
విడిపోతే విజయవాడే రాజధాని : గండ్ర
హైదరాబాద్: తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ లాబీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణకే నష్టమని మంత్రి పార్థసారథి అన్నారు. అందుకు ప్రతిగా మీకు విడిపోవాలనే ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. అంతే కాకుండా విడిపోతే మీకు విజయవాడ రాజధాని అవుతుందని కూడా ఆయన అన్నారు.
మీరు పైకి మాత్రమే సమైక్యమంటున్నారని గండ్ర విమర్శించారు.