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. సీఐ గోపాలకృష్ణమూర్తి కథనం ప్రకారం.. ఈ నెల 18న కేపీహెచ్‌బీ నుంచి గుంటూరు వెళ్లే ఆర్టీసీ బస్సులో మాజీ మంత్రి పార్థసారథి సతీమణి కమల రూ. 45.10 లక్షల నగదుతో వెళ్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్వోటీ, వనస్థలిపురం పోలీసులు సంయుక్తంగా ఆటోనగర్ ప్రాంతంలో బస్సు తనిఖీ చేయగా, ఆమె వద్ద రూ. 45.10 లక్షల నగదు ఉండడంతో స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కమల గురువారం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. దీంతో ఆమెను అరెస్టు చేసి, వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. కాగా, తన వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న నగదుకు సంబంధించి అన్ని ఆధారాలున్నాయని మాజీమంత్రి సతీమణి కమల ‘న్యూస్‌లైన్’కు చెప్పారు. ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలను పోలీసులకు రాతపూర్వకంగా సమర్పించినట్లు చెప్పారు. ప్రతి రూపాయికీ లెక్కుంది: మాజీ మంత్రి పార్థసారథి తన భార్య కమల వద్ద నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న నగదులో ప్రతి రూపాయికి తమ వద్ద లెక్క ఉందని, డబ్బు తరలింపులో ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని వైఎస్సార్సీపీ మచిలీపట్నం లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. ఆయన సతీమణి కమలను గురువారం అరెస్టు చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన గురువారం రాత్రి ‘సాక్షి’తో మాట్లాడారు. నిర్మాణ కంపెనీకి సంబంధించిన మెటీరియల్ సప్లయర్స్‌కు కొద్దినెలలుగా బిల్లులు ఇవ్వడం లేదని, వారి బకాయిలు చెల్లించేందుకు ఆమె నగదు తెస్తున్నారని చెప్పారు. దీంతోపాటు ఎంపీగా పోటీ చేస్తున్న తనకు ఎన్నికల ఖర్చుల కోసం కూడా కొంత నగదు తీసుకువస్తున్నారని తెలిపారు. ఎన్నికల ఖర్చుకోసం విజయవాడలోని కార్పొరేషన్ బ్యాంక్‌లో ఖాతా కూడా తెరిచినట్టు సారథి తెలిపారు. -
సమదూరంలో విజయవాడ
విజయవాడ: భౌగోళికంగా రాయలసీమకు, ఉత్తరకోస్తాకు సమదూరంలో ఉండే నగరం విజయవాడ అని, రాజధానికి కావాల్సిన అన్ని వసతులూ ఆ నగరంలో ఉన్నాయని మాజీ మంత్రి కొలుసు పార్ధసారధి చెప్పారు. తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు కూడా విజయవాడలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. విజయవాడ చుట్టుపక్కల ప్రభుత్వ స్థలం 20 వేల ఎకరాలు ఉన్నాయని చెప్పారు. అటవీ భూమి 7 వేల ఎకరాలు ఉన్నాయని తెలిపారు. విజయవాడను రాజధానిగా అభివృద్ధి చేస్తే గుంటూరు, ఏలూరు నగరాలు కూడా అభివృద్ధి చెందుతాయనన్నారు. విజయవాడను రాజధానిగా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నట్లు పార్థసారధి తెలిపారు. -
కరువు జాబితాలోకి.. ఆ నాలుగు మండలాలు
అనంతపురం అగ్రికల్చర్, : జిల్లాలో ఎన్పీకుంట, తనకల్లు, తలుపుల, యాడికి మండలాలను కూడా కరవు మండలాల జాబితాలోకి చేర్చారు. రాష్ట్ర విపత్తుల విభాగం (డిజాస్టర్ మేనేజ్మెంట్) కమిషనర్ సి.పార్థసారధి ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరిలో జిల్లాలో 59 మండలాలనే కరువు ప్రాంతాలుగా ప్రకటించింది. ఆ జాబితాలో ఈ నాలుగు మండలాలకు చోటులేకపోయిన విషయం తెలిసిందే. దీనిపై రైతులు, రైతు సంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఆయా మండల కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలో ఉన్న ఆందోళనలు చేశాయి. ఫలితంగా జిల్లాలోని 63 మండలాలనూ కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. రూ.600 కోట్లతో కరువు నివేదిక సిద్ధం- తొలి జాబితాలో ఉన్న 59 మండలాల నుంచి వచ్చిన పంట నష్టం అంచనాలను క్రోడీకరించిన నాచురల్ కలామిటి (ఎన్సీ) సెల్ అధికారులు రూ.600 కోట్ల నష్టంతో తుది నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. మండలాలు, పంటల వారీగా తయారు చేసిన కరువు నివేదికను కలెక్టర్ ద్వారా గురువారం వ్యవసాయశాఖ కమిషనరేట్‌కు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. బుధవారం సాయంత్రానికి 46 మండలాల నివేదిక త యారు చేశారు. ఈ మండలాల పరిధిలో 4.79 లక్షల హెక్టార్లలో పంట దె బ్బతినగా రూ.470 కోట్ల మేర నష్టం జరిగినట్లు పేర్కొన్నారు. అనుకున్న విధంగా 59 మండలాల నుంచి పంట నష్టం అటుఇటుగా రూ.600 కోట్లకు చేరుకునే అవకాశం ఉందన్నారు. కరువు జాబితాలో లేనందున ఎన్పీ కుంట, తలుపుల, తనకల్లు, యాడికి మండలాల్లో పంట నష్టం అంచనాలు వేయలేదు. ప్రస్తుతం సిద్ధం చేసిన నివేదిక నుపంపాలా? లేదా తక్కిన నాలుగు మండలాల నష్టం చేర్చి పంపాలా.? అనే విషయాన్ని అధికారులు తేల్చుకోలేక పోతున్నారు. -
టెట్ వాయిదా: పార్థసారధి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 9న జరగాల్సిన ఈ పరీక్షను సీమాంధ్ర ఉద్యోగుల సమ్మె కారణంగా వాయిదా వేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. సంబంధిత అధికారులతో గురువారం జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం విద్యాశాఖ మంత్రి పార్థసారధి పరీక్ష వాయిదాకే నిర్ణయించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల ఆఖరులోగా నిర్వహిస్తామన్నారు. అయితే, ఉద్యోగుల సమ్మె ఈ నెల 21 వరకు కొనసాగే అవకాశం ఉండడం, 23న పంచాయతీ కార్యదర్శి నియామక పరీక్ష, ఫిబ్రవరి ఆఖర్లో ఎన్నికల షెడ్యూలు వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో టెట్ నిర్వహణ ప్రశ్నార్థకమేనని అధికారులు చెబుతున్నారు. డీఎస్సీ అనుమానమే!: టెట్ ఫలితాల తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాల్సి ఉంటుంది. మంత్రి చెబుతున్నట్లు ఫిబ్రవరి ఆఖరులో టెట్ నిర్వహిస్తే దీని ఫలితాల అనంతరం డీఎస్సీ నోటిఫికేషన్ మార్చిలో వెల్లడించాలి. ఫిబ్రవరి నెలాఖరుకే ఎన్నికల షెడ్యూలు వెలువడితే ఇక డీఎస్సీ జరిగే అవకాశంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. -
జాక్టోతో చర్చలు సఫలం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని విద్యాశాఖ మంత్రి పార్థసారధి హామీ ఇచ్చారు. తమ డిమాండ్ల పరిష్కారానికి ఈనెల 23న చలో అసెంబ్లీ కార్యక్రమం నిర్వహించాలని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త మండలి (జాక్టో) పిలుపునిచ్చిన నేపథ్యంలో.. మండలి ప్రతినిధి బృందంతో మంత్రి మంగళవారం చర్చలు జరిపారు. చర్చలు ఫలించిన నేపథ్యంలో చలో అసెంబ్లీని వాయిదా వేయాలని జాక్టో నేతలు నిర్ణయించారు. చర్చల్లో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారి, కమిషనర్ వాణీమోహన్, ఎమ్మెల్సీలు జనార్ధన్‌రెడ్డి,శ్రీనివాసులు నాయుడు, పి.రవీందర్, పుల్లయ్య, రవికిరణ్‌వర్మ, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి, పీఆర్టీయూ అధ్యక్షుడు వెంకటరెడ్డి, ఎస్టీయూ ప్రధాన కార్యదర్శి కత్తి నరసింహారెడ్డి, ఏపీటీఎఫ్(258) నేత పాండురంగవరప్రసాద్, ఏపీటీఎఫ్(1938) నాయకుడు హృదయరాజ్, పండితపరిషత్ నేత అబ్దుల్లా, పీఈటీ అసోసియేషన్ నాయకులు యాదయ్య, కరిముల్లారావు, ఎయిడెడ్ టీచర్స్ గిల్డ్ నేత దేశ్‌పాండే, హెడ్మాస్టర్ల సంఘం నేత శర్మ, ఆపస్ నేత సాయిరెడ్డి పాల్గొన్నారు. మంత్రి ఇచ్చిన హామీలు ఇవీ.. - 2,500 మంది పండిట్లు, 2,500 మంది పీఈటీలను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ త్వరలో ఉత్తర్వులు. మరో 5 వేల పోస్టుల అప్‌గ్రేడ్ చేయడానికి సీఎంకు ప్రతిపాదనలు. - రూ. 398 వేతనంతో పనిచేసిన టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరుకు వీలుగా సంబంధిత ఫైల్‌ను ఆర్థిక మంత్రి, సీఎంకు మూడు రోజుల్లోగా పంపించడానికి చర్యలు. - పంచాయితీరాజ్, మున్సిపల్, ఎయిడెడ్ టీచర్లకు అర్ధవేతన సెలవును నగదుగా మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు. - మండల విద్యాధికారులుగా ఆ మండలంలోని సీనియర్ స్కూల్ అసిస్టెంట్ నియామకం. హెడ్మాస్టర్లకు జిల్లా ఉప విద్యాధికారులుగా అదనపు బాధ్యతలు ఇచ్చే అంశం పరిశీలన. - ఎయిడెడ్ టీచర్ల జీతాల గ్రాంట్ ఈ నెలాఖరులోగా విడుదలకు చర్యలు. ఎయిడెడ్ పాఠశాలల్లో అప్రెం టీస్ విధానాన్ని రద్దు చేస్తూ త్వరలో ఉత్తర్వులు. -
విడిపోతే విజయవాడే రాజధాని : గండ్ర
హైదరాబాద్: తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ లాబీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణకే నష్టమని మంత్రి పార్థసారథి అన్నారు. అందుకు ప్రతిగా మీకు విడిపోవాలనే ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. అంతే కాకుండా విడిపోతే మీకు విజయవాడ రాజధాని అవుతుందని కూడా ఆయన అన్నారు. మీరు పైకి మాత్రమే సమైక్యమంటున్నారని గండ్ర విమర్శించారు.