రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన సమగ్ర సమాచారం వెల్లడించేందుకు అధికార పక్ష నేతలు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్ సీపీ నిలదీసింది.
టీడీపీ సర్కారుపై వైఎస్సార్ సీపీ నేత పార్థసారథి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు సంబంధించిన సమగ్ర సమాచారం వెల్లడించేందుకు అధికార పక్ష నేతలు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్ సీపీ నిలదీసింది. టీడీపీ నేతలు తిన్నవి, దోచుకున్నవి బయట పడతాయనేనా అని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి సూటిగా ప్రశ్నిం చారు.
అసెంబ్లీలో అర్థవంతమైన చర్చల కోసం ప్రభుత్వ రాబడులు, వ్యయాల వివరాలు కావాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అడిగితే మంత్రులు ఆయనపై ఎందుకు ఎదురు దాడికి దిగుతున్నారని ధ్వజమెత్తారు. పార్థసారథి బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వివరాలన్నీ అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని జగన్ అడగడం తప్పా? అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా అది ఆయన హక్కన్నారు. తక్కువ కేటాయింపులతో ఎలా అన్నీ అమలు చేస్తారని జగన్ అడిగితే తప్పా? మంత్రులు ఆయనపై వ్యక్తిగత విమర్శలకు దిగుతారా? అని పార్థసారథి దుయ్యబట్టారు.